critical condition
-
మళ్లీ విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం
న్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి ఆరోగ్యం మళ్లీ విషమించింది. సీపీఎం పార్టీ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 72 ఏళ్ల ఏచూరికి వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతుందని వెల్లడించింది. ‘‘సీతారాం ఏచూరికి తీవ్రమైన శ్వాసకోస ఇన్ఫెక్షన్ జరిగింది. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స అందుతున్నా.. పరిస్థితి విషమంగా ఉంది. వైద్యుల బృందం ఏచూరిని నిశితంగా పరిశీలిస్తోంది’’ అని సీపీఎం పార్టీ ఎక్స్ అకౌంట్లో పోస్టు పెట్టింది.కాగా ఆగస్టు 19వ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో వైద్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్ అమర్చారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. దీంతో ఆయన కోలుకుంటున్నారని అంతా భావించారు. ఈలోపే మళ్లీ ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు పార్టీ వెల్లడించింది. Comrade Sitaram Yechury’s health condition pic.twitter.com/NDPl8HE8K0— CPI (M) (@cpimspeak) September 10, 2024 ఇదీ చదవండి: కాంగ్రెస్‌తో కటీఫేనా?.. రెండో జాబితా కూడా విడుదల -
స్లొవాకియా ప్రధానికి మరో శస్త్రచికిత్స
బ్రాటిస్లావా: హత్యాయత్నానికి గురైన స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోకు శుక్రవారం మరో శస్త్రచికిత్స జరిగింది. 59 ఏళ్ల ఫికో పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రెండు రోజుల క్రితం హండ్లోవా పట్టణంలో ప్రభుత్వ సమావేశం తర్వాత బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తుండగా ఒక దుండగుడు ఫికోపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ను బన్స్కా బి్రస్టికాలోని ఎఫ్.డి.రూజ్వెల్ట్ ఆసుపత్రికి తరలించారు. ఫికోకు సి.టి. స్కాన్ తీశామని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ విషమంగానే ఉందని రూజ్వెల్ట్ ఆసుపత్రి డైరెక్టర్ మిరియమ్ లపునికోవా తెలిపారు. ఫికో స్పహలోనే ఉన్నారని చెప్పారు. శరీరంలో మృత టిçష్యూను తొలగించడానికి శుక్రవారం శస్త్రచికిత్స నిర్వహించినట్లు వెల్లడించారు. -
అత్యంత విషమంగానే ప్రీతి ఆరోగ్యం
-
తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్ రామ్..
సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. తాజాగా హీరో కల్యాణ్ రామ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా..“నా సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ”అంటూ ట్వీట్ చేశారు. నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను . Get well soon and get back to complete health brother. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 28, 2023 -
రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్16 ఆరోగ్యం విషమం
వాటికన్ సిటీ: పోప్ బాధ్యతల నుంచి కొన్నేళ్ల క్రితం తప్పుకున్న బెనెడిక్ట్–16 ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వాటికన్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని పేర్కొన్నాయి. 95 ఏళ్ల బెనెడిక్ట్ చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వార్థక్యం వల్ల పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని వాటికన్ అధికార ప్రతినిధి మాటియో బ్రూనీ తెలియజేశారు. బెనెడిక్ట్ కోలుకోవాలంటూ అందరూ ప్రార్థించాలని పోప్ ఫాన్సిస్ విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. వాటికన్ ఆడిటోరియంలో బుధవారం పోప్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బెనెడిక్ట్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని ప్రకటించారు. పూర్తి వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు. చదవండి: ‘బాంబ్’ కోరల నుంచి బయటపడని అమెరికా.. కనీవినీ ఎరగని విధ్వసం -
ములాయం సింగ్ ఆరోగ్యంపై మోదీ ఆరా.. అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీయూలో చికిత్స పొందుతున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధమని, తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని అఖిలేశ్‌కు ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనారోగ్యంత గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చేరిన 82 ఏళ్ల ములాయం సింగ్‌కు మొదట ప్రవేటు వార్డులో చికిత్స అందించారు వైద్యులు. అయితే అకస్మాతుగా ఆక్సీజన్ స్థాయిలు తగ్గడంతో ఆదివారం మధ్యాహ్నం హూటాహుటిన ఐసీయూకు తరలించారు. దీంతో అఖిలేశ్ సహా ఇతర కుటుంబసభ్యులంతా ఆదివారం సాయంత్రం వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ అఖిలేశ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆస్పత్రి వైద్యులకు కూడా యోగి ఫోన్ చేశారని, అత్యంత మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు పేర్కొన్నాయి. అయితే ములాయం సింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని అఖిలేశ్ యాదవ్ ఎస్పీ కార్యకర్తలకు తెలిపారు. ఆయనను చూసేందుకు ఆస్పత్రికి అభిమానులు భారీగా తరలిరావడంతో ఈ మేరకు ఆదివారం వెల్లడించారు. చదవండి: మోగిన ఎన్నికల నగారా.. 6 రాష్ట్రాల్లో 7 సీట్లకు ఉప ఎన్నిక -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై ఆశా భోస్లే కీలక ప్రకటన
Asha Bhosle rushes to meet sister Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉంది. ఆరోగ్యం క్షీణించడంతో ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు. లతా మంగేష్కర్ పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో హాస్పిటల్ పరిసరాల్లో పోలీసులు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇక లతాజీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని తెలియగానే ఆమె సోదరి, ప్రముఖ గాయని ఆశా భోస్లే హుటాహుటిన బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మేమందరం ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నాం.ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు అని పేర్కొన్నారు. "We hope #Latadidi recovers soon. We are praying for her recovery. Doctors have informed us that she's stable.": #AshaBhosle on #LataMangeshkar's health! Read more here: https://t.co/x9KnspxXxB pic.twitter.com/7ggXJ46ygI — Pune Mirror (@ThePuneMirror) February 5, 2022 -
మళ్లీ విషమంగా సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి..
నైటింగెల్ ఆఫ్ ఇండియా, లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ముంబైలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రి వైద్యుడు ప్రతీత్ సంధాని చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది. ఏఎన్ఐ ప్రకారం 'వెటరన్ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు' అని డాక్టర్ ప్రతీత్ సంధాని పేర్కొన్నారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌కు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధరణ కాగా జనవరి 11న బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ ద్వారా న్యూమోనియా కూడా అటాక్ అయింది. అయితే ఇటీవల లతా మంగేష్కర్ కోవిడ్‌ను జయించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ మంత్రి తెలిపారు. న్యూమోనియా నుంచి కూడా కోలుకున్నట్లు వివరించారు. Veteran singer Lata Mangeshkar's health condition has deteriorated again, she is critical. She is on a ventilator. She is still in ICU and will remain under the observation of doctors: Dr Pratit Samdani, Breach Candy Hospital (file photo) pic.twitter.com/U7nfRk0WnM — ANI (@ANI) February 5, 2022 -
Oscar Fernandes: విషమంగా ఆస్కార్ ఆరోగ్యం
సాక్షి, యశవంతపుర: మంగళూరులో గత ఆదివారం ఇంట్లో జారి పడి ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తల లోపల బలమైన గాయాలై మంగళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. ఐసీయూలో వైద్యమందిస్తున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. -
కొంప ముంచిన ఆర్ఎంపీ వైద్యం.. బాలిక పరిస్థితి విషమం..
సాక్షి, మరిపెడ(మహబూబాబాద్): ఓ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వాహకుడు తన స్థాయికి మించి ఓ బాలికకు వైద్యం చేయడంతో పరిస్థితి విషమంగా మారిన ఘటన మరిపెడ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మరిపెడ మండలం వీరారం గ్రామానికి చెందిన దళిత మైనర్ బాలిక ఇటీవల జ్వరంతో బాధపడుతుండగా ఈనెల 15న మండల కేంద్రంలోని ఓ ప్రైయివేట్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన ఆర్ఎంపీ ఇవ్వాల్సిన డోస్ కంటే హైపర్ యాంటిబయోటిక్ ఇంజక్షన్ ఇచ్చి ఇంటికి పంపించాడు. మూడు రోజుల తర్వాత బాలికకు శరీరంపై బొబ్బలు వచ్చి అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యలు పరీక్షించి ఓవర్ డోస్ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే పరిస్థితి వికటించినట్లు వెల్లడించారు. అక్కడ చేసిన వైద్యానికి సుమారు రూ.లక్ష కావడంతో ఇకపై స్థోమతలేని తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకొచ్చారు. ఆదివారం బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆర్ఎంపీని నిలదీయగా.. విషయం బయటకు పొక్కడంతో చేసేది లేక అతను మధ్యవర్తుల ద్వారా రూ.2 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. చదవండి: Covid-19: పెరుగుతున్న గుండె కుడివైపు వైఫల్య సమస్యలు -
రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన నటి.. పరిస్థితి విషమం
వాషింగ్టన్ : హాలీవుడ్ నటి లీసా బెన్స్(65) రోడ్డు ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం..లీసా బెన్స్ వాషింగ్టన్‌లోని లింకన్ సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఆమెను ఢీకొట్టింది. దీంతో నటి లీసాకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. బైక్‌పై వచ్చిన వ్యక్తి అతి వేగంగా ప్రయాణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రమాదం తర్వాత బైకుని ఆపకుండా వెళ్లిపోయాడని లాసా మేనేజర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. అయితే బాధితుడి వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు. ఘటన జరిగి రెండు రోజులు అయినా ఇంకా అతడిని అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఇక ‘గాన్ గర్ల్’ సినిమాతో ఫేమస్ అయిన లీసా బెన్స్ ఆ తర్వాత పలు సహాయక పాత్రలతో పాట పలు టీవీ ఫోలలో కూడా పాల్గొంది. చదవండి : నాలుగేళ్లుగా డేటింగ్: పెళ్లి జరగదంటున్న నటుడు బ్రాడ్‌పిట్‌కి అనుకూలంగా తీర్పు.. ఇక విడాకులే! -
ప్రాణాపాయ స్థితిలో గాయకుడు జై శ్రీనివాస్
సాక్షి, ఆదిలాబాద్: చిన్నప్పటి నుంచీ పాటే ప్రాణంగా పెరిగాడు. ఎంతో కష్టపడి సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. దేశభక్తి పాటతో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం కరోనా బారిన పడడంతో రూ.11లక్షలకు పైగా వైద్యం కోసం ఖర్చు చేశాడు. ఆర్థిక పరిస్థితి ఛిన్నాబిన్నం కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. మందమర్రి మూడో జోన్‌కు చెందిన నేరడికొమ్మ శ్రీనివాస్ ఉరఫ్ జై శ్రీనివాస్ స్థానిక సింగరేణి హైస్కూల్లో 1993లో పదో తరగతి వరకు చదివాడు. ఆయన తండ్రి మందమర్రి ఏరియాలోని స్టోర్‌లో క్లర్క్‌గా విధులు నిర్వర్తించి 15ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందాడు. అక్క చైతన్య, బావ జితేంద్ర సహకారంతో హైదరాబాద్‌కు వెళ్లాడు. చిన్నప్పటి నుంచి పాటల మీద ఉన్న మక్కువతో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. అవకాశాలు లభించడంతో పలు చిత్రాల్లో పాడాడు. జై సినిమాలోని దేశభక్తి పాట ‘దేశం మనదే తేజం మనదే..’, రాజారాణి సినిమాలో ‘ఓ బేబి ఓరకనులతో..’, వీధి సినిమాలో ‘నా చిట్టితల్లి..’, బోనాల పాట ఢమ ఢమ డప్పుల మోత, తెలంగాణ జననీ తదితర అనే పాటలతో గుర్తింపు పొందాడు. నేరడికొమ్మ శ్రీనివాస్ తన పాటతో ‘జై శ్రీనివాస్’గా మారాడు. సినిమా, దేశభక్తి, జానపద, దైవభక్తి పాటలు పాడి పేరు సంపాదించుకున్నాడు. కరోనాతో ఆసుపత్రిలో.. జై శ్రీనివాస్ గత నెలలో కరోనా బారిన పడ్డాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. ఇప్పటివరకు వైద్యం కోసం కుటుంబ సభ్యులు సుమారు రూ.11లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఇంకా పరిస్థితి విషమంగానే ఉండడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కావడంతో భార్యాపిల్లలు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మానవత్వంతో ముందుకు వచ్చి ఆదుకోవాలని, శ్రీనివాస్ తండ్రి రామాచారి బ్యాంకు అకౌంట్ నంబరు 62107990766, ఐఎఫ్‌సీ కోడ్ N0020308, గూగుల్‌పే నంబర్ 918247641235కు దాతలు ఆర్థికసాయం అందించాలని భార్య స్వాతి, కూతుళ్లు అభిష్ణు, జైత్ర కోరుతున్నారు. చదవండి: ఆర్ఎంపీల అత్యుత్సాహం.. టైపాయిడ్ పేరిట వైద్యం -
కదిలితే చనిపోతుంది.. రోజుకు 22 గంటలు బెడ్‌పైనే..
నెదర్లాండ్స్: డ్రాన్‌టెన్‌కు చెందిన 27 ఏళ్ల సెలెస్ట్ వాస్ వీనెస్ అనే మహిళ అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్ (EDS) అని పేర్కొనే జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతుంది. ఇది వంశపారపర్యంగా సోకే అరుదైన వ్యాధి. దీంతో ఆమె రోజుకు 22 గంటలు మంచంమీదే పడుకుని ఉంటుంది. అయితే ఆమె ప్రత్యేక పైపుల ద్వారా కాల కృత్యాలను తీర్చుకుంటుంది. ఈ వంశపారపర్యం వ్యాధి వలన చర్మం, ఎముకలు, రక్తనాళాలు, అవయవాలకు సంబంధించిన కణజాలాలు తీవ్ర ప్రభావానికి గురౌతాయి. దీని వలన ఆ వ్యక్తిలో కదల్లేని స్థితి ఏర్పడుతుంది. దీంతో మెడ, వెన్నుపూసలు నిటారుగా నిలబడలేవు. కాగా, ఆమె గొట్టాల సహయంతో ద్రవ పదార్థాన్ని ఆహరంగా తీసుకుంటుంది. ఆమె శరీరంలోని కొన్ని భాగాలు కదలకుండా ఉండేందుకు 22 రింగులను తొడిగారు. ఆమె ఎక్కువగా కదిలితే చనిపోయే ప్రమాదం ఉంది. దాంతోనే ఆమె శరీరంలోని పలు భాగాలకు రింగులు అమర్చారు. ఆమె శరీరం సూర్యరశ్మి కిరణాలను కూడా తట్టుకొలేదు. దీంతో ఆమె ఎక్కువ సమయం చీకటిలోనే గడుపుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ ఇంకా ఎన్నిరోజులుంటానో తెలియదు.. శారీరకంగా మానసికంగా కుంగిపోతున్నాను..ఇంకా బతకాలని లేదని బాధపడింది’ ..అయితే స్పెయిన్‌లోని బార్సినాలోని వైద్యులు ఆమె అరుదైన వ్యాధికి చికిత్స అందించడానికి ముందుకొచ్చారు. ఈ ఆపరేషన్‌కు అవసరమైన మొత్తాన్ని క్రౌడ్ ఫండింగ్ సహయంతో సేకరిస్తున్నారు. -
నాయిని ఆరోగ్యం విషమం
ముషీరాబాద్: రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకుని ఇంటికి వస్తారు.. అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. దీంతో పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. దీంతో నాయిని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్ రవి ఆండ్రూస్, మరో డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భార్య, అల్లుడు, మనుమడికి కరోనా.. ఇదిలా ఉండగా నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకింది. ఆమె కూడా బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ ఆసుపత్రిలోనే ఉండి మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు. అలాగే నాయిని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఎలా సోకింది..? లాక్‌డౌన్‌తోపాటు కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఇంటికే పరిమితమైన నాయిని నరసింహారెడ్డి ఇటీవల ముషీరాబాద్‌లో జరిగిన కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొని అభిమానులు అందించిన కేక్‌ను తిన్నారు. అలాగే ఓ మతపెద్ద ఇంటి ప్రహరీ గోడ కూలిన సమయంలో పరామర్శించేందుకు వెళ్లారు. దానికి తోడు ఓ మతపెద్ద సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడే ఎక్కడో నాయినికి కరోనా సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. -
‘ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది’
ముంబై : సినిమాటోగ్రాఫర్ నదీమ్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన భార్య, గాయని పార్వతి తెలిపారు. ప్రస్తుతం నదీమ్ వెంటిలేటర్‌పై ఉన్నారని, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని ఆమె తెలిపారు. నదీమ్ ఖాన్ సోమవారం సాయంత్రం ఇంట్లో మెట్ల మీద నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. దీంతో తల, భుజం, ఛాతికి దెబ్బలు తగలడంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. మంగళవారం ఉదయం అతనికి బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. కాగా నదీమ్ ఖాన్ ప్రముఖ హిందీ కథారచయిత రాహి మసూమ్ రాజా కుమారుడు. నదీమ్ ఖాన్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య మాట్లాడుతూ.. ‘ఆయన ఐసీయులో వెంటిలేటర్‌పై ఉన్నారు. అతను స్పృహలో లేరు. ఆయన స్పందించడానికి 48 నుంచి 72 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. అతను ఎప్పుడు స్పందిస్తారని వేచి చూస్తున్నాం. నదీమ్ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు’. అని పార్వతి తెలిపారు. (‘అది తప్పే నిజాయితీగా ఒప్పుకుంటున్నా’) ‘మేము ఆస్పత్రికి వచ్చినప్పుడు నదీమ్‌కు చిన్న చిన్న గాయలు మాత్రమే అయ్యాయి. అయితే ఇప్పుడవి సీరియస్‌గా మారాయి. ఆసుపత్రిలో అతన్ని ఐసీయూలో కోవిడ్-19 బాధితులతో ఉంచారు. రెండు నెలలుగా అతను లాక్‌డౌన్‌లోనే ఉన్నారు. ఎవరినీ కలవలేదు. వైద్యులు నదీమ్‌కు ర్యాపిడ్ పరీక్షలు, అత్యవసర సర్జరీలు చేశారు. అయితే ఈ ప్రక్రియను నిర్వహించడంలో వైద్యులు ఆలస్యం చేశారు. ఆసుపత్రిలో కరోనా ప్రభావం ఉండటం వల్ల ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. కేవలం అతను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’’ అని పార్వతి భావోద్వేగానికి లోనయ్యారు. కాగా నదీమ్ ఖాన్.. డిస్కో డాన్సర్, జమానా, ఆంధీ-తూఫాన్, ఆగ్ హాయ్ ఆగ్, కింగ్ అంకుల్, గునాహ్ వంటి 40 చిత్రాలకు పైగా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే చంకీ పాండే, ఇందర్ కుమార్, మోనికా బేడి నటించిన తిర్చి తోపివాలే (1998) సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. (రియాజ్..ఇక నరకంలో హాయిగా నిద్రపో’ ) -
అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, న్యూఢిల్లీ : కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 9న ఆస్పత్రిలో చేరిన జైట్లీకి సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్‌లో చేరినప్పటి నుంచి జైట్లీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం ఉదయం జైట్లీని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వాకబు చేశారు. కాగా నరేంద్ర మోదీ తొలి సర్కార్‌లో పలు కీలక శాఖలు నిర్వహించిన 66 సంవత్సరాల జైట్లీ అనారోగ్య కారణాలతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయని సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైట్లీ వైద్య చికిత్స నిమిత్తం అమెరికాలో ఉండటంతో పీయూష్ గోయల్ ఆయన స్ధానంలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం తన ఆరోగ్య పరిస్థితి సహకరించనందున తాను ప్రభుత్వంలో, క్యాబినెట్లో ఎలాంటి బాధ్యత నిర్వహించలేనని అరుణ్ జైట్లీ ప్రధానికి లేఖ రాశారు. -
కేరళ కాంగ్రెస్ చీఫ్ పరిస్థితి విషమం!
కొచ్చి: కేరళ కాంగ్రెస్(ఎం) అధ్యక్షుడు కేఎం మణి ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 86 ఏళ్ల మణికి కొచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చెస్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే మణి గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా, మణికి మెరగైన వైద్యం అందిస్తున్నామని ఆస్పత్రి హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. ఆయన 50 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కొట్టాయం పార్లమెంట్ స్థానం నుంచి ఆయన కేరళ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. కానీ అనారోగ్యం కారణంగా ఆయన ప్రచారానికి దురంగా ఉన్నారు. -
పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది భరత్ చేతిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక(17) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించే సమయానికే ఆమె పల్స్‌రేటు పడిపోయింది. బీపీ లెవల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను ఐసీయూకి తరలించి వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. బాధితురాలి శరీరంపై 14 చోట్ల బలమైన కత్తిగాట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తల పైభాగంలో కత్తిగాటుకు పుర్రె రెండుగా చీలిపోయింది. మెదడులోని కీలక నరాలు తెగిపోయాయి. అంతర్గత రక్తస్రావం ఎక్కువగా ఉంది. మెడ పైభాగంలోనూ బలమైన గాయమైంది. దవడ సహా రెండు చేతుల మణికట్టుల వద్ద రెండు సెంటీమీటర్ల లోతు తెగిపోయింది. అరచేతులు, వేళ్లపై బలమైన గాట్లు పడ్డాయి. చేతివేలి కీళ్లు విరిగి బయటికి కన్పిస్తున్నాయి. ఎడమచేతి వేలు ఒకటి పూర్తిగా తెగిపోయింది. రక్తం ఎక్కువగా పోవడంతో ఇప్పటివరకు ఐదు బాటిళ్ల రక్తం ఎక్కించారు. కత్తిగాట్ల వల్ల తెగి వేలాడుతున్న శరీర భాగాలకు కుట్లు వేశారు. అధిక రక్తస్రావాన్ని నియంత్రించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. రక్తస్రావం ఆగిపోయి, బీపీ, పల్స్రేట్ సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు శస్త్రచికిత్స చేస్తామని వెల్లడించారు. -
ముదుసలి మృత్యుపోరాటం
ముగ్గుబుట్ట వంటి తల..ముడుతలు పడిన శరీరం..లోతుకుపోయిన కళ్లు..శ్రమ పడేందుకు సహకరించని శరీరం..అండగా ఉండేందుకు ఎవరూ లేక ఓ వృద్ధురాలు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇటువంటి దీన పరిస్థితిలో ఆ వృద్ధురాలి గాథను వినిపించుకునేదెవరు? ఆ అభాగ్యురాలి ఆవేదన ఎవరి హృదయాలను కదిలించగలదు. తిండి, వైద్యం లేకుండా మృత్యువుతో ఒంటరిగా పోరాడుతున్న ఆమె మొరను పట్టించుకునేదెవరు? సభ్య సమాజంలో ఒంటరిగా పోరాడుతున్న దీనురాలి దీనస్థితిని చూస్తున్నా మానవత్వం పరిమళించక పోవడం విచారకరం. రాయగడ : రాయగడ జిల్లా కొల్నార సమితి కలియగుడ గ్రామంలో ఒక నిరుపేద వృద్ధురాలు కొద్దిరోజులుగా తిండి లేక తలకు గాయమైనప్పటికీ వైద్యమందక సహాయం అందించేవారు లేక మృత్యువుతో పోరాడుతోంది. కలియగుడ గ్రామంలో ఎంతోమంది ప్రజలు ఉన్నప్పటికీ ఓ వృద్ధురాలికి తిండి లేక పొయ్యలో నిప్పు వెలగని పరిస్థితుల్లో కూడా సహాయం అందక ఉండగా తలకు గాయమైతే ఏ ఒక్కరూ సహాయం అందించక పోవడమే కాకుండా కనీసం 108 అంబులెన్సు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆకలితో అలమటిస్తూ రోగగ్రస్థురాలై తన ఇంట్లో పొయ్యి దగ్గర నిస్సహాయ స్థితిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లకపోవడం విచారకరం. గ్రామంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఆమె నిస్సహాయ స్థితిలో మృత్యువుతో పోరాడడం విచాకరం. ఇటువంటి అభాగ్యులను ఆదుకునేందుకు సమితి అధికారులు, సర్పంచ్‌లు, సమితి మెంబర్లు, వార్డు మెంబర్లకు ప్రభుత్వం ప్రత్యేక సహాయం అందిస్తున్నప్పటికీ ఓ వృద్ధురాలిని ఆదుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం విచారకరం. -
శశికళ భర్తకు సీరియస్?
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ భర్త నటరాజన్ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆయనకు ఛాతీ నొప్పి రాగా.. చెన్నైలోని గ్లోబల్ హెల్త్ సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని.. ఆరోగ్యంపై ఇప్పుడే ఏం చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ భర్త అనారోగ్యం వార్త అందుకోగానే హుటాహుటిన పెరోల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమచారం. కాగా, 74 ఏళ్ల నటరాజన్ లివర్ సంబంధిత వ్యాధితో గతంలోనూ అస్వస్థతకు గురికాగా.. శశికళ పెరోల్‌పై బయటకు వచ్చారు. అయితే ఆమె అప్పుడు భర్త కోసం కంటే రాజకీయాల పైనే ఎక్కువ దృష్టిసారించారన్న ఆరోపణలు వినిపించాయి. -
జ్ఞాపకాలే మిగిలాయి
-
హాలీవుడ్ నటి పరిస్థితి విషమం
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్, డిస్టినీ చిత్రం ద్వారా బాల నటిగా ప్రస్తానం ప్రారంభించిన లాతవియా రాబర్సన్(34) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం గర్భవతి అయిన ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తరలించారు. లతావియా ఓ రియాలిటీ షో ను నిర్వహిస్తున్నారు. ‘ఆర్ అండ్ ఆంప్, ఆంప్ బీ దివాస్: అట్లాంటా’ అనే టీవీ రియాలిటీ షోలో గాయనిగా కొనసాగుతున్న ఆమె మరికొద్ది రోజుల్లో మరో బిడ్డకు తల్లి కాబోతుంది. ఆమెకు ఇది వరకే మూడేళ్ల పాప కూడా ఉంది. ఇటీవల ఇన్ స్టాగ్రమ్లో తాను కొద్ది రోజుల్లో తల్లికాబోతున్నానంటూ ఓ ఫొటో కూడా పెట్టింది. అయితే, గర్భానికి సంబంధించిన సమస్య తలెత్తి తీవ్ర అనారోగ్యంపాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మరింత క్షీణించిన ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్యం
హైదరాబాద్: ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు (ఎం) ఎస్ఐ జూలూరి సిద్ధయ్య ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలోని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సిద్ధయ్య ఇంకా అపస్మారకస్థితిలోనే ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సిద్ధయ్య శరీరం నుంచి మూడు బుల్లెట్లు తొలగించినా, ఇంకా చిన్న మెదడులో ఉండిపోయిన బుల్లెట్‌ను వెలికితీయాల్సి ఉంది. అయితే ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆ బుల్లెట్‌ను తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాలా? లేదా అనే విషయంపై వైద్యులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కాగా అదే ఆస్పత్రిలో ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరణిష . ఓ మగబిడ్డకు జన్మించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఐ సిద్ధయ్యతో పాటు పుట్టిన బిడ్డను కూడా చూసేందుకు అనేకమంది తరలి రావటంతో ఆ బాబుకు ఇన్ఫెక్షన్ సోకినట్లు సమాచారం. -
ఎస్సై సిద్ధయ్య పరిస్ధితి విషమం
-
కూతురు వరసైన చిన్నారిపై క్రూరత్వం
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి శివార్లలోని దామినేడు క్వార్టర్స్ లో దారుణం జరిగింది. కూతురు వరసైన 8 ఏళ్ల చిన్నారిపై ప్రకాశ్ అనే వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లో మూత్రం పోసిందన్న కారణంతో చిన్నారిని చితకబాదడంతో పాటు ఒంటిపై వేడినీళ్లు పోసి దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లు నిందితుడు ప్రకాశ్ కు దేహశుద్ధి చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. బాలిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పూర్తివివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
బాలచందర్‌కు అత్యవసర వైద్యం
ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం చెన్నై ఆల్వార్‌పేటలో గల కావేరి ఆస్పత్రిలో అత్యవసర వైద్యం పొందుతున్నారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్సా విభాగంలో వైద్య సేవలందిస్తున్నారు. బాలచందర్ 1910లో తంజావూరు జిల్లా నన్నిలం గ్రామంలో జన్మించారు. బాలచదర్కు ఎనిమిదేళ్ల వయస్సు నుంచి సినిమాలపై ఆసక్తి కలిగింది. 12వ ఏడాదికే థియేటర్ ఆర్టిస్ట్ సంఘంలో సభ్యులయ్యారు. ఉన్నత విద్య పూర్తి చేసి తొలుత ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. చెన్నై మహాన గరానికి ఒక అకౌంట్ క్లర్క్‌గా అడుగుపెట్టారు. ఆ తరువాత యునెటెడ్ అమెరికన్ ఆర్టిస్టు నటన కంపెనీలో చేరారు. అనంతరం అతి త్వరలోనే తన కంటూ సొంతంగా డ్రామా గ్రూప్‌ను తయారు చేసుకుని మేజర్ చంద్రకాంత్, నాటకాన్ని రూపొందించి దర్శకత్వం వహిం చారు. ఆ తరువాత అదే నాటకంతో వెండితెరపై దర్శకుడిగా అవతరించారు. రజనీకాంత్, కమలహాసన్, ప్రకాష్‌రాజ్, సరిత, వివేక్ వంటి ప్రముఖ నటీనటులను పరిచయంచేసిన ఘనత కె.బాలచందర్దే. ప్రస్తు తం బాలచందర్ వయసు 84. ఈయన తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో 100 చిత్రాలకుపైగా చేసి భారతీయ సినీ కళామతల్లి గర్వించదగ్గ దర్శకుడిగా పేరొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. రజనీ కాంత్ ఆస్పత్రికి వచ్చి బాలచందర్‌ను పరామ ర్శించారు. నటి కుష్బుకూడా బాలచందర్‌ను పరామర్శించి కోలుకుంటున్నారని చెప్పారు. -
ప్రముఖ దర్శకుడు బాలచందర్ పరిస్థితి విషమం
-
ప్రముఖ దర్శకుడు బాలచందర్ పరిస్థితి విషమం
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం చెన్నై నగరంలోని కావేరి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. విశ్వవిఖ్యాత నటుడు కమల్‌హాసన్ తన గురువుగా బాలచందర్‌ను అభివర్ణిస్తారు. రజనీకాంత్, కమల్‌హాసన్, ప్రకాష్ రాజ్ లాంటి అనేకమంది ప్రముఖ నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత బాలచందర్దే. అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే కమల్‌హాసన్ ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. కొంతకాలంగా బాలచందర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు శ్వాసకోశ సమస్యలతో పాటు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. దీంతోనే ఆయన కావేరి ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. అయితే, సోమవారం ఉదయం ఉన్నట్టుండి బాలచందర్ ఆరోగ్యం విషమించింది. తాము ఎంత ప్రయత్నించినా చికిత్సకు ఆయన శరీరం స్పందించడం లేదని వైద్యులు అంటున్నారు. దాదాపు 80 ఏళ్ల వయసు ఉండటంతో చికిత్స కూడా కష్టం అవుతోందన్నారు. ప్రస్తుతం చెన్నైలోని కావేరి ఆస్పత్రి వద్ద బాలచందర్ అల్లుడు, మరికొందరు బంధువులు ఉన్నారు. -
ఐదుగురి పరిస్ధితి విషమంగా ఉంది