
తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని జరుగుతున్న ప్రచారంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ స్పందించారు. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. తనకు కరోనా సోకిందమోనని కొంత మంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్నారని.. ఇప్పటి వరకైతే తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘కొన్ని రోజుల కిత్రం చేసిన టెస్ట్‌ల్లో నాకు కరోనా నెగిటివ్‌గా తేలింది. నాకు కరోనా రావాలని కోరుకుంటున్నవారే.. ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారేమో. నాకు కరోనా సోకిందని రుమార్లు సృష్టించేవారు.. శునకానందం మానుకోవాలి. ఏదైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. ఒకరి ఆరోగ్యం బాగోలేదని ప్రచారం చేసే చర్యలు హర్షించదగ్గవి కావు. (చదవండి : నా స్నేహితులు నాతో పాటే పడుకునే వారు: మనోజ్ బాజ్‌పేయి)
ఇప్పటికైతే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఒకవేళ నాకు కరోనా వచ్చినా అధైర్య పడే రకాన్ని కాదు. కరోనాతో పోరాడి నా ఆరోగ్యాన్ని నేను వెనక్కి తెచ్చుకుంటాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మిత్రులకు నా ధన్యవాదాలు’ అని తెలిపారు. (చదవండి : అమెజాన్‌తో ప్రియాంక భారీ డీల్)
Comments
Please login to add a commentAdd a comment