ముంబై: దిగ్గజ గాయని లతా మంగేష్కర్ (90) శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, మంగళవారం డిశ్చార్జ్ అవుతారని ఆమె సోదరి ఉషా మంగేష్కర్ తెలిపారు. వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో ఆమెను ఆస్పత్రిలో ఉంచాలని భావించినట్లు తెలిపారు. మంగేష్కర్ వెయ్యికి పైగా చిత్రాల్లో వేలాది పాటలు పాడారు. దాదాపు 70 ఏళ్లపాటు ఆమె గాయనిగా కొనసాగారు. చివరగా 75 ఏళ్ల వయసులో ఉండగా వీర్ జారా సినిమా కోసం పనిచేశారు. 1989లో ఆమె దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, 2001లో దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment