దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రైతులకు తీపికబురు అందించింది. రైతులకు తక్కువ వడ్డీకే అగ్రి గోల్డ్ రుణాలను అందిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఆసక్తి గల వ్యక్తులు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా రుణాన్ని పొందవచ్చు. ఈ వియాన్ని ఎస్‌బీఐ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఎస్‌బీఐ అగ్రి గోల్డ్ రుణాల పేరుతో రైతులకు రుణాలను అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ 7 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. యోనో యాప్ ద్వారా అప్లై చేసే రుణాలు వేగంగా మంజూరవుతాయి. రీపేమెంట్ ఆప్షన్ కూడా రైతులు తమకు కావాల్సినట్టుగా ఎంచుకోవచ్చు.
ఈ ఎస్‌బీఐ అగ్రి గోల్డ్ రుణం మాత్రం కేవలం బంగారు నగలపై మాత్రమే లభిస్తుంది. 24 క్యారట్, 22 క్యారట్, 20 క్యారట్, 18 క్యారట్ స్వచ్ఛత గల నగలు, ఆభరణాలపై రుణాలు తీసుకోవచ్చు. 50 గ్రాముల వరకు బ్యాంక్ గోల్డ్ కాయిన్స్ పైనా రుణాలు లభిస్తాయి. గోల్డ్ బార్స్ పై ఈ రుణాలు వర్తించవు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఎస్‌బీఐ అగ్రి గోల్డ్ రుణాలు తీసుకోవచ్చు. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, పిగ్గరీ, గొర్రెల పెంపకం లాంటి వాటికీ ఈ రుణాలు వర్తిస్తాయి. యంత్రాల కొనుగోలు, వ్యవసాయం, హార్టీకల్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ లాంటి అవసరాలకు ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు.
Avail SBI's Agri gold loan at lowest interest rate through YONO. #SBIAgriGoldLoan #SBI #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/jawDwSzWsH
— State Bank of India (@TheOfficialSBI) December 21, 2021
(చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. రూ.1.44 లక్షల కోట్లు రీఫండ్..!)
Comments
Please login to add a commentAdd a comment