projects works
-
అత్యంత ప్రాధాన్యతాంశంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగు నీటి రంగం అభివృద్ధిని వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతాంశంగా చేపట్టిందని, ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తోందని జలవనరుల శాఖ ఇంజనీర్ – ఇన్ చీఫ్ సి.నారాయణ రెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఈనాడు ప్రచురించిన కథనాన్ని ఆయన ఖండించారు. గత ప్రభుత్వ తప్పిదాలను దాచిపెట్టి ప్రస్తుత ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం ‘ఈనాడు’ చేస్తోందని విమర్శించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కింద ఉత్తరాంధ్రలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ ప్రాజెక్టుల నిధులను గత టీడీపీ ప్రభుత్వం ప్రణాళికా రహితంగా ఖర్చు చేసి, కాంట్రాక్టుల రూపంలో అనుయాయులకు లబ్ధి చేకూర్చిందని చెప్పారు. వందల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని, పనులు మాత్రం జరగలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి పైసా ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తోందన్నారు. వంశధార నిర్వాసితులకు అదనపు ప్రయోజనం వంశధార ప్రాజెక్టు రెండో భాగం రెండో దశలో ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని నారాయణ రెడ్డి తెలిపారు. దీని ద్వారా 27,800 ఎకరాలకు ఇప్పటికే నీటి వసతి లభించిందన్నారు. శ్రీకాకుళం జిల్లాల్లోని 9 మండలాల్లో 225 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి కలుగుతోందని తెలిపారు. అదేవిధంగా 1.2 టీఎంసీల నీటిని హీరమండలం రిజర్వాయర్ ద్వారా కిడ్నీ వ్యాధి పీడిత ఉద్దానం ప్రాంతానికి సరఫరా చేసే అవకాశం కలుగుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వంశధార నిర్వాసితుల ప్రయోజనాలను గాలికి వదిలేశారన్నారు. ఈ నిర్వాసితులకు అదనపు ప్రయోజనం కల్పించేందుకు సీఎం జగన్ రూ. 217 కోట్లు మంజూరు చేశారని అన్నారు. వంశధార నదిపై గొట్టా బ్యారేజి నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా హీర మండలం రిజర్వాయర్‌కు 12 టీఎంసీల నీటిని అందించేందుకు రూ. 176 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అనుసంధానంతో 18,527 ఎకరాల స్థిరీకరణ వంశధార–నాగావళి అనుసంధానం ద్వారా 18,527 ఎకరాల స్థిరీకరణకు, 4 మండలాల్లోని 38 గ్రామాల పరిధిలో 5 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రస్తుత ప్రభుత్వం రూ.145 కోట్ల నిధులకు అనుమతిచ్చిందని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. మిగతా పనులు 2023 జూన్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువను పొడిగించి విజయనగరం జిల్లాలోని ఆరు మండలాల్లో 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు గజపతినగరం బ్రాంచి కాలువ పనులు చేపడుతున్నామన్నారు. ఇందులో 43% పనులు పూర్తయ్యాయని, భూ సేకరణలో కొన్ని ఇబ్బందుల వల్ల మిగిలిన పనులు ఆగాయని చెప్పారు. మిగతా పనులకు రూ.137 కోట్లతో తయారు చేసిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందన్నారు. ఈ పనులను కూడా 2024 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. తారకరామతీర్థ సాగరం ద్వారా 16 వేల ఎకరాలకు నీరు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో చంపావతి నదికి అడ్డంగా తారకరామతీర్థ సాగరం బ్యారేజి నిర్మించి 2.75 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని, మూడు మండలాల్లోని 49 గ్రామాల్లో 16,538 ఎకరాలకు నీరు ఇవ్వచ్చని చెప్పారు. ఈ పనులు 59 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులకు రూ.198 కోట్లతో చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరలో కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి పనులు అప్పగిస్తామన్నారు. పునరావాస కార్యక్రమాలను ముందుగానే పూర్తి చేసేందుకు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరు ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగు, తాగు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.7,214 కోట్లతో బీఆర్ అంబేడ్కర్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని నారాయణ రెడ్డి గుర్తు చేశారు. దీనిద్వారా 8లక్షల ఎకరాలకు సాగునీరు, విశాఖతోపాటు ఇతర ప్రాంతాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీలు తరలించాలనేది లక్ష్యమన్నారు. తొలి దశలో రెండు ప్యాకేజీల్లో గత ప్రభుత్వం 2017–18లో రూ.2,022కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించినా పురోగతి లేదన్నారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి, అంచనాలను రూ.17,411కోట్లకు పెంచిందన్నారు. ఫేజ్–2 కింద రెండు ప్యాకేజీలను చేపట్టిందన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ 63వ కిలోమీటరు నుంచి 102వ కిలోమీటరు పొడవున శ్రీకా కుళం జిల్లా నడిగెడ్డ వరకు నీటిని తీసుకు వెళ్లేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 7,500 ఎకరాల భూసేకరణ త్వరగా జరుగుతోందని, 60 శాతం మేర డిజైన్లకు అనుమతి లభించిందన్నారు. మడ్డువలస రెండో దశ పనులు 79% పూర్తి మడ్డువలస రిజర్వాయర్ నుంచి కుడి ప్రధాన కాలువను విస్తరించి 12,500 ఎకరాల అదనపు ఆయకట్టుకు 1.5టీఎంసీల నీరిచ్చే లక్ష్యంతో రెండో దశ పనులను చేపట్టామని ఈఎన్సీ చెప్పారు. దీనివల్ల జి.సిగడాం, పొందూరు, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లోని 21 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇప్పటికే 79 శాతం పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులను పాత కాంట్రాక్టరు చేయలేకపోవడంతో రూ.26.9కోట్లతో సవరిం చిన అంచనాలను ప్రభుత్వం ఆమోదించిందన్నా రు. వచ్చే ఖరీఫ్‌కు ఈ పనులు పూర్తవుతాయన్నారు. తోటపల్లి బ్యారేజి 83% పూర్తి విజయనగరం జిల్లా తోటపల్లి వద్ద నాగావళి నదిపై బ్యారేజి నిర్మించి 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా 1,31,000 ఎకరాల ఆయకట్టుకు 15.89 టీఎంసీల నీరిచ్చేందుకు తోటపల్లి బ్యారేజ్ పనులను ప్రభుత్వం చేపట్టిందని నారాయణరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును రూ.1127.58 కోట్లతో చేపట్టగా, 83 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. రూ.123.21 కోట్లతో మిగిలిన పనులను రెండు ప్యాకేజిలుగా చేపట్టామన్నారు. ఈ పనులు 2023 జూన్‌కి పూర్తవుతాయన్నారు. రూ.854 కోట్లతో మహేంద్రతనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ మహేంద్రతనయ నది మీద చాప్రా గ్రామం వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మించి 1,200 క్యూసెక్కుల నీటిని రేగులపాడు రిజర్వాయర్‌కు తరలించే ప్రధాన ఉద్దేశంతో ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నట్టు నారాయణరెడ్డి తెలిపారు. 2.1 టీఎంసీల నీటిని నిల్వచేసే ఈ రిజర్వాయర్ ద్వారా 24,600 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. భూసేకరణ, పునరావాస ప్రక్రియల్లో ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని పేర్కొన్నారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి, రూ.854.25 కోట్లతో మిగిలిన పనులు చేపట్టేందుకు అనుమతినిచ్చిందని చెప్పారు. త్వరలోనే రివర్స్ టెండరింగ్ ద్వారా పనులను చేపట్టి 2024 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీరిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
ప్రజల కోసమే పనులు: మోదీ
నవ్సారి/అహ్మదాబాద్: సుదీర్ఘకాలం అధికారంలో ఉండి కూడా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ఏనాడూ ప్రాధాన్యమివ్వలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. శుక్రవారం గుజరాత్‌లోని గిరిజన జిల్లా నవ్సారిలో ఖుద్వేల్ గ్రామంలో గుజరాత్ గౌరవ్ అభియాన్ సభలో ఆయన మాట్లాడారు. ‘‘మేం అభివృద్ధి పనులు చేపడుతున్నది ఎన్నికల్లో గెలుపు కోసం, ఓట్ల కోసం కాదు. ప్రజల జీవితాలను మెరుగుపర్చాలన్న లక్ష్యంతో. గిరిజన ప్రాంతాలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. గిరిజన తండాల్లో రోడ్లు కూడా ఉండేవి కావు. మేమొచ్చాక మార్పు వచ్చింది’’ అన్నారు. రూ.3,050 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అలాంటి వారం ఒక్కటైనా ఉంటే చూపించండి ‘‘గతంలో మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల దాకా ప్రభుత్వ పథకాలు చేరాలంటే చాలా సమయం పట్టేది. ఏళ్లు గడిచినా టీకాలే అందేవి కావు. అడవి బిడ్డలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యేవారు. వారి సంక్షేమంపై మేం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. కరోనా టీకాలు వారికి త్వరగా అందజేశాం. ఇంతకుముందు గిరిజన ప్రాంతం నుంచి ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన సొంత గ్రామంలో నీళ్ల ట్యాంకు కూడా ఉండేది కాదు. నేను సీఎం కాగానే ఆ గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మించాలని ఆదేశించా. నేను ఓట్ల కోసమే అభివృద్ధి పనులు చేస్తున్నానని కొందరు విమర్శిస్తుండడం బాధాకరం. రెండు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉన్నా. నేను అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించని వారం ఒక్కటైనా ఉంటే చూపించాలని సవాలు విసురుతున్నా. గిరిజన ప్రాంతాల్లో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, యూనివర్సిటీలూ నిర్మిస్తున్నాం. రెండు దశాబ్దాలుగా గుజరాత్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది’’ అన్నారు. ‘ఇన్–స్పేస్’ ఆఫీసు ప్రారంభించిన మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇండియన్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) మోదీ ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. ఐటీ తరహాలోనే గ్లోబల్ స్పేస్ సెక్టార్‌లోనూ భారత సంస్థలు అగ్రగామికి ఎదగాలని ఆకాంక్షించారు. అంతరిక్ష రంగంలో గతంలో ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం లభించేది కాదని గుర్తుచేశారు. కానీ, తమ ప్రభుత్వం సంస్కరణలను తెరతీయడం ద్వారా ప్రైవేట్ రంగానికి స్వాగతం పలుకుతోందని తెలిపారు. స్పేస్ సెక్టార్లో సంస్కరణల ద్వారా అన్ని నియంత్రణలను, ఆంక్షలను తొలగించామని వివరించారు. ప్రైవేట్ రంగానికి ఇన్–స్పేస్ తగిన మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్కూల్ టీచర్‌తో భేటీ ప్రధాని నరేంద్ర మోదీ తనకు విద్యాబోధన చేసిన గురువును గుజరాత్ పర్యటనలో కలుసుకున్నారు. నవ్సారిలో నిరాలీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా టీచర్ జగదీష్ నాయక్(88)ను కలిసి కాసేపు మాట్లాడారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీ కుటుంబం మెహసానా జిల్లాలోని వాద్నగర్లో నివసించిన సమయంలో ఆయనకు జగదీష్ నాయక్ పాఠాలు బోధించారు. -
400 కోట్లు వృధా అయ్యాయి.. ఆ పాపం నీది కాదా చంద్రబాబు..?
సాక్షి, తాడేపల్లి: కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారంటూ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కరోనా సంక్షోభం వచ్చినా కూడా సంక్షేమ పథకాలు ఆగలేదు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. ఎల్లో పత్రికలు కొన్ని కధనాలు ప్రచురించే పనిలో పడ్డారు. జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లి చంద్రబాబును లేపే కార్యక్రమంలో పడ్డారు. టీడీపీ హయాంలో రూ.55వేల కోట్లు ఖర్చు పెట్టారట. మేము రూ.15వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామట. ఎందుకు వాళ్లు బాగా ఖర్చు పెట్టారు..? దాని వెనుక నిజాలేమిటి..?. ప్రాధాన్యత ఉన్న కీలక పనులు ఏవీ చంద్రబాబు చేయలేదు. కాంట్రాక్టర్లకు బాగా మిగిలే పనులు మాత్రమే చేశారు. మేము కీలకమైన పనులు మాత్రమే టేక్ అప్ చేశాం. రెండు సార్లు కోవిడ్ వచ్చినా పనులు ఆగకుండా చిత్తశుద్ధితో పనిచేశాం. మనం ఫైట్ చేస్తున్నది టీడీపీ మీద మాత్రమే కాదు.. ఎల్లో మీడియాపై అని మా నాయకుడు ముందే చెప్పాడు. సందు దొరికితే విష ప్రచారం చేసే పనిలో పడ్డారు. మీరు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరు. ఈ జలయజ్ఞాన్ని వైఎస్సార్ ప్రారంభించారు.. ఆగే ప్రసక్తే లేదు. మేము అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో 6 ప్రాజెక్టులను ఎంచుకున్నాం. తక్కువ ఖర్చుతో వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉపద్రవం కోవిడ్ వచ్చింది.. తేదీలు కొంచెం అటు ఇటు అవ్వొచ్చు. చదవండి: (కడుపు మండి తప్పుడు వార్తలు రాస్తున్నారు: బూడి ముత్యాలనాయుడు) పద్నాలుగేళ్లు సీఎంగా నీ చరిత్రలో ఒక్క ప్రాజెక్ట్ అయినా రిబ్బన్ కట్ చేశావా చంద్రబాబు...? ఎల్లో మీడియా వాస్తవాలు రాయండి.. మీరు చంద్రబాబును ఏమీ లేపలేరు. మీరు ఆయన్ని చైర్లో కూర్చోబెట్టే ప్రశ్నే లేదు. ఆయనకి చిత్తశుద్ధి లేదు. ఈ రోజు పోలవరం కొద్దిగా ఆలస్యం కావడానికి కారణం చంద్రబాబు. నువ్వు చేసిన పాపం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం ఎక్కడా లేదు. దీనివల్ల రూ.400 కోట్లు వృధా అయ్యింది. మళ్లీ కట్టాలంటే అదనపు ఖర్చు. దాని నుంచి నీటిని తోడి మళ్లీ కట్టాలంటే 2,000 కోట్లు కావాలి.. ఈ పాపం నీది కాదా..? నిపుణుల కమిటీ నువ్వు చేసిన తప్పుల వల్ల రీ డిజైన్ చేయడానికి వస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు ఉపయోగపడే దిశగా మేము తపన పడుతున్నాము. గత రెండేళ్లలో అందరికీ సాగు నీరు అందజేసాం. నీరు చెట్టు కింద ఎన్ని నిధులు కాజేశారో అందరికీ తెలుసు. చేసిందంతా మీరు చేసి మాపై బురద జల్లుతారా. నెల్లూరు సంగం బ్యారేజీ పూర్తి చేసి జులైలో రైతులకు అందజేసేలా ప్రయత్నం చేస్తున్నాం. అవుకు రెండో టన్నెల్లో చంద్రబాబు సగం పనులు వదిలేశాడు.. దాన్ని మేము చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నాం. ఖర్చు కాదు ప్రధానం.. ప్రాజెక్టులు చిత్తశుద్దిగా చేస్తున్నారో లేదో చూడాలి. కోవిడ్ తగ్గుముఖం పట్టింది.. పెండింగ్ బిల్లులు చెల్లించి పనులు వేగవంతం చేశాం. పోలవరం నుంచి శాస్త్రీయంగా రెండు దశల్లో నీరు ఇస్తారు. ముందు కనీస నిల్వ సామర్ధ్యం నుంచి నీళ్ళు ఇస్తారు.. ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్తారు. మీరు జానడు తవ్వి మేము పట్టిసీమ చేశాం అని చెప్పుకుంటున్నారు. ఆ కాల్వలు తవ్వి ఎంత దండుకున్నారో అందరికీ తెలుసు. ఆ పనుల కోసం పెట్టిన ఖర్చు పోలవరంపై పెట్టి ఉంటే మరో రకంగా ఉండేది. మీరంతా కట్టకట్టుకుని ప్రయత్నం చేసినా మా చిత్తశుద్ధిని ఆపలేరు. ఎవరు అపరిచితుడో అందరికీ తెలుసు. స్పిల్ వే నష్టంపై చంద్రబాబు చర్చకు సిద్ధమా..? దాని వల్ల ఆర్థికంగా నష్టం.. రెండు సీజన్లు నష్టపోయాయి. చంద్రబాబు ఎంత బలహీనుడో వాళ్ళ అబ్బాయి ఎంత బలహీనుడో అందరికీ తెలుసు. వాళ్ల బలహీనతని కప్పిపుచుకోడానికి జగన్ బలహీనుడు అంటున్నారు అంటూ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్ర స్థాయిల్లో ఫైర్ అయ్యారు. -
శాస్త్ర సాంకేతికతపై యుద్ధం పిడుగు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి నెల రోజులు అవుతోంది. ఈ యుద్ధ ఫలితంగా వేలాదిమంది శరణార్థులుగా మారడంతో అతిపెద్ద మానవీయ సమస్య తలెత్తుతోంది. యుద్ధ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు, ఎరువులు, ఆహారపదార్థాల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రష్యా దాడుల ప్రభావం ప్రపంచ శాస్త్ర పరిశోధన రంగంపై భారం మోపుతోంది. యుద్ధ కారణంగా కీలక ప్రాజెక్టులు రద్దు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ మానవ శాస్త్ర సాంకేతిక పురోగతిని దెబ్బతీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధారంభం నుంచి ఇంతవరకు ప్రభావితమైన సైన్సు సంబంధిత అంశాలు ఇలా ఉన్నాయి.. మార్స్ మిషన్ రష్యాతో చేపట్టదలిచిన సంయుక్త మార్స్ మిషన్‌ను నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇరు పక్షాలు కలిసి కుజగ్రహ యాత్రను చేపట్టాల్సిఉంది. కేవలం ఎక్సోమార్స్ మిషన్ మాత్రమే కాకుండా పలు ఇతర ప్రాజెక్టుల్లో రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోమాస్‌తో బంధాలను తెంచుకుంటున్నట్లు యూరోపియన్ ఏజెన్సీ తెలిపింది. ఇంధన రంగం ఉక్రెయిన్‌పై దాడితో ముందెన్నడూ చూడనటువంటి అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ముంచుకువస్తోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) హెచ్చరించింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల స్థిరీకరణకు ఈ ఏజెన్సీని 1973లో నెలకొల్పారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ సంక్షోభం తొలగిపోవాలంటే మిగిలిన దేశాలు ఉత్పత్తి పెంచితే సరిపోదని, ఇంధన పొదుపును అన్ని దేశాలు పాటించాలని ఏజెన్సీ సూచించింది. ఇందుకోసం ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, విమానయానాలను తగ్గంచడం, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించడం తదితర చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని వేగంగా అమలు చేయాలని ప్రభుత్వాలను కోరింది. దీంతోపాటు ఫార్మా, ఆహార రంగాల్లో పలు పరిశోధనలు యుద్ధం కారణంగా అటకెక్కనున్నాయి. ఈ పరిణామాలన్నీ ఇంతవరకు మానవాళి సాధించిన సైన్సు విజయాలను ధ్వంసం చేస్తాయని ప్రపంచ పరిశోధకులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఐఎస్ఎస్ నిర్వహణ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నిర్మాణంలో రష్యా, అమెరికా కలిసి పనిచేశాయి. తాజా యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఆవేశాలు పెరిగాయి. దీని ప్రభావం అంతరిక్ష ప్రయోగాలపై పడనుంది. ఇక మీదట ఇరుదేశాల ఉమ్మడిపాత్రపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఐఎస్ఎస్లో ఉన్న అమెరికా ఆస్ట్రోనాట్ మార్క్ వాండే మరో ఇద్దరు రష్యన్ కాస్మోనాట్స్‌తో కలిసి భూమి మీదకు రష్యా అంతరిక్ష వాహనంలో రావాల్సిఉంది. ప్రస్తుతానికి ఈ ప్రయోగం వరకు సహకరించుకునేందుకు రష్యా, అమెరికా అంగీకారానికి వచ్చాయి. కానీ ఇకపై అమెరికాకు రాకెట్ విక్రయాలు చేపట్టమని రష్యా ప్రకటించింది. రష్యా దాడికి నిరసనగా అన్నట్లుగా రష్యన్ వ్యోమగాములు తమ ఐఎస్ఎస్ ప్రయాణంలో పసుపురంగు సూట్లు ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. రష్యా దాడికి నిరసనగా ఉక్రెయిన్‌కు చెందిన ఈ రంగును కాస్మోనాట్లు వాడారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తాము సాధారణంగానే ఈ రంగును ఎంచుకున్నట్లు కాస్మోనాట్లు చెబుతున్నారు. ముందుముందు ఐఎస్ఎస్పై రష్యా పట్టు తొలగిపోవచ్చన్న అనుమానాలున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
మౌలికానికి గతి ‘శక్తి’
న్యూఢిల్లీ: మెరుగైన ప్రణాళికల రచన, అమలు, పర్యవేక్షణ ద్వారా ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి పీఎం గతి శక్తి కొత్త దిశను నిర్దేశించగలదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రాజెక్టుల అమల్లో జాప్యాలను, అధిక వ్యయాలను తగ్గించేందుకు దోహదపడగలదని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో జట్టు కట్టాలని, పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ’గతి శక్తి’పై ఏర్పాటైన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కార్పొరేట్లకు సూచించారు. దేనికదే అన్న ధోరణిలో పనిచేసే వివిధ విభాగాలను సమన్వయం చేసేందుకు, సమగ్రమైన ప్రణాళికలతో ప్రాజెక్టులను అమలు చేయడంలో ఉపయోగపడేందుకు ఉద్దేశించిన పీఎం గతి శక్తి – జాతీయ మాస్టర్ ప్లాన్‌ను గతేడాది ప్రకటించారు. ‘ఇన్ఫ్రా ప్లానింగ్, అమలు, పర్యవేక్షణకు ఇక నుంచి పీఎం గతి శక్తితో కొత్త దిశ లభిస్తుంది. దీనితో ప్రాజెక్టుల అమల్లో జాప్యం జరగడం, ఫలితంగా వ్యయాలు పెరిగిపోవడం మొదలైనవి తగ్గుతాయి‘ అని ప్రధాని పేర్కొన్నారు. సిసలైన పీపీపీ విధానం.. ఇన్ఫ్రా ప్రణాళికల రచన నుంచి అభివృద్ధి చేసి, వినియోగంలోకి తెచ్చే దశ దాకా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానం సిసలైన రీతిలో అమలయ్యేలా చూసేందుకు గతి శక్తి తోడ్పడుతుందని ప్రధాని చెప్పారు. భారత ఎకానమీ మరింత పటిష్టంగా మారేందుకు, అసంఖ్యాకంగా కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు ఇన్ఫ్రా ఆధారిత అభివృద్ధి విధానం దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సంబంధించి సాంప్రదాయ విధానాల్లో .. వివిధ భాగస్వాముల మధ్య సమన్వయం ఉండటం లేదని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘వివిధ విభాగాల వద్ద సమాచారం స్పష్టంగా లేకపోవడం ఇందుకు కారణం. పీఎం గతి శక్తితో ఇకనుంచి అందరూ పూర్తి సమాచారంతో తమ తమ ప్రణాళికలను రూపొందించుకోవడం వీలవుతుంది. దేశ వనరులను గరిష్ట స్థాయిలో సమర్థంగా వినియోగించుకోవడానికి సాధ్యపడుతుంది‘ అని ఆయన చెప్పారు. గతి శక్తి కార్యక్రమ ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ.. 2013–14లో ప్రభుత్వ ప్రత్యక్ష పెట్టుబడుల వ్యయాలు రూ. 2.50 లక్షల కోట్లుగా ఉండగా.. 2022–23లో ఇది రూ. 7.5 లక్షల కోట్లకు చేరిందని ప్రధాని వివరించారు. ‘సమాఖ్య విధానంలోని సహకార స్ఫూర్తిని మరింత పటిష్టంగా అమలు చేసే దిశగా, ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్ల మేర తోడ్పాటు అందించేందుకు కేంద్రం కేటాయింపులు జరిపింది. బహువిధమైన ఇన్ఫ్రా, ఇతర ప్రయోజనకరమైన అసెట్స్‌పై రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు‘ అని ప్రధాని పేర్కొన్నారు. పుష్కలంగా డేటా.. గతి శక్తి – నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో ప్రస్తుత, ప్రతిపాదిత మౌలిక ప్రాజెక్టులతో పాటు అటవీ భూములు, పారిశ్రామిక స్థలాలు మొదలైన వాటన్నింటికి సంబంధించి 400 పైగా రకాల డేటా అందుబాటులో ఉందని మోదీ చెప్పారు. మాస్టర్ ప్లాన్ కీలక వివరాలన్నీ ఒకే చోట సింగిల్ ప్లాట్ఫామ్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ప్రణాళికల రచన కోసం ప్రైవేట్ రంగం వీటన్నింటినీ మరింత విస్తృతంగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా, ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడుల రాకకు గతి శక్తి తోడ్పడగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. దీనితో ఆర్థిక వ్యవస్థకు పలు ప్రయోజనాలు చేకూరగలవని ఆయన పేర్కొన్నారు. -
ఆరేళ్ల ప్రాజెక్టు.. యాక్సిడెంట్లు తగ్గేట్టు
సాక్షి, హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం ఆరేళ్ల ప్రాజెక్టును అమలు చేయబోతోంది. దేశవ్యాప్తంగా ఈ ఆరేళ్లలో రూ. 7,270 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో 50 శాతం మొత్తాన్ని కేంద్ర రహదారుల శాఖ కేటాయించనుండగా, 25 శాతం ప్రపంచ బ్యాంకు, మిగతా మొత్తాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అందించనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రాలకు మొత్తంగా రూ.6,725 కోట్లను కేంద్రం ఇవ్వబోతోంది. ఇందులో రాష్ట్రానికి రూ. 320 కోట్లు రానున్నాయి. రోడ్లు భవనాల శాఖతోపాటు రవాణా, హోం, వైద్యారోగ్య, విద్య, పట్టణాభివృద్ధి శాఖలను కలుపుకొని ప్రాజెక్టును కేంద్రం అమలు చేయబోతోంది. 2019 నాటి ప్రమాదాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. వాహనాల సంఖ్య బాగా పెరుగుతుండటం, అందుకు తగ్గట్టు డ్రైవింగ్ నైపుణ్యం అభివృద్ధి చెందకపోవటం, ప్రమాణాలతో రోడ్లు అందుబాటులో లేకపోవటంతో యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు చర్యలు చేపట్టకుంటే పరిస్థితి క్రమంగా భయానకంగా మారుతుందని గుర్తించిన కేంద్రం కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రజల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచితే తప్ప పరిస్థితి మారదని నిర్ణయించి చర్యలు తీసుకోబోతోంది. 2019లో జరిగిన ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టింది. ఆ సంవత్సరం మన రాష్ట్రంలో 21,588 ప్రమాదాలు జరిగాయి. వీటన్నింటిలో కలిపి 6,800 మంది మృతి చెందగా 22,265 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదాల తీవ్రత, రోడ్ నెట్వర్క్ విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు కేటాయించింది. మార్కులేస్తూ.. డబ్బులిస్తూ.. ప్రాజెక్టులో భాగంగా 14 రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాజెక్టు ప్రమాణాలను రూపొందించి కచ్చితంగా పాటించేలా గైడ్‌లైన్స్ రూపొందించింది. వాటి అమలు ఆధారంగా రాష్ట్రాలకు మార్కులు ఇవ్వనుంది. అలా వచ్చిన మార్కుల ఆధారంగా ఏటా నిధులను విడుదల చేయనుంది. వచ్చే ఆరేళ్లలో ప్రమాదాల సంఖ్యలో కనీసం 30 శాతం తగ్గాలని, ముఖ్యంగా మృతుల సంఖ్య అంతమేర తగ్గిపోవాల్సి ఉంటుందని కేంద్రం లక్ష్యంగా విధించింది. తొలి ఏడాది 3% మేర మృతుల సంఖ్య తగ్గాలని, ఆ తర్వాతి ఐదేళ్లలో వరుసగా 7.5%, 13.5%, 19.5%, 25.5%, 30 % వరకు తగ్గిపోవాలని చెప్పింది. ప్రమాదాల నివారణకు కేంద్రం మార్గదర్శకాలు.. ►రోడ్డు ప్రమాదాలపై డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ సంబంధిత అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. ►రోడ్లపై నిర్ధారిత వేగాన్ని మించకుండా పరికరాలు సమకూర్చుకోవాలి. ►రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే పాఠ్యాంశాలు రూపొందించాలి. ►ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి లోపాలను సరిదిద్దాలి. ►వాహనాల ఫిట్నెస్ పరీక్షలను కఠినంగా అమలు చేయాలి. ►నిబంధనలు పాటించని వాహనదారులకు పెనాల్టీలు విధించాలి. ►ప్రమాదాలు జరిగితే వెంటనే క్షతగాత్రులకు వైద్యం అందేలా అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ►అంబులెన్సులు సమకూర్చుకోవాలి. వాటి నిర్వహణ పక్కాగా ఉండాలి. ►ప్రధాన రోడ్లపై ద్విచక్ర వాహనాలకు విడిగా మార్కింగ్ ఉండాలి. -
గతిశక్తి ప్లాన్ కింద 101 ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద 101 ప్రాజెక్టులను గుర్తించినట్టు కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. వినియోగం, ఉత్పత్తి కేంద్రాలను పోర్ట్‌లతో అనుసంధానించేందుకు గతిశక్తి పథకాన్ని కేంద్రం తీసుకురావడం గమనించాలి. సీఐఐ వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా సోనోవాల్ మాట్లాడారు. 24 రాష్ట్రాల పరిధిలో 11 జలమార్గాలు విస్తరించాయని.. వీటిని జాతీయ జలమార్గాలుగా గుర్తించినట్టు తెలిపారు. ‘‘రవాణా వ్యయాలను తగ్గించడం భారత్‌కు కీలకం. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దృష్టితో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అనుసంధానం విస్తృతికి 101 ప్రాజెక్టులను మా శాఖ గుర్తించింది’’ అని సోనోవాల్ వివరించారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులైన సాగర్మాలా, భారత్‌మాలా, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అమలు దశల్లో ఉన్నట్టు చెప్పారు. సాగర్మాలా ప్రాజెక్టు కింద పోర్టుల సదుపాయాల విస్తరణకు, నైపుణ్యాల శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వాలకు తమ శాఖా తరఫున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఇతర పోర్ట్‌లతో అనుసంధానానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దేశంలో రవాణా సదుపాయాల విస్తరణ, రవాణా వ్యయాలు తగ్గించే లక్ష్యాలతో రూ.100 లక్షల కోట్ల నేషనల్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రధాని మోదీ ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రారంభించడం గమనార్హం. మౌలిక, రవాణా సదుపాయాలను విస్తరించడం ద్వారా భవిష్యత్తులో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్నది ఇందులోని ఉద్దేశ్యం. దేశ వాణిజ్యం, వృద్ధిలో సముద్రరంగం కీలక పాత్ర పోషిస్తుందని సోనోవాల్ అన్నారు. సరఫరా వ్యవస్థ, రవాణా సామర్థ్యాలు బలోపేతం అయితే 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం సాధ్యమవుతుందన్నారు. -
రూ.20వేల కోట్ల ప్రాజెక్టులపై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం జరిగిన 39వ ‘ప్రగతి’ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సహా 7 రాష్ట్రాల్లో చేపట్టిన రూ.20వేల కోట్ల విలువైన 8 ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. ప్రధాన అధ్యక్షతన 9 అంశాల ఎజెండాతో జరిగిన ఈ సమావేశంలో 8 ప్రాజెక్టులతోపాటు ఒక పథకంపై సమీక్ష జరిగినట్లు ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ల్లో చేపట్టిన 3 రైల్వే ప్రాజెక్టులు, రోడ్డు రవాణా, హైవేశాఖ, విద్యుత్ శాఖలకు చెందిన రెండేసి ప్రాజెక్టులు, పెట్రోలియం, సహజవాయువు శాఖకు చెందిన ఒక ప్రాజెక్టు ఇందులో ఉన్నాయి. వ్యయాలు పెరగకుండా సకాలంలో ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నొక్కి చెప్పారు. పోషణ్ అభియాన్ ప్రగతిపైనా ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం, పోషణపై ప్రాథమిక స్థాయిలో అవగాహన పెంపొందించడంలో స్వయం సహాయక బృందాలు, ఇతర స్థానిక సంఘాల భాగస్వామ్యంపైనా ఆయన చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రాజెక్టుల అమలు, నిర్వహణను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఆన్లైన్ వేదికే ‘ప్రగతి’. ఇప్పటి వరకు జరిగిన 38 విడతల ప్రగతి సమావేశాల్లో రూ.14.64 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులపై నరేంద్ర మోదీ సమీక్ష జరిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వివరించింది. -
రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్ డాలర్లు దాటిన భారత్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్, రష్యా ద్వైపాక్షిక ఇంధన సహకార బలోపేతంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి, రష్యా ఇంధన మంత్రి నికోలయ్ షుల్గినోవ్‌తో శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించారు. రష్యాలోని ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులపై భారత్ పెట్టుబడులు 15 బిలియన్ డాలర్లను మించడం గమనార్హం. అలాగే రష్యాకు చెందిన రోజ్‌నెఫ్ట్ భారత్‌కు చెందిన ఎస్సార్ ఆయిల్‌ను 2017లో 12.9 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయడం తెలిసిందే. ఇంధన సహకార విస్తృతిపై నికోలయ్‌తో చర్చలు నిర్వహించినట్టు కేంద్ర మంత్రి పురి ట్వీట్ చేశారు. రష్యాలోని ప్రాజెక్టులపై భారత చమురు సంస్థల పెట్టుబడులను, ఎల్ఎన్జీ, ముడి చమురు సరఫరాను సమీక్షించినట్టు ప్రకటించారు. భారత ఇంధన రంగంలో రష్యా అతిపెద్ద పెట్టుబడిగా ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు -
సమన్వయలోపం.. ప్రాజెక్టులపై ప్రభావం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే మధ్య సమన్వయం లేకపోవడంతో కొన్ని ప్రాజెక్టులపై ఆ ప్రభావం పడుతోంది. దీన్ని నివారించేందుకు ఏ ప్రయత్నాలు జరగక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్‌లోని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి ప్రధాన రైల్వే స్టేషన్లలో కేవలం 21 ప్లాట్‌ఫామ్స్ ఉండగా ఇవి ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు కూడా సరిపోవట్లేదు. కొత్త రైళ్లు కావాలంటే ప్లాట్‌ఫామ్స్ లేకపోవటం పెద్ద సమస్యగా మారింది. ఇందుకోసం నగర శివారు ప్రాంతాల్లో రెండు భారీ శాటిలైట్ టెర్మినళ్లు నిర్మించాలని చాలాకాలంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నిస్తోంది. వరంగల్ రూట్లో చర్లపల్లి, ముంబై రూట్లో నాగులపల్లిని ఎంపిక చేసింది. చర్లపల్లి స్టేషన్ వద్ద రైల్వేకు 50 ఎకరాల భూమి ఉంది. నాగులపల్లిలో స్టేషన్ మినహా సొంత భూమి లేదు. దీంతో చర్లపల్లి వైపు 150 ఎకరాలు, నాగులపల్లి వైపు 100 ఎకరాల భూమి ఇస్తే రెండు భారీ టెర్మినళ్లు నిర్మించి నగరానికి రైల్వే పరంగా ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రతిపాదించింది. కానీ వివిధ కారణాలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించలేదు. అక్కడితో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. కానీ రైల్వే పరంగా ఇబ్బందులు కొనసాగుతుండటంతో గత్యంతరం లేక తన ఆలోచనను మార్చుకున్న దక్షిణ మధ్య రైల్వే, చర్లపలి వద్ద అందుబాటులో ఉన్న 50 ఎకరాల్లో కొత్త టెర్మినల్ నిర్మాణ పని ప్రారంభించింది. నాగులపల్లి ప్రతిపాదన కాస్తా అటకెక్కింది. చర్చలేవీ? ఈ విషయంలో రైల్వే బోర్డు ఇప్పటివరకు స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భూమిని పొందే ప్రయత్నమే చేయలేదు. ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వకుంటే ఎంతోకొంత ధరకు కొనే విషయాన్ని రైల్వే శాఖ పట్టించుకోవటం లేదు. దీన్ని కొలిక్కి తెచ్చేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చొరవ చూపటం లేదు. ఫలితంగా అత్యంత కీలకమైన ప్రాజెక్టుకు విఘాతం ఏర్పడింది. చదవండి: (బడ్జెట్ టైమ్: ఆర్థిక భారతానికీ టీకా వేస్తారా?) చర్లపల్లిలో వేగంగా.. చర్లపల్లిలో కొత్త టెర్మినల్ పనులను దక్షిణ మధ్య రైల్వే వేగంగా కొనసాగిస్తోంది. గత బడ్జెట్లో రూ.4 కోట్లు ఇవ్వటంతో వాటితో పనులు జరుగుతున్నాయి. ఇందుకు రూ.110 కోట్లకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. అక్కడ తక్కువ స్థలమున్నందున కొత్తగా 3 ఫుట్ఓవర్ వంతెనలు, ఆరు ప్లాట్‌ఫామ్స్, రైళ్లు నిలిపేందుకు పిట్ లైన్స్, వాటి నిర్వహణ పనులకు అదనపు మెయింటెనెన్స్ లైన్స్ నిర్మిస్తోంది. ఈ బడ్జెట్లో దీనికి భారీగా కేటాయింపులు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏమిటీ సమస్య? సికింద్రాబాద్‌లో కేవలం 10 ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. కానీ నిత్యం ఆ స్టేషన్ మీదుగా దాదాపు 250 రైళ్లు (ఎంఎంటీఎస్‌తో కలిపి) వచ్చిపోతుంటాయి. వాటికి ప్లాట్‌ఫామ్స్ సర్దుబాటు చేయటం కష్టంగా మారింది. దీంతో ఇక్కడ ప్లాట్‌ఫామ్ ఖాళీ అయ్యేవరకు.. నగరానికి వచ్చిన రైళ్లను శివారులో దాదాపు అరగంట పాటు నిలిపేయాల్సి వస్తోంది. ఇది ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. దీంతో చాలామంది అక్కడే దిగి నానా తంటాలు పడి రోడ్డుపైకి చేరుకుని ఆటోలను ఆశ్రయించి వెళ్లిపోవాల్సి వస్తోంది. అలాగే నాంపల్లి స్టేషన్‌కు వంద రైళ్ల తాకిడి ఉండగా ఆరు ప్లాట్‌ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. చదవండి: (స్కూల్ బెల్ నేటి నుంచే..) ఇందులో మూడు చిన్నవి కావటంతో ఎక్కువ బోగీలుండే రైళ్లకు పనికిరావటం లేదు. మూడు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. కాచిగూడ స్టేషన్ మీదుగా 150 రైళ్లు సాగుతుండగా, ఐదు ప్లాట్‌ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. కొత్తగా రైళ్లు కేటాయిస్తే వాటిని నిలిపేందుకు జాగా లేకుండా పోయింది. ఖాళీ సమయాల్లో రైళ్లను పార్క్ చేసేందుకు స్థలం లేక దూరంగా ఉన్న స్టేషన్లలో నిలిపి తిరిగి తీసుకురావాల్సి వస్తోంది. అయితే ఖర్చును పంచుకునే పద్ధతిలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో రైల్వే–రాష్ట్ర ప్రభుత్వం మధ్య సఖ్యత లేక పనుల్లో జాప్యం జరుగుతున్నట్టుగానే ఈ టెర్మినల్ ప్రాజెక్టుల విషయంలోనూ సమస్యలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరించేందుకు ఇరువైపులా చొరవ చూపాల్సి ఉంది. -
చైనా ప్రాజెక్టులకు కరోనా సెగ
చైనా కలల ప్రాజెక్టులను కరోనా గట్టిగా దెబ్బ తీసింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లతో వాణిజ్య సంబంధాల బలోపేతం, పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని డ్రాగన్ దేశం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు వైరస్ సెగ తగిలింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) పేరిట చైనా ప్రారంభించిన మహానిర్మాణంలో అయిదో వంతు ప్రాజెక్టులపై కోవిడ్–19 ప్రభావం పడిందని చైనా విదేశాంగ శాఖలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ జియోలాంగ్ వెల్లడించారు. 40 శాతం ప్రాజెక్టులపై అత్యంత తీవ్ర ప్రభావం, 30–40 శాతం ప్రాజెక్టులపై కొంతమేరకు కరోనా ప్రభావం పడిందని ఆయన చెప్పినట్టుగా సౌత్ చైనా మార్నింగ్ పోస్టు పత్రిక వెల్లడించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2013లో అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఐని ప్రారంభించారు. ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, గల్ఫ్ ప్రాంతం, ఆఫ్రికా, యూరప్‌లను రహదారి, సముద్ర మార్గాల ద్వారా కలుపుతూ బీఆర్ఐ మహా నిర్మాణంలో మొదలైంది. ఈ ఏడాది జనవరి నాటికి మొత్తం 2,951 ప్రాజెక్టుల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. వీటి విలువ 3.87 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని ఒక అంచనా. ఈ ప్రాజెక్టుల్లో అధిక భాగం పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సీపీఈసీపైనా ప్రభావం 6 వేల కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)పై కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఈ కారిడార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా వెళుతూ ఉండడంతో భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కాంబోడియాలో సిహనౌకువిలే ప్రత్యేక ఆర్థిక మండలి, ఇండోనేసియాకు చెందిన జకార్తా–బాండంగ్ హైస్పీడు రైలు ప్రాజెక్టుల పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీనికి సంబంధించి చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి త్వరగా ఈ ప్రాజెక్టుల్ని ప్రారంభించాలని సూచించారు. -
ప్రగతికి శ్రీకారం
-
మీ రుణం తీర్చుకుంటున్నా..
సాక్షి ప్రతినిధి కడప: ‘నాన్నను మీరు అమితంగా ప్రేమించారు.. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఎవరూ లేరన్న సందర్భంలో మీ వెనుక మేమంతా ఉన్నామని కుటుంబంలా నాకు తోడుగా నిలబడ్డారు. మీ బిడ్డగా నన్ను దీవించారు.. ఆశీర్వదించారు. ఇవాళ మీ బిడ్డగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందున మీ రుణం తీర్చుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.1,329 కోట్లతో చేపట్టిన 24 అభివృద్ధి పనులకు బుధవారం ఉదయం ఆయన పులివెందుల ధ్యాన్‌చంద్ క్రీడా మైదానంలో శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున హాజరైన స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలివిడతగా ఈ పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పలు గ్రామాల్లో కొత్త చెరువుల తవ్వకం.. ‘‘గండికోట ప్రాజెక్టు దిగువన ముద్దనూరు మండలం ఆరవేటిపల్లె, దేనేపల్లె వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇంజనీర్లు సర్వే చేశారు. రాబోయే రోజుల్లో ఈ డ్యామ్‌కు శంకుస్థాపన చేస్తాం. దీంతో జిల్లాలో కరువు పరిస్థితిని అధిగమిస్తాం. ముద్దనూరు – కొడికొండ చెక్‌పోస్టు (పులివెందుల–బెంగుళూరు) రోడ్డును విస్తరిస్తాం. పెండింగ్‌లో ఉన్న పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ), లింగాల బ్రాంచ్ కెనాల్, గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో చెరువులు లేని గ్రామాల్లో కొత్త చెరువులు తవ్వుతాం. సర్వే చేయించి.. ఆ చెరువులకు దగ్గరలో ఉన్న కాలువలతో అనుసంధానం చేసి పూర్తిగా నింపే కార్యక్రమం చేస్తాం. ఆ చెరువులకు మైక్రో ఇరిగేషన్‌తో లింక్ చేసి ఆయకట్టుకు నీరందిస్తాం. మొత్తం పీబీసీ ఆయకట్టును మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. రాబోయే పర్యటనల్లో వాటికి శంకుస్థాపనలు చేస్తాను. ఇవాళ 24 పనులకు (జాబితా చదివారు) శంకుస్థాపన చేస్తున్నా’’ అని సీఎం జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఎంలు ఎస్బీ అంజద్‌బాష, ఆళ్ల నాని, మంత్రులు శంకర నారాయణ, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ మేయర్, కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సీఎం శంకుస్థాపన చేసిన పనుల వివరాలు.. ►పులివెందులలో రూ.347 కోట్లతో వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు. ►గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా వేముల, వేంపల్లె మండలాల్లోని 15 వేల ఎకరాల స్థిరీకరణ. రూ.58 కోట్లతో చేపట్టే ఈ పథకం ద్వారా కొత్తగా అలవలపాడు, పెండ్లూరు, నాగూరు గ్రామాలకు జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి) నుంచి నీళ్లందించడమే కాకుండా పీబీసీ ఆయకట్టు చివర ఉన్న వి.కొత్తపల్లె, గిడ్డంగివారిపల్లె, టి.వెలమవారిపల్లె, ముచ్చుకోన చెరువులకు నీరందుతుంది. (తర్వాత ఈ నీళ్లు పాపాగ్నిలో కలుస్తాయి) తద్వారా నందిపల్లి, ఉప్పాలపల్లె, ముసల్‌రెడ్డిపల్లె గ్రామాలకు సైతం ప్రయోజనం చేకూరుతుంది. ►చిత్రావతి నుండి ఎర్రబల్లి చెరువుకు నీటిని నింపి, వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వల్ల ప్రభావితమయ్యే ఏడు గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం. రూ.350 కోట్లతో చేపట్టే ఈ పథకం ద్వారా కోమన్నూతల, ఎగువపల్లి, మురారిచింతల, అంబకపల్లె, ఎర్రబల్లి చెరువు, మోటూన్నూతలపల్లె వంక, తదితర గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది. గిడ్డంగివారిపల్లెలో 1.1 టీఎంసీ రిజర్వాయర్ నిర్మించి యూసీఐఎల్ పల్లెలకు నీటి సరఫరా చేయొచ్చు. ►పులివెందులలో రూ.100 కోట్లతో 55.36 కిలోమీటర్లు భూగర్బ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు. ►పులివెందులలో రూ. 65 కోట్లతో 142.56 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా కోసం పైపులైన్ నిర్మాణం. ►వేంపల్లె గ్రామ పంచాయతీలో రూ.63 కోట్లతో 85.50 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.114 కోట్ల పాడా నిధులతో సీసీ రోడ్లు, పులివెందుల పట్టణ సుందరీకరణ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, పీబీసీ, సీబీఆర్ పరిధిలో వివిధ చెరువులకు సాగునీటి సరఫరా, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తారు. దీంతోపాటు పీబీసీ నుంచి దొండ్లవాగు చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల చెరువు నుంచి వనం బావి చెరువుకు ఎత్తిపోతల పథకం, నాయనిచెరువు నుంచి బత్తెనగారి చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల బ్రాంచ్ కెనాల్ కింద రామట్లపల్లె చెరువు, గుణకనపల్లె చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల కెనాల్ కింద సోత్రియం ఎత్తిపోతల పథకం నుంచి నల్లపురెడ్డిపల్లె, కమ్మాయిగారిపల్లె కుంటకు నీళ్లందిస్తారు. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.13.21 కోట్లతో ఏడు మార్కెట్ గిడ్డంగులతోపాటు పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్ యార్డులలో మౌలిక వసతుల కల్పన ►పులివెందులలో హార్టికల్చర్ పంటల కోసం రూ.13 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రీకూలర్, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలు. ►నల్లచెరువుపల్లె గ్రామంలో రూ.27 కోట్లతో 132 కేవీ విద్యుత్ ఉప కేంద్రం ద్వారా 14 గ్రామాలకు లబ్ధి కలిగేలా పనులు. ►రూ.10 కోట్లతో ఐదు 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం.. 10 గ్రామాల్లోని 2,100 వ్యవసాయ, 10,200 గృహ విద్యుత్ సర్వీసులకు లబ్ధి. ►రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.19.60 కోట్లతో కడప – పులివెందుల రోడ్డులోని వేంపల్లె పట్టణం నుంచి నూలివీడు, పందికుంట, కోళ్లకుంట రోడ్డు పనులు. ►రూ.11.52 కోట్లతో పులివెందులలో ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి. ►రూ.9.30 కోట్లతో 30 పడకల నుంచి 50 పడకలకు వేంపల్లెలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విస్తరణ. ►రూ.17.50 కోట్లతో పులివెందుల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమి ఏర్పాటు. తద్వారా 14 రకాల స్పోర్ట్స్‌కు అన్ని రకాల వసతులతో శిక్షణ. ►రూ.20 కోట్లతో ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్ అభివృద్ధి. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.16.85 కోట్లతో 51 దేవాలయాల పునరుద్ధరణ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 18 కొత్త దేవాలయాల నిర్మాణం. ►పులివెందులలో రూ.10 కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (మినీ సచివాలయం) ఏర్పాటు. ►రూ.11.20 కోట్లతో నియోజకవర్గంలో 32 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం. ►రూ.4.50 కోట్లతో వేంపల్లెలో నూతన ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మాణం. ►రూ.20 కోట్లతో వేంపల్లెలో కొత్తగా డిగ్రీ కళాశాల నిర్మాణం. ►పులివెందుల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో రూ.20 కోట్లతో లెక్చర్ కాంప్లెక్స్, నైపుణాభివృద్ది కేంద్రం ఏర్పాటు. ►రూ.4 కోట్లతో వేంపల్లెలో బీసీ బాలురు, బాలికల వసతి గృహాల నిర్మాణం. ►పులివెందులలో రూ.3.64 కోట్లతో మోడల్ పోలీసుస్టేషన్ నిర్మాణం. ►పులివెందులకు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కళాశాలలను మంజూరు చేస్తున్నాం. నాన్నగారి హయాంలో నిర్మించిన.. ప్రస్తుతం దైన్యస్థితిలో ఉన్న ఐజీ కార్ల్ భవనాల్లో ఈ కళాశాలలను ఏర్పాటు చేస్తాం. త్వరలో వీటికి పునాది రాయి వేస్తాం. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీళ్లిస్తాం. దేవుడి ఆశీర్వాదంతో మరిన్ని గొప్ప పనులు చేసేలా దీవించాలని పేరుపేరునా ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. – సీఎం వైఎస్ జగన్ -
పట్టుకుంటే చాలు అవినీతి షాక్!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం విజయవాడ విద్యుత్ సౌధ కార్యాలయంలో భేటీ అయింది. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) మాజీ సీఎండీ పి.గోపాల్ రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం రెండు గంటలపాటు సాగింది. 45 రోజుల వ్యవధిలో ప్రభుత్వం సూచించిన ప్రాజెక్టులను ఏ విధంగా పరిశీలించాలి? అవినీతి కోణాన్ని గుర్తించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కమిటీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, సమాచార సేకరణకు అవసరమైన ఏర్పాట్లు.. తదితర అంశాలపై సమావేశంలో చైర్మన్, సభ్యులు రామారావు (ట్రాన్స్‌కో గ్రిడ్ ఆపరేషన్స్ మాజీ డైరెక్టర్), ప్రొఫెసర్ ఉషా రామచంద్ర (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్), రాజ్‌గోపాల్ రెడ్డి (ఆర్థిక నిపుణులు, ఏపీఈఆర్ మాజీ సభ్యుడు), సీహెచ్‌వీఎస్ సుబ్బారావు (ట్రాన్స్‌కో ప్లానింగ్ సీజీఎం) సమగ్రంగా చర్చించారు. ఎవరికి ఎంత అందిందో ఆరా.. ట్రాన్స్‌కోలో అవసరం లేకున్నా కమీషన్ల కోసమే విద్యుత్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అప్పు చేసి మరీ అనుకూలమైన సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందుకోసం నిబంధనలను ఇష్టానుసారం మార్చారు. కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే అర్హత సంపాదించేలా జాగ్రత్త పడటంలో అప్పటి అధికారులు అన్ని విధాల టీడీపీ ప్రభుత్వానికి సహకరించారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఏపీ జెన్కోలో రెండు థర్మల్ ప్రాజెక్టుల ఈపీసీ కాంట్రాక్టులను దేశంలో ఎక్కడా లేని విధంగా కొన్ని సంస్థలకు కట్టబెట్టి, విద్యుత్ పంపిణీ సంస్థలను దండుకునే కేంద్రాలుగా గత ప్రభుత్వం మార్చేసింది.డెప్యూటేషన్‌పై ట్రాన్స్‌కోకు వచ్చిన ఓ అధికారి అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై సమగ్రంగా విచారణ జరపాలని కమిటీ నిర్ణయించింది. విద్యుత్ శాఖలో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు అధికారుల అవినీతి, బినామీ వ్యవహారాలపై కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. దీన్ని కూడా లోతుగా పరిశీలించే వీలుంది. అతి ముఖ్యమైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, స్వల్పకాలిక, రోజువారీ విద్యుత్ కొనుగోళ్లలో ఎవరికి ఎన్ని ముడుపులు అందాయనేది ఆరా తీయబోతున్నారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏళ్ల తరబడి అదే విభాగంలో ఉన్న అధికారుల ఆస్తులపై కూడా వివరాలు అందినట్లు తెలిసింది. ప్రతి ప్రాజెక్టులోనూ మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని ఆధారాలతో వెలికితీయాలని కమిటీ నిర్ణయించింది. అవినీతిపైనే ప్రధాన దృష్టి.. గత ఐదేళ్లలో విద్యుత్ రంగం పూర్తిగా అవినీతి మయమైంది. ట్రాన్స్‌కో, జెన్కో ప్రాజెక్టుల విషయంలో భారీగా ముడుపులు చేతులు మారాయి. ఉన్నతాధికారుల దగ్గర్నుంచి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడికి భారీగా ముడుపులు అందాయనే విమర్శలొచ్చాయి. ఈ అవినీతి వ్యవహారాలను ఐదేళ్లుగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలతో వెలుగులోకి తెచ్చింది. బొగ్గు కొనుగోళ్లు, థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు, ట్రాన్స్‌కోలో కొంతమందికే అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపొందించిన తీరును ఎప్పటికప్పుడు వెలికితీసింది. దీనిపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనూ, బయట పెద్దఎత్తున పోరాడారు. తాము అధికారంలోకి రాగానే అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, బాధ్యులైన వారిని శిక్షిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. -
విద్యార్థుల ప్రతిభ.. ఆకట్టుకుంటున్న సృజన!
నేటితరం విద్యార్థులు కేవలం మార్కుల సాధనకేకాకుండా చదువుకుంటూనే వివిధ రకాల ప్రాజెక్టుల తయారీపై దృష్టిపెడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే వివిధ రకాల పరికరాలను తయారుచేస్తూ అబ్బురపరుస్తున్నారు. ప్రధానంగా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో వినూత్న తరహా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. దీనికిగాను ఆయా కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహం ప్రశంసనీయం. పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామంలోని భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకుంటున్నాయి. సాక్షి, భిమవరం(పశ్చిమ గోదావరి) : హార్ట్‌బీట్ మానిటరింగ్ సిస్టమ్, స్మార్ట్ సెక్యూరిటీ ఆలర్ట్ ఫర్ హెవికల్స్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్, స్మార్ట్ రిజర్వాయర్ సిస్టమ్ వంటివి ఎన్నో ప్రాజెక్టులను భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తయారు చేశారు. కళాశాలలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సహకారంతో రేయింబవళ్లు విద్యార్థులు తమ మేథస్సును ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో తయారుచేసిన పలు ప్రాజెక్టులకు మరింత మెరుగుపర్చి వినియోగంలోకి తీసుకువస్తే ధనికులకేకాకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ప్రస్తుతం ఈవీఎంలు మొరాయిస్తున్న కారణంగా ఎన్నికల పోలింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు ఓటరు గుర్తింపు కార్డులను పరిశీలించడం మరికొంత ఆలస్యానికి కారణం. దీనిని అధిగమించడానికి ఈసీఇ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న పి నిర్మల, వి సాయిభారతి, పి వెంకటలక్ష్మి, బి హిమసాయి తయారుచేసిన ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ సిస్టమ్ ఎంతగానో దోహదపడుతుంది. దీని ద్వారా ఓటింగ్ త్వరితగతిని పూర్తిచేయించడమేకాక సిబ్బంది సంఖ్యను కూడా ఘననీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. హార్ట్‌బీట్ మానిటరింగ్ సిస్టమ్ కళాశాలలోని ఈసీఈ డిపార్ట్మెంట్కు చెందిన విద్యార్థులు వై రోహిత్, కె హరిలత, కె శివ, బి దేవి కేవలం రూ.2,500 వ్యయంతో తయారుచేసిన హార్ట్‌బీట్ మానిటరింగ్ సిస్టమ్ ఆకట్టుకుంటోంది. దీని ద్వారా ఆసుపత్రులు, నివాసాల్లో సైతం రోగుల హార్ట్‌బీట్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ప్రధానంగా వృద్ధులు ఒంటరిగా ఉన్నప్పుడు దీనిని ఉపయోగించుకోవడం ఎంతో సులువు. తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ యంత్రాన్ని అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ రిజర్వాయర్ సిస్టమ్ ఈసీఈ తృతీయ సంవత్సరం విద్యార్థిని జి సుప్రియ నేతృత్వంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎస్ జ్యోతిక, సీహెచ్ సాయి మహేష్, పి లలిత రూ.3 వేల వ్యయంతో రూపొందించిన స్మార్ట్ రిజర్వాయర్ సిస్టమ్ ద్వారా రిజర్వాయర్లు, డ్యామ్‌లలో నీటి పరిమాణాన్ని గుర్తించే వీలుంటుంది. నివాసాల వద్ద ఏర్పాటుచేసుకునే వాటర్ ట్యాంక్లులో నీరు నిండిన సమయంలో ఈ సిస్టమ్ ద్వారా ఆలారమ్ మోగుతుంది. తద్వారా నీటి వృథాను అరికట్టవచ్చు. వెహికల్స్ అలర్ట్ నేటి ఆధునిక యుగంలో అన్ని వయస్సులవారు వాహనాలను యథేచ్చగా వినియోగిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలకు గురై అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోతున్ననవారు కొందరైతే, సకాలంలో వైద్యం అందక తుదిశ్వాస విడిచేవారు మరికొందరు. అయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు సీహెచ్ సంతోష్, బి దేవిశ్రీ, వి థామస్, వై లోకేష్, ఎన్ శరత్ తయారుచేసిన స్మార్ట్ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ వెహికల్స్ సిస్టమ్ ద్వారా మోటారుసైకిల్స్, కార్లు నడిపే సమయంలో హెల్మ్‌ట్, సీట్‌బెల్ట్ ధరించకపోయినా, మద్యం సేవించి డ్రైవింగ్ చేసినా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసిన పద్ధతి వల్ల వెంటనే సదరు కుటుంబ సభ్యులకు మెసేజ్ వెళ్తుంది. ఎక్కడైనా ప్రమాదం జరిగినా క్షణాల్లో తెలుస్తుంది. తద్వారా ప్రమాదం జరిగి వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చును. దీనిని కేవలం రూ.4 వేల వ్యయంతో రూపొందించారు. చదువుతో పాటు ప్రయోగాలు మా కళాశాలలో విద్యనేర్చుకోవడంతో పాటు సరికొత్త అంశాలపై ప్రయోగాలను చేస్తున్నాం. దీని ద్వారా కేవలం ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూడనవసరం లేకుండా సొంతంగా చిన్న కంపెనీ ఏర్పాటు చేసుకుని మరొక పదిమందికి ఉపాధి అవకాశం కల్పించవచ్చును. –జి.సుప్రియ, ఈసీఈ విద్యార్థి కళాశాల యాజమాన్యం ప్రోత్సహిస్తోంది కళాశాలలో విద్యాబోధనతో సమానంగా వివిధ రకాల ప్రాజెక్టుల రూపకల్పనకు యాజమాన్యం ఎంతగానో అవకాశం కల్పిస్తోంది. సొంతంగా ప్రాజెక్టులు తయారు చేయడం వల్ల చదువు పూర్తయిన తరువాత వివిధ ఆంశాలపై అవగాహన ఉండడంతో ఎక్కడ ఉద్యోగంలో చేరినా కష్టం లేకుండా పనిచేసుకునే అవకాశం ఉంటుంది. –పి.నిర్మల, విద్యార్థిని మాలో మాకే పోటీ ప్రాక్టికల్స్ వల్ల ఎక్కువ ప్రయోజనం బట్టిపట్టే విద్యకంటే ప్రాక్టికల్స్ ద్వారా ఎక్కువ విజ్ఞానాన్ని గ్రహించవచ్చు. మా కళాశాలలో వివిధ రకాల ప్రాజెక్టులను తయారు చేసే విద్యార్థులకు మంచి ప్రోత్సహం లభిస్తోంది. అందువల్లనే తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎక్కువ ఉపయోగకకరంగా ఉండే వివిధ రకాల ప్రాజెక్టుల తయారీలో విద్యార్థులం పోటీ పడుతున్నాం. –సీహెచ్ సంతోష్, విద్యార్థి -
సాగునీటి అక్రమాలపై మూడో కన్ను!
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం మూడో కన్ను తెరిచింది! అంచనా వ్యయాలను భారీగా పెంచేసి చేపట్టిన పనుల్లో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ‘థర్డ్ పార్టీ’తో విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రిటైర్డ్ ఈఎన్సీలు బి.రోశయ్య, నారాయణరెడ్డి, నాక్ డైరెక్టర్ పీటర్, ఐఐటీ ప్రొఫెసర్ రమణ సభ్యులుగా థర్డ్ పార్టీని నియమించాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి. శ్వేతపత్రం సాక్షిగా బాబు దోపిడీ.. రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 8న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అదే ఏడాది జూలై 28న సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగిలిన ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామని శ్వేతపత్రంలో ప్రకటించారు. జలయజ్ఞం కింద చేపట్టిన గుండ్లకమ్మ, గాలేరు–నగరి తొలిదశ, హంద్రీ–నీవా తొలిదశ, తాడిపూడి, తోటపల్లి, ముసురుమిల్లి, వంశధార, గురురాఘవేంద్ర తదితర 11 ప్రాజెక్టుల పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, మిగిలిపోయిన ఐదు శాతం పనులకు రూ.780 కోట్లు ఖర్చు చేస్తే కొత్తగా 2,03,628 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చని 2013–14 సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. కానీ శ్వేతపత్రం సాక్షిగా చంద్రబాబు దోపిడీకి తెరతీశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో డీజిల్, సిమెంట్, స్టీలు ధరలు పెరగాయనే నెపంతో ధరల సర్దుబాటు కింద అదనపు బిల్లులు చెల్లించడానికి వీలుగా 2014 ఫిబ్రవరి 7న నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 13) జారీ చేసింది. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ ఉత్తర్వులు జారీ చేశారని గవర్నర్ నరసింహన్‌కు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో దీన్ని ఆయన అభయన్స్(నిలుపుదల)లో పెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ముడుపుల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ ఉత్తర్వులు జారీ చేయించిందని, దీనివల్ల ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోందని, అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉండగా నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లకు మరింత ప్రయోజనం చేకూర్చేలా జీవో 13లో నిబంధనలు మార్చారు.‘ధరల సర్దుబాటు’ కింద కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు మంజూరు చేసేలా 2015 ఫిబ్రవరి 23న జీవో 22 జారీ చేయించారు. అంతటితో ఆగకుండా ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) మౌలిక సూత్రాలను తుంగలో తొక్కుతూ పనుల పరిమాణాల ఆధారంగా అదనపు బిల్లులు చెల్లించేలా జీవో 63 జారీ చేయించారు. ఈ రెండు ఉత్తర్వుల వల్ల సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం భారీగా పెరుగుతుందని, ఖజానాపై భారం పడుతుందని నాడు ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేసినా లెక్క చేయలేదు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ఈ ఉత్తర్వులు జారీ చేశారని సాగునీటి రంగ నిపుణులు సైతం స్పష్టం చేశారు. పనులు గిట్టుబాటు కాకుంటే కాంట్రాక్టర్లను కొట్టినా పనులు చేయరంటూ వారి తరఫున వకల్తా పుచ్చుకున్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడానికే ఈ జీవోలు జారీ చేసినట్లు నమ్మించే యత్నం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా తప్పుబట్టిన ఉత్తర్వులనే అధికారంలోకి రాగానే సమర్థించడం ద్వారా బాబు తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. అంచనాలు పెంచి కమీషన్లు కాజేయ్.. కోరినంత కమీషన్లు చెల్లించని సాగునీటి కాంట్రాక్టర్లపై ఏపీడీఎస్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్) 60 సీ నిబంధన కింద చంద్రబాబు వేటు వేయించారు. ఆ తర్వాత జీవో 22, జీవో 63లను వర్తింపజేసి అంచనా వ్యయం పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ఇలా గత ఐదేళ్లలో 25 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని రూ.39,935.34 కోట్ల నుంచి ఏకంగా రూ.96,785.72 కోట్లకు పెంచేశారు. ఆ తర్వాత కమీషన్లు చెల్లించే కాంట్రాక్టర్లకు పనులను కట్టబెట్టి భారీఎత్తున కమీషన్లు వసూలు చేసుకున్నారు. గత ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.75,427.46 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో నీరు–చెట్టు కింద రూ.13,023.49 కోట్లు, అటవీ శాఖ ద్వారా ఖర్చు చేసిన రూ.185.90 కోట్లు పోనూ మిగతా రూ.57,332.91 కోట్లను సాగునీటి ప్రాజెక్టుల పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. అయితే ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేసిన దాఖలాల్లేకపోవడం గమనార్హం. కొత్తగా ఒక్కటంటే ఒక్క ఎకరాకూ నీళ్లందించిన పాపాన పోలేదు. ఈ వ్యవహారంలో రూ.30 వేల కోట్లకుపైగా దోపిడీ జరిగినట్లు అంచనా. అవినీతిపరులపై చర్యలు టీడీపీ హయాంలో కొత్తగా చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం, కొండవీటివాగు వరద మళ్లింపు పథకం నుంచి ఎన్నికలకు ముందు ప్రకటించిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్–హంద్రీ–నీవా ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, బీటీపీ ఎత్తిపోతల, ఉరవకొండ సీఎల్డీపీ, పత్తికొండ ఎత్తిపోతల, వేదవతి ఎత్తిపోతల, రాజోలిబండ కుడి కాలువ, గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, ముక్త్యాల ఎత్తిపోతల, కోటపాడు–విస్సన్నపేట ఎత్తిపోతల, వరికపుడిశెల ఎత్తిపోతల, గుంటూరు ఛానల్ విస్తరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ, వంశధార–బాహుదా నదుల అనుసంధానం తదితర ప్రాజెక్టు పనుల అంచనా వ్యయంపై కూడా థర్డ్ పార్టీ విచారణ చేయనుంది. ఎంత అవినీతి జరిగిందో సర్కార్‌కు నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా అవినీతి పరు లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారవర్గాలు తెలిపాయి. మూడు నెలల్లో సర్కారుకు నివేదిక సాగునీటి ప్రాజెక్టుల వారీగా చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు, ఈఈలతో థర్డ్ పార్టీ సమావేశమై అంచనాల లెక్కలు తేల్చి మూడు నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. 2004లో వైఎస్సార్ జలయజ్ఞం పనులు చేపట్టారు. ఒకేసారి రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 సాగునీటి ప్రాజెక్టుల పనులకు శ్రీకారం చుట్టారు. వీటిని పూర్తి చేయడం ద్వారా కొత్తగా 1.21 కోట్ల ఎకరాలకు నీళ్లందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అకుంఠిత దీక్షతో జలయజ్ఞాన్ని కొనసాగించారు. 2004 నుంచి 2009 వరకూ రూ.53,205.29 కోట్లు ఖర్చు చేసి 16 ప్రాజెక్టులను సంపూర్ణంగా, మరో 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసిన వైఎస్సార్ 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించారు. మరో 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. సాగునీటి రంగ చరిత్రలో ఇదో రికార్డుగా అధికార వర్గాలు అభివర్ణిస్తున్నాయి. గుట్టు విప్పనున్న థర్డ్‌పార్టీ.. సాగునీటి ప్రాజెక్టుల వారీగా చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు, ఈఈలు, డీఈలు, ఏఈలతో థర్డ్ పార్టీ సమావేశం కానుంది. ప్రాజెక్టు చేపట్టినప్పుడు అంచనా వ్యయం ఎంత? 2014 నాటికి ఎంత పరిమాణం పని పూర్తయింది? బిల్లుల రూపంలో ఎంత చెల్లించారు? ఎంత పని మిగిలింది? ఆ పని పూర్తి చేయాలంటే ఎంత అవసరం? 2014లో టీడీపీ అధికారంలోకొచ్చాక మిగిలిన పని అంచనా వ్యయాన్ని ఎంతకు పెంచింది? పనులను ఎవరికి, ఎంత ధరకు అప్పగించారు? ఇప్పటివరకూ ఎంత పని పూర్తయింది? బిల్లుల రూపంలో ఎంత చెల్లించారు? ఎంత పని మిగిలింది? అన్న కోణంలో థర్డ్ పార్టీ వాస్తవ లెక్కలను రాబట్టనుంది. -
ప్రాజెక్టుల్లో అవినీతిపై థర్డ్ పార్టీతో విచారణ
సాక్షి, అమరావతి: అంచనాలు పెంచి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించి వాస్తవ అంచనాలను మదింపు చేసి అక్రమాల నిగ్గు తేల్చుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. థర్డ్ పార్టీ విచారణ ముగిసేవరకు ఎదురు చూడకుండా, వాస్తవాలను బహిర్గతం చేసి భారీగా అంచనాలు పెంచిన ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలోచనా విధానాన్ని మార్చుకుని ప్రభుత్వ నిధులను ఆదా చేసే దిశగా పని చేయాలని అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం మరోసారి జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇవీ.. ప్రజల ఆశలను నెరవేర్చేలా పాలించాలి.. ‘ప్రభుత్వం డబ్బులు తిన్నవారు ఒకరు.. కానీ చెడ్డపేరు మీకు వస్తోంది.. ఆ పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడి నిజాయితీగా పనిచేయండి. వాస్తవ అంచనాలతో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి’ అని సమీక్షలో సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రాజెక్టుల వ్యయాన్ని తగ్గించి ఖజానాకు నిధులు ఆదా చేసే అధికారులను ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానిస్తామని పునరుద్ఘాటించారు. ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో ప్రజలు ఎన్నో విజ్ఞప్తులు చేశారని, వారి ఆశలు ఫలించేలా పాలన అందించాల్సిన బాధ్యత తనపై ఉందని జగన్ స్పష్టం చేశారు. ఐదు కోట్ల మందిలో తనకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, ప్రజలకు జవాబుదారుగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల వారీగా సాగునీటి పనులపై లోతుగా సమీక్షిస్తానని చెప్పారు. ఎమ్మెల్యేలనూ భాగస్వాములుగా చేసి ప్రాజెక్టుల ప్రాధాన్యతను నిర్ధారించి పనులు పూర్తి చేస్తామన్నారు. జలయజ్ఞానికి తూట్లు పొడిచారు.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంనికి చంద్రబాబు పాలనలో తూట్లు పొడిచారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో 2014 నాటికి కొంత భాగం పనులు మాత్రమే మిగిలాయని, వీటి అంచనా వ్యయాన్ని 200 నుంచి 300 శాతం పెంచడంతోపాటు పాత కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేసి టైలర్ మేడ్ నిబంధనల ద్వారా కమీషన్లు చెల్లించిన కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టారని స్పష్టం చేశారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ నుంచి వంశధార ప్రాజెక్టుల వరకూ అన్నిటిలోనూ అవినీతికి పాల్పడ్డారన్నారు. ‘జలయజ్ఞం కింద చేపట్టినప్పుడు ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? 2014 నాటికి ఎంత పని పూర్తయింది? ఎంత ఖర్చు చేశారు? ఎంత పని మిగిలింది? 2014 తర్వాత మిగిలిన పని అంచనా వ్యయాన్ని ఎంత పెంచేశారు? ఇప్పటివరకూ ఎంత పని పూర్తి చేశారు? బిల్లుల రూపంలో ఎంత చెల్లించారు? ఇంకా ఎంత పని మిగిలి ఉంది? అది పూర్తి కావాలంటే ఎంత అవసరం? అనే అంశాలపై ప్రాజెక్టుల వారీగా నివేదిక ఇవ్వండి. వాటిపై థర్డ్ పార్టీతో విచారణ చేయిద్దాం. ఇందులో జలవనరుల శాఖ అధికారులు, సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉంటారు. అక్రమాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రాధాన్యతల వారీగా పనులు పూర్తి.. జలవనరుల శాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉన్న ప్రాజెక్టుల ప్రాధాన్యత గుర్తించి పూర్తి చేద్దామని సూచించారు. వంశధార, తోటపల్లి, తారకరామతీర్థసాగరం, చింతలపూడి, వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, గుండ్లకమ్మ, గోదావరి డెల్టా ఆధునికీకరణ, కృష్ణా డెల్టా ఆధునికీకరణ, ఏలేరు డెల్టా ఆధునికీకరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మిగతా ప్రాజెక్టులను ప్రాధాన్యత కింద చేపట్టి పూర్తి చేస్తామన్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ విస్తరణలో కేవలం మట్టి పనుల కోసమే రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశారని, రెండు ప్యాకేజీలు ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించారని, ఇదో పెద్ద కుంభకోణమని స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్‌తో అక్రమాలు బహిర్గతం టీడీపీ సర్కారు ఎన్నికలకు ముందు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్–హంద్రీ–నీవా ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, బీటీపీ ఎత్తిపోతల, ఉరవకొండ సీఎల్డీపీ, పత్తికొండ ఎత్తిపోతల, వేదవతి ఎత్తిపోతల, రాజోలిబండ కుడి కాలువ, గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ, ముక్త్యాల ఎత్తిపోతల, కోటపాడు–విస్సన్నపేట ఎత్తిపోతల, వరికపుడిశెల ఎత్తిపోతల, గుంటూరు ఛానల్ విస్తరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ, వంశధార–బాహుదా నదుల అనుసంధానం పనులు చేపట్టినట్లు జలవనరుల శాఖ అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు.ఈ ప్రాజెక్టులకు ఫీజుబులిటీ, హైడ్రలాజికల్ క్లియరెన్స్ తీసుకోకపోవడం, కేవలం లైన్ ఎస్టిమేట్ల ఆధారంగా టెండర్లు పిలవడంపై సీఎం విస్మయం వ్యక్తం చేశారు. ఇందులో భారీ కుంభకోణం దాగుందని స్పష్టం చేశారు. బీటీపీ ఎత్తిపోతల పథకం పనులను అంచనా వ్యయంలో 60 శాతం నిధులతోనే పూర్తి చేయవచ్చని ఒక ప్రజాప్రతినిధి చెప్పారని, ఆయనతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల్లో అంచనా వ్యయాలను పెంచేయడంపై వాస్తవాలను వెల్లడిస్తే అక్రమాలు జరిగిన ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని తెలిపారు. జ్యుడీషియల్ కమిషన్ నేతృత్వంలో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే ప్రాజెక్టుల అంచనా వ్యయంలో కనీసం 20 శాతం తగ్గుతుందని, ఆ మేరకు ఖజానాకు ఆదా అయ్యే నిధులతో కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చని పేర్కొన్నారు. అవసరమైన ప్రాజెక్టులే చేపడదాం.. రాజధాని తాగునీటి అవసరాల కోసం రూ.2,169 కోట్లతో వైకుంఠపురం బ్యారేజీ పనులను చేపట్టామని, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు సార్లు టెండర్లు నిర్వహించామని, 13.19 శాతం అధిక ధరలకు కాంట్రాక్టర్‌కు అప్పగించామని అధికారులు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. అయితే కొండవీటి వాగు వరద మళ్లింపులో భాగంగా మూడు జలాశయాల నిర్మాణాన్ని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) చేపట్టిందని సీఎం గుర్తు చేశారు. వైకుంఠపురం బ్యారేజీ వద్ద నీటి లభ్యత ఉందో లేదో మరోసారి సర్వే చేయాలని ఆదేశించారు. సీఆర్డీఏ జలాశయాలను నిర్మిస్తున్న నేపథ్యంలో వైకుంఠపురం బ్యారేజీ పనులు అవసరమో కాదో తేల్చి నివేదిక ఇవ్వాలని సూచించారు. వంశధార–బాహుదా నదుల అనుసంధానం పనుల అంచనా వ్యయం రూ.6326.62 కోట్లని అధికారులు చెప్పడంతో సీఎం వైఎస్ జగన్ నివ్వెరపోయారు. దీనిపై మరోసారి అధ్యయనం చేయాలని ఆదేశించారు. తాను పాదయాత్ర చేసినప్పుడు రాజోలి, జోలదరాశి, గుండ్రేవుల, సిద్దేశ్వరం అలుగు వంటి ప్రాజెక్టులు చేపట్టాలని అందిన విజ్ఞప్తులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకుందాం చింతలపూడి ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించి హరిశ్చంద్రాపురం నుంచి నాగార్జునసాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోసి ఆయకట్టును స్థిరీకరించడానికి రూ.6,020 కోట్లతో గోదావరి–పెన్నా తొలి దశను చేపట్టామని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.అయితే చింతలపూడి ఎత్తిపోతల నీటితో చింతలపూడి, కోటపాడు–విస్సన్నపేట, నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు ఒకేసారి నీళ్లందించడం ఎలా సాధ్యమవుతుందన్న సీఎం వైఎస్ జగన్ ప్రశ్నకు అధికారులు నీళ్లు నమిలారు. కర్ణాటక సర్కార్ ఆల్మట్టి ఎత్తు పెంచుతున్న నేపథ్యంలో కృష్ణా నదిలో నీటి లభ్యత మరింత తగ్గిపోయి సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా గోదావరి జలాల మళ్లింపుపై ఒకరోజు మేథోమథనం చేసి పనులు చేపడదామని స్పష్టం చేశారు. పోలవరంపై ప్రత్యేక దృష్టి.. పోలవరం పనులపై పర్యావరణ నిషేధాన్ని సడలిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల గడువు జూలై 2వ తేదీతో ముగుస్తుందని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. పర్యావరణ నిషేధాన్ని ఎత్తివేసేలా కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తానని, తక్షణమే వివరాలు పంపాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి యుద్దప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలవరం పనులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రధాన కాంట్రాక్టు సంస్థకు డీజిల్ ఖర్చుల కోసం తక్షణమే రూ.50 కోట్లు విడుదల చేయాలని అధికారులను సీఎం అదేశించారు. గోదావరికి మరో నెల రోజుల్లో వరదలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటివరకూ చేసిన పనులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్, కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, వివిధ ప్రాజెక్టుల సీఈలు పాల్గొన్నారు. ‘‘టెండర్ల వ్యవస్థను చంద్రబాబు అపహాస్యం చేశారు. అంచనాల్లో వంచనకు పాల్పడి సాగునీటి ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచేయించారు. ఎక్కువ కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా టైలర్ మేడ్ నిబంధనలతో టెండర్లు పిలిచారు. అధిక ధరలతో కాంట్రాక్టర్లకు అప్పగించి ఖజానాకు గండి కొట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అంచనాలు పెంచేయడంపై వాస్తవాలు చెప్పండి. అవినీతి జరిగిన ప్రాజెక్టులకు రివర్స్ టెండర్లు నిర్వహిద్దాం. ఖజానాకు కనీసం 20 శాతం నిధులు ఆదా అవుతాయి. ఈ డబ్బులు ఆదా కావడానికి సహకరించిన అధికారులకు ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానం చేస్తాం’’ ‘మా నాన్న, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టారు. ఆ ప్రాజెక్టులు అన్నిటినీ పూర్తి చేసి కరువన్నదే ఎరుగని ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది నాన్న ఆశయాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా పని చేస్తాం’’ ‘‘తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యం ఇద్దాం. సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతులకు ప్రతిఫలం దక్కేలా ఉండాలి. అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు ప్రయోజనం చేకూర్చడమే’’ జలవనరుల శాఖపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి -
ఖజానా ఖాళీ చేసి కమిషన్ల ప్రాజెక్టులు!
సాక్షి, అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ఎన్నికల ముందు కమీషన్ల కోసం చేపట్టిన ప్రాజెక్టులు, పనులు త్వరలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి గుదిబండలుగా మారనున్నాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కమీషన్ల దాహంతో స్వీయ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ఖజానాను వినియోగించుకున్నారని పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రజలతోపాటు ఆర్థిక వ్యవస్థ ఏమైనా సరే ఫరవాలేదనే ధోరణితో వ్యవహరించారని వ్యాఖ్యానిస్తున్నాయి. ఆర్థికశాఖతో పాటు సంబంధిత శాఖలు వారించినప్పటికీ లెక్క చేయకుండా ఎన్నికల ముందు ఐదారేళ్ల బడ్జెట్‌కు సరిపడా పనులను ఎడాపెడా మంజూరు చేశారని, ఇదంతా కోటరీ కాంట్రాక్టర్లకు పనులను కట్టబెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రూపంలో కమీషన్ల కోసమేనని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. డీపీఆర్ లేకుండానే అనుమతులు ఎన్నికలకు ఐదు నెలల ముందే ఖజానాను ఖాళీ చేయడంపై చంద్రబాబు పక్కా ప్రణాళిక రచించారు. నీటి లభ్యత, డీపీఆర్, అనుమతులు లేకుండానే గోదావరి–పెన్నా అనుసంధానం పేరుతో పాటు మొత్తం 15 ప్రాజెక్టులకు పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చారని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇందుకు ఆర్థికశాఖ తీవ్ర అభ్యంతరం తెలిపినా ఏమాత్రం పట్టించుకోలేదు. డీపీఆర్, భూసేకరణ తరువాత పరిపాలనా పరమైన అనుమతులు ఇస్తే అంచనా వ్యయాలు పెరగవని ఆర్థిక శాఖ సూచించినా ఆలకించలేదు. ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారు.. ఇప్పటికే వివిధ శాఖల్లో మంజూరు చేసిన పనులతోపాటు ప్రాజెక్టులకు ఐదారేళ్ల బడ్జెట్ కూడా సరిపోని స్థితికి ఖజానా చేరుకుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే వచ్చే ఐదారేళ్ల బడ్జెట్ నుంచి చెల్లింపులకు సరిపడా పనులు, ప్రాజెక్టులను చేపట్టినందున ఇక కొత్తవి మంజూరు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భరించలేదని స్పష్టం చేసింది. రెవెన్యూ వ్యయం భారీగా పెరిగిపోయిందని, మరోపక్క సాగునీటి, విద్యుత్తు తదితర ప్రాజెక్టుల నుంచి ఆదాయంలభించడం లేదని, ఆ ప్రాజెక్టులు పూర్తికానందున రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం కలగడం లేదని ఆర్థిక శాఖ ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి స్పష్టం చేసింది. అయినా సరే దీన్ని పట్టించుకోకుండా చంద్రబాబు స్వయంగా సంబంధిత ఫైళ్లను తెప్పించుకుని సంతకాలు చేసి పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేశారు. ఈ–ప్రగతి పేరుతో అనుత్పాదకత ప్రాజెక్టు మంజూరు చేశారని, ఐటీ పేరుతో కోట్ల రూపాయల వ్యయం చేశారని, దీనివల్ల ప్రభుత్వ పెద్దలకు మినహా ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ సర్కారు తీరుతో ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని ఆర్థిక శాఖ హెచ్చరించినట్లు తెలిపాయి. ఈమేరకు సంబంధిత ఫైళ్లలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా లిఖితపూర్వకంగా తెలిపిందని అధికార వర్గాలు వివరించాయి. ప్రాజెక్టుల పేరుతో కమీషన్ల పర్వం ఒక్క సాగునీటి శాఖలోనే ఉమ్మడి ఏపీలో చేపట్టిన 24 ప్రాధాన్యత ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, వీటి వ్యయం రూ.24,492 కోట్లు కాగా ఇప్పటివరకు కేవలం రూ.6,760 కోట్లు వ్యయం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు కొనసాగుతున్న 24 ప్రాజెక్టులకే ఇంకా రూ.17,792 కోట్లు వ్యయం కానుందని, ఐదారేళ్ల పాటు వీటికి బడ్జెట్ నుంచి చెల్లింపులు చేయాల్సి ఉందని తెలిపాయి. ఈ ప్రాజెక్టులన్నింటినీ సమీక్షించి ప్రయోజనం లేని పథకాలు, ప్రాజెక్టులు, పనులను రద్దు చేయకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కష్టమని ఓ ఉన్నతాధికారి చెప్పారు. కమీషన్ల కోసం సీఎం చంద్రబాబు 15 ప్రాజెక్టులకు రూ.17 వేల కోట్ల రూపాయలకు పైగా అంచనాలతో పరిపాలన అనుమతులను ఇచ్చారని, వీటిని క్షుణ్నంగా అధ్యయనం చేసి ప్రయోజనం లేని వాటిని రద్దు చేయాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఐటీ శాఖలో ఇష్టానుసారంగా పనులు మంజూరు చేసి అయిన కాడికి కమీషన్లు వసూలు చేసుకున్నారని, ఈ రంగంలో పనులపై నూతన ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపాయి. ►నీటి లభ్యత, డీపీఆర్ లేకుండా ఈ ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చిన ప్రాజెక్టులు 15వాటి విలువ 17,000 కోట్లు ►సాగునీటి శాఖలో ఉమ్మడి ఏపీలో చేపట్టి నేటికీ కొనసాగుతున్న ప్రాధాన్య ప్రాజెక్టులు 24 వీటి వ్యయం (అంచనా) 24,491 కోట్లు ►ఇప్పటి వరకు చేసిన వ్యయం (అధికారిక వర్గాల సమాచారం మేరకు) 6,760 కోట్లు -
మిగిలింది 25 టీఎంసీలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు వేగంగా అడుగంటుతున్నాయి. వేసవి రోజురోజుకూ తీవ్రమవుతుండటం, నీటి అవసరాలు ఎక్కువగా ఉండటంతో కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నిల్వలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల్లో నీటి లభ్యత 25టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ నీటితోనే ఆగస్టు వరకు రెండు తెలుగురాష్ట్రాలు ఎలా నెట్టుకొస్తాయన్నది ప్రశ్నగా మారింది. సాగర్‌లో మొత్తం 590 అడుగులకుగానూ ప్రస్తుతం 513 అడుగుల వరకు నీటి నిల్వలున్నాయి. ఇందులో 510 అడుగుల కనీస నీటిమట్టం వరకు నీటి లభ్యత 6 టీఎంసీలు మాత్రమే. ఈ నీటితో ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలు తీరే అవకాశం లేకపోవడంతో కృష్ణాబోర్డు సాగర్‌లో 505 అడుగుల మట్టం వరకు నీటిని తీసుకునేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో 14.87 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునే అవకాశముంది. శ్రీశైలంలో 885 అడుగుల మొత్తం నీటిమట్టానికి గానూ 818.70 అడుగుల వరకు 39.83 టీఎంసీల నీరు లభ్యతగా ఉంది. కొరతను దృష్టిలో ఉంచుకుని కృష్ణా బోర్డు మరో 80 అడుగుల వరకు నీటిని తీసుకునేందుకు అవకాశమిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ 10.87 టీఎంసీలు నీటిని వినియోగించుకోగలం. మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో కలిపి 25.74 టీఎంసీల మేర నీరు మాత్రమే లభ్యతగా ఉంది. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటితో తెలంగాణ, ఏపీ తెలంగాణ అసవరాలకు 24.2 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉంది. ఇందులో ఏపీ వాటా 9.5 టీఎంసీలు, తెలంగాణ కోటా 14.7 టీఎంసీలు. ఈ అవసరాలకు మించి వాడుకున్న పక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడాలు తప్పవు. వినియోగంపై జాగ్రత్త రెండు ప్రాజెక్టుల్లో ఉన్న లభ్యత నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. ఈ ప్రాజెక్టుల్లో కేవలం 25 టీఎంసీల నీరే ఉందని, ఆగస్టు వరకు ఇదే నీటిపై ఆధారపడాల్సి ఉంటుందని తెలంగాణ, ఏపీలకు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం శుక్రవారం లేఖ రాశారు. -
ప్రాజెక్టులు పూర్తయితే రైతుల్లో హర్షం
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే రైతు లు వర్షం కోసం ఆకాశానికి చూడాల్సిన అవసరం ఉండదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం లోటస్‌పాండ్‌లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సుస్థిర వ్యవసాయంపై రాసిన వ్యాసా ల సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే రైతుల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. తెలంగాణలో గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపు ధాన్యం పండిందని తెలిపారు. రైతుల కష్టసుఖాలు తెలిసిన సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ రెండు పథకాలు ప్రపంచ గుర్తిం పు పొందాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతతో విదేశాల్లో ఉన్న యువకులు కూడా ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. త్వరలో లక్షా 25 వేల ఎకరాల్లో రెండు పం టలకు సాగునీరు అందించబోతున్నామని తెలిపారు. రమేశ్ ఈ పుస్తకంలో చేసిన సలహాలు, సూచనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పా రు. వ్యవసాయం సుస్థిరంగా సాగాలంటే పర్యావరణ సహకారం అవసరమని పుస్తక రచయిత చెన్నమనేని రమేష్ అభిప్రాయపడ్డారు. సుస్థిర వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, రైతుసమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్‌కల్లం, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
తీరు మారలేదు.. భూ సేకరణ సాగలేదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి భూ సేకరణ అడ్డంకిగా మారింది. గతంలో భూ సేకరణ జరగక ప్రాజెక్టుల పరిధిలో అంచనాలు పెంచాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదనపు ధరలు చెల్లించేందుకు సిద్ధమైన ప్రాజెక్టుల ప్యాకేజీల్లో కూడా భూ సేకరణలో జాప్యం జరగడంతో గడువు పెంచాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో మొత్తంగా 51 ప్యాకేజీల పరిధిలో మరో 21,633 ఎకరాల మేర భూ సేకరణ చేయాల్సి ఉండటంతో ఈ ప్యాకేజీలను పూర్తి చేసేందుకు వచ్చే ఏడాది జూన్ వరకు గడువు పొడిగించారు. అయితే చాలా చోట్ల కోర్టు కేసులు ఉండటం, కొన్నిచోట్ల రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో గడువులోగా ప్రాజెక్టుల్లోని ప్యాకేజీల పూర్తి గగనంగా మారనుంది. మళ్లీ ‘భారం’తప్పదా? భూ సేకరణ జరగకపోవడం, అటవీ అనుమతులు లేకపోవడంతో ప్రాజెక్టుల నిర్మాణ గడువు పెరగడం, దీనికి అనుగుణంగా స్టీలు, సిమెంట్, ఇంధన ధరలు, కార్మికుల వ్యయం, యంత్ర పరికరాల ధరలు, ఇసుక, కంకర వంటి ఇతర మెటీరియల్స్ ధరలు పెరిగాయి. దీంతో కాంట్రాక్టర్లపై భారం పెరిగి.. వారు పనులు ఆపేసే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో భూ సేకరణ, రీ ఇంజనీరింగ్, చట్టపరమైన అనుమతులు వంటి సహేతుక కారణాలతో ఎక్కడైనా ప్రాజెక్టుల పనులు ఆలస్యమైన చోట అదనపు ధరల చెల్లింపు (ఎస్కలేషన్) చేసేందుకు ప్రభుత్వం రెండున్నరేళ్ల కింద ముందుకొచ్చింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 25 భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల్లోని 116 ప్యాకేజీల్లో ధరల పెరుగుదలకు అనుగుణంగా అదనపు చెల్లింపులు చేయడానికి జీవో 146లో ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ జీవో కారణంగా ప్రభుత్వంపై సుమారు రూ.2,500 కోట్ల మేర భారం పడింది. ఇందులో వివిధ కారణాలతో 33 ప్యాకేజీలను తొలగించగా, 83 ప్యాకేజీలను ఎస్కలేషన్ పరిధిలో చేర్చారు. 83 ప్యాకేజీల్లో 36 ప్యాకేజీలను గతేడాది నవంబర్ నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా, భూ సేకరణలో ఇబ్బందులతో పనులు పూర్తి కాలేదు. ఈ ప్యాకేజీల పరిధిలో 24,002 ఎకరాలు అవరసరం కాగా.. ఇంకా 17,025 ఎకరాల మేర భూ సేకరణ మిగిలే ఉంది. మరో 15 ప్యాకేజీలను ఈ జూన్‌కే పూర్తి చేయాల్సి ఉండగా.. అక్కడా మరో 4,500 ఎకరాల సేకరణ జరగకపోవడంతో ఆ పనులు పూర్తికాలేదు. పొడిగించిన గడువులోగా పనులు పూర్తి కాకుంటే.. ప్రభుత్వంపై మళ్లీ భారం పడే అవకాశం ఉంది. మరో 11.79 లక్షల ఎకరాలు మొత్తం 51 ప్యాకేజీల కింద 18.18 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉండగా.. ఇందులో 6.39 లక్షల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. మరో 11.79 లక్షల ఎకరాలు సాగులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం భూ సేకరణ ఆలస్యం కారణంగా 5 లక్షల ఎకరాలపై నేరుగా ప్రభావం పడుతోంది. దేవాదుల పరిధిలో 5 వేల ఎకరాలు ప్రధానంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పరిధిలోనే 19 ప్యాకేజీల పరిధి లో 3,200 ఎకరాల మేర అవసరం ఉండగా, 2,300 ఎకరాల సేకరణ జరగలేదు. అత్యధికంగా కల్వకుర్తి పరిధిలో 1,450 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుల పరిధిలో పనులన్నింటినీ వచ్చే ఏడాది జూన్ వరకు పొడి గించారు. దేవాదుల, సింగూరు పరిధిలో నీటి విడుదల జరుగుతున్న కారణంతో భూ సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. దేవాదుల పరిధిలోని 10 ప్యాకేజీల్లో ఏకంగా 5 వేల ఎకరాల భూ సేకరణ పూర్తికాలేదు. కొన్ని చోట్ల భూపరిహారంపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వ పరిహారంకన్నా అధికంగా డిమాండ్ చేస్తున్న కారణంతో సేకరణ జరగడం లేదు. -
బాకీలతో బడా ప్రాజెక్టులు!
సాక్షి, హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం సర్కారు వేట సాగిస్తోంది. కాళేశ్వరం నిధుల సేకరణ కోసం ఇప్పటికే భారీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 33 వేల కోట్ల రుణం పొందిన ప్రభుత్వం.. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టుల కోసం ‘తెలంగాణ రాష్ట్ర వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్‌డబ్ల్యూఐసీ)’పేరుతో మరో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా రూ. 17 వేల కోట్ల మేర రుణం తీసుకునేందుకు ఆంధ్రాబ్యాంకు సహా ఇతర బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. మరోవైపు పాలమూరు–రంగారెడ్డిలోని ఎలక్ట్రో మెకానికల్ పనులకూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ద్వారా రూ. 17 వేల కోట్లు తీసుకోవాలని అనుకుంటోంది. భారీ నిధులు.. భారీ రుణాలు కృష్ణా, గోదావరి నదుల నీటిని సద్వినియోగం చేసుకోవడానికి 36 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రూ. 1,94,403 కోట్లకు పరిపాలన అనుమతులు ఇవ్వగా.. రూ. 1,40,449 కోట్ల పనులకు ఒప్పందాలు కుదిరి పనులు మొదలయ్యాయి. ఇందులో రూ. 83,658 కోట్ల మేర ఇప్పటికే ఖర్చు చేశారు. మరో రూ. 1.11 లక్షల కోట్లు అవసరం కానున్నాయి. అయితే సీతారామ, డిండి, పాలమూరు–రంగారెడ్డి రీ ఇంజనీరింగ్‌తో వ్యయం అంచనా మరో రూ. 34 వేల కోట్లకు పెరిగే అవకాశం ఉండటంతో మొత్తంగా రూ. 1.45 లక్షల కోట్లు అవసరమయ్యే అవకాశం ఉంది. దీంతో నిధుల సమీకరణకు ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తోంది. వాటితో రుణ సంస్థలు, బ్యాంకుల నుంచి అవసరమైన మేర రుణాలు తెచ్చుకునేందుకు వీలు కలుగుతుంది. ఆ నాలుగింటికి ఆంధ్రాబ్యాంకు రెడీ కాళేశ్వరం కోసం ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆంధ్ర, విజయ, పీఎన్బీ, పీఎఫ్‌సీల ద్వారా రూ. 33 వేల కోట్ల రుణాన్ని సర్కారు పొందింది. ఇందులో ఇప్పటికే రూ. 16 వేల కోట్ల మేర ఖర్చయ్యాయి. తాజాగా మరో 4 ప్రాజెక్టులకు కలిపి కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేవాదుల అంచనా రూ. 9,423 కోట్ల నుంచి రూ. 13,445 కోట్లు, సీతారామ అంచనా రూ. 7,926 కోట్ల నుంచి రూ. 14,500 కోట్లకు పెరగడం.. తుపాకులగూడెం ప్రాజెక్టుకు రూ. 1,919 కోట్లు, వరద కాల్వ పనులను మరో రూ. 4,500 కోట్లు అవసరమవడంతో 4 ప్రాజెక్టులతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. వీటి కోసం రూ. 17 వేల కోట్లు రుణాలు తీసుకోవాలని భావిస్తోంది. రుణాలు ఇచ్చేందుకు ఆంధ్రాబ్యాంకు కన్సార్షియం ముందుకు రావడంతో రెండ్రోజుల కిందట సీఎస్ ఎస్కే జోషి వారితో చర్చలు జరిపారు. రుణాలపై ఆగస్టు 15లోపు స్పష్టత ఇస్తామని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించినట్లు తెలిసింది. పాలమూరుకు పీఎఫ్సీ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వరద జలాలపై ఆధారపడిన ప్రాజెక్టు కావడంతో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలకు బ్యాంకులు నేరుగా రుణాలిచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్ పనులకు రుణాలు తీసుకోవాలని సర్కా రు నిర్ణయించింది. ఈ పనులకు రూ. 17 వేల కోట్లు అవసరం ఉండగా అంతమొత్తం రుణాలిచ్చేందుకు పీఎఫ్సీ ముందుకొచ్చింది. అయితే ఎప్పుడెప్పుడు ఎంత రుణం ఇవ్వాలి, దానిపై వడ్డీ తదితరాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు రుణాలపై పీఎఫ్సీ చైర్మన్ రాజీవ్ శర్మ ఇటీవలే ప్రభుత్వంతో చర్చలు జరిపి నెలలో రుణాల ప్రక్రియ మొదలు పెడతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ రుణాలు ఓకే అయితే మొత్తంగా ప్రాజెక్టుల కోసం రూ. 67 వేల కోట్ల మేర రుణం తీసుకున్నట్లవుతుంది. -
చెరువులతో ప్రాజెక్టుల చెలిమి!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు భారీ సాగునీటి ప్రాజెక్టుల రూప కల్పన, మరోవైపు చిన్న నీటి వనరులను పునరుద్ధరిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఈ రెండింటినీ అనుసంధానం చేసే ప్రణాళికకు పురుడు పోసింది. మిషన్ కాకతీయలో గుర్తించిన ప్రతి చెరువునూ భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింది కాల్వలతో అనుసంధానం చేసి బీడు భూముల న్నింటికీ నీరు పారించే కార్యాచరణను రూపొందిం చింది. వచ్చే ఏడాది ఖరీఫ్‌కు ముందే వీలైనన్ని ఎక్కువ చెరువులను ఈ విధానం ద్వారా నింపాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు నీటి పారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి విడతగా ఇప్పటికే గుర్తించిన 7,500 గొలుసుకట్టు చెరువులను నింపి మిగతా వాటికి గల అవకాశాలను ‘టోపోషీట్’ల ద్వారా అధ్యయనం చేయనుంది. గరిష్ట వినియోగం.. గరిష్ట ఆయకట్టు నిజానికి చిన్న నీటివనరుల కింద భారీ నీటి కేటాయింపులు ఉన్నాయి. గోదావరి బేసిన్లో 165 టీఎంసీలు, కృష్ణాలో 89 టీఎంసీలు కలిపి మొత్తంగా 254 టీఎంసీల కేటాయింపులున్నా వినియోగం మాత్రం 100 నుంచి 130 టీఎంసీలకు మించడం లేదు. వీటి కింద 24.50 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నా మిషన్ కాకతీయకు ముందువరకు 10 లక్షల ఎకరాల్లోపే సాగు జరిగేది. కాకతీయ ఆ తర్వాత అది 15 లక్షలకు చేరినా మరో 10 లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉంది. ఈ దృష్ట్యా మరింతగా నీటిని వినియోగించుకోవడంతో పాటు గరిష్ట ఆయకట్టుకి నీరు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే మిషన్ కాకతీయ కింద 44,928 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోగా నాలుగు విడతల్లో కలిపి 29 వేల చెరువుల పునరుద్ధరణకు అనుమతులొచ్చాయి. ఇందులో 20 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. ఈ డిసెంబర్ నాటికే మిగతా చెరువుల పనులు పూర్తి చేయనున్నారు. మిగిలిన వాటిని ఐదో విడతలో చేపట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయనున్నారు. ఖరీఫ్‌ను త్వరగా మొదలుపెట్టొచ్చని.. పునరుద్ధరించిన చెరువులను నిత్యం నీటితో నింపడంపై దృష్టి సారించిన సర్కారు.. భారీ, మధ్యతరహా, ఎత్తిపోతల పథకాలతో వాటిని అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాణం పూర్తి చేసుకున్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖను ఇటీవల సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల కాల్వలు పారుతున్న ప్రాంతాలను టోఫోషీట్లపై మొదట గుర్తించాలని.. తర్వాత వాటికి దగ్గరలోని చెరువులను మార్కింగ్ చేసి కాల్వల ద్వారా నింపే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. మొత్తం ఎన్ని గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టు ద్వారా వాటిని నింపే అవకాశం ఉందో నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. చెరువుల్లో నీటి లభ్యత పెరిగితే జూన్‌లో వర్షాలకు ముందే చెరువు నీటితో నార్లు పూర్తవుతాయని, వర్షాలు కురిసే సమయానికి నాట్లకు వీలవుతుందని, తద్వారా ఖరీఫ్‌ను త్వరగా చేపట్టొచ్చని సీఎం భావిస్తున్నట్లు నీటి పారుదల వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 7,500 గొలుసుకట్టు చెరువులను గుర్తించామని, మిగతా వాటిని గొలుసుకట్టుగా మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నామని నీటి పారుదల శాఖ వెల్లడించింది. కరువును జయించవచ్చు: హరీశ్ రాష్ట్రంలోని చెరువులను, కుంటలను నీటితో నింపితే కరువు పరిస్థితులను పారదోలవచ్చని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘చెరువుల్లో నీరు ఉండే ప్రాంతాల్లో సైక్లింగ్ విధానం వల్ల తిరిగి ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు నీటితో నిండితే కరువును జయించడమే కాకుండా అకాల వర్షాలు, వడగండ్ల వానలను నివారించవచ్చు. పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. భూగర్భజలాలు పెరిగి ఫ్లోరైడ్ సమస్య తగ్గుతుంది. రాష్ట్రానికి పూర్థి స్థాయిలో నీటి భద్రత లభిస్తుంది’ అని హరీశ్‌రావు వివరించారు. -
ప్రాజెక్టులకు నిధుల కటకట
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ నిధుల సమస్య ఎదురైంది. భారీ కేటాయింపులున్నా నిధుల విడుదల నామమాత్రంగా జరుగుతుండటంతో నిర్మాణ పనులన్నీ చతికిలపడుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆరు భారీ, రెండు మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తి చేసేలా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినప్పటికీ వివిధ ప్రాజెక్టులకు ఏకంగా రూ. 8,289 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటం గడువులోగా వాటిని పూర్తి చేయడంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. ఇచ్చింది రూ. 2 వేల కోట్లే... గతేడాదిలాగానే ఈ ఏడాదీ ప్రభుత్వం సాగునీటిశాఖకు రూ. 25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితోపాటు కాళేశ్వరం కింద గరిష్ట ఆయకట్టు ఇచ్చేలా నిధుల కేటాయింపు చేసింది. అయితే అనుకున్న స్థాయిలో నిధులు విడుదల చేయకపోవడం, బకాయిలు పేరుకుపోవడంతో నిర్మాణ పనులు నెమ్మదించాయి. గత మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వం మొత్తంగా సాగునీటి ప్రాజెక్టులపై రూ. 5,793 కోట్లు ఖర్చు చేయగా మరో రూ. 8,289.84 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఖర్చు చేసిన నిధుల్లోనూ కాళేశ్వరానికి రుణాల ద్వారా తీసుకున్న మొత్తాలే రూ. 3,798 కోట్లు ఉన్నాయి. అంటే ఈ లెక్కన ప్రభుత్వం ఖజానా నుంచి విడుదల చేసంది కేవలం రూ. 2 వేల కోట్లుగానే ఉంది. ఒక్క కాళేశ్వరం పరిధిలోనే ఇంకా రూ. 2,590 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇవన్నీ రుణాల రూపేనా తీసుకునే అవకాశం ఉండటంతో పెద్దగా ఇబ్బందులు లేవు. ఇది మినహా మిగతా ప్రాజెక్టులన్నీ నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. నెమ్మదించిన ‘పాలమూరు’ పనులు... పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో రూ. 1,242 కోట్ల మేర నిధులు కేటాయించాల్సి ఉంది. ఇందులో రూ. 350 కోట్ల మేర కేటాయిస్తే భూసేకరణ చేసుకుంటామని అధికారులు కోరుతున్నా అది జరగక పనులన్నీ నెమ్మదించాయి. చాలా ప్యాకేజీల నుంచి కాంట్రాక్టర్లు యంత్ర సామగ్రి, కార్మికులను కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలకు మళ్లించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో నీటిని ఇవ్వాలని నిర్ణయించిన ప్రాజెక్టుల్లో కల్వకుర్తి ఉండగా అక్కడ రూ. 626 కోట్లు, దేవాదులలో రూ. 888 కోట్లు, భీమాకు రూ. 100 కోట్లు, సీతారామకు రూ. 461 కోట్లు, డిండికి రూ. 122 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధుల విడుదలపై ఆర్ధికశాఖను అడిగినప్పుడల్లా రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్లు విడుదల చేస్తున్నారని, మిగతా నిధుల విడుదలకు ఆగాల్సిందేనన్న సమాధానం వస్తోందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల మేర కేటాయించడంతో ఇరిగేషన్ బడ్జెట్‌కు కోత పడుతోంది. ‘మిషన్ కాకతీయ’కూ ఆర్థిక కష్టాలే... మిషన్ కాకతీయ పథకం కింద చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ పనులనూ నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటివరకు ఏకంగా రూ. 455 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పడటంతో రెండు, మూడో విడతల్లో చేపట్టిన పనుల్లో ఇంకా 5,500లకుపైగా చెరువుల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని జూలైలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అది కష్టంగానే ఉంది. ఇక నాలుగో విడతలో దాదాపు 5 వేల చెరువుల్లో పూడికతీత పనులకు అనుమతినిచ్చినా నిధుల సమస్యతో కేవలం 3 వేల చెరువుల్లోనే పనులు మొదలయ్యాయి. -
రీడిజైన్లతో తీరని అన్యాయం
చేవెళ్ల : రీడిజైన్ల పేరుతో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. చేవెళ్ల మండలకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద శుక్రవారం ఎల్డీఎంఆర్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భట్టి విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా కురుసిన అకాల వర్షంతో రైతులు త్రీవంగా నష్టపోయారన్నారు. జిల్లాలో మొక్కజొన్న, వరిపంట పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. పంట నష్టాన్ని తక్షణమే అంచనావేసి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేవారు. రీడిజైన్‌తో జిల్లా ప్రజలకు తీరని అన్యాయం... తెలంగాణాలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ చేయించారని, కానీ ప్రస్తుత సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎక్కడ కాంగ్రెస్‌ప్రభుత్వానికి దక్కుతుందోనని రీడిజైన్ పేరుతో ప్రాజెక్ట్‌ను ఆపేసే పరిస్థితి తీసుకువచ్చారని భట్టి విమర్శించారు. ఐటీఐఆర్‌ప్రాజెక్టును అటకెక్కించారు... రంగారెడ్డిజిల్లాకు వరప్రదాయని అయిన ఐటీఐఆర్ ప్రాజెక్టును నాటి యుపీఏ ప్రభుత్వం 2012లో మంజూరు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టుకై అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం భూములు కూడా కేటాయించిందని గుర్తుచేసారు. అన్ని అనుమతులు మంజూరైనా ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవడంలేని ఆగ్రహం వ్యక్తం చేసారు. హామీల విషయమై బహిరంగ చర్చకు సిద్ధమా..? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వందశాతం పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరిలో చెప్పుకోవడం సిగ్గుచేటని, దీనిపై దమ్ముంటే జిల్లాలోని ఏదైనా గ్రామ సభలో బహిరంగంగా చర్చిందాం.. కేసీఆర్‌కు దమ్ముంటే తన సవాలు స్వీకరించాలని భట్టి సవాలు విసిరారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకుంటున్న రైతులకు 2013 చట్టం ప్రకారం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో ఏఐసీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ డాక్టర్ ప్రసాద్, ఎల్డీఎంఆర్సీ రాష్ట్ర కన్వీనర్ వేణుగోపాల్, రాష్ట్ర ఎస్సీ సెల్‌ఉపాధ్యాక్షుడు ప్రీతమ్, డీసీసీ అద్యక్షుడు క్యామ మల్లేశ్, చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి పి. వెంకటస్వామి, జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షుడు దర్శన్ ఉన్నారు. కమిటీల బలోపేతానికి ఎల్డీఎంఆర్సీ ద్వారా కృషి... గ్రామ, మండలస్థాయిలోని కమిటీలను బలోపేతం చేసేందుకు ఎల్డీఎంఆర్సీ కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. చేవెళ్ల మండలకేంద్రంలో శుక్రవారం ఎల్డీఎంఆర్సీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి పి.వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎల్డీఎంఆర్సీ రాష్ట్ర కన్వీనర్ వేణుగోపాల్, ఏఐసీసీసీ ఎస్సీసెల్ కన్వీనర్ డాక్టర్ ప్రసాద్, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు ప్రీతమ్ హాజరైనారు. ఈసందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు పక్కా ప్రణాళికలతో ఏఐసీసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో ఎల్డీఎంఆర్సీ పనిచేస్తోందన్నారు. కమిటీల వారిగా చేయాల్సిన పనులు, చేపడుతున్న కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. కమిటీ సభ్యుల సందేహాలను తీర్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు దర్శన్, జిల్లాపార్టీ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, పీఏసీఎస్ ఆలూరు చైర్మన్ పి.క్రిష్ణారెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్లు వనం మహేందర్‌రెడ్డి, కసిరె వెంకటేశ్, మానేయ్య, ఎ–బ్లాక్ అధ్యక్షుడు పి.ప్రభాకర్, నాయకులు వీరేందర్‌రెడ్డి, జంగారెడ్డి, శేఖర్‌రెడ్డి, మాధవ్‌గౌడ్, పర్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, బాలయ్య, ప్రకాశ్‌గౌడ్, ఐదు మండలాలల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.