సాక్షి,హైదరాబాద్: ‘రైతుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించబోమని’ కాంగ్రెస్ (congress) ప్రభుత్వానికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)హెచ్చరించారు.
నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘రుణ మాఫీ వచ్చే నాలుగేళ్లలో కూడా పూర్తిస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు. 35 రోజుల క్రితం రుణమాఫీ చెక్కు ఇచ్చినా..ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో డబ్బులు జమకాలేదు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది.
పండిన ప్రతి గింజకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది. ధాన్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం 26 వేల కోట్లు ఖర్చుపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై పట్టు లేదా ? రైతులంటే పట్టింపు లేదా ? ఎందుకు ధాన్యం కొనుగోలు చేయలేకపోతుంది ?.
రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. పత్తి, వరి పంటలను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ భారం అంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. రైతులపై భారం పడకుండా రైతు పక్షపాతిగా మోదీ (narendra modi) ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment