formers
-
‘రైతుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించం’
సాక్షి,హైదరాబాద్: ‘రైతుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించబోమని’ కాంగ్రెస్ (congress) ప్రభుత్వానికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)హెచ్చరించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘రుణ మాఫీ వచ్చే నాలుగేళ్లలో కూడా పూర్తిస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు. 35 రోజుల క్రితం రుణమాఫీ చెక్కు ఇచ్చినా..ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో డబ్బులు జమకాలేదు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది.పండిన ప్రతి గింజకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది. ధాన్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం 26 వేల కోట్లు ఖర్చుపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై పట్టు లేదా ? రైతులంటే పట్టింపు లేదా ? ఎందుకు ధాన్యం కొనుగోలు చేయలేకపోతుంది ?.రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. పత్తి, వరి పంటలను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ భారం అంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. రైతులపై భారం పడకుండా రైతు పక్షపాతిగా మోదీ (narendra modi) ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది’ అని అన్నారు. -
Ts: బడ్జెట్‌పై హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందని, ప్రజాపాలన అబాసుపాలయ్యిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ వాగ్దాన భంగాలేనన్నారు. బడ్జెట్‌పై శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీశ్‌రావు మాట్లాడారు. ‘బడ్జెట్ ప్రజలకు నమ్మకం ఇవ్వలేదు. అన్నదాతలను అగం చేసే విధంగా ఉంది. అంకెలు మార్చి ఆంక్షలు పెట్టే విధంగా బడ్జెట్ ఉంది. వ్యవసాయ రంగానికి కేటాయించిన 19 వేల కోట్ల నిధుల్లో రైతు భరోసా ఎలా అమలు చేస్తారు ? రైతు భరోసాకు 22 వేల కోట్ల రూపాయలు అవసరం. రైతు రుణమాఫీ కి మొండి చేయి చూపారు. రైతు బీమకు కేటాయింపులు ఎక్కడ ? పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిన మాటలు బోగస్ గా మారాయి. రైతులను దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీలో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. 24 గంటల కరెంట్ సరఫరా ఎక్కడ ఇస్తున్నారో చూద్దాం పదండి. లాగ్ బుక్‌లు పరిశీలిద్దాం రండి. ఆరు గ్యారంటీలపై చట్టం చేస్తామని చెప్పారు. రెండు సమావేశాలు అయిపోతున్నాయి ఎక్కడ చట్టం ? వంద రోజుల్లో హామీలు అమలు చేయలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తోంది. ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోంది. జనవరి నెల అసరా పింఛన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ఇవ్వాల్సి ఉన్నా వాటికి నిధుల కేటాయింపుపై ప్రస్తావనే లేదు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. -
సూక్ష్మ సేద్యం.. సిఫార్సుల్లేకుండా సాధ్యం
సాక్షి, అమరావతి: బిందు, తుంపర సేద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సాగునీటి సౌకర్యం లేనిచోట్ల మైక్రో ఇరిగేషన్ సౌకర్యం కల్పించి ప్రతి నీటి బొట్టును రైతులు వినియోగించేకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నాలుగేళ్లలో 5.32 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించగా.. ఈ ఏడాది మరో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇప్పటికే 1.27 లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాలు అమర్చారు. మిగిలిన లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. అర్హతే కొలమానంగా.. అడిగిన ప్రతి రైతుకూ పరికరాలు రాష్ట్రంలో ఇప్పటివరకు 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.969.40 కోట్ల బకాయిలను చెల్లించి సూక్ష్మసేద్యం విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019–20లో రూ.720 కోట్లు వెచ్చింది 3.05 లక్షల ఎకరాల్లో విస్తరించగా.. 1,03,453 మంది లబ్ధి పొందారు. కరోనా వల్ల రెండేళ్లపాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. 2022–23 నుంచి మళ్లీ ప్రారంభించి.. ఆ ఏడాది రూ.636 కోట్ల ఖర్చుతో 2.27 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్య పరికరాలను అమర్చారు. తద్వారా 82,289 మంది లబ్ధి పొందారు. 2023–24లో రూ.902.56 కోట్ల అంచనాతో మరో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. మరింత ఎక్కువమందికి లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ఎకరాలోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాలలో 5–12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. సిఫార్సులతో పని లేకుండా ఆర్బీకేలో నమోదు చేస్తే చాలు అర్హతే కొలమానంగా అడిగిన ప్రతి రైతుకు పరికరాలు అందిస్తున్నారు. రైతులు తమ వాటా చెల్లించిన 2–3 వారాల్లోపే నేరుగా వారి వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లి మరీ పరికరాలు అమరుస్తున్నారు. ఆర్బీకేల్లో 2.02 లక్షల మంది రైతులు రిజిస్ట్రేషన్ 2023–24లో ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా 5,79,517 ఎకరాలు బిందు తుంపర పరికరాల కోసం 2.02 లక్షల మంది రైతులు తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటివరకు 2.85 లక్షల ఎకరాలను ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం సిబ్బంది, కంపెనీల ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసింది. 2.75 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు కంపెనీలు బీఓక్యూను జనరేట్ చేయగా.. 1.56 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు పరిపాలనామోదం ఇచ్చారు. ఇప్పటికే 1.27 లక్షల ఎకరాల్లో పరికరాలను బిగించారు. సీఎంకు రుణపడి ఉంటాం నేను 4.14 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. తుంపర సేద్య పరికరాల కోసం ఆర్బీకేలో దరఖాస్తు చేశా. ఎలాంటి సిఫార్సు చేయలేదు. నాకు కావాల్సిన పరికరాలు మా పొలానికి తీసుకొచ్చి అమర్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. – టి.పాపయ్య, ఎర్రవారిపాలెం, తిరుపతి జిల్లా దిగుబడులు పెరుగుతాయి ఐదెకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. పైపులు, స్ప్రింక్లర్లు కోసం దరఖాస్తు చేశా. 15 రోజుల్లో తీసుకొచ్చి అమర్చారు. వీటిద్వారా నీటిని పొదుపుగా వాడుకునే అవకాశం ఏర్పడటంతో కాయ నాణ్యత పెరిగింది. దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. – ముళ్లమూరి బాలకృష్ణ,కలువాయి, నెల్లూరు జిల్లా అవసరం ఉన్న వారికే ప్రాధాన్యత సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు శరవేగంగా జరుగుతోంది. పారదర్శకంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక జరుగుతోంది. జిల్లాల వారీగా టార్గెట్లు నిర్ధేశించినప్పటికీ అవసరం ఉన్న వారికి అర్హత ఉంటే చాలు ప్రాధాన్యత ఇస్తున్నాం. జనవరి నాటికి లక్ష్యాన్ని అధిగమించేలా ముందుకెళ్తున్నాం. – డాక్టర్ సీబీ హరినాథరెడ్డి, పీఓ, ఏపీ సూక్ష్మసాగునీటి పథకం -
మద్దతు పెరగాల్సిన రంగం
రబీ పంటల పెంపు ధరలు 2 నుంచి 7 శాతం పరిధిలో ఉన్నాయి. 2022–23 సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం పెరుగుదల దాదాపు 7.6 శాతం. అంటే కనీస మద్దతు ధరలో పెంపుదల, ద్రవ్యోల్బణం రేటును కూడా సమీపించడం లేదు. పైగా ధాన్య సేకరణ ఎక్కువగా గోధుమలు, వరికే పరిమితం అయినందున, కనీస మద్దతు ధర ప్రయోజనాన్ని పొందే రైతుల శాతం సంవత్సరాలుగా 6 శాతం నుండి 14 శాతానికి మాత్రమే పెరిగింది. 86 శాతం మంది రైతులు ఇప్పటికీ తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను అమ్ముకోవలసి వస్తోంది. పైగా, కనీస మద్దతు ధరలో పెంపుదల ఇంకా ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగానే ఉంటోంది. అందుకే ధరలకు సంబంధించి వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం. 2018లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఒక ఎపిసోడ్లో, నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఒక చిన్న రైతు తన దుఃస్థితి గురించి చెప్పినప్పుడు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన చెవులను తానే నమ్మలేక పోయారు. వ్యవసాయం ద్వారా ఎంత సంపాదిస్తున్నారని అమితాబ్ అడిగిన ప్రశ్నకు ఆ రైతు, ‘‘సంవత్సరానికి రూ. 60,000 కంటే ఎక్కువ సంపాదించడం లేదు. దానిలో సగం డబ్బు విత్తనాలు కొనడానికే పోతోంది. నేను నా కుటుంబానికి రాత్రి భోజనం మాత్రమే అందించగలుగుతున్నాను’’ అని బదులిచ్చారు. ఆ రైతు సమాధానం విని అమితాబ్ నివ్వెరపోయారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, దేశ రైతులను ఆదుకోవాలని ఆయన ప్రజలను కోరారు. అప్పటి నుండి గ్రామీణ మహారాష్ట్రలో నిరాశ మరింతగా పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య కాలంలో 1,809 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తా కథనాలు చెబుతున్నాయి. గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే ఇది కాస్త తక్కువే అయినప్పటికీ సగటున రోజుకు ఏడుగురు రైతులు తమ జీవితాలను ముగించుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల్లో యాభై శాతం పత్తి పండించే ప్రాంతంలోనే నమోదయ్యాయి. రైతులకు జాక్‌పాటేనా? శీతాకాలపు పంటల కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)ల్లో ఇటీవలి పెంపుపై మీడియాలో వస్తున్న వార్తల్లోని ఉత్సాహం నన్ను ఆ దిశగా ఆలోచించేలా చేసింది. ఇది రైతులకు ‘జాక్‌పాట్’ లేదా ‘అదనపు వరం’ అని ప్రశంసిస్తున్నారు. కానీ ఇది కష్టాల్లో ఉన్న రైతులకు ఏదైనా సహాయం అందజేస్తుందా అనేది ప్రశ్న. ధరల పెంపుదల పెరుగు తున్న నిరాశను ఆశాజనకంగా మార్చే అవకాశమైతే కనిపించడం లేదు. ముందుగా, ప్రకటించిన కనీస మద్దతు ధర పెరుగుదల పరిమాణాన్ని చూద్దాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పైగా 2024 లోక్‌సభ ఎన్నికల సమయా నికి రబీ పంటల కోతలు జరగనున్నాయి. రబీ పంటల ధరల పెంపు 2 నుంచి 7 శాతం పరిధిలో ఉన్నాయి. 2022–23 సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం పెరుగుదల దాదాపు 7.6 శాతం. అంటే, కనీస మద్దతు ధరలో పెంపుదల అనేది, ద్రవ్యోల్బణం రేటును కూడా సమీపించడం లేదు. పైగా, రైతులకు ‘జాక్‌పాట్’ లేదా ‘అదనపు వరం’ అంటూ చేస్తున్న వర్ణన వాస్తవానికి క్షేత్ర వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయడం పైనే ఆధారపడి ఉంది. ప్రతి పంట సీజన్లోనూ, ప్రభుత్వానికి ధరలను సిఫార్సు చేసే ‘కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్’ (సీఏసీపీ– వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్)... ఉత్పత్తి ధరల సూచిలో వచ్చే మార్పుల శాతాన్ని, గణనలను కూడా అందజేస్తుంది. 2022–23తో పోలిస్తే, ఈ ఏడాది మిశ్రమ ఉత్పత్తి ధరల సూచీ 8.9 శాతం పెరిగింది. అంటే ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండగా, కనీస మద్దతు ధరల పెరుగుదల దానికి అనుగుణంగా లేదు. ఇది రైతులు హర్షించడానికి కారణం కాదు. ఒక సంవత్సరం క్రితం, ఇది మరింత దారుణంగా ఉండేది. మిశ్రమ ఉత్పత్తి ధరల సూచీ 8.5 శాతం పెరుగుదలకు ప్రతిగా, గోధుమ కనీస మద్దతు ధర కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. యాదృచ్ఛికంగా, ఈ ఏడాది క్వింటాల్‌కు రూ. 150 పెరగడంతో గోధుమల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2,275కి చేరుకుంది. 2006–07, 2007–08 తర్వాత, దేశీయ ఉత్పత్తిదారులకు ధరలను పెంచడం మినహా యూపీఏ ప్రభుత్వానికి పెద్దగా అవకాశం లేకుండా పోయిన తర్వాత, ఇది గోధుమ ధరలో అత్యధిక పెరుగుదలగానే చెప్పాలి. ఎన్నికల సంవత్సరాల్లోనే! రైతుల నుండి నేరుగా గోధుమలను కొనుగోలు చేయడానికి ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలనే లోపభూయిష్ట నిర్ణయం జరిగిన తర్వాత, ఇది ప్రభుత్వ నిల్వల్లో భారీ అంతరానికి కారణ మైంది. ఆ కొరతను తీర్చడానికి ప్రభుత్వం దాదాపు రెట్టింపు ధరలకు (స్వదేశీ రైతులకు ఇచ్చే) గోధుమలను దిగుమతి చేసుకోవలసి వచ్చింది. ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాల నుండి వచ్చిన విమర్శల తరువాత, ముఖ్యంగా ధర సమానత్వం తీసుకురావడానికి, గోధుమ లకు కనీస మద్దతు ధరను పెంచారు. ఈ ఏడాది ధరలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణల్లోని ప్రధాన రబీ పంటలపై ప్రభావం చూపుతాయని పరిగణనలోకి తీసు కుంటే, ధరల పెరుగుదల ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఊహాగానాలు ఉన్నాయి. గోధుమలు అత్యంత ముఖ్యమైన రబీ పంట. బార్లీ(యవలు), పెసర, రేప్‌సీడ్–ఆవాలు, పప్పు (మసూర్)... ఇతర శీతాకాలపు పంటలు కావడంతో, ధరల పెరుగుదల కచ్చితంగా రాజకీయ కోణాన్ని కలిగి ఉంది. ఆర్థికవేత్తలు సుఖ్‌పాల్ సింగ్, శ్రుతి భోగల్ 2004, 2009, 2014, 2019కి ముందు సంవత్సరాల్లో గోధుమలు, వరి కనీస మద్దతు ధర ఎంత ఎక్కువగా ఉందనే అంశాన్ని 2021 జనవరిలో స్పష్టంగా చూపించారు. ఇవన్నీ ఎన్నికలు జరిగిన సంవత్సరాలు. 2023–24 రబీ ధరల పెంపు కూడా ఇదే తరహాలో ఉంది. ఎన్నికలకు ముందు మాత్రమే రైతులకు సాపేక్షంగా అధిక కనీస మద్దతు ధరలను ప్రకటించాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించారు. దీనివల్ల కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనాలను పొందివుండొచ్చు. కానీ భవిష్యత్తులో పంటల ధరలను రాజకీయాలు నిర్ణయించకుండా దూరంగా ఉండేలా చూసుకోవాల్సిన సమయం ఇది. స్వామినాథన్ ఫార్ములా అమలు కావాలి వ్యవసాయం దానధర్మం కాదు. పంటల ధరలను రాజకీయ నాయకత్వం ఇష్టారాజ్యానికి వదిలేయలేం. వ్యవసాయానికి నిర్మా ణాత్మక సంస్కరణలు అవసరం. ఎన్నికలు జరిగిన సంవత్సరంతో నిమిత్తం లేకుండా, స్వామినాథన్ ఫార్ములా ప్రకారం, ‘వెయిటెడ్ యావరేజ్’కు 50 శాతం లాభం కలిపి రూపొందించిన కనీస మద్దతు ధరలు రైతులకు అందేలా ఈ సంస్కరణలు ఉండాలి. ఏది ఏమైనప్పటికీ, ధాన్య సేకరణ ఎక్కువగా గోధుమలు, వరికే పరిమితం అయినందున, కనీస మద్దతు ధర ప్రయోజనాన్ని పొందే రైతుల శాతం సంవత్సరాలుగా 6 శాతం నుండి దాదాపు 14 శాతానికి మాత్రమే పెరిగింది. దీనివల్ల అర్థం చేసుకోవలసిన విషయమేమిటంటే, కనీస మద్దతు ధర పెంపు ఇంకా చాలావరకూ ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ఉంది. మార్కెట్లు మిగిలిన 86 శాతం మంది రైతులకు నష్టాలతో కూడిన ధరలు చెల్లించడం వల్ల వ్యవసాయ కష్టాలు తీవ్ర మవుతున్నాయి. రుణభారం, ఆత్మహత్యలు పెరుగు తున్నాయి. అంతేకాకుండా, రైతులకు సరైన ఆదాయాన్ని శాశ్వతంగా నిరాక రించిన స్థూల ఆర్థిక విధానాలపై పునరాలోచన చేయాల్సిన సమయం ఇది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (ప్లస్ లేదా మైనస్ 2 శాతం) బ్రాకెట్లో ఉంచడం వ్యవసాయాన్ని దెబ్బతీసింది. వినియోగదారుల ధరల సూచిక బుట్టలో ఆహారం, పానీయాల వాటా 45.9 శాతం ఉన్న ప్పటికీ, విధాన రూపకర్తలు అతిపెద్ద ద్రవ్యోల్బణ చోదకశక్తిగా ఉన్న గృహనిర్మాణంపై మాత్రం కళ్ళు మూసుకున్నారు. గృహనిర్మాణాన్ని పెట్టుబడిగా పరిగణిస్తుండగా, కనీస మద్దతు ధరలో ఏదైనా పెంపు దలను మాత్రం ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని నిందిస్తుంటారు. ఇది మారాల్సి ఉంది. - వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
ఒక్క రోజులోనే మార్కెట్‌కు 6వేళ క్వింటాళ్ల వరి ధాన్యం
జనగామ: వానాకాలం సీజన్లో ముందస్తు సాగు చేసిన వరి ‘కోతలు’ ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు మార్కెట్ బాట పట్టారు. దీంతో రికార్డు స్థాయిలో వస్తున్న ధాన్యం రాశులతో జనగామ వ్యవసాయ మార్కెట్ నిండి పోతున్నది. గురువారం ఒక్కరోజే ఆరువేల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రూ.500 తక్కువగా వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో మరో రూ.200 పెచేలా చూడాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్ 1.72 లక్షల ఎకరా ల్లో వరి సాగు చేశారు. ఏటా ఈ సీజన్లో కత్తెర సాగుతో పాటు రెగ్యులర్ పంట వేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సెప్టెంబర్ రెండవ వారం వరకు కత్తెర కోతలు పూర్తి కాగా.. ప్రస్తుతం ముంద స్తు నాట్లు వేసిన రైతులు వరి కోతలు ప్రారంభించారు. ధాన్యంతో జనగామ మార్కెట్‌కు ఉదయం వచ్చిన రైతులు, సాయంత్రాని ఇంటికి వెళ్లేలా పాలకమండలి, అధికారులు చర్యలు చేపట్టారు. రోజూ ఉదయం 5 నుంచి 10 గంటల వరకు సరుకును లోనికి అనుమతిస్తూ.. మధ్యాహ్నం రెండు గంటల వరకు మార్కెట్ గేటు మూసి వేస్తున్నారు. ఎంట్రీ చేసిన సరుకుకు ఈ–నామ్లో టోకెన్ కేటాయించి గేట్ ఎంట్రీ వద్ద లాట్ నంబర్ ఇస్తున్నారు. ఉద యం బిడ్డింగ్ మొదలైన తర్వాత ఆలస్యంగా వచ్చిన ధాన్యం వాహనాలను అనుమతించి మరుసటి రోజు కొనుగోలు చేస్తున్నారు. 43 లక్షల క్వింటాళ్ల ధాన్యం వానాకాలం సీజన్లో 43 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో ప్రభుత్వం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. 2023–24 సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వరి పంటకు కనీస మద్దతు ధర ఏ–గ్రేడ్ రూ.2,203, సాధారణ గ్రేడ్‌కు రూ.2,183 ప్రకటించింది. కత్తెర, ముందస్తు సాగు చేసిన వరి కోతలు మొదలై మార్కెట్లోకి పెద్ద ఎత్తున సరుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నేటికి ప్రారంభం కాలేదు. దీంతో మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు సుమారు రూ.500 తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తేమ అధికంగా ఉండడం వల్లే ధర ఇవ్వలేక పోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. 56వేల క్వింటాళ్ల కొనుగోళ్లు ఈ ఏడాది ఆగస్టు 30 నుంచి గురువారం వరకు జనగామ వ్యవసాయ మార్కెట్లో 1,262 మంది రైతుల వద్ద 56,074(85,169 బ్యాగులు) క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాకు ధర గరిష్టంగా రూ.2,079, రూ.1,961, రూ.1,859, కనిష్టంగా రూ.1,911, 1,720, రూ,1,609, రూ.1,405, మోడల్ ప్రైజ్ రూ.1,899, రూ.1,913, రూ.1,779, రూ.1,889 ధర పలికింది. ధర తక్కువగా వచ్చింది పదెకరాల్లో వరి సాగు చేసినం. పెట్టుబడికి రూ.2.50లక్షలు ఖర్చయింది. ముందుగా నాట్లు వేసిన ఆరు ఎకరాల్లో కోతలు పూర్తి చేసినం. 180 బస్తాల దిగుబడి రాగా జనగామ మార్కెట్‌కు వచ్చినం. ప్రభుత్వ మద్దతు ధరకంటే.. తక్కువగా కొనుగోలు చేశారు. సరుకు పచ్చిగా ఉందని క్వింటాకు రూ.1,765 మాత్రమే ధర ఇచ్చారు. విధిలేక అమ్ముకున్నాం. ధర మరో రూ.150 ఎక్కువ వస్తే బాగుండేది. శ్రమకు ఫలితం రావడం లేదు. – బాలోతు కళమ్మ, మహిళా రైతు, పెద్దపహాడ్(ఎర్రకుంటతండా) కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి ఐదెకరాల్లో వరి సాగు చేస్తే రెండు ఎకరాల్లో కోతలు పూర్తయ్యా యి. 90 బస్తాల దిగుబడి రాగా మార్కెట్‌కు తెచ్చిన. క్వింటాకు రూ.1,708 ధర పెట్టిండ్లు. రూ.1,800 ఇవ్వాలని కొట్లాడినా ఫలితంలేదు. ధాన్యానికి సరైన ధర రావాలంటే ప్రభుత్వం వెంట నే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – భూక్యా సరక్రూ, రైతు, మచ్చుపహాడ్, నర్మెట ధర పడిపోకుండా చూస్తున్నాం.. మార్కెట్‌కు వచ్చిన ప్రతి గింజకు మంచి ధర వచ్చేలా చూస్తున్నాం. ఈ–నామ్ పద్ధతిలో విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్కువగా పచ్చి సరుకు రావడంతో ధర పడిపోకుండా చూస్తున్నాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా పర్యవేక్షిస్తున్నం. – బాల్దె సిద్ధిలింగం, మార్కెట్ చైర్మన్ -
TS History:1948 పోలీస్ యాక్షన్ – మరో కోణం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, అది సృష్టించిన సాహిత్యం మన రాజకీయాల్లో, సాహిత్యంలో చివరకు మన జీవితాల్లోనూ విడదీయరాని భాగం. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు రెండు తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో ఒక్క ప్రతినిధి కూడా లేడు. అయినప్పటికీ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వామపక్ష భావజాలమే ఇప్పటికీ బలంగా ఉంది. తెలుగు సాహిత్యంలో అత్యధిక భాగం ‘సామ్యవాద వాస్తవికత’ ప్రభావంలోనే ఉందంటే అతిశయోక్తి కాదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానం వచ్చాక 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. నిజాం సంస్థానం చాలా పెద్దది. అందులోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణలోని నల్లగొండ, వరంగల్ రెండు జిల్లాల్లో ప్రధానంగానూ, మరో ఒకటి రెండు జిల్లాల్లో స్వల్పంగానూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది. ఆనాటి చారిత్రక సంఘటనల మీద తమ అనుభవాలను గ్రంథస్థం చేసిన ఆ పోరాట అగ్రనాయకులు అందరూ తెలంగాణకు పరిమితమయ్యారు. తమ పుస్తకాలకు నిజాయితీగా ‘తెలంగాణ’ అనే శీర్షికలే పెట్టారు. మిగిలిన నిజాం సంస్థానాన్ని వదిలేశారు. దానికి రెండు కారణాలు. మొదటిది ఉర్దూ భాషా సమస్య, రెండోదిముస్లిం మత సమస్య.నిజాం పాలన గురించి మనకు, ముఖ్యంగా, తెలుగు పాఠకులకు తెలిసింది చాలా తక్కువ. నిజాం సంస్థానంలో పెట్టుబడీదారీ అభివృద్ధి గురించి పరిశోధనలు చేసిన ప్రొఫెషనల్స్ కొందరు లేకపోలేదు. వారిలో ఒకడైన సివి సుబ్బారావు ఆ రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూ వాగ్దానం చేసిన ఇండియాకన్నా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలోని నిజాం సంస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి మెరుగ్గా ఉందనే నిర్ధారణకు వచ్చాడు.ఇంతకీ తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భారత కమ్యూనిస్టు పార్టీ సాధించిందేమిటి? వాదన కోసం; నిజాం రాచరిక పాలననో, జాగీర్దార్ల భూస్వామ్యాన్నో వాళ్ళు అంతం చేసేశారు అనుకుందాము. భూస్వామ్య వ్యవస్థను అంతం చేశాక పెట్టుబడీదారీ వ్యవస్థ ఏర్పడుతుందని సాక్షాత్తు ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో కార్ల్ మార్క్స్– ఫ్రెడరిక్ ఏంగిల్స్ చెప్పారు. అంతేకాని భూస్వామ్య వ్యవస్థను కూల్చేస్తే సమసమాజం వస్తుందనో, కమ్యూనిస్టు రాజ్యం వస్తుందనో, కనీసం ‘రైతు–కూలీ రాజ్యం’ వస్తుందనో వాళ్ళెక్కడా చెప్పలేదు.తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ రాచరిక – భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిన తరువాత అక్కడ అత్యంత సహజంగానే పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృద్ధి చెందడాన్ని మనందరం చూస్తున్నాం. 1940ల చివర్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగానీ, 1980ల మొదట్లో నక్సలైట్ పార్టీలుగానీ ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా పెట్టుబడిదారులు పెరగడానికి కారణమయ్యారు. సమాజానికి తనదైన ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. ఒకరు అనుకున్నా అనుకోకపోయినా అదలా సాగిపోతుందంతే. ఒక కఠోర చారిత్రక వాస్తవం ఏమంటే ప్రపంచంలో ఇప్పటి వరకు పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ సోషలిస్టు విప్లవం విజయవంతం కాలేదు. 1948 నాటి పోలీస్ యాక్షన్ గురించి కమ్యూనిస్టు నాయకులు చెప్పని ఇంకో పెద్ద నిజం కూడా ఉంది. జె.ఎన్. చౌధరి నాయకత్వంలోని ‘పోలీసు యాక్షన్’ కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాలకు చేరుకోవడానికి ముందే నిజాం సంస్థానంలో సాయుధపోరాటంలో మరణించిన 3 వేలకు ఓ పది రెట్లకు పైగా ముస్లింలను అతి క్రూరంగా చంపేశారు. వాళ్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన నెహ్రూ వేసిన సుందర్ లాల్ బహుగుణ కమిటీ మాత్రమేకాక, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి అప్పటి పార్లమెంటరీ రాజకీయాల వేదికగా ఉన్న ‘పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ’(పీడీఎఫ్) నాయకులు కూడ ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేశారు. సుందర్ లాల్ బహుగుణ నివేదికను జాతీయభద్రత దృష్ట్యా చాలాకాలం దాచిపెట్టారుగానీ ఇప్పుడు అది అందుబాటులో వుంది. ఇండో–అమెరికన్ రచయిత అఫ్సర్ మహమ్మద్ 1948 నాటి పోలీస్ యాక్షన్ బాధిత కుటుంబాల సంతతిని కలిసి వాళ్ళ అనుభవాలను నమోదు చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ అంశం మీద ఓ దశాబ్దం పాటు విçస్తృత పరిశోధనలు చేసి ఇప్పుడు ‘రీమేకింగ్ హిస్టరీ –1948 పోలీస్ యాక్షన్ అండ్ ది ముస్లిమ్స్ ఆఫ్ హైదరాబాద్’ శీర్షికతో ఒక భారీ చారిత్రక డాక్యుమెంట్ ప్రచురించాడు. 2002 గుజరాత్ అల్లర్ల తరువాత తను ముస్లిం సమాజం మీద దృష్టి పెట్టాడు. మొహర్రం పండుగ సందర్భంగా తెలంగాణలో వెల్లివెరిసే మతసామరస్యం మీద పరిశోధన సాగించాడు. ఆ క్రమంలో 1948 పోలీస్ యాక్షన్ బాధితులు అతనికి తారసపడ్డారు. దాచేస్తే దాగని సత్యాలను వెళ్ళడించడానికి సిద్ధపడ్డాడు. దాని ఫలితమే ఈ పరిశోధనా గ్రంథం. ప్రపంచం అనేది చాలా పెద్దది. అందులో మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ అనే స్పృహ చాలామందికి ఉండదు. ప్రపంచం మొత్తం తెలియకపోయినా మనదేశం గురించి, మన రాష్ట్రం గురించయినా తెలియాలి. హీనపక్షం మనతో వందల సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న సమూహాల మనోభావాలనైనా తెలుసుకోవాలిగా. దానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని ఆశిస్తాను. వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు మొబైల్: 9010757776 -
ఐసీఏఆర్‌తో అమెజాన్ ఒప్పందం.. ప్రయోజనాలివే!
న్యూఢిల్లీ: కిసాన్ స్టోర్‌లో నమోదు చేసుకున్న రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడంలోనూ, అధిక దిగుబడులు.. ఆదాయం పొందడంలో తోడ్పాటు అందించడంపై ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. పుణేలోని ఐసీఏఆర్–కృషి విజ్ఞాన్ కేంద్రంలో సంయుక్తంగా నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఊతంతో తమ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించినట్లు అమెజాన్ తెలిపింది. ఐసీఏఆర్ డిప్యూటీ జనరల్ యూఎస్ గౌతమ్, అమెజాన్ ఫ్రెష్ సప్లై చెయిన్..కిసాన్ విభాగం ప్రోడక్ట్ లీడర్ సిద్ధార్థ్ టాటా ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద ఐసీఏఆర్ అభివృద్ధి చేసే అధునాతన వ్యవసాయ సాంకేతికతలను రైతులకు చేరువ చేసేందుకు ఇరు సంస్థలు కృషి చేస్తాయి. అలాగే, రైతులు తమ ఆదాయాలను పెంచుకునేందుకు ఉపయోగపడే మెరుగైన సాగు విధానాలను కిసాన్ వికాస్ కేంద్రాల్లో (కేవీకే) ప్రదర్శిస్తాయి. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు కావాల్సిన శిక్షణ, సహాయాన్ని అమెజాన్ అందిస్తుంది. తద్వారా రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానిస్తుంది. 2021 సెప్టెంబర్‌లో అమెజాన్ తమ ప్లాట్ఫామ్లో ’కిసాన్ స్టోర్’ సెక్షన్‌ను ప్రారంభించింది. ఇందులో షాపింగ్ ద్వారా వ్యవసాయానికి అవసరమైన ముడి వనరులను రైతులు ఇంటి దగ్గరే అందుకోవచ్చు. -
ఈ నెల 7న ‘వైఎస్సార్ యంత్ర సేవ’ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతాంగం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవ పథకాన్ని 7వ తేదీన ప్రారంభించనున్నారు. పథకం కింద వివిధ జిల్లాల రైతులకు 3,800 ట్రాక్టర్లు, 300 కంబైన్డ్ హార్వెస్టర్స్ అందిస్తారు. గుంటూరు జిల్లా కేంద్రంగా మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మేళా ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హరికిరణ్ గురువారం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్టా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు వ్యవసాయ శాఖ అధికారులు, ట్రాక్టర్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 7న సీఎం చేతుల మీదుగా ఆయా జిల్లాలకు చెందిన రైతులకు 1,215 ట్రాక్టర్లు, 77 కంబైన్డ్ హార్వెస్టర్స్‌ను పంపిణీ చేస్తారని, దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ జరిగే ప్రాంతానికి రవాణా సౌకర్యం, తాగునీరు, వసతి వంటి సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు రాకూడదని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మేళా ప్రాంతానికి ముందుగానే యంత్రాలు చేరేలా కంపెనీ ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. (చదవండి: అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ) -
ముందస్తు నీటి విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి ప్రతినిధి, కడప: రాబోయే ఖరీఫ్ సీజన్లో ముందస్తుగానే వ్యవసాయానికి సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సమావేశమైన ఏపీ క్యాబినెట్ తీర్మానించింది. ఈ విషయాన్ని రైతాంగానికి తెలియజేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వర్షాలు కురుస్తుండడంతో సాగునీటికి కొరత లేదు. ఖరీఫ్‌కు ముందస్తుగా నీటిని విడుదల చేస్తే నవంబరు, డిసెంబరు వరకు రైతులు పంటలు సాగు చేసుకుని తుపానుల వల్ల నష్టపోయే పరిస్థితి ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వచ్చే ఖరీఫ్‌కు ముందస్తుగానే నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. రైతాంగం ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తోంది. సాగునీటి వనరుల్లో పుష్కలంగా నీరు జిల్లాలోని జీఎన్ఎస్ఎస్, తెలుగుగంగ ప్రాజెక్టుల పరిధిలోని అన్ని సాగునీటి వనరులలో ప్రభుత్వం ముందస్తుగానే నీటిని నింపింది. గత ఏడాది నింపిన నీరు ఇప్పటికీ అలాగే ఉంది. జీఎన్ఎస్ఎస్ పరిధిలోని గండికోట, మైలవరం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి, పైడిపాలెంతోపాటు అటు తెలుగుగంగ పరిధిలోని ఎస్ఆర్–1, ఎస్ఆర్–2, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లలో నీరు ఉంది. ఈ రెండు సాగునీటి వనరుల పూర్తి నీటి సామర్థ్యం 76.608 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో 55.117 టీఎంసీల నీరు ఉంది. గండికోట పూర్తి సామర్థ్యం 26.850 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 23.900 టీఎంసీల నీరు ఉంది. బ్రహ్మంసాగర్ పూర్తి సామర్థ్యం 17.730 టీఎంసీ కాగా, ప్రస్తుతం 13.367 టీఎంసీల నీరు ఉంది. దీంతో రైతులకు ముందస్తుగా నీటిని విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రభుత్వం నిర్దేశించినట్లు జిల్లాలోని జీఎన్ఎస్ఎస్, తెలుగుగంగ పరిధిలోని సాగునీటి వనరుల కింద ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు సిద్ధమని అధికారులు చెబుతున్నారు. జీబీఆర్ రైట్ కెనాల్ కింద 26 వేల ఎకరాలకు, పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద 35 వేల ఎకరాలకు, గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ కింద 7500 ఎకరాలు చొప్పున 68,500 ఎకరాలకు, అలాగే మై లవరం కింద జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాలలో 50 వేల ఎకరాలకు, సర్వరాయసాగర్, వామికొండ సాగర్ పరిధిలో కమలాపు రం నియోజకవర్గంలో 4500 ఎకరాలకు నీరివ్వనున్నారు. ఇవికాకుండా పరోక్షంగా మరో 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఇక తెలుగుగంగ ప్రాజె క్టు పరిధిలోని ఎస్ఆర్–1, ఎస్ఆర్–2, బ్రహ్మంసాగర్‌ల పరిధిలో 1,40,000 ఎకరాల ఆయకట్టు ఉండగా, ఖరీఫ్‌లో 96,485 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. ఇ క్కడ కూడా దాదాపు 20 వేల ఎకరాలకు అనధికారికంగా నీరు అందనుంది. రెండు సాగునీటి ప్రా జెక్టుల పరిధిలోని నీటి వనరుల కింద 2. 50 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు ఖరీఫ్‌లో సాగునీరు అందనుంది. ఏ నిమిషమైనా నీటి విడుదలకు సిద్ధం తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని బ్రహ్మంసాగర్, ఎస్ఆర్–1, ఎస్ఆర్–2ల పరిధిలో ప్రస్తుతం 15 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ప్రభుత్వం ముందస్తుగా ఖరీఫ్‌కు నీటిని విడుదల చేయాలని ఆదేశిస్తే ఏ నిమిషమైనా నీటి విడుదలకు సిద్ధంగా ఉన్నాము. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో 96,485 ఎకరాలకు నీటిని అందించనున్నాము. – శారద, ఎస్ఈ, తెలుగుగంగ ప్రాజెక్టు జీఎన్ఎస్ఎస్ నుంచి ఆయకట్టుకు సాగునీరిస్తాం జీఎన్ఎస్ఎస్ పరిధిలోని సీబీఆర్, పీబీసీ, జీకేఎల్ఐ, మైలవరం ప్రాజెక్టుల పరిధిలో తగితనంతగా నీరు ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖరీఫ్ సీజన్‌కుగాను ముందస్తుగానే నీళ్లు విడుదల చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1,40,000 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. – మల్లికార్జునరెడ్డి,ఎస్ఈ, జీఎన్ఎస్ఎస్ -
ఖరీఫ్ సాగు లక్ష్యం ..93.91 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్–2022 కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కోసం సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను వైఎస్సార్ ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. పంటలు ప్రకృతి వైపరీత్యాల బారినపడకుండా ముందస్తు ఖరీఫ్‌కు వెళ్లేలా రైతులను సమాయత్తం చేయాలని అధికారులు నిర్ణయించారు. నిర్దేశించిన గడువులోగా సాగు నీటిని విడుదల చేయడం ద్వారా జూన్ మొదటి వారంలోనే నాట్లు పడేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖరీఫ్–2022లో 93.91 లక్షల ఎకరాల్లో పంటల్ని సాగు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ప్రధానంగా 40.34 లక్షల ఎకరాల్లో వరి, 18.40 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.82 లక్షల ఎకరాల్లో పత్తి, 6.62 లక్షల ఎకరాల్లో కందులు, 3.71 లక్షల ఎకరాల్లో చెరకు, 2.72 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతాయని అంచనా. ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ రానున్న సీజన్లో రూ.196.70 కోట్ల విలువైన 6.84 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించాలని అధికారులు నిర్ణయించారు. తొలిసారి వాణిజ్య పంటలైన పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల (నాన్ సబ్సిడీ)ను కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయబోతున్నారు. వేరుశనగ విత్తన పంపిణీ మే మూడో వారం నుంచి, వరి విత్తనాలను జూన్ మొదటి వారం నుంచి పంపిణీ చేయనున్నారు. గిరిజన మండలాల్లో మాత్రం వేరుశనగ, వరి విత్తనాలను మే 3వ వారం నుంచే పంపిణీ చేస్తారు. మరోవైపు 19.02 లక్షల టన్నుల ఎరువులు కేటాయించారు. వీటిని ల్యాబ్‌లలో సర్టిఫై చేసిన తర్వాతే పంపిణీ చేయబోతున్నారు. కనీసం 1.50 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల వద్ద ముందస్తుగా నిల్వ చేస్తున్నారు. ఈసారి మొత్తం వినియోగంలో కనీసం 30 శాతం ఎరువులు, 10 శాతం పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీజన్లో రూ.92,687 కోట్ల మేర వ్యవసాయ రుణాలివ్వాలని నిర్దేశించారు. రైతు ముంగిటకే అన్నిసేవలు ఖరీఫ్‌లో ప్రతి రైతుకు వారి గ్రామాల్లోనే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటి వాటిని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. సేంద్రియ సాగును ప్రోత్సహించేలా ఆర్బీకేల ద్వారా రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పకడ్బందీ ఏర్పాట్లు పంటలు వైపరీత్యాల బారిన పడకుండా సాధ్యమైనంత త్వరగా సీజన్ ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. సీజన్‌కు ముందుగానే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నాం. 8,508 పొలం బడులు నిర్వహించడం ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ జారీకి శ్రీకారం చుడుతున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ (చదవండి: రూ.390 సిమెంట్ బస్తా రూ.235కే!) -
ఐటీలో మేటి.. రైతుల సేవలో ఘనాపాటి
అనకాపల్లి: ఆధునిక పోకడలకు అనుగుణంగా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించుకొని జిల్లా ఏరువాక కేంద్రం అన్నదాతలకు వినూత్నమైన సేవలందిస్తోంది. రైతులు, వ్యవసాయ విస్తరణ విభాగాలకు మధ్య వారధిగా పనిచేస్తోంది. పంటల సాగులో తీసుకోవాల్సిన మెళకువలతోపాటు అత్యవసర సమయాల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తోంది. అందరి చేతిలో ఇంటర్నెట్తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జిల్లా ఏరువాక కేంద్రం ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) యాప్‌ను రూపొందించింది. ఏడాది పొడవునా కావలసిన సమాచారాన్ని రైతులు ఈ యాప్ ద్వారా పొందవచ్చు. యాప్ పనిచేస్తుందిలా.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏఎన్జీఆర్ఏయూఆర్బీకే (ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రైతు భరోసా కేంద్రం) యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లో వెబ్ లింకును నొక్కితే ఎఫ్‌ఏఆర్‌ఎం ఆర్ఏడీఐవో.ఇన్ కింద ఫార్మ్ రేడియో ఓపెన్ అవుతుంది. ఇందులో నాలుగు స్లాట్లు ఉంటాయి. వ్యవసాయం, కాయగూరలు పండ్లు, వెటర్నరీ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సమాచారం వస్తుంది. దేనిపై ప్రెస్ చేసినా మూడు నిమిషాల నిడివిగల వాయిస్ వినిపిస్తుంది. అదే సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ నెలకు సంబంధించిన ఆ సమాచారం ఫార్మ్ రేడియోలో వినిపిస్తుంది. రైతుల ముంగిటకే సమాచారం రైతుల వద్దకే సమాచారాన్ని పంపిస్తున్నాం. ఇంటర్నెట్ సదుపాయమున్న వారు వెబ్‌లింకు ద్వారా ఫార్మ్ రేడియోలో వ్యవసాయం, కాయగూరలు, వెటర్నరీ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను ఆయా నెలల్లో వినవచ్చు. జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో ఈ యాప్‌ను రూపొందించాం. – ప్రదీప్‌కుమార్, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త (చదవండి: -
నర్సరీలతో ఉపాధి... ఒక్కో నర్సరీకి రూ. 6 లక్షలు
కడప సిటీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది కొత్తగా నర్సరీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు తోడ్పాటు కల్పిస్తున్నారు. అలాగే నిర్మాణాత్మక పనులకు కూడా నిధులు కేటాయిస్తున్నారు. దీంతోపాటు నీటి సంరక్షణ పనులకు కూడా ప్రభుత్వం ఉపాధి హామీలో నిధులు కేటాయిస్తోంది. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పండ్ల తోటల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. పూర్తి ఉచితంగా సన్న, చిన్నకారు రైతులు సాగు చేసేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే 11 రకాల పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది కొత్తగా సన్న, చిన్నకారు రైతులు మరింత ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఉపాధి హామీ పథకానికి అవసరమైన మొక్కలను పెంచేందుకు నర్సరీల అవసరం ఏర్పడింది. ఈ నర్సరీలను పెంచేందుకు రైతులకే అవకాశం కల్పించారు. ఒక్కో నర్సరీకి రూ.6 లక్షలు నర్సరీ ఏర్పాటుకు ఏడాదికి రూ. 6 లక్షల నిధులు ఉపాధి హామీ పథకం నుంచి రైతులకు అందుతాయి. 50 వేల మొక్కలను సంబంధిత రైతు నర్సరీలో పెంచాల్సి ఉంటుంది. ఒక్కో మొక్కకు నెలకు రూపాయి చొప్పున కేటాయిస్తారు. దీంతో నెలకు రూ. 50 వేల ఆదాయం సమకూరుతుంది. అటవీ ఉత్పత్తులైన కానుగ, వేప, నీరుద్ది, నెమలినార, నిద్రగన్నేరు, నేరేడు, టేకు, ఎర్రచందనం, మునగ మొక్కలను పెంచాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఆరుచోట్ల నర్సరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. సిద్దవటం మండలం జేఎంజే కళాశాల ఎదురుగా ఉన్న మూలపల్లె గ్రామంలో, చెన్నూరు మండలం బయనపల్లె, కమలాపురం మండలం నసంతపురం, వీఎన్ పల్లె మండలం గోనుమాకులపల్లె గ్రామాల్లో నర్సరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అలాగే చక్రక్రాయపేట మండలం గంగారపువాండ్లపల్లె, సుండుపల్లె ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలో ఉపాధి హామీ పథకం అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో నర్సరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతులకు వరం సన్న, చిన్నకారు రైతులకు మరొక వరం లాంటి అవకాశం వచ్చింది. ఆసక్తిగల రైతులు నర్సరీలు పెంచేందుకు ముందుకు రావాలని ఉపాధి హామీ అధికారులు సూచించారు. ఉపాధి హామీ పథకం కింద రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన మొక్కలను సేకరించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని రైతులకు ఇచ్చి నర్సరీల ద్వారా అటవీ జాతి మొక్కలను పెంచేందుకు అవకాశం కల్పించారు. పొలం ఉన్నా.. లేకున్నా.. సన్న, చిన్నకారు రైతులకు నర్సరీల ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. నీటి సౌకర్యం కలిగి ఉండాలి. అలాగే ఒకవేళ పొలం లేకున్నా స్థలం, నీటి సౌకర్యం ఉంటే నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆసక్తిగల రైతులు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఉపాధి సిబ్బందిని కలిసి వివరాలు తెలుసుకోవచ్చు. మొక్కలు, సంబంధిత బ్యాగులు, పొలాన్ని చదును చేయడం, స్టంప్స్ (పెద్ద కర్రలు)తోపాటు పాటిమిక్చర్ (ఎరువు, ఇసుక, ఎర్రమట్టి)ను కూడా ఉపాధి హామీ పథకం కిందనే ఉచితంగా అందజేస్తారు. నర్సరీలతో మరింత ఉపాధి రైతులకు నర్సరీల ద్వారా మరింత ఉపాధి లభించే అవకాశం ఉంది. ఒక్కో నర్సరీకి రూ. 6 లక్షల నిధులు అందుతాయి. నెలకు రూ. 50 వేలు ఆదాయం పొందవచ్చు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – యదుభూషణరెడ్డి, డ్వామా పీడీ, కడప -
రైతులకు ఎస్బీఐ తీపికబురు.. తక్కువ వడ్డీకే రుణాలు!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు తీపికబురు అందించింది. రైతులకు తక్కువ వడ్డీకే అగ్రి గోల్డ్ రుణాలను అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఆసక్తి గల వ్యక్తులు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాన్ని పొందవచ్చు. ఈ వియాన్ని ఎస్బీఐ ట్విట్టర్లో వెల్లడించింది. ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాల పేరుతో రైతులకు రుణాలను అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ 7 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. యోనో యాప్ ద్వారా అప్లై చేసే రుణాలు వేగంగా మంజూరవుతాయి. రీపేమెంట్ ఆప్షన్ కూడా రైతులు తమకు కావాల్సినట్టుగా ఎంచుకోవచ్చు. ఈ ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణం మాత్రం కేవలం బంగారు నగలపై మాత్రమే లభిస్తుంది. 24 క్యారట్, 22 క్యారట్, 20 క్యారట్, 18 క్యారట్ స్వచ్ఛత గల నగలు, ఆభరణాలపై రుణాలు తీసుకోవచ్చు. 50 గ్రాముల వరకు బ్యాంక్ గోల్డ్ కాయిన్స్ పైనా రుణాలు లభిస్తాయి. గోల్డ్ బార్స్ పై ఈ రుణాలు వర్తించవు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాలు తీసుకోవచ్చు. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, పిగ్గరీ, గొర్రెల పెంపకం లాంటి వాటికీ ఈ రుణాలు వర్తిస్తాయి. యంత్రాల కొనుగోలు, వ్యవసాయం, హార్టీకల్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ లాంటి అవసరాలకు ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు. Avail SBI's Agri gold loan at lowest interest rate through YONO. #SBIAgriGoldLoan #SBI #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/jawDwSzWsH — State Bank of India (@TheOfficialSBI) December 21, 2021 (చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. రూ.1.44 లక్షల కోట్లు రీఫండ్..!) -
రైతుల విజయోత్సవం ... సింఘు నుంచి సొంతూళ్లకు..
న్యూఢిల్లీ/చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా నిరసనలకు ప్రధాన వేదికగా కొనసాగిన ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లోని సింఘు వద్ద పండుగ వాతావరణం నెలకొంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతోపాటు, వారి ఇతర డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతులు ఇళ్లకు మరిలారు. ఈ సందర్భంగా రైతులు కొంత ఉద్విగ్నానికి లోనయ్యారు. జాతీయ జెండాలు, రైతు సంఘాల జెండాలు, రంగుల విద్యుత్ దీపాలతో ట్రాక్టర్ ట్రాలీలను అందంగా అలంకరించారు. (చదవండి: అధిక సీరో పాజిటివిటీ కాపాడుతోంది!) ఇప్పటి వరకు సింఘు, ఘాజీపూర్, టిక్రీ నిరసన శిబిరాల్లో ఉపయోగించుకున్న టెంట్లు, ఇతర సామగ్రిని ట్రాలీల్లో వేసుకుని పంజాబ్, హరియాణా, యూపీ రైతులు తిరుగు పయనమయ్యారు. సింఘు ప్రాంతం భాంగ్రా నృత్యాలు, పాటలు, కీర్తనలతో మారుమోగింది. ఏడాదిపాటు ఇక్కడ గడిపిన తమకు ఈ ప్రాంతంతో, ఇక్కడి వారితో అనుబంధం ఏర్పడిందని కొందరు రైతులు అన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లడం కొంతబాధాకరంగానే ఉందని ఉద్విగ్నానికి లోనయ్యారు. జాతీయరహదారులపై పండుగ వాతావరణం డిమాండ్లను సాధించుకుని ఇళ్లకు వస్తున్న రైతులకు పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ–కర్నాల్–అంబాలా, ఢిల్లీ–హిసార్ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో ప్రజలు వారికి ఎదురెళ్లి పూల వర్షం కురిపించి, స్వీట్లు తినిపించి, పూలమాలలతో సత్కరించారు. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టిన సింఘు, టిక్రి, ఘాజీపూర్, షాజహాన్పూర్లు హిందువుల పుణ్యక్షేత్రాలైన చార్‌ధామ్‌లుగా స్వరాజ్ ఇండియా సంస్థ అధ్యక్షుడు యోగీంద్రయాదవ్ అభివర్ణించారు. కాగా, రైతుల నిరసనల కారణంగా నిలిచిపోయిన ఈ నాలుగు ప్రాంతాల్లోని టోల్‌ప్లాజాలను రెండు, మూడు రోజుల్లో తిరిగి ప్రారంభిస్తామని జాతీయరహదారుల అధికారులు తెలిపారు. ఇద్దరు రైతులు మృతి టిక్రి నుంచి ఇళ్లకు వెళ్తున్న రైతుల ట్రాలీ ఒకటి హరియాణాలోని హిసార్ వద్ద ప్రమాదానికి గురైంది. ఒక ట్రక్కు ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి ఢీకొనడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: గ్రహాంతరవాసులను చూసేందకు వెళ్తున్నా!... అంటూ హాస్యగాడిలా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే చివరికి!!) -
కొనుడుపై కొట్లాట..! టీఆర్ఎస్, బీజేపీ పరస్పర దాడులు
-
కొనుడుపై కొట్లాట..! టీఆర్ఎస్, బీజేపీ పరస్పర దాడులు
సాక్షి, నల్లగొండ జిల్లా నెట్వర్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పర్యటన రణరంగంగా మారింది. ఆసాంతం టీఆర్ఎస్ కార్యకర్తల అడ్డగింతలు, రాళ్లు, కోడిగుడ్లతో దాడులు.. బీజేపీ శ్రేణుల ప్రతిదాడులతో ఉద్రిక్తత నెలకొంది. పలుచోట్ల ఇరువర్గాలు రాస్తారోకోలకు దిగాయి. కొన్నిచోట్ల పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టాల్సి వచ్చింది. దాడులు, లాఠీచార్జిలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు సోమ, మంగళవారాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పర్యటిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. అయితే సంజయ్ పర్యటనను అడ్డుకుని, నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. ఆయా గ్రామాల్లో భారీగా మోహరించారు. ఎక్కడిక్కడ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. పలుచోట్ల రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా దీటుగా స్పందించారు. కర్రలు చేతబట్టి టీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లారు. ఆర్జాలబావి వద్ద తీవ్ర ఘర్షణ బండి సంజయ్ కాన్వాయ్ నేరుగా నల్లగొండ జిల్లా కేంద్రం శివార్లలోని ఆర్జాలబావి దగ్గరున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకుంది. అప్పటికే అక్కడ గుమిగూడిన టీఆర్ఎస్ కార్యకర్తలు ‘సంజయ్ గోబ్యాక్, బీజేపీ నాయకులు గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలకు దిగారు. పోలీసులు రోప్‌పార్టీ సాయంతో సంజయ్‌ను ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి తీసుకెళ్లారు. ఆయన రైతులతో మాట్లాడుతుండగా.. కొనుగోలు కేంద్రంలోకి చొచ్చుకువచ్చేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. పోలీసులు వెంటనే కల్పించుకుని టీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టారు. తర్వాత బండి సంజయ్ తిరిగి వెళ్లిపోతుండగా.. కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. వెంటనే బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాహనాల నుంచి దిగి కర్రలతో టీఆర్ఎస్ కార్యకర్తల వెంటపడ్డారు. పోలీసులు వారిని అడ్డుకుని.. సంజయ్ కాన్వాయ్‌ను పంపేశారు. అయితే బీజేపీ నాయకులు తమపై దాడి చేశారంటూ టీఆర్ఎస్ నాయకులు అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకోకు దిగారు. టీఆర్ఎస్ వాళ్లే తమపై దాడిచేశారంటూ బీజేపీ నాయకులు కూడా రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను పంపేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలతో వచ్చిన ఎమ్మెల్యే.. బండి సంజయ్ పర్యటనను అడ్డుకునేందుకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆర్జాలబావి కొనుగోలు కేంద్రానికి వచ్చారు. కానీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుందని భావించిన ఎస్పీ రంగనాథ్ ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించారు. రాళ్లదాడి జరగొచ్చని ముందే ఊహించిన పోలీసులు.. కొనుగోలు కేంద్రం, పరిసరాల్లో ఉన్న రాళ్లను ఏరి దూరంగా పడేశారు. కుక్కడం వద్ద లాఠీచార్జి బండి సంజయ్ మాడుగులపల్లి మండలంలోని కుక్కడం వద్ద కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లగా.. టీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు పరస్పరం ఘర్షణకు దిగారు. వారిని అదుపుచేస్తున్న క్రమంలో ఓ ఎస్సై కిందపడిపోవడంతో.. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. ఇరువర్గాల ఆందోళనతో నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. శెట్టిపాలెం వద్ద ఆగమాగం వేములపల్లి మండలం శెట్టిపాలెం కొనుగోలు కేంద్రం వద్ద కూడా బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఆయన రైతులతో మాట్లాడి తిరిగి వెళ్తుండగా.. టీఆర్ఎస్ నేతలు విసిరిన కోడిగుడ్లు బండి సంజయ్ వాహనంపై పడ్డాయి. దీనితో బీజేపీ కార్యకర్తలు కూడా ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలు రాళ్లు, కోడిగుడ్లు విసురుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరస్పర దాడుల్లోఓ ముగ్గురికి గాయాలయ్యాయి. ఓ మీడియా ప్రతినిధి కంటికి దెబ్బతగిలింది. ఇరువర్గాల కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. యాద్గార్పల్లి వద్ద నిరసనలు మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి సమీపంలోని రైస్ మిల్లుల వద్దకు వెళ్లిన బండి సంజయ్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సంజయ్ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. చిల్లేపల్లి మూసీ వంతెన వద్ద రణరంగం.. బండి సంజయ్ కాన్వాయ్ నల్లగొండ జిల్లా దాటి సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశిస్తుండగా.. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి మూసీ వంతెన వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాన్వాయ్ రావడానికి ముందే నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లి మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని మూసీ వంతెనపై బైఠాయించారు. సంజయ్ కాన్వాయ్ అక్కడికి చేరుకోగానే.. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, రాళ్లు రువ్వారు. దీంతో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేసి టీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టారు. బండి సంజయ్ కాన్వాయ్‌ను ముందుకు పంపారు. అయితే కొంత దూరంలో వేచి ఉన్న మరికొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు.. సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ ఘర్షణలతో చిల్లేపల్లి నుంచి నేరేడుచర్ల, మిర్యాలగూడ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి జనం ఇబ్బందిపడ్డారు. ఇక నేరేడుచర్ల పట్టణంలో కూడా కాన్వాయ్‌పై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. గడ్డిపల్లిలో రాళ్లు రువ్వి.. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బండి సంజయ్ కాన్వాయ్‌ను టీఆర్ఎస్ నేతలు అడ్డుకుని రాళ్లు రువ్వారు. ఆందోళకారులు ముందుగానే గ్రామంలో కరెంట్ కట్ చేశారు. గ్రామంలో బీజేపీ దివంగత నేత రామినేని ప్రభాకర్‌రావు విగ్రహానికి బండి సంజయ్ పూలమాల వేస్తున్న సమయంలోనూ రాళ్లు విసిరారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. అనంతారంలోనూ.. సూర్యాపేట జిల్లా అనంతారంలో ఆందోళనకారులు కరెంటు కట్‌చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద భారీగా మోహరించారు. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను వాహనం నుంచి దిగనివ్వలేదు. ఆయన కాన్వాయ్‌ను అనాజిపురం గ్రామం మీదుగా సూర్యాపేట వైపు మళ్లించారు. ఈ విషయం తెలిసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనాజిపురంలో బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. తాళ్లఖమ్మంపహాడ్‌లో తీవ్ర ఉద్రిక్తత సూర్యాపేట జిల్లా తాళ్లఖమ్మంపహాడ్ గ్రామంలోనూ భారీగా గుమిగూడిన టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్వాయి. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. అయితే పోలీసులు తగిన భద్రత కల్పించడం లేదంటూ బీజేపీ కార్యకర్తలు గ్రామంలో రాస్తారోకోకు దిగి నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అక్కడికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టించారు. తర్వాత సంజయ్ కాన్వాయ్ ఇమాంపేటకు చేరుకోగా.. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు రోడ్డుపై ట్రాక్టర్ కేజ్ వీల్స్, కలప దుంగలు అడ్డుపెట్టి, కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. అక్కడి నుంచి బయలుదేరిన బండి సంజయ్.. రాత్రి 9.50 గంటలకు పెన్‌పహాడ్ మండలంలోని జానారెడ్డినగర్‌లో ఉన్న బీజేపీ దివంగత నేత కట్కూరి గన్నారెడ్డి నివాసానికి చేరుకుని.. బసచేశారు. -
పీఎం కిసాన్ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!
పీఎం కిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(ప్రధాని-కిసాన్) యోజన పథకం కింద 9వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 9న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. "9.75 కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాల ఖాతాలో రేపు ₹19,500 కోట్ల నగదును జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో ప్రధాన మంత్రి సంభాషించనున్నారు'' అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి ₹6,000లను కేంద్రం ప్రతి ఏడాది మూడు విడుతలలో విడుదల చేస్తుంది. ఒక్కొక్క విడుతలలో భాగంగా ₹2,000లను ప్రతి నెలలకు ఒకసారి జమచేస్తుంది. ఈ నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో బదిలీ చేస్తారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ₹1.38 లక్షల కోట్లకు పైగా సమ్మాన్ రాశిని రైతు కుటుంబాలకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొంటారు. అంతకు ముందు మే 14న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 8వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేశారు. To further strengthen the social security of farmers, PM Shri @narendramodi will release the next instalment of PM-KISAN on 9th August 2021 at 12:30 PM. Register for the event at: https://t.co/NNPhWg5KT1 #TransformingIndia pic.twitter.com/VjYHLEMA2D — MyGovIndia (@mygovindia) August 8, 2021 -
42 లక్షల పీఎం కిసాన్ రైతులకు కేంద్రం భారీ షాక్!
పీఎం కిసాన్ రైతులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. పీఎం-కిసాన్ పథకం కింద 42 లక్షల మందికి పైగా అనర్హులైన రైతులకు బదిలీ చేసిన సుమారు రూ.3,000 కోట్లను కేంద్రం రికవరీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. పీఎం కిసాన్ పథకం కింద, కేంద్రం ప్రతి ఏడాది రూ.6,000ను దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాలలో బదిలీ చేస్తుంది. అయితే ఈ పథకానికి రైతులు అర్హత సాధించాలంటే కొన్ని అర్హతా ప్రమాణాలు ఉన్నాయి. పీఎం కిసాన్ పథకం కింద డబ్బు పొందిన 42.16 లక్షల మంది అనర్హులైన రైతుల నుంచి రూ.2,992 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో అంగీకరించారు. పీఎం కిసాన్ నుంచి అక్రమంగా నగదు పొందిన రైతుల గరిష్ట సంఖ్య అస్సాంలో 8.35 లక్షలుగా ఉంది, తమిళనాడులో - 7.22 లక్షలు, పంజాబ్ - 5.62 లక్షలు, మహారాష్ట్రలో - 4.45 లక్షలు, ఉత్తరప్రదేశ్ లో - 2.65 లక్షలు, గుజరాత్ లో - 2.36 లక్షలు. స్వాధీనం చేసుకోవలసిన డబ్బు అస్సాంలో రూ.554 కోట్లు, పంజాబ్ లో రూ.437 కోట్లు, మహారాష్ట్రలో రూ.358 కోట్లు, తమిళనాడులో రూ.340 కోట్లు, యుపీలో రూ.258 కోట్లు, గుజరాత్ లో రూ.220 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. "ఆధార్, పీఎఫ్ఎంఎస్ లేదా ఆదాయపు పన్ను డేటాబేస్ ఆధారంగా అధికారులు లబ్ధిదారుల డేటాను నిరంతరం చెక్ చేస్తారు. అయితే, వెరిఫికేషన్ ప్రక్రియ సమయంలో ఈ పథకం ప్రయోజనం కొంతమంది ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతులతో సహా కొంతమంది అనర్హులైన లబ్ధిదారులకు నగదు బదిలీ చేసినట్లు కనుగొన్నట్లు" తోమర్ పార్లమెంటుకు తెలిపారు. పీఎం కిసాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడటానికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుందని "నిజమైన రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి" ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చాలా రాష్ట్రాలు అనర్హులైన రైతుల నుంచి డబ్బులను రికవరీ చేయడానికి నోటీసులు పంపాయి. పీఎం-కిసాన్ లబ్ధిదారుల భౌతిక ధృవీకరణ కోసం ప్రామాణిక కార్యాచరణ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసినట్లు తోమర్ పేర్కొన్నారు. -
Eruvaka Pournami: రైతన్నల వ్యవసాయ పండుగ
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): తొలకరి పిలుపు రైతన్న మోములో చిరునవ్వు, పిల్ల కాలువల గెంతులాట, పుడమితల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరువాక పౌర్ణమి. ఆధునికత ఎంత ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠ మాసం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడి భూమి మెత్తబడుతుంది. దుక్కి దున్నడం, వ్యవసాయ పనులను ప్రారంభించడం ఏరువాకతోనే ప్రారంభమవుతుంది. ఏరువాక అంటే.. అన్నదాతలు వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే వేడుక. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడం అని అర్థం. ఈరోజు రైతులు కాడెద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గజ్జెలు, గంటలతో అలంకరిస్తారు. ఎడ్లకు కట్టేకాడిని దూపదీప నైవేద్యాలతో పూజించి, ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. భూమిని దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. దేశమంతటా.. ఏరువాకను జ్యోతిష, శాస్త్రవేత్తలు కృష్యారంభం, సస్యారంభం అని వ్యవహరిస్తారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. జ్యేష్ఠమాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం దేశమంతా ఒకేలా ఉంటుంది. దేశంలో దాదాపు 80 శాతం వర్షపాతం నైరుతి వల్లే కలుగుతుంది. పాడిపంటలకు, పొలం పనులకు ఆటంకాలు ఎదురుకావొద్దని కోరుకుంటూ ఏరువాకను మహా యజ్ఞంలా పరిగణించి ఆచరిస్తారు. నాగేటి సాళ్లల్లో సీత దొరికింది కాబట్టి సీతా యజ్ఞంగాను భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే ఈ రోజే ఒడిశాలోని పూరీ జగన్నా«థునికి స్నానోత్సవం నిర్వహిస్తారు. అతి ప్రాచీనమైన పండుగ.. ఏరువాక అతి ప్రాచీనమైన పండుగ. ఈ రోజున శ్రీకృష్ణదేవరాయలు రైతుల కృషిని అభినందించి, తగిన రీతిలో వారిని ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే శుద్ధోధన రాజు కపిలవస్తులో లాంఛనంగా ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని రైతులకు అందించినట్లుగా కథలున్నాయి. ఏరువాకతో వ్యవసాయానికి సిద్ధమయ్యే రైతులకు ధాన్యపు సిరులు కురవాలని ఆశిద్దాం. రైతుకు అండగా ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు అండగా నిలిచి, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. భూరికార్డుల ప్రక్షాళనతో అన్నదాతలకు కొత్త పాసుబుక్కులు ఇచ్చింది. రైతు రుణమాఫీ అమలు చేస్తూ పంట బీమా సౌకర్యం కల్పిస్తోంది. రైతుబంధు పథకంతో ఏటా ఏటా ఎకరానికి రూ.10 వేలు నేరుగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. రైతు బీమా పథకం ధ్వారా 18 నుంచి 59 ఏళ్లలోపు రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి తక్షణం రూ.5 లక్షలు పరిహారంగా అందిస్తోంది. ప్రతీ గ్రామీణ నియోజకవర్గానికి 100 సంచార పశు వైద్యశాలను నిర్వహిస్తోంది. 24 గంటల కరెంటు, సకాలంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులోకి తేవడమే కాకుండా బీడు భూములకు, ఎండిన చెరువులు, కుంటలకు కాళేశ్వరం జలాల ద్వారా సాగు నీరందిస్తోంది. లాక్డౌన్లో రైతులు ఆగం కావొద్దని పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి, బాసటగా నిలిచింది. దిగుబడి పెరిగితే సాగు లాభమే మాకు మానకొండూర్‌లో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సేంద్రీయ విధానంలో వరి సాగు చేస్తాం. ప్రత్యేక రాష్ట్రంలో రైతుల కష్టాలు మెల్లమెల్లగా తీరుతున్నాయి. వాతావరణం కూడా అనుకూలించి, దిగుబడి పెరిగితే వ్యవసాయం లాభమే. – బొప్పు శ్రీహరి, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, మానకొండూర్ విత్తనాలు ప్రభుత్వమే ఇవ్వాలి ఏటా నకిలీ, నాణ్యతలేని విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వమే సబ్సిడీతో నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి. అప్పుడే అన్నదాతలకు మేలు జరుగుతుంది. – నర్సయ్య, రైతు, తీగలగుట్టపల్లి, కరీంనగర్ నీటి ఎద్దడి లేదు ఏరువాక పౌర్ణమి రోజు రైతులందరం వ్యవసాయ పనిముట్లు, భూదేవికి, ఏడ్లకు పూజలు చేస్తాం. నాగలి కట్టి దుక్కులు దున్నడం ప్రారంభిస్తాం. వ్యవసాయానికి సాగునీటి ఎద్దడి లేకపోవడం సంతోషం. వర్షాలు అనుకున్నట్లు పడితే సాగుకు ఢోకా ఉండదు. – గంగాచారి, రైతు, చింతకుంట,కరీంనగర్ -
జై కిసాన్
-
హలో వెంకటయ్య.. నేను హరీశ్‌ను!
మంత్రి హరీశ్‌రావు: ‘హలో.. వెంకటయ్య నేను హరీశ్‌ను మాట్లాడుతున్నాను.. వెంకటయ్య: సార్.. సార్.. చెప్పండి హరీశ్‌రావు: అంతా బాగున్నారా? నీళ్లు మంచిగా ఉన్నాయా? బోరు పోస్తుందా.. ? వెంకటయ్య: సార్ బాగున్నాం.. నీళ్లకు ఢోకాలేదు.. హరీశ్‌రావు: ఆయిల్ పామ్ గురించి మొన్న మీటింగ్‌లో విన్నావు కదా! ఎన్ని ఎకరాలు సాగు చేస్తావు.. వెంకటయ్య: రెండు ఎకరాలు వేద్దామని అనుకుంటున్న సార్ హరీశ్‌రావు: రెండు ఎకరాలు వేస్తే ఏం లాభం.. మూడు ఎకరాలు సాగు చేయి.. వెంకటయ్య: మీరు చెప్పినంక మాకేం భయం సార్.. మూడు కాదు.. నాలుగు ఎకరాల్లో పామ్ ఆయిల్ వేస్తా సార్.. హరీశ్‌రావు: ఓకే వెంకటయ్య.. నీతోపాటు పక్క రైతులను కూడా సాగుచేయమని చెప్పు. మంచి లాభాలు వచ్చే సాగు. ఎకరానికి ప్రభుత్వం రూ.30 వేలు ప్రోత్సాహకాలు కూడా అందజేస్తుంది. ఫ్యాక్టరీని కూడా మన సిద్దిపేటలోనే ఏర్పాటు చేస్తున్నం. మంచి లాభం వచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన రైతు వెంకటయ్యతో బుధవారం ఫోన్లో చేసిన సంభాషణ ఇది. సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మొత్తం 55 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 28వ తేదీన సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతుల ఉత్సాహాన్ని చూసిన మంత్రి హరీశ్‌రావు బుధవారం హైదరాబాద్ నుంచి 300 మంది రైతులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి రైతులు ఆయిల్ పామ్ వేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఆయిల్ పామ్ దిగుబడి, లాభాలు, జిల్లాలో ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు వంటి విషయాలను మంత్రి రైతులకు వివరించారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి జిల్లా రైతులకు దశల వారీగా ఆయిల్ పామ్ తోటలు సాగుచేసిన రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన సిద్దిపేట నియోజకవర్గం నుంచి 150 మంది రైతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, దమ్మపేటలకు పంపిస్తున్నామని, రైతులు అక్కడకు వెళ్లి ఆయిల్ పాం సాగులో మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్, హార్టికల్చర్ అధికారి రామలక్ష్మి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రైతుల సేవే లక్ష్యం: సీఎం జగన్
ఆర్బీకేల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ– క్రాపింగ్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర లభిం చకపోతే వీరికి చెబితే రిజిస్టర్ చేసుకుం టారు. సీఎం యాప్ ద్వారా ఆ విషయాన్ని వారు పైకి తెలియజేస్తారు. తద్వారా మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకుని, మద్దతు ధరకు అమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అలా వీలుకాకపోతే నేరుగా మార్కెటింగ్ శాఖే కొనుగోలు చేస్తుంది. ఇదంతా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రైతును ఊరు దాటించే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) ఉం దని, ఆ మేరకు అవసరమయ్యే సేవలన్నింటినీ అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలు అన్నింటినీ తీర్చడమే లక్ష్యంగా ఆర్బీకేలు పని చేయాలని, వీటి ద్వారా రైతులు ఆర్డర్ చేసిన వెంటనే నిర్దేశిత సమయంలోగా విత్తనాలు, ఎరువులు చేరాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుత రబీ ప్రొక్యూర్‌మెంట్‌తో పాటు, ఖరీఫ్ 2021–22 సన్నద్ధతపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు ఊరు దాటి పోకూడని విధంగా సేవలందించాలనే విషయాన్ని అధికారులు కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రతి గ్రామానికి ఆర్బీకే యూనిట్‌గా పంటల ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఆర్బీకేల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. ఈ సమయంలో వ్యవసాయ సిబ్బంది ఆర్బీకేలోనే రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆర్బీకేల ద్వారా కచ్చితంగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందివ్వాలని, ఇందులో వేరే మాటకే తావులేదని.. ఫిషరీస్ ఫీడ్, లైవ్ స్టాక్ మెడిసిన్, సీడ్, ఫెర్టిలైజర్స్ అన్నీ రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆర్బీకేలన్నింటికీ ఇంటర్నెట్ సదుపాయం ఆర్బీకేలన్నింటికీ వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం ఉండాలని సీఎం ఆదేశించారు. ఇది ఇంటరాక్టివ్ విధానంలో రైతుల సందేహాల నివృత్తికి ఉపయోగపడుతుందన్నారు. రైతులకు వచ్చే ఖరీఫ్‌లో ఇచ్చే విత్తనాలు కచ్చితంగా నాణ్యతతో ఉండాలని.. మార్కెట్లో కొనుగోలుకు ఆసక్తి చూపని వంగడాలు, ఆసక్తి చూపి మంచి ధర లభించే వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. దీనిపై పోస్టర్లను విడుదల చేయాలన్నారు. దీనివల్ల మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగు పడతాయన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ సహాయంతో రైతులకు స్పష్టంగా ఈ విషయాలను తెలియజేయాలని, ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయాలని సూచించారు. రబీ పంటలు సాగు చేసిన 6,081 ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోళ్లు ప్రారంభించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.28,430 కోట్లతో పంటల కొనుగోళ్లు చేశామని తెలిపారు. ఇందులో ధాన్యం కొనుగోలుకు రూ.22,918 కోట్లు, ఇతర పంటలకు రూ.5,512 కోట్లు వెచ్చించామన్నారు. 2015–16 నుంచి 2018–19 వరకు గత ప్రభుత్వం నాలుగేళ్లలో పంటల కొనుగోలు కోసం రూ.43,047 కోట్లు మాత్రమే వెచ్చించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విత్తనాల దగ్గర నుంచి పురుగు మందులు, ఎరువులు సహా ఏం కొనుగోలు చేసినా రైతు మోసపోకూడదు. వాటి కోసం ఆర్బీకేల్లో రైతులు ఆర్డర్ చేసిన 48 నుంచి 72 గంటల్లోగా అందుబాటులోకి తేవడమే లక్ష్యం. వాటిని ప్రభుత్వం పరీక్షించి, క్వాలిటీ పరంగా స్టాంప్ వేసి ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా కల్తీ అన్నది రైతు దగ్గరకి రాకూడదన్న తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఆర్బీకే యూనిట్‌గా ప్రతి గ్రామానికి పంటల ప్రణాళిక తయారు చేయాలి. ఏయే పంటలకు కనీస మద్దతు ధర ఏమిటనేది ప్రదర్శించిన పోస్టర్ ఉండాలి. ప్రతి గ్రామంలో రైతులు విత్తనం వేసే దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ప్రతి అడుగులో తోడుగా ఉంటూ చేయి పట్టుకుని నడిపించాలి. ఇలాంటి వ్యవస్థ కచ్చితంగా గ్రామాల్లో రావాలనే తాపత్రయం, తపన నుంచి పుట్టిన బీజమే ఈ రైతు భరోసా కేంద్రం. ఆర్బీకే చానల్ ప్రారంభం రైతులకు అన్ని విధాలా తోడుగా ఉండేలా రూపొందించిన ఆర్బీకే చానల్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ఘట్టంలో ఈ రోజు ఇంకో ముందడుగు వేశామని పేర్కొన్నారు. ఆర్బీకేల్లో స్మార్ట్ టీవీలు పెడుతున్నాం కాబట్టి, అక్కడి రైతులకు చాలా విషయాల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణం గురించి తెలియజెపుతూ నిరంతరం సమాచారం ఇచ్చేందుకు ఈ చానల్ ఉపయోగపడుతుందన్నారు. ఏ రైతుకు ఏ సందేహం వచ్చినా టోల్ ఫ్రీ నంబర్ 155251కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. రైతుల సందేహాలపై సైంటిస్ట్‌లతో ఇంటరాక్టివ్ పద్ధతిలో కూడా సందేహాలు తీర్చడానికి ఒక పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆర్బీకేలను విప్లవాత్మకంగా రైతులకు ఇంకా దగ్గరగా, ఇంకా ఎక్కువగా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు. ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడాలని మనసారా ఆశిస్తున్నానని, రైతులకు ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. చదవండి: బడుగుబలహీన వర్గాలకే అగ్రాసనం.. మైదుకూరు ఛైర్మన్ పీఠం వైఎస్సార్సీపీదే -
‘చంద్రబాబుకు దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలి’
అమరావతి: అమరావతిలో దళితుల భూములను ఇన్సైడ్ ట్రేడింగ్ జరిపి చంద్రబాబు అక్రమంగా కాజేశారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఎదుర్కొవాలని బొత్స డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే అమరావతి భూకుంభ కోణంపై ప్రశ్నిస్తుందని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. అయితే తమ ప్రభుత్వానికి చంద్రబాబుపై కక్ష సాధించాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ చంద్రబాబు ఇన్సైడ్ ట్రేడింగ్ జరపనట్టైతే విచారణ ఎదుర్కొవాలిగానీ..కోర్టులకు వెళ్ళి అడ్డదారిలో స్టేలు తెచ్చుకోవడమేంటని బొత్స ప్రశ్నించారు. ఈ సందర్భంగా బొత్స , వైఎస్సార్సీపీవై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించారు. తాము అధికారంలోకి వచ్చి రెండేళ్ళయ్యిందని ఒకవేళ మేము తప్పుచేస్తే ఇప్పటివరకు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకొలేక చంద్రబాబు బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాగా, దళితులకు అన్యాయం జరిగితే ఎవరైన ఫిర్యాదు చేయవచ్చని, కేవలం దళితుడే కావాల్సిన అవసరం లేదని గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు. అయితే, రాజధాని భూఅక్రమాలపై ఆర్కే ఫిర్యాదుచేస్తే తప్పేంటని ప్రశ్నించారు. చదవండి: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు -
పీఎం కిసాన్ అర్హుల జాబితా నుంచి 33 లక్షల పేర్లు తొలగింపు
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి కేంద్రం అర్హత కలిగిన ప్రతి రైతుకు మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలను బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుంచి 33 లక్షల రైతుల పేర్లను తొలగించింది. వీరంతా అర్హత లేకున్నా పీఎం కిసాన్ నగదును పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. అందుకే వీరి పేర్లను పీఎం కిసాన్ అర్హుల జాబితా నుంచి తొలగించింది. అనర్హులైన రైతుల నుంచి తిరిగి సుమారు 2,327 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పంజాబ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ ప్రక్రియ ప్రారంభమైంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా అనర్హులైన రైతుల నుంచి రికవరీని త్వరలో ప్రారంభించవచ్చు. పీఎం కిసాన్ వెరిఫికేషన్ ప్రక్రియ సమయంలో 32,91,152 మంది భోగస్ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కు జత చేసిన ఆధార్, పాన్ నంబర్లను తనిఖీ చేసే సమయంలో కొన్ని లక్షల మంది రైతులు ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారని గుర్తించింది. అలాగే ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగాలు, పెన్షనర్లు కూడా ఈ ప్రయోజనాలు పొందుతున్నట్లు గుర్తించింది. అనర్హుల జాబితాలో ఎక్కువ శాతం మంది తమిళనాడులో(6.96 లక్షల) ఉన్నారు. ఇక పంజాబ్ లో 4.70 లక్షల మంది, కర్ణాటకలో 2.04 లక్షల మంది, ఉత్తరప్రదేశ్ లో 1.78 లక్షలు మంది, రాజస్థాన్ లో 1.32 లక్షల మంది, హర్యానాలో 35 వేల మంది, గుజరాత్ లో ఏడు వేలకు పైగా బోగస్ లబ్ధిదారులు ఉన్నారు. అయితే మీకు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా? రావా? అని కూడా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా: మొదట మీరు పీఎం-కిసాన్ పోర్టల్ సందర్శించాలి. ఇప్పుడు మీకు ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే Beneficiaries Listపై క్లిక్ చేయాలి. తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. -
ధరణి.. సంస్కరణ కాదు సంక్షోభం
సాక్షి, అదిలాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన అనేక సబ్సిడీలకు కోత పెట్టి.. రైతుబంధు పేరుతో కేసీఆర్ అన్నదాతలను మోసం చేస్తున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మండిపడ్డారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని సీఎల్పీ బృందం బుధవారం రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని ఏర్రాటు చేసింది. ఈ కార్యక్రమంలో భట్టితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు భరత్ చౌహాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి దుర్గాభవానీ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, స్థానిక మండల ఇంఛార్జి పొద్దుటూరి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కడెం రైతులతో సమావేశం అయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు పేరు మీద ప్రభుత్వం ద్వారా రావాల్సిన సహాయాన్ని, సబ్సిడీనికి కేసీఆర్ ప్రభుత్వం ఆపేసిందని రైతులకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మోసాలు ప్రజలకు, రైతులుకు అర్థమవుతోందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేవలం భూములున్న భూస్వాములకు, వందల ఎకరాల బీడు భూమి ఉన్న ఆసాములకు మాత్రమే ఉపయోగపడుతోంది తప్పా.. నిజంగా భూమిని దున్నే రైతులకు ఉపయోగపడడం లేదని పేర్కొన్నారు. భూమిని నమ్మి పంట పండించే రైతులకు మద్దతు ధరలేక.. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదన్నారు. అంతేగాక గత ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీలు కూడా లేక... అన్నదాతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ ప్రాంతంలో నాటి దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన సదర్‌మఠ్ ప్రాజెక్టును కుట్రతోనే డిజైన్ మార్చి.. ఈ ప్రాంత వాసులకు నీళ్లు రాకుండా చేశారని భట్టి ఆరోపించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కోసం నిర్మించిన కడెం ప్రాజెక్టు ద్వారా చివరి భూములకు నీళ్లు అందించేలా ప్రతి ఏడాది మెయింటెనెన్స్ చేయడం జరిగేదన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మెయిటెనెన్స్ చేయకపోవడంతో కింది ప్రాంత రైతులకు నీళ్లు రావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కడెం ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం మంజూరు చేసిన 130 మంది ఉద్యోగులను గత కాంగ్రెస్ ప్రభుత్వం నియమిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం 101 మందిని తొలగించి.. కేవలం 29 మందితో ప్రాజెక్టు నిర్వహణ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 74 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అలసత్వం వహించడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడెం ప్రాజెక్టును రైతులకు దూరం చేసే ఒక దుర్మార్గమైన ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ధరణితో రైతులందరిని కేసీఆర్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని భట్టి ధ్వజమెత్తారు. ధరణి అనేది సంస్కరణ కాదు.. సంక్షోభం అని ఆయన అన్నారు. రాష్ట్రంలో 95 శాతం మంది రైతులు 5 ఎకరాల్లోపు ఉన్నవారే.. వారంతా పండించిన పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలు.. దేశ రైతాంగాన్ని వణికిస్తున్నాయని భట్టి విక్రమార్క పెర్కొన్నారు. -
పీఎం ఫసల్ బీమా యోజనకు రూ.16వేల కోట్లు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పిఎంఎఫ్‌బివై) పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.16,000 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021-22 బడ్జెట్ లో 305కోట్లు ఎక్కువగా కేటాయించారు. దేశంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వ తన నిబద్ధతను తెలియజేస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ అభిప్రాయపడింది. ఈ పథకం ద్వారా రైతుల విత్తనాలు వేసిన దగ్గర నుంచి పంటకోతకు వచ్చే వరకు ఆ పంటకు రక్షణ లభిస్తుంది. పిఎంఎఫ్‌బివై ప్రయోజనాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులు భీమా చేసిన పంటలకు నష్టం కలిగితే దీని ద్వారా భీమా అందిస్తారు. ప్రకృతి విపత్తు కారణంగా రైతు పంట నాశనమైతే వారికి ఈ పథకం కింద భీమా లభిస్తుంది. ఖరీఫ్ పంటలో 2శాతం, రబీ పంటకు 1.5శాతం, హార్టికల్చర్ కు 5శాతం రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల క్రితం 13 జనవరి 2016న భారత ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని పీఎం తీసుకొచ్చింది.(చదవండి: భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్) కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద పంట బీమా పథకం ఇది. ప్రీమియం విషయంలో మూడో అతిపెద్ద బీమా పథకం. ప్రతి ఏడాది 5.5 కోట్లకు పైగా రైతుల దరఖాస్తులు చేసుకుంటారు. ఈ పథకానికి రైతులు ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు. అన్ని రకాల ఆహార పంటలకు ఇది వర్తిస్తుంది. పంట నష్టపోయిన రైతులు 72 గంటల్లో దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్‌కు లేదా క్రాప్ ఇన్స్యూరెన్స్ యాప్‌లో రిపోర్ట్ చేయాలి. అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్‌కు బీమా డబ్బులు వస్తాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను https://pmfby.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. -
అన్నదాతల కోసం మరో కేంద్ర పథకం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిది యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీని కింద ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తుంది. అలాగే ఇప్పుడు రైతుల కోసం మరో పథకం కూడా అందుబాటులో ఉంది. గతంలోనే అన్నదాతల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపై అవగాహన తక్కువగా ఉండటం వల్ల చాలా తక్కువ మంది రైతుల మాత్రమే ఇందులో చేరారు.(చదవండి: రైతులకు భారీ ఊరట: రుణ మాఫీ) పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనేది చిన్న, ఉపాంత రైతుల సామాజిక భద్రత కోసం తీసుకొచ్చిన ప్రభుత్వ పథకం. 18 నుండి 40 సంవత్సరాల వయస్సులోపు 2 హెక్టార్ల వరకు సాగు చేయగల భూములను కలిగి ఉన్న చిన్న, ఉపాంత రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందటానికి అర్హులు. ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన తరువాత రైతులకు నెలకు 3000/- రూపాయల కనీస భరోసా పెన్షన్ లభిస్తుంది. రైతు మరణిస్తే రైతు జీవిత భాగస్వామికి 50శాతం పెన్షన్‌ను కుటుంబ పెన్షన్‌గా పొందటానికి అర్హత ఉంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల చందాదారులు 60ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు 60 ఏళ్లు నిండిన వెంటనే పెన్షన్ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ప్రతి నెల సంబంధిత వ్యక్తి యొక్క పెన్షన్ ఖాతాలో రూ.3వేలు జమ అవుతాయి. దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా/PM-కిసాన్ ఖాతా, పొలం పాస్‌బుక్, రెండు ఫోటోలు ఉంటే సరిపోతుంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్నా వారు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఉచితంగానే ఈ పథకంలో చేరవచ్చు. -
రైతుల కోసం 'క్రాప్ దర్పణ్'!
హైదరాబాద్: పంటలకు సంబంధించి రైతుల సమస్యలు తీర్చేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రత్యేక యాప్ రూపొందించింది. పత్తి పంటకు సోకే వ్యాధుల నిర్ధారణలో రైతులకు సాయం చేసేందుకు 'క్రాప్ దర్పణ్' పేరిట యాప్ తయారు చేశారు. భారత్-జపాన్ జాయింట్ రీసెర్చ్ లేబొరేటరీ ప్రాజెక్టు కింద దీన్ని రూపొందించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐటీ హైదరాబాద్, బాంబే ఐఐటీ సహకారంతో ట్రిపుల్ ఐటీ ఈ యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.(చదవండి: కాళేశ్వరంలో పడవ ప్రయాణం) తొలుత పత్తి పంటపై మాత్రమే రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. తదుపరి దశల్లో ఇతర పంటలపై కూడా దృష్టి పేట్టి యాప్‌ల రూపకల్పన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్ ప్రొఫెసర్ పి.కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అరవింద గాడమశెట్టి, రేవంత్ పర్వతనేని, సాయిదీప్ చెన్నుపాటి, శ్రీనివాస్ అన్నపల్లి కలసి ఈ యాప్ రూపొందించారు. గతంలో కూడా వ్యవసాయ సలహా వ్యవస్థను, గ్రామ స్థాయిలో ఈ-సాగును ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేసింది. చీడపీడలపై రైతులకు అవగాహన పత్తి పంట పెరుగుదలను ప్రభావితం చేసే సమస్యలు, తెగుళ్లు, బ్యాక్టీరియా, శిలీంద్ర వ్యాధులు, పోషక లోపాలకు సంబందించిన అంశాలు ఈ యాప్‌లో పాందుపర్పారు. చీడపీడలపై రైతులపై మార్గనిర్దేశం చేయడమే కాకుండా అవగాహన కల్పిస్తుంది. https://www.cropdarpan.in/cropdarpan/ పోర్టల్‌లో లింకు ద్వారా ఈ యాప్‌ను స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పత్తి పంటపై మాత్రమే తెలుగు, ఇంగ్లిష్ భాషలలో రూపొందించారు. త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాప్‌లోని ప్రశ్నలను ఎంపిక చేసుకుంటే వాటికి సమాధానాలు, తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. విత్తనాలు ఎప్పుడు వేయాలో, పోషకాలు ఎలా అందించాలో ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. -
‘ఏం జరిగినా కాంగ్రెస్ పాపమే అంటున్నారు’
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ అకాల వర్షంతో నష్టపోయిన రైతులపై లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం సర్వేకు వస్తుందన్నా రాష్ట్ర ప్రభుత్వం కదలడం లేదన్నారు. హైదరాబాద్‌లో ఇల్లు కూలిన వారికి కేవలం రూ. 10వేలు ఇస్తే సరిపోదని, పూర్తిగా కూలిన ఇళ్లకు 2 లక్షల రూపాయలు, పాక్షికంగా కూలిన ఇళ్లకు ఒక లక్ష రూపాయలు చెల్లించాలని ఆయన డిమండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేల రూపాయలు చెల్లించాలన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ నష్టం జరిగినా అది కాంగ్రెస్ పాపమే అంటున్నారని, 6 ఏళ్ల నుంచి మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ చూపిన శ్రద్ధ.. రైతులు, ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆరోపించారు. వర్షాలతో నష్టం ఎక్కడ జరిగిందో అక్కడికి అధికారులు వెంటనే వెళ్లి సర్వే చెయ్యాలని, వారికి న్యాయం చెయ్యాలన్నారు. పంట నష్టం కారణంగా రైతులు ఆందోళనతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని, వెంటనే మేలుకొని ఎకరాకు 20వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేందుకు వారి తరపున ఈ నెల 31న కాంగ్రెస్ పార్టీ ఆధ్యరంలో ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. (చదవండి: బండి సంజయ్‌కు మంత్రి హరీష్ సవాల్) -
పంట నష్టం అంచనాను ప్రారంభించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి : రెండు రాష్ట్రాల్లో కురిసిన ఎడతెరపి లేని వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలగజేశాయి. పంట చేతికందే సమయంలో కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం నేల పాలవడంతో. అన్నదాతలకు ఆవేదనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన పంట నష్టం అంచనాను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు 71,821 హెక్టార్లలో నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. చదవండి: నీటిలో కలిసిన ప్రాణాలు.. కుటుంబాల్లో విషాదం అత్యధికంగా 54,694 హెక్టార్లలో వరి పంట నష్టం జరగగా.. 12 వేల హెక్టార్లలో పత్తిపంటకు నష్టం వాటిల్లింది. అత్యధికంగా గోదావరి జిల్లాల్లో పంటలు నిట మునిగినట్లు అధికారుల గుర్తించారు.తూర్పుగోదావరి జిల్లాలో 29వేల హెక్టార్లలో పంట నష్టపోగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 13,900 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇక కృష్ణా జిల్లాలో 12,466 హెక్టార్లు, విశాఖ జిల్లాలో 4,400 హెక్టార్లలో పంట నష్టం వాటిలినట్లు అధికారులు తెలిపారు. చదవండి: భారీ వర్షం.. కొట్టుకొచ్చిన కొండచిలువ -
కొత్త సాగు చట్టాలు వద్దు
న్యూఢిల్లీ/ఖట్కార్‌కలాన్: కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లులతో రైతాంగానికి తీవ్ర నష్టం తప్పదని పేర్కొంటూ ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా కాంగ్రెస్ సహా వివిధ ప్రతిపక్ష పార్టీలు ఈ ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్నాయి. సోమవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసనకారులు ఓ ట్రాక్టర్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్న పంజాబ్ యూత్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, తెలంగాణ, గుజరాత్, గోవా, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో రైతులు వీధుల్లోకి వచ్చి, నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. బిల్లులను సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పారు. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన కోరారు. తమిళనాడులో జరిగిన నిరసన ప్రదర్శనల్లో ఎండీఎంకే చీఫ్ వైగో, పీసీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, డీఎంకే నేతలు టీఆర్ బాలు, దయానిధి మారన్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలో రైతు సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రజాస్వామ్యం మరణించింది: రాహుల్ ఎన్డీయే ప్రభుత్వం రైతన్నల గొంతులను పార్లమెంట్ లోపల, బయట కర్కశంగా అణచి వేసిందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్‌లో ప్రజాస్వామ్యం మరణించింది అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులు రైతుల పాలిట మరణ శాసనమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ సోమవారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ తేల్చిచెప్పారు. ధాన్య సేకరణ ప్రారంభమైంది కనీస మద్ధతు ధరతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు దేశమంతా ప్రారంభమైందని కేంద్రం తెలిపింది. 48 గంటల్లో హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లోని 390 మంది రైతుల నుంచి రూ. 10.53 కోట్ల విలువైన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని సోమవారం ప్రకటించింది. 2020–21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 495.37 లక్షల టన్నుల వరిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
వ్యవసాయ బిల్లులపై నిరసనలు
చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతన్నలు భగ్గుమన్నారు. తమకు నష్టదాయకమైన ఈ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాలు శుక్రవారం అన్నదాతల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. దేశవ్యాప్త బంద్‌లో భాగంగా రైతులు ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చారు. రహదారులను దిగ్బంధించారు. వ్యవసాయ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ తాము పోరాటం ఆపే ప్రసక్తే లేదని నినదించారు. రైతుల నిరసనలతో పంజాబ్, హరియాణాలో జనం రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. గురువారం ప్రారంభమైన రైలు రోకో రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. రైతులు రైలు పట్టాలపై బైఠాయించారు. వ్యవసాయ బిల్లులపై రైతుల ఉద్యమానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ బంద్‌కు మద్దతునిచ్చాయి. ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ రాష్ట్రంలో పలుచోట్ల రోడ్ల దిగ్బంధం చేపట్టింది. వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బిల్లులతో రైతులను బానిసలుగా మారుస్తారా? అని నిలదీసింది. కనీస మద్దతు ధరను రైతుల నుంచి దూరం చేయడం ఏమిటని ప్రశ్నించింది. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించింది. -
యూరియా కోసం బారులు.. లైన్లో మందు సీసాలు
సాక్షి, కామారెడ్డి : దోమకొండ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు..ఎరువులు తీసుకునేందుకు పడిగాపులు కాశారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే ఓపిక లేకపోవడంతో క్యూ లైన్లో తమ గుర్తుగా వస్తువులు ఉంచారు. చెప్పులు, రాళ్లతో పాటు మందు బాటిళ్లను కూడా లైన్లో ఉంచారు. తాగి పడేసిన మందు సీసాలను లైన్లో పెట్టడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (విక్రయాల్లో విచిత్రాలెన్నో..) -
అలా జరిగితే పదవి వదులుకుంటా: బాలినేని
సాక్షి, ఒంగోలు : విద్యుత్ సంస్కరణల విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని ,లేనిపోని అపోహలు సృష్టించవద్దని ఆ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఉచిత విద్యుత్‌కి ఎటువంటి విఘాతం కలగదని అన్నారు. ఎట్టి పరిస్థితిలో రైతులు డబ్బు కట్టే పరిస్థితి రాదని బాలినేని స్పష్టం చేశారు. రైతులు ఒక్క రూపాయి కట్టే పరిస్థితి వస్తే తన మంత్రి పదవి వదులుకుంటానని తెలిపారు. (రైతుల ఖాతాలోకే విద్యుత్ సబ్సిడీ) మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పధకం ఎట్టి పరిస్థితిలో ఆపే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఆనాడు ఉచిత విద్యుత్ గురించి వైఎస్సార్ మాట్లాడితే ..తీగల మీద బట్టలు ఆరవేసుకోవాల్సిందే అని చంద్రబాబు ఎద్దేవా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాలినేని గుర్తుచేశారు. విద్యుత్ గురించి మాట్లాడితే బషీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలో భాగంగా రైతులకు ,ఉచిత విద్యుత్‌కు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బాలినేని తెలిపారు. రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని అన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే డబ్బులు జమచేసి ఆ బిల్లు డబ్బును డిస్కం ఖాతాలో జమచేయడం ద్వారా రైతులకు ఎటువంటి నష్టం లేదని మంత్రి బాలినేని పేర్కొన్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతన్నల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. ఈ పథకం ద్వారా ఇంతకాలం విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు)కు చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఇక నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ తరువాతే ఆ డబ్బు డిస్కమ్‌లకు చేరుతుంది. ఉచిత విద్యుత్తు ద్వారా వ్యవసాయదారులు ఎంత కరెంట్ వాడుకున్నా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. -
పొలాల్లో ‘వజ్రాల పంట’
తుగ్గలి: వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. పంటలు కళకళలాడుతున్నాయి. వాటితో పాటే వజ్రాలు కూడా తళుక్కుమంటున్నాయి. అదృష్టం రూపంలోదరికి కాసుల పంట పండిస్తున్నాయి. తుగ్గలి మండలంలోని పగిడిరాయి, జొన్నగిరి, చిన్నజొన్నగిరి, రామాపురం, జి.ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, తుగ్గలి, గిరిగెట్ల, చెన్నంపల్లి, బొల్లవానిపల్లి, పి.కొత్తూరు, గిరిజన తండాల్లోని ఎర్రనేలల్లో వజ్రాలు లభ్యమవుతుంటాయి. ఏటా తొలకరి వర్షాలు మొదలైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు దొరుకుతుంటాయి. దీంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్థానికులతో పాటు వివిధ జిల్లాల నుంచి జనం పెద్దసంఖ్యలో వజ్రాన్వేషణకు వస్తుంటారు. ఇలా వచ్చిన వారికే కాకుండా పొలాల్లో పనులు చేసే రైతులు, కూలీలకు కూడా వజ్రాలు దొరుకుతున్నాయి. (అదృష్టం అంటే అతనిదే.. రాత్రికి రాత్రే) ⇔ దీంతో పంట పొలాలకు వెళ్లినప్పుడు ఓ వైపు పని చేసుకుంటూనే..మరోవైపు వజ్రాలపై కూడా నిఘా ఉంచుతున్నారు. ⇔ ఈ ఏడాది ఇప్పటికే రూ.50 లక్షలకు పైగా విలువ చేసే 50కి పైగా వజ్రాలు లభ్యమయ్యాయి. ⇔ దొరుకుతున్న వజ్రాలను జొన్నగిరి, మద్దికెర మండలం పెరవలి, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వ్యాపారులు రహస్యంగా కొనుగోలు చేస్తున్నారు. ⇔ విక్రయదారులకు ధర నచ్చకపోతే టెండర్ పద్ధతిన తీసుకుంటారు. రంగు, జాతితో పాటు క్యారెట్ల రూపంలో లెక్కించి వ్యాపారులు వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. ⇔ రెండు రోజుల క్రితం జొన్నగిరిలో మహిళా కూలీకి దొరికిన వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.6 లక్షల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు సమాచారం. -
అమాంతం పెరిగిపోయిన కౌలు ధరలు..
సొంతూళ్లో పంట భూములను కౌలుకు అప్పగించి చెట్టుకొకరు, పుట్టకొకరుగా పట్టణాలకు పయనమైన వారంతా గ్రామాలకు తిరిగొచ్చారు. కరోనా మహమ్మారి విధించిన లాక్డౌన్ వల్ల ఉపాధి దొరక్క అంతా పల్లెబాట పట్టారు. ఇప్పుడు వారి దృష్టి సేద్యం వైపు మళ్లడంతో జిల్లాలో కౌలు భూములకు డిమాండ్ పెరిగింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది కౌలు ధరలు ఇంతగా పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికిస్తున్న ప్రోత్సాహం ఒక కారణమైతే.. కరోనా దెబ్బకు అన్ని రంగాలూ దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయ పనులు మాత్రం యథావిధిగా సాగుతుండటం మరో కారణంగా కనిపిస్తోంది. జె.పంగులూరు: జిల్లాలో సాగు భూములకు తీవ్ర డిమాండ్ నెలకొంది. కౌలు భూముల కోసం రైతుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత ఏడాదితో పోల్చితే ఎకరాకు కనీసం ఐదు వేల రూపాయల మేర పెరుగుదల కనిపిస్తోంది. భూముల వారీగా ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు కౌలు ఖరారు చేస్తున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు ప్రకృతి అనుకూలిస్తుందన్న భరోసా, పంట ఉత్పత్తులకు మార్కెట్ ధర ఆశాజనకంగా ఉంటుందన్న విశ్వాసం అధిక శాతం మందిని సాగుకు సమాయత్తం చేస్తోంది. ఈ ఏడాది సగటు వర్షపాతానికి మించి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలు రైతుల్లో ఆశావహ దృక్పథానికి దారితీసింది. ఖరారవుతున్న ఒప్పందాలు.. కరోనా మహమ్మారి దెబ్బకు చిన్నాచితకా వ్యాపారాలు కుంటుపడ్డాయి. నిన్నా మొన్నటి వరకు దూర ప్రాంతాలకు వెళ్లి చిన్నపాటి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను నెట్టు కొచ్చిన వారు స్వ గ్రామాలకు చేరుకుంటున్నారు. ప్రైవేటు కంపెనీలు, ఇతర రంగాలలో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడంతో నిరుద్యోగ యువత పొలాల వైపు చూస్తోంది. గడచిన నాలుగు నెలలుగా మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. వ్యాపారాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేకపోవడంతో సొంత భూములున్న రైతులు కౌలుకు ఇవ్వడం మానేసి తామే సాగుకు సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది వరకు నీటి లభ్యత ఉండి వ్యవసాయ బోర్లు ఉన్న భూములకు ఎకరానికి రూ.20వేల నుంచి రూ.25వేల వరకు కౌలు లభించగా ఈ ఏడాది అవే భూములకు ఎకరానికి రూ. 30 నుంచి రూ.35వేల వరకు కౌలు చెల్లించేందుకు రైతులు పోటీ పడుతున్నారు. ఈ పోటీ భూ యజమానులకు కలిసి వస్తోంది. మిర్చి ధరలతో మరింత డిమాండ్.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి పంటకు గిట్టుబాటు ధర రావటం కౌలు ధరలు పెరిగేందుకు కారణమవుతోంది. గత సంవత్సరం సకాలంలో వర్షాలు పడ్డాయి. మిర్చి పంటకు నీరు సంవృద్ధిగా అందింది. ప్రస్తుతం ఎకరా మిర్చి పంట వేసేందుకు కౌలు రూ. 35 వేలు నుంచి 40 వేలు వరకు ఉంది. శనగ సాగు చేసే పొలాలకు ఎకరా కౌలు రూ. 25 నుంచి 30 వేలు పలుకుతోంది. ఈ కౌలు కూడా జూన్, జూలై మాసాలలో ముందుగానే కౌలు చెల్లించాలని భూ యజమానులు షరతు పెడుతున్నారు. శనగ పంటకు గిట్టుబాటు ధర.. ఎన్నడు లేని విధంగా ప్రభుత్వం ఈ సంవత్సరం శనగ పంటకు మంచి గిట్టుబాటు ధర కల్పించింది. దీంతో రైతులు దళారులకు పంట అమ్మకుండా నేరుగా మార్కెట్ యార్డులకు అమ్ముకొని లభాలు బాట పట్టారు. సంవత్సరాల కొద్ది శీతల గిడ్డంగులలో వున్న శనగపంట ఈ సంవత్సరం మొత్తం అమ్ముడుపోయింది. దానితో ఈ సంవత్సరం శనగ పంట వేసేందుకు రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మాగాణికి రూ.30 వేలు.. ఈ సంవత్సరం జిల్లాలో మగాణి పంటలు కళకళలాడాయి. సకాలంలో వర్షాలు పడటం, సాగరు కాలువ నీరు సమృద్ధిగా అందటం, గిట్టుబాటు ధర వుండటంతో కౌలు ధరలు అమాంత పెరిగాయి. -
అవినీతి మరకలేని వారు రైతులొక్కరే..
మరికల్ (నారాయణపేట): దేశంలో అవినీతి మరక లేని వారు ఉన్నారంటే అది రైతులు ఒక్కరేనని ప్రొఫెసర్ హారగోపాల్ అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా మరికల్ శ్రీవాణి పాఠశాల్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోట్ల రూపాలయలను కొల్లగొట్టి దేశం విడిచి పొతున్న అవినీతి రాజకీయ నాయకులకు ఈ ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు మద్దతు ధరలు ప్రకటించాలని కొరితే లాఠీచార్జ్‌లు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోసం చేసిన అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చెసుకుంటున్నా ప్రభుత్వాల నుంచి స్పందన రావడం లేదన్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారో అని అలోచన చేయకుండా రైతులు నూతన పద్ధతి ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టాలన్నారు. సేంద్రియ ఎరువులు వేసి పంటలను పండిస్తే అధిక దిగుబడితో పాటు మంచి లాభాలను ఆర్జించవచ్చన్నారు. నేడు హైబ్రీడ్ విత్తనాలు రావడంతో ఓ పంటల దిగుబడి పూర్తిగా తగ్గిందని, దీంతో అప్పులు రైతులవి ఆదాయం మాత్రం కార్పొరేట్ వారివి అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేసిన హామీలను వెంటనే అమలు చేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసశర్మ, వినితమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట రైతుల ఆత్మహత్య యత్నం
సాక్షి, నిజామాబాద్: తన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలేదనే కోపంతో అబ్దుల్లాపూర్మేట్ ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో పలు జిల్లాలోని రైతులు భూ సమస్యలను తీర్చాలంటూ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే....నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన అంకం గంగాధర్ అనే రైతు చెట్టెక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ సోమవారం కలెక్టరెట్ ముందు బెదిరింపులకు దిగాడు. దీంతో ఓ పోలీసు అధికారి చెట్టెక్కి తాడు లాగి రైతును కిందకు దించారు. కాగా అన్నదమ్ముల మధ్య జరుగుతున్న బోరు సమస్యను దర్పల్లి మండలం ఎమ్మార్వోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రైతు తెలిపాడు. ఇప్పటికైనా బోరు సమస్యను తక్షణమే పరిష్కారించాలని రైతు కోరాడు. బోధన్: ఆర్డీవో కార్యాలయంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యా యత్నం చేసింది. తగ్గెళ్ళి గ్రామానికి చెందిన అబ్బవ్వ అనే మహిళా రైతు తన డిజిటల్ పట్టా పాస్‌బుక్ కోసం ఏడాదిగా బోధన్ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినా వారు పట్టించుకోవడం లేదంటూ ఇవాళ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకుని విచారించగా తన భూమిని ఇతరుల పేరు మీదకు మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది. జనగామ జిల్లా: అలాగే జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం గమ్మడవెల్లి గ్రామానికి చెందిన చెంగిర్ల వెంకటేష్ అనే రైతు ఎకరం భూమిని తన పేరు మీదకు పట్టా చేయడం లేదంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రైతును స్టేషన్‌కు తరలించారు. ఈ మూడు సంఘటనలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. -
ఇది ట్రైలర్ మాత్రమే..
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమే.. సినిమా రావాల్సి ఉంది. అభివృద్ధితోపాటు టెర్రరిజాన్ని సమూలంగా అంతం చేయడం, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం మా ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికలకు ముందు ఏంచెప్పామో అక్షరాలా అదే చేసి చూపిస్తున్నాం. ఈ 100 రోజుల పాలనే ఒక ఉదాహరణ. మాది అవినీతి వ్యతిరేక ప్రభుత్వం. చట్టానికి అతీతమని భావించిన వారంతా ఇప్పుడు జైలుకెళ్లారు (చిదంబరాన్ని ఉద్దేశించి).. – రాంచీ సభలో ప్రధాని మోదీ రాంచీ: బీజేపీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, సినిమా రావాల్సి ఉందని రాంచీలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని మోదీ మరోమారు స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పామో అక్షరాలా అదే చేసి చూపిస్తున్నామనీ, ఈ 100 రోజుల పాలనే ఒక ఉదాహరణ అన్నారు. జార్ఖండ్ కొత్త అసెంబ్లీ భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాంచీలో మాట్లాడారు. తమ ప్రభుత్వ 100 రోజుల పాలన ఒక మచ్చుతునక మాత్రమేనన్నారు. తమ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక ప్రభుత్వమనీ, తాము చట్టానికి అతీతమని భావించిన వారంతా ఇప్పుడు జైలుకెళ్ళారనీ చిదంబరాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మూడు జాతీయ పథకాలను మోదీ జార్ఖండ్ నుంచి ప్రారంభించారు. దేశంలోని గడపగడపకీ రక్షిత మంచి నీరు తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ అన్నారు. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రాధాన్యత అనీ, అందుకే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చామనీ తెలిపారు. కశ్మీర్, లడక్‌ల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశామనీ, అందులో భాగంగానే కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దుచేశామనీ స్పష్టం చేశారు. ఇవన్నీ ఎన్డీఏ–2 వంద రోజుల పాలనలో ఆవిష్కృతమైనవేనని ఆయన గుర్తుచేశారు. రాంచీలో నూతన అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవంతోపాటు ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతు పెన్షన్ స్కీంని మోదీ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆదివాసీ విద్యార్థులకోసం 462 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభోత్సవం చేశారు. వీటితో పాటు నూతన సెక్రటేరియట్ భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు. ► ‘జాతీయ స్థాయి పథకాల ప్రారంభోత్సవానికి జార్ఖండ్ వేదికగా నిలుస్తోంది. గత సెప్టెంబర్ లో సైతం ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ కూడా జార్ఖండ్‌లోని ప్రభాత్ తారా గ్రౌండ్ నుంచే ప్రారంభించాం. ఈ రోజు మూడు జాతీయస్థాయి సంక్షేమ పథకాలను సైతం ఇక్కడి నుంచి ప్రారంభించాం’ అని అన్నారు. ► ‘ఆదివాసీలతో సహా ప్రజలందరికీ సుపరిపాలన అందించడం ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఆయుష్మాన్ భారత్, పీఎం జీవన్ జ్యోతి యోజన, జన్ ధన్ ఎకౌంట్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం ఆరంభించింది’ అని వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని పూర్తిగా నిర్మూలించడంలో జార్ఖండ్ ప్రజలు క్రియాశీలక పాత్ర పోషించాలని మోదీ పిలుపునిచ్చారు. ► ‘మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని ఒక చోటికి సమీకరించి, దేశాన్ని ప్రమాదం నుంచి కాపాడండి’ అంటూ మోదీ ప్రజలకు సూచించారు. కిసాన్ మాన్‌ధన్ యోజన ప్రధాని ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన ద్వారా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు 60 ఏళ్ళు దాటాక నెలకు 3000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే 1,16,183 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నట్టు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ తెలిపారు. స్వరోజ్‌గార్ పెన్షన్ ఇక్కడ నుంచి ప్రారంభించిన మరో రెండు పథకాలు ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్ మన్ధన్ యోజన, స్వరోజ్‌గార్ పెన్షన్ స్కీంలు. వీటి ప్రకారం సైతం 60 ఏళ్ల తరువాత లబ్దిదారులకు ప్రతినెలా 3000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. జార్ఖండ్ అసెంబ్లీ కొత్త భవనం -
రైతన్నకు భరోసా..
సాక్షి, కడప : ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతులను ఆదుకునే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. గత రబీ, ఇప్పుడు ఖరీఫ్ సీజన్లోను ఊరటకలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ సిద్ధిక్ యోజన పేరిట నగదును రైతుల ఖాతాలకు అందజేసింది. ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ మాన్‌ధన్ యోజన కింద పింఛన్ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఉద్యోగులకు ఇతర వర్గాలకు ఇచ్చే పింఛన్ మాదిరిగా రైతులకు కూడా వ్యవసాయం చేయలేక వృద్ధాప్యం మీద పడినప్పుడు కుటుంబ సభ్యుల నుంచి చీదరింపులు ఎదురుకాకుండా ఉండేలా, వారిని ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ఈ పధకాన్ని తీసుకొచ్చింది. ఈనెల 9వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర వ్యవసాయశాఖామంత్రి నరేంద్రసింగ్ తోమర్ దీనిని ప్రారంభించారు. 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించిన రైతులకు 61 ఏట నుంచి నెలకు రూ.3వేలు అందజేస్తారు.18–60 ఏళ్ల మధ్య వయసు ఉండే రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో చేరిన రైతు మధ్యలో కన్నుమూస్తే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తం తోపాటు బోనస్ లేదా వడ్డీ కలిసి నామినీ కూడా పాలసీని కొనసాగించుకునే వెసులుబాటు ఉండడం, ప్రీమియంలో సగం మాత్రమే చెల్లించేలా మార్గదర్శకాలు రూపొందించారు. పాలసీ చేసిన రైతు 61 ఏళ్ల తరువాత చనిపోతే నామినీకి సగం పెన్షన్ రూ.1500 చెల్లించనున్నట్లు ప్రకటించడం విశేషం. చిన్న, సన్నకారు రైతులకే...: ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం పూర్తిగా చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. జిల్లాలో మొత్తం రైతులు 6.30లక్షల మంది ఉండగా ఇందులో చిన్నసన్నకారు రైతులు 3.65లక్షల మంది ఉన్నారు. వీరు మాత్రమే ఈ పథకానికి అర్హులు కానున్నారు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులై ఉండి ఎలాంటి ఉద్యోగం, వ్యాపారం లేకుండా కేవలం వ్యవసాయం మాత్రమే చేస్తున్న వారు ఈ పింఛన్ పథకానికి అర్హులు. ఇందులో చేరిన రైతులు ప్రీమియంలో సగం చెల్లిస్తే మిగతా సగం ప్రభుత్వమే జమ చేస్తుంది. నెల, మూడు, ఆరు నెలల ప్రీమియం చెల్లించేలా వీలు కల్పించారు. ఎల్ఐసీ ఎలా కంతులుగా చెల్లిస్తారో ఈ ప్రీమియం కూడా అలానే చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులు బ్యాంకు ఖాతా ద్వారా ఆటోమేటిక్ డెబిట్ పద్థతిలో జరుగుతుంది. అంతేకాకుండా పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని సైతం ఈ పింఛన్ ప్రీమియం చెల్లింపునకు వినియోగివచుకోవచ్చు. ఒకనెల దాటినా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మరో నెలలో ప్రీమియం చెల్లించవచ్చు. ఇలా మూడుసార్లు వీలుకల్పించారు. ఆరు ప్రీమియంలు వరుసగా చెల్లించకపోతే మాత్రం ప్రభుత్వం చెల్లించే వాటా నిలిచిపోతుంది. నిలిచిపోయిన ఈ పథకాన్ని మూడేళ్ల వరకు తిరిగి కొనసాగించుకోవచ్చు. ఏడాది తరువాత చెల్లింపులు నిలిపివేసి పెన్షన్ పథకం నుంచి తప్పుకుంటే నామ మాత్రపు వడ్డీతో అప్పటి వరకు కట్టిన మొత్తాన్ని రైతుకు చెల్లిస్తారు. ఈ పథకంలో చేరేందుకు రైతులు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని కామన్ సర్వీస్ సెంటర్ల (ఇంటర్నెట్, మీ–సేవా) కు వెళ్లి ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్ ద్వారా సెల్ఫ్‌డిక్లరేషన్ ఇవ్వాలి. నామినీని మధ్యలో మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇది మంచి పథకం...: రైతుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం చాలా బాగుంది. ఉద్యోగులకు, ఇతర వర్గాల వారికి పింఛన్ వస్తుంది. కానీ రైతుకు ఇలాంటివి లేవు. రైతులకు ఎంత వీలైతే అంత చెల్లిస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం కూడా ప్రీమియం చెల్లించడం మంచిదే.–బాలరాజు, రైతు, వెలంవారిపల్లె, వేంపల్లె మండలం. రైతులకు ఆసరా.. రైతులు ఎన్నో విధాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వృద్ధాప్యంలోని రైతులకు ఇది ఒక వరం, ఆసరాగా ఉంటుంది. –పి.బ్రహ్మం, రైతు, గోనమాకులపల్లె, వీరపునాయునిపల్లె మండలం. -
అన్నదాతకు పంట బీమా
ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుం బిగించింది. విపత్తుల సమయంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలు చేపట్టింది. పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేలా బడ్జెట్లో కేటాయింపులు చేసింది. రైతులకు పంటల ధీమాను కల్పించింది. జిల్లాలో 1,86,825 హెక్టార్లలో సాగుచేసే పంటకు బీమా వర్తించనుందన్న వ్యవసాయాధికారుల ప్రకటనలతో రైతులు సంబర పడుతున్నారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం వచ్చిందని... వ్యవ‘సాయం’తో ఆర్థిక కష్టాలు తొలగుతాయని ఆశపడుతున్నారు. సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోంది. అందరికీ అన్నంపెట్టే రైతన్నను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. విపత్తుల సమయంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలకు శ్రీకారం చుట్టింది. రైతులు పంటలు పండించకపోతే పట్టెడు అన్నం కూడా దొరకదని... రైతులకు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ప్రయోజనాలు కల్పిస్తుందని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు పంట బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు. విపత్తుల సమయంలో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. తొలిబడ్జెట్‌లోనే ప్రీమియం చెల్లించేందుకు రూ.1163 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో విజయనగరం జిల్లాలో 1,86,825 హెక్టార్లలో వివిధ రకాల పంటలు పండిస్తున్న రైతులకు ధీమాను కలిగించారు. అయితే, ఆరుతడి పంటలకు జూలై 31, వరి పంటకు ఆగస్టు 15 లోగా పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. జిల్లాలో సాగులో ఉన్న పంటల వివరాలను వ్యవసాయాధికారులు సేకరించారు. ‘ఈ పంట యాప్’లో నమోదుచేయాలి. ఈ ప్రక్రియను వ్యవసాయ ఉన్నతాధికారులు వేగవంతం చేయాలి. గడువులోగా పంటల వివరాలు నమోదు చేయకుంటే రైతుల కు నష్టం తప్పదన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. వ్యవసాయశాఖ ఈ పంట యాప్ తో పాటు గణాంకశాఖ ఆధ్వర్యంలో క్రాప్ బుకింగ్ చేసే పద్ధతి కూడా ఉంది. ఆ వివరా లు ఆధారంగా కూడా ప్రభుత్వం ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. అయి తే, గణాంకశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న క్రాప్ బుకింగ్‌లో అరొకర వివరాలు ఉంటున్నాయని, దీంతో మిగిలిన రైతులు నష్టపోతారన్న వాదన వినిపిస్తోంది. ఉదాహరణకు చీపురుపల్లి నియోజకవర్గంలో 7 వేల హెక్టార్లలో మొక్కజొన్న పండిస్తున్న నేపథ్యంలో గణాంకశాఖ 2 వేల హెక్టార్లులో మాత్రమే పంటను చూపిస్తున్నారు. దీంతో మిగిలిన రైతులకు నష్టం కలగడమే కాకుండా అధికారుల అలసత్వం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. పంటల బీమా గడువు దగ్గర పడుతోంది.... పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించాల్సిన గడువు దగ్గరపడుతోంది. ఆరుతడి పంటలకు జూలై 31లోగా, వరి పంటకు ఆగస్టు 15లోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ‘ఈ పంట యాప్’ ద్వారా వ్యవసాయశాఖ, క్రా>ప్ బుకింగ్ పద్ధతిలో గణాంకశాఖలు పంటల సాగు వివరాలను నమోదు చేయాలి. ఇంతవరకు వ్యవసాయశాఖ ఈ పంట యాప్ అందుబాటులోకి రాలేదు. ఈ పంట యాప్ రాగానే పంటల నమోదును త్వరితగతిన చేపడతాం. – ఎన్.వి.వేణుగోపాల్, సబ్ డివిజినల్ అసిస్టెంట్ డైరెక్టర్, చీపురుపల్లి -
ప్రకాశమంతా పండుగ
సాక్షి, ఒంగోలు: జిల్లా కేంద్రం ఒంగోలులో రాష్ట్ర విద్యుత్, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, అటవీశాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యవసాయం పండుగ అని నిరూపించిన మహానేత రాజశేఖరరెడ్డి అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రారంభమైన పార్టీలో నేతలుగా, కార్యకర్తలుగా ఉన్నందుకు ప్రతి ఒక్కరు గర్వించాలన్నారు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఉచిత విద్యుత్‌పై సంతకం చేసి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా పేరుతో అక్టోబరు 15వ తేదీన రు12500లు రైతులకు అందిస్తున్నారని, అంతే కాకుండా రైతులకు నాణ్యమైన 9గంటల పగటిపూట విద్యుత్, రైతులకు వడ్డీలేని పంట రుణాలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. • యర్రగొండపాలెంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మార్కాపురం రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆయన కేక్‌ను కట్ చేశారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి మంత్రి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌తో కలిసి రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. • ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ వైఎస్సార్ ఉచిత విద్యుత్‌పై తన తొలి సంతకాన్ని పెట్టి ఆ సంతకానికి ఉన్న విలువేంటే రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా చేశారని కొనియాడారు. రైతులకు రుణాల పంపిణీ, వైఎస్సార్ పింఛన్ పథకం అమలు, విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ లాంటి కార్యక్రమాలతో సీఎం జగన్మోహన్రెడ్డి వైఎస్సార్‌కు నిజమైన నివాళులు అర్పించే విధంగా చేశారని అన్నారు. • గిద్దలూరులోని పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. రాచర్ల గేట్ సెంటర్లో వైయస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించడంతోపాటు నగర పంచాయతీ కార్యాలయంలో సామాజిక పెన్షన్లు పంపిణీతోపాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది • దర్శి నియోజకవర్గ ప్రజలు మహానేతను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పించారు. దర్శిలో శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొని పలుచోట్ల వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. • సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వైయస్సార్ జయంతి వేడుకకు సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు హాజరై ఘనంగా జననేతకు నివాళి అర్పించారు. సంతనూతలపాడు, మద్దిపాడులలో జరిగిన కార్యక్రమాలకు హాజరై సామాజిక పెన్షన్లు, బాలికలకు సైకిళ్లు తదితరాలను పంపిణీ చేశారు. • నిగిరిలో జననేత జయంతిని శాసనసభ్యులు బుర్రా మధుసూదన్‌యాదవ్ ప్రారంభించారు. ఎద్దుల బండిపై ఊరేగింపుగా రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరై ఉత్తమ రైతులకు ప్రశంసాపత్రాలు, పంట రుణాల చెక్కులు, నాగలి, పొట్టేళ్లను పంపిణీచేశారు. • మార్కాపురం శాసనసభ్యులు కుందుర్రు నాగార్జునరెడ్డి రైతు దినోత్సవంలో పాల్గొని వైయస్సార్‌కు ఘన నివాళి అర్పించారు. ఉత్తమరైతులను ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలు అందించారు. పలువురు కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను పంపిణీచేయడంతోపాటు పలువురు రైతులకు ట్రాక్టర్లను పంపిణీచేశారు. . • కందుకూరు పార్టీ కార్యాలయంలో శాసనసభ్యుడు, మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులకు వ్యవసాయ పరికరాలు, కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను పంపిణీ చేశారు. జననేత జయంతి కార్యక్రమంలో భాగంగా పేదలకు పట్టాలు పంపిణీతోపాటు పొజిషన్ చూపించారు. • అద్దంకి మార్కెట్‌యార్డులో జరిగిన రైతు దినోత్సవానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గరటయ్య హాజరై వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బల్లికురవ, జె.పంగులూరు, కోరిశపాడు మండలాల్లో జరిగిన కార్యక్రమాలకు యువ నాయకుడు బాచిన కృష్ణచైతన్య పాల్గొన్నారు. • కొండపిలో వైఎస్సార్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయినాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొని సామాజిక పెన్షన్లు పంపిణీచేశారు. • చీరాల గడియార స్తంభం సెంటర్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తోటవారిపాలెంలో పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను ఆమంచి కట్ చేశారు. అనంతరం రైతుదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. • పర్చూరు నియోజకవర్గం కారంచేడులోని దగ్గుబాటి క్యాంప్ కార్యాలయంలో దగ్గుబాటి హితేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పర్చూరు మార్కెట్ యార్డులో జరిగిన రైతు దినోత్సవంలో పాల్గొని ఆయన సామాజిక పెన్షన్ల పంపిణీ చేశారు. వైఎస్ ఆశయాల కొనసాగింపే ఘన నివాళి ఒంగోలు సిటీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను, ఆదర్శాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్ధానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత 70వ జయంతి కార్యక్రమాలను కేకు కోసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు అధ్యక్షత వహించారు. పార్టీ కార్యాలయంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రైతు బాంధవుని జయంతి నాడే రైతు దినోత్సవాన్ని ప్రారంభించామన్నారు. వైఎస్ బాటలోనే జగన్ పయనిస్తారని అన్నారు. రైతులను వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల నుంచి కాపాడేందుకే వ్యవసాయాన్ని పండుగ చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. నెల రోజుల్లోనే రైతులను నిలబెట్టే అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతులకు పగటి పూటే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు అందజేస్తున్నామని అన్నారు. ఉచిత విద్యుత్తు, విత్తనాల సబ్సిడీ, కరెంటు బకాయిల రద్దు, పావలా వడ్డీ, ప్రాజెక్టుల నిర్మాణం , మద్దతు ధరతో వ్యవసాయ ఉత్పత్తులు వంటివి గుర్తు చేసుకున్నప్పుడు వైఎస్సారే గుర్తుకు వస్తారని అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల వ్యవధిలోపే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనే ఎన్నో నిర్ణయాలను అమలు చేశారని వివరించారు. పండించిన ప్రతి ధాన్యం గింజ మీద అది ఎవరు తినాలో దేవుడు రాసి మెడతాడన్నది సామెతగా ప్రస్తావిస్తూ ప్రతి ధాన్యపు గింజను ప్రతి వ్యవసాయ ఉత్పత్తిని పండించే కష్టజీవులైన రైతుల కళ్లల్లో ఆనందం, వారి కుటుంబాల్లో సంతోషాలను నింపేలా జగన్ ప్రభుత్వం ధీమా కల్పిస్తుందని వివరించారు. గ్రామ స్ధాయి నుంచి గ్రామ సచివాలయాల వ్యవస్ధ ద్వారా పేరుకుపోయిన అవినీతిని తొలగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రయత్నానికి దేవుడి దీవెనలు వైఎస్సార్ ఆశీస్సులు ఉంటాయని అన్నారు. జిల్లాలో రైతులకు తొమ్మిది గంటల విద్యుత్తు అందించడం వల్ల ఈ ఏడాది గ్యాప్ ఆయకట్టు లక్షలకు పైగా ఎకరాలు సాగులోకి రానుందని అన్నారు. జగన్ ప్రభుత్వం రైతు బాంధవుని ప్రభుత్వంగా గుర్తింపు పొందిందని, రానున్న రోజుల్లో రైతు కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వ్యవసాయానికి కావాల్సిన అన్ని అంశాల్లోనూ ప్రభుత్వమే అన్నదాతకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఆక్వా ఉత్పత్తులు ఏటా రూ.1400 కోట్లకుపైగా ఉన్నాయని వివరించారు. ఆక్వా రైతుకు సబ్సిడీపై కరెంటు ఇవ్వడం వల్ల ఈ ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. రైతు భరోసా కింద అందిస్తున్న కార్యక్రమాలను వివరించారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. -
రైతు దినోత్సవానికి సర్వం సిద్ధం
సాక్షి, జమ్మలమడుగడు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర రైతు దినోత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతు దినోత్సవ కార్యక్రమాన్ని సొంత జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి నిర్ణయించడంతో సోమవారం పట్టణంలోని ముద్దనూరు రహదారిలో పనులను వేగ వంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే సభాప్రాంగణం పూర్తి చేయడంతోపాటు రైతులకు సంబంధించిన పరికరాల పంపిణీ కోసం, వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకులు సీఎం సభకు భారీగా వస్తారని అంచనాతో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారి జిల్లాకు వస్తుండటంతో భారీగా ప్రజలు, రైతులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అదే స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతులకు, మహిళలకు, ప్రజలకు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేయించారు. వర్షం పడినా సభకు అంతరాయం కలుగకుండ రేకుల షెడ్లతో కూడిన సభావేదికను తీర్చిదిద్దారు. భారీగా బందోబస్తు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు దినోత్సవ సభకు హాజరవుతుండటంతో పాటు జిల్లాలోని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, వ్యవసాయాశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, మిధున్రెడ్డిలతోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు కర్నూల్ జిల్లాలోని బనగానపల్లి, ఆళ్లగడ్డ, అనంతపురం జిల్లా నుంచి తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు సైతం ఈ సభకు హాజరవుతుండటంతో పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
గిట్టుబాటు కాలే..
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్) : పంటలకు కేంద్రం పెంచిన మద్దతు ధరలపై రైతులు పెదవి విరుస్తున్నారు. అరకొరగా పెంచి చేతులు దులుపుకొందని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో రైతాంగానికి కొంత ఊరట లభించినా ఆయా మద్దతు ధరలు రైతులకు ఎంతమాత్రం దక్కుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలోనూ ప్రకటించిన మద్దతు ధరలు రైతుల దరికి చేరకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. నాణ్యత పేరుతో వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధరలకు గండి కొడుతున్నారని వాపోతున్నారు. కేంద్రం నాణ్యత విషయంలో నిబంధనలను కొంత మేరకు సడలింపు చేసినట్లయితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాగు ఖర్చులు కూడా పెరిగాయని, వీటితో పోలిస్తే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు ఎంత మాత్రం గిట్టుబాటుగా లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా విత్తనాలు, డీజిల్, ఎరువులు, పురుగు మందుల ధరలు గణనీయంగా పెరిగాయని వీటితోపాటు కూలీల ఖర్చు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఏ పంటకు ఎంత.. కేంద్రం 2019–20 సంవత్సర కాలానికి సంబంధించి పలు పంట ఉత్పత్తులకు మద్దతు ధరలను పెంచింది. అయితే 2018–19 ఏడాదిలో పెంచిన ధరలతో పోలిస్తే ప్రస్తుతం పెరిగిన ధరలు స్వల్పంగానే ఉన్నాయి. గతేడాది వరికి ఏకంగా క్వింటాకు రూ.200 పెంచగా.. ఈసారి నామమాత్రంగా రూ.65 పెంచింది. ఈ పెంపుతో ప్రస్తుతం క్వింటా ఏ గ్రేడు ధాన్యానికి రూ.1,770 నుంచి రూ.1,835కు మద్దతు ధర చేరింది. కాగా వరికి కనీసంగా క్వింటా ధరను రూ.2 వేలకు వరకు పెంచినా బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. అలాగే పత్తికి గతేడాది క్వింటాకు రూ.1,130 పెంచగా ఈసారి కేవలం రూ.105 మాత్రమే పెంచింది. దీంతో పత్తి మద్దతు ధర క్వింటాకు గరిష్టంగా రూ.5,550కు చేరింది. ఇక జిల్లాలో ప్రధానంగా సాగు చేసే మొక్కజొన్న పంటకు సంబంధించి క్వింటాకు రూ.60 పెంచింది. దీంతో మొక్కజొన్న గరిష్ట ధర రూ.1,760కు చేరింది. మరో ప్రధాన పంట వేరుశనగకు రూ.200 పెంచింది. దీంతో వేరుశనగ గరిష్ట ధర రూ.5,090కి చేరింది. నాణ్యతను సడలిస్తే.. కాగా పంట ఉత్పత్తుల నాణ్యత నిబంధనలను కొంత మేరకు సడలిస్తే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న ఉత్పత్తులకు సంబంధించి తేమ శాతం గుర్తింపులో సడలింపు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పంట దిగుబడులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్దతు ధరలు లభించేలా సంబంధిత మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్యయ ప్రయాసాలకోర్చి పండించిన పంట దిగుబడులను మార్కెట్‌కు తీసుకువస్తే మద్దతు ధర దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ దిక్కు వివిధ కారణాలతో పంట దిగుబడులు తగ్తుండగా.. మద్దతు ధర కూడా దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరలను రైతులకు అందించేలా కృషి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుకు మేలు జరగాలి రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వ మద్దతు ధరలు ఉండాలి. ప్రతి ఏటా సాగు వ్యయం పెరుగుతూ వస్తుంది. అందుకు తగ్గట్టుగానే మద్దతు ధరల పెరుగుదల ఉండాలి. సాగు వ్యయం, మద్దతు ధర మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. పత్తి ధర రూ.6 వేలు, వరి ధాన్యం ధర రూ.2 వేలకు పెంచితే కొంత నయంగా ఉండేది. – వెంకట్‌రెడ్డి, రైతు సంఘం నాయకుడు, మున్ననూర్ -
‘ఇది ప్రగతిశీల బడ్జెట్’
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. కేంద్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. 50 లక్షల మంది రైతులు ఏటా ఆరు వేల రూపాయలు అందుకోబోతున్నారని తెలిపారు. చేపల అభివృద్ధి కోసం నీలి విప్లవం సృష్టిస్తామన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను ఇప్పటికే అమలు చేశామన్నారు. పంట ఖర్చుపై ఇప్పటికే 50 శాతం మద్దతు ధరను ప్రకటించామని జవదేకర్ తెలిపారు. వివిధ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు కూడా పెంచామన్నారు జవదేకర్. అన్ని వర్గాలకు ఉపశమనం కల్పించేలా బడ్జెట్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను 9 శాతం పెంచామని పేర్కొన్నారు. 5 మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించే దిశగా మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. -
సాగు కష్టాలతో పాటు సర్ప భయాలు..
సాక్షి, శ్రీకాకుళం : తొలకరి పలకరించింది. రైతు పొలం బాట పడుతున్నాడు. సాగు కష్టాలతో పాటు సర్ప భయాలు కూడా అన్నదాతను వెంటాడుతుంటాయి. పల్లెల్లో ఇది సర్పాలు బయటకు వచ్చే సమయం. ఎండలు తగ్గి కాసింత చల్లదనం ఉంటే సరి.. పాములు బయటకు వచ్చి సేద తీరడానికి చూస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే రైతులు పాముకాట్లకు గురై ప్రాణాలు కోల్పోతుంటారు. ఆస్పత్రుల్లో పాముకాటు మందులు ఉన్నా చాలా మంది నాటు వైద్యానికి, ఆర్ఎంపీల వద్ద వైద్యానికే వెళ్తుండడంతో ప్రాణనష్టం తప్పడం లేదు. అందుకే సాగు సమయంలో పాములతో కాసింత జాగ్రత్తగా ఉండాలని, కాటు వేశాక తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వానల్లో.. జూన్, జూలై మాసాలు రైతులకు చాలా కీలకం. పొలం పనులు మొదలుపెట్టి రాత్రీ పగలు ఆ గట్ల మీదుగానే తిరగాల్సి ఉంటుంది. ఇలా వెళ్లినప్పుడు, తన పని తాను చేసుకంటున్న సమయాల్లోను పాము కాటుకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. పొలాల గట్లు, రాళ్లు, పుట్టలు వంటి ప్రదేశాల్లో ఉన్న పాములు కూడా ఈ కాలంలో బయటకు వచ్చి సంచరిస్తుంటాయి. రహదారులు, నివాసాల మధ్య కూడా ఈ మధ్య కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటోంది. పాము కాటు బారిన పడిన సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పాము కాటుకు గురికాకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలేమిటి అన్న అంశాలపై చాలా మందికి అవగాహన లేక ప్రాణాలు కోల్పోతున్నారు. సొంతవారికి కన్నీళ్లు మిగుల్చుతున్నారు. పాముకాటు జరిగిన గంటలోపు ప్రభుత్వ ఆస్పత్రికి వెళి తే ప్రాణాపాయం తప్పుతుంది. నాటు వైద్యం జోలికి వెళితే అపాయం కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులైన వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రా మాల్లో తిరిగే కొందరు సంచి (ఆర్ఎంపీ) వైద్యులను నమ్మి మోసపోవడం కంటే ముందే మేలుకుని పాణాలు కాపాడుకోవాలని సూచిస్తున్నారు. నాలుగు జాతులే విషపూరితం మన దేశంలో నాలుగు వందలకు పైగా సర్ప జాతులుండగా వాటిలో కేవలం నాలుగు జాతులు మాత్రమే విషపూరితమైనవిగా జీవావరణ వేత్తలు చెబుతున్నారు. నాగు పాము, పొడ పాము(రక్తపింజరి), కట్లపాము(తుట్ట), సముద్రసర్పాలు. ఇవి కరిస్తే ప్రాణానికి ప్రమాదం ఉంది. మిగిలిన జాతుల మాపులు కరిస్తే ఏమీ కాదంటున్నారు. విష సర్పాల్లో నాగుపాముకు పడగ ఉండగా, కర్త పింజరికి ని లువు చారలు ఉం టాయి. కట్ల పాములో రెండు రకాలుండగా ఇండియన్ క్రైట్ రాత్రి వేళల్లోనే సంచరిస్తుంటాయి. ఈ రకం పా ము అడవులు, కొండ కోనల్లోనే కనిపిస్తాయి. ఇక నలుపు, పసుపు చారలతో ఉంటే గౌరీబెత్తు సైతం విషపూరితమైనదే. కొండల్లోను, పంట పొలాల్లోను కనిపించే కింగ్ కోబ్రా జాతికి చెందిన రాచనాగు, వైరానాగులు అరుదైనవి. రాచనాగుకు రంగులు మార్చే స్వభావం ఉంటుంది. అది నివశించే ప్రాంతాన్ని బట్టి గోధుమ, చింత, మొగలి నాగులని పిలుస్తారు. తెలుపు, పచ్చ రంగుల్లో కనిపించే కొన్ని రకాల పాములు జన్యులోపాలతో పుట్టినట్లుగా చెబుతారు. సూచనలుపాటించాలి ⇔పాము కరవగానే మంత్రాలు, పచ్చిమిరపకాయలు తినిపిస్తారు. ఇవి అసలు చేయకూడదు. ⇔పాముకాటుకు గురైన వ్యక్తిని నడిపించడం మంచిది కాదు. మోసుకుని లేదా ఆటో, ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లాలి. ⇔ఆర్ఎంపీ, సంచి వైద్యుల సలహాలు పాటించి ఇంటి వద్దనే ఉంచవద్దు. జాప్యం చేయడం వల్ల ప్రాణానికే ప్రమాదం జరుగుతుంది. వీలైనంత తొందరగా నిపుణులైన డాక్టర్ వద్దకు చేర్చాలి. ⇔మూఢనమ్మకాలను అసలు నమ్మవద్దు. మంత్రాలు, పసర మందులతో ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. అవగాహనే కీలకం ⇔ఏ పాము కరవగానే భయపడే కంటే ధైర్యంగా ఉండి నాకేమీ కాదన్న నమ్మకాన్ని కలిగించుకోవాలి. ఏ జాతి, ఏ రకం పాము కరచిందో గమనించాలి. ⇔ఏ పాము కాటు వేసిన చోట శుభ్రంగా కడగాలి, విషం శరీరం అంతా ప్రసరణ జరగకుండా చేయాలి. ⇔ఏ పాము కాటేసిన వెంటనే కాటుకు కొంచెం దూరంలో ఏదైనా తాడు వంటి దానితో గట్టిగా కట్టాలి. దీంతో రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తంలో కలిసిన విషం శరీర భాగాల్లోకి వెళ్లకుండా నిరోధించవచ్చు. ⇔ఏ రక్తపింజరి జాతికి చెందిన పాము కాటు వేసిన సందర్భాల్లో చిగుళ్లు, మూత్ర పిండాలు, మూత్రం, మలం నుంచి రక్త స్రావం జరుగుతుంది. ⇔ఏ నాగుపాము, కట్ల పాములు కరిస్తే కళ్లు మూత పడటం, వాపులు రావటం, నోటి నుంచి నురగలు రావడం, మాట్లాడలేని పరిస్థితి ఏర్పడటం వంటి లక్షణాలు ఉంటాయి. ⇔ఏ రాత్రులు పొలాలకు వెళ్లే రైతులు విధిగా టార్చిలైట్, చేతికర్ర వెంట తీసుకుని వెళ్లాలి, కాలిమొత్తం వరకు లుంగీ విడిచిపెట్టాలి, వీలైతే ప్యాంట్ వేసుకుంటే మంచిదే. ⇔ఏ పొలం గట్లపైన నడిచే సందర్భాల్లో చేతికర్రతో ముందు శబ్ధం చేసుకుంటూ అడుగులు వేయాలి. ⇔ఏ ఇంటి పరిసరాల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని లేకుండా చూడాలి. నాటు వైద్యం హానికరం పాము కాటుకు గురైన వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి. విషం విరుగుడుకు అవసరమైన మందులను అన్ని ఆస్పత్రుల్లోను అందుబాటులో ఉంచుతున్నారు. ఏ సమయంలో పాము కాటుకు గురైనా వెంటనే గ్రామాల్లోని ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వారే ఆస్పత్రికి సిఫార్స్ చేస్తారు. ఆస్పత్రిలో అన్ని పరిశీలనలు చేసిన తర్వాత అవసరాన్ని బట్టి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేయడం, సొంత వైద్యం చేయడం, మంత్రాలు, పసర మందుల వల్ల పాము కాటుకు గురైన వ్యక్తికి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. పాముకాటు విషం విరుగుడు మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉంచడం జరిగింది. బాధితులు ప్రభుత్వ ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలి. – రెడ్డి హేమలత, ప్రభుత్వ డాక్టర్, లక్ష్మీనర్సుపేట పీహెచ్సీ, ఎల్.ఎన్.పేట పాముల్ని చంపడం నేరమే కొండ చిలువలు, ఇతర పాముల్ని చంపడం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఉల్లంఘణ కిందకు వ స్తుంది. ఇది పెద్ద నేరమే. ఇలాం టి చర్యలకు పాల్పడేవారికి వైల్డ్‌లైఫ్ చట్టం 1972లో సెక్షన్ 61(1), (2) ప్రకారం రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10వేలు వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కేవలం జరిమానాతో విడిచిపెట్టే అవకాశం లేదు. – జగదీశ్వరరావు, ఫారెస్ట్ రేంజర్, పాలకొండ సెక్షన్ -
రబీ, ఖరీఫ్ కు రూ.3,975.85 కోట్లు
సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం) : 2019 – 20 ఆర్థిక సంవత్సర జిల్లా రుణ ప్రణాళిక ఖరారైంది. జిల్లా లీడ్‌బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలకు సంబంధించి మొత్తం రూ.3,975.85 కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో ప్రస్తుత ఖరీఫ్, రానున్న రబీ సీజన్‌కు సంబంధించి పంట రుణాలు రూ.1,999.42 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. వీటిలో రూ.252.24 కోట్ల రుణాలు రెన్యువల్ చేసినవి ఉన్నాయి. వచ్చే ఆగస్టు నుంచి కొత్త పాసుపుస్తకాలకు కూడా పంట రుణాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 888 గ్రామాల్లో మొత్తం 1,19,115 మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారు. వీటిలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 3,11,627.5 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి రూ.1,999.42 కోట్లు రుణాలు ఇవ్వనుండగా, వ్యవసాయ టర్మ్ లోన్లు రూ.185.85 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం ప్రణాళికలో ఇది 4.67 శాతం. వీటితో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.899.91 కోట్ల మేర రుణాలు ఇవ్వనున్నారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ.3,085.18 కోట్లు ఇచ్చేలా ప్రణాళికలో పొందుపరిచారు. ఇవన్నీ కలిపి మొత్తం రుణాల్లో రూ.77.59 శాతంగా ఉన్నాయి. మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించి రూ.63.51 కోట్లు, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.95.26 కోట్లు, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.158.77 కోట్లు కేటాయించారు. ఇవి కాకుండా విద్యాశాఖకు రూ.153 కోట్లు, గృహరుణాలకు రూ.363.82 కోట్లు, రెన్యువబుల్ ఎనర్జీకి 18.27 కోట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 13.03 కోట్లు ఇచ్చేలా ప్రణాళిక తయారు చేశారు. గత వార్షిక ప్రణాళికలో ఇచ్చింది 55.65 శాతమే... 2018–19 సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం నిర్ధేశించుకున్న వార్షి్క రుణ ప్రణాళిక లక్ష్యంలో 55.65 శాతం మాత్రమే సాధించడం గమనార్హం. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా రూ.3,656.43 కోట్లు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం కాగా, అందులో ఇచ్చింది రూ.1,999.06 కోట్లు మాత్రమే. వీటిలో ఖరీఫ్, రబీకి కలిపి పంట రుణాల లక్ష్యం రూ.1,852.53 కోట్లు కాగా, ఇందులో రూ.922.15 కోట్లు మాత్రమే ఇచ్చారు. నిర్ధేశిత లక్ష్యంలో 49.77 శాతం మాత్రమే జిల్లాలోని అన్ని బ్యాంకులు కలిపి ఇచ్చాయి. ఇక గత సీజన్లో ప్రభుత్వ రంగం బ్యాంకులు మాత్రమే కొంతమేరకు నయం అనిపించాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల లక్ష్యం రూ.1,922.37 కోట్లు కాగా, ఇందులో రూ.1,213.80 కోట్లు రుణాలు ఇచ్చాయి. నిర్ధేశిత లక్ష్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులు 63.14 శాతం సాధించాయి. వీటిలో ఒక్క ఎస్బీఐ మాత్రం 71.08 శాతం ఇచ్చింది. ప్రైవేటు రంగ బ్యాంకులు కేవలం 27.07 శాతం లక్ష్యాన్ని మాత్రమే సాధించాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం వాణిజ్య బ్యాంకులన్నీ (పబ్లిక్, ప్రైవేట్) కలిసి 59.16 శాతం లక్ష్యాన్ని సాధించాయి. ఏపీజీవీబీ, డీసీసీబీ, భద్రాద్రి కో ఆపరేటివ్ బ్యాంకులన్నీ కలిసి 48.18 శాతం లక్ష్యాన్ని సాధించాయి. గత ఏడాది 60 శాతం మంది రైతులకే పట్టాదారు పాసుపుస్తకాలు 2018 – 19 సీజన్లో వివిధ రకాల కారణాలతో నిర్ధేశించుకున్న పంట రుణాల లక్ష్యాన్ని సాధించలేదు. గత ఏడాది 60 శాతం మంది రైతులకే పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయి. అదేవిధంగా రుణమాఫీ ఆశ ఉండడంతో, ఈ రుణాలు వస్తే రుణమాఫీ వర్తించదనే అపోహతో రైతులు రుణాలు క్లియర్ చేయలేదు. ఇక చాలామంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు మ్యాన్యువల్ పట్టాలకు రుణాలు ఇవ్వలేదు. వచ్చే ఆగస్టు నుంచి కొత్త పాసుపుస్తకాలకు రుణాలు అందుతాయి. – పుల్లారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ -
‘ఎర్ర’ బంగారమే...
సాక్షి, ఖమ్మం: వర్షాభావ పరిస్థితులు.. చీడపీడలు.. గణనీయంగా పెరిగిన పెట్టుబడులు.. ఈ క్రమంలో ఎలాగోలా చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో ధర లేని పరిస్థితి. కష్టమైనా.. నష్టమైనా భరిద్దామనే ఉద్దేశంతో పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. ఇప్పుడు ఖరీఫ్ పంట పెట్టుబడికి నగదు అవసరం ఉండడంతో ఆ పంటను మార్కెట్లో అమ్ముతుండగా.. వారం రోజులుగా మిచ్చి పంటకు మంచి ధర పలుకుతోంది. మధిర వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుత సీజన్లో క్వింటాకు రూ.10,500లతో ప్రారంభమైన ధర శుక్రవారం నాటికి రూ.11,700 చేరింది. గత ఖరీఫ్‌లో రైతులు తక్కువ విస్తీర్ణంలో మిర్చి సాగు చేయగా.. ఇప్పుడు ధర మాత్రం బాగానే పలుకుతోంది. దీంతో రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన పంటను అమ్మేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 36 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. వీటిలో 25 లక్షల బస్తాల మిర్చి నిల్వ చేసుకునే అవకాశం ఉంది. గత ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు, చీడపీడలు, వైరస్ ;పట్టడంతో ఆశించిన మేర మిర్చి పంట దిగుబడి రాలేదు. పంట చేతికొచ్చే సమయంలో పెట్టుబడులు, చేసిన అప్పులు తీర్చేందుకు కొందరు రైతులు మొదటి విడత కోసిన మిర్చిని కల్లాల్లోనే అమ్మగా.. మరికొందరు రైతులు తేజరకం క్వింటా మిర్చి రూ.8వేల నుంచి రూ.8,500, లావు రకం రూ.7వేల నుంచి రూ.7,500లకు అమ్మారు. ఇంకొందరు రైతులు ఆ రేటుకు మిర్చి అమ్మితే నష్టపోతామని భావించి కోల్ట్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 లక్షల బస్తాల మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో ఉంచారు. ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి చేస్తుండడంతో డిమాండ్ పెరిగి.. మంచి ధర కూడా పలుకుతోంది. ఇప్పటికే రైతులు 10 లక్షల బస్తాలను విక్రయించగా.. మరో 10 లక్షల బస్తాలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో పంటలకు పెట్టుబడులు పెట్టేందుకు, గత ఏడాది చేసిన అప్పులు తీర్చేందుకు రైతులు మిర్చి పంటను విక్రయించేందుకు సన్నద్ధమయ్యారు. దీనికితోడు గిట్టుబాట ధర కూడా ఉండడంతో పంటను విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రైతుల పంట ఉత్పత్తుల రాకతో మార్కెట్ యార్డు కళకళలాడుతోంది. ముఖ్యంగా తొడిమ తీసిన మిర్చిని 10 కేజీలు, 25 కేజీల ప్యాకింగ్‌తో చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి చేసేందుకు ఆర్డర్లు ఉన్నాయి. మిర్చి పంటకు ఆశాజనకమైన రేటు ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కొనుగోలు కేంద్రాలు తెరచి ధాన్యం కొనడం మరిచారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. రైతు సమస్యలపై చర్చించేందుకు సోమవారం అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులతో కలిసి ఆయన పౌరసరఫరాల కమిషనర్ డి.వరప్రసాద్‌ను కలిశారు. క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతిపత్రమిచ్చారు. మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు తీసుకెళ్లి రైతులే విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారని దీంతో రైతు నష్టపోయి మిల్లర్లు లాభపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర నామమాత్రంగా కూడా రైతుకు దక్కడం లేదని ఫిర్యాదు చేశారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించినా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్తే గోనె సంచులు లేవని అక్కడి సిబ్బంది చెప్పడమే కాకుండా సంచులను మిల్లర్ల వద్ద తెచ్చుకోవాలంటూ సూచిస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యాన్ని మిల్లర్లు నేరుగా కొనుగోలు చేస్తున్నందున బస్తాకు దాదాపు రూ.200 రైతులు నష్టపోతున్నారన్నారు. ఒకవైపు అకాల వర్షాలు మరోవైపు తుపాను వస్తుందనే వార్తలతో రైతులు కలవర పడుతూ చేసేది ఏమీలేక ఎంతో కొంతకు ధాన్యాన్ని తెగనమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని విధిగా కొనుగోలు చేయాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రైతు సంఘం నేతలకు కమిషనర్ హామీ ఇచ్చారు. -
అది రైతులకు అవమానం
బహ్రైచ్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి ప్రియాంకా గాంధీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ అమలు చేస్తున్న పీఎం–కిసాన్ పథకంపై విరుచుకుపడ్డారు. వాస్తవానికి ఈ పథకంతో బీజేపీ రైతులను అవమానిస్తోందన్నారు. ప్రధాని మోదీ గొప్పగా ప్రకటించుకున్నప్పటికీ ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్నది రోజుకు రూ.3.50 మాత్రమే, ఇది ముమ్మాటికి రైతులను అవమానించడమే అని ఆమె అన్నారు. బీజేపీ ఎప్పుడూ జాతీయవాదం గురించి ప్రస్తావిస్తుందనీ, నిజానికి రైతులు, ప్రజల సమస్యలు వినడం, వాటికి పరిష్కారం చూపడమే నిజమైన జాతీయవాదం అని తాను భావిస్తున్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహ్రైచ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సావిత్రిభాయ్ పూలే తరఫున ప్రియాంక ప్రచారం చేశారు. జాతీయవాదం గురించి ప్రధాని పదేపదే తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తుంటారని, ప్రజలు కష్టాలు పరిష్కరించడమే నిజమైన జాతీయవాదంగా తాను భావిస్తానని, స్వోత్కర్షపైనే ఎప్పుడూ మోదీ దృష్టిసారిస్తారనిఅన్నారు. -
2.18 కోట్ల మందికి ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం చేసింది. తాజాగా ప్రకటించిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2.18 కోట్ల మంది రైతులకు రూ. 4,366 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం ఐదెకరాలలోపున్న నిర్దేశిత సన్న చిన్నకారు రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. విడతకు రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా సాగు ఖర్చుల నిమిత్తం కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎన్నికల కోడ్ వచ్చే నాటికి నిధులను విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఎన్నికలు అయ్యాక మిగిలిన రైతులకు కూడా ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో 14.41 లక్షల మందికి ఐదెకరాలలోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఉన్నతాదాయ వర్గాలంతా అనర్హులని పీఎం–కిసాన్ పథకం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వారికి వర్తించదు. తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ తాజా, మాజీ చైర్మన్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రస్తుత, రిటైర్ అయిన ఉద్యోగులు, అధికారులు అనర్హులు. స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అధికారులు కూడా అనర్హులే. 10 వేల రూపాయలకు మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులంతా అనర్హుల జాబితా కిందకే వచ్చారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్‌లు తదితర వృత్తి నిపుణులకు ఈ పథకాన్ని వర్తింపచేయలేదు. దీంతో తెలంగాణలో సన్న, చిన్నకారు రైతులు దాదాపు 47 లక్షల మంది ఉంటే, వారిలో కేవలం 26 లక్షల మంది మాత్రమే పీఎం–కిసాన్ పథకానికి అర్హులయ్యారు. తెలంగాణ లో 14.41 లక్షల మంది రైతులకు రూ.288 కోట్లు విడుదల చేసింది. దేశంలో అత్యధికంగా ఏపీలో 32.15 లక్షల మంది రైతులకు రూ.643 కోట్లు అందజేసింది. ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రంలో 25.58 లక్షల మంది రైతులకు రూ. 511.62 కోట్లు అందజేసింది. అత్యంత తక్కువగా ఛత్తీస్‌గఢ్‌లో 36 మంది రైతులకు రూ.72 వేలు అందజేసింది. -
రైతుబంధే శ్రీరామరక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్కు రైతు బంధు పథకం ఓట్ల వరదాయినిగా మారింది. గంపగుత్తగా ఓట్లు పడేలా ఇది ఉపయోగపడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతు బంధు పథకమే టీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. రైతు బంధుతో లబ్ధి పొందిన అన్నదాతలు అనేక మంది ఆ పార్టీని ఆశీర్వదించి ఊహించని విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ పథకం ఓట్ల వర్షం కురిపిస్తుందని టీఆర్ఎస్ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. దీంతో ఈ పథకంపై పార్టీ శ్రేణులు పెద్దెత్తున ప్రచారం చేస్తున్నాయి. వచ్చే మే నెలలో మరోసారి ఖరీఫ్ పెట్టుబడి సాయం అందుతుందని చెబుతున్నాయి. వచ్చే సీజన్ నుంచి ఎకరానికి రూ.10 వేలు... రైతు బంధు పథకాన్ని ఇతర రాష్ట్రాలే కాక ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించి ప్రశంసించిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం దీని ఆధారంగా పీఎం–కిసాన్ పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టింది. సీజన్ ప్రారంభానికి ముందే సాగు ఖర్చు సహా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి పెట్టుబడి సాయం ఇవ్వడమే దీని లక్ష్యం. ఖరీఫ్, రబీలో ఒక్కో సీజన్‌కు ఎకరాకు రూ.4 వేలు ఇచ్చేలా దీన్ని రూపొందించారు. ఈ ప్రకారం రాష్ట్రంలో 2018–19 ఖరీఫ్‌లో 50.91 లక్షల మంది రైతులకు చెక్కులిచ్చి రూ. 5,256 కోట్లు అందజేశారు. రబీ సీజన్ కింద 43.60 లక్షల మందికి రూ. 4,724 కోట్లు రైతు బంధు సొమ్ము ఇచ్చారు. రెండు సీజన్లు కలిపి దాదాపు రూ. 10 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో చేరాయి. దీంతో రైతులంతా టీఆర్ఎస్కు ఓట్ల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా వచ్చే ఖరీఫ్ నుంచి ఏడాదికి ఎకరాకు ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో రైతుల్లో మరింత ఊపు వచ్చింది. ఇది లోక్‌సభ ఎన్నికల్లోనూ తమకు లాభిస్తుందని అధికార పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. దీంతోపాటు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం–కిసాన్ పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 19.04 లక్షల రైతు కుటుంబాలకు రూ.380.80 కోట్లు బ్యాంకు ఖాతాలకు చేరాయి. ఇంకా 7.25 లక్షల మంది రైతులకు మాత్రం ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత వారికి రూ.145.04 కోట్లు వస్తాయని అంటున్నారు. రెండు విధాలా లాభం జరుగుతుండటంతో రైతులు టీఆర్ఎస్ను ఆశీర్వదిస్తారని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇది కేంద్ర పథకమైనా రాష్ట్ర అధికారుల ద్వారానే వస్తుండటంతో టీఆర్ఎస్కే ప్రయోజనం కలుగనుందన్నది వారి వాదన. ఒకేవైపు కోటి ఓట్లు... రాష్ట్రంలో తాజా లెక్కల మేరకు 2.96 కోట్ల మందికి పైగా ఓటర్లున్నారు. గత ఖరీఫ్‌లో 50.91 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం పొందారు. అంటే భార్యాభర్తలను కలిపి చూసినా రైతు బంధు సాయం అందుకున్నవారివే కోటి ఓట్లు ఉంటాయి. వారి పిల్లలు, వారికి ఓట్లు ఉంటే మరో 25 లక్షల మంది ఉంటారు. అందులో ఇతర పార్టీలకు కొన్ని పోయినా ఒక అంచనా ప్రకారం నికరంగా కోటి ఓట్లు తమకు పడతాయన్నది టీఆర్ఎస్ వర్గాల ఆశాభావం. పైగా రైతు బంధు ద్వారా లబ్ధిపొందినవారిలో 68 శాతం మంది రైతులు ఐదెకరాల్లోపు వారే. వీరిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. పైగా గ్రామీణ ఓటర్లు దాదాపు 40 శాతంపైగా ఉంటారని అంచనా. కాబట్టి 16 లోక్‌సభ సీట్లు కచ్చితంగా తమ ఖాతాలోనే పడతాయని టీఆర్ఎస్ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. -
నెర్రెలు బారిన నేలలో నేలకొరుగుతున్న రైతన్నలు..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఐదేళ్లుగా దుర్భిక్షం తాండవమాడుతోంది. వరుణుడు ముఖం చాటేయడంతో ఏటా సాగు విస్తీర్ణం పడిపోయింది. కొద్దోగొప్పో నీరున్న బోర్లలో కూడా ఏళ్లకు ఏళ్లు చినుకు జాడలేక నీళ్లు పాతాళంలోకి ఇంకిపోయాయి. పంటల సాగు, బోర్ల కోసం చేసిన అప్పులు తడిసిమోపెడయ్యాయి. తమ దుస్థితిని తలచుకుని బయటపడే మార్గం కానరాక రైతన్నల కళ్లు చెమర్చుతున్నాయి. కూలీలతో కలిసి సన్న, చిన్నకారు, పెద్ద రైతులు కూడా బతుకుదెరువు కోసం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెరుగుతున్న వలసలు దయనీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మరోపక్క అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సాగు ఇంత సంక్షోభంలో కూరుకుపోయినా సర్కారు చేష్టలుడిగి చూస్తోంది. కాయలు మంచి ధర పలుకుతున్న సమయంలో రాయలసీమలో బొప్పాయి, బత్తాయి తోటలు నీళ్లు లేక నిలువునా ఎండిపోతున్నాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి దుస్థితే ఉంది. బోర్లు ఇంకిపోవడం, కొత్తవి తవ్వినా నీటి చుక్క జాడ లేకపోవడంతో ఎండిపోతున్న తోటలను చూసి రైతులు పడుతున్న ఆవేదన మాటలకు అందని విధంగా ఉంది. పంటలు కోల్పోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిన సర్కారు విపత్కర పరిస్థితుల్లో మొండిచేయి చూపుతోంది. 2018 ఖరీఫ్, రబీ సీజన్లలో దుర్భిక్షం వల్ల పంటలు కోల్పోయిన రైతులకు నేటికీ నయాపైసా కూడా పెట్టుబడి రాయితీ విదల్చలేదు. గత ఏడాది ఖరీఫ్‌లో 450 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులున్నా 316 మండలాలనే ఆ జాబితాలో చేర్చి చేతులు దులుపుకొంది. ఎక్కడైనా సరే వర్షాభావ పరిస్థితులుంటేనే పంటల సాగు విస్తీర్ణం పడిపోయి పొలాలు బీళ్లుగా మారతాయి. కానీ మన రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయినా వ్యవసాయ రంగం ప్రగతి బాట పట్టిందంటూ సర్కారు ప్రచారం చేసుకుంటోంది. పైర్లు ఎండిపోయి రైతులు నష్టపోతే వ్యవసాయ రంగం బాగుందని చెప్పడంపై నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం కరువును దాచిపెడుతోందని పేర్కొంటున్నారు. ఎటుచూసినా ఎండిన పంటలే... రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనుచూపు మేరలో బీడు భూములు, ఎండిన పైర్లే కనిపిస్తున్నాయి. బొప్పాయి, బత్తాయి, అరటి తదితర పండ్ల తోటలు నీరందక మాడిపోతుండటంతో రైతులు కుమిలిపోతున్నారు. తినడానికి మేత దొరక్క పశువులు బక్కచిక్కిపోతున్నాయి. వాటి అవస్థ చూడలేక కబేళాలకు విక్రయిస్తున్నారు. పాతాళంలో నీళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2,550 గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. 11 నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో ఎద్దడి తీవ్రంగా ఉంది. వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి ఆందోళన రేపుతోంది. గత ఏడాది మార్చి 10వతేదీతో పోల్చితే ఈ ఏడాది అదే తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం 6.59 అడుగులు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఇక రాయలసీమలో సగటున 20.04 అడుగుల మేర భూగర్భ జలమట్టం తగ్గింది. చిత్తూరు జిల్లాలో ఏకంగా 31.20 అడుగుల మేర నీటి జాడ తగ్గడంతో పాతాళానికి పడిపోయాయి. రైతుల బిల్లులు రూ.12,630 కోట్ల పెండింగు విలాసవంతులకు ఉద్దేశించిన అయిదు నక్షత్రాల హోటళ్లకు, విమాన ప్రయాణాలకు రాయితీలు ఇస్తున్న చంద్రబాబు సర్కారు రైతులను వారి ఖర్మకు వదిలేస్తోంది. గత రెండేళ్లలో ప్రకృతి విపత్తుల బారిన పడ్డ వారికి చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ 2018 –19 రబీతో కలిపి చూస్తే రూ. 2800 కోట్లు పైగా బకాయిలు ఉన్నాయి. 2018 –19 ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు కోల్పోయిన రైతులకు నయాపైసా కూడా పెట్టుబడి రాయితీ చెల్లించలేదు. రుణమాఫీకి రెండు విడతల బకాయిలు రూ.8,830 కోట్లు, వ్యవసాయ పరికరాల బిల్లులు రూ.800 కోట్లు, మొక్కజొన్నలకు రూ.200 కోట్లు కలిపి రైతులకే రూ.12,630 కోట్ల బిల్లులను సర్కారు పెండింగులో పెట్టింది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి పెట్టుబడి రాయితీ బకాయిలు రూ.2,350 కోట్లుంది. కానీ ఇది తన హయాంలోకి రాదంటూ చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. మరి ఈ సర్కారు హయాంలో రూ.2800 కోట్లు పైగా పెట్టుబడి రాయితీ చెల్లించకుండా ఎందుకు పెండింగులో పెట్టారని రైతు సంఘాల ప్రతినిధులు నిలదీస్తున్నారు. రూ.లక్షకు పైగా నష్టపోయా... ‘ఎకరం రూ.10 వేల చొప్పున 9 ఎకరాలు కౌలుకు తీసుకుని మొదట వాము పంట వేశా. రూ.40 వేలు పెట్టుబడి పెట్టినా వానల్లేక పంటంతా ఎండిపోయింది. ఆశ చావక మళ్లీ రూ.60 వేల దాకా పెట్టుబడి పెట్టి పప్పుశనగ సాగు చేశా. విత్తినప్పటి నుంచి చినుకు జాడ లేక పైరంతా ఎండిపోయింది. ఎన్నడూ లేని విధంగా కరువు ఉంది. ఈ ఏడాది నయాపైసా ఆదాయం రాలేదు. అప్పులు ఎలా తీర్చాలో దిక్కు తెలియడం లేదు. – రామాంజినేయులు, కౌలు రైతు, గిరిగెట్ల, కర్నూలు జిల్లా రూ. 2,350 కోట్ల పెట్టుబడి రాయితీ ఎగవేత టీడీపీ 2014లో అధికారంలోకి రాగానే అప్పటివరకు రైతులకు చెల్లించాల్సిన రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగ్గొట్టింది. ఈ అన్యాయం చాలదన్నట్లుగా 2014 ఖరీఫ్‌లో రూ.375 కోట్ల పెట్టుబడి రాయితీకి కోత పెట్టింది. ఆ ఏడాది 566 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు కలెక్టర్లు నివేదిక పంపగా ప్రభుత్వం కేవలం 238 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. రైతులకు రూ.1,067.77 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించినా తదుపరి భేటీలో రూ.692.67 కోట్లకు కుదించింది. కుట్రను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ 2015 ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయినా, సాగుచేసిన పంటలు ఎండిపోయినా తొలుత కేవలం 196 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో చివరకు మరో 163 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఇక 2016లో 450కిపైగా దుర్భిక్ష మండలాలున్నప్పటికీ 301 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. 2017 ఖరీఫ్‌లో సాగు 35.92 లక్షల హెక్టార్లకే పరిమితమైనా, చినుకు జాడలేక ఇందులో సగం పంటలు ఎండిపోయినా కరువే లేదని బుకాయించింది. ఇలా ఐదేళ్లలో దుర్భిక్షం తక్కువ చేసి చూపించడం ద్వారా పెట్టుబడి రాయితీ ఎగవేత రూపంలో రైతులకు రూ. 6,550 కోట్లకుపైగా నష్టం కలిగించినట్లేనని స్పష్టమవుతోంది. 2016లో రూ. 600 కోట్ల పెట్టుబడి రాయితీ ఎగవేత కుట్రను ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో మెమోను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. – లేబాక రఘురామిరెడ్డి, సాక్షి, అమరావతి -
తళుకులు కోల్పోతున్న ‘తెల్లబంగారం’
తెల్లబంగారం ఉప్పు ఉత్పత్తిలో ఓ వెలుగు వెలిగిన గోపాలపురం ప్రస్తుతం గత వైభవానికి చిహ్నంగా మిగిలిపోయి కుమిలిపోతోంది. తెల్లదొరల కాలం నుంచి ఉప్పు ఉత్పత్తికి, రవాణా అనుమతులకు కేంద్ర కార్యాలయంగా భాసిల్లిన ఆ పల్లె ఇప్పుడు బతుకుతెరువు కోల్పోయి గోడుమంటోంది. వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆ ఊరు ప్రస్తుతం అటు ఉపాధి లేక.. ఇటు భూములు పనికి రాక దారిద్య్రాన్ని అనుభవిస్తోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించక ముఖం చాటేసింది. కనీసం భూములు సేకరించి పరిహారం ఇస్తారనుకుంటే ఆ ప్రతిపాదనలు ముందుకు కదలించలేదు. ముత్తుకూరు: జిల్లాలోని ముత్తుకూరు మండలంలో తెల్లదొరల పాలనా వైభవానికి, సాధారణ ఉప్పు తయారీ ప్రాభవానికి కేంద్రంగా ఉన్న గోపాలపురంలో సాల్ట్ ఫ్యాక్టరీ దాదాపు మూతపడింది. ఉప్పు ఉత్పత్తి, అమ్మకాలు, రవాణాతో కళకళలాడిన ఆ గ్రామం ప్రగతికి దూరమై బోసిపోయింది. ఉప్పు ఉత్పత్తి లేక లైసెన్సీదారులు చెట్టుకొకరుగా చెదిరిపోయారు. ఊరినే నమ్ముకొన్న లైసెన్సీ సాగుదారులు దారిద్య్ర భారంతో కొట్టుమిట్టాడుతున్నారు. భూములు తీసుకుని పరిహారం ఇస్తారని ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. పరిహారం కళ్ల చూడకుండానే కొందరు కాలం చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో సాధారణ ఉప్పు ఉత్పత్తికి గోపాలపురం పెట్టింది పేరు. 1870లోనే తెల్లదొరల పాలనలో ఇక్కడ ఉప్పు తెల్లబంగారంగా రైతులను ఆదుకుంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని 770 ఎకరాల్లో ఏటా 20 వేల టన్నుల ఉప్పు ఉత్పత్తి జరిగింది. లీజు పద్ధతిలో 110 మంది లైసెన్సీదారులు తరతరాలుగా ఇక్కడ ఉప్పు ఉత్పత్తి చేసి, పడవలు, లారీలు, ఎద్దుల బండ్ల ద్వారా అమ్మకాలు, రవాణా జరిపారు. గోపాలపురం సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలో ఉప్పు ఉత్పత్తి ద్వారా 2,000 మందికి పైగా కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందారు. కరిగిపోయిన ఉప్పు వైభవం సముద్రనీటితో నేరుగా ఉప్పు తయారు చేసి, శుద్ధి చేసే ఫ్యాక్టరీలు నిర్మితం కావడంతో సంప్రదాయ సేద్యం ద్వారా ఉత్పత్తి చేసే ఉప్పునకు మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం మొదలైంది. జిల్లాకే తలమానికంగా ఏర్పడిన కృష్ణపట్నంపోర్టులో ఐరన్‌ఓర్, బొగ్గు ఎగుమతి, దిగుమతులు ఉప్పు ఉత్పత్తికి శాపంగా మారాయి. పోర్టు నుంచి ఎగసిపడే దుమ్ము, ధూళి సాధారణ ఉప్పు ఉత్పత్తి, నాణ్యతను దెబ్బతీశాయి. కయ్యలను కలుషితం చేశాయి. క్రమంగా ఉత్పత్తి, ధరలు పడిపోయి, సాగు విస్తీర్ణం తరిగిపోయింది. 2009తో మొదలై 2012 నాటికి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. పోర్టు విస్తరణకు ఉప్పు భూములు కృష్ణపట్నంపోర్టు విస్తరణకు ఉప్పు భూములు సేకరించే ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. లైసెన్సీదారులకు పరిహారం ఇచ్చి, భూములు సేకరిస్తారన్న ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో లైసెన్సీలు రద్దయ్యాయి. కయ్యలు బీడు పడ్డాయి. ముళ్ల చెట్లతో సాల్ట్ భూములు అడవుల్లా మారాయి. నిల్వ చేసిన ఉప్పు కుప్పలు మట్టిపాలయ్యాయి. నలుగురు జిల్లా కలెక్టర్లు ఇక్కడి పరిస్థితిని పరిశీలించి వెళ్లారు. గోపాలపురం సాల్ట్ కార్యాలయం శిథిలమై, కూలిపోయే దశకు చేరింది. ఒకే ఒక్కడు ఈ కార్యాలయాన్ని సంరక్షిస్తున్నాడు. రెండు సార్లు సీఎంను కలిశారు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, కృష్ణపట్నంపోర్టు చుట్టూ భూముల పరిహారం ఫైళ్లు అనేక మార్లు ప్రయాణం చేశాయి. ఎకరాకు రూ.15 లక్షల పరిహారం నిర్ణయిస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 డిసెంబరు 2వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారం మొత్తం జిల్లా కలెక్టర్ ఖాతాకు జమ చేయాలని పోర్టును సూచించింది. లైసెన్సీదారుల కష్టాలు ఇక్కడ నుంచి మొదలయ్యాయి. పోర్టు నిర్వాహకులు, ఉన్నతాధికారులు, అధికార పార్టీ నాయకుల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగిపోయేలా తిరిగారు. మంత్రి సోమిరెడ్డి ద్వారా సాల్ట్ లైసెన్సీలు ప్రత్యేక వాహనాల్లో వెళ్లి రెండు సార్లు సీఎం చంద్రబాబును కలిసి, తమ గోడు వెళ్లబోసుకొన్నారు. పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వకపోవడంతో లైసెన్సీలు నీరసించిపోయారు. సంపాదనకు దూరమై దారిద్య్రంలో మునిగిపోయారు. ఉప్పు వైభవం ముగిసిపోవడంతో గోపాలపురం కూడా అభివృద్ధికి దూరమై, కళావిహీనమైంది. 14 మంది లైసెన్సీదారులు కాలం చేశారు ఉప్పు ఉత్పత్తిలో పేరుపడిన 14 మంది లైసెన్సీలు తమ భూముల పరిహారం కళ్ల చూడకుండానే కాలం చేశారు. వీరిలో వాడా వేణుగోపాలరెడ్డి, వాడా వెంకటశేషమ్మ, ఈదూరు రామచంద్రారెడ్డి, కలిసెట్టి దామోదరం, బండి శ్రీనివాసులు, ఆలపాక వీరమ్మ, నరహరి సత్యనారాయణ, మోహనరావు, అనిసెట్టి శేషమ్మ, సిద్ధవరపు భాస్కర్‌రెడ్డి, కరణం రాధయ్య, గాలి దామోదరం, మారుబోయిన బాలకోటయ్య, రమణయ్య పరిహారం దక్కకుండానే గతించిపోయారు. తిరిగి తిరిగి అలిసిపోయాం – చేవూరు కృష్ణయ్య, లైసెన్స్‌దారుడు 4 ఎకరాల్లో ఉప్పు సాగు చేశాను. సాగు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితికి గురయ్యాము. పరిహారం కోసం కాళ్లు అరిగిపోయేలా తిరిగాము. అటు నాయకులు, ఇటు అధికారులు సాయం చేయకపోవడంతో దిక్కుతోచక నీరసించిపోయాము. ఉప్పు తప్ప మరో వ్యాపకం లేదు – కలిచేటి సుబ్బారావు, లైసెన్స్‌దారుడు 3 ఎకరాల్లో ఉప్పు సాగును మాత్రమే నమ్ముకొని జీవనం సాగించాము. సాగుకు దూరమై, పరిహారం దక్కని దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించనేలేదు. చాలా మంది లైసెన్సీలు దివంగతులయ్యారు. అయినప్పటికీ పరిహారం మాత్రం దక్కలేదు. దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్నా – కలిచేటి చంద్రశేఖర్, లైసెన్స్‌దారుడు నేను గతంలో 10 ఎకరాలు ఉప్పు సాగు చేసే వాడిని. ప్రస్తుతం ఉప్పు సాగు జరగడం లేదు. భూముల పరిహారం పంపిణీ చేయాలంటూ ప్రభుత్వం మూడేళ్ల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు అందలేదు. లైసెన్సీదారులు చాలా మంది దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్నారు. పరిహారం చెల్లించకపోగా ఉప్పు భూముల్లో నిర్మాణాలు చేస్తున్నారు. -
రైతుల.. నిలువు దోపిడీ
బాల్కొండ: ఎర్రజొన్న రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. వ్యాపారుల మాయాజాలంలో ఘోరంగా మోసపోతున్నారు. మద్దతు ధర కోసం ఓవైపు రైతులు ఉద్యమిస్తుంటే సర్కారు నుంచి స్పందన కరువైంది. ఇదే అదనుగా వ్యాపారులు ధర తెగ్గోసి రైతుల పుట్టి ముంచుతున్నారు. మొన్నటి వరకు ఎర్రజొన్న క్వింటాల్ ధర రూ. 2,100 పలికింది. అయితే, గిట్టుబాటు ధర ప్రకటించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ఉద్యమించడం, ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో వ్యాపారుల ఆగడాలు రెట్టింపయ్యాయి. సర్కారు స్పందించక పోవడాన్ని అలుసుగా తీసుకుని ఇష్టమొచ్చిన ధరలు నిర్ణయిస్తున్నారు. మొన్నటివరకు రూ.2,100 చొప్పున కొనుగోలు చేసిన దళారులు.. ఇప్పుడు ఏకంగా రూ.1,650కి తగ్గించేశారు. పైగా క్వింటాల్‌కు 6 నుంచి 8 కిలోల వరకూ కడ్తా తీసేస్తున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుత సంవత్సరం జొన్న విత్తడం ప్రా రంభం నుంచి విక్రయించే వరకు రైతులకు తిప్ప లు తప్పడం లేదు. ఎర్ర జొన్నలను గతేడాది ప్ర భుత్వం కొనుగోలు చేయడంతో, ప్రస్తుత సంవత్సరం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న ధీమాతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేశారు. కానీ సర్కారు చేతులు ఎత్తివేయడంతో జొన్న రైతులు ఉద్యమ బాట పట్టారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలో ఎర్ర జొన్నలను క్వింటాల్‌కు రూ.2100 చొప్పున వ్యాపారులు కొనుగోళు చే శారు. ఆ తర్వాత వారం వ్యవధిలో ధర తగ్గించేశా రు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1650 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు నిర్ణయించిన ధర కారణంగా రైతులు ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.450 చొప్పున నష్టపోతున్నారు. గతేడాది ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2300 రూపాయాల మద్దతు ధర ప్రకటించింది. ఆ లెక్క ప్రకారమైతే రూ.650 చొప్పున నష్టపోతున్నారు. మరింత తగ్గుతుందని ప్రచారం.. మరోవైపు, ధర మరింత తగ్గుతుందని దళారులు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. క్వింటాల్ ధర రూ.1500 వరకు పడిపోతుందంటూ వ్యాపారులు ప్రచారం చేయిస్తున్నారు. దీంతో రైతులు ఆందోళనతో వచ్చిన ధరకే తెగనమ్ముకుంటున్నారు. తామంతా ఐక్యంగా ఉండాలని, ఎవరు కూడా జొన్నలను విక్రయించవద్దని తొలుత రైతులు నిర్ణయించుకున్నారు. అయితే, రైతుల ఐక్యతను దెబ్బ తీయడానికి మొదట్లో వ్యాపారులు రూ.2100 ధర చెల్లించి కొనుగోళ్లు ప్రారంభించగా, కొందరు పంట విక్రయించుకున్నారు. దీంతో రైతుల ఐక్యతను క్రమంగా దెబ్బతీసిన వ్యాపారులు ఇప్పుడు ధరను తగ్గించేస్తున్నారు. దీంతో ఆందోళన చెందుతున్న రైతులు ప్రభుత్వం స్పందించి ఎర్ర జొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధర తగ్గించేశారు.. ఎర్ర జొన్నలు క్వింటాలుకు 1650 రూపాయాలకు కొనుగోలు చేస్తున్నారు. మొదట్లో 2100 రూపాయాలకు కొనుగోలు చేసిన వ్యాపారులు 15 రోజుల్లో ధరను తగ్గించేశారు. ధర తగ్గించడం, కడ్తా రూపంలో ఆరు కిలోలు తీసేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి. –సతీష్, రైతు, నాగంపేట్ ప్రభుత్వమే ఆదుకోవాలి.. ఎర్ర జొన్నల ధర మరింత తగ్గుతుందని వ్యాపారులు అంటున్నారు. దీంతో వచ్చిన ధరకే పంటను విక్రయించుకుంటున్నాం. ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే రైతులకు మేలు జరిగేది. జొన్న రైతుల గురించి సర్కారు ఆలోచన చేయాలి. ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనాలి. – గణేష్, రైతు, నాగంపేట్ -
అన్నదాతకు ఆసరా..
కాజీపేట: పంటల సాగు కోసం అన్నదాతలకు బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణ పరిమితి పెరగనుం ది. భూమి ఐదెకరాల పైన ఉన్న రైతులకు ఉపయోగకరంగా ఉండేలా రిజర్వు బ్యాంకు నిర్ణ యం తీసుకుంది. ఎలాంటి సెక్యూరిటీ పత్రాలు లేకుండా ప్రతి రైతుకు రూ.1.60 లక్షలు పంట రుణాలు అందించాలన్న నిర్ణయంతో రైతన్నకు కాస్త ఊరట లభించనుంది. ప్రస్తుతం రైతులకు క్రాప్‌లోను కింద రూ.లక్ష వరకు బ్యాంకులు అందిస్తున్నాయి. ఎకరాకు రూ.30వేల చొప్పున ఈ రుణాలు అందుతున్నాయి. అయితే జిల్లాలో ఐదున్నర ఎకరాలు పైబడి ఉన్న రైతులకే పెరిగిన రుణ పరిమితి వర్తించనుంది. ఒకటి, రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు ఇది అంతగా ప్రయోజనం చేకూర్చదు. గతంలో మాదిరిగానే రూ.లక్ష లోపు రుణమే దక్కనుంది. రబీ సీజన్ ప్రారంభమై ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యం లో ఈ నిబంధనలు రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు వర్తించనున్నాయి. 4.76 లక్షల మంది రైతులు.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4.76 లక్షల మంది రైతులుండగా.. ఐదెకరాలలోపు ఉన్న రైతులు 2.82లక్షలు, ఐదున్నర నుంచి ఆరెకరాల వరకున్న రైతులు 72 వేల పైచిలుకు ఉన్నారు. ఇక పది నుంచి 25 ఎకరాలు ఉన్న రైతులు 89 వేల మంది దాకా ఉన్నారు. 25 ఎకరాలకు పైగా ఉన్న రైతులు 33 వేలకు పైగా ఉన్నారు. వీరందరికీ భూమితో సంబంధం లేకుండా ఆర్బీఐ నిర్ణయించిన ప్రకారమే రూ.1.60 లక్షలు రుణం దక్కనుంది. అంటే ఎకరానికి రూ.30 వేల చొప్పున బ్యాంకు రుణం పరిమితికి లోబడి ఇస్తున్నందున ఐదున్నర ఎకరాలు పైబడిన రైతులందరికీ రుణాలు దక్కనున్నాయి. గతంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం పాస్‌పుస్తకాలతో సంబంధం లేకుండానే బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో పాత పాస్పుస్తకాలన్ని బ్యాంకర్ల వద్దనే ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేస్తే పెద్ద ఎత్తున రైతులకు మేలు జరుగనుంది. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మార్గదర్శకాల కోసం ఎదురుచూపు.. పెరిగిన రుణ పరిమితికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. ప్రస్తుతం ఉన్న రుణాలను మాఫీ చేస్తేనే బ్యాంకర్లు కొత్తగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు. గతంలో భూములను మార్టిగేజ్ చేసుకోవడం, పాస్‌పుస్తకాలను పెట్టుకోవడం ద్వారా రుణాలను మంజూరు చేసేవారు. ప్రస్తుతం ధరణి వెబ్సైట్లో రైతులకు భూమి ఎంత ఉందనేది నిర్ధారణ చేసుకున్న అనంతరం పాస్‌పుస్తకాలను చూసి రుణాలను ఇవ్వాల్సి ఉంటుంది. రైతుల నుంచి తనఖా పత్రాలను తీసుకోవడం కానీ, మార్జిగేజ్ చేసేకోవడం కానీ ఇకపై ఉండదు. పాస్‌పుస్తకాలను ధ్రువీకరించుకోవడం కోసమే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆన్లైన్ ద్వారా ధరణి వెబ్సైట్లో రైతుల సమాచారాన్ని, భూముల వివరాలను, సర్వే నంబర్లను చూసి సదరు భూములు రుణాలు పొందే రైతులవేనా అని సరిచూసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. రుణాల పంపిణీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ కూడా రైతులకు ప్రయోజనం చేకూరేలా ఆదేశాలను ఇచ్చింది. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత బ్యాంకర్లు రుణాల విషయమై చర్యలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. బ్యాంకర్లు ముందుకొచ్చేనా..? రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకొని పంటలు సాగు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో మూడెకరాలు ఉన్న రైతులకు రూ.60 నుంచి రూ.90వేల వరకు రుణాలు ఇచ్చేవారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా మూడెకరాల వరకు ఉన్న రైతులకు ఉపయోగపడలేదు. ఐదున్నర ఎకరాలు పైబడిన రైతులకు మాత్రమే రూ.1.60లక్షలు రానున్నాయి. బ్యాంకర్లు ఇస్తున్న రుణాలకు, పెరిగిపోయిన వ్యవసాయ పెట్టుబడులకు తీవ్ర వ్యత్యాసం ఉంటోంది. పంటలు సాగు చేయడానికి కూలీల ఖర్చు, ట్రాక్టర్లు దున్నకానికి, విత్తనాలు, ఎరువులు మొదలుకొని పంటలు కోసి, దిగుబడులను అమ్ముకునే వరకు రైతులకు నష్టం వస్తుందా లేదా లాభం వస్తుందా తేలని పరిస్థితులున్నాయి. లీడ్ బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు మండలాలు, డివిజన్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తే తప్ప బ్యాంకు మేనేజర్లు రుణాలపై ఓ స్పష్టతకు రారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో పెరిగిన రుణాల విషయంలో బ్యాంకర్లు ఏ మేరకు రైతులకు సహకరిస్తారో వేచిచూడాల్సిందే. ఉమ్మడి జిల్లాలో రైతులు 4.76 లక్షలు ఐదెకరాలలోపు ఉన్నవారు 2.82 లక్షలు 5.5 నుంచి ఆరు ఎకరాలు 72 వేలపైన.. పది నుంచి 25 ఎకరాలు.. 89 వేల మంది 25 ఎకరాలకు పైగా కలిగిన వారు 89 వేల మంది -
రైతుకు నోటీసు
మోర్తాడ్(బాల్కొండ): రైతుల ఉద్యమాన్ని నియంత్రించేందుకు పోలీసులు కొత్త అస్త్రం సంధిస్తున్నారు. ఆందోళనల్లో పాల్గొంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న రైతులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. పోలీసుల వైఖరిపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు కోసం పోరాడుతుంటే నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేయడంపై మండి పడుతున్నారు. పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్నారు. మద్దతు ధర కోసం ఆర్మూర్ కేంద్రంగా శాంతియుత నిరసనలు చేపడుతున్నా రు. ధర్నాలు, రాస్తారోకోలు, జాతీయ రహదారు ల దిగ్బంధనంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందు కు యత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఎర్రజొన్నలకు ధర నిర్ణయం తో పాటు కొనుగోలు అంశంపై సర్కారు స్పష్టతనివ్వడం లేదు. దీంతో రైతులు వరుసగా ధర్నాలు, రాస్తారాకోలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ‘మద్దతు’ కరువు.. ఆర్మూర్ డివిజన్లో పసుపు, ఎర్రజొన్నలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఆయా పంటలు పెద్ద విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి పసుపు పండిస్తున్న రైతులకు ఏటా నష్టాలే మిగులుతున్నాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎకరానికి సగటున రూ.40 వేల వరకు రైతులు నష్టపోతున్నారు. మరోవైపు, ఎర్రజొన్నల విషయంలోనూ అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. పండించిన పంటను అమ్ముకునేందుకు ఏటా తిప్పలు పడుతూనే ఉన్నారు. మార్కెట్ మాయాజాలంలో మోసపోతూ ప్రతి సంవత్సరం ఆందోళనలకు దిగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ప్రభుత్వం స్పందించి మద్దతు ధర ప్రకటించడమే కాకుండా కొనుగోలు చేసింది. అయితే, ఈ సంవత్సరం మాత్రం మద్దతు ధరతో కొనుగోలుపై సర్కారు నుంచి స్పందన కరువైంది. వరుస ఆందోళనలు.. ఏటా తలనొప్పిగా మారిన ఎర్రజొన్నలతో పాటు పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని అన్నదాతలు గత నెల రోజులుగా ఉద్యమిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లోని 14 మండలాలకు చెందిన రైతులు ఆర్మూర్ కేంద్రంగా ఆందోళనలు చేపడుతున్నారు. గత నెల 12, 16 తేదీల్లో ఆర్మూర్‌లో బైఠాయించిన రైతులు.. 18వ తేదీన కలెక్టరేట్‌ను ముట్టడించారు. గత నెల 25న జాతీయ రహదారులను దిగ్బంధించి, రోడ్లపై వంటావార్పు నిర్వహించారు. ఆ తర్వాతి హైదరాబాద్‌కు పాదయాత్రగా బయల్దేరారు. అయితే, పోలీసులు వారిని జక్రాన్‌పల్లి శివారులో అడ్డుకుని అరెస్టు చేశారు. పోలీసు తాఖీదులు రైతుల ఉద్యమాన్ని చల్లార్చడానికి పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 14 మండలా ల్లో 144 సెక్షన్ విధించినా అన్నదాతలు మాత్రం ఆందోళనలను ఆపలేదు. పోలీసులు గ్రామాలకు వెళ్లి ధర్నాలకు వెళ్లొద్దని ప్రచారం చేయడంతో పాటు పికెటింగ్ నిర్వహించారు. తాజాగా నోటీసు అస్త్రం సంధించారు. ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటున్న రైతులకు సీఆర్పీసీ 149 సెక్షన్ ప్రకారం ముందస్తు హెచ్చరికగా నోటీసులు జారీ చేస్తున్నా రు. హైవేలు, జనసమ్మర్థం గల ప్రాంతాల్లో ఆందో ళన నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని నోటీసులో పేర్కొన్నారు. మున్ముందు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నోటీసులు అందుకున్న రైతులు ఎలాంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా ఉద్యమానికి నాయక త్వం వహిస్తున్న వారికే ఈ తాఖీదులు జారీ చే స్తుండడం గమనార్హం. మోర్తాడ్, కమ్మర్పల్లి, వే ల్పూర్, ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా, బాల్కొం డ, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, నందిపేట్ తదితర మం డలాల్లోని రైతు నాయకులకు నోటీసులు జారీ చేశారు. ప్రతి గ్రామంలో రైతులను సమన్వయం చేస్తు ఉద్యమానికి ఊతమిస్తున్నట్లుగా గుర్తించిన రైతు నాయకులకు ఈ నోటీసులిచ్చారు. రైతుల్లో ఆందోళన.. ఇప్పటికే గ్రామాలలో పికెటింగ్ నిర్వహిస్తున్న పోలీసులు.. తాజాగా నోటీసులు జారీ చేయడం వల్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంఘ విద్రోహ శక్తులకు జారీ చేయాల్సిన నోటీసులను శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న తమకు జారీ చేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళన కార్యక్రమాలను అడ్డుకోవడంలో భాగంగా ముందస్తు అరెస్టులు చేయడం, గ్రామాలలో పికెటింగ్ నిర్వహించడం, తాజాగా నోటీసులను జారీ చేయడంపై మండిపడుతున్నారు. రైతుల ఐక్యతను దెబ్బ తీసి ఉద్యమాన్ని అణచి వేయడానికే పోలీసులు నోటీసులను జారీ చేస్తున్నారని రైతు నాయకులు విమర్శిస్తున్నారు. పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకరావడం వల్లే నోటీసులు జారీ చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్దతు ధర ప్రకటించాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గుణపాఠం తప్పదు పసుపు, ఎర్రజొన్న రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూస్తోంది. అలా చేస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు. మద్దతు ధర కోసం ఉద్యమం కొనసాగిస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో వెయ్యి మంది వరకు నామినేషన్లు వేసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేస్తాం. రైతులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను విరమించుకోవాలి. – అన్వేష్‌రెడ్డి, రైతు ఉద్యమ నాయకుడు ఎవరికైనా ఇవ్వవచ్చు.. సీఆర్పీసీ 149 సెక్షన్ కింద పోలీసులు ఎవరికైనా నోటీసులు ఇవ్వవచ్చు. ప్రధానంగా సంఘ విద్రోహ శక్తులకు ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తుంటారు. అయితే, రైతులు సంఘ విద్రోహశక్తులు కాదు. ఈ సెక్షన్ కింద వారికి నోటీసులు ఇవ్వకుంటేనే బాగుండేది. పోలీసులకు అధికారం ఉన్నప్పటికీ రైతుల విషయంలో ఆలోచించాల్సింది. రైతుల వరుస ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ఈ సెక్షన్‌ను ఉపయోగించుకున్నారు. – రాజేశ్వర్, న్యాయవాది -
పేద రైతుకే ‘పెట్టుబడి’
సాక్షి, మెదక్: చిన్న, సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేద కర్షకులకు వరంలా మారింది. నిరుపేద రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఈ పథకంతో గుంటభూమి ఉన్నా రైతుకు రూ. 6 వేలు వస్తుండటంతో వారు సంతోషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో గుంట, రెండు గుంటల భూమి ఉన్న వేలాదిమంది పేద రైతులు ఆ పథకాన్ని వదిలేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా 2.20 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 1.95 వేల మంది రైతులకు రూ.148 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా అందించింది. ఇందులో 25 వేల మంది రైతులకు సంబంధించిన భూములు వివిధ సమస్యలు ఉండటంతో పార్ట్(బీ)లో పెట్టినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ రబీ సీజన్లో 1.73 వేల మంది మాత్రమే రైతుబంధును తీసుకోగా ఇందుకోసం రూ. 136 కోట్లను పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఖరీఫ్ సీజన్ నుండి రబీ సీజన్‌తో పోల్చుకుంటే జిల్లావ్యాప్తంగా 5 వేల మంది రైతులు రైతుబంధు పథకాన్ని తీసుకోకుండా తిరస్కరించారు. దీనికి ప్రధాన కారణం ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇవ్వడమే ఈ లెక్కన గుంటభూమి ఉన్న రైతుకు కేవలం రూ. 100 మాత్రమే వచ్చింది. ఇలా ఐదారు గుంటల భూములున్న రైతులు దాదాపు 5వేల మంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను తిరస్కరించారు. జిల్లాలో తక్కువ భూమి ఉన్న రైతులే అధికంగా ఉన్నారు. దీంతో నిరుపేద రైతులకు రైతుబంధు పథకం ఉపయోగ పడడం లేదు. «ఎకరం నుంచి ఆపైన ఉన్న రైతులకు మాత్రమే ఉపయోగ పడుతోంది. ఈ లెక్కన వంద ఎకరాలు గల భూస్వామికి రూ. 4 లక్షలు రాగా ఎకరం భూమి ఉన్న రైతుకు కేవలం రూ. 4 వేలు మాత్రమే వచ్చింది. అదే గుంట భూమి ఉన్న రైతుకు రూ. 100 మాత్రమే చెక్కు రూపంలో వచ్చింది. దీంతో ఐదారు గుంటల భూములున్న రైతులకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది జిల్లాలో లక్షా 7 వేల మందికి లబ్ధి.. జిల్లాలో 1.07 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులుగా తేల్చారు. జిల్లాలో 3.20 లక్షల ఎకరాల భూములు ఉండగా అందులో 1.7లక్షల మంది రైతులు మాత్రమే ఐదెకరాలలోపు భూములు కలిగి ఉన్నారు. ఒక్కో రైతుకు రూ. 6 వేలను మూడు విడతల్లో ఒక్కో విడతకు రూ.2వేల చొప్పున అందిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో విడతకు జిల్లావ్యాప్తంగా రూ. 21.40 కోట్ల చొప్పున మూడు విడతల్లో రూ. 64.20 కోట్లను ఇవ్వనున్నారు. ఇప్పటికే చాలా మంది రైతుల అకౌంట్లలో రూ. 2 వేల చొప్పున వేసినట్లు అధికారులు చెబుతున్నారు. గుంట భూమి ఉన్నా కేంద్ర సాయం గుంట భూమి ఉన్న రైతులు సైతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులే. జిల్లాలోని 5 వేల మంది రైతులకు ఎకరం కన్నా తక్కువ భూమి ఉంది. దీంతో వారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు చెక్కులను తీసుకోలేదు. గుంట భూమి ఉన్న రైతుకు రైతుబంధు కింద రూ. 100 మాత్రమే వస్తుందనే ఉద్దేశంతో తీసుకోలేదు. ఇలాంటి రైతులందరూ వారి పట్టాపాస్‌పుస్తకాలు, బ్యాంకు అకౌంట్లు, ఆధార్ కార్డులు తెచ్చి ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలి. వారందరికీ ఏడాదికి రూ. 6వేల చొప్పున మూడు విడతల్లో డబ్బులు వస్తాయి. చిన్న, సన్నకారు రైతులందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులకు డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు ఇస్తే ఐదు సంవత్సరాల పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రైతు అకౌంట్లకే వస్తాయి. – పరశురాం, జిల్లావ్యవసాయశాఖ అధికారి -
‘రైతులను ఆదుకోవాలి’
హైదరాబాద్: పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేసిన ఆర్మూరు రైతులను నిర్బంధించడం సరికాదని అఖిల భారత కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. పసుపు, ఎర్రజొన్న పంటకు ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. పసుపు, ఎర్రజొన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రజొన్నలకు రూ.3,500, పసుపు క్వింటాల్‌కు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. పత్తి, మిర్చి, కంది పంటలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ 23న రాష్ట్రవాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులతో సమావేశం జరిపి వారు కోరిన న్యాయమైన ధరలకే పంట కొనుగొలు చేయాలని డిమాండ్ చేశారు. -
పసుపు, ఎర్రజొన్న రైతులను ఆదుకోవాలి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిం చి, వారిని ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. మంగళవారం సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో పసుపు, ఎర్రజొన్న ప్రధాన వాణిజ్య పంటలు అయినప్పటికీ అక్కడి రైతుల పంటలను న్యాయమైన ధర చెల్లించి కొనుగోలు చేసే మార్కెట్ వ్యవస్థ లేదని పేర్కొన్నారు. పసుపు శుద్ధికి, అమ్మకానికి నిజామాబాద్‌లో కావాల్సిన సౌకర్యాలు లేవన్నారు. ఎర్రజొన్న మార్కెట్ కొంతమంది వ్యాపారుల చేతుల్లో ఉందని, వారే మార్కెట్‌ను శాసిస్తుండటం వల్ల గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారన్నారు. అందు కే రైతులు గిట్టుబాటుధర కోసం ఆందోళన చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్య లు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఎర్రజొన్నలను క్వింటాల్‌కు రూ.3,500 చొప్పున, పసుపు క్వింటా ల్కు రూ.15 వేల ధర స్థిరీకరించేలా చర్యలు చేపట్టాలని, పసుపు బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నా రు. మార్కెట్ చట్టంలోని సెక్షన్ 11ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. కేంద్రం సూచించినట్లుగా కాంట్రాక్టు వ్యవసాయంలో రైతుల రక్షణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఆందోళన చేస్తున్న రైతులపై, రైతు సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, జైల్లో ఉన్న నాయకులను విడుదల చేయాలని ఆయన కోరారు. -
గిట్టుబాటు ధరకోసం ఉద్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. పసుపునకు క్వింటాలుకు రూ.15 వేలు, ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ.3500 మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. టీజేఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని రైతుల డిమాండ్ మేరకు పసుపు, ఎర్రజొన్న పంటలకు ధరలు పెంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16న రైతులు తలపెట్టిన ఆందోళనకు తాము మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలు కారణంగా పత్తి, మిర్చి, కందులు, జొన్న రైతులు దెబ్బతిన్నారన్నారు. రాష్ట్రంలో మంత్రివర్గం లేకపోవడంతో సమస్యలు నివేదించే పరిస్థితి లేదని చెప్పారు. పంటకు గిట్టుబాటు ధర కోరితే ప్రభుత్వం దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. టీజేఎస్ రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ రైతుల సమస్యలపై గ్రామాలకు వెళ్లి అధ్యయనం చేస్తామన్నారు. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. -
మామిడిని ఆశించే తెగుళ్లకు సేంద్రియ పద్ధతుల్లో నివారణ
బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, మసి తెగులు.. ఇవి మామిడి తోటల్లో కనిపించే ప్రధాన తెగుళ్లు. వీటి నివారణకు సేంద్రియ పద్ధతుల్లో రైతులు అనుసరించదగిన నివారణ చర్యలను సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి. రాజశేఖర్ (83329 45368) ఇలా సూచిస్తున్నారు. బూడిద తెగులు (పౌడరీ మిల్ డ్లూ్య) లక్షణాలు: కాడలపై, పూల మీద, చిరుపిందెల మీద తెల్లని పౌడరు లాంటి బూజు ఏర్పడుతుంది. ఈ బూజు వల్ల పూలు, పిందెలు వడలిపోయి రాలిపోతాయి. పంటకు నష్టం కలుగుతుంది. నివారణ: ∙పూత, మొగ్గలు కనిపించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రాములు ‘నీటిలో కరిగే గంధకా’న్ని కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి ►శొంఠిపాల కషాయం కూడా ఒకసారి పిచికారీ చేయవచ్చు. ఆకుమచ్చ తెగులు లక్షణాలు: ఈ తెగులు కొల్లోటోట్రైకం అనే బూజు (శిలీంధ్రం) వల్ల వస్తుంది. వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు కలిసిపోయి ఆకులు త్వరగా పండుబారి రాలిపోతాయి. లేత రెమ్మలపై నల్లని మచ్చలు ఏర్పడి పూలగుత్తులు, పూలు మాడిపోతాయి. తెగులు సోకిన కాయలపై నల్లటి గుంత మచ్చలు ఏర్పడి కాయలు కుళ్లిపోతాయి. నివారణ: పూత దశకు ముందే ఎండిన కొమ్మలను తీసివేసి వాటిని నాశనం చేయాలి ∙బోర్డో మిశ్రమం 1 శాతం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ చెట్లపై పిచికారీ చేయాలి ∙బాగా పులిసిన పుల్లని మజ్జిగ 6 లీటర్లు + 100 గ్రాముల ఇంగువను 100 లీటర్ల నీటిలో కలిపి చెట్లపై 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మసి తెగులు (సూటీ మోల్డ్) లక్షణాలు: ఈ తెగులు ‘క్యాప్నోడియం’ అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది. రసం పీల్చే తేనెమంచు పురుగు, పిండినల్లి విసర్జించిన తియ్యని పదార్థం ఆకుల మీద పిందెలు, కాయల మీద పడి నల్లటి మసిలా పెరుగుతుంది. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం కలుగుతుంది. కాయ సైజు తగ్గిపోయి, రాలిపోతాయి. నివారణ: రసం పీల్చే పురుగులను 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం ఉపయోగించి అరికట్టాలి. 2 కిలోల గంజి పొడి(స్టార్చి)ని 5 లీటర్ల వేడి నీటిలో కలిపి, దీనికి 100 లీటర్ల నీటిని చేర్చి గంజి ద్రావణం తయారు చేయాలి. గంజి ద్రావణాన్ని మసి తెగులు సోకిన చెట్ల కొమ్మలకు, ఆకులపై కాయలపై బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి. నీమాస్త్రం రసంపీల్చే, ఇతర చిన్న చిన్న పురుగుల నివారణకు నీమాస్త్రం పనికివస్తుంది. 5 కిలోల పచ్చి వేపాకు ముద్ద (బాగా నూరిన) లేదా 5 కిలోల ఎండు ఆకులు లేదా వేప పండ్ల పొడిని 100 లీటర్ల నీటిలో వేయాలి. అందులో 5 లీటర్ల గో మూత్రం, 1 కిలో ఆవు పేడను కలపాలి. తర్వాత ఒక కర్ర సహాయంతో బాగా కలపాలి. 24 గంటల వరకు మూత పెట్టి మురగబెట్టాలి. ఆ తర్వాత గుడ్డతో వడకట్టుకొని, పంటలకు పిచికారీ చేసుకోవాలి. -
నా పంట యాప్ రైతుకు చేదోడు!
రైతులకు తోడ్పడటానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలన్న తపనతో నవీన్ కుమార్ అనే యువకుడు ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన ప్రస్థానం రైతులకు చేదోడుగా నిలుస్తోంది. సకాలంలో సమాచారం సాంకేతిక సలహా అందక పంట నష్టపోవడం, దళారీ వ్యవస్థ వల్ల పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించగలిగితే రైతుల జీవితాల్లో వెలుగులు పూయించవచ్చని నవీన్‌కుమార్ తలపెట్టాడు. ఐఐఐటీ హైద్రాబాద్, ఇక్రిశాట్ నిపుణుల తోడ్పాటుతో ‘నా పంట’ అనే మొబైల్ యాప్‌ను 2017 జూన్‌లో రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోకి గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘నా పంట’ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3,500 మార్కెట్లలో 300 వ్యవసాయోత్పత్తులకు పలుకుతున్న తాజా ధరవరలతోపాటు మూడేళ్లలో వాటి ధరల్లో హెచ్చుతగ్గులను ఈ యాప్ ద్వారా రైతులు తెలుసుకోవచ్చు. ప్రకృతి, సేంద్రియ, రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు అవసరమైన 120 పంటలకు సంబంధించిన ఎరువులు, చీడపీడల యాజమాన్య మెలకువలు, కషాయాలకు సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచారు. పంటల బీమా.. కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు.. యంత్రపరికరాల లీజు సమాచారం, వ్యవసాయ డీలర్ల వివరాలు.. వంటి మొత్తం 16 రకాల సేవలను స్మార్ట్ ఫోన్ ద్వారా నిమిషంలోనే పొందవచ్చని నవీన్ వివరించారు. గ్రామీణ రైతులు ఉపయోగించుకోగలిగేలా తెలుగు భాషలోనే ఆన్లైన్ మార్కెటింగ్, ఈ కామర్స్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభించిన ఏడాదిన్నర కాలంలోనే ఈ యాప్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షా పది వేల మంది రైతులు ఇప్పటికే లబ్ధి పొందుతున్నారని నవీన్(95059 99907) చెబుతున్నారు. బాల వికాస, రెడ్డీ ల్యాబ్స్ వంటి ప్రైవేటు సంస్థలతోపాటు ప్రభుత్వ సంస్థలతోనూ కలిసి పనిచేస్తూ రైతులకు చేరువ అవుతున్నామన్నారు. అనతికాలంలోనే అనేక అవార్డులను అందుకున్న ‘నా పంట’ యాప్‌ను ఉపయోగించుకోగలిగిన రైతులు సాగు వ్యయాన్ని తగ్గించుకోవడానికి, ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. -
పాత(ర) ధాన్యం... పోషకం
‘పాతర’ అనే మాట నేటి తరానికి కొత్తగా అనిపించినా, తరతరాల నుండి వినిపిస్తున్న పాత మాటే. భూమిని తవ్వి అందులో ధాన్యాన్ని లేదా ఏదైనా వస్తువును పెట్టి మళ్లీ మట్టిని కప్పేదాన్ని ‘పాతర’ అని అంటారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటను కళ్లాల్లోకి తెచ్చి నూర్పులు చేస్తారు. ఏడాది పొడుగునా కుటుంబం తినేందుకు సరిపడే ధాన్యం దాచుకునేందుకు, పెళ్లీ, పేరంటాలు, గ్రామదేవతా ఉత్సవాలు వంటి శుభ కార్యాలలో బియ్యం కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తగా పాతర వేసి ధాన్యం నిల్వ ఉంచుకుంటారు. సంక్రాంతి అనంతరం కళ్లాల్లోని ధాన్యలక్ష్మిని పూజించి ఇంటికి తెచ్చి వాటిని పాతర వేస్తారు. అలా మే నెలాఖరు వరకు పాతర్లలో ధాన్యం నిల్వ చేస్తారు. అనంతరం బయటకు తీసిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టి మిల్లు చేస్తారు. ఇలా పాతర వేసిన బియ్యం నాణ్యంగా, ఆరోగ్యకరమైన పోషక విలువలుండేలా, రుచికరంగా ఉంటాయని పాత తరం వారు చెబుతున్నారు. సంక్రాంతి నుండి నెల రోజుల పాటు నిత్యం పాతరను ఆవుపేడతో ఆవుపేడతో అలుకుతారు. ఉదయం, సంధ్యవేళల్లో రంగురంగుల ముగ్గులతో అలకంరించి, వాటిపై గొబ్బెమ్మలు పెట్టి ధాన్యలక్ష్మీ అవతారంగా భావించి దీపారాధన చేస్తారు. పాతర వేయడంలో ఆంతర్యం ఇదే... పాతర ధాన్యం తిన్న పాపలు పుష్టిగా ఉంటారని గ్రామీణ ప్రాంతాల్లో నానుడి ప్రచారంలో ఉంది. ఈ ధాన్యం ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా భూస్వాముల ప్రతిష్టకు గౌరవం తెచ్చేవిగా చెబుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు అధికంగా పూరింట్లో నివాసం ఉండేవారు. జనవరి నెల నుంచి మే, జూన్ నెల వరకు అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇళ్లల్లో దాచిన సమయాల్లో అగ్నికి ఆహుతి కాకుండా ముందస్తు జాగ్రత్తగా ఇళ్ల ముందు గొయ్యి తీసి అందులో ధాన్యం ఉంచడం వల్ల అవి సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. మే నెలలో అధికంగా వివాహాలు, గ్రామదేవత ఉత్సవాలు రోజుల తరబడి నిర్వహించే నేపథ్యంలో ఇంటికి వచ్చిన అతిథులకు, స్నేహితులకు, బంధువులకు మూడు పూటలా భోజనాలు అవసరమైనపక్షంలో వెంటవెంటనే పాతర్ల నుండి అవసరం మేర ధాన్యం తీసి వినియోగించేవారు. అంతేకాకుండా కరువు కాటకాలు ఏర్పడిన సమయంలో పాతర్లలో ధాన్యం వినియోగించేవారు. – మద్దిలి కేశవరావు, సాక్షి, ఇచ్ఛాపురం రూరల్ పాతర ఎత్తును బట్టి... గ్రామాల్లో రైతుల ఇళ్ల ముందు వేసిన పాతర ఎంత ఎత్తులో ఉంటే ఆతను ఎన్ని ఎకరాల భూస్వామిగా అప్పట్లో నిర్ధారించేవారు. అంతేకాదు, సదరు రైతు హుందాకు చిహ్నంగా పాతరను చెప్పవచ్చు. ఆ ఏడాది పొడవునా అన్నదాతగా ఆ రైతుకు గౌర మర్యాదలు దక్కేవి. -
ప్రాజెక్టులు పూర్తయితే రైతుల్లో హర్షం
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే రైతు లు వర్షం కోసం ఆకాశానికి చూడాల్సిన అవసరం ఉండదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం లోటస్‌పాండ్‌లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సుస్థిర వ్యవసాయంపై రాసిన వ్యాసా ల సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే రైతుల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. తెలంగాణలో గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపు ధాన్యం పండిందని తెలిపారు. రైతుల కష్టసుఖాలు తెలిసిన సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ రెండు పథకాలు ప్రపంచ గుర్తిం పు పొందాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతతో విదేశాల్లో ఉన్న యువకులు కూడా ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. త్వరలో లక్షా 25 వేల ఎకరాల్లో రెండు పం టలకు సాగునీరు అందించబోతున్నామని తెలిపారు. రమేశ్ ఈ పుస్తకంలో చేసిన సలహాలు, సూచనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పా రు. వ్యవసాయం సుస్థిరంగా సాగాలంటే పర్యావరణ సహకారం అవసరమని పుస్తక రచయిత చెన్నమనేని రమేష్ అభిప్రాయపడ్డారు. సుస్థిర వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, రైతుసమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్‌కల్లం, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
‘పీఎం–కిసాన్’ లబ్ధిదారుల్ని గుర్తించండి
న్యూఢిల్లీ: పీఎం–కిసాన్ పథకం కింద తొలి విడతలో రూ.2 వేలు పొందే చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ పథకానికి ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 కోట్ల మంది రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని అంచనా. ఈశాన్య రాష్ట్రాల్లో మినహా ఈ రైతు ప్యాకేజీ అమలులో పెద్దగా ఇబ్బందులేమీ రావని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. సాగుకు పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ చాలా రోజులుగా కసరత్తు చేస్తోందని, అదే ఉత్సాహంతో ఈ పథకాన్ని అమలుచేస్తామని తెలిపారు. రూపకల్పన కన్నా అమలుపరచడమే ఇందులో ప్రధానమని, చిన్న, సన్నకారు రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను తాజా బడ్జెట్ ప్రతిబింబిస్తోందని అన్నారు. లబ్ధిదారుల్ని గుర్తించే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, వ్యవసాయ కార్యదర్శులకు ఈ నెల 1న లేఖలు పంపారని వెల్లడించారు. లబ్ధిదారుల పేరు, కులం తదితర వివరాల్ని సేకరించి స్థానిక గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ఉంచాలని లేఖలో సూచించారు. చాలా రాష్ట్రాల్లో భూ దస్త్రాల డిజిటలీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఫిబ్రవరి ఒకటి నాటికి భూ రికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే పీఎం–కిసాన్ పథకానికి అర్హులని రాజీవ్ కుమార్ తెలిపారు. ఏడాదికి రూ.6 వేలు అంటే చిన్న మొత్తమేమీ కాదని, ఆ డబ్బుతో పేద రైతులు ఎన్నో ఖర్చులు వెళ్లదీసుకోవచ్చని అన్నారు. చిక్కులు తప్పవు: నిపుణులు పథకం అమలులో న్యాయపర చిక్కులు తప్పవని వ్యవసాయ నిపుణుల విశ్లేషణ. యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ పథకానికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయని సీనియర్ న్యాయవాది ఎన్కే పొద్దార్ పేర్కొన్నారు. ఒకే సాగు భూమికి ఒకరి కన్నా ఎక్కువ మంది యజమానులు ఉండి, వారందరికీ రూ.6 వేల చొప్పున సాయం అందితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ పథకం కింద వెచ్చించే కోట్లాది రూపాయలు అనుత్పాదక వినియోగంలోకి వెళ్తాయని ఆర్థిక నిపుణుడు శశికాంత్ సిన్హా అన్నారు. -
బ్యాంకుల చుట్టూ రైతన్నలు..రైతుబంధు సాయానికి కొర్రీలు.!
సాక్షి, కమాన్‌పూర్: రైతులకు పంట పెట్టుబడి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రబీ సాగుకోసం ఎకరాకు రూ. 4 వేలు చెల్లిస్తుంది. ఖరీఫ్ సాగుకు మొదటి విడతలో రైతులకు ప్రభుత్వం నేరుగా చెక్కుల రూపంలో అందజేసింది. రబీసాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అంత సిద్ధం చేసింది కాని ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పెట్టుబడి సాయం రైతులకు నేరుగా ఇవ్వరాదని, నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేయాలని ఎన్నికల కమిషన్ అదేశాలు జారీ చేసింది. పెట్టుబడి సహయాన్ని బ్యాంకు అధికారులు రైతులను ఏలాంటి ఇబ్బందులు పెట్టకుండా నేరుగా రైతులకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల పంట పెట్టుబడి సహయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. డబ్బులు తీసుకునేందుకు బ్యాంకు వెళ్లిన రైతులకు బ్యాంకు సిబ్బంది లేని పోని కొర్రీలు పెడుతున్నారు. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ చేసుకోలేదని డబ్బులు తీసుకోకుండా ఖాతాలోని డబ్బులను హోల్డ్( తాత్కాలికంగా నిలిపివేత)లో పెట్టడంతో రైతుల చేతికి డబ్బులు రాకపోవడంతో బ్యాంకు చుట్టు తిరుగుతున్నారు. రబీసాగు ప్రారంభం కావడంతో పెట్టుబడి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో పది రెవెన్యూ గ్రామాల పరిధిలో 4048 మంది రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం రైతులు వ్యవసాయాధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందించారు. వ్యవసాయశాఖ అధికారులు దరఖాస్తులను ఆన్లైన్ చే యడంతో రైతులకు నేరుగా డబ్బులను మండల కేంద్రంలోని ఎస్బీఐ. కేడీసీసీలతో పాటు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. డబ్బులు జమ కావడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డబ్బులు తీసుకోవడానికి కమాన్‌పూర్ ఎస్బీఐ బ్యాంకు వెళ్లి విత్ డ్రా చేద్దామనుకుంటే డబ్బులు హోల్డ్ చేశామని చెప్పడంతో ఇందేందని బ్యాంకులోని ఫీల్డ్ ఆఫీసర్ వద్దకు వెళ్లీ వివరాలు అడిగితే పంట రుణాలను రెన్యూవల్ చేసుకోలేదు అందుకు ఖాతాలోని డబ్బులను హోల్డ్ చేశామని అనడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. గిదేంది ప్రభుత్వం రైతులు నేరుగా బ్యాంకులకు వెళ్లీ పెట్టుబడి సహయాన్ని తీసుకోండి అని అంటుంటే మీరు ఇలా అంటున్నారేంటి అంటే సదురు బ్యాంకు అధికారులు రైతులకు సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రబీసాగు మొదలైంది. నారుమడి దున్ని నారుపోసుకునేందుకు డబ్బులు తీసుకునేందుకు వస్తే బ్యాంకు అధికారుల తీరుతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయంపై బ్యాంకు మేనేజర్‌ను వివరణ కోరగా రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలను రెన్యూవల్ చేసుకోకపోవడంతో ఆటోమేటిక్‌గా రైతుల ఖాతాలోని డబ్బులు హోల్డ్ చేస్తున్నారని వివరణ ఇచ్చారు. -
పట్టాలివ్వలేదని ఓట్ల బహిష్కరణ
సాక్షి, గార(ఇల్లందు): మండలంలోని వేదనాయకపురం గ్రామ రైతులు తమ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వడం లేదని, ఓటు వేయమని 4 గంటల పాటు రోడ్డు బైఠాయించి ఓటును బహిష్కరించారు. సమాచారం తెలసుసుకున్న తహసీల్దార్ కృష్ణ, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామానికి చేరుకుని ఓట్లు వేయాలని కోరారు. దీంతో రైతులు మాట్లాడుతూ.. 100 సంవత్సరాల క్రితం బిషఫ్ హజారయ్య దగ్గర తమ ముత్తాతలు భూములు కొను గోలు చేసి సేద్యం చేసుకుంటున్నామని, పలుమార్లు రెవెన్యూ అధికారులకు భూములు పట్టాలు చేయాల ని విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఓట్ల బహిష్కరణకు సిద్ధమయ్యామని తెలిపారు. పాస్‌పుస్తకాలు లేకపోవడంతో రైతుబంధు డబ్బులు రాలేదని వాపోయారు. రైతుల భూములకు పట్టాలు ఇప్పించేందుకు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి కృషి చేస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో సుమారు 168 మంది ఓటర్లు ఓటు వేసేందుకు కదిలారు. -
రైతన్న కష్టాలు..సబ్సిడీ కోసం
సాక్షి, ధర్మవరం: ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మేలు చేసేందుకు సంక్షేమ పథకాలన అమలు చేస్తుంది. కానీ ధర్మవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ప్రతి పథకాన్నీ తమ రాజకీయ అవసరాలకు డుకుంటున్నారు. లబ్ధిదారులకు పచ్చ కండువాలు కప్పి తమవారిగా చేసుకున్న తర్వాతే సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు. భార్యా భర్తల మధ్య తగవైనా.. అన్నాదమ్ముల మధ్య నెలకొన్న వివాదమైనా..చంద్రన్న బీమా అయినా.. చేపల చెరువు అయినా ఏదైనా కండువా కప్పుకుంటేనే న్యాయం జరుగుతుంది.. లేకపోతేఏడ్చి గగ్గోలు పెట్టినా ఎవరూ పట్టించుకోరు. నాపేరు కృష్ణయ్య. ముదిగుబ్బ మండలం నల్లచెర్లోపల్లి. నేను బోరువద్ద రెండు ఎకరాల్లో టమాట పంట పెట్టుకున్నా. ఉద్యానశాఖ ప్రోత్సాహకం కింద అందించే డబ్బుకోసం బిల్లు పెడితే ఇయ్యలేదు. ఎంపీఈఓ ఫొటో తీసుకెళ్లినా నాకు బిల్లు రాలేదు. ఎందుకని అడిగితే ‘‘మీరు వైఎస్సార్ సీపీ వాళ్లు అందుకని బిల్లు పెట్టనివ్వం’’ అని ఇక్కడి టీడీపీ నేతలు చెబుతున్నారు. చీనీ చెట్లకు బిల్లు పెట్టుకున్నా.. అదీ అంతే. నేను పదేళ్ల కిందట చీనీ మొక్కలు నాటినా బిల్లు ఇయ్యలేదు. సంవత్సరం కూడా కాని చెట్లకేమో బిల్లులిస్తున్నారు. సొసైటీలో రూ.6 వేలు డీడీ కట్టినా.. ఇంతవరకూ రూపాయి కూడా గతిలేదు. చివరకు ఊరంతా సీసీరోడ్లు వేసినా.. మా సందులో మాత్రం ఎయ్యలేదు. వైఎస్సార్సీపీ వాళ్లమంటూ నానా ఇబ్బందులు పెడుతున్నారు.’’ప్రభుత్వ తీరు.. అధికార పార్టీ నేతల ఆగడాలపై ఓ రైతు నిస్సహాయత ఇదీ. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో బాధిత రైతును గుర్తించిన ‘సాక్షి’ లోతైన విశ్లేషణ చేయగా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘అన్న చెప్పాడు.. మీ వానికి చంద్రన్న బీమా రావాలంటే పార్టీలో చేరాలంట.. లేకపోతే బీమా ఇయ్యరు. పార్టీలోకి చేరతారో..? బీమా మొత్తం పోగొట్టుకుంటారో...? మీ ఇష్టం..’’ ఇటీవల రోడ్డు ప్రమాదంలో బిడ్డను కోల్పోయి చంద్రన్న బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన మృతుని కుటుంబ సభ్యులకు అధికారపార్టీ నాయకులు జారీ చేసిన హుకుం ఇది. ‘‘మీ భూములను హౌసింగ్‌కు తీసుకుంటారంట..నీవు వచ్చి అన్నను కలిస్తే.. నీకు న్యాయం జరగుతుంది..లేకపోతే అంతే.. నీకు పింఛన్ వచ్చింది.. అన్న దగ్గరకు వచ్చిపో.. నీకు ఇళ్లు ఇప్పిస్తాం.. ఒకసారి ఆఫీస్ దగ్గరికి వస్తే చాలు’’ –ధర్మవరం నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాలకు ఎంపికైన లబ్ధిదారులను అధికారపార్టీ నేతలు చేస్తున్న ఒత్తిళ్లు..ఇవి ధర్మవరం: నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల దాష్టీకానికి లబ్ధిదారులు పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు ఎంపికైన లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరుతాపుతున్నారు. ఏ సంక్షేమ పథకానికైనా తమకు తెలియకుండా లబ్ధిదారులను ఎంపిక చేయవద్దనీ, ఒక వేళ అలా ఎంపిక చేసినా తమకు చెప్పకుండా పథకం వర్తింపచేయవద్దని అధికార పార్టీ నేతలు అధికారులను ఆదేశిస్తున్నారు. వారు చెప్పిట్లు వినేవారికి మాత్రమే పథకాలు అందేలా చూస్తారు. ముఖ్యంగా «పింఛన్లు, హౌసింగ్, చంద్రన్నబీమా, రేషన్ కార్డులు, చినీచెట్ల బిల్లులు ఇలా అన్ని సంక్షేమ పథకాలు అందాలంటే పచ్చకండువా కప్పుకోవడం ఆయా లబ్ధిదారులకు తప్పని సరైంది. కాదు..కూడదంటే నిర్ధాక్షిణ్యంగా సంక్షేమ పథకాలను వారికి దూరం చేస్తున్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు ఇలా.. బత్తలపల్లి మండలంలో వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలంటే తప్పనిసరిగా అధికారపార్టీలోకి చేరాలని హుకుం జారీ చేశారు. అందుకు అంగీకరించని వారి దరఖాస్తులను అధికారుల చేత తిరస్కరింపజేశారు.ఇక ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో పండ్ల చెట్లకు సంబంధించిన బిల్లులు చెల్లించాలంటే తప్పని సరిగా అధికారపార్టీ కండువా కప్పుకోవాలని లేకపోతే లేదని తేల్చిచెప్పారు. అయితే వారి ఒత్తిళ్లలకు తలొగ్గనివారికి నేటికీ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. గతంలో వారు వీరు అన్న తేడాలేకుండా..అందరికీ ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు అందేవి. కానీ నేడు ఇలా వ్యవహరించడం పట్ల నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బత్తలపల్లి మండలం జ్వాలాపురం గ్రామం. ఈమెకు 189 సర్వే నంబర్లో ఐదు ఎకరాల భూమి ఉంది. ఐదు సంవత్సరాల క్రితం పొలంలో 356 మామిడి మొక్కలు నాటుకున్నారు. ఉపాధి పథకం కింద వీటిని సాగు చేశారు. ఇందుకు గాను మూడు సంవత్సరాల్లో రూ.7.30 లక్షలు బిల్లు కావాల్సి ఉంది. అయితే రూ.1.25 లక్షలు మాత్రమే బిల్లు చేసి ఉపాధి సిబ్బంది చేతులు దులుపేసుకున్నారు. మిగిలిన బిల్లులు చేయమంటే ‘‘మీరు వైఎస్సార్సీపీ మద్దతుదారులు..మీకు బిల్లులు చేయడం ఇబ్బందిగా ఉంది’’ అని చెబుతున్నారని బాధితురాలు వాపోతోంది. వీరితో పాటు చెట్లు నాటుకున్న రైతులకు మాత్రం మొత్తం బిల్లులు ఇవ్వడం గమనార్హం. - మహిళా రైతు పేరు ఉమ్మడి ఆదిశేషమ్మ. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు. మండల కేంద్రమైన బత్తలపల్లిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు కింద నిధులతో జనసంచారం లేని ప్రాంతాల్లో సైతం సిమెంట్ రోడ్లు వేసి నిధులు దిగమింగిన అధికార పార్టీ నేతలు...తమ కాలనీలో మాత్రం రోడ్లు వేయడం లేదని వాపోతున్నారు. తాము వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నామన్న కారణంగా తమ వీధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. -సాకే లక్ష్మన్న,ధర్మవరం బత్తలపల్లి మండలం ఎం.చెర్లోపల్లి గ్రామం. ఈయన గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులుగా వ్యవహరిస్తున్నారు. ఒక హెక్టారులో అరటి పంటను సాగు చేశారు. ఈయనతో పాటు నారాయణరెడ్డి, నాగేంద్రమ్మలు సైతం అరటి పంటను సాగు చేశారు. ఇందుకుగాను ప్రభుత్వం హార్టికల్చర్ కింద హెక్టారుకు రూ.30,800 చెల్లిస్తుంది. ఈ డబ్బులు ఇవ్వకుండా గ్రామానికి చెందిన జన్మభూమి కమిటి సభ్యులు, ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ పేరు చెప్పి బిల్లులు చేయకుండా అడ్డుకున్నారు. అదేమని హార్టికల్చర్ అధికారులను అడిగితే ‘‘మీకు బిల్లులు చేయవద్దని ఒత్తిడి తీసుకువస్తున్నారు’’ అని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. - గుమ్మడి అనంతరెడ్డి. పిన్నదరి గ్రామానికి చెందిన ఈయన... సర్వేనంబర్ 374లో 4.8 ఎకరాల్లో 330 చీనీచెట్లు సాగు చేశాడు. మొక్క రూ.70 ప్రకారం కొని, మొక్కలు నాటడానికి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. పండ్లతోటల సాగుచేసే రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే మహేష్ వైఎస్సార్ సీపీ మద్దతుదారుడని అధికారులకు చెప్పిన టీడీపీ నాయకులు ఆయన దరఖాస్తును పక్కన పెట్టించారు. దీంతో రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. -రైతు టీ.మహేష్. తాడిమర్రి మండలంలోని నార్శింపల్లి స్వగ్రామం. నాలుగేళ్ల కిత్రం సర్వేనంబర్ 284లోని 4.20 ఎకరాల పొలంలో డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ పథకం ద్వారా 294 మామిడి మొక్కలు నాటాడు. మొక్కలను సంరక్షించడానికి (వాచ్ అండ్ వాటర్) నెలకు రూ.10 వేలు ఏడాది పాటు ఇచ్చారు. రామకృష్ణచౌదరి వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో పాల్గొంటుడటంతో టీడీపీ నాయకులు ఆయన బిల్లులు నిలిపారు. ఇప్పటికి రూ.4 లక్షల వరకు బిల్లులు అందాల్సి ఉందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -ఎం.రామకృష్ణచౌదరి, తాడిమర్రి మండలం కండువా కప్పుకుంటేనే బిల్లిస్తారంట నేను 5.20 సెంట్లలో 600 చినీ చెట్లను సాగు చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లుల కోసం ఉద్యానశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాను. నేను వైఎస్సార్సీపీకి చెందిన వాడని బిల్లులు రాకుండా అడ్డుకున్నారు. బిల్లుల కోసం కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేశాను. అధికారులు కనికరించలేదు, గ్రామంలో జన్మభూమి కమిటీ వాళ్లతో సంతకాలు చేయించుకు రావాలని అధికారులు సూచించారు. వాళ్లేమో కండువా వేసుకుంటే తప్ప బిల్లులు చేయమని తెగేసి చెప్పుతున్నారు. రైతులకు పార్టీలు అంటగట్టి పథకాలు రాకుండా చేయడం శోచనీయం. – రాజశేఖర్, నల్లచెర్లోపల్లి, ముదిగుబ్బ మండలం మూడేళ్లుగా బిల్లులు చెల్లించలేదు నేను మూడు ఎకరాల్లో 220 మామిడి చెట్లను పెంచుతున్నాను. ఈ చెట్లను ఉపాధి హామీ పథకం కింద సాగు చేస్తున్నాను. టీడీపీ అధికారం చేపట్టిన మొదట్లో ఒక బిల్లు మాత్రమే వేశారు. అనంతరం నేను వైఎస్సార్సీపీ సానుభూతి పరుడని చెప్పి బిల్లులు రాకుండా నిలిపివేశారు. బిల్లుల కోసం అధికారులు చుట్టు తిరిగినా వారు పట్టించుకోలేదు. – తిరుపాల్‌రెడ్డి, మర్తాడు, ముదిగుబ్బ టీడీపీలో చేరితే బిల్లులిస్తామని చెబుతున్నారు ఉపాధి హామీ పథకం కింద మూడున్నర ఎకరంలో మామిడి మొక్కలను రెండేళ్ల కిందట నాటాను. మొక్కలను ట్యాంకర్ల ద్వారా నీటిని తోలుకుని బతికించుకున్నాను. బిల్లుల కోసం ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్లితే మీ గ్రామంలో ఉన్న జన్మభూమి కమిటీ సభ్యుల సంతకం పెట్టించుకుని రావాలని ఏపీఓ చెప్పారు. వాళ్ల వద్దకు వెళ్లితే నీవు వైస్సార్సీపీ సానుభూతి పరుడివి బిల్లులు ఎలా అయితాయని అనుకుంటున్నారు.. మళ్లీ ఎంపీడీఓ వెంకటరమణ వద్దకు వెళ్లి బతిమాలుకుంటే...ఆయన ‘‘ఇదంతా ఎందుకు నీవు పార్టీ కండువా వేసుకుంటావని చెప్పు వెంటనే ఎమ్మెల్యేతో మాట్లాడి నీ బిల్లులు, నీ బంధువులకు చెందిన బిల్లులను ఒక్కరోజులోనే చేస్తా’’ అని చెప్పాడు. మీరు కుడా ఇలా మాట్లాడాతారా సార్..అంటే ‘‘కండువా వేసుకుంటేనే బిల్లుల కోసం కార్యాలయానికి రా.. లేకపోతే రావద్దు’’ అని ఆయన గట్టిగా చెప్పాడు. నాకు రూ.29 వేలు రావాల్సి ఉంది. వీటి కోసం ఆత్మాభిమానం చంపుకోలేనని చెప్పి అక్కడి నుంచి వచ్చా. నా గోడును మా గ్రామం మీదుగా పాదయాత్ర చేసుకుంటు వెళ్లిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతి పత్రం రూపంలో ఇచ్చుకున్నాను. – చంద్రమోహన్, ఏలుకుంట్ల, బత్తలపల్లి మండలం ఇచ్చిన బిల్లును తీసుకున్నారు ఉపాధి హామీ పథకం ద్వారా నేను 5 ఎకరాలలో మామిడి మొక్కలను నాటుకున్నాను. గ్రామంలో వైఎస్సార్సీపీకి సానుభూతి పరునిగా ఉంటున్నాను. ఈ విషయాన్ని అధికారులకు చెప్పి జన్మభూమి కమిటీ సభ్యుల బిల్లులు చేయకూడదంటు నిలుపుదల చేశారు. బిల్లుల కోసం జిల్లా కేంద్రంలో జరిగే గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చుకున్నాను. వీటికి స్పందించిన అధికారులు పెండింగ్‌లో ఉన్న బిల్లు మొత్తం రూ.70 వేలు పోస్టాఫీసు ద్వారా పంపిణీ చేశారు. అయితే సాయంత్రం చేతికి డబ్బులు ఇచ్చారు. గంట వ్యవధిలోనే మళ్లీ వచ్చి ‘‘నీ బిల్లులో పొరపాటు ఉందని...లెక్క తేలగానే ఇస్తాం’’ అని చెప్పి డబ్బును ఇప్పించుకుపోయారు. బిల్లు కోసం మళ్లీ వెళ్లితే జన్మభూమి కమిటీ వాళ్లను కలవమని పోస్ట్‌మ్యాన్ చెప్పాడు. కమిటీ సభ్యులను అడిగితే ఎమ్మెల్యే సూర్యనారాయణతో కండువా వేయించుకుంటేనే బిల్లు ఇస్తామని చెప్పారు. ఇదెక్కడి న్యాయం. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేయాలి...టీడీపీ వాళ్లకే చేస్తామనడం సరికాదు. – కేశప్ప, ఏలుకుంట్ల , బత్తలపల్లి మండలం -
రుణమాఫీ కోసం కదంతొక్కిన రైతన్న
ముంబై: రైతు రుణమాఫీ, అటవీభూములపై గిరిజనులకు హక్కులు, కరువు సాయం కోరుతూ వేలాదిమంది మహారాష్ట్ర రైతులు, గిరిజనులు నిరసనబాట పట్టారు. మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డాక్టర్ రాజేంద్రసింగ్ సైతం వీరి వెంట నడిచారు. ప్రధానంగా మరాఠ్వాడా, థానె, భుసావాల్ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, గిరిజనులతో మంగళవారం మధ్యాహ్నం థానెలో ర్యాలీ ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముంబైలోని విధాన్ భవన్‌కు గురువారం చేరుకుని అక్కడ భారీస్థాయిలో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. రైతులందరికీ అందుబాటులో తగినంత భూమి, నీరు, సహజవనరులన్నీ దక్కాలని సూచించిన స్వామినాథన్ కమిటీ నివేదికను అమలుచేయాలని రైతులు డిమాండ్చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యమంబాట పట్టామని ర్యాలీకి నేతృత్వం వహిస్తున్న లోక్ సంఘర్‡్ష మోర్చా నేత ప్రతిభాషిండే చెప్పారు. -
ఏకకాలంలో రూ.2 లక్షల మాఫీ
సాక్షి,బోధన్(నిజామాబాద్): తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని మాయ మాటలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ బోధన్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మహకూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని, తాము అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షల చొప్పన పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. బుధవారం మండలంలోని రాజీవ్‌నగర్ తాండ, బెల్లాల్, ఊట్పల్లి, అమ్దాపూర్ గ్రామాల్లో సుదర్శన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. హామీల అమలులో టీఆర్ఎస్ విఫలమైందని, స్వార్థ ప్రయోజనాల కోసం మిషన్ భగీరథ వంటి పథకాలను చేపట్టిందని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తి చేస్తామని, అప్పటివకు నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖతాల్లో రూ.15లక్షలు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఎంపీపీ గంగాశంకర్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లె రమేశ్, మండలాధ్యక్షుడు నాగేశ్వర్రావ్, నేతలు నరేందర్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, ఖలీల్, శంకర్, సురేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అనవసర యంత్రాలతో అధిక హాని
అత్యధిక వ్యయంతో కూడిన వ్యవసాయ యంత్రాల అనవసర భారం వల్లే దేశీయ వ్యవసాయం దురవస్థల పాలవుతోందని గుర్తించకపోవడం వలన వ్యవసాయిక ప్రధాన రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలు తమ రైతులకు మరిన్ని యంత్రాలను అమ్మడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. వరి పంట కోతల కాలం సమీపిస్తుండటం, ఢిల్లీలో వాయు కాలుష్యం భీతి కలిగిస్తుండటం వల్ల, ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ పంట కోతలు పూర్తయ్యాక మిగిలే దుబ్బు తగులబెట్టడం లేదా తొలగించడం పేరిట మరిన్ని యంత్రాలను రైతులకు అంటగట్టేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. పంటకోతలు పరాకాష్టకు చేరుతున్నందున, పంజాబ్ 27,972 వ్యవసాయ యంత్రాల సరఫరాను లక్ష్యంగా పెట్టుకుంది. వరి నాటు యంత్రాలు, పంట కోత యంత్రాలు, దుబ్బును తొలగించే యంత్రాలు, పొలం దున్నే యంత్రాలు వంటి పలు రకాల పనిముట్లు వీటిలో భాగం. ఇక హరియాణాలో అలాంటి 40 వేల యంత్రాలను ఇప్పటికే 900 కిరాయి కేంద్రాలకు, వేలాది విడివిడి రైతులకు ప్రత్యక్ష కొనుగోలు పద్ధతిలో సరఫరా చేశారు. రైతులకు కలుపుతీత, వరిపంట కోత యంత్రాన్ని –హ్యాపీ సీడర్ మెషీన్– 50 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. ఇకపోతే కో–ఆపరేటివ్ లేదా రైతుల బృందాలకు దీన్ని 80 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారులకు ఇది వరం లాంటిది. చాలా కాలంగా ఈ యంత్రాలను అమ్మడానికి వీరు పెద్ద ఎత్తున లాబీ చేస్తున్నారు. పంజాబ్‌లో లక్ష ట్రాక్టర్లు అవసరమైన చోట ఇప్పటికే నాలుగున్నర లక్షల ట్రాక్టర్లను ఉనికిలోకి తెచ్చారు. ఒక యంత్రం అవసరమైన చోట పంజాబ్ రైతులు ఆరు నుంచి ఎనిమిది వరకు అదనపు యంత్రాల భారాన్ని ఎందుకు మోస్తున్నారనేది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ట్రాక్టర్లను మోతాదుకు, అవసరానికి మించి మోస్తుండటమే పంజాబ్ రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణమవుతోంది. వ్యవసాయ కార్యకలాపాల్లో అధిక యంత్రాల వినియోగం రైతుల రుణభారాన్ని మరింతగా పెంచుతోంది. వ్యవసాయ యంత్రాల కొనుగోళ్ల కోసం సబ్సిడీ కేటాయింపును పరిశీలిస్తే ప్రభుత్వ వ్యవసాయ విధానాలు ఎంత హ్రస్వ దృష్టితో ఉంటున్నాయో అర్థమవుతుంది. ఈ కేటాయింపుల అసలు లక్ష్యం వ్యవసాయదారుల పేరుతో వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారులకు సహాయం చేయడమేనా అని నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. గతంలో కూడా పాలీ హౌస్‌ల (పాలిథిన్ షీట్ల నీడలో చేసే వ్యవసాయం)ను ఏర్పాటు చేయడానికి వాటి పరిమాణాన్ని బట్టి రూ. 25 లక్షల భారీ సబ్సిడీని అందుబాటులోకి తెచ్చారు. కానీ ఈ పాలీ హౌస్‌లలో 80 శాతం కంటే ఎక్కువగా పని చేయడం లేదని అనేక అధ్యయనాలు కోడై కూస్తున్నాయి. ఇది భారీ కుంభకోణానికి ఏమాత్రం తక్కువ కాదు. అయితే పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లకు ఏది అవసరమో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గతంలోనే సూచిం చారు. దుబ్బును తగులబెట్టకుండా, తొలగించడానికి కేంద్రప్రభుత్వం 2 వేల కోట్ల రూపాయలను మదుపు పెట్టాల్సి ఉంది. ‘క్వింటాల్ దుబ్బు తొలగింపునకు కనీసం రూ. 100లు ఇవ్వాలని మేం కేంద్రాన్ని డిమాండ్ చేశాం. ఈ మొత్తం రూ. 2 వేల కోట్లకు సమానం’ అని చెప్పారాయన. అమరీందర్ సింగ్ చెప్పింది యథార్థం. కానీ అంత డబ్బు తమ వద్ద లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. అయితే జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదించిన 6.9 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ఒక చిన్న మొత్తాన్ని ఈ దుబ్బు తొలగింపు సమస్య పరిష్కారం కోసం ఎందుకు వెచ్చించలేరో అర్థం కాదు. కానీ వ్యవసాయం విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రభుత్వం ప్రతిసారీ మొండిచేయి చూపిస్తుంటుంది. పంట అవశేషాలను తగులబెట్టడాన్ని నిరోధించే చర్యలు తీసుకుంటున్నందుకు తమపై పడుతున్న అదనపు ఖర్చులకోసం గాను ఎకరాకు రూ.6 వేలను పరిహారంగా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పైగా పంజాబ్‌లో పనికి ఆహార పథకంలో 12.5 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. ఈ పథకం కింద అందుబాటులో ఉన్న రూ. 4 వేల కోట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించలేకపోతోంది. పంట కోతల అనంతరం పొలంలో మిగిలే దుబ్బు నిర్వహణను పనికి ఆహార పథకంలో భాగం చేసినట్లయితే ఖాళీగా ఉన్న రైతుకూలీలకు పని కల్పించడమే కాకుండా, దుబ్బును తగులబెట్టడం ద్వారా కలుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని పరిష్కరించవచ్చు కూడా. వ్యాసకర్త: దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
న్యాయమైన పరిహారం కోరుతూ ఆమరణ దీక్షకు సిద్ధమైన రాజా
-
అన్నదాతకు ‘పీఎం ఆశ’
న్యూఢిల్లీ: 2019 ఎన్నికలకు ముందు రైతులకు లబ్ధి చేకూర్చే మరో పథకానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. 2022 వరకు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేసే కార్యక్రమంలో భాగంగా.. రైతులకు మద్దతు ధర భరోసా కల్పించే రూ.15,053 కోట్ల విలువైన సేకరణ విధానాన్ని కేంద్రం ప్రకటించింది. దీంతోపాటుగా ధాన్యాల కొనుగోలు విషయంలో రైతులకు లాభం జరిగేలా సేకరణ జరగాలని, ఇందుకోసం అవసరమైతే ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించాలని రాష్ట్రాలకు సూచించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ‘ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ (ఆదాయం) సంరక్షణ్ అభియాన్’ (పీఎం ఆశ)కు ఆమోదం లభించింది. ‘2018 బడ్జెట్లో ప్రకటించినట్లుగా రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర పొందేలా చూడటమే ఈ ‘పీఎం ఆశ’ విధానం లక్ష్యం. ఇదో చారిత్రక నిర్ణయం’ అని కేబినెట్ భేటీ వివరాలను వెల్లడిస్తూ వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు. ‘పీఎం ఆశ’ విధానంలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు.. ఎమ్మెస్పీ (కనీస మద్దతు ధర) కన్నా తగ్గినపుడు ధాన్యాన్ని సేకరించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వాలు మూడు పథకాల్లో (ప్రస్తుత మద్దతు ధర – పీఎస్ఎస్, కొత్తగా రూపొందించిన ధరల కొరత చెల్లింపుల పథకం – పీడీపీఎస్, ధాన్య సేకరణ ప్రైవేటు వ్యాపారుల పథకం పైలట్ – పీపీఎస్ఎస్) ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చు. సేకరణ క్రెడిట్ లైన్ పెంపు పీఎం ఆశ పథకాన్ని అమలుచేసేందుకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలకు రూ.15,053 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. సేకరణ సంస్థలకు ఇచ్చే క్రెడిట్ లైన్‌కు ప్రభుత్వ హామీని రూ. 16,550 కోట్లు పెంచింది. దీంతో ఈ క్రెడిట్ లైన్ మొత్తం రూ.45,550కి చేరింది. ఈ కొత్త విధానం ప్రకారం.. రాష్ట్రాలకు ప్రస్తుత మద్దతుధర పథకాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం కేంద్ర ఏజెన్సీలు.. వ్యవ సాయ ఉత్పత్తుల ధరలు తగ్గినపుడు కూడా ఎమ్మెస్పీని రైతులకు చెల్లించే అవకాశం ఉం టుంది. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుందని రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ అమలుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందన్నారు. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు ► దేశవ్యాప్తంగా 13,675 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌ల విద్యుదీకరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. ఇందుకోసం రూ.12,134.5 కోట్ల విడుదలకు పచ్చజెండా ఊపింది. 2021–22 కల్లా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ► దేశవ్యాప్తంగా మరో 4 నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ఎన్ఐడీ చట్టం– 2014కు సవరణలను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుం ది. అమరావతి (ఏపీ), భోపాల్ (మధ్య ప్రదేశ్), జోర్హాట్ (అస్సాం), కురుక్షేత్ర (హరియాణా)ల్లో ఏర్పాటుచేయనున్న ఎన్‌ఐడీలకు జాతీ య ప్రాముఖ్య సంస్థల హోదా కల్పిస్తారు. ఇథనాల్ ధర 25% పెంపు దేశవ్యాప్తంగా పెట్రో మంట రాజుకున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా.. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ధరను 25% పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించే యత్నాల్లో భాగంగానే ఈ పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం లీటర్ ఇథనాల్ ధర రూ.47.13 ఉండగా.. దీన్ని రూ.59.13కి పెంచనున్నట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా చక్కెర రైతులకు లబ్ధి జరగనుంది. ఇథనాల్ ధరను పెంచడం ద్వారా చక్కెర మిల్లులకు లాభం పెరిగి.. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేందుకు వీలవుతుంది. చక్కెర మిల్లుల ద్వారా రైతులకు రూ.13వేల కోట్ల బకాయిలున్నాయి. ఇందులో 40% యూపీలోనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో 4–5% ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలు పుతుండగా.. వచ్చే నాలుగైదేళ్లలో దీన్ని 10%కు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. -
వైఎస్ జగనన్నే మాకు న్యాయం చేయాలి
-
వైఎస్ జగన్‌ను కలిసిన రైవాడ ఆయకట్ట రైతులు
-
రైతులకు స్టార్ హీరో భారీ సాయం
ఇటీవల రైతు సమస్యల నేపథ్యంలో చినబాబు సినిమాను నిర్మించిన కోలీవుడ్ స్టార్హీరో సూర్య, రైతులకు భారీ విరాళం ప్రకటించారు. స్వయంగా ఆరుగురు రైతులకు 12 లక్షల రూపాయలు అందజేసిన సూర్య, రైతుల సంక్షేమం కోసం వ్యవసాయాభివృద్ధి సంస్థకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తమిళ నాట చినబాబు సినిమా ఘనవిజయం సాదించటంతో సినిమా లాభాలనుంచి ఈ సాయం అందిస్తున్నట్టుగా ప్రకటించారు సూర్య. తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కార్తీ, సయేషా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చినబాబు సినిమాను సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై స్యయంగా నిర్మించారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు నాట పరవాలేదనిపించగా కోలీవుడ్ లో మాత్రం భారీ వసూళ్లను సాదిస్తూ దూసుకుపోతోంది. రైతు సమస్యలతో పాటు కుటుంబ బంధాలు, అలకలు, కోపాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు దర్శకుడు పాండిరాజ్. -
పక్కా లోకల్ !
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు చేయనున్న 7 జోన్లు, 2 మల్టీ జోన్ల వ్యవస్థకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జోన్ల వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరుతూ కేంద్రానికి పంపించే ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. ఎల్ఐసీ ద్వారా రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జోన్ల వ్యవస్థ, రైతులకు జీవితబీమా పథకంపై విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం మంత్రివర్గం ఏకగ్రీవంగా ఈ రెండింటిని ఆమోదించింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటవుతాయి. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లుగా ఏర్పడుతాయి. ఒకటో మల్టీ జోన్లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు, రెండో మల్టీ జోన్లో యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లుగా ఉంటాయి. ఉద్యోగుల నియామకానికి జిల్లా, జోన్, మల్టీ జోన్, స్టేట్ కేడర్లు ఉంటాయి. స్టేట్ కేడర్ పోస్టులను కచ్చితంగా పదోన్నతి ద్వారానే భర్తీ చేస్తారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు కనీసం నాలుగు సంవత్సరాలు ఎక్కడ విద్యాభ్యాసం చేస్తారో, ఆ ప్రాంతాన్నే సదరు అభ్యర్థి స్థానిక ప్రాంతం (లోకల్ ఏరియా)గా గుర్తిస్తారు. అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ కేటగిరీగా ఉంటుంది. టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్, గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు వి.శ్రీనివాస గౌడ్, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డిలను ఈ కేబినెట్ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారు. జోన్ల వ్యవస్థకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ప్రధానిని కోరేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశం అనంతరం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. పంద్రాగస్టు నుంచి బీమా పత్రాలు రాష్ట్రంలోని 18–60 ఏళ్ల వయసున్న ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా వర్తించనుంది. ఎల్ఐసీ ద్వారా ఈ బీమా అమలు చేస్తారు. ప్రతీ రైతుకు రూ.2,271 చొప్పున ప్రతీ ఏడాది ప్రభుత్వం ప్రీమియం చెల్లించనుంది. బీమా ప్రీమియానికి సంబంధించిన సొమ్మును బడ్జెట్లోనే కేటాయించనుంది. జూన్ 2 నుంచి రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరిస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా సర్టిఫికెట్లు అందిస్తారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఎండీతోపాటు ఇతర సిబ్బందిని నియమిస్తారు. వైద్య ఆరోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతారు. పదోన్నతులతోనే సూపర్ వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ ఐసీడీఎస్‌లో సూపర్ వైజర్–గ్రేడ్ 2 పోస్టులను వందకు వందశాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లలో అనుభవజ్ఞులు, అర్హతలు కలిగిన వారినే సూపర్ వైజర్లుగా నియమించాలని చెప్పారు. సూపర్ వైజర్ల నియామకానికి సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి తదితరులతో సీఎం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో అంగన్వాడీ టీచర్లకున్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. -
రైతన్నకు బీమా ధీమా
సాక్షి, హైదరాబాద్: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తామని వెల్లడించారు. రైతులకు ఎంత భూమి ఉన్నా, వారు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా, ఎంత వ్యయమైనా ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. ఈ పథకానికి కావాల్సిన నిధులను బడ్జెట్లోనే కేటాయిస్తామన్నారు. ఏటా ఆగస్టు 1న ప్రీమియం చెల్లిస్తామని చెప్పారు. విశ్వసనీయత, విస్తృత యంత్రాంగమున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ ద్వారా బీమా పథకం అమలు చేస్తామని తెలిపారు. సాధా రణ మరణమైనా, ప్రమాదవశాత్తూ చనిపోయినా రైతు ప్రతిపాదించిన నామినీకి పది రోజుల్లోగా రూ.5 లక్షల బీమా పరిహారం చెల్లించేలా ఈ పథకం ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం ప్రమాద బీమా అయితే.. ప్రభుత్వంపై వ్యయ భారం కూడా తక్కువయ్యేదని, కానీ ఎంత ఖర్చయినా మరణించిన ప్రతీ రైతు కుటుంబాన్ని ఆదుకోవడాన్ని బాధ్యతగా భావించి బీమా చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రైతుల జీవిత బీమా పథకం రూపకల్పనపై శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులు, ఎల్ఐసీ ప్రతినిధులతో మాట్లాడి విధి విధానాలు ఖరారు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో బీమా చేస్తున్నందున ఎల్ఐసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం కోరారు. ‘‘తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులే 93 శాతం మంది ఉన్నారు. ఒక్క ఎకరంలోపు ఉన్న వారు 18 లక్షల మంది ఉన్నారు. వారికి భూమి తప్ప మరో జీవనాధారం లేదు. ఏదేని పరిస్థితుల్లో రైతు చనిపోతే ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఉంటే ఆ కుటుంబానికి ఆసరా ఉంటుంది. కేవలం ప్రమాద బీమా వర్తింపచేయడం వల్ల ప్రభుత్వానికి భారం తక్కువగా ఉన్నప్పటికీ, రైతులకు పెద్దగా లాభం ఉండదు. కాబట్టి వ్యయం ఎక్కువైనా సరే సాధారణ మరణాలకు కూడా వర్తించే విధంగా జీవిత బీమా చేయాలని నిర్ణయించాం’’అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ వినోద్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, ఎల్ఐసీ రీజినల్ మేనేజర్ ఆర్.చందర్, డీఎం బీఎస్ నర్సింహ, డీఎం సుబ్రహ్మణ్యం, బీఎం జి.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. విధివిధానాలివే.. ఎల్ఐసీతో పాటు ఇతర బీమా సంస్థల నిబంధనల ప్రకారం 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికే సాధారణ జీవిత బీమా వర్తిస్తుంది. 59 ఏళ్లలోపు వారిని మాత్రమే బీమా పథకానికి నమోదు చేసుకుంటారు. 60 ఏళ్ల వయసు వచ్చే వరకు బీమా సౌకర్యం కల్పిస్తారు. అందుకే రైతులకు జీవిత బీమా పథకానికి 18 నుంచి 59 ఏళ్లలోపు వారి పేర్లు నమోదు చేస్తారు. ఆధార్ కార్డుపై నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. 2018 ఆగస్టు 15 నాటికి రైతు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రతీ ఏడాది కూడా ఆగస్టు 15నే ప్రామాణికంగా తీసుకుని పేర్లను నమోదు చేసుకుంటారు. ఈ జాబితా ప్రకారమే ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. వ్యవసాయాధికారులు క్లస్టర్ల వారీగా 18–59 వయసున్న రైతుల జాబితాను సిద్ధం చేస్తారు. ప్రభుత్వం వారి తరఫున ప్రీమియం చెల్లించి, రైతుల జాబితాను ఎల్ఐసీకి అందిస్తుంది. ఎల్ఐసీ బీమా సర్టిఫికెట్లను ముద్రిస్తుంది. ఈ సర్టిఫికెట్లను ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రైతులకు పంపిణీ చేస్తుంది. ప్రతి రైతుకు ప్రభుత్వం–ఎల్ఐసీ సంయుక్తంగా బీమా సర్టిఫికెట్‌ను అందజేస్తుంది. బీమా పరిహారంగా రూ.5 లక్షలు ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించే స్వేచ్ఛ రైతుకే ఉంటుంది. ముందుగానే రైతులు నామినీని ప్రతిపాదించాల్సి ఉంటుంది. కొద్ది రోజుల్లోనే వ్యవసాయాధికారులు గ్రామాల్లో రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలను సేకరిస్తారు. రైతు మరణించిన పది రోజుల్లోగానే రూ.5 లక్షలు నామినీకి అందజేస్తారు. రైతు కుటుంబ సభ్యులు కేవలం మరణ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. పది రోజుల్లోగా బీమా సొమ్ము చెల్లించేలా ప్రభుత్వానికి, ఎల్ఐసీకి మధ్య ఒప్పదం కుదురుతుంది. పది రోజుల్లోగా బీమా సొమ్ము చెల్లించకుంటే ఎల్ఐసీకి జరిమానా విధిస్తారు. ప్రభుత్వం ప్రతీ ఏడాది బడ్జెట్లోనే ప్రీమియం కోసం నిధులు కేటాయిస్తుంది. ఆగస్టు 1న ఎల్ఐసీకి చెల్లిస్తుంది. ప్రతి నెలా రైతుల వివరాలను వ్యవసాయాధికారులు అప్ డేట్ చేస్తారు. దాని ప్రకారం అర్హుల జాబితా అప్ డేట్ అవుతుంది. ఎప్పుడు భూమి కొంటే అప్పటి నుంచి బీమా వర్తించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. దేశ చరిత్రలో ఇది రికార్డు: ఎల్ఐసీ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న రైతులకు జీవిత బీమా సదుపాయం దేశ చరిత్రలో, బీమా సంస్థల చరిత్రలో సరికొత్త రికార్డుగా ఎల్ఐసీ ప్రకటించింది. ‘‘గతంలో కూడా ఇలాంటి గ్రూపు ఇన్సూరెన్సులున్నాయి. తక్కువ మంది సభ్యులు.. లక్ష నుంచి రెండు లక్షల బీమా ఉండేది. ప్రీమియం సొమ్ము తక్కువవుతుందనే ఉద్దేశంతో ప్రమాద బీమా మాత్రమే చేస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎంత వ్యయమైనా సరే, రైతులందరికీ ప్రయోజనం ఉండాలని భావించింది. ఎక్కువ ప్రీమియం అయినా సరే.. ప్రమాద బీమా కాకుండా జీవిత బీమా చేయాలని నిర్ణయించింది. రైతులందరికీ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల బీమా చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇన్ని లక్షల మందిని సభ్యులుగా గ్రూపు ఇన్సూరెన్సు చేయడం కూడా దేశ చరిత్రలో, ఇన్సూరెన్సు కంపెనీల చరిత్రలో ఎన్నడూ లేదు’’అని సీఎంతో సమీక్ష అనంతరం ఎల్ఐసీ రీజనల్ మేనేజర్ ఆర్.చందర్, డీఎంలు బీఎస్ నర్సింహ, సుబ్రహ్మణ్యం అన్నారు. -
25 రోజుల్లో 100%
సాక్షి, హైదరాబాద్: రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని 25 రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. జిల్లాకు ఒకరు చొప్పున మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఇన్చార్జులుగా నియమిం చాలని నిర్ణయించారు. పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాకో ఐఏఎస్ అధికారిని స్పెషలాఫీసర్‌గా నియమించారు. ఈ నెల 24 నుంచి జూన్ 20 వరకు 25 రోజుల పాటు అధి కార యంత్రాంగమంతా ఇదే కార్యక్రమంలో నిమగ్నం కావాలని చెప్పారు. బుధవారం ప్రగతిభవన్‌లో బుక్కులు, చెక్కుల పంపిణీపై సీఎం కేసీఆర్ ఆరు గంటలపాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘‘ఈ రోజు వరకు జరిగిన భూముల అమ్మకం, కొనుగోలు వివరాలన్నీ నమోదు చేయాలి. అన్ని రకాల మ్యుటేషన్లు చేయాలి. వారసత్వ హక్కులు తేల్చాలి. కొత్తగా నమోదైన వివరాలతో పాస్ బుక్కులు ముద్రించి పంపిణీ చేయాలి. ఇప్పటికే జారీ చేసిన పాస్ పుస్తకాల్లో తప్పులుంటే వెంటనే వాటిని సవరించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. గుంట భూమికి కూడా యజమాని ఎవరో తేల్చాలి. జరిగిన ప్రతీ అమ్మకం, కొనుగోలును నమోదు చేయాలి. వారసత్వ హక్కులను తేల్చాలి. భూ యాజమాన్యానికి సంబంధించిన అన్ని మార్పులను నమోదు చేయాలి. పెండింగ్‌లో పెట్టొద్దు. జూన్ 20 నాటికి వివరాల నమోదు కార్యక్రమం పూర్తి కావాలి. ఆ వివరాలను పొందు పరుస్తూ ‘ధరణి’వెబ్సైట్ రూపొందించాలి. భూమికి సంబంధించి ఇకపై ఒకటే లెక్క ఉండాలి’’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. ఆన్లైన్ ఫ్రీజింగ్ ఎత్తివేత భూమి వివరాలను నమోదు చేయడానికి ఆన్లైన్ ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 27 నుంచి ఫ్రీజింగ్ ఎత్తివేసి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడానికి తహసీల్దార్లకు అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వంద రోజుల పాటు భూరికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ, కొన్నిచోట్ల రికార్డుల్లో తప్పులు దొర్లడం, అసమగ్ర వివరాలుండటం పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతోపాటు మానవ తప్పిదాలు కూడా ఉన్నాయని, దీనివల్ల రైతులకు కొంత అసౌకర్యం కలిగిందని, కొందరికి పాస్ పుస్తకాలు అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు కొన్ని సమస్యలు తప్పవని, ఈ పరిస్థితిని సవాల్‌గా తీసుకుని, మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సూచించారు. కొత్త జిల్లాలతో కలెక్టర్లకు పర్యవేక్షణ సులభమైందని, దీన్ని సానుకూలాంశంగా తీసుకుని మరింత చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. వచ్చేనెల నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానంతోపాటు రైతులకు జీవిత భీమా పథకం అమల్లోకి వస్తుందని, ఇవి సవ్యంగా సాగాలంటే భూరికార్డులు సరిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రక్షాళన విజయవంతం భూముల సమస్యలను పరిష్కరించడానికి గత ప్రభుత్వాలు ఎన్నడూ శ్రద్ధ పెట్టలేదని సీఎం అన్నారు. ‘‘ప్రభుత్వ శాఖల మధ్య కూడా భూ వివాదాలున్నాయి. రెవెన్యూ, అటవీ శాఖ మధ్య గొడవలున్నాయి. భూరికార్డులు సరిగా లేకపోవడం వల్ల గ్రామాల్లో గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. వీటన్నింటికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతోనే భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాం. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ సాహసానికి పూనుకోలేదు. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతమైంది. అధికారులు ఎంతో శ్రమకోర్చి రికార్డుల ప్రక్షాళన చేశారు’’అని చెప్పారు. ప్రతి రైతుకు బీమా పట్టా ప్రతి రైతుకు బీమా పట్టా అందిస్తామని సీఎం చెప్పారు. ‘‘రైతులు భూమిని నమ్ముకుని బతుకుతున్నారు. చాలామంది చిన్న, సన్నకారు రైతులే. ఒక్క ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది ఉన్నారు. అలాంటి పేద రైతు చనిపోతే వారి కుటుంబం ఉన్నట్టుండి అగాథంలో పడిపోతుంది. కాబట్టి మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల బీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ఐíసీ ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తాం. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతి రైతుకు బీమా పట్టా అందిస్తాం. రైతులు కోరుకున్న వారినే నామినీగా చేర్చాలి. బీమా పథకం అమలుకు సంబంధించి ఎల్ఐసీ అధికారులతో చర్చలు జరుపుతున్నాం. రైతు చనిపోయిన వెంటనే ఆయన కుటుంబానికి పరిహారం అందేలా రూపకల్పన చేయాలి’’అని అధికారులకు సూచించారు. కల్యాణలక్ష్మికి కుల ధ్రువీకరణ వద్దు రంజాన్ పండుగ ఏర్పాట్లు, రాష్ట్రావతరణ వేడుకలు, కల్యాణలక్ష్మి, హరితహారం తదితర కార్యక్రమాలపై సీఎం కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. రంజాన్ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ముస్లింలకు దుస్తుల పంపిణీ చేయాలన్నారు. పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నందును కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని పేర్కొన్నారు. జూన్ 1 నుంచే పాఠశాలల ప్రారంభం అవుతున్నందున జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని సూచించారు. సీఎం తీసుకున్న కీలక నిర్ణయాలివీ.. – అసైన్డ్ భూములు కొన్న వారు పేదలైతే వారి పేరిటే యాజమాన్య హక్కులు కల్పించాలి. వారికి రైతు బంధు పథకం వర్తింపచేయాలి – స్వస్థలానికి రాలేకపోతున్న ఎన్నారైలకు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానం అనుసరించాలి – ఆధార్ నంబరు అనుసంధానం చేయడానికి ముందుకు రాని వారి పాస్ పుస్తకాలను పక్కన పెట్టాలి – భూమికి సంబంధించిన అన్ని వివరాలతో ‘ధరణి’వెబ్సైట్ నిర్వహించాలి – భూరికార్డులను నిర్వహించే విషయంలో అవినీతికి పాల్పడే వారిపట్ల అత్యంత కఠినంగా ఉండాలి. తప్పులు చేసిన వారిని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి – పాస్ పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమం వంద శాతం పూర్తయ్యే బాధ్యతను కలెక్టర్లతో పాటు మంత్రులు స్వీకరించాలి – ప్రతీ మండలంలో వందశాతం బుక్కులు, చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యే బాధ్యతను ఆయా మండలాల తహసీల్దార్లకు అప్పగించాలి. జిల్లాలో మంత్రి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. చెక్కుల పంపిణీకి స్పెషలాఫీసర్లు వీరే.. పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ పర్యవేక్షణకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించింది. ఆ వివరాలివీ.. ఆదిలాబాద్– వికాస్‌రాజ్, భద్రాద్రి కొత్తగూడెం–అధర్ సిన్హా, జగిత్యాల–సందీప్‌కుమార్ సుల్తానియా, జనగామ–అజయ్‌మిశ్రా, జయశంకర్ భూపాలపల్లి–అరవింద్‌కుమార్, జోగులాంబ గద్వాల–రజత్‌కుమార్ సైనీ, కామారెడ్డి–టి.కె.శ్రీదేవి, కరీంనగర్–స్మితా సబర్వాల్, ఖమ్మం– నీతూకుమారి ప్రసాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్–టి.చిరంజీవులు, మహబూబాబాద్–క్రిస్టినా చోంగ్తు, మహబూబ్‌నగర్–దానకిశోర్, మంచిర్యాల–నవీన్‌మిట్టల్, మెదక్–రంజీవ్ ఆర్.ఆచార్య, మేడ్చల్ మల్కాజ్గిరి–జయేశ్ రంజన్, నాగర్ కర్నూల్–వి.అనిల్‌కుమార్, నల్లగొండ–సోమేశ్‌కుమార్, నిర్మల్– శశాంక్ గోయల్, నిజామాబాద్–రామకృష్ణారావు, పెద్దపల్లి–ఎన్.శ్రీధర్, సిరిసిల్ల–సునీల్‌శర్మ, రంగారెడ్డి– శైలజ రామయ్యర్, సంగారెడ్డి–మాణిక్ రాజ్, సిద్దిపేట– చిత్రా రామచంద్రన్, సూర్యపేట– వై.శ్రీలక్ష్మీ, వికారాబాద్–ఎన్.శివశంకర్, వనపర్తి–అనితా రాజేంద్ర, వరంగల్ అర్బన్– ఎం.వీరబ్రహ్మయ్య, వరంగల్ రూరల్– ఎం.జగదీశ్వర్, యాదాద్రి భువనగిరి– శాంతికుమారి.