పథకాల పబ్లిసిటీ ఖర్చు అక్షరాల రూ.3800 కోట్లు..! | Centre Spent Rs 3800 Crore For Publicity Of Government Schemes In Last 3 Years | Sakshi
Sakshi News home page

పథకాల పబ్లిసిటీ ఖర్చు అక్షరాల రూ.3800 కోట్లు..!

Published Fri, Jun 28 2019 9:33 PM | Last Updated on Fri, Jun 28 2019 9:33 PM

Centre Spent Rs 3800 Crore For Publicity Of Government Schemes In Last 3 Years - Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మూడేళ్లకాలంలో అక్షరాల రూ.3800 కోట్లు ఖర్చుచేసినట్టు సమాచార ప్రసారశాఖమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు. లోక్‌సభలో శుక్రవారం ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. 2016-17 ఏడాదికి గాను రూ.1280.07 కోట్లు, 2017-18కి గాను 1328.06 కోట్లు, 2018-19 గాను 1195.94 కోట్లు ఖర్చయినట్టు తెలిపారు. ప్రింట్‌ మీడియా, ఆడియో విజువల్‌, ఔట్‌డోర్‌ పబ్లిసిటీ, ప్రింటెడ్‌ విధానాల్లో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లినట్టు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement