బాలచందర్‌కు అత్యవసర వైద్యం
ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం చెన్నై ఆల్వార్‌పేటలో గల కావేరి ఆస్పత్రిలో అత్యవసర వైద్యం పొందుతున్నారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్సా విభాగంలో వైద్య సేవలందిస్తున్నారు. బాలచందర్ 1910లో తంజావూరు జిల్లా నన్నిలం గ్రామంలో జన్మించారు. బాలచదర్‌కు ఎనిమిదేళ్ల వయస్సు నుంచి సినిమాలపై ఆసక్తి కలిగింది. 12వ ఏడాదికే థియేటర్ ఆర్టిస్ట్ సంఘంలో సభ్యులయ్యారు. ఉన్నత విద్య పూర్తి చేసి తొలుత ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. చెన్నై మహాన గరానికి ఒక అకౌంట్ క్లర్క్‌గా అడుగుపెట్టారు. ఆ తరువాత యునెటెడ్ అమెరికన్ ఆర్టిస్టు నటన కంపెనీలో చేరారు.
అనంతరం అతి త్వరలోనే తన కంటూ సొంతంగా డ్రామా గ్రూప్‌ను తయారు చేసుకుని మేజర్ చంద్రకాంత్, నాటకాన్ని రూపొందించి దర్శకత్వం వహిం చారు. ఆ తరువాత అదే నాటకంతో వెండితెరపై దర్శకుడిగా అవతరించారు. రజనీకాంత్, కమలహాసన్, ప్రకాష్‌రాజ్, సరిత, వివేక్ వంటి ప్రముఖ నటీనటులను పరిచయంచేసిన ఘనత కె.బాలచందర్‌దే. ప్రస్తు తం బాలచందర్ వయసు 84. ఈయన తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో 100 చిత్రాలకుపైగా చేసి భారతీయ సినీ కళామతల్లి గర్వించదగ్గ దర్శకుడిగా పేరొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. రజనీ కాంత్ ఆస్పత్రికి వచ్చి బాలచందర్‌ను పరామ ర్శించారు. నటి కుష్బుకూడా బాలచందర్‌ను పరామర్శించి కోలుకుంటున్నారని చెప్పారు.