న్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి ఆరోగ్యం మళ్లీ విషమించింది. సీపీఎం పార్టీ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 72 ఏళ్ల ఏచూరికి వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతుందని వెల్లడించింది.
‘‘సీతారాం ఏచూరికి తీవ్రమైన శ్వాసకోస ఇన్‌ఫెక్షన్ జరిగింది. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స అందుతున్నా.. పరిస్థితి విషమంగా ఉంది. వైద్యుల బృందం ఏచూరిని నిశితంగా పరిశీలిస్తోంది’’ అని సీపీఎం పార్టీ ఎక్స్ అకౌంట్‌లో పోస్టు పెట్టింది.
కాగా ఆగస్టు 19వ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో వైద్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్ అమర్చారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. దీంతో ఆయన కోలుకుంటున్నారని అంతా భావించారు. ఈలోపే మళ్లీ ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు పార్టీ వెల్లడించింది.
Comrade Sitaram Yechury’s health condition pic.twitter.com/NDPl8HE8K0
— CPI (M) (@cpimspeak) September 10, 2024
ఇదీ చదవండి: కాంగ్రెస్‌తో కటీఫేనా?.. రెండో జాబితా కూడా విడుదల
Comments
Please login to add a commentAdd a comment