Bangkok
-
సైలెంట్‌గా మాజీ మంత్రి కొడుకు బ్యాంకాక్ ట్రిప్.. విమానం గాల్లో ఉండగా ట్విస్టులు
ఆయనో మాజీ మంత్రి తనయుడు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఓ ఆగంతకుడు పోలీసులకు సమాచారం అందించాడు. అతని తండ్రి అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులే స్వయంగా కిడ్నాప్ చేసి నమోదు చేసి రంగంలోకి దిగారు. ఆపై ఆ మాజీ మంత్రి సీన్లోకి రావడంతో అధికార యంత్రాగమే దిగి వచ్చింది. పాపం.. ఆ బాబుగారి సీక్రెట్ బ్యాంకాక్ ప్లాన్ ‘గాల్లో ఉండగానే’ బెడిసి కొట్టింది. ముంబై: శివసేన(షిండే వర్గం) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్ సావంత్ కిడ్నాప్‌నకు గురయ్యారనే వ్యవహారం సోమవారం రాత్రి మహారాష్ట్రలో కలం రేపింది. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న తానాజీ.. హుటాహుటిన కమిషనర్ ఆఫీస్‌కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఎంక్వైరీ చేసిన పోలీసులు అతనొక ప్రైవేట్ ఛార్ట్‌లో అండమాన్ వైపు వెళ్తున్నాడనే సమాచారం తెలుసుకున్నారు. ఎవరో ఇద్దరు బలవంతంగా తన కొడుకును ఎత్తుకెళ్తున్నారని ఆయన మీడియా ముందు వాపోయారు. ఆ వెంటనే డీజీసీఏకు ఈ కేసు గురించి సమాచారం అందించారు. బ్యాంకాక్ వైపు వెళ్తున్న ఆ ప్రైవేటు విమానం.. పుణెకు తీసుకురావాలని పైలట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత పైలట్లు అదొక తప్పుడు సమాచారం అనుకున్నారట. సాధారణంగా మెడికల్ ఎమర్జెన్సీ లేదంటే సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే అలా వెనక్కి రావడానికి పైలట్లకు అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఎందుకైనా మంచిదని ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి ధృవీకరణ చేసుకుని వెనక్కి తిప్పారు. అలా.. అండమాన్ దాకా వెళ్లిన విమానం అలాగే వెనక్కి వచ్చేసింది.పుణే ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కాగానే విమానంలో ఉన్న ముగ్గురు షాక్ తిన్నారు. తమకు తెలియకుండానే తిరిగి రావడంతో రిషిరాజ్, అతడి స్నేహితులు.. పైలట్లపై మండిపడ్డారు. అయితే తాము కేవలం ఆదేశాలు మాత్రమే పాటిస్తామని పైలట్లు చెప్పడంతో ఏం చేయలేకపోయారు. ఆ వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది విమానంలోకి వెళ్లి వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తన కుటుంబానికి తెలియకుండా రిషిరాజ్ ఇద్దరు స్నేహితులతో ‘బిజినెస్ ట్రిప్’ ప్లాన్ చేశాడట. విషయం తెలిసి పోలీసులు, ఆ మాజీ మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకోకుండా తన కొడుకును బలవంతంగా వెనక్కి రప్పించారంటూ అధికారులపై ఆ మాజీ మంత్రి అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. మరోవైపు మరోవైపు పోలీసుల అత్యుత్సాహం, తానాజీ అధికార దుర్వినియోగంపై ఉద్దవ్ శివసేన మండిపడింది. ఎక్కడైతే రిషిరాజ్ కిడ్నాప్‌నకు గురయ్యారని హడావిడి జరిగిందో.. అదే సింగాద్ రోడ్ పీఎస్‌లో ఈ వ్యవహారంపై యూబీటీ శివసేన ఫిర్యాదు చేసింది. -
స్వదేశానికి చేరుకున్న థాయ్ బందీలు
బ్యాంకాక్: 500 రోజులపాటు హమాస్ చెరలో ఉన్న థాయ్‌లాండ్ వ్యవసాయ కార్మికులు స్వదేశానికి చేరుకున్నారు. 2023 అక్టోబర్‌లో జరిగిన దాడుల్లో దక్షిణ ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న పొంగ్సాక్ థేన్నా, సతియాన్ సువన్నాఖమ్, వాచరా శ్రీవూన్, బన్నావత్ సేథావో, సురసాక్ లామ్నావోలను కూడా హమాస్ అపహరించింది. ఎట్టకేలకు వారు ఆదివారం ఉదయం బ్యాంకాక్‌కు చేరకున్నారు. సువర్ణభూమి ఎయిర్‌పోర్టులో దిగిన ఐదుగురు కుటుంబాలను కలుసుకోవడంతో విమానాశ్రయంలో భావోద్వేగ వాతావావరణ నెలకొంది. కాగా, వారు మళ్లీ తిరిగి ఇజ్రాయెల్‌కు వెళ్లకుండా ఉండేందుకు నెలకు 725 పౌండ్ల వేతనంతో పాటు సుమారు 14,510 పౌండ్లను ఒకేసారి ఇవ్వనున్నట్లు థాయ్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. ఒక థాయ్ బందీ ఆచూకీ లభించలేదు. గాజాలో ఇంకా ఉన్న ఆరో థాయ్ బందీ విడుదల కోసం ప్రయత్నిస్తామని, గెలుస్తామనే ఆశ ఉందని విదేశాంగ మంత్రి సంగియంపోంగ్సా అన్నారు. అక్టోబర్ 2023 నుంచి మొత్తం 46 మంది థాయ్ కార్మికులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది హమాస్ దాడిలో, కొందరు హెజ్బొల్లా ప్రయోగించిన క్షిపణుల వల్ల మరణించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జనవరి 30న విడుదలయ్యారు. అయితే 10 రోజులపాటు వారికి ఇజ్రాయెల్ ఆసుపత్రిలోనే ఉంచి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. అనంతరం స్వస్థలాలకు పంపించారు. బ్యాంకాక్ చేరుకున్న అనంతరం బందీలు మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. మేం ఇక్కడ నిలబడానికి సహాయం చేసిన అధికారులందరికీ కృతజ్ఞతలు. స్వదేశానికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నాం’’అని చెప్పారు. తమవారిని మళ్లీ ఇంటికి దూరంగా పంపించాలనుకోవడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
అంబరాన మహాకుంభ సంబరం
ఆకాశం అంటే అనంతం... అనంతమైన భక్తి కూడా ఆకాశం లాంటిదే. తనలోని అనంతమైన భక్తిని ఆకాశ వేదికగా చాటింది ఇరవై నాలుగు సంవత్సరాల అనామికాశర్మ...ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్కైడైవర్ అనామికా శర్మ బ్యాంకాక్ మీదుగా 13 వేల అడుగుల ఎత్తులో మహాకుంభ్ అధికారిక జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించింది. అనామిక డేరింగ్ ఫీట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. విమానం ఎక్కే ముందు ఆత్మవిశ్వాసంతో మహాకుంభ్ జెండాను అనామిక పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో ఉన్నాయి. అనామిక విమానం నుండి దూకడం, జెండా ఎగరవేస్తూ ‘మహాకుంభ్ 2025’కు ప్రపంచానికి స్వాగతం పలికే దృశ్యాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే కుంభమేళ న్ట అబ్బురపరుస్తాయి.‘ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభ్ 2025కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆహ్వానిస్తున్నాను’ అని అనామిక శర్మ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోనే చూస్తూ నెటిజనులు అనామికను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.వాటిలో కొన్ని...‘అపూర్వ సాహసం, భక్తిభావం మేళవించిన దృశ్యం’‘మన సంస్కృతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు’‘ఇది స్టంట్ కాదు. ప్రపంచానికి అందించిన శక్తిమంతమైన సందేశం’అనామిక తండ్రి మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తండ్రి ఒడిలో సాహసాల ఓనమాలు నేర్చుకున్న అనామికకు ధైర్యంగా ముందుకు దూసుకెళ్లడమే తెలుసు. తాజా ఫీట్‌తో తన సాహసాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది.పవిత్ర క్షేత్రమైన ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక మన సంస్కృతి, సంప్రదాయాలను వింటూ పెరిగింది. ‘మన సంస్కృతిలోని గొప్పదనం ఏమిటంటే, ఒక మంచి పని కోసం అందరూ ముందుకు వస్తారు. నేనేమిటి? నా స్థాయి ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించరు. రామాయణంలో ఉడుత కథ దీనికి ఉదాహరణ. భరతమాత బిడ్డను అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను’ అంటుంది అనామిక.భవిష్యత్‌లో మరెన్నో సాహసాలు చేయడానికి సిద్ధం అవుతున్న అనామిక ట్రైన్డ్ స్కూబా డైవర్ కూడా. మన దేశంలో ‘స్కై సి లైసెన్స్’ ఉన్న యంగెస్ట్ ఫీమెల్ స్కైడైవర్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.‘వీడియోను చూసి చాలామంది... మీకు భయంగా అనిపించలేదా అని అడిగారు. నిజం చెప్పాలంటే భక్తి భావంతో నాకు భయం కలగలేదు. ఒకటికి పదిసార్లు మనసులో మేరా భారత్ మహాన్ అనుకున్నాను’ అంటోంది అనామిక. -
విస్తరణ బాటలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ .. గల్ఫ్, మధ్య ప్రాచ్యంలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు ఆగ్నేయాసియాలోనూ తమ కార్యకలాపాలను విస్తరించనుంది. బ్యాంకాక్, సింగపూర్, కొలంబో తదితర కొత్త రూట్లను పరిశీలిస్తున్నట్లు సంస్థ ఎండీ అలోక్ సింగ్ తెలిపారు. 2025 మార్చి వేసవి షెడ్యూల్లో ఖాట్మండూ రూట్లో సరీ్వసులు మొదలుపెడతామని, వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా ఆపై సంవత్సరం వియత్నాంకి ఫ్లయిట్స్‌ను ప్రారంభించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రధానంగా 5.5–6 గంటల ప్రయాణ దూరం ఉండే రూట్లు, ద్వితీయ .. తృతీయ శ్రేణి నగరాలకు సరీ్వసులపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా కోల్‌కతా నుంచి ఢాకాకు డైరెక్ట్ ఫ్లయిట్స్ ప్రణాళికను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి నాటికి తమ విమానాల సంఖ్యను ప్రస్తుతమున్న 90 నుంచి 100కి పెంచుకోనున్నట్లు సింగ్ చెప్పారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం దేశీయంగా 36, అంతర్జాతీయంగా 15 గమ్యస్థానాలకు నిత్యం 400 ఫ్లయిట్స్ నడుపుతోంది. -
ఫారిన్ ట్రిప్‌లో చిల్ అవుతున్న రీతూ వర్మ.. ఫోటోలు వైరల్
-
చైతన్య లహరి
చదువులో ‘శభాష్’ అనిపించుకున్న లహరి చదువే ప్రపంచం అనుకోలేదు. సమకాలీన సమాజం నుంచి కూడా ఎన్నో విషయాలను పాఠాలుగా నేర్చుకుంటోంది. విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహతో ముందడుగు వేస్తోంది.‘మన కోసం మనమే కాదు ఇతరుల కోసం మనం’ అనే స్పృహతో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం అవుతున్న సిద్దిపేట జిల్లా తడకపల్లికి చెందిన బండోజీ లహరి బ్యాంకాక్‌లో జరిగిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సులో ప్రసంగించింది...‘ఇది ఆడవాళ్లకు సాధ్యం కాదు’ అనే మాట ఎన్నోచోట్ల విన్నది లహరి. ‘ఎందుకు సాధ్యం కాదు?’ అని ధైర్యంగా అడిగే వయసు కాదు. అయితే చిన్న వయసులోనే రకరకాల సందర్భాలలో శక్తిమంతమైన మహిళల గురించి విన్న లహరికి ‘మహిళలకు సాధ్యం కానిది లేదు’ అనే సత్యం బోధపడింది.‘ప్రతిభావంతులతో పోటీ పడితే మనలోని ప్రతిభ కూడా మెరుగుపడుతుంది’ అనే పీటీ ఉష మాట ప్రభావంతో ఆటలపై ఆసక్తి పెంచుకుంది. ఎన్నో ఆటల్లో భాగం అయింది.మదర్ థెరెసా గురించి విన్నప్పుడల్లా ఆమె చేసిన అపారమైన సేవా కార్యక్రమాలలో ఏ కొంచెం చేసినా జీవితం ధన్యం అయినట్లే అనుకునేది. ‘ఇతరుల కోసం జీవించని జీవితం జీవితం కాదు’ అనే మదర్ మాట లహరి మనసులో నాటుకుపోవడమే కాదు సామాజికసేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. కరాటే...కిక్ బాక్సింగ్బాసర ట్రిపుల్‌ఐటీలో ఆర్జీయూకేటీలో ఈసీఈ ఫైనలియర్ చదువుతోంది లహరి. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉండే లహరి కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించింది. కిక్ బాక్సింగ్‌లో ప్రాపావీణ్యం సాధించింది. ‘ఖేలో ఇండియా’లో ఉషూ ప్లేయర్‌గా సత్తా చాటింది.అత్యవసరంగా రక్తం అవసరమున్నవారికి సహాయం అందించేందుకు సిద్ధిపేటలో ‘లహరి బ్లడ్ ఫౌండేషన్ ’ ఏర్పాటు చేసింది. మిత్రులతో కలిసి రక్తదానాలు చేయడం, చేయించేలా ప్రోత్సహించడం చేస్తోంది. కోవిడ్ టైమ్‌లోనూ రిస్క్ తీసుకుని సేవలందించింది. తాను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను విద్యార్థినులకు నేర్పిస్తోంది. బాసర ఆర్జీయూకేటీలోనూ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (ఎస్జీసీ) కౌన్సిల్ మెంబర్‌గా ఉంది. ట్రిపుల్ ఐటీలో ఆపదలో ఉన్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన ఈ ‘హోప్హౌజ్ ఫౌండేషన్’’ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటోంది.ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సుల్లో పాల్గొంది. 36 దేశాల నుంచి 699 మంది పాల్గొన్న ఈ సదస్సుకు మన దేశం నుంచి హాజరైన అయిదుగురిలో లహరి ఒకరు. ఈ సదస్సులో ‘ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ మైగ్రేషన్ స్మగ్లింగ్’ అనే అంశంపై మాట్లాడిందామె.నాన్నలాగే సైన్యంలో చేరి దేశసేవ చేయాలనేది లహరి లక్ష్యం. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. లెట్స్ షేప్ ఏ బెటర్ వరల్డ్కొత్త ప్రదేశం అంటే భౌగోళిక విషయాల పరిచయం మాత్రమే కాదు. ఎన్నో విషయాలను తెలుసుకునే పుస్తక సముద్రం. ‘యూత్ సమ్మిట్’లో పాల్గొనడానికి బ్యాంకాక్‌కు వెళ్లిన లహరి ‘ఇక్కడ ప్రసంగించి వెళ్లిపోతే తన బాధ్యత పూర్తయిపోతుంది’ అనుకోలేదు. ఇటీవల థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ‘లెట్స్ షేప్ ఏ బెటర్ వరల్డ్’ నినాదంతో మొదలైన అంతర్జాతీయ యువ సమ్మేళనంలో వివిధ దేశాల నుంచి వైబ్రెంట్ డెలిగేట్స్ పాల్గొన్నారు. పర్యావరణ సంక్షోభం నుంచి సాంస్కృతిక విశేషాల వరకు ఎన్నో అంశాలపై ఎంతోమంది డెలిగేట్స్‌తో లహరి మాట్లాడింది. ఉద్యమ ప్రయాణంలో వారి అనుభవాలతో స్ఫూర్తి పొందింది. ‘బ్యాంకాక్ సమ్మిట్‌లో పాల్గొనడం గొప్ప అనుభవం’ అంటుంది లహరి. – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పాములు కలకలం
-
బ్యాంకాక్‌లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థుల మృతి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం బ్యాంకాక్‌లో విద్యార్థుల బస్సులో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదలో బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44 మంది విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు స్వల్పంగా గాయాలు అయినట్లు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 మృతదేహాలను కనుగొన్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.Thailand School bus Fire Update-Initially...there were 10 fatalities.! and many injured. #Bangkok #โหนกระแส #ไฟไหม้ #ไฟไหม้รถบัส #Thailand #Schoolbus #Fire #ประเทศไทย #รถดับเพลิง pic.twitter.com/lVgc9LZdLy— Chaudhary Parvez (@ChaudharyParvez) October 1, 2024 ట్రల్ ఉథాయ్ థాని ప్రావిన్స్ నుంచి స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్తున్న సమయంలో బ్యాంకాక్ ఉత్తర శివారు ప్రాంతమైన పాతుమ్ థాని ప్రావిన్స్ వద్ద మధ్యాహ్నం భారీగా మంటలు చెలరేగాయని రవాణా మంత్రి సూర్యా జుంగ్రుంగ్రూంగ్కిట్ తెలిపారు. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించటం పూర్తి చేయనందున మరణాల సంఖ్యను ఇంకా ధృవీకరించలేకపోయారని మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ మీడియాకు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారి సంఖ్య ఆధారంగా ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు చనిపోయారని అన్నారు.School bus after fire. #ไฟไหม้รถบัสที่วิภาวดี #ไฟไหม้รถบัส #ไฟไหม้ #รถบัสไฟไหม้ #รถบัส #โหนกระแส #Thailand #Schoolbus #ประเทศไทย https://t.co/UdnhJSiPCb— Chaudhary Parvez (@ChaudharyParvez) October 1, 2024ఈ ఘటనపై ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా ఎక్స్‌లో స్పందించారు. ‘ఈ ప్రమాదంలో గాయపడినవారికి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తాం’’ అని అన్నారు. విద్యార్థుల వయస్సు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. బస్సు టైర్లలో ఒకటి పేలడంతో అదుపుతప్పి.. మంటలు చెలరేగాయని సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు పోలీసులకు తెలిపారు.చదవండి: హిజ్బుల్లా నస్రల్లా హత్య ప్లాన్.. బంకర్లోకి విషవాయువులు! -
బ్యాంకాక్‌లో సంచలనం.. ఆరుగురు టూరిస్టుల మిస్టరీ డెత్
బ్యాంకాక్: టూరిస్టుల స్వర్గధామం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆరుగురు విదేశీయులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆరుగురు మంగళవారం(జులై 16) నగరంలోని ఓ హోటల్ గదిలో విగత జీవులుగా పడి ఉన్నారు. వీరంతా వియత్నాం దేశస్తులని సమాచారం.అయితే వీరిలో ఇద్దరికి అమెరికా పాస్పోర్టులుండటం గమనార్హం. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు. వీరు శని, ఆదివారాల్లో వేరువేరుగా బ్యాంకాక్‌లోని ఓ ప్రముఖ హోటల్‌కు వచ్చి రెండు గదులు తీసుకున్నారు. అనంతరం మంగళవారం వారంతా ఒకే గదిలో చనిపోయి ఉండటం మిస్టరీగా మారింది. విదేశీయులు అనుమానాస్పదంగా మృతి చెందిన హోటల్‌ను ప్రధాని స్రెత్తా తవిసిన్ పరిశీలించారు. పర్యాటక రంగంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకుగాను ఈ ఘటనపై వేగవంతమైన దర్యాప్తు జరపాలని ప్రధాని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురితో పాటు వేరే ఎవరైన వ్యక్తి వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
విమానంలో భయానక ఘటన.. సారీ చెప్పిన సింగపూర్ ఎయిర్‌లైన్స్
బ్యాంకాక్: లండన్ నుంచి సింగపూర్‌కు బయల్దేరిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా సీలింగ్ తగిలి, చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. ఊహించని పరిణామంతో హతాశుడైన ఓ ప్రయాణికుడు (73) అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ఘటనపై ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతున్నట్లు తెలిపింది.అసలేమైంది?211 మంది ప్రయాణికులు, 18 సిబ్బందితో విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. బోయింగ్ 777 రకం ఎస్క్యూ321 విమానం మంగళవారం ఉదయం మయన్మార్ దగ్గర్లోని అండమాన్ సముద్ర జలాలపై ప్రయాణిస్తున్నపుడు ఈ ఘటన జరిగింది. విమానం బయల్దేరిన 10 గంటల తర్వాత జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయి ర్‌హోస్టెస్ ప్రయాణికులకు అల్పాహారం అందిస్తున్న సమయంలో విమానం 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా విమానం కుదుపులకు లోనైంది. మూడు నిమిషాల వ్యవధిలో ఆరువేల అడుగులు అంటే 37వేల అడుగుల ఎత్తు నుంచి 31వేల అడుగుల స్థాయికి పడిపోయింది. దీంతో విమానంలో బెల్ట్ పెట్టుకోని ప్రయాణికులంతా ఒక్క ఉదుటున గాల్లోకి లేచి సీలింగ్‌కు ఢీకొన్నారు. Aftermath of Singapore Airlines flight 321 from London to Singapore which had to divert to Bangkok due to severe turbulence. One death passenger and several injured. Blood everywhere, destroyed cabin. #singaporeairlines #sq321 pic.twitter.com/C2FgrVt9yv— Josh Cahill (@gotravelyourway) May 21, 2024 Severe turbulence on #SingaporeAirlines flight from London to Singapore results in 1 death and several injured passengers. This is a reminder - always have your seat belts fastened when inflight. #SQ321 pic.twitter.com/NV9yoe32ZC— Bandit (@BanditOnYour6) May 21, 2024 మూడు నిమిషాల పాటు విమానం అటూఇటూ ఊగుతూ కిందకు పడిపోతుండటంతో లోపలున్న వారంతా చెల్లా చెదు రుగా పడిపోయారు. అసలేం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతో అస్వస్థతకు గురై 73 ఏళ్ల బ్రిటిష్ జాతీయుడు అక్కడికక్కడే మరణించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. 31 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక విమానం మళ్లీ స్థిరత్వాన్ని సాధించింది. వెంటనే తేరుకున్న పైలట్లు 30 నిమిషాల్లోపే బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేసియా, సింగపూర్, న్యూజిలాండ్ దేశస్తులున్నారు.ఘటన తర్వాత విమానాన్ని దారి మళ్లించి దగ్గర్లోని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ల్యాండ్చేశారు. గాయపడని ప్రయాణికులను వేరే విమానాల్లో గమ్యస్థానమైన సింగపూర్‌కు పంపేశారు. -
సింగపూర్ విమానంలో భారీ కుదుపులు
బ్యాంకాక్: లండన్ నుంచి సింగపూర్‌కు బయల్దేరిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా సీలింగ్ తగిలి, చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. ఊహించని పరిణామంతో హతాశుడైన ఒక 73 ఏళ్ల ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. 30 మంది గాయపడ్డారు. వీరందరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. వీరిలో ఏడుగురికి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి.బోయింగ్ 777 రకం ఎస్క్యూ321 విమానం మంగళవారం ఉదయం మయన్మార్ దగ్గర్లోని అండమాన్ సముద్ర జలాలపై ప్రయాణిస్తున్నపుడు ఈ ఘటన జరిగింది. విమానం బయల్దేరిన 10 గంటల తర్వాత జరిగిన ఈ ఘటన వివరాలను సింగపూర్ ఎయిర్‌లైన్స్, ప్రయాణికులు వెల్లడించారు. ఘటన తర్వాత విమానాన్ని దారి మళ్లించి దగ్గర్లోని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ల్యాండ్చేశారు. గాయపడని ప్రయాణికులను వేరే విమానాల్లో గమ్యస్థానమైన సింగపూర్‌కు పంపేశారు.అసలేమైంది?211 మంది ప్రయాణికులు, 18 సిబ్బందితో విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. ఎయి ర్‌హోస్టెస్ ప్రయాణికులకు అల్పాహారం అందిస్తున్న సమయంలో విమానం 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా విమానం కుదుపులకు లోనైంది. మూడు నిమిషాల వ్యవధిలో ఆరువేల అడుగులు అంటే 37వేల అడుగుల ఎత్తు నుంచి 31వేల అడుగుల స్థాయికి పడిపోయింది. దీంతో విమానంలో బెల్ట్ పెట్టుకోని ప్రయాణికులంతా ఒక్క ఉదుటున గాల్లోకి లేచి సీలింగ్‌కు ఢీకొన్నారు.మూడు నిమిషాల పాటు విమానం అటూఇటూ ఊగుతూ కిందకు పడిపోతుండటంతో లోపలున్న వారంతా చెల్లా చెదు రుగా పడిపోయారు. అసలేం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతో అస్వస్థతకు గురై 73 ఏళ్ల బ్రిటిష్ జాతీయుడు అక్కడికక్కడే మరణించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. 31 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక విమానం మళ్లీ స్థిరత్వాన్ని సాధించింది. వెంటనే తేరుకున్న పైలట్లు 30 నిమిషాల్లోపే బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేసియా, సింగపూర్, న్యూజిలాండ్ దేశస్తులున్నారు. ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. -
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం!
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–13తో నూర్ మొహమ్మద్–తాన్ వీ కియోంగ్ (మలేసియా) జంటపై విజయం సాధించింది.పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. భారత రైజింగ్ స్టార్, ప్రపంచ 84వ ర్యాంకర్ మైస్నం మిరాబా లువాంగ్ వరుస గేముల్లో ప్రణయ్‌ను ఓడించి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు.55 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో మిరాబా 21–19, 21–18తో ప్రణయ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్‌కే చెందిన కిరణ్ జార్జి, సతీశ్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. కిరణ్ 15–21, 21–13, 17–21తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో... సతీశ్ 13–21, 17–21తో జేసన్ గుణవన్ (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యారు.అష్మిత మినహా...మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి ఐదుగురు బరిలోకి దిగగా... అష్మిత మినహా మిగతా నలుగురు ఉన్నతి హుడా, సామియా, మాళవిక, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అష్మిత 19–21, 21–15, 21–14తో ఎస్తర్ నురిమి (ఇండోనేసియా) పై గెలిచింది. ఉన్నతి 21–14, 14–21, 19–21తో లియాన్ టాన్ (బెల్జియం) చేతిలో, సామియా 13–21, 13–21తో గావో ఫాంగ్ జి (చైనా) చేతిలో ... మాళవిక 11–21, 10–21తో హాన్ యువె (చైనా) చేతిలో, ఆకర్షి 13–21, 8–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
బ్యాంకాక్‌లో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్‌ని బ్యాంకాక్‌లో ్ర΄ారంభించారు. ‘‘సరికొత్త కథాంశంతో రూ΄÷ందుతున్న చిత్రం ‘కుబేర’. బ్యాంకాక్‌లో ్ర΄ారంభించిన షెడ్యూల్లో నాగార్జునతో ΄ాటు మరికొందరు నటీనటులపై కొన్ని టాకీ, యాక్షన్ ΄ార్ట్లు చిత్రీకరించనున్నాం. భారీ స్థాయిలో రూ΄÷ందుతున్న ఈ సినిమా ఇంతకుముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి. -
హైదరాబాద్–బ్యాంకాక్ మధ్య ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండిగో తాజాగా హైదరాబాద్–బ్యాంకాక్ మధ్య నేరుగా సరీ్వసులను సోమవారం ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఉదయం 3.55కు విమానం బయల్దేరి 9.05కు బ్యాంకాక్ చేరుకుంటుంది. ఇరు నగరాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ నడుపుతున్న భారతీయ తొలి విమానయాన సంస్థ తామేనని ఇండిగో ప్రకటించింది. భారత్–బ్యాంకాక్ మధ్య ఇండిగో ప్రతి వారం 37 సరీ్వసులు నడుపుతోంది. -
థాయ్ మాజీ ప్రధానికి పెరోల్
బ్యాంకాక్: జైలు శిక్ష అనుభవిస్తున్న థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్షిన్ షినవత్ర(76) పెరోల్ మీద విడుదలయ్యారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ప్రభుత్వం అతడిని పెరోల్‌పై విడుదల చేసింది. మరో ఆరు నెలల్లో షినవత్ర శిక్ష ముగియనుంది. 15 ఏళ్ల ప్రవాసం వీడి గతేడాది దేశంలో అడుగు పెట్టిన వెంటనే ఆయనను జైలుకు తరలించారు. అనారోగ్యం కారణంగా జైలు నుంచి వెంటనే పోలీస్ ఆస్పత్రికి తరలించి నిర్బంధంలో ఉంచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన షినవత్రకు అవినీతి ఆరోపణలపై 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో షినవత్ర కుటుంబ సభ్యులే కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 70 ఏళ్లు దాటి అనారోగ్యం బారిన పడినందున మిగిలిఉన్న జైలు శిక్షను ప్రభుత్వం రద్దు చేసింది. ఇదీ చదవండి.. కనీసం చివరిచూపు చూసుకోనువ్వండి -
విలాసవంతమైన భవనం కట్టడం డ్రీమ్!..సడెన్‌గా మర్డర్ కేసులో..
అలికిడిలేని ఇళ్ల చుట్టూ హడలెత్తించే కథలల్లుకోవడం కొత్తేం కాదు. అందుకే చాలా పాడుబడిన భవనాలు ఇప్పటికీ మిస్టరీలుగా ప్రపంచాన్ని వణికిస్తుంటాయి. థాయ్‌లండ్ రాజధాని బ్యాంకాక్‌లో 49 అంతస్తులతో అసంపూర్ణంగా మిగిలిపోయిన ‘ఘోస్ట్ టవర్’ కూడా అలాంటిదే! దీని అసలు పేరు సాథోర్న్ యూనిక్ టవర్. ఇదొక దయ్యాల భవనంగా 1997 నుంచి 2014 వరకూ పుకార్లతో షికార్లు చేసింది. ఈ భవంతిలోని 43వ అంతస్తులో 2014 డిసెంబర్ 5న స్వీడిష్ టూరిస్ట్ మృతదేహం..ఈ పుకార్లకు సాక్ష్యాన్నిచ్చింది. 2014లో.. అప్పటికే 17 ఏళ్లుగా మూసే ఉంటున్న ఈ టవర్‌లో.. స్వీడిష్ టూరిస్ట్ ఉరి తాడుకు వేలాడటం స్థానికులను హడలెత్తించింది. ప్రపంచ మీడియాను కదిలించింది. నథాపత్ అనే 33 ఏళ్ల ఫొటోగ్రాఫర్.. మొదటగా ఈ భవనంలో స్వీడిష్ టూరిస్ట్ మృతదేహాన్ని గుర్తించాడు. 30 ఏళ్ల స్వీడిష్ టూరిస్ట్ జేబులో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ సాయంతో నవంబర్ 10 థాయిలండ్కు వచ్చాడని.. అక్కడే ఓ గెస్ట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నాడని తేలింది. మృతదేహం దొరికిన్నాటికే అతడు చనిపోయి ఐదు రోజులు అయ్యుండొచ్చని వైద్యనిపుణులు అంచనా వేశారు. కానీ మరణానికి అసలు కారణం స్పష్టం కాలేదు. అతని కలే ఈ భవనం.. 1990లో రంగ్సన్ టోర్సువాన్ అనే ప్రముఖ థాయ్ వాస్తుశిల్పి.. విలాసవంతమైన ‘కండోమినియం కాంప్లెక్స్’ కట్టాలని కలగన్నాడు. అతడు స్వయంగా డెవలపర్ కావడంతో ఆశపడినట్లే దీని నిర్మాణాన్ని అనుకున్న సమయానికి ప్రారంభించాడు. అయితే అనుకోకుండా 1993లో థాయ్ సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి మర్డర్ కేసులో ఇరుక్కున్న టోర్సువాన్.. జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆర్థిక కష్టాలు మొదలుకావడం, యజమాని జైల్లో ఉండటంతో 1997లోనే ఈ నిర్మాణం ఆగిపోయింది. అప్పటికే 80 శాతం పూర్తయిన ఈ టవర్.. అసంపూర్ణంగానే మూలపడింది. నాటి నుంచి నేటికీ ఆ భవనంలో ప్రేతాత్మలున్నాయని చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకానికి స్వీడిష్ డెత్ మిస్టరీ మరింత బలం చేకూర్చింది. చివరికి టోర్సువాన్.. 2010లో నిర్దోషిగా బయటికి వచ్చాడు. దయ్యాలు, మూఢనమ్మకాల చుట్టూ తిరిగే కొందరు మాత్రం ఈ పాడుబడిన భవనం గురించి మాట్లాడుకునేటప్పుడు.. టోర్సువాన్ పతనానికి ఈ భవననిర్మాణమే కారణమని భావిస్తుంటారు. ఎందుకంటే ఆ స్థలంలో గతంలో శ్మశానవాటిక ఉండేదని, దాన్ని పూర్తిగా పూడ్చేసి టోర్సువాన్ ఈ టవర్ కట్టాడని చెప్పుకుంటారు. ఒకప్పుడు ఈ టవర్‌పైకి ఎక్కడానికి అడ్డదార్లను వెతికే ఔత్సాహికులు కొందరు ఇక్కడి సెక్యూరిటీ గార్డులకు లంచం ఇచ్చి మరీ లోపలికి వెళ్లి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టేవారు. కానీ స్వీడిష్ టూరిస్ట్ మరణం తర్వాత సెక్యూరిటీ మరింత పెరిగింది. అలాగే 2015 నుంచి రంగ్సాన్ టోర్సువాన్ వారసుడు పన్సిత్ టోర్సువాన్.. టవర్‌పైకి ఎక్కి ఆన్లైన్లో ఫొటోలు షేర్ చేసేవారిపై కేసులు పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఈ టవర్‌లోకి అడుగుపెట్టే సాహనం ఎవరూ చేయడం లేదు. ఏది ఏమైనా ఈ టవర్‌లో దయ్యాలు ఉన్నాయా? స్వీడిష్ టూరిస్ట్ ఎలా చనిపోయాడు? ఎవరైనా అతన్ని చంపి, అక్కడ ఉరితాడుకు కట్టేసి నేరం నుంచి తప్పించుకున్నారా? లేక దయ్యాలే దాడి చేశాయా? వంటివన్నీ నేటికీ మిస్టరీనే! ∙సంహిత నిమ్మన (చదవండి: అక్కడ కవి పుట్టిన రోజు ‘బర్న్స్ నైట్’ పేరుతో ఓ పండుగలా ..!) -
థాయ్‌లాండ్‌లో భారీ పేలుడు.. 18 మంది మృతి
బ్యాంకాక్: సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని సుపాన్ బూరిరి ప్రావిన్సులో ఓ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 18 మంది కార్మికులు మరణించినట్లు రెస్క్యూ పనులు చేపడుతున్న సిబ్బంది తెలిపారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని తెలుస్తోంది. పేలుడు కారణమేంటన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సహాయక చర్యలు చేపడుతోంది. ఇదీచదవండి.. కెనడానకు తగ్గిన భారత యువత -
విశాఖ నుంచి బ్యాంకాక్‌కి నేరుగా ఫ్లైట్ సర్వీస్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాంకాక్ వెళ్లేవారికి శుభవార్త. విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్ ప్రారంభిస్తోంది థాయ్‌ల్యాండ్‌కు చెందిన విమానయాన సంస్థ థాయ్ ఎయిర్ ఏషియా. విశాఖ నుంచి బ్యాంకాక్‌కి ఫ్లైట్ సర్వీస్‌లను ప్రారంభిస్తున్నట్లు థాయ్ ఎయిర్ ఏషియా తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ డైరెక్ట్ సర్వీస్‌లు ఉండబోతున్నట్లు పేర్కొంది. వారంలో మూడు రోజుల పాటు ఈ సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో డైరెక్ట్ ఫ్లైట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇది కూడా చదవండి: On-time Performance: ఆన్‌టైమ్‌లో బెస్ట్.. ఆకాశ ఎయిర్ ప్రస్తుతం విశాఖ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు లేవు. కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా ప్రయాణించాల్సి ఉంది. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులోకి వస్తుండటంతో ఇక్కడి నుంచి ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
27 ఏళ్ల తర్వాత థాయ్ యువరాజు రీఎంట్రీ.. అందు కోసమేనా?
బ్యాంకాక్: థాయ్ మహారాజు వజిరాలాంగ్కార్న్(71) రెండో కుమారుడు యువరాజు వచరేసార్న్ వైవాచారవాంగ్సే(42) సుమారు 27 ఏళ్ల తర్వాత రాజయానికి తిరిగొచ్చారు. ఆయనకు రాకను పురస్కరించుకుని స్వాగతం పలికేందుకు బ్యాంకాక్ సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీగా శ్రేయోభిలాషులు తరలి వచ్చారు. Vacharaesorn Vivacharawongse, a son of His Royal Highness King Vajiralongkorn who has been living in New York, has reportedly returned to Thailand. This was a video posted and widely shared on social media. pic.twitter.com/vYPNOdUBjs — Thai Enquirer (@ThaiEnquirer) August 6, 2023 న్యూయార్క్ లో ఒక న్యాయ సంస్థలో పనిచేస్తున్న వచరేసార్న్ వైవాచారవాంగ్సే చాలా కాలం తర్వాత తిరిగి రావడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతేడాది డిసెంబరులో థాయ్ మహారాజు పెద్ద కుమార్తె యువరాణి బజ్రకితీయాబా మహిడాల్(44)మైకో ప్లాసం ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ కోమాలో ఉన్నారు. ఆమెను పరామర్శించడానికి వచ్చారా లేక రాజా కుటుంబం వారసత్వాన్ని కొనసాగించడానికి వచ్చారా అన్నదే అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. Vacharaesorn Vivacharawongse, a son of His Royal Highness King Vajiralongkorn, expressed during his visit to the 2infamily Foundation, a foundation for child care in Khlong Toei, that returning to #Thailand after 27 years of living abroad was like a dream come true. He stated… pic.twitter.com/lZ4h4WLCIV — Thai Enquirer (@ThaiEnquirer) August 8, 2023 ఇదిలా ఉండగా యువరాజు థాయ్‌లాండ్ వస్తూనే ఓ స్వచ్చంద కార్యక్రమంలో పాల్గొని నిర్భాగ్యులైన పిల్లలను, నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మరుసటి రోజున ఆయన దేశం(రాజ్యం)లోని ఎమరాల్డ్ బుద్ధుడి దేవాలయం తోపాటు అనేక దేవాలయాలను సందర్శించారు. రాత్రి ఒక ఆటో రిక్షాలో ప్రయాణిస్తూ ఫోటో తీసుకున్న ఆయన దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కింద 'బ్యాంకాక్ టుక్ టుక్' అని క్యాప్షన్ కూడా రాశారు. థాయ్‌లాండ్ మహారాజు వజిరాలాంగ్కార్న్ కు నలుగురు భార్యలు ఏడుగురు సంతానం. 2016లో పట్టాభిషక్తుడైన ఆయన రెండో భార్య సుజరిణీ వైవాచారవాంగ్సేకు కలిగిన కుమారుడే వచరేసార్న్ వైవాచారవాంగ్సే. యువరాణి చాలాకాలంగా కోమాలో ఉండటంతో దుఃఖసాగరంలో ఉన్న రాజకుటుంబంలో యువరాజు రాకతో ఒక్కసారిగా సంతోషాలు వెల్లివిరిశాయి. ఇది కూడా చదవండి: భారత్‌లో జరిగే జీ-20 సదస్సులో అదే హాట్ టాపిక్ -
ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..?
బ్యాంకాక్: నడిచే ఎస్కలేటర్ లో పొరపాటున కాలు పడి ఇరుక్కోవడంతో 57 ఏళ్ల మహిళ మోకాలి పైభాగం వరకు కాలును తొలగించిన సంఘటన థాయ్ లాండ్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. దీంతో పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో సౌకర్యాలపై అనుమానాలు కమ్ముకుని, ఇకపై బ్యాంకాక్ పర్యటన అంటే పర్యాటకులు ఆలోచించే పరిస్థితి నెలకొంది. డాన్ ముయాంగ్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కారంత్ తనకుల్జీరపత్ తెలిపిన వివరాల ప్రకారం నఖోన్ సి తమ్మారత్ వెళ్తోన్న ఒక మహిళ నడిచే ఎస్కలేటర్ మీద వెళ్తుండగా ఉన్నట్టుండి ఆమె కాలు ఎస్కలేటర్ లోపల ఇరుక్కుపోయింది. చాలాసేపు నొప్పితో విలవిల్లాడిపోయిన ఆ మహిళకు విముక్తి కలిగించడానికి విశ్వప్రయత్నాలు చేశామని అన్నారు. ఇరుక్కున్న కాలిని విడిపించేందుకు చాలాసేపు శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. చివరి ప్రయత్నంలో ఆమె కాలును మోకాలి పైభాగం వరకు తొలగించి అనంతరం దగ్గర్లోని బుమ్రుంగ్రాండ్ అంతర్జాతీయ హాస్పిటల్ కు తరలించామని తెలిపారు కారంత్. ప్రమాదానికి గల కారణం ఏమిటన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మా వలన ఆ మహిళకు జరిగిన నష్టానికి నా సానుభూతి తెలియజేస్తున్నానని.. జరిగిన తప్పిదానికి మేము పూర్తి బాధ్యత వహిస్తామని, ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు తోపాటు ఆమెకు ఎలాంటి పరిహారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కారంత్. బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. మా అమ్మ పైకి ధైర్యంగానే ఉన్నప్పటికీ కాలు తీసేయడంతో ఆమె గుండె బద్దలైందని ఒకే కాలితో జీవితాంతం ఎలాగన్న ఆలోచన తనను లోలోపలే తొలిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
సుందర దేశంలో విషపుగాలి! బయటకు రావాలంటే జంకుతున్న జనం!
ప్రకృతి రమణీయత ఉట్టిపడే అందమైన దేశం, ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్‌లాండ్‌ను వాయు కాలుష్యం ముంచెత్తుతోంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోతుండడంతో జనం ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలియజేసే యాప్‌లను జనం ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. యాప్ ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకుంటున్నారు. ఎర్ర మార్క్ కనిపిస్తే ఇంట్లో ఉండిపోవాల్సిందే. ఉదయం పూట వ్యాయామం చేయాలన్నా బయటకు వెళ్లలేని పరిస్థితి. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కాలుష్యం బెడద మరింత తీవ్రంగా ఉండడం కలవరం సృష్టిస్తోంది ఎయిర్ పొల్యూషన్ దెబ్బకు టూరిస్టుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రధాన పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. ఎందుకీ తీవ్ర కాలుష్యం? థాయ్‌లాండ్‌లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా ప్రభుత్వం తరచుగా కాలుష్య హెచ్చరికలు జారీ చేయడం సాధారణమే. అయితే, ఈసారి మాత్రం కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. ఉత్తర థాయ్‌లాండ్‌లో రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తుంటారు. మూడు నెలల పాటు ఈ సీజన్ కొనసాగుతుంది. ఈ సమయంలో తీవ్ర కాలుష్యం ఉత్పన్నమవుతుంది. ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి రేణువులు వెలువడుతాయి. విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. పంట వ్యర్థాల దహనం కారణంగా రైతులు శ్వాస సంబంధిత వ్యాధుల బారినపడుతున్నట్లు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని థాయ్‌లాండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ పరిశోధకుడు కనికా థాంపానిష్వోంగ్ చెప్పారు. దేశంలో 2021లో వాయు కాలుష్యం వల్ల 29,000 మంది మరణించారని అంచనా. ఇక రాజధాని బ్యాంకాక్‌లో తీవ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ సమస్య వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. చలికాలం కావడంతో పరిస్థితి భీతావహంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచించిన దానికంటే థాయ్‌లాండ్ ప్రజలు సగటున నాలుగు రెట్లు అధికంగా సూక్ష్మ ధూళి కణాలను(పీఎం 2.5) పీలుస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. కాలుష్యం వల్ల దేశంలో ప్రజల జీవిత కాలం సగటున రెండేళ్లు తగ్గినట్లు థాయ్‌లాండ్ ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’అంచనా వేసింది. వేధిస్తున్న నిధుల కొరత మరోవైపు కాలుష్యాన్ని తగ్గించడంపై థాయ్‌లాండ్ సర్కారు దృష్టిపెట్టింది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి అంతర్జాతీయ సంస్థలు, పరిశోధనా కేంద్రాలతో కలిపి పనిచేస్తోంది. కాలుష్య నియంత్రణ కోసం కొత్త కొత్త విధానాలు రూపొందిస్తున్నప్పటికీ నిధుల కొరత వల్ల అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ పాలసీల అమలుకు బడ్జెట్లో ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడం పెద్ద అవాంతరంగా మారింది. స్వచ్ఛమైన గాలిని పీల్చడం ప్రజల హక్కు, ఆ హక్కును కాపాడడంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ గ్రీన్‌పీస్ థాయ్‌లాండ్, ఎన్విరాన్మెంటల్ లా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలు గత ఏడాది మార్చి నెలలో కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ‘క్లీన్ ఎయిర్ బిల్లు’ను ఆమోదించాలంటూ థాయ్‌లాండ్ క్లీన్ ఎయిర్ నెట్వర్క్ అనే మరో సంస్థ పోరాడుతోంది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. కాలుష్యానికి కారణమయ్యే వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించవచ్చు. మరోవైపు పంట వ్యర్థాలను దహనం చేయకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. 14.49 లక్షల మంది బాధితులు థాయ్‌లాండ్ ప్రజారోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. కాలుష్యం వల్ల దేశంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటిదాకా 14,49,716 మంది అస్వస్థతకు గురయ్యారు. రాజధాని బ్యాంకాక్‌లో 31,695 మంది అనారోగ్యం బారినపడ్డారు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. బాధితుల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, నిమోనియా, బ్రాంకైటీస్, ఆస్తమా, ఇన్‌ఫ్లూయెంజా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి లక్షణాలు కనిపించాయి. బ్యాంకాక్‌లో తాజాగా 50కిపైగా ప్రాంతాల్లో పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్‌కు 51 నుంచి 78 మైక్రోగ్రాములు ఉన్నట్లు తేలిందని కాలుష్య నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ పిన్సాక్ సురాస్వాడీ చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కాలుష్యం నుంచి ఉపశమనం కోసం ప్రజలు ముఖానికి మాస్కు తప్పనిసరిగా ధరించాలని థాయ్ ఎయిర్ క్వాలిటీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రఫాన్ సూచించారు. కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పట్టకపోతే ఇళ్ల నుంచే పనిచేయాలని ఉద్యోగులకు సూచిస్తామని థాయ్‌లాండ్ మంత్రి అనుపోంగ్ పావోజిండా చెప్పారు. బ్యాంకాక్‌లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యశాలలు ► కాలుష్యం, తద్వారా అనారోగ్య సమస్యలు పెరిగిపోతుండడంతో థాయ్‌లాండ్ ప్రజారోగ్య శాఖ ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటు చేసింది ► కాలుష్యం బారినపడిన వారిలో శ్వాస ఆడకపోవడం, చర్మంపై దద్దుర్లు, గుండె సంబంధిత వ్యాధులు తలెత్తున్నాయి. ► బాధితులకు చికిత్స అందించడానికి దేశవ్యాప్తంగా 66 ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. ► వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్న వ్యాధులు, నివారణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయా లని బ్యాంకాక్‌లోని 22 ప్రధాన ఆసుపత్రులకు వ్యాధుల నియంత్రణ విభాగం సూచించింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా వెళ్లాలనుకునేవారికి శుభవార్త.. 14 రోజుల్లోనే వీసా..!
న్యూఢిల్లీ: అమెరికా వీసా ఆశావహులు ప్రస్తుతం భారత్‌లో నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. బీ1, బీ2 వీసాల కోసం వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. మొదటిసారి దరాఖాస్తుదారుల్లా అందరికీ ఇంటర్వ్యూ మినహాయింపు లేకపోవడంతో వీసా అపాయింట్మెంట్ కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. అయితే భారతీయుల కోసం ఈ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తోంది అమెరికా. బ్యాంకాక్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల్లోని అమెరికా ఎంబసీలు భారతీయులు బీ1, బీ2 వీసాల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా రెండు మూడు వారాల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితమే అమెరికా వీసా గడువు ముగిసిన భారతీయులు ఈ దేశాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే వీసా త్వరగా లభిస్తుంది. ప్రస్తుతం కోల్‌కతా నుంచి అమెరికా బీ1, బీ2 వీసాల కోసం ధరఖాస్తు చేస్తే ఇంటర్వ్యూ కోసం 589 రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది. ముంబై నుంచి అయితే ఏకంగా 638 రోజులు వేచి చూడాలి. చెన్నైలో అయితే 609 రోజులు, హైదరాబాద్‌లో అయితే 596 రోజులు, ఢిల్లీలో అయితే 589 రోజులు వెయిట్ చేయాలి. కానీ భారతీయులు బ్యాంకాక్ వెళ్లి అక్కడి అమెరికా ఎంబసీ నుంచి వీసా కోసం దరఖాస్తు చేస్తే 14 రోజుల్లోనే ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తవుతుంది. వీసా త్వరగా రావాలనుకునే వారు ఈ దేశాలకు వెళ్తే సరిపోతుంది. జనవరిలో తాము లక్ష వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ శనివారం వెల్లడించింది. 2019 జులై తర్వాత ఒక్క నెలలో ఇన్ని దరఖాస్తులు పరిశీలించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రానున్న రోజుల్లో సిబ్బంది పెరుగుతారు కాబట్టి ఇంకా ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేస్తామని పేర్కొంది. కరోనా సమయంలో అమెరికా ఎంబసీలు వేల మంది సిబ్బందిని ఇంటికి పంపాయి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారిలో కొంతమందిని మాత్రమే తిరిగి విధుల్లో చేర్చుకున్నాయి. ఈ కారణంగానే వీసాల జారీ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. అయితే భారతీయుల కోసం అమెరికా కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. బీ1, బీ2 వీసాల కోసం తొలిసారి దరఖాస్తు చేసుకునేవారికి ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చింది. చదవండి: డబ్బు ఉందా?.. దుబాయ్‌లో మంచి ఇల్లు.. బోలెడు రెంటు.. ఆపై గోల్డెన్ వీసా -
పాన్ మసాలా ప్యాకెట్లలో 32 లక్షల యూఎస్ డాలర్లు, కంగుతిన్న అధికారులు
ఒక వ్యక్తి ఎయిర్ పోర్ట్‌లో వందలకొద్ది పాన్‌మసాలా ప్యాకేట్లతో పట్టుబడినట్లు కోల్‌కత్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. వాటిలో ఏకంగా రూ 32 లక్షల విలువ చేసే యూఎస్ కరెన్సీని ప్యాక్ చేసి తరలించేందుకు యత్నించాడు. దీంతో ఎయిర్పోర్ట్ ఇంటిలిజెన్స్ అధికారులు కోల్‌కతా కస్టమ్స్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన కస్టమస్స్ అధికారులు నిందితుడు పాన్‌మసాలా ప్యాకెట్లలో యూఎస్ కరెన్సీని తరలించే విధానం చూసి కంగుతిన్నారు. సుమారు రూ. 32 లక్షల విలువ చేసే యూఎస్ కరెన్సీనీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తామ తనిఖీలు చేస్తున్నప్పుడు వందలకొద్ది పాన్ మసాల ప్యాకెట్లు చూసి ఆశ్యర్యపోయాం అన్నారు. ఆ పాన్ ప్యాకెట్లలో ఒక పారదర్శక కవర్లో ఒక జతన యూఎస్ కరెన్సీ దానితో పాటు పాన్ పౌడర్ పెట్టి ప్యాక్ చేశారు. ఒక పెద్ద ట్రాలీ లగేజ్‌లో నిండా ఈ మసాల ప్యాకెట్లు ఉన్నట్లు తెలిపారు. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌కి తరలించేందుకు యత్నించినట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..ఏకంగా ఓ కేసునే టేకప్ చేస్తోంది) #WATCH | AIU officials of Kolkata Customs intercepted a passenger scheduled to depart to Bangkok yesterday. A search of his checked-in baggage resulted in the recovery of US $40O00 (worth over Rs 32 lakh) concealed inside Gutkha pouches: Customs pic.twitter.com/unxgdR7jSu — ANI (@ANI) January 9, 2023 -
ప్లీజ్ సార్..ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డ ఎయిర్ హోస్ట్.. పిడిగుద్దులు గుద్దుతూ..
బ్యాంకాక్ నుంచి కోల్‌కతాకు వస్తున్న విమానంలో ఘటన ముయే థాయ్ (థాయ్ బాక్సింగ్) గేమ్‌ను తలపించింది. ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన సీటు గొడవ తారా స్థాయికి చేరింది. ఓ ప్రయాణికుడిపై మరో ఐదుగురు ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. గొడవను సద్దుమణిగించేందుకు ఎయిర్ హోస్టెస్ చేసిన ప్రయత్నాలు విఫలయ్యాయి. క్యాబిన్ క్రూ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పిడిగుద్దులు గుద్దుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ వివాదంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. వివాదానికి కారణమైన ప్రయాణికులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. థాయ్ స్మైలీ ఎయిర్వేస్కు చెందిన విమానం డిసెంబర్ 26న థాయ్‌ల్యాండ్ నుంచి కోల్‌కతాకు వస్తుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి క్రూ సిబ్బంది ప్రయాణికులకు జాగ్రత్తలు చెబుతున్నారు. అదే సమయంలో ఓ ఎయిర్ హోస్ట్ బ్రౌన్ కలర్ (గోధుమ రంగు) షర్ట్ ధరించిన ప్రయాణికుడు తాను కూర్చున్న సీటును నిటారుగా జరపాలని కోరింది. Not many smiles on this @ThaiSmileAirway flight at all ! On a serious note, an aircraft is possibly the worst place ever to get into an altercation with someone. Hope these nincompoops were arrested on arrival and dealt with by the authorities.#AvGeek pic.twitter.com/XCglmjtc9l — VT-VLO (@Vinamralongani) December 28, 2022 అంతే బ్రౌన్ కలర్ షర్ట్ ధరించిన వ్యక్తి రెచ్చిపోయి తన పక్కనే గ్రే కలర్ (బూడిద రంగు) చొక్కా ధరించిన వ్యక్తిపై దాడికి దిగాడు. వివాదానికి కారణమైన ప్రయాణికుడు తన కళ్లజోడు తీసి నల్ల చొక్కా ధరించిన బాధితుడి చెంపలు వాయిస్తూ, ఆపకుండా పిడిగుద్దులు గుద్దాడు. దాడికి పాల్పడే వ్యక్తికి మద్దతుగా అతని స్నేహితులు సైతం కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతలో ఈ గొడవను ఆపేందుకు ఎయిర్ హోస్టెస్ ప్లీజ్ సార్.. ప్లీజ్ సార్ అని ఒకటే ప్రాధేయ పడుతున్నా పట్టించుకో లేదు. నిందితుడు కోల్ కతాలో ఫ్లైట్ దిగే సమయంలో సైతం తన సీటు బెల్ట్ తీసి తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడని.. అదే ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్న అలోక్ కుమార్ అనే ప్రయాణికుడు తెలిపారు.కాగా, విమానంలో జరిగిన ప్రమాదంపై కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా గొడవలు విమాన ప్రయాణంలో ఆమోదయోగ్యం కాదని ట్వీట్ చేశారు. ఈ ఘటనలో కారణమైన ప్రయాణికులకు కేసు నమోదు చేయాలని సంబంధిత శాఖ అధికారులుకు ఆదేశాలు జారీ చేసినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. With regard to the scuffle between passengers on board a @ThaiSmileAirway flight, a police complaint has been filed against those involved. Such behaviour is unacceptable. — Jyotiraditya M. Scindia (@JM_Scindia) December 29, 2022 చదవండి👉 రతన్ టాటా మరో సంచలనం..500 విమానాల కోసం భారీ ఆర్డరు! -
విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు.. చేయి దించి మాట్లాడంటూ..
-
Video: విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు.. చేయి దించి మాట్లాడంటూ..
కారణం ఏంటో తెలియదు కానీ విమానంలో కొంతమంది యువకులు తగువులాడుకున్నారు. చిన్నగా మొదలైన వీరిమధ్య గొడవ మాటామాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. విమానం గాల్లో ఉండగా.. తోటి ప్రయాణికుల ముందే రౌడీల్లా తన్నుకున్నారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌కు చెందిన థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానంలో చోటుచేసుకుంది. బ్యాంకాంక్ నుంచి కోల్‌కతా వస్తున్న థాయ్ స్మైల్ ఎయిర్వేస్ టేకాఫ్ అయ్యింది. విమానం గాల్లో ఉండగా అద్దాలు పెట్టుకున్న ఓ యువకుడు తన ఎదురుగా ఉన్న బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తితో గొడవకు దిగాడు. విమానంలో ప్రయాణికులందరూ చూస్తుండగానే ఇద్దరు కొద్దిసేపు వాదులాడుతుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు విమాన సిబ్బంది, సహా ప్రయాణికులు ప్రయత్నించినా గొడవ సద్దుమణగలేదు. ఇంతలో అద్దాలు పెట్టుకున్న వ్యక్తికి మద్దతుగా తన స్నేహితులు రావడంతో గొడవ ఇంకాస్తా పెద్దది అయ్యింది. దీంతో అందరూ కలిసి ఎదుటి వ్యక్తిపై చేయిచేసుకున్నారు. ఒక్కడిని చేసి అతడిపై అందరూ దాడి చేశారు. వతల వ్యక్తి ఒక్కటే కావడంతో తనను తాను రక్షించుకుంటూ వారి చేతిలో తన్నులు తిన్నాడు. ఈ తతంగాన్నంతా ఓ ప్రయాణికుడు రికార్డ్ చేయగా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Not many smiles on this @ThaiSmileAirway flight at all ! On a serious note, an aircraft is possibly the worst place ever to get into an altercation with someone. Hope these nincompoops were arrested on arrival and dealt with by the authorities.#AvGeek pic.twitter.com/XCglmjtc9l — VT-VLO (@Vinamralongani) December 28, 2022 ఇందులో.. ఇద్దరిలో ఒకరు.. కూర్చోని నెమ్మదిగా మాట్లాడండి అని చెబుతుండగా.. ఎదుటి వ్యక్తి ముందు చేయి కిందకు దించు అని అరవడం వినిపిస్తోంది. సెకన్ల వ్యవధిలోనే వీరి మధ్య గొడవ పెరగడంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. విమానంలో అలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. రైలు, బస్సులో సీటు కోసం గొడవ పడటం చూశాం. కానీ విమానంలో ఒకరినొకరు తన్నుకోవడం ఏంట్రా బాబూ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ గొడవ ఎందుకు మొదలైందనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. అంతేగాక ఇప్పటివరకు, థాయ్ స్మైల్ ఎయిర్వేస్ ఈ ఘటనపై స్పందించలేదు. చదవండి: Bomb Cyclone: జారిపోతున్న కార్లు.. మంచులా మారుతున్న వేడి నీళ్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్.. -
థాయ్ ప్రిన్స్‌కి తీవ్ర అస్వస్థత.. కోలుకోవాలని ప్రజలంతా...
థాయ్‌లాండ్ రాజు వజిరాలాంగ్కార్న్ పెద్ద కుమార్తె థాయ్ యువరాణి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె బ్యాంకాక్‌కి ఉత్తరాన ఉన్న నఖోన్ రాట్చాసిమాలో జరుగుతున్న మిలటరీ శునకాల శిక్షణ కార్యక్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా బ్యాంకాక్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఇంటిన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు . ఆమె గుండె, ఊరితిత్తులు, కిడ్ని సరిగా పనిచేయడం లేదని థాయ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆయా భాగాలకి వైద్యపరికరాల అమర్చి చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి థాయ్‌లాండ్ రాజ్యం వారసత్వ నియమాలు పురుషులకే అనుకూలంగా ఉంటాయి. పైగా రాజు తర్వాత వారసుడిగా పురుషులనే ప్రకటిస్తారు. కాగా, అస్వస్థతకు గురయ్యినా 44 ఏళ్ల ప్రిన్స్ బజ్రకితియాభా మహిడోల్ని థాయ్‌లాండ్‌లోని ప్రజలు ప్రిన్సెస్ భా అని పిలుస్తారు. ఆమె థాయ్ రాజు మొదటి భార్య ఏకైక సంతానం. ఆమె థాయ్ రాజ్యంలో చాలా కీలక పాత్ర పోషించి అందరీ మన్ననలను అందుకుంది. ఆమె ఒక చిన్న అభియోగానికి 15 ఏళ్లు వరకు జైలు శిక్ష విధించే పరువు నష్టం వంటి చట్టాలను విమర్శిస్తూ..ప్రజలను రక్షిస్తుందనే మంచి పేరు ఆమెకు ఉంది. ప్రజలంతా రాజకుటుంబంలోని సదరు యువరాణికే పెద్ద పీఠ వేస్తారు. ప్రస్తుతం రాజ్యంలోని ప్రజలంతా ఆమె త్వరగా కోలుకోవాని ప్రార్థనలు చేయడమేగాక ఆమె త్వరగా కోలుకోవాలంటూ పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ ప్రచురిస్తున్నారు. (చదవండి: 5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు) -
మహిళ బాత్రూమ్లో భారీ పైథాన్.. ఆ తర్వాత ఏమైందంటే?
అనుకోకుండా ఓ పామును చూస్తేనే మనం భయంతో వణికిపోతాము. అలాంటిది ఇంట్లో ఉండే బాత్రూమ్లోకి ఏకంగా భారీ కొండ చిలువ ప్రవేశిస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి షాకింగ్ ఘటనే థాయ్‌లాండ్‌కు ఓ మహిళకు ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. బ్యాంకాక్‌కు చెందిన ఓ మహిళ ఇంట్లో ఉన్న బాత్రూమ్లోకి ఓ 12 అడుగుల కొండ చిలువ వెళ్లింది. ఈ క్రమంలో బాత్రూమ్లో నుంచి బయటకు వచ్చేందుకు కొండ చిలువ ప్రయత్నించింది. అయితే బాత్రూమ్ మొత్తం గ్లాస్‌తో కవర్ చేసి ఉండటంతో బయటకు రాలేకపోయింది. ఇదంతా అక్కడే ఉన్న రెండు పిల్లలు గమినిస్తూ ఉండటం వీడియోలో చూడవచ్చు. కాగా, ఇంటి సభ్యుల ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన యానిమల్ కంట్రోల్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు వ్యక్తులు పామును కాపాడి తమతో తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ టాయిలెట్ టబ్ నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం ద్వారా కొండచిలువ బాత్రూమ్లోని వచ్చినట్టు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by NowThis (@nowthisnews) -
ఆస్ట్రేలియాకు షేన్ వార్న్ భౌతికకాయం
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించేందుకు థాయ్‌లాండ్ అధికారులు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం బ్యాంకాక్ ఎయిర్‌పోర్టుకు వార్న్ మృతదేహాన్ని తరలించారు. రేపటిలోగా మృతదేహం ఆస్ట్రేలియాకు తరలించేలా అధికారులు ప్లాన్ చేశారు. ఇక వార్న్ శవపరీక్షకు సంబంధించి అటాప్సీ రిపోర్టు సోమవారం వచ్చిన సంగతి తెలిసిందే. రిపోర్టులో వార్న్‌ది సాధారణ మరణమేనని పోలీసులు ధ్రువీకరించారు. ఇక వార్న్ అంత్యక్రియలు మార్చి 30న ప్రభుత్వ అధికార లాంచనాలతో నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఈ నెల 30న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లో వార్న్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అతని అభిమానులు, సన్నిహితులు, బంధువులు కడసారి వీడ్కోలు పలికేందుకు వీలుగా ఎంసీజీని వేదికగా చేశామని విక్టోరియా రాష్ట్ర ముఖ్యమంత్రి డానియెల్ అండ్రూస్ వెల్లడించారు. ఎంసీజీ వార్న్‌కు విశిష్టమైన వేదిక. అక్కడే 1994లో జరిగిన యాషెస్ సిరీస్‌లో హ్యాట్రిక్‌తో అందరికంటా పడ్డాడు. తర్వాత 2006లో అచ్చొచ్చిన ఆ వేదికపైనే 700వ వికెట్ తీశాడు. బ్యాంకాక్‌లోని విల్లాలో స్నేహితులతో గడిపేందుకు వచ్చిన 52 ఏళ్ల వార్న్ ఈనెల 4న గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. చదవండి: Shane Warne: 'వార్న్ భుజాలు బలమైనవి'... రహస్యం తెలుసన్న అశ్విన్ -
ఎంబసీ బాత్రూమ్లో స్పై కెమెరాల కలకలం
రాయబార కార్యాలయంలోని ఆడవాళ్ల బాత్రూమ్లో స్పై కెమెరాల గుర్తింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. బ్యాంకాక్(థాయ్‌లాండ్)లోని ఆస్ట్రేలియా ఎంబసీ ఛాంబర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు శనివారం కాన్బెర్రా నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఎంబసీలో పని చేసిన మాజీ ఉద్యోగి పనే ఇదని తెలుస్తోంది. రాయల్ థాయ్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి.. విచారిస్తున్నట్లు సమాచారం. గతేడాది చివర్లో ఓ అధికారిణి బాత్రూమ్ ఫ్లోర్ మీద మెమొరీ కార్డును గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి.. థాయ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి.. జనవరి 6వ తేదీనే ఫిర్యాదు నమోదు అయినట్లు తెలుస్తోంది. కెమెరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? అనే విషయంపై నిర్ధారణ కోసం దర్యాప్తు కొనసాగుతోంది. -
బ్యాంకాక్ టూర్ వెళ్తున్నారా? మీకో ముఖ్యగమనిక
కరోనా కారణంగా భారీగా దెబ్బతిన్న రంగం పర్యాటకం. ట్రావెల్ బ్యాన్, కఠిన ఆంక్షల కారణంగా లెక్కకు అందని నష్టం వాటిల్లింది ఈ రంగానికి. ముఖ్యంగా లక్షల మంది ఉపాధి లేకుండా పోయారు. మరోవైపు టూరిజం ఆకర్షణగా ఉన్న ప్రాంతాలు.. ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నాయి. ఈ తరుణంలో థాయ్‌లాండ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. థాయ్‌లాండ్‌కు టూర్ మీద వెళ్లే వాళ్లు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే. ఈ మేరకు 300 బహ్త్(9 డాలర్లు-మన కరెన్సీలో 665 రూ.) టూరిస్ట్ ఎంట్రీ ఫీజును ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎంట్రీ ఫీజును సందర్శన ప్రాంతాల అభివృద్ధి కోసం, అలాగే సందర్శకుల ఇన్సూరెన్స్ కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఎంట్రీ ఫీజు నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే విమాన ప్రయాణికుల విషయంలో.. ఈ ఫీజును విమాన ఛార్జీలకు ఏప్రిల్ నుంచి జత చేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇతర మార్గాల గుండా వచ్చే సందర్శకుల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ ఫీజు.. చాలాదేశాల్లో వసూలు చేస్తున్న టూరిస్ట్ ఫీజుకు సమానంగానే ఉందని, కానీ, సందర్శకులకు కలిగే ప్రయోజనాలు మాత్రం అదనంగా ఉంటున్నాయని లెక్కలతో సహా చెప్తోంది థాయ్‌లాండ్ ప్రభుత్వం. ఒకవైపు ప్రపంచం అంతా ఒమిక్రాన్, కరోనా కేసుల భయంతో ఆంక్షలు విధిస్తుంటే.. థాయ్‌లాండ్ మాత్రం టూరిస్టులకు వెల్కమ్ చెప్తోంది. భారత్ నుంచి రాజధాని బ్యాంకాక్‌కు ఎక్కువ మంది క్యూ కడతారన్న విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా దెబ్బతిన్న థాయ్ టూరిజాన్ని.. తిరిగి నిలదొక్కుకునేలా చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టూరిజం ఎంట్రీ ఫీజు విధించింది. ప్రస్తుతం యాభై లక్షల మంది సందర్శకులు వస్తారని థాయ్ ప్రభుత్వం భావిస్తోంది. యూరప్, అమెరికాల నుంచి రెగ్యులర్ టూరిస్టుల తాకిడి ఉందని ప్రకటించుకుంది. మరోవైపు భారత్, చైనా గనుక తమ ప్రజలకు సడలింపులు ఇస్తే.. ఆ సంఖ్య 90 లక్షలకు చేరుతుందని భావిస్తోంది. ఒకవేళ భూమార్గం సరిహద్దులు గనుక తెరిస్తే.. ఆ సంఖ్య కోటి యాభై లక్షలకు చేరొచ్చని అంచనా వేస్తోంది. చదవండి: మహీంద్రా గ్రూప్స్ సంచలన నిర్ణయం -
అనకాపల్లి కుర్రాడు.. చైనాలో మొనగాడు
పాఠశాల వార్షికోత్సవాల్లో డ్యాన్స్ ప్రదర్శనతో ప్రారంభమైన ఆ యువకుడి ప్రస్థానం ఖండాంతరాలను దాటింది.. ఆ కళాకారుడి నృత్యానికి ఫిదా అయిన అభిమానులు అతన్ని అందలమెక్కించారు. ఉత్తరాంధ్ర స్థాయిని దాటి టీవీ చానళ్లలో డ్యాన్స్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రస్థాయి ఇమేజిని సంపాదించాడు. విదేశాల్లో ప్రదర్శనల్చి, అక్కడి కళాభిమానులనూ ముగ్ధులను చేశాడు. అలా థాయిలాండ్‌లో కొన్నాళ్లు నృత్య శిక్షణ ఇచ్చి.. చైనాలో స్థిరపడ్డాడు. యోగాలోనూ ప్రావీణ్యం సంపాదిం అవార్డులెన్నో అందుకున్నాడు. అనకాపల్లిలో పుట్టి పెరిగిన కుర్రాడు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. సాక్షి, అనకాపల్లి: ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కొణతాల విజయ్.. పేరుకు తగ్గట్టు విజయానికి చిరునామాగా మారాడు. ఆ గుర్తింపు అతనికి అంత సులువుగా రాలేదు. దాని వెనుక ఎంతో కృషి, తపన ఉంది. సూరి అప్పారావు, కాంతకుమారిల ముగ్గురు కొడుకుల్లో మధ్యవాడు విజయ్. విశాఖ జిల్లా అనకాపల్లిలో పాఠశాల వార్షికోత్సవాల్లో నృత్యాలు చేస్తూ విజయ్ గ్రూప్‌ను స్థాపించాడు. తండ్రితోపాటు అన్నయ్య కూడా చిన్నప్పుడే చనిపోవడంతో తల్లిని, సోదరుడ్ని చూసుకునే భారం అతనిపై పడింది. అయినా సరే తన అభిరుచిని వీడలేదు. తన టీం ద్వారా విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్రలోనూ మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు పొందాడు. కొత్తగా ప్రారంభమైన జెమినీ టీవీ షోలో అవకాశమ్చొంది. మొదటి ప్రయత్నంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన విజయ్ బృందం ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందింది. చిరంజీవి, లారెన్స్ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన విజయ్ హైదరాబాద్‌కు మకాం మార్చాడు. జీ తెలుగు చానల్లో ‘డేర్ టూ డ్యాన్స్’ ప్రోగ్రాంలో యాంకర్‌గా వ్యవహరించిన అనంతరం ఆ గుర్తింపుతో అంతర్జాతీయ వేదికలపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లలో డ్యాన్స్ మాస్టర్‌గా ఎంతోమందికి శిక్షణ ఇచ్చాడు. నాన్న, అన్నయ్య ఉంటే గర్వపడేవారు పదహారేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాను. చిన్నప్పుడు నా నృత్య ప్రదర్శనలు చసి అన్నయ్య ఎంతో సంతోషించేవాడు. ఈ స్థాయికి వచ్చానని తెలిస్తే ఎంతో గర్వపడతాడు. కానీ నాకు ఆ అదృష్టం లేదు. అన్నయ్య ఆశయం మేరకు డ్యాన్స్‌లో రాణించాను. పద నర్తన నాకో ప్యాషన్. ఆ అభిరుచే నన్ను ఇంతవాణ్ని చేసింది. ఆదరించిన కళాభిమానులకు కృతజ్ఞణ్ని. – కొణతాల విజయ్ చైనాలో రాణింపు... థాయ్‌లాండ్‌లో స్థిరపడిన విజయ్‌కు చైనాకు సంబంధింన వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. విజయ్ ప్రతిభను గుర్తించిన చైనా మిత్రులు అక్కడికి రమ్మని ఆహ్వానించడంతో డ్యాన్స్ నేర్పేందుకు ఆ దేశానికి వెళ్లాడు. కొరియోగ్రఫీ చేస్తూ అక్కడ టీవీ చానళ్లలో కూడా డ్యాన్స్‌పై పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. వివాహం అయిన తర్వాత విజయ్ ప్రస్థానం మరో మలుపు తిరిగింది. ఫిట్నెస్ కోసం యోగా నేర్చుకున్న అతను ఆ శాస్త్రంలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. మహిళలు గర్భం ధరించిన సమయంలో చేయగల యోగాసనాల్లో శిక్షణ ఇవ్వగల స్థాయికి చేరుకున్నాడు. గర్భిణిగా ఉన్న తన భార్యతో ఆసనాలు వేయించి రికార్డులను నెలకొల్పాడు. ఇటీవల అష్టవక్రాసనం, మయూరాసనాలను ప్రదర్శించి అవార్డులు దక్కించుకున్నాడు. విజయ్ ఇప్పుడు చైనాలో డ్యాన్సర్‌గా ఒక రోల్‌మోడల్‌గా నిలిచాడు. -
ప్రియుడి 23 లక్షల బైక్‌ను తగలబెట్టేసిన ప్రియురాలు
బ్యాంకాక్: ప్రేమ.. మాటల్లో వర్ణించలేని గొప్ప ఫీలింగ్. ఒకరి మనుసు ఒకరు తెలుసుకొని జీవితాంతం తోడుగా నిలవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కానీ తమ ప్రేమను పెళ్లితో మూడేసి నూరేళ్లు జీవించేవాళ్లు కొందరే. మనస్పర్థలు, నమ్మకం కోల్పోవడం వంటి కారణాలతో మధ్యలోనే విడిపోయే వారు కోకొల్లలు. కొంతమంది బలమైన కారణంతో బ్రేకప్ మరికొంతమంది సిల్లీ రీజన్స్‌తో విడిపోతుంటారు. అయితే అచ్చం ఇలాగే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ సమయంలో కనాక్ వావన్ అనే యువతి తన లవర్‌కు లక్షల విలువైన బైక్‌ను గిఫ్ట్‌గా అందించింది. తరువాత కొన్ని కారణాలతో వారు విడిపోయారు. అయితే తను ఇచ్చి బైక్‌ను తిరిగి ఇవ్వాలని యువతి అతన్ని కోరింది. ఇందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో ఎలాగైన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఓ ప్లాన్ వేసింది. బ్యాంకాక్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో ప్రియుడి బైక్ పార్క్ చేసి ఉందని తెలుసుకుంది. అక్కడికి వెళ్లి ఆమె ఇచ్చిన లగ్జరీ బైక్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఈ క్రమంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఆరు బైక్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే అక్కడున్న సిబ్బంది వెంటనే తెరుకొని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అనంతరం సీసీ టీవీఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ప్రమాదం జరిగడానికి ముందు ఓ మహిళ వచ్చి ఓ బైక్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం పోలీసులు గమనించారు. ప్రమాదానికి కనాక్ వావన్ కారణమని తెలుసుకొని ఆమెను అరెస్ట్ చేసి విచారించగా మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. ఆ బైక్ ధర ఒక మిలియన్ బాట్ అంట. అంటే మన కరెన్సీలో సుమారు ₹23 లక్షల వరకు ఉంటుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడే ఆమె కొనిచ్చనని, ఇప్పుడు విడిపోవడంతో అతని మీద కోపంతో ఆ బైక్‌ను తగలబెట్టాలని తెలిపింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: వీడియో వైరల్: భారీగా బరువు తగ్గిన కిమ్ జాంగ్ -
బ్యాంకాక్ నుంచి భారత్‌కు ఆక్సిజన్ ట్యాంకర్లు
న్యూఢిల్లీ: థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్ నుంచి భారత్‌కు నాలుగు ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి. భారత వాయుసేనకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇవి గుజరాత్‌లోని జామ్ నగర్‌కి బుధవారం సాయంత్రం చేరుకున్నట్లు అధికా రులు వెల్లడించారు. మరోవైపు సింగపూర్ నుంచి రెండు సీ–130 ఎయిర్ క్రాఫ్ట్‌ల ద్వారా 256 ఆక్సిజన్ సిలిండర్లు పశ్చిమబెంగాల్లోని పనాగఢ్‌కు చేరుకున్నా యి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేమితో భారత్ కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో భారత వాయు సేన పలు ట్యాంకర్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక దేశంలో సైతం పలు ప్రాంతాల మధ్య కూడా యుద్ధ విమానాలను ఉపయోగించి ట్యాంకర్లను తరలిస్తున్నారు. ఆగ్రా, హిందోన్, భోపాల్, చండీగఢ్‌ల నుంచి ఒక్కో సిలిండర్ చొప్పున రాంచీకి తరలిం చారు. అవేగాక ఇండోర్ నుంచి రాయ్‌పూర్‌కు రెండు ట్యాంకర్లు, జోధ్‌పూర్ నుంచి జామ్ నగర్‌కు రెండు ట్యాంకర్లు తరలించారు. చదవండి: కరోనా కల్లోలం.. 3 వేల మంది పేషెంట్లు పరారీ! -
ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. భారీ పార్శిల్
బ్యాంకాక్: వ్యాపారాల్లోకి ఈ-కామర్స్ రంగ ప్రవేశంతో వస్తువుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వినియోగదారులు ఈ కామర్స్‌పైనే ఆధారపడి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అమ్మకాలు ఎంత గణనీయంగా పెరిగాయో అంతే సంఖ్యలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగాయి. ఒక వస్తువు తక్కువ ధర వస్తూంటే ముందు వెనుకా ఆలోచించకుండా వెంటనే ఆర్డర్ చేసి మోసపోయే సంఘటనలు కూడా పెరిగాయి. వినియోగదారులు అత్యాశ, నిర్లక్ష్యం ఈ ఇలాంటి మోసాలకు పెట్టుబడి. తాజాగా ఇలాంటి ఉదంతమే ఒకటి థాయిలాండ్‌లో వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా విలాసానికి మారు పేరైన ఐఫోన్అంటే మరీ మోజు ఎక్కువ. ఈ ఉత్సాహంతోనే మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకు ఐఫోన్న వస్తోందని ఒక పిల్లాడు పప్పులో కాలువేశాడు. థాయ్‌లాండ్‌కు చెందిన టీనేజర్ తక్కువ ధరకే ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ఆశపడ్డాడు. వెంటనే ఆర్డర్ చేశాడు. ఐఫోన్ ఎప్పుడొస్తుందా! అని కళ్లల్లో వత్తులు వేసుకొని, ఎదురుచూస్తూ ఉన్నాడు. చేసిన ఆర్డర్ రానే వచ్చింది. సాధారణంగా అయితే స్మార్ట్‌ఫోన్ పార్శిల్ చిన్నగా ఉంటుంది. కానీ తనకొచ్చిన భారీ పార్శిల్ చూసి నిర్ఘాంతపోయాడు. పార్శిల్ ఓపెన్ చేసిన అతగాడికి దిమ్మదిరిగా మైండ్ బ్లాక్ అయింది. విషయం ఏమిటంటే..ఐఫోన్ కు బదులు ఐఫోన్ ఆకారంలో ఒక కాఫీ టేబుల్ వచ్చింది. తీరిగ్గా విషయాన్ని పరిశీలించాక జరిగిన మోసం అర్థం అయింది ఇ-కామర్స్ సంస్థ ప్రకటనలోని వివరాలన్నీ సరిగ్గా చూసుకోకుండా ఆర్డర్ చేసి మోస పోయానని గుర్తించాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదీ సంగతి..ఫ్రీ, డిస్కౌంట్లు లాంటి ఆఫర్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. లేదంటే ఇలాంటి షాక్‌లు తప్పవు. తస్మాత్ జాగ్రత్త! చదవండి: పోలీస్ అధికారి సాహసం..స్పైడర్‌మ్యాన్ అంటూ ప్రశంసలు -
బ్యాంకాక్‌కు భారత షట్లర్లు
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –1000 బ్యాడ్మింటన్ టోర్నీలలో పాల్గొనేందుకు భారత బృందం బ్యాంకాక్ పయనమైంది. ఈనెల 12–17 వరకు యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీతో పాటు... 19 నుంచి 24 వరకు జరిగే టయోటా థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో ఆడేందుకు భారత్ నుంచి స్టార్ షట్లర్లు సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్ బయలుదేరారు. వీరి వెంట డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి, సింగిల్స్ ఆటగాళ్లు ప్రణయ్, కశ్యప్, సమీర్ వర్మ, ధ్రువ్ కపిల, మనూ అత్రి కూడా వెళ్లారు. లక్ష్యసేన్ వెన్ను నొప్పి కారణంగా చివరి నిమిషంలో తప్పుకున్నాడు. లండన్ నుంచి సింధు గత అక్టోబర్ నుంచి లండన్‌లోనే ఉంటూ అక్కడే ప్రాక్టీస్ చేసిన ప్రపంచ చాంపియన్ పీవీ సింధు లండన్ నుంచి దోహా మీదుగా బ్యాంకాక్ చేరనుంది. హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు సింధుతో కలిసి తీసుకున్న ఫోటోను ఇంగ్లండ్ డబుల్స్ ఆటగాళ్లు బెన్ లేన్, సీన్ వెండీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇంగ్లండ్ ఆటగాళ్లతో సింధు -
బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రభుత్వం రాజధాని బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ప్రధానమంత్రి గద్దె దిగాలనీ, దేశంలో రాజ కుటుంబం పెత్తనం తొలగించి, ప్రజాస్వామ్య సంస్కరణలు తేవాలంటూ బుధవారం విద్యార్థులు రాజ ప్రాసాదానికి సమీపంలో నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రాజ కుటుంబం వాహనాలకు అవరోధం కలిగించేందుకు యత్నించారు. దీనిపై ఆగ్రహించిన ప్రభుత్వం ఈ అనూహ్య చర్యకు పూనుకుంది. ‘రాజ కుటుంబం వాహనాలకు అవరోధం కలిగించడం వంటి వివిధ మార్గాల్లో అవాంఛనీయ ఘటనలను, ఉద్యమాలను ప్రేరేపించడానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించాయి’అని ప్రభుత్వం తెలిపింది. అత్యవసర పరిస్థితి ప్రకటన అనంతరం రాజధాని వీధుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు కనిపించారు. గురువారం వేకువజాము నుంచే పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రయుత్ చన్ ఓచా నివాసం ఎదుట నిరసనలను కొనసాగిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదర్శనలపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ తాజా అరెస్టులకు నిరసనగా బ్యాంకాక్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో నిరసనలు కొనసాగాయి. ప్రధాని రాజీనామా చేయాలని, అరెస్టయిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. థాయ్ చట్టాల ప్రకారం రాజు పూజనీయుడు. రాజు, రాజకుటుంబాన్ని బహిరంగంగా ప్రశ్నించినా, విమర్శించినా శిక్షలు కఠినంగా ఉంటాయి. -
ట్రావెల్ బస్సును ఢీకొన్న రైలు ఫొటోలు
-
బస్సును ఢీకొట్టిన రైలు.. 20 మంది మృతి
బ్యాంకాక్ : థాయిలాండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకాక్ నుంచి చా చోంగ్‌సావో ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేందు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రావిన్స్ గవర్నర్ మైత్రీ త్రితిలానంద్ తెలిపారు. మృతులంతా ఓ ప్యాక్టరీకి చెందిన కార్మికులుగా గుర్తించారు. టూరిస్ట్ బస్సు రైల్వే ట్రాక్ దాటుతుండగా సరుకు రవాణా రైలు వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు నుజ్జునుజ్జయ్యింది. శిథిలాలు, మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. -
షాకింగ్: బంగారం అమ్మేస్తున్నాం..
బ్యాంకాక్ : బంగారాన్ని నమ్మినవారెవరూ నష్టపోరంటారు పెద్దలు.... ఇది థాయ్‌లాండ్ ప్రజలకు పక్కాగా వర్తిస్తుంది. ఆపద కాలంలో అక్కడ ప్రజలను పసిడి ఆదుకుంటోంది. సహజంగా బంగారాన్ని అమ్మడానికి ఎవరూ ఇష్టపడరు. ప్రాణం మీదకు వచ్చినప్పుడు మాత్రమే అమ్మడానికి చూస్తారు. అయితే కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి చేతిలో డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. (ఏడాది చివర్లో రూ 50,000 దాటేస్తుందా..?) లాక్‌డౌన్‌తో థాయ్‌లాండ్ ప్రజలు నగదు లేక విలవిల్లాడుతున్నారు. దీంతో వారి దృష్టి బంగారం అమ్మకంపై పడింది. తమ దగ్గరున్న బంగారం విక్రయించి, సొమ్ము చేసుకునేందుకు ఎగబడుతున్నారు. బ్యాంకాక్‌లోని చైనాటౌన్‌లోని యోవారత్‌కు ప్రజలు పరుగులు పెడుతున్నారు. స్వర్ణం ధర భారీగా పెరగడం వారిలో ఆశలు రేకెత్తిస్తోంది. థాయ్‌లాండ్‌లో ఔన్స్ బంగారం ప్రస్తుతం 1,731 డాలర్లు పలుకుతోంది. గత ఏడేళ్లలో ఇదే అత్యధిక ధర. (లాక్డౌన్ 2.0 : ఆర్బీఐ కీలక నిర్ణయం ) ప్రజలు బంగారం అమ్ముకోవడానికి మాస్కులు ధరించి పెద్ద ఎత్తున జ్యూవెలరీ షాప్‌లకు బారులు తీరుతున్నారు. జనాల తాకిడి పోటెత్తడంతో ఆ దేశ ప్రధాని ప్రయూత్ చాన్-ఓచా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం విక్రయిస్తే నగదు సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, అవసరం మేరకే విక్రయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జనాలను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా స్థానిక అధికారులు కసరత్తు కూడా చేపట్టారు. (ఇంట్లోనే మద్యం తయారు చేసుకోవడం ఎలా? ) కాగా థాయ్‌లాండ్ ప్రజలు చేతిలో నగదు ఉంటే వాటిని బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతారు. బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా, నమ్మకమైన పెట్టుబడిగా చూస్తారు. దీంతో అక్కడ ప్రజలు బంగారు ఆభరణాలను భారీగా కొనుగోలు చేసి, ధరలు పెరిగినప్పుడు అమ్మడం చేస్తుంటారు. బ్యాంకాక్‌లో పక్షం రోజులుగా లాక్డౌన్ అమలులో ఉండటంతో చేతిలో సరైన నగదు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలతో పాటు ఇతరత్రా అవసరాలకు థాయ్ ప్రజలు బంగారపు కడ్డీలతో పాటు, నగలను అమ్ముకుంటున్నారు. బంగారం ధర పెరగడంతో ఇందుకోసం ఉదయం నుంచే షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. (విద్యార్థుల మృతదేహాలను రప్పించండి ) థానకార్న్ ప్రోమ్యూయెన్ మాట్లాడుతూ.. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. దీంతో నగదు కోసం నా దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. నాకు ఖర్చులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆదాయం లేకపోవడంతో వేరే గత్యంతరం లేకపోయిందని మరొకరు వాపోయారు. ఇప్పటివరకూ తన సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేదని అందుకే బంగారాన్ని అమ్ముతున్నట్లు ఓ వ్యాపారి తెలిపాడు. ఇక గత 60 ఏళ్లలో ప్రజలు ఈ విధంగా క్యూ లైన్లలో నిలబడి బంగారం అమ్మడాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని గోల్డ్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జిట్టి టాంగ్సిత్పాక్డి వ్యాఖ్యానించారు. (మీకు ఇలాంటి సంఘటన ఎదురైందా ?) (ఆశ్చర్యం: గాలిపటం ఎగరేస్తున్న కోతి) -
థాయ్‌లాండ్‌లో మోదీ.. కీలక ప్రసంగం
బ్యాంకాక్: ఆసియాన్ దేశాలతో బహుళ విభాగాల్లో సంబంధాల విస్తరణకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. బ్యాంకాక్‌లో జరిగిన 16వ ఆసియాన్-భారత్ సదస్సుకు హాజరయ్యారు. తీరప్రాంత రక్షణ సహా వ్యవసాయం, ఇంజినీరింగ్, డిజిటల్ సాంకేతికత, పరిశోధన రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. పలు అంశాల్లో ఆసియాన్ కూటమిలోని సభ్యదేశాలతో కలిసి సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతానికి సంబంధించి పరస్పర సహకారంపై కూటమి దేశాలు, భారత్ ఏకాభిప్రాయంతో ఉండటాన్ని స్వాగతించారు మోదీ. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా అవతరించాలన్న భారత్ కల త్వరలోనే సాకారం అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్త మార్పుల దిశగా భారత్ అడుగులు వేస్తోందని తెలిపారు. బ్యాంకాక్‌లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని మోదీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. బ్యూరోక్రటిక్ తరహా పాలనకు స్వస్తి పలికి.. నవభారతం దిశగా దేశం అడుగులు వేస్తోందని తెలిపారు. థాయ్ ప్రధానితో భేటీ థాయ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్ ఓ చాన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో.. మయన్మార్ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూకీతోనూ సమావేశమయ్యారు. సాయంత్రం జరిగే విందులో పాల్గొంటారు. -
ఉగ్ర మూలాల్ని నాశనం చేశాం
బ్యాంకాక్/న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం వేళ్లూనుకునేందుకు గల కారణాన్ని గుర్తించి, తొలగించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్న ప్రధాని భారత సంతతి ప్రజలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలో వేర్పాటువాదం, ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు మూలాలను నాశనం చేశాం. ఆగస్టు 5న ఆర్టికల్ 370ను రద్దు చేశాం. జమ్మూకశ్మీర్‌కు సొంత రాజ్యాంగాన్ని కల్పించడం వంటి అనేక తాత్కాలిక నిబంధనలను తొలగించాం. మన నిర్ణయం సరైందే అని ప్రపంచం గుర్తించింది. థాయ్‌లాండ్‌లోనూ అదే విషయం ప్రతిధ్వనించింది. మీరిచ్చే ప్రశంసలు భారత్ పార్లమెంట్, పార్లమెంట్ సభ్యులకే చెందుతాయి’అని ప్రధాని పేర్కొన్నారు. దీంతో అక్కడి వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. పనిచేసి, ఫలితం చూపేవారి నుంచే ప్రజలు ఎక్కువగా ఆశిస్తారని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన వంటి పథకాలు, కర్తార్‌పూర్ కారిడార్‌తో ప్రయోజనాలను ప్రధాని వారికి వివరించారు. ఈ నెల 3వ తేదీన బ్యాంకాక్ సమీపంలోని నొంతబురిలో జరిగే ఆసియాన్–ఇండియా 16వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. 4న 14వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం, ఆర్సెప్ మూడో శిఖరాగ్ర సమావేశంలోనూ మోదీ హాజరవుతారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర భేటీలో ఆసియాన్‌లోని 10 దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా పాల్గొననున్నాయి. ప్రయోజనాన్ని బట్టే ఆర్సీఈపీ దేశానికి ఒనగూరే ప్రయోజనాలను బేరీజు వేశాకే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్సీఈపీ) ఒప్పందంపై సంతకం చేస్తామని మోదీ తెలిపారు. బ్యాంకాక్ పర్యటనకు వెళ్లే ముందు ఆయన ఒక ప్రకటన చేస్తూ.. ‘ఈ నెల 4వ తేదీన జరిగే భేటీ సందర్భంగా ఆర్సీఈపీ చర్చల్లో పురోగతిని పరిశీలిస్తాం. మన సరుకులు, సేవలు, పెట్టుబడులకు సంబంధించిన ప్రయోజనాలు ఈ ఒప్పందంతో ఎంతవరకు నెరవేరతాయనే అంశాన్ని పరిశీలిస్తాం. ఈ ఒప్పందం అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి. ఈ శిఖరాగ్రం సందర్భంగా ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తాం. ఆసియాన్‌కు సంబంధించిన ఈ సమావేశాలు మనకు చాలా ముఖ్యం. అనుసంధానత, సామర్థ్యం పెంపు, సాంస్కృతిక, వాణిజ్యపరమైన ప్రాథమ్యాంశాలపై ఆసియాన్‌తో మన భాగస్వామ్యం ఆధారపడి ఉంది’అని తెలిపారు. -
ఫైనల్లో నిఖత్, హుసాముద్దీన్
న్యూఢిల్లీ: బ్యాంకాక్‌లో జరుగుతున్న థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు నిఖత్ జరీన్, హుసాముద్దీన్ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మహిళల 51 కేజీల విభాగంలో తెలంగాణకు చెందిన జరీన్ 4–1తో జుతమస్ జిత్పోంగ్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించగా... మరో తెలంగాణ బాక్సర్, కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత హుసాముద్దీన్ పురుషుల 56 కేజీల విభాగంలో 3–2తో అమ్మరిట్ యోదమ్ (థాయ్‌లాండ్)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించాడు. వీరితో పాటు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత దీపక్ సింగ్ (49 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), బ్రిజేష్ యాదవ్ (81 కేజీలు)లు సెమీస్‌లో తమ ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్స్‌కు చేరారు. మహిళల విభాగంలో మంజు రాణి (48 కేజీలు), భాగ్యబతి కచారి (81 కేజీలు) సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. -
క్వార్టర్స్‌లో హుసాముద్దీన్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల 56 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో జార్జి మొల్వాంట్వా (బోట్స్వానా)పై గెలుపొందాడు. 69 కేజీల విభాగంలో ఆశిష్ కుమార్ 5–0తో పీటర్ సెటినిక్ (క్రొయేషియా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మహిళల 75 కేజీల విభాగంలో భాగ్యబతి కచారి సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో భాగ్యబతి 5–0తో ఎన్గుయెన్ హోంగ్ (వియత్నాం)పై నెగ్గింది. -
నటి కొంపముంచిన ఆల్చిప్ప!
బ్యాంకాక్ : జెయింట్ క్లామ్ ఆల్చిప్ప నటి కొంపముంచింది. అంతరించిపోతున్న ఆల్చిప్ప జాతికి చెందిన జీవిని పట్టుకున్న కారణంగా సౌత్ కొరియా నటికి ఐదేళ్ల జైలు శిక్ష పడనుంది. వివరాల్లోకి వెళితే.. సౌత్ కొరియాకు చెందిన లీ ఇయోల్ ఎమ్ అనే నటి గత కొద్దినెలలుగా ‘‘లా ఆఫ్ ది జంగిల్’’ అనే రియాలిటీ షోలో పాల్గొంటోంది. జూన్ 30వ ఎపిసోడ్ చిత్రీకరించటానికి రియాలిటీ షో టీం బ్యాంకాక్‌లోని థాయ్ మెరైన్ నేషనల్ పార్క్‌కు వచ్చింది. షోలో భాగంగా సముద్రంలోకి దిగిన లీ ఇయోల్ ఎమ్ నీటి అడుగున ఉన్న ఆల్చిప్పలను బయటకు తీసువచ్చారు. అవి అంతరించిపోతున్న జాతికి చెందినవని ఆమెకు తెలియదు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ‘హట్ చావో మాయ్ నేషనల్ పార్క్’ అధికారులు నేషనల్ పార్క్, థాయ్ వన్య ప్రాణుల సంరక్షణా చట్టాలను ఉల్లంఘించిందంటూ ఆమెపై కేసు పెట్టారు. నటిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకోసం అన్వేషణ ప్రారంభించారు. రియాలిటీ షో నిర్వాహకులు క్షమాపణలు చెప్పినప్పటికి వన్య ప్రాణి సంరక్షణా అధికారులు కేసు వెనక్కితీసుకోవటానికి ఒప్పకోలేదు. థాయ్ మెరైన్ నేషనల్ పార్క్ అధికారి నారంగ్ కొంగైడ్ మాట్లాడుతూ.. ‘‘ నటిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇప్పుడా కేసు కోర్టు పరిథిలో ఉంది. ఆమెను శిక్షించాలా లేక వదిలేయాలా అన్నది కోర్టుకు సంబంధించిన విషయ’’ మని పేర్కొన్నారు. -
11వ అంతస్తు నుంచి కిందపడినా..
థాయ్‌లాండ్: కేవలం ఒక్క అంతస్తు పైనుంచి పడి మరణించిన వారిని చూసుంటాం. మరి 11 అంతస్తు నుంచి పడితే... బతికే చాన్సే లేదు. కానీ థాయ్‌లాండ్‌లో ఓ చిన్నారి 11వ అంతస్తు నుంచి కిందపడినా కూడా ప్రాణాలతో బయటపడి మృత్యుంజయురాలిగా నిలిచింది. వివరాల్లోకెళ్తే... వ్యక్తిగత పనిపై దీచా సూక్పలం అనే వ్యక్తి తన కుమార్తెతో కలిసి థాయ్‌లాండ్‌లోని పట్టాయా పట్టణానికి వెళ్లాడు. వీరిద్దరూ అక్కడే ఓ హోటల్లో బస చేశారు. నిద్రలో నడిచే అలవాటున్న దీచా కుమార్తె రాత్రి గది నుంచి బయటకు వచ్చింది. తర్వాత వేరే గదిలోకి వెళ్లడానికి ప్రయత్నించిన ఆ చిన్నారి నేరుగా బాల్కానీ వైపు వెళ్లి గోడపైకి ఎక్కి వేలాడింది. కాసేపు గోడపై వేలాడిన చిన్నారి పట్టు తప్పడంతో 11వ అంతస్తు నుంచి పడిపోయింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదంతా హోటల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. చిన్నారి కిందపడిపోతూ గట్టిగా కేకలు పెట్టింది. హోటల్ సిబ్బంది వచ్చి చూసేసరికి ఆ చిన్నారి కింద పడిపోయి స్పృహతప్పింది. వెంటనే ఆమెను బ్యాంకాక్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి ప్రాణహాని లేదని.. గాయాల నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
విజేత భారత్
సాక్షి, హైదరాబాద్: ఇండో–థాయ్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది. బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 25–23, 25–20తో థాయ్‌లాండ్ జట్టుపై పోరాడి గెలిచింది. ఈ సందర్భంగా థాయ్‌లాండ్ ఆసియా త్రోబాల్ కార్యదర్శి మొహమ్మద్ లతీఫుద్దీన్, థాయ్‌లాండ్ కార్యదర్శి మన్నత్ బూన్చాన్ భారత జట్టును అభినందించారు. , -
రాజవంశీకురాలు పోటీ చేయడమేమిటి?
బ్యాంకాక్ : తన సోదరి ఉబోల్ రతన(67) ప్రధాని పదవికి పోటీ చేస్తాననడం పట్ల థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్ విముఖత వ్యక్తం చేశారు. రాచరిక సంప్రదాయాలకు విరుద్ధంగా ఓ రాజవంశీకురాలు ఎన్నికల్లో పోటీ చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘ రాజు, రాజవంశీకులు రాజకీయాలకు అతీతం. రాజవంశీకులను రాజకీయ వ్యవస్థలో భాగస్వాములు చేయాలనుకోవడం రాచ, థాయ్ సంప్రదాయాలకు విరుద్ధం. ఇలా చేయడం సరైంది కాదు. రాచరికాన్ని, ప్రతిష్టను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక యువరాణిగా ప్రజలకు ఆమె అందించిన సేవలు ఆదర్శనీయం’ అంటూ ఉబోల్ రతనను ప్రశంసిస్తూ, ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన పార్టీని విమర్శిస్తూ రాయల్ గెజిట్‌ను విడుదల చేశారు. కాగా థాయ్‌లాండ్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఉబోల్ రతన శుక్రవారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. థాయ్ మాజీ ప్రధాని థక్షిన్ షినవ్రతకు చెందిన ‘థాయ్ రక్ష చార్త్ పార్టీ’ తరఫున పోటీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో ఇన్నాళ్లుగా విజయం తమదే అన్న విశ్వాసంతో ఉన్న సైనిక పాలకుల్లో ఆందోళన మొదలైంది. అయితే రతన తన నిర్ణయం ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాయల్గెజిట్ వెలువడటం గమనార్హం. ఇక 1972లో అమెరికా దేశస్తుడు పీటర్ జెన్సెన్ను వివాహం చేసుకున్న రతన, రాచరిక గౌరవాలను వదులుకున్నారు. ఏకైక కొడుకు మరణం, భర్తతో విడాకులు తర్వాత రాచ కుటుంబ సభ్యురాలిగానే కొనసాగుతున్నారు. -
ఇక రూ. 2500కే బ్యాంకాక్ వెళ్లొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకం కింద చిన్న విమానాశ్రయాలను అంతర్జాతీయ గమ్యస్ధానాలకు అనుసంధించాలని యోచిస్తోంది. ఈ పథకం కింద అంతర్జాతీయ గమ్యస్ధానాలకు రూ. 2500 కంటే తక్కువ చార్జీలతోనే చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశ ప్రజల్లో ఎక్కువ మందికి విమానాయానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం ద్వారా చిన్న నగరాలనూ దేశంలోని పలు ప్రధాన నగరాలకు కనెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ రూట్లనూ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉడాన్ మూడవ దశలో ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పథకం కింద అసోంలోని విమానాశ్రయాలు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, నేపాల్‌లోని ఖట్మాండులతో కనెక్ట్ కానున్నాయి. ఇదే తరహాలో బిహార్ ఎయిర్‌పోర్ట్‌లను నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లోని ఎయిర్‌పోర్ట్‌లకు నేరుగా అనుసంధానించనున్నారు. అసోం ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సమ్మతించగా, స్పైస్‌జెట్ సహా పలు విమానయాన సంస్థలు బ్యాంకాక్ వంటి ప్రముఖ గమ్యస్ధానాలకు విమాన సర్వీసులను చేపట్టేందుకు ఆసక్తి కనబరిచాయి. ప్రభుత్వం తన ప్రణాళికలతో ముందుకు వెళితే త్వరలోనే రూ. 2500తో అంతర్జాతీయ విమాన టికెట్లను ఆఫర్ చేస్తూ పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటన చేస్తుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉడాన్ మూడవ దశకు ఇటీవల ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించగా 111 రూట్ల కోసం 15 ఎయిర్లైన్ల నుంచి బిడ్లను పొందింది. -
ఇయర్ ఎండింగ్, న్యూఇయర్ జోష్ అక్కడే..
సాక్షి, సిటీబ్యూరో: న్యూఇయర్ జోష్ అప్పుడే మొదలైంది. నగరంలో ఇయర్ ఎండింగ్ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు అనేక సంస్థలు పోటీ పడుతుండగా... సిటీజనులు మాత్రం ఎంచక్కా విదేశాలకు చెక్కేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లో జరుపుకునేందుకు ఎక్కువ శాతం మంది మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా ప్రతిఏటా డిసెంబర్ చివరి వారంలో హైదరాబాద్ నుంచి గోవాకు ఎక్కువ మంది వెళ్తారు. గోవాలో సరదాగా గడిపేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఈసారి చాలామంది నగరవాసులు గోవా కంటే బ్యాంకాక్‌కు పరుగులు పెడుతున్నారు. అందుబాటు చార్జీల్లోనే విదేశీ టూర్ ప్యాకేజీలు లభిస్తుండడంతో కొంతమంది కుటుంబాలతో సహా విదేశాలకు పయనమవుతుండగా... మరికొందరు సోలోగా ఎంజాయ్ చేసేందుకు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. గత వారం రోజులుగా సుమారు 25శాతానికి పైగా విదేశీ ప్రయాణాలు పెరిగినట్లు పలు ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్‌లు సైతం బాగా పెరిగినట్లు థామస్‌కుక్, కాక్స్ అండ్ కింగ్స్ తదితర సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సుమారు లక్ష మంది ప్రయాణికులు అదనంగా బయలుదేరి వెళ్తున్నట్లు అంచనా. చలో బ్యాంకాక్... హైదరాబాద్ నుంచి సింగపూర్, మలేసియా, మాల్దీవులు, బ్యాంకాక్, దుబాయ్‌లకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ ఐదింటిలోనూ బ్యాంకాక్‌కు వెళ్లే వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందుబాటులో ఉన్న ప్యాకేజీలు, విమాన చార్జీలే ఇందుకు కారణం. సాధారణంగా హైదరాబాద్ నుంచి గోవా టూర్‌కు వెళ్లేందుకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. ఇంచుమించు అదే ప్యాకేజీల్లో బ్యాంకాక్ టూర్లు లభిస్తుండడంతో ఎక్కువ మంది గోవాకు ప్రత్యామ్నాయంగా బ్యాంకాక్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. గోవాలో సందర్శించే స్థలాలు తక్కువ. బ్యాంకాక్‌లో ఎక్కువ పర్యాటక స్థలాలను సందర్శించవచ్చు. పైగా విదేశీ టూర్ చేసిన అనుభూతి కూడా ఉంటుంది. రూ.40వేల నుంచి రూ.50వేల వరకు నాలుగు రోజుల టూర్ ప్యాకేజీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దీంతో నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్తున్న వాళ్లలో 50శాతం బ్యాంకాక్‌నే ఎంపిక చేసుకుంటున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలిసి వెళ్తున్న పర్యాటకులు సింగపూర్, మలేసియాలను ఎంచుకుంటున్నారు. ఒకే ప్యాకేజీలో రెండు దేశాలను సందర్శించే అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ రెండు దేశాల తర్వాత మాల్దీవులకు వెళ్తున్న వారి సంఖ్య కూడా బాగానే ఉంది. ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకల కోసమే కాకపోయినా దుబాయ్‌కు వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా ఇతోధికంగా పెరిగినట్లు ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. దుబాయ్‌లో షాపింగ్‌కు ఇది అనుకూలమైన సమయం కావడంతోఎక్కువ మంది దుబాయ్‌ను కూడా ఎంపిక చేసుకుంటున్నారు. సోలో.. సో బెటర్ మరోవైపు హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే ఒంటరి పర్యాటకుల సంఖ్య కూడా ఈ ఏడాది బాగా పెరిగింది. సుమారు 28శాతం ఇలా ఒంటరిగా విదేశీ టూర్లకు వెళ్తున్నట్లు అంచనా. తమకు నచ్చిన పర్యాటక స్థలాల్లో ఏకాంతంగా గడపాలనే కోరిక, ఎలాంటి బాదరాబందీల్లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తేలిగ్గా ప్రయాణించేందుకు అవకాశం ఉండడం వల్ల చాలా మంది సోలో జర్నీయే సో బెటర్ అనుకుంటున్నారు. సోలోగా వెళ్తున్న వారిలోనూ ఎక్కువ మంది బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్‌లతో పాటు శ్రీలంకకు వెళ్తున్నారు. విదేశాలతో పాటు దేశంలోని బెంగళూర్, గోవా, జైపూర్, కొచ్చిన్, గౌహతి, విశాఖ నగరాలకు సైతం సోలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండడం గమనార్హం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం హైదరాబాద్ నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు 20శాతం అదనంగా పెరిగాయి. ఇందుకు దేశంలోని వివిధ నగరాల్లో ఉడాన్ పథకం కింద ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి రావడం, విదేశీ విమాన చార్జీలు కొంతమేర తగ్గుముఖం పట్టడం పర్యాటక ప్రియులకు చక్కటి అవకాశంగా మారింది. -
మిస్ యూనివర్స్‌గా ఫిలిప్పీన్స్ భామ
బ్యాంకాక్: మిస్ యూనివర్స్ 2018 కిరీటాన్ని ఫిలిప్పీన్స్ యువతి కాట్రియానా గ్రే సొంతం చేసుకుంది. 93 దేశాలకు చెందిన యువతులు ఈ కిరీటం కోసం పోటీపడగా కాట్రియానా విజేతగా నిలిచింది. సోమవారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో న్యాయనిర్ణేతలు ఆమెను విజేతగా ప్రకటించారు. తొలి రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తామరిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనెజెవిలాకు చెందిన స్టీఫనీ గుటీరెజ్ నిలిచారు. సింగర్, మోడల్‌గా పేరొందిన కాట్రియానా వేదికపై ఎరుపు రంగు గౌనులో తళుక్కుమంది. ఓ అగ్నిపర్వతాన్ని ప్రేరణగా తీసుకుని తాను ఎరుపు రంగు గౌనును ధరించానని కాట్రియానా చెప్పింది. గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన డేమీ లీ నీల్పీటర్స్ కాట్రియానాకు కిరీటాన్ని అలంకరించింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె కాట్రియానాకు అభినందనలు తెలిపారు. -
థాయ్‌లాండ్‌కు చలో..చలో
సాక్షి, విశాఖపట్నం: పర్యాటకులు అమితంగా ఇష్టపడే బ్యాంకాక్‌కు విశాఖ నుంచి విమాన సర్వీసు ప్రారంభం కానుంది. విశాఖ ప్రాంతవాసుల ఐదేళ్ల కల నేటి అర్ధరాత్రికి నెరవేరనుంది. విశాఖ నుంచి సోమ, మంగళ, గురు, శనివారాల్లో అంటే వారంలో నాలుగు రోజుల పాటు థాయ్ ఎయిర్ ఏసియా తమ సర్వీసులను బ్యాంకాక్‌కు నడపనుంది. ఏడో తేదీ రాత్రి బ్యాంకాక్‌లోని డాన్‌ముయాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి 11.45 గంటలకు విశాఖ చేరుతుంది. 30 నిమిషాల అనంతరం శుక్రవారం అర్ధరాత్రి దాటాక 12.15 గంటలకు బ్యాంకాక్‌కు తొలి విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. విశాఖపట్నం–బ్యాంకాక్‌ల మధ్య ఉన్న 1,905 కిలోమీటర్ల దూరాన్ని 2.45 గంటల్లో చేరుకుంటుంది. టిక్కెట్టు ధర డిమాండ్‌ను బట్టి రానూపోనూ రూ.6,000–14,000 మధ్య ఉంది. బ్యాంకాక్‌కు విశాఖ నుంచి విమాన సర్వీసు నడపాలన్న ప్రతిపాదన 2013 నుంచి ఉంది. ఏడాది క్రితమే ఈ సర్వీసు ప్రారంభించాలనుకున్నా, అప్పట్లో నేవీ ఆంక్షలతో వీలు పడలేదు. ఎట్టకేలకు ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. మరోవైపు డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు భారతీయులకు థాయ్‌లాండ్ ఉచిత వీసా సదుపాయం కల్పించింది. ఇది కూడా ప్రయాణికులు పెరగడానికి దోహదం చేస్తుంది. డబ్బు, సమయం ఆదా ఇన్నాళ్లు విశాఖ ప్రాంత వాసులు బ్యాంకాక్ (థాయ్‌లాండ్) వెళ్లాలంటే హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాలకు వెళ్లి అక్కడ నుంచి బయలుదేరాల్సి వచ్చేది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు 2,400 కి.మీ., చెన్నై నుంచి 2,254 కి.మీ. ఉండగా విశాఖ నుంచి 1.905 కిలోమీటర్లు మాత్రమే ఉంది. హైదరాబాద్, చెన్నైల మీదుగా బ్యాంకాక్ Ððవెళ్లడానికి 8–10 గంటల సమయం పడుతోంది. ఇప్పుడు విశాఖ నుంచి నేరుగా బ్యాంకాక్‌కు కేవలం 3 గంటల్లోపే చేరుకుంటారు. దీనివల్ల సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. సగటున రోజుకు 40 మంది.. విశాఖ ప్రాంతం నుంచి బ్యాంకాక్‌కు రోజుకు సగటున 60 మంది చొప్పున వెళ్తున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా రోజుకు 40–50 మంది, చెన్నై మీదుగా 20–30 మంది ప్రయాణిస్తున్నారు. ఇతర మార్గాల్లో విశాఖ నుంచి రోజుకు 30 మంది వరకు సిల్క్ ఎయిర్వేస్ విమానంలో బ్యాంకాక్ పయనమవుతున్నారు. నాలుగో అంతర్జాతీయ సర్వీసు ఇప్పటివరకు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్, మలేసియా, దుబాయ్‌లకు విమాన సర్వీసులున్నాయి. గతంలో శ్రీలంకకు కూడా విమాన సర్వీసు నడిచేది. కానీ లాభదాయకంగా లేకపోవడంతో అక్టోబర్ 27 నుంచి ఆ సర్వీసును రద్దు చేసుకుంది. దీంతో తాజాగా బ్యాంకాక్ సర్వీసుతో ఈ ఎయిర్‌పోర్టు నుంచి నాలుగో అంతర్జాతీయ సర్వీసు కానుంది. నాక్ ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా ఫిబ్రవరి నుంచి విశాఖ–బ్యాంకాక్‌ల మధ్య కొత్త సర్వీసులను ప్రారంభించనుంది. తొలి ట్రిప్ ఫుల్ విశాఖ నుంచి బ్యాంకాక్ మధ్య నడిచే విమానంలో 180 సీట్ల సామర్ధ్యం ఉంది. ప్రారంభ ట్రిప్‌లో గురువారం నాటికి 172 మంది టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో 20 మంది ఏపీ టూర్స్ అండ్ ట్రావెలర్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. మిగిలిన సీట్లు కూడా శుక్రవారం నాటికి ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఫార్మా ఎగుమతులకు అనుకూలం మరోవైపు కొత్తగా ప్రారంభం కానున్న బ్యాంకాక్ విమాన సర్వీసు వల్ల ఫార్మా ఎగుమతిదార్లకు కూడా అనుకూలంగా మారనుంది. ప్రస్తుతం విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా జపాన్‌కు వీటి ఎగుమతి జరుగుతోంది. వీటి మధ్య దూరం 6,680 కిలోమీటర్లు, విశాఖ నుంచి సింగపూర్ మీదుగా జపాన్‌కు 8,096 కిలోమీటర్లు ఉంది. విశాఖ నుంచి బ్యాంకాక్ మీదుగా జపాన్‌కు 6,412 కిలోమీటర్లే ఉంది. దీంతో కొత్తగా నడిపే బ్యాంకాక్ విమాన సర్వీసు ఫార్మా ఎగుమతిదార్లకు కూడా లాభదాయకంగా ఉంటుందని ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. పర్యాటక ప్రగతికి దోహదం బ్యాంకాక్ విమాన సర్వీసుతో రాష్ట్రానికి వియత్నాం, కంబోడియా, తైవాన్, చైనా తదితర దేశాల నుంచి కనెక్టివిటీ పెరిగి పర్యాటకులతో పాటు బౌద్ధులు ఆకర్షితులవుతారు. ఇది పర్యాటకరంగం వృద్ధికి దోహదపడుతుంది. ఆయా దేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మన పర్యాటక విశిష్టతలపై రోడ్డుషోలు నిర్వహించాలి. – కె.విజయమోహన్, ప్రెసిడెంట్, ఏపీ టూర్స్ అండ్ ట్రావెలర్స్ అసోసియేషన్ -
థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే!
-
థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలా.. అయితే..
థాయ్ సంస్కృతీ, సంప్రదాయాలు, ఆకాశహార్మ్యాలతో ఆకట్టుకునే బ్యాంకాక్ మరో సరికొత్త నిర్మాణంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. స్కైవాక్ నిర్మించి టూరిస్టుల మనసు దోచుకుంటోంది. బ్యాంకాక్‌లో అతి ఎత్తైన బిల్డింగ్‌గా గుర్తింపు పొందిన ‘కింగ్ పవర్ మహనఖాన్’ నిర్మాణం ఇటీవలే పూర్తైన సంగతి తెలిసిందే. 78 అంతస్తులతో కూడిన ఈ బిల్డింగ్‌లో ఆఖరి అంతస్తు అంచు చివర స్కైవాక్‌ను నిర్మించారు. ఇది భూమి నుంచి సుమారు 1030 అడుగుల ఎత్తులో ఉంటుంది. గాజుతో నిర్మితమైన ఈ స్కైవాక్పై నుంచి 360 డిగ్రీల కోణంలో సిటీ అందాలన్నీ వీక్షించవచ్చు. దీంతో ధైర్యవంతులు, ఉత్సాహవంతులైన పర్యాటకులు బ్యాంకాక్‌కు చేరుకుంటున్నారు. అంతేకాదు తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇంకేం.. మీరు కూడా ధైర్యవంతులేనా..? అయితే ఈసారి బ్యాంకాక్‌కు వెళ్లినపుడు స్కైవాక్పై నడిచి సరదా తీర్చుకోండి. అయితే గాజు పలకపై నడిచేపుడు మాత్రం ఫ్యాబ్రిక్ షూస్ ధరించడం మాత్రం మర్చిపోకండి. -
స్త్రీలోక సంచారం
37 యు.ఎస్. డాలర్లు అంటే సుమారుగా 2,700 రూపాయలు. థాయ్‌లాండ్ కరెన్సీలోనైతే 1,200 బ్యాత్‌లు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో మహిళా ‘మోర్సాయ్’ లు (మోటార్ టాక్సీ డ్రైవర్లు) రోజుకు పన్నెండొందల బ్యాత్‌లు సంపాదిస్తున్నారు! అంటే మన రూపాయిల్లో నెలకు సుమారుగా 80,000. ఇది పెద్ద మొత్తమే కానీ, వీరు పడే శ్రమ చిన్నదేం కాదు. బ్యాంకాక్ నగరంలోని మోసకారి గతుకు రోడ్లు, గోతుల నుంచి తప్పించుకుని వెనక సీట్లోని ప్రయాణికురాలిని (ఒక్కోసారి ప్రయాణికుడిని) భద్రంగా, సమయానికి గమ్యస్థానం చేర్చడానికి ఎంత నేర్పు, ఎంత ఒడుపు, ఎంత చొరవ కావాలో కదా. ఇక కార్లయితే కనికరం లేకుండా, పక్క వాహనాలకు కూడా దారి ఇవ్వకుండా తమ తోవ తాము చూసుకుంటూ దూసుకెళుతూ ఉంటాయి వాటి మధ్యలోంచి మోర్సాయ్లు కట్లు కొట్టుకుంటూ వెళ్లాలి. అయినప్పటికీ ‘మోర్సాయ్’ని ఒక కెరీర్‌గా ఎన్నుకుంటున్న బ్యాంకాక్ యువతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆ వృత్తిలో లభించే గౌరవం, స్వేచ్ఛ, ఆర్థిక స్వతంత్య్రం.. వీటికి యువతులు బాగా ఆకర్షితులు అవుతున్నారు. ప్రస్తుతం ఆ సిటీలో ‘మోర్సాయ్’లుగా రిజిస్ట్రర్ అయిన వారి సంఖ్య 98,000 మంది ఉండగా, వారిలో 30 శాతం వరకు మహిళలే. అయితే ఇంతకన్నా ఎక్కుమంది మహిళలే ఉంటారని థాయ్‌లాండ్ మోటార్‌సైకిల్ టాక్సీ అసోసియేషన్ అంటోంది. షర్ట్‌పై ఆరెంజ్ జాకెట్లు వేసుకుని రోడ్లపై ‘ర య్’మని వెళుతూ కనిపిస్తున్న వీళ్లను బ్యాంకాక్ ప్రజలు ఇప్పుడు ‘రోడ్ వారియర్స్’ని పిలుస్తున్నారు. -
థాయ్‌లో కాల్పులు.. భారతీయుడు మృతి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి రట్చతేవి జిల్లాలోని సెంట్రా వాటర్‌గేట్ పెవిలియన్ హోటల్ వద్ద రెండు టీనేజ్ గ్యాంగ్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో భారత పర్యాటకుడు గాఖ్రేజ్ ధీరజ్ (42), లావోస్ పర్యాటకుడు కెవోంగన్సా (28) ఉన్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు భారతీయులు, ఒక లావోస్ పౌరుడితో పాటు మరో ఇద్దరు థాయ్‌లాండ్ పౌరులున్నారు. రాత్రి అక్కడున్న భారతీయ రెస్టారెంట్‌మాల్‌లో పర్యాటకులంతా కలసి భోజనం చేశారు. అనంతరం వారంతా తమ బస్సుకోసం ఎదురు చూస్తూ పార్కింగ్ ప్రదేశంలో నిలబడ్డారు. పార్కింగ్ సమీపంలో ఉన్న స్నూకర్ క్లబ్ దారిలో అకస్మాత్తుగా రెండు టీనేజ్ గ్రూప్‌లు పరిగెత్తుకుంటూ వచ్చాయి. తొలుత వారి మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది.. నిమిషాల వ్యవధిలోనే అది కాల్పులకు దారి తీసింది. దాదాపు 20 మంది టీనేజర్లు తుపాకులు, కత్తులు, కర్రలు పట్టుకుని క్లబ్ నుంచి వీధిలోకి పరిగెత్తుకొచ్చారని, అందులో ముగ్గురు కాల్పులకు దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం
-
బ్యాంకాక్‌లో కాల్పులు.. భారతీయుడి మృతి
బ్యాంకాక్ : బ్యాంకాక్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో భారత పర్యాటకుడు గాఖ్‌రెజర్ ధీరజ్(42) మృతిచెందాడు. రచ్చత్వేహి జిల్లాలోని సెంటరా వాటర్‌గేట్ పెవిలియన్ హోటల్ దగ్గర ఈ ఘటన జరిగింది. స్నూకర్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన రెండు గ్రూపుల మధ్య ఫైరింగ్ జరగడంతో అక్కడే ఉన్న టూరిస్టులపైకి బుల్లెట్లు దూసుకువచ్చాయి. ఈ కాల్పుల్లో ధీరజ్‌తో పాటూ లావోస్‌కు చెందిన మరో పర్యాటకుడు మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరు భారతీయులున్నారు. ఓ మాల్లోని ఇండియన్ రెస్టారెంట్లో పర్యాటకులు భోజనం చేసి బయటకు వచ్చి బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. రెండు గ్యాంగ్‌లకు చెందిన సుమారు 20 మంది ఫైరింగ్‌లో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కత్తులు, హాకీ స్టిక్లోతోనూ దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే లోపు రెండు గ్రూపులకు చెందిన సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బ్యాంకాక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకాక్‌లో ఏపీ యువకుడి మృతి
సాక్షి, కృష్ణా : బ్యాంకాక్‌లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి ఓ ఆంధ్రా యువకుడు మృతి చెందారు. మృతుడు పల్లంపాటి వెంకటేష్ కృష్ణా జిల్లా మచిలీపట్నంకి చెందిన యువకుడిగా గుర్తించారు. వెంకటేశ్ హైదరాబాద్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఆఫీసు పని మీద ఇటీవల బ్యాంకాక్ వెళ్లిన వెంకటేష్ మంగళవారం మృతి చెందారు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు తల్లిడిల్లుతున్నారు. వెంకటేష్ మృతితో అతని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
తప్పు నాదే.. మన్నించండి
దాదాపు 15 రోజులుగా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గుహలోనే చిక్కుకుపోయిన ఫుట్‌బాల్ టీమ్. పదిరోజుల అన్వేషణ .. ఇంటర్నేషనల్ ఆపరేషన్.. ఎట్టకేలకు ఆచూకీ లభ్యం. ఇప్పుడు వారందరినీ బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే చిమ్మచీకట్లో వారందరినీ కంటికి రెప్పలా ఇన్నాళ్లపాటు కాపాడిన కోచ్.. ఓ భావోద్వేగమైన సందేశాన్ని ప్రపంచానికి విడుదల చేశారు. బ్యాంకాక్: 25 ఏళ్ల ఎక్కపోల్ చాంతవోంగ్.. ఫుట్‌బాల్ టీమ్ కోచ్. గుహలోకి వాళ్లందరినీ తీసుకెళ్లింది ఆయనే. చిక్కుకుపోయిన వాళ్లలో అంతా మైనర్లే కాగా.. చాంతవోంగ్ వారిని కాపాడుతూ వస్తున్నారు. ‘తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. మీ పిల్లలంతా క్షేమంగానే ఉన్నారు. జరిగిన దాంట్లో తప్పు మొత్తం నాదే. మీ అందరికీ నా క్షమాపణలు. పిల్లలను జాగ్రత్తగా కాపాడేందుకు నా శాయశక్తులా కృషి చేస్తా.. ఇట్లు... మీ చాంతవోంగ్’ అంటూ ఓ లేఖను రాశాడు. థాయ్ నేవీ సీల్(SEAL) ఫేస్బుక్ పేజీలో శనివారం ఆ లేఖను పోస్ట్ చేశారు. కాగా, పదేళ్ల వయసులో ఓ ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన చాంతవోంగ్.. ఆమె దూరపు బంధువైన ఓ మహిళ దగ్గర పెరిగాడు. ‘ఆంటీ.. మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ లేఖలో సదరు మహిళకు కూడా చాంతవోంగ్ జాగ్రత్త సూచించాడు. ఇదిలా ఉంటే ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రొవిన్స్‌లో గత నెల 23న కోచ్‌తోపాటు 12 మంది సభ్యులున్న ఫుట్‌బాల్ టీమ్.. థామ్ లూవాంగ్ గుహ సందర్శనకు వెళ్లింది. ఒక్కసారిగా భారీ వర్షాలు కురియటంతో వారంతా లోపలే ఇరుక్కుపోయారు. పిల్లలు గుహాలో చిక్కుకున్నారని తెలిశాక.. కోచ్ చాంతవోంగ్పైనే తీవ్ర విమర్శలు వినిపించాయి. అయితే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటం.. తాను పస్తులుండి వారి ఆకలి తీర్చటం లాంటి విషయాలు వెలుగులోకి వచ్చాక వాళ్ల అభిప్రాయం మారి అతనిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం వారందరినీ బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక 5 ఆప్షన్లే... మిషన్ ఇంపాజిబుల్ -
ఐఫా-2018 సంబరాలు
-
ఐఫా అవార్డులు-2018
ప్రతిష్టాత్మక ఐఫా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. గత రాత్రి(ఆదివారం) బ్యాంకాక్‌లో జరిగిన 19వ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల(ఐఫా) కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. తుమ్హారి సులు చిత్రం అత్యధికంగా ఆరు కేటగిరీల్లో నామినేట్ కాగా, ఐదు అవార్డులతో తర్వాతి స్థానంలో రాజ్‌కుమార్ రావ్ నటించిన న్యూటన్ నామినేట్ అయ్యింది. పెద్ద చిత్రాలేవీ అవార్డులను కొల్లగొట్టకపోగా.. చిన్న చిత్రాలు సత్తా చాటాయి. అవార్డుల విషయానికొస్తే... ఉత్తమ చిత్రంగా తుమ్హారి సులు, ఉత్తమ దర్శకుడిగా సాకేత్ చౌదరి(హిందీ మీడియం), ఉత్తమ నటిగా మామ్ చిత్రానికి గానూ దివంగత నటి శ్రీదేవి(భర్త బోనీకపూర్ అందుకున్నారు), ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్ ఖాన్(హిందీ మీడియం) అవార్డులు దక్కించుకున్నారు. అవార్డుల పూర్తి జాబితా... ఉత్తమ చిత్రం- తుమ్హారి సులు ఉత్తమ దర్శకుడు- సాకేత్ చౌదరి(హిందీ మీడియం) ఉత్తమ నటుడు- ఇర్ఫాన్ ఖాన్ (హిందీ మీడియం) ఉత్తమ నటి-శ్రీదేవి(మామ్) ఉత్తమ సహయ నటుడు-నవాజుద్దీన్ సిద్ధిఖీ (మామ్) ఉత్తమ సహయ నటి-మెహర్ వీఐజే (సీక్రెట్ సూపర్‌స్టార్) ఉత్తమ కథ- న్యూటన్ చిత్రం(అమిత్ వీ మసూర్కర్) ఉత్తమ సంగీత దర్శకుడు -అమాల్ మాలిక్, తనిష్క్ బాగ్చి, అఖిల్ సచ్దేవ-బద్రీనాథ్ కీ దుల్హానియా బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ -ప్రీతమ్ (జగ్గా జసూస్ చిత్రానికి) బెస్ట్ స్క్రీన్ ప్లే -నితీశ్ తివారీ, శ్రేయస్ జైన్ (బరేలీ కీ బర్ఫీ) ఉత్తమ కొరియోగ్రఫీ-విజయ్ గంగూలీ, రూలె దౌసన్ వరిందని (జగ్గా జసూస్ చిత్రంలోని గల్తీ సే మిస్టేక్ పాటకు) ఉత్తమ డైలాగులు-హితేష్ కేవల్య(సుభ మంగళ్ సావధాన్) ఉత్తమ సినిమాటోగ్రఫీ-మార్కిన్ లస్కవైక్, యూఎస్సీ(టైగర్ జిందా హై చిత్రానికి గానూ...) ఉత్తమ ఎడిటింగ్- శ్వేత వెంకట్ మాథ్యూ (న్యూటన్) ఉత్తమ సింగర్(మహిళా)- మేఘనా మిశ్రా(సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రంలోని మైన్ కౌన్ హూ పాటకు) ఉత్తమ సాహిత్యం - మనోజ్ ముంటషిర్ (బాద్షావో చిత్రంలోని మెరే రష్కే ఖమర్ పాటకు...) ఉత్తమ సింగర్ (మేల్)- అర్జిత్ సింగ్( జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రంలోని హవాయెన్ పాటకు) ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ - కోంకణ్ సేన్ శర్మ అవుట్‌స్టాండింగ్ అఛీవ్మెంట్ అవార్డు- సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఉత్తమ స్టైల్ ఐకాన్- నటి కృతి సనన్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు - ఎన్వై వీఎఫ్‌ఎక్స్‌వాలా (ప్రసాద్ వసంత్ సుటార్ -జగ్గా జసూస్ చిత్రం) ఉత్తమ సౌండ్ డిజైన్ - దిలీప్ సుబ్రమణియమ్-గణేశ్ గంగాధరన్(వైఆర్ఎఫ్ స్టూడియోస్).. టైగర్ జిందా హై చిత్రం ఇక ఈవెంట్ మధ్యలో రణ్‌బీర్ కపూర్, వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, లూలియా వంటూర్, కృతి సనన్, బాబీ డియోల్, అర్జున్ కపూర్ తమ ఫెర్ఫార్మెన్స్‌తో ఆహతులను ఆకట్టుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సీనియర్ నటి రేఖ స్టేజీపై నృత్య ప్రదర్శన ఇవ్వటం కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచింది. -
టాక్సీలో మేకప్ వేసుకుంటుండగా.. విషాదం
బ్యాంకాక్ : టాక్సీలో ప్రయాణిస్తున్న ఓ యువతి కంటికి ‘ఐలైనర్ పెన్సిల్’ సహాయంతో మెరుగులు దిద్దుతుండగా.. ఐలైనర్ పెన్సిల్ కాస్తా కంటిలో గుచ్చుకుంది. సగానికి పైగా పెన్సిల్ కంటిలోకి చొరబడటంతో భరించలేని నొప్పితో తీవ్ర ఇబ్బందులకు గురైందా యువతి. ఈ సంఘటన సోమవారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌కు చెందిన 20 ఏళ్ల యువతి టాక్సీలో ప్రయాణిస్తోంది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనం నిదానంగా కదులుతోంది. స్నేహితులను కలవాలన్న తొందరలో ఉన్న ఆమె బ్యాగులో ఉన్న ఐలైనర్‌ను తీసి కంటికి మెరుగులు దిద్దుకోవటం ప్రారంభించింది. ఇంతలో ఆమె ప్రయాణిస్తున్న టాక్సీ కాస్తా ముందున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో ఆమె తల ముందున్న సీటుకు తగిలి ఐలైనర్ పెన్సిల్ కంటిలోకి చొచ్చుకెళ్లింది. పెన్సిల్ కంట్లో గుచ్చుకోవటంతో భరించలేని నొప్పి కారణంగా ఆమె గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆమె పరిస్థితి గమనించిన టాక్సీ డ్రైవర్ వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత అంబులెన్స్‌లో ఆమెను దగ్గరలోని ‘రాజవితి’ హాస్పిటల్‌కు తరలించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు యువతి కంటి నుంచి పెన్సిల్‌ను తొలగించారు. ‘రాజవతి’ ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. కంటిలోని ముఖ్యమైన భాగాలకు ఎలాంటి నష్టం కలుగకపోవటంతో ఆమె కంటిచూపుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలిపారు. ప్రయాణాల్లో ఉన్నపుడు మేకప్ వేసుకునే వాళ్లకు ఇదొక గుణపాఠమని, కదులుతున్న కారులో ఇలాంటివి చేయకూడదని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు ఊహించనివని, అన్నింటికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. -
ప్యాకప్ కే బాద్
రామ్ చరణ్ ఏదైనా జోక్ చెప్పారా? లేక వర్కౌట్స్ సెషన్స్‌లో ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? ఇలాగే డౌట్స్ వస్తాయి కదూ... పక్కనున్న ఫొటోలో బాగా నవ్వుతున్న హీరోయిన్ కియారా అద్వానీని చూస్తే. ఇంతకీ చరణ్, కియారా వర్కౌట్స్ చేస్తోంది ఎక్కడో తెలుసా? థాయిలాండ్‌లో. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. షూటింగ్ ప్యాకప్ కే బాద్ వర్కౌట్స్ చేయడానికి జిమ్‌కి వెళ్తున్నారట రామ్ చరణ్ అండ్ కియారా. ‘‘షూటింగ్ ప్యాకప్... నెక్ట్స్ కో–స్టార్‌తో కలిసి వర్కౌట్స్ చేస్తున్నా’’ అని రామ్ చరణ్‌తో కలిసి వర్కౌట్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కియారా. -
కెనడా పేరుతో బ్యాంకాక్‌కు!
సాక్షి,సిటీబ్యూరో: ఉద్యోగ వీసాపై కెనడా వెళ్లాల ని భావించిన నగర వాసిని ఉత్తరాదికి చెందిన ముఠా నిలువునా ముంచింది. ఇతడిని బ్యాంకాక్ కు తీసుకెళ్లి రూ.3 లక్షలు కాజేసింది. మోసపోయానని గుర్తించిన బాధితుడు తిరిగి వచ్చి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహం తి సోమవారం పేర్కొన్నారు. చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్ యాకూబ్ కెనడాలో ఉద్యోగం చేయాలని భావించాడు. ఇందుకోసం తన ప్రొఫైల్‌ను నౌకరీ.కామ్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. దీని ద్వారా యాకూబ్ వివరాలు సంగ్రహించిన సైబర్ నేరగాళ్లు అతడికి ఫోన్ చేశారు. మూడు వేర్వేరు సెల్‌ఫోన్ నెంబర్ల నుంచి నేహ, రీత, అర్పిత, జాహ్నవి అనే చెప్పుకున్న యువతులు వరుసగా మాట్లాడారు. నౌకరీ.కామ్‌లో మీ ప్రొఫైల్ చూశామని, కెనడాకు కచ్చితంగా వీసా ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. అయితే సాంకేతిక కారణాల నేపథ్యంలో భారత్ నుంచి సాధ్యం కావట్లేదని, బ్యాంకాక్‌కు వస్తే అక్కడ నుంచి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇతడి మాటలు నమ్మిన యాకూబ్ బ్యాంకాక్‌కు ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకోవడంతో పాటు ఆ వివరాలను సైబర్ నేరగాళ్లకు పంపాడు. బ్యాంకాక్‌లో దిగిన బాధితుడు అక్కడ విజిట్ వీసా తీసుకున్నాడు. విమానాశ్రయంలో యాకూబ్‌ను కలుసుకున్న ఓ యువతి హోటల్ రూమ్‌కు తీసుకువెళ్లింది. తాము కెనడా వీసా ప్రాసెసింగ్ చేస్తున్నామంటూ యాకూబ్ నుంచి అతడి పాస్‌పోర్ట్ సైతం తీసుకువెళ్ళింది. కొన్ని రోజులకు వాట్సాప్ ద్వారా బాధితుడిని సంప్రదించిన సదరు యువతి వీసా ప్రాసెసింగ్ పూర్తయిందని, తమకు రూ.3 లక్షలు చెల్లించాలని చెప్పింది. వాట్సాప్ ద్వారానే వీసా పేపర్లు సైతం పంపింది. దీనిని నమ్మిన అతను తరుణ్‌జీత్ కౌర్ పేరుతో ఉన్న ఖాతాలోకి నగదు బదిలీ చేశాడు. ఇది జరిగిన మరుసటి రోజు ఓ యువతి యాకూబ్ పాస్‌పోర్ట్‌ను ఓ కవర్లో పెట్టి ఆయన బస చేసిన హోటల్ రిసెప్షన్లో ఇచ్చి వెళ్లింది. హోటల్ సిబ్బంది ద్వారా కవర్ అందుకున్న యాకూబ్ అందులో పాస్‌పోర్ట్ ఉన్నప్పటికీ వీసాకు సంబంధించిన పేపర్లు చింపేసినట్లు గుర్తించాడు. సైబర్ మోసగాళ్లను సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. సిటీకి తిరిగి వచ్చి సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై కృష్ణ, కానిస్టేబుళ్ళు మురారి, మహేష్, సతీష్ దర్యాప్తు చేశారు. యాకూబ్ డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు వివరాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుల్ని గుర్తించారు. ఉత్తరాదికి వెళ్ళిన ప్రత్యేక బృందం నోయిడా, హర్యానాలో కునాల్, వినయ్, తరుణ్‌జీత్ కౌర్‌లను పట్టుకుంది. ఈ ముగ్గురు నిందితుల్నీ అక్కడి న్యాయస్థానాల్లో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. -
క్లబ్బులో గొడవ: హీరోయిన్ అరెస్టు
-
క్లబ్బులో గొడవ: హీరోయిన్ అరెస్టు
బ్యాంకాక్: పీకలదాకా తాగి క్లబ్లో రచ్చ రచ్చ చేసిన బ్రిటీష్ నటి అన్నారీస్ను బ్యాంకాక్ పోలీసులు అరెస్టు చేశారు. థాయ్ నైట్ క్లబ్‌కు వెళ్లిన అన్నారీస్ బిల్లు చెల్లించకుండా క్లబ్లో పనిచేసే వారితో వాగ్వాదం పెట్టుకుంది. బిల్లు కట్టాలని వారు కోరడంతో కోపం పట్టలేని రీస్ క్లబ్లో ఉన్న వస్తువులను వారిపై విసిరేసింది. అంతేకాకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రీస్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, రెండేళ్ల క్రితం కారును వేగంగా నడుపుతూ పోలీసు అధికారిని ఢీ కొట్టిన కేసులో రీస్ అరెస్టు అయింది. క్లబ్లో గొడవపై ఆమెను విచారించగా.. తన కుటుంబ సమస్యల వల్లే అలా ప్రవర్తించానని రీస్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి పూచీకత్తుతో రీస్‌ను వదిలినట్లు చెప్పారు. తదుపరి విచారణను కొనసాగిస్తామని వివరించారు. -
నక్షత్రం వర్కింగ్ స్టిల్స్
-
శ్యామ్‌కు పతకం ఖాయం
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. బ్యాంకాక్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శ్యామ్‌తోపాటు రోహిత్ టోకస్ (64 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ మనోజ్ కుమార్ (69 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్ బౌట్స్‌లో సమక్ సెహాన్ (థాయ్‌లాండ్)పై శ్యామ్; కుతోవ్ కువాన్ (కజకిస్తాన్)పై రోహిత్ గెలుపొందారు. గియాసోవ్ షాక్రమ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో మనోజ్ ఓటమి పాలయ్యాడు. -
తాబేలు పొట్టలో 915 నాణేలు
-
ఎయిర్ అంబులెన్స్ కు ప్రమాదం, పైలట్ మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని నుంచి థాయ్‌లాండ్‌కు వెళుతున్న మేదాంత ఆస్పత్రికి చెందిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. విమానంలో మంటలు అంటుకోవడంతో బ్యాంకాక్ సమీపంలో కూలిపోయిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ ఘటనలో పైలట్ అరుణక్షా నంది అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా బ్యాంకాక్ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె వరుస ట్వీట్లు చేశారు. గాయపడ్డ వారిలో డాక్టర్ శైలేంద్ర, డాక్టర్ కోమల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సుష్మ తెలిపారు. -
తాబేలు పొట్టలో 915 నాణేలు
బ్యాంకాక్: సముద్రపు తాబేలు పొట్టలో 915 నాణేలు బయటపడ్డాయి. బ్యాంకాక్‌లోని శ్రీరకా కన్జర్వేషన్ సెంటర్లో తాబేలు నివసించే ట్యాంక్‌లో సందర్శకులు వందల సంఖ్యలో కాయిన్లు విసేరేసేవారు. వాటిలో కొన్నింటిని అందులో నివాసముండే ఒమ్సిన్ అనే సముద్రపు పచ్చతాబేలు మింగేసింది. కాలక్రమేణా ఎక్కువ సంఖ్యలో నాణేలను మింగడంతో ఈదలేని పరిస్ధితికి చేరుకుంది. ఒమ్సిన్ అవస్ధను గుర్తించిన కన్జర్వేషన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. అత్యవసర శస్త్రచికిత్స చేసి తాబేలు పొట్టలోని నాణేలు బయటకు తీయకపోతే దాని ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు తెలిపారు. దీంతో ఒమ్సిన్కి ఆపరేషన్ నిర్వహించగా.. దాని పొట్టలో చుట్టబడిపోయిన 5 కేజీల నాణేల బాల్ ఉంది. దాదాపు ఏడు గంటలపాటు శ్రమించి తాబేలును వైద్యులు రక్షించారు. ప్రపంచంలో తొలిసారి ఇలాంటి ఆపరేషన్‌ను నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఒమ్సిన్ పూర్తిగా కోలుకోవడానికి ఒక నెల సమయం పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత మరో ఆర్నెల్ల పాటు ఫిజికల్ థెరపీ అవసరమని తెలిపారు. -
ఛలో బ్యాంకాక్!
పాటలు కనువిందుగా ఉండాలంటే ఏం చేయాలి? లొకేషన్స్ అదిరిపోవాలి. అలాంటి లొకేషన్స్ కోసం ‘నక్షత్రం’ చిత్రబృందం బ్యాంకాక్ వెళ్లింది. అక్కడి అందమైన పరిసర ప్రాంతాల్లో మూడు పాటలు చిత్రీకరించనున్నారు. ఇక, సినిమా కథ ఏంటంటే... పోలీసు అవ్వాలనే ప్రయత్నంలో ఉన్న యువకుడి కథ ఇది. సందీప్ కిషన్,రెజీనా నాయకా నాయికలు. సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘‘రామాయణంలో హనుమంతుని పాత్రకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో, సమాజంలో పోలీసు పాత్రకు అంతే ఉంటుంది. అదెలాగో నా సినిమాలో చూడండి’’ అంటున్నారు చిత్రదర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమా టాకీ పూర్తయింది. నేటి నుంచి బ్యాంకాక్‌లో పాటల చిత్రీకరణ ఆరంభిస్తారు. ఒక పాటను సందీప్‌కిషన్, రెజీనా పై, మరోపాటను సాయిధరమ్, ప్రగ్యాపై చిత్రీకరించనున్నారు. అక్కడే ఓ ప్రత్యేక పాటను కూడా షూట్ చేస్తారు. ఆ పాట వివరాలు బ్యాంకాక్ నుంచి వచ్చిన తర్వాత తెలియజేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్, భరత్ అందిస్తున్నారు. శ్రీచక్ర మీడియా సారధ్యంలో బుట్టబొమ్మ క్రియోషన్స్ కె.శ్రీనివాసులు, విన్‌విన్‌విన్ క్రియేషన్స్ వేణుగోపాల్, సజ్జు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
బ్యాక్ ఫ్రమ్ బ్యాంకాక్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లు. బ్యాంకాక్‌లో సెకండ్ షెడ్యూల్‌ను అనుకున్న టైమ్ కంటే ఒక్క రోజు ముందే పూర్తి చేశామని రవీందర్‌రెడ్డి తెలిపారు. ‘‘30 రోజుల పాటు బ్యాంకాక్‌లో హీరో హీరోయిన్లతో పాటు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న జగపతిబాబు, శరత్‌కుమార్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. బోయపాటి ప్లానింగ్, ఆర్టిస్టుల సహకారంతో ఒక్క రోజు ముందే షెడ్యూల్ పూర్తయింది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం. రత్నం, కెమేరా: రిషి పంజాబీ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
థాయ్‌లాండ్‌లో వరుస బాంబు పేలుళ్లు
గంటల వ్యవధిలో వరుస బాంబు దాడులతో ప్రముఖ పర్యాటక దేశం థాయ్‌లాండ్ ఉలిక్కిపడింది. థాయ్ రాణి సిరికిత్ పుట్టిన రోజు వేడుకల రోజున ప్రముఖ ప్రఖ్యాత రిసార్టులు, హోటళ్ల వద్ద ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అక్కడి మిలటరీ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగానికి ప్రజలు ఆమోదం తెలిపిన కొన్ని రోజుల వ్యవధిలో జరిగిన ఈ దాడుల్లో నలుగురు దుర్మరణం చెందగా, 34 మంది గాయపడ్డారు. గురువారం అర్ధ రాత్రి నుంచి శుక్రవారాల్లో వరకు 5 దక్షిణ ప్రావిన్స్‌లలో కనీసం 11 బాంబు దాడులు జరిగాయి. ఒక ప్రాంతంలో దాడి జరిగిన కొన్ని గంటల్లోనే కొన్ని మీటర్ల దూరంలోని మరో ప్రాంతంలో పేలుళ్లు చోటుచేసుకోవడంతో స్థానికుల్లో భయాందోళనకు గురయ్యారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా దేశాలకు చెందిన వారు అధికంగా ఉన్నారన్నారు. అయితే ఈ దాడి ఉగ్రవాద చర్య కాదని, స్థానిక విద్రోహ శక్తులే ఈ కుట్రకు పాల్పడినట్లు వెల్లడించారు. -
ఆ హీరోయిన్‌కు అప్పుడే 40 ఏళ్లా!
2000, ఏప్రిల్ 20.. రాష్ట్రంలోని పలు సినిమా థియేటర్లవద్ద భారీ కోలాహలం.. పవన్ కల్యాణ్ హీరోగా కొత్త దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన 'బద్రి' విడుదలైన రోజది. సినిమా హిట్. పవన్ నటనతోపాటు హీరోయిన్ల అందచందాలపైనా థియేటర్ల బైట చర్చలు. 'బద్రి' ఇద్దరు హీరోయిన్లలో ఒకరైన రేణు దేశాయ్ తర్వాతి కాలంలో పవర్ స్తార్ ను పెళ్లాడగా, మరో హీరోయిన్ అమీషా పటేల్.. మరో నాలుగైదు తెలుగు సినిమాల్లో నటించి, అంతకు ముందే తనకు అచ్చొచ్చిన బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ఆ అమిషాయే గురువారం 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. విషయం తెలుసుకున్న నెటిజన్లలో కొందరు 'అప్పుడే ఆ హీరోయిన్ కు 40 ఏళ్లొచ్చాయా!' అనుకున్నారు. బ్యాంకాక్ లోని ఓ రిసార్ట్స్ లో అమిషా తన 40వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంది. తన బిజినెస్ పార్ట్ నర్ పరిణీత్ కునాల్, ఆయన భార్య షామిలీతో కలిసి అమీషా బర్త్ డే కేక్ కట్ చేసింది. వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 2000 సంవత్సరంలో 'కహోనా ప్యార్ హై' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అదే ఏడాది 'బద్రి'తో తెలుగు తెరపై తళుక్కుమంది. అవకాశాలు పలుచబడటంతో ఈ మధ్య సనిమాలకు దూరమైన అమీషా.. త్వరలోనే 'దేశీ మ్యాజిక్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
18 మంది బాలికలు సజీవ దహనం
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 18 మంది గిరిజన బాలికలు మృత్యువాత పడ్డారు. ఐదుగురు బాలికలకు తీవ్ర గాయలయ్యాయి. చియాంగ్ రై ప్రావిన్స్‌లోని రెండంతస్తుల పిథక్కియార్ట్ విథయా పాఠశాలలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన బాలికలందరూ 5 నుంచి 12 ఏళ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో 38 మంది బాలికలు నిద్రపోతున్నట్లు చెప్పారు. ఇక ఇద్దరి జాడ తెలియలేదు. -
నేనింకా కన్యనే: భర్త కోసం నటి ప్రకటన
'వయస్సు 40 ఏళ్లు. కన్య. అరణ్య పుయ్ కాబోయే భర్త కోసం ఎదురుచూస్తోంది' అంటూ ఇటీవల బ్యాంకాక్‌లో వెలిసిన ఓ ప్రకటన హల్చల్ చేసింది. నటి అరణ్య పుయ్ పాథుమ్థాంగ్ వరుడి కోసం ఇలా చిత్రమైన ప్రటకన ఇచ్చింది. 'వాంట్ యూ' పేరిట వెలిసిన ఈ భారీ ప్రకటనలో ఆమె తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది. తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటే సంప్రదించాలని సూచించింది. చనిపోవడానికి ముందు ఒక్కసారైనా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నానని, కన్యగా చనిపోవాలని లేదని ఆమె ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. 'బీ' కేటగిరీ సినిమాల్లో నటించే ఈ అమ్మడు కేవలం అండర్వేర్ మాత్రమే ధరించి.. అర్ధనగ్నంగా పోజు ఇస్తూ పెట్టిన ఈ భారీ హోర్డింగ్ స్థానికంగా కలకలం రేపింది. ప్రౌఢ సుందరి పెట్టిన ఈ ఘాటు ప్రకటన చూసి బ్యాకాంక్ వాసులు బిత్తరపోయారు. నిజానికి 45 ఏళ్ల వయస్సు ఉన్న అరణ్య వరుడి కోసం మ్యారేజ్ బ్యూరోల్లో, డేటింగ్ యాప్స్‌లో తీవ్రంగా ప్రయత్నించింది. తనను పెళ్లి చేసుకోవడానికి తగినవాడు దొరకకపోవడంతో ఆఖరి ప్రయత్నంగా ఈ భారీ ప్రకటనను ఇచ్చింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని లాట్ ఫ్రావ్ జిల్లాలోని మంచి కూడలిలో ఈ ప్రకటనను పెట్టింది. పబ్లిసిటీ కోసం కాకుండా సీరియస్‌గానే జీవిత భాగస్వామి కోసమే ఈ హోర్డింగ్‌ను పెట్టినట్టు ఆమె చెప్తోంది. అయితే పోలీసులుస మాత్రం ఈ అశీల్ల హోర్డింగ్ పెట్టినందుకు యాడ్ ఏజెన్సీపై 10 పౌండ్లు (సుమారు రూ. వెయ్యి) జరిమానా విధించింది. అశ్లీల పోజుతో ప్రకటన ఇచ్చినందుకు సదరు నటిని కూడా ప్రశ్నిస్తామని పోలీసులు చెప్తున్నారు. -
బ్యాంకాక్ లో పడవ పేలుడు: 60 మందికి గాయాలు
బ్యాంకాక్: నీటిపై ఇళ్లు, వాటి మధ్య వీధులు, పడవలపైనే దుకాణాలు.. 'వెనిస్ ఆఫ్ ది ఈస్ట్' గా పేరుపొందిన ధాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో శనివారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. నగరంలోని వాట్ థెప్లీలా పెర్ ప్రాంతంలో ప్రయాణికుల పడవ ఇంజన్ పేలిపోవడంతో 60 మంది గాయపడ్డారు. బోటులో జనం కిక్కిరి ప్రయాణిస్తున్న సమయంలో ఇంజన్ ఒక్కసారిగా పేలిపోయిందని, మంటలు చెలరేగటంతో వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులు పలువురు తీవ్రంగా గాయపడ్డారని అయితే ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు చెప్పారు. పేలుడు ధాటికి ప్రయాణికులు చెల్లాచెదురుగా నీళ్లలో పడిపోయారని ప్రత్యక్షసాక్షలు తెలిపారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని, తీవ్రంగా గాయపడ్డ 14 మంది తప్ప మిగతవారు ప్రాథమిక చికిత్స అనంతరం వెళ్లిపోయారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదానికి గురైన బోటు సీన్ సేబ్ కెనాల్ నుంచి బ్యాంకాక్ నగరం మీదుగా చావ్ ప్రయా నది వరకు వెళ్లాల్సి ఉండగా మధ్యలోనే ప్రమాదానికి గురైంది. బ్యాంకాక్ లో ప్రతిరోజు దాదాపు లక్ష మంది ప్రయాణికులు పడవలపై ప్రయాణిస్తుంటారు.