Lata Mangeshkar Health Update: Spokesperson Says 'Disturbing To See False News Being Circulated' - Sakshi
Sakshi News home page

Lata Mangeshkar: 'ప్రైవసీ ఇవ్వండి.. దీదీ ఇంకా ఐసీయూలోనే'

Published Sat, Jan 22 2022 2:59 PM | Last Updated on Sat, Jan 22 2022 3:56 PM

Lata Mangeshkar Health Rumours: Spokes Person Gives Clarity On Her Health - Sakshi

Lata Mangeshkar Health Update: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి కీలక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా లతా మంగేష్కర్‌ ఆరోగ్యం క్షీణించిందటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె అధికార ప్రతినిధి ఖండించారు. ఈ వదంతులను నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చారు.

Lata Mangeshkar Health Rumours

లతా దీదీ ఇంకా ఐసీయూలోనే ఉంది. డాక్టర్‌ ప్రతీత్‌ సందానీ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయవద్దు. లతా మంగేష్కర్‌ కుటుంబానికి, వైద్యులకు ప్రైవసీ ఇవ్వాలి అంటూ ప్రకనటలో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ విఙ్ఞప్తి చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement