హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే రైతు లు వర్షం కోసం ఆకాశానికి చూడాల్సిన అవసరం ఉండదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం లోటస్‌పాండ్‌లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సుస్థిర వ్యవసాయంపై రాసిన వ్యాసా ల సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే రైతుల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. తెలంగాణలో గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపు ధాన్యం పండిందని తెలిపారు.
రైతుల కష్టసుఖాలు తెలిసిన సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ రెండు పథకాలు ప్రపంచ గుర్తిం పు పొందాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతతో విదేశాల్లో ఉన్న యువకులు కూడా ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. త్వరలో లక్షా 25 వేల ఎకరాల్లో రెండు పం టలకు సాగునీరు అందించబోతున్నామని తెలిపారు.
రమేశ్ ఈ పుస్తకంలో చేసిన సలహాలు, సూచనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పా రు. వ్యవసాయం సుస్థిరంగా సాగాలంటే పర్యావరణ సహకారం అవసరమని పుస్తక రచయిత చెన్నమనేని రమేష్ అభిప్రాయపడ్డారు. సుస్థిర వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, రైతుసమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్‌కల్లం, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment