Rescue Operation
-
సొరంగంలో మరో మృతదేహం లభ్యం
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగ ప్రమాదంలో శిథిలాల కింద కూరుకుపోయిన వారిలో మరొకరి మృతదేహం మంగళవారం లభ్యమైంది. మృతుడిని జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్‌కుమార్ (50)గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సహాయ బృందాలు మనోజ్‌కుమార్ మృతదేహాన్ని సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చాయి. నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన కుటుంబానికి అప్పగించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ సురేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో మనోజ్‌కుమార్ స్వగ్రామం యూపీలోని ఉన్నావ్ జిల్లా బంగార్మావ్ గ్రామానికి తరలించారు. మనోజ్‌కుమార్ 2009 నుంచి జేపీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్వర్ణలత, కుమార్తె శైలజ (24), కుమారుడు ఆదర్శ్ (17) ఉన్నారు. ఎక్స్కవేటర్ ద్వారా తవ్వకాలతో మృతదేహం బయటకు.. సొరంగంలోని 14వ కి.మీ. సమీపంలో ఫిబ్రవరి 22న పైకప్పు కూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లలో 8 మంది ఆచూకీ గల్లంతవడం తెలిసిందే. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఈ నెల 9 ఒక మృతదేహాన్ని (గురుప్రీత్‌సింగ్) వెలికితీయగా డీ2 ప్రాంతానికి సుమారు 190 మీటర్ల దూరంలో వెనక వైపు, కన్వేయర్ బెల్టుకు సమీపంలో మనోజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. సొరంగానికి కుడి వైపున కన్వేయర్ బెల్టు ఉండగా బెల్టు సమీపంలో ఇప్పటికే ఒకవైపు నుంచి తవ్వకాలు చేపడుతూ సహాయక బృందాలు మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఎడమ వైపున మట్టి వేశాయి. ఎక్స్కవేటర్ సాయంతో అక్కడి మట్టిని తొలగిస్తుండగా మంగళవారం మృతదేహం కనిపించింది. ప్రమాదానికి ముందు లోకో ట్రైన్లో కాంక్రీట్ సెగ్మెంట్లు, సామగ్రిని తీసుకెళ్లారని, ప్రమాద సమయంలో లోకోట్రైన్తో సహా చెల్లాచెదురై వెనక్కి కొట్టుకొచ్చి ఉంటుందని సహాయక సిబ్బంది అంటున్నారు. ఇదే ప్రాంతంలో నాలుగు ఎక్స్కవేటర్ల సాయంతో ముమ్మరంగా తవ్వకాలు, మట్టి తొలగింపు చేపట్టారు. -
SLBC టన్నెల్ లో మరో మృతదేహం గుర్తింపు
-
SLBC: 28వ రోజూ అన్వేషణ.. ఏడుగురి జాడ ఎక్కడ?
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం 28 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యం కాగా, మిగిలిన ఏడు మృతదేహాల కోసం నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సభ్యులు షిఫ్టుల వారిగా సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద భారీగా ఉబికి వస్తున్న ఊటనీరు పనులకు ఆటంకంగా మారింది. ఇంకా అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోల పని ప్రారంభం కాలేదు. రోబోలకు అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటం జఠిలంగా మారింది.ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 28 రోజులు గడిచింది. సాంకేతిక పరిజ్జానాన్ని, నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ సహయక చర్యలు కొనసాగిసాగుతున్న ఏడుగురి మృతదేహాల ఆచూకీ దొరకడం లేదు. టన్నెల్ ప్రమాద జీరో పాయింట్ వద్ద 50 మీటర్ల పరిధిలో ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ ఈ రోబోలు వినియోగించాలని నిర్ణయించారు. రోబోలు సమర్దవంతంగా పనిచేసేందుకు కావాల్సిన అదనపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆధునాతనమైన వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ టెక్నాలజీ వాడాలని నిర్ణయించారు.జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో రెండు ఎస్కవేటర్లతో పెద్దఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ లభించడం లేదు. మరో వైపు డిజాస్టర్ మెనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాగావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్, సింగరేణి జీఎం బైద్య నిత్యం ఉదయం, సాయంత్రం సహాయ బృందాల హెడ్స్‌తో సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు, పరికరాలు సమకూర్చుతున్నారు. గడిచిన 28 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం ఓవైపు జార్ఖండ్ పంజాబ్ జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన భాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.భారీగా ఊరుతున్న సిపేజ్ వాటర్ బురదను తొలగించడం కష్టంగా మారింది దక్షిణ మధ్య రైల్వే వారి సహకారంతో ప్లాస్మా కట్టర్స్ థర్మల్ కట్టర్స్ తో టిబిఎం మిషన్ విభాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా, బురదను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 800 టన్నుల స్టీల్‌ను లోకో ట్రైన్ ద్వారా, 800 టన్నుల మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలించారు మొత్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు బురద ఊటనీరుతో సహాయకచర్లకు అడుగడుగున ఆటంకాలుఎదురవు తున్నాయి.రోబోల వినియోగానికి నెట్ వర్క్ సమస్యతో పాటు.. మిగిలిన పనులకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మార్లు క్యాడవర్ డాగ్స్‌ను టన్నెల్లోకి పంపి శోదన చేయించారు.అయితే జీరో పాయింట్ వద్ద మనుషులు వెళ్లి పనిచేయటం ప్రమాదమని సహాయక బృందాలు అభిప్రాయపడుతున్నాయి. అవిశ్రాంతంగా చేస్తున్న తమ కృషి ఫలిస్తుందని ధీమాతో సహాయక చర్యలు మాత్రం షిఫ్ట్ ల వారీగా కొనసాగిస్తూనే ఉన్నారు. -
SLBC: రోబోలతో సెర్చ్ ఆపరేషన్.. టన్నెల్లో ప్రస్తుత పరిస్థితి ఇదే
సాక్షి, మహబూబ్‌నగర్ జిల్లా: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం 23 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యం అయింది. మిగిలిన ఏడు మృతదేహాల కోసం నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సభ్యులు షిఫ్టుల వారిగా సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద భారీగా ఉబికి వస్తున్న ఊటనీరు పనులకు ఆటంకంగా మారింది.రోబోల వినియోగంతో సహాయక చర్యలు ముమ్మరం అవుతాయని భావిస్తున్నా ఇంకా రోబోల పని ప్రారంభం కాలేదు. అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోలు మూడింటిని వినియోగించనున్నారు. ఒక్కో మిషన్ నిమిషానికి వెయ్యి క్యూబిక్ మీటర్ల సామర్ద్యం గల బురద, మట్టిని తొలగిస్తోంది. మానవుల కంటే 15 రెట్లు అధికంగా ఈ రోబోల పని చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. టన్నెల్ ప్రమాద జీరో పాయింట్ వద్ద 50 మీటర్ల పరిధిలో ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ ఈ రోబోలు వినియోగించాలని నిర్ణయించారు.రోబోలు సమర్దవంతంగా పనిచేసేందుకు కావాల్సిన అదనపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ లభించడం లేదు. మరో వైపు డిజాస్టర్ మెనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాగావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిత్యం ఉదయం, సాయంత్రం సహయ బృందాల హెడ్స్‌తో సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు, పరికరాలు సమకూర్చుతున్నారు.గడిచిన 23 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం ఓవైపు జార్ఖండ్ పంజాబ్ జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భారీగా ఊరుతున్న సీపేజ్ వాటర్ బురదను తొలగించడం కష్టంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే వారి సహకారంతో ప్లాస్మా కట్టర్స్ థర్మల్ కట్టర్స్‌తో టిబిఎం మిషన్ విభాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు మొత్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు బురద ఊట నీరుతో సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. -
వడివడిగా బురద తొలగింపు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగతా ఏడుగురు కార్మికుల జాడ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదస్థలంలో చివరి 40 మీటర్లలో తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉండగా, ఇందుకోసం రోబోలతో ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే సొరంగంలోకి ఆటోమేటివ్ స్లడ్జ్ రిమూవల్ రోబో మిషినరీని తీసుకెళ్లారు. శనివారం దానికి అనుసంధానంగా పనిచేసే వ్యాక్యూమ్ ట్యాంక్‌ను సొరంగంలోకి తరలించారు. దీని ద్వారా వేగంగా బురద, మట్టిని కన్వేయర్ బెల్టు మీదుగా బయటకు తరలించవచ్చని భావిస్తున్నారు. ఈ పనులు పూర్తిస్థాయిలో ఆదివారం ప్రారంభమవుతాయని చెబుతున్నారు. డీ1 వద్ద తవ్వకాలు పూర్తయితేనే.. ఇప్పటికే కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2 ప్రాంతంలో పూర్తిస్థాయిలో తవ్వకాలు చేపట్టారు. అక్కడ గురుప్రీత్‌సింగ్ మృతదేహం లభించగా, మిగతా వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మరో పాయింట్ డీ1 వద్ద సింగరేణి, ర్యాట్‌హోల్ మైనర్స్ ఆధ్వర్యంలో తవ్వకాలు ముమ్మరం చేశారు. డీ1 వద్ద 9 మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగిస్తేనే మిగతా కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది. డీ1 వద్ద టీబీఎంలో సెగ్మెంట్ ఎరెక్టర్ ఉండే చోట కార్మికులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో తవ్వకాలు పూర్తికావచ్చని, అప్పుడే కార్మికుల జాడ తెలిసే వీలుందని తెలుస్తోంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
SLBC టన్నెల్లోకి అటామనస్ హైడ్రాలిక్ పవర్ రోబో
సాక్షి, మహబూబ్‌నగర్/నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యు ఆపరేషన్ కొనసాగుతోంది. మనుషులకు బదులుగా రోబోలతో మట్టి తవ్వకాలు చేపట్టారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్‌ను వినియోగిస్తున్నారు.దీంతో మట్టిని త్వరగా తొలగించేందుకు, టన్నెల్ లోపల పనులను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారు. వాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించే అవకాశం ఉంది. కాగా, ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడ గుర్తించడానికి రోబో రెస్క్యూ కార్యక్రమాలకు రూ. 4 కోట్ల వ్యయం కానుంది. దానికి సంబంధించిన ఫైల్‌పై మంత్రి ఉత్తమ్ గురువారం సంతకం చేశారు.టన్నెల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఏఐ ఆధారిత స్లడ్జ్ రిమూవల్ రోబో మిషనరీ ఇప్పటికే సొరంగంలో పనిచేస్తుండగా, నిన్న (శుక్రవారం) మరో రెండు రోబోలు సొరంగం వద్దకు చేరుకోనున్నాయి. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య 12 మీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న టీబీఎం పైకప్పుగా మెటల్ ప్లాట్‌ఫాం ఉంది. దాని కింద హోలో స్పేస్‌గా ఉన్న ఖాళీ ప్రదేశంలో కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు.టీబీఎం లోపల ఖాళీ ప్రదేశమంతా మట్టి, బురద, శిథిలాలతో కూరుకొని ఉంది. వాటిని పూర్తిగా తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. డీ2, డీ1 మధ్య కార్మికులు నడిచేందుకు అవకాశమున్నట్టు భావిస్తున్న చోట ట్రెంచ్‌గా తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం కడావర్ డాగ్స్‌ను మరోసారి టన్నెల్లోకి తీసుకెళ్లారు. మట్టి, బురద తొలగించిన ప్రదేశాల్లో మరోసారి అన్వేషణ చేపట్టారు. -
టన్నెల్లో రోబోలతో రెస్క్యూ షురూ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాద స్థలం వద్ద మట్టి, శిథిలాలు, బురద తొలగింపునకు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం అన్వి రోబోటిక్స్‌కు చెందిన నిపుణులు ఆటోమేటెడ్ స్లడ్జ్ రిమూవల్ రో బోను సొరంగం లోపలకు తీసుకెళ్లారు. రాళ్లను క్రష్ చేసి తొలగించేందుకు ఒక రోబో, మట్టిని తొలగించేందుకు మరో రోబో, బురదను తొలగించేందుకు ఒకటి చొప్పున మూడు రకాల రోబోల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఆటో మేటెడ్ స్లడ్జ్ రిమూవల్ రోబోæ సొరంగంలో పను లు మొదలుపెట్టింది. పూర్తిగా ఉక్కుతో తయారైన ఈ రోబోట్ హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ రోబోకు ముందుభాగంలో ఉన్న గ్రైండర్ సహాయంతో పెద్ద రాళ్లు, శిథిలాలను కట్ చేస్తూ ము క్కలుగా చేయడంతోపాటు బురదను వ్యాక్యూమ్ సక్కర్ ద్వారా తొలగించి నేరుగా కన్వేయర్ బెల్టుపై వేస్తుంది. గంటకు వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టి, బురదను తొలగిస్తుందని చెబుతున్నారు.ప్రమాద స్థలంలో ఏఐ ఆధారిత రోబో సాయంతో తవ్వకాలు, మట్టి తొలగింపు చేపడుతుండగా, 100 మీటర్ల దూరం నుంచి రిమోట్ ఆపరేటింగ్ ద్వారా రోబోలను పర్యవేక్షించనున్నారు. సొరంగం ఇన్లెట్ వద్ద ఉండే మాస్టర్ రోబో మిగతా రోబోలతో కమ్యూనికేట్ చేస్తుంది. ఆల్ఇండియా రోబోటిక్ అసోసియేషన్ ఈ ఆపరేషన్‌కు సహకారం అందిస్తోంది. చివరి 20 మీటర్ల వద్ద తవ్వకాలు సొరంగంలో ప్రమాదం చోటుచేసుకున్న 13.85 కి.మీ. పాయింట్ వద్ద చివరి 20 మీటర్ల స్థలంలో సొరంగం పైకప్పు వదులుగా ఉండటంతో మళ్లీ కూలే అవకాశాలు ఉన్నాయని, అక్కడ పనిచేసే రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదకరమని జియోలాజికల్ సర్వే అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చివరి 20 మీటర్ల ప్రదేశంలో రోబోల ద్వారా రెస్క్యూ చేపడుతున్నారు. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య ట్రెంచ్ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడే టీబీఎం మధ్య భాగంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ స్థలంలోనే మిగతా కార్మికులు ఉంటారని భావిస్తున్నారు. ఆ ప్రాంతమంతా పూర్తిగా మట్టి, శిథిలాలతో కూరుకుపోయి ఉంది. మట్టి, బురద, శిథిలాలను తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. -
రంగంలోకి రోబోలు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ కనిపెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత రోబోలను బుధవారం నుంచి రంగంలోకి దింపనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన ఎన్వీ రోబో టిక్స్ బృందం మంగళవారం సొరంగం వద్దకు చేరుకుంది. మూడు రకాల రోబోల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనున్నారు. వాటిని ఆప రేట్ చేసే మాస్టర్ రోబోను సొరంగం వద్దకు తీసుకొచ్చారు. రోబోటిక్ నిపుణులు విజయ్, అక్షయ్ నేతృత్వంలో రోబోల అనుసంధానం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముమ్మరంగా గాలింపు సొరంగంలో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని ఇప్పటికే వెలికి తీయగా, మిగతా ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2 నుంచి డీ1 స్పాట్ల మధ్యలో ట్రెంచ్‌ను తవ్వుతున్నారు. టీబీఎం కట్టర్ హెడ్ భాగానికి వెనుకవైపు నుంచి డీ1 వరకు సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో ప్రతీ 10 మీటర్లకు ఒక చోట తవ్వకాలు జరుపుతూ గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా చోట్ల మళ్లీ కడావర్ డాగ్స్‌తో గాలింపు చేపడుతున్నారు. 18 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలను డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సొరంగం వద్దే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మనుషుల కన్నా 15 రెట్ల వేగం సొరంగం లోపల 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా.. చివరి 20 మీటర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. పైకప్పు వదులుగా ఉండి మళ్లీ కూలే అవకాశం ఉండటంతో రోబోల ద్వారా రెస్క్యూ పనులను చేపట్టనున్నారు. సొరంగంలోని పెద్ద రాళ్లను, శిథిలాలను తొలగించేందుకు ఒక రోబో, మట్టిని తొలగించేందుకు ఒకటి, బురదను తొలగించేందుకు మరొక రోబోను వినియోగించనున్నారు. సొరంగం చివరన 200 మీటర్ల విస్తీర్ణంలో సుమారు 6 వేల క్యూబిక్ మీటర్ల మట్టి, బురద పేరుకుని ఉంది. రోబోల ద్వారా మూడు రోజుల్లో మొత్తం మట్టి, శిథిలాలను తొలగించేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. రోబోల రెస్క్యూ ఆపరేషన్‌ను సొరంగంలోపల 200 మీటర్ల దూరం నుంచి పర్యవేక్షించేందుకు వీలుంటుంది. ఇందుకోసం ఇన్‌డెప్త్ ఏఐ కెమెరా, లైటర్ టెక్నాలజీ వినియోగించనున్నారు. -
SLBC టన్నెల్ వద్ద 18వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
SLBC Tunnel: టన్నెల్లోకి ప్రవేశించిన రోబోలు
సాక్షి, నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతోంది. సహాయ చర్యల్లోకి రోబోలతో పాటు వాటి బృందాలు అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేడు ఒకటో, రెండో మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం అన్వి రోబో బృందంతో పాటు మొదటి షిప్ట్‌లో 110 మంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోకో ట్రైన్లో బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లాయి. టన్నెల్ నుంచి ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. మినీ జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు.ఇప్పటికే 14 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి కారి్మకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాడవర్ డాగ్స్ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్ డాగ్స్ చూయించిన ప్రదేశంలోనే ప్రధానంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం రాబిన్స్ కంపెనీలో టీబీఎం ఆపరేటర్‌గా పనిచేస్తున్న గురుప్రీత్‌సింగ్ మృతదేహం లభించింది. దీంతో మిగతా 7 మంది కోసం సహాయక బృందాలు అన్వేషణను ముమ్మరం చేశాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తూనే ఆ ఏడు మంది కోసం సొరంగంలో గాలిస్తున్నారు. స్థానిక యంత్రాంగం గంటగంటకూ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు.ఎస్ఎల్బీసీ సొరంగంలో 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడమే రెస్క్యూ బృందాలకు ప్రతిరోజు క్లిష్టతరమవుతోంది. సొరంగంలో 13 కి.మీ. లోపల రెస్క్యూ నిర్వహించే సిబ్బందికి సైతం ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 16 రోజుల పాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు ఆదివారం ఒక కారి్మకుడి మృతదేహం లభ్యమైంది. సమీపంలో గాలిస్తున్నా మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. సోమవారం రెస్క్యూ బృందాలతో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్దకు ‘సాక్షి’ వెళ్లి పరిశీలించింది.సొరంగం ఇన్లెట్ నుంచి 13.850 కి.మీ. దూరంలో ఉన్న ప్రమాదస్థలం వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకే కనీసం 1.45 గంటలు పడుతోంది. లోకోట్రైన్ ద్వారా రాకపోకలకే కనీసం 3›–4 గంటలు పడుతోంది. ఒక్కో షిఫ్టులో సహాయక బృందాలు 12 గంటల పాటు పనిచేస్తున్నారు. సొరంగంలో 12 కి.మీ. వద్దకు చేరుకున్నాక సీపేజీ నీరు, బురద వస్తోంది. 13.200 కి.మీ. పాయింట్ వరకూ లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. లోకో ట్రైన్ ట్రాక్ తర్వాత రెండు ఎస్కవేటర్లు మట్టి, శిథిలాలను తొలగిస్తున్నాయి.13.400 వద్ద టీబీఎం భాగాలు టన్నెల్ నిండా చిక్కుకుని ఉండగా, సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా కుడివైపు నుంచి మిషిన్ భాగాలను కట్‌చేసి దారిని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ప్రమాదస్థలం 13.850 వరకూ కాలినడకన బురద, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. సొరంగానికి కుడివైపున కన్వేయర్ బెల్టు అందుబాటులోకి తీసుకురాగలిగారు. సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో 15 ఫీట్ల ఎత్తులో టన్నెల్ నిండా మట్టి, బురద పేరుకుని ఉండటంతో వాటిని తొలగించేందుకు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కడావర్ డాగ్స్ సూచించిన ప్రాంతాల్లోనే తవ్వకాలను జరిపి కార్మికుల జాడ కోసం అన్వేషణ చేపడుతున్నారు.సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్‌సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పక్కనే ఆదివారం, సోమవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కేరళ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్, జీపీఆర్ సిస్టం ద్వారా గుర్తించిన డీ1, డీ2 లొకేషన్లలో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు, ఇతర సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ పలు సూచనలు చేశారు. మంగళవారం సొరంగం వద్ద సహాయక చర్యల్లో భాగంగా రోబోలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నారు. -
SLBC: నేడు మరో రెండు మృతదేహాలు వెలికితీత!
సాక్షి, మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 17వ రోజు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరికిగా గుర్తిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఆదివారం ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఎత్తు, చేతి కడియం తదితర ఆనవాళ్లను బట్టి పంజాబ్‌కు చెందిన టీబీఎం ఆపరేటర్ గుర్‌ప్రీత్‌సింగ్ (40)గా గుర్తించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది.గత నెల 22న ఎస్ఎల్బీసీ సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా ఎనిమిది మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సొరంగంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం టీబీఎం ఆపరేటర్ గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు తెలిపారు.సహాయచర్యల్లో భాగంగా సొరంగం లోపల పేరుకుపోయిన మట్టి, టీబీఎం యంత్రం దిగువన డాప్లర్ సంకేతాలతో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ (స్నిఫర్స్) కూడా పలువురి ఆనవాళ్లను పసిగట్టాయి. దీంతో, శనివారం రాత్రి సహాయక బృందాలు టీబీఎం ఎడమవైపు భాగంలో తవ్వుతుండగా ఆరు అడుగుల లోతులో మొదట కుడిచేతి వేళ్లు, చేతి కడియం కనిపించాయి. అధికారుల సూచనల మేరకు గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికితీశారు. ఇంజినీర్ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటూ ఇటూ మరో ముగ్గురి జాడ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు మరో ఇద్దరి జాడ లభించే అవకాశం ఉందని సహాయ బృందాలు తెలిపాయి. మిగిలినవారు సొరంగం చిట్టచివరి భాగం వద్ద టీబీఎం కట్టర్ సమీపంలో చిక్కుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.మూడేళ్లుగా గుర్‌ప్రీత్‌సింగ్ విధులు ఎస్ఎల్బీసీ సొరంగంలో మృతదేహం లభ్యమైన గుర్‌ప్రీత్‌సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని తరన్‌తరాన్. రాబిన్స్ సంస్థలో 2022 నుంచి టీబీఎం ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రాజేందర్ కౌర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాపిల్లలు స్వస్థలంలో ఉండగా.. గుర్‌ప్రీత్‌సింగ్ మూడేళ్లుగా దోమలపెంటలోని రాబిన్స్ క్యాంపులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగాక బంధువులు వచ్చి కొన్ని రోజులు వేచిచూశారు. ఆచూకీ తెలియకపోవడంతో స్వస్థలానికి వెళ్లిపోయారు. -
ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యల్లో పురోగతి
-
SLBC టన్నెల్ లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్
-
SLBC: కాంక్రీట్‌లో కూరుకుపొయిన మృతదేహం గుర్తింపు
Slbc Tunnel Rescue Operation Updates:👉జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.👉కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. 👉కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. 👉ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కారి్మకులు చిక్కుకున్నట్లు డాగ్స్ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్‌తో కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది.👉టన్నెల్లో జరిగిన ప్రమాదం జాతీయ విపత్తు అని, అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత ఉపయోగిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం టన్నెల్‌ను సందర్శించిన ఆయన రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.👉సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధి గురించి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యల్లో అవంతరాలను అధిగమిస్తూ వేగంగా ముందుకెళ్తున్నామని, సొరంగం లోపల ఆక్సిజన్ సరిగా లేకపోవడం, నీటి ఊట అధికంగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 👉టీబీఎం దృఢమైన లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిత్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేసే కారి్మకులకు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిలటరీ ఇంజినీర్ వికాస్‌సింగ్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్, ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రభాకర్, సింగరేణి, రైల్వే, ఎన్జీఆర్ఐ, హైడ్రా తదితర బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
టన్నెల్ లో టెన్షన్.. ఇదే చివరి ప్రయత్నం
-
SLBC టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు: మంత్రి ఉత్తమ్
ఎస్ఎల్బీసీ సహాయక చర్యల అప్డేట్స్..టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు: మంత్రి ఉత్తమ్టన్నెల్ వద్ద సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్మంత్రి ఉత్తమ్ కామెంట్స్..సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఇలాంటి క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదు14 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉందిచివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులుఅక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్లకు సైతం ప్రమాదంఅందుకే రోబోల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నాం 👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నేటితో సహాయక చర్యలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఇక, టన్నెల్లో జీపీఆర్ గుర్తించిన అనుమానిత ప్రాంతాలనే క్యాడవర్ డాగ్స్ మళ్లీ గుర్తించాయి. మరోవైపు.. టన్నెల్లో సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేడు మరోసారి సమీక్షించనున్నారు. హెలికాప్టర్లో మంత్రి ఉత్తమ్ దోమలపెంట చేరుకోనున్నారు.👉ఇక, హైదరాబాద్‌కు చెందిన అన్వీ రోబోటిక్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు వరసగా రెండోరోజు కూడా సొరంగంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో టీబీఎం చుట్టుపక్కల, అక్కడి నుంచి మరికొంత దూరంలో కొన్ని ప్రదేశాలను గుర్తించినట్లు సమాచారం. ఇంతకుముందు క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలనే ఇవి కూడా గుర్తించినట్లు తెలిసింది.👉ఇదిలా ఉండగా.. సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు టీబీఎం కత్తిరింపునకు అవసరమైన సామగ్రిని లోకో ట్రైన్ ద్వారా సొరంగంలోకి తెప్పించుకున్నారు. రాకపోకలకు అనుకూలంగా ఉండేందుకు కూలిపడిన మట్టి దిబ్బ వరకు పొక్లెయిన్ వెళ్లేలా టీబీఎంను ఒకవైపు కత్తిరిస్తున్నారు. టీబీఎం భాగాలను కత్తిరించే పనిలో సహయక సిబ్బంది వేగం పెంచారు. రోజుకు సుమారు ఐదు అడుగుల మేర తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో రెండు రోజుల్లో మట్టి కూలిన ప్రదేశం వరకు పొక్లెయిన్ చేరుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించిన టీబీఎం సామగ్రిని లోకో ట్రైన్‌తో బయటకు పంపిస్తూ రాకపోకలకు క్లియర్ చేస్తున్నారు. -
SLBC: ఆ ప్రదేశంలో ఆగిన క్యాడవర్ డాగ్స్.. రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పరిణామం
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో మూడు మృతదేహాల స్పాట్స్‌ను క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి. జీపీఆర్ ద్వారా మార్క్ చేసిన ప్రదేశంలోనే క్యాడవర్ డాగ్స్ ఆగాయి. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్‌ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతోపాటు వాటి శిక్షకులను దోమలపెంటకు రప్పించింది.నేషనల్ డిజా స్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్ కీర్తి ప్రకాశ్‌సింగ్‌తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్ నేతృత్వంలో కడావర్ డాగ్స్ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది.శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్‌తో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద కార్మికుల జాడ కోసం సహాయ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను ఈ శునకాలు పసిగడతాయి.8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయినా ఇప్పటి వరకు గల్లంతైన వారి జాడ దొరకలేదు.12 విభాగాలకు చెందిన దాదాపు 650 మంది సభ్యులు నిరంతం షిఫ్టుల వారిగా సహయక చర్యల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇవాళ టన్నెల్లో చిక్కుకున్న వారి అచూకీ కనుగొనేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన రెండు క్యాడవర్ డాగ్స్‌ను సొరంగంలోకి పంపించారు. ఉదయం ఏడున్నర గంటలకు లోకో ట్రైన్లో వాటిని లోపలికి తీసుకెళ్లారు. తిరిగి మధ్యాహ్నం రెండున్నరకు బయటకు తీసుకొచ్చారు. తప్పిపోయిన వారి ఆనవాళ్లకు సంబంధించి పలు అనుమానిత ప్రాంతాలను డాగ్స్ గుర్తించినట్టు చెబుతున్నారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలపై అధికారులు సమీక్ష చేస్తున్నారు.టన్నెల్లోకి నలుగురు సభ్యులతో కూడిన ఎన్వీ రోబోటిక్ నిపుణుల బృందం వెళ్లింది. వారితో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా వెళ్లి అందులో అధ్యయనం చేశారు. మరో వైపు కన్వేయర్ బెల్ట్ కూడ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావటంతో సహయచర్యలు వేగవంతమయ్యాయి. సొరంగంలో కూరుకుపోయిన మట్టి, బురదను తొలగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే నిపుణులతో ప్లాస్మాకట్టర్స్ ద్వారా టీబీఎం మిషన్ భాగాలు కట్ చేస్తూ వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు.టీబీఎంపై ఉన్న మట్టిని వాటర్‌గన్‌తో తొలగిస్తున్నారు. కాని జీపీఆర్ అనుమానిత ప్రాంతాల్లో జరుపుతున్న తవ్వకాల్లో పెద్దఎత్తున సీఫేజ్ వాటర్ వస్తుండటంతో సహయక చర్యలకు కొంత అవరోధం ఏర్పడుతుంది. మరోవైపు అదనపు మోటార్లు ఏర్పాటు చేసి సీఫేజ్ వాటర్‌ను త్వరిత గతిన బయటికి పంపే ప్రక్రియను చేపడుతున్నారు. మొత్తంగా టన్నెల్లో ఇరుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అనేక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ 8 మంది ఆచూకీ దొరకపోవటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. గడచిన 14 రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. -
SLBC: టెన్నెల్‌లోకి క్యాడవర్ డాగ్స్ బృందం.. వీటి ప్రత్యేకత ఇదే..
సాక్షి, దోమలపెంట: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 14వ రోజుకు చేరుకున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇక, తాజాగా మరణించిన కార్మికులను గుర్తించేందుకు కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ బృందం టన్నెల్లోకి వెళ్లింది. ఇదే సమయంలో టన్నెల్లో తవ్వేందుకు అవసరమైన సామగ్రిని లోకోమోటర్ తీసుకెళ్లింది.ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులను గుర్తించేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయమే రెండు క్యాడవర్ డాగ్స్‌తో సహాయక బృందం టన్నెల్లోకి వెళ్లింది. బెల్జియం మ్యాల్నోయిస్ బ్రీడ్‌కు చెందిన క్యాడవర్ డాగ్స్ 15 ఫీట్ల లోపల ఉన్న వస్తువులను, మృతదేహాలను గుర్తిస్తాయి. ఇదే వీటి ప్రత్యేకత. వీరితో పాటుగా 110 మంది కూడా టెన్నెల్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మృతదేహాల గుర్తించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎనిమిది మంది కార్మికుల అన్వేషణ అనంతరం ఈ బృందం మధ్యాహ్నం 2 గంటల తర్వాత టన్నెల్ నుంచి బయటకు రానుంది.ఇదిలా ఉండగా.. టన్నెల్లో కార్మికుల జాడ గుర్తించేందుకు జీపీఆర్ సహాయంతో సిగ్నళ్లు పంపగా.. 8 ప్రదేశాల నుంచి బలమైన సిగ్నల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాలను, లోతును లెక్కకడుతున్నారు. ఎనిమిది ప్రాంతాల్లో మార్కింగ్ చేసి రెండుచోట్ల తవ్వకాలు జరిపితే యంత్ర పరికరాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతాలను వదిలేసి మిగతా ఆరు చోట్ల తవ్వకాలు చేపట్టారు.మరోవైపు.. టన్నెల్‌లోని వ్యర్దాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపుతున్నారు. ఈ బెల్ట్ ద్వారా గంటకు 8 వందల టన్నుల వ్యర్దాలను బయటికి పంపుతున్నారు. దీంతో టన్నెల్లో భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను త్వరిత గతిన తొలగించే అవకాశం ఏర్పడింది. వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. -
ఎస్ఎల్ బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ కోసం జాగిలాలు
-
ఆపరేషన్ ‘కడావర్ డాగ్స్’
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్‌ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించింది. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతోపాటు వాటి శిక్షకులను గురువారం సాయంత్రానికి దోమలపెంటకు రప్పించింది. నేషనల్ డిజా స్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్ కీర్తి ప్రకాశ్‌సింగ్‌తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్ నేతృత్వంలో కడావర్ డాగ్స్ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్‌తో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద కార్మికుల జాడ కోసం సహాయ బృందం గాలించనుంది. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను ఈ శునకాలు పసిగడతాయి.కొనసాగుతున్న టీబీఎం భాగాల తొలగింపు..సొరంగం లోపల 13.650 కి.మీ. పాయింట్ వద్ద టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) భాగాలు చెల్లాచెదురై టన్నెల్ మార్గానికి అడ్డుగా ఉండటం తెలిసిందే. దీంతో ఆయా భాగాలను ప్లాస్మా, గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి సుమారు 150 మీటర్ల వరకు టీబీఎం భాగాలు ఉండగా వాటి మధ్యలోనే కార్మికులు చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి టీబీఎం భాగాలను కట్ చేస్తూ, మట్టిని తొలగిస్తూ కార్మికుల కోసం అన్వేషిస్తున్నారు.కన్వేయర్ బెల్టును ప్రమాదస్థలం వరకు కొనసాగించేందుకు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో ఫౌండేషన్, జాయింట్ మెషీన్, కమిషన్ పనులు పూర్తవగా ఎలక్ట్రికల్ పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయానికి కన్వేయర్ బెల్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తుందని చెబుతున్నారు.నేడు రంగంలోకి టన్నెల్ ప్రత్యేక నిపుణులు..సొరంగంలో ప్రమాద స్థలంలో చిక్కుకున్న కార్మికుల వెలికితీత కోసం కొనసాగుతున్న సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఐఐటీ చెన్నైకి చెందిన టన్నెల్ నిపుణులు శుక్రవారం దోమలపెంటకు రానున్నారు. ఇప్పటికే ఎన్వీ రోబోటిక్స్‌కు చెందిన నిపుణులు ప్రమాదస్థలానికి పరిశీలించారు. ప్రత్యేక పరికరాలు లేదా ఏఐ రోబోల ద్వారా కార్మికుల వెలికితీత సాధ్యమవుతుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎన్జీఆర్ఐ, నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీకి చెందిన నిపుణులు అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని సొరంగం పైభాగంలో భూమి పరిస్థితులపై సర్వే పనులను కొనసాగిస్తున్నారు.13 రోజులుగా శిథిలాల కిందే..ఎస్ఎల్బీసీ సొరంగం కుంగిన ప్రమాదంలో 8 మంది కారి్మకులు, ఇంజనీర్లు గత 13 రోజులుగా శిథిలాల కిందే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో 12 ఏజెన్సీలు, సంస్థలు సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెళ్లు లేకుండానే 14 కి.మీ. వరకు ఏకధాటిగా టీబీఎం ద్వారా సొరంగం తవ్వకాలు చేపట్టడం వల్ల ప్రమాదస్థలంలో రెస్క్యూ బృందాలకు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. టన్నులకొద్దీ పేరుకుపోయిన మట్టి, శిథిలాలను బయటకు తరలించేందుకు రోజుల సమయం పడుతోంది. దీంతో ఈ తరహా సహాయక చర్యల్లో పాలుపంచుకున్న అనుభవమున్న అంతర్జాతీయ సంస్థలను సంప్రదించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తమ వారి ఆచూకీ నేటికీ లభించకపోవడంతో బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి పరిస్థితి ఎలా ఉందోనంటూ ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. -
SLBC టన్నెల్ ల్లో 13వ రోజు సహాయక చర్యలు
-
SLBC టన్నెల్ ప్రమాదం: వీడని ఉత్కంఠ.. 13 రోజులైనా జాడే లేదు
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీతపై ఉత్కంఠ వీడటం లేదు. 13 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. మూడు షిప్టుల్లో 24 గంటలూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 13 రోజులు గడుస్తున్నా 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అనుమానిత ప్రాంతాల్లో ముమ్మరంగా తవ్వకాలు చేపట్టారు. టీబీఎం మిషన్‌పై బుర తొలగింపునకు వాటర్ గన్స్ ఉపయోగిస్తున్నారు. రోబోల వినియోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా, కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు.అయితే సహాయక బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో, ఎవరికి వారు ఇక్కడ.. అక్కడ అన్నట్టుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో 10 రోజులైనా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్‌చేసిన టీబీఎం మెషీన్ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చి వెళ్లిన నాటి నుంచి అధికారుల హడావుడి అంతగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకు రావడం కష్టతరంగా మారుతోంది. టన్నెల్లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. -
SLBC టన్నెల్ లో 12వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
కీలక దశకు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో మరో ముందడుగు పడింది. సహయకచర్యలకు ఆటంకంగా ఉన్న బురద, శిథిలాలు తొలగించేందుకు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించారు. దీంతో సహయక చర్యలు వేగవంతం కానున్నాయి. టన్నెల్లో 11 రోజుల క్రితం గల్లంతైన 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు సహయక చర్యలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగనున్నాయి. త్వరలో తప్పిపోయిన వారి ఆచూకీ దొరుకుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో తప్పిపోయిన వారి ఆచూకీ కోసం 11 రోజులుగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, ర్యాట్‌హోల్ మైనర్స్, ఎన్జీఆర్ఐ ఇలా 12 విభాగాలకు చెందిన దాదాపు 650 సభ్యులతో నిర్విరామంగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఆచూకీ లభించకపోవటంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ప్రమాద సమయంలో పెద్దమొత్తంలో సీపేజ్ వాటర్, మట్టి పడటంతో టన్నెల్లో బురద పేరుకుపోయి సహయక చర్యలకు ఆటంకంగా మారింది. అదే సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ధ్వంసం అయ్యింది. మిషన్‌కు అను సంధానంగా పనిచేసే కన్నేయర్ బెల్ట్ సైతం దెబ్బతింది.దీంతో టన్నెల్లో ఉన్న శిథిలాలు, బురద అలాగే ప్లాస్మా కట్టర్స్ ద్వారా తొలగిస్తున్న టీబీఎం మిషన్ పరికరాల తొలగింపు సమస్యగా మారింది. ఇప్పటి వరకు లోకో ట్రైన్ ద్వారా రెండు బోగీలలో వాటిని తొలగిస్తూ వచ్చారు.ఒకసారి లోకో ట్రైన్ లోపలికి వెళ్లి రావటానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. అంటే ఈ లెక్కన బురద, శిథిలాలు తొలగించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో సహయక చర్యలు వేగవంతం కావాలంటే కన్వేయర్ బెల్ట్ పునరద్దరణే శరణ్యమని నిర్ణయించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో కూడ ఇదే అంశాన్ని ప్రతిపాదించారు. దీంతో వెంటనే కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణ పనులు చేపట్టారు. ఇంజనీయర్లు రెండు రోజులు శ్రమించి ఇవాళ సాయంత్రం దాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం వ్యర్దాలను ఈ బెల్ట్ ద్వార బయటికి పంపుతున్నారు. ఈ బెల్ట్ ద్వారా గంటకు 8 వందల టన్నుల వ్యర్దాలను బయటికి పంపే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో టన్నెల్లో భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను త్వరిత గతిన తొలగించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం దాదాపు10 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టి, బురద ఉన్నట్టు చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణతో తప్పిపోయిన వారి ఆచూకీ త్వరలోనే గుర్తించవచ్చని అభిప్రాయపడుతున్నారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని, కన్వేయర్ బెల్ట్ సిద్ధంగా ఉండటంతో వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు.రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్న నీటిని ఎప్పటికప్పుడు పంపుల ద్వారా బయటకు పంపిస్తున్నట్లు వివరించారు. మొత్తంగా కన్వేయర్ బెల్ట్ ను పునరుద్దరించి సహయకచర్యలు చేపట్టడం మాత్రం రెస్క్యూ ఆపరేషన్‌లో కీలకంగా మారింది. -
SLBC: సహాయక చర్యలు కొనసాగింపు.. కన్వేయర్ బెల్టు విస్తరణ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో పదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో టీబీఎం మిషన్ కటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే, నేడు కన్వేయర్ బెల్టు పునరుద్దరణ చర్యలను అధికారులు చేపట్టారు. పిల్లర్ వేసి కన్వేయర్ బెల్టును విస్తరించనున్నారు. ఇక, టన్నెల్లో ఊరుతున్న నీటితో పనులకు ఆటంకం కలుగుతోంది.👉మరోవైపు.. టన్నెల్లో ఏడు మీటర్ల లోతు తవ్వినా కూడా కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. జీపీఆర్ టెక్నాలజీ విఫలం కావడంతో గందరగోళం ఏర్పడుతోంది. పది రోజులుగా టన్నెల్లో ఉన్న వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.👉ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు ఆదివారం సాయంత్రం వెళ్లారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఆరా తీసి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైతే రోబోల సాయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. సొరంగంలో చిక్కుకున్న వాళ్లు ఎక్కడున్నారో.. బతికి ఉన్నారో లేదో అంచనాకు రాలేదన్న సీఎం.. మరో రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రకృత్తి విపత్తులు జరిగినప్పుడు.. అండగా నిలవాల్సిన విపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు.👉సహాయక చర్యలు, తవ్వకాలకు నిరంతర నీటి ఊట అడ్డంకిగా మారుతోంది. పూడిక, కత్తిరించిన టీబీఎం భాగాలను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. షిఫ్ట్‌కు 120 మంది చొప్పున రోజుకు మూడు షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి రెస్క్యూ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయక చర్యల్లో 18 ఏజెన్సీలు, 700 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు.అనుమానిత ప్రాంతాలు తాజాగా గుర్తింపు👉ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల జాడ ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఇతర ప్రాంతాలను.. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీ సహాయంతో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) తాజాగా గుర్తించింది. నలుగురు కార్మీకులు టన్నెల్ బోరింగ్ యంత్రం (టీబీఎం)కు వెనుక మట్టిదిబ్బల కింద కూరుకుపోయి ఉన్నట్టు అనుమానిస్తుండగా, మరో నలుగురు టీబీఎం ఉన్న ప్రాంతంలోనే శిథిలాల కింద ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్జీఆర్ఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు ఆదివారం ఊహా చిత్రం రూపొందించారు. దీని ఆధారంగా డయాగ్రామ్‌ను తయారు చేసి, దాని ఆధారంగా మూడు దశల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు వ్యూహం సిద్ధం అయ్యింది. -
SLBC సహాయక చర్యలపై అధికారులతో మంత్రులు, సీఎస్ రివ్యూ
-
ఆ నలుగురి జాడెక్కడ?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని ఛమోలా జిల్లా మనా గ్రామంలో హిమపాతం కారణంగా మంచు చరియల్లో కూరుకుపోయిన వారిలో మొత్తంగా ఇప్పటిదాకా 50 మంది కార్మికులను బయటకు తీసుకురాగలిగారు. అయితే వీరిలో నలుగురి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేసినా ఫలితంలేకుండా పోయింది. ఆ నలుగురు శనివారం చనిపోయారని జిల్లా విపత్తు నిర్వహణాధికారి ఎన్కే జోషి చెప్పారు. మంచుచరియల్లో కూరుకుపోయిన మిగతా నలుగురి కోసం అన్వేషణ తీవ్రతరం చేశారు. తొలుత ఐదుగురు చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి.ఐదుగురిలో సునీల్ అనే కార్మికుడు ప్రాణాలతో బయటపడి సొంతూరుకు వెళ్లినట్లు తాజాగా తేలింది. దీంతో నలుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. బద్రీనాథ్ ఆలయానికి వెళ్లే రహదారిలో మంచుచరియలు పడటంతో సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్ఓ) కార్మికులు ఆ మంచును తొలగిస్తుండగా శుక్రవారం ఉదయం ఇతర 55 మంది సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్న కంటైనర్లు, షెడ్‌పై మంచుచరియలు పడటంతో దుర్ఘటన జరిగిన విషయం తెల్సిందే. వీరిలో 33 మందిని శుక్రవారం రాత్రి, 17 మందిని శనివారం మంచు నుంచి బయటకు లాగారు. మంచులో 57 మంది కూరుకుపోయారని శుక్రవారం వార్త లొచ్చాయి. శనివారం మాత్రం 55 మంది మాత్రమే చిక్కుకున్నారని అధికారులు చెప్పారు.6 హెలికాప్టర్ల వినియోగంశుక్రవారం రాత్రంతా భారీగా మంచు కురియడంతో అన్వేషణకు విరామమిచ్చి శనివారం ఉదయాన్నే ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్, బీఆర్ఓ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వాయుసేన ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను మొదలెట్టాయి. వీరికి జిల్లా యంత్రాంగం, వైద్య విభాగం తగు సాయం అందిస్తున్నాయి. ‘‘భారతీయ సైన్యానికి చెందిన మూడు, వాయు సేనకు చెందిన రెండు, మరో పౌర హెలికాప్టర్‌ను మొత్తంగా ఆరు హెలికాప్టర్లను గాలింపు కోసం వినియోగిస్తున్నాం. బయటకులాగిన వారిలో 24 మందికి గాయాలయ్యాయి. వారిని ఆర్మీ ఆస్పత్రికి తరలించాం’’ అని ఆర్మీ అధికారి చెప్పారు. -
నేడు SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. టన్నెల్ లోపల జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు. ప్రమాద స్థలానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సహాయక చర్యలను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు సీఎం టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. టన్నెల్లో మరోచోట ఏడు మీటర్ల లోతులో మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. మిగిలిన నాలుగు మృతదేహాలు తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ బృందాలు చెబుతున్నాయి. మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్‌లు కూడా సిద్ధంగా చేశారు. ఇక, ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా.. వాళ్ల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.నలుగురి ఆనవాళ్లు దొరికినా..టన్నెల్ లోపల చిక్కుకుపోయిన 8 మందిలో టీబీఎం వెనక భాగంలో 4 మీటర్ల మట్టి కింద నలుగురు, ముందు భాగంలో రెండు చోట్ల ఏడు మీటర్ల కింద నలుగురు ఉన్నట్లు గుర్తించారు. సిమెంట్, నీరు కలిసి మూడు మీటర్ల మందంతో కాంక్రీట్‌గా మారిన ప్రాంతాన్ని డ్రిల్లింగ్ చేస్తే వైబ్రేషన్‌తో ఎక్కడ పైకప్పు కదులుతుందోనని ఆందోళన చెందుతున్నారు.ప్రమాదం జరిగిన స్థలంలో(Zero Spot)లో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్‌ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు.సమస్యగా మారిన బురద, ఊట నీరు..టన్నెల్ లోపల 13.50 కి.మీ దాటి ముందుకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ మద్రాస్ ఇంజనీరింగ్ 7వ రెజ్మెంట్, బార్డర్రోడ్ ఆర్గనైజషన్, సింగరేణి మైన్స్, హైడ్రా, ఫైర్ సిబ్బందిని ఎవరిని కదిలించినా వారి అనుభవాలను పంచుకుంటున్నారు. టన్నెల్లోపల 5 మీటర్ల వరకు పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ఊట నీళ్లతో బురదగా మారి అడుగు తీసి అడుగేయడానికి కూడా వీలు కావడం లేదని చెబుతున్నారు. టన్నెల్లోపల13 కి.మీ వరకు పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను లోకో బకెట్స్‌లో వేసి తరలించారు. -
ఉత్తరాఖండ్: 46 మంది సేఫ్.. నలుగురి మృతి.. ఐదుగురు మిస్సింగ్
డెహ్రాడూన్: మంచు చరియలు విరిగిపడిన(Uttarakhand avalanche) ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు భారత సైన్యం శనివారం ప్రకటించింది. రెండో రోజు సహాయక చర్యల్లో 17 మందిని రక్షించినట్లు.. మిగిలిన మరో ఐదుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.ఛమోలి జిల్లాలో శుక్రవారం వేకువజామున బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ క్యాంప్ వద్ద భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 55 మంది బీఆర్వో కార్మికులు చిక్కుకుపోగా.. భారత సైన్యం(Indian Army) రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మంచు వర్షంతో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే నిన్న 33 మందిని.. ఇవాళ మరో 17 మందిని భారత సైన్యం రక్షించింది. వీళ్లలో తీవ్రంగా గాయపడిన వాళ్లను జోషిమఠ్‌లోని ఆస్పత్రులకు హెలికాఫ్టర్ల ద్వారా తరలించింది. చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు తెలిపింది.ఇండో-టిబెటన్ సరిహద్దు గ్రామమైన మనాలో.. సైన్యం కదలికల కోసం రోడ్ల నుంచి మంచును తొలగించే పనుల్లో బీఆర్వో బృందం తలమునకలైంది. ఈ క్రమంలో.. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంచు కొండలు విరిగిపడ్డాయి. ఎనిమిది కంటైనర్లతో పాటు ఒక షెడ్డూలో వాళ్లను మంచు చరియలు కప్పేశాయి. ఒకవైపు వర్షం.. మరోవైపు అడుగుల మేరలో పేరుకుపోయిన మంచులో మరికొన్ని ఏజెన్సీల సాయంతో సైన్యం సహాయక చర్యలు కొనసాగించింది. వీళ్లలో కొందరు ఉత్తరాఖండ్(Uttarakhand) నుంచి ఉండగా, చాలామంది బీహార్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్ము కశ్మీర్, ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు ఉన్నారు.సహాయక చర్యలపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి సమీక్ష జరుపుతున్నారు. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నామని అన్నారాయన. -
SLBC టన్నెల్ నుంచి కొనసాగుతున్న మృతదేహాల వెలికితీత
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా.. వాళ్ల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక.. నాగర్ కర్నూల్ నుంచి ఎనిమిది ఆంబులెన్స్‌లు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు సమాచారం. అక్కడి గుర్తింపు పరీక్షలు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయ్యాకే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.మరోవైపు టన్నెల్ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు సిబ్బంది, మరో ఇద్దరు పీజీ వైద్యులు, నాగర్ కర్నూల్ డీఎంహెచ్‌వో ప్రమాద స్థలంలో ఉన్నారు. ఇవాళ ఎలాగైనా మృతదేహాలను వెలికి తీసి.. బంధువులకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8.30గం. ప్రాంతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాల అవశేషాలను గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన స్థలంలో(Zero Spot)లో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్‌ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎనిమిదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. NDRF, SDRF, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, రైల్వే రెస్క్యూ టీంలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి టన్నెల్ నుంచి.. పైపుల ద్వారా భారీగా నీటిని, బురదను డబ్బాల్లో బయటకు పంపుతూనే ఉన్నారు. -
SLBC టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు
-
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్‌లో ఈరోజు ఏం చేస్తారంటే?
సాక్షి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు. 12 వేర్వేరు విభాగాలతో 600 మంది సహయక చర్యలు చేపట్టారు. టీబీఎం మిషన్‌ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్టింగ్ చేస్తున్నారు. బురద, శిథిలాల తొలగింపు జటిలంగా మారింది. రెండు, మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.కార్మికుల జాడ కోసం అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికతతో భూమిలో కొంత దూరం వరకు ఏమేం ఉన్నాయో గమనించవచ్చుజీపీఆర్ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు భూగర్భంలోకి ప్రసరించి... అక్కడున్న వివిధ రకాల రాళ్లు, వస్తువులను తాకి ప్రతిబింబిస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల్లో ఉండే వైవిధ్యాన్ని జీపీఆర్ పరికరానికి ఉండే యాంటెన్నా రికార్డు చేస్తుంది. దీని ఆధారంగా భూగర్భంలో ఉన్న వస్తువుల నమూనా చిత్రాలను జీపీఆర్ పరికరం రూపొందిస్తుంది. అందులో మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలు ఉంటే.. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం సులువు కానుంది. అదే చోట తవ్వకాలు జరపడం ద్వారా దేహాలను బయటికి తీసుకురావడానికి వీలవుతుంది. ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను నిపుణులు నేడు (శుక్రవారం) విశ్లేషించనున్నారు.బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిపుణుల పర్యవేక్షణలో.. సొరంగంలోపల మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాల తొలగింపు, విరిగిపడిన పరికరాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసే పనులు ప్రారంభమయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్క్యూ బృందాలు, కార్మికుల సహాయంతో లోకో ట్రైన్‌లోని మూడు కోచుల్లో మట్టి, బురదను టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో సొరంగం పైకప్పునకు రీయిన్‌ఫోర్స్‌మెంట్ చేస్తూ మళ్లీ కూలకుండా చర్యలు చేపడుతున్నారు.సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలతో మూడు షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీవాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మూడు రోజుల్లోగా రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక టన్నెల్లో ఊట నీటిని తొలగించేందుకు డీవాటరింగ్ నిరంతరం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు పంపులతో నీటిని తోడేస్తుండగా, శుక్రవారం మరో రెండు మోటార్లు రానున్నాయి.సొరంగం ఇన్లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల ప్రమాద స్థలానికి రెస్క్యూ టీంలు చేరుకుని, బయటకు వచ్చేందుకు... లోపల ఉన్న శిథిలాలు, మట్టిని బయటికి తెచ్చేందుకు లోకో ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమాదస్థలం నుంచి శిథిలాలను లోకో ట్రైన్ వరకు చేర్చేందుకు 300 మీటర్ల మేర రెస్క్యూ సిబ్బంది మోసుకెళ్లాల్సి వస్తుండటం కష్టంగా మారింది. కన్వేయర్ పనిచేయకపోవడంతో లోకో ట్రైన్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవానికి టీబీఎం మెషీన్‌తోపాటే కన్వేయర్ బెల్టు కూడా పనిచేస్తుంది. టీబీఎం సొరంగాన్ని తొలుస్తూ ఉండగా.. రాళ్లు, మట్టి అంతా ఆ కన్వేయర్ బెల్టు ద్వారా టన్నెల్ నుంచి బయటికి వస్తాయి. ఇప్పుడు టీబీఎం లేకుండా కన్వేయర్ బెల్టును వినియోగంలోకి తేవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.సొరంగం పైకప్పును పటిష్టం చేయడంతోపాటు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సింగరేణి గనులకు చెందిన మరో 200 మంది రెస్క్యూ సిబ్బంది శుక్రవారం ప్రమాదస్థలానికి చేరుకోనున్నారు. ఇప్పటికే టన్నెల్ వద్ద వంద మంది వరకు సింగరేణి రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా భూగర్భ టన్నెళ్లలో ప్రమాదాల నుంచి రక్షించే సుశిక్షితులైన సిబ్బందిని రప్పిస్తున్నామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. -
ప్రమాద స్థలానికి దగ్గరగా వెళ్లిన రెస్క్యూ బృందాలు
-
SLBC లోపలి దృశ్యాలు: సౌండ్లు చేస్తూ ముందుకు..
నాగర్ కర్నూల్, సాక్షి: SLBC టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన.. కార్మికులు చిక్కుకుపోయారని భావిస్తున్న ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. ‘‘ఎవరైనా ఉన్నారా?’’ అంటూ శబ్ధాలు చేస్తూ కార్మికుల జాడ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి.నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో సొరంగం 14 కిలోమీటర్ వద్ద ఈ నెల 22వ తేదీన ప్రమాదం జరిగింది. టన్నెల్ బోరింగ్ మెషీన్‌తో పనులు ప్రారంభించగానే.. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు సొరంగమంతా ఊగిపోయింది. పైభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి 40 మంది కార్మికులు సురక్షితంగా బయటపడగా.. మరో ఎనిమిది మంది లోపలే చిక్కుపోయారు. అప్పటి నుంచి సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాయి. ఉబికి వచ్చిన నీటితో మట్టి తడిసి ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఐదు రోజులు గడిచినా.. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. నీరుందని, పూడిక చాలా ఎత్తులో పేరుకుపోయిందని, శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యల్ని చేపడుతూ వచ్చారు. ఈ క్రమంలో సొరంగంలో పేరుకుపోయిన మట్టిని, నీటిని తొలగిస్తూ వచ్చారు. సహాయక చర్యలకు అడ్డుగా ఉన్న బోరింగ్ మెషిన్, ఇతర పరికరాలను ఢ్రిల్లింగ్ చేసి తొలగించి ముందుకు సాగారు. అయితే భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతూ వచ్చాయి. మరోవైపు.. టన్నెల్ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉండడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలను సహాయక బృందాలు విరమించుకున్నాయి. ఈ క్రమంలో..మంగళవారం రాత్రి ఘటనాస్థలానికి 15 మీటర్ల వరకు సహాయక బృందాలు(Rescue Teams) చేరుకున్నాయి. అక్కడంతా బురద, మట్టి పెల్లలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీ, ఎన్డీఎఫ్, ఎస్డీఎఫ్ టీమ్‌లతో పాటు వెళ్లిన కార్మికులు ఆక్సిజన్ అందకపోవడంతో హుటాహుటిన వెనక్కి వచ్చేశారు. ఈ ఉదయం ఆక్సిజన్ సాయంతో ఘటనా స్థలానికి మరింత చేరువగా వెళ్లారు. దాదాపు ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గురువారం నాటికి జీరో పాయింట్‌కు చేరుకోగలిగారు. అయితే కార్మికుల ఇంకా తెలియకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రసుత్తం ప్రమాద స్థలంలో భారీగా బురద పేరుకుపోవడంతో దానిని తొలగించే పనులు కొనసాగిస్తున్నారు. -
SLBC టన్నెల్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
SLBC వద్దకు ఆపరేషన్ మార్కోస్ టీమ్.. ప్రస్తుత పరిస్థితి ఇలా..
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ఆపరేషన్ మార్కోస్ టన్నెల్ రంగంలోకి దిగుతోంది. మరికాసేపట్లో టన్నెల్ వద్దకు ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్ రానుంది.ఈ కమాండ్స్ నేల, నీరు, ఆకాశంలో రెస్క్యూ కార్యక్రమాలు చేపడతారు. ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో కార్మికులు బయటకు వస్తారని అందరూ ఆశిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగంపై నుంచి కాని, పక్క నుంచి కానీ.. వెళ్లే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టన్నెల్ బురదమయం..ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కాపాడేందుకు సహాయచర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ సహా పలు సహాయక బృందాలు వారి వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు సహాయక బృందాలు 13.5 కిలోమీటర్ల వరకు మాత్రమే చేరుకున్నాయి. అక్కడ.. ధ్వంసమైన టీబీఎం పరికరాలు ఉండటంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు.. 11.5 కి.మీ నుంచి ఎయిర్ సప్లయ్ పైప్‌లైన్ వ్యవస్థ ధ్వంసమైంది. జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ నిపుణులు బురద పరిస్థితిపై అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం టన్నెల్లో 200 మీటర్ల వరకు 15 అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది. గంటకు 3600 నుంచి 5000 లీటర్ల ఊట వస్తోంది. సొరంగ మార్గంలో 10వేల క్యూబిక్ మీటర్ల బురద ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్‌తో గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశముందని చెబుతున్నారు.ఎస్ఎల్బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు ఉండటంతో అక్కడ అడుగు వేయడానికి వీలులేకుండా ఉందని నిర్ధారించారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలకు సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. కూలిపోయే ప్రమాదం.. అక్కడి పరిస్థితిని రెస్క్యూ టీం సభ్యులు వీడియో తీశారు. ‘ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది.. పైకప్పునకు క్రాక్ వచ్చింది. కూలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి వెంటనే వెనక్కి వెళ్దాం పదండి..’ అంటూ రెస్క్యూ టీం సభ్యులు వీడియోలో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ బృందం తిరిగి బయటకు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సొరంగంలోకి వెళ్లిన ఐదో రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి 40 మీటర్ల సమీపం వరకే వెళ్లగలిగింది. -
ఎస్ఎల్బీసీ సొరంగం.. మళ్లీ కూలింది!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలింది! లోపల పేరుకుపోయిన మట్టి, శిథిలాల ఎత్తు మరో మీటరు మేర పెరిగిపోయింది. దానికితోడు నీటి ఊట ఆగకుండా కొనసాగుతోంది. దీనితో సహాయక చర్యల కొనసాగింపు మరింత కష్టంగా మారింది. సొరంగంలో చిక్కుకుపోయిన వారి కోసం చేపట్టిన ఐదో రెస్క్యూ ప్రయత్నమూ విఫలమైంది. దీనితో బాధితుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కసారిగా కూలిపడటంతో.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా 43.93 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట (ఇన్లెట్) వద్ద నుంచి 13.94 కిలోమీటర్ల లోపలి వరకు తవ్వకం పూర్తయింది. అక్కడ పనులు చేస్తుండగా శనివారం ఉదయం 8.30 గంటలకు సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు/ఉద్యోగులు గల్లంతయ్యారు. వారిని రక్షించడానికి ఆదివారం మధ్యాహ్నం వరకు చేసిన 3 ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. నాలుగో ప్రయత్నంగా ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు సొరంగం లోపలికి వెళ్లిన రెస్క్యూ బృందం సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బయటికి వచ్చింది. ఐదో ప్రయత్నంగా సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మరో రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది. సొరంగం కూలిన ప్రాంతంలో ఆదివారంతో పోలి్చతే సోమవారం నాటికి మట్టి, శిథిలాల ఎత్తు, పరిమాణం గణనీయంగా పెరిగాయి. దీనితో అక్కడే మరోసారి సొరంగం పైకప్పు కూలి ఉంటుందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. సొరంగం లోపల 200–250 మీటర్ల మేర 15–20 అడుగుల ఎత్తులో మట్టి, శిథిలాలు పేరుకుపోయి ఉన్నట్టు చెబుతున్నారు. నేడు మరో ప్రత్యేక బృందం ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, ఇతర సిబ్బంది మొత్తం కలిపి మొత్తం 584 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున విపత్తుల నిర్వహణ, ఉపరితల రవాణా శాఖలకు చెందిన నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం మంగళవారం ఉదయానికల్లా టన్నెల్ వద్దకు చేరుకునే అవకాశం ఉంది. పైనుంచి రంధ్రం చేయడానికి జీఐఎస్ నో ఎల్‌ఎస్‌బీసీ సొరంగాన్ని భూగర్భంలో 400 మీటర్ల దిగువన నిర్మిస్తున్నారు. దీనితో ఆ మేరకు భూఉపరితలం నుంచి సొరంగం వరకు రంధ్రం చేసి కార్మీకులను బయటికి తీసుకువచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరిపింది. కానీ సొరంగాన్ని పరిశీలించిన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) నిపుణుల బృందం ఈ ఆలోచనకు నో చెప్పింది. సొరంగంపై తీవ్ర ఒత్తిడి ఉందని, భూఉపరితలం నుంచి సొరంగం దాకా రంధ్రం వేసేందుకు ప్రయత్నిస్తే మరింతగా కుప్పకూలుతుందని ఐదో రెస్క్యూ బృందంతో కలిసి లోపలికి వెళ్లి వచ్చిన జీఎస్ఐ జియాలజిస్టులు తేల్చారు. మట్టి, శిథిలాల తొలగింపుపై రెస్క్యూ బృందానికి వీరు చేసే సూచనలు కీలకంగా మారనున్నాయి. సొరంగంలోకి రాకపోకలకే 4 గంటలు.. గల్లంతైన కార్మీకుల జాడ దొరక్కపోయినా సొరంగం లోపలి పరిస్థితులపై ఇప్పుడు స్పష్టమైన అవగాహన ఏర్పడిందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. తొలుత కేవలం లోపలి పరిస్థితిని దూరం నుంచి మాత్రమే అంచనా వేయగలిగామని.. నాలుగు, ఐదో ప్రయత్నంలో సొరంగం కూలిన చోట పేరుకున్న మట్టి, శిథిలాల సమీపం వరకు రెస్క్యూ బృందాలు చేరుకోగలిగాయని వివరించారు. లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్లిరావడానికే మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోందని వెల్లడించారు. నిరంతరం కొనసాగుతున్న నీటి ఊట సొరంగంలో నీరు నిరంతరం ఊరుతూ, కూలిన ప్రాంతాన్ని నింపేస్తోంది. ఇన్లెట్ నుంచి లోపలికి వెళ్లే నీరు గ్రా>విటీ ద్వారా అవుట్లెట్ వైపు వెళ్లేలా సొరంగాన్ని వాలుగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు తవి్వన మేరకు సొరంగం కూలిన ప్రాంతమే చివరిది కావడంతో.. ఊట నీళ్లు అక్కడే పేరుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీనితో నిరంతరంగా ఆ నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నారు. కార్మీకుల కుటుంబాల్లో ఆందోళన.. నేడు సర్కారు కీలక ప్రకటన? ప్రమాదం జరిగి సోమవారం అర్ధరాత్రి సమయానికి సుమారు 65 గంటలు దాటింది. కానీ సొరంగంలో గల్లంతైనవారి జాడ తెలియరాలేదు. దీనితో కార్మీకుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. సోమవారం ఇద్దరు కార్మీకుల కుటుంబ సభ్యులు సొరంగం వద్ద చేరుకుని.. తమవారి సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కార్మీకుల యోగక్షేమాలపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సొరంగం లోపలికి డ్రోన్, మినీ జేసీబీ.. నీళ్ల కింద ఉన్న వస్తువులను గుర్తించే సోనార్ టెక్నాలజీ ఆధారంగా కార్మీకుల జాడను తెలుసుకునేందుకు ఆదివారం ప్రయతి్నంచగా.. ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. నీటిలో మనుషుల రక్తం, అవశేషాలను గుర్తించే పోలీసు జాగిలాలు (స్నిఫర్ డాగ్స్)ను సొరంగంలోకి తీసుకెళ్లినా.. ప్రమాద స్థలంలో నీరు, బురద ఉండటంతో ముందుకు వెళ్లలేకపోయాయి. చివరిగా ఐదో రెస్క్యూ బృందంతో ఒక అత్యధునిక డ్రోన్, ఇద్దరు ఆపరేటర్లను సొరంగం లోపలికి పంపించారు. రెస్క్యూ బృందాలు వెళ్లలేని చోట్ల దీనితో జరిపే పరిశీలన ఆధారంగా లోపలి పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక సొరంగం కూలిన చోట పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగించడానికి సోమవారం లోకో ట్రైన్ సాయంతో మినీ జేసీబీని లోపలికి పంపించారు. దీనితో మట్టి, శిథిలాల తొలగింపు చర్యల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రమాదంలో దెబ్బతిన్న కన్వేయర్ బెల్ట్‌కి సైతం మరమ్మతులు ప్రారంభించారు. మట్టి, శిథిలాలను కన్వెయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయక చర్యల్లో ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ నేతృత్వంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, నాగర్‌కర్నూల్ జిల్లా మాజీ కలెక్టర్ ఇ.శ్రీధర్‌లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల బృందం మూడు రోజులుగా సొరంగం వద్ద మకాం వేసి నిరంతరంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి రెస్క్యూ బృందాలతో నిరంతరం సమీక్షిస్తూ.. సహాయక చర్యలపై దిశానిర్దేశం చేస్తోంది. సొరంగంలోకి ‘ర్యాట్ హోల్ మైనర్స్’ సొరంగంలో సహాయక చర్యల్లో మరో ప్రయత్నంగా మరో రెస్క్యూ బృందం ‘ర్యాట్ హోల్ మైనర్స్’తో కలసి లోపలికి వెళ్లింది. ఉత్తరాఖండ్‌లోని సిలి్కయార సొరంగం 2023 నవంబర్‌లో కుప్పకూలింది. దానిలో లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను 17 రోజుల తర్వాత ర్యాట్ హోల్ మైనర్స్ బృందం బయటికి తీసుకురాగలిగింది. దీంతో ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యల కోసం ‘ర్యాట్ హోల్ మైనర్స్’ను ప్రభుత్వం రప్పించింది. ఈ బృందం సొరంగంలో, పేరుకుపోయిన మట్టిలో ఎలుక బొరియల తరహాలో రంధ్రాలు చేసి లోపలికి వెళ్లి కార్మీకులను బయటకి తీసుకువచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అయితే సొరంగం రెండో వైపు పూర్తిగా మూతబడి ఉండటం, పెద్ద మొత్తంలో ఊట నీరు ఆ ప్రాంతాన్ని ముంచెత్తి ఉండటంతో ‘ర్యాట్ హోల్’ విధానంలో రెస్క్యూ ఆపరేషన్ శ్రేయస్కరం కాదనే భావన వ్యక్తమవుతోంది. అయితే ర్యాట్ హోల్ మైనర్లు సొరంగంలో ఏ వ్యూహాన్ని అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. వారు సొరంగం నుంచి బయటికి వస్తే ఈ అంశంపై స్పష్టత రానుంది. ఇక మంగళవారం ఉదయానికల్లా మరో ‘ర్యాట్ హోల్ మైనర్స్’ బృందం టన్నెల్ వద్దకు చేరుకోంది. -
SLBC టన్నెల్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు
-
ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్
-
టన్నెల్ లోనే చిక్కుకుపోయిన మరో 8 మంది
-
ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లోకి నేవీ సిబ్బంది
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. 36 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ప్రమాద స్థలానికి 50 మీటర్ల చేరువగా వెళ్లగలిగిన ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్50 మీటర్లకు మించి ెవెళ్లలేకపోతున్న ఆర్మీ, ఎన్డీఆర్ఎప్, ైహైడ్రా సిబ్బందిాభారీగా మట్టి, బురద ేపేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకంప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లోకి నేవీ సిబ్బందిరాత్రికి ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు చేరుకోనున్న నేవీ సిబ్బందిసహాయక చర్యలు కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశం ఎస్ఎల్బీసీ సొరంగంలో మంత్రి జూపల్లి కృష్ణారావుఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్ లో టన్నెల్ లోకి వెళ్లిన మంత్రిమధ్యాహ్నం 1 గంట నుంచి ఆరు గంటలుగా సొరంగంలోనే జూపల్లిప్రమాద స్థలం దగ్గర నుంచి ఇంజనీరింగ్ అధికారులు, ఎజెన్నీ ప్రతినిధులతో ఇంటర్ కాం ఫోన్ లో మాట్లాడిన మంత్రి జూపల్లిస్వయంగా సహాయక చర్యల్లో పాలుపంచుకున్న మంత్రిసోరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు లోపల జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న మంత్రిప్రమాదం జరిగిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రిఇంజనీరింగ్, సహాయక బృందాలకు మంత్రి దిశానిర్ధేశంబయట నుంచి ప్రమాదస్థలికి సొరంగంలో మధ్య దూరం 13.5 కి.మీరెస్క్యూ బృందంలో ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలుటన్నెల్ సైట్ దగ్గర 23 మంది ఆర్మీ నిపుణులుఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలుప్రమాద స్థలిలో మట్టి, బురద నీరు ఎక్కువగా ఉంది: కలెక్టర్ సంతోష్రెస్క్యూ టీమ్ లోపలికి వెళ్లేందుకు ఆటంకం ఏర్పడిందిభారీ మోటార్ల ద్వారా నీటిని బయటకి పంపుతున్నాంప్రమాదంలో చిక్కుకున్న వారి కనెక్టివిటీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ావాడుతున్నాం రేవంత్‌కు రాహుల్ ఫోన్..SLBC ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన రాహుల్ గాంధీసొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరాదాదాపు 20 నిమిషాలు వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివెంటనే ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో తెలిపిన సీఎంమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంఘటన స్థలానికి చేరుకొని తరలించడం, NRDF, SRDF రెస్క్యూ స్క్వాడ్లను మోహరించామన్న రేవంత్గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్న సీఎంప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిరంతర పర్యవేక్షణను అభినందించిన రాహుల్ గాంధీ మంత్రి ఉత్తమ్ కామెంట్స్.. టన్నెల్ చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం. రాత్రి నుంచి కేంద్ర బృందాలు రాష్ట్ర బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేసింది. 14 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్ళగలిగాం. టెన్నెల్ బోర్ మెషిన్ లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. టన్నెల్ నీటిమయం..ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, సీనియర్ ఐఏఎస్ శ్రీధర్.మరోసారి తన లోపలికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందం.12వ కిలోమీటర్ నుంచి పూర్తిగా బురదమయం.నీటితో కూడుకున్న టన్నెల్.నీటిని బయటికి తీసేందుకే సమాలోచనలు.నీరంతా బయటకి తోడిన తర్వాతే భవిష్యత్తు సహాయక చర్యలు చేపట్టే అవకాశం.వారంతా ప్రాణాలతో ఉన్నారా? లేదా?లోపలికి ఆక్సిజన్ అందుతోందా?.అనే అనుమానాలు వ్యక్తమువుతున్నాయి. రాత్రి పరిస్థితి ఇది..👉ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్న రాత్రి 12 గంటలకు వరకు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 12 కిలోమీటర్ల లోపలికి వెళ్లి పరిస్థితిని అంచనా వేశారు. ఈ సందర్బంగా మోకాళ్ల లోతు బురద ఉన్నట్టు వారు గుర్తించారు. 👉ఇక, ఈ సొరంగానికి ఇన్లెట్ తప్ప ఎక్కడా ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. చిక్కుకున్నది వీరే.. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. జేపీ సంస్థకు చెందిన మనోజ్‌కుమార్ (పీఈ), శ్రీనివాస్ (ఎస్ఈ), రోజువారీ కార్మికులు సందీప్‌సాహు (28), జక్తాజెస్ (37), సంతోష్‌సాహు (37), అనూజ్ సాహు (25) ఉన్నారు. రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్ (35), గురుదీప్ సింగ్ (40) సొరంగం లోపల విధుల్లో ఉన్నారు. జమ్మూ, పంజాబ్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు సొరంగంలో కొంతకాలంగా పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బయటపడిన వారు కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వారే.మంత్రుల పర్యవేక్షణ..👉మరోవైపు.. దోమలపెంట వద్దకు నేడు మంత్రులు ఉత్తమ్, జూపల్లి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలను మంత్రులు పర్యవేక్షించనున్నారు.ఇటీవలే పనులు పునః ప్రారంభమై... 👉శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్ఎల్బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్ ఇన్లెట్) నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. 👉ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్ ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. నీటి ఊట పెరిగి.. కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపోయి.. 👉శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్‌బోల్ట్, కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్‌కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్‌కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. వేగంగా సహాయక చర్యలు చేపట్టినా..👉సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది. -
కుప్పకూలిన సొరంగం
సాక్షి, నాగర్‌కర్నూల్/ సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. ఘటన విషయం తెలిసిన సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు టన్నెల్ వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతామని, పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇటీవలే పనులు పునః ప్రారంభమై... శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్ఎల్బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్ ఇన్లెట్) నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్ ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. నీటి ఊట పెరిగి.. కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపోయి.. ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్‌బోల్ట్, కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్‌కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్‌కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. వేగంగా సహాయక చర్యలు చేపట్టినా...: సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది. ఈ సొరంగానికి ఇన్లెట్ తప్ప ఎక్కడా ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న మంత్రులు సొరంగం ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. సహాయక చర్యలను పరిశీలించారు. నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతో‹Ù, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు క్షేత్రస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కిషన్‌రెడ్డి ఫోన్ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించాలని, కేంద్రం నుంచి అన్నిరకాల సహాయం అందించాలని కోరారు. అమిత్ షా సానుకూలంగా స్పందించారని.. హైదరాబాద్ నుంచి ఒకటి, విజయవాడ నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రమాద స్థలానికి పంపారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇక సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.శరవేగంగా సహాయక చర్యలు: సీఎం రేవంత్ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గాయపడిన కార్మీకులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించా రు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తనకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఇక ఈ అంశంపై శనివారం రాత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ప్రమాదం ఘటన, సహాయక చర్యల పరిస్థితి, ఇతర అంశాలను సీఎంకు మంత్రి ఉత్తమ్ వివరించారు.పూర్తి సహకారం అందిస్తాం: ప్రధాని మోదీ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మీకులను కాపాడేందుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని సీఎం రేవంత్ వివరించారు. దీనితో కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, సహాయక చర్యల కోసం సత్వరమే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని మోదీ హామీ ఇచ్చారు. -
అసోం: ఇంకా బొగ్గు గనిలోనే కార్మికులు!
దిస్పూర్: అసోంలోని బొగ్గుగని ప్రమాదంలో రెండు రోజులు గడిచినా.. ఇంకా కార్మికుల జాడ కానరావడం లేదు. ఈ క్రమంలో ఈ ఉదయం గని నుంచి ఓ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తెచ్చాయి. దీంతో.. మిగిలిన కార్మికుల ఆచూకీపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే అధికారులు మాత్రం గాలింపు చర్యలను ముమ్మరం చేయించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం (జనవరి 7) అసోం దిమాహసావో జిల్లాలోని ఓ బొగ్గుగనిలోకి సోమరాత్రి ఒక్కసారికి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరింది. సుమారు 100 ఫీట్ల నీరు గనిలోపల ముంచెత్తింది. దీంతో గనిలో ఉన్న వారిలో ముగ్గురు జలసమాధై కనిపించారు. మరికొంత మంది లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు సహాయక చర్యల్లో(Rescue Operations) పాల్గొంటున్నాయి. మరోవైపు.. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్స్ బృందం మైన్ వద్ద రెక్కీ నిర్వహించి, ఆపై రంగంలోకి దిగింది. అయితే గనిలో ప్రతికూల పరిస్థితులు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఒకానొక టైంలో తొలుగు గుర్తించిన మూడు మృతదేహాలను బయటకు తీయడం కూడా కష్టమైంది. గని నుంచి నీటిని బయటకు పంపి.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.అయితే ప్రమాద సమయంలో లోపల 15 మంది కార్మికులు ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికారులు మాత్రం తొమ్మిది మంది పేర్లను మాత్రమే ప్రకటించారు. వీళ్లులో ఒకరు ఈ ఉదయం మృతదేహాంగా బయటకు వచ్చారు. మిగిలినవాళ్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ కార్మికులు అసోం, పశ్చిమ బెంగాల్, నేపాల్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. గనిలో సుమారు 340 ఫీట్ల లోపల వాళ్లు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సదరు గనికి అనుమతులు లేవని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం హిమంత బిస్వ శర్మ(Himanta Biswa sharma) స్వయంగా ప్రకటించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు ఒకరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారాయన. అలాగే రెస్క్యూ ఆపరేషన్‌లో కోల్‌మైన్ సహకారం కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తోనూ మాట్లాడినట్లు తెలిపారాయన. ఇదీ చదవండి: ముగ్గురు పోరాడినా.. పోటీ ఇద్దరి మధ్యే! -
కర్ణాటకలో బోరుబావిలో పడ్డ బాలుడు సురక్షితం
బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో బోరుబావిలో పడ్డ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు 20 గంటలపాటు సంయుక్త రెస్క్యూ ఆపరేషన్‌తో శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. గురువారం మధ్యాహ్నాం ఆ బాలుడ్ని బయటకు తీసుకొచ్చాయి. ముందుజాగ్రత్తగా చిన్నారిని ఆస్పత్రికి తరలించాయి. విజయపుర జిల్లా లచయానా గ్రామంలో.. సతీష్ ముజగొండ అనే వ్యక్తి తన పొలంలో బోరు బావిని తవ్వించాడు. బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు అతని ఏడాదిన్నర వయసున్న కొడుకు సాత్విక్. దాదాపుగా 16 అడుగుల లోతున ఆ చిన్నారి పడినట్లు గుర్తించి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు అధికారులు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు గంటల తరబడి శ్రమించాయి. బాలుడు మరింత లోపలికి జారిపోకుండా చూసుకుంటూనే.. పైపుల ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తూ వచ్చాయి. అదే సమయంలో గ్రామస్తులంతా సాత్విక్ క్షేమంగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు స్థానికులు చేశారు. చివరకు.. అందరి ప్రార్థనలు ఫలించి బాలుడు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మరో రెండు గంటలు అదనం.. బుధవారం సాయంత్రం 6గం.30 ని. ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. తొలుత అధికారులు ఒక కెమెరాను చిన్నారి ఇరుక్కుపోయిన స్పాట్‌కు పంపించి చిన్నారి కదలికల్ని పరిశీలించారు. వాస్తవానికి 18 గంట్లోలపే సహాయక బృందాలు చిన్నారిని చేరుకున్నాయి. కానీ, రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో తవ్వి బయటకు తీయడానికి మరో రెండు గంటల టైం పట్టింది. #WATCH | Karnataka: After 20 hours of rescue operation, NDRF and SDRF teams have succeeded in rescuing a 1.5-year-old child who fell into an open borewell in the Lachyan village of Indi taluk of the Vijayapura district. (Source: SDRF) https://t.co/0zWcT99XI5 pic.twitter.com/pZ8IJP8i8s — ANI (@ANI) April 4, 2024 -
భారత నేవీ మరో సాహసం.. 23 మంది పాకిస్థానీలను కాపాడి..
భారత నేవీ మరో సాహసం చేసింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన చేపల బోటులో ఉన్న 23 మంది పాకిస్థానీయులను కాపాడింది. కాగా, సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు భారీ నేవీ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో దేశాలతో సంబంధం లేకుండా సముద్ర, నావికుల భద్రత విషయంలో ఎల్లప్పుడూ కట్టుబడిఉన్నట్లు నేవీ ప్రకటించింది. వివరాల ప్రకారం.. ఇతర దేశాల నౌకలు ఆపదలో ఉన్న ప్రతీసారి మేము ఉన్నామంటూ భారత నేవీ ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే నేవీ అధికారులు మరో సహాసం చేశారు. అరేబియాలోని గల్ఫ్ ఏడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీపసమూహానికి 90 నాటికల్ మైళ్ల దూరంలో గురువారం ఇరాన్‌కు చెందిన చేపల బోటు హైజాక్‌కు గురైంది. తొమ్మిది మంది సముద్ర పైరేట్స్ పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. #IndianNavy Responds to Piracy Attack in the #ArabianSea. Inputs received on a potential piracy incident onboard Iranian Fishing Vessel 'Al-Kambar' late evening on #28Mar 24, approx 90 nm South West of Socotra. Two Indian Naval ships, mission deployed in the #ArabianSea for… pic.twitter.com/PdEZiCAu3t — SpokespersonNavy (@indiannavy) March 29, 2024 దీంతో, ఆ బోటును, సిబ్బందిని రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నట్లు భారత నేవీ శుక్రవారం రాత్రి ప్రకటించింది. దీంతో తొలుత ఐఎన్ఎస్ సుమేధా సముద్రపు దొంగల అదుపులో ఉన్న ‘ఏఐ కంబార్’ బోటును అడ్డగించింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ త్రిశూల్ నౌక దానికి తోడైంది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్ అనంతరం బోటులో ఉన్న పైరేట్లు లొంగిపోయారు. 23 మంది పాకిస్థానీయులు సురక్షితంగా బయటపడ్డట్లు నేవీ పేర్కొంది. ఇక, రక్షించిన బోటును సురక్షిత రక్షిత ప్రాంతానికి తరలించడానికి భారత్ నేవీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. -
హౌతీల దాడి.. భారత యుద్ధనౌక సాహసం
గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి.. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పలువురిని భారత యుద్ద నౌక కాపాడింది. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో యెమెన్ హౌతీ రెబల్స్ జరిపిన క్షిపణి దాడుల్లో బార్బడోస్ నుంచి బయల్దేరిన వాణిజ్య నౌక ఘోరంగా దెబ్బతింది. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. గాయపడిన వాళ్లతో పాటు మిగిలిన సిబ్బంది బిక్కుబిక్కుమంటూ నౌకలోనే గడిపారు. ఆ సమయంలో శరవేగంగా స్పందించిన ఐఎన్ఎస్ కోల్‌కతా.. 21 మందిని రక్షించడంతో పాటు వాళ్లకు అత్యవసర చికిత్సను సైతం అందించింది. ఈ వివరాలను భారత నేవీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. #IndianNavy's swift response to Maritime Incident in #GulfofAden. Barbados Flagged Bulk Carrier MV #TrueConfidence reported on fire after a drone/missile hit on #06Mar, approx 54 nm South West of Aden, resulting in critical injuries to crew, forcing them to abandon ship.… pic.twitter.com/FZQRBeGcKp — SpokespersonNavy (@indiannavy) March 7, 2024 ఇందుకోసం ఐఎన్‌ఎస్‌లోని హెలికాప్టర్, బోట్ల సర్వీసులను ఉపయోగించినట్లు తెలిపింది. నేవీ రక్షించిన వాళ్లలో.. ఓ భారతీయుడు కూడా ఉన్నాడట. మరోవైపు గత కొన్నివారాలుగా పశ్చిమ హిందూ మహాసముద్రంలో భారత నావికా దళం వాణిజ్య నౌకలకు రక్షణగా తన వంతు పహరా కాస్తోంది. ఇదిలా ఉంటే.. యూరప్‌తో ఆసియా, మిడిల్ ఈస్ట్‌ను కలిపే ఈ ప్రధాన మార్గంలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నవంబర్ చివరి వారం నుంచి హౌతీలు ఇక్కడ దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో.. జనవరి నుంచి ప్రతిగా అమెరికా వైమానిక దాడులకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన రంగంతో పాటు వర్తక వాణిజ్యలపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కాకినాడ తీరంలో కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. కోస్ట్ గార్డ్ ఆపరేషన్‌తో 11 మంది మత్స్యకారులను కోస్ట్‌గార్డ్ సిబ్బంది కాపాడారు. -
Uttarkashi tunnel collapse rescue: పీడకల... అగ్నిపరీక్ష
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికిన 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి క్షేమంగా బయటకు వచ్చారు. సొరంగంలో తమకు ఎదురైన భయానక అనుభవాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్న తీరును పలువురు కార్మికులు బుధవారం మీడియాతో పంచుకున్నారు. సొరంగంలో తామంతా కష్టసుఖాలు కలబోసుకున్నామని, మిత్రులుగా మారామని చెప్పారు. ఆడిన ఆటలు, పాడుకున్న పాటల గురించి తెలియజేశారు. సొరంగంలో చిక్కుకున్నప్పుడు ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని జార్ఖండ్‌లోని ఖిరాబేడా గ్రామానికి చెందిన అనిల్ బేడియా(22) అనే కార్మికుడు వెల్లడించాడు. ‘‘నవంబర్ 12న సొరంగంలో మేము పనిలో ఉండగా, హఠాత్తుగా కొంత భాగం కూలిపోయింది. భారీ శబ్ధాలు వినిపించాయి. మేమంతా లోపలే ఉండిపోయాం. బయటకు వచ్చే దారి కనిపించలేదు. ఎటు చూసినా చిమ్మచీకటి. అక్కడే సమాధి కావడం తథ్యమని అనుకున్నాం. మొదటి రెండు రోజులపాటు బతుకుతామన్న ఆశ లేకుండాపోయింది. క్రమంగా ధైర్యం కూడదీసుకున్నాం. బయట పడడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ముందు ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం. నిజంగా అదొక పీడకల, అగ్ని పరీక్ష. సొరంగం పైభాగంలోని రాళ్ల సందుల నుంచి పడుతున్న ఒక్కో చుక్క నీటిని ఒడిసిపట్టుకొని చప్పరించాం. మా దగ్గరున్న బొరుగులతో 10 రోజులపాటు కడుపు నింపుకున్నాం. అర్ధాకలితో గడిపాం. ఆ తర్వాత అధికారులు పైపు గుండా పండ్లు, భోజనం, నీళ్ల సీసాలు మాకు అందించారు. ప్రమాదం జరిగాక 70 గంటల తర్వాత అధికారులు మాతో మాట్లాడారు. అప్పుడే ప్రాణాలపై మాలో ఆశలు మొదలయ్యాయి. మేమంతా కలిసి నిత్యం దేవుడిని ప్రార్థించేవాళ్లం. చివరకు దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు. మొదట్లో కష్టంగా గడిచింది సొరంగంలో తాము చిక్కుకున్నట్లు తెలియగానే ఆందోళనకు గురయ్యామని ఉత్తరాఖండ్‌లోని చంపావత్ గ్రామానికి చెందిన పుష్కర్‌సింగ్ ఐరే అనే కార్మికుడు చెప్పాడు. మొదట్లో చాలా కష్టంగా గడిచిందని, చనిపోతామని అనుకున్నామని, క్రమంగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డామని తెలిపాడు. తొలుత సరైన ఆహారం లేదు, బయటున్నవారితో మాట్లాడే వీలు లేదని అన్నాడు. ఒంటిపై ఉన్న బట్టలతోనే 17 రోజులపాటు ఉండాల్సి వచి్చందని, స్నానం చేయలేదని, సొరంగం లోపలంతా అపరిశుభ్రంగా మారిందని తెలియజేశాడు. ప్లాస్టిక్ షీట్లపై నిద్రించామని పేర్కొన్నాడు. ఆహారం, నీరు అందిన తర్వాత ఊపిరి పీల్చుకున్నామని చెప్పాడు. కాలక్షేపం కోసం పేకాడామని, కాగితాలను క్రమపద్ధతిలో చింపుతూ ఉండేవాళ్లమని వివరించాడు. సాక్సులతో బంతులు చేసి, చోర్–సిఫాయి ఆట ఆడామని, పాటలు పాడుకున్నాం తెలిపాడు. నిత్యం యోగా, వాకింగ్ చేశాం.. సొరంగం నుంచి బయటకు వచి్చన 41 మంది కార్మికులతో మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సొరంగంలో ఉన్నప్పుడు నిత్యం యోగా, వాకింగ్ చేశామని, తద్వారా మనోస్థైర్యం సడలకుండా జాగ్రత్తపడ్డామని, ఆత్మవిశ్వాసం పెంచుకున్నామని ప్రధానమంత్రికి కార్మికులు తెలియజేశారు. విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రమాదాల్లో చిక్కుకుంటే మన ప్రభుత్వం కాపాడిందని, స్వదేశంలోనే ఉన్న తామెందుకు భయపడాలని భావించామని అన్నారు. రిషికేశ్ ఎయిమ్స్‌కు కార్మికుల తరలింపు సిల్క్యారా టన్నెల్ నుంచి బయటకు వచి్చన కార్మికులను బుధవారం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు హెలికాప్టర్లో తరలించారు. డిజాస్టర్ వార్డులో చేర్చి, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మానసిక పరిస్థితి కూడా పరీక్షిస్తామని, అవసరమైన వారికి తగిన చికిత్స అందిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆరోగ్యం కుదుటపడిన వారిని ఇళ్లకు పంపిస్తామని వెల్లడించారు. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధులను కూడా సిల్క్యారా నుంచి బస్సుల్లో ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. కార్మికుల గ్రామాల్లో సంబరాలు ఖిరాబేడా గ్రామం నుంచి మొత్తం 13 మంది యువకులు సొరంగం పనుల కోసం ఉత్తరకాశీకి చేరుకున్నారు. అదృష్టం ఏమిటంటే వారిలో ముగ్గురు మాత్రమే సొరంగంలో చిక్కుకున్నారు. బాధితులుగా మారిన మొత్తం 41 మంది కార్మికుల్లో 15 మంది జార్ఖండ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. ఖిరాబేడాలో అనిల్ బేడియా తల్లి 17 రోజులపాటు తల్లడిల్లిపోయింది. కుమారుడు జాడ తెలియక ఆందోళనకు గురైంది. ఇంట్లో వంట చేసింది లేదు. ఇరుగు పొరుగు అందించిన భోజనంతో కడుపు నింపుకుంది. ఎట్టకేలకు కుమారుడు అనిల్ బేడియా సొరంగం నుంచి బయటకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్ బేడియా(55)కు పక్షవాతం. ఏకైక కుమారుడు రాజేంద్ర సొరంగం నుంచి బయటపడడంతో అతని ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రశంసలందుకున్న నాగపూర్ నిపుణుల సేవలు సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొన్నాయి. నిపుణులు తమవంతు సేవలందించారు. కార్మికులకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా, కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరగకుండా వీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ డబ్ల్యూసీఎల్కు నిపుణులు సొరంగం వద్దే మకాం వేశారు. భారీ యంత్రాలతో తవ్వకం పనులు చేపట్టడంతో సొరంగం లోపల కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతుండేవి. ప్రమాదకర స్థాయికి చేరగానే యంత్రాలను ఆపించేవారు. వారి సేవలు ప్రశంసలందుకున్నాయి. సొరంగంలో కార్మికులు భుజాలపై ఎత్తుకున్నారు ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల్లో ఢిల్లీకి చెందిన ఫిరోజ్ ఖురేïÙ, యూపీకి చెందిన మోను కూమార్ తొలుత సొరంగంలోని కార్మికుల వద్దకు చేరుకున్నారు. తమను చూడగానే కార్మికులు ఆనందంతో భుజాలపై ఎత్తుకున్నారని ఫిరోజ్ వెల్లడించాడు. ‘‘మాకు పండ్లిచ్చారు. పేర్లు అడిగారు. అరగంట పాటు సొరంగంలో ఉన్నాం’’ అని మోను కూమార్ చెప్పాడు. తాము కార్మికుల వద్దకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం వచ్చారని పేర్కొన్నాడు. కార్మికులను కాపాడినందుకు తాము డబ్బులేమీ తీసుకోలేదని తెలియజేశాడు. తల్లిదండ్రుల ఫొటో చూస్తూ కాలం గడిపా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరీ జిల్లా భైరాంపూర్కు చెందిన 25 ఏళ్ల మంజీత్ చౌహాన్ సిల్క్యారా టన్నెల్లో చిక్కకొని, 17 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. అతడి రాకతో స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. మంజీత్ తల్లిదండ్రులు భైరాంపూర్లో ఉంటున్నారు. అతడి సోదరుడు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రుల ఫొటో మంజీత్ వద్ద ఉంది. ఆ ఫొటో చూస్తూ ధైర్యం తెచ్చుకొని సొరంగంలో కాలం గడిపానని, ఒత్తిడిని అధిగమించానని చెప్పాడు. ‘‘సొరంగం లోపలిభాగం కూలిన సమయంలో అక్కడికి కేవలం 15 మీటర్ల దూరంలోనే పని చేస్తున్నాను. తొలుత అసలేం జరిగిందో అర్థం కాలేదు. క్రమంగా అది పీడ కలగా మారింది. ప్రమాదం జరిగాక మొదటి 24 గంటలు చాలా కష్టంగా గడిచాయి. మేమంతా భయందోళనకు గురయ్యాం. ఆకలి, దాహం, నీరసం, నిరాశ వంటివి అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నాలుగు అంగుళాల పైపు గుండా అధికారులు ఆహారం, నీరు పంపించిన తర్వాత మా మానసిక స్థితి మారింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలియడంతో మాలో మనోధైర్యం పెరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగాం. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని నాన్నకు చెప్పా. ఫోన్ వాల్‌పేపర్‌లో నా తల్లిదండ్రుల ఫొటో చూస్తూ ఉండిపోయేవాడిని. ప్రాణాలపై ఆశ కోల్పోకుండా అది ఉపయోగపడింది. సొరంగంలో అటూ ఇటూ నడుస్తూ ఉండేవాళ్లం. పైపు గుండా అధికారులు పంపించిన పప్పు నాకెంతో నచ్చింది. సొరంగంలో చిక్కుకున్న మేమంతా ఒకరికొకరం మంచి మిత్రులుగా మారిపోయాం. మా కష్ట సుఖాలు తెలియజేసుకున్నాం. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేకపోవడం పట్ల విచారంగా ఉంది. ఇంటికెళ్లిన తర్వాత మ్యాచ్ హైలైట్స్ చూస్తా’’ అని మంజీత్ చౌహాన్ ఉత్సాహంగా చెప్పాడు. సొరంగం పనులు కొనసాగుతాయి ఉత్తరాఖండ్‌లో 4.5 కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగం పనులు కొనసాగుతాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. కూలిపోయిన ప్రాంతంలో మరమ్మతులు, సేఫ్టీ ఆడిట్ ముగిసిన తర్వాత పనులు యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభంచిన 900 కిలోమీటర్ల ‘చార్ధామ్ యాత్ర ఆల్ వెదర్ రోడ్’ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా టెన్నల్‌ను నిర్మిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్‌ధామ్‌లో భాగమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను అనుసంధానించడానికి కేంద్రం రూ.12,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నాలుగు క్షేత్రాలను చుట్టిరావడానికి వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 డిసెంబర్ 27న శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2020 మార్చిలోగా ప్రాజెక్టు పూర్తికావాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జాప్యం జరుగుతోంది. కేబినెట్ భేటీలో మోదీ భావోద్వేగం సిల్క్యారా సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచి్చంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ మంగళవారం రాత్రి సమావేశమైంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను తలచుకొని ప్రధానమంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం చెప్పారు. కార్మికులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు స్వయంగా ఆరా తీశారని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. దేశ విదేశాల్లోని భారతీయులను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు. -
ఉత్తరకాశీలో టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను రక్షించటంపై సీఎం వైఎస్ జగన్ హర్షం
-
'అది కోట్ల ఆశల విజయం'.. దిగ్గజ వ్యాపారవేత్తల స్పందన
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ గ్రూప్‌నకు చెందిన హర్ష్ గోయెంకా, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా మంగళవారం ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ ఆపరేషన్ విజయవంతం కావడంతో స్పందించారు. ఉత్తరాఖండ్‌లో 17 రోజుల తర్వాత 41 మంది కార్మికులను సురక్షితంగా రక్షించడంతో ఆపరేషన్ పూర్తయింది. నవంబర్ 12న సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంతో కార్మికులు 17 రోజుల పాటు అందులోనే చిక్కుకుపోయారు. దాంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. చివరకు మంగళవారం అందరినీ విజయవంతంగా బయటకుతీశారు. దాంతో దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు రెస్క్యూ సిబ్బంది, కార్మికులకు అభినందనలు తెలిపారు. రెస్క్యూ వర్కర్లకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తన ఎక్స్ ఖాతా ద్వారా సెల్యూట్ చేశారు. ఈ పోరాటంలో కోట్లాది మంది దేశప్రజల ఆశ ఫలించిందని ఆయన అన్నారు. 17 రోజుల పాటు ధైర్యం కోల్పోకుండా తిరిగి వచ్చిన 41 మంది కార్మికుల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో సహా ఈ రెస్క్యూ మిషన్‌లో భాగంమైన అందరికీ అభినందనలు చెప్పారు. దేశ ప్రగతికి బాటలు వేసే ఈ కార్మిక సోదరులందరికీ మెరుగైన ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. जीवन और मृत्यु के मैराथन संघर्ष के बीच यह करोड़ों देशवासियों के ‘उम्मीद’ की जीत है। 17 दिन तक एक सुरंग से बिना हिम्मत हारे वापिस लौटने वाले सभी 41 श्रमिकों के आत्मबल को मेरा प्रणाम। NDRF और SDRF की टीमों समेत इस रेस्क्यू मिशन को सफल बनाने वाले हर एक सदस्य को साधुवाद। हम देश की… — Gautam Adani (@gautam_adani) November 28, 2023 మహీంద్రా గ్రూప్ ఛైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా ఈ సంఘటనపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ విజయవంతం కావడంలో 'రాథోల్ మైనర్ల' పాత్రను ప్రశంసించారు. అధునాతన డ్రిల్లింగ్ పరికరాల తర్వాత, వీరు కీలకంగా మారి చివరి నిమిషంలో కార్మికులను కాపాడారని కొనియాడారు. ఆస్ట్రేలియాకు చెందిన భూగర్భ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ రెస్క్యూ పరిస్థితిని వివరించినందుకు అభినందనలు తెలిపారు. And after all the sophisticated drilling equipment, it’s the humble ‘rathole miners’ who make the vital breakthrough! It’s a heartwarming reminder that at the end of the day, heroism is most often a case of individual effort & sacrifice. 🙏🏽👏🏽👏🏽👏🏽🇮🇳 #UttarakhandTunnelRescue pic.twitter.com/qPBmqc2EiL — anand mahindra (@anandmahindra) November 28, 2023 ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్పర్సన్ హర్ష్ గోయెంకా కూడా 41 మంది ప్రాణాలను కాపాడటంలో శ్రమించినందుకు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఇండియాకు వ్యతిరేకంగా రన్నులు కొట్టారన్నారు. కానీ అదే దేశానికి చెందిన డిక్స్ మాత్రం ఇండియాలోని 41 మంది కార్మికులను కాపాడేందుకు శ్రమించారని తెలిపారు. #Maxwell digs a hole against India #INDvsAUS But hey, an Aussie led a different kind of dig saving 41 lives! 💪 My gratitude to NDRF , SDRF, Army, our rat miners and all those involved in this incredible rescue mission. 🇮🇳🇮🇳 #UttarakhandTunnelRescue — Harsh Goenka (@hvgoenka) November 28, 2023 బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా రెస్క్యూ వర్కర్లను ప్రశంసించారు. కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డానికి వీరోచితంగా పోరాడిని సిబ్బందిని చూసి దేశం గర్విస్తోందన్నారు. Uttarkashi Tunnel Rescue Operation Live Updates: All Workers Rescued Safely - Heroic and outstanding sense of duty displayed by rescuers. Enduring resilience displayed by those rescued. Makes our nation proud🙏🙏👏👏👏 https://t.co/q2vqmUTRsG — Kiran Mazumdar-Shaw (@kiranshaw) November 28, 2023 -
ఉత్తరకాశీ: సొరంగాన్ని జయించారు.. ఎప్పుడేం జరిగింది..
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా కోట్లాది మంది చేసిన ప్రార్థనలు ఫలించాయి. 17 రోజుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఉత్కంఠకు తెరపడింది. ప్రమాదవశాత్తూ సొరంగంలో చిక్కుకొని ఆశ నిరాశల మధ్య క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్ రూట్లో ఏర్పాటు చేసిన స్టీల్ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఎప్పుడేం జరిగింది? నవంబర్ 12 దీపావళి పండుగ రోజే ఉదయం 5.30 గంటలకు సిల్క్యారా–దందల్‌గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సొరంగంలోకి ఎయిర్–కంప్రెస్డ్ పైపుల ద్వారా ఆక్సిజన్, విద్యుత్, ఆహార పదార్థాలు పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ, ఎన్హెచ్ఐడీసీఎల్, ఐటీబీపీ తదితర సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నవంబర్ 13 సొరంగంలో ఉన్న కార్మికులతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆక్సిజన్ కోసం ఉద్దేశించిన పైపుల గుండా అధికారులు మాట్లాడారు. క్షేమంగా ఉన్నామని కార్మికులు బదులిచ్చారు. అదేరోజు సొరంగం పైభాగం నుంచి మట్టి కూలింది. టన్నెల్ లోపల 60 మీటర్ల మేర మట్టి విస్తరించింది. నవంబర్ 14 దాదాపు 900 మిల్లీమీటర్ల వ్యాసార్ధం ఉన్న స్టీల్ పైపులను సొరంగం వద్దకు చేర్చారు. మట్టి శిథిలాల గుండా సొరంగంలోకి ఈ పైపులను పంపించాలని నిర్ణయించారు. సొరంగంలో పైభాగం నుంచి మరింత మట్టి కూలడం ఆందోళన కలిగించింది. ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. నవంబర్ 15 కార్మికులను బయటకు తీసుకురావడానికి డ్రిల్లింగ్ యంత్రంతో తవ్వకం పనులు చేపట్టారు. అవి సవ్యంగా సాగకపోవడంతో అత్యాధునిక అగర్ మెషీన్‌ను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఢిల్లీ నుంచి విమానంలో తీసుకొచ్చారు. నవంబర్ 16 అగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. నవంబర్ 17 సొరంగంలో 57 మీటర్ల మేర మట్టి శిథిలాలు ఉండగా, 24 మీటర్ల మేర తవ్వకాలు జరిపారు. నాలుగు ఎంఎస్ పైపులను శిథిలాల గుండా పంపించారు. ఐదో పైపునకు అవరోధాలు ఎదురుకావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మరో అగర్ మెషీన్‌తో పనులు ప్రారంభించారు. ఐదో పైపును అమర్చే క్రమంలో సొరంగంలో భారీగా పగుళ్ల శబ్ధాలు వినిపించాయి. సొరంగం మొత్తం కుప్పకూలే అవకాశం ఉండడంతో ఆ పనులు వెంటనే నిలిపివేశారు. నవంబర్ 18 1,750 హార్స్పవర్ కలిగిన అమెరికన్ అగర్ మెషీన్ వల్ల టన్నెల్ లోపల ప్రకంపనలు పుట్టుకొస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యామ్నాయం కోసం అన్వేíÙంచారు. సహాయక చర్యల్లో ఆలస్యం జరుగుతుండడంతో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఐదు రకాల మార్గాలపై దృష్టి పెట్టారు. టన్నెల్ ఉపరితలం నుంచి లోపలికి నిలువుగా డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 19 ఘటనా స్థలంలో సహాయక చర్యలను కేంద్ర మంతి నితిన్ గడ్కరీ స్వయంగా సమీక్షించారు. నిలువుగా కాకుండా అగర్ మెషీన్‌తో అడ్డంగా డ్రిల్లింగ్ చేస్తే బాగుంటుందని సూచించారు. నవంబర్ 20 సహాయక చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్లో అడ్డంగా డ్రిల్లింగ్ చేస్తుండగా, అగర్ మెషీన్‌కు పెద్ద రాయి అడ్డుపడింది. పనులు నిలిచిపోయాయి. నవంబర్ 21 సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల మొదటి వీడియోను అధికారులు విడుదల చేశారు. ఆహారం తీసుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కార్మికులు కనిపించారు. తమ కుటుంబ సభ్యులతోనూ వారు మాట్లాడారు. సిల్కియారా వైపు నుంచి అగర్ యంత్రంలో అడ్డంగా డ్రిల్లింగ్ పనులను అధికారులు పునఃప్రారంభించారు. నవంబర్ 22 800 వ్యాసార్ధం కలిగిన స్టీల్ పైపులను శిథిలాల గుండా 45 మీటర్ల వరకు పంపించారు. మరో 12 మీటర్లే మిగిలి ఉంది. ఇంతలో మరో అవాంతరం వచ్చిపడింది. అగర్ మెషీన్‌కు కొన్ని ఇనుప కడ్డీలు అడ్డం వచ్చాయి. నవంబర్ 23 అడ్డంగా ఉన్న ఐరన్ రాడ్లను తొలగించారు. శిథిలాల్లో అడ్డంగా 48 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయ్యింది. ఇక్కడ మరో ఉపద్రవం తప్పలేదు. అగర్ మెషీన్‌ను ఏర్పాటు చేసిన వేదికకు పగుళ్లు వచ్చాయి. నవంబర్ 24 పగుళ్లను సరిచేసి, డ్రిల్లింగ్ మళ్లీ ప్రారంభించారు. ఈసారి మెటల్ గిర్డర్ అడ్డుపడింది. దాన్ని తొలగించారు. నవంబర్ 25 అగర్ మెషీన్ బ్లేడ్లు శిథిలాల్లో ఇరుక్కున్నాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరికొన్ని వారాలు పడుతుందని భావించారు. మరో 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ మిగిలి ఉంది. కానీ, ఆ పనులు ఆపేయాలని నిర్ణయించారు. నవంబర్ 26 కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ మార్గం కోసం 19.2 మీటర్ల మేర నిలువుగా డ్రిల్లింగ్ పూర్తిచేశారు. 700 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కలిగిన పైపులు పంపించే పనులు ప్రారంభించారు. నవంబర్ 27 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ కోసం ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. అదే సమయంలో టన్నెల్ పై భాగం నుంచి నిలువుగా డ్రిల్లింగ్ 36 మీటర్ల మేర పూర్తయ్యింది. నవంబర్ 28 సాయంత్రం 7 గంటలకల్లా డ్రిల్లింగ్ ఆపరేషన్ మొత్తం పూర్తయ్యింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్టీల్ పైపు గుండా కార్మికుల వద్దకు చేరుకున్నారు. వీల్డ్–్రస్టెచ్చర్లపై ఒక్కొక్కరిని భద్రంగా బయటకు తీసుకొచ్చారు. Triumph of unity and courage! Salute to the heroes who rescued 41 workers from Silkyara tunnel. 🌟 #UttrakhandTunnelRescue #SilkyaraRescue #inspiration #Thanks #happyday #INDvsAUS #16Days Maxwell pic.twitter.com/d7xIDjEfr5 — ShimonaSharma (@ShimonaSharma3) November 29, 2023 ‘ర్యాట్–హోల్’పై నిషేధం.. అదే ప్రాణాలు కాపాడింది ఎలుకలాగా కలుగును తవ్వేసే ర్యాట్–హోల్ మైనింగ్ అనేది నిజానికి చట్టవిరుద్ధమే. కానీ, సిల్క్యారా టన్నెల్లో ఇదే ప్రక్రియ 41 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) సయ్యద్ అతా హస్నెయిన్ మంగళవారం వెల్లడించారు. ఈ సొరంగంలో ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు 12 మీటర్ల శిథిలాలను 24 గంటల వ్యవధిలో తవ్వేశారని చెప్పారు. వారి కృషి వల్లే కార్మికులు త్వరగా బయటకు వచ్చారని ప్రశంసించారు. Some of the heroes who successfully rescued 41 of the labourers from the #Uttarkashi tunnel. Salute 🫡 to these brave men.#UttarakhandTunnelRescue pic.twitter.com/ajsS6xSqWz — Baba Banaras™ (@RealBababanaras) November 28, 2023 -
వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఉత్తరకాశీలో టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘టన్నెల్ ఆపరేషన్‌లో రెస్క్యూ టీం అవిశ్రాంతంగా పనిచేసింది. అలుపెరగని ప్రయత్నాల చేసి కార్మికులను రక్షించిన రెస్క్యూ టీం కి నా అభినందనలు. వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి. మొత్తం 41 మంది కార్మికులు సొరంగం నుండి సురక్షితంగా బయటపడటం సంతోషాన్నిచ్చింది’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. My appreciation for the tireless commitment and unwavering efforts of the rescue team in the Uttarkashi Tunnel Operation! Their determination and bravery is an inspiration to all of us! I am relieved that all 41 of the trapped workers have safely been evacuated from the… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 28, 2023 ప్రమాదవశాత్తూ సొరంగంలో చిక్కుకొని ఆశ నిరాశల మధ్య క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్ రూట్లో ఏర్పాటు చేసిన స్టీల్ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. గుహ లాంటి సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులు బాహ్య ప్రపంచాన్ని కళ్లారా తిలకించి, గుండెనిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌లో సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యలు మంగళవారం పూర్తయ్యాయి. ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు సొరంగం లోపల మిగిలిన 12 మీటర్ల మేర శిథిలాల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేశారు. వెంటనే భారీ స్టీల్ పైపును ఏర్పాటు చేసి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్నారు. ఇదీ చదవండి: వాళ్లు సొరంగాన్ని జయించారు! -
ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
-
వాళ్లు సొరంగాన్ని జయించారు!.. ఎప్పుడేం జరిగింది?
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా కోట్లాది మంది చేసిన ప్రార్థనలు ఫలించాయి. 17 రోజుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఉత్కంఠకు తెరపడింది. ప్రమాదవశాత్తూ సొరంగంలో చిక్కుకొని ఆశ నిరాశల మధ్య క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్ రూట్లో ఏర్పాటు చేసిన స్టీల్ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. గుహ లాంటి సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులు బాహ్య ప్రపంచాన్ని కళ్లారా తిలకించి, గుండెనిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌లో సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యలు మంగళవారం పూర్తయ్యాయి. ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు సొరంగం లోపల మిగిలిన 12 మీటర్ల మేర శిథిలాల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేశారు. వెంటనే భారీ స్టీల్ పైపును ఏర్పాటు చేసి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్నారు. ఒక్కొక్కరిని స్ట్రెచ్చర్లపై బయటకు చేర్చారు. స్టీల్ పైపు నుంచి బయటకు రాగానే కార్మికులకు వైద్య సిబ్బంది కొన్ని పరీక్షలు చేశారు. వారందరి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ చెప్పారు. అయినప్పటికీ వారిని ఇళ్లకు పంపించడానికి ముందు కొన్నిరోజులపాటు వైద్యుల పరిశీలనలో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. 41 మంది కార్మికులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. సహాయక ఆపరేషన్‌లో పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతు లేకుంటే ఈ ఆపరేషన్ ఇంత త్వరగా విజయవంతమయ్యేది కాదని పుష్కర్‌సింగ్ ధామీ అన్నారు. ఘటనా స్థలంలో ఉద్వి గ్న వాతావరణం సొరంగం ముఖద్వారం వద్ద మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కార్మికులకు కేంద్ర మంత్రి వి.కె.సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొందరు కార్మికులతో ఫోన్లో మాట్లాడారు. ఘటనా స్థలంలో ఉద్వి గ్న వాతావరణం నెలకొంది. హర హర మహాదేవ, భారత్ మాతాకీ జై అనే నినాదాలు మిన్నంటాయి. సొరంగం బయట ఉన్నవారంతా పరస్పరం ఆలింగనాలతో ఆనందం పంచుకున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులు సైతం అభినందనలు తెలుపుకున్నారు. సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. భగవంతుడు తమ మొర ఆలకించాడని చెమర్చే కళ్లతో వారు చెప్పారు. అధికారులు అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌ల్లో కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఆసుపత్రిలో కార్మికుల కోసం ఇంతకుముందే 41 పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. ఈ నెల 12వ తేదీన కార్మికులు సిల్ క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమై, కార్మికులు క్షేమంగా బయటకు రావడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సహాయక సిబ్బందిని అభినందిస్తూ సోషల్ మీడియాలోనూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. చదవండి: ఆ నలుగురు.. సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర వీరిదే.. ‘ర్యాట్–హోల్’పై నిషేధం.. అదే ప్రాణాలు కాపాడింది ఎలుకలాగా కలుగును తవ్వేసే ర్యాట్–హోల్ మైనింగ్ అనేది నిజానికి చట్టవిరుద్ధమే. కానీ, సిల్క్యారా టన్నెల్లో ఇదే ప్రక్రియ 41 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) సయ్యద్ అతా హస్నెయిన్ మంగళవారం వెల్లడించారు. ఈ సొరంగంలో ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు 12 మీటర్ల శిథిలాలను 24 గంటల వ్యవధిలో తవ్వేశారని చెప్పారు. వారి కృషి వల్లే కార్మికులు త్వరగా బయటకు వచ్చారని ప్రశంసించారు. బొగ్గు గనుల్లో 3 నుంచి 4 అడుగుల ఎత్తయిన సొరంగాలను అడ్డంగా తవ్వడానికి ర్యాట్–హోల్ మైనింగ్ టెక్నాలజీ వాడుతుంటారు. కేవలం ఒక్క మనిషి పట్టేందుకు వీలుగా ఈ సొరంగాలు ఉంటాయి. మేఘాలయ బొగ్గు గనుల్లో ఈ సాంకేతికతను వాడడాన్ని 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధించింది. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో ర్యాట్–హోల్ మైనింగ్‌పై నిషేధం అమలవుతోంది. కానీ, ఇతర నిర్మాణ పనుల్లో అనధికారికంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. సిల్క్యారా సొరంగంలో మట్టి శిథిలాలను తవ్వడానికి 12 మంది ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. ఎప్పుడేం జరిగింది? నవంబర్ 12 దీపావళి పండుగ రోజే ఉదయం 5.30 గంటలకు సిల్క్యారా–దందల్‌గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సొరంగంలోకి ఎయిర్–కంప్రెస్డ్ పైపుల ద్వారా ఆక్సిజన్, విద్యుత్, ఆహార పదార్థాలు పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ, ఎన్హెచ్ఐడీసీఎల్, ఐటీబీపీ తదితర సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నవంబర్ 13 సొరంగంలో ఉన్న కార్మికులతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆక్సిజన్ కోసం ఉద్దేశించిన పైపుల గుండా అధికారులు మాట్లాడారు. క్షేమంగా ఉన్నామని కార్మికులు బదులిచ్చారు. అదేరోజు సొరంగం పైభాగం నుంచి మట్టి కూలింది. టన్నెల్ లోపల 60 మీటర్ల మేర మట్టి విస్తరించింది. నవంబర్ 14 దాదాపు 900 మిల్లీమీటర్ల వ్యాసార్ధం ఉన్న స్టీల్ పైపులను సొరంగం వద్దకు చేర్చారు. మట్టి శిథిలాల గుండా సొరంగంలోకి ఈ పైపులను పంపించాలని నిర్ణయించారు. సొరంగంలో పైభాగం నుంచి మరింత మట్టి కూలడం ఆందోళన కలిగించింది. ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. నవంబర్ 15 కార్మికులను బయటకు తీసుకురావడానికి డ్రిల్లింగ్ యంత్రంతో తవ్వకం పనులు చేపట్టారు. అవి సవ్యంగా సాగకపోవడంతో అత్యాధునిక అగర్ మెషీన్‌ను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఢిల్లీ నుంచి విమానంలో తీసుకొచ్చారు. నవంబర్ 16 అగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. నవంబర్ 17 సొరంగంలో 57 మీటర్ల మేర మట్టి శిథిలాలు ఉండగా, 24 మీటర్ల మేర తవ్వకాలు జరిపారు. నాలుగు ఎంఎస్ పైపులను శిథిలాల గుండా పంపించారు. ఐదో పైపునకు అవరోధాలు ఎదురుకావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మరో అగర్ మెషీన్‌తో పనులు ప్రారంభించారు. ఐదో పైపును అమర్చే క్రమంలో సొరంగంలో భారీగా పగుళ్ల శబ్ధాలు వినిపించాయి. సొరంగం మొత్తం కుప్పకూలే అవకాశం ఉండడంతో ఆ పనులు వెంటనే నిలిపివేశారు. నవంబర్ 18 1,750 హార్స్పవర్ కలిగిన అమెరికన్ అగర్ మెషీన్ వల్ల టన్నెల్ లోపల ప్రకంపనలు పుట్టుకొస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యామ్నాయం కోసం అన్వేíÙంచారు. సహాయక చర్యల్లో ఆలస్యం జరుగుతుండడంతో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఐదు రకాల మార్గాలపై దృష్టి పెట్టారు. టన్నెల్ ఉపరితలం నుంచి లోపలికి నిలువుగా డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 19 ఘటనా స్థలంలో సహాయక చర్యలను కేంద్ర మంతి నితిన్ గడ్కరీ స్వయంగా సమీక్షించారు. నిలువుగా కాకుండా అగర్ మెషీన్‌తో అడ్డంగా డ్రిల్లింగ్ చేస్తే బాగుంటుందని సూచించారు. నవంబర్ 20 సహాయక చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్లో అడ్డంగా డ్రిల్లింగ్ చేస్తుండగా, అగర్ మెషీన్‌కు పెద్ద రాయి అడ్డుపడింది. పనులు నిలిచిపోయాయి. నవంబర్ 21 సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల మొదటి వీడియోను అధికారులు విడుదల చేశారు. ఆహారం తీసుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కార్మికులు కనిపించారు. తమ కుటుంబ సభ్యులతోనూ వారు మాట్లాడారు. సిల్కియారా వైపు నుంచి అగర్ యంత్రంలో అడ్డంగా డ్రిల్లింగ్ పనులను అధికారులు పునఃప్రారంభించారు. నవంబర్ 22 800 వ్యాసార్ధం కలిగిన స్టీల్ పైపులను శిథిలాల గుండా 45 మీటర్ల వరకు పంపించారు. మరో 12 మీటర్లే మిగిలి ఉంది. ఇంతలో మరో అవాంతరం వచ్చిపడింది. అగర్ మెషీన్‌కు కొన్ని ఇనుప కడ్డీలు అడ్డం వచ్చాయి. నవంబర్ 23 అడ్డంగా ఉన్న ఐరన్ రాడ్లను తొలగించారు. శిథిలాల్లో అడ్డంగా 48 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయ్యింది. ఇక్కడ మరో ఉపద్రవం తప్పలేదు. అగర్ మెషీన్‌ను ఏర్పాటు చేసిన వేదికకు పగుళ్లు వచ్చాయి. నవంబర్ 24 పగుళ్లను సరిచేసి, డ్రిల్లింగ్ మళ్లీ ప్రారంభించారు. ఈసారి మెటల్ గిర్డర్ అడ్డుపడింది. దాన్ని తొలగించారు. నవంబర్ 25 అగర్ మెషీన్ బ్లేడ్లు శిథిలాల్లో ఇరుక్కున్నాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరికొన్ని వారాలు పడుతుందని భావించారు. మరో 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ మిగిలి ఉంది. కానీ, ఆ పనులు ఆపేయాలని నిర్ణయించారు. నవంబర్ 26 కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ మార్గం కోసం 19.2 మీటర్ల మేర నిలువుగా డ్రిల్లింగ్ పూర్తిచేశారు. 700 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కలిగిన పైపులు పంపించే పనులు ప్రారంభించారు. నవంబర్ 27 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ కోసం ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. అదే సమయంలో టన్నెల్ పై భాగం నుంచి నిలువుగా డ్రిల్లింగ్ 36 మీటర్ల మేర పూర్తయ్యింది. నవంబర్ 28 సాయంత్రం 7 గంటలకల్లా డ్రిల్లింగ్ ఆపరేషన్ మొత్తం పూర్తయ్యింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్టీల్ పైపు గుండా కార్మికుల వద్దకు చేరుకున్నారు. వీల్డ్–్రస్టెచ్చర్లపై ఒక్కొక్కరిని భద్రంగా బయటకు తీసుకొచ్చారు. -
ఆ నలుగురు.. సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర వీరిదే..
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత బయటికి వచ్చారు. నవంబర్ 12న టన్నెల్ కూలిపోయి లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేసింది. చివరకు ర్యాట్-హోల్ పద్ధతిలో డ్రిల్లింగ్ చేసి కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సొరంగం లోపల కార్మికులు చిక్కుకున్న చోటకు పైప్‌లైన్ ఏర్పాటు చేసి ఆహారం, ఇతర అత్యవసర వస్తువులు పంపించడంతో వారు ఇన్ని రోజులు సజీవంగా ఉండగలిగారు. సహాయక చర్యల్లో దేశ విదేశాల నిపుణులు సైతం పాలుపంచుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైన నేపథ్యంలో ఇందులో కీలకంగా పాత్ర వహించిన నలుగురి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) సభ్యుడు, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఎంఏ పాత్రను పర్యవేక్షిస్తున్నారు. ఈయన శ్రీనగర్‌లోని భారత సైన్యం జీవోసీ 15 కార్ప్స్లో మాజీ సభ్యుడు. 2018 జూలై 13న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్శిటీకి ఛాన్సలర్‌గా లెఫ్టినెంట్ జనరల్ హస్నైన్ను నియమించారు. మైక్రో టన్నెలింగ్ నిపుణుడు క్రిస్ కూపర్ నవంబర్ 19న ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ప్రయత్నాల్లో చేరిన మెల్బోర్న్కు చెందిన చార్టర్డ్ ఇంజనీర్ క్రిస్ కూపర్స్ మైక్రో టన్నెలింగ్ స్పెషలిస్ట్. తన దశాబ్దాల అనుభవంలో ఆయన మెట్రో సొరంగాలు, పెద్ద గుహలు, ఆనకట్టలు, రైల్వేలు, మైనింగ్ వంటి ప్రాజెక్టులలో పనిచేశారు. కూపర్ రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టుకు అంతర్జాతీయ సలహాదారుగా కూడా ఉన్నారు. ఐఏఎస్ అధికారి నీరజ్ ఖైర్వాల్ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న పలు కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి నీరజ్ ఖైర్వాల్‌ను నోడల్ అధికారిగా సీఎం ధామి నవంబర్ 18న నియమించారు. గత పది రోజులుగా ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వాటి గురించి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయాలకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ఆయన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ ఆస్ట్రేలియాకు చెందిన ఆర్నాల్డ్ డిక్స్ ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో సేవలందించాలని కోరడంతో నవంబర్ 20న ఆయన రంగంలోకి దిగారు. ఆయన వ్యక్తిగత వెబ్సైట్ ప్రకారం.. ఆర్నాల్డ్ బారిస్టర్, శాస్త్రవేత్త, ఇంజనీరింగ్ ప్రొఫెసర్. భూగర్భ, రవాణా మౌలిక రంగంలో నిపుణుడు. నిర్మాణ ప్రమాదాలను అంచనా వేయడం నుంచి కార్యాచరణ భద్రతా పనితీరుకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడం వరకు ఆయనకు విశేష నైపుణ్యం ఉంది. -
ఆయన సపోర్టు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు : ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ విజయం సాధించింది. 41 మంది కార్మికులను సురక్షితంగా సొరంగంనుంచి బయటికి తీసుకువచ్చారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. 17 రోజులు సుదీర్ఘ నిరీక్షణ తరువాత వారంతా ఈసంక్షోభం నుంచి బైటపడటంతో కార్మికుల కుటుంబాలు, రెస్క్యూ సిబ్బందితోపాటు, దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగమైన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి మోదీ నిరంతరం తనతో టచ్‌లో ఉంటూ, రెస్క్యూ ఆప్‌కు సంబంధించిన అప్డేట్లు తెలుసుకున్నారనీ పలు సలహాలిచ్చారని సీఎం వెల్లడించారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్) ఎలాగైనా అందరినీ క్షేమంగా రక్షించడమే కర్త్యవ్యంగా పెట్టుకున్నాననీ, ఈ విషయంలో ప్రధాని సపోర్టు లేకుంటేఇది సాధ్యమయ్యేది కాదంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు కార్మికులందరికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించి, క్షేమంగా ఇళ్లకు చేరేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని మోదీ తనను ఆదేశించారని వెల్లడించారు. కాగా ఈ విజయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిమోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని ప్రకటించారు. (ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్ మహీంద్ర) (అద్భుతం..ఉద్వేగమైన క్షణాలివి: ఆనందోత్సాహాల వెల్లువ) #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: CM Pushkar Singh Dhami says, " I want to thank all the members who were part of this rescue operation...PM Modi was constantly in touch with me and was taking updates of the rescue op. He gave me the duty to rescue everyone safely… pic.twitter.com/TldZLK6QEB — ANI (@ANI) November 28, 2023 -
నిషేధించిన పద్ధతే.. 41 మంది కార్మికులను కాపాడింది!
ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకురావడానికి చివరికి నిషేధించిన పద్దతే దిక్కైంది. భారతీయ సాంకేతికతతో పాటు అమెరికా నుంచి తీసుకొచ్చిన భారీ యంత్రాలు కూడా ధ్వంసమయ్యాయి. చివరికి గతంలో నిషేధించిన ర్యాట్ హోల్ పద్దతినే ఉపయోగించారు. ఆరు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నప్పటికీ చివరికి అత్యంత ప్రమాదకర విధానంలోనే రెస్క్యూ బృందాలు చేరుకోగలిగారు. అసలు ఏంటి ఈ ర్యాట్ హోల్ మైనింగ్? ఎందుకు నిషేధించారు. ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ప్రస్తుత ఘటనలో పదేళ్లుగా ఈ వృత్తిలో అనుభవం ఉన్న కార్మికులను రంగంలోకి దించారు. అయితే.. బొగ్గును వెలికితీయడం కాకుండా కార్మికులను కాపాడేందుకు ఈ పద్దతిలో పనిచేయడం ఇదే తొలిసారి. 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేసిన అనుభవం ఉన్నట్లు పేర్కొన్న కార్మికులు.. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేశారు. పర్యావరణ ఆందోళనలతో నిషేధం.. ర్యాట్ హోల్ మైనింగ్‌పై అనేక విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ పద్దతిలో కార్మికుల ప్రాణాలకు ఎలాంటి భద్రత ఉండదు. లోపలికి వెళ్లిన కార్మికులకు వెలుతురు ఉండదు. గనులు కూలిపోవడం, వర్షాలు వచ్చినప్పుడు అవి నీటితో నిండిపోవడం వంటి అతి ప్రమాదకర పరిస్థితులు ఈ పద్దతిలో కార్మికులకు ఎదురవుతాయి. గతంలో ఈ రకమైన మైనింగ్ పద్దతుల్లో పదుల సంఖ్యలో కార్మికులు మరణించారు. దీనిపై పర్యావరణ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. శాస్త్రీయ పద్దతిలో లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ పద్దతిని నిషేధించింది. ఈశాన్య రాష్ట్రాలు సవాలు చేసినప్పటికీ గ్రీన్ ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. అయితే... ప్రత్యామ్నాయ మార్గాలు లేనందున మేఘాలయా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. 41 మంది సురక్షితం -
అద్భుతం..ఉద్వేగమైన క్షణాలివి: ఆనందోత్సాహాల వెల్లువ
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది సురక్షితంగా బయటకు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కార్మికులు క్షేమంగా తిరిగి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. వారి ధైర్యం, సంకల్పం కార్మిక సోదరులకు కొత్త జీవితాన్నిచ్చాయన్నారు. మానవత,జట్టు కృషికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారంటూ రెస్క్యూ టీంను ప్రశంసించారు. ఉత్తరకాశీలో కార్మిక సోదరుల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. ధైర్యం, సహనం అందరికి స్ఫూర్తిని కలిగిస్తున్నాయంటూ కార్మికులను అభినందించారు. అందరికీ శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇంతకాలం నిరీక్షణ తర్వాత కార్మికులు వారి ప్రియమైన వారిని కలుసుకోవడం చాలా సంతృప్తిని కలిగించే విషయం. ఈ సమయంలో సహనంతో ఆయా కుటుంబాలన్నీ చూపించిన ఓర్పు, ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేమని కొనియాడారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్) उत्तरकाशी में हमारे श्रमिक भाइयों के रेस्क्यू ऑपरेशन की सफलता हर किसी को भावुक कर देने वाली है। टनल में जो साथी फंसे हुए थे, उनसे मैं कहना चाहता हूं कि आपका साहस और धैर्य हर किसी को प्रेरित कर रहा है। मैं आप सभी की कुशलता और उत्तम स्वास्थ्य की कामना करता हूं। यह अत्यंत… — Narendra Modi (@narendramodi) November 28, 2023 రాష్ట్రపతి. ద్రౌపది ముర్ము కూడా కార్మికులును వెలికి తీసుకొచ్చిన ఘటనపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర నితిన్ గడ్కరీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తన సందేశాన్ని వీడియో రూపంలో ట్విటర్లో షేర్ చేశారు. అలాగే నటుడు సోనూ సూద్ ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని వెలిబుచ్చారు. (ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్ మహీంద్ర) सिल्क्यारा टनल बचाव कार्य में शामिल सभी का धन्यवाद। #SilkyaraTunnelRescue pic.twitter.com/H8r0JsRELY — Nitin Gadkari (@nitin_gadkari) November 28, 2023 Uttarkashi rescue operation complete. All 41 workers rescued from the collapsed #SilkyaraTunnel ❤️❤️❤️❤️ A M A Z I N G 🙏 — sonu sood (@SonuSood) November 28, 2023 -
ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్ మహీంద్ర
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్ వారిని ఒక్కొక్కరినీ బయటికి తీసుకువచ్చారు. దీంతో అక్కడంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. 17 రోజుల పాటు సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు మంగళవారం (నవంబరు 28) తొలిసారి వెలుగు ముఖం చూశారు. Uttarkashi tunnel rescue | Uttarakhand CM Pushkar Singh Dhami meets the workers who have been rescued from inside the Silkyara tunnel. pic.twitter.com/8fgMiHPkAD — ANI (@ANI) November 28, 2023 బయటకు తీసుకొచ్చిన వారిని అత్యవసర వైద్య పరీక్షల నిమత్తం ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. దీనిపై సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లి విరిసాయి. 423 గంటలు, 41 జీవితాలు!!! రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు!! అంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి పరిశీలించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సిల్క్యారా సొరంగం లోపల నుండి బైటికి వచ్చిన కార్మికులను కలిసి ఆనందం ప్రకటించారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్) ముఖ్యంగా ఆనంద్ మహీంద్ర ఈ ఆపరేషన్‌పై సక్సెస్‌పై స్పందించారు. 41 మంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు గత 17 రోజులుగా అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏ క్రీడా విజయం సాధించగలిగే దానికంటే గొప్పగా, దేశ స్ఫూర్తిని ఇనుమడింప చేశారు. మా ఆశల్ని ద్విగుణీ కృతం చేశారని పేర్కొన్నారు. మన ఆశయం, కృషి కలెక్టివ్‌గా ఉంటే, ఐక్యంగా ఉంటే ఏ సొరంగం నుండి బయటపడటం కష్టం కాదు, ఏ పని అసాధ్యం కాదని మరోసారి గుర్తు చేసారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్) It’s time for gratitude. Thank you to EVERY single person who worked tirelessly over the past 17 days to save these 41 precious lives. More than any sporting victory could have, you have uplifted the spirits of a country & united us in our hope. You’ve reminded us that no tunnel… https://t.co/ZSTRZAAJOl — anand mahindra (@anandmahindra) November 28, 2023 -
ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్ సొరంగంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చే విషయంలో కీలక పురోగతి. దాదాపు 17 రోజుల పాటు టన్నెల్లో ఉన్న కార్మికులు ఎట్టకేలకు వెలుగు చూసే క్షణాలు సమీపిస్తున్నాయి. దీంతో అక్కడంతా ఉత్కంఠ వాతావారణం నెలకొంది. ఈ ఉద్వేగభరిత క్షణాలకోసం కుటుంబ సభ్యులతో పాటు, రెస్క్యూ ఆపరేషన్ టీం ఎదురు చూస్తున్నారు. టన్నెల్లో అమర్చిన పైప్‌లైన్ ద్వారా రెస్క్యూ బృందం వారిని బయటకు తీసుకురానుంది. మరోవైపు కార్మికులు బైటికి వచ్చిన వెంటనే ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబంధిత మెడికల్ ఆఫీసర్లు కూడా టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సిల్క్యారా సొరంగం ప్రవేశ ద్వారం వద్ద నలభై ఒక్క అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా కార్మికులను సమీప వైద్య శాలలకు తరలిస్తారు. ఇందు కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. తద్వారా బయటికి వచ్చిన కార్మికులదరిన్నీ హుటాహుటిన ఈ సొరంగం నుండి 30 కి.మీ దూరంలో ఉన్న చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలిస్తారు. కార్మికులకు స్వాగతం పలికేందుకు పూలమాలలు కూడా సిద్ధం చేశారు. #WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel rescue: Rishikesh AIIMS on alert mode for medical services. A 41-bed ward including trauma center ready. A team of cardiac and psychiatric specialist doctors including trauma surgeon ready. Three helicopters can be landed simultaneously at… pic.twitter.com/Xesrf1zc6u — ANI (@ANI) November 28, 2023 ఒక్కో వ్యక్తిని బయటకు తీయడానికి మూడు నుండి ఐదు నిమిషాలు పడుతుంది. కాబట్టి, మొత్తం 41 మంది కార్మికులను రక్షించేందుకు నుండి నాలుగు గంటల సమయం పడుతుందని ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూపై NDMA సభ్యుడు లెఫ్టినెంట్జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ చెప్పారు. ప్రతి కార్మికుడికి సత్వర వైద్య సంరక్షణ అందించేలా 41 ఆక్సిజన్‌తో కూడిన పడకలతో ఒక వార్డును కూడా ఏర్పాటు చేశారు. వర్కర్లు అందర్నీ రెస్క్యూ చేయనున్నట్లు కార్మికులకు తక్షణ వైద్యం సహాయం అందించేందుకు అంబులెన్సులు కూడా చేరుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ప్రస్తుత రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అటు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న వారికి యూపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ సమన్వయకర్త అరుణ్ మిశ్రా ధన్యవాదాలు చెప్పారు. త్వరలోనే కార్మికులంతా బైటికి రానున్నారని తెలిపారు. VIDEO | "It will take about three to five minutes to pull out one individual each. So, it will take about three to four hours to rescue all 41 workers," says Lt Gen (Retd) Syed Ata Hasnain, NDMA member, on Uttarkashi tunnel rescue.#UttarkashiTunnelRescue #SilkyaraTunnelRescue pic.twitter.com/AJ7bHXOVIS — Press Trust of India (@PTI_News) November 28, 2023 बाबा बौख नाग जी की असीम कृपा, करोड़ों देशवासियों की प्रार्थना एवं रेस्क्यू ऑपरेशन में लगे सभी बचाव दलों के अथक परिश्रम के फलस्वरूप श्रमिकों को बाहर निकालने के लिए टनल में पाइप डालने का कार्य पूरा हो चुका है। शीघ्र ही सभी श्रमिक भाइयों को बाहर निकाल लिया जाएगा। — Pushkar Singh Dhami (@pushkardhami) November 28, 2023 -
ఉత్తరాఖండ్ టన్నెల్ వద్ద శరవేగంగా రెస్క్యూ ఆపరేషన్
-
Uttarakhand: రెస్క్యూ బృందాలకు 5 మీటర్ల దూరంలో కార్మికులు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గత 17 రోజులు సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సొరంగంలోని బండరాళ్లను తవ్వే క్రమంలో అవంతరాలు ఎదురవ్వడంతో రెస్క్యూ ప్లాన్లను మార్చి మార్చి అమలు చేస్తున్నారు. శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను పక్కనపెట్టి.. కొండపై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులను సోమవారం మొదలు పెట్టారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Visuals from the Silkyara tunnel where the operation to rescue 41 workers is ongoing. First visuals of manual drilling ongoing inside the rescue tunnel. Auger machine is being used for pushing the pipe. So far about 2 meters of… pic.twitter.com/kXNbItQSQR— ANI (@ANI) November 28, 2023 ఇక ‘ర్యాట్ హోల్ మైనింగ్’ బృందానికి చెందిన అనుభవజ్ఞులైన 24 మంది మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ముందుగా 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను తొలగించి.. అదే మార్గంలో దూరిన కార్మికులు.. సొరంగానికి మ్యాన్యువల్‌గా రంధ్రం చేయడం ప్రారంభించారు. ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మాన్యువల్ డ్రిల్లింగ్ ద్వారా శిథిలాలను బయటకు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు దాదాపు 2 మీటర్ల మేర మాన్యువల్ డ్రిల్లింగ్ పూర్తయింది. చదవండి: ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Visuals from the Silkyara tunnel where the operation to rescue 41 workers is ongoing. Manual drilling is going on inside the rescue tunnel and auger machine is being used for pushing the pipe. So far about 2 meters of manual… pic.twitter.com/oIMNAxvre2— ANI (@ANI) November 28, 2023 మరోవైపు టన్నెల్ పైభాగం నుంచి వర్టికల్ డ్రిల్లింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. 86 మీటర్లు తవ్వాల్సి ఉండగా.. మంగళవారం ఉదయం నాటికి 51 మీటర్ల మేర మైక్రో టన్నెల్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెస్క్యూ బృందాల నుంచి కార్మికులు కేవలం 5 మీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అయిదు మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయితే కార్మికులను చేరుకోనున్నారు. ఈ పద్దతి ద్వారా గురువారం నాటికి కార్మికులను బయటకు తీయాలని అధికారులు భావిస్తున్నారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Micro tunnelling expert Chris Cooper says, "...It went very well last night. We have crossed 50 metres. It's now about 5-6 metres to go...We didn't have any obstacles last night. It is looking very positive..." pic.twitter.com/HQssam4YUs— ANI (@ANI) November 28, 2023 కాగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న టన్నెల్ వద్దకు నేడు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి వెళ్లారు. సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. ఇక ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్డుమార్గంలో ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సిల్క్యారా–బార్కోట్ మార్గంలో సొరంగం నిర్మిస్తుండగా నవంబర్ 12వ తేదీన లోపల కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు రెండు కిలోమీటర్ల పొడవైన భాగంలో చిక్కుకుపోయారు. చదవండి: ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్‌కు ఎడతెగని ఆటంకాలు! -
ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో సైన్యం ఎంట్రీ
ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడే ఆపరేషన్‌లో భారత సైన్యం ఎంట్రీ ఇచ్చింది. సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని బయటకు తొలగించే పనుల్లో సైన్యం నిమగ్నమైంది . ఇందుకు ఆర్మీ తమ పరికరాలను కొండ పైభాగానికి తరలిస్తున్నారు. 800 ఎంఎం ఇనుప పైపును డ్రిల్లింగ్ చేసి, ఇన్సర్ట్ చేస్తున్న ఆగర్ మిషన్ బ్లేడ్లు శనివారం శిథిలాలలో చిక్కుకున్నాయి. దీంతో యంత్రం ధ్వంసమైంది. ఫలితంగా సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను విమానంలో తీసుకువచ్చారు. ఆగర్ యంత్రం భాగాలను తొలగించే పనిలో సైన్యం నిమగ్నమైంది. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 15 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చురుగ్గా సాగుతోంది. ఆగర్ యంత్రం ధ్వంసం కావడంతో సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కారణంగా కార్మికులను రక్షించడానికి కొన్ని వారాలు పట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: Uttarkashi tunnel collapse: సొరంగ బాధితులకు క్రిస్మస్కు విముక్తి? -
ప్రస్తుత ప్లాన్ పనిచేయకపోతే, మరో ఐదు ప్లాన్లు సిద్ధం, కానీ..!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న నలభై ఒక్క మంది కార్మికులను వెలుపలికి తీసు కొచ్చేందుకు పనులు జరుగు తున్నప్పటకీ ఈ ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. శుక్రవారం అంతరాయం తరువాత అమెరికాఅగర్ డ్రిల్లింగ్ మెషిన్ సాయంతో డ్రిల్లింగ్ కార్యక్రమం తిరిగి కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో వారంతా క్షేమంగా బయటకు రావచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రక్రియలో సవాళ్లను బట్టి 15 రోజుల వరకు పట్టవచ్చని కేంద్రం తెలిపింది. ప్రస్తుత ప్లాన్ వర్క్ అవుట్ కాపోతే మరో ఐదు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశామని ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ మరో 15 రోజులు అయినా కూడా సాగుతుందన్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడి సహాయక చర్యలను పరిశీలించారు. మరో 12 -15 రోజులు రోడ్డు రవాణా మరియు హైవేస్ సెక్రటరీ అనురాగ్ జైన్ మాట్లాడుతూ డ్రిల్లింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఇదే సరియైన పద్ధతి. దీనికితోడు తాము మరో ఐదు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధంగా ఉంచామని, అయితే వాటికి 12-15 రోజులు పట్టవచ్చని జైన్ చెప్పారు. ఒక ఆప్షన్కోసమే వెయిట్ చేయకుండా, ఏకకాలంలో అన్ని ప్లాన్లపైనా పని చేస్తున్నామని వెల్లడించారు. సొరంగానికి సమాంతరంగా అగర్, క్షితిజ సమాంతర బోరింగ్ సాయంతో ప్రస్తుతం మైక్రో టన్నెల్ నిర్మాణం కూడా జరుగుతోంది. అయితే దీనికి 12-15 రోజులు పట్టవచ్చని కూడా తెలిపారు. వెజ్ పులావ్, మటర్ పనీర్ వారికి గత రాత్రి వెన్నతో వెజ్ పులావ్, మటర్ పనీర్, చపాతీలతో కూడిన భోజనం అందించామన్నారు. ఆహారం 6-అంగుళాల పైప్‌లైన్ ద్వారా పంపిణీ చేశామని, అలాగే పండ్లు, ఇతర అత్యవసరవస్తువులను అందించామని కూడా చెప్పారు. ఈనేపథ్యంలోనే పెద్ద మొత్తంలో ఘనమైన ఆహారం, నీటిని పంపడానికి అధికారులు 57 మీటర్ల పొడవు, 6 అంగుళాల వెడల్పు గల పైపును ఏర్పాటు చేశారు. దీని ద్వారా కార్మికులకు వేడి ఆహారాన్ని అందిస్తున్నామని జైన్ వెల్లడించారు. అలాగే సైట్‌కు చేరుకున్న వైద్యులు, యోగా చేయాలని, వాకింగ్ లాంటి చిన్నపాటి వ్యాయామం చేయాలని, ఒకరితో ఒకరు మాట్లాడు కుంటూ ఉండాలని చిక్కుకున్న కార్మికులకు సూచించారు. కార్మికులతో సంభాషించిన 30 సెకన్ల వీడియోను అధికారులు విడుదల చేశారు. కాగా ఈ నెల (నవంబర్) 12 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 4.5 కిలోమీటర్ల సొరంగంలో కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. -
Uttarakhand Tunnel Crash: కొండ పైనుంచి టన్నెల్లోకి రంధ్రం
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా సొరంగం కూలి అప్పుడే ఏడు రోజులైంది. లోపల చిక్కుకున్న 40 మంది కార్మికుల భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతుండగా, అధికారులు మరో ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చారు. శుక్రవారం నిలిపివేసిన అమెరికన్ ఆగర్ యంత్రం డ్రిల్లింగ్ పనులను మళ్లీ ప్రారంభించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) రూపొందించిన తాజా ప్రణాళిక ప్రకారం..సొరంగం నిర్మాణ పనులు సాగుతున్న కొండ పైనుంచి సొరంగంలోకి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉంది. కొండ పైనుంచి 1,000 నుంచి 11,00 మీటర్ల పొడవైన రంధ్రం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పనులు ప్రారంభించాం. రేపు మధ్యాహ్నం కల్లా ఇది సిద్ధమవుతుంది’అని బీఆర్వోకు చెందిన మేజర్ నమన్ నరులా చెప్పారు. ‘ముందుగా 4–6 అంగుళాల రంధ్రాన్ని తొలిచి లోపల చిక్కుబడిపోయిన వారికి అత్యవసరాలను అందిస్తాం. పరిస్థితులు అనుకూలిస్తే మూడడుగుల వెడల్పుండే రంధ్రాన్ని 900 మీటర్ల పొడవున తొలుస్తాం. దీని గుండా లోపలున్న వారు కూడా బయటకు చేరుకోవచ్చు’అని బోర్డర్ రోడ్స్ డీజీ ఆర్ఎస్ రావు చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం అధికారుల బృందం కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. కార్మికులను కాపాడేందుకు నిపుణులు వివిధ రకాలైన అయిదు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రధాని మాజీ సలహాదారు, ప్రస్తుతం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఓఎస్డీ భాస్కర్ ఖుల్బే చెప్పారు. ఇలా ఉండగా, శిథిలాల నుంచి డ్రిల్లింగ్‌ను మరింత సమర్థంగా కొనసాగించేందుకు శనివారం ఇండోర్ నుంచి ఒక యంత్రాన్ని తీసుకువచ్చారు. దీనిని కూడా బిగించి, డ్రిల్లింగ్ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. డ్రిల్లింగ్ పనులు మళ్లీ మొదలు: శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో అయిదో పైపును లోపలికి పంపేందుకు డ్రిల్లింగ్ పనులు సాగుతుండగా సొరంగంలో ఒక్కసారిగా పెళ్లుమనే శబ్దం వినిపించింది. దీంతో, వెంటనే పనులను నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ శబ్ధం సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బందిలో వణుకు పుట్టించింది. డ్రిల్లింగ్‌ను కొనసాగిస్తే టన్నెల్ మరింతగా కూలే ప్రమాదముందని నిపుణుడొకరు చెప్పారు. మొత్తం 60 మీటర్లకు గాను 24 మీటర్లలో శిథిలాల గుండా డ్రిల్లింగ్ పూర్తయిందన్నారు. ఇలా ఉండగా, సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల సంఖ్య 41గా తేలినట్లు అధికారులు వివరించారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన దీపక్ కుమార్ కూడా లోపలే ఉండిపోయారని అన్నారు. -
శరవేగంగా రెస్క్యూ ఆపరేషన్: హృదయ విదారకం, ఆనంద్ మహీంద్ర ట్వీట్
Uttarakhand Tunnel ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్ సొరంగం కూలి శిథిలాల మధ్య ఉన్న బాధితులను కాపాడేందుక అమెరికాకు చెందిన అత్యాధునిక డ్రిల్లింగ్ పరికరం 'అమెరికన్ ఆగర్'తో సహాయక చర్యలు చేపట్టారు. అయితే వాతావరణ ప్రతికూలత, మంగళవారం రాత్రి మళ్లీ కొండ చరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో టన్నెల్ బయట నిరీక్షిస్తున్న కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక సూపర్వైజర్ తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందవద్దని తన కుమారుడికి హామీ ఇచ్చిన ఆడియో క్లిప్ ఒకటి గురువారం వెలువడింది. చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్, ఆహారం చేరేలా ఏర్పాటు చేసిన పైపు ద్వారా తన కొడుకుతో మాట్లాడాడు నేగి. దీంతో అతని కుమారుడు ఆకాష సంతోషం వ్యక్తం చేశాడు. ఎవరికీ గాయాలు కాలేదని, సరిపడా ఆహారం, నీరు అందుతున్నాయని నాన్న చెప్పారనీ ఆందోళన చెందవద్దని ఇంట్లో అందరికీ చెప్పమన్నారని చెప్పాడు. అంతా మంచి జరుగుతుందని భావిస్తున్నాని తెలిపాడు. మరో కార్మికుడు మహదేవ్ బావున్నాను అని తన కుటుంబానికి చెప్పండి అంటూ ఒడియాలో చెప్పడం కాస్త ఊరటినిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ ఘటనపై పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్ర స్పందించారు. హృదయ విదారకంగా ఉంది. తొందరగానే వీరంతా ఈ ప్రమాదంనుంచి క్షేమంగా తిరిగి రావాలి. అంతేకాదు కాస్త ఆలస్యమైనా క్షేమంగా బైటికి వచ్చి, వారి కుటుంబాలతో సంతోషంగా దీపావళి వేడుక జరుపుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు సొరంగంలో చిక్కుకుని ఇప్పటికే అయిదు రోజులైంది. రక్షణ చర్యల్లో భాగంగా సోమవారం 55 మీటర్ల నుంచి 60 మీటర్ల శిథిలాలను తొలగించారు. అయితే ఆ ప్రాంతంలో మళ్లీ మట్టి కొట్టుకుపోవడంతో తవ్విన భాగాన్ని 14 మీటర్లకు తగ్గించారు. రాయిని డ్రిల్‌చేసి దాని ద్వారా 80 మిమీ (3 అడుగుల కంటే తక్కువ)బోర్ వేసి దాని ద్వారా కూలీలను రక్షించడానికి ప్లాన్ చేస్తున్నామని జాతీయ విపత్తు సహాయ దళం చీఫ్ అతుల్ కర్వాల్ తెలిపారు. అమెరికన్ అగర్ డ్రిల్ సుమారు 12 -15 గంటల్లో 70 మీటర్ల రాళ్లను కట్ చేసే సామర్థ్యం ఉందన్నారు. ప్రస్తుతం చేపట్టిన సహాయక చర్యలు ప్లాన్ బీ విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రెస్క్యూ ఆపరేషన్ అధికారి కల్నల్ దీపక్ పాటిల్ గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక అమెరికన్ డ్రిల్లింగ్ పరికరాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. అటు రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని కేంద్ర మంత్రి వీకే సింగ్ కూడా వెల్లడించారు. విదేశీ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామనీ, అనుకున్న సమయానికంటే ముందే రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుందని భావిస్తున్నామన్నారు. #WATCH | On arriving at Uttarakhand's Uttarkashi to take stock of the operation to rescue 40 workers who are stuck inside the Silkyara tunnel, Union Minister General VK Singh (Retd) says, "Rescue operation is underway, we have full hope. We are trying our best." pic.twitter.com/M1pXGYFBbn — ANI (@ANI) November 16, 2023 -
రంగంలోకి బాహుబలి...కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
తెలంగాణలో చరిత్రలోనే అత్యధికంగా వానలు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో వానలు కురుస్తున్నాయి. ఒక్కరోజులోనే 62 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యింది చరిత్ర సృష్టించింది. రాష్ట్రవ్యాప్త పరిస్థితిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని తనకు తెలియజేయాలని చీఫ్ సెక్రెటరీ శాంతికుమారిని ఆదేశించారు. లోతట్టు.. వరద ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారాయన. అలాగే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మోరంచపల్లి గ్రామం మోరంచవాగు ఉధృతికి నీట మునిగిన సంగతి తెలిసిందే. దాదాపు వందేళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామంలో సహాయక చర్యలకు హెలికాఫ్టర్లను సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే.. వర్షాలతో సాధారణ హెలికాఫ్టర్లు అక్కడికి వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో.. సికింద్రాబాద్ ఆర్మీ అధికారులతో సీఎస్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వరదలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ అక్కడ మొదలైనట్లు సమాచారం. -
ములుగు జిల్లా అడవుల్లో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం
-
ములుగు NDRF రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
సాక్షి, ములుగు: ఉత్కంఠకు తెర దించుతూ పర్యాటకులందరినీ ఎన్డీఆర్ఎఫ్ రక్షించింది. ములుగు అడవుల్లో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. వీరభద్రం అడవుల్లో చిక్కుకున్న మొత్తం పర్యాటకులంతా క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. వర్షాకాలం సీజన్ కావడంతో వీరభద్రం గ్రామం సమీపంలోని ముత్యంధార Muthyaladhara Waterfall జలపాతం చూసేందుకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో నీటి ప్రవాహం పెరగడంతో కొందరు పర్యాటకులు అడవుల్లో చిక్కుకుపోయారు. దీంతో వీలైనంత త్వరగా వాళ్లను రక్షించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ తరుణంలో పోలీసులతో పాటు రెస్క్యూ టీం వాళ్లను రక్షించే యత్నం చేశారు. కానీ, వీలుకాలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. దాదాపు ఎనిమిది గంటలపాటు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్లను రక్షించారు. బాధితులను అంకన్నగూడెంకు చేర్చగా.. అక్కడి జిల్లా కలెక్టర్, ఎస్పీ వాళ్లను రిసీవ్ చేసుకున్నారు. ముత్యంధార జలపాతం దేశంలోనే అతిపెద్ద జలపాతాల్లో ఒకటిగా పేరుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం సీజన్లో దీనిని చూసేందుకు జనం ఎక్కువగా వస్తుంటారు. వీరభద్రం గ్రామం నుంచి ట్రెక్కింగ్ ద్వారా ఈ జలపాతానికి చేరుకుంటారు పర్యాటకులు. -
భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన చైనా.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ: మధ్య హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన చేపల ఓడ మునిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు నావికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఓడలోని మిగతా 37 మంది నావికులను కాపాడేందుకు భారత నేవీ రంగంలోకి దిగి సాయం చేసింది. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని చైనాకు ఆపన్నహస్తం అదించింది. దీంతో భారత్ సహా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని తమ వంతు సాయం అందించించిన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, మాల్దీవ్‌కు చైనా విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. కష్టకాలంలో సాయం చేసినందుకు ప్రశంసల వర్షం కురిపించింది. చైనాకు చెందిన లుపెంగ్ యువాన్యు 028 చేపల ఓడ మంగళవారం హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఇందులో మొత్తం 39 మంది నావికులు ఉన్నారు. వీరిలో చైనాకు చెందన వారు 17 మంది, ఇండోనేషియాకు చెందినవారు 17 మంది, ఫిలిప్పైన్స్కు చెందిన ఐదుగురు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. చైనాకు చెందిన 10 ఓడలు ఆ ఆపరేషన్‌లో భాగమయ్యాయి. ఇంకా మరిన్ని ఓడలను ఘటనా స్థలానికి చేర్చుతున్నారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఓడను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: అమెరికాలో న్యాయ పోరాటం.. భారత్‌కు అతిపెద్ద విజయం.. ‘రాణాను అప్పగించండి’ -
బాలల అక్రమ రవాణాకు చెక్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): బిహార్ రాష్ట్రం నుంచి విజయవాడ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు తరలిస్తున్న మైనర్ల అక్రమ రవాణాను విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకుని వారిని రక్షించారు. విజయవాడ డివిజన్ సీనియర్ డీఎస్సీ(డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్) వల్లేశ్వర బీటీ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన మైనర్ (బాలురు)లను ఎక్స్‌ప్రెస్ రైల్లో ముజఫర్‌పూర్ స్టేషన్ నుంచి బెంగళూరు, చెన్నైలకు తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందింది. దీనిపై జీఆర్పీ పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, బచ్పన్ బచావో ఆందోళన్(బీబీఏ) సంస్థ, చైల్డ్‌లైన్ ప్రతినిధుల సహకారంతో మంగళవారం రాత్రి రైలు విజయవాడ చేరుకోగానే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి సుమారు 12 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న 18 మంది బాలలను గుర్తించి సంరక్షించారు. అనంతరం వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి, వారి ఆదేశాల మేరకు తాత్కాలిక వసతి కోసం ఎస్కేసీవీ చిల్డన్స్ ట్రస్ట్ వసతి గృహానికి తరలించారు. బాలల వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి తగిన ఆధారాలతో వన తల్లిదండ్రులకు వారిని అప్పగిస్తామని తెలిపారు. బాలల అక్రమ రవాణా చట్ట వ్యతిరేకమని, దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపరేషన్‌లో ఆర్ఫీఎఫ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఐ మకత్‌లాల్‌నాయక్, జీఆర్పీ ఎస్ఐ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
Borewell: 60 అడుగుల బోరుబావిలో పడిన చిన్నారి..
భోపాల్: మధ్యప్రదేశ్ విదిశా జిల్లాలో 8 ఏళ్ల బాలుడు 60 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఆడుకుంటూ పొరపాటున అందులో జారిపడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మూడు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాయి. బోరుబావిలో బాలుడి కదలికలు గమనించి అతడు సురక్షితంగానే ఉన్నట్లు నిర్ధరించుకున్నాయి. అనంతరం అతడ్ని బయటకు తీసుకొచ్చేందుకు బోరుబావికి సరిసమానంగా తవ్వాయి. అతడు 43-44 అడుగుల వద్ద చిక్కుకుని ఉన్నాడని, కొద్ది గంటల్లో బయటకు తీసుకువస్తామని సహాయక సిబ్బంది తెలిపారు. కాగా.. బాలుడి కదలికలు గుర్తించినప్పటికీ.. అతనితో మాట్లాడలేకపోయినట్లు అధికారులు తెలిపారు. చిన్నారికి ఆహారం కూడా అందించే పరిస్థితి లేదన్నారు. వీలైనంత త్వరగా అతడ్ని బయటకు తీసుకొచ్చాక ఆహారం అందించి, ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు. MP | An 8-year-old boy in Vidisha fell into a 60 feet deep borewell and got stuck at 43 feet. 3 teams of SDRF & 1 team of NDRF are on the spot. The child is being monitored, oxygen is being supplied. We cannot talk to him &food has not been delivered yet: Vidisha ASP Sameer Yadav pic.twitter.com/3bOwIvsDZh — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 14, 2023 చదవండి: వింత ఘటన: 56 బ్లేడులు మింగిన వ్యక్తి! -
బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. మూడు గంటల్లోనే బయటకు..
భోపాల్: ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారిని మూడు గంటల్లోనే సురక్షితంగా బయటకు తీశారు సహాయక సిబ్బంది. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి చిన్నారి ప్రాణాలు కాపాడారు. మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లా లాల్‌గౌన్ పాలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాన్సీ అనే చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీసి చెకప్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. बेटी की मां से फोन पर बात की है। यह जानकर संतोष और आनंद हुआ कि बेटी स्वस्थ है। उसे जनरल चेकअप के लिए अस्पताल ले जाया गया। मेरी शुभकामनाएं और आशीर्वाद बेटी के साथ हैं। मामा शिवराज सदैव तुम्हारे साथ हैं! https://t.co/KK9GdA7Qfz — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 26, 2023 కాగా నాన్సీ బోరుబావిలో సుమారు 30 అడుగుల లోతులో చిక్కుకుందని అధికారులు పేర్కొన్నారు. వివిధ రకాల పరికరాలు, జేసీబీలు ఉపయోగించి పాపను కాపాడినట్లు వివరించారు. గతేడాది జూన్‌లో కూడా ఈ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఐదేళ్ల బాలుడు పొలంలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. సహాయక సిబ్బంది 8 గంటలు శ్రమించి అతడ్ని సురిక్షితంగా కాపాడారు. చదవండి: గుండెపోటుతో నవ వరుడు హఠాన్మరణం -
శిథిలాల కింద 90 గంటలపాటు సజీవంగా 10 రోజుల పసికందు
-
డెక్కన్ మాల్ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత.. బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధం
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ భవనంలో సెర్చ్ ఆపరేషన్ నిలిచిపోయింది. ఈ నెల 19వ తేదీన ఆరు అంతస్తుల ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం విదితమే. అదే రోజు డెక్కన్ నిట్‌వేర్‌లో పనిచేసే జునైద్, జహీర్, వాసిం భవనంలోకి వెళ్లి కనిపించకుండా పోయారు. మూడు రోజులుగా పాటు ఫైర్, డీఆర్ఎఫ్, పోలీసులు భవనం మొత్తం జల్లెడ పట్టి గాలించారు. ఈ నెల 21వ తేదీన భవనంలోని మొదటి అంతస్తులో ఒకరి మృతదేహం ఆనవాళ్లు మాత్రమే బయటపడ్డాయి. ఆదివారం కూడా అధికారులు గల్లంతైన వారి కోసం భవనం మొత్తం గాలించారు. కానీ ఎవరి ఆచూకీ లభించడలేదు. ► భవనం వెనుక వైపు గ్రౌండ్ నుంచి మూడో అంతస్తు వరకు శ్లాబులు కూలిపోయి శిథిలాలు మొత్తం మొదటి సెల్లార్లో పడ్డాయి. వాటి కిందే మృతదేహాలు ఉంటాయనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద శిథిలాలను కదిలించే పరిస్థితి లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. జేసీబీ లాంటి యంత్రాలను తీసుకుని వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో సోమవారం కూడా అధికారులు భవనం లోపలికి వెళ్లలేదు. ► భవనం లోపల సెర్చ్ ఆపరేషన్ చేసేందుకు ఫైర్, పోలీసు అధికారులు భయపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచిచూస్తున్నారు. కానీ గల్లంతైన వారి బంధువులు మాత్రం తమవారి ఆచూకీ తెలిసేంత వరకు భవనం కూలి్చవేయవద్దని అంటున్నారు. దీంతో అధికారులు సందిగ్ధావస్థలో పడ్డారు. ► ఆచూకీ దొరకని జునైద్, వాసీం, జహీర్‌ల బంధువులను సోమవారం రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్ లింగేశ్వర్‌రావు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. వారి రక్త నమూనాల కోసం వివరాలు సేకరించి వారిని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఎఫ్ఎస్ఎల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఇటీవల దొరికిన మృతదేహం ఎవరిది అనే విషయాన్ని నిర్ధారించనున్నారు. చదవండి: స్మిత సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు.. ఆనందకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు -
డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదంపై కేసు.. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ డెక్కన్ మాల్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంపై కేసు నమోదైంది. కానిస్టేబుల్ బలప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి భవనం యజమాని మహమ్మద్ ఓవైసీ, ఎంఏ రహీంలు కారణమని గుర్తించారు. ఈ ఘటనలో నలుగురిని రెస్క్యూ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. భవనానికి సెట్ బ్యాక్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మంటల్లో చిక్కుకున్న ముగ్గురు వసీం, జునైద్, జహీర్ కోసం అగ్నిమాపక సిబ్బంది భవనంలోకి వెళ్లారు. బిల్డింగ్ ఓనర్‌ను కూడా లోపలికి తీసుకెళ్లారు. నిన్న అగ్ని ప్రమాద ఘటనలో అస్వస్థతకు గురైన ఫైర్ సిబ్బంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారంతా నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంకా అదుపులోకి రాని మంటలు.. డెక్కన్ మాల్లో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. భవనం దగ్గరికి ఎవరినీ అనుమతించడం లేదు. సెల్లార్లో చిక్కుకున్న వారిపై ఇంకా స్పష్టత రాలేదు. పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భవన యజమానిపై చర్యలకు అధికారులు సిద్దమవుతున్నారు. మంటల్లో కాలిపోయిన భవనాన్ని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు. చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదంతో హైటెన్షన్..
సాక్షి, సికింద్రాబాద్: రామ్‌గోపాల్‌పేట్‌లోని దక్కన్ స్టోర్ భవనంలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలు భవనంలోకి రెండో అంతస్తు కూడా వ్యాప్తించాయి. ఎగిసిపడుతున్న మంటల కారణంగా భవనమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఘటనా స్థలానికి చేరకున్న 10 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాద స్థలంలో దాదాపు 4 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అయితే, అగ్ని ప్రమాద భవనానికి దాదాపు 100 మీటర్ల దూరంలోనే కిమ్స్ ఆసుపత్రి ఉన్నట్టు తెలుస్తోంది. దక్కన్ స్టోర్ నుంచి పొగలు ఆసుపత్రికి వరకు వెళ్తున్నట్టు సమాచారం. అగ్నిమపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. ఇదిలా ఉండగా.. దక్కన్ స్టోర్ నుంచి మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు భవనాలకు వ్యాప్తి చెందాయి. తాజాగా దక్కన్ స్టోర్ బిల్డింగ్ లోపల నుంచి పేలుడు శబ్దాలు వినిపించడం ఆందోళన కలిగిస్తోంది. మంటలు ఎంతకు అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఆ ప్రాంతంలో మంటలు, తీవ్రమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన పొగ కారణంగా ఫైర్ సిబ్బంది కూడా అస్వస్థతకు గురయ్యారు. కాగా, మంటల భయంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇక, రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ చీఫ్ విశ్వజిత్ మీడియాతో మాట్లాడారు. భవనం దగ్గరికి ఫైర్ ఇంజిన్లు వెళ్లే పరిస్థితి లేదన్నారు. అందుకే రెస్య్కూ ఆపరేషన్ ఆలస్యం అవుతుందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయిస్తున్నట్టు తెలిపారు. అవసరమైనే బిల్డింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు.. మంటలు అదుపులోకి రాకపోతే కెమికల్స్ సాయంతో అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కాగా, మంటలు అదుపులోకి రావడానికి మరిన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మంటలు ఇలాగే చెలరేగితే భవనం కూలిపోయే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. -
సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. పక్క బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు
సాక్షి, సికింద్రాబాద్: నగరంలోని దక్కన్ స్టోర్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంటల కారణంగా భవనంలో దట్టమైన పొగ అలుముకుంది. భవనం ఆరో అంతస్తులో మంటలు చెలరేగి కింద వరకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఇదిలా ఉండగా.. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా, మొదటి అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కాసేపటి క్రితమే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మంటలు చేలరేగాయి.. మంటలు కాస్తా పక్కనే ఉన్న మరో భవనానికి వ్యాపించాయి. ఘటనా స్థలంలో మూడు గంటలుగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహాయక చర్యలను పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఫైర్ సిబ్బంది నలుగురు వ్యక్తులను కాపాడారు. మరో ఇద్దరు లోపల ఉన్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అని స్పష్టం చేశారు. -
రాజుకు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీ
కామారెడ్డి టౌన్: గుట్టపైకెళ్లి ప్రమాదవశాత్తు బండరాళ్ల కింద ఇరుక్కుపోయి సురక్షితంగా బయటపడిన రాజు పూర్తిగా కోలుకున్నాడని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజు మానసిక ఆరోగ్యం మెరుగుపరచడానికి శుక్రవారం కౌన్సెలింగ్‌తోపాటు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీని మానసిక వైద్య నిపుణులు, జిల్లా మెంటల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జి.రమణ అందించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు వన్యప్రాణుల వేటకు వెళ్లి మాచారెడ్డి మండలం సింగరాయిపల్లి అడవిలోని ఓ గుట్టపైనున్న బండరాళ్ల కింద మంగళవారం ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. రెండ్రోజులు నరకయాతన అనుభవించాడు. సహాయక బృందం బండరాళ్లను పగులగొట్టి రాజును సురక్షితంగా బయటకు తీసి గురువారం కామారెడ్డి జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించింది. ఈ సందర్భంగా రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ కొన్నిగంటలపాటు తలకిందులుగా ఉండటం, రాళ్లు బరుసుగా ఉండటంతో కాళ్లు, చేతులు రాపిడికి గురై గాయాలయ్యాయని చెప్పాడు. తొడభాగంలో కాస్త పెద్ద గాయమైందని, ఒళ్లునొప్పులతో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నాడు. రాజును శనివారం డిస్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. జీవితంలో తీవ్రమైన బాధ కలిగించిన ఘటనలు, ప్రతికూల పరిస్థితుల(రేప్, పెద్ద ప్రమాదం, అగ్నిప్రమాదం)ను ఎదుర్కొన్నవారు మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని, ఆ భయంకరమైన జ్ఞాపకాల నుంచి బయటకురాలేక చాలామంది మానసికంగా కుంగిపోతుంటారని వైద్యులు తెలిపారు. సాధారణ వైద్యంతోపాటు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఇలాంటివారిని సాధారణస్థితికి తీసుకురావచ్చన్నారు. రాజుతోపాటు కుటుంబసభ్యులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రాం సామాజిక కార్యకర్త డాక్టర్ విరాహుల్ కుమార్, డ్యూటీ డాక్టర్ కాళిదాసు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
రాజు రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. 48 గంటల నరకయాతన నుంచి విముక్తి
సాక్షి, కామారెడ్డి/ కామారెడ్డి టౌన్: రెండు పెద్ద బండరాళ్ల మధ్య.. దాదాపు 48 గంటల పాటు.. ఎటూ కదల్లేని మెదల్లేని పరిస్థితి.. రాత్రివేళ మరీ నరకయాతన. బయట పడతానో లేదో అన్న సందిగ్ధం. కానీ ధైర్యం కోల్పోలేదు. రెండు రాత్రిళ్లు గడిచాయి. అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు ఆ నరకం నుంచి విముక్తి. అధికారులు, సిబ్బందిలో ఒకరి ప్రాణాలు కాపాడగలిగామనే సంతృప్తి..కుటుంబసభ్యుల్లో వెల్లివిరిసిన సంతోషం. గుట్టల్లో బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన రాజు గురువారం క్షేమంగా బయటపడటంతో కుటుంబసభ్యులు, బంధువులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. వేటకు వెళ్లి..బండరాళ్ల మధ్య చిక్కి.. మంగళవారం రెడ్డిపేట–సింగరాయపల్లి రోడ్డులో గన్పూర్ (ఆర్) తండాకు సమీపంలోని పులిగుట్ట అటవీ ప్రాంతానికి వెళ్లిన చాడ రాజు.. రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. ఏదులు, ఉడుములు పట్టుకోవడంలో దిట్ట అయిన రాజు.. ఉడుమును పట్టుకునే క్రమంలోనే బండరాళ్ల మధ్య చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. కాగా రాజు వెంట వెళ్లిన అతని స్నేహితుడు సున్నపు మహేశ్.. అతన్ని బయటకు లాగేందుకు చాలాసేపు విఫలయత్నం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఏ ఇబ్బంది ఎదురవుతుందోనని మహేశ్ భయపడ్డాడు. ఆ రోజు రాత్రంతా రాజుతో మాట్లాడుతూ అక్కడే రాతి గుండుపై ఉండిపోయాడు. బుధవారం ఉదయం ఇక లాభం లేదనుకుని గ్రామంలోని తమ మిత్రులు కొందరికి విషయం చెప్పాడు. వారు కూడా అక్కడికి చేరుకుని తమ వంతు ప్రయత్నాలు చేశారు. రాజు కూడా బయటకు వచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయతి్నంచాడు. కానీ ఫలించలేదు. విధిలేని పరిస్థితుల్లో గ్రామస్తులు, పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసు, రెవెన్యూ, అటవీ సిబ్బంది సమష్టిగా.. రామారెడ్డి ఎస్సై అనిల్ తన సిబ్బందితో అటవీ ప్రాంతంలోని గుట్టల వద్దకు చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెంటనే అదనపు ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం, సీఐ శ్రీనివాస్‌లతో పాటు పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బందిని పంపించారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వచి్చన పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, సహాయ సిబ్బంది.. రాజును రక్షించేందుకు గుట్టను తవ్వే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో స్థానిక యువకుల్ని అప్పుడప్పుడు రాజుతో మాట్లాడిస్తూ ధైర్యం చెప్పారు. ముఖ్యంగా అశోక్ అనే రాజు మిత్రుడు అతని సమీపం వరకు వెళ్లి నీళ్లు, పండ్ల రసాలు అందించడంలో సాయపడ్డాడు. లోపల ఉక్కపోత నుంచి కాపాడేందుకు చార్జింగ్ ఫ్యాన్‌ను లోనికి పంపించారు. బుధవారం రాత్రంతా సహాయక చర్యలు కొనసాగించారు. జేసీబీతో, రాళ్లను బ్లాస్ట్ చేస్తూ.. పులిగుట్ట మొత్తం పెద్దపెద్ద బండరాళ్లతో నిండి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రాళ్ల మధ్యన ఇరుక్కున్న రాజును రక్షించేందుకు మొదట జేసీబీ సాయంతో ప్రయతి్నంచారు. తర్వాత రాళ్లకు డ్రిల్లింగ్‌తో రంధ్రాలు చేసి పేలుడు మందు నింపి బ్లాస్టింగ్ చేశారు. ఈ విధంగా గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 12 సార్లు బండరాళ్లను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ (పెద్ద రాళ్ల ముక్కలు రాజు మీద పడకుండా తక్కువ మోతాదు పేలుళ్లు) చేశారు. బ్లాస్ట్ చేసిన రాళ్లను తొలగించేందుకు జేసీబీని వినియోగించారు. ఈ క్రమంలో రాజుతో వీలైనన్నిసార్లు మాట్లాడుతూ అధైర్యపడవద్దని చెప్పారు. రాళ్లు రాజుపై పడకుండా అడ్డుగా ఏర్పాట్లు చేశారు. సుమారు 20 గంటల ఆపరేషన్ తర్వాత ఎట్టకేలకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజును బయటకు తీయగలిగారు. దీంతో దాదాపు 48 గంటల పాటు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పక్కా ప్రణాళికతో..చాకచక్యంగా.. రెస్క్యూ ఆపరేషన్‌ను జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ స్వ యంగా పర్యవేక్షించారు. బండరాళ్లు పేల్చడం ఒక రకంగా అధికారులు చేసిన సాహసమేనని చెప్పాలి. అందుకనే ఈ తరహా పేలుళ్లలో అనుభవజు్ఞడైన కామారెడ్డికి చెందిన పెంటయ్యతో పాటు అతని బృందాన్ని పిలిపించారు. తక్కువ పరిమాణంలో మందుగుండు అమర్చుతూ పేలుళ్లు జరిపారు. పొరపాటున భారీ విస్ఫోటనం జరిగితే లోపల ఇరుక్కున్న రాజుకు అపాయం జరిగే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో 80 పాల్గొన్నారు. ఆస్పత్రిలో 24 గంటల అబ్జర్వేషన్ రాజును అధికారులు తక్షణమే కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. రెండురోజుల పాటు సరైన ఆహారం లేకపోవడంతో శరీరంలో షుగర్ శాతం తగ్గిన్నట్లు గుర్తించారు. ఎడమ చేతికి వాపు వచి్చంది. బండరాళ్ల మధ్య కదలడంతో రెండు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం రాజు ఆరోగ్యం నిలకడగా ఉందని ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు. అతని ధైర్యమే అతన్ని కాపాడిందని డాక్టర్ సంతోష్ కుమార్ చెప్పారు. అధికారులు దేవుళ్లలాగా వచ్చారు.. పడిపోయిన సెల్‌ఫోన్ తీసుకోవడానికి వెళ్లి రాళ్లలో తలకిందులుగా ఇరుక్కుపోయా. అయినా ధైర్యంగానే ఉన్నా. నేను ఎవ్వరికీ భయపడను.. ఒక్క దేవుడికి తప్ప. అయితే బండరాళ్ల మధ్య నరకం అనుభవించా. కానీ మా వాళ్లకు ధైర్యంగా ఉండాలని, నాకు ఏం కాదని చెప్పా. రాళ్లు పేల్చుతుంటే మాత్రం కొంచెం భయం వేసింది. కలెక్టర్, ఎస్పీ, పోలీస్, రెవె న్యూ, అటవీ, వైద్య శాఖల అధికారులు దేవుళ్లలాగా వ చ్చారు. చాలా కష్టపడి నన్ను బయటకు తీశారు. వాళ్లందరికీ నేను చనిపోయేంత వరకు రుణపడి ఉంటాను. – రాజు అందరికీ రుణపడి ఉంటా.. మా ఆయన్ను ఆ పరిస్థితిలో చూసి చాలా భయపడ్డా. అసలు బయటకు వస్తాడా..బతుకుతాడా?.. నా పిల్లలు, నా పరిస్థితి ఏందని ఏడ్చాను. గుండె ఆగిపోయినంత పని అయింది. సార్లు, డాక్టర్లు అందరూ వచ్చి రెండ్రోజులు కష్టపడి నా భర్తను బతికించారు. అందరికీ జీవితాంతం రుణపడి ఉంటా. – లక్షి్మ, రాజు భార్య బయటికి వస్తాడో లేడో అని అని్పంచింది రాజు రాళ్ల మధ్యలో పడ్డాడని నాకు చెప్పారు. నేను వెళ్లి బయటకు తీయడానికి చాలాసేపు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తర్వాత భయం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చాం. అందరూ వచ్చి కష్టపడి రాజన్నను బతికించారు. పరిస్థితి చూస్తే అసలు బయటికి వస్తాడో లేడో అని భయం వేసింది. అతని బాధ చెప్పలేను. కానీ రాజు చాలా ధైర్యంగా ఉన్నాడు. – అశోక్, రాజు మిత్రుడు -
38 గంటలుగా బోరు బావిలోనే బాలుడు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బైతూల్ జిల్లాలో బోరు బావిలో పడిన 8 ఏళ్ల బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంగళవారం సాయత్రం 5 గంటలకు మండవి గ్రామంలో ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు తన్మయ్ దియావర్ సాహూ అనే బాలుడు. ప్రస్తుతం 55 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బోరుకు సమాంతరంగా గుంతను తవ్వి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ‘బోరు బావిలో పడిపోయిన 8 ఏళ్ల బాలుడిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 33 అడుగల మేర లోతుకు గుంత తవ్వటం పూర్తయింది. 45 అడుగుల వరకు చేరుకోవాలి. ఆ తర్వాత బోరులోకి సొరంగం చేస్తారు. బండ రాళ్లు ఉన్నందుకు సమయం పడుతోంది. బాలుడి నుంచి ఎలాంటి స్పందన లేదు. బహుశా అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉండవచ్చు. బాలుడిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.’ అని తెలిపారు జిల్లా అదనపు కలెక్టర్ శ్యామేంద్ర జైశ్వాల్. రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్), హోమ్ గార్డ్స్, స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: హిమాచల్‌లో హోరాహోరీ.. ‘ఆపరేషన్ లోటస్’ గుబులు.. కొత్త ఎమ్మెల్యేల తరలింపు! -
వరదలో కారుతో సహా కొట్టుకుపోయిన వ్యక్తి.. కాపాడిన రెస్క్యూ టీం
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో ఉప్పొంగుతున్న నదిలో కారుతో సహా చిక్కుకున్న ఓ వ్యక్తిని రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సురక్షితంగా కాపాడింది. నదిలో కారుపై ఉండి సాయం కోసం ఎదురుచూసిన అతడి కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. పౌడీ గర్వాల్ జిల్లా శ్రీ యంత్ర తపు ప్రాంతంలో వరదలో ప్రయాణించినప్పుడు ఇతడి కారు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అతను స్థానికుడే అని, క్షేమంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. నదిలో చిక్కుకున్న వ్యక్తిని ఎస్ఆర్ఎఫ్ కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Uttarakhand: In an operation, late last night, SDRF(State Disaster Response Force)rescued a man who got stuck in a raging river near Sri Yantra Tapoo in Pauri Garhwal district after his car fell into it. The rescued man is a local resident & is safe. (Video Source:SDRF) pic.twitter.com/dduE2y7JDU — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 8, 2022 చదవండి: చీతాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ -
కరకట్ట లీకేజీల ద్వారా కాలనీల్లోకి భారీగా వరదనీరు
-
అమర్నాథ్ యాత్రలో ఆకస్మిక వరదలు.. యాత్రికుల గల్లంతు!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అమర్నాథ్ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మిక వరద పోటెత్తింది. గుహ పరిసరాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది. సుమారు 12 వేల మంది భక్తులు వరదలో చిక్కుకుపోయారు. వరద ఉధృతికి పలువురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య భారీగా పెరగొచ్చని భావిస్తున్నారు. సాయంత్రం 5.30గం. నుంచి కుంభవృష్టి మొదలైంది. భోలేనాథ్ గుహ సమీపంలోనే మొదలైంది కుంభవృష్టి. ఆకస్మిక వరద ఉదృతికి యాత్రికుల టెంట్లు మొత్తం కొట్టుకుని పోయాయి. పలువురు వరదల్లో కొట్టుకుపోగా.. ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. అయితే చాలా మంది కనిపించకుండా పోవడంతో వరదలో కొట్టుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రాణ నష్టం వివరాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విపత్తు నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక వాయిదా వేశారు. ఆకాశం బద్ధలైనట్లుగా.. 2 కిలోమీటర్ల మేర వరద ఒక్కసారిగా కొండపై నుంచి కిందకు పోటెత్తిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పెను విషాదంగా మారే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం తగ్గడంతో.. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు లైట్ల వెలుతురులో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. మరింత సమాచారం అందాల్సి ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Major cloud burst hit holy Amar nath cave,many tents washed Way, several people missing.. Cloudburst near Amarnath lower cave, #NDRF & SDRF teams start rescue operation.#Amarnath #AmarnathYatra #Jammu pic.twitter.com/03MhDB7MNY — Chaudhary Parvez (@ChaudharyParvez) July 8, 2022 #WATCH | J&K: Visuals from lower reaches of #Amarnath cave where a cloud burst was reported. Rescue operation underway by NDRF, SDRF & other agencies #cloudburst (Source: ITBP) pic.twitter.com/LEfOpOpxZO — NewsMobile (@NewsMobileIndia) July 8, 2022 J&K | #Exclusive visuals of flash floods at #Amarnath cave. pic.twitter.com/UM8KPgCTyg — News18.com (@news18dotcom) July 8, 2022 -
‘రోప్‌వే’ బాధితుల తరలింపు పూర్తి
దేవ్‌గఢ్: జార్ఖండ్‌లోని దేవగఢ్‌లో ఆదివారం సాయంత్రం సంభవించిన రోప్‌వే ప్రమాదంలో చిక్కుకుపోయిన పర్యాటకుల తరలింపు పూర్తయింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి మొత్తం 60 మందిని బయటకు తీసుకువచ్చామని అదనపు డీజీపీ ఆర్కే మాలిక్ వెల్లడించారు. సుమారు 46 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆది, సోమవారాల్లో కొందరిని సురక్షితంగా తీసుకురాగా మరో 15 మంది కేబుల్ కార్లలోనే ఉండిపోయిన విషయం తెలిసిందే. దట్టమైన అడవి, కొండప్రాంతం కావడంతో రాత్రి వేళ అధికారులు సహాయక చర్యలను నిలిపివేశారు. అధికారులు వారికి డ్రోన్ల ద్వారా నీరు, ఆహార సరఫరాలను కొనసాగించారు. మంగళవారం ఉదయం తిరిగి సహాయక చర్యలు ప్రారంభించి, రెండు హెలికాప్టర్ల ద్వారా 14 మందిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. తరలింపు సమయంలో హెలికాప్టర్ నుంచి శోభాదేవి(60) ప్రమాదవశాత్తు జారి పడి చనిపోవడంతో ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరిందని అదనపు డీజీపీ ఆర్కే మాలిక్ వెల్లడించారు. కేబుల్ కార్లు ఢీకొన్న సమయంలో ఒక మహిళ చనిపోగా, గాయపడిన మరో 12 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. -
ఉక్రెయిన్‌లో భారతీయులు.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్ పరిణామాలు, ముఖ్యంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల తరలింపే ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సోమవారం హై లెవల్ మీటింగ్ జరిగింది. ఇప్పటికే ఆపరేషన్ గంగ పేరుతో భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా భేటీలో.. కేంద్రమంత్రులు స్వయంగా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లి తరలింపు ప్రక్రియను పర్యవేక్షించాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజ్జు, జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ ఇందులో పాల్గొననున్నట్లు అధికార వర్గాల సమాచారం. వీళ్లు హంగేరి, రొమేనియా, పోల్యాండ్, స్లొవేకియా దేశాలకు వెళ్తారు. అక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తూ.. భారతీయుల తరలింపును వేగవంతం చేస్తారు. భారతీయులను సురక్షితంగా, త్వరగతిన స్వదేశానికి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా ఈ మిషన్‌ను చేపట్టింది కేంద్రం. మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో.. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ నుంచి పోల్యాండ్‌కు వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ తరుణంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండగా.. భారతీయులపై స్థానిక పోలీసులు దాడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఉక్రెయిన్‌లో సుమారు పదిహేను వేల మంది దాకా భారతీయులు ఉన్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. #WATCH | Prime Minister Narendra Modi calls a high-level meeting on the Ukraine crisis. Some Union Ministers may go to neighboring countries of Ukraine to coordinate the evacuations.#RussiaUkraineCrisis pic.twitter.com/yqTFYwspxo — ANI (@ANI) February 28, 2022 -
రెండు రోజులుగా చావు అంచున వేలాడుతూ, చివరికి..
ఊహించని రీతిలో చావు అంచున వేలాడుతూ రెండు రోజులు గడిపాడు ఆ వ్యక్తి. అధికారులు ప్రయత్నించినా.. అతన్ని కాపాడడం వీలు కాలేదు. ఇక తన ప్రాణం పోవడం ఖాయం అనుకుంటూ ఆ యువకుడు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఆ తరుణంలో భారత్ ఆర్మీ ఎంట్రీతో సీన్ మారింది. ఆ కేరళ యువకుడి ప్రాణాలు నిలిచాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లా చేరాడు సమీపంలో చేరాట్ కొండలున్నాయి. వీటిని అధిరోహించాలనుకున్న ఆర్.బాబు (23), తన స్నేహితులు సోమవారం నాడు ట్రెక్కింగ్‌కు వెళ్లారు. కొండ అలా ఉండడంతో కష్టంగా అనిపించడంతో ఇద్దరు స్నేహితులు మధ్యదాకా వెళ్లి కిందకు వచ్చేశారు. కానీ, బాబు మాత్రం ధైర్యంగా ముందుకెళ్లి కొండపైకి చేరుకున్నాడు. కానీ, తిరిగి వచ్చే క్రమంలో అతనికి పట్టు జారిపోయింది. దీంతో రెండు బండరాళ్ల మధ్య చీలికలో చిక్కుకుపోయాడు. అక్కడి నుంచి బయటపడే మార్గం తోచలేదు. సీఎం చొరవతో.. కొండ అంచు చీలిక భాగంలో రెండు రోజులుగా చిక్కుకుపోయి సోమవారం నుంచి ఆహారం, నీరు లేకుండా అక్కడే చిక్కుకుపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన చావు ఇలా రాసి ఉందా? అని యువకుడు అనుకున్నాడు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఆర్మీ సాయాన్ని కోరారు. దీంతో బుధవారం ఉదయానికి రెండు ఆర్మీ బృందాలు చేరాట్ కొండ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇందులో ఒకటి మద్రాస్ రెజిమెంట్ కు చెందిన బృందం. ఇందులో పర్వతాల అధిరోహణలో నైపుణ్యం కలిగిన సైనికులు ఉన్నారు. అలాగే, బెంగళూరు నుంచి పారాచ్యూట్ రెజిమెంట్ కు చెందిన 22 మంది సైనికుల బృందం అన్ని రకాల ఎక్విప్ మెంట్ తో చేరుకుంది. ముందు తిండి.. ఆపై బాబును సహాయ కార్యక్రమాలు బుధవారం ఉదయం 5.45 గంటలకు మొదలయ్యాయి. డ్రోన్ల సాయంతో బాబు జాడను గుర్తించారు. తొలుత అతడికి తిండి, నీరు అందించారు. ఆపై అతడికి కొంచెం ఓపిక వచ్చాక.. అనంతరం అక్కడి నుంచి క్షేమంగా కిందకు తీసుకొచ్చారు. కాగా, సురక్షితంగా ఒక ప్రాణం నిలబెట్టిన భారత్ ఆర్మీకి సోషల్ మీడియా సలాం చెబుతోంది. కృతజ్క్షతలు చెప్పినవాళ్లలో కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఉన్నారు. Worries have been put to rest as the young man trapped in the Cherad hill in Malampuzha has been rescued. The treatment & care needed to regain his health will be provided now. Thanks to the soldiers who led the rescue operation and everyone who provided timely support. pic.twitter.com/YAwHQOxZAP — Pinarayi Vijayan (@vijayanpinarayi) February 9, 2022 -
కేరళలో కొండ చీలికలో చిక్కుకున్న యువకుడు..
-
‘అమ్మా కాపాడు..’ అని అరుస్తూ ఆ పసిగుండె ఆగింది
ఐదేళ్ల పసిబాలుడు.. ఐదు రోజుల పాటు చీకటి ఊబిలాంటి బావిలో అల్లాడిపోయాడు. ఆకలి, ఆక్సిజన్ అందిస్తూ అభయం అందించినా.. భయంతో ‘అమ్మా.. పైకి లాగమ్మా’ అంటూ వేసిన కేకలు కోట్ల మందిని చలింపజేశాయి. నిర్విరామంగా కృషి చేసిన సహాయక సిబ్బంది.. ఆ చిన్నారిని చేరుకునేలోపే నష్టం జరిగిపోయింది. ఆ చిన్నారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయింది. బోరుబావి విషాద ఘటన.. మొరాకోలో మాత్రమే కాదు ఆ మాటకొస్తే ఇంటర్నెట్ ప్రపంచం మొత్తానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. రయాన్ అవ్రామ్ వయసు ఐదేళ్లు. షెఫ్షావూలోని తన ఇంటి దగ్గర పోయిన మంగళవారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 32 మీటర్ల లోతైన బోరుబావిలో పడిపోయాడు. పిల్లాడు సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తప్పిపోయాడేమోనని అంతా వెతికారు. అయితే, సమీపంలోని బోరు బావి నుంచి కేకలు వినిపిస్తుండడంతో అప్రమత్తమైన స్థానికులు.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లైట్లు వేసి చూశారు. తనను పైకి లాగాలంటూ ఆ చిన్నారి ఆర్తనాదాలు చేశాడు. వెంటనే అధికారులకు సమాచారమివ్వగా వారొచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల పాటు ఆపరేషన్ సాగింది. పిల్లాడికి గొట్టం ద్వారా తిండి, నీళ్లు, ఆక్సిజన్ పంపించారు. ఊపిరి ఆడక ఆ చిన్నారి ఆక్సిజన్ పైపు దగ్గరికి ముఖం పోనిచ్చిన వీడియోలు, ఫొటోలు వైరల్ కావడం.. పలువురిని కంటతడి పెట్టించింది. నాన్‌స్టాప్ ఆపరేషన్ పిల్లాడిని బతికించేందుకు బోరుబావికి సమాంతరంగా అధికారులు సొరంగం తవ్వడానికి తీవ్రంగా శ్రమించారు. భారీ ఎత్తున జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు స్థానికులు సైతం సహకరించారు. వాళ్ల కోసం వంటవార్పు సిద్ధం చేసి.. సహాయక కార్యక్రమాలు ఆగిపోకుండా చూసుకున్నారు. మరోవైపు దేశం మొత్తం, ఇంటర్నెట్ నిండా ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనల పోస్టులు కనిపించాయి. ఐదురోజుల శ్రమ అనంతరం బాలుడు ఇరుకున్న చోటుకు చేరుకున్నారు. కానీ, అప్పటికే ఆ పిల్లాడి ఊపిరి ఆగిపోయింది. విగత జీవిగా మారిన తమ బిడ్డను చేతుల్లోకి తీసుకుని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మొరాకో వ్యాప్తంగా పాఠశాలల్లో నివాళిగా పిల్లలు ర్యాలీలు తీశారు. ఘటనపై గురించి తెలిసి మొరాకో రాజు మహ్మద్ సంతాపం తెలిపారు. Morocco moves a mountain to save a child 🇲🇦#SaveRayan 🇲🇦 humanity first ✊🏿✊🏿 pic.twitter.com/fp2jaSW8fL — Distinguished Senator (@Senatorisiaq) February 5, 2022 Minutes after the announcement of the death of the child #Rayan in Morocco, a young man from Palestine, Hamza Mansour, has a child and calls him #Rayan, in solidarity with the cause of the Moroccan child Rayan and in honor of his memory 💔🇲🇦🇵🇸 #Ryan pic.twitter.com/9m28efE78x — Simø Elyouzghi (@Mohamed365076) February 6, 2022 బా అంకుల్ కంటతడి పెట్టిన వేళ.. రయాన్ మరణవార్త తెలిసిన తర్వాత.. మొరాకో మొత్తం విషాదంలోకి కూరుకుపోయింది. చాలా చోట్ల ఆ చిన్నారికి నివాళులు అర్పించారు. పాలస్తీనాకు చెందిన ఓ తండ్రి.. అప్పుడే పుట్టిన తన బిడ్డను రయాన్ అని పేరు పెట్టడం విశేషం. బా అలీ.. మొరాకో మొత్తం బా అంకుల్ అని ముద్దుగా పిల్చుకుంటుంది. బోరు బావులను తవ్వడంలో నేర్పరి అయిన బా అలీ.. గతంలోనూ ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్లు ఎన్నో నిర్వహించారు కూడా. వంద గంటలపాటు నాన్‌స్టాప్‌గా పని చేసిన బా అంకుల్.. చివరికి చిన్నారి రయాన్ ప్రాణాలతో లేడనే విషయం తెలిసి కన్నీళ్ల ప్రాయం అయ్యాడు. Rest In Peace to Rayan 👼🏻 So sad. Was praying he would make it out of the well safe, but God had other plans for this little boy 💔Praying for his family 🙏🏼 #Rayan pic.twitter.com/6ESpSoehFT — ENISA (@IAmENISA) February 5, 2022 All the love & respect to Ba (uncle) Ali who dug with his hand for more than 100 straight hours to help in Rayan's rescue operation. Ba Ali, a well-drilling expert who never cared about the looming risk & insisted on contributing his long experience to save the little #Rayan. 😞 pic.twitter.com/escoatEs8Z — Zouhir • ⵣⵓⵁⵉⵔ (@oskai_z) February 6, 2022 #Rayan may have not survived but they are still heroes. Along with parents of Ryan No one can estimate the immense pain of the rescue workers who worked 24x7 to save him May Allah grant them paradise also 🤲🏽 #Ryan#PrayforRayan #ريان_المغرب #الطفل_ريان pic.twitter.com/C4948V9mbN — Mubeen ❄️ (@MubeenFatma) February 5, 2022 -
సీఎం జగన్ సత్వర స్పందన.. నదిలో చిక్కుకున్న 10 మంది సురక్షితం, వైరలైన దృశ్యాలు
సాక్షి, అనంతపురం: ఏపీ సర్కార్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఫలించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సకాలంలో స్పందించటంతో అనంతపురం జిల్లాలో చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈరోజు ఉదయం చిత్రావతి నదిలో రాప్తాడు నియోజకవర్గంలో ని చెన్నేకొత్తపల్లి మండలం వెల్తుర్ది వద్ద కారు గల్లంతైంది. వారిని రక్షించేందుకు స్థానికులు, ఫైర్ సిబ్బంది వెళ్లారు. అంతా కలిసి 10 మంది చిత్రావతి నదిలోని జేసీబీ పై ఉండిపోయారు. అనంతపురం జిల్లా యంత్రాంగం వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. (చదవండి: వైఎస్సార్ జిల్లా: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు) విషయాన్ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ చొరవతో ఇండియన్ నేవీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆగమేఘాలపై ప్రత్యేక హెలికాప్టర్ అనంతపురం వచ్చింది. సహాయక బృందాలు చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మందిని సురక్షితంగా కాపాడాయి. రెస్క్యూ ఆపరేషన్‌ను అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పర్యవేక్షించారు. సీఎం సత్వర స్పందనపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాకిది పునర్జన్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సకాలంలో స్పందించి ప్రత్యేక హెలికాప్టర్ పంపటం వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని చిత్రావతి నదిలో చిక్కుకుని సురక్షితంగా బయపడిన బాధితులు చెప్పారు. సీఎం జగన్ చొరవ వల్ల తమకు పునర్జన్మ లభించిందని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం.. ప్రత్యేక హెలికాప్టర్ వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం చకచకా జరిగిపోయాయని అన్నారు. (చదవండి: నా తల్లి, కుమార్తెపై దాడి చేసి కొట్టారు.. గత్యంతరం లేకే ఇలా..) -
Viral: కరెంట్ వైర్ల మధ్య పావురం.. డ్రోన్‌తో పోలీసుల రెస్క్యూ
ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. వ్యవసాయం రంగం మొదలుకొని రక్షణ రంగం వరకు అన్ని సేవలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా పెరు దేశ రాజధాని లీమాలో డ్రోన్ సాయంతో ఓ పావురం ప్రాణాలు కాపాడారు అక్కడి పోలీసులు. ఓ పావురం కాలుకు దారం చుట్టుకోవటంతో హైటెన్షన్ వైర్‌కు చిక్కుకొని కిందికి వేలాడుతూ.. ఎగరలేక విలవిలాడింది. ఇది గమనించిన పోలీసులు ఆ పావురాన్ని రక్షించడానికి డ్రోన్‌ను ఉపయోగించారు. డ్రోన్‌కు కత్తి కట్టి కరెంట్ వైర్ల మధ్య దాన్ని ఆపరేట్ చేస్తూ నెమ్మదిగా పావురం కాలుకున్న దారాన్ని కట్‌చేశారు. దీంతో పావురం సురక్షితంగా కిందపడింది. అనంతరం దాని కాలుకు చుట్టుకొని ఉన్న మొత్తం దారాన్ని తొలగించి పంజరంలో వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
విషాదం: ఈ తల్లి త్యాగానికి చేతులెత్తి మొక్కాల్సిందే!
Venezuela Mother Sacrifice Story: మనిషికి మాత్రమే కాదు.. మిగతా జీవరాశికి తల్లి స్పర్శే మొదటి ప్రేమ. అమ్మ ప్రేమ జీవికి ఆప్యాయతను పరిచయం చేస్తుంది. ‘అమ్మ’.. మాటల్లో వర్ణించలేని ఓ మధురానుభూతి. అందుకేనేమో తల్లికి మాత్రమే సాధ్యపడే త్యాగానికి ఆమె సిద్ధపడింది. ప్రాణం పోతోందని తెలిసి కూడా సాహసానికి పూనుకుంది. తాను నరకం అనుభవిస్తూ.. బిడ్డల ఆకలిని తీర్చింది. చివరికి ప్రాణ త్యాగంతో పిల్లల్ని బతికించుకుని.. మృత్యువు ఒడిలోకి ఒదిగిపోయింది. ఆ తల్లి గాథ సోషల్ మీడియాలో ఇప్పుడు అందరితో కంటతడి పెట్టిస్తోంది. వెనిజులా బోట్ ప్రమాదం.. సెప్టెంబర్ 3న కరేబియన్ దీవులవైపు వెళ్లిన వెనిజులా టూరిస్ట్ క్రూజ్ బోట్ ఒకటి అదృశ్యం అయ్యిందని నావికా అధికారులకు సమాచారం అందింది. దీంతో సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టారు. నాలుగు రోజుల తర్వాత ‘లా టార్టు’ దీవి సమీపంలో ఓ చిన్నసైజు లైఫ్ బోట్‌ను గుర్తించి.. దగ్గరి వెళ్లి ఆ దృశ్యాన్ని చూసి సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. తల్లి మృతదేహం పక్కనే ఒదిగిన ఇద్దరు చిన్నారుల్ని గుర్తించి వెంటనే కాపాడారు. ఆ తల్లి పేరు మార్లేస్ బీట్రిజ్ చాకోన్ మర్రోక్విన్. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి సరదా ట్రిప్ కోసం వెళ్తే.. అది కాస్త వాళ్ల జీవితాల్లో విషాదాన్ని నింపింది. నరకం ఓర్చుకుంది.. భారీ అలల కారణంగా క్రూజ్ దెబ్బతినగా.. చిన్న లైఫ్ బోట్ సాయంతో మార్లేస్, తన బిడ్డల్ని రక్షించుకునే ప్రయత్నం చేసింది. వెనిజులా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అక్వాటిక్ స్పేసెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగాక నాలుగు రోజులపాటు ఆ తల్లీబిడ్డలు ఆ చిన్న లైఫ్బోట్లోనే ఉన్నారు. తన ఇద్దరు బిడ్డల్ని(ఒకరికి రెండేళ్లు, ఒకరికి ఆరేళ్లు) డీహైడ్రేషన్, అలల నుంచి కాపాడుకునేందుకు మార్లేస్ వీలైనంత ప్రయత్నం చేసింది. వాళ్ల ఆకలి తీర్చేందుకు పాలు పట్టింది. తన మూత్రాన్ని తానే తాగి ఆకలి తీర్చుకుంది. వేడికి ఆమె ఒళ్లంతా మంటలు పుట్టాయి. అయినా ఓర్చుకుంది. తనకేమైనా పర్వాలేదనుకుని.. బిడ్డల్ని అక్కున చేర్చుకుని వేడి తగలకుండా చూసుకుంది. చివరికి డీహైడ్రేషన్ కారణంగా అవయవాలు దెబ్బతిని ప్రాణం విడిచిందామె. మొత్తం తొమ్మిది మంది లైఫ్ బోటులో తల్లి మృతదేహంలో ఒదిగి పడుకున్న పిల్లలను.. కారాకస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లల ఒంటిపై సూర్య తాపానికి బొబ్బలు వచ్చాయి. తిండి లేక నీరసించిపోయిన ఆ పిల్లల్ని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చారు కూడా. మరోవైపు ఈ ఇద్దరు పిల్లల్ని చూసేందుకు నియమించిన యువతి వెరోనికా మార్టినెజ్(25).. పక్కనే ఓ ఐస్ బాక్స్‌లో పడుకుని బతికి బట్టకట్టింది. ప్రస్తుతం కోలుకున్న ఆ యువతి.. మానసికంగా మాత్రం కోలుకోలేకపోతోంది. అయితే ఆ మార్లేస్ భర్త రెమిక్ డేవిడ్ కాంబ్లర్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. సరదా ట్రిప్‌లో భాగంగా వెనిజులా హిగుయిరోట్ నుంచి లా టార్టుగా ఐల్యాండ్(కరేబియన్ దీవులు) వైపు తొమ్మిది మందితో వెళ్లింది. భారీ అల కారణంగా మొదట పాడైన బోటు.. ఆ తర్వాత అలల ధాటికి చెల్లాచెదురై ఉంటుందని, సుమారు 70 మైళ్ల దూరం కొట్టుకుని పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదంలో మిగిలిన వాళ్లెవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఆ మాతృమూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చదవండి: ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అన్నారు -
సిమ్లా హైవే పై విరిగిపడ్డ కొండచరియలు
-
విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు
సిమ్లా: ప్రకృతి ప్రకోపిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ప్రమాదంతో ఈ వ్యాఖ్యలు నిజం అని మరోసారి రుజువు అయ్యింది. కిన్నౌర్ జిల్లోని రెఖాంగ్ పీయో – సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మధ్యాహ్నం 12:45 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఒక లారీ, ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలు చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో పదిమంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడడంతో వాహనాలన్నీ బండరాళ్ల కింద చిక్కుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన బస్సులో ఏకంగా 40 మంది ప్రయాణికులు చిక్కుకోగా.. ఇప్పటికి కొందరిని రక్షించగా. మరో 20 మందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ఐటీబీపీ) సహాయక చర్యలు ప్రారంభించారు. సంఘటన స్థలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ సందర్భంగా కిన్నౌర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘నిగుల్సారి ప్రాంతం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ ఆర్టీసి బస్సు అక్కడ చిక్కుకుపోయింది. ఇప్పటికే బస్సు డ్రైవర్ని, కొందరిని రక్షించాం. సహాయక చర్యలు కొనసాగతున్నాయి’’ అని తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌కు కాల్ చేసి.. పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఐటీబీపీ డీజీతో కూడా మాట్లాడారు. అలానే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా జైరామ్ ఠాకూర్‌తో మాట్లాడారు. -
వరదల్లో చిక్కుకున్న హోం మంత్రి.. తాడు కట్టి పైకి లాగారు
భోపాల్: మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తం మిశ్రాకు చేదు అనుభవం ఎదురయ్యింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వెళ్లిన నరోత్తం.. చివరకు తానే వరదలో చిక్కుకుపోయాడు. విషయం తెలిసిన వెంటనే అధికారులు హెలికాప్టర్ని రంగంలోకి దించి.. తాడు సాయంతో ఆయనను పైకి లాగి రక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కుండపోత వర్షాల కారణంగా మధ్యప్రదేశ్ దాతియా జిల్లాలో భారీగా వరదలు సంభవించాయి. ఈ క్రమంలో జిల్లాలోని కోట్రా గ్రామంలో ప్రజలు వరదలో చిక్కుకుని ఇబ్బందులు పడసాగారు. ఈ క్రమంలో వరద తీవ్రత పెరగడంతో కొందరు గ్రామస్తులు ఇంటి మీదకు చేరి సాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది. వారికి సాయం చేసేందుకు హోం మినిస్టర్ నరోత్తం మిశ్రా.. కొందరు సహాయక సిబ్బందితో కలిసి పడవలో కోట్రా గ్రామానికి బయల్దేరారు. ఇంతలో ఉన్నటుండి ఓ చెట్టు పడవ మీద పడటంతో అది అక్కడే చిక్కుకుపోయింది.. ముందుకు కదలేదు. పరిస్థితి గురించి నరోత్తాం మిశ్రా ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ని రంగంలోకి దింపారు. తాళ్ల సాయంతో ఆయనను పైకి లాగారు. అనంతరం వరదల్లో చిక్కుకున్న మరో తొమ్మిది మంది గ్రామస్తులను కూడా కాపాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
బాలుడి కోసం, బావిలోకి గ్రామస్తులు, నలుగురు మృత్యువాత
-
Borewell: 16 గంటల ఆపరేషన్, బాలుడు సేఫ్
జైపూర్: దేశంలో పలు చోట్ల బోరు బావుల్లో చిన్నారులు పడిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఆయా ఘటనల్లో కొందరు పిల్లలు ప్రాణాలు విడువగా.. మరికొందరు బతికి బయటపడ్డారు. అయితే, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. బోరు బావుల యజమానులు కొందరు తమ దారి తమదే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలో ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు. పిల్లాడిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యమే బాలుడిని ప్రమాదంలో పడేసింది వివరాల్లోకి వెళితే.. జాలోర్ జిల్లాలోని లచ్‌హ్రీ అనే గ్రామానికి చెందిన రైతు నాగరమ్ దేవసీ తన వ్యవసాయ పొలంలో రెండు రోజుల క్రితం బోరు వేయించాడు. నాగారామ్ కొడుకు అనిల్ దేవాసీ ప్రమాదవశాత్తు ఆ బావిలో జారి పడిపోయాడు. ఆ బావి సుమారు 95 అడుగులు లోతు ఉంది. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి.. చుట్టుపక్కలవారికి విషయం చెప్పాడు. దీంతో వారు పోలీసులకు, ఎన్డీఆర్ఎఫ్ టీంకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి సుమారు 16 గంటల తీవ్రంగా శ్రమించిన అనంతరం బాలుడిని బావిలోంచి బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఆక్సిజన్‌తో నిలిచిన ప్రాణం.. స్థానిక ఎస్‌హెచ్‌వో ఆచార్య మాట్లాడుతూ.. ‘బాలుడు బోరు బావిలో పడిపోయాడని సమాచారం అందగానే హుటాహుటిన అక్కడకు చేరుకున్నాం. పిల్లాడి వద్దకు కెమెరా పంపించి అతని క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాం. పిల్లాడికి పైపు ద్వారా ఆక్సిజన్‌ను, ఆహార పదార్థాలు కూడా బావిలోకి పంపించాము. అలాగే బాలుడు నిద్రపోకుండా ఉండటానికి మా జట్టు సభ్యులు నిరంతరం కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాం. సహాయక కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగాయి. బాలుడిని క్షేమంగా బయటకు తీయగలిగాం’అని చెప్పారు. ( చదవండి: అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్’ ముప్పు ) #UPDATE | Rajasthan: The four-year-old boy who fell into a nearly 95-feet-deep open borewell in a village in Jalore has been rescued. pic.twitter.com/UEak9keBEN — ANI (@ANI) May 7, 2021 -
వైరల్: హాలీవుడ్ యాక్షన్ సీన్లను తలదన్నే ‘ఆపరేషన్’
ఆమ్స్టర్డామ్: చాలా సినిమాల్లో చూసే ఉంటాం.. కింద కారులో, సముద్రంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదంలో ఉంటే.. మన హీరో గారు హెలికాప్టర్లో వచ్చి.. తాడు నిచ్చెన సాయంతో కిందకు దిగి ప్రమాదంలో ఉన్న వారిని కాపాడతాడు. సినిమాల్లో అంటే ఏం చూపించినా చెల్లుతుంది. పైగా ఇలాంటి రిస్కీ షాట్లలో పని చేసేది.. హీరోలు కాదు.. డూపులే అన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ సైన్యంలో రెస్క్యూ టీంలలో ఇలాంటి రియల్ హీరోలు ఉంటారు. వారు ప్రాణాలకు తెగించి మరి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడతారు. తమకు ప్రమాదం అని తెలిసినా.. వారి జీవితాలను పణంగా పెట్టి.. మరి ఇతరులను ఆదుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సముద్రంలో వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల కార్గో షిప్ భారీ ఆటుపోట్లకు గురవుతుంది. ఈ లోపే సహాయక సిబ్బంది అత్యంత చాకచక్యంగా షిప్లో ఉన్న 12 మందిని సురక్షితంగా కాపాడారు. ఆ వివరాలు.. జర్మనీలోని బ్రెమెర్‌హావెన్ నుంచి నార్వేలోని కొల్వరైడ్ వరకు పలు చిన్న నౌకలను తీసుకువెళుతున్న డచ్ కార్గో షిప్ "ఈమ్స్లిఫ్ట్ హెండ్రికా" సోమవారం సముద్రంలో ప్రయాణిస్తుండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆటుపోట్లకు గురవుతుంది. ప్రమాదం గురించి షిప్లో ఉన్న సిబ్బంది ముందే తమ యాజమాన్యానికి సమాచారం అందించడంతో వారు సహాయక సిబ్బందిని పంపిస్తారు. ఇక హెలికాప్టర్ ద్వారా రంగంలోకి దిగిన సిబ్బంది షిప్లో ఉన్న 12మందిని రెండు విడతల్లో కాపాడారు. ఆపరేషన్‌లో భాగంగా సహాయక సిబ్బంది తొలుత షిప్ డెక్ మీద ఉన్న వారిలో 8 మందిని గాల్లోకి లేపి హెలికాప్టర్లోకి చేరవేశారు. ఈలోపు షిప్ ప్రమాద తీవ్రత పెరగడంతో మిగిలిన నలుగురిని సముద్రంలోకి దూకమని చెప్పి.. ఆ తర్వాత వారిని కూడా రక్షించారు. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్ సాగిన తీరు చూస్తే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. డెక్ మీద ఉన్న వారిని కాపాడటం కోసం తొలత హెలికాప్టర్లో ఉన్న సహాయక సిబ్బంది ఒకరు ఇనుప తాడు సాయంతో షిప్ డెక్ మీదకు దిగుతాడు. ఆ తర్వాత అతడు ఒక్కొక్కరిని అదే తాడు ద్వారా హెలికాప్టర్లోకి పంపిస్తాడు. ఇలా 8 మందిని కాపాడిన తర్వాత షిప్ ఆటుపోట్లకు గురవుతూ ప్రమాదకర రీతిలో కదులుతుంది. దాంతో డెక్ మీద మిగిలిన నలుగురిని సముద్రంలోకి దూకమని చెప్పి.. ఆ తర్వాత వారిని కాపాడారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చదవండి: సూయెజ్ దిగ్బంధనం నేర్పుతున్న పాఠాలు -
అన్వేషణలో డ్రోన్లు, భారీ యంత్రాలు
డెహ్రాడూన్: హిమానీనదం వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లో ఇంకా 174 మంది ఆచూకీ లభించడం లేదు. ఎన్టీపీసీ హైడల్ ప్రాజెక్టు తపోవన్ సొరంగ ముఖద్వారం మట్టి, రాళ్ల పెళ్లలతో మూసుకుపోవడంతో సహాయ చర్యలు అత్యంత సంక్లిష్టంగా మారాయి. భారీ యంత్రాల సాయంతో వాటిని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో సొరంగంలో చిక్కుకుపోయిన 25–35 మంది కార్మికుల్ని కాపాడడానికి డ్రోన్లను, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలను మోహరించి గాలిస్తున్నారు. ‘‘సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. లోపలికి వెళ్లడానికి భారీగా పేరుకుపోయిన రాళ్లతో కూడిన బురద అడ్డంగా ఉంది. దానిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’అని ఉత్తరాఖండ్ డీఐజీ నీలేశ్ ఆనంద్ భార్నె చెప్పారు. సొరంగ మార్గంలో శిథిలాలతో కూడిన బురద ఎండిపోవడంతో గట్టిపడి లోపలికి వెళ్లడానికి వీల్లేకుండా ఉంది. ఇప్పటివరకు 80 మీటర్ల లోపలికి తవ్వకాలు జరిపారు. 100 మీటర్ల వరకు వెళితే లోపల చిక్కుకున్న వారీ ఆచూకీ తెలియవచ్చు’’అని వెల్లడించారు. అలుపెరుగని సాయం.. కేవలం సొరంగ మార్గం వద్ద సహాయ చర్యల కోసం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, సహస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ) సిబ్బంది 600 మందికి పైగా నిరంతరాయంగా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. పెద్ద పెద్ద మంచుపెళ్లల్ని పెకిలించడం, నీటిని భారీ యంత్రాలతో తోడుతున్నప్పటికీ ఇంకా బాగా వస్తూనే ఉంది’’అని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తామన్నారు. అయితే సొరంగానికి అడ్డంగా ఉన్న శిథిలాల తొలగింపు ఆలస్యమవుతున్న కొద్దీ లోపలున్న వారి పరిస్థితి ఎలాగ ఉందోనన్న ఆందోళన పెరుగుతోంది. ‘‘కాలం గడుస్తున్న కొద్దీ ఆ కార్మికులు సజీవంగా ఉంటారన్న నమ్మకం పోతోంది. అయితే ఏదైనా అద్భుతం జరిగితే వారిని కాపాడుకోవచ్చు’’అని రాష్ట్ర సహాయ బృందం సభ్యుడు పీయూష్ అన్నారు. ‘రేయింబగళ్లు శిథిలాలను తొలగిస్తున్నా పని పూర్తి అవడం లేదు. సొరంగం వెలుపల ఆక్సిజన్ సిలండర్లు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు’ అని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే అన్నారు. -
బంగారు గనిలో పేలుడు: 10 మంది దుర్మరణం
బీజింగ్/ జినాన్: చైనాలోని షాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న బంగారు గనిలో పేలుడు సంభవించిన రెండు వారాలకు ప్రమాదంలో చిక్కుకున్న వారి వద్దకు చేరుకున్నారు. రెండువారాల పాటు గనిలో చిక్కుకున్న వారిలో 10 మంది మృత్యువాత పడగా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. జనవరి 10వ తేదీన బంగారు గనిలో ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదం జరిగిన విషయం మాత్రం 30 గంటల తర్వాత అధికారులకు తెలిసింది. దీంతో బాధితులను కాపాడే ప్రయత్నాలు ఆలస్యమయ్యాయి. విషయం తెలిసిన అనంతరం హుటాహుటిన నిపుణులను తరలించి వారిని వెలికితీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే భూగర్భంలో నీటి తాకిడి భారీగా ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. గని ముఖద్వారంపై వెయ్యి అడుగుల లోతున 70 టన్నుల మట్టి కూరుకుపోవడంతో మరింత కష్టమైంది. వారిని బయటకు తీసేందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. లోపల ఉన్నవారి పరిస్థితిపై ఆందోళన చెందిన అధికారులు వీలైనంత త్వరగా బయటకు తీసుకొద్దామని ప్రయత్నించారు. రెండు వారాల పాటు తీవ్రంగా శ్రమించి ప్రమాదంలో చిక్కుకున్న వారిని 25వ తేదీన బయటకు తీసుకొచ్చారు. అయితే అధికారులు చేరుకునేలోపు 10 మంది మరణించగా, మరో 11 మంది ప్రాణాలతో ఉన్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. మరొక వ్యక్తి ఆచూకీ లభించలేదు. అతడి కోసం అధికారులు వెతుకున్నారు. అయితే గనిలో పేలుడుకు కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. చైనాలో మైనింగ్ పరిశ్రమలో ప్రమాదాలు తరచూ సంభవిస్తుంటాయి. ఏటా దాదాపు 5 వేల మంది మరణిస్తుంటారని ఆ దేశ మీడియా తెలిపింది. -
అది క్లాత్ కాదు.. చిరుతపులి
గువాహటి: ఓ లేడీస్ హాస్టల్లో ప్రవేశించిన చిరుతపులి భయాందోళనలను సృష్టించింది. గువహటిలోని హెంగ్రాబరీ ప్రాంతంలో లేడిస్ హాస్టల్లోకి చిరుతపులి ప్రవేశించడంతో స్థానికంగా అలజడి రేగింది. హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు అస్సోం రాష్ట్రంలోని జూ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను బంధించారు. హస్టల్ వార్డెన్ మౌసుమి బోర సమాచారం మేరకు సోఫా కింద ఏదో క్లాత్ ఉందని తీయడానికి ప్రయత్నించగా అది క్లాత్ కాదని కూృరమృగమని తెలిసింది. వెంటనే బోరాతో సహా హాస్టల్లో ఉంటున్న మరో 15మంది పైకి వెళ్లిపోయి రూమ్ డోర్ వేసుకోని ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. చదవండి: (రాజీవ్ గాంధీ విగ్రహానికి మసి పూశారు) ట్రాంక్విలైజర్ గన్‌తో అస్సోం జూ అధికారులు, వైల్డ్ లైఫ్ టెర్రిటోరియల్ డివిజన్ అధికారులు పోలీసులతో కలిసి హాస్టల్‌కు చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటలసేపు కష్టపడి చిరుత పులిని బంధించి జూ కి తరలించారు. చిరుతపులికి గాయాలు అయ్యాయేమో చూసి అడవిలో వదిలుతామన్నారు. దీనిలో భాగంగా చిరుతకు మైక్రోచిప్‌ని అమర్చుతామని అధికారులు తెలిపారు. అధికారుల మరోక విజయవంతమైన ఆపరేషన్ చేశారని, హాస్టల్లో ప్రవేశించిన ఒక చిరుతపులిని ఎలాంటి హానీ జరగకుండా రెస్క్యూ చేశారని అస్సోం అటవీ శాఖ మంత్రి పరిమల్ శుక్లాబైద్య ట్వీట్ చేశారు. ఈ విజయం అస్సోం జూ అధికారులదని ఆయన కొనియాడారు. (చదవండి: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే నిర్వాకం) -
పీలేరులో ఎన్డీఆర్ఫ్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం
-
హమ్మయ్య.. ప్రాణాలతో తీరానికి..
సాక్షి, విశాఖపట్నం: గాజువాక ప్రాంతంలోని యారాడలో సముద్ర తీరంలో చిక్కుకున్న ముగ్గురు యువకులు చావు అంచుల నుంచి తప్పించుకున్నారు. ఆటవిడుపుగా యారాడకు వచ్చిన ఏడుగురు యువకులు అలల తాకిడికి తీరంలోని పిట్ల కొండ వద్ద రాళ్లలో చిక్కుకున్నారు. వారిలో నలుగురు యువకులు బయపడగా.. మిగతా ముగ్గురు మాత్రం అక్కడి నుంచి రాలేకపోయారు. తమ మిత్రులు ప్రమాదంలో చిక్కుకున్నారని యువకులు న్యూ పోర్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పోలీసులు .. రెవెన్యూ, రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో అధికార యంత్రాంగం యువకులను రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో నగరానికి చెందిన కొండ నవీన్ (20), భీశెట్టి యశ్వంత్ (20), కె.శ్రవణ్ (20) ను రక్షించించారు. యువకులు క్షేమంగా బయటపడటంతో అధికారులు, కుటుంబ సభ్యులు, వారి మిత్రులు ఊపిరిపీల్చుకున్నారు. -
మృత్యుసొరంగం
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచుతున్న భారీ జలవిద్యుత్ కేంద్రం కొందరు ఉద్యోగుల జీవితాలను చీకటిమయం చేసింది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన భారీ అగ్నిప్రమాదం తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుంది. రూ. వందల కోట్ల ఆస్తి నష్టాన్ని మిగిలిచ్చింది. జలవిద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్ ప్యానల్ బోర్డులో మంటలు చెలరేగడం, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్ పేలుడుతో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ఉండగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఏడుగురు జెన్కో ఉద్యోగులుకాగా, మిగిలిన ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన వారు. మరో ఎనిమిది మంది ఉద్యోగులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు... గురువారం రాత్రి 10:30 నుంచి 11:00 గంటల సమయంలో 900 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంగల శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉన్న 4వ యూనిట్‌లోని ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్‌తో తొలుత మంటలు రేగాయి. ఆ వెంటనే ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో విధుల్లో ఉన్న డీఈ పవన్, ఇతర ఉద్యోగులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడమే కాకుండా కేవలం 3 నిమిషాల్లోనే పవర్‌హౌస్‌లో పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన ఆరుగురు ఉద్యోగులు వెంటనే కారులో బయటకు వచ్చారు. ఎలక్ట్రికల్ డీఈ అంకినీడు, మరో ఉద్యోగి అతికష్టం మీద డీజిల్ సెట్ వెళ్లే సొరంగ మార్గంలో పరుగులు పెడుతూ బయటికి వచ్చి సొమ్మసిల్లిపడిపోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ట్రాన్స్ఫార్మర్ పేలుడుకు కారణం అదేనా? శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. కృష్ణా నదిలో హెడ్ (నీటి ఇన్‌టేక్, నీటి డిశ్చార్జ్ పాయింట్ మధ్య హెచ్చుతగ్గులు) ఎక్కువగా ఉండటం వల్ల సహజంగానే 150 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇదే కారణంతో ఒక్కో యూనిట్ 180 మెగావాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలిసింది. అయితే పేలుడు సంభవించిన నాలుగో యూనిట్‌కు చెందిన ఆక్సిలరీ వోల్జేజీ ట్రాన్స్ఫార్మర్, ప్యానల్ బోర్డు మాత్రం ఒక్కసారిగా 200 మెగావాట్ల ఉత్పత్తికి వెళ్లిపోయింది. ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్ఫార్మర్ పేలడానికి ఇదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని ఓ అధికారి చెప్పారు. డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు నాలుగో యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆగిపోలేదని సమాచారం. ఈ క్రమంలో పేలుళ్లు, మంటలు సంభవించి విద్యుత్ కేంద్రం మొత్తం చీకటిగా మారింది. అడుగు దూరంలో ఉన్న మనిషిని సైతం చూడలేని పరిస్థితి ఏర్పడిందని, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలిగిందని బయటకు వచ్చిన ఇంజనీర్లు, ఇతర అధికారులు పేర్కొన్నారు. హుటాహుటిన ఘటనాస్థలికి మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు, ఎస్పీఈ సిబ్బంది, అధికారులు, కార్మికులు, నాన్ ఇంజనీర్లు ఆక్సిజన్ ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ దట్టమైన పొగల వల్ల సాధ్యం కాలేదు. కారు లైట్లు వేసుకొని వెళ్లినా దారి కనిపించలేదు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఎల్. శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ విద్యుత్ కేంద్రం వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి 2:15 గంటలకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి పొగ కమ్ముకోవడంతో వెనుదిరిగారు. అనంతరం జగదీశ్‌రెడ్డి ప్రమాద ఘటనపై జెన్కో అధికారులతో సమీక్షించారు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులను అతికష్టం మీద లోపలికి పంపించారు. పవర్‌హౌస్‌లోని గ్యాస్ ఇన్సులేటెడ్ సిస్టమ్ దిగువ ప్రాంతంలో ఆయిల్ లీక్ కావడంతో మంటలు మరింత ఎగసిపడ్డాయి. అయినా అతికష్టం మీద ఫైర్ సిబ్బంది ప్రయత్నం కొనసాగించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎండీ ప్రభాకర్‌రావు, జిల్లా కలెక్టర్ శర్మన్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని పొగలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. పొగ ఎక్కువగా ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ప్రమాదం జరిగిన ప్లాంటులోకి ప్రవేశించి గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతికారు. ప్రమాదంలో చిక్కుకున్న వారు దురదుష్టవశాత్తు మరణించడంతో మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మృతులు వీరే.. 1. డీఈ శ్రీనివాస్‌గౌడ్ (హైదరాబాద్) 2. ఏఈ వెంకటేశ్వర్రావు (పాల్వంచ) 3. ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్) 4. ఏఈ ఉజ్మా ఫాతిమా (హైదరాబాద్) 5. ఏఈ సుందర్ (సూర్యాపేట) 6. ప్లాంట్ అటెండర్ రాంబాబు (ఖమ్మం జిల్లా) 7. జూనియర్ ప్లాంట్ అటెండర్ కిరణ్ (పాల్వంచ) 8. వినేష్ కుమార్ (అమరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి) 9. మహేష్ కుమార్ (అమరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి) వీరందరూ ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. -
నువ్వు, పిల్లలు జాగ్రత్త.. సుందర్ చివరి మాటలు
సాక్షి, నాగర్ కర్నూల్: ‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అని ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు ఇవి. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిదిమంది మృత్యువాత పడ్డారు. ఇందులో సుందర్ నాయక్ ఒకరు. 35 ఏళ్ల సుందర్ నాయక్ నిన్ననే తిరిగి విధుల్లో చేరాడు. కరోనా బారిన పడి కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్న తర్వాత తేరుకున్న సుందర్ డ్యూటీకి గురువారం హాజరయ్యాడు. (చదవండి: జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) కాగా, కరోనాను జయించిన సుందర్.. ఇలా విద్యుత్ ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ మృత్యుంజయుడనుకున్న సుందర్‌ను విధి మరోలా వక్రించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో తొలుత లభించిన మృతదేహం కూడా సుందర్‌దే. ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత ఇక ప్రాణాలతో బయటపడలేమని ఊహించిన సుందర్.. భార్యకు జాగ్రత్తలు చెప్పాడు. ‘నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడలేకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అని భార్యకు ఫోన్లో ప్రమాద తీవ్రతను వివరించాడు. కాగా, మోహన్ అనే మరో ఏఈ తోటి వారిని కాపాడటానికి సహకరించాడు. ఈ ఘటనలో 17 మంది విధుల్లో ఉండగా, ఎనిమిది మంది బయటపడ్డారు. మిగతా తొమ్మిది మంది ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: పవర్ హౌజ్ ప్రమాదం: సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం) -
మరో ఐదు మృతదేహాలు గుర్తింపు
సాక్షి, నాగర్ కర్నూలు: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. తొలుత రెస్క్యూ బృందం మూడో ఫ్లోర్లో ఏఈ సుందర్ నాయక్ (35) మృతదేహాన్ని గుర్తించింది. ఆ తర్వాత మోహన్‌తో పాటు మరో నలుగురి మృతదేహాలను గుర్తించింది. ఏఈ సుందర్‌తో పాటు మోహన్ మృత దేహాలను బయటకు తరలించారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్య్కూ ఆపరేషన్ పూర్తయ్యేందుకు మరో అయిదు గంటల సమయం పట్టనుంది. కాగా గురువారం రాత్రి 10.35 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ప్రమాద ఘటన గురించి సీం కేసీఆర్‌కు వివరించామని పేర్కొన్నారు (గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు..) -
కరోనాపై గెలిచి, అనూహ్యంగా మృత్యువాత
నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఒకరు మృతి చెందారు. ఏఈ సుందర్ నాయక్ (35) మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. మిగతా 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో రెండు గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, మృతుడు సుందర్ నాయక్ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం, జగన తండాగా తెలిసింది. అతనికి భార్య ప్రమీల ఇద్దరు కూతుళ్లు మనస్వి, నిహస్వి ఉన్నారు. నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సుందర్ నాయక్ సొంతూరుకు వచ్చి 15 రోజులు హోమ్ క్వారెంటైన్లో ఉండి కరోనాను జయించారు. నిన్న రాత్రి 9 గంటలకు శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విధులకు హాజరయ్యారు. అతని తండ్రి నాగేశ్వరరావు కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. (35 మందితో పవర్ హౌస్‌లోకి రెస్క్యూ టీమ్) -
శ్రీశైలం పవర్ హౌస్‌లోకి రెస్క్యూ టీమ్
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ జల విద్యుత్ ఉత్పతి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిదిమంది జెన్కో ఉద్యోగులను రక్షించేందుకు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పొగతో పాటు మంటలు అదుపులోకి రాకపోవడంతో గత రాత్రి సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. అధునాతన పరికరాలతో పవర్ హౌస్‌లోకి వెళ్లిన 35మంది సీఐఎస్ఎఫ్ సభ్యుల బృందం సహాయక చర్యలు మొదలుపెట్టింది. మరోవైపు అదనపు డీజీ సీవీ ఆనంద్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ డీజీపీ విజ్ఞప్తితో సీఐఎస్ఎఫ్ ప్రత్యేక బృందాన్ని పంపింది. ఇవాళ మధ్యాహ్నానికి పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. (చదవండి: జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) మంటల్లో చిక్కుకున్నవారి వివరాలు 1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2.AE వెంకట్రావు, పాల్వంచ 3.AE మోహన్ కుమార్, హైదరాబాద్ 4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్ 5.AE సుందర్, సూర్యాపేట 6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా 7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ 8,9 హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ (చదవండి: గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు) ఏపీ గవర్నర్ దిగ్భ్రాంతి శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ గట్టు భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులు క్షేమంగా బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలం వద్ద ఏపీ ఎమ్మెల్యేలు పలువురు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ప్రమాదం జరిగిన శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ గట్టు భూగర్భ జల విధ్యుత్ కేంద్రం వద్దకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. లోపల చిక్కుకుపోయిన 9 మంది క్షేమంగా తిరిగిరావాలని ఆకాక్షించారు. -
అప్పటివరకు క్షణమొక యుగంలా గడిపాడు..
రాయ్‌పూర్: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చత్తీస్‌గఢ్‌లోని ఖారున్ నది పరవళ్లు తొక్కుతోంది. బిలాస్‌పూర్‌లోని ఖుతాఘాట్ డ్యామ్ వద్ద ఖారున్ నది మహోగ్ర రూపం దాల్చింది. అయితే, ఓ వ్యక్తి అక్కడికి ఎలా వచ్చాడో ఏమో తెలియదు గానీ ఆ డ్యామ్ మధ్యలో చిక్కుకుపోయాడు. రక్షించండని స్థానికులను వేడుకున్నాడు. కానీ, వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో స్థానికులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అంతలోనే సమాచారం అందుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలీకాప్టర్‌తో రంగంలోకి దిగింది. బిలాస్పూర్ చేరుకుని కిందకు తాడు వేసి బాధితున్ని పైకి లాగి రక్షించింది. అప్పటివరకు క్షణమొక యుగంలా గడిపిన ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) తక్షణ స్పందనపై స్థానికులు సెల్యూట్ చేశారు. సోమవారం ఉదయం సంఘటన జరిగింది. -
బిలాస్పూర్: నదిలో చిక్కుకుపోయిన వ్యక్తి
-
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
-
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముంద్కా ప్రాంతంలో ఉన్న విడిభాగాల ఫ్యాక్టరీలో గురువారం మధ్యాహ్నం మంటలంటుకున్నాయి. ఇవి మరింత విస్తరించి భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న 26 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి వుంది. Delhi: 26 fire tenders present at the spare parts factory in Mundka, where a fire has broken out. https://t.co/O8XY1gDSss pic.twitter.com/sidhMphqdo — ANI (@ANI) February 13, 2020 -
అదుపులోకి గ్యాస్ బ్లోఅవుట్
ఉప్పూడి నుంచి సాక్షి ప్రతినిధి: కోనసీమ వాసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన ఉప్పూడి గ్యాస్ బ్లోఅవుట్ ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. 42 గంటలపాటు ఉత్కంఠ రేకెత్తించిన గ్యాస్ విస్ఫోటనాన్ని కట్టడిచేయడంలో ఓఎన్జీసీ రెస్క్యూటీమ్ మంగళవారం విజయవంతమైంది. ఓఎన్జీసీకి తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని అడవిపేట రిగ్ పరిధిలోని ఉప్పూడి–1 బావిలో ఆదివారం గ్యాస్ బ్లోఅవుట్ సంభవించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బావి నుంచి ఎగసిపడుతున్న గ్యాస్‌ను కట్టడి చేసేందుకు ఓఎన్జీసీ రెస్క్యూటీమ్ ప్రయత్నించింది. ప్లాన్–ఏలో భాగంగా నీటిని ఎగసిపడుతున్న గ్యాస్ బావిపైకి ఎగజిమ్ముతూ నియంత్రించాలనుకున్నారు. అది ఫలించకపోవడంతో మంగళవారం ప్లాన్–బి ప్రకారం రసాయనాలతో కూడిన మడ్‌ను పంపింగ్ చేయడం ద్వారా ఎగసిపడుతున్న గ్యాస్‌ను అదుపులోకి తీసుకురావాలనుకున్నారు. అయితే ఓఎన్జీసీ రెస్క్యూటీమ్‌ను పర్యవేక్షిస్తున్న ఓఎన్జీసీ ఆపరేషన్ గ్రూపు జనరల్ మేనేజర్ ఆదేశ్‌కుమార్, ఆపరేషన్స్ ఏరియా మేనేజర్ బి.ప్రసాదరావు సూచన మేరకు ప్లాన్– ఏ నే మెరుగైన పద్ధతిలో అమలు చేయాలని నిర్ణయించారు. 360 డిగ్రీల పీడనంతో అంబ్రిల్లా (గొడుగు మాదిరిగా)లా నీటిని గ్యాస్ బావిపై పంపింగ్ చేయడం ద్వారా నియంత్రించారు. ఈ ప్రక్రియను ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి 10.40 గంటలకు ముగించారు. వెనువెంటనే రిస్క్ మేనేజ్మెంట్ టీమ్ డీజీఎం ఏబీ రామారావు వీపునకు ఆక్సిజన్ సిలెండర్‌ను తగిలించుకుని వెల్ మౌత్ వద్దకు వెళ్లి వెల్‌కేప్‌ను మూసేయడం ద్వారా ఆపరేషన్‌ను ముగించారు. మంత్రి పినిపే విశ్వరూప్ డీజీఎంతో కలిసి బావి వద్దకు వెళ్లి పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మి ఓఎన్జీసీ అధికారులతో కలిసి విజయోత్సవాన్ని పంచుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఏడు బృందాలలో సుమారు 70 మంది పాల్గొన్నారు. 42 గంటల తరువాత గ్యాస్ అదుపులోకి రావడంతో ఉప్పూడి సహా కోనసీమ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసు కేసు నమోదు: ఉప్పూడి–1 బావిని నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థ పీఎఫ్‌హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్‌పై పోలీసు కేసు నమోదైంది. చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు ఎస్పీ ప్రకటించారు. చమురు సంస్థల అన్వేషణతో జరుగుతున్న ప్రమాదాలపై సీఎం వైఎస్ జగన్‌కు అందజేసేందుకు నివేదిక సిద్ధం చేయాలని యంత్రాంగాన్ని మంత్రులు ఆదేశించారు. -
ఉప్పూడిలో అదుపులోకి వచ్చిన గ్యాస్ లీక్
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో గ్యాస్ లీకేజ్ అదుపులోకి వచ్చింది. ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మంగళవారం నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమయింది. మడ్ పంపింగ్ ద్వారా ముంబై నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ గ్యాస్ బ్లో అవుట్‌ను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఉప్పూడి పరిసరప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, రెండు రోజులుగా ఉప్పూడి సమీపంలోని ప్రజలను గ్యాస్ బ్లో అవుట్ వణికించిన సంగతి తెలిసిందే. దీనిని అదుపు చేసేందుకు సోమవారం ఓఎన్జీసీ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రెస్క్యూ మంగళవారం ఆపరేషన్ కొనసాగించారు. గ్యాస్ లీక్‌ను అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. 2.2 కి.మీల లోతులో ఉన్న గ్యాస్ బావిలోకి నిరంతారాయంగా వాటర్ పంపింగ్ చేపట్టారు. చివరకు మడ్పంపింగ్ ద్వారా గంటన్నలోపే గ్యాస్ లీకేజ్‌ను అదుపులోని తెచ్చారు. అంతకుముందు గ్యాస్ లీకేజీ దృష్ట్యా ఘటన స్థలికి 2 కి.మీ పరిధిలోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. కాట్రేనికోనలో నిన్నటి నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. -
మృత్యుంజయుడిగా నిలిచిన లోకోపైలట్
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ స్టేషన్లో రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కేబిన్‌లో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీశాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. సాయంత్రం 6.40 గంటలకు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగాయి. క్యాబిన్లో ఇరుక్కున్న లోకో పైలట్ చంద్రశేఖర్ 8 గంటల ఉత్కంఠ... ప్రమాదంలో ఇంటర్సిటీ రైలు ఇంజిన్.. ఎంఎంటీఎస్ ముందు భాగాన్ని చీల్చు కుంటూ డ్యాష్‌బోర్డును స్వల్పంగా ధ్వంసం చేసి ఆగిపోయింది. దీంతో లోకోపైలట్ చంద్రశేఖర్ అందులో ఇరుక్కుపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఎన్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్సిటీ రైలు ఇంజిన్‌ను కదలకుండా చేసి, ఎంఎంటీఎస్ రైలు ఎడమవైపు ఐరన్ షీటును కట్టర్లతో తొలగించారు. దాని వెనకాలే చంద్రశేఖర్ ఇరుక్కుని ఉండటంతో అక్కడ నుంచి మిగతా జాగ్రత్తగా చేతులతోనే కట్ చేయడం ప్రారంభించారు. 11.15 గంటలకు లోకోపైలట్‌కు ఆక్సిజన్ పెట్టారు. నిరంతరం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ.. బీపీ చెక్ చేస్తూ.. అతడు మత్తులోకి జారిపోకుండా మాట్లాడిస్తూ ఆపరేషన్ కొనసాగించారు. సాయంత్రం 5.25 గంటలకు రైలుకు ఎడమ పక్కన ఉన్న ఐరన్షీటు పూర్తిగా తొలగించారు. రక్త ప్రసరణ లేకపోవడంతో అతడి కాలు వాచిపోయి ఉన్న సంగతి అప్పుడు గుర్తించారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రశేఖర్ తల కనిపించడంతో వైద్యులు వెళ్లి ధైర్యం చెప్పారు. భయపడవద్దని మరికొద్ది నిమిషాల్లో బయటికి వస్తావని చెప్పారు. సాయంత్రం 6.05 గంటలకు డ్యాష్ బోర్డులో ఇరుక్కున్న చంద్రశేఖర్ వెనక ఉన్న మరో ఐరన్షీట్ను తొలగించారు. అయినా తల, ఛాతి, వెన్ను అలాగే ఉండిపోయాయి. సాయంత్రం 6.40 గంటలకు మిగిలిన భాగాలను కూడా కత్తిరించి, అతడిని బయటకి తీసుకొచ్చారు. వెంటనే చంద్రశేఖర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపించారు. రియల్ హీరో ‘నిశాంత్’ ప్రమాదం జరిగాక అక్కడి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ నిశాంత్ చివరి వరకు అక్కడే ఉన్నాడు. చంద్రశేఖర్‌ని నిత్యం మాట్లాడిస్తూ.. అతనికి నీళ్లు ఇస్తూ.. ధైర్యం చెబుతూ వచ్చాడు. రైలును కట్టర్లతో కోస్తున్నపుడు చంద్రశేఖర్‌పై నిప్పురవ్వలు ఎగిసిపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. నిశాంత్‌కు తోడుగా రైల్వే సిబ్బంది శ్రీను, ఆక్సిజన్ సిలిండర్‌ను చివరి వరకు పట్టుకున్న స్టేషన్ ఉద్యోగి రాజు.. లోకోపైలట్‌ను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. -
బోటు ప్రమాదం: మరో మహిళ మృతదేహం లభ్యం
సాక్షి, తూర్పుగోదావరి : కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాద స్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మంటూరు సమీపంలో ఉన్న వాడపల్లి గొంది వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని దేవిపట్నంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రాయల్ వశిష్ట లాంచీ మునిగి మంగళవారానికి పదిరోజులు అవుతోంది. అయినప్పటికీ ఇంకా 14 మంది పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది. ప్రమాదం సంభవించి పదిరోజులు కావడం వల్ల నీటిలో ఉన్న మృతుల శరీరంలో అవయవాలన్ని మెత్తగా మారిపోయి ఉంటాయని వైద్యులు తెలిపారు. వాడపల్లి గొందె వద్ద లభించిన మహిళ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ దేవిపట్నంకు తరలించారు. జుట్టు లేకుండా ఉన్న మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉంది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు రాయల్ వశిష్ట లాంచీ ప్రమాదంలో 38 మృతదేహలు గోదావరిలో లభ్యం కాగా ఇంకా 13 మంది పర్యాటకుల ఆచూకీ కోసం రక్షణ సిబ్బంది గాలిస్తున్నారు. -
ఐఏఎఫ్ డేర్‌డెవిల్ ఆపరేషన్
జమ్మూ: భారత వైమానిక దళం సిబ్బంది ధైర్య సాహసాలు ప్రదర్శించి వరదల్లో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను కాపాడారు. జమ్మూకు చెందిన నలుగురు మత్స్యకారులు జమ్మూలోని భగవతి నగర్ వద్ద తావీ నదిలోకి దిగారు. ఒక్కసారిగా నదిలో వరద ఉధృతి పెరగడంతో వారు అక్కడే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌పైకి ఎక్కారు. అంతకంతకు నీటి మట్టం పెరుగుతుండటంతో స్థానికుల సాయంతో అధికారులకు సమాచారం అందించారు. ఐఏఎఫ్ వెంటనే రంగంలోకి దిగింది. ఐఏఎఫ్ హెలికాప్టర్ పిల్లర్‌కు అతి సమీపానికి రాగా గరుడ్ కమాండో కింది దిగారు. అక్కడున్న ఇద్దరినీ సురక్షితంగా హెలికాప్టర్లోకి ఎక్కేలా చేసి, మరో ఇద్దరి కోసం తాడు నిచ్చెనను వదిలారు. అయితే, వారిద్దరూ పైకి ఎక్కలేక తిరిగి నీళ్లలో పడిపోయారు. దీంతో గరుడ్ కమాండోలు తిరిగి పిల్లర్ ఉన్న ప్రాంతానికి చేరుకుని, వారిద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేరేలా చేయగలిగారు. దాదాపు రెండుగంటలపాటు సాగిన ఈ సాహసోపేత చర్యను స్థానికులు ఉత్కంఠగా తిలకించారు. నలుగురినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన ఐఏఎఫ్ సిబ్బంది సాహసాన్ని వారు కొనియాడారు. ఇది డేర్‌డెవిల్ ఆపరేషన్ అని ఐఏఎఫ్ అధికారులు అభివర్ణించారు. ఇదంతా హెలికాప్టర్ పైలెట్, గరుడ్ కమాండో మధ్య సమన్వయం వల్లే సాధ్యమైందన్నారు. నగరంలోని హర్కిపౌడి ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో.. ఉధంపూర్‌కు చెందిన తాలిబ్ హుస్సేన్ తావి నది వరదలో చిక్కుకుపోగా పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. -
ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, న్యూడిల్లీ : ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డు సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 34 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్రం చేస్తున్నారు. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆస్పత్రిలో మంటలు వ్యాపించినట్లు సమాచారం. భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో మొదటి అంతస్తులో చికిత్స పొందుతున్న రోగులను మరో చోటుకు తరలించారు. అయితే ఇప్పటివరకు మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇదే ఆస్పత్రిలో బీజేపీ సీనియర్‌నేత అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారని, సహాయక చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
కూలిన భవనం.. ఏడుగురు దుర్మరణం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌లోని సుదర్శన్ పార్క్ వద్దగల ఓ మూడంతస్థుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించండంతో భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా మరో 8 మందిని రెస్క్యూ టీం రక్షించింది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డీసీపీ (పశ్చిమ ఢిల్లీ) మోనికా భరద్వాజ్ తెలిపారు. ప్రమాద సమయంలో మొత్తం 18 మంది ఫ్యాక్టరీలో ఉన్నట్టు చెప్పారు. అయితే, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ప్రమాద సమయంలో 13 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. పక్కనే ఉన్న స్క్రాప్‌యార్డులో మరో 12 మంది ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. -
మేఘాలయలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
మేఘాలయలో కొనసాగుతున్న రెస్కూ ఆపరేషన్
-
పడవ బోల్తా: అధికారులు సేఫ్, ఒకరు మృతి
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ పడవ ప్రమాదానికి గురయింది. ముంబై నారీమన్ పాయింట్ నుంచి 2.6 కిలోమీటర్ల దూరంలో శివాజీ స్మారక్ వద్ద సముద్రంలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పడవలో మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ జైన్‌తోపాటు ఇతర సీనియర్ అధికారులు కూడా ఉన్నారన్న సమాచారం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు చనియారు. మిగిలిన వారిని రక్షించామనీ కోస్ట్ గార్డ్ పీఆర్వో వెల్లడించారు. పడవలో మొత్తం 25 మంది ఉన్నారని పోలీసులు ధృవీకరించారు. అయితే చనిపోయిన వారి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. శివాజీ స్మారక నిర్మాణ పనులను పరిశీలించేందుకు రెండు స్పీడ్ బోట్లలో వెళ్తుండగా సీఎస్, ఎమ్మెల్సీ ఉన్న బోటు ప్రమాదానికి గురైంది. మరో బోటులో 40 మంది పాత్రికేయులు ఉన్నారు. శివాజీ స్మారకానికి 2.6 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రాళ్లను పడవ ఢీకొట్టడంతో బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం కారణంగా శివాజీ స్మారకం పనులను నిలిపివేశారు. #UPDATE: Police confirmed that there were 25 people on board the capsized boat. 24 were evacuated safely earlier; one body recovered by State Control Room: Indian Coast Guard PRO — ANI (@ANI) October 24, 2018 -
కులూలో కొనసాగుతున్న రెస్స్క్యూ ఆపరేషన్
-
నోరు జారాడు.. అనుభవిస్తున్నాడు
థాయ్ కేవ్ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ బ్రిటీష్ డైవర్‌పై.. టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సదరు డైవర్ అసలు సహాయక చర్యల్లో పాల్గొనలేదని.. పైగా అతను చిన్నారులను లైంగికంగా వేధించే వ్యక్తి అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. థాయ్ కేవ్ ఆపరేషన్‌లో భాగంగా వైల్డ్ బోర్ అనే డైవర్స్ టీం సహాయక చర్యల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ బృందంలో బ్రిటీష్ డైవర్ వెర్నోన్ అన్స్వోర్త్ కూడా ఉన్నారు(మ్యాపింగ్ రూట్ సమాచారం అందించటం...). టెస్లా తరపున సహాయక చర్యల కోసం మస్క్.. జలంతర్గాములను పంపించాడు. అయితే అవి చాలా చిన్నవిగా ఉన్నాయని, ఆపరేషన్‌కి పనికి రాలేదని, ఆ విషయం తెలిసికూడా టెస్లా కేవలం ప్రచార ఆర్భాటం కోసమే వాటిని పంపిందని వెర్నోన్ పేర్కొన్నారు. దీంతో మండిపోయిన మస్క్.. వెర్నోన్ను విమర్శిస్తూ ఆదివారం సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేశారు. ‘మా సబ్మెరెన్లు పనికి రావని ఆ పెద్ద మనిషి అన్నారు. కానీ, ఆయన సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు ఎక్కడా కనిపించలేదు. కేవలం ప్రచారం కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం కూడా నాకు ఈ మధ్యే తెలిసింది. ఆయనొక పెడో. (పెడో.. పైడోఫిలేకి సంక్షిప్త రూపం.. పిల్లల్ని ప్రలోభ పెట్టి లైంగికంగా వాడుకోవటం). అలాంటి వ్యక్తి చేసే పనికిమాలిన కామెంట్లను పట్టించుకోవటం.. మాకు అవమానం’ అంటూ వరుసగా ట్వీట్లు చేశాడు. అయితే ఈ విషయంలో వెర్నోన్కే మద్ధతుగా చాలా మంది నిలిచారు. మస్క్‌ను విమర్శిస్తూ పెద్ద ఎత్తున్న పోస్టులు వెల్లువెత్తటంతో చివరకు మస్క్ ఆయా ట్వీట్లను డిలేట్ చేశారు. ఇక ఈ విషయంపై అన్స్వోర్త్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీడియా కథనాల ద్వారానే ఈ విషయం నాకు తెలిసింది. మస్క్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నా’ అని వెల్లడించారు. భారీ నష్టాలు.. ఇదిలా ఉంటే మస్క్ చేసిన ట్వీట్లు టెస్లా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. సోమవారం దాదాపు 4 శాతానికిపైగా షేర్లు పడిపోవటంతో 295 మిలియన్ డాలర్ల మేర నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఆటోమేకర్ రంగంలో దిగ్గజం అయిన టెస్లా.. ఎలోన్ మస్క్ నిర్ణయాలు, ప్రవర్తన మూలంగా ఏడాది కాలంలో 2 బిలియన్ డాలర్ల నష్టం చవిచూడాల్సి వచ్చింది. కాగా, ఎలోన్.. టెస్లా కొంప ముంచుతున్నాడంటూ బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గోదావరి నదిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
-
ఇంకా దొరకని ఆ ఏడుగురి ఆచూకీ
సాక్షి, పశువుల లంక (తూర్పు గోదావరి) : గోదావరి నదిలో గల్లంతైన ఆరుగురు విద్యార్థినులు, ఒక మహిళ ఆచూకీ ఇంకా లభించలేదు. పోలవరం మండలం పశువుల లంక వద్ద వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతోంది. అయితే, ప్రతికూల వాతావరణం ఉండటంతో ఆదివారం ఉదయం సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. శనివారం ప్రభుత్వ కార్యక్రమం ‘వనం-మనం’లో పాల్గొని నాటు పడవలో ఇంటికి తిరిగి వస్తూ వీరు గోదావరి నదీ పాయలో ప్రమాదానికి గురయ్యారు. ఆరుగురు విద్యార్థినులు, ఒక మహిళ నీటిలో గల్లంతయ్యారు. అక్కడికి సమీపంలోనే సముద్రం ఉండడంతో వారి ఆచూకీపై ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో మరో 23మంది సురక్షితంగా బయటపడ్డారు. రెండో శనివారం అయినప్పటికీ.. సెలవు రద్దు చేసి.. ‘వనం-మనం’ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలంటూ ఆదేశాలు ఇవ్వడం ఆ చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారింది. పిల్లల ఆచూకీ కోసం రాత్రంతా ఘటనాస్థలంలోనే ఉన్న తల్లిదండ్రులు వారి కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్రంలో కేవలం 8 నెలల వ్యవధిలో 4 ఘోర పడవ ప్రమాదాలు జరగడం గమనార్హం. కొనసాగుతున్న సహాయక చర్యలు ఆదివారం ఉదయం వర్షంలోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డైవర్స్ నీళ్లలోకి దిగి గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. గోదావరి దిగువన సముద్రంలో కోస్ట్‌గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. గోదావరి పొడవునా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు బృందాలుగా విడిపోయి.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. పిల్లలు ఆచూకీ కోసం తల్లిదండ్రులు, వారి బంధువులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ నేతలను ఆదేశించారు. -
సాహసం-హీరోయిజం.. అందమైన కథ!
-
సాహసం-హీరోయిజం.. అందమైన కథ!
చిమ్మ చీకట్లో పదిహేను రోజులకుపైగా బిక్కుబిక్కుమంటూ ఆటగాళ్లు, కోచ్. తినటానికి తిండి లేదు.. మట్టి నీరు తప్ప. చుట్టూ విషపూరిత పాములు.. భయానక పరిస్థితులు. ముందు.. అసలు బతికున్నారో లేదో అన్న అనుమానాలు. ఆచూకీ లభించాక వారిని వెలుపలికి తెస్తామో లేదో అన్న సంశయం. వెరసి ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి ఆసక్తిగా తిలకించిన వేళ థాయ్‌లాండ్ ‘థామ్ లూవాంగ్ గుహ’ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కోచ్‌తోపాటు 12 మంది పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. అయితే ఓ సినిమాకు ఇంతకన్నా మంచి స్క్రీన్‌ప్లే దొరకదన్న ఉద్దేశంతో పలు ప్రఖ్యాత సంస్థలు దీనిని తెరకెక్కించేందుకు ఎగబడిపోతున్నాయి. ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్పై సుమారు 60 మిలియన్ డాలర్ల ఖర్చుతో(దాదాపు 400 కోట్ల) బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని నిర్మాతలు మైకేల్ స్కాట్, అడమ్ స్మిత్‌లు అధికారికంగా ప్రకటించారు. ‘ఈ ఘటనలో సాహసం ఉంది. హీరోయిజం ఉంది. ఓ సినిమాకు ఇంతకన్నా ఏం కావాలి. అయినా ఇది ఓ చిత్రం మాత్రమే కాదు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వీరులకు, మరణించిన డైవర్‌కు ఈ చిత్రం అంకితమిస్తున్నాం’ అని మైకేల్ స్కాట్ తెలిపారు. ఇక మరో దర్శకుడు ఎమ్ చూ కూడా ఈ థాయ్ ఆపరేషన్‌ను చిత్రంగా మలిచేందుకు సిద్ధమయ్యారు. ‘ఇదో అందమైన కథ. ప్రపంచం మొత్తాన్ని ఊపిరి బిగపట్టేలా చేసిన ఈ ఆపరేషన్‌ను.. తెరపై చూపించటం గర్వంగా ఫీలవుతున్నా’ అని ఆయన ప్రకటించారు. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఇవన్హోయె పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ రెండింటిలో ఒకటి కోచ్ ఎక్కపోల్ చాంతవోంగ్ కోణంలో తెరకెక్కుతుండగా.. మరొకటి గుహ సహయక ఆపరేషన్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు థాయ్ మీడియా ఛానెళ్లు కథనాలను ప్రచురించాయి. I refuse to let Hollywood #whitewashout the Thai Cave rescue story! No way. Not on our watch. That won’t happen or we’ll give them hell. There’s a beautiful story abt human beings saving other human beings. So anyone thinking abt the story better approach it right & respectfully. — Jon M. Chu (@jonmchu) 11 July 2018 -
గుహలో సాహసం ఇలా...
థాయ్‌లాండ్‌లోని ఆ గుహలో ఎక్కడ ఏముందో తెలీనంత కటిక చీకటి. రాళ్లు, బండలతో నిండిన, బాగా ఇరుకైన దారులు. భారీ వర్షాల ధాటికి గుహలోకి నీటి వెల్లువ. ఇన్ని ప్రతికూలతల మధ్య రెండున్నర మైళ్ల దూరం లోపలకు వెళ్లడమే అసాధ్యం. ఇక అక్కడ చిక్కుకుపోయిన, సరిగ్గా ఈత రాని పిల్లలకు దారిలో ఏ అపాయం కలగకుండా కాపాడి బయటకు తీసుకురావడమంటే ఎంతటి సాహసమో ఊహించడం కష్టం. ఇన్ని అవరోధాలను ఎదుర్కొని, అసాధ్యమనుకున్న దాన్ని చేసి చూపిన సహాయక బృందం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. మే సాయ్/చియాంగ్ రాయ్: థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో 18 రోజులుగా చిక్కుకున్న మొత్తం 12 మంది బాలురు, వారి ఫుట్‌బాల్ జట్టు కోచ్‌ను సహాయక బృందాలు రక్షించి అసాధ్యమనుకున్న దానిని చేసి చూపించాయి. థాయ్‌లాండ్‌తోపాటు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి వచ్చిన నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అమెరికా వాయుసేనకు చెందిన డెరెక్ అండర్సన్ వారిలో ఒకరు. పిల్లలను కాపాడటంలో తనకు ఎదురైన అనుభవాలను ఆయన విలేకరులకు వివరించారు. జపాన్‌లోని ఒకినవాలో అమెరికా వైమానిక స్థావరంలో విధులు నిర్వర్తిస్తున్న అండర్సన్ తన బృందంతో కలిసి థాయ్‌లాండ్‌లోని గుహ వద్దకు 28న చేరుకున్నారు. ‘ఇది జీవితంలో ఒక్కసారే ఎదురయ్యే సాహసం’ అని ఆయన అన్నారు. గుహలో ఉన్న వారంతా తనకు ఉత్సాహంగానే కనిపించారనీ, ఆ పిల్లలు నిజంగా చాలా హుషారైన వారని అండర్సన్ అభివర్ణించారు. ‘ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కోచ్, పిల్లలు కలిసి మాట్లాడుకుని, ధైర్యంగా ఉండాలనీ, బతుకుపై ఆశ వదులుకోకూడదని నిశ్చయించుకున్నారు. మేం గుహ వద్దకు చేరుకునే సమయానికి గుహ దారుల్లో పెద్దగా నీరు లేదు. కానీ మేం లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే మూడు అడుగుల ఎత్తున నీటి ప్రవాహం మొదలై మమ్మల్ని బయటకు తోసేయ సాగింది. గుహలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతుండటం, పిల్లలు జబ్బుపడే ప్రమాదం, వర్షాలు కురిస్తే నీరు నెలల తరబడి గుహలో ప్రవహించడం తదితర కారణాల వల్ల పిల్లలు ఎక్కువసేపు లోపల ఉండటం మంచిది కాదని అనిపించింది’ అని వివరించారు. స్విమ్మింగ్ పూల్‌లో సాధన డైవర్లు పిల్లలను గుహ నుంచి ఎలా కాపాడాలనే దానిపై ముందుగా ఓ ఈతకొలనులో సాధన చేశారు. లోపల ఉన్న పిల్లలంత ఎత్తు, బరువే ఉన్న పిల్లలను ఎంచుకున్నారు. ‘ఒక్కో పిల్లాడ్ని ఓ డైవర్‌కు కట్టి ఉంచారు. పది మందికి పైగా ఇతర డైవర్లు వెంటే ఉన్నారు. పిల్లాడ్ని పట్టుకునేందుకు, ఆక్సిజన్ అందించేందుకు ఇలా చేశారు. ఒక్కో పిల్లాడికి అవసరమైన మాస్కులు తదితరాలు తొడిగి బయటకు తెచ్చేందుకు సిద్ధం చేయడానికే గంటలు పట్టింది. ఇరుకు దారుల్లో ఇరుక్కున్నప్పుడు నీరు మాస్క్ల్లోపలికి చేరకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ప్రెషర్ మాస్క్‌లను వాడటం కీలకంగా మారింది. ఆపరేషన్‌లో తాడే కీలకం.. గుహ బయట నుంచి బాలలు ఉన్న ప్రాంతం వరకు 8 మిల్లీ మీటర్ల మందం ఉన్న తాడును సహాయక బృందాలు కట్టారు. ఆపరేషన్లలో తాడే కీలకమనీ, లోపలకు వెళ్లిన వారు బయటకు రావాలంటే తాడును పట్టుకుని రావడం ఒకటే మార్గమని చెప్పారు. ‘ఇక్కడ తాడు జీవన రేఖ. లోపలకు వెళ్లేటప్పుడే బయటకు వచ్చే దారిని ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో బాలుడిని బయటకు తీసుకొచ్చే సమయంలో గుహలో 100 మందికిపైగా సహాయక సిబ్బంది ఉన్నారు. కొన్ని చోట్ల నీరు లేదుగానీ పెద్ద పెద్ద బండరాళ్లు, ఇరుకైన దారులతో ప్రమాదకరంగా ఉంది’ అని వివరించారు. వారికి మందులు ఇచ్చినందువల్ల పిల్లలను బయటకు తెస్తున్నప్పుడు వారిలో కొంతమంది నిద్రపోయారనీ, మరికొంత మంది కాస్త మెలకువతో ఉన్నారని థాయ్‌లాండ్ నౌకాదళంలోని మరో డైవర్ చెప్పారు. సాహస కథతో హాలీవుడ్ సినిమా పిల్లలను గుహ నుంచి కాపాడటం కథాంశంగా హాలీవుడ్లో ఓ సినిమా వస్తోంది. ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా తీస్తోంది. దాదాపు 413 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ సినిమాకు కావోస్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది. ప్యూర్ ఫ్లిక్స్ సీఈవో స్కాట్ మాట్లాడుతూ ‘సహాయక బృందాల ధైర్యం, హీరోయిజం స్ఫూర్తి కలిగిస్తున్నాయి’ అని అన్నారు. సాయంలో భారతీయులు భారత్‌లో ప్రముఖ నీటి మోటార్ పంపుల సంస్థ కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ (కేబీఎల్) ఈ సహాయక చర్యల్లో భాగమైంది. పుణె కేంద్రంగా పనిచేసే కంపెనీ సేవలను గుహ నుంచి నీటిని బయటకు తోడటంలో వాడుకోవాలని భారత ఎంబసీ సూచించింది. భారత్, థాయ్‌లాండ్, బ్రిటన్‌లలోని తమ సిబ్బందిని గుహ వద్దకు పంపింది. నీటిని బయటకు తోడటం, మోటార్లను సమర్థంగా వాడటంలాంటి పనుల్లో సంస్థ సిబ్బంది సాయపడ్డారు. మేము ఆరోగ్యంగా ఉన్నాం బాలురు వైద్యశాలలో చికిత్స పొందుతున్న తొలి వీడియో బయటకు వచ్చింది. ఆసుపత్రిలో వారి ఫొటోలను కూడా తొలిసారిగా మీడియాకు విడుదల చేశారు. ఇన్నాళ్లూ గుహలో ఉన్నందువల్ల వారికేమైనా ఇన్ఫెక్షన్స్ సోకి ఉంటాయోమోనన్న అనుమానంతో ముందుజాగ్రత్తగా పిల్లలను వేరుగా ఉంచారు. వారిని కలిసేందుకు తల్లిదండ్రులు సహా ఎవ్వరినీ వైద్యులు అనుమతించలేదు. గాజు అద్దాల గదుల్లో పిల్లలను ఉంచి బయట నుంచే తల్లిదండ్రులు చూసి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు. అయితే తామంతా ఆరోగ్యంగానే ఉన్నామని పిల్లలు తలలూపుతూ, చేతులు ఆడిస్తూ, శాంతి చిహ్నాలను ప్రదర్శించారు. పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు. అయితే పిల్లల మానసిక ఆరోగ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమనీ, ఇప్పుడు బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా, దీర్ఘకాలంలో వారి ప్రవర్తనపై గుహలో చిక్కుకుపోయిన ప్రభావం ఉండొచ్చని పలువురు మానసిక వైద్యులు అంటున్నారు. మొరాయించిన మోటార్ నీటి పంపు మంగళవారం చివరి బాలుడు బయటకు వచ్చిన తర్వాత.. గుహ నుంచి నీటిని బయటకు తోడే ప్రధాన పంపు మొరాయించింది. అప్పటికి సహాయక సిబ్బంది ఇంకా గుహ లోపలే, ప్రవేశ ద్వారానికి ఒకటిన్నర కిలో మీటరు దూరంలో ఉన్నారు. పంపు పనిచేయడం మానేయడంతో గుహలో నీటిమట్టం భారీగా పెరగసాగిందని ఆస్ట్రేలియా డైవర్లు వెల్లడించారు. బాలురను బయటకు తీసుకురావడానికి ముందే పంపు మొరాయించినట్లైతే ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం కలిగి ఉండేదన్నారు. సహాయక చర్యల్లో వాడిన నీటినితోడే పంపు -
థాయ్ ఆపరేషన్ సాగిందిలా..!
మే సాయ్ : థాయ్‌లాండ్‌లో థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 13 మందిని సహాయక బృందాలు మంగళవారం క్షేమంగా బయటకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూడు రోజులుగా థాయ్‌లాండ్ నౌకాదళ సిబ్బందితో కలసి వివిధ దేశాల నిపుణులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. 18 రోజుల నరకయాతన తర్వాత మొత్తం 13 మంది గుహ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. చివరి క్షణంలో అనుకోని ప్రమాదం... అయితే చివరి పిల్లవాడిని కాపాడిన తర్వాత నీటిని బయటకు తోడే మోటర్లలో ప్రధాన మోటార్ చెడిపోయిందంట. ఆ సమయంలో డైవర్స్, మరికొందరు సహాయక సిబ్బంది ఇంకా గుహ లోపలనే ఉన్నారు. ఈ విషయం గురించి సహాయక సిబ్బంది సభ్యుడొకరు చెబుతూ.. ‘మేమంతా గుహ ప్రధాన ద్వారానికి 1.5 కిమీ దూరాన ఉన్నాం. మోటార్ చెడిపోవడంతో నీటి ప్రవాహం పెరిగింది. మేమే కాక మరో 100 మంది గుహ ప్రధాన ద్వారం వద్ద ఉన్నారు. నీటి ప్రవాహం పెరగడంతో వారంతా బయటకు వెళ్లి పోయారు. మేము నలుగురం మాత్రమే లోపల మిగిలి పోయాము. ఆ సమయంలో మేమంతా ప్రాణాల మీద ఆశ వదులుకున్నాము. కానీ చివరకు క్షేమంగా బయటకు వచ్చాం’ అని తెలిపారు. సబ్‌మెరైన్ ఆచరణ సాధ్యం కాదు... పూర్తి ఆపరేషన్ ఎలా సాగిందనే విషయాన్ని కూడా తొలిసారి బయటకు వెల్లడించారు. పిల్లలు ఉన్న చోటకు ప్రవేశ ద్వారానికి మధ్య 3 కిలోమీటర్ల దూరం ఉంది. పిల్లల ఆచూకీ తెలిసిన తర్వాత వారి కోసం ఆహారం, మందులు సరఫరా చేశారు. ఇంతలో గుహలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో, ఆక్సిజన్ సిలిండర్లు అమర్చాలని భావించారు. అందుకోసం సమన్ గుణన్ అనే డైవర్ లోపలికి వెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తు అతను మరణించడంతో ప్రమాద తీవ్రత ప్రపంచానికి తెలిసింది. దాంతో సబ్‌మెరైన్‌ను వాడదామనుకున్నారు. కానీ అది కూడా సాధ్యపడదని తేలింది. దాంతో చివరకూ డైవర్లనే గుహ లోపలికి పంపించి పిల్లలను బయటకు తీసుకురావాలని భావించారు. (ఊహాచిత్రాలు బీబీసీ సౌజన్యంతో) ప్రమాదకర దారిలో ప్రయాణం... జూన్ 30న వచ్చిన ఆస్ట్రేలియా డైవర్లు ప్రమాద తీవ్రతను పరీక్షించారు. ప్రవేశ ద్వారం నుంచి పిల్లలు ఉన్న చోటుకు చేరడం అంత తేలిక కాదు అనే విషయం వారికి అర్ధమయ్యింది. ఎందుకంటే ఆ మార్గం అంతా బురదతో నిండి పోయి ఉండటమే కాక కొన్ని చోట్ల కేవలం 70 సెంటీ మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. మరికొన్ని చోట్ల ఎగుడుదిగుడుగా ఉంది. పిల్లలున్న ప్రాంతానికి కొద్ది దూరంలో గుహ చాలా కోసుగా ఉంది. అది దాటి కాస్తా ముందుకు వెళ్తే 30 మీటర్ల లోతు ఉంది. గుహ లోపలికి చేరుకోవాలంటే డైవర్లు కూడా ఆక్సిజన్ సిలిండర్లను ధరించాల్సిందే. మనిషి పట్టడమే కష్టంగా ఉన్న చోట ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు మనిషి ప్రయాణం చేయడం అస్సలు సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారంతా అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అసమాన్యులు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 19 మంది డైవర్లు పాల్గొన్నారు. వీరిలో కేవలం ముగ్గురికి మాత్రమే లోపలికి వెళ్లడానికి అవకాశం ఉంది. ఒక్కో పిల్లవాన్ని కోసం 8 గంటలు... ఈ ముగ్గురిలో ఇద్దరు డైవర్లు, ఒకరు వైద్యుడు. పిల్లలున్న చోటు నుంచి గుహ ప్రవేశ ద్వారం వరకూ మొత్తం మార్గాన్ని మూడు చాంబర్లుగా విభజించారు. పిల్లలను తీసుకు రావడానికి వెళ్లే ముగ్గురు డైవర్లు కాక మిగతా అందరూ రెండో చాంబర్లో మానవహారంగా నిల్చున్నారు. లోపలికెళ్లిన ముగ్గురు డైవర్లు ఒక్కోసారి ఒక పిల్లవాన్ని తమతో పాటు తీసుకొచ్చారు. ఒక డైవర్ ఆక్సిజన్ ట్యాంక్‌ని పట్టుకుంటే అతని వెనుక భాగాన బాలుడిని కట్టారు. మరో డైవర్ బాలుడి వెనకాల ఇంకో ఆక్సిజన్ ట్యాంక్ పట్టుకుని పిల్లాడు ఎలా ఉన్నాడో జాగ్రత్తగా గమనించారు. ముగ్గురు ఆక్సిజన్ సిలిండర్లు ధరించి ఉంటారు. వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతానికి రాగానే సిలిండర్లను తొలగిస్తారు. ఒక్కొక్కరుగా రెండో చాంబర్లోకి వస్తారు. (ఊహాచిత్రాలు బీబీసీ సౌజన్యంతో) అక్కడికి రాగానే అప్పటికే అక్కడ మానవహారంగా నిలబడిన డైవర్లు ఒకరి తర్వాత ఒకరిగా బాలున్ని బయటకు చేర్చుతారు. ఇలా ఒక్కో పిల్లవాన్ని బయటకు తీసుకురావడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. అంతసేపు రెండో చాంబర్లో ఉన్న డైవర్లు అలా బురదలోనే నిల్చుని ఉండాలి. ఏ ఒక్కరు కాస్తా ఏమరుపాటుగా ఉన్న అంతే సంగతులు. చాంబర్ 3 చాంబర్ 2 వరకూ రావడానికి మొదట 5 గంటల సమయం పట్టేది. అయితే నీటిని నిరంతరం బయటకు పంపిచడంతో ఓ గంట సమయం కలిసి వచ్చింది. డైవర్లు ప్రతీ బాలుడి ముఖానికి మాస్క్ తొడిగారు. ఈదేటపుడు వెట్ సూట్ వేశారు. బూట్లు వేసి, హెల్మెట్ పెట్టారు. రిచర్డ్ హరీ ధైర్యం అసామన్యం... అయితే డైవర్లతో పాటు వెళ్లిన డాక్టర్ రిచర్డ్ హరీస్ ధైర్యసాహసాలను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. పిల్లలందరిని బయటకు తీసుకొచ్చేవరకూ రిచర్డ్ డైవర్లతోనే ఉన్నారు. బుధవారం మరో విషాదం చోటుచేసుకుంది. ఆ రోజు రిచర్డ్ నాన్న గారు మరణించారు. కానీ రిచర్డ్ ఆ బాధను దిగిమింగి రోజులానే గుహలోకి వెళ్లి పిల్లలను కాపాడారు. -
‘ఆపరేషన్ థాయ్’లో ఇండియన్ టెకీలు..
మే సాయ్ : థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న ఫుట్‌బాల్ టీమ్‌లోని చివరి ఐదుగురిని సహాయక బృందాలు మంగళవారం క్షేమంగా బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అసాధ్యమైన ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికి ప్రాణాలకు తెగించి పోరాడిన డైవర్లు, సహాయక సిబ్బందికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే చిన్నారులను సురక్షితంగా బయటికి తీసుకురావడంలో థాయ్‌లాండ్ ప్రభుత్వంతో పాటు పలువురు ప్రముఖులు, వివిధ దేశాల పాత్ర కూడా ఉంది. కేవలం పిల్లలను కాపాడేందుకే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్ ఏకంగా ఓ చిన్నపాటి జలాంతర్గామిని తయారు చేయించి పంపగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. అత్యంత దుర్భేద్యమైనదిగా భావించిన ఈ ఆపరేషన్‌లో భారత్ కూడా ప్రముఖ పాత్ర పోషించింది. నీటిని తోడటంలో ప్రముఖ పాత్ర... థామ్ లువాంగ్ గుహలో చిన్నారులు చిక్కుకున్న విషయం గురించి తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. పుణెకు చెందిన కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్(కేబీఎల్)కు చెందిన సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవాల్సిందిగా థాయ్ అధికారులకు సిఫారసు చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కేబీఎల్ సాంకేతిక నిపుణులు థామ్ లువాంగ్‌కు చేరుకున్నారు. నీటిని తోడేందుకు ఉపయోగించే పంపుల పనితీరును పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాటి కండీషన్ గురించి పరిశీలించారు. నీటిని త్వరిగతిన తోడేందుకు నాలుగు అత్యాధునిక ‘ఆటోప్రైమ్ డీవాటరింగ్’ పంపులను కూడా థాయ్‌లాండ్‌కు పంపించేందుకు మహారాష్ట్రలోని కిర్లోస్‌వాడి ప్లాంట్‌లో సిద్ధంగా ఉంచినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. చిన్నారులంతా సురక్షితంగా బయటపడటంలో తమ వంతు సహకారం కూడా ఉన్నందుకు సంతోషిస్తున్నామని పేర్కొంది. -
అనన్య సామాన్యం: అందరూ మృత్యుంజయులే
మే సాయి : 18 రోజుల ఎడతెగని నిరీక్షణ అనంతరం థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న ఫుట్‌బాల్ టీమ్ తిరిగి భూమి వెలుపలికి వచ్చింది. నాటకీయ పరిణామాల మధ్య మూడు రోజుల పాటు జరిగిన డైవింగ్ ప్రక్రియలో ఆదివారం నలుగురు, సోమవారం నలుగురు, మంగళవారం నలుగురు చిన్నారులు, కోచ్‌ను డైవర్లు అత్యంత సురక్షితంగా గుహ వెలుపలికి తీసుకొచ్చారు. వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా, ఫుట్‌బాల్ టీమ్‌ను రక్షించడంలో డైవర్లు చూపిన తెగువ అనన్యసామాన్యం. గుహ లోపలికి వెళ్లడమే అతి కష్టమని భావిస్తే. టీమ్ సభ్యులను ఒక్కొక్కరిగా బయటకు తేవడానికి డైవర్లు పడిన కష్టానికి ఒట్టి ప్రశంసలు మాత్రమే సరిపోవు. గుహ గోడలు 70 సెంటీమీటర్ల కంటే తక్కువ గ్యాప్ ఉన్న సమయంలో డైవర్లు అతి కష్టంపైన బయటకు వచ్చిన తీరును గమనిస్తే ఒళ్లు జలదరిస్తుంది. సదరు వీడియోను తిలకిస్తే మనమైతే శ్వాస తీసుకోవడానికి కూడా శక్తి లేకుండా అయిపోయే వాళ్లమేమో అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. 18 రోజులుగా గుహకే పరిమితమైన చిన్నారులకు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉండటంతో వారిని కలిసేందుకు తల్లిదండ్రులకు సైతం అనుమతి ఇవ్వడం లేదు. 48 గంటల తర్వాతే వారిని కలవడానికి తల్లిదండ్రులకు అనుమతి ఇవ్వనున్నారు. కాగా, గుహ నుంచి బయటపడ్డ పిల్లల్ని థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ప్రయుత్ చాన్-ఓచా ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. జూన్ 23న ఈ పన్నెండు మంది చిన్నారులు తమ ఫుట్‌బాల్ కోచ్‌తో థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత తామ్ లుయాంగ్ గుహ చూడడానికి వెళ్లగా వరద ఉద్ధృతి పెరగడంతో అందులోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. తొమ్మిది రోజుల తర్వాత(జులై 7న) వారిని ఇద్దరు బ్రిటీష్ డైవర్లు కనిపెట్టారు. ప్రాణాలకు తెగించి పిల్లలను కాపాడిన డైవర్ల సాహసాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కీర్తిస్తున్నారు. -
ఆపరేషన్ 13
-
గుహ నుంచి ఆరుగురిని రక్షించిన రెస్క్యూ టీమ్
-
తప్పు నాదే.. మన్నించండి
దాదాపు 15 రోజులుగా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గుహలోనే చిక్కుకుపోయిన ఫుట్‌బాల్ టీమ్. పదిరోజుల అన్వేషణ .. ఇంటర్నేషనల్ ఆపరేషన్.. ఎట్టకేలకు ఆచూకీ లభ్యం. ఇప్పుడు వారందరినీ బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే చిమ్మచీకట్లో వారందరినీ కంటికి రెప్పలా ఇన్నాళ్లపాటు కాపాడిన కోచ్.. ఓ భావోద్వేగమైన సందేశాన్ని ప్రపంచానికి విడుదల చేశారు. బ్యాంకాక్: 25 ఏళ్ల ఎక్కపోల్ చాంతవోంగ్.. ఫుట్‌బాల్ టీమ్ కోచ్. గుహలోకి వాళ్లందరినీ తీసుకెళ్లింది ఆయనే. చిక్కుకుపోయిన వాళ్లలో అంతా మైనర్లే కాగా.. చాంతవోంగ్ వారిని కాపాడుతూ వస్తున్నారు. ‘తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. మీ పిల్లలంతా క్షేమంగానే ఉన్నారు. జరిగిన దాంట్లో తప్పు మొత్తం నాదే. మీ అందరికీ నా క్షమాపణలు. పిల్లలను జాగ్రత్తగా కాపాడేందుకు నా శాయశక్తులా కృషి చేస్తా.. ఇట్లు... మీ చాంతవోంగ్’ అంటూ ఓ లేఖను రాశాడు. థాయ్ నేవీ సీల్(SEAL) ఫేస్బుక్ పేజీలో శనివారం ఆ లేఖను పోస్ట్ చేశారు. కాగా, పదేళ్ల వయసులో ఓ ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన చాంతవోంగ్.. ఆమె దూరపు బంధువైన ఓ మహిళ దగ్గర పెరిగాడు. ‘ఆంటీ.. మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ లేఖలో సదరు మహిళకు కూడా చాంతవోంగ్ జాగ్రత్త సూచించాడు. ఇదిలా ఉంటే ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రొవిన్స్‌లో గత నెల 23న కోచ్‌తోపాటు 12 మంది సభ్యులున్న ఫుట్‌బాల్ టీమ్.. థామ్ లూవాంగ్ గుహ సందర్శనకు వెళ్లింది. ఒక్కసారిగా భారీ వర్షాలు కురియటంతో వారంతా లోపలే ఇరుక్కుపోయారు. పిల్లలు గుహాలో చిక్కుకున్నారని తెలిశాక.. కోచ్ చాంతవోంగ్పైనే తీవ్ర విమర్శలు వినిపించాయి. అయితే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటం.. తాను పస్తులుండి వారి ఆకలి తీర్చటం లాంటి విషయాలు వెలుగులోకి వచ్చాక వాళ్ల అభిప్రాయం మారి అతనిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం వారందరినీ బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక 5 ఆప్షన్లే... మిషన్ ఇంపాజిబుల్ -
మృత్యువు ‘ఉచ్చు’ బిగిస్తోంది!
