
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ వైరస్ బారరినపడక తప్పడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. తాజగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్ సోకినట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వివేకానంద్‌ను ‘సాక్షి’ఫోన్‌లో పలకరించగా వైద్యుల సూచన మేరకు 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతానని, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌లు, శానిటైజర్లతో శుభ్రంగా ఉండాలని సూచించారు. (ఇప్పట్లో వదలదు!)
Comments
Please login to add a commentAdd a comment