delhi aiims
-
ఎయిమ్స్‌కు ఏచూరి భౌతికకాయం అప్పగింత
న్యూఢిల్లీ: వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థీవదేహం ఎయిమ్స్‌కు చేరుకుంది. వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించిన అనంతరం.. అంతిమ యాత్ర సాగింది. ఆయన కోరిక మేరకే భౌతిక కాయాన్ని మెడికల్ రీసెర్చ్ కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు దానం చేశారు.ఈ ఉదయం 11 గంటలకు ఏచూరి పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం.. పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ.. ఏచూరి భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి ఆయన సతీమణిని ఓదార్చారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, కేరళ సీఎం పినరయి విజయన్.. ఏచూరి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆప్ కీలక నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, వైఎస్సార్సీపీ తరఫున విజయసాయిరెడ్డి కూడా దివంగత కామ్రేడ్‌కు నివాళులర్పించారు.సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయన 1992 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి తొలుత జేఎన్‌యూ(JNU)కు తరలించి అక్కడి నుంచి ఆయన నివాసానికి తీసుకెళ్లారు. జేఎన్‌యూఎస్‌యూ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉంచగా.. వందల మంది విద్యార్థులు ‘‘లాల్‌సలాం’’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమాన కమ్యూనిస్టు యోధుడికి పుష్పాంజలి ఘటించారు. VIDEO | Veteran CPI(M) leader Sitaram Yechury’s mortal remains brought to AIIMS, Delhi. The CPI(M) general secretary died on Thursday, August 12, in Delhi after battling a lung infection. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/7eTYgwssEG— Press Trust of India (@PTI_News) September 14, 2024క్లిక్ చేయండి: వామపక్ష దిగ్గజ నేత జీవితంలో ప్రత్యేక క్షణాలు -
కాకినాడ కామ్రేడ్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన వామç³క్ష దిగ్గజం సీతారాం ఏచూరి తెలుగు బిడ్డే. సుదీర్ఘకాలం సీపీఎం అగ్రనేతగా కొనసాగిన ఆయన స్వస్థలం కాకినాడ. బాల్యం అంతా అక్కడే గడిచింది. రామారావుపేటలో ప్రస్తుతం ఏచూరి పేరుతో ఉన్న అపార్టుమెంట్ స్థలంలోనే ఏచూరి కుటుంబ సభ్యుల ఇల్లు ఉండేది. తాతల కాలం నాటి ఇంటి స్థానంలో అపార్టుమెంట్ నిరి్మంచారు. అక్కడ కనిపించే రెండు ఏనుగు బొమ్మల గురించి స్థానికులు గొప్పగా చెప్పుకునే వారు. తాత సీతారామారావు పేరునే ఏచూరికి పెట్టారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా సీతారాంకు స్వయానా మేనమామ. చెన్నైలో మేనమామ ఇంట సీతారాం జని్మంచారు. ఢిల్లీ జేఎన్‌యూలో ఉన్నత విద్యాభ్యాసం అనంతరం అక్కడి నుంచే వామపక్షవాదిగా రాజకీయాల్లోకి వచ్చారు. సీతారాం తండ్రి సర్వేశ్వర సోమయాజులు రవాణా శాఖలో పనిచేస్తూ డిప్యుటేషన్‌పై ఢిల్లీ వెళ్లారు. ప్రాచీన కళలపై ఎనలేని మక్కువ సీతారాం తల్లి కల్పకం విద్యావంతురాలు. కాకినాడ కేంద్రంగా మూడున్నర దశాబ్దాల పాటు అఖిల భారత మహిళా కాన్ఫరెన్స్ సభ్యురాలిగా చురుకైన పాత్ర పోషించారు. వాతావరణ కాలుష్యం, మొక్కల పెంపకం, నీటి వనరుల పరిరక్షణ, మహిళలపై దాడుల నియంత్రణ తదితర అంశాలపై ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మూడేళ్ల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. తన తండ్రి పేరుతో కాకినాడ గాం«దీభవన్‌లో నిరి్మంచిన కార్యాలయాన్ని చూసి సీతారాం ఎంతో సంతోíÙంచారని నాటి జ్ఞాపకాలను కాకినాడకు చెందిన వాడ్రేవు శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. మహర్షి సాంబమూర్తి ఇనిస్టిట్యూట్‌ను తాత్కాలికంగా సీతారాం ఇంట్లో ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కలి్పంచారని ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు తటవర్తి శ్రీనివాస్ చెప్పారు.ప్రాచీన కళలంటే వల్లమాలిన అభిమానం కలిగిన సీతారాం తోలు బొమ్మలాట కార్మికులు నిర్వహించిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కాకినాడ వచ్చారు. నేటి యువత గాంధీజీ ఆశయాలను ఆకళింపు చేసుకునేలాగాంధీ భవన్ చేస్తున్న కృషిని ప్రశంసించారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. 2008 ఆగస్టు 31న కాకినాడలో సీపీఎం కార్యాలయం సుందరయ్య భవనం ప్రారం¿ోత్సవం అనంతరం జరిగిన సభలో సీతారాం ప్రసంగాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని సీపీఎం నాయకులు పేర్కొంటున్నారు. -
కామ్రేడ్ ఏచూరి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ఎర్రజెండా నీడలో ప్రకాశించిన అరుణతార నేల రాలింది. దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యూనిస్టు రాజకీయాలపై చెరగని ముద్రవేసిన వామపక్ష యోధుడు, ప్రజా ఉద్యమకారుడు, సామాజిక వేత్త, కాలమిస్ట్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతూ ఆగస్టు 19వ తేదీన ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఐసీయూలో చేరిన ఏచూరి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రమవడంతో రెండురోజుల క్రితం విదేశాల నుంచి మెడిసిన్ తెప్పించారు.అది కూడా ఫలితాన్నివ్వకపోవడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీతారాం ఏచూరి కన్నుమూసినట్లు ఎయిమ్స్ వైద్య బృందం ప్రకటించింది. ఆయన భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు పరిశోధనల నిమిత్తం దానంగా ఇవ్వనున్నారు. ఏచూరి కోరిక మేరకే ఆయన కుటుంబసభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏచూరి రెండు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య పేరు ఇంద్రాణి మజుందార్. రెండో భార్య సీమ చిస్తీ. ఆయనకు కుమార్తె అఖిల, కుమారుడు డానిష్ ఉన్నారు. పశి్చమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత బుద్ధదేవ్ భట్టాచార్యకు నివాళులర్పిస్తూ ఆగస్టు 22న చివరిసారిగా ఏచూరి ఒక వీడియో సందేశంలో కని్పంచారు. ‘అనారోగ్యం కారణంగా ఎయిమ్స్ నుంచే మాట్లాడాల్సి వస్తోంది. విప్లవ లాల్ సలామ్‌లు బుద్ధదేవ్ గారికి..’ అని ఆ సందేశంలో ఏచూరి అన్నారు.ఏచూరి మరణంతో అటు కమ్యూనిస్టు పార్టీలోనూ, ఇటు కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రియతమ కామ్రేడ్‌ను కోల్పోవడం తీవ్ర విషాదకరమని సీపీఎం పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏచూరి మృతిపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఏచూరి భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తల నివాళులు, సందర్శనార్థం ఏచూరి పార్థివదేహాన్ని శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంచుతామని సీపీఎం తెలిపింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎయిమ్స్‌కు అప్పగించనున్నారు. పరిశోధనల కోసం పార్థివ దేహం ఏచూరి పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం దానం చేస్తున్నట్లు ఆయన కుటుంబీకులు అధికారికంగా ప్రకటించారు. పార్థివ దేహాలను పరిశోధనల కోసం దానం చేసే పద్ధతిని కమ్యూనిస్టులు కొంతకాలంగా కొనసాగిస్తున్నారు. ఇదే కోవలో పశి్చమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య భౌతికకాయాన్ని కూడా దానం చేశారు. ఇలాగే మరికొందరి భౌతికకాయాలను కూడా ఆసుపత్రులకు అప్పగించారు. నేడు విదేశీ కమ్యూనిస్టు నేతల రాక ఏచూరి మరణవార్తను తెలుసుకున్న విదేశాలకు చెందిన కమ్యూనిస్టుల పార్టీల నేతలు, ఆయనకు నివాళులరి్పంచేందుకు ఢిల్లీ రానున్నారు. శుక్రవారం చైనా, నార్త్ కొరియా, వియత్నాం, క్యూబా వంటి దేశాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మూడురోజుల పాటు ఢిల్లీలోనే ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1977అక్టోబర్ నెల.. ఓ నూనుగు మీసాల యువకుడి నాయకత్వంలో వందలాది విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ ఇంటికి వారంతా ర్యాలీగా చేరారు. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ఆమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాన్స్‌లర్ పదవిని మాత్రం వీడలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ వారంతా నినాదాలు చేయడం ప్రారంభించారు. చివరికి ఇందిర తన నివాసం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు లెగిచాడు.. జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సీతారాం ఏచూరి. ఇందిర పక్కనే నిల్చుని.. ఆమె రాజీనామానే డిమాండ్ చేస్తూ.. మెమెరాండంను చదివి వినిపించాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇందిర చాన్స్‌లర్ పదవికి రాజీనామా చేశారు.ఏచూరికి ప్రముఖుల సంతాపం⇒ ఏచూరి మరణం తీవ్ర విషాదకరం. విద్యార్థి నేతగా మొదలై జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారి పార్లమెంటేరియన్‌గా ఉంటూ ప్రజావాణిని వినిపించిన నేతను కోల్పోవడం విచారకరం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడుతూనే అన్ని రాజకీయపార్టీల నేతలతో మైత్రి కొనసాగించారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి⇒ ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో దేశ ప్రజాస్వామ్యం పటిష్టతకు ఏచూరి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజాసేవలో అలుపెరగక పనిచేశారు. – జగదీప్ ధన్కడ్, ఉప రాష్ట్రపతి⇒ వామపక్షాలకు ఏచూరి దారి దీపంగా మారారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించారు. పార్టీలకతీతంగా అందరు నేతలతో కలిసిపోయే సామర్థ్యం ఆయన సొంతం. అలాంటి ఏచూరిని కోల్పోవడం విషాదకరం. పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్ర వేశారు. ఈ విషాదకాలంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి⇒ ఏచూరి మరణం రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన మరణ వార్త నన్ను కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను – అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి⇒ ఏచూరి మరణం బాధాకరం. సుదీర్ఘ ప్రజాజీవితంలో పార్లమెంట్ సభ్యునిగా ఉంటూనే పౌర సమస్యలపై పోరాడుతూ విశిష్టమైన నేతగా ఎదిగారు. – రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి⇒ భారత దేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఏచూరి ఒకరు. ఆయన కింద స్థాయి నుంచి పైస్థాయి వరకు ఎదిగారు. ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. – సీఎం చంద్రబాబు ⇒ జీవితాంతం వామపక్ష భావాలతో ఏచూరి గడిపారు. దేశ ప్రగతి కోసం నిరి్వరామంగా చొరవ చూపారు. సీతారాం స్వశక్తితో జాతీయస్థాయికి ఎదిగారు. ఏచూరి మృతి దేశ రాజకీయాల్లో తీరని లోటు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – వైఎస్ జగన్, మాజీ సీఎం ⇒ లౌకిక చాంపియన్ ఏచూరి. దేశ భిన్నత్వాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధత చాటారు. 2004–08 ప్రభుత్వంలో కలిసి పనిచేశాం. రాజ్యాంగాన్ని ఎంతో గౌరవిస్తారు. చిరకాలం కమ్యూనిస్ట్‌గా ఉన్నా ఆయన మూలాలు ప్రజాస్వామ్య విలువల్లో దాగి ఉన్నాయి. పార్లమెంటేరియన్‌గా ప్రజాసమస్యలను బలంగా వినిపించారు. – సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్⇒ ఆయన నాకు అత్యంత ఆప్తుడు. దేశాన్ని లోతుగా అర్థం చేసుకున్న నేత. భారతదేశ ఆలోచన (ఐడియా ఆఫ్ ఇండియా)కు రక్షకుడు ఆయన. – రాహుల్ గాంధీ, లోక్‌సభలో విపక్షనేత⇒ సమకాలీన కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించిన అసాధారణ నేతల్లో ఏచూరి ఒకరు. దశాబ్దాల క్రితం ఆయన విద్యార్థి సంఘంలో, నేను ఆలిండియా యూత్ ఫెడరేషన్లో పనిచేశాం. – డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి -
ఏచూరి ప్రజల మనసుల్లో నిలిచిపోతారు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వామపక్ష దిగ్గజ నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ఆయన పాత్రను కొనియాడుతూ.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు.ఈ క్రమంలో ఏచూరి మరణంపై ప్రధానమంత్రి మోదీ మోదీ సంతాపం తెలిపారు. ఏచూరి వామపక్ష ఉద్యమానికి దారిదీపం వంటి వారని పేర్కొన్నారు, ఆయన సామర్ధ్యం, వాగ్ధాటి పార్టీలకు అతీతంగా అందరినీ ఆకట్టుకునేదని అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఆయన దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ప్రధాని మోదీ.. గతంలో ఏచూరితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.చదవండి: సీతారాం ఏచూరి కన్నుమూత.. జీవిత ప్రస్థానం ఇదేSaddened by the passing away of Shri Sitaram Yechury Ji. He was a leading light of the Left and was known for his ability to connect across the political spectrum. He also made a mark as an effective Parliamentarian. My thoughts are with his family and admirers in this sad hour.… pic.twitter.com/Cp8NYNlwSB— Narendra Modi (@narendramodi) September 12, 2024 -
Sitaram Yechury: జీవితమే కాదు.. దేహమూ ప్రజాసేవకే అంకితం
ప్రముఖ రాజకీయ నేత, సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూసిన విషయం తెలిసిందే. 72 ఏళ్ల ఏచూరి ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశనుంచే వామపక్ష భావాలను అలవరచుకున్న ఆయన.. తుదిశ్వాస విడిచే వరకు ప్రజా పోరాటాల్లో బతికారు. తన జీవితాన్నే కాదు.. చివరకు తన దేహాన్ని సైతం ప్రజాసేవకే అంకితమిచ్చారు.ఆయన బతికి ఉన్నప్పుడే తాను మరణిస్తే పార్థీవ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన పార్థీవదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. మృతదేహాన్ని శుక్రవారం ఆస్పత్రికి తరలించనున్నారు. దీంతో ఏచూరి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించటం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా కమ్యూనిస్టు నేతలు తమ పార్థివదేహాలను పరిశోధనల కోసం ఇవ్వడం ఇదే తొలిసారికాదు.. గత కొన్నేళ్లుగా వామపక్ష నాయకులు ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఆగస్టు 2024లో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) భౌతికకాయాన్ని కూడా వైద్య పరిశోధనల కోసం దానం చేశారు. కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కార్ ఆసుపత్రిలోని అనాటమీ విభాగానికి పార్థివ దేహాన్ని అప్పగించారు. ఇందుకు సంబంధించి మార్చి 2006లోనే బుద్ధదేవ్ ఓ స్వచ్ఛంద సంస్థకు హామీ ఇచ్చారు.ఆయనతోపాటు పశ్చిమ బెంగాల్‌కు 34 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు దిగ్గజ నేత జ్యోతిబసు కూడా 2010లో ఆయన మరణాంతరం శరీరాన్ని వైద్య సేవలకే అప్పగించారు.ఆయన పార్థివ దేహాన్ని కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి దానం చేశారు. ఇందుకు సంబంధించి 2006లోనే ఆయన హామీ ఇచ్చారు. మాజీ లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 2000 సంవత్సరంలో తన శరీరాన్ని దానం చేస్తానని ప్రమాణం చేశాడు. 2018లో అతని మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు శరీరాన్ని దానం చేశారు. సీపీఎం కార్యదర్శి అనిల్ బిశ్వాస్‌తోపాటు పార్టీ సీనియర్ నేత బెనోయ్ చౌధురీల భౌతికకాయాలూ ఆస్పత్రులకు అప్పగించారు. -
మళ్లీ విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం
న్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి ఆరోగ్యం మళ్లీ విషమించింది. సీపీఎం పార్టీ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 72 ఏళ్ల ఏచూరికి వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతుందని వెల్లడించింది. ‘‘సీతారాం ఏచూరికి తీవ్రమైన శ్వాసకోస ఇన్ఫెక్షన్ జరిగింది. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స అందుతున్నా.. పరిస్థితి విషమంగా ఉంది. వైద్యుల బృందం ఏచూరిని నిశితంగా పరిశీలిస్తోంది’’ అని సీపీఎం పార్టీ ఎక్స్ అకౌంట్లో పోస్టు పెట్టింది.కాగా ఆగస్టు 19వ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో వైద్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్ అమర్చారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. దీంతో ఆయన కోలుకుంటున్నారని అంతా భావించారు. ఈలోపే మళ్లీ ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు పార్టీ వెల్లడించింది. Comrade Sitaram Yechury’s health condition pic.twitter.com/NDPl8HE8K0— CPI (M) (@cpimspeak) September 10, 2024 ఇదీ చదవండి: కాంగ్రెస్‌తో కటీఫేనా?.. రెండో జాబితా కూడా విడుదల -
నిలకడగా ఏచూరి ఆరోగ్యం: సీపీఎం
న్యూఢిల్లీ: సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి(72) ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు సీపీఎం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో కామ్రెడ్ సీతారాం ఏచూరి చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందుతోంది. సానుకూల స్పందన కనిపిస్తోంది. కామ్రెడ్ సీతారాం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఛాతీలో న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ సోకడంతో ఆగస్ట్ 19వ తేదీన ఆన ఎయిమ్స్‌లో చేరారు. -
సీతారాం ఏచూరి పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నా, గురువారం ఆయన ఆరోగ్యం మరింత తీవ్రంగా క్షీణించింది. ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావడంతో వైద్యులు ఆయనకు ఐసీయూకి తరలించారు. తొలుత ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. అనంతరం ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. -
ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్లై, తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థకు గురయ్యారు. దీంతో జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు ఆమెను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు అధికారులు తరలించారు. అక్కడ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కవిత గైనిక్ సమస్యలు, వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.కాగా ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆమె తిహార్ జైలులో శిక్షననుభవిస్తున్న విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరిగ్ నేరారోపణలతో సీబీఐ, ఈడీ కేసుల్లో మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. దాదాపు 5 నెలలగా జైలులో ఉన్నారు.ఇక గతంలోనూ ఒకసారి కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆమె తీవ్ర జ్వరం ,నీరసంతో బాధపడ్డారు. కవిత కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.మరోవైపు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ విషయంలో వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. -
ఎయిమ్స్‌లో రాజ్‌నాథ్‌సింగ్
సాక్షి,ఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్(73) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం(జులై11) ఉదయం రాజ్‌నాథ్ వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి ప్రైవేట్ వార్డులో ఆయనకు వెన్నునొప్పి సంబంధిత పరీక్షలు చేశారు. -
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ హెల్త్ అప్డేట్
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు గురువారం అపోలో ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.కాగా బుధవారం సాయంత్రం అనారోగ్యానికి గురైన ఆయనను.. కుటుంబసభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో నేడు డిశ్చార్జ్ అయ్యారు.అయితే వారం రోజుల వ్యవధిలోనే 96 ఏళ్ల అద్వానీ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం రెండోసారి. గత నెల 26న వృద్ధాప్యం కారణంగా యూరాలజీ సంబంధిత సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు సర్జరీ నిర్వహించిన విషయం తెలిసిందే. సర్జరీ తర్వాత కోలుకున్న ఆయనను డిశ్చార్జ్ చేశారు. మళ్లీ అద్వానీ ఆస్వస్థకు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు.కాగా ఈ ఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు అద్వానీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు. అయితే అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన నివాసంలోనే ఈ కార్యక్రమం జరిగింది. -
జైల్లో కుదుటగానే కేజ్రీవాల్ ఆరోగ్యం: ఢిల్లీ ఎయిమ్స్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటగానే ఉన్నట్లు తెలుస్తోంది. టైప్-2 డయాబేటిస్తో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అయిదుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ అందిస్తోంది. ఈ మేరకు ఎయిమ్స్‌కు చెందిన అయిదుగురు వైద్యుల బృందం శనివారం కేజ్రీవాల్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దాదాపు అరగంట పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. కేజ్రీవాల్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నందున, ఆయన ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని మెడికల్ బోర్డు సూచించిం.ది మెడిసిన్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు పేర్కొంది. దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని తెలిపింది’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వారం తర్వాత ఈ బృందం సీఎంను మరోసారి పరీక్షించనున్నట్లు పేర్కొన్నాయి.కాగా ఆయన షుగర్ లెవల్స్ 320కు పెరగడంతో గతవారం తీహార్ జైల్లో తొలి ఇన్సులిన్ అందించారు. తన వ్యక్తిగత వైద్యుడితో రోజూ వీడియో మాధ్యమంలో సంప్రదించే అవకాశాన్ని కల్పించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆరోగ్య కారణాల కింద బెయిల్ పొందేందుకే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే స్వీట్స్, మామిడిపండ్లు, ఆలూపూరీ వంటి ఆహార పదార్దాలు తీసుకుంటున్నారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.అయితే టైప్ 2 డయాబెటిక్ పేషెండ్ అయిన కేజ్రీవాల్‌కు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా?, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని నిర్ణయించేందుకు ఎయిమ్స్ వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశించింది. ఇంట్లో వండిన ఆహారాన్ని కూడా కోర్టు అనుమతించింది. అయితే అది ఖచ్చితంగా డాక్టర్ సూచించిన డైట్ చార్ట్‌కు కట్టుబడి ఉండాలని పేర్కొంది. -
Ayodhya Event: సెలవుపై వెనక్కి తగ్గిన ఢిల్లీ ఎయిమ్స్
ఢిల్లీ: అయోధ్య రామ మందిర వేడుకకు ఆఫ్ డే సెలవు ప్రకటనపై ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వెనక్కి తగ్గింది. మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని రేపు మధ్యాహ్నం 2.30 గంటల వరకు నాన్ క్రిటికల్ సర్వీస్‌లను మూసివేయాలన్న నిర్ణయాన్ని ఈరోజు వెనక్కి తీసుకుంది. నాన్-క్రిటికల్ సర్వీస్‌లలోని సిబ్బందికి రేపు సగం రోజు విరామం ప్రకటించడంపై నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఎయిమ్స్-ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్ రేపు ఆఫ్ డే సలవు అని పేర్కొంటూ మెమోరాండం జారీ చేశారు. రేపు ప్రభుత్వ సిబ్బందికి హాఫ్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. "22.01.2024న 14.30 గంటల వరకు ఎయిమ్స్ హాఫ్ డే సెలవు ఉంటుందని ఉద్యోగులందరి సమాచారం" అని మెమోరాండం పేర్కొంది. అయినప్పటికీ, "అన్ని క్రిటికల్ క్లినికల్ సేవలు" నడుస్తాయని పేర్కొన్నారు. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (OPD) సేవలు అందుబాటులో ఉంటాయో లేదో అధికారిక నోట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ ఇలాంటి రోజుల్లో అవుట్డోర్ పేషెంట్లు వైద్యులను సంప్రదించలేమని భయపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. రోగులు నెలల తరబడి వేచి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీడీ సేవలు నిలిపివేస్తే రోగులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని మండిపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
హిమాచల్ సీఎంకు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు
ఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖును ఢిల్లీలోకి ఎయిమ్స్ తరలించారు వైద్యులు. వైద్య పరీక్షల కోసం శుక్రవారం సీఎంను ఎయిమ్స్‌కు తీసుకెళ్లినట్లు ఐజీఎమ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు తెలిపారు. అయితే, సుఖ్విందర్ సింగ్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబ సభ్యులు ఆయనను సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చేరారు. ఈ సందర్బంగా డాక్టర్ రాహుల్ రావు మాట్లాడుతూ.. బుధవారం రాత్రి నుంచి అన్ని రకాల పరీక్షలు చేశాం. కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు బయటపడింది. మరిన్ని వైద్యపరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించామని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, అన్ని నివేదికలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. ఇక, సిమ్లాలో సీఎంను పరీక్షించిన వైద్యబృందం కూడా ఆయన వెంట వెళ్లింది. Himachal Pradesh Chief Minister Sukhvinder Singh Sukhu has been shifted to AIIMS New Delhi today as he was diagnosed with Pancreatitis by the doctors of Indira Gandhi Medical College and Hospital (IGMC), Shimla. As confirmed by the IGMC Sources "He has been shifted to AIIMS for… — ANI (@ANI) October 27, 2023 అయితే, ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు గత కొద్దిరోజులుగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్నిసార్లు బయట ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. దానివల్లే ఆయన ఇన్ఫెక్షన్కు గురయ్యారు అని సుఖు ప్రధాన మీడియా సలహాదారు వెల్లడించారు. -
గాల్లోనే ఊపిరి పోశారు!
న్యూఢిల్లీ: అది శనివారం ఉదయం వేళ. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం. బయల్దేరి అప్పటికి 20 నిమిషాలైంది. ఇంకో గంట ప్రయాణం ఉంది. ప్రయాణికుల్లో పుట్టుకతోనే తీవ్ర హృద్రోగ సమస్యతో బాధ పడుతున్న ఒక ఆర్నెల్ల చిన్నారి. తల్లిదండ్రులు తనను చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ తీసుకెళ్తున్నారు. ఉన్నట్టుండి ఊపిరాడక పాప అల్లాడింది. దాంతో తల్లి పెద్దపెట్టున రోదించింది. సాయం కోసం అర్థించింది. విషయం అర్థమై ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు డాక్టర్లు హుటాహుటిన రంగంలో దిగారు. తనకు తక్షణం సాయం అందించారు. విమానంలో పెద్దలకు ఉద్దేశించి అందుబాటులో ఉండే ఆక్సిజన్ కిట్ నుంచే పాపకు శ్వాస అందించారు. ఎయిర్ హోస్టెస్ వద్ద అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ నుంచే మందులను వాడారు. అలా ఏకంగా గంట పాటు తన ప్రాణం నిలబెట్టారు. అంతసేపూ ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఊపిరి బిగబట్టి దీన్నంతా ఉత్కంఠతో చూస్తూ గడిపారు. విమానం ఢిల్లీలో దిగుతూనే అక్కడ అప్పటికే అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ వైద్య బృందం చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. దాంతో ప్రయాణికులతో పాటు అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఆ 15 నిమిషాలు... ఇలా చిన్నారి ప్రాణాలను నిలబెట్టిన వైద్యుల్లో ఒకరు ఐఏఎస్ అధికారి కావడం విశేషం! ఆయన పేరు డాక్టర్ నితిన్ కులకరి్ణ. జార్ఖండ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మరొకరు డాక్టర్ మొజమ్మిల్ ఫిరోజ్. రాంచీలోని సదర్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. చిన్నారి పుట్టుకతోనే పేటెంట్ డక్టస్ అర్టరియోసిస్ అనే హృద్రోగంతో బాధ పడుతోందని వారు చెప్పారు. ‘మేం వెంటనే రంగంలో దిగి పాపకు ఆక్సిజన్ అందివ్వడంతో పాటు థియోఫైలిన్ ఇంజక్షన్ ఇచ్చాం. అలాగే తల్లిదండ్రులు తమ వెంట తెచి్చన డెక్సోనా ఇంజక్షన్ కూడా బాగా పని చేసింది. హార్ట్ బీట్ ను స్టెతస్కోప్ తో చెక్ చేస్తూ వచ్చాం. తొలి 15 నుంచి 20 నిమిషాలు చాలా భారంగా గడిచింది. పెద్ధగా ఏమీ పాలుపోలేదు. కాసేపటికి పాప స్థితి క్రమ క్రమంగా మెరుగైంది‘ అని వారు తమ అనుభవాన్ని వివరించారు. సహా ప్రయాణికుల్లో పలువురు వారి అమూల్య సేవను మెచ్చుకుంటూ ఎక్స్‌లో మేసేజ్‌లు చేశారు. -
విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు
సాక్షి, న్యూఢిల్లీ/రాయదుర్గం: దేశంలోని విద్యాసంస్థల్లో అన్ని విభాగాల్లో కలిపి ఐఐటీ–మద్రాస్ అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది. మొత్తం విభాగాల్లో ఐఐటీ–మద్రాస్‌కు మొదటిస్థానం దక్కడం ఇది ఐదోసారి కాగా, ఇంజనీరింగ్ విభాగంలోనూ వరుసగా ఎనిమిదోసారి నంబర్‌వన్ స్థానాన్ని నిలుపుకోవడం విశేషం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికను విద్య, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ సోమవారం విడుదల చేశారు. బోధనా అభ్యాసం, మౌలిక వసతులు, పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం, గ్రాడ్యుయేషన్ ఫలితం, విద్యార్థులు పొందే ఉపాధి అవకాశాలు వంటి అంశాల ఆధారంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్ కాలేజీలకు ర్యాంకులను ప్రకటించారు. వీటిలో అన్ని కేటగిరీల్లో ఐఐటీ–మద్రాస్ తొలిస్థానంలో ఉండగా, ఐఐఎస్సీ–బెంగళూరు రెండో స్థానంలో, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) 20వ స్థానం, నిట్–వరంగల్ 53, ఉస్మానియా యూనివర్సిటీ 64, వడ్డేశ్వరంలోని కేఎల్ కాలేజ్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ 50, వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచాయి. ర్యాంకింగ్స్ కోసం 200కు పైగా యూనివర్సిటీలను సర్వేచేశారు. దరఖాస్తు చేసిన దాదాపు 8వేల సంస్థల నుంచి 2023 ర్యాంకులను ప్రకటించారు. అత్యుత్తమ వర్సిటీల విభాగంలో... ఇక అత్యుత్తమ వర్సిటీల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలి స్థానంలో ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 36, హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 84వ స్థానంలో నిలిచింది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ 43, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 60వ స్థానం దక్కించుకున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 8వ, నిట్–వరంగల్ 21వ స్థానంలో ఉన్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానంలో, హెచ్‌సీయూ 25వ స్థానంలో నిలిచాయి. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం–వైజాగ్ 29వ, ఐసీఎఫ్ఏఐ–హైదరాబాద్ 40వ స్థానంలో ఉన్నాయి. ఫార్మసీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–హైదరాబాద్ తొలి స్థానంలో ఉండగా, న్యాయ విభాగంలో నల్సార్ యూనివర్సిటీ 3వ స్థానంలో ఉంది. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. వ్యవసాయ విభాగంలో.. ఇక వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో గుంటూరులోని ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ 20వ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 31వ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్–హైదరాబాద్ 32వ స్థానంలో ఉన్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కోసం https://www.nirfindia.org/ వెబ్సైట్లో చూడొచ్చు. సమష్టి కృషితోనే సాధ్యం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మంచి గుర్తింపే లక్ష్యం. సమష్టి కృషితోనే సాధ్యం. దేశంలో టాప్– 10 విశ్వవిద్యాలయాల్లో హెచ్సీయూకు మళ్లీ ర్యాంక్‌ను పొందడం ఆనందంగా ఉంది. ఉత్తమ పద్ధతులు, నాణ్యతతో కూడిన బోధన, పరిశోధనల కారణంగా ఈ ర్యాంకు సాధ్యమైంది. భవి ష్యత్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తాం. -ప్రొ. బీజే రావు, వైస్‌చాన్స్‌లర్ హెచ్‌సీయూ మానవాళి కోసం టెక్నాలజీ ఈ విజయంలో విద్యార్థులు, అధ్యాపకులతోపాటు, పూర్వ విద్యార్థుల కృషి కూడా ఉంది. మానవాళి కోసం సాంకేతిక పరిజ్ఞానం అనే నినాదంతో ఐఐటీహెచ్ ముందుకెళ్తోంది. – ప్రొ. బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ డైరెక్టర్ IIT Madras ranked best institution followed by IISC Bengaluru and IIT Delhi as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/yAKN3uVnuU— ANI (@ANI) June 5, 2023 IISC, Bangalore ranked best university followed by JNU and Jamia Millia Islamia as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/Jvr1OixSHz— ANI (@ANI) June 5, 2023 ఫార్మసీ విభాగంతో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్దర్ద్, బిట్స్ పిలానీ రెండో, మూడో స్థానాలు సాధించాయి.న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ‘నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా’ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దీనికి సంబంధించిన సమగ్ర వార్తకథనం మా ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో చదవండి -
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వల్ప అస్వస్థత!
సాక్షి, ఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి(58) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు ఆయన వెళ్లారు. అయితే ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లు నిర్ధారించుకున్న వైద్యులు.. చికిత్స అందించారు. ఛాతి ప్రాంతంలో నొప్పిగా అనిపించడంతో ఆయన రాత్రి 11 గం. ప్రాంతంలో ఎయిమ్స్‌కు వెళ్లారు. కార్డియోన్యూరో సెంటర్లోని కార్డిక్ కేర్ యూనిట్లో ఆయనకు పరీక్షలు జరిగాయి. అనంతరం ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యే ఉన్నట్లు వైద్యులు తేల్చి.. అడ్మిట్ చేసుకున్నారు. చికిత్స అనంతరం సోమవారం ఉదయం ఆయన్ని డిశ్చార్జి చేయొచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: సూపర్ సీనియర్లు కూడా పోటీ నై!! -
నేపాల్ అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
న్యూఢిల్లీ: నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఏయిమ్స్‌కు తరలించారు. మంగళవారం ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో రామ్ చంద్రనుతో ఖాట్మాండులోని మహారాజ్‌గంజ్ త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బుధవారం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. కాగా గత నెల రోజుల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పౌడెల్ ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆయన్ను త్రిభువన్ టీచింగ్ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. గత 15 రోజులుగా యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదని ఖాట్మండు వార్తాపత్రిక పేర్కొంది. నేపాల్ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ ఈఏడాది మార్చి 10న ఎన్నికయ్యారు. అదేనెల 13న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామచంద్ర.. పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీ సీపీఎన్-యూఎంఎల్ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్ చంద్ర నెబ్‌మాంగ్‌పై విజయం సాధించారు. ఈయనకు 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల ఓట్లు వచ్చాయి. చదవండి: అమెరికాలో పోలీసుల అదుపులో 17 మంది ‘వాంటెడ్’ సిక్కులు -
నర్సు కాదు దేవత
ఐసీయూలో పేషెంట్లకు సేవ చేసే నర్సులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే కొన్ని వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది.ఢిల్లీ ఎయిమ్స్‌లో పని చేసే దివ్య సోజల్మూడుసార్లు టి.బి బారిన పడింది.అయినా సరే రోగుల సేవ మానలేదు.‘నా కర్తవ్యం నుంచి నేను పారి పో ను’ అంటున్న ఆమెను ప్రాణాంతక రోగులు మనిషి అనరు. దేవత అంటుంటారు. దివ్య సోజల్ ఐసీయూలో ఉందంటే పేషెంట్లకే కాదు తోటి స్టాఫ్‌కు కూడా ఎంతో ధైర్యం. ఐసీయూలో ఉండే పేషెంట్లను చూసుకోవడంలో ఆమెకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం ఉన్నాయి. అయితే అవి చాలామందిలో ఉంటాయి. అందరూ ఐసీయూలో ఉండటానికి ఇష్టపడరు. కాని దివ్య సోజల్ మాత్రం తనకు తానుగా ఐసియులో ఉండే పేషెంట్ల సేవను ఎంచుకుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవడంలో నాకో సంతృప్తి ఉంది’ అంటుంది సోజల్. అయితే ఆ పనిలో ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే అలాంటి రోగులకు సేవ చేసేటప్పుడు కొన్ని వ్యాధులు అంటుకోవచ్చు. సోజల్ మూడుసార్లు అలా టి.బి బారిన పడింది. కేరళ నర్స్ దివ్య సోజల్ది కేరళలోని పత్తానంతిట్ట. చదువులో చురుగ్గా ఉండేది. ముంబైలోని పీడీ హిందూజా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి జనరల్ నర్సింగ్‌లో డిప్లమా చేసి 2011 నాటికి హిందూజా హాస్పిటల్లో ఐసీయూ నర్స్‌గా పని చేయడం మొదలు పెట్టింది. అప్పటికి ఆమె వయసు 23. ఆ సమయంలోనే ఒకరోజు నైట్ డ్యూటీలో ఆమెకు శ్వాసలో ఇబ్బంది ఎదురైంది. ఎక్స్‌రే తీసి చూస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అని తేలింది. పరీక్షలు చేస్తే టి.బి . అని తేలింది. అదే హాస్పిటల్‌లోని వైద్యులు ఆమెకు ఆరు నెలల ట్రీట్మెంట్లో పెట్టారు. రోజూ నాలుగు రకాల మందులు తీసుకోవాల్సి వచ్చేది. వాటిని తీసుకుంటూ టి.బి. నుంచి బయట పడింది. అయితే వృత్తిని మానేయలేదు. ఐసీయూను వదల్లేదు. ఢిల్లీ ఎయిమ్స్‌లో 2012లో బి.ఎస్సీ నర్సింగ్ చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్‌కు వచ్చింది దివ్య. ఆ తర్వాత అక్కడే న్యూరోసైన్స్ నర్సింగ్‌లో పి.జి. చేరింది. న్యూరోలాజికల్ ఐసీయూలో పని చేయడానికి నిశ్చయించుకోవడం వల్లే ఆ కోర్సులో చేరింది. ఆ సమయంలో అంటే 2014లో మళ్లీ టి.బి. బారిన పడింది దివ్య. నెల రోజులు హాస్పిటల్లో ఉంచారు. నీడిల్‌తో ఫ్లూయిడ్‌ను బయటకు తీయాల్సి వచ్చింది నాలుగైదు సార్లు. మూడు నెలల పాటు రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేరుగా రంగంలో దిగి దివ్య ట్రీట్మెంట్ను పర్యవేక్షించాడు. దివ్య సేవాతత్పరత ఆయనకు తెలియడం వల్లే ఇది జరిగింది. దాంతో రెండోసారి టి.బి నుంచి విజయవంతంగా బయటపడింది దివ్య సోజల్. ఈ దశలో ఎవరైనా సులభమైన పని ఉండే వార్డుల్లో పని చేయడానికి మారి పో తారు. కాని దివ్య మారలేదు. డ్యూటీని కొనసాగించింది. ఆహారం సరిగా తినక ఐసీయూలో ఉద్యోగం అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి. దివ్య సరిగా ఆహారం తినేది కాదు డ్యూటీలో. నిజానికి తినడానికి టైమ్ కూడా ఉండేది కాదు. అది ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బ తీసింది. అప్పటికి దివ్య పెళ్లి చేసుకుంది. జీవితం ఒక మార్గాన పడింది అనుకుంది. కాని 2019లో విదేశాలలో ఉద్యోగానికి అప్లై చేసేందుకు చేయించుకున్న రొటీన్ పరీక్షల్లో మూడోసారి టీబీ బయటపడింది. విషాదం ఏమంటే ఈసారి వచ్చింది డ్రగ్ రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని వేరియెంట్. ‘ఈ వార్త విన్నప్పుడు చాలా కుంగి పో యాను’ అంది దివ్య. ‘నేను కేరళలోని మా ఊరికి వచ్చి ట్రీట్మెంట్ కొనసాగించాను. లెక్కలేనన్ని మాత్రలు మింగాల్సి వచ్చేది. ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వచ్చేది. బరువు తగ్గాను. నాసియా ఉండేది. నా తల్లిదండ్రులు నన్ను జాగ్రత్తగా చూసుకుని కాపాడుకున్నారు’ అంటుంది దివ్య. ఇంత జరిగినా ఆమె ఉద్యోగం మానేసిందా? ఐసీయూను వదిలిపెట్టిందా? ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లి చూడండి. ్రపాణాపాయంలో ఉన్న రోగులను అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. ఇటువంటి మనిషిని నర్సు అని ఎలా అనగలం? దేవత అని తప్ప. టి.బి రోగులలో స్థయిర్యానికి ‘నేను ఒకటి నిశ్చయించుకున్నాను. టి.బి రోగుల్లో ధైర్యం నింపాలి. వాళ్లు నన్ను చూసే ధైర్యం తెచ్చుకోవాలి. మూడుసార్లు టి.బి వచ్చినా నేను బయటపడగలిగాను. అందువల్ల ఆ వ్యాధి వచ్చినవారు కుంగి పో వాల్సిన పని లేదు. సరైన మందులు సరిగ్గా తీసుకోవాలి. అంతే కాదు నర్సులు కాని సామాన్య ప్రజలు కాని మంచి తిండి తిని సమయానికి తిని రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పుడు నేను ఆ చైతన్యం కోసం కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను’ అంటుంది దివ్య. -
చిన్నారి వైద్యం కోసం ఉదారంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్
-
చిన్నారి వైద్యం కోసం ఉదారంగా స్పందించిన సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: చిన్నారి వైద్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారంగా స్పందించారు.. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. నిడదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ల డయానా శాంతి ‘స్పైనల్ మస్క్యులర్‘ వ్యాధితో బాధపడుతోంది. జనవరి 3న సీఎం జగన్ రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా కలిసి తగిన సహాయం అందించాల్సినదిగా విజ్ఞప్తి చేశారు. డయానా శాంతి ఆరోగ్య పరిస్థితి విని స్పందించిన సీఎం.. ఎయిమ్స్‌లో తగిన వైద్య సేవలు అందచేసేందుకు చొరవ తీసుకున్నారు. పాప మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు రూ. లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని ఆదేశించినట్లు లెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. అంతేగాక నెలకూ రూ.10 వేల పెన్షన్, అవుట్ సోర్సింగ్ కింద డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇవ్వడం జరిగిందని కలెక్టర్ వివరించారు. కాగా, ముఖ్యమంత్రి బుధవారం నిడదవోలు వచ్చిన సందర్భంగా డయానా తల్లి సూర్యకుమారి వైఎస్ జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అయితే తన కుమార్తె వైద్య సేవల కోసం న్యూ ఢిల్లీకి వెళ్లి రావడం చాలా ఖర్చుతో కూడుకున్నట్లు సీఎంకు తెలియజేశారు. దీనిపై స్పందించిన సీఎం.. ప్రభుత్వ పరంగా సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. వైద్య సేవల కోసం న్యూ ఢిల్లీకి వెళ్లి రావడానికి అవసరమైన చేయూతను అందచేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం రూ.2 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. యూఎస్ఏ నుంచి పాప వైద్యానికి సంబంధించి రిస్డిప్లం (risdiplam) IT gene therapy) ఇంజెక్షన్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఈ ఇంజెక్షన్ సుమారు రూ.14 కోట్ల రూపాయల ఖరీదు ఉన్న నేపథ్యంలో అందులో భాగంగా కొద్ది నెలల పాటు పాప వైద్య పరీక్షలు నిర్వహించవలసి ఉందన్నారు. తగిన వైద్య సేవలు పొందేందుకు వీలుగా న్యూఢిల్లీకి వెళ్లి రావడం కోసం విమాన ప్రయాణం ఖర్చులు, వసతి తదితర ఖర్చుల తగిన ఆర్థిక సాయానికి సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ మాధవీలత వెల్లడించారు. చదవండి: ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతాం: ఏపీ డీజీపీ -
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(63) అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆమె చేరారు. అయితే ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. వైరల్ ఫీవర్, పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగానే నిర్మాలా సీతారామన్ ఆస్పత్రిలో చేరారని అధికారులు పేర్కొన్నారు. వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ ఆదివారం బాగానే ఉన్నారు. మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత వాజ్‌పేయీ జయంతి సందర్భంగా నివాళులు కూడా అర్పించారు. కానీ ఆ మరునాడే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. చదవండి: రాహుల్ స్పీచ్‌లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు: సీఎం స్టాలిన్ -
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై దాడి.. చైనా హ్యాకర్ల పనే: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని సర్వర్లపై జరిగిన దాడి ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్‌పై సైబర్ దాడి చైనా హ్యకర్ల పనేనని తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. హ్యకింగ్‌కు గురైన లక్షల మంది రోగుల వివరాలను ఆసుపత్రి వర్గాలు తిరిగి పొందాయని పేర్కొంది. ‘ఎయిమ్స్ సర్వర్లపై దాడి చేసింది చైనీయులే. హ్యకింగ్ చైనా నుంచే జరిగినట్లు విచారణలో తేలింది. మొత్తం 100 సర్వర్లున్న ఢిల్లీ ఎయిమ్స్‌లో 40 ఫిజికల్‌గా 60 వర్చువల్‌గా పనిచేస్తున్నాయి.ఇందులో ఐదు ఫిజికల్ సర్వర్లలో హ్యకింగ్ జరిగింది. ఇది చాలా నష్టాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు హ్యకింగ్‌కు గురైన అయిదు సర్వర్లలోని డేటా విజయవంతంగా తిరిగి పొందాం’ అని కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. మొదట నవంబరు 23న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సిస్టమ్స్ పనిచేయకపోవడాన్ని గుర్తించారు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ పోలీస్‌లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ ఎయిమ్స్‌లోని సర్వర్లలో హ్యకర్లు చొరబడినట్లు గుర్తించింది. అయితే సిస్టమ్‌ను పునరుద్ధరించేందుకు హ్యాకర్లు రూ. 200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని అడిగినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఖండించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్లపై దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేపట్టింది. వీవీఐపీలు సహా లక్షలాది రోగుల వైద్య రికార్డుల సమాచారం గాలికి పోయిన ఎయిమ్స్ ఘటన దేశంలోనే అతి పెద్ద సైబర్ దాడి. ఒక భారతీయ సంస్థపై ఇంత తీవ్రమైన దాడి మునుపెన్నడూ జరగలేదు అని దేశ తొలి సైబర్ సెక్యూరిటీ హెడ్ మాట. చదవండి: మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం -
రెచ్చిపోతున్న హ్యాకర్స్.. ‘ఐసీఎంఆర్’పై 6వేల సార్లు సైబర్ దాడి!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఎయిమ్స్‌పై సైబర్ దాడి జరిగి సర్వర్లు డౌన్ అయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు వారాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో సర్వర్లు పని చేయటం లేదు. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని అత్యున్నత వైద్య వ్యవస్థలే లక్ష్యంగా దుండగులు సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఎయిమ్స్ తర్వాత భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)పై సైబర్ దాడికి యత్నించారు హ్యాకర్స్. ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌పై సుమారు 6వేల సార్లు దాడి చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఐపీ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో ట్రేస్ చేయగా.. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న హాంకాంగ్‌కు చెందిన ఐపీగా తేలిందన్నారు అధికారులు. అయితే, అప్డేటెడ్ ఫైర్‌వాల్, పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవటం ద్వారా ఐసీఎంఆర్ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురికాలేదని స్పష్టం చేశారు అధికారులు. హ్యాకర్స్ 6వేల సార్లు ప్రయత్నించినా వారి దుశ్చర్య ఫలించలేదన్నారు. మరోవైపు.. ఢిల్లీ ఎయిమ్స్ ముందు ఉన్న సఫ్దార్‌గంజ్ ఆసుపత్రిపై డిసెంబర్ 4న సైబర్ దాడి జరిగింది. అయితే, ఎయిమ్స్‌తో పోలిస్తే నష్టం తక్కువేనని అధికారులు తెలిపారు. ఒక రోజంతా తమ సర్వర్ పని చేయలేదని ఆసుపత్రి వైద్యులు బీఎల్ శెర్వాల్ తెలిపారు. ఎన్ఐసీ కొన్ని గంటల్లోనే సేవలను పునరుద్ధరించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: తమిళనాడు ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5లక్షల మంది రోగుల డేటా విక్రయం! -
మన నిర్లక్ష్యానికి మూల్యమెంత?
కొన్ని సంఘటనలు అంతే... పెనునిద్దర నుంచి పెద్ద మేలుకొలుపుగా పనిచేస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లోని సర్వర్లపై జరిగిన సైబర్‌దాడి అలాంటిదే. నవంబర్ 23న ఆగంతకులు భారీమొత్తం డిమాండ్ చేస్తూ జరిపిన రాన్సమ్వేర్ దాడితో కుప్పకూలిన సర్వర్లు పన్నెండు రోజులైనా ఇప్పటికీ బాగు కాలేదు. దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక ఆరోగ్యరక్షణ సంస్థలోని ఈ ఘటన మన దేశ సైబర్ భద్రతా మార్గదర్శకాలను సమగ్రంగా పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. డిజిటల్ ఇండియా పేరిట అన్ని రకాల ప్రభుత్వ విధులనూ, ప్రజా సేవలనూ, నగదు చెల్లింపులనూ ఆన్లైన్లో జరపాలని ప్రోత్సహిస్తున్నవేళ అత్యవసరం వచ్చిపడింది. సైబర్ దాడులు అంటువ్యాధిలా వ్యాపించి, ఎయిమ్స్ ఘటన లాంటివి మరిన్ని జరగక ముందే సురక్షిత వ్యవస్థనూ, ఆపత్సమయంలో సమాచారాన్ని వెనక్కి రప్పించే పద్ధతులనూ సృష్టించుకోవడం తక్షణ కర్తవ్యమని తెలిసివచ్చింది. వీవీఐపీలు సహా లక్షలాది రోగుల వైద్య రికార్డుల సమాచారం గాలికి పోయిన ఎయిమ్స్ ఘటన దేశంలోనే అతి పెద్ద సైబర్ దాడి. ఒక భారతీయ సంస్థపై ఇంత తీవ్రమైన దాడి మునుపెన్నడూ జరగలేదు అని దేశ తొలి సైబర్ సెక్యూరిటీ హెడ్ మాట. డిసెంబర్ 1న జలశక్తి శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఇటీవల ఓ ప్రభుత్వ శాఖపై జరిగిన రెండో పెద్ద సైబర్ దాడి ఇది. నవంబర్‌లో ఢిల్లీలోనే సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌పైనా సైబర్ దాడి జరిగింది. నిజానికి, ఆరోగ్య రంగంపై సైబర్ దాడుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్ ఉందని సైబర్ భద్రతా నిఘా సంస్థ క్లౌడ్‌సెక్ లెక్క. ఒక్క 2021లోనే దేశంలోని సైబర్ దాడుల్లో 7.7 శాతం ఆరోగ్య రంగంపై జరిగినవే. గత మూడేళ్ళలో భారత్‌లో సైబర్ దాడులు 3 రెట్లు పెరిగాయి. సైబర్ ముప్పును ఎదుర్కోవడా నికి ఉద్దేశించిన ప్రధాన సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సీఈఆర్టీ–ఇన్) డేటా ప్రకారం 2019లో జరిగిన ఉల్లంఘనలు 3.94 లక్షల చిల్లర. 2020లో అది 11.58 లక్షల పైకి, 2021లో 14.02 లక్షలకూ ఎగబాకింది. ఈ ఏడాదిలో జూన్ నాటికే 6.74 లక్షలయ్యాయి. వెరసి మూడున్నరేళ్ళలో 30 లక్షలకు పైగా కేసులొచ్చాయి. కానీ, సైబర్ భద్రతా నిధుల వినియోగం అర కొరగా సాగింది. రూ. 213 కోట్లు మంజూరైతే, రూ. 98.31 కోట్లే ఖర్చు పెట్టడం నిర్లక్ష్యానికి నిలువు టద్దం. అంతకన్నా దారుణం ఎయిమ్స్‌లో 30–40 ఏళ్ళుగా కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లను మార్చక పోవడం. ఈ ఇక్ష్వాకుల కాలపు సామగ్రి పట్ల ఆందోళన వ్యక్తమైనా పట్టించుకున్న నాధుడు లేడు. పైగా ఐటీ ఓనమాలు తెలీని డాక్టర్ గారే ఇప్పటికీ అక్కడ కంప్యూటర్ విభాగాధిపతి అంటే ఏమనాలి! 2004లో తొలి డిజిటల్ దాడి రికార్డయిన నాటి నుంచి ఇప్పటి దాకా సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. విస్తరించిన ఇంటర్నెట్కు విపరిణామం – ప్రపంచవ్యాప్త సైబర్ భద్రతా ఉల్లంఘనలు. నిజానికి, ప్రపంచంలో అత్యధికంగా డేటా చౌర్యం జరుగుతున్న దేశాల్లో భారత్‌ది 6వ స్థానం. ప్రతి వంద మంది భారతీయుల్లో 18 మంది డేటా చోరీ అయిందని నెదర్లాండ్స్ సంస్థ సర్ఫ్‌షార్క్ మాట. మన పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం ఈ ఏటి నివేదికలో పొంచివున్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి మన దేశ సామర్థ్యాన్ని పెంచుకోవడం తప్పనిసరి అంది. ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయన్నది ప్రశ్న. సైబర్ ముప్పుపై తగిన నియంత్రణ వ్యవస్థకు ఎలక్ట్రానిక్స్–ఐటీ శాఖ కింద ‘సైబర్ భద్రతా విభాగా’న్ని కేంద్రం నెలకొల్పింది. అది ఎంత సమర్థంగా పనిచేస్తోందో తెలీదు. ఎయిమ్స్ సంక్షోభ పరిష్కారానికి కేంద్రం ఎన్ఐఏ, డీఆర్డీఓ, గూఢచారి విభాగం, సీబీఐ నిపుణులను బరిలోకి దింపాల్సి వచ్చింది. రక్తం చిందని ఈ అభౌతిక, ఆధునిక యుద్ధంతో ఉక్రెయిన్ – ఆస్ట్రేలియాల్లో పవర్ గ్రిడ్లు, నిరుడు మన దేశంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, ఇరాన్లో అణు సదుపాయాలు, జార్జియాలో టెలికామ్ సేవలు, వివిధ దేశాల్లో ఎయిర్‌లైన్స్, ప్రభుత్వ సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. అవన్నీ వాటి పొరుగు శత్రుదేశాల పనే. ఇక, మేధాసంపత్తి హక్కులు, వ్యక్తిగత డేటా చౌర్యాలు లెక్కలేనన్ని. ఐటీ సిస్టమ్స్‌పై దాడితో డేటాను ఎన్‌క్రిప్ట్ చేసేసి, సమాచారాన్ని తిరిగి అందుబాటులో ఉంచాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేసే రాన్సమ్వేర్ దాడులు ప్రధానంగా మున్సిపిల్, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకులు సహా ఆర్థిక సేవలపై విరుచుకుపడుతున్నాయి. ఇవాళ మన బ్యాంక్ సేవల నుంచి టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్‌లు, పాస్‌పోర్ట్ సమాచారం, పౌర విమాన యానం దాకా అంతా డిజటలే! స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటున్న పాలకులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో పాటు పెరిగే సైబర్ ముప్పుపై దృష్టి పెట్టకుంటే ప్రాథమిక వసతులకూ పెను ప్రమాదమే! వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొనే సమగ్ర సైబర్ భద్రతా విధానం కావాలి. ఘటన జరిగాక హడావిడి కాక ముందుగానే వాటిని నివారించేందుకు సీఈఆర్టీ–ఇన్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను సంసిద్ధం చేయాలి. డిజిటల్ సేవలు కావాల్సిందే గనక సమాచార నిల్వ, ఆపత్కాలంలో తిరిగి తీసుకొనేలా సమర్థ విధానాలు పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఆధునికీకరించాలి. సైబర్ రక్షణ రంగా నికి నిధులిచ్చి, అత్యాధునిక కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ (ఎంఎల్) పరిష్కారాలతో సత్తా సమ కూర్చుకోవాలి. అప్పుడే డిజిటల్ ప్రపంచం సురక్షితమవుతుంది. ఈ కృషిలో నూతన ఆవిష్కరణలం దేలా ఉత్ప్రేరణ కలిగించాల్సింది విధాన రూపకర్తలే. అప్పుడే డిజిటల్ ఇండియా విజయం సాధ్యం! -
7 నెలలుగా కోమాలో గర్భిణీ.. పండండి ఆడబిడ్డకు జన్మ
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 7 నెలలుగా అచేతన స్థితిలో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓ గర్భిణీ(23) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణీ యువతి గత వారం బిడ్డకు జన్మనిచ్చినట్లు ఢిల్లీ ఎయిమ్స్ ట్రామాకేర్ విభాగం వైద్యులు తెలిపారు. ఇప్పటికీ ఆ యువతి అచేతన స్థితిలోనే ఉందని, స్వతహాగా ఊపిరి తీసుకోగలుగుతున్నట్లు తెలిపారు. ఒక్కోసారి కళ్లు తెరిచి చూస్తోందని, కొన్ని సంవత్సరాల్లోనే తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు 10-15 శాతం అవకాశం ఉందని వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ ఏడాది మార్చి 31న గర్భిణీ మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో భార్యాభర్తలు హెల్మెట్ ధరించలేదు. దీంతో యువతి తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భర్తకు ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవటంతో ఆయన కోలుకున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బూలంద్శహర్లో జరిగింది. తొలుత బాధితురాలికి బులంద్‌శహర్‌లోని అబ్దుల్లా ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడి నుంచి ఏప్రిల్ 1న తెల్లవారుజామున ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు మార్చారు. తలకు తీవ్ర గాయాలవగా మెదడులో ఎముక ఉండిపోయినట్ల వైద్యులు గుర్తించారు. ఇప్పటి వరకు 5 రకాల న్యూరోసర్జికల్ ఆపరషన్లు నిర్వహించారు. ఆమె కళ్లు తెరుస్తుందని, కానీ కదల్లేని స్థితిలో ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ‘ప్రమాదం జరిగిన సమయానికి ఆమె 40 రోజుల గర్భిణీ. కడుపులో శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. కుటుంబ సభ్యులు అబార్షన్‌కు ఒప్పుకోలేదు. నెలలు నిండిన ఆమెకు అక్టోబర్ 22న ప్రసవం చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు 2.5 కిలోలు ఉంది. తల్లి అచేతన స్థితిలో ఉండడం వల్ల బిడ్డకు పాలు ఇచ్చే ఆస్కారం లేదు. ప్రస్తుతానికి డబ్బా పాలే అందిస్తున్నాం. ’ అని డాక్టర్లు తెలిపారు. ఇదీ చదవండి: లాటరీలో ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి జాక్‌పాట్.. బీజేపీ మనీలాండరింగ్ ఆరోపణ -
బీజేపీ ఎమ్మెల్యే హఠాన్మరణం..ప్రధాని మోదీ సంతాపం
ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, ఒడిషా ఎమ్మెల్యే బిష్ణు చరణ్ సేథీ(61) హఠాన్మరణం చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసినట్లు సమాచారం. లంగ్ ఇన్ఫెక్షన్, మెదడులో రక్తస్రావం గత రెండు నెలలుగా ఆయన ఐసీయూలోనే ఉన్నట్లు ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. బిష్ణు చరణ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు. ఒడిషా గవర్నర్ గణేషీ లాల్, సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలియజేశారు. Shri Bishnu Charan Sethi Ji made an outstanding contribution to Odisha's progress. He distinguished himself as a hardworking legislator and contributed greatly to social empowerment. Saddened by his demise. Condolences to his family and supporters. Om Shanti. — Narendra Modi (@narendramodi) September 19, 2022 బీజేపీ ఒడిషా విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు బిష్ణు చరణ్. టికెట్ మీద మొదటిసారిగా 2000 సంవత్సరంలో బిష్ణు చరణ్ గెలుపొందారు. భద్రక్ జిల్లా ధామ్‌నగర్ నియోజకవర్గం నుంచి 2019లో గెలుపొందారు. ఒడిషా అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేతగా ఆయన పనిచేశారు. -
క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన్ను.. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు హుటాహుటిన తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. క్రియాటిన్ లెవల్ పడిపోవడంతో మెరుగైన ఆరోగ్యం కోసం లాలూను మంగళవారం ఎయిమ్స్‌కు తరలించాలని జైలు అధికారులకు రిఫర్ చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర ప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఏప్రిల్ 1వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు మార్చి 11వ తేదీన కొట్టేసింది. 73 ఏళ్ల లాలూకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఆంబులెన్స్‌లో లాలూను ఎయిమ్స్‌కు తరలించే అవకాశం ఉంది. -
Omicron Variant: మళ్లీ ఆంక్షల చట్రంలోకి.. మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి
లండన్, జోహెన్నెస్‌బర్గ్, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్(బి.1.1.529) కేసులు పలు దేశాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా బ్రిటన్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఇజ్రాయెల్‌లో కేసులు నిర్ధారణయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో బ్రిటన్‌లో ముగ్గురికి, ఆస్ట్రేలియాలో ఇద్దరికి, జర్మనీలో ఇద్దరికి, ఇటలీ, ఇజ్రాయెల్, బెల్జియంలలో ఒక్కొక్కరికీ ఈ వేరియెంట్ సోకిందని పరీక్షల్లో తేలింది. ఇక దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్‌కు వచ్చిన ప్రయాణికుల్లో 61 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైతే వారిలో 13 మందికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకిందని అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి ఖతర్ ఎయిర్వేస్ విమానంలో సిడ్నీకి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకిందని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. డెల్టా కంటే శరవేగంగా ఈ వేరియెంట్ కేసులు వ్యాపిస్తూ ఉండడంతో భయాందోళనలకు లోనైన 18 దేశాలు దక్షిణాఫ్రికా నుంచి రాకపోకల్ని నిలిపివేశాయి. ఇజ్రాయెల్ తమ దేశాల సరిహద్దుల్ని మూసేసింది. ఆఫ్రికాలోని 50 దేశాల నుంచి రాకపోకల్ని నిషేధించింది. యూకేలో మళ్లీ మాస్కులు ఇంగ్లాండ్‌లో మంగళవారం నుంచి దుణాకాలు, వ్యాపారసముదాయాలు, ప్రజారవాణా వ్యవస్థల్లో మంగళవారం నుంచి మళ్లీ మాస్కులు ధరించడం తప్పనిసరి చేయనున్నారు. యూకేకు వచ్చే విదేశీ ప్రయాణీకులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులను తప్పనిసరి చేస్తామని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావేద్ ఆదివారం వెల్లడించారు. మొరాకో సోమవారం నుంచి రెండువారాల పాటు తమ దేశంలోకి వచ్చే విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రపంచానికి త్వరితంగా వెల్లడిస్తే శిక్షిస్తారా? ఒమిక్రాన్ వేరియెంట్ ఎంత ప్రమాదకరమో ఇంకా నిర్ధారణ కాకుండానే అంతర్జాతీయ సమాజం రవాణా ఆంక్షలు విధించడంపై దక్షిణాఫ్రికా ఆవేదన వ్యక్తం చేస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల్ని రానివ్వకపోవడం అత్యంత క్రూరమైన చర్యని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాము ఎంతో ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించి కొత్త వేరియెంట్‌ని కనుగొనడం తమకు శిక్షగా మారిందని అంటోంది. ‘‘సైన్స్ అద్భుతం చేస్తే ప్రశంసించాలి కానీ శిక్షించకూడదు’’ అని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ‘రిస్క్’ ఉన్న దేశాల నుంచి వస్తే... ఆర్టీ–పీసీఆర్ ఫలితాలొచ్చాకే ఇంటికి న్యూఢిల్లీ: ‘రిస్క్’ దేశాల నుంచి (ఒమిక్రాన్ జాడలు బయటపడుతున్న దేశాలు) లేదా వాటిమీదుగా వస్తున్న ప్రయాణికులు అందరూ భారత్‌లో దిగగానే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని, పరీక్షల ఫలితాలు వచ్చేదాకా వారు విమానాశ్రయంలోనే వేచి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ట్రాన్సిట్‌లో ఉన్న వారు కూడా పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే... తదుపరి ప్రయాణం నిమిత్తం విమానాల్లోకి బోర్డింగ్ కావొచ్చని తెలిపింది. సురక్షిత జాబితాలోని దేశాల నుంచి వచ్చే వారు ఇళ్లకు వెళ్లడానికి అనుమతిస్తారని, అయితే 14 రోజుల పాటు వీరు స్వీయ ఆరోగ్యపరిరక్షణ చూసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముప్పులేని దేశాల నుంచి వచ్చేవారిలోనూ ఐదుశాతం మందిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి విమానాశ్రయంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఆరోగ్యోశాఖ వెల్లడించింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపింది. కాగా ఈ నెల 24వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చిన ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒమిక్రాన్ వేరియెంటో, కాదో తేల్చుకోవడానికి అతని శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ రక్షణను ఏమార్చొచ్చు: గులేరియా ‘‘ఒమిక్రాన్ వేరియెంట్ వైరస్ కొమ్ములో 30 పైచిలుకు జన్యుపరమైన మార్పులున్నట్లు సమాచారం. ఫలితంగా ఇది రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోగలదు. కాబట్టి ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తాయనేది (ఈ వేరియెంట్ నుంచి ఎంతమేరకు రక్షణ కల్పిస్తాయనేది) నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది’’ అని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. వైరస్ పైనుండే కొమ్ముల ద్వారానే కరోనా ఆతిథ్య కణంలోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందుతుందనే విషయం తెలిసిందే. ‘ఎక్కువమటుకు వ్యాక్సిన్లు స్పైక్ ప్రొటీన్ (వైరస్‌పై నుంచే కొమ్ములకు)లకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీలను తయారుచేయడం ద్వారా రక్షణ కల్పిస్తాయి. అలాంటి స్పైక్ ప్రొటీన్‌లో పెద్దసంఖ్యలో జన్యుపరమైన మార్పులుంటే యాంటీబాడీలు వాటిని అంత సమర్థంగా అడ్డుకోలేకపోవచ్చు’ అని గులేరియా పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనేది పరిశోధించి నిర్ధారించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ ముప్పు అన్ని దేశాలకు పొంచి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచడం, కరోనా పరీక్షలు ఎక్కువ చేయడం, కరోనా హాట్‌స్పాట్‌ల్లో నిరంతర పర్యవేక్షణ, ఆస్పత్రుల్లో సదుపాయాలను పెంచడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయడం, ప్రజలందరూ కోవిడ్–19 నిబంధనల్ని తుచ తప్పకుండా పాటించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదివారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్, బోస్ట్వానా నుంచి వచ్చే ప్రయాణికుల్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయాలని, అందరికీ కరోనా పరీక్షలతో పాటు ఏ వేరియెంట్ సోకిందో తెలిసే వరకు క్వారంటైన్లో ఉంచాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించానికి ఏర్పాటు చేసిన ఇన్సాకాగ్ ల్యాబొరేటరీకి శాంపిల్స్ పంపాలన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించకుండా వైరస్ ఎంతవరకు వ్యాప్తి చెందిందో తెలుసుకోవడం కష్టమవుతుందన్నారు. 5శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు ఉండేలా రాష్ట్రాలన్నీ చర్యలు చేపట్టాలన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్ అన్న విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలు కృషి చెయ్యాలన్నారు. -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగ్యూతో బాధపడుతున్నారని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఎయిమ్స్ అధికారులు శనివారం తెలిపారు. మన్మోహన్సింగ్ ప్లేట్లెట్ల సంఖ్య వృద్ధి చెందుతోందని వైద్యులు తెలిపారు. చదవండి: కేంద్రమంత్రిపై మన్మోహన్ సింగ్ కుమార్తె ఆగ్రహం..‘వాళ్లేం జూలో జంతువులు కాదు’ కాగా మాజీ ప్రధాని జ్వరం, నీరసం వంటి అనారోగ్య సమస్యలతో బుధవారం ఎయిమ్స్‌లో చేరారు. డెంగ్యూ జ్వరం బారినపడిన మాజీ ప్రధాని.. ఎయిమ్స్ ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్లోని ఓ ప్రైవేట్ వార్డులో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ నితీష్ నాయక్ మార్గదర్శకత్వంలోని కార్డియాలజిస్ట్ బృందం మాజీ ప్రధాని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. చదవండి: వైరల్: వీడెవడ్రా బాబు.. నాకే పోటీగా వచ్చేలా ఉన్నాడు.. -
నిపా వైరస్: పండ్లు కడిగే తింటున్నారా?
థర్డ్ వేవ్‌తో కరోనా విరుచుకుపడుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్న వేళ.. నిఫా వైరస్ పేరు మళ్లీ వినిపించడం వైద్యసిబ్బందిని కలవరపాటుకు గురి చేస్తోంది. కేరళలో పన్నెండేళ్ల బాలుడు నిపా వైరస్ కారణంగా చనిపోవడంతో కేరళ, ఆ పొరుగునే ఉన్న తమిళనాడు జిల్లాలు అప్రమత్తం అయ్యాయి. ఈ తరుణంలో ఫేక్ కథనాలు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ.. నిపా విషయంలో అప్రమత్తంగా ఉంటేనే నష్టనివారణ చేయొచ్చని సూచిస్తున్నారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు. నిపా.. జూనోటిక్ డిసీజ్. జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అయితే మనిషి నుంచి మనిషికి సోకడమనే ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. అందుకే జంతువులు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ అశుతోష్ బిస్వాస్ చెబుతున్నారు. ఫ్రూట్ బ్యాట్(గబ్బిలాలు) లాలాజలం నుంచి, వాటి విసర్జితాల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రత్యేకించి చికిత్స విధానమంటూ నిపా వైరస్‌కు లేకపోవడం వల్ల జాగ్రత్తగా ఉండడమే మార్గమని డాక్టర్ బిస్వాస్ అంటున్నారు. సెప్టెంబర్ 5న నిపా కారణంగా కేరళ కోజికోడ్ బాలుడు చనిపోగా.. బాధితుడి ఇంటి నుంచి సేకరించిన ‘రాంభూటాన్ పండ్ల’(చెట్టు నుంచి కిందపడిన పండ్లు) ద్వారా వైరస్ నిర్ధారణ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు డాక్టర్ బిస్వాస్. పండ్లు కడగాల్సిందే! గబ్బిలాలు నిపా వాహకాలు కావడంతో పండ్ల(ఫ్రూట్స్) విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ బిస్వాస్ సూచిస్తున్నారు. సాధారణంగా గబ్బిలాలు జంతువులకు వైరస్‌ను అంటిస్తాయి. ప్రధానంగా గబ్బిలాలు కొరికిన పండ్ల వల్ల నిపా వైరస్ సోకుతుంది. చాలామంది చెట్ల మీద నుంచి పడిన పండ్లను సంబరంగా తింటుంటారు. సగం కొరికి కింద పడ్డ పండ్లను.. కడగకుండానే తినేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన అలవాటు అని చెప్తున్నారు డాక్టర్ బిస్వాస్. పండ్లు ఎలాంటివైనా సరే శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలని ఆయన సూచిస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఈ జాగ్రత్త తప్పక పాటించాలని, లేకుంటే ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారాయన. ప్రాథమిక జాగ్రత్తలు ► పెంపుడు జంతువుల్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం.. వాటిని బయటకు తీసుకెళ్లినప్పుడు ఓ కంటకనిపెడుతుండడం. ► చేతులను తరచు సబ్బుతో శుభ్రం చేసుకోవటం. ► ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తినడం ► పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. లక్షణాలు ► శ్వాసకోశ సమస్యలు, ► జ్వరం ► ఒళ్లు నొప్పులు ► తలనొప్పి ► వాంతులు ► లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. ► నిపా నిర్ధారణ అయితే వైద్యసిబ్బందిని సంప్రదించడం. మలేషియాలో పందుల పెంపకందారులకు మొదటిసారిగా నిపా వైరస్ సోకింది. భారత్‌లో మొదటిసారి పశ్చిమబెంగాల్లో, రెండోసారి కేరళలో విజృంభించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి తీరుతెన్నులను గమనిస్తే ఒకే ప్రాంతం, దాని చుట్టుపక్కల పరిసరాలకు పరిమితమవుతూ వచ్చింది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే.. ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశమే ఉండదని వైద్యులు చెప్తున్నారు. చదవండి: మరోసారి నిపా కలకలం -
దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం
చండీగఢ్: దేశంలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా) మృతి నమోదయ్యింది. హరియాణాలో 11 ఏళ్ల బాలుడు ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా వైరస్‌తో బాధపడుతూ మృతి చెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బర్డ్ ఫ్లూతో మృతి చెందిన తొలి కేసు ఇదేనన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిమ్స్ సిబ్బంది అందరు ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం అనేది చాలా రేర్‌గా జరుగుతుందని.. కానీ ఒక్కసారి దాని బారిన పడితే మరణాల రేటు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. బర్డ్ ఫ్లూ సోకిన వారిలో మరణాల రేటు 60శాతంగా ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో హరియాణాతో సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల బర్డ్ ఫ్లూ వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇక హరియాణాలో నిపుణులు ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా వైరస్ సబ్ టైప్ హెచ్5ఎన్8(H5N8)ని గుర్తించారు. ఈ జాతి మనుషులకు సోకుతుందని తెలిపారు. ఢిల్లీ, కేరళ, రాజస్తాన్, హరియాణా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్రల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ సంక్రమణ వ్యాప్తిని ఎదుర్కోవటానికి దేశవ్యాప్తంగా పక్షులను చంపడం జరిగింది. జనవరిలో ఢిల్లీ ఎర్రకోట నుంచి సేకరించిన పక్షుల నమూనాలు ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ఖాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం అప్పట్లో ఆదేశించింది. ఫిబ్రవరిలో ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ నుంచి సేకరించిన మరిన్ని నమూనాల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా తేలాయి. మార్చిలో ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా తిరిగి కనిపించింది. మహారాష్ట్రలోని అమరావతి, నందూర్బార్ జిల్లాల్లో 261 పౌల్ట్రీ పక్షులు చనిపోయాయి. ఏప్రిల్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని పాంగ్ డ్యామ్ సరస్సులో 100 వలస పక్షులు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ సంక్రమణ భయం మళ్లీ పెరిగింది. -
ఢిల్లీ ఎయిమ్స్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రధాన అత్యవసర వార్డులో సోమవారం తెల్లవారుజామున ఒక చిన్న అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని.. ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన మంటలను గంటలో అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. రోగులందరినీ బాధిత ప్రాంతాల నుంచి సురక్షితంగా తరలించారు. "ప్రమాద ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రిలోని డమ్మీ గదిలో మంటలు, పొగ కనిపించింది. రోగులందరినీ బాధిత ప్రాంతం నుంచి తరలించారు. ఏడు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉందని డీసీసీ సౌత్ అతుల్ ఠాకూర్ వార్తా సంస్థ ఏఎన్ఐకి వెల్లడించారు. చదవండి: ఇంట్లో ఒంటరిగా ముగ్గురు పిల్లలు; నిజమైన హీరోలు మీరే! -
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలోని బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని కన్వర్జెన్స్ బ్లాక్‌లోని తొమ్మిదో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 22 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు.అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఫైర్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారి ఒకరు వెల్లడించారు. -
మళ్లీ జైలుకు: కరోనాతో కోలుకున్న గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్
ఢిల్లీ: కరోనా బారిన పడిన గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ కోలుకున్నాడు. అతడు కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. అతడి ఆరోగ్యం మెరుగవడంతో అధికారులు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి తిహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 22వ తేదీన చోట రాజన్ కరోనా వైరస్ బారినపడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆ నెల 24వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో ఒక్కసారిగా చోట రాజన్ మృతి చెందాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చోటా రాజన్ మృతి చెందారనే వార్త వైరల్‌గా మారింది. ఈ పుకార్లపై పోలీస్, ఆస్పత్రి అధికారులు స్పందించి ‘లేదు.. లేదు. చోట రాజన్ చనిపోలేదు. చికిత్స పొందుతున్నాడు’ అన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. చివరకు ఆయన కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంతో తిహార్ జైలుకు తిరిగి వెళ్లాడు. చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా చదవండి: దారుణం.. వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత -
ఆ వార్తలు అవాస్తవం.. చోటా రాజన్ బ్రతికే ఉన్నాడు!
సాక్షి, న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనాతో మరణించాడంటూ మీడియాలో వెలువడుతున్న వార్తలపై తీహార్ జైలు డీజీ, ఎయిమ్స్ అధికారులు స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని, చోటా రాజన్ బ్రతికే ఉన్నాడని స్పష్టం చేశారు. తీహార్ జైలులో ఖైదీగా ఉన్న రాజేందర్ సదాశివ్ నికల్జే అలియాస్ చోటారాజన్‌కు గత నెల 22వ తేదీ కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆయనను 24వ తేదీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని జైలు డీజీ తెలిపారు. చోటా రాజన్ బ్రతికే ఉన్నాడని, ఎయిమ్స్‌లో చేరి కరోనాకు చికిత్స పొందుతున్నారని ఎయిమ్స్ అధికారులు ట్విటర్ వేదికగా స్పష్టత నిచ్చారు. కాగా, అండర్ వరల్డ్ డాన్‌గా పేరు బడ్డ చోటా రాజన్ మొదట ముంబై డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా ఉండేవాడు. దావూద్‌తో విబేధాల కారణంగా మరో గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. రాజన్‌పై దాదాపు 70కిపైగా క్రిమినల్ కేసులున్నాయి. -
నెగటివ్: కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధానమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా బారినపడిన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్టకేలకు కోలుకున్నారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ రావడంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ఏప్రిల్ 19వ తేదీన మన్మోహన్ కరోనా బారినపడ్డారు. రెండుసార్లు (మార్చి 4, ఏప్రిల్ 3) కరోనా టీకాలు తీసుకున్న తర్వాత కూడా ఆయన కరోనా బారినపడడం కలకలం రేపింది. కరోనా నిర్ధారణ అయిన అనంతరం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. పది రోజుల పాటు ఎయిమ్స్‌లో చికిత్స పొందిన అనంతరం మన్మోహన్ సింగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. కరోనా టెస్ట్ చేయగా నెగటివ్ రావడంతో మన్మోహన్ సింగ్‌ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే మన్మోహన్ సింగ్ దేశంలో కరోనా వ్యాప్తి, కట్టడి చర్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. పలు సూచనలు చేయగా వాటిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి -
కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రోజు ఉదయం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ మేరకు ప్రధానిమోదీ ట్వీట్ చేశారు.‘ఈ రోజు ఎయిమ్స్‌లో కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్నాను.. వైరస్‌ను ఓడించడానికి మనకు ఉన్న మార్గాలలో వ్యాక్సిన్ ఒకటి. టీకా తీసుకునేందుకు మీరు అర్హులు అయితే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి.. ఇందుకు కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ CoWin.gov.in చేయించుకోండి’. అని మోదీ పిలుపునిచ్చారు. కాగా మార్చి 1న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా తొలి డోస్ తీసుకున్న విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం మొదటి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ వ్యవధిని 6-8 వారాలకు కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా రెండో డోస్ తీసుకున్నారు. తొలి డోస్ వేయించుకున్నప్పటిలా కాకుండా ఈసారి ప్రధాని ముఖానికి మాస్క్ ధరించి వ్యాక్సిన్ తీసుకున్నారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత ఎల్కే ఆద్వాని సైతం కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. చదవండి: పరీక్షలు ఒక్కటే జీవితం కాదు: మోదీ Got my second dose of the COVID-19 vaccine at AIIMS today. Vaccination is among the few ways we have, to defeat the virus. If you are eligible for the vaccine, get your shot soon. Register on https://t.co/hXdLpmaYSP. pic.twitter.com/XZzv6ULdan — Narendra Modi (@narendramodi) April 8, 2021 భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ పరంగా భారత్ ప్రపంచంలోనే ముందు వరుసలోదూసుకుపోతోంది. ముందుగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందించగా.. తర్వాత 60 ఏళ్లు దాటినవారు, 45 ఏళ్లు దాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారికి వ్యాక్సినేషన్ అందజేశారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన అందరికీ టీకా పంపిణీ ప్రారంభించారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 8 కోట్ల మందికి టీకాను అందజేశారు. -
ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్యం మెరుగుపడింది. ఎయిమ్స్‌లోని ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డులోకి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రపతి ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయన కోలుకుంటున్నారని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి 27వ తేదీన సైనిక (ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్) ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆ ఆస్పత్రి వర్గాలు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లాలని సూచించాయి. సాధారణ వైద్య పరీక్షల అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు మర్చి 30వ తేదీన బైపాస్ సర్జరీ విజయవంతంగా చేసిన విషయం తెలిసిందే. President Kovind was shifted from the ICU to a special room in the AIIMS today. His health has been improving continuously. Doctors are constantly monitoring his condition and have advised him to take rest. — President of India (@rashtrapatibhvn) April 3, 2021 చదవండి: రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ -
రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ
న్యూఢిల్లీ: ఛాతీలో నొప్పితో అనారోగ్యానికి గురయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం మంగళవారం ఆయనకు బైపాస్ సర్జరీ విజయవంతంగా చేశారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రపతి ఆరోగ్యం కుదుటగా ఉందని.. కోలుకుంటున్నారని వెల్లడించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ వైద్యులను ఆయన అభినందించారు. ఈనెల 27వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఛాతీ నొప్పితో సైనిక (ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్) ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆ ఆస్పత్రి వర్గాలు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లాలని సూచించాయి. సాధారణ వైద్య పరీక్షలు రావడంతో రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు బైపాస్ సర్జరీ విజయవంతంగా ముగించారు. దీనిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ జరిగింది. విజయవంతంగా సర్జరీ చేసిన వైద్యులను అభినందిస్తున్నా. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడి తెలుసుకున్నా. రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. The President of India, Shri Ramnath Kovind has undergone a successful bypass surgery at AIIMS, Delhi. I congratulate the team of Doctors for successful operation. Spoke to Director AIIMS to enquire about Rashtrapatiji’s health. Praying for his well-being and speedy recovery. — Rajnath Singh (@rajnathsingh) March 30, 2021 -
ఢిల్లీ ఎయిమ్స్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
-
మార్చి 30న రాష్ట్రపతి కోవింద్‌కు బైపాస్ సర్జరీ..
సాక్షి,న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై శనివారం ఆర్మీ ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సాధారణ వైద్య పరీక్షల అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌ను ఢిల్లీలోని ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బైపాస్ సర్జరీ నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో మార్చి 30న ఏయిమ్స్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా శుక్రవారం రామ్‌నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో ఆయనను వెంటనే ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోవింద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని కోరిన వారందరికీ కృతజ్ఙతలు తెలియజేశారు. The President has been under observation after a routine medical checkup. He thanks all who enquired about his health and wished him well. — President of India (@rashtrapatibhvn) March 27, 2021 -
క్షీణిస్తున్న లాలూ ఆరోగ్యం
రాంచీ: రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్(72) ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో శనివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ వివిధ ఆరోగ్య సమస్యలతో రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. ‘ఆయనకు న్యుమోనియా సోకింది. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని నిర్ణయించాం. ఎయిమ్స్ నిపుణులను ఇప్పటికే సంప్రదించాం. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ నుంచి నివేదిక అందిన వెంటనే ఢిల్లీకి తీసుకెళ్తాం’ అని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ శనివారం సాయంత్రం తెలిపారు. అధికారులు, లాలూ కుటుంబసభ్యులు ఢిల్లీకి తరలించేందుకు ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్సును ఏర్పాటు చేశారని కూడా ఆయన వెల్లడించారు. లాలూను ఢిల్లీకి తరలించేందుకు రాంచీ జైలు అధికారులు సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. లాలూ ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసిన భార్య రబ్రీదేవి, కూతురు మిసా భారతి, కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి శుక్రవారం రాత్రి ఆయనను కలుసుకున్నారు. అనంతరం తేజస్వీ యాదవ్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ అయి, తమ తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు సాయం అర్థించారు. రిమ్స్‌లో ఉండగా లాలూ జైలు నిబంధనలను అతిక్రమించారన్న కేసుపై జార్ఖండ్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో ఆస్పత్రి యంత్రాంగం, జైలు అధికారులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. -
సీఎం రావత్‌కు అస్వస్థత, ఎయిమ్స్‌కు తరలింపు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. సీఎంకు ఛాతీలో ఇన్ఫెక్షన్ పెరిగినట్లు ఎయిమ్స్ వర్గాలు నిర్ధారించాయి. కాగా, ఈనెల 18న సీఎం రావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే, ఆయనకు జ్వరంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం డెహ్రాడూన్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి నేడు ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. ఇక కేబినెట్ భేటీలో పాల్గొన్న మంత్రి సాత్పాల్ మహరాజ్‌కు కరోనా నిర్ధారణ కావడంతో జూన్ 1న ఓసారి క్వారంటైన్‌కు వెళ్లిన సీఎం, తన కార్యాలయంలో పనిచేసే ఓఎస్డీకి కరోనా సోకడంతో ఆగస్టు 26న మరోసారి ఐసోలేషన్‌కు వెళ్లారు. -
ఏదీ తేలిగ్గా తీసుకోవద్దు
సాక్షి, అమరావతి: ఏలూరులో పలువురు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలపై ఏ అంశాన్ని కొట్టి పారేయవద్దని, నిపుణులు సూచించిన ప్రతి కోణంలోనూ మరింత లోతుగా పరిశీలన, పరిశోధన జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తాగునీటి విషయంలో క్షుణ్నంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఎక్కడా పొరపాటు జరగడానికి వీల్లేదని, ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలని, బ్లడ్ శాంపిళ్లలో లెడ్, ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్ఫరస్ కనిపిస్తోందని, ఇది ఎలా వచ్చిందో కచ్చితంగా కనిపెట్టాలని స్పష్టం చేశారు. ఇలాంటివి పునరావృతం కారాదంటే ఎలా జరిగిందన్న విషయం కచ్చితంగా కనిపెట్టాల్సిందేనని, ఈ కోణంలో అంతా దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. సమన్వయంతో ముందడుగు: ఏలూరు ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీని నియమించాం. ఈ అంశంపై పరిశోధన చేస్తున్న వివిధ సంస్థలు, ఏజెన్సీలు, నిపుణులు సమన్వయంతో ముందడుగు వేయాలి. బుధవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిద్దాం. విచ్చలవిడిగా పురుగు మందుల వాడకాన్ని అడ్డుకోవాలి. పురుగు మందులపై జాగ్రత్త..: నిషేధిత పురుగు మందులు, రసాయనాలు విక్రయిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల ద్వారా అనుమతించిన పురుగు మందులు, ఎరువులను మాత్రమే రైతులకు చేరవేయాలి. వీటి వినియోగంపై రైతులకు మరింత అవగాహన కల్పించడం ద్వారా ఆహార పదార్థాలు కలుషితం కాకుండా నిరోధించవచ్చు. ప్రస్తుతం వినియోగిస్తున్న పురుగుల మందులను కూడా పరీక్షించాలి. నెల పాటు ఈ ప్రక్రియ సాగాలి. పూర్తిస్థాయిలో నీటి పరీక్షలు..: ప్రస్తుత పరిస్థితికి నీరు కారణమా? కాదా? అన్నదానిపై ముందుగా పూర్తిస్థాయిలో నిర్ధారణలు తీసుకోవాలి. సేంద్రీయ సేద్యం, సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. బియ్యం శాంపిళ్లు కూడా తీసుకుని పరీక్షలు చేయాలి. ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, కలెక్టర్ ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ వల్లభనేని బాలశౌరి, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో పాటు అధికారులు కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. పురుగు మందులూ కారణం కావచ్చు 16 శాంపిల్స్‌ను పరిశీలించాం, తాగునీటిలో చెప్పుకోదగ్గ స్థాయిలో లెడ్, నికెల్ లేదు. మరోసారి పరీక్షలు చేస్తున్నాం. పాలలో నికెల్ కనిపించింది, దీనిపై మరింత పరిశీలన చేపట్టాం. బ్లడ్ శాంపిళ్లలో లెడ్, నికెల్ కనిపించాయి. పురుగు మందులు కూడా ఈ పరిస్థితికి దారి తీయవచ్చు. పురుగు మందుల్లో భార లోహాలు ఉంటాయి. ఆర్గనో క్లోరిన్ నిర్ధారించుకునేందుకు సీఐఎస్ఎఫ్ఎల్ నుంచి ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. – ఎయిమ్స్ న్యూఢిల్లీ తాగునీటిలో ఇబ్బంది లేదు 21 తాగు నీటి శాంపిళ్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించాం. తాగు నీరు క్లీన్ అని స్పష్టంగా చెబుతున్నాం. లెడ్, ఆర్గనో క్లోరిన్ కనిపించ లేదు. బాధితుల రక్తంలో లెడ్, ఆర్గనో క్లోరైడ్స్ ఉన్నాయి. సీరమ్ శాంపిళ్లలో ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్ఫరస్ కనిపించాయి. ఈ రెండింటి వల్ల ఈ పరిస్థితి వచ్చిందన భావిస్తున్నాం. – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ బియ్యంలో మెర్క్యురీ ఆనవాళ్లు పురుగు మందుల అవశేషాలే కారణమని ప్రాథమికంగా అంచనా వేశాం. దీర్ఘకాలంలో పరిశోధన చేయాల్సి ఉంది. శాంపిల్స్‌పై ఇంకా విశ్లేషణ కొనసాగుతుంది. బియ్యంలో మెర్క్యురీ ఆనవాళ్లు అధికంగా కనిపించాయి, మరిన్ని పరీక్షలు అవసరం. టమాటాపైన కూడా పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. ఆర్గనో ఫాస్ఫరస్ బ్లడ్‌లో కనిపించింది. ఇవి ఎలా మనుషుల శరీరంలోకి ప్రవేశించాయో గుర్తించాల్సి ఉంది. – ఎన్ఐఎన్, హైదరాబాద్ పెస్టిసైడ్స్ ఆనవాళ్లు 19 నీటి శాంపిళ్లను పరిశీలించాం. వాటిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించాం. భార లోహాలు కనిపించలేదు. ఇ–కోలి సాధారణ స్థాయిలోనే ఉంది. – ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ -
ఆ కోణంలో దృష్టి పెట్టాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏలూరులో పలువురి అస్వస్థతకు కారణాలపై కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలూరులో పరిస్థితులకు సంబంధించి ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. గత రాత్రి నుంచి ఇద్దరు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలో 8 మంది, ఏలూరులో 5గురు మాత్రమే చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు అంతా డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయిన వారు తిరిగి ఆస్పత్రులకు వచ్చిన దాఖలాలు లేవు. పశువుల నుంచి కూడా కొన్ని శాంపిళ్లు తీసుకుని భోపాల్‌కు పంపాం. అలాగే చేపల శాంపిళ్లు కూడా తీసుకున్నాం. గాలిలో కాలుష్యంపైనా కూడా పరీక్షలు చేయించాం. అన్ని ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.(చదవండి: రైతుల ఆదాయం రెట్టింపు చేయాలి: సీఎం జగన్) శాంపిళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో లెడ్, నికెల్స్ లేవు: ఎయిమ్స్ వైద్య బృందం 16 శాంపిల్స్‌ను పరిశీలించామని, తాగునీటి శాంపిళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో లెడ్, నికెల్స్ లేవు, మరోసారి పరీక్షలు చేస్తున్నామని న్యూఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం వివరించింది. ప్రాథమికంగా పాలలో నికెల్ కనిపించింది, దీనిపై మరింత పరిశీలన చేస్తున్నాం. కానీ బ్లడ్ శాంపిళ్లలో లెడ్, నికెల్లు కనిపించాయి. యూరిన్‌లో లెడ్ కనిపించింది. పురుగు మందులు కూడా ఈ పరిస్థితికి దారి తీయొచ్చు. ఎందుకంటే పురుగు మందుల్లో భారీ లోహాలు ఉంటాయి. ఆర్గనో క్లోరిన్ ఉందా? లేదా? అని చెప్పడానికి సీఐఎస్‌ఎఫ్‌ఎల్‌కు పంపాం. ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుందని వెల్లడించారు. (చదవండి: అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు) తాగునీరు సురక్షితం: ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ 21 తాగు నీటి శాంపిళ్లను ఒకటికి రెండు సార్లు పరిశీలించామని ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పేర్కొంది. తాగు నీరు క్లీన్ అని స్పష్టంగా చెప్తున్నాం. తాగు నీటి శాంపిళ్లలో లెడ్ కాని, ఆర్గనో క్లోరిన్ కాని, ఆర్గనో ఫాస్పేట్స్ కాని కనిపించ లేదు. బ్లడ్‌లో లెడ్, ఆర్గనో క్లోరైడ్స్ ఉన్నాయి. సిరమ్ శాంపిళ్లలో ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్పరస్ కనిపించాయి. ఆర్గనో క్లోరిన్స్, ఆర్గనో ఫాస్పరస్ రెండింటి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నామని వివరించారు. పురుగు మందుల అవశేషాలే కారణం:ఎన్ఐఎన్ ఎన్ఐఎన్లో 9 మందితో కమిటీని ఏర్పాటు చేశాం. పురుగు మందుల అవశేషాలే కారణమని ప్రాథమిక అంచనా వేశాం. దీర్ఘకాలంలో పరిశోధన చేయాల్సి ఉంది. శాంపిల్స్‌పై ఇంకా విశ్లేషణ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. బియ్యంలో మెర్క్యురీ ఆనవాళ్లు అధికంగా కనిపించాయి. మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. టమోటాపైన కూడా పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. ఆర్గనో పాస్ఫరస్ బ్లడ్‌లో కనిపించింది. ఎలా ఇవి మనుషుల శరీరంలోకి ప్రవేశించిందన్నదానిపై గుర్తించాల్సి ఉందని ఎన్ఐఎన్ బృందం వెల్లడించారు. ఆ అనవాళ్లు కనిపించలేదు.. భూగర్భ జలాన్ని పరిశీలిస్తున్నామని ఎన్ఈఈఆర్ఐ (నీరి) బృందం పేర్కొంది. శాంపిళ్లు తీసుకున్నాం. పరీక్షల ఫలితాలు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. 100కి పైగా శాంపిళ్లు తాగునీటిని చెక్ చేస్తే భారీలోహాలు కాని, ఆర్గనో క్లోరిన్స్‌గాని, ఆర్గనో ఫాస్పరస్స్ ఆనవాళ్లు కనిపించలేదని ఏపీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. కచ్చితంగా కనిపెట్టాలి.. తాగునీటి మీద ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేయించాలని.. ఎక్కడా పొరపాటు జరగడానికి వీల్లేదని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఒకటికి రెండు సార్లు ఖరారు చేసుకోవాలన్నారు. బ్లడ్ శాంపిళ్లలో లెడ్, ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్పరస్ కనిపిస్తోంది.. ఎలా వచ్చిందన్నది కచ్చితంగా కనిపెట్టాలని చెప్పారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే.. ఇది ఎలా జరిగిందన్న దానిపై కచ్చితంగా కనిపెట్టాలని.. ఈ కోణంలో అందరూ దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘‘ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున కమిటీని వేశాం. ఈ అంశంపై పరీక్షలు చేస్తున్న వివిధ సంస్థలు, ఏజెన్సీలు, నిపుణులను సమన్వయం చేస్తూ ముందడుగు వేయాలి. బుధవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిద్దాం. విచ్చలవిడిగా పురుగు మందులు, అలాగే నిషేధిత పురుగు మందుల వినియోగాన్ని అడ్డుకోవాలి. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిషేధించిన పురుగు మందులు అమ్మితే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల ద్వారా అనుమతించిన పురుగు మందులు, ఎరువులు మాత్రమే రైతులకు చేరవేయాలి. వాటి వినియోగంపైన రైతులకు అవగాహన కల్పించాలి. తద్వారా ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అడ్డుకోగలుగుతాం. ప్రస్తుతం వినియోగిస్తున్న పురుగుల మందులను పరీక్షలు చేయాలి. వచ్చే నెలరోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగాలి. ప్రస్తుత పరిస్థితికి నీరు కారణమా? కాదా? అన్నదానిపై ముందు పూర్తి స్థాయిలో నిర్ధారణలు తీసుకోవాలి. ఆ తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దృష్టిపెట్టాలి. దానిపై అవగాహన కల్పించాలి. సేంద్రీయ పద్దతుల ద్వారా ఉత్పత్తులను ప్రోత్సహించాలి. బియ్యం శాంపిల్స్ కూడా తీసుకుని పరీక్షలు చేయించండి. పెస్టిసైడ్స్ రూపంలో కూడా చేరే అవకాశాలున్నాయని చెప్తున్నారు కాబట్టి పరిశీలన చేయాలని’’ సీఎం వైఎస్ జగన్ సూచించారు. కాగా, 19 నీటి శాంపిళ్లను పరిశీలించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటవ్ మెడిసిన్, వాటిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది. భార లోహాలు కనిపించలేదని వెల్లడించింది. ఈకోలి సాధారణ స్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది. మరో వైపు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వాతావరణంలో వాయువులు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని గుర్తించారు. పురుగు మందుల అవశేషాలపై ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని వెల్లడించారు. ఎన్ఐఎన్, ఐఐసీటీ, ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ మంగళగిరి, సీసీఎంబీ, నీరి–హైదరాబాద్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎన్ఐవీ పూణె, ఎన్సీడీసీ సభ్యులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, కలెక్టర్ ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. క్యాంప్ ఆఫీసు నుంచి కాన్ఫరెన్సులో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ వల్లభనేని బాలశౌరి, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. -
తగ్గిన కొత్త కేసులు.. కోలుకున్న ఏలూరు
ఏలూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి ప్రతినిధి ఏలూరు: అంతుచిక్కని అనారోగ్యం బారిన పడిన బాధితులకు అత్యున్నత వైద్య చికిత్స అందిస్తూనే కారణాలను గుర్తించేందుకు వివిధ రకాల నమూనాల విశ్లేషణ కొనసాగుతోంది. ఒకే నమూనాను పలు ల్యాబొరేటరీల్లో పరీక్షిస్తున్నారు. ఏలూరులో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నీటిలో పెస్టిసైడ్స్ (పురుగు మందులు) ఆనవాళ్లు మోతాదుకు మించి ఉన్నాయని గుర్తించినట్లు సమాచారం. దీనికి గల కారణాలపై విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. పెద్ద ఎత్తున ఆక్వా సాగు జరుగుతుండటం, ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జలాలు ఏమైనా కలుషితమయ్యాయా? అనే దిశగా అన్వేషిస్తున్నారు. మరోవైపు బాధితుల రక్తంలో నికెల్, లెడ్ లాంటివి ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు గుర్తించడంతో పెస్టిసైడ్స్‌కు వీటితో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనే పరిశోధిస్తున్నారు. దీన్ని నిర్థారించుకునేందుకు మంగళవారం ఉదయం నమూనాలను మరోసారి ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపగా బుధవారం ఫలితాలు వెలువడనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. తాడేపల్లిగూడెం, భీమవరంలో కూడా తాగునీటిని సేకరించి పరిశీలిస్తారు. ఇక ఆస్పత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఏలూరులో బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఎన్ఐఎన్ బృందం.. పంపుల చెరువులో నీటిని శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలిస్తున్న మంత్రి ఆళ్ల నాని ఇ–కొలి లేదు.. తాగునీటిలో ప్రమాదకరమైన ఇ–కొలి బాక్టీరియా ఉందేమోనన్న అనుమానాలు తొలగిపోయాయి. మంగళవారం ఉదయం నివేదికల ఫలితాల్లో బాక్టీరియా లేదని స్పష్టమైంది. సెరబ్రిల్ స్పైనల్ ఫ్లూయిడ్ శాంపిల్ నమూనాలను విశ్లేషించగా అవికూడా నార్మల్‌గా ఉన్నట్లు తేలింది. ఇంటింటికీ తిరిగి నమూనాల సేకరణ డాక్టర్ జేజే బాబు ఆధ్వర్యంలో తొమ్మిది మంది వైద్య సిబ్బందితో కూడిన బృందం ఏలూరులో వ్యాధి ప్రారంభం అయిన దక్షిణపు వీధిలోని జేపీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి బాధితులతో మాట్లాడింది. ఆహార పదార్థాలు, నీటి నమూనాలను సేకరించింది. నాలుగో రోజు తగ్గుముఖం ఏలూరును పీడిస్తున్న అంతుచిక్కని వ్యాధి తీవ్రత నాలుగో రోజు తగ్గినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. మంగళవారం రాత్రి సమయానికి 68 మంది బాధితులు చికిత్స పొందుతుండగా ఇప్పటివరకు 497 మంది డిశ్చార్జి అయినట్లు ఏలూరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ తెలిపారు. బాధితుల్లో 24 మంది విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. చిన్నారులకు పాత ప్రభుత్వాస్పత్రిలోని పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స అందిస్తుండగా మిగిలిన వారిని కొత్త ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌కు తరలించి ప్రత్యేక చేసిన ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శివశంకరరావు దగ్గరుండి వీరిని పర్యవేక్షిస్తున్నారు. ఐఐసీటీకి వివరాలు.. ఏలూరులో దుకాణదారులు విక్రయిస్తున్న పురుగు మందుల వివరాలను అధికారులు ఆరా తీశారు. నిషేధించిన మందులు ఏవైనా విక్రయిస్తున్నారా? అనే కోణంలోనూ వివరాలు సేకరించి ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)కి పంపారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం ఏలూరులో నెలకొన్న పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిత్యం పర్యవేక్షిస్తూ ఆరా తీస్తున్నారు. సీఎంవో కార్యాలయం, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నితోపాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ బాధితులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష జరిపిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ మూడు రోజులుగా ఏలూరులోనే ఉంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. వైద్య శిబిరాలు, కేంద్ర వైద్య బృందాలను రప్పించడం, వ్యాధి నిర్థారణ పరీక్షలు, నమూనాల సేకరణను పర్యవేక్షిస్తున్నారు. మోతాదు మించి ఉన్నాయి ‘నీటిలో పెస్టిసైడ్స్ మోతాదు ఎక్కువగా ఉంది. వీటిని ఆర్గనో క్లోరిన్స్ అంటారు. ఓపీ డీడీటీ, ఓపీ డీడీఈ లాంటి పలు రకాల నిషేధిత ఆర్గనో క్లోరిన్స్ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఇంత మోతాదులో ఉన్న నీటిని తాగితే నాడీ వ్యవస్థకు హాని కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇవి ఎలా వచ్చాయన్న దానిపై పరిశీలన జరుగుతోంది’ –డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్ -
సుశాంత్‌ది ఆత్మహత్యే.. హత్య కాదు!
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ మరణించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలాగా అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు, సీబీఐ, ఎన్సీబీ, ఈడీ దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టిననప్పటికీ అతనిది ఆత్మహత్యా, హత్యా అన్న విషయంలో స్పష్టత రాలేదు. బంధుప్రీతి, బాలీవుడ్ ప్రముఖుల విపరీత పోకడల అంశం చుట్టూ తిరిగిన ఈ కేసు డ్రగ్స్ వ్యవహారంతో మరో మలుపు తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ది హత్య కాదని, అది ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ల బృందం సీబీఐకు పేర్కొంది. చదవండి: సుశాంత్ కేసులో మరో మలుపు కాగా జూన్ 14న సుశాంత్ తన అపార్ట్మెంట్లో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ముంబై పోలీసులు సుశాంత్‌ది ఆత్మహత్యేనని తెలిపారు. అయితే తన కొడుకు చావుకు గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమని, సుశాంత్ నుంచి అధిక మొత్తంలో డబ్బులు లాక్కొందని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన డ్రగ్స్ సంబంధిత ఆరోపణలపై రియా ప్రస్తుతం జైలులో ఉన్నారు. చదవండి: రియా బెయిల్ పిటిషన్: తీర్పు రిజర్వులో సుశాంత్‌కు విషం ఇచ్చారని, గొంతు నులిమి చంపారని చేసిన ఆరోపణలను ఏయిమ్స్ వైద్య బృందం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు తమ మెడికో లీగల్ ఒపీనియన్‌ను న సీబీఐకు సమర్పించారు. సుశాంత్ పోస్ట్ మార్టం, అటాప్సీ రిపోర్టులను ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు సమగ్రంగా విశ్లేషించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారు. ఇది ఆత్మహత్య కేసే తప్ప, మర్డర్ కేసు కాదని ఘటనా స్థలం వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా వెల్లడైందన్నారు. 45 రోజుల పాటు ఢిల్లీ ఎయిమ్స్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చెందిన నలుగురు డాక్టర్ల బృందం అనేక కోణాలలో దర్యాప్తు చేసి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో సుశాంత్ ఆత్మహత్య కేసు కోణంలో ఇక సీబీఐ దీన్ని దర్యాప్తు చేయనుంది. చదవండి: ప్లీజ్ ఆ వీడియో తొలగించండి: అంకిత -
ఢిల్లీ: ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
-
కరోనా వ్యాక్సిన్ : ఎయిమ్స్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్నవేళ తొలి దేశీయ వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రధాన ఆసుపత్రిలలో హ్యూమన్ ట్రయిల్స్ ప్రారంభం కాగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సంస్థ ఆల్ ఇండియా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు కూడా ఎథిక్స్ అనుమతి లభించింది. (కరోనా వ్యాక్సిన్.. వాలంటీర్‌కు తొలి డోస్) కోవిడ్-19 టీకా పరీక్షలకు సంబంధించిన వాలంటరీ ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నామని, సంబంధిత వాలంటీర్ల ఆరోగ్య పరీక్షలను ప్రారంభించామనీ ఎయిమ్స్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ వెల్లడించారు. ఇప్పటికే కొంతమంది వాలంటీర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని రాయ్ తెలిపారు. మొదటి దశలో, 375 వాలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు. వీరిలో గరిష్టంగా 100 మంది ఎయిమ్స్ నుంచే ఉండనున్నారు. కాగా ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను రూపొందించింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను ఆగస్టు15నాటికి అందుబాటులోకి తీసుకురావాలనిఐసీఎంఆర్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఎయిమ్స్ సహా దేశంలోని 13 ఆస్పత్రులలో హ్యూమన్ ట్రయల్స్‌ను వేగవంతం చేయనున్నారు. హైదరాబాద్‌లో నిమ్స్‌లో ఈ పరీక్షలు నేడు( సోమవారం) ప్రారంభమైనాయి. పట్నాలోని ఎయిమ్స్‌లో చిన్నమోతాదులో తొమ్మిదిమందికి ట్రయల్స్ గతవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు.ఢిల్లీలోని తన నివాసంలో ఉండగా, ఆదివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో, హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు. వెంటనే వైద్యులు, హృద్రోగ విభాగంలో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ కార్డియో థొరాసిక్ విభాగం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన అవయవాలన్నీ సరిగానే పనిచేస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2009లో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. ఆర్థికవేత్తగా ప్రఖ్యాతిగాంచిన మన్మోహన్ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా దేశానికి సేవలందించారు. మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు ట్వీట్ చేశారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. (చదవండి: రైలు ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్) Delhi: Former Prime Minister Dr Manmohan Singh has been admitted to All India Institute of Medical Sciences (AIIMS) after complaining about chest pain (File pic) pic.twitter.com/a38ajJDNQP — ANI (@ANI) May 10, 2020 -
కరోనా : ఇంటికి దూరమైన డాక్టర్
సాక్షి, ఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరోనా ముప్పు బారిన పడినవాళ్లకు వైద్య చికిత్స అందిచడం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. కొంతమంది కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ తమ కర్తవ్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు డాక్టర్ అంబిక. ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో పనిచేస్తున్న డాక్టర్ అంబిక కోవిడ్ బాధితులకు వైద్యం అందిస్తూ గత కొన్ని రోజులుగా ఇంటికి దూరమైయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ "ఈ కష్టకాలంలో కుటుంబసభ్యులు నాకు ఎంతో అండగా నిలుస్తున్నారు. వాళ్లను చాలా మిస్ అవుతున్నా. కానీ ఇంటికి వెళ్లలేని పరిస్థితి. రోజు ఎంతోమందికి చికిత్స అందిస్తున్నాం. నా వల్ల వాళ్లకు ఏమైనా అనారోగ్యం తలెత్తితే ఆ బాధ నాకు ఎప్పటికీ ఉండిపోతుంది". అని డాక్టర్ భావేద్వేగానికి లోనయ్యారు. -
మూడోదశకు కరోనా వైరస్ : ఎయిమ్స్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్యా నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా పలు కీలక విషయాలను వెల్లడించారు. దేశంలో పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ రెండో దశను దాటి మూడో దశకు చేరుకుందని ప్రకటించారు. అయితే మూడో దశ దేశ వ్యాప్తంగా కేవలం కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే ఉందని తెలిపారు. (మూడో దశకు సిద్ధంగా ఉండండి) సోమవారం ఓ కార్యక్రమంలో డాక్టర్ రణ్‌దీప్ మాట్లాడుతూ.. ‘దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరగడం ఆందోళనకరం. పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ (లోకల్ కాంటాక్ట్) ద్వారా వైరస్ సోకడాన్ని గుర్తించాం. దీనిని వైరస్ మూడోదశగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దశ దేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే విస్తరించింది. దేశ వ్యాప్తంగా అత్యధిక భాగం కేవలం రెండోదశలో ఉండంటం కొంత ఉపశమనం కలిగించే అంశం. అయితే మూడోదశ అనేది మన దేశంలో ప్రస్తుతం ప్రారంభదశలోనే ఉంది. దానిని అదుపుచేయడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నాం. దానిని ఎంత త్వరగా అరికడితే అంతమంచింది. లేకపోతే మూడోదశ ఉధృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదు.’ అని అన్నారు. (26 మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లకు కరోనా!) ఇక ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనాల కారణంగానే దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని రణ్‌దీప్ తెలిపారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించడం కష్టతరమైనప్పటికీ.. ప్రభుత్వాలు చర్యలు సఫలమైయ్యాయని పేర్కొన్నారు. వైరస్ కట్టడికి వైద్యులకు ప్రజలు సహకరించాలని కోరారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తివేయడం గురించి సరైన నిర్ణయం చెప్పలేమని, ఏప్రిల్ 10 తరువాత పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పిస్తామని స్పష్టం చేశారు. కాగా సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా 4వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 109కి చేరింది. -
ప్రాక్టీస్ చేస్తుండగా బాణం గుచ్చుకోవడంతో..
న్యూఢిల్లీ : ఖేలో ఇండియా క్రీడల సందర్భంగా గురువారం 12 ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి శివాంగిని గొహేన్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పారపాటుగా ఒక బాణం వచ్చి ఆమె మెడకు గుచ్చుకుంది. దీంతో ఆమెను గుహావటిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండడంతో అక్కడి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రూమా సెంటర్‌కు తరలించినట్లు స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాప్) పేర్కొంది. 'ఈరోజు(శుక్రవారం) ఉదయం 8గంటల ప్రాంతంలో శివాంగిని జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆమెను అబ్జర్వేజన్‌లో ఉంచామని, చికిత్సకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు' ఎయిమ్స్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ అమిల్ లత్వాల్ పేర్కొన్నారు. శాయ్ అథారిటీ సెక్రటరీ శ్యామ్ జులానియా మాట్లాడుతూ.. గురువారం అస్సాంలోని దిబ్రూఘర్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పొరపాటున ఒక బాణం వచ్చి శివాంగిని మెడకు గుచ్చుకుంది. ఆమె పరిస్థితి కొంత విషమంగా మారడంతో ఎయిమ్స్ ట్రూమా సెంటర్‌కు తరలించాము.శివాంఘి కోలుకునేవరకు ఆమెకయ్యే వైద్య ఖర్చులన్నింటిని శాయ్ భరించనుందని స్పష్టం చేశారు. కాగా ఖేలో ఇండియా క్రీడలు ఈరోజు(జనవరి 10) నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22 వరకు జరగనునన్న ఈ పోటీలు మొత్తం 20 విభాగాల్లో నిర్వహించనున్నారు. దాదాపు 6500 మంది అథ్లెట్లు అండర్-17, అండర్-21 కేటగిరీల్లో పోటీ పడనున్నారు. -
అందుకే వాళ్లంతా మరణించారు!
జైపూర్ : ఢిల్లీ నుంచి ఆరుగురు వైద్యుల బృందం శనివారం రాజస్తాన్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలోని కోటా జిల్లాలోని జేకేలోన్ పిల్లల ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా శిశువులు మరణిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించడానికి ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఆరుగురు డాక్టర్లు ఆసుపత్రిని సందర్శించారు. గత డిసెంబర్ నెలలో 107 మంది శిశువులు మృత్యువాత పడగా కేవలం 23, 24 తేదీల్లో వంద మంది పిల్లలు జన్మిస్తే ..వారిలో పది మంది మరణించడం గమనార్హం. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడం, వైద్య పరికరాల కొరత వల్లే వీరంతా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. అదే విధంగా కోటా నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నలోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆసుపత్రిని సందర్శించి.. మృత శిశువుల తల్లిదండ్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగు పరచడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి రెండు సార్లు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఇక శిశువుల మరణాల విషయాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. శిశువుల మరణాలను సంబంధించి నాలుగు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. కేంద్ర కమిషన్ సైతం ఆసుపత్రులలో ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాల్లో 50 శాతానికి పైగా పనికిరానివని, ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న ఆక్సీజన్ సరఫరాతో సహా ప్రాథమిక సదుపాయాలు లేవని కమిషన్ నివేదిక ఇచ్చింది. మరోవైపు... గతేడాదితో పోలిస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉందని రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం 2019 సంవత్సరంలో 963 మంది పిల్లలు జెకెలోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించగా, అంతకుముందు ఈ సంఖ్య 1,000 కంటే ఎక్కువగా ఉందని తేలింది. ఇదిలావుండగా ఆసుపత్రిలోని శిశువులు మరణానికి కారణమైన బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ నేత హరీష్ రావత్ శనివారం అన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. గత ఐదేళ్లుగా బీజేపీ రాష్ట్రంలోని వైద్య సదుపాయాలను నాశనం చేసిందని, ఇప్పుడు తమ పార్టీ దాన్ని వాటిని మెరుగుపరుస్తోందని రావత్ పేర్కొన్నారు. -
హైకోర్టు రిజిస్ట్రార్‌కు రీ పోస్ట్‌మార్టం రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు నిందితుల మృతదేహాలకు చేసిన రీ పోస్ట్‌మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ రిజిస్ట్రార్‌కు చేరుకుంది. మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం నిర్వహించిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు మంగళవారం ప్రిలిమినరీ రిపోర్టుతో పాటు చిత్రీకరించిన వీడియో సీడీని అందజేశారు. కాగా ఢిల్లీ వెళ్లిన తరువాత పూర్తిస్థాయి రిపోర్టును అందజేస్తామని ఈ మేరకు ఎయిమ్స్ వైద్య బృందం హైకోర్టుకు నివేదించింది. చదవండి: ‘మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి’ -
ముగిసిన రీ పోస్టుమార్టం
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్‌పేట: పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన దిశ నిందితుల మృతదేహాలకు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం సోమవారం గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించింది. మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, నవీన్ కుమార్, చెన్నకేశవుల మృతదేహాలను అనువణువు పరిశీలించింది. డాక్టర్ సుధీర్ గుప్తా, ఆదర్శ్ కుమార్, అభిషేక్ యాదవ్, వరుణ్ చంద్రాలతో కూడిన వైద్య బృందం సుమారు నాలుగు గంటలపాటు ఈ ప్రక్రియ చేపట్టింది. పోలీసు బందోబస్తు, కుటుంబ సభ్యుల సమక్షం లో నిర్వహించిన పోస్టుమార్టం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించింది. రీ పోస్టుమార్టం నివేదిక ను రెండు రోజుల్లో కోర్టుకు అందజేయనుంది. గాంధీ వైద్యులను దూరంగా ఉంచి... హైకోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్ వైద్య బృందం సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకుంది. తొలుత గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌తో సమావేశమై మొదటి పోస్టుమార్టం నివేదికపై ఆరా తీసింది. అయితే ఆ నివేదిక తమ వద్ద లేదని, కోర్టుకు సమర్పించినట్లు డాక్టర్ శ్రవణ్ చెప్పిన విషయాన్నీ రికార్డు చేసుకుంది. అలాగే మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి అభ్యంతరాలను తెలుసుకుంది. పోస్టుమార్టంలో ఏ మృతదేహానికి ఎన్ని గాయాలున్నాయి? ఏ భాగంలో ఎన్ని బుల్లెట్లు తగిలాయి? ఇతర గాయాలేమైనా ఉన్నాయా? వంటి అంశాలను గుర్తించేందుకు ఆయా మృతదేహాలకు వైద్య బందం ఎక్సరే తీసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు రీ పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం సమయంలో ఎయిమ్స్ వైద్యులు ఎవరినీ లోపలకు రానివ్వలేదు. పోస్టుమార్టం ప్రక్రియ అనంత రం మృతదేహాలను పోలీసులకు అప్పగించగా వారు మృ తుల బంధువులకు అప్పగించారు. ఆపై నాలుగు పోలీసు వా హనాల్లో మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించారు. గంటన్నరలో అంత్యక్రియలు పూర్తి... సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘దిశ’నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు వారి స్వస్థలమైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాల్లో ముగిశాయి. ఎన్కౌంటర్లో మరణించిన దాదాపు 18 రోజుల తర్వాత ఇళ్లకు చేరుకున్న తమ బిడ్డల మృతదేహాలను చూసి మృతుల తల్లిందండ్రులు, కుటుంబీకులు కన్నీంటి పర్యంతమయ్యారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మృతదేహాలు వారి ఇళ్లకు చేరగా అప్పటికే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్న కుటుంబీకులు అరగంటలోపే శవయాత్రలు ప్రారంభించారు. రాత్రి ఏడున్నర గంటలకు మృతదేహాలను వారివారి పొలాల్లోనే ఖననం చేశారు. అవివాహితులైన శివ, నవీన్ ఇళ్ల ముందు పందిళ్లు వేసిన వారి కుటుంబ సభ్యులు ముందుగా తమ సంప్రదాయాల ప్రకా రం కత్తితో పెళ్లి చేశారు. తర్వాత మృతదేహాలను ట్రాక్టర్లలో వారి పొలాలకు తరలించారు. చెన్నకేశవులు మృతదేహానికి పాడె కట్టి శవయాత్ర నిర్వహించారు. శివ, నవీన్, చెన్నకేశవులును గుడిగండ్లలో... ఆరీఫ్‌ను జక్లేర్‌లో ఖననం చేశారు. చెన్నకేశవులు భార్య రేణుక తన భర్త మృతదేహాన్ని పట్టుకొని భోరున విలపించింది. ఆరీఫ్ ఇంటి పక్కనే ఉన్న మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు.. ముస్లింల శ్మశాన వాటిక (ఖబ్రస్తాన్)లో ఖననం చేశారు. -
‘మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి’
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసులోని నలుగురు నిందితుల మృతదేహాలకు సోమవారం ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు సుమారు నాలుగు గంటలకు పైగా రీ పోస్టుమార్టం తంతు పూర్తి చేశారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులు తయారు చేసిన నేటి పోస్టుమార్టం నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామని ఈ మేరకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రవణ్‌కుమార్ తెలిపారు. మరికాసేపట్లో మృతదేహాలను తరలించే అవకాశం ఉంది. నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఇప్పటికే గాంధీ వైద్యులు రెండు ప్రత్యేక అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఇక రెండు రోజుల్లో రీ పోస్టుమార్టం నివేదికను సీల్ట్ కవర్లో హైకోర్టు రిజిస్టార్కు అప్పగించనున్నటట్లు ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు పేర్కొన్నారు. -
నేడు ‘దిశ’ నిందితుల రీ పోస్టుమార్టం
సాక్షి, హైదరాబాద్: చటాన్‌పల్లి ఎన్కౌంటర్లో మరణించిన ‘దిశ’అత్యాచార నిందితుల మృతదేహాలకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మార్చురీలో సోమవారం రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు చెందిన ముగ్గురు సీనియర్ ఫోరెన్సిక్ వైద్యులు ఆదివారం నగరానికి చేరుకున్నారు. ఈ బృందం లో ఎయిమ్స్ ఫోరెన్సిక్ అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా, డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్ ఉన్నారు. వారికి సహాయకుడిగా డాక్టర్ వరుణ్ చంద్ర వ్యవహరిస్తారు. ఈ బృందం సోమ వారం ఉదయం 9 గంటలకు రీ పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తారు. నాలుగు మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి చేసేందుకు సుమారు 6 గంటల సమయం పట్టనుంది. రీ పోస్టుమార్టం ముగిసిన వెంటనే సాయంత్రం 4 గంటలకు నివేదికతోపాటు వీడియో దృశ్యాలను పెన్‌డ్రైవ్‌లో కోర్టుకు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టా రు. రీ పోస్టుమార్టం ముగిసిన తర్వాత మృతదేహాలను సంబంధిత కుటుంబసభ్యులకు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకువెళ్లేటప్పటికే రాత్రి అవుతుందని, అప్పుడు అంత్యక్రియలు జరిపే అవకాశం ఉండదని కుటుంబ సభ్యులు తెలిపితే రీ పోస్టుమార్టం చేసిన మృతదేహాలను మళ్లీ మార్చురీలోనే భద్రపరిచి, మంగళవారం ఉదయం అందజేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. దిశ అత్యాచార నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో, ఇతర మృతదేహాలకు చేయాల్సిన పోస్టుమార్టం ప్రక్రియ చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. గాంధీ మార్చురీ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగనవార్ నేతృత్వంలో గోపాలపురం ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, సుమారు వంద మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులతో గాంధీ మార్చురీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. -
‘దిశ’ నిందితులకు రీ పోస్టుమార్టం
సాక్షి, హైదరాబాద్ : ఎన్కౌంటర్లో మరణించిన దిశ అత్యాచార నిందితుల మృతదేహాలకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులతో తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని ముగ్గురు సీనియర్ ఫోరెన్సిక్ వైద్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి. నలుగురి మృతదేహాలకు ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పోస్టుమార్టం నిర్వహిం చాలి. మృతదేహాల వారీగా నివేదికివ్వాలి. కమిటీని తక్షణమే పంపాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎయిమ్స్‌ను కోరాలి. వైద్యుల కమి టీకి ప్రయాణ ఖర్చులు, బస మొదలైన వాటిని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. పోస్టుమార్టం నిర్వహించేటప్పుడు వీడియో చిత్రీకరణ చేయాలి. దాన్ని సీడీ లేదా పెన్‌డ్రైవ్‌లో భద్రపరిచి ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అందజేయాలి. రెండోసారి పోస్టుమార్టం పూర్తి చేశాక మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు పోలీ సుల సమక్షంలో గాంధీ ఆస్పత్రి సూపరింటెం డెంట్ అప్పగించాలి. ఎన్కౌంటర్లో వినియోగించిన రివాల్వర్ వంటి ఆయుధాలు, లాగ్ రిజిస్టర్, పోలీసు వాహనాల కదలికల రిజిస్టర్ మొదలైన వాటిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్వాధీనం చేసుకుని హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలి. సిట్ ఇచ్చే వాటిపై నివేదికను, పోస్టుమార్టం నివేదికలను సుప్రీం కోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్‌కు ప్రభుత్వ అధికారులు అందజేయాలి’అని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శనివారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవాలు వెలుగులోకి రావాలి.. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు మరణిస్తే.. సీఆర్పీసీలోని 176 (1)(ఎ) సెక్షన్ కింద జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లేదా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మాత్రమే ఆ ఘటనపై విచారణ చేయాలని, అయితే చటాన్‌పల్లి ఎన్కౌంటర్ తర్వాత ఆర్డీవో విచారణ చేపట్టినట్లు ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో చెప్పడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి. ప్రజలకు నిజం ఏంటో తెలియాలి. అసలు ఏం జరిగిందో చట్టప్రకారం తేల్చాలి’అని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్కౌంటర్ ఘటనపై కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ (ఆధారాల సేకరణ)పై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఈ నెల 17న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కె.సజన ఇతర మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజాసంఘాలు సంయుక్తంగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై శనివారం హైకోర్టు విచారణ జరిపింది. దిశ హత్యాచార ఘటనపై ప్రజాగ్రహం వ్యక్తం కావడంతో ‘తక్షణ న్యాయం’పేరుతో నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులను ఎన్కౌంటర్లో హతమార్చారని, సీబీఐ దర్యాప్తు చేసే ఉత్తర్వులు జారీ చేయాలని సజన, ఇదే మాదిరిగా మరో ఐదు పిల్స్ కూడా దాఖలయ్యాయి. మృతదేహాలు సగం పాడయ్యాయి.. ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.శ్రవణ్ కుమార్ స్వయంగా హాజరై ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రంగా ఉంచామని, ఇప్పటికే మృతదేహాల అంతర్గత భాగాలు 50 శాతం వరకు చెడిపోయాయని, మరో ఐదారు రోజులు ఉంచితే మృతదేహాల బయట కూడా చెడి పూర్తిగా పాడైపోతాయని చెప్పారు. మైనస్ 5 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చేందుకు దేశంలో ఎక్కడా వసతుల్లేవని తెలిపారు. 2 నుంచి 4 డిగ్రీల మధ్య మృతదేహాల్ని భద్రపరిచామన్నారు. వద్దంటూనే ఒప్పుకున్న ప్రభుత్వం ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. హైకోర్టు ఆదేశాల మేరకే నలుగురి మృతదేహాలకు గాంధీ ఆస్పత్రి వైద్య నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించామని, కోర్టు ఆదేశాల మేరకే మృతదేహాల్ని భద్రపర్చామని, మళ్లీ పోస్టుమార్టం చేయాల్సిన అవసరం లేదన్నారు. రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయిస్తే రాష్ట్రంలో ఉన్న నిష్ణాతులైన ఫోరెన్సిక్ వైద్య నిపుణులతో నిర్వహిస్తే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉంటుందన్నారు. ఒకవేళ రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని ధర్మాసనం నిర్ణయిస్తే అందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ఏజీ చెప్పారు. కోర్టుకు సహాయకారిగా నియమితులైన సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్‌రెడ్డి వాదిస్తూ.. ఎన్‌కౌంటర్‌పై సందేహాలు, అనుమానాలు ఉన్నందున రాష్ట్రానికి సంబంధం లేని వైద్యులతో స్వతంత్రంగా రీపోస్టుమార్టం చేయిస్తే ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరుగుతుందని చెప్పారు. ఎన్కౌంటర్ బోగస్.. పిటిషనర్ సజన తరఫు సుప్రీంకోర్టు న్యాయవాది వింద్రా గ్రోవర్ వాదిస్తూ.. ఇవి ప్రభుత్వ అధీనంలో జరిగిన హత్యలని అభివర్ణించారు. పిటిషనర్లు మహిళలు, బాలికల హక్కుల గురించి పోరాడుతున్నారని, హత్యాచార ఘటనలపై ఆందోళనలు చేస్తారని, అయితే దిశ హత్యాచార కేసులో నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడాలని కోరుకుంటున్నారని వివరించారు. తక్షణ న్యాయం పేరుతో చట్టాలను చేతుల్లోకి తీసుకున్నప్పుడు మౌనంగా ఉంటే అరాచకాలకు తెర తీసినట్లవుతుందని పేర్కొన్నారు. ఎన్కౌంటర్ ఘటనపై ఆధారాల సేకరణ, మృతదేహాల అప్పగింత అంశంపై హైకోర్టు ఉత్తర్వులివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, మృతదేహాలకు రెండోసారి పోస్టుమార్టం చేస్తేనే ఆధారాలు సేకరించినట్లు కాదని చెప్పారు. నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా ఉన్నత స్థాయి శిక్షణ పొందిన పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారని, ఆ పోలీసులు అందరి దగ్గర ఆయుధాలు ఉంటే నిరాయుధులైన నిందితులు వాటిని లాక్కుని కాల్పులు జరపబోతే పోలీసులు ఎన్కౌంటర్ చేశామని చెప్పడం కట్టు కథేనని వివరించారు. ఎన్కౌంటర్ జరిగాక సీనియర్ పోలీసులు, మంత్రులు సైతం ఘనకార్యం జరిగినట్లుగా స్పందించి వేడుకలు చేసుకున్నారని, తక్షణ న్యాయం పేరుతో పౌరహక్కుల్ని కాలరాశారని చెప్పారు. ఏం జరిగిందంటే.. దిశ హత్యాచార ఘటన తొండుపల్లి టోల్గేట్ సమీపంలో నవంబర్ 27న జరిగింది. ఘటనా స్థలానికి ఈ నెల 6న నిందితుల్ని పోలీసులు తీసుకువెళ్తుండగా చటాన్‌పల్లిలో ఎన్కౌంటర్ జరిగింది. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అదే రోజే సాయంత్రం పలు మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు హైకోర్టుకు ఫిర్యాదు చేశాయి. దీనిని పిల్‌గా పరిగణించిన హైకోర్టు అదే రోజు రాత్రి న్యాయమూర్తి తన నివాసంలో ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమై విచారణ జరిపింది. అప్పటికే మృతదేహాలకు మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో గాంధీ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారు. ఇదే సమయంలో మృతదేహాల్ని భద్రంగా ఉంచాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత సుప్రీం కోర్టులో నేరుగా పిల్స్ దాఖలు కావడంతో ఎన్కౌంటర్ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ విచారణకు ఆదేశాలు వెలువడ్డాయి. హైకోర్టు సహా అన్ని రకాల విచారణలపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో మృతదేహాలు పాడవ్వకుండా మహబూబ్‌నగర్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
ఎయిమ్స్ పరీక్షలో దుబ్బాక డాక్టర్‌కు ఫస్ట్ ర్యాంక్
దుబ్బాక టౌన్: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ (ఎయిమ్స్) నిర్వహించిన న్యూరాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రవేశపరీక్షలో సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన డాక్టర్ బిల్ల సృజన జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 2020 ప్రవేశాలకు సంబంధించి ఎయిమ్స్ మంగళవారం రాత్రి ఈ ఫలితాలను ప్రకటించింది. డాక్టర్ సృజన దుబ్బాక పట్టణానికి చెందిన సుధాకర్, సకన్యల పెద్ద కుమార్తె. సుధాకర్ తెలంగాణ సెక్రటేరియట్ ప్లానింగ్ విభాగంలో రీసెర్చ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సృజన భర్త డాక్టర్ ప్రణీత్ ఢిల్లీ ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సృజన ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, గాంధీ ఆసుపత్రిలో ఎండీ పూర్తి చేశారు. -
రేపు అరుణ్ జైట్లీ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జైట్లీ మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని కైలాష్ కాలనీలోని నివాసానికి తరలించారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సందర్శనార్థం రేపు ఉదయం వరకూ నివాసంలోనే జైట్లీ పార్థివదేహాన్ని ఉంచుతారు. అనంతరం ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పార్టీ శ్రేణుల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచుతారు. రేపు సాయంత్రం నిగమ్‌బోధ్ ఘాట్‌లో జైట్లీ అంత్యక్రియలు నిర్వహిస్తారు. అనారోగ్య కారణాలతో ఈ నెల 9న జైట్లీ ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. చదవండి: అరుణ్ జైట్లీ అస్తమయం -
అరుణ్ జైట్లీ అస్తమయం
సాక్షి, న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈనెల 9న జైట్లీ ఎయిమ్స్‌లో చేరగా.. 20వ తేదీ నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. 1952, డిసెంబర్ 28న న్యూఢిల్లీలో జైట్లీ జన్మించారు. ఆయనకు భార్య సంగీత, కుమారుడు రోహన్, కూతురు సోనాలీ ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 12.07 నిముషాలకు అరుణ్ జైట్లీ మరణించారని ఢిల్లీ ఎయిమ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. (చదవండి : వకీలు నుంచి విత్తమంత్రిగా ఎదిగి..) విద్యార్థి సంఘం నాయకుడిగా.. ఢిల్లీ వర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన జైట్లీ రాజకీయాల వైపు అడుగులేశారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. మోదీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. జైట్లీ హయాంలోనే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి సంస్కరణలను కేంద్రం తీసుకొచ్చింది. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను విలీనం చేశారు. గత మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ.. అమెరికాలోనూ దీర్ఘకాలంపాటు చికిత్స తీసుకున్నారు. గతేడాది కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. -
మరింత విషమంగా జైట్లీ ఆరోగ్యం..!
సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) ఆరోగ్యం మరింత విషమించింది. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు పడుతున్నారని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి శనివారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈనెల 9న జైట్లీ ఎయిమ్స్‌తో చేరగా.. 20వ తేదీ నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. -
ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, న్యూడిల్లీ : ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డు సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 34 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్రం చేస్తున్నారు. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆస్పత్రిలో మంటలు వ్యాపించినట్లు సమాచారం. భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో మొదటి అంతస్తులో చికిత్స పొందుతున్న రోగులను మరో చోటుకు తరలించారు. అయితే ఇప్పటివరకు మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇదే ఆస్పత్రిలో బీజేపీ సీనియర్‌నేత అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారని, సహాయక చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
సుష్మాస్వరాజ్: ఏబీవీపీ నుంచి కేంద్ర మంత్రిగా..
బీజేపీ సీనియర్ నేత, విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) ఇక లేరు. గుండెపోటుతో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుష్మా మృతితో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. బీజేపీ అగ్రనేతలంతా ఢిల్లీ ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. విద్యార్థి సంఘం నాయుకురాలిగా రాజకీయ అరంగ్రేటం చేసిన ఆమె.. అనతికాలంలోనే దేశరాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు సుష్మా. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా...మంచి మనసున్న నాయకురాలిగా ప్రజలకు దగ్గరయ్యారు. మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఆమె చేసిన సహాయాలే. ప్రధాని మోదీ తర్వాత అంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగిన సుష్మా స్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. సుష్మాస్వరాజ్ ఏబీవీపీ నాయకురాలిగా 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి..1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1996, 1998లో వాజ్‌పేయి మంత్రివర్గంలో పనిచేశారు. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో బళ్లారిలో సోనియాపై పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ.. ఏకంగా కాంగ్రెస్ అధినేత్రిపై పోటీచేసి దేశం దృష్టిని ఆకర్షించారు. 2004 ఏప్రిల్‌లో సుష్మా స్వరాజ్ ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. జనవరి 2003 నుంచి మే 2004 వరకు అదనంగా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు పార్లమెంటరీ వ్యవహారాలు బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో 2014 మే 26న కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. విదేశాంగ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసి అంతర్జాతీయంగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. -
‘అమిత్ షాకు అందుకే స్వైన్‌ఫ్లూ సోకింది’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న అమిత్ షా ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచినందుకే అమిత్ షాకు స్వైన్‌ఫ్లూ సోకిందని వ్యాఖ్యానించారు. సంకీర్ణ సర్కార్‌ను కూలదోసే చర్యలు విరమించకపోతే ఆయనకు జ్వరంలో పాటు డయేరియా ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసిన బీజేపీ నేతలు వారిని ముంబై తరలించారని, వారికి బీజుఏపీ, ఆరెస్సెస్ కార్యకర్తలను కాపలగా ఉంచారని హరిప్రసాద్ ఆరోపించారు. జేడీయూ-కాంగ్రెస్ సర్కార్‌ను కూలదోయాలని ప్రయత్నించడంతోనే అమిత్ షాకు ఈ వ్యాధి సోకిందని ధ్వజమెత్తారు. మరోవైపు స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న అమిత్ షా కోలుకున్నారని, ఒకట్రెండు రోజుల్లో ఆయనను ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి చేస్తారని బీజేపీ మీడియా చీఫ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ చెప్పారు. -
టూత్‌బ్రష్ మింగేశాడు..
న్యూఢిల్లీ: గొంతును శుభ్రం చేసుకుంటున్న ఓ వ్యక్తి అనుకోకుండా టూత్‌బ్రష్‌ను మింగేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది జరిగిన రెండు రోజలు తరువాత ఆ వ్యక్తికి ఎండోస్కోపీ నిర్వహించిన ఏయిమ్స్ వైద్యులు 12 సెం.మీల పొడువున్న బ్రష్‌ను అతని పొత్తికడుపు పై భాగం నుంచి బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ సీమాపూరిలో నివాసం ఉంటున్న అవిద్ గతేడాది డిసెంబర్ 8వ తేదీన టూత్‌బ్రష్‌తో గొంతును బాగా శుభ్రం చేయాలని ప్రయత్నిస్తుండగా బ్రష్ గొంతు లోనికి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అవిద్ తనకు కడుపులో నొప్పిగా ఉందంటూ ఓ ఆస్పత్రికి వెళ్లారు. అవిద్ అసలు విషయం చెప్పకపోవడంతో వైద్యులకు అతని కడుపు నొప్పికి గల కారణాలు తెలియలేదు. దీంతో వైద్యులు అతనికి సీటీ స్కాన్ నిర్వహించారు. అందులో అవిద్ కడుపులో ఏదో వస్తువు ఉన్నట్టు తెలింది. అప్పుడు అవిద్ వైద్యులకు అసలు విషయం చెప్పారు. బ్రష్‌ను బయటకు తీయడానికి ఆ ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో అక్కడి వైద్యులు అవిద్ సమస్యను ఏయిమ్స్‌కు రిఫర్ చేశారు. అవిద్కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఏయిమ్స్ వైద్యులు అతని ఉదరభాగంలో టూత్‌బ్రష్ చిక్కుకుని ఉందని.. అది గొంతు లోపలి ఇతర భాగాలకు ఎటువంటి హాని చేయలేదని తేల్చారు. డిసెంబర్ 10వ తేదీన అతని పొత్తికడుపు పైభాగంలో చిక్కుకున్న టూత్‌బ్రష్‌ను ఎండోస్కోపి చికిత్స ద్వారా బయటకు తీశారు. ఈ ఘటనపై ఎయిమ్స్ వైద్యులు ప్రవీణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. చాలా మంది గొంతును శుభ్రం చేసుకోవడానికి టూత్‌బ్రష్ వాడతారని.. కానీ అలా చేయడానికి టంగ్ క్లీనర్ వాడటం మంచిదని తెలిపారు. -
జైట్లీకి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి
-
జైట్లీకి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి
న్యూఢిల్లీ : గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి సోమవారం ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశారు. జైట్లీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్టు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, త్వరగా కోలుకుంటారని తెలిపారు. ఈ సర్జరీ కోసం జైట్లీ శనివారం రోజు ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. నేడు ఉదయం 8 గంటలకు జైట్లీకి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సోదరుడు అపోలో ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ గులేరియా ఈ ఆపరేషన్ చేశారు. సందీప్ గులేరియా జైట్లీ కుటుంబానికి సన్నిహితుడు కూడా. ఈ అనారోగ్య సమస్యతో జైట్లీ వచ్చే వారంలో లండన్‌లో జరుగబోయే 10వ భారత్-అమెరికా ఎకానమిక్, ఫైనాన్సియల్ సదస్సు పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. జైట్లీకి కొన్నేళ్ల క్రితం గుండె సంబంధిత సర్జరీ కూడా అయింది. -
ఎయిమ్స్‌లో.. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’
సాక్షి, న్యూఢిల్లీ : అద్నన్ ఖుర్రమ్ 19 ఏళ్ల యువకుడు. ఎంతటివారినైనా బురిడీ కొట్టించగల ఘనుడు. తన ప్రతిభతో డాక్టర్ సీటు సంపాదించలేకపోయాడు గానీ ప్రొఫెసర్ల కళ్లుగప్పి ఐదు నెలలపాటు ఎయిమ్స్ జూనియర్ డాక్టర్‌గా నటిస్తూ లబ్ది పొందాలని చూశాడు. చివరికి మోసం బయటపడటంతో కటకటాల పాలయ్యాడు. బీహార్ టూ ఢిల్లీ.. బీహార్‌కు చెందిన అద్నన్ ఖుర్రమ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రొఫెసర్లతో పరిచయం పెంచుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎమ్సీ) బిల్లుకు వ్యతిరేకంగా రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్(ఆర్డీఏ) ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్లో ఖుర్రమ్ తనను తాను జూనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా వారికి పరిచయం చేసుకున్నాడు. మోసం బయటపడిందిలా.. ఆర్డీఏ చేపట్టే ప్రతీ నిరసన కార్యక్రమాల్లో, మారథాన్లలో ఖుర్రం చురుగ్గా పాల్గొనేవాడు. అయితే ఆ కారణంగానే అతని మోసం బయటపడింది. మామూలుగా జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు 18 నుంచి 20 గంటల డ్యూటీ ఉంటుంది. డ్యూటీ చేయకుండా ఖుర్రం ఎప్పుడూ బయటే కనిపించేవాడని, దాంతో అతనిపై అనుమానం కలిగిందని డాక్టర్ హర్జీత్ సింగ్ భట్టి తెలిపారు. వెంటనే విద్యార్థుల ప్రవేశ పట్టికతో పాటు స్టైఫండ్ పొందే విద్యార్థుల జాబితా పరిశీలించగా ఖుర్రమ్ పేరు ఎక్కడా కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. ఎయిమ్స్‌లో సుమారు 2 వేల మంది రెసిడెంట్ డాక్టర్లు ఉంటారని.. అందుకే ఖుర్రం మోసాన్ని కనుక్కోలేకపోయామని తెలిపారు. అంతేకాకుండా నిరసనకు మద్దతు తెలిపేందుకు వచ్చే వీఐపీలతో ఫొటోలు దిగడానికి మాత్రమే ఆసక్తి చూపేవాడని పేర్కొన్నారు. అలా రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ వంటి ప్రముఖ వ్యక్తులతో ఫొటోలు దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. జూనియర్ డాక్టర్లుగా చెప్పుకుంటూ తమ కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు పొందారన్నారు. ఖుర్రంను అరెస్టు చేసిన పోలీసులు సెక్షన్ 419(మోసం), సెక్షన్ 468(ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం)ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
నర్సు మృతి.. ఐదుగురు ఎయిమ్స్ వైద్యుల సస్పెన్షన్
సొంత సిబ్బంది విషయంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు సీనియర్ వైద్యులతో పాటు ఇద్దరు జూనియర్ డాక్టర్లపై ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సస్పెన్షన్ వేటు వేసింది. ప్రసవం కోసం చేరిన నర్సు మరణించడంతో ఎయిమ్స్ ఈ చర్య తీసుకుంది. దాంతో ఇప్పుడు నర్సుల యూనియన్లు, రెసిడెంట్ డాక్టర్ల యూనియన్లు పరస్పరం తలపడుతున్నాయి. రాజ్బీర్ కౌర్ (28) ఎయిమ్స్‌లోని మెడిసిన్ డిపార్టుమెంటులో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. ఆమె జనవరి 16న ప్రసవం కోసం ఆస్పత్రిలోని గైనకాలజీ విభాగంలో అడ్మిట్ అయ్యారు. ప్రసవానికి కొద్ది గంటల ముందు శిశువు గుండె కొట్టుకునే వేగం బాగా తక్కువగా ఉందని వైద్యులు గుర్తించారు. శిశువు ప్రాణాలకు ముప్పు ఉండటంతో వెంటనే సిజేరియన్ చేయాలని నిర్ణయించారు. కానీ, అనెస్థటిస్టు ఆలస్యంగా రావడంతో ఆపరేషన్ లేటయింది. ఎట్టకేలకు సిజేరియన్ ఆపరేషన్ చేసినా, మృత శిశువు బయటపడింది, కౌర్‌కు తీవ్రంగా కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. ఆమెకు కార్డియో పల్మనరీ రీససికేషన్ (సీపీఆర్) చేసినా ఫలితం లేకపోవడంతో కౌర్ కోమాలోకి వెళ్లిపోయారని ఎయిమ్స్ నర్సింగ్ యూనియన్ అధ్యక్షుడు హరీష్ కుమార్ కజ్లా చెప్పారు. నొప్పులు రప్పించడానికి కౌర్‌కు బాగా ఎక్కువ మొత్తంలో మందు ఇవ్వడం వల్లే ఆమెకు తీవ్ర అనారోగ్యం వచ్చిందని ఆయన ఆరోపించినా, ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. ఈ విషయమై నిజానిజాలు తెలుసుకోడానికి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డీకే శర్మ అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీని నియమించామని, రెండు రోజుల్లో ప్రాథమిక నివేదిక వస్తుందని ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ అమిత్ గుప్తా తెలిపారు. కాగా ఇప్పటికే ఎనస్థీషియా శాఖకు చెందిన ఇద్దరు జూనియర్ డాక్టర్లు, గైనకాలజీ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ డాక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే వైద్యుల సస్పెన్షన్‌పై రెసిడెంట్ డాక్టర్ల సంఘం తీవ్రంగా మండిపడి, సమ్మె చేస్తామని బెదిరించింది. మరోవైపు ఎయిమ్స్‌కు చెందిన 500 మంది నర్సింగ్ ఆఫీసర్లు ఇప్పటికపే డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తప్పు చేసినవారచిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తాము తమ సహోద్యోగిని కోల్పోయామని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
వీణా వాణీ శస్త్రచికిత్సకు రంగం సిద్ధం
-
వీణా వాణీ శస్త్రచికిత్సకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా వాణీలను శస్త్రచికిత్స ద్వారా విడదీసే ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అఖిల భారత వైద్య విద్యామండలి వైద్యులతో పాటు లండన్ నుంచి వచ్చిన నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శస్త్రచికిత్స ద్వారా వారిని విడదీస్తామంటూ లండన్ వైద్యులు గతేడాది ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారికి ఆపరేషన్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేయాలా లేదా లండన్‌లోనే చేయాలా అన్న దానిపై స్పష్టత రాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. వీణా వాణీలను విడదీసే ఆపరేషన్ విజయవంతమవుతుందా లేదా అన్నదానిపైనా వైద్య నిపుణుల్లో జోరుగా చర్చ సాగుతున్న నేపథ్యంలో గురువారం నాటి ఢిల్లీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆపరేషన్‌కు ముందు వారికి ‘డిజిటల్ సబ్‌స్ట్రాక్షన్ యాంజియో’ పరీక్ష చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. అవిభక్త కవలలను విడదీసే ఆపరేషన్‌కు ముందు వారి మెదడుకు సంబంధించిన సమాచారాన్ని ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. రాజధానిలోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో ఈ రకమైన పరీక్ష నిర్వహించే సదుపాయం ఉంది. ఈ పరీక్ష అనంతరం నివేదికను లండన్ వైద్యుల పరిశీలనకు పంపుతారు. ఈ పరీక్ష ద్వారా అందిన సమాచారం ఆధారంగానే వీరికి శస్త్రచికిత్స తేదీని నిర్ణయిస్తారని వైద్యుడొకరు వెల్లడించారు.