sing a song
-
రైతు గుండెల్లో తన్నెళ్లిపోయేరా.. ఇల్లెందు రైతన్న పాట నెట్టింట వైరల్
వైరల్: అకాల వర్షాలు, వడగండ్ల వాన.. నష్టాన్ని ఎక్కువగా మిగిల్చేది రైతన్నకే!. తాజా వానలతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఇక తెలంగాణలోని ఓ రైతన్న రోదన ఆకాశన్నంటింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీలో రామ్మూర్తి అనే రైతు అకాల వర్షంలో దెబ్బతిన్న తన మొక్కజొన్న పంట చూసి ఆవేదనతో... పాట రూపంలో తన బాధను వ్యక్తం చేశారు. అది చూసి.. కష్టకాలంలోనూ మస్త్ పాటను అందించావంటూ అభినందిస్తూనే.. ఆ అన్నకి కలిగిన నష్టంపై అయ్యో పాపం అంటున్నారు నెటిజన్లు. ఓ రైతన్న పరేషాన్.. కష్టాల్లో కూడా మస్త్ పాట#Yellandu, #Bhadradri, #Farmersong #unseasonalrains #TelanganaFarmersong pic.twitter.com/cPyf9XTPrd — lakshminarayana (@plnroyal) March 20, 2023 -
ఇళయరాజా రాసిన పాటకు కొడుకు యువన్ శంకర్ గానం
చెన్నై సినిమా: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా రాసి బాణీలు కట్టిన పాటను ఆయన తనయుడు, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఆలపించడం విశేషం. ఇళయరాజా సంగీతమందిస్తున్న 1, 417వ చిత్రం 'నినైవెల్లా నీయడా'. ఆదిరాజన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ చిత్రంలో ప్రాజన్, మనీషా యాదవ్ జంటగా నటిస్తున్నారు. లేఖా థియేటర్స్ పతాకంపై రాయల్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఇళయరాజా పాట రాయడం, దానికి ఆయన కుమారుడు, సంగీత దర్శకుడు అయిన యువన్ శంకర్ రాజా పాడటం ప్రత్యేక ఆకర్షణ అని డైరెక్టర్ ఆదిరాజన్ తెలిపారు. తన సినిమాకు ఇళయరాజా సంగీతమందిచాలన్నది తన చిరకాల కోరిక అని వెల్లడించారు. అది ఈ సినిమాతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. -
బాలయ్య బర్త్‌డే గిఫ్ట్: సాంగ్ విన్నారా?
నటసింహం నందమూరి బాలకృష్ణ బుధవారం 60వ జన్మదిన వేడుకలు జరుపుకోబోతున్న విషయం తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా నందమూరి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. దివంగత ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరును కథ’ సినిమాలోని ‘శివ శంకరీ శివానంద లహరీ’ పాటను ఆలపించారు. ఈ పాటకు సంబంధించి ఆ చిత్రంలోని సన్నివేశాలను చూపిస్తూనే బ్యాక్‌గ్రౌండ్‌లో బాలయ్య పాటను యాడ్ చేశారు. ఈ పాటను ఎన్బీకే ఫిలింస్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే వేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక బర్త్‌డే గిఫ్ట్‌గా తమ హీరో పాడిన పాటకు నందమూరీ అభిమానులతో పాటు సంగీత ప్రియులు సైతం ఫిదా అవుతున్నారు. మీ క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదం: బాలయ్య ఇక తన 60వ పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ తన అభిమానులకు ఫేస్బుక్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ.. ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమాన సోదరులందరికీ నా ఆత్మీయ విజ్ఞప్తి. నా 60వ పుట్టినరోజుని మీ ఇంటి పండగలా కనీ, వినీ ఎరుగని రీతిలో సంబరాలు చేస్తున్న మీ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నా హితులు, శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులైన మీ అందరితో కలిసి వేడుక చేసుకొనే ఆదృష్టానికి అంతరాయం ఏర్పడినందుకు బాధగా ఉంది. ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం నా భాధ్యత. మీ క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదం. ప్రభుత్వ నిబంధనలు, ఆంక్షలు, భౌతికదూరం పాటించడం మనందరి కర్తవ్యం. అందుకే అందర్నీ కలవాలన్న నా ఆకాంక్షకి అడ్డుకట్ట వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మీ ఆరోగ్యాల్ని నిర్లక్ష్యం చేసి ఎవరూ నన్ను కలవడానికి రావద్దని కోరుతున్నాను. ఈ రోజు ద్వారక క్రియేషన్స్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నేను నటిస్తున్న చిత్రం టీజర్ మరియు నేను పాడిన పాట విడుదలౌవుతున్నాయి. ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ప్రభుత్వ నిబంధనలు పాటించండి. నిండు మనసుతో నా విన్నపాన్ని మన్నించండి. మీ బ్రతుకు ముఖ్యం... మీ భవిత ముఖ్యం. మీ అందరి క్షేమమే మీరు నాకు ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదం. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ... మీ బాలకృష్ణ’ అంటూ హీరో బాలకృష్ణ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. -
పోలీస్ పాటకు జనం ఫిదా.. వీడియో వైరల్
-
పోలీస్ పాటకు జనం ఫిదా.. వీడియో వైరల్
సాక్షి, ఢిల్లీ: హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ ఒకరు పాడిన పాట అందరి ప్రశంసలను అందుకుంటోంది. రహదారి భద్రత గురించి ఉన్న ఈ పాట వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన గల్లీబాయ్ సినిమాలోని 'ఆప్నా టైమ్ ఆయేగా..' పాటను తన వెర్షన్లో పాడాడు. రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడుకోండంటూ సలహాలను చరణాలుగా మలిచాడు. 42 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో రోడ్డు భద్రతపై సందేశాన్నిచ్చే విధంగా సొంత లిరిక్స్నుపయోగించాడు సందీప్ సాహి అనే ట్రాఫిక్ పోలీస్. సందీప్ భార్య రోడ్డు ప్రమాదంలో మరణించింది. అప్పటినుంచి రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాడు. హెల్మెట్స్, సీట్‌బెల్ట్ ధరించండని ప్రస్తుత పాటలో వాహనదారులకు పిలుపునిస్తున్నాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించవద్దని కోరుకుంటున్నాడు. ‘నేను చెప్పేది పాటించండి.. హాయిగా జీవించండి’ అని తన వీడియో ద్వారా సందేశాన్నిచ్చాడు. అదే సమయంలో తాగి వాహనాలు నడిపే వారిని హెచ్చరించాడు. 'జై హింద్, జై భారత్' అంటూ పాట ముగించాడు. ఈ వీడియోకు నెటిజన్లు స్పందిస్తూ అతని పాటకు పూర్తిగా ఫిదా అయ్యామని, అందుకు 10కి 10 మార్కులు ఇవ్వొచ్చని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి పోలీసులే మాకు కావాల్సింది అంటూ అతనికి సెల్యూట్ చేస్తున్నారు. మరి ఈ సాంగ్ రణవీర్ కూడా చూశాడో, లేదో తెలియాలి! -
వావ్.. నైజీరియన్స్ నోట షారుఖ్ పాట
విశ్వజనీనంగా మాట్లాడే శక్తి కేవలం సంగీతానికే ఉందనేది జగమెరిగిన సత్యం. ఎల్లలు దాటుతూ, హద్దులు చెరిపివేస్తూ ప్రజలందరినీ ఏకం చేసే శక్తి సంగీతానికి ఉందని ఎన్నో సార్లు రుజువైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇదే విషయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. నైజీరియాకు చెందిన కొంత మంది కుర్రాళ్లు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు వీరాభిమానులు. అయితే తమ హీరోకు సంబంధించిన సినిమాలోని పాటలను నేర్చుకొని పాడటం వాళ్లకు సరదా. అయితే అలీ గుల్ ఖాన్ అనే వ్యక్తి గతంలో వీరి పాటకు సంబంధించిన పాటను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. షారుఖ్ హిట్ సినిమా ‘కల్ హో న హోలో’లోని టైటిల్ సాంగ్ పాడి సంగీత ప్రియుల మనసులను గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా షారుఖ్‌కు చెందిన మరో పాటను పాడి సంగీతంపై, తమ హీరోపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు నైజీరియన్ కుర్రాళ్లు. తాజాగా అలీ గుల్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన మరో వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. షారుఖ్ హిట్ సినిమా ‘దిల్ తో పాగల్ హై’ లోని ‘బోలి సి సూరత్’పాటను ఐదుగురు నైజీరియన్ కుర్రాళ్లు పాడుతూ సంగీత ప్రియులను ఆశ్చర్యపరిచారు. వాళ్లలో ఒకరు పాట పాడుతుంటే మిగతా వారు కోరస్ ఇచ్చారు. వాళ్ల అద్భుత ప్రదర్శనకు సంగీతం తెలిసిన వారు, తెలియనివారు అందరూ ముగ్దులవుతున్నారు. ఇక అలీ వీడియో షేర్ చేస్తూ ‘బాలీవుడ్ సినిమాలను భారతీయులకంటే నైజీరియన్లే ఎక్కువ చూస్తున్నారని అనిపిస్తోంది. మరో పాటను అద్భుతంగా పాడారు’ అంటూ వీడియో కింద పేర్కొన్నారు. -
శ్రీ రాముడి పాట పాడిన కత్తి మహేష్
-
అమోఘం: కత్తి మహేష్ నోట శ్రీరాముడి శ్లోకం!
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఇటీవల శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేయడంతో కత్తిపై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లిపోయారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి వీళ్లేదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కత్తి దీనిపై న్యాయబద్ధంగా పోరాడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. శ్రీరాముడిని దూషించిన నోటితోటే ఆయనను పొగుడుతూ శ్లోకాలతో కూడిన ఓ పాటను కత్తి మహేష్ పాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కత్తి మహేష్ రాముడి పాటను స్పష్టంగా పాడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దాదాపు ఒక నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో ఆయన నోటి వెంట రాముని పాట తప్ప ఇంకేమీ లేకపోవడం విశేషం. అయితే కత్తి నోట ఈ శ్లోకం రావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. పశ్చత్తాపంతో రాముడిని స్మరించుకున్నాడా..? లేదంటే శ్రీ రాముడికి తాను వ్యతిరేకిని కాదని చెప్పడానికి పాడాడా..? భయంతో పాడుతున్నాడా.? భక్తితో పాడుతున్నాడా.? లేక వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారా.? అనేది అర్థం కావడంలేదని నెటిజన్లు అంటున్నారు. -
నాని కోసం ఎన్టీఆర్ పాట?
మన కథానాయకులు, నాయికలు తమ చిత్రాలకు కొత్త హైప్ తీసుకొచ్చేందుకు పాటలు పాడేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ ట్రెండ్ ఇటీవల ఎక్కువైంది. అయితే ఓ హీరో కోసం మరో స్టార్ హీరో పాట పాడుతుండడం విశేషమనే చెప్పాలి. నాని హీరోగా త్రినాథరావు దర్శకత ్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘నేను లోకల్’. ఇందులో కీర్తి సురేశ్ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓ పాట పాడనున్నారని ఫిలింనగర్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో తన చిత్రాలు ‘యమ దొంగ’, ‘అదుర్స్’, ‘రభస’, ‘నాన్నకు ప్రేమతో’లో పాటలు పాడిన ఎన్టీఆర్, కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కోసం ఆ మధ్య కన్నడంలోనూ ఓ పాట పాడారు. ఆ పాటలన్నీ బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు ‘నేను లోకల్’ కోసం మరోసారి తను సింగర్‌గా మారనున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్, ‘దిల్’ రాజులతో ఉన్న స్నేహం వల్లే తారక్ మళ్ళీ ఇలా సింగర్ అవతారమెత్తుతున్నారని తెలుస్తోంది. -
కృష్ణాష్టమి వేడుకల్లో పాటపాడిన సీఎం..
-
రియో ఒలింపిక్స్‌పై ఐటీ ఉద్యోగిని సాంగ్
హైదరాబాద్: ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని క్రీడాకారులు అత్యున్నత క్రీడా వేదిక ఒలింపిక్ గేమ్స్‌కు ఎంపికవుతారు. ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలని ఎన్నో కలలు కనడం సహజమే. ఒలింపిక్స్‌కు వెళ్లే క్రీడాకారుల ఊహా లోకాన్ని తెలియజేసే పాటే ‘ సోనే కీ మోహర్ చాహే దిల్ కీ జమాన్’.. రియో ఒలింపిక్స్ పోస్టర్‌ను చూసి స్పూర్తితో ఓ ఐటీ ఉద్యోగి పాట రాయగా అదే స్పూర్తితో మరో ఐటీ ఉద్యోగిని పాట పాడింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ హల్చల్ చేస్తోంది. మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్‌లోని కాగ్నిజెంట్ కంపెనీలో ఐటీ ఉద్యోగినిగా, కంపెనీ కల్చరల్ మెంబర్‌గా ఉన్న వసంతి ఉక్కెమ్ ఈ పాటను పాడారు. అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అవిరల్ మాతూర్ ఓ రోజు మార్నింగ్ వాక్ చేస్తుండగా రియో ఒలింపిక్స్ పోస్టర్ కనబడింది. పోస్టర్‌ను చూసి రియో ఒలింపిక్స్ పై పాట రాశారు. ఆ పాటను పాడాలని అదే కంపెనీలో కల్చరల్ సభ్యురాలుగా ఉన్న వసంతిని అడగగా ఆమె ఒప్పుకుంది. క్లాసికల్ మ్యూజిక్‌లో శిక్షణ పొందిన వసంతి పాట పాడగా అన్ లిమిట్ స్టూడియోలు మ్యూజిక్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఇమాన్యుల్ రాబర్ట్ ఈ పాటకు సంగీతాన్ని సమాకూర్చారు. ఇప్పటికే యూట్యాబ్, ఫేస్ బుక్‌లలో అప్ లోడ్ చేశారు. తమ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుందని వసంతి తెలిపారు. -
రింగ్‌టోన్‌గా మారిపోయిన అళగే....ఆళగే పాట