Lata Mangeshkar health
-
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై ఆశా భోస్లే కీలక ప్రకటన
Asha Bhosle rushes to meet sister Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉంది. ఆరోగ్యం క్షీణించడంతో ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు. లతా మంగేష్కర్ పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో హాస్పిటల్ పరిసరాల్లో పోలీసులు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇక లతాజీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని తెలియగానే ఆమె సోదరి, ప్రముఖ గాయని ఆశా భోస్లే హుటాహుటిన బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మేమందరం ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నాం.ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు అని పేర్కొన్నారు. "We hope #Latadidi recovers soon. We are praying for her recovery. Doctors have informed us that she's stable.": #AshaBhosle on #LataMangeshkar's health! Read more here: https://t.co/x9KnspxXxB pic.twitter.com/7ggXJ46ygI — Pune Mirror (@ThePuneMirror) February 5, 2022 -
మళ్లీ విషమంగా సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి..
నైటింగెల్ ఆఫ్ ఇండియా, లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ముంబైలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రి వైద్యుడు ప్రతీత్ సంధాని చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది. ఏఎన్ఐ ప్రకారం 'వెటరన్ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు' అని డాక్టర్ ప్రతీత్ సంధాని పేర్కొన్నారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌కు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధరణ కాగా జనవరి 11న బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ ద్వారా న్యూమోనియా కూడా అటాక్ అయింది. అయితే ఇటీవల లతా మంగేష్కర్ కోవిడ్‌ను జయించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ మంత్రి తెలిపారు. న్యూమోనియా నుంచి కూడా కోలుకున్నట్లు వివరించారు. Veteran singer Lata Mangeshkar's health condition has deteriorated again, she is critical. She is on a ventilator. She is still in ICU and will remain under the observation of doctors: Dr Pratit Samdani, Breach Candy Hospital (file photo) pic.twitter.com/U7nfRk0WnM — ANI (@ANI) February 5, 2022 -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన..
Lata Mangeshkar Health Update: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి కీలక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించిందటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె అధికార ప్రతినిధి ఖండించారు. ఈ వదంతులను నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చారు. లతా దీదీ ఇంకా ఐసీయూలోనే ఉంది. డాక్టర్ ప్రతీత్ సందానీ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయవద్దు. లతా మంగేష్కర్ కుటుంబానికి, వైద్యులకు ప్రైవసీ ఇవ్వాలి అంటూ ప్రకనటలో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ విఙ్ఞప్తి చేశారు. #LataMangeshkar health update: She's showing signs of improvement, still in ICUhttps://t.co/h5TekiPHOp — India Today Showbiz (@Showbiz_IT) January 22, 2022 -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. వివరించిన మంత్రి
Lata Mangeshkar Health Is Improving Says Maharashtra Health Minister: ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 92 ఏళ్ల లతా స్వల్ప కరోనా లక్షణాలతో జనవరి 11న ముబయిలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా ఆమె హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చారు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే. లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు. లతా మంగేష్కర్ ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటున్న అభిమానుల కోసం జల్నాలో విలేకర్లతో సమావేశమై ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. 'లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నా. లతా మంగేష్కర్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఆమె కుటుంబ సభ్యులతో చర్చించాను. అలాగే ఆసుపత్రి అధికార ప్రతినిధి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేలా చూడాలని హాస్పిటల్ యాజామాన్యాన్ని కోరాను.' అని మంత్రి రాజేశ్ టోపే తెలిపారు. ఇదీ చదవండి: లతాజీ గొంతు బావుండదు.. -
కోలుకున్న లతా మంగేష్కర్
ముంబై: దిగ్గజ గాయని లతా మంగేష్కర్ (90) శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, మంగళవారం డిశ్చార్జ్ అవుతారని ఆమె సోదరి ఉషా మంగేష్కర్ తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్తో ఆమెను ఆస్పత్రిలో ఉంచాలని భావించినట్లు తెలిపారు. మంగేష్కర్ వెయ్యికి పైగా చిత్రాల్లో వేలాది పాటలు పాడారు. దాదాపు 70 ఏళ్లపాటు ఆమె గాయనిగా కొనసాగారు. చివరగా 75 ఏళ్ల వయసులో ఉండగా వీర్ జారా సినిమా కోసం పనిచేశారు. 1989లో ఆమె దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, 2001లో దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను అందుకున్నారు. -
గానకోకిలకు గుండెపోటు?
సాక్షి, ముంబై: గాన కోకిల లతా మంగేష్కర్‌కు గుండెపోటు వచ్చిందన్న వదంతులు చిత్ర పరిశ్రమను కుదిపివేసింది. అయితే ఆమె ఆరోగ్యంగా ఉందని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలీవుడ్ నటి నందా మరణంతో విషాదంలో ఉన్న చిత్రపరిశ్రమకి లతా మంగేష్కర్‌కు గుండె పోటు వచ్చి పరిస్థితి విషమంగా ఉందన్న వదంతులు మరింత దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ వదంతులు మంగళవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీనిపై లతా మంగేష్కర్ స్వయంగా ట్వీట్ చేయాల్సి వచ్చింది. ‘మీ అందరి అభిమానాలతో బాగానే ఉన్నా. నాకేమీ కాలేదు. ఆరోగ్యంగానే ఉన్నాను. మీ అందరి అభిమానాలు భవిష్యత్‌లోనూ ఇదేవిధంగా లభిస్తాయని కోరుకుంటున్నాను. నా కోసం ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతల’ని ఆమె పేర్కొన్నారు. అయినా బుధవారం ఉదయం కూడా ఈ వదంతుల పర్వం కొనసాగింది. దీనిపై మీడియా ప్రతినిధులతోపాటు ఆమె అభిమానులు లతా మంగేష్కర్ ఆరోగ్యం గురించి వాకబు చేయడం మొదలెట్టారు. దీంతో ఆమె స్వయంగా వాయిస్ మెసేజ్‌ను ట్వీట్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.