అమోఘం: కత్తి మహేష్‌ నోట శ్రీరాముడి శ్లోకం! | Kathi Mahesh Sings Lord Sri Rama Song | Sakshi
Sakshi News home page

అమోఘం: కత్తి మహేష్‌ నోట శ్రీరాముడి శ్లోకం!

Published Thu, Jul 12 2018 3:32 PM | Last Updated on Thu, Jul 12 2018 8:30 PM

Kathi Mahesh Sings Lord Sri Rama Song - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ ఇటీవల శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్‌ చేయడంతో కత్తిపై హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లిపోయారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి వీళ్లేదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కత్తి దీనిపై న్యాయబద్ధంగా పోరాడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. శ్రీరాముడిని దూషించిన నోటితోటే ఆయనను పొగుడుతూ శ్లోకాలతో కూడిన ఓ పాటను కత్తి మహేష్‌ పాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కత్తి మహేష్‌ రాముడి పాటను స్పష్టంగా పాడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దాదాపు ఒక నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో ఆయన నోటి వెంట రాముని పాట తప్ప ఇంకేమీ లేకపోవడం విశేషం. అయితే కత్తి నోట ఈ శ్లోకం రావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. పశ్చత్తాపంతో రాముడిని స్మరించుకున్నాడా..? లేదంటే శ్రీ రాముడికి తాను వ్యతిరేకిని కాదని చెప్పడానికి పాడాడా..? భయంతో పాడుతున్నాడా.? భక్తితో పాడుతున్నాడా.? లేక వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారా.? అనేది అర్థం కావడంలేదని నెటిజన్లు అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement