ఏచూరి ప్రజల మనసుల్లో నిలిచిపోతారు: ప్రధాని మోదీ | Leading Light Of The Left: PM Modi Pays Tribute To Sitaram Yechury | Sakshi
Sakshi News home page

Sitaram Yechury: వామపక్షాలకు దిక్సూచీ, ప్రజల మనసుల్లో నిలిచిపోతారు: ప్రధాని మోదీ

Published Thu, Sep 12 2024 8:54 PM | Last Updated on Thu, Sep 12 2024 8:56 PM

Leading Light Of The Left: PM Modi Pays Tribute To Sitaram Yechury

న్యూఢిల్లీ: వామపక్ష దిగ్గజ నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి మరణం పట్ల దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ఆయన పాత్రను కొనియాడుతూ.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు.

ఈ క్రమంలో ఏచూరి మరణంపై ప్రధానమంత్రి మోదీ మోదీ సంతాపం తెలిపారు. ఏచూరి వామపక్ష ఉద్యమానికి దారిదీపం వంటి వారని పేర్కొన్నారు, ఆయన సామర్ధ్యం, వాగ్ధాటి పార్టీలకు అతీతంగా అందరినీ ఆకట్టుకునేదని అన్నారు. ఉత్తమ  పార్లమెంటేరియన్‌గా ఆయన దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ప్రధాని మోదీ.. గతంలో ఏచూరితో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు.
చదవండి: సీతారాం ఏచూరి కన్నుమూత.. జీవిత ప్రస్థానం ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement