
Earthquake Live Rescue OP Updates
మయన్మార్‌లో మరోసారి భూకంపం
👉రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.1 గా నమోదు
👉భారీగానే భూకంప మృతులు.. శిథిలాల కింద వందల మంది
- మయన్మార్, పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌కు భారీ భూకంపం తీరని నష్టం కలుగ జేసింది.
- ఇప్పటికే మృతుల సంఖ్య వెయ్యికి పైగా చేరింది
- సగాయింగ్ కేంద్రంగా శుక్రవారం మధ్యాహ్నాం 12.50గం. 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం
- నిమిషాల వ్యవధిలో మరో భారీ భూకంపం.. ఆపై స్వల్ప తీవ్రతతో పలుమార్లు కంపించిన భూమి
- కేవలం 10 కి.మీ. లోతులో భూకంపం ఏర్పడడంతో భారీ నష్టం
- ఈ ప్రభావంతో పొరుగున ఉన్న.. భారత్, చైనా, కంబోడియా, లావోస్, బంగ్లాదేశ్‌లలోనూ కంపించిన భూమి
- థాయ్‌లాండ్‌లో ఛాటుఛక్ మార్కెట్‌లో కుప్పకూలిన నిర్మాణంలోని భారీ భవనం
- 10 మంది మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న 100 మంది
ప్రపంచ దేశాల తక్షణ సాయం
- ఏ దేశమైనా సరే.. ఏ సంస్థ అయినా సరే.. మయన్మార్‌కు ఆపన్న హస్తం అందించాలని ప్రపంచ దేశాల సాయం కోరుతున్న జుంటూ మిలిటరీ చీఫ్ అవుంగ్
- తక్షణమే స్పందించి సాయానికి ఆదేశించిన ప్రధాని మోదీ
- భారత్ తరఫున ప్రత్యేక విమానాల్లో ఇప్పటికే చేరుకున్న సాయపు సామాగ్రి
- యూరప్ దేశాలతో పాటు అమెరికా సాయం ప్రకటన
థాయ్‌లో భారతీయులు సేఫ్
- భూకంపంపై అత్యవసర సమావేశం నిర్వహించిన థాయ్ ప్రధాని షినవత్రా
- భారతీయులంతా సురక్షితంగానే ఉన్నారని ప్రకటించిన ఎంబసీ
- అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలంటూ సూచన
👉వెయ్యి దాటిన భూకంప మృతులు
మయన్మార్, థాయ్‌లాండ్‌లో వెయ్యి దాటిన మృతుల సంఖ్య
మయన్మార్‌లోనే మృతులు అత్యధికం
శిథిలాల నుంచి పలువురిని రక్షిస్తున్న సహాయక బృందాలు
👉 మయన్మార్, థాయ్‌లాండ్‌లో మృత్యు ఘోష
భారీ భూకంపంతో రెండు దేశాల్లో మృత్యు ఘోష
మయన్మార్, థాయ్‌లాండ్‌లో 700కి పెరిగిన భూకంప మృతుల సంఖ్య
ఒక్క మయన్మార్‌లోనే 694 మంది మృతి, 1500 మందికి పైగా గాయాలు
బ్యాంకాక్‌లో ఇప్పటిదాకా 10 మంది మృతి చెందినట్లు ప్రకటన
సహాయక చర్యల్లో భాగంగా.. శిథిలాల నుంచి బయటపడుతున్న మృతదేహాలు
సజీవంగా బయటపడుతున్నవాళ్ల సంఖ్య తక్కువే
రెండు దేశాల్లోనూ కొనసాగుతున్న సహాయక చర్యలు
మయన్మార్‌లో కూలిపోయిన సగాయింగ్ బ్రిడ్జి
శిథిలా కింద చిక్కుకున్న వాళ్లను కాపాండేందుకు రెస్క్యూ టీం సహాయం
మృతుల సంఖ్య 10వేలకు పైగా ఉండొచ్చని అమెరికా సంస్థ అంచనా
👉 భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో కుప్పకూలిన భారీ భవనం
కుప్పకూలిన 33 అంతస్తుల భవనం
నాలుగు మృతదేహాల వెలికితీత
90 మంది ఆచూకీ గల్లంతు
కొనసాగుతున్న శిథిలాల తొలగింపు
👉మయన్మార్, థాయ్‌లాండ్‌లో ప్రకృతి విలయం
- 200 దాటిన మృతుల సంఖ్య
- మయన్మార్‌లో నేలమట్టమైన 40 భారీ అపార్ట్‌మెంట్లు
- బ్యాంకాక్‌లోనూ కూలిన భవనాలు
- శిథిలాల కింద వందలాది మంది.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- రక్షించాలంటూ శిథిలాల నుంచి కేకలు
- అయినవాళ్ల కోసం కన్నీళ్లతో గాలిస్తున్న పలువురు
- మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా
👉అఫ్గాన్‌లో భూకంపం
- రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదు
- ఉదయం 5.16 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ
👉భూకంప బాధితులకు భారత్ ఆపన్న హస్తం
- 15 టన్నుల సహాయక సామగ్రిని మయన్మార్‌కు పంపించిన భారత్
- గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, ఆహార పొట్లాలు, సోలార్ లైట్లు, ఔషధాలను మిలిటరీ విమానంలో పంపించినట్లు వెల్లడించిన విదేశాంగశాఖ
👉మయన్మార్‌లో మళ్లీ భూకంపం
- మయన్మార్‌ను వణికించిన మరో భూకంపం
- సహాయక చర్యలు కొనసాగుతుండగానే గతరాత్రి మళ్లీ భూకంపం
- 4.2 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలు
- నిన్నటి భూకంపం ధాటికి 200 మంది మరణించినట్లు ప్రకటించిన అధికారులు
- ఇంకా భారీగా మృతులు ఉండే అవకాశం
- వెయ్యి మంది మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్న అమెరికా భూకంపం సర్వే సంస్థ
👉 థాయ్‌లాండ్‌లో కొనసాగుతున్న ఎమర్జెన్సీ
- థాయ్‌లాండ్‌లో భూకంపంతో అత్యవసర పరిస్థితి ప్రకటన
- ఉత్తర థాయ్‌లాండ్‌లో తీవ్ర నష్టం
- రాజధాని బ్యాంకాక్ అతలాకుతలం
- కొనసాగుతున్న శిథిలాల తొలగింపు
- భారీ సంఖ్యలో మృతులు ఉండే అవకాశం
👉హృదయ విదారకం
- మయన్మార్, థాయ్‌లాండ్‌ల్లో హృదయవిదారకంగా భూకంప దృశ్యాలు
- పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద నుంచి హాహాకారాలు
- స్కూల్స్, ఆఫీసులు, ఆస్పత్రులు.. ఇలా అన్ని కుప్పకూలిన వైనం
- శిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే వెదుక్కుంటున్న జనం
- కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
👉మయన్మార్, థాయ్‌లాండ్‌ను కుదిపేసిన భారీ భూకంపం
- కుప్పకూలిన భవనాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం
- ఇంకా శిథిలాల కిందే పలువురు.. కొనసాగుతున్న సహాయకచర్యలు
- మయన్మార్‌లో ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటన
- థాయ్‌లాండ్‌లో భారతీయుల సహాయార్థ
- ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్
- థాయ్‌లాండ్‌లో హెల్ఫ్‌లైన్ నెంబర్ +66618819218
ఊహించని ప్రకృతి వికృతి చర్య.. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్ పాలిట భారీ భూకంపం గోరుచుట్టుపై రోకటిపోటుగా మారింది.
- టిబెట్ పీఠభూమి ప్రాంతంలో సంక్లిష్టమైన టెక్టానిక్ ఫలకాలపై ఉన్నందున మయన్మార్‌కు భూకంప ముప్పు ఎక్కువే.
- ఇక్కడ హెచ్చు తీవ్రతతో కూడిన భూకంపాలు పరిపాటి. భూమి పై పొరలోని ఇండో, బర్మా టెక్టానిక్ ఫలకాలు సమాంతరంగా కదలడమే తాజా భూకంపానికి కారణమని సైంటిస్టులు తేల్చారు.
- భూ ఫలకాల అంచులను ఫాల్ట్‌గా పిలుస్తారు. లక్షలాది ఏళ్ల కింద భారత ఉపఖండం ఆసియాను ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డ సాగయింగ్ ఫాల్ట్‌గా పిలిచే పగుళ్ల వెంబడే తాజా భూకంపం చోటుచేసుకుంది.
- ఇక్కడ టెక్టానిక్ ఫలకాలు ఏటా 0.7 అంగుళాల చొప్పున పరస్పర వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. ఫలితంగా పుట్టుకొచ్చే ఒత్తిడి భూకంపాలుగా మారుతుంటుంది. ఇక్కడ దశాబ్దానికి ఒక్క భారీ భూంకంపమన్నా నమోదవుతుంటుంది.
- మయన్మార్‌లో గత వందేళ్లలో 6కు మించిన తీవ్రతతో 14కు పైగా భూకంపాలు నమోదయ్యాయి. 1946లో 7.7, 1956లో 7.1 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 1988 నాటి భూకంపానికి వేలాది మంది బలయ్యారు. 2011, 2016ల్లో కూడా 6.9 తీవ్రతతో భూకంపాలొచ్చాయి.
👉ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకుల్లా వణికిపోయిన థాయ్‌లాండ్, మయన్మార్
- మార్చి 28 శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇటు మయన్మార్‌లో.. 7.4 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలు అటు థాయ్‌లాండ్‌లోనూ భారీ విధ్వంసం సృష్టించాయి.
- మయన్మార్‌లో 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించగా తర్వాత కూడా మరో నాలుగైదు ప్రకంపనాలు వణికించాయి.
- ఇటు మయన్మార్‌లో.. అటు థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భవనాలు కళ్లముందే పేకమేడల్లా కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి