Health Update
-
లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా
అనారోగ్యం నుంచి కోలుకున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli)ని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ పరామర్శించాడు. కాంబ్లీతో ఫోన్లో సంభాషించి అతడికి ధైర్యం చెప్పాడు. అదే విధంగా కాంబ్లీకి చికిత్స అందించిన వైద్యులకు కపిల్ దేవ్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఇటీవల అస్వస్థతకు గురైన వినోద్ కాంబ్లీ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.కపిల్ దేవ్‌తో వీడియో కాల్మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో రెండు వారాల క్రితం కాంబ్లీ ఆస్పత్రిలో చేరగా... అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పుడు రెండు వారాల చికిత్స అనంతరం కాంబ్లీ కోలుకుని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా కాంబ్లీకి చికిత్స అందించిన ఆకృతి ఆస్పత్రి డైరెక్టర్.. కపిల్ దేవ్(Kapil Dev)కు వీడియో కాల్ చేసి కాంబ్లీతో మాట్లాడించాడు. ఈ క్రమంలో భావోద్వేగానికి లోనైన కాంబ్లీ.. ‘‘హాయ్.. కపిల్ పాజీ ఎలా ఉన్నారు’’ అంటూ పలకరించగా.. కపిల్ దేవ్ కూడా ఆప్యాయంగా బదులిచ్చాడు. లవ్ యూ.. తొందర్లోనే వస్తాను‘‘నేను త్వరలోనే వచ్చి నిన్ను కలుస్తాను. మరికొన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్తే మాత్రం అక్కడే ఉండు. నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా! గడ్డానికి కూడా రంగేసుకున్నావు. కానీ దేనికీ ఇప్పుడే తొందరపడవద్దు. పూర్తిగా కోలుకున్న తర్వాతే మునుపటి జీవితం గడుపగలవు. డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలన్నీ తప్పక పాటించు. తొందర్లోనే నేను వచ్చి కలుస్తాను. సరేనా.. లవ్ యూ’’ అని కపిల్ దేవ్ కాంబ్లీకి భరోసా ఇచ్చాడు. కాగా ఇంటికి చేరుకున్న అనంతరం కాంబ్లీ నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు సందేశం ఇచ్చాడు. ‘‘మద్యం, మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. వాటికి దూరంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది’’ అని పేర్కొన్నాడు. సచిన్ టెండుల్కర్ బాల్య మిత్రుడుమరోవైపు.. కాంబ్లీ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని... కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ వివేక్ త్రివేది పేర్కొన్నారు. కాగా ముంబైకి చెందిన వినోద్ కాంబ్లీ సచిన్ టెండుల్కర్(Sachin tendulkar)కు బాల్య మిత్రుడు. ఇద్దరూ ముంబై నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు.అయితే, సచిన్ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ లెజెండరీ బ్యాటర్‌గా ఎదగగా.. కాంబ్లీ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. చెడు వ్యసనాలకు బానిసై ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకున్నాడు. ఈ క్రమంలో.. ఇటీవల తమ చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్‌ను కలిసిన కాంబ్లీ పరిస్థితిని చూసి అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. కపిల్ సేన ఆర్థిక సాయం!ఈ క్రమంలో అతడిని ఆదుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు వెల్లువెత్తగా. కపిల్ సారథ్యంలో 1983 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టు కాంబ్లీకి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే, కాంబ్లీ చెడు అలవాట్లు మానేసి.. పునరావాస కేంద్రానికి వెళ్తేనే సహాయం అందిస్తామని షరతు పెట్టగా.. అతడు అందుకు అంగీకరించాడు. తాను మందు, పొగ తాగటం మానేశానని చెప్పాడు. చదవండి: IND vs AUS 5th Test: రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!? -
నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్ కాంబ్లీ
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం(Vinod Kambli Health Update) నిలకడగా ఉంది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఈ ముంబైకర్.. డిశ్చార్జ్ కానున్నాడు. ఈ విషయాన్ని అతడి స్నేహితుడు మార్కస్ కౌటో వెల్లడించాడు. కాగా 52 ఏళ్ల కాంబ్లీ ఆరోగ్యం క్షీణించడంతో శనివారమే ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే.అయితే, ఆ రోజు మూత్రనాళ ఇన్ఫెక్షన్ సమస్యలతో కాంబ్లీని అడ్మిట్ చేసినప్పటికీ... తదనంతర వైద్యపరీక్షల్లో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతున్నట్లు తేలిందని డాక్టర్ వివేక్ త్రివేది వెల్లడించారు. దీంతో ఇన్సెంటివ్ క్రిటికల్ కేర్ యూనిట్(ICU)లో ఉంచి ప్రత్యేక వైద్యబృందం ఎప్పటికప్పుడు అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.మెడికల్ బిల్లులు చెల్లించేందుకుఇక మంగళవారం కూడా అవసరమైన వైద్యపరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆ వైద్యబృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడిన కాంబ్లీ ఫ్రెండ్ మార్కస్ కౌటో.. ‘‘కాంబ్లీ ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్తోనే అతడు ఆస్పత్రిలో చేరాడు. అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయే వరకు హాస్పిటల్లోనే చికిత్స అందించాలని కోరాను.కాంబ్లీకి సంబంధించిన మెడికల్ బిల్లులు చెల్లించేందుకు కచ్చితంగా ఎవరో ఒకరు సాయం చేస్తారు’’ అని పేర్కొన్నాడు. ఇక కాంబ్లీని చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ.. ‘‘క్రికెటర్‌గా రాణించిన వినోద్ సర్(Cricketer Vinod Kambli) పట్ల మాకు అభిమానం ఉంది.అందుకు ఆయన కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తాం. తన కెరీర్‌లోని మధుర జ్ఞాపకాల గురించి ఆయన మాతో పంచుకుంటున్నారు’’ అని తెలిపారు. ఇక వినోద్ కాంబ్లీ సైతం ఈ సందర్భంగా వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. డాక్టర్ వల్లే నేను బతికి బయటపడ్డాను‘‘డాక్టర్ వల్లే నేను ఈరోజు బతికి బయటపడ్డాను. ఆయన నన్నేం అడిగినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇకపై నలుగురికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాను’’ అని కాంబ్లే పేర్కొన్నాడు.కాగా ముంబైకి చెందిన ఈ మాజీ క్రికెటర్ చాన్నాళ్ల నుంచే అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ఇటీవల దిగ్గజ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ స్మారక కార్యక్రమంలో కాంబ్లీ పాల్గొన్నప్పటికీ కుర్చీకే పరిమితమయ్యాడు. తాను ఇప్పటికే మద్యం, పొగతాగడం మానేశానని.. కపిల్ దేవ్ సారథ్యంలోని 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టు సాయంతో పునరావాస శిబిరంలో చేరతానని కాంబ్లీ ఇటీవల వెల్లడించాడు.చదవండి: IND vs AUS 4th Test: వాడిగా 'వేడిగా' సాగనున్న బాక్సింగ్ డే టెస్ట్!VIDEO | "It is because the doctor here that I am alive... All I would say is that I will do whatever sir (referring to the doctor) asks me to. People will see the inspiration that I'll give them..." said Vinod Kambli. (Full video is available on PTI Videos -… pic.twitter.com/ZCpP8OUvfD— Press Trust of India (@PTI_News) December 23, 2024 -
నటుడు మోహన్ బాబు ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?
మంచు ఫ్యామిలీలో గత రెండు రోజులుగా వివాదం నడుస్తోంది. తండ్రి కొడుకు.. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు మోహన్ బాబు ఆస్పత్రిలో చేరడం వరకు వచ్చింది. మంగళవారం రాత్రి ఇంటి దగ్గరకొచ్చి మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడిచేయడం పెద్ద వివాదమైంది. ఈ క్రమంలోనే 118 బీఎన్ఎస్ యాక్ట్ కింద ఈయనపై కేసు కూడా నమోదైంది. ఇదంతా పక్కనబెడితే రాత్రే మోహన్ బాబు ఆస్పత్రిలో కూడా చేరారు. ఇంతకీ ఈయన ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది? డాక్టర్స్ ఏం చెబుతున్నారు?అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు.. మంగళవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంతకీ ఏమైందా అని అందరూ అనుకున్నారు. వైద్యుల ఏం చెబుతున్నారంటే.. 'విపరీతమైన ఒళ్లు నొప్పులు, స్పృహ కోల్పోయిన స్థితిలో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఎడమ కంటి కింద గాయమైంది. బీపీ, రక్తపోటు కూడా పెరిగాయి. నిపుణుల పర్యవేక్షణలో ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి' అని చెప్పారు.(ఇదీ చదవండి: మా నాన్న దేవుడు: మంచు మనోజ్)మోహన్ బాబుకి ప్రస్తుతం చికిత్స చేస్తున్న డాక్టర్ గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 'మెడ, కాలిలో నొప్పితో పాటు బీపీ ఎక్కువయ్యేసరికి మోహన్ బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయనకు నిద్రలేదు. బీపీలో ఇప్పటికే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.మరోవైపు తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్‌ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ వేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. తాను సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉండటంతో ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు) -
రజినీకాంత్ లేటెస్ట్ హెల్త్ అప్డేట్.. డాక్టర్లు ఏం చెప్పారు?
సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ హెల్త్ బులెటిన్ వచ్చేసింది. చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు.. రజినీకి ఏమైందనే విషయాన్ని బయటపెట్టారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని, దీనికి చికిత్స అందించామని చెప్పారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో డిశ్చార్జి అయిపోతారని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)ఏం జరిగింది?తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో రజినీకాంత్‌ని సోమవారం అర్థరాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం కాత్ ల్యాబ్‌లో ఎలక్టివ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ జరిగింది. భయపడాల్సింది ఏం లేదని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితి ఏంటనేది హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.సినిమా రిలీజ్రజినీకాంత్ లీడ్ రోల్ చేసిన 'వేట్టయాన్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబరు 10న థియేటర్లలోకి రానుంది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు చేశారు. మరోవైపు 'కూలీ' సినిమా చేస్తున్నారు. దీని షెడ్యూల్ ముగించుకుని రీసెంట్గా చెన్నై వచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
ఆ బాటిల్ తీసి తాగగానే వాంతులు: అప్పుడు మయాంక్ పరిస్థితి ఇదీ!
Mayank Agarwal Shares Update on his health: టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కర్ణాటక జట్టు మేనేజర్ స్పష్టం చేశాడు. మయాంక్‌కు ప్రమాదం తప్పిందని.. విమానంలో జరిగిన ఘటన గురించి అతడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారని తెలిపాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్.. జట్టుతో పాటు మంగళవారం త్రిపుర నుంచి న్యూఢిల్లీకి బయల్దేరాడు. అయితే, విమానంలో కూర్చున్న కాసేపటికే గొంతులో నొప్పి, మంటతో బాధపడుతున్నట్లు సహచర ఆటగాళ్లకు చెప్పాడు. ఆ తర్వాత వాంతులు కూడా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అగర్తల(త్రిపుర రాజధాని)లోనే నిలిచిపోగా.. మయాంక్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించగా.. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. మయాంక్‌కు దాహం వేసింది... అప్పుడు ఈ విషయంపై స్పందించిన కర్ణాటక జట్టు మేనేజర్ ఇండియా టుడేతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాడు. ‘‘కాసేపట్లో విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా.. మయాంక్‌కు దాహం వేసింది. దాంతో.. తాను కూర్చున్న సీటు పాకెట్లో ఉన్న బాటిల్ తీసి తాగాడు. వాంతి చేసుకున్నాడు కొన్ని నిమిషాల తర్వాత తన గొంతులో నొప్పి తీవ్రమైందంటూ.. వాష్‌రూమ్‌కి పరిగెత్తుకువెళ్లాడు. కాక్‌పిట్‌కు సమీపంలోనే ఉన్న వాష్‌రూమ్‌లో వాంతి చేసుకున్నాడు. తనకు అస్వస్థతగా ఉందని ఎయిర్ హోస్టెస్‌కు చెప్పడంతో ఆమె వెంటనే ఎమర్జెన్సీ బెల్ కొట్టింది. ప్రథమ చికిత్స అక్కడ కుదరదన్నారు విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారేమోనని ఆరా తీశారు. కానీ దురదృష్టవశాత్తూ అక్కడ ఒక్క డాక్టర్ కూడా లేరు. దీంతో పైలట్‌కు మెసేజ్ అందించగా.. ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎయిర్‌పోర్టులో ఉన్న వైద్యులు మయాంక్‌ను పరీక్షించి.. ఇక్కడ ప్రథమ చికిత్స అందించడం కుదరదని.. ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అంబులెన్స్‌ను పిలిపించగా.. హుటాహుటిన మయాంక్‌కు హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం’’ అంటూ కొన్ని నిమిషాల పాటు తమకు ఏం అర్థం కాలేదని వాపోయాడు. విచారణ జరపండి ఏదేమైనా మయాంక్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని.. అందుకు సంతోషిస్తున్నామని తెలిపాడు. కాగా మయాంక్ ఇండిగో ఫ్లైట్ 6E 5177లో ఉండగా ఈ ప్రమాదం బారిన పడగా.. ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. తమ విమానంలో ఉన్న ప్యాసింజర్ అనారోగ్యం పాలైన కారణంగా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఫ్లైట్ కాస్త ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై పోలీసులు మయాంక్ అగర్వాల్ వాంగ్మూలం నమోదు చేశారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. ఇందుకు గల కారణాలేమిటో తెలుసుకోవాలని కర్ణాటక జట్టు మేనేజర్ మయాంక్ తరఫున విజ్ఞప్తి చేసినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెల్లడించింది. నేను బాగున్నాను.. థాంక్యూ ‘‘ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుటపడింది. త్వరలోనే తిరిగి వస్తా. నా కోసం ప్రార్థించిన, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని మయాంక్ అగర్వాల్ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. టీమిండియా తరఫున 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్ 21 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1488, 86 పరుగులు చేశాడీ ఓపెనర్. ప్రస్తుతం రంజీ టోర్నీతో బిజీగా ఉన్న ఈ కర్ణాటక సారథి ఇప్పటికే రెండు సెంచరీలు, ఓ అర్ధ శతకం సాధించాడు. ఇక మయాంక్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ నికిన్ జోస్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. చదవండి: Ind vs Eng: వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు -
కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్
-
ఫాన్స్ కి గుడ్ న్యూస్ ఎవరి సాయం లేకుండానే..!
-
వరల్డ్ కప్ కి రిషబ్ పంత్ రీఎంట్రీ ..!
-
అత్యంత విషమంగా శరత్ బాబు ఆరోగ్యం!
ప్రముఖ నటుడు శరత్ బాబు(71) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రెండు రోజుల క్రితం ఆయనను హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శరీరం మొత్తం సెప్సిస్ కావడంతో ఊపిరితిత్తులు, కాలెయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయావాలు పాడైపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శరత్‌బాబుకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్స్ వెల్లడించారు. ఈరోజు సాయంత్రం మరోసారి శరత్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని సన్నిహితుల చెబుతున్నారు. (చదవండి: జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి సీరియస్? ఐసీయూలో చికిత్స!) కాగా, 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమల్లో 200కి పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలతో అలరించారు. -
తారకరత్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించింది. నేడు(శుక్రవారం)ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొన్న కల్యాణ్ రామ్‌కు తారకరత్న హెల్త్‌పై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రస్తుతం తారకరత్న కోలుకుంటున్నాడు. అతనికి మెరుగైన వైద్యం అందుతుంది. అయితే ఇప్పుడు కండీషన్ ఎలా ఉందన్నది డాక్టర్లు మాత్రమే చెప్పగలరు. ఆ విషయాలు హాస్పిటల్ వర్గాలు చెబితేనే బాగుంటుంది. మేం అందరం తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. అతనికి మీ అందరి ఆశిస్సులతో తను పూర్తిగా రికవర్ అవుతాడని భావిస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. కాగా గత కొన్నిరోజులుగా తారకరత్న హెల్త్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు తారకరత్న పరిస్థితి ఇప్పడెలా ఉందన్నది అటు కుటుంబసభ్యులు కానీ, ఆసుపత్రి వర్గాలు కానీ వెల్లడించలేదు. -
'స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే హాయిగా ఉంది'
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. గతేడాది డిసెంబర్లో ఢిల్లీ నుంచి వస్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా యాక్సిడెంట్లో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. దాదాపు 40 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న పంత్ తన ఆరోగ్యం గురించి తాజాగా సమాచారం ఇచ్చాడు. బాల్కనీలో కూర్చున్న ఫొటోను పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇన్నాళ్లకు బయటకు వచ్చి స్వచ్చమైన గాలి పీల్చుకున్నట్లు తెలిపాడు. ''ఇలా బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే ఇంత హాయిగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆల్ ఈజ్ వెల్'' అని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు. పంత్ షేర్ చేసిన ఫోటోలను బట్టి చూస్తే ఆ ప్రదేశం ఆసుపత్రి ఆవరణలోనిదే అని అర్థమవుతుంది. కాగా మోకాళ్లకు శస్త్రచికిత్స కావడంతో అతను తిరిగి మైదానంలోకి రావడానికి కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. పంత్ బెడ్ రెస్ట్‌లో ఉండటంతో ఈ ఏడాది జరిగే కీలక సిరీస్‌లు, టోర్నీలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఆస్ట్రేలియా సిరీస్, ఆతర్వాత జరిగే ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లను పంత్ బెడ్‌పై నుంచే వీక్షించాల్సి ఉంటుంది. పంత్ పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధిస్తే ఈ ఏడాది చివర్లో జరిగే టి20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ఉంది. చదవండి: Turkey Earthquake: విషాదం.. గోల్‌కీపర్ కన్నుమూత ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో -
మెరుగైన చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తరలిస్తారా?
గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత వారం రోజులుగా ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు బులిటిన్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కాస్త కోలుకున్నా ఇంకా మెరుగుపడలేదు. గుండెపోటుకు గురైన సమయంలో దాదాపు 45 నిమాషాల పాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో న్యూరో సర్జన్లతో పాటు 10మంది వైద్యుల బృందం.. ఆయన హెల్త్ కండీషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రీసెంట్గా మెదడు స్కానింగ్ తీసిన వైద్యులు రిపోర్డుల ఆధారంగా ట్రీట్మెంట్ అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మెదడులో స్వెల్లింగ్ క్రమంగా తగ్గుతోందని, వాపు తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో తారకరత్న కోలుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంస సభ్యులు ఉన్నట్లు సమాచారం. -
రిషబ్ పంత్ హెల్త్ అప్డేట్.. పరిస్థితి ఏంటంటే..?
Rishabh Pant Health Update: గతేడాది డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ అసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు, యంగ్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కు సంబంధించిన హెల్త్ అప్డేట్ ఇవాళ (జనవరి 31) విడుదలైంది. పంత్ మోకాలి సర్జరీ విజయవంతమైనట్లు డాక్టర్ల ప్రకటించారు. ఈ విషయంలో పాటు ఆసుపత్రి వర్గాలు మరో శుభవార్త కూడా చెప్పారు. పంత్ వేగంగా కోలుకుంటున్నాడని, ఈ వారంలోనే అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వారు వెల్లడించారు. మార్చిలో పంత్‌కు మరో విడత మోకాలి సర్జరీ జరుగుతుందని, పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 9 నెలల సమయం పడుతుందని వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి కూడా ధృవీకరించారు. కాగా, గత నెలలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో పంత్ కుడి మోకాలిలో మూడు లిగ్మెంట్లు తెగిపోయిన విషయం తెలిసిందే. పంత్ బెడ్ రెస్ట్‌లో ఉండటంతో ఈ ఏడాది జరిగే కీలక సిరీస్‌లు, టోర్నీలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఆస్ట్రేలియా సిరీస్, ఆతర్వాత జరిగే ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లను పంత్ బెడ్‌పై నుంచే వీక్షించాల్సి ఉంటుంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్‌కు ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో ఉండగా.. ఆసీస్ టెస్ట్ సిరీస్‌లో మాత్రం పంత్ లేని లోటు టీమిండియాపై పెను ప్రభావం చూపనుంది. -
తారకరత్న ఆరోగ్యంపై ఎమోషనల్ పోస్ట్ చేసిన చిరంజీవి
సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిపింది. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి ఊరటనిచ్చే విషయం చెప్పారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన తారకరతన్న కోలుకుంటున్నారని తెలిసి తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. ‘‘సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు.. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ.. ఈ పరిస్థితి నుండి తారకరత్నను కాపాడిన ఆ డాక్టర్లకి, భగవంతుడికి కృతజ్ఞతలు. నువ్వు నిండు నూరేళ్లు.. ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను మై డియర్ తారకరత్న’’ అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం చిరు షేర్ చేసిన ఈ పోస్ట్‌తో నెట్టింట వైరల్‌గా మారింది. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. May you have a long and healthy life dear Tarakaratna! — Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2023 -
ఇంకా వెంటిలేటర్‌పైనే తారకరత్న.. రిపోర్టులు వచ్చాక క్లారిటీ
నందమూరి తారకరత్న క్రమంగా కోలుకుంటున్నారని నందమూరి రామకృష్ణ తెలిపారు. అతని ఆరోగ్యం మెరుగుపడిందని అయితే సిటీ స్కాన్ రిపోర్టు వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందన్నారు. తారకరత్నకు అసలు ఎక్మోనే పెట్టలేదు. అతని అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయి. కొంత ఆక్సిజన్ సొంతంగానే తీసుకుంటున్నారు. క్రమంగా కోలుకుంటున్నాడు. పూర్తిగా రికవర్ అయ్యేందుకు సమయం పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. కాగా శుక్రవారం కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మొదలుపెట్టిన పాదయాత్రలో తారకరత్న ఉన్నట్లుండి కుప్పకూలిన సంగతి తెలిసిందే! -
ముగిసిన అబ్జర్వేషన్.. తారకరత్న హెల్త్‌పై అప్పుడే క్లారిటీ!
నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. 48 గంటల అబ్జర్వేషన్ ముగిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని.. మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత స్పష్టత వస్తుందని వైద్యులు తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సోమవారం మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. తారకరత్నకు కుప్పంలో యాంజియోప్లాస్టీ తర్వాత నారాయణ హృదయాలయలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స కొనసాగిస్తోంది. అయితే తారకతరత్నకు ఈరోజు నిర్వహించే వైద్య పరీక్షలు కీలకం కానున్నాయి. ఈరోజు ఆయనకు ఎమ్ఆర్ఐ(MRI)స్కాన్ తీయనున్నారు. దీని ఆధారంగా ట్రీట్మెంట్ కొనసాగించనున్నారు. ఈనెల 27న తారకరత్న గుండెపోటుకు గురికాగా అప్పటి నుంచి పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ ఆదివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆయన గుండె స్పందన సాధారణంగా ఉన్నా మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించామని తెలిపారు. -
తారకరత్న గురించి గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్
సినీనటుడు నందమూరి తారకరత్న గుండెపోటు కారణంగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అతని ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉన్న నేఫథ్యంలో కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే బాలయ్య అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తుండగా నిన్న(ఆదివారం)తారక్, కల్యాణ్ రామ్‌లు కుటుంబసమేతంగా బెంగళూరులోని హాస్పిటల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు మంచు మనోజ్ తారకరత్నను చూసేందుకు బెంగళూరుకు వెళ్లారు. అతని ఆరోగ్యంపై వైద్యులను అడిగిన తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'తారకరత్నను చూడటం జరిగింది. రికవరీ అవుతున్నాడు. త్వరలోనే కోలుకొని బయటకు వచ్చేస్తాడు. తారకరత్న స్ట్రాంగ్ ఫైటర్. అతనికి ఇది టెస్టింగ్ టైమ్. నేను వందశాతం కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఆ దేవుడి దయ వల్ల తారకతరత్న త్వరగా కోలుకొని బయటకు రావాలని కోరుకుంటున్నా' అంటూ పేర్కొన్నారు. visited #Tarakratna and am filled with hope and optimism for his future. He has our unwavering support and I'm sure with the grace of God and all the prayers of the people who care for him, he will make a full recovery soon and be back home with us. Love u babai 🙏🏼❤️ — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 29, 2023 -
తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్ రామ్..
సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. తాజాగా హీరో కల్యాణ్ రామ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా..“నా సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ”అంటూ ట్వీట్ చేశారు. నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను . Get well soon and get back to complete health brother. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 28, 2023 -
విజయ్ ఆంటోని ఆరోగ్యంపై రకరకాల వార్తలు! ఫొటోతో క్లారిటీ ఇచ్చిన హీరో
కోలీవుడ్ స్టార్ హీరో, బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోని ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మలేషియాలో జరుగుతున్న బిచ్చగాడు 2 మూవీ షూటింగ్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ముఖానికి బలమైన గాయాలు కావడంతో. పళ్లు, దవడ ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, కొమాలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఆయన అభిమాలంత ఆందోళనకు గురవుతున్నారు. చదవండి: ఎన్టీఆర్ వర్థంతి నాడు నాగ్ అలా.. ఏఎన్ఆర్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా.. ఈ క్రమంలో తన ఆరోగ్యంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు విజయ్. ఆస్పత్రి బెడ్‌పైనే ఉన్న ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. తన ఆరోగ్యంపై బాగానే ఉందని, కోలుకుంటున్నానని చెప్పారు. ‘‘డియర్ ఫ్రెండ్స్.. మలేషియాలో ‘పిచ్చైకారన్ 2’ (‘బిచ్చగాడు 2’) చిత్రీకరణ చేస్తున్న సమయంలో నేను ప్రమాదానికి గురయ్యా. ఈ ఘటనలో నా దవడ, ముక్కు భాగాలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వాటి నుంచి సురక్షితంగా కోలుకున్నాను. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తి అయ్యింది. వీలైనంత తొందరలో మీతో మాట్లాడతాను. ఈ కఠిన పరిస్థితుల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని విజయ్ ట్వీట్ చేశారు. చదవండి: ఆనంద్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గురించిన ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? ఈ సందర్భంగా ఆస్పత్రి బెడ్‌పైనే థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ ఉన్న తన ఫోటోని షేర్ చేశారు ఆయన. దీంతో ఆయన ట్వీట్ వైరల్‌గా మారింది. విజయ్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్న క్రమంలో స్వయంగా ఆయనే ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మలేషియాలో జరుగుతున్న బిచ్చగాడు-2 షూటింగ్లో యాక్షన్ సీన్స్ చేసే క్రమంలో బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. Dear friends, I am safely recovered from a severe jaw and nose injury during Pichaikkaran 2 shoot in Malaysia. I just completed a major surgery. I will talk to you all as soon as possible😊✋ Thank you for all your support and concern for my health🙏❤️ pic.twitter.com/YJm24omxrS — vijayantony (@vijayantony) January 24, 2023 -
పంత్ పరిస్థితిపై బీసీసీఐ కీలక అప్డేట్
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న సమయంలో పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పంత్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బీసీసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పంత్‌కు చికిత్స జరుగుతోందని.. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. అయితే పంత్ గాయాలు మాత్రం తీవ్రంగానే ఉందని పేర్కొంది. పంత్ నుదుటి చిట్లిందని అలాగే మొహంపై రెండు చీలికలు ఉన్నాయని తెలిపింది వీపుపై కాలిన గాయాలు ఉన్నట్లు పేర్కొంది. దీంతో పాటు కుడి మోకాలి లిగ్మెంట్ కదిలినట్లు ఎక్స్‌రేల్లో తేలినట్లు వెల్లడించింది. వీటితో పాటు కుడిచేయి మణికట్టు, కుడికాలు చీలమండ, పాదానికి కూడా గాయాలైనట్లు పేర్కొంది. ఇక ఈ ఘటనపై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ట్రీట్మెంట్ జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే పంత్ కుటుంబ సభ్యులతో మాట్లాడానన్నారు. వైద్యులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. పంత్ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామన్న జైషా.. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చదవండి: Rishabh Pant: పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే.. My thoughts and prayers are with Rishabh Pant as he fights his way back to recovery. I have spoken to his family and the doctors treating him. Rishabh is stable and undergoing scans. We are closely monitoring his progress and will provide him with all the necessary support. — Jay Shah (@JayShah) December 30, 2022 Media Statement - Rishabh Pant The BCCI will see to it that Rishabh receives the best possible medical care and gets all the support he needs to come out of this traumatic phase. Details here 👇👇https://t.co/NFv6QbdwBD — BCCI (@BCCI) December 30, 2022 -
Rishabh Pant: పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే..
Rishabh Pant Accident- Health Update: టీమిండియా డాషింగ్ క్రికెటర్ రిషభ్ పంత్ ఆరోగ్యంపై డెహ్రాడూన్ వైద్యులు స్పందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కాగా శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైన పంత్‌కు డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. యాక్సిడెంట్లో పంత్ తల, కాలికి గాయాలు అయినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అతడికి చికిత్స అందిస్తున్న వైద్య బృందంలోని ఓ డాక్టర్ మాట్లాడుతూ.. ‘‘పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాలు ఫ్రాక్చర్ అయింది. ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి రావొచ్చు’’ అని పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనం ప్రచురించింది. మెరుగైన వైద్యం కాగా ఉత్తరాఖండ్ అంబాసిడర్ పంత్ ప్రమాద ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. అతడికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అదృష్టవశాత్తూ పంత్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని.. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రాణాలతో బయటపడ్డాడు డివైడర్‌ను ఢీకొన్న ప్రమాద ఘటనలో పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమైపోయింది. 25 ఏళ్ల రిషభ్ పంత్ చాకచక్యంగా వెంటనే కారులో నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఈ విచారకర ఘటనపై స్పందించిన క్రీడా ప్రముఖులు, అభిమానులు పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా బంగ్లాదేశ్ పర్యటన ముగించుకున్న రిషభ్ పంత్‌కు స్వదేశంలో శ్రీలంకతో సిరీస్ నేపథ్యంలో విశ్రాంతినిచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Rishabh Pant: ఉదయమే పంత్ గురించి ఆలోచించా.. ఇంతలో ఇలా Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం.. -
నటుడు శరత్‌కుమార్ ఆరోగ్యంపై వదంతులు.. పీఆర్ టీం క్లారిటీ
ప్రముఖ సినీనటుడు శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. డయేరియా, డీహైడ్రేషన్‌తో శరత్‌కుమార్‌ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారని వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్‌మీడియాలోనూ శరత్‌కుమార్ ఆరోగ్యంపై వదంతులు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై శరత్‌కుమార్ పీఆర్ టీం స్పందించింది. చిన్నపాటి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆసుపత్రికి వెళ్లారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని పీఆర్ టీం తెలిపింది. కాగా తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శరత్‌కుమార్‌కు ప్రస్తుతం వారీసు చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి తాజా అప్డేట్
-
హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు
తమిళ సీనియర్ నటుడు, దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగమ్ (DMDK) అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ కొన్ని రోజులుగా కోలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విజయకాంత్ ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆయన కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. మధుమేహంతో బాధపడుతున్న ‘కెప్టెన్’ కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు డీఎండీకే తెలిపింది. చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని కూడా పార్టీ పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులు, కార్యకర్తలను కోరింది. విషయం తెలిసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ట్వీట్ చేశాడు. ‘నా ప్రియ మిత్రుడు విజయకాంత్ త్వరగా కోలుకుని మునుపటిలా కెప్టెన్‌గా గర్జించాలని సర్వశక్తిమంతుడైన దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ రజనీ పేర్కొన్నాడు. என் அருமை நண்பர் விஜயகாந்த் அவர்கள் விரைவில் குணமடைந்து பழையபடி கேப்டனாக கர்ஜிக்க வேண்டும் என்று எல்லாம் வல்ல இறைவனை வேண்டுகிறேன். — Rajinikanth (@rajinikanth) June 21, 2022 -
కోవిడ్‌ను జయించిన 92 ఏళ్ల లతా మంగేష్కర్.. కానీ!
Lata Mangeshkar Latest Health Update: ప్రముఖ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యంపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కీలక ప్రకటన చేశారు. కరోనా బారినపడిన చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్ తాజాగా కోవిడ్‌ను జయించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని, రెండు రోజుల క్రితమే వెంటిలేటర్ కూడా తీసేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా న్యూమోనియా నుంచి కూడా లతాజీ కోలుకున్నట్లు వివరించారు. అయితే మరికొన్ని రోజుల పాటు ఆమెను ఐసీయూలోనే వైద్యుల బృందం పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈనెల 8న కరోనాతో లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. I spoke with Dr Pratit Samdani who is treating singer Lata Mangeshkar. She's recovering, was on a ventilator for some days, but is better now. She is no more on ventilator. Only oxygen is being given to her. She is responding to the treatment: Maharashtra Minister Rajesh Tope pic.twitter.com/qOSP2H9OLl — ANI (@ANI) January 30, 2022 -
లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్: వెంటిలేటర్ తీసేసినా..
Lata Mangeshkar Latest Helath Update: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్ విడుదలైంది. ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్న ఆమెకు వెంటిలేటర్ తొలగించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వెంటిలేటర్ లేకుండా ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ ఉదయం కాసేపు వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నట్లు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. డాక్టర్ ప్రతీత్ సందానీ నేతృత్వంలోని వైద్యబృందం లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం గమనిస్తోందని తెలిపారు. లతాజీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈనెల 8న కరోనాతో లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. pic.twitter.com/xDxD43SHsw — Lata Mangeshkar (@mangeshkarlata) January 27, 2022 -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన..
Lata Mangeshkar Health Update: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి కీలక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించిందటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె అధికార ప్రతినిధి ఖండించారు. ఈ వదంతులను నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చారు. లతా దీదీ ఇంకా ఐసీయూలోనే ఉంది. డాక్టర్ ప్రతీత్ సందానీ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయవద్దు. లతా మంగేష్కర్ కుటుంబానికి, వైద్యులకు ప్రైవసీ ఇవ్వాలి అంటూ ప్రకనటలో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ విఙ్ఞప్తి చేశారు. #LataMangeshkar health update: She's showing signs of improvement, still in ICUhttps://t.co/h5TekiPHOp — India Today Showbiz (@Showbiz_IT) January 22, 2022 -
కైకాల ఆరోగ్యంపై ఆడియో సందేశం ఇచ్చిన కూతురు రమాదేవి
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి కాస్తా విషమంగా ఉందని, ఆయనను కాపాడేందుకు కృషి చేస్తున్నామంటూ రెండు రోజుల క్రితం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. చదవండి: కైకాల సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాలుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి, ఒక దశలో ఆయన పరిస్థితి విషమించిందని, పరిస్థితి చేచారిందంటూ సోషల్ మీడియాల్లో ప్రచారం మొదలు పెట్టారు. ఇక ఈ పుకార్లకు చెక్ పెడుతూ కైకాల కూతురు రమాదేవి ఓ ఆడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ అంతేగాక తన తండ్రి కైకాల ఆరోగ్యం కొంత మెరుగుపడిందని, ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నట్లు ఆమె చెప్పారు. ఇక ఆయన ఆరోగ్యంపై అనవసరపు ప్రచారం చెయోద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కూడా ఎవరూ నమ్మోద్దని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవరం లేదని ఆమె స్పస్టం చేశారు. కాగా ప్రస్తుత సమాచారం ప్రకారం కైకాల సత్యనారాయణ అపోలోలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన చికిత్సకి స్పందిస్తున్నారు. త్వరలోనే కైకాల కోలుకుంటారని వైద్యులు చెప్తున్నారు. -
కైకాల సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు ఆదివారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కైకాల స్పృహలోనే ఉన్నారని, ఆయనకు చికిత్స కొనసాగుతోందని అపోలో వైద్యులు తెలిపారు. అయితే ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వివరించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బీపీ లెవల్స్ చాలా తక్కువగా ఉండటంతో వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: కొడుకుని ప్రేమతో ముద్దాడిన ఎన్టీఆర్.. వైరలవుతోన్న ఫోటో కైకాలను ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిశీలిస్తోందని తెలిపారు. కాగా గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడటంతో నొప్పులు ఎక్కువగా ఉండటంతో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధిస్తున్నారు. -
రజనీకాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లతా
-
రజనీకాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లతా
Latha Rajinikanth Reacts On Rajinikanth Health: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ఆయన భార్య లతా రజనీకాంత్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే రజనీ ఆసుపత్రిలో చేరారని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. కాగా నిన్న సాయంత్రం రజినీకాంత్ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వచ్చిన రజినీకాంత్ గురువారం సాయంత్రం హుటాహుటిన రజినీ అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చదవండి: అభిమానులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అజయ్‌భూపతి ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ -
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన తమన్
Sai Dharam Tej Is Recovering Reveals SS Thaman: సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ అక్టోబర్1న విడుదల కానుంది. దేవాకట్టా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతున్న సమయంలో సెప్టెంబర్ 10న యాక్సిడెంట్ సాయితేజ్‌కు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. కొన్ని రోజుల క్రితం సాయి తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ అయ్యింది. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయితేజ్ ఆరోగ్యంపై పవన్ కల్యాణ్ అన్న మాటలు ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సాయితేజ్ ఆరోగ్యంపై అప్డేట్ ఇవ్వాల్సిందిగా అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రిక్వెస్టులు చేస్తున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ స్పందించారు. 'నా నన్భన్(స్నేహితుడు) కోలుకుంటున్నాడు. అప్డేట్ ఇచ్చినందుకు తేజ్ మ్యానెజర్ బి.కే.ఆర్. సతీశ్‌కు ధన్యవాదాలు. త్వరలోనే నా స్నేహితుడ్ని కలుస్తున్నందుకు ఎగ్జైటెడ్‌గా ఉన్నాను అంటూ' తమన్ ట్వీట్ చేశారు. All your prayers are working ❤️ My nanban @IamSaiDharamTej is recovering ❤️🩹 So well thanks @bkrsatish for the update . I am so excited to meet mY dear nanban in couple of days ⭐️#GetWellSoonSDT love u Nanba😍 — thaman S (@MusicThaman) September 30, 2021 -
'సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారు..వెంటిలేటర్ తొలగించాం'
Sai Dharam Tej Latest Health Bulletin: హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని, వెంటిలేర్‌ను కూడా తొలిగించినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే చికిత్స నిమిత్తం మరికొన్ని రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంటారని వెల్లడించారు. కాగా కొన్ని రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయిన అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. ఇటీవలో ఆయన కాలర్ బోన్‌కు శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. చదవండి : కాబోయే భర్తకు గ్రాండ్‌గా సర్ప్రైజ్ ఇచ్చిన నయనతార ‘మా’ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నిబంధనలు ఇవే -
నర్సులతో కలిసి సినిమా చూస్తున్న విజయకాంత్
Vijayakanth Watches Super Hit Movie With Nurses In Dubai : తాను ఆరోగ్యంగానే ఉన్నానని డీఎండీకే అధినేత విజయకాంత్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నర్సులతో కలిసి కాలక్షేపం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆయన్ని దుబాయ్‌కు తరలించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై పార్టీ నాయకులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో తాను ఆరోగ్యంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. తాను నటించిన క్షత్రియన్ను ఆస్పత్రి నర్సు లతో కలిసి చూస్తూ.. కాలక్షేపం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. దీంతో డీఎండీకే వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. Am doing well. Watching 'Satriyan' movie, with Sisters who taking care of me. நான் நல்ல உடல் நலத்துடன் உள்ளேன். நான் நடித்த 'சத்ரியன்' திரைப்படத்தை, எனது சிகிச்சைக்கு உதவிபுரியும் செவிலியர் சகோதரிகளுடன் பார்த்த போது எடுத்த படம். pic.twitter.com/QekthdQNz2 — Vijayakant (@iVijayakant) September 5, 2021 చదవండి : బిల్డప్ రౌడీగా వచ్చేస్తున్న సందీప్ కిషన్ హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు -
Maoist Party : హిడ్మా, శారద క్షేమమే
సాక్షి, హైదరాబాద్/గంగారం: తమ పార్టీ అగ్రనేతలు మడవి హిడ్మా, శారద అలియాస్ జజ్జర్ల సమ్మక్కలు క్షేమంగానే ఉన్నారని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. హిడ్మా, శారదక్కలు మరణించారంటూ పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఒకవేళ వారు మరణిస్తే తామే సమాచారం ఇస్తామని వెల్లడించారు. ఇటీవల మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, మరో నేత భారతక్క కరోనా బారినపడిన సమయంలో పోలీసులు, గ్రేహౌండ్స్ జవాన్లు తమపై దాడికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అందుకే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తమ అగ్రనేతలకు సరైన చికిత్స అందించలేకపోయామని పేర్కొన్నారు. ఎవరి మాటలు నమ్మాలి: లింగమ్మ కరోనా నేపథ్యంలో ఇటీవల తన అల్లుడు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మృతి చెందినట్లు ప్రచారం అయిందని, చివరికి ఇదే విషయాన్ని మావోయిస్టులు అధికారికంగా ప్రకటించారని శారదక్క తల్లి లింగమ్మ అన్నారు. అది జరిగాక నాలుగు రోజులకే తన కూతురు శారదక్క కూడా మృతి చెందిందని ప్రచారం జరగడంతో తామంతా దుఃఖ సాగరంలో మునిగి పోయామన్నారు. భార్యాభర్తలు చనిపోవడంతో ఇద్దరికీ కలిపి పెద్దకర్మ చేసేందుకు కార్డులను ముద్రించామని చెప్పారు. కానీ ఇప్పుడు శారదక్క బతికుందని మావోయిస్టు పార్టీ ప్రకటించడంతో కుటుంబసభ్యులమంతా అయోమయంలో పడిపోయామని తెలిపారు. ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదన్నారు. చదవండి: దళిత సాధికారత: మేధావులకు సీఎం కేసీఆర్ పిలుపు -
చూపు కోల్పోయిన కత్తి మహేశ్?
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నప్పటికీ ఆయన తల, ముక్కు,కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగకపోవడం వలన మహేష్‌కు ప్రాణాపాయం లేదని తెలుస్తుంది. అయితే ఆయన ఎడమ కంటి చూపు మాత్రం పూర్తిగా పోయిందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్లు తమతో చెప్పారని కత్తి మహేష్ మేనమామ ఒకరు మీడియాకు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతుంది. సర్జరీ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. మరోవైపు కత్తి మహేశ్ త్వరగా కోలుకోవాలని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. ఈ ఘటనలో కత్తి మహేశ్ కారు నుజ్జు, నుజ్జు అయిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌పై విమర్శలు, వివాదాస్పద పోస్తులలో కత్తి మహేశ్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్‌కు తీవ్ర గాయాలు -
రోడ్డు ప్రమాదంలో సినీ విమర్శకుడు ‘కత్తి’కి గాయాలు
కొడవలూరు: రోడ్డు ప్రమాదంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్‌కు గాయాలయ్యాయి. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు.. మహేష్ తన స్నేహితుడు సురేష్‌తో కలిసి విజయవాడ నుంచి తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా యర్రవారిపాలేనికి శుక్రవారం రాత్రి ఇన్నోవా కారులో బయలుదేరారు. చంద్రశేఖరపురం వద్ద ముందు వెళుతోన్న కంటైనర్‌ను శని వారం తెల్లవారుజామున 2.30 గంటలకు కారు ఢీకొంది. ఆ సమయంలో మహేష్ స్నేహితుడు కారును డ్రైవ్ చేస్తున్నారు. ఘటనలో మహేష్‌కు కంటి భాగంలో తీవ్ర గాయమైంది. ఆయనను హైవే మొబైల్ పోలీ సులు నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పిం చారు. ప్రమాదం నుంచి సురేష్ సురక్షితంగా బయటపడ్డారు. మహేష్‌కు ఎడమ కన్ను బాగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స అవసరమ ని వైద్యులు నిర్ధారించి ఆయనను శనివారం చెన్నైకు తరలించారు. చదవండి: రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్‌కు తీవ్ర గాయాలు -
ఆసుపత్రి నుంచి కెప్టెన్ విజయకాంత్ డిశ్చార్జ్
చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విజయకాంత్ కోలుకొని ఇంటికి చేరుకున్నారని పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన క్షేమంగా ఉన్నారని, అనవసరంగా ఆయన ఆరోగ్యం గురించి లేనిపోని పుకార్లు సృష్టించవద్దని అభ్యర్థించారు. కాగా ఈనెల 19న విజయ్‌కాంత్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఊపిరాడని సమస్య మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై మనప్పాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. విజయకాంత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అప్పటినుంచి విజయ్‌కాంత్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పార్టీ కార్యాలయం తాజాగా విడుదల చేసిన ప్రకటనతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కెప్టెన్ అంటూ ప్రజలతో అభిమానంగా పిలువబడే విజయకాంత్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయన కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను సింగపూరులో చికిత్స చేయించి సుమారు మూడునెలల తరువాత చెన్నైకి తీసుకొచ్చారు. దాదాపుగా మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనకుండా ప్రధాన కార్యాలయంలో జరిగే ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. పార్టీ కోశాధికారి హోదాలో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని నడుపుతున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ఏమీ మాట్లాడకుండా కారులోనే కూర్చుండి సైగలతో ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఆయన మళ్లీ ఇంటికే పరిమితమయ్యారు. చదవండి : Vijayakanth Health Condition 2021: విజయ్ కాంత్‌కు అస్వస్థత టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత -
సీఎం కేసీఆర్ తాజా రిపోర్ట్‌లో మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరోనా నుంచి కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు ప్రకటించారు. కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్‌కు తాజాగా గురువారం యాంటిజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. వాటిల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. నిన్నటి యాంటిజెన్ టెస్ట్ నివేదికలో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ పరీక్ష నివేదికలో కచ్చితమైన ఫలితం రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని వైద్యుడు ఎంవీ రావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రెండు, మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కు ఏప్రిల్ 19వ తేదీన కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నారు. అంతకుముందు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసుకున్నారు. చదవండి: నాగార్జున సాగర్ మళ్లీ టీఆర్ఎస్దే చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. -
సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే కోవిడ్ బారిన పడి తన వ్యవసాయ క్షేత్రంలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం పూర్తిస్థాయిలో చక్కబడిందని ఆయన వ్యక్తిగత వైద్యుడు డా.ఎం.వి.రావు గురువారం మీడియాకు తెలిపారు. ఆరోగ్యపరంగా ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని, తగిన విశ్రాంతి అనంతరం త్వరలోనే రోజువారీ కార్యక్రమాలకు హాజరవుతారని తెలియజేశారు. బుధవారమే ఆయనకు వివిధ వైద్యపరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించగా, గురువారం వాటన్నింటినీ పరిశీలించినపుడు అన్నీ సవ్యంగా ఉన్నట్టుగా తేలిందన్నారు. సీఎంకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని ఇదివరకే వెల్లడి కాగా, రక్తనమూనాలు అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని డా.ఎం.వి.రావు తెలిపారు. చదవండి: భర్తకు కరోనా.. భయంతో ఉరేసుకున్న భార్య చదవండి: కరోనా విజృంభణ ప్రధాని మోదీ కీలక నిర్ణయం -
గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉంది: అపోలో
ముంబై: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్‌కతా అపోలో ఆస్పత్రి వర్గాలు దాదా ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్‌ని విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని.. భయపడాల్సిన పని లేదని వెల్లడించాయి. ఈ రోజు గంగూలీ సాధారణ కార్డియాక్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లారని.. అన్ని ముఖ్యమైన పారామీటర్స్ సవ్యంగా ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇక గతంలోనే గుండెనొప్పితో బాధపడిన గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రోజు మరోసారి ఆయన ఆస్పత్రికి వెల్లడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొన్నది. (చదవండి: ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది: షమీ) -
మరింత మెరుగ్గా బాలు ఆరోగ్యం
సాక్షి, చెన్నై: కోవిడ్-19తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటన్నట్లు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ‘బాలసుబ్రహ్మణ్యం పూర్తి స్పృహలోనే ఉన్నారు.. వైద్యానికి స్పందిస్తున్నారు. ఫిజియోథెరపీలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు’ అని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనా సోకడంతో ఎస్పీ బాలు ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తొలుత ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ మధ్యలో కాస్త విషమించింది. దాంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన కోలుకుంటున్నారని..మనుషులను గుర్తుపడుతున్నారని తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. (చదవండి: బాలుకి కరోనా.. నేను కారణం కాదు: గాయని) -
‘సెప్టిక్ షాక్’లోకి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఆయన ఆరోగ్యాన్ని మరింత కుంగదీసిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నిన్నటి నుంచి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ‘సెప్టిక్ షాక్’లోకి వెళ్లారు. నిపుణులైన వైద్య బృందం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రస్తుతం ప్రణబ్ డీప్ కోమాలో ఉన్నారు. వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నాం’ అంటూ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. (చదవండి: ఆస్పత్రి నుంచి అమిత్ షా డిశ్చార్జ్) సాధారణంగా ‘సెప్టిక్ షాక్’కి గురయ్యే వ్యక్తుల్లో గుండె, మెదడు, కిడ్నీలు వంటి కీలక అవయవాలు దెబ్బతినడం, బీపీ తీవ్రంగా పడిపోవడం జరుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు మూత్ర సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. ఒకరకంగా సెప్టిక్ షాక్‌లోకి వెళ్లడమంటే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఇన్ఫెక్షన్ బారినపడిన తర్వాత శరీరంలో బీపీ ఒక్కసారిగా పడిపోవడంతో ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తుతుంది. ఇక ప్రణబ్ ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా ట్వీట్ చేస్తున్న అతని కుమారుడు అభిజిత్ ముఖర్జీ ‘ప్రతి ఒక్కరూ తన తండ్రి కోసం ప్రార్థించాల్సిందిగా కోరారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం క్లిష్టంగానే ఉందని.. కానీ అతని కీలకమైన పారామీటర్స్ అన్ని స్థిరంగా ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు. I urge all my friends here to pray for the recovery of My father #PranabMukherjee . He is a fighter & with all your good wishes & prayers , He will surely recover ! At the moment he is critical but all his vital parameters are stable ! — Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 31, 2020 -
విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం
తమిళసినిమా (చెన్నై): కరోనాతో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమంగానే ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విదేశీ వైద్యుల సూచనలతో ఎక్మో పరికరంతో వైద్యం చేస్తున్నామన్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన కోలుకునే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. బాలు కోసం ప్రార్థనలు: ఎస్పీబీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రముఖ నటుడు రజనీకాంత్, కమలహాసన్, దర్శకుడు భారతీరాజా, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. బాలు త్వరగా కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు చేద్దామని దర్శకుడు భారతీరాజా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత కళాకారులతో గురువారం సాయంత్రం 6 గంటలకు ఎస్పీబీ పాటల ద్వారా సామూహిక ప్రార్థనలు చేద్దామని పిలుపునిచ్చారు. -
నిలకడగా...
ఇటీవలే క్యాన్సర్‌కి గురై లండన్‌లో చికిత్స పొందుతున్నారు సోనాలీ బింద్రే. ఆమె క్షేమసమాచారాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఈ క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్నానని సోనాలీ పేర్కొ న్నారు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని సోనాలీ భర్త గోల్డీ బెహల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. భార్య హెల్త్ అప్డేట్ను బెహల్ షేర్ చేస్తూ – ‘‘సోనాలీ మీద అందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. తన ఆరోగ్యం నిలకడగా ఉంది. ట్రీట్మెంట్కు బాగా రెస్పాండ్ అవుతోంది. క్యాన్సర్‌కి ఎదురుగా పోరాడటం పెద్ద జర్నీ. మేం పాజిటివ్‌గా స్టార్ట్ చేశాం’’ అన్నారు. -
టెన్షన్..టెన్షన్.. అపోలో రోగుల తరలింపు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నగరాల్లో ముఖ్యంగా చెన్నైలో అప్రమత్తత పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నగరంలోని పలు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ముందస్తుగా ఇంటికి పంపించేస్తున్నాయి. కొన్ని సంస్థలు మధ్యాహ్నానికే సెలవులు ప్రకటించాయి. మరోపక్క, జయ చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద టెన్షన్ పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సీరియస్ కేసులను సైతం జాగ్రత్తగా అంబులెన్స్‌ల ద్వారా వేరే ఆస్పత్రులకు మారుస్తున్నారు. వారి రోగాన్ని బట్టి ఇతర నగరాల్లోని ఆస్పత్రులకు కూడా వారిని తరలిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క, జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి ఏఐఏడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోతోంది. ఆస్పత్రి వద్ద కాస్తంత ఉద్విగ్న పరిస్థితి నెలకొనడం, ఆస్పత్రిలోని రోగులను వేరే ఆస్పత్రులకు తరలిస్తున్న నేపథ్యంలో జయను తమకు చూపించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు, బ్లాక్ కమాండోస్‌ను రంగంలోకి దించారు. మొత్తానికి తమిళనాడు అంతటా కూడా ఉక్కిరిబిక్కిరి పరిస్థితి కనిపిస్తోంది. -
24 గంటలు గడిస్తే తప్ప..!
24 గంటల్లో జయలలితకు చికిత్స స్పందించే అవకాశం: వైద్యులు చెన్నై: ఆరోగ్యం తీవ్రంగా విషమించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ కోలుకోవడంపై 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని చెన్నైలోని అపోలో వైద్య వర్గాలు చెప్తున్నాయి. రానున్న 24 గంటలు జయలలితకు అత్యంత కీలకమని, ఆమె చికిత్సకు స్పందించడానికి 24 గంటల సమయం పట్టవచ్చునని వైద్యులు తెలిపారు. అదేసమయంలో జయలలిత రక్తపోటు, హృదయ స్పందన (హార్ట్‌రేట్), శ్వాస, బాడీ టెంపరేచర్ వంటివి వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. జయలలితకు ఆదివారం సాయంత్రం తీవ్రస్థాయిలో గుండెపోటు రావడంతో ఆమెకు ‘ఈసీఎంవో’ ఏర్పాటు చేశామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈసీఎంవో అంటే ‘ఎక్స్ట్రాకార్పోరియల్ మెబ్రేన్ ఆక్సిజెనేషన్’.. శారీరక ధర్మాలను గుండె, ఊపిరితిత్తులు నిర్వహించలేకపోయినప్పుడు ఈ యాంత్రిక వ్యవస్థ ద్వారా వాటి విధులను నిర్వహింపజేస్తారు. రోగికి అత్యంత ప్రాణాపాయం ఉన్నప్పుడు మాత్రమే ఈ యాంత్రిక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇందులో రోగి బతికే అవకాశాలు ఫిఫ్టీ, ఫిఫ్టీ మాత్రమే ఉంటాయని హృద్రోగ నిపుణులు చెప్తున్నారు. జయలలిత ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని అపోలో ఆస్పత్రి విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించడంతో తమిళనాడు అంతటా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్షణక్షణం అమ్మ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతుండటంతో ఒక్క చెన్నై నగరంలోనే 15వేలమంది బలగాలను మోహరించారు. అపోలో ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న షాపులన్నింటినీ ఖాళీ చేయించి.. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.