unseasonal rains
-
గుజరాత్లో అకాల వర్షాలు..
అహ్మదాబాద్: గుజరాత్ వ్యాప్తంగా ఆదివారం అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో 20 మంది వరకు చనిపోయినట్లు రాష్ట్ర అత్యవసర విభాగం తెలిపింది. దహోడ్ జిల్లాలో నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, అహ్మదాబాద్, అమ్రేలీ, బనస్కాంత, బోటడ్, ఖేడా, మెహ్సానా, పంచ్‌మహల్, సబర్కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవ్‌భూమి ద్వారకల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారని ఒక అధికారి చెప్పారు. రాష్ట్రంలోని 252 తాలుకాలను గాను 234 చోట్ల ఆదివారం వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, సౌరాష్ట్ర ప్రాంతంలోని సెరామిక్ పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రానికి మరింత వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. -
అకాల వర్షాలు.. పిడుగులు పడి 20 మంది మృత్యువాత
దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ సహా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అనేకచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 20 మంది మృత్యువాత పడ్డారు. దాహోద్ జిల్లాలో నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, తాపిలో ఇద్దరు, అహ్మదాబాద్, అమ్రేలీ, సూరత్, సురేంద్ర నగర్, దేవ్‌భూమి ద్వారక, బనస్కాంత, బోతాడ్, ఖేదా, మెహసానా, పంచమహల్, సబర్కాంత ప్రాంతాల్లో ఒక్కరు చొప్పున పిడుగులు పడి మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లోని మొత్తం 252 తాలూకాలలో 234 తాలూకాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడినట్లు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం (SEOC) వెల్లడించింది. సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపి, భరూచ్, అమ్రేలి వంటి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కేవలం 16 గంటల్లో 50 నుంచి 117 మిమీ వాన నమోదైంది. ఈశాన్య అరేబియా సముద్రంపై తుఫాను సర్క్యులేషన్ ఉందని, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలపై దాని ప్రభావాన్ని విస్తరించిందని ఐఎండీ తెలిపింది. గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షంతో పలువురు మృతి చెందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు ట్విటర్లో తెలిపారు. చదవండి: అతిపెద్ద టైగర్ రిజర్వ్! ગુજરાતના વિવિધ શહેરોમાં ખરાબ હવામાન અને વીજળી પડવાને કારણે અનેક લોકોના મોતના સમાચારથી ખૂબ જ દુઃખ અનુભવુ છું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની ન પૂરી શકાય તેવી ખોટ પર હું તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર રાહત કાર્યમાં… — Amit Shah (@AmitShah) November 26, 2023 -
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను.. రుతుపవనాలపై ప్రభావం ఉండదు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం కూడా సకాలంలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ప్రభావం రుతుపవనాలపై ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నా అందుకు అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అకాల వర్షాల ప్రభావం రుతుపవనాలపై ఉండే అవకాశం ఏమాత్రం లేదని అమరావతి వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త కరుణసాగర్ తెలిపారు. అరేబియా సముద్రంలో తుపాను వస్తే దాని ప్రభావం రుతుపవనాలపై కొంత ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. బంగాళాఖాతంలో వచ్చే తుపానుల ప్రభావం రుతుపవనాలపై ఉండదన్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలో ప్రవేశిస్తాయి. ఈసారి కూడా అదే సమయానికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రుతుపవనాలు మే నెలలో అండమాన్ నికోబార్‌లో ప్రారంభమవుతాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను వల్ల వీచే బలమైన గాలులతో అవి ఇంకా ముందే కదిలే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రుతుపవనాలు 4, 5 రోజులు ముందుగానే కేరళలో ప్రవేశించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మంత్రాలయంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత మే నెలాఖరు వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శుక్రవారం అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా పచ్చవలో 43.3, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కసుమూరులో 43.1, చినఅరికట్లలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
ఏపీ: వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు సమయం.. అదీ ఐదు రోజులకే ధాన్యం డబ్బుల్ని నష్టపోయిన రైతుల ఖాతాలో జమ చేయడం గమనార్హం. అకాల వర్షాలతో పంట దెబ్బ తిన్న రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాలని మొదటి నుంచి సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం భావిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే నష్టపోయిన రైతులను ఆదుకోవడమే కాకుండా.. పంట నిల్వలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఎప్పటికప్పుడు అధికారుల్ని ఆదేశిస్తూ వస్తున్నారాయన. ఇక ఇప్పుడు రికార్డు సమయంలో రైతులకు నగదును అందించింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 5 రోజులకే ధాన్యం డబ్బులు జమ అయ్యాయి. ఈరోజు ఒక్కరోజే 32,558 రైతులకు 474 కోట్లు జమ కాగా.. రబీ సీజన్‌కి సంబంధించి ఇప్పటివరకు రూ. 1,277 కోట్లు ధాన్యం డబ్బులు జమ చేసింది జగన్ సర్కార్. ఏపీలో ఇప్పటిదాకా 82.58 శాతం రైతులకు డబ్బులు జమ అయ్యాయి. వాస్తవానికి 21 రోజులు సమయమున్నా.. 5 రోజులకే రైతులకు చెల్లింపులు జరిగాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. పశ్చిమగోదావరి జిల్లా రైతులకు రూ. 527 కోట్లు, ఏలూరు జిల్లా రైతులకు రూ. 296 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా రైతులకు రూ. 258 కోట్లు, కోనసీమ జిల్లా రైతులకు రూ. 100 కోట్లు జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ఇదీ చదవండి: జగనన్నకు చెబుదాంపైనా అక్కసు.. ఆయనగారి పైత్యం -
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ద్రోణి ప్రభావంతో..
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడడం లేదు. తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు సోమవారం ఉదయం నుంచి ఇరు రాష్ట్రాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కూడా. తెలంగాణలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయ్యింది. భారీ వానలు, వడగండ్ల వానలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్‌లోనూ భారీ వాన సూచన మేరకు అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేస్తోంది. యెల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు.. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్. నిజామాబాద్ కరీంనగర్‌తో పాటు పెద్దపల్లి సూర్యాపేట, మహబూబ్‌నగర్‌తో పాటు నాగర్‌కర్నూల్, నారాయణపేట రాబోయే రెండు మూడు రోజుల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో. అలాగే.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అమరావతి: ఇక ఏపీలో నేడు(సోమవారం), రేపు(మంగళవారం) అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలో.. సోమవారం ఉదయం నుంచి పలుచోట్ల వర్షం పడుతోంది. విజయవాడ, ఏలూరులో ఓ మోస్తరు వర్షం కురుస్తుండగా.. పలు జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది వాతావరణ కేంద్రం. CONVERGENCE MOVING AWAY Finally the peak spell of unseasonal rains ending in Telangana. All the MASSIVE RAINS will shift to Andhra Pradesh during next 3days. Telangana too will definetely see rains, but only scattered ones, not widespread heavy Hyderabad - Scattered rains only pic.twitter.com/Up5NdMNMwK — Telangana Weatherman (@balaji25_t) May 1, 2023 My apartment cellar flooded after such huge downpour. Might be same situation in many other areas too. Hope people are safe. Rains to gradually reduce now. The worst is over. Only scattered rains to continue till morning. One of the record breaking spell of rain in recent yrs 🙏 pic.twitter.com/dUddwRKeLU — Telangana Weatherman (@balaji25_t) April 30, 2023 Panjagutta views in #HyderabadRains 🌧 pic.twitter.com/zEgs97sIqn — Mahendar Vanaparthi Ⓜ️ (@MahendarBRS) May 1, 2023 Many areas in #Tolichowki flooded due to heavy rains that lashed for an hour. Traffic snarls, power cuts reported.#HyderabadRains pic.twitter.com/s56lkccaJn — Toofan News (@ToofanNewsHyd) April 30, 2023 అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా పంట నష్టం వాటిల్లగా.. మరోవైపు జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. శనివారం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో.. మళ్లీ నగరం నీట మునిగింది. పలు కాలనీల్లోకి నీరు చేరగా.. చెట్లు నేలకూలాయి. పలు వాహనాలు నాశనం అయ్యాయి. గాలులకు, వానకి విద్యుత్, రవాణా వ్యవస్థలకు, మంచి నీటి సరఫరాకు విఘాతం ఏర్పడింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీవర్షం.. వర్షపాత నమోదు ఇలా షేక్‌పేట లో 10.6 సెం.మీ ఖాజగూడ లో 9.6 సెం.మీ రామంతపూర్ లో 8.1 సెం.మీ మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ లో 8.1 సెం.మీ శ్రీనగర్ కాలనీ 8 సెం.మీ మాదాపూర్ 7.3 సెం.మీ తార్నాక లో 7.1 సెం.మీ జూబ్లీహిల్స్ 6.9 సెం.మీ మైత్రివనం 6.9సెం.మీ బంజారాహిల్స్ 6.9 సెం.మీ ఇదీ చదవండి: చిన్నారి మౌనిక ఘటన మరువక ముందే.. కుండపోతకు మరో విషాదం -
హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. తెలంగాణలో కొనసాగుతున్న వర్షప్రభావం
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం సహా తెలంగాణలోని జిల్లాలను వరుణుడు ముంచేశాడు. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం ఉదయం కూడా పలు చోట్ల వాన పడుతోంది. ఒకవైపు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంట నష్టం జరగ్గా.. మరోవైపు హైదరాబాద్‌కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. భారీ ఈదురుగాలులతో దంచికొట్టడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయ్యి రంగంలోకి దిగింది. అయినప్పటికీ ఇప్పటికీ పలు ప్రాంతాలు నీటిలోనే ఉండిపోయాయి. రామచంద్రాపురంలో అత్యధికంగా 6 సెం.మీ. వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, బేగంపేట, కూకట్పల్లి, గాజులరామారం తదితర ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్గిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అకాల వర్షాలతో, వడగండ్ల వానతో తీవ్ర పంట నష్టం వాటిల్లుతోంది. మరో నాలుగు రోజులపాటు వర్షా ప్రభావ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగండ్ల వానలు పడొచ్చని చెబుతోంది. కాబట్టి, ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం కోరుతోంది. -
హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరం మరోసారి అకాల వర్షంతో తడిసి ముద్దయ్యింది. గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. బషీర్‌బాగ్, నాంపల్లి, కోఠి, అబిడ్స్.. ఇలా నగర మధ్య ప్రాంతాలతో పాటు పలు చోట్ల వర్షం పడింది. ఉదయం ఎండ, సాయంత్రం వానతో నగరవాసులు ఉపశమనం పొందారు. అయితే.. ఈదురు గాలుల తాకిడికి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ హైకోర్టు వద్ద ఈదురు గాలుల తాకిడికి భారీ వృక్షం ఒకటి నేలకొరిగింది. దీంతో రెండు బైక్‌లు, ఓ కారు ధ్వంసం అయ్యాయి. మహిళతో పాటు ఓ చిన్నారికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపించింది. చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇదీ చదవండి: ఏపీకి రెండు రోజులు హీట్ వేవ్ అలర్ట్ -
TS/AP: మరో రెండు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్ష ప్రభావం కొనసాగనుంది. ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు ఉండగా, తెలంగాణలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అకాలవర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ, రేపు(సోమ, మంగళవారాల్లో) ఏపీలో వర్షాలు పడనున్నాయి. ఏపీ తో పాటు యానాం మీదుగా కొనసాగుతోంది అల్పపీడనం. దీంతో.. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు లేదంటే వడగంట్ల వాన కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలుగురాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలతో ఇప్పటికే భారీగా పంట నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. -
Health: ఏది పడితే ఆ టాబ్లెట్ వేసుకోవద్దు! పైనాపిల్, నిమ్మ, కివి పండ్లు.. ఇంకా తులసితో..
గత కొద్దిరోజులుగా వాతావరణంలో వస్తున్న రకరకాల మార్పుల వల్ల దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. చాలామంది మెడికల్ షాప్‌కు వెళ్లి వాళ్లు ఇచ్చిన మందులు తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు. అది చాలా ప్రమాదం. దానివల్ల రకరకాల దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దగ్గు, జలుబుకు సహజమైన చిట్కాలు పాటించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం. అసలు దగ్గు, జలుబు రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తిన్నట్లయితే తొందరగా ఈ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బలవర్థకమైన ఆహారం తీసుకొని శరీరాన్ని బలంగా ఉంచుకుంటే, అసలు ఇవి రాకుండానే ఉంటాయి. జలుబు, దగ్గు వంటి సమస్యల నివారణకు యాంటీబయాటిక్స్ ఉపయోగించటం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. సహజ చిట్కాలు... ►తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ►రోజుకు రెండుసార్లు పసుపు, వేడి పాలను కలిపి తీసుకుంటే కూడా ఉపశమనం దొరుకుతుంది. ►మిరియాల కషాయాన్ని తాగినా, లవంగాలు బుగ్గన పెట్టుకుని వాటి రసాన్ని మింగుతున్నా, వేడి వేడి మసాలా టీ తయారు చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది ►చెంచాడు నిమ్మరసాన్ని, రెండు స్పూన్ల తేనెను వేడినీళ్లలో కలుపుకొని తాగితే ఉపశమనం దొరుకుతుంది. ►అల్లాన్ని దంచి కషాయం చేసుకుని తాగినా, అల్లం టీ చేసుకుని తాగినా కూడా రిలీఫ్ ఉంటుంది ►కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కిట పట్టడం వల్ల గొంతుకు ఉపశమనం దొరుకుతుంది∙ ►కొన్ని తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, టీ స్పూన్ వాము, మెంతులు, పసుపు, నాలుగైదు నల్ల మిరియాలు వేసి నీళ్లు పోసి బాగా మరిగించి కషాయం తయారు చేసుకుని తాగితే మరింత మంచి ఫలితం ఉంటుంది. వేడినీళ్ళకే ఓటేయండి... ►దగ్గు, జలుబుతో బాధపడేవారు శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ►అదేవిధంగా ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లటి నీళ్లను తాగడానికి బదులు ఎప్పుడు నీళ్లు తాగినా కాస్త వేడిగా ఉన్న నీటిని మాత్రమే తాగడం మంచిది. ఈ పండ్లు మంచివి పైనాపిల్, నిమ్మ, కివి వంటి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: Health: బీరకాయ, నేతి బీరకాయ తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల.. Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
రైతు గుండెల్లో తన్నెళ్లిపోయేరా.. ఇల్లెందు రైతన్న పాట నెట్టింట వైరల్
వైరల్: అకాల వర్షాలు, వడగండ్ల వాన.. నష్టాన్ని ఎక్కువగా మిగిల్చేది రైతన్నకే!. తాజా వానలతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఇక తెలంగాణలోని ఓ రైతన్న రోదన ఆకాశన్నంటింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీలో రామ్మూర్తి అనే రైతు అకాల వర్షంలో దెబ్బతిన్న తన మొక్కజొన్న పంట చూసి ఆవేదనతో... పాట రూపంలో తన బాధను వ్యక్తం చేశారు. అది చూసి.. కష్టకాలంలోనూ మస్త్ పాటను అందించావంటూ అభినందిస్తూనే.. ఆ అన్నకి కలిగిన నష్టంపై అయ్యో పాపం అంటున్నారు నెటిజన్లు. ఓ రైతన్న పరేషాన్.. కష్టాల్లో కూడా మస్త్ పాట#Yellandu, #Bhadradri, #Farmersong #unseasonalrains #TelanganaFarmersong pic.twitter.com/cPyf9XTPrd — lakshminarayana (@plnroyal) March 20, 2023 -
Unseasonal rains: ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను కారు మబ్బులు కమ్మేశాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానతో ఇరు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాలను దట్టమైన మేఘాలు అలుముకుని సాయంత్రం ఐదు గంటలకే చీకటి కమ్మేసింది. కృష్ణా, ఎన్టీఆర్, విశాఖపట్నం, నెల్లూరు.. ఇలా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, గుంటూరులలో వడగండ్ల వాన కురుస్తోంది. ఇక విశాఖ వర్షం నేపథ్యంలో.. రేపటి(ఆదివారం) మ్యాచ్‌కి అంతరాయం కలగొచ్చనే ఆందోళన క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు వర్ష ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇదీ చదవండి: వివక్ష లేదు.. మంత్రి వేణు ప్రకటన -
రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు
చెన్నై: తమిళనాడు, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తంజావూరు, పుదుకోటై జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించారు అధికారులు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. నగరంలో శనివారం ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలుగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా నైరూతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీలంక తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం తమిళనాడులోని డెల్టా జిల్లాలైన పుదుకోటై, తిరువారూర్, నాగపట్నం, తంజావూరు జిల్లాలతో పాటు దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకుడి, రామనాథపురం, తెన్కాశి, తిరునల్వేలి జిల్లాలపై కూడా పడింది. అలాగే, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలోనూ అనేక చోట్ల వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా, వాయువ్య భారతదేశంలో ఈ నెలలో సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. రానున్న రోజుల్లో చలిగాలుల ప్రభావం తగ్గుతుందని పేర్కొంది. Tamil Nadu Rains: Schools, Colleges Shut In Thanjavur and Pudukottai Districts Amid Heavy Rainfall#TamilNaduRains #Thanjavur #Pudukottai #HeavyRainfall #IMDhttps://t.co/URLQXV6A0u — LatestLY (@latestly) February 4, 2023 వాయుగుండం రూపంలో ఎదురైన గండం డెల్టా అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తిరువారూర్ జిల్లాలో 75 వేల ఎకరాల్లో వరి వర్షార్పణమైంది. వేల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతింది. ఈ నష్టం పరిశీలనకు శుక్రవారం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గురువారం రాత్రి, శుక్రవారం మధ్యాహ్నం వరకు వర్షాలు కొనసాగాయి. అధికంగా డెల్టా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. తిరువారూర్ జిల్లాలో 75 వేల ఎకరాల వరి పంట దెబ్బతింది. తంజావూరు, పుదుకోటై జిల్లాల్లోని వేలాది ఎకరాలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డెల్టా జిల్లాలో పెద్ద ఎత్తున వేరుశనగ పంట కూడా దెబ్బతింది. ఆయా జిల్లా అధికారులు నష్టం తీవ్రతను పరిశీలిస్తున్నారు. -
తెలంగాణలో పలుచోట్ల వర్షాలు
-
అకాల వర్షాలు..రైతుల ఆవేదన
-
ఆశలు గల్లంతు!
సాక్షి, పెద్దపల్లి : కొనుగోళ్లలో జాప్యం...అకాల వర్షం... వరదకు కొట్టుకుపోతున్న ధాన్యం... బురదనీళ్లలో గింజలు ఏరుకుంటు న్న రైతు ధైన్యం. జిల్లాలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిత్యం కనిపిస్తున్న దృశ్యం. చమటోడ్చి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుంటే అన్నదాత ఆశలు గల్లంతవుతున్నా యి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి, దళారులను ఆశ్రయించొద్దు అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఉండడం లేదనే విమర్శలున్నాయి. తేమ శాతం పేరిట కొనుగోళ్లలో విపరీతమైన జాప్యానికి తోడు, అకాల వర్షాలు రైతును నిండా ముంచుతున్నాయి. బాధ్యులెవరు? ప్రతీ సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 131 పీఏసీఎస్, 35 ఐకేపీ కొనుగోలు కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 7,24,320 క్వింటాళ్లు, ఐకేపీ ద్వారా 2,51,521 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. అయితే క్వింటాళ్ల కొద్దీ ధాన్యం రాశులు ఇప్పటికీ కొనుగోలు కాకుండా కేంద్రాల్లోనే పడిఉన్నాయి. తేమశాతం పేరిట కొనుగోలు చేయకపోవడంతో ధాన్యాన్ని కేంద్రాల్లోనే ఆరబెడుతూ రైతులు నిరీక్షిస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతుల కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతోంది. ఆరబెట్టిన ధాన్యం, కుప్పలు పోసిన ధాన్యం కూడా వర్షానికి తడవడమే కాకుండా, వరద నీళ్లతో మోరీల పాలవుతోంది. టార్పాలిన్లు ఉన్నాయని చెబుతున్నా, అవి సమయానికి రైతులకు అందడం లేదు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితిలో రైతులకు ముందే టార్పాలిన్లు ఇవ్వాల్సి ఉండగా, సిబ్బంది తమ దగ్గరే ఉంచుకుని వర్షం పడుతున్న సమయంలో ఇస్తుండడంతో ధాన్యం తడిసిపోతుంది. కొన్ని చోట్ల చిరిగిన టార్పాలిన్లు ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు టార్పాలిన్లు లేవు. స్థలాల ఎంపికలోనే సమస్య.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల స్థల ఎంపిక కూడా ఇబ్బందిగా మారింది. పెద్దపల్లి మండలం రంగాపూర్‌లో కుంట కింద, కాలువ పక్కన కేంద్రం ఏర్పాటు చేయడంతో ధాన్యం నష్టం ఎక్కువ జరిగింది. వర్షానికి తోడు వరద నీళ్లు ముంచెత్తడంతో రైతులు తమ ధాన్యాన్ని అధిక మొత్తంలో నష్టపోతున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షం, వరదనీళ్ల కారణంగా గంట శ్రీకాంత్ అనే కౌలురైతుకు చెందిన ధాన్యం కుప్ప మొత్తం కొట్టుకుపోయింది. సకాలంలో తన ధాన్యం కొనుగోలు చేస్తే నష్టం తప్పేదని ఆ రైతు వాపోతున్నాడు. ఇంచిమించు జిల్లాలోని అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తేమ, హమాలీ, రవాణా పేరిట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం రైతులను తీవ్రంగా నష్టపరుస్తుంది. మద్దతు ధర వస్తుందని ఆశపడి కొనుగోలు కేంద్రాలకు వస్తే, ఆలస్యంతో తాము తెచ్చిన ధాన్యమే నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తమ కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోయిందని, దీనికి బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. పంట విక్రయించి అప్పులు తీర్చి, పెట్టుబడికి మిగుల్చుకుందామనుకున్న సమయంలో పంట కొట్టుకుపోతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉండడంతో, ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. జాప్యం లేకుండా కొనుగోళ్లు – చంద్రప్రకాశ్‌రెడ్డి, డీసీవో రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండానే తూకం వేయిస్తున్నాం. తేమశాతం ఎక్కువగా ఉన్న రైతులే రెండు, మూడు రోజులు నిరీక్షిస్తున్నారు. ధాన్యం నింపేందుకు అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. రవాణాపరమైన ఇబ్బందులు లేవు. టార్పాలిన్లను కూడా కేంద్రాల్లోనే ఉంచాం. అనుకోకుండా వర్షాలు కురవడం వల్లే అక్కడక్కడ కొంత మేరకు ధాన్యం తడిసింది. రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. -
ఏపీలో బీభత్సం సృష్టించిన అకాల వర్షాలు
-
ఉరుములు.. మెరుపులు
సిరిసిల్ల : రైతు గుండెలో ఉరుములు. మెరుపులు మెరిశాయి. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన రాళ్లవాన అన్నదాతను తీవ్రంగా దిగాలు పర్చింది. ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో ఉరుములతో కూడిన జోరువాన పడింది. అక్కడక్కడ రాళ్లు పడ్డాయి. సిరిసిల్ల పట్టణంలోనూ మేఘావృతమై చిన్నపాటి వర్షం కురిసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం వరి పొట్టదశలో ఉండగా.. పక్షంరోజుల్లో పంట చేతికందుతుంది. ఈదశలో చెడగొట్టువానలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాళ్ల వానలు పడితే పొలాలు పూర్తిగా దెబ్బతిని పంట చేతికి రాదు. పొట్టదశలో ఉన్న పంటుల, నీరుతాగే దశలో ఉన్న పంట రాళ్ల దెబ్బలకు పాడయ్యే ప్రమాదం ఉంది. మామిడి రైతులకువడగండ్లు, ఈదురుగాలుల భయం పట్టింది. ఏడాదికి ఒక్కసారే వచ్చే మామిడి కాయలు ఈదురు గాలులతో నేలరాలుతాయనే భయంలో ఉన్నారు. ఆరుగాలం శ్రమించిన అన్నదాతలను అకాల వర్షాలు వణికిస్తున్నాయి. ఆదివారం పగలు రాళ్లవానతో, ఉరుములతో అదరగొట్టిన వరుణుడు సాయంత్రానికి చల్లబడ్డాడు. మళ్లీ వాతావరణంలో మార్పు వచ్చింది. రైతులకు చెడగొట్టు వానల భయం పట్టుకుంది. శనివారం సాయంత్రం బోయినపల్లి, ఇల్లంతకుంట తదితర మండలాల్లో కురిసిన వడగండ్ల వానతో వందలాది ఎకరాల్లో వరి దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మామడితోటలూ ధ్వంసమయ్యాయని, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పంట నష్టం అంచనా వేయొచ్చని అంటున్నారు. బోయినపల్లిలో 125 హెక్టార్లలో దెబ్బతిన్న వరి బోయినపల్లి(చొప్పదండి): మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన ఉంది మండలంలోని రైతుల పరిస్థితి. ఒకవైపు సాగు నీరులేక వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోయే దశకు చేరుకుంది. దీనికితోడు శనివారం కురిసిన వడగళ్ల వానతో వందల ఎకరాల్లో పంట దెబ్బతింది. సుమారు 125 హెక్టార్లలో పంట దెబ్బ తిన్నదని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కొదురుపాకలో మొక్కజొన్న నేలవాలింది. విలాసాగర్, నర్సింగాపూర్, జగ్గారావుపల్లి, తడగొండ గ్రామాల్లో వడగళ్ల ధాటికి పొట్టదశలో ఉన్న వరి పైరు వంగి పోయింది. ఆదివారం విలాసాగర్, కొదురుపాక, నర్సింగాపూర్, జగ్గారావుపల్లి, వరదవెల్లి గ్రామాల్లో ఎంపీపీ సత్తినేని మాధవ్, జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, ఏఈ వంశీకృష్ణతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అన్ని గ్రామాల్లో వ్యవసాయ అధికారులు సర్వే చేసి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షంతో ఆపార నష్టం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : వెంకటాపూర్, పదిర, హరిదాసునగర్, దుమాల, అక్కపల్లి, అల్మాస్పూర్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన కురిసింది. పెద్దసైజు మంచురాళ్లతో వర్షం పడడంతో మామిడికాయలు రాలిపోయాయి. వరిపంట దెబ్బతింది. ఈసారి మామిడి కాయలు విరబుయ్యగా ఆకాల వర్షం దెబ్బతీయడంతో రైతులు ఆవేదకు లోనయ్యారు అక్కపల్లిలో పెద్దసైజులో ఉన్నరాళ్లతో మూడుగంటలపాటు ఏకధాటిగా కురవడంతో జనం బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారుపై చెట్లు కూలిపడ్డాయి. అక్కపల్లి, పోతిరెడ్డిపల్లిలో రెండు ఇళ్లపై రేకులు లేచిపోయాయి. ముస్తాబాద్(సిరిసిల్ల) : మోహినికుంట, పోత్గల్, బందనకల్, తెర్లుమద్ది గ్రామాల్లో వడగండ్ల వానతో మామిడితోటలు ధ్వంసమయ్యాయి. సుమారు 45 ఎకరాల్లోని మామిడితోటలకు నష్టం జరిగిందని రైతులు తెలిపారు. గూడెం, పోత్గల్, ముస్తాబాద్‌లో కురిసిన వడగండ్లకు వరి పంట దెబ్బతింది. భూగర్భ జలాలు అడుగంటిన సమయంలో ఎంతోశ్రమకోర్చి వరి పంటను కాపాడుకున్న రైతన్న.. పంట చివరి దశకు చేరగా వడగండలకు దెబ్బతినడంతో కకావికలమయ్యాడు. దబ్బెడ నారాయణ, రాజయ్య, బండి ప్రశాంత్, గూడెం గ్రామంలో యాద భూమలింగం, బట్టు దేవయ్య, మల్లేశం, తిరుపతి, బాలయ్య, రాములు, లక్ష్మణ్‌కు చెందిన వరిపంట దెబ్బతింది. పోత్గల్‌లో స్వర్ణకారుడు సజ్జనం పురుషోత్తం రేకుల షెడ్డు ఈదురుగాలుల ధాటికి ధ్వంసమైంది. ఆయన కుటుంబం వీధిన పడింది. కోనరావుపేట : వెంకట్రావుపేట, మామిడిపల్లి, కోనరావుపేట, కనగర్తి, నిజామాబాద్ తదితర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వడగళ్లవాన కురిసింది. వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోనరావుపేటకు చెందిన గంగసాని రాజు మామిడితోట ధ్వంసమైంది. పంటలు నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
నిండా ముంచిన అకాల వర్షాలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్ : వాతావరణ మార్పులతో వచ్చిన అకాల వర్షాలు ఉద్యాన రైతులను నిండా ముంచేశాయి. గడచిన రెండు రోజులపాటు వీచిన ఈదురు గాలులు, అకాల వర్షంతో రాష్ట్రంలోని ఐదారు జిల్లాల్లో మామిడి పంటతోపాటు అరటి, బొప్పాయి, దోస, కర్బూజ వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 50 వేల హెక్టార్లలో మామిడి పంట దెబ్బతిన్నట్టు అనధికార అంచనా. వేలకు వేలు ఖర్చు పెట్టి తోటల్ని సిద్ధంచేస్తే పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి సృష్టించిన బీభత్సంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది మామిడి పూత రావడమే ఆలస్యం కాగా వచ్చిన పూత నిలవక రైతులు ఆదిలో ఇక్కట్లు పడ్డారు. నానా తంటాలు పడి పూతను నిలుపుకుంటే ఇప్పుడీ అకాల వర్షంతో పిందెలతో సహా సర్వం నేల రాలాయని రైతులు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, వి.కోట, గంగవరం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో వడగండ్ల వానకు మామిడి, టమోట, వరి, అరటి.. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాలలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో సుమారు వేయి హెక్టార్ల వరకు మామిడి సహా వివిధ రకాల ఉద్యాన వన పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని వల్లూరు, చింతకొమ్మదిన్నె, కడప, కమలాపురం, పెండ్లిమర్రి, చెన్నూరు, రామాపురం, వీరబల్లి, జమ్మలమడుగు, వేంపల్లె, ఖాజీపేట, పుల్లంపేట, దువ్వూరు, సిద్దవటం, కాశినాయన, రాజంపేట, ఒంటిమిట్ట, మైదుకూరు, రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు, పెనగలూరు, ఒంటిమిట్ట ప్రాంతాల్లో చేతికందివచ్చిన అరటి, బొప్పాయి, మామిడి, టమాటా, దోస, కర్బూజ పంటలకు భారీనష్టం వాటిల్లింది. మొత్తం మీద మార్చి 16న, 30న సంభవించిన గాలివానలవల్ల ఈ జిల్లాలో 6000 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. ఇందులో అత్యధికంగా 1,665 ఎకరాలు అరటి తోటలే ఉండటం గమనార్హం. కర్నూలు జిల్లాలో స్వల్పంగా మామిడి పిందెలు నెలరాలాయి. ఎకరానికి రూ.55 నుంచి రూ.60 వేల వరకు ఖర్చు పెట్టామని, ఈ పరిస్థితుల్లో తమకు పెట్టుబడైనా వస్తుందో లేదోనని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే, 12 ట్రాన్స్ఫార్మర్లు, 60 విద్యుత్ స్తంభాలు జిల్లాలో నేలకొరగగా 6 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లాలో రూ.50 లక్షలకు పైగా ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. యాడికి, ఎన్పీ కుంట, తలుపుల, పుట్లూరు, ఓడీ చెరువు, నార్పల తదితర మండలాల పరిధిలో అరటి, టమాట, మామిడి తోటలు 50 హెక్టార్లకు పైగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే.. నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయాధికారులు రంగంలోకి దిగారు. ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి అకాల వర్షంతో నష్టపోయిన మామిడి రైతులకు ఎకరానికి కనీసం రూ.50 వేల పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ.. ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.50 వేలు, కూరగాయల పంటలకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలన్నారు. -
ఏపీలో పలుచోట్ల పిడుగుల వాన
-
నేడు, రేపు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, రాయలసీమల మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తాంధ్రలోను, మంగళవారం రాయలసీమలోను అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు గాని, తేలికపాటి వర్షం గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం తెలిపింది. అదే సమయంలో కొన్ని చోట్ల ఈదురుగాలులకు, అకాల వర్షాలకు ఆస్కారం ఉందని హెచ్చరించింది. -
నేలరాలిన ఆశలు
► అన్నదాతకు కడగండ్లు మిగిల్చిన వడగండ్లు ► అకాల వర్షంతో పండ్ల తోటలకు అపార నష్టం ► చేతికొచ్చే దశలో నేలపాలైన పంటలు ► ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ నెలల తరబడి కాపాడుకుంటూ వస్తున్న పంట గంటలో నేలపాలైంది. అసలే అప్పుల ఊబిలో ఉన్న అన్నదాతల్ని అకాలవర్షం మరింత నష్టాలపాల్జేసింది. పంట చేతికొచ్చే దశలో శుక్ర, శనివారాల్లో కురిసిన వాన రైతుకు కడగండ్లు మిగిల్చింది. జొన్న, నువ్వులు, వరి, మినుము పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, నిమ్మ, మిర్చి తోటల్లో కాయలు నేలరాలాయి. వడగండ్ల ధాటికి కోతదశలో ఉన్న పుచ్చ కాయలు పగిలిపోయాయి. ఊహించని పరిణామంతో దిక్కుతోచని రైతులు ప్రభుత్వమే తమకు సాయం చేసి ఆదుకోవాలని విన్నవిస్తున్నారు. పామూరు/మార్టూరు: పర్చూరు నియోజకవర్గంలో శనివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షం పండ్ల తోటలకు తీవ్ర నష్టం చేకూర్చింది. మార్టూరు మండలం బబ్బేపల్లి, ద్రోణాదుల గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. మామిడి, బొప్పాయి, అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్టూరు మండలం బొబ్బేపల్లిలో గేదెలు మేపేందుకు వెళ్లిన మహిళ, ఇంకొల్లులో పొలం పనికి వెళ్లిన రైతు పిడుగుపాటుకు మృతి చెందారు. కోలలపూడి గ్రామంలో 200 ఎకరాల్లో ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో గాలి, వాన బీభత్సానికి పిందెలతో సహా కాయలు రాలిపడ్డాయి. బొప్పాయి, మునగ చెట్లు నేలవాలాయి. పామూరు మండలంలో..: పామూరు మండలంలోని బొట్లగూడూరు, బలిజపాలెం, మీరాపురం, తూర్పు కట్టకిందపల్లె, మోపాడు కొండారెడ్డిపల్లె, తూమాటివారిపాలెం గ్రామాలతోపాటు మోపాడు రిజర్వాయర్ ప్రాంతంలోని సాగుభూముల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య వడగండ్ల వర్షం కురిసింది. దీంతో నిమ్మ, పుచ్చ, మిరప, జొన్న, నువ్వులు, వరి, మినుము పంటలు దిబ్బతినగా సుమారు రూ.4.70 కోట్ల నష్టం వాటిల్లింది. ఎక్కువగా బొట్లగూడూరు ప్రాంతంలో జొన్న, మిర్చి, బలిజపాలెం, తూమాటివారిపాలెం గ్రామాల పరిధిలో సన్ననిమ్మ, పుచ్చ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రెండు మూడు రోజుల్లో కోయనున్న పుచ్చ, మరో వారం పది రోజుల్లో కోతలు పూర్తికానున్న జొన్న పైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల కల్లాల్లో వడ్లు కూడా తడిసిపోయాయి. పంట నష్టం పరిశీలన..: వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను గురువారం స్థానిక తహశీల్దార్ మెర్సీకుమారి, ఏడీఎ చల్లా సుబ్బరాయుడు, ఉద్యాన శాఖాధికారిణి ఎస్.దీప్తి, మోపాడు రిజర్వాయర్ చైర్మన్ ఎ.ప్రభాకర్‌చౌదరి పరిశీలించారు. నష్టం వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ► బలిజపాలెం, తూమాటివారిపాలెం, బొట్లగూడూరు గ్రామాలలో సుమారు 55 మంది రైతులకు సంబంధించి 160 ఎకరాలలో నిమ్మతోటలు దెబ్బతినగా సుమారు రు.80 లక్షల నష్టం వాటిల్లింది. ► బొట్లగూడూరు, తూమాటివారిపాలెం, మీరాపురం గ్రామాల్లో 25 ఎకరాలలో పుచ్చపైరు దెబ్బతినగా రు.30 లక్షలమేర నష్టం వాటిల్లింది. ► బొట్లగూడూరు, తూమాటివారిపాలెం గ్రామాలలో 35 ఎకరాల్లో మిరప పంట దెబ్బతినగా రు. 40 లక్షల మేర నష్టం వాటిల్లింది. ► బొట్లగూడూరు, మోపాడు కొండారెడ్డిపల్లె గ్రామాల్లో 450 మంది రైతులకు సంబంధించి 1800 ఎకరాల్లో జొన్నపంట దెబ్బతింది. రు.3 కోట్లమేర నష్టం వాటిల్లింది. ► 50 ఎకరాల్లో దెబ్బతిన్న నువ్వు పంటకు రు.7 లక్షలు, వరిపంటకు రు.3.50 లక్షలు, పదెకరాల్లో మినుము పంటకు రు.లక్షమేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేశామని వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు తెలిపారు. చేతికొచ్చే పంట నేలపాలైంది: చేతికొచ్చిన మిర్చిపంట నేలపాలయింది. మిర్చికోసం ఎకరాకు రు.1.25 లక్షల దాకా పెట్టుబడి అయింది. ఈ ఏడాది దిగుబడి కూడా బాగానే ఉంది. పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన నిలువునా ముంచింది. –కోటపాటి వెంకటేశ్వర్లు, మిర్చిరైతు(బొట్లగూడూరు) జొన్న పూర్తిగా దెబ్బతింది..: బొట్లగూడూరు, మోపాడు రిజర్వాయర్ పరిధిలో దాదాపు రెండు వేల ఎకరాల్లో జొన్నపైరు పూర్తిగా పాడయిపోయింది. ఎకరాకు రు.7 వేల నుంచి 8 వేల దాకా కనీస పెట్టుబడి వచ్చింది. ఎకరాకు ప్రస్తుతం 12 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. క్వింటా ధర ప్రస్తుతం రు.2 వేల దాకా ఉంది. ప్రభుత్వం రైతులకు పంట నష్టం చెల్లించి ఆదుకోవాలి. – కోటపాటి మాలకొండరాయుడు, జొన్నరైతు (బొట్లగూడూరు) ప్రభుత్వం ఆదుకోవాలి...: ఎకరాకు రు.35 వేల దాకా పెట్టుబడి పెట్టి పుచ్చ సాగుచేశా. ఎకరాకు 15 టన్నుల చొప్పున దిగుబడి వచ్చే అవకాశముంది. చేతికొచ్చిన పుచ్చ పంటను టన్ను రు.8 వేల వంతున అమ్మకానికి పెట్టాం. మరో రెండు రోజుల్లో వచ్చి కాయలు కోసుకుపోయేవారు ఇప్పటి దాకా కాపాడుకున్న పంట గంటలో నేలపాలైంది. ప్రభుత్వం ఆదుకోవాలి. –ఎర్రగొల్ల బాబు, పుచ్చరైతు (బలిజపాలెం) జీవనాధారం కోల్పోయాం..: నిమ్మతోట, కూరగాయల పెంపకంతో జీవిస్తున్నాం. ఎకరా నిమ్మకు కనీసం రు.30 వేలదాకా పెట్టుబడి అయింది. అకాల వడగండ్లతో ఒక్కో చెట్టుకు రు.500 విలువ చేసే కాయలు పెద్దవి, పిందెలు రాలిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. – మాటూరి మహాలక్ష్మణరావు, నిమ్మరైతు (బలిజపాలెం) -
‘సీఎం వద్దే తేల్చుకుంటాం’
బీర్కూర్: కామారెడ్డి జిల్లా బీర్కూరు ప్రాంతంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం, వడగళ్ల వానకు జరిగిన పంట నష్టంపై ఇక సీఎం వద్దే తేల్చుకుంటామంటూ బీర్కూరు అన్నదాతలు పట్టుబడుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టారు. నష్ట పరిహారంపై జాయింట్ కలెక్టర్ సత్తయ్య, ఆర్డీవో రాజేశ్వర్‌ల హామీతో వారు సంతృప్తి చెందలేదు. వెంటనే పరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ వద్దే తేల్చుకుంటామంటూ సుమారు 300 మంది రైతులు కిష్టాపూర్ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభించారు. ఇందుకు బీర్కూరు ఎస్సై, ఎమార్వోల నుంచి అనుమతి కూడా పొందారు. కాగా, హైదరాబాద్ వెళ్లొద్దంటూ టీఆర్ఎస్ నాయకులు రైతులను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. -
రైతులు అధైర్యపడొద్దు: ఎంపీ కవిత
నిజామాబాద్ : అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ కవిత హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నందిగామలో అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను టీఆర్ఎస్ ఎంపీ కవిత శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షానికి అత్యధికంగా కౌలు రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడొద్దన్నారు. సీఎం కేసీఆర్‌కు పరిస్థితిని వివరించి నష్ట పరిహారం అందేలా చూస్తామన్నారు. అకాల వర్షాలతో రాష్ట్రంలో 25 వేల హెక్టార్లతో పంట నష్టం జరిగిందని తెలిపారు. కేంద్రం ఇస్తున్న ఫసల్ బీమా పథకం పరిహారం సరిపోవడం లేదన్నారు. ఇచ్చిన పరిహారం కూడా సమయానికి అందడం లేదని చెప్పారు. కంపెనీలు క్లెయిమ్ ఇవ్వకపోవడంతో రైతులు బీమా చేయించుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. -
అకాల వర్షాలకు పంట నష్టం
-
అకాల వర్షాలు, వేలాది ఎకరాల్లో పంటనష్టం
-
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: వైఎస్సార్ సీపీ
గత మూడురోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలతో రైతాంగం విలవిలలాడుతోంది. పంట నష్టంతోపాటు పండ్ల తోటలు కూడా దెబ్బతిని కోలుకోలేని స్థితిలోఉన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బైఎస్సార్ సీపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సిద్ధార్థరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన ఆయన పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలు సిద్దార్థరెడ్డితో కలిసి పర్యటనలో పాల్గొన్నారు. -
'అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'
ఆకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన 'సాక్షి' విలేకరితో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి నష్టం వివరాలు సేకరిస్తున్నట్లు, నివేదికను పకడ్బందీగా రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ హాయంలో జరిగిన అవకతవకలు సరిచేసి రైతులకు త్వరగా పరిహారం అందిస్తామని చెప్పారు. -
'అకాల' మృతులకు రూ.5 లక్షలు నష్టపరిహారం
గడిచిన రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాలవర్షాలతో పంట, ఆస్తి నష్టపోయిన రైతులు, ప్రజలను అన్నివిధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. బాధితులను ఆదుకునే విషయంలో మానవత్వంతో వ్యవహరిస్తామన్నారు. అకాల వర్షాల కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. జిల్లాల వారిగా పంట, ఆస్తి నష్టం వివరాలను తక్షణమే సేకరించాలని అధికారులను ఆదేశించారు. వర్షం కారణంగా వాణిజ్యపంటలతోపాటు కూరగాయలు, పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. భారీ వర్షం కారణంగా పలు జిల్లాల్లోని రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ , నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అకాల వర్షాలు తీవ్రం ప్రభావం చూపాయి. దాదాపు 50 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా. కోట్లలో ఆస్తి నష్టం ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
అకాల దెబ్బ
కరీంనగర్ అగ్రికల్చర్: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగండం ప్రభావంతో శనివారం కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. అకాలవర్షం రబీ రైతులకు కాస్త ఊరట కలిగించగా, మరికొంత మంది రైతులకు నష్టాన్ని మిగిల్చింది. ఏరివేత దశకు వచ్చిన పత్తి వానకు తడిసి ముద్దయింది. మంథని మార్కెట్ యార్డులో కొనుగోలు చేసి తరలింపునకు సిద్ధంగా ఉన్న ధాన్యం నీటిపాలైంది. పలుచోట్ల ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులకు మొక్కజొన్న కర్రలు నేలవాలాయి. సింగరేణి సంస్థ ఆర్జీ-1 డివిజన్ పరిధిలోని ఓసీపీ 1, 2లలో నీరునిలిచి బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్, గోదావరిఖనితో పాటు పలు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కరీంనగర్లో ఇళ్లలోకి నీరు చేసింది. విద్యుత్ స్తంభాలు నేలకూలగా, ఇళ్ల పైకప్పులు గాలులకు కొట్టుకుపోయాయి. శుక్రవారం రాత్రి నుంచే జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది. శనివారం ఉదయం పది గంటల నుంచి మళ్లీ వాన జోరందుకుంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లావ్యాప్తంగా సగటున 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఇరవై మండలాల్లో వర్షం పడగా, అత్యధికంగా మల్యాల మండలంలో 37.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 908 మిల్లీమీటర్లకు 588 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. జిల్లాలో 35 శాతం లోటు వర్షపాతం లోటుండగా, ఆరు మండలాల్లో సాధారణం, 49 మండలాల్లో లోటు, రెండు మండలాల్లో అత్యల్ప వర్షపాతం ఉంది. జిల్లాకు మరో నాలుగు రోజులు వర్ష సూచన ఉండటంతో లోటు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. కరీంనగర్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించేందుకు ప్రజలు నానా ఇబ్బందులుపడ్డారు. రామగుండంలో కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగ్జిబిషన్లో భారీ కటౌట్లు కూలిపోయాయి. తిరుమల్‌నగర్ తీన్రాస్తాలో ఓ ప్రైవేట్ సంస్థ కేబుళ్ల కోసం తవ్వి వదిలేయడంతో స్థానికంగా ఉన్న ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. ఉల్లిగడ్డల హోల్‌సేల్ దుకాణంలోకి భారీగా నీరు రావడంతో సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని యజమాని తెలిపాడు. యెటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీలో భారీ వర్షానికి ఓసీపీ 1,2,3లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ప్రాజెక్టుల్లో నీరు నిలువడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మంథని వ్యవసాయ మార్కెట్‌తో పాటు డివిజన్లోని సుమారు 15 కేంద్రాల్లో నిల్వ ఉన్న 20వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిముద్దయింది. డివిజన్లోని ఏడు మండలాల్లో సుమారు 500 ధాన్యం కుప్పలు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్నట్లు పీఏసీఎస్ అధికారులు తెలిపారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న రెండు వేల ధాన్యం బస్తాలు తడిసినట్లు వారు తెలిపారు. మంథని మండలంలో కోత దశకు వచ్చిన వరిపంట వర్షం తాకిడికి నేలవాలగా, మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. వెంకటాపూర్ కేంద్రంలో ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. కాటారం, మల్హర్, కమాన్‌పూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మల్హర్ మండలం కొండంపేట పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో శనివారం ఉదయం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. వెల్గటూర్, పెగడపల్లి, వేములవాడ, చందుర్తి, కోరుట్ల, రాయికల్, మానకొండూర్, బెజ్జంకి, శంకరపట్నం, తిమ్మాపూర్, ఇల్లంతకుంట, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, జూలపల్లి తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. -
అకాలవర్షాలతో నీటిపాలైన ధాన్యం
-
అకాలవర్షాలతో నీటిపాలైన ధాన్యం
-
అకాలవర్షానికి తడిచి ముద్దయిన ధాన్యం
-
అకాల వర్షాలతో 11 మంది మృతి
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు 11 ప్రాణాలను బలిగొనగా, 20 లక్షల హెక్టార్లకు పైగా పంటలు పూర్తిగా సర్వనాశనం అయ్యాయి. తమిళనాట మొదలైన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పగలు, రాత్రి తేడా లేకుండా ఎడా పెడా వర్షం కురవడంతో పాకలు కూలిపోయాయి. పిడుగు పాటు మరికొన్ని ప్రాణాలను బలిగింది. అధికారుల లెక్కల ప్రకారమే భారీ వర్షాల వల్ల 11 మంది మరణించారు. పశు సంపదకు కూడా భారీగా నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. 36,380 హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా పాడైనట్లు వెల్లడించారు. -
అకాల వర్షంతో మామిడి పంటలకు తీవ్ర నష్టం