సాక్షి, ముంబై: గాన కోకిల లతా మంగేష్కర్‌కు గుండెపోటు వచ్చిందన్న వదంతులు చిత్ర పరిశ్రమను కుదిపివేసింది. అయితే ఆమె ఆరోగ్యంగా ఉందని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలీవుడ్ నటి నందా మరణంతో విషాదంలో ఉన్న చిత్రపరిశ్రమకి లతా మంగేష్కర్‌కు గుండె పోటు వచ్చి పరిస్థితి విషమంగా ఉందన్న వదంతులు మరింత దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ వదంతులు మంగళవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీనిపై లతా మంగేష్కర్ స్వయంగా ట్వీట్ చేయాల్సి వచ్చింది.
‘మీ అందరి అభిమానాలతో బాగానే ఉన్నా. నాకేమీ కాలేదు. ఆరోగ్యంగానే ఉన్నాను. మీ అందరి అభిమానాలు భవిష్యత్‌లోనూ ఇదేవిధంగా లభిస్తాయని కోరుకుంటున్నాను. నా కోసం ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతల’ని ఆమె పేర్కొన్నారు. అయినా బుధవారం ఉదయం కూడా ఈ వదంతుల పర్వం కొనసాగింది. దీనిపై మీడియా ప్రతినిధులతోపాటు ఆమె అభిమానులు లతా మంగేష్కర్ ఆరోగ్యం గురించి వాకబు చేయడం మొదలెట్టారు. దీంతో ఆమె స్వయంగా వాయిస్ మెసేజ్‌ను ట్వీట్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గానకోకిలకు గుండెపోటు?
Published Wed, Mar 26 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM
Advertisement
Advertisement