Lata Mangeshkar Health Condition Update: She Is Critical, Says Doctors - Sakshi
Sakshi News home page

Lata Mangeshkar: మళ్లీ విషమంగా సింగర్​ లతా మంగేష్కర్​ ఆరోగ్య పరిస్థితి..

Published Sat, Feb 5 2022 2:19 PM | Last Updated on Sat, Feb 5 2022 3:59 PM

Singer Lata Mangeshkar Health Condition Again Critical - Sakshi

నైటింగెల్​ ఆఫ్​ ఇండియా, లెజండరీ సింగర్​ లతా మంగేష్కర్​ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ముంబైలోని బ్రీచ్​ క్యాడీ ఆసుపత్రి వైద్యుడు ప్రతీత్​ సంధాని చెప్పినట్లు ఏఎన్​ఐ పేర్కొంది. ఏఎన్​ఐ ప్రకారం 'వెటరన్​ సింగర్​ లతా మంగేష్కర్​ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు' అని డాక్టర్​ ప్రతీత్​ సంధాని పేర్కొన్నారు. 

92 ఏళ్ల లతా మంగేష్కర్​కు కొవిడ్​ పాజిటివ్​ అని నిర్ధరణ కాగా జనవరి 11న బ్రీచ్​ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్​ ద్వారా న్యూమోనియా కూడా అటాక్​ అయింది. అయితే ఇటీవల లతా మంగేష్కర్‌ కోవిడ్‌ను జయించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ మంత్రి తెలిపారు. న్యూమోనియా నుంచి కూడా  కోలుకున్నట్లు వివరించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement