నర్సారెడ్డి భూపతిరెడ్డి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, జ్యోత్స్నా రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలోలో జోరు పెరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేపడుతూ పార్టీ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో అన్న విషయాన్ని స్పష్టంగా వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సొంటిరెడ్డి పున్నారెడ్డి 2018 నుంచి సీపీఆర్ ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయనకి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండదండలు పుష్కలంగా ఉండగా రేవంత్ రెడ్డి సహకారం కూడా ఉందని ప్రచారం చేసుకుంటున్నాడు.
► అదేవిధంగా 1986 నుంచి పార్టీలో ఉంటూ వస్తున్న మరో ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి సైతం తనకి టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో కీలకంగా వ్యవహరించి ఆయన అధిష్టానం దృష్టిలో పడ్డారు. రేవంత్‌రెడ్డి ఆశీస్సులు సైతం ఉన్నాయని ప్రచారం ఉంది.
► ఇదే క్రమంలో పీసీసీ ప్రతినిధి కొలను హనుమంత్‌రెడ్డి 70 రోజులుగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్రను చేస్తున్నారు. తప్పకుండా ప్రజల్లో ఉంటున్న ఆయన టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు.
► అదేవిధంగా మొదటి నుంచి టీపీసీసీ అధ్యక్షుడికి అత్యంత సన్నిహితంగా ఉండే జ్యోత్స్నా శివారెడ్డి సైతం టికెట్ కోసం రేసులో ఉన్నారు.
► అయితే పార్టీ అధిష్టానం ఈ నలుగురిలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్నది అంతుచిక్కకుండా ఉంది. ఎవరికివారు పోటీపడి ప్రచారంలో మునిగిపోతూ తమ ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతుండగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిలో ఎవరికో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ వరించే అవకాశం ఉందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment