
'అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'
ఆకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన 'సాక్షి' విలేకరితో ప్రత్యేకంగా మాట్లాడారు.
జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి నష్టం వివరాలు సేకరిస్తున్నట్లు, నివేదికను పకడ్బందీగా రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ హాయంలో జరిగిన అవకతవకలు సరిచేసి రైతులకు త్వరగా పరిహారం అందిస్తామని చెప్పారు.