kathi mahesh
-
కత్తి మహేశ్ ప్రమాదంపై విచారణలో డ్రైవర్ సురేశ్ ఏమన్నాడంటే..
సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ జరిపించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొవ్వూరు సీఐ ప్రమాదంలో కత్తి మహేశ్ కారు డ్రైవింగ్ చేస్తున్న సురేశ్‌ను పిలిచి విచారించారు. ఈ విచారణలో డ్రైవర్ ప్రమాదం జరిగిన తీరును ఇలా వివరించాడు. నిద్ర సమయం కావటంతో నెల్లూరులో ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకున్నామని, ఆ లోపే ఈ ఘటన జరిగిందన్నాడు. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించాడు. ప్రమాదం సమయంలో కత్తి మహేశ్ నిద్రలో ఉన్నారని, సీటు బెల్టు కూడా పెట్టుకోకపోవడం వల్ల ఆయన ముందుకు పడినట్లుగా సురేశ్ వెల్లడించాడు. ఈ క్రమంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ పగిలిన అద్దాల ముక్కలు మహేశ్ కంటికి గుచ్చుకున్నాయని అన్నాడు. ఆయనకు రక్తస్రావం అవుతుండటంతో హైవే పెట్రోలింగ్ పోలీసుల సాయంతో మహేశ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించామన్నాడు. అయితే అక్కడ ఐ స్పెషలిస్టు లేకపోవటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి తరలిచించామని తెలిపాడు. మరీ ఈ ప్రమాదంలో మీకేందుకు గాయాలు కాలేదని పోలీసులు అడగడంతో తను సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే గాయాలు కాలేదని సురేశ్ సమాధానం ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ విచారణ అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, ఈ కేసులో తనని అనుమానించాల్సిన అవసరం లేదన్నాడు. అవసరమైతే మళ్లీ పోలీసుల విచారణకు సహకరిస్తానని సురేశ్ పేర్కొన్నాడు. ఇక సీఐ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి ట్వీట్‌తో మహేశ్ ప్రమాద ఘటనపై విచారణ జరిపాం అన్నారు. ఈ మేరకు కారు నడిపిన సురేశ్‌ను పిలిచి విచారించామని, ప్రమాదం జరిగిన తీరు గురించి వివరాలు అడిగినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని విచారించాల్సి ఉందని సీఐ తెలిపారు. -
కత్తి మహేశ్‌కు జరిగిన ప్రమాదం తీరు అనుమానాస్పదంగా ఉంది: మందకృష్ణ
సాక్షి, నెల్లూరు: సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్ జరిగిన ప్రమాదం తీరు చూస్తుంటే అనుమానంగా ఉందన్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేశ్ కారు కుడి భాగం నుజ్జునుజ్జు అయినప్పటికీ డ్రైవర్ సురేశ్ స్వల్ప గాయాలతో బయటపడటం ఏంటని, ఎడమ వైపు కూర్చున్న మహేశకు తీవ్ర గాయాలవడం ఏంటని ప్రశ్నించారు. మహేశ్‌కు ఎంతో మంది శత్రువులు ఉన్నారన్నారని, గతంలోని దాడులు, కొన్ని సంఘటనలు దీనికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్నారు. తొలుత కత్తి మహేశ్‌కు గాయాలే కాలేదని చెప్పారన్నారు. ఆసుపత్రిలో మహేశ్ ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు పెట్టారని చెప్పారు. కత్తి మహేశ్ మరణంపై విచారణ జరిపించాలని ఏపీ సర్కారును ఆయన కోరారు. అంతేగాక ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ రోజు నెల్లూరు జిల్లా రూరల్ డీఎప్సీని కలిసి కత్తి మహేశ్ మృతిపై విచారణ జరపాల్సిందిగా కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీంతో సీఐ రామకృష్ణా రెడ్డి డ్రైవర్ సూరేశ్‌ను విచారణకు పిలిచి దర్యాప్తు జరుపుతున్నారు. దీనితో పాటు కత్తి మహేశ్ తండ్రి సైతం తన కొడుకు మృతిపై అనుమానం ఉందని తెలిపారు. కాగా, గత జూన్ 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. -
కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు ఉన్నాయి: తండ్రి ఓబులేసు
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం కత్తి మహేశ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో జరిగాయి. అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ మహేశ్ మరణం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. కత్తి మహేశ్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాజాగా ఆయన తండ్రి ఓబులేసు కూడా మహేశ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ మరణించిన విషయం తమ కంటే ముందే బయటకు చెప్పారని ఆయన తెలిపారు. కత్తి మహేశ్ మృతిపై న్యాయ విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వయసు రీత్యా తన శరీరం సహకరించడం లేదని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని ఓబులేసు విజ్ఞప్తి చేశారు. -
ఆ రెండు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కత్తి మహేశ్
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పలు వివాదాస్పద అంశాలతో చర్చకు తెరతీసి పాపులర్ అయిన కత్తి మహేశ్‌కు సోషల్ మీడియాలోనూ బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పలు సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీలు అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువు పూర్తయ్యాక ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేసిన కత్తి మహేశ్..రాఘవేంద్రరావు ప్రొడక్షన్ హౌస్‌లో ‘రాఘవేంద్ర మహత్య్మం’ సీరియల్‌కు పనిచేశారు. 2015లో పెసరట్టు అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. అయితే నటుడిగా రాణించాలనే కోరికతో హృదయ కాలేయం,కొబ్బరి మట్ట సహా కొన్ని చిత్రాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఎప్పటికైనా నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కకోవాలని అనుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన సన్నిహితులతో పాటు స్నేహితులతోనూ పదేపదే చెప్పేవారట. అంతేకాకుండా రాజకీయాల్లోనూ రాణించాలని భావించారట. అయితే దురదృష్టవశాత్తూ యాక్టింగ్, పాలిటిక్స్..ఈ రెండింటిలోనూ ఆయన ప్రారంభ దశలో ఉండగానే అకస్మాత్తుగా కన్నుమూశారు. 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించినా అప్పుడు కుదరలేదు. మొత్తానికి నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనదైన గుర్తింపు సంపాదించాలన్న కత్తి మహేశ్..ఆ రెండు కోరికలు తీరకుండానే తుదిశ్వాస విడిచారు. -
కత్తి మహేష్ : ఎన్నో వివాదాస్పద అంశాలు..అయినా బెదరలేదు
‘‘శోధన, సాధన చేసిన జ్ఞానం మాత్రమే శాశ్వతమని నమ్ముతాను. నిరంతరం ప్రశ్నించుకుంటూ నిజాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.’’ అప్పటికి మూడు పదులు కూడా నిండని కత్తి మహేష్– బ్లాగ్ పరిచయంలో తన చూపుని అట్లా ప్రకటించుకున్నాడు. ఎలాంటి కాలమది!. పత్రికలు, టీవీలని దాటి కొత్త మాధ్యమాలు అవతరిస్తున్నాయి. ఆర్కుట్ మూత పడుతూ బ్లాగులు కళకళ లాడుతున్నాయి. అప్పటివరకూ సాహిత్యం, సమాజం పట్ల నిబద్ధత కలిగిన మేధా సమూహాల రచనలకి దీటుగా సమస్త భావజాలాల మేలిమి ఆలోచనలతో బ్లాగ్ ప్రపంచం విస్తరించింది. 2007 – 2012 కాలంలో తెలుగు బ్లాగుల్లో కుల మత, ప్రాంత, జెండర్ భావాల సైద్ధాంతికతని ఒంటిచేత్తో ప్రవేశ పెట్టినవాడు మహేష్. అతని ‘పర్ణశాల’ బ్లాగ్ – అర్ధ దశాబ్దపు విస్ఫోటనం. తమ అభిమాన హీరో మీద విమర్శ చేస్తేనో, తాము పూజించే దేవుడిని తార్కికంగా ప్రశ్నిస్తేనో అతను ఎదుర్కొన్న దాడులు ఇటీవలివి. ట్రోలింగ్ అన్నమాట సమాజానికి పూర్తిగా పరిచయం కాకముందే పలు ఆధిపత్య సమూహాల చేత ట్రోల్ చేయబడ్డాడు. వ్యభిచార చట్టబద్ధత, నగ్న దేవతలు, కుల గౌరవ హత్యలు, ప్రత్యేక తెలంగాణ, పశువధ – గొడ్డు మాంసం, భాష – భావం, వివాహానికి పూర్వం సెక్స్, వర్గీకరణ సమస్య, గే చట్టం, కశ్మీర్ అంశం మొదలుకుని అనేక వివాదాస్పద అంశాల్లో పది పద్నాలుగేళ్ళకి ముందే దాదాపు నాలుగైదు వందల పోస్టులు రాసాడు. మేధావులనబడేవారి పరిమిత వలయంలో తిరుగాడుతుండే అటువంటి అంశాలని, వాటిమీద తన ప్రశ్నలని మామూలు ప్రజల మధ్యకి తీసుకు వచ్చాడు. అందుకోసం ఆర్కుట్– బ్లాగ్– ఫేస్బుక్– ట్విట్టర్– ఇన్ స్టాగ్రామ్ మీదుగా విస్తరించుకుంటూ సినిమాలు, పార్లమెంటరీ రాజకీయాలు తన కార్యక్షేత్రాలుగా నిర్ణయించుకున్నాడు. ప్రశ్నని నేర్చుకుంటే దానికి చెల్లించాల్సిన మూల్యం ఎంతటిదో తెలిసాక కూడా ‘నువ్వు రాసింది చదివి, రావలసిన వారికి కోపం రాకపోతే, నీ మీద బెదిరింపులకు దిగకపోతే, నీ మీద హత్యా ప్రయత్నమైనా జరగకపోతే, నువ్వేం రాస్తున్నట్టు?‘ అనగలిగిన తెగువ మహేష్‌కి ఉంది. అవును అతను దళితుడు, కానీ అతనిది మాలిమి చేయడానికి అనువైన బాధిత స్వరం కాదు, అందరినీ దూరం పెట్టే ఒంటరి ధిక్కార స్వరమూ కాదు. మందిని కలుపుకు పోయే, అనేక వర్గాలతో చెలిమి చేయగల ప్రజాస్వామిక స్వరం. ఈ గొంతు దిక్కుల అంచుల వరకూ వినబడగలిగే శక్తి కలిగినది కాబట్టే అంతే తీవ్రతతో వ్యతిరేకత కూడా వచ్చింది. కులం మతం వంటి సున్నితమైన అంశాల మీద మాట్లాడినపుడు, అతడి తర్కానికి జవాబు ఇవ్వడం తెలీని వారు, వ్యక్తిగత దూషణలకు దిగినా సంయమనం కోల్పోకుండా ఓపిగ్గా విషయాన్ని వివరించడానికి ప్రయత్నించేవాడే తప్ప మాట తూలేవాడు కాడు. అసలది అతని నైజమే కాదు. మహేష్ కంటే ముందే పురాణపాత్రలను విమర్శించిన వారెందరో ఉన్నారు. కేవలం అతని దళిత అస్తిత్వాన్ని ఆధారంగా చేసుకుని అతని విమర్శలను అంగీకరించక విషం కక్కిన లోకానికి మహేష్ ఎన్నడూ జడవలేదు. తిరిగి విషమూ కక్కలేదు. తనదైన శైలిలో తన అభిప్రాయాలను చెపుతూనే ఉన్నాడు, మర్యాదగా విభేదించడం మహేష్ వద్ద చాలామంది మిత్రులు నేర్చుకున్న విషయం. బ్లాగుల్లో తనతో హోరాహోరీ వాదనలకు దిగిన వ్యక్తులు బయట కలిస్తే అత్యంత స్నేహపూరితంగా ఉండేవాడు. పరుషమైన మాటలతో వ్యక్తిగత దూషణలు చేసినవారు సైతం, అతని స్నేహస్వభావానికి కరిగి స్నేహితులుగా మారిపోయిన సందర్భాలు అనేకం. రాముడిని విమర్శించి నగర బహిష్కరణకు గురైన అతడు 2007 లోనే తన బ్లాగ్ పేరు ‘పర్ణశాల’గా పెట్టుకున్నాడు. ‘పర్ణశాల అంటే ఆకుల పందిరి. దానికింద కూచుని అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. చాయ్ ఉంటే ఇంకా... రాముడు కూడా అలాంటిది ఒకటి కట్టుకున్నాడన్నమాట‘ అనేవాడు సరదాగా. వేలాది పేజీల తన రాతలు ఒక్క పుస్తకంగా కూడా వేసుకోలేదు మహేష్. అసలు ఆ ఆలోచన ఉన్నట్లు కూడా ఎపుడూ కనపడలేదు. నిలవ ఆలోచనల మీద ఘర్షణ, వ్యక్తుల్లో మానసిక విలువల పెంపుదల జరిగి మానవ సంస్కారంలో అవి ఇంకిపోతే చాలని అనుకునేవాడేమో! మనుషుల పట్ల ఇంత అక్కర ఉన్నవారు అత్యంత అరుదు. సామాజిక మాధ్యమాల్లో ఎవరి పోరాటాలు వారివి, తలదూర్చితే తలనొప్పులని తప్పుకునే వారే ఎక్కువ. కానీ మహేష్‌కి అంతశక్తి ఎలా వచ్చేదో కానీ తిరిగి ఒకమాట అనలేని వారి పక్షాన, చర్చల్లో ఒంటరులైనవారు అలిసిపోయే సమయాన– వారి ప్రాతినిధ్య స్వరంగా నిలబడేవాడు. ఇది చాలామందికి అనుభవమైన విషయం. ఎవరనగలరు అతనికి మనుషుల మీద ద్వేషం ఉందని! ఉన్నదల్లా ప్రేమే. ఆ ప్రేమ వల్లనే నాకెందుకని ఊరుకోక ప్రతిసారీ ఓపిగ్గా చర్చకి దిగేవాడు, చర్చే నచ్చనివారికి అది వితండవాదం కావొచ్చు. కానీ సంభాషిస్తూనే ఉండడం ఒక అంబేడ్కరైట్ గా అతని ఆచరణ. మహేష్‌కీ అంబేడ్కర్‌కీ ఆచరణలో ఒక పోలిక కనపడుతుంది. వారిద్దరూ తాము ప్రాతినిధ్యం వహించిన పీడిత కులాల గురించి ఆలోచనలు చేసి వారి ఎదుగుదలకి పునాదులు సూచించి ఊరుకోలేదు. అక్కడ నిలబడి స్వేచ్ఛా సమానత్వాలతో కూడిన సవ్యమైన జాతి మొత్తం నిర్మాణం కావాలని ఆశించారు. అందుకోసం అంబేడ్కర్ చేసిన కృషి ఆయన్ని జాతి మొత్తానికి నాయకుడిగా నిలిపింది. మహేష్ ఆయన మార్గంలో వడిగా సాగుతుండగా విషాదం సంభవించింది. రచయిత, విమర్శకుడు, సినిమా నటుడు, గాయకుడు, సామాజిక వ్యాఖ్యాత, కార్యకర్త, రాజకీయ నాయకుడుగా ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కత్తి మహేష్. మరి నాలుగైదు దశాబ్దాలు ఉండవలసిన మనిషి, అసమాన త్యాగాలతో నిండిన సామాజిక చైతన్యానికి కొత్త చేర్పుని, కొత్త రూపుని కనిపెట్టగల ఆధునిక ప్రజా కార్యకర్త – పరుగు పందాన్ని అర్ధాంతరంగా ఆపి విశ్రాంతికై తన కలల పర్ణశాలకి మరలిపోయాడు. వేలాది పేజీలలో, వందలాది ఉపన్యాసాలలో అతను పొదిగిన ప్రశ్నలను అంది పుచ్చుకుని ఈ పరుగుని కొనసాగించడమే మనం చేయగలిగింది. కె.ఎన్. మల్లీశ్వరి, సుజాత వేల్పూరి (నటుడు, సినీ, సాహిత్య, సామాజిక విమర్శకుడు కత్తి మహేష్‌కు నివాళిగా) -
Kathi Mahesh: బెంగాలీ యువతితో ప్రేమ..అనుకోకుండా ‘బిగ్‌బాస్’ ఆఫర్
సాక్షి, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కత్తి మహేశ్ అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో జరగనున్నాయి. సినీ విమర్శకుడిగా ఫేమస్ అయిన మహేశ్ నేపథ్యం ఒక్కసారి చూస్తే.. కత్తిమహేశ్ కుమార్ చిత్తూరు జిల్లాలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన తండ్రి వ్యవసాయశాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. మహేశ్‌కు ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. డైరెక్టర్ అవ్వాలనుకొని.. ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేశారు. రాఘవేంద్రరావు ప్రొడక్షన్ హౌస్‌లో ‘రాఘవేంద్ర మహత్య్మం’ సీరియల్‌కు పనిచేశారు. వర ముళ్లపూడి వద్ద 10 ఎపిసోడ్లకు సహాయకుడిగా పని చేసిన తర్వాత డబ్బులు సరిపోకపోవడంతో చిత్తూరు వెళ్లిపోయి ఓ ఎన్జీవోలో చేరారు. ఆ తర్వాత యూనిసెఫ్, వరల్డ్ బ్యాంకు, సేవ్ ది చిల్ర్డన్ తదితర సంస్థల్లో పనిచేశారు. బెంగాలీ యువతితో ప్రేమలో.. కత్తి మహేశ్‌ది ప్రేమ వివాహం. యూనిసెఫ్‌లో పనిచేస్తున్నప్పుడు బెంగాలీ యువతి సోనాలి పరిచమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. ఆమె కేర్ ఇండియా సంస్థ తరపున పనిచేసేది. వీరికి ఒక్క కుమారుడు ఉన్నారు. మరో ప్రయత్నం అనురాగ్ కశ్యప్ చెప్పిన మాటలకు స్ఫూర్తి పొంది సినిమా చేయాలని మళ్లీ ఇండస్ట్రీవైపు అడుగులు వేశారు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఊరు చివర ఇల్లు కథను ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ ఫిలింకి దర్శకత్వం చేశాడు. మిణుగురులు అనే చిత్రానికి సహ-రచయితగా వ్యవహరించాడు. పెసరట్టు అనే సినిమా క్రౌడ్ ఫండింగ్ ఆధారంగా నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు సమకూర్చుకుని తీశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అనుకోకుండా ‘బిగ్‌బాస్’లోకి బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ మొదటి సీజన్లో కత్తి మహేశ్ పాల్గొన్నారు. అయితే ఆ అవకాశం కూడా అనుకోకుండానే వచ్చిందని పలు సందర్భాల్లో మహేశ్ చెప్పారు. స్టార్ మా నుంచి కాల్ రాగానే ఏదైనా సినిమా కోసం ఏమో అనుకున్నారట. కానీ, బిగ్‌బాస్ కోసం అని చెప్పడంతో ఆశ్చర్యపోయారట. అలా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన ఆయన దాదాపు నాలుగు వారాల పాటు ప్రేక్షకులను అలరించారు. అలాంటి సినిమా తీయాలకున్నాడు సినిమాలు అంటే ఇష్టం కాని, నటుడు కావాలని కత్తి మహేశ్ ఎప్పుడు అనుకోలేదట. దర్శకుడిగా మారి మంచి చిత్రాలను తెరకెక్కించాలనుకున్నారట. అయితే సంపూర్ణేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘హృదయ కాలేయం’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు మహేశ్. ఆ సినిమా దర్శకుడు సాయిరాజేశ్ కోరిక మేరకు నటుడిగా మారాడట. ‘నిజానికి నటుడు అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. సాయి రాజేశ్ నాకు స్నేహితుడు. చిన్న బడ్జెట్లో ‘హృదయ కాలేయం’ తీస్తున్నానని నాతో చెప్పాడు. పెద్ద నటులతో చేసేంత బడ్జెట్ లేదని, మీకు సరిపోయే పాత్ర ఒకటి ఉంది చేస్తారా? ‘మీరు మీలా ఉంటే చాలు’ అని అడిగారు. నేను, రచయిత దర్శకుడు కావడంతో సంభాషణలు, హావభావాలు పలకడం సులభమైంది. అంతేకానీ, నేను గొప్ప నటుడిని కాదు’అని కత్తి మహేశ్ ఓ సందర్భంలో చెప్పారు. నేనే రాజు నేను మంత్రి, కొబ్బరి మట్ట, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, క్రాక్ సినిమాల్లో నటించారు. ఎప్పటికైనా మంచి సందేశాత్మక చిత్రం తీయాలని కత్తి మహేశ్ అనుకునేవారని, ఆయన కోరిక అదేనని ఆయన సన్నిహితులు చెప్పారు. -
కత్తి మహేశ్: సినిమాల పిచ్చి.. 50 రోజులకు 50 సినిమాలు
సాక్షి, వెబ్‌డెస్క్: బహుముఖ ప్రజ్ఞాశాలి కత్తి మహశ్ శనివారం కన్నుమూశారు. గత నెలలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఓ చిన్న పల్లెటూరి నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న కత్తి మహేశ్ జీవిత విశేషాలపై ఓ లుక్.. వ్యక్తిగత జీవితం : కత్తి మహేశ్‌కుమార్ అలియాస్ కత్తి మహేశ్ ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని పీలేరు పట్టణం దగ్గర ఎల్లమంద అనే గ్రామంలో ఓబులేసు, సరోజమ్మ దంపతులకు 1977లో జన్మించారు. తండ్రి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎక్స్‌టెన్సన్ ఆఫీసరుగా పనిచేసేవారు. మహేశ్‌కు ఓ అన్న, చెల్లి ఉన్నారు. పీలేరు, హర్యానా, అనంతపురంలలో ప్రాథమిక విద్య, మైసూరులో డిగ్రీ.. హైదరాబాద్‌లోని ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. చాటింగ్ ద్వారా పరిచయం అయిన సోనాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికో బాబు ఉన్నాడు. సినిమా కెరీర్ : కత్తి మహేశ్‌కు చిన్నప్పటినుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉండేది. మదనపల్లె, తిరుపతిలో ఎక్కువగా సినిమాలు చూస్తుండేవారు. 50 రోజుల వేసవి సెలవుల్లో 50 సినిమాలు చూసేవారంటే సినిమా అంటే ఎంతిష్టమో అర్థం చేసుకోవచ్చు. దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ‘ఊరి చివరి ఇళ్లు’ ఆధారంగా ‘ఎడారి వర్షం’ అనే షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించారు. 2014లో మిణుగురులు సినిమాకు కో రైటర్‌గా పనిచేశారు. అదే సంవత్సరంలో వచ్చిన కామెడీ సినిమా ‘హృదయ కాలేయం’లో పోలీస్ పాత్రను పోషించారు. 2015లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘పెసరట్టు’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్‌గోపాల్ వర్మ ‘‘ స్లోక్యామ్’’ టెక్నాలజీని వాడారు. నేనే రాజు నేను మంత్రి, కొబ్బరి మట్ట, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, క్రాక్ సినిమాల్లో నటించారు. 2017లో బిగ్‌బాస్ సీజన్ వన్‌లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. సేవా కార్యక్రమాలు : కత్తి మహేశ్ యూనిసెఫ్, వరల్డ్ బ్యాంక్, సేవ్ ది చిల్డ్రన్, క్లింటన్ ఫౌండేషన్లతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంట్రవర్సీలపై కత్తి మహేశ్ సమాధానం.. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంట్రవర్సీలపై స్పందిస్తూ. ‘‘ కాంట్రవర్సీలతో.. కామెంట్లతో ఎంజాయ్ చేసేది ఏమీ ఉండదు. అనవసరపు అటెన్షన్, ఇది మనకు అవసరమా.. మన పనులన్నీ మానుకుని వాటిపై స్పందిస్తూ ఉండటం ఎంత చికాకో అర్థం కావట్లేదు’’ అని అన్నారు. -
కత్తి మహేశ్ మరణ వార్తతో షాకయ్యా
గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల బారిన పడ్డ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. నిన్న మొన్నటి వరకూ మహేశ్ ఆరోగ్యం నిలకడగానే ఉందనే వార్తలు వచ్చినా పరిస్థితి ఒక్కసారిగా విషమించి కన్నుమూశారు. ప్రధానంగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో కత్తి మహేశ్ ప్రాణాలు కోల్పోయారు. కత్తి మహేశ్ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేశ్ మరణవార్త విని షాక్ గురయ్యానని మంచు మనోజ్ ట్విటర్లో తెలిపారు. కత్తి మహేశ్ ప్రాణాలు కోల్పోయాడనే వార్త కలచివేసింది. కత్తి మహేశ్ కుటుంబానికి ప్రాగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేశ్ ఆత్మకు శాంతి చేకూరాలని మంచు మనోజ్ ట్విటర్లో పేర్కొన్నారు. టాక్సీవాలా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కత్తి మహేశ్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. మహేశ్ ఆత్మకు శాంతి కలగాలని ట్విటర్లో పేర్కొన్నారు. హ్యపిడేస్ ఫేం ఆదర్శ్ బాలకృష్ణ కత్తి మహేశ్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ హౌజ్‌లో కత్తి మహేశ్‌తో గడిచిన క్షణాలను గుర్తుకుతెచ్చుకున్నారు. కత్తి మహేశ్ అపారమైన జ్ఞానం, ఆసక్తికరమైన భావజాలం కలిగిన వ్యక్తి అని ఆదర్శ్ కొనియాడారు. మహేశ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కత్తి మహేశ్ మరణవార్త విని షాక్ గురయ్యానని నేచురల్ స్టార్ నాని ట్విటర్లో పేర్కొన్నారు.కత్తి మహేశ్ ఎల్లప్పుడూ తన రివ్యూలతో ప్రత్యేకమైన కంటెంట్ సినిమాలను ప్రోత్సహించే వారని నాని గుర్తుచేశారు. మహేశ్ కుటుంబానికి, స్నేహితులకు సానూభూతిని వ్యక్తపరిచారు. #KathiMahesh is no more. May His Soul Rest In Peace pic.twitter.com/BRbjJw8QEE— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 10, 2021 Shocked & saddened to hear the news about the demise of #KathiMahesh garu. My deep condolences to his family and friends. May his soul rest in peace! Om shanti 🙏 pic.twitter.com/PgFmmk4ct6— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) July 10, 2021 Spent a lot of time with #kathimahesh in the Big Boss House. Was a man of immense knowledge and interesting ideologies. Gone too soon. Deepest condolences to the family 🙏 pic.twitter.com/bGum4yhMOZ — Aadarsh Balakrishna (@AadarshBKrishna) July 10, 2021 Shocked to hear that Kathi Mahesh gaaru passed away. From what I’ve seen, he always tried to encourage films with unique content through his reviews. Strength to his family and friends. — Nani (@NameisNani) July 10, 2021 -
ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మృతి
-
Kathi Mahesh : ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ మృతి
సాక్షి, చెన్నై : ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. త్వరలోనే కుదుటపడుతుందనుకున్న ఆయన ఆరోగ్యం విషమించింది. అకస్మాత్తుగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు. కత్తి మహేశ్ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తల, కంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కత్తి మహేశ్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం మానవతా కోణంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17లక్షల రూపాయలు అందచేసింది. అయినా కూడా మహేశ్ ప్రాణాలు దక్కలేదు. ‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేశ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్-1 ద్వారా సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కత్తి మహేశ్. అంతకుముందు నందు హీరోగా నటించిన పెసరట్టు అనే సినిమాను తెరకెక్కించారు. కాగా, హృదయ కాలేయం, నేనే రాజు.. నేనే మంత్రి, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లోనూ నటించారు. -
కత్తి మహేశ్ చికిత్సకు ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్ చికిత్స కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.17 లక్షల భారీ అర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ నుంచి లేఖను విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)నుంచి ఈ నగదు అందించారు. ఇటీవల నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
చూపు కోల్పోయిన కత్తి మహేశ్?
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నప్పటికీ ఆయన తల, ముక్కు,కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగకపోవడం వలన మహేష్‌కు ప్రాణాపాయం లేదని తెలుస్తుంది. అయితే ఆయన ఎడమ కంటి చూపు మాత్రం పూర్తిగా పోయిందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్లు తమతో చెప్పారని కత్తి మహేష్ మేనమామ ఒకరు మీడియాకు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతుంది. సర్జరీ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. మరోవైపు కత్తి మహేశ్ త్వరగా కోలుకోవాలని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. ఈ ఘటనలో కత్తి మహేశ్ కారు నుజ్జు, నుజ్జు అయిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌పై విమర్శలు, వివాదాస్పద పోస్తులలో కత్తి మహేశ్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్‌కు తీవ్ర గాయాలు -
రోడ్డు ప్రమాదంలో సినీ విమర్శకుడు ‘కత్తి’కి గాయాలు
కొడవలూరు: రోడ్డు ప్రమాదంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్‌కు గాయాలయ్యాయి. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు.. మహేష్ తన స్నేహితుడు సురేష్‌తో కలిసి విజయవాడ నుంచి తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా యర్రవారిపాలేనికి శుక్రవారం రాత్రి ఇన్నోవా కారులో బయలుదేరారు. చంద్రశేఖరపురం వద్ద ముందు వెళుతోన్న కంటైనర్‌ను శని వారం తెల్లవారుజామున 2.30 గంటలకు కారు ఢీకొంది. ఆ సమయంలో మహేష్ స్నేహితుడు కారును డ్రైవ్ చేస్తున్నారు. ఘటనలో మహేష్‌కు కంటి భాగంలో తీవ్ర గాయమైంది. ఆయనను హైవే మొబైల్ పోలీ సులు నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పిం చారు. ప్రమాదం నుంచి సురేష్ సురక్షితంగా బయటపడ్డారు. మహేష్‌కు ఎడమ కన్ను బాగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స అవసరమ ని వైద్యులు నిర్ధారించి ఆయనను శనివారం చెన్నైకు తరలించారు. చదవండి: రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్‌కు తీవ్ర గాయాలు -
నటుడు కత్తి మహేశ్‌కు పెను ప్రమాదం
-
రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్‌కు తీవ్ర గాయాలు
సాక్షి, నెల్లూరు: ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. దీంతో మహేశ్ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా, తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎడమ కంటికి తీవ్రగాయమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ ఘటనలో కత్తి మహేశ్ కారు నుజ్జు, నుజ్జు అయింది. పవన్ కల్యాణ్‌పై విమర్శలు, వివాదాస్పద పోస్తులలో కత్తి మహేశ్ పాపులర్ అయ్యారు. రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గతంలో ఆయన హైదరాబాద్ నగర బహిష్కరణకు కూడా గురయ్యారు. -
సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్
తల్లి పెళ్లి వేడుకలో పిల్లల సందడి. తన జీవితంలోని మధుర జ్ఞాపకంలో అడుగడుగునా వారి భాగస్వామ్యం. పెళ్లిపందిరిలో.. తమను పెంచి పెద్దచేసిన అమ్మను అట్టిపెట్టుకునే ఉన్నారు... ఉంగరాల ఆటలో ఆమె గెలుపును ఆస్వాదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నాళ్లు ఒంటరి మహిళగా ఉన్న మాతృమూర్తికి తోడు దొరికినందుకు వారి కళ్లు సంతోషంతో వెలిగిపోయాయి. ప్రముఖ గాయని సునీత వివాహంలో ఆవిష్కృతమైన దృశ్యాలు ఇవి. కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నానన్న సంతోషం కంటే.. పిల్లలు అందుకు అండగా నిలిచినందుకే బహుశా ఆమె ఎక్కువగా ఆనందించి ఉంటారు. ఏదైతేనేమీ ఎన్నో ఒడిదొడుకుల అనంతరం ఆమె.. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో జనవరి 9న ఏడడుగులు నడిచారు. శంషాబాద్‌లోని ఓ ఆలయంలో వీరి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: ఘనంగా సింగర్ సునీత వివాహ వేడుక) ఇక అప్పటి నుంచి ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. సెలబ్రిటీ పెళ్లి.. అందునా ఇద్దరికి రెండో వివాహం. ఇంకేముంది నెటిజన్లకు కావాల్సినంత చర్చ. సునీత నిర్ణయాన్ని స్వాగతిస్తూ భర్తతో ఆమెకున్న అనుబంధాన్ని, అందుకు పిల్లలు ఆనందిస్తున్న తీరు చూసి చాలా మంది అభినందనల అక్షింతలు జల్లుతుంటే.. మరికొంత మంది మాత్రం.. ‘‘పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని, తల్లి రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటి? సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు’’ అంటూ మండిపడుతున్నారు. అయితే ఇలాంటి కామెంట్లపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ తనదైన శైలిలో స్పందించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఛస్! అయ్.. అసలు ఏంటిది? ‘‘ఈ కళ్లలో ఆనందం చూస్తే ఎందుకో "ఇబ్బంది."? అరే... ఎదో బాధ్యతతో పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా ఉద్ధరించడానికి పెళ్లి చేసుకుంటారు. బాధల్లో ఉంటే ఓదార్చడానికి,ఆదుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. ఇలా సుఖం కోసం. ఆనందం కోసం. ఆర్భాటంగా పెళ్లి చేసుకుని. సంతోషంగా కనిపిస్తే...హమ్మో! ఎంత కష్టం. ఎంత కష్టం. ఎదో రెండోపెళ్లి చాటుమాటుగా చేసుకుని. గిల్ట్ ఫీలవుతూ, ఏడుపు ముఖాలతో కనిపించాలిగానీ. ఈ బిమింగ్ హ్యాపీనెస్ ఏమిటి?ఆ కళ్లలో ఆ ఆనందం ఏమిటి? ఆ వెలుగేమిటి? ఎట్లా ఇట్లా అయితే? సమాజం నాశనం అయిపోదా...హమ్మా!!! సమాజానికి మీరు ఇలా ఏం సందేశం ఇస్తున్నట్టు? ఛస్! ఆయ్!!’’ అంటూ ఫేస్బుక్ వేదికగా నెగిటివిటీ ప్రచారం చేస్తున్న వారిని ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. -
కత్తి మహేష్‌పై మరో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్‌పై సైబర్‌క్రైమ్ పోలీసులు శుక్రవారం మరోసారి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జాంబాగ్‌కు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కత్తి మహేష్‌ను పిటీ వారెంట్‌పై నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కత్తి మహేష్ చంచల్‌గూడ జైలులో ఉన్నారు. గతంలో శ్రీరాముడిపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన కేసులో కత్తి మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన హిందూ సంఘాలు పలు చోట్ల కేసులు పెట్టాయి. కొద్దిరోజుల క్రితం ట్విటర్లో శ్రీరాముడి గురించి అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన కత్తి మహేశ్‌ను ఆగస్టు 15న సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి : శ్రీరాముడిపై పోస్టు.. కత్తి మహేశ్ అరెస్టు) -
శ్రీరాముడిపై పోస్టు.. కత్తి మహేశ్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేశ్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సోషల్ మీడియా పోస్టు ప్రభావం బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో హైదరా బాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో బుధవారం నుంచి సైబర్ స్పేస్ పోలీసింగ్ చేపడుతూ సోషల్ మీడియాపై పటిష్ట నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే గురువారం కత్తి మహేశ్ శ్రీరాముడిపై ఫేస్బుక్లో అనుచిత పోస్టు పెట్టాడు. ఈ విషయం పోలీస్ అధికారుల దృష్టికి రావడంతో సైబర్ క్రైమ్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా సుమోటో కేసు నమోదు చేసి మహేశ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. మహేశ్‌పై గతంలో సైబర్ క్రైమ్ ఠాణాలో ఓ కేసు నమోదై ఉంది. ఈ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. -
ఆ వార్తల్లో నిజం లేదు : కత్తి మహేష్
-
ఆ వార్తల్లో నిజం లేదు : కత్తి మహేష్
తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని జరుగుతున్న ప్రచారంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ స్పందించారు. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. తనకు కరోనా సోకిందమోనని కొంత మంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్నారని.. ఇప్పటి వరకైతే తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘కొన్ని రోజుల కిత్రం చేసిన టెస్ట్‌ల్లో నాకు కరోనా నెగిటివ్‌గా తేలింది. నాకు కరోనా రావాలని కోరుకుంటున్నవారే.. ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారేమో. నాకు కరోనా సోకిందని రుమార్లు సృష్టించేవారు.. శునకానందం మానుకోవాలి. ఏదైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. ఒకరి ఆరోగ్యం బాగోలేదని ప్రచారం చేసే చర్యలు హర్షించదగ్గవి కావు. (చదవండి : నా స్నేహితులు నాతో పాటే పడుకునే వారు: మనోజ్ బాజ్‌పేయి) ఇప్పటికైతే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఒకవేళ నాకు కరోనా వచ్చినా అధైర్య పడే రకాన్ని కాదు. కరోనాతో పోరాడి నా ఆరోగ్యాన్ని నేను వెనక్కి తెచ్చుకుంటాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మిత్రులకు నా ధన్యవాదాలు’ అని తెలిపారు. (చదవండి : అమెజాన్‌తో ప్రియాంక భారీ డీల్) -
కత్తి మహేష్‌పై దాడి
ఖైరతాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై భజ్రంగ్దళ్ సభ్యులు దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం ఐమాక్స్‌లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చూసి కారులో బయటికి వస్తున్న కత్తి మహేష్‌పై ఐదుగురు భజ్రంగ్దళ్ సభ్యులు దాడిచేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని మాసబ్‌ట్యాంక్‌కు చెందిన బి.రాజ్‌కుమార్, ఖైరతాబాద్‌కు చెందిన వై.వెంకట్, జి.సాయిరాజ, ఎంఎస్‌మక్తాకు చెందిన డి.నాగరాజు, వారాసిగూడకు చెందిన దేవగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
కత్తి మహేష్‌పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్ : శ్రీరాముడిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, హిందువుల మనోభావాలు దేబ్బతీసేలా మాట్లాడరని ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ మీద కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లు, హిందూ మతాన్ని కించపరిచేలా మట్లాడిన కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని నాంపల్లి పోలీసు స్టేషన్లో ఉమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును నాంపల్లి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్‌పై కేసు నమోదు చేశారు. ఇవే ఆరోపణలతో అడ్వొకేట్, హింధు సంఘటన్ అధ్యక్షుడు కరుణాసాగర్ కూడా మహేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ మీటింగ్‌ను ఉద్దేశించి కత్తి మహేష్ మాట్లాడుతూ హిందు దేవతలను కించపరిచేలా వ్యవహరించారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కరుణాసాగర్ కోరారు. కాగా, గతంలో కూడా కత్తి మహేష్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపారు. ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. -
‘మూడు ప్రాంతాల అభివృద్ధికి జైకొడదాం’
కదిరి: కోస్తా, ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని..ఈ నిర్ణయానికి జై కొడదామని సినీ నటుడు కత్తి మహేష్ అన్నారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో టీడీపీ పెద్దలు భారీగా భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. జనసేనాని పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సేనానిలా మారిపోయారని విమర్శించారు. -
సినీ నటితో అసభ్య ప్రవర్తన
బంజారాహిల్స్: తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీవీ9 యాంకర్ సత్య, కత్తి మహేష్‌లపై చర్యలు తీసుకోవాలని సినీ నటి సునీత బోయ మంగళవారం బంజారాహిల్స్పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్యాస్టింగ్ కౌచ్‌పై గతడాది ఏప్రిల్ 14న టీవీ9లో యాంకర్ సత్య నిర్వహించిన చర్చావేధికలో తనతో పాటు కత్తి మహేష్, నిర్మాత ప్రసన్నకుమార్ పాల్గొన్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కత్తి మహేష్ మహిళలు, తన పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిపై తాను అప్పుడే కేసు పెట్టినట్లు తెలిపింది. అయితే బాధ్యులపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగేందుకు మంగళవారం టీవీ9 స్టూడియోకు వెళ్లిన తన పట్ల మరోసారి అసభ్యంగా ప్రవర్తించారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. -
కత్తి మహేష్ ఎన్నికల ప్రచారం
ముప్పాళ్ళ(సత్తెనపల్లి): టీడీపీ ప్రభుత్వంతో ఏ వర్గాలకూ న్యాయం జరగలేదని సినీ విమర్శకుడు కత్తి మహేష్ అన్నారు. ఎస్సీలను టీడీపీ కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, మనమంతా వైఎస్సార్ సీపీకి అండగా ఉండాలన్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలంలోని గోళ్ళపాడు, ముప్పాళ్ళ గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో సోమవారం వైఎస్సార్ సీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాలనీవాసులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్సీలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలపాలన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు.