Prakash Javdekar
-
కమలనాథుల గ్రేటర్ అటెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా దూరదృష్టితో ప్రణాళికలు రచించే బీజేపీ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అతిరథ మహారథులందరినీ హైదరాబాద్‌లో దించుతోంది. గ్రేటర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఒక కార్పొరేషన్ ఎన్నికకు బీజేపీ ఇంత ప్రాధాన్యతనివ్వడం, ఢిల్లీ నేతలందరూ సిటీలోని గల్లీలకు తరలిరావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది. దుబ్బాక విజయం ఇచ్చిన ఊపు బీజేపీలో నయాజోష్ నింపింది. తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న అగ్రనాయకత్వం... గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా మిషన్–2023కి గట్టి పునాది వేయాలనే ఆలోచనలో ఉంది. అందుకే ప్రధాన వ్యూహకర్త, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సహా పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు, మహిళా, యువమోర్చా నాయకులు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. ఇప్పటికే కొందరు వచ్చారు. ఫైర్‌బ్రాండ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు కూడా రానున్నారు. ఆఖరి నాలుగు రోజుల్లో అగ్రనేతలతో ప్రచారాన్ని హోరెత్తించేలా కార్యాచరణను రూపొందించింది. జవదేకర్ రాకతో పెరిగిన వేడి జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. అందుకే పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న ఎంపీ భూపేంద్ర యాదవ్‌ను ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించింది. అంతేకాదు రాష్ట్ర పార్టీలోని నేతలంతా కలిసి పని చేసేలా కార్యాచరణ అమలుకు ఆదేశించింది. ‘ఆరేళ్ల టీఆర్ఎస్ జమానా... అరవై తప్పుల ఖజానా’పేరుతో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా ఈనెల 22న చార్జ్‌షీట్‌ను వేసింది. ఇక అప్పటి నుంచి ప్రచార వేగాన్ని పెంచింది. బండి సంజయ్, కిషన్‌రెడ్డి, డీకే ఆరుణ , డాక్టర్ కె.లక్ష్మణ్ తదితర నేతలంతా రోజుకు ఆరేడు డివిజన్లలో విస్తృత ప్రచారానికి ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నారు. ఎంపీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య సోమ, మంగళవారాల్లో నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. యువ ఓటర్లే లక్ష్యంగా... ఉద్యోగాలు ఏవని, ఉపాధి ఎక్కడని టీఆర్ఎస్ను నిలదీశారు. ఉద్రిక్తతల మధ్య ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ, పార్టీ మహిళ మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌లు కూడా బుధవారం నగరానికి వచ్చారు. రంగంలోకి బడానేతలు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎంపీ భూపేంద్రయాదవ్‌లు గురువారం హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే ఈనెల 27వ తేదీన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పలు డివిజన్లలో రోడ్‌షోలతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. యోగికి బీజేపీ శ్రేణుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవలి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ యోగి ప్రచారసభలకు భారీ స్పందన వచ్చింది. దాంతో రాష్ట్ర నాయకులు యూపీ సీఎం పర్యటనపై భారీఆశలు పెట్టుకున్నారు. ఈనెల 28వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేధావుల సభ, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో జరిగే రోడ్‌షోల్లో పాల్గొంటారు. ప్రచారానికి ఆఖరిరోజైన 29న అమిత్‌షా సికింద్రాబాద్ పరిధిలో రోడ్‌షోలో పాల్గొననున్నారు. నేడు మేనిఫెస్టో విడుదల జీహెచ్ఎంసీలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు చోటు కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను పేర్కొంటూ, తాము అధికారంలోకి వస్తే చేపట్టే కార్యాచరణతో బీజేపీ మేనిఫెస్టోను రూపొందించింది. గురువారం దేవేంద్ర ఫడ్నవీస్ దీన్ని విడుదల చేయనున్నారు. తెలంగాణలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటినుంచే కార్యాచరణను అమలు చేస్తోంది. గ్రేటర్ పోరులో ప్రభావం చూపిస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావొచ్చని ప్రణాళికలు రచిస్తోంది. -
‘వారు దళారులకే దళారులు’
పనాజీ : వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్న వారు దళారులకే దళారులుగా వ్యవహరిస్తున్నారని అభివర్ణించారు. ప్రస్తుతం రైతులు తక్కువ ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకుంటుండగా, వినియోగదారులు అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వ్యవసాయ బిల్లులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గోవాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వివరించారు. దళారులు రైతుల నుంచి కారుచౌకకు కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ధరలను పెంచేసి లాభాలు దండుకుంటున్నారని , ఈ దళారులను ఏరివేయడం ద్వారా వ్యవసాయ బిల్లులు ఈ సమస్యను తొలగిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విపక్షాలు దళారుల కొమ్ముకాస్తూ దళారుల కోసం దళారులుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన సమసిపోతుందని అసత్యాలకు త్వరలో కాలం చెల్లుతుందని, వాస్తవం మాత్రం శాశ్వతమని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని, అయితే వ్యవసాయ సంస్కరణలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ప్రసంగాల్లో పలుమార్లు పిలుపుఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యూటర్న్ తీసుకుందని అన్నారు. వ్యవసాయ బిల్లులతో వ్యవసాయ మార్కెట్ కమిటీలు మూతపడతాయని విపక్షాలు దుష్ర్పచారం సాగిస్తున్నాయని ఆరోపించారు. కనీస మద్దతు ధరపై వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు నిలిచిపోతుందని ప్రచారం చేస్తున్నారని ఇవన్నీ అసత్యాలేనని చెప్పుకొచ్చారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘మిషన్ కర్మయోగి’ పేరిట సివిల్ సర్వీసుల ప్రక్షాళనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సివిల్ సర్వీసులపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసుల సామర్థ్య పెంపు కోసం జాతీయ కార్యక్రమంగా మిషన్ కర్మయోగిని ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. పౌర అధికారులను మరింత సృజనశీలురుగా, నిర్మాణాత్మకంగా, చురుకుగా, పారదర్శకంగా ఉండేలా దేశ భవిష్యత్ కోసం వారిని దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మిషన్ కర్మయోగిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. వారు మరింత ఉత్తేజంగా, సాంకేతిక అంశాలపై పట్టు సాధించేలా ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని అన్నారు. ప్రపంచంలో అత్యంత మెరుగైన విధానాలను ఒంటబట్టించుకునే పౌర అధికారులు భారత సంస్కృతి, విధానాలకు అనుగుణంగా వాటిని మెరుగుపరిచే క్రమంలో సామర్థ్య పెంపు దోహదపడుతుందని తెలిపారు. ఇక జమ్ము కశ్మీర్లో డోంగ్రి, హిందీ, కశ్మీరీ, ఉర్దు, ఇంగ్లీష్‌లను అధికార భాషలుగా గుర్తించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. మరోవైపు జపాన్, ఫిన్లాండ్, డెన్మార్క్‌లతో వరుసగా జౌళి శాఖ, గనులు, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత మూడు ఎంఓయూలకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. చదవండి : షూటింగ్స్ ప్రారంభించుకోండి! -
ఈపీఎఫ్‌పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
ఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో 72లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, భారత్ ఆత్మనిర్భర్ కింద ఈ జూన్ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ 24శాతం (12 శాతం ఉద్యోగుల వాటా, 12 శాతం యజమానుల వాటా) పొడిగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. (ఏడుగురికి కరోనా హైకోర్టు మూసివేత) వంద మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు, రూ.15వేల కంటే తక్కువ వేతనం పొందుతున్న కార్మికులు, ఉద్యోగులు, యజమానుల వాటా పీఎఫ్‌ను కేంద్రం మూడు నెలల పాటు చెల్లిస్తుందన్నారు. ఈ చర్యతో 72 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగిందని జవదేకర్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో ఐదు నెలల పాటు పొడిగించేందుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. దీంట్లో 81 కోట్ల మందికి 203 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నవంబర్ వరకు కేటాయించనున్నట్లు చెప్పారు. గత మూడు నెలల్లో 120 లక్షల టన్నులు పంపిణీ చేశామని చెప్పారు. గతంలో నాలుగు 4.60లక్షల టన్నుల పప్పు ఇవ్వగా, ఇప్పుడు 9.70లక్షల టన్నులు ఇవ్వనున్నట్లు వివరించారు. -
కోవిడ్-19 : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
-
ప్రధాని సహా ఎంపీల వేతనాల్లో కోత
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సోమవారం కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోత విధించాలని నిర్ణయించారు. రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ నిధులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తమ వేతనాలను తగ్గించేందుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంగీకరించారు. వేతనాల కోత ద్వారా సమకూరిన నిధులను కన్సాలిడేషన్ ఫండ్‌కు జమ చేస్తారు.కాగా, కేబినెట్ నిర్ణయాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తే రూ 7900 కోట్లు సమకూరుతాయని మంత్రి తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4067కు పెరిగింది. చదవండి : బడా నిర్మాత కూతురికి కరోనా -
ప్రకాశ్ జవదేకర్‌తో కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. బుధవారం కేంద్ర మంత్రిని కలసిన సీఎం రాష్ట్రంలోని పలు సాగునీరు, ఇతర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పలు ప్రతిపాదనలను పరిష్కరించాల్సిందిగా కోరారు. ఫార్మాసిటీకి సంబంధించిన అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్ వెంట టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. -
ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ జరుపుకోనుంది. గోవాలో జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను భారీగా నిర్వహించనున్నట్టు సమాచారం. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రజనీకాంత్‌కు ‘ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ’ అనే అవార్డు ప్రదానం చేయనున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవ్దేకర్ తెలిపారు. ‘‘గత కొన్నేళ్లుగా భారతీయ సినిమాకు రజనీకాంత్ అందిస్తున్న సేవలను గుర్తించి ‘ఐఎఫ్ఎఫ్ఎఫ్ 2019’లో ఆయనకు ఈ అవార్డు అందిస్తాం’’ అని ట్వీట్ చేశారు ప్రకాశ్. ‘‘ఈ గౌరవాన్ని నాకు ప్రదానం చేస్తున్న భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని రజనీకాంత్ తన ట్వీటర్ ద్వారా తెలిపారు. ఈ ఉత్సవంలో ఫ్రెంచ్ నటి ఇసబెల్లా హుప్పెర్ట్కు జీవిత సాఫల్య పురస్కారం అందించనున్నారు. నవంబర్ 20 నుంచి 28 వరకూ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. -
‘ఇది ప్రగతిశీల బడ్జెట్’
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. కేంద్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. 50 లక్షల మంది రైతులు ఏటా ఆరు వేల రూపాయలు అందుకోబోతున్నారని తెలిపారు. చేపల అభివృద్ధి కోసం నీలి విప్లవం సృష్టిస్తామన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను ఇప్పటికే అమలు చేశామన్నారు. పంట ఖర్చుపై ఇప్పటికే 50 శాతం మద్దతు ధరను ప్రకటించామని జవదేకర్ తెలిపారు. వివిధ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు కూడా పెంచామన్నారు జవదేకర్. అన్ని వర్గాలకు ఉపశమనం కల్పించేలా బడ్జెట్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను 9 శాతం పెంచామని పేర్కొన్నారు. 5 మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించే దిశగా మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. -
పథకాల పబ్లిసిటీ ఖర్చు అక్షరాల రూ.3800 కోట్లు..!
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మూడేళ్లకాలంలో అక్షరాల రూ.3800 కోట్లు ఖర్చుచేసినట్టు సమాచార ప్రసారశాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. లోక్‌సభలో శుక్రవారం ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. 2016-17 ఏడాదికి గాను రూ.1280.07 కోట్లు, 2017-18కి గాను 1328.06 కోట్లు, 2018-19 గాను 1195.94 కోట్లు ఖర్చయినట్టు తెలిపారు. ప్రింట్ మీడియా, ఆడియో విజువల్, ఔట్‌డోర్ పబ్లిసిటీ, ప్రింటెడ్ విధానాల్లో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లినట్టు చెప్పారు. -
తిరుమల శేషాచలంపై యాక్షన్ ప్లాన్-జవదేకర్
తిరుమల: తిరుమల శేషాచలంలోని విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడం, తిరిగి ఆ మొక్కల్ని పెంచటం, అగ్నిప్రమాదాలు అరికట్టడం కోసం ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందని, అందుకు కేంద్రం కూడా సహకరిస్తుందని తెలిపారు. నిత్యం వేలాదిగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే తిరుమల సప్తగిరుల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు టీటీడీ, రిజర్వు ఫారెస్ట్ సంయుక్తంగా కృషి చేస్తున్నాయన్నారు. భవిష్యత్‌లో కూడా తలెత్తే అన్ని సమస్యల్ని టీటీడీ, రిజర్వు ఫారెస్ట్ సంయుక్తంగా కట్టడి చేసేందుకు అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుందన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని జవదేకర్ చెప్పారు. -
ప్రత్యక్ష ప్రసారం చేస్తే తప్పేంటి?
నాగపూర్: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ప్రసంగాన్ని దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. దూరదర్శన్ చేసిన దాంట్లో తప్పేంలేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన దూరదర్శన్ ప్రొఫెషనలిజం చూపాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. దూరదర్శన్ కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. భాగవత్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ 89వ వ్యవస్థాపక దినోత్సవంతో పాటు దసరా సందర్భంగా అక్టోబర్ 3న భాగవత్ చేసిన ప్రసంగాన్ని దూరదర్శన్‌లో గంట పాటు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి. భాగవత్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి.