సాక్షి, న్యూడిల్లీ : ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డు సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 34 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్రం చేస్తున్నారు.
కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆస్పత్రిలో మంటలు వ్యాపించినట్లు సమాచారం. భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో మొదటి అంతస్తులో చికిత్స పొందుతున్న రోగులను మరో చోటుకు తరలించారు. అయితే ఇప్పటివరకు మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇదే ఆస్పత్రిలో బీజేపీ సీనియర్‌నేత అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారని, సహాయక చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment