
వైరల్: అకాల వర్షాలు, వడగండ్ల వాన.. నష్టాన్ని ఎక్కువగా మిగిల్చేది రైతన్నకే!. తాజా వానలతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఇక తెలంగాణలోని ఓ రైతన్న రోదన ఆకాశన్నంటింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీలో రామ్మూర్తి అనే రైతు అకాల వర్షంలో దెబ్బతిన్న తన మొక్కజొన్న పంట చూసి ఆవేదనతో... పాట రూపంలో తన బాధను వ్యక్తం చేశారు. అది చూసి.. కష్టకాలంలోనూ మస్త్ పాటను అందించావంటూ అభినందిస్తూనే.. ఆ అన్నకి కలిగిన నష్టంపై అయ్యో పాపం అంటున్నారు నెటిజన్లు.
ఓ రైతన్న పరేషాన్.. కష్టాల్లో కూడా మస్త్ పాట#Yellandu, #Bhadradri, #Farmersong #unseasonalrains #TelanganaFarmersong pic.twitter.com/cPyf9XTPrd
— lakshminarayana (@plnroyal) March 20, 2023
Comments
Please login to add a commentAdd a comment