పరిచయమైన మూడు రోజులకే పెళ్లి చేయాలంటూ.. యువకుడి హల్‌చల్‌  | Man Climbs Building Threat To Suicide To Get Married Minor Girl At Quthbullapur | Sakshi
Sakshi News home page

పరిచయమైన మూడు రోజులకే పెళ్లి చేయాలంటూ.. యువకుడి హల్‌చల్‌ 

Published Sun, Aug 21 2022 10:55 AM | Last Updated on Sun, Aug 21 2022 11:25 AM

Man Climbs Building Threat To Suicide To Get Married Minor Girl At Quthbullapur - Sakshi

బిల్డింగ్‌ ఎక్కిన ఆంజనేయులు  

సాక్షి, హైదరాబాద్‌: ఒకరోజు చూశాడు.. రెండో రోజు మాట్లాడాడు.. మూడో రోజు బిల్డింగ్‌ ఎక్కి ఆ అమ్మాయితో నాకు పెళ్లి చేయండి.. లేదంటే చేస్తాను.. అంటూ ఓ యువకుడు హల్‌చల్‌ చేయడంతో కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి గ్రామంలో కలకలం రేపింది. పేట్‌బషీరాబాద్‌ ఎస్‌ఐ భాను, స్థానికుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా రాళ్లకల్‌ గ్రామానికి చెందిన కదిరి ఆంజనేయులు దూలపల్లిలో ఉంటున్న తన మామ ఇంటికి వచ్చి స్థానికంగా పని చేసుకుంటూ అద్దె గదిలో ఉంటున్నాడు.

ఈ క్రమంలో ఓ మైనర్‌(13) అమ్మాయిని చూశాడు. రెండో రోజు ఆమెతో మాట కలిపాడు. ఇంతలో ఏమైందో ఏమో.. న కు ఆ పిల్లను ఇచ్చి పెళ్లి చేయమని శనివారం ఉదయం ఐదంతస్తుల బిల్డింగ్‌ ఎక్కి హల్‌చల్‌ చేయడం కలకలం రేపింది. ఈ విషయాన్ని స్థానికులు కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌ చేసి సమా చారం ఇచ్చారు. సదరు యువకుడు సై తం 100కు డయల్‌ చేసి తాను ఆత్మహకు పాల్పడుతున్నట్లు పోలీసులకు తెలిపారు.

దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుకున్న పోలీసులు కొద్దిసేపు యువకుడితో మాటలు కలిపి స్థానికుల సాయంతో నాలుగు తగిలించి కిందకు తీసుకు వచ్చారు. సదరు అమ్మాయిపై ప్రేమ విషయాన్ని చెబుతూ రావడంతో స్థానికులు ఆరా తీయగా చిన్నారి మైనర్‌ అని తేలింది. ఈ మేరకు పోలీసులు న్యూసెన్స్‌ కేసు కింద సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
చదవండి: హైదరాబాద్‌ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ ఏక్‌ షామ్‌.. చార్మినార్‌ కే నామ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement