State Bank of India
-
ఈసీ చేతికి ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారం
ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. న్యూమరికల్ నంబర్లతో కూడిన ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలను ఎస్బీఐ గురవారం ఈసీకి అందించింది. మార్చి 18న ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి న్యూమరికల్ నంబర్లతో పూర్తి వివరాలను వెల్లడించాలని ఎల్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే రెండు సార్లు బాండ్ల వివరాలను ఈసీకి పంపిన ఎస్బీఐ.. న్యూమరికల్ నంబర్లతో కూడిన బాండ్ల పూర్తి వివరాలను వెల్లడించకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఎస్బీఐ ఎన్నికల సంఘానికి సమర్పించిన బాండ్ల పూర్తి వివరాల్లో.. ఎలక్టోరల్ బాండ్లు కొన్నవారి పేర్లు. బాండ్ల నంబర్లు. బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల పేర్లు. రాజకీయ పార్టీ బ్యాంక్ ఖాతా నంబర్లో చివరి నాలుగు అంకెలు. ఏ పార్టీ ఎన్ని బాండ్లను నగదు రూపంలో మార్చుకున్న పూర్తి వివరాలు ఉన్నాయి. ఇక..‘బ్యాంక్ అకౌంట్ల భద్రత (సైబర్ సెక్యూరిటీ) విషయంలో రాజకీయ పార్టీల పూర్తి బ్యాంక్ ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు బహిర్గతం చేయటంలేదు. ఎన్నికల బాండ్ల కొనుగోలుదారుల కేవైసీ వివరాలను సైతం భద్రతా కారణాల రీత్యా వెల్లడించటం సాధ్యం కాదు. అయితే రాజకీయ పార్టీలను గుర్తించేందుకు ఆ వివారాలు అవసరం లేదు’ అని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో ఎస్బీఐ పేర్కొంది. అదేవిధంగా ఎస్బీఐ పూర్తి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అందించిన అనంతరం ఈసీ తన అధికారిక వెబ్సైట్ ఈ వివరాలను పొందుపర్చాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. చదవండి: ‘ఫ్యాక్ట్ చెక్ యూనిట్’ నోటిఫికేషన్‌పై సుప్రీం స్టే -
ఎన్నికల బాండ్ల డేటాను వెల్లడించిన ఈసీ
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. వివిధ రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను తమ అధికారిక వెబ్సైట్ https://www.eci.gov.in/లో పొందుపరిచింది. ఎవరు ఎన్ని బాండ్లు? ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే వివరాలు ఇందులో ఉన్నాయి. రూ.891 విలువైన ఎలక్టోరల్ బాండ్లను మేఘా సంస్థ కొనుగోలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎస్బీఐ నుంచి వచ్చిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని మార్చి 15 సాయంత్రంలోగా వెబ్సైట్లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 763 పేజీలతో రెండు పార్ట్‌లుగా వెబ్‌సైబ్‌లో అందుబాటులో ఉంచింది. న్యాయస్థానం ఇచ్చిన గడువుకు ఒక రోజు ముందే డేటాను ప్రచురించింది. పార్ట్-1లో ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు; పార్ట్-2లో బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకున్న పార్టీల వివరాలతో పాటు తేదీ, మొత్తాలకు సంబంధించిన డేటాను ఉంచింది. కాగా దేశంలో రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూరిన నిధుల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే.. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 దాకా.. ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ చేశామని, వీటిని వ్యక్తులు/సంస్థలు కొనుగోలు చేసి, రాజకీయ పారీ్టలకు విరాళం రూపంలో అందజేశారని వెల్లడించింది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్నాయని వివరించింది. చదవండి: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకీ తలకు తీవ్రగాయం -
ఎస్బీఐలోకి ఎద్దు ఎంట్రీ! ఆపై..
ఓ ఎద్దు.. తాపీగా బ్యాంకులోకి నడుచుకుంటూ వచ్చింది. ఆ దృశ్యం చూసి బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు జడుసుకుని ఓ మూలకు వెళ్లారు. అయినా అది బెదరకుండా ముందుకు వెళ్లపోయింది. ఇంతలో సెక్యూరిటీ గార్డు లాఠీతో దానిని వెనక నుంచి బయటకు తోలేసే యత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతోంది. ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లా షాగంజ్ ఎస్బీఐ బ్యాంకులో బుధవారం ఈ చిత్రం జరిగింది. అంతకు ముందు బ్యాంక్ బయట అది మరో ఎద్దుతో పోట్లాడిందట. ఈ క్రమంలోనే ఆ ఎద్దు బ్యాంక్ ఎంట్రెన్స్ డోర్ తెరిచి ఉండడంతో లోపలికి వచ్చేసిందని సెక్యూరిటీ గార్డు చెబుతున్నాడు. ఆ సమయంలో కస్టమర్లు పెద్ద సంఖ్యలో లేకపోవడంతో ప్రమాదం తప్పిందని మేనేజర్ అంటున్నారు. Bull Steals the Spotlight: Unlikely Visitor Creates Stir at SBI Bank in Unnao, Uttar Pradesh. 😂 🐂 Watch the viral video 📽️#SBI #Unnao #UttarPradesh #ViralVideo pic.twitter.com/lzonqeuXw9 — Lokmat Times (@lokmattimeseng) January 11, 2024 VIDEO CREDITS: Lokmat Times కిందటి ఏడాది ఏమో అనుకుంటాం.. అసోం దుభ్రిలో ఓ ఎద్దు షాపింగ్‌మాల్ మొత్తం కలియదిరిగి తెగ వైరల్ అయిపోయింది. -
సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్.. రూ. 4 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్ జరిగింది. రూ. 4.75 కోట్ల నిధులు స్వాహా అయినట్లు తేలింది. దీంతో బ్యాంక్ మేనేజర్ కార్తీక్ రాయ్‌పై కేసు నమోదైంది. అయితే ఓ సాఫ్ట్వేర్ యువతి అకౌంట్లోనే సుమారు రూ. 48 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల నుంచి యువతి డబ్బులు అడుగుతున్నా మేనేజర్ పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖాతాదారుల నగదు మాయం పట్ల బ్యాంక్ మేనేజర్ హస్తంపై పోలీసుల విచారణ జరుపుతున్నారు. చదవండి: TS: కొత్త పాలసీ? ఉచిత విద్యుత్‌పై కీలక ఆదేశాలు -
SBI YONO: నిలిచిపోయిన ఎస్బీఐ యోనో సేవలు
భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI)కు చెందిన యోనో (YONO) యాప్ సేవలు బుధవారం కొద్దిసేపు నిలిచిపోయాయి. జనవరి 10న ఉదయం 10:30 గంటల వరకు యోనో యాప్ సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ స్వయంగా కస్టమర్లకు తెలియజేసింది. ఈ మేరకు ఎస్బీఐ ‘ఎక్స్’ (ట్విటర్)లో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఓ పోస్టు చేసింది. "సాంకేతిక సమస్యల కారణంగా, యోనో సేవలు 2024 జనవరి 10న ఉదయం 10:30 గంటల వరకు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి మా ఇతర డిజిటల్ ఛానెల్‌లు అందుబాటులో ఉంటాయి" అని ఎస్బీఐ పేర్కొంది. కాగా బుధవారం ఉదయం 10.30 గంటల తర్వాత ఎస్బీఐ యోనో యాప్ సేవలు తిరిగి పునరుద్ధరించినట్లుగా తెలిసింది. pic.twitter.com/zKuerGTPo6 — State Bank of India (@TheOfficialSBI) January 10, 2024 -
ఎస్బీఐ కస్టమర్లకు మరింత దగ్గర కానున్న ఎంఎస్ ధోనీ!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)తో చేతులు కలిపింది. మిస్టర్ కూల్‌ను తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని వివిధ మార్కెటింగ్, ప్రమోషనల్ క్యాంపెయిన్లలో కీలక పాత్ర పోషిస్తారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒత్తిడితో కూడిన పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉంటూ స్పష్టమైన ఆలోచన, వేగంగా నిర్ణయం తీసుకోవడంలో ఎంఎస్ ధోనీ ప్రసిద్ధి చెందారు. ఆయనతో భాగస్వామ్యం దేశవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లు, వాటాదారులతో మరింత కనెక్ట్ అవ్వడానికి ఉపకరిస్తుందని ఎస్బీఐ పేర్కొంది. "సంతృప్త కస్టమర్‌గా ఎస్బీఐతో ధోని అనుబంధం ఆయన్ను మా బ్రాండ్ నైతికతకు పరిపూర్ణ స్వరూపంగా చేస్తుంది. ఈ భాగస్వామ్యంతో, విశ్వాసం, సమగ్రత, అచంచలమైన అంకితభావంతో దేశానికి, కస్టమర్లకు సేవ చేయాలనే మా నిబద్ధతను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. -
ఎస్బీఐ ఛైర్మన్‌గా మళ్ళీ ఆయనే.. మరో పది నెలలు..
భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) చైర్మన్ 'దినేష్ ఖరా' (Dinesh Khara) పదవీ కాలాన్ని మరో 10 నెలలు పొడిగిస్తూ కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ (ACC) నిర్ణయం తీసుకుంది. నిజానికి దినేష్ ఖరా అక్టోబర్ 2020లో మూడు సంవత్సరాల కాలానికి ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు 2024 ఆగష్టు నెల 28 వరకు అతడే చైర్మన్ పదవిలో కొనసాగుతారు. ఆయన వయసు 63 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పదవిలోనే ఉండనున్నారు. ఇదీ చదవండి: ఏఐ వల్ల ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే? 1984లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన దినేష్ ఖరా.. ఆ తరువాత రిటైల్ క్రెడిట్, ఎస్ఎమ్ఈ అండ్ కార్పొరేట్ క్రెడిట్, డిపాజిట్ మొబిలైజేషన్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఆపరేషన్, బ్రాంచ్ మేనేజర్ వంటి పదవుల్లో కొనసాగారు. ఆ తరువాత ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. కాగా ప్రస్తుతం వచ్చే ఏడాది ఆగష్టు వరకు ఇదే పదవిలో కొనసాగుతారు. -
పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ తగ్గింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి మేరకు.. ఈ రుణాలపై రెండున్నర శాతం మేర వడ్డీ తగ్గింపుతో పాటు ఆయా రుణాలపై ