
విత్ డ్రా ఫాంలకు ఇంతలా..
చిత్రంలో కనిపిస్తున్న ఖాతాదారులు నగదు కోసం ఎగబడటం లేదు. బ్యాంకులో ఇచ్చే విత్ డ్రా ఫామ్ కోసం ఈ విధంగా బ్యాంక్ సిబ్బంది వెంట పడుతున్నారు. కేవలం విత్ డ్రా ఫామ్ కోసమే ఇంత ఇబ్బంది పడుతుంటే ఇక నగదుకు ఎన్ని కష్టాలు ఎదురవుతాయో అర్థం చేసుకోవచ్చు. కుత్బుల్లాపూర్ పరిధి షాపూర్‌నగర్ ఎస్‌బీహెచ్ వద్ద శుక్రవారం పోలీసుల సహకారంతో విత్ డ్రా ఫామ్‌లు పంపిణీ చేయాల్సి వచ్చింది.
– కుత్బుల్లాపూర్