వేటగాళ్ల ఉచ్చుకు తీవ్రంగా గాయపడిన ఓ పెద్ద పులి మృత్యువు అంచుకు చేరుకుంటోంది. ఎదిగే దశలో ఉన్న పులి కావడంతో నడుముకు చుట్టుకున్న తీగలాంటి ఉచ్చు మరింత బిగుసుకుపోతోంది. మంచిర్యాల జిల్లా పరిధిలోని చెన్నూరు రిజర్వ్ అటవీ ప్రాంతంలో తీవ్ర గాయాలతో సంచరిస్తున్న ఆడ పులిని బంధించి ఉచ్చు నుంచి విముక్తి కల్పించేందుకు రాష్ట్ర అటవీ యంత్రాంగం 3 నెలల నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. అడవిలో అమర్చిన కెమెరా ట్రాప్‌లకు చిక్కిన పులి తాజా చిత్రాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది జనవరి నుంచి.. మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యం నుంచి మంచిర్యాల జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యానికి పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న చెన్నూ రు, కాగజ్‌నగర్ ఫారెస్టు డివిజన్లకు టైగర్ కారిడార్లుగా పేరుంది. కాగజ్‌నగర్ డివిజన్లో సంచరిస్తున్న ఫాల్గుణ అనే ఆడ పులి దాదాపు రెండున్నరేళ్ల కింద మూడు మగ, ఒక ఆడ కూనలకు జన్మనిచ్చింది. ఈ కూనలకు కే–1, కే–2, కే–3, కే–4గా అప్పట్లో అటవీ శాఖ పేర్లు పెట్టింది. వీటి లో మూడు మగ పిల్లలు చాలాకాలంగా జాడలేకుండా పోయాయి. నడు ముకు బిగుసుకున్న ఉచ్చుతో సంచరిస్తున్న ‘కే–4’ఆడ పులి మాత్రం గతేడాది జనవరిలో చెన్నూరు అడవిలో కెమెరా ట్రాప్‌లకు చిక్కింది. ఉచ్చుతో పెద్దగా ప్రమాదం లేదను కున్న అటవీ శాఖ మిన్నకుండిపోయింది. వలస వెళ్లిపోతే మరింత కష్టం పులి చెన్నూరు దాటి ఎక్కువ దూరం వలస వెళ్లిపోతే బంధించడం కష్టంగా మారుతుందని జం తు సంరక్షణ సంస్థల కార్యకర్తలు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. వర్షాలు ప్రారంభమైతే రెస్క్యూ ఆపరేషన్ సాధ్యం కాదని పేర్కొంటున్నారు. మరోవైపు కే–4 పులికి జన్మనిచ్చిన ఆడపులి ఫాల్గుణ కాగజ్‌నగర్ అడవిలో ఇటీవల మరో మూడు కూనలకు జన్మనిచ్చింది. వేటగాళ్ల బారి నుంచి వీటిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఫలించని రెస్క్యూ ఆపరేషన్ ఎదిగే పులి కావడంతో నడుముకు ఉచ్చు బిగుసుకుపోయి ప్రమాదకరంగా మారుతోందని గుర్తించిన అటవీ శాఖ ఎట్టకేలకు గత మార్చిలో రక్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. కవ్వాల్ పులుల అభయారణ్య ఫీల్డ్ డైరెక్టర్ సి.సర్వనన్ నేతృత్వంలో ముగ్గురు పశు వైద్యులు, ఓ డీఎఫ్ఓ, మరో ఎన్జీఓతో కమిటీని ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్ బాధ్యతలు అప్పగించింది. తొలి ప్రయత్నంగా చెన్నూరు అడవిలో బోను ఏర్పాటు చేసి ఎరగా ఎముకలు వేయగా, పులి దరిదాపుల్లోకి రాలేదు. ఆ తర్వాత మూడు నాలుగు చోట్ల బోనులో పశువులను కట్టి ఉంచినా ఫలితం రాలేదు. కేంద్ర మంత్రి మనేకా గాంధీకి విషయం తెలియడంతో పులిని బంధించేందుకు ఆమె ఓ ప్రొఫెషనల్ హంటర్ని పంపించారు. కెమెరా ట్రాప్స్‌లో పులి చిత్రాలను చూసిన హంటర్ కూడా గా యం తగ్గిందని, రెస్క్యూ చేయాల్సిన అవసరం లేదని రెండు నెలల కింద తేల్చి వెళ్లిపోయాడు. తాజాగా కెమెరా ట్రాప్‌కు చిక్కిన పులి చిత్రాల్లో ఉచ్చు వల్ల నడుముకు రెండు వైపుల కోసుకుపోయి తీవ్ర గాయాలైనట్లు గుర్తించారు. వేట కోసం పులి లంఘిస్తున్న క్రమంలో గాయం పెద్దదిగా మారుతోంది. మహమ్మద్ ఫసియుద్దీన్ -
5 ఆప్షన్లు : ప్రమాదం కాదు.. పెను ప్రమాదం..
సాక్షి, వెబ్ డెస్క్ : కాలం ఆగిపోతే బావుణ్ణు. సెకన్లు, గంటలు, రోజులు గడుస్తున్న కొద్దీ థామ్ లూవాంగ్ గుహలో చిక్కుకుపోయిన 13 మంది(12 మంది పిల్లలు+వారి ఫుట్‌బాల్ కోచ్)ని రక్షించతరమా? అనే సందేహం రేకెత్తుతోంది. గుహలో తప్పిపోయి 10 రోజుల తర్వాత ఇద్దరు బ్రిటీష్ డైవర్లకు సజీవంగా కనిపించిన ఫుట్‌బాల్ టీమ్‌ను రక్షించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. వర్షాకాలం తొంగి చూస్తుండటం పిల్లల తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టింది. గుహ నుంచి పిల్లల్ని బయటకు తేవాలంటే కొన్ని కిలోమీటర్ల మేర వారితో డైవింగ్ చేయించాలి. గుహలోని నీటిని తగ్గించేందుకు జపాన్‌కు చెందిన ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు. వారి వినియోగిస్తున్న మోటార్ ద్వారా గుహ నుంచి గంటకు 1 సెంటీమీటర్ మేర నీటి మట్టాన్ని తగ్గించగలుగుతున్నారు. థాయ్‌లాండ్ ప్రభుత్వం ముందు 5 ఆప్షన్లు : వర్షాకాలం అనే పదం ప్రస్తుతం థాయ్‌లాండ్ ప్రభుత్వాన్ని తరుముతోంది. ఎంత త్వరగా గుహలో నుంచి పిల్లల్ని బయటకు తెస్తే అంతమంచిది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం ముందు ఐదు ఆప్షన్లు ఉన్నాయి. నీరు వెళ్లబెట్టే వరకూ ఆగడం థాయ్ ప్రభుత్వం ముందు ఉన్న అత్యంత సురక్షితమైన ఆప్షన్ ఇది. అయితే, ఇందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చు. నీరు మొత్తాన్ని వెళ్లబెట్టినా, వర్షాకాలం ముంచుకొస్తోంది. కొన్ని వారాల గుహ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. ఓ వర్షాకాలంలో వచ్చిన నీరు మొత్తాన్ని వెళ్లబెట్టడం అసాధ్యం కాకపోయినా కష్టతరమే. చిమ్నీ ద్వారా.. దాదాపు 10 కిలోమీటర్లు మేర పొడవున్న థామ్ లువాంగ్ గుహలో అక్కడక్కడ చిమ్నీలు(గుహ లోపలికి గాలి, వెలుతురు ప్రసరింపజేస్తుంటాయి) ఉండి ఉండొచ్చు. అయితే, అలాంటి వాటిని ప్రభుత్వం ఇంతవరకూ గుర్తించలేదు. ఫుట్‌బాల్ టీం ఉన్న ప్రాంతానికి చేరువలో చిమ్నీలు ఏమైనా ఉన్నాయా? అనే దానిపై అధికారులు శోధిస్తున్నారు. డైవింగ్ పిల్లలతో పాటు కోచ్‌కు డైవింగ్‌లో తర్ఫీదు ఇచ్చి బయటకు తేవాలనేది మరో ఆప్షన్. అసలు ఈత అంటేనే తెలియని వారితో ఎలా డైవింగ్ చేయిస్తారు?. సాధారణంగా ఓ వ్యక్తికి డైవింగ్‌లో తర్ఫీదు ఇవ్వడానికి మూడు రోజుల సమయం పడుతుంది. అలాంటిది ఇప్పటికే 12 రోజులుగా చీకటి గుహలో నివసిస్తున్న వారు శారీరకంగా, మానసికంగా బలహీనపడివుంటారు. అలాంటి వారితో అతివేగంగా ప్రవహిస్తున్న నీటిలో డైవింగ్ చేయించగలగాలి. అంతేకాకుండా థామ్ లువాంగ్ గుహలో అతి సన్నని మార్గాలు ఉంటాయి. ఒక డైవర్ నీటిలోకి దిగాక అతని కంటికి కేవలం కొన్ని సెంటీమీటర్ల మేర మాత్రమే ఏం జరగుతుందో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఆందోళన చెందితే వారి ప్రాణాలతో పాటు ఎస్కార్ట్‌గా వస్తున్న నిపుణులైన డైవర్ల ప్రాణాలకు సైతం ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఒక్క పిల్లాడితో డైవింగ్ చేయించడం.. డైవింగ్ అంటే పిల్లలకు ఉన్న భయాన్ని వారి మదిలో నుంచి తొలగించేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడొచ్చు. వాలంటీర్‌గా ముందుకొచ్చిన ఒక పిల్లాడిని తొలుత గుహ నుంచి బయటకు తెచ్చి, అతడు డైవ్ చేసిన ఫొటోలను మిగతా వారికి చూపి సాహసానికి ప్రోత్సహించవచ్చు. ‘ప్యాకేజ్’ల రూపంలో.. ఆక్సిజన్ ప్యాకేజిలలో ఒక్కొక్కరిని ఉంచి బయటకు తేవడం. ఈ పద్దతిలో చాలాసార్లు విజయం సాధించినట్లు అమెరికా పేర్కొంది. అయితే, గుహలో మార్గాలు అతి సన్నగా ఉండటం వల్ల ఇది సాధ్యపడే అవకాశాలు తక్కువే. -
మానస్ సరోవర్‌లో ముగిసిన రెస్క్యూ ఆపరేషన్
-
మిషన్ ఇంపాజిబుల్!
12 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు.. అందునా పిల్లలు.. తమ కోచ్‌తో కలిసి విహార యాత్ర కోసం గుహలోకి వెళ్లారు.. అంతలోనే భారీ వర్షాలు.. వరదలు.. గుహలో నిండిన నీళ్లు.. లోపలికి వెళ్దామంటే.. గజ ఈతగాళ్లే గజగజలాడాల్సిన పరిస్థితి. వారం గడిచింది..అందరూ ఆశలు వదిలేసుకున్నారు.. అయితే.. అనుకోకుండా ఒకరోజు.. ఇద్దరు బ్రిటన్ డైవర్లకు పిల్లలు కనిపించారు.. సజీవంగా.. దేశమంతా పండుగ చేసుకుంది. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.. సజీవంగా కనిపించారు.. అయితే.. సజీవంగా బయటకు వస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. వాళ్లకు ఈత రానందున గుహ నుంచి బయటకు రావడం అసాధ్యమంటున్నారు.. 4 నెలలు అందులోనే ఉండిపోవాల్సిందేనంటున్నారు.. మరోవైపు వారినెలాగైనా బయటకు తేవడానికి అంతర్జాతీయ నిపుణుల బృందం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది.. 100 శాతం అందరినీ రక్షిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ వారి మిషన్ ఫలిస్తుందా? ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించిన ఈ ఘటన వివరాలు గ్రాఫిక్ రూపంలో.. జూన్ 23: పిల్లలు, వారి కోచ్ థామ్ లుయాంగ్ నాంగ్ నాన్ గుహ(దీని పొడవు 9.65 కి.మీ)కు వెళ్లారు. ఎంతసేపయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గుహ ముఖద్వారం వద్ద సైకిళ్లు.. లోపల షూలు, బ్యాగులు కనిపించడంతో గుహలో చిక్కుకుపోయారని గ్రహించారు. జూన్ 24: గుహ లోపల పిల్లల చేతి, కాలి ముద్రలు కనిపించాయి. గుహలో నీటిమట్టం పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు మరింత లోపలికి వెళ్లి ఉంటారని అంచనా వేశారు. జూన్ 25, 26: థాయ్‌లాండ్ నేవీ సీల్స్ విభాగం డైవర్లు రంగంలోకి దిగారు. అయితే.. వరద ఉధృతి వల్ల వారు వెనక్కి రావాల్సి వచ్చింది. జూన్ 27: బ్రిటిష్ డైవర్లు రిచర్డ్, జాన్, రాబర్ట్‌తో పాటు అంతర్జాతీయ నిపుణులు వచ్చారు. జూన్ 28: వరదల వల్ల సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపేశారు. భారీ మోటార్లను వినియోగించి గుహలోని నీటిని తోడటం మొదలుపెట్టారు. పై నుంచి గుహలోకి వెళ్లే మార్గాన్ని కనుగొనేందుకు డ్రోన్లను రంగంలోకి దింపారు. జూన్ 29: భూమిపై నుంచి డ్రిల్లింగ్ ద్వారా గుహలోకి వెళ్లే అవకాశమున్న ఓ ప్రదేశాన్ని కనుగొన్నా.. అది గుహ ప్రధాన మార్గాన్ని చేరుతుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. జూన్ 30: వాతావరణం అనుకూలించడంతో డైవర్లు గుహలో ముందుకు వెళ్లారు. జూలై 1: గుహలో ఓ పొడి ప్రాంతంలో బేస్ ఏర్పాటు చేసుకున్నారు. గుహలో కొన్ని రోజులు ఉండేందుకు వీలుగా వందలాది ఆక్సిజన్ ట్యాంకులు, ఆహార పదార్థాలను తరలించారు. జూలై 2: గుహ ప్రవేశ ద్వారానికి 4 కి.మీ. దూరంలో ఆ 13 మందిని జాన్, రిచర్డ్ గుర్తించారు. జూలై 3, 4, 5: బుధవారం కొందరు తెలియక మధ్యలో ఓసారి నీటిని మళ్లీ గుహలోకే పంపింగ్ చేసేశారు. తర్వాత దీన్ని గుర్తించి సరిదిద్దారు. పిల్లలు తమ తల్లిదండ్రులతో మాట్లాడటానికి వీలుగా ఫోన్ లేదా ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు లోపల ఉన్న ఇద్దరు పిల్లలు, కోచ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్‌ను పంపింగ్ చేస్తున్నారు. త్వరలో భారీ వర్షాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వీరిని రక్షించడానికి ప్రస్తుతం మూడే మార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. డ్రిల్లింగ్ చేసి.. సిలెండర్లాంటి దానిలో వారిని పైకి తేవాలి. అయితే.. వారు కనుగొన్న ప్రదేశం.. గుహలో వారున్న ప్రాంతాన్ని కచ్చితంగా చేరుతుందా అన్నదానిపై అనుమానాలున్నాయి. దీనికితోడు దాదాపు కిలోమీటరు మేర లోతులో డ్రిల్లింగ్ చేయాలి. పైగా.. పిల్లలు పైకి తెచ్చేంత వైశాల్యంలో.. దీనికి చాలా టైం పడుతుందంటున్నారు. ఇదిలా ఉండగా.. తమకు బయట నుంచి కుక్కల అరుపులు వంటివి వినిపిస్తున్నాయని బుధవారం గుహలోని బాలురు చెప్పారు. అంటే.. ఈ లెక్కన భూమిపైనుంచి లోపలికి ఎక్కడో భారీ రంధ్రంలాంటిది ఉండొచ్చనే అంచనాతో దాని కోసం గాలిస్తున్నారు. వర్షాలు ఆగి.. నీటి మట్టం తగ్గేంతవరకూ వేచి ఉండటం.. అంతవరకూ లోపల చిక్కుకున్నవారికి ఆహారం సరఫరా చేయడం.. ప్రస్తుతానికి ఉన్నవాటిల్లో ఇది మంచి నిర్ణయంలా కనిపిస్తున్నా.. ఇందుకోసం వారు 4 నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. పైగా.. వర్షాలు అంచనాలకు మించి పడినా.. వరద పోటెత్తినా.. వీరు ఉన్న ప్రదేశానికి కూడా నీరు చేరుకునే ప్రమాదముందని అంటున్నారు. ఇప్పటికే.. నీటి మట్టం పెరగడంతో వారు గతంలో ఉన్న ప్రదేశం కంటే మరికాస్త వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. ఆ 13 మందికి ఈత రాదంటున్నారు.. ఇక్కడ ఈత మాత్రమే కాదు.. డైవింగ్ రావాలి.. అంటే స్కూబా సామగ్రి వేసుకుని.. నీటిలో ఈదాల్సి ఉంటుంది. పైగా.. చాలాచోట్ల ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలిగేలా ఇరుకిరుకుగా ఉంటుంది. వారికి డైవింగ్ నేర్పించి, ఒక్కొక్కరికి ఇద్దరు డైవర్లు చొప్పున మార్గదర్శనం చేస్తూ.. బయటకు తేవాల్సి ఉంటుంది. వారిని వెంటనే రక్షించాలంటే ఇదొక్కటే మార్గం. ఇప్పటికే పిల్లలు డైవింగ్ దుస్తులు వేసుకోవడం వంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే.. ఇది ప్రమాదకరమైనది. నిపుణులైన డైవర్లు కూడా ఈ గుహలో ఈదాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటుంటారని చెబుతున్నారు. అమెరికా నేవీకు చెందిన డైవర్ ఒకరు పిల్లలు ఇలాంటి గుహలో డైవింగ్ చేయడానికి ప్రయత్నిస్తే.. వారిలో కొందరు చనిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
భారీ రెస్క్యూ ఆపరేషన్.. ఉత్కంఠకు తెర
దాదాపు పది రోజులపాటు కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కనిపించకుండా పోయిన ఫుట్‌బాల్ టీమ్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. వారంతా ప్రాణాలతోనే ఉన్నారని ప్రకటించిన థాయ్‌లాండ్ అధికారులు.. భారీ రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లు సోమవారం ప్రకటించారు. గుహలోనే చిన్నారులంతా చిక్కకు పోయారని, అంతా సజీవంగా ఉన్నారని ప్రకటించారు. దీంతో చిన్నారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. సుమారు 12 మంది సభ్యులు(అంతా 13-16 ఏళ్లలోపు వాళ్లే).. కోచ్(25)తోపాటు అంతా మృత్యుంజయులుగా నిలిచారు. ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రొవిన్స్‌లో ఈ నెల 23న చెందిన సదరు ఫుట్‌బాల్ టీమ్ ప్రాక్టీస్ ముగిశాక దగ్గర్లోని థామ్ లూవాంగ్ గుహ సందర్శనకు వెళ్లింది. (మయన్మార్-లావోస్-థాయ్‌లాండ్ సరిహద్దులో ఉండే సుమారు 10 కిలోమీటర్ల పొడవు ఉండే గుహ అది). సాధారణంగా వర్షాకాలంలో ఈ గుహ చుట్టూ, లోపలికి నీరు చేరుతుంది. అందుకే ఆ సమయంలో గుహలోని అనుమతించరు. కానీ, వర్షాలు తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయంతో ఆ ఫుట్‌బాల్ టీమ్ లోపలికి వెళ్లింది. అంతలో భారీ వర్షం పడటం.. నీరు ఒక్కసారిగా లోపలికి చేరటంతో వారంతా అందులో చిక్కుకుపోయారు. ప్రాక్టీస్‌కు వెళ్లిన వాళ్లు తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు అధికారులకు సమాచారం అందించారు. గుహ వెలుపల సైకిళ్లు కనిపించటంతో అధికారులు గాలింపు చేపట్టారు. పదిరోజుల పాటు ఉత్కంఠే... భారీ వర్షాలు, బురద దట్టంగా పేరుకుపోవటంతో సహాయక చర్యలకు అవాంతరం ఏర్పడింది. థామ్ లూవాంగ్ గుహ, విషపూరితమైన పాములతో నిండి ఉండటం, పైగా లోపలి మార్గాలు చాలా ఇరుక్కుగా ఉండటంతో.. అన్నిరోజులు వారు బతకటం కష్టమని భావించారు. తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. అయితే అధికారులు మాత్రం ఆశలు వదులుకోలేదు. థాయ్ నేవీ సీల్(SEAL) డైవర్స్‌తోపాటు ముగ్గురు బ్రిటీష్ డైవర్స్, యూస్‌ఫసిఫిక్ కమాండ్‌కు చెందిన అమెరికా మిలిటరీ బృందం, పారా రెస్క్యూ సిబ్బంది, మరికొందరు రక్షణ నిపుణులు రంగంలోకి దించి భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భారీ వర్షాలతో లోపలికి నీరు చేరినా.. సంక్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఆ బృందం తమ గాలింపును కొనసాగించింది. మరోవైపు ప్రజలు, బౌద్ధ సన్యాసులు వారంతా సురక్షితంగా తిరిగి రావాలని పూజలు చేశారు. ఎట్టకేలకు పదిరోజులకు అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. సోమవారం(జూలై 2న) వారిని కనుగొన్నట్లు సహాయక బృందం ప్రకటించింది. ‘అంతా సురక్షితంగా ఉన్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని చియాంగ్ రాయ్ గవర్నర్ నారోంగ్సక్ ఒసోట్టనాక్రోన్ ఓ ప్రకటనలో ధృవీకరించారు. ఈ మేరకు సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్న ఓ వీడియోను అధికారులు విడుదల చేశారు. ‘సహాయక బృందాన్ని చూడగానే వారంతా సంతోషం వ్యక్తం చేయటం.. ఆకలిగా ఉంది. తినటానికి ఏమైనా కావాలని.. తమను వెంటనే బయటకు తీసుకెళ్లాలని ఓ బాలుడు కోరటం’ వీడియోలో ఉంది. అధికారుల కృషిపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. -
ఒళ్లు గగుర్పొడిచేలా.. గాల్లో తలకిందులుగా...
సాహసం చెయ్యరా డింభకా అంటూ ఓ 60 మంది రోలర్ కోస్టర్ ఎక్కారు.. గిరాగిరా తిరిగిన రోలర్ కోస్టర్.. సరిగ్గా అందులోని వారు తలకిందులుగా ఉన్న సమయంలో ఆగిపోయింది. అప్పటివరకు గాలిలో గింగిరాలు కొడుతూ.. కేరింతలు కొట్టిన సందర్శకులు.. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో షాక్ తిన్నారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రెండు గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గాల్లో తలకిందులుగా గడిపారు. చివరకు రక్షక దళాలు రంగంలోకి దిగడంతో బతుకు జీవుడా అంటూ ఆ రోలార్ కోస్టర్ నుంచి బయటపడ్డారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జపనీస్ మీడియా యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. జపాన్‌లోని యూనివర్సల్ స్టూడియోలో ఉన్న ‘ఫ్లైయింగ్ డైనోసార్’ రోలర్ కోస్టర్ ఎక్కేందుకు రోజుకు వందల మంది వస్తూ ఉంటారు. అలాగే మంగళవారం కూడా ఓ 60 మంది వచ్చారు. వారంతా ఎంతో ఉత్సాహంతో రైడ్ ప్రారంభించారు. కానీ కాసేపటి తర్వాత సాంకేతిక లోపం తలెత్తడంతో.. రోలర్‌కోస్టర్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో రెండు గంటల పాటు వారంతా గాల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్థానిక మీడియా పేర్కొంది. -
జపాన్‌లో ఒళ్లు ఒళ్లు గగుర్పొడిచే ఘటన
-
బోరు బావిలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారి
-
బోరు బావిలో చిన్నారి
భోపాల్ : మరో పసి ప్రాణం కోసం తల్లిదండ్రుల గుండెలవిసేలా విలపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో నాలుగేళ్ల ఓ చిన్నారి బోరు బావిలో పడిపోయాడు. దేవాస్ జిల్లా ఉమరియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో పోలానికి వెళ్లిన ఆ చిన్నారి.. ఆడుకుంటూ అటుగా వెళ్లి బావిలో పడిపోయాడు. అది గమనించిన తల్లి గ్రామస్థులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఆ బాబును బయటికి తీసేందుకు యత్నిస్తున్నారు. సుమారు 40 అడుగుల లోతున బోర్ బావిలో రోషన్ ఇరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ను రంగంలోకి దించేందుకు యత్నాలు సాగుతున్నాయి. గతేడాది మధ్యప్రదేశ్‌లోనే సత్యం అనే 5 ఏళ్ల బాలుడు 100 అడుగుల బోర్ బావిలో పడిపోగా.. అతని కాపాడేందుకు 48 గంటలకు పైగా అధికారులు శ్రమించి విఫలమయ్యారు. -
గుర్రంతోపాటు బావిలో పడ్డ వరుడు.. వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకలో అపశృతి చోటచేసుకుంది. అప్పటివరకూ ఎంతో ఉత్సాహంగా ఉన్న వధూవరుల బంధువులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. పెళ్లికొడుకును గుర్రంపై ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో దురదృష్టవశాత్తూ గుర్రంతో పాటే వరుడు ఓ బావిలో పడిపోయాడు. దీంతో ఏం జరుగుతుందోనని వరుడి బంధువులు ఆందోళన చెందారు. ఈ ఘటన యూపీలోని గొండాలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుంది. శుభకార్యం జరిగే సమయంలో ఇలా జరగడంపై వధూవరుల బంధువుల ఆనందం ఆవిరైంది. అయితే జేసీబీ సాయంతో గుర్రాన్ని ప్రాణాలతో బయటకు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బావి మరీ ఎక్కువ లోతు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అ వరుడిని బావి నుంచి బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బోరు బావిలో మీనా.. ఎప్పుడేం జరిగిందంటే!
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో గత గురువారం బోరుబావిలో పడిన చిట్టితల్లీ మీనాను ప్రాణాలతో కాపడలేకపోయారు. దాదాపు 60 గంటల పాటు పలువురు సిబ్బంది ఎంతో శ్రమించినా మీనా కథ విషాదంగానే ముగిసింది. పాప మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చూడాల్సి రావడంతో తల్లిదండ్రులతో పాటు చూపరులు సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు. అసలే ఏం జరగిందంటే.. గురువారం సాయంత్రం తోటి చిన్నారులతో మీనా ఆడుకుంటూ ఉంది. తెరచిఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తూ పడిపోయిన చిన్నారిని అత్యాధునిక పరికరాలతో బయటకు తీయాలని ఎన్డీఆర్ఎఫ్ బృందం సైతం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి బోరు బావి నుంచి దుర్వాసర వస్తుండటంతో మంత్రి మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో చివరి ప్రయత్నంగా ఫ్లషింగ్ విధానాన్ని అనుసరించారు. దీంతో మొదట పాప దుస్తులు వచ్చాయి. అనంతరం పాప శరీర భాగాలను బయటకు తీసి చేవెళ్ల ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. రెస్క్యూ ఆపరేషన్ ఇలా సాగింది.. జూన్ 22న (గురువారం) ఆడుకుంటూ సాయంత్రం 6:45 గంటలకు బోరుబావిలో పడిపోయిన చిన్నారి మీనా సాయంత్రం 6:50 గంటలకు స్థానికులకు సమాచారం అదే రోజు రాత్రి 7:15 గంటలకు బోరుబావి వద్దకు చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది. మరో ఐదు నిమిషాలకు ఘటనస్ధలంలో మంత్రి మహేందర్ రెడ్డి రాత్రి 7:45 గంటలకు జేసీబీల రాక. రాత్రి 11 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి 11:30 గంటలకు ఘటనాస్థలానికి వచ్చి పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ రఘునందన్ గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అత్యాధునిక పరికరాలతో వచ్చిన మంగళగిరి ఎన్డీఆర్ఎఫ్ బృందం జూన్ 22 అర్థరాత్రి నుంచి జూన్ 23 ఉదయం వరకు బోరు బావికి సమాంతరంగా తవ్వకాలు శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బోరు బావి నుంచి మోటార్ వెలికితీత మధ్యాహ్నం నుంచి మళ్లీ కొనసాగిన తవ్వకాలు. పాప 40 అడుగుల నుంచి 100 అడుగులకు లోతుకు జూన్ 24 (శనివారం) ఉదయం ప్రత్యేక లేజర్ కెమెరాలు తెప్పించి.. 110 అడుగుల లోతు వరకు పంపి పరిశీలించినా కనిపంచని పాప ఆనవాళ్లు మధ్యాహ్నం అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించిన కనిపించని పాప జాడ సాయంత్రం కొక్కెం లాంటి పరికరాలతో పాపను బయటకు తీసేందుకు సిబ్బంది యత్నం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత పాప చనిపోయి ఉండొచ్చునని అనుమానాలు ఆదివారం వేకువజాములోగా కేఎల్ఆర్ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేక యంత్రాలను తెప్పించారు. బోరుబావిలోకి ఫ్లషర్ పెట్టి చిన్నారి దేహాన్ని బయటకు తీయాలని యత్నాలు దాదాపు 6 గంటల ప్రాంతంలో బోరుబావి నుంచి దుర్వాసన. అనంతరం పాప దుస్తులు, అవశేషాలు వెలికితీత చిన్నారి మీనా మృతిచెందినట్లు ఉదయం 6:25 గంటలకు మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటన. అనంతరం పాప అవశేషాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలింపు సంబంధిత కథనాలు ఆ నిర్ణయమే కొంప ముంచింది! ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా! చిన్నారి మీనా ఘటన విషాదాంతం 300 అడుగుల లోతు నుంచి 2 గంటల్లోనే.. -
ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా!
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. అయితే అరవై గంటలకు పైగా శ్రమించినా కనీసం పాప మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించలేకపోవటం విచారకరం. కేవలం పాప అవశేషాలు ఒక్కొక్కటిగా చూడాల్సి రావడంతో కడసారి చూపును సైతం కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. మరోవైపు గురువారం రాత్రి నుంచి అత్యాధునిక పరికరాలతో బయటకు తీసేందుకు సిబ్బంది చేసిన యత్నాలు ఫలించలేదు. శుక్రవారం బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. శనివారం ప్రత్యేక లేజర్ కెమెరాలతో పరిశీలించినా, అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించినా చిన్నారి ఆచూకీ కానరాలేదు. ఆదివారం వేకువ జాము నుంచి ఎయిర్ ప్రెషర్ ద్వారా బయటకు తీయాలని చేసిన చివరి ప్రయత్నం కొంత మేలని అధికారులు భావించారు. అయితే ఫ్లషింగ్తో మృతదేహాన్ని బయటకు తీయాలని చూడగా మొదటగా బోరు బావి నుంచి దుర్వాసన వచ్చింది. ఆపై చిన్నారి దుస్తులు బయటకు వచ్చాయి. ఇది చూడగానే చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆపై మరికాసేపు ఫ్లషింగ్ చేయగా చిన్నారి మీనా అవశేషాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఆ తల్లిదండ్రులకు తమ ముద్దుల చిన్నారి రూపాన్ని కడసారి చూపు సైతం దక్కలేదని స్థానికులు ఆవేదన చెందారు. దాదాపు మూడు రోజులుగా నీళ్లు, మట్టిలో చిన్నారి కూరుకుపోవడంతో చనిపోయి మృతదేహం కుళ్లిపోయింది. శవ పరీక్ష కోసం చిన్నారి అవశేషాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. పనిచేయని బోరుబావులు మూసివేయకుండా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ఘటనా స్థలంలో ఉన్న మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. చిన్నారి కుటంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ప్రమాదానికి కారణమైన బోరు యాజమాని మల్లారెడ్డిపై 336 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బోరు బావిని నిర్లక్ష్యంగా వదిలేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రఘునందన్‌రావు చెప్పారు. సంబంధిత కథనాలు ఆ నిర్ణయమే కొంప ముంచింది! బోరు బావిలో మీనా.. ఎప్పుడేం జరిగిందంటే! చిన్నారి మీనా ఘటన విషాదాంతం 300 అడుగుల లోతు నుంచి 2 గంటల్లోనే.. -
విషాదం: చిన్నారి మీనా మృతి
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందినట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో దాదాపు 60 గంటలపాటు ఎంతో శ్రమించినా ఫలితం శూన్యమైంది. ఎయిర్ ప్రెషర్ ద్వారా చిన్నారి మృతదేహాన్ని బయటకు తీయాలని సిబ్బంది యత్నిస్తుండగా బోరు బావి నుంచి చిన్నారి అవశేషాలతో పాటు దుస్తులు(ఫ్రాక్) బయటకు వచ్చినట్లు తెలిపారు. బోరు బావి నుంచి దుర్వాసన వస్తోందని, అయితే మృతదేహాన్ని తల్లిందండ్రులకు అప్పగించి వారికి పాప చివరిచూపును కల్పించేందుకు విశ్వ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటనతో చిన్నారి మీనా తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో బోరు బావి సమీప ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. గురువారం మీనా అనే ఏడాదిన్నర పాప బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. అయితే మూడు రోజులుగా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో చిన్నారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు. గురువారం 40 అడుగుల లోతున ఇరుక్కుపోయిన చిన్నారి.. శుక్రవారం బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. శనివారం ప్రత్యేక లేజర్ కెమెరాలతో పరిశీలించినా, అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించినా చిన్నారి ఆచూకీ కానరాలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఎయిర్ ప్రెషర్ ద్వారా యత్నించగా.. చిన్నారి ఫ్రాక్ బయటకు రావడంతో పాటు బోరు బావి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో చిన్నారి మీనా మృతి చెందినట్లు నిర్దారించారు. చిన్నారి మృతి బాధాకరం: మహేందర్ రెడ్డి 60 గంటలపాటు శ్రమించినా చిన్నారిని కాపాడలేకపోయాం. మీనా మృతి నిజంగా బాధాకరం. ఎంత శ్రమించినా మా శ్రమ ఫలించలేదు. ఎయిర్ ప్రెషర్ ద్వారా చిన్నారి దుస్తులు, అవశేషాలు రావడంతో మృతిచెందినట్లు గుర్తించాం. శవ పరీక్ష కోసం చిన్నారి మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించాం. పనిచేయని బోరుబావులు మూసివేయకుండా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటాం. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. సంబంధిత కథనాలు ఆ నిర్ణయమే కొంప ముంచింది! ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా! బోరు బావిలో మీనా.. ఎప్పుడేం జరిగిందంటే! 300 అడుగుల లోతు నుంచి 2 గంటల్లోనే.. -
చిన్నారి పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేం!
చేవెళ్ల: బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీ కనుక్కొనేందుకు త్రిడైమన్షన్ మ్యాట్రిక్స్ కెమెరాను బోరుబావిలోకి పంపామని, అయితే, 180 అడుగుల వద్ద నీళ్లు తగలడంతో చిన్నారి ఆచూకీ లభించలేదని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో ప్రత్యేక మోటారు ద్వారా నీటిని అంతటిని తోడిస్తున్నామని ఆయన చెప్పారు. చిన్నారి పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. ఇక జిల్లా వైద్యాధికారి బాలాజీ మాట్లాడుతూ చిన్నారిని బయటకు తీసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నిరంతరం బోరుబావిలోకి ఆక్సీజన్ పంపుతున్నామని, చిన్నారిని బయటకు తీయగానే వైద్యం అందించేందుకు చేవెళ్ల ప్రభుత్వాస్పత్రి.. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశామని బాలాజీ చెప్పారు. 'సాక్షి' ఉద్యమంలో నేనూ పాల్గొంటా: కొండా విశ్వేశ్వరరెడ్డి తెరిచి ఉన్న బోరుబావులను వెంటనే మూసివేయాలంటూ 'సాక్షి' పిలుపునిచ్చిన ఉద్యమంలో తాను కూడా పాల్గొంటానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో 30వేలకుపైగా తెరిచి ఉన్న బోరుబావులున్నట్టు అంచనా ఉందని, వీటిని వెంటనే మూసివేసేందుకు ఉచితంగా క్యాప్‌లు పంపిణీ చేస్తామని తెలిపారు. చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామ పరిధి ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 18నెలల చిన్నారి మీనా బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే. చిన్నారిని బోరుబావిలోంచి వెలికితీసేందుకు జరుగుతున్న ఆపరేషన్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి, అధికారులతో కలిసి దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.