
బ్యాంకాక్ : థాయిలాండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకాక్ నుంచి చా చోంగ్‌సావో ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేందు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రావిన్స్ గవర్నర్ మైత్రీ త్రితిలానంద్ తెలిపారు. మృతులంతా ఓ ప్యాక్టరీకి చెందిన కార్మికులుగా గుర్తించారు. టూరిస్ట్ బస్సు రైల్వే ట్రాక్ దాటుతుండగా సరుకు రవాణా రైలు వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు నుజ్జునుజ్జయ్యింది. శిథిలాలు, మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment