
కొడవలూరు: రోడ్డు ప్రమాదంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్‌కు గాయాలయ్యాయి. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు.. మహేష్ తన స్నేహితుడు సురేష్‌తో కలిసి విజయవాడ నుంచి తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా యర్రవారిపాలేనికి శుక్రవారం రాత్రి ఇన్నోవా కారులో బయలుదేరారు.
చంద్రశేఖరపురం వద్ద ముందు వెళుతోన్న కంటైనర్‌ను శని వారం తెల్లవారుజామున 2.30 గంటలకు కారు ఢీకొంది. ఆ సమయంలో మహేష్ స్నేహితుడు కారును డ్రైవ్ చేస్తున్నారు. ఘటనలో మహేష్‌కు కంటి భాగంలో తీవ్ర గాయమైంది.
ఆయనను హైవే మొబైల్ పోలీ సులు నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పిం చారు. ప్రమాదం నుంచి సురేష్ సురక్షితంగా బయటపడ్డారు. మహేష్‌కు ఎడమ కన్ను బాగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స అవసరమ ని వైద్యులు నిర్ధారించి ఆయనను శనివారం చెన్నైకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment