publicity expenditure
-
దావోస్ టూర్..బాబు పబ్లిసిటీకి భారీ ఖర్చు
సాక్షి,విజయవాడ:సీఎం చంద్రబాబు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) టూర్ పబ్లిసిటీ కోసం కూటమి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. దావోస్ టూర్‌కు భారీ ప్రచారానికి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డబ్బులిచ్చి మరీ పబ్లిసిటీ చేయించుకోవాలని బాబు సర్కారు నిర్ణయించింది. జాతీయ బిజినెస్ టీవీ చానల్ సీఎన్‌బీసీ(CNBC) ద్వారా పబ్లిసిటీ కోసం రూ.కోటి 15 లక్షల రూపాయిలు కేటాయిస్తూ పరిపాలన అనుమతుల జీవోను ప్రభుత్వం శనివారం(జనవరి18) జారీ చేసింది.ఇప్పటికే ఎన్డీటీవి ద్వారా పబ్లిసిటీ రూ.74లక్షలు,డిజిటల్ మీడియాలో పబ్లిసిటీ కోసం బిజినెస్ టుడేకు రూ.60 లక్షల దాకా మంజూరు చేశారు.రెండు ఛానళ్ల ద్వారా దావోస్‌లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం సర్కారు రూ.2 కోట్లకుపైగా దుబారా చేస్తోంది. పెట్టుబడుల విషయంలో కేవలం చంద్రబాబును పొగడడం కోసమే ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.గతంలో టీడీపీ(TDP) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో సహా చంద్రబాబు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు వెళ్లారు. ప్రభుత్వం తరపున సీఎం, మంత్రులు వెళ్లాల్సిన సదస్సుకు కుటుంబ సభ్యులు అది కూడా ప్రత్యేక విమానం వేసుకుని వెళ్లడమేంటన్న విమర్శలు వచ్చాయి. దావోస్ సమావేశాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు శనివారం రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి ఐదురోజుల పాటు దావోస్‌లో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. దావోస్‌కు వెళ్లేందుకు చంద్రబాబు మంత్రులు లోకేష్, టీజీ భరత్ మరో ఐదుగురు ఉన్నతాధికారులు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. వీరందరికి సహాయకులుగా మరో 15 మంది దాకా దావోస్‌కు వెళ్లనున్నారు.ఇదీ చదవండి: స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను అవమానించిన బీజేపీ నేత -
పథకాల పబ్లిసిటీ ఖర్చు అక్షరాల రూ.3800 కోట్లు..!
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మూడేళ్లకాలంలో అక్షరాల రూ.3800 కోట్లు ఖర్చుచేసినట్టు సమాచార ప్రసారశాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. లోక్‌సభలో శుక్రవారం ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. 2016-17 ఏడాదికి గాను రూ.1280.07 కోట్లు, 2017-18కి గాను 1328.06 కోట్లు, 2018-19 గాను 1195.94 కోట్లు ఖర్చయినట్టు తెలిపారు. ప్రింట్ మీడియా, ఆడియో విజువల్, ఔట్‌డోర్ పబ్లిసిటీ, ప్రింటెడ్ విధానాల్లో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లినట్టు చెప్పారు. -
ఆ ఖర్చులో ఎన్డీఏ టాప్..
సాక్షి, న్యూఢిల్లీః గత మూడేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాలో ప్రకటనలపై రోజుకు సగటున వెచ్చించిన వ్యయం యూపీఏ ప్రభుత్వంతో పోల్చితే రెండింతలుగా ఉంది. గత మూడేళ్లలో ఎన్డీఏ సర్కార్ ప్రకటనల కోసం రూ 3214 కోట్లు ఖర్చు చేసింది. ఇది సగటున రోజుకు రూ 3.21 కోట్లుగా నమోదైంది. అయితే పదేళ్ల కాలంలో యూపీఏ సర్కార్ ప్రకటనలపై రూ 2658 కోట్లు ఖర్చు చేసి రోజుకు సగటున రూ 1.45 కోట్లు వెచ్చించింది. సమాచార హక్కు కింద ఈ వివరాలు వెల్లడయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తన తొలి వేయి రోజుల పాలనలో రూ 3529 కోట్లు ప్రచారంపై ఖర్చు చేసిందని ఆర్టీఐ కింద పిటిషన్ దాఖలు చేసిన సామాజిక కార్యకర్త అర్జున్ పర్మార్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియాపై గత మూడేళ్లలో రూ 1585 కోట్లు ఖర్చు చేసింది. ఇది యూపీఏ సర్కార్‌తో పోలిస్తే 80 శాతం అధికం కావడం గమనార్హం. ప్రింట్ మీడియాపై కేంద్రం గడిచిన మూడేళ్లలో రూ 1630 కోట్లు ఖర్చు చేసింది. ఇది యూపీఏ పదేళ్ల పాలనలో చేసిన ఖర్చుపై 50 శాతం అధికం. ఇక అవుట్డోర్ పబ్లిసిటీ లోనూ ఎన్డీఏ ప్రభుత్వం భారీగానే వెచ్చించింది. యూపీఏ పదేళ్ల హయాంలో అవుట్డోర్ ప్రచారంపై రూ 202 కోట్లు ఖర్చు చేయగా, ఎన్డీఏ ప్రభుత్వం మూడేళ్లలోనే రూ 315 కోట్లు ఖర్చు చేసింది. -
మూడు నెలల్లో రూ. 15 కోట్ల ఖర్చు!
సామాన్యుడి ప్రభుత్వం తన ప్రచార కార్యక్రమాలకు భారీగా ఖర్చుపెడుతోంది. గడిచిన మూడు నెలల్లో ప్రింట్ మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు ఏకంగా రూ. 15 కోట్లు వెచ్చించింది. ఈ విషయం సమాచార హక్కు దరఖాస్తుకు వచ్చిన సమాధానంలో తేలింది. అయితే.. కేవలం ఢిల్లీలో వెలువడే పత్రికలు, ఇతర జాతీయ పత్రికలకే కాకుండా.. కేరళ, కర్ణాటక, ఒడిషా, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాలకు చెందిన స్థానిక పత్రికలలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మే 11 వరకు టీవీ ప్రకటనలు కాకుండా మిగిలిన ప్రకటనలకు మాత్రమే రూ. 14.56 కోట్లు ఖర్చుపెట్టిందని ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానంలో ఉంది. అమన్ పన్వర్ అనే న్యాయవాది ఈ దరఖాస్తు చేశారు. ఆప్ సర్కారు ప్రచారకండూతిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కనీసం పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవంటూనే మరోవైపు సొంత ప్రచారం కోసం ఇంత పెద్దమొత్తంలో ఖర్చుపెట్టడం ఏంటని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ప్రశ్నించారు. రెండు దశలుగా అమలుచేసిన సరి-బేసి విధానంపై ప్రచారం కోసమే ఢిల్లీ ప్రభుత్వం రూ. 5 కోట్లు ఖర్చుపెట్టింది.