
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. కేంద్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారన్నారు. 50 లక్షల మంది రైతులు ఏటా ఆరు వేల రూపాయలు అందుకోబోతున్నారని తెలిపారు. చేపల అభివృద్ధి కోసం నీలి విప్లవం సృష్టిస్తామన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను ఇప్పటికే అమలు చేశామన్నారు. పంట ఖర్చుపై ఇప్పటికే 50 శాతం మద్దతు ధరను ప్రకటించామని జవదేకర్ తెలిపారు.
వివిధ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు కూడా పెంచామన్నారు జవదేకర్. అన్ని వర్గాలకు ఉపశమనం కల్పించేలా బడ్జెట్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను 9 శాతం పెంచామని పేర్కొన్నారు. 5 మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించే దిశగా మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment