
మయన్మార్, థాయిలాండ్‌లలో సంభవించిన భూకంపం(Earthquake) వందలాదిమందిని పొట్టనపెట్టుకుంది. భూకంపం సంభవించిన సమయంలో భవనాలు ఊగిపోతూ నేలకొరిగాయి. కొన్ని భవనాలపైనుంచి నీరు బయటకు దారాపాతంగా పొంగుకొచ్చింది. ఈ పరస్థితులను చూసిన జనం వణికిపోతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు.
Terremoto en tailandia desde la altura de un edificio, que locura#earthquake #Terremoto pic.twitter.com/mGQS5Ts5W3
— ¿Por qué es tendencia Colombia? (@TendenciaenXHoy) March 29, 2025
మయన్మార్(Myanmar)లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించగా దాని ప్రకంపనలు థాయ్‌లాండ్‌ను కుదిపివేశాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న భారత్‌కు చెందిన పర్యాటకులు వెనువెంటనే విమానాల్లో భారత్‌కు తిరిగి వచ్చారు. వీరు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
థాయ్‌లాండ్ నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్న రంజన్ బెనర్జీ మాట్లాడుతూ.. భూకంపం సంభవించినప్పుడు వెంటనే మాల్స్‌తోపాటు పలు కార్యాలయాలను ఖాళీ చేయించారు. మెట్రో రైలు రాకపోకలను నిలిపివేశారని తెలిపారు. మరో పర్యాటకుడు సఫ్దర్ మాట్లాడుతూ, ఆకాశహర్మ్యాలు వణికిపోయాయని, భవనాల పైనుంచి జలపాతంలా నీరు కిందికి పడిందని తెలిపారు.
సంజీవ్ దత్తా మాట్లాడుతూ.. తాను పడుకున్న మంచం ఒక్కసారిగా కదిలిపోయిందన్నారు. జనం భయంలో రోడ్లపై పరిగెట్టారని, తాను ఏడవ అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చి, అక్కడ కొంతసేపు వేచి ఉన్నానని, భారీ ట్రాఫిక్ కారణంగా 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఐదారు గంటలు పట్టిందని ఏఎన్‌ఐకి తెలిపారు. అత్యవసరంగా విమానాశ్రయానికి చేరుకునేందుకు టాక్సీలు దొరకలేదని భారతి ఖురానా చెప్పారు. తాము ఉన్న హోటల్ తీవ్రంగా కంపించడంతో అందరూ బయటకు పరుగులు తీసిన విషయాన్ని ప్రణవ్ గుర్తు చేసుకున్నారు.
థాయిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం(Indian Embassy) అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో థాయిలాండ్‌లోని భారతీయ పౌరులు నంబర్ +66 618819218ను సంప్రదించాలని సూచించారు. బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు,సిబ్బంది చియాంగ్ మాయిలోని కాన్సులేట్ సభ్యులంతా సురక్షితంగా ఉన్నారని థాయిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో తెలిపింది.
ఇది కూడా చదవండి: Nepal: మాజీ రాజు జ్ఞానేంద్ర షా అరెస్టుకు రంగం సిద్ధం?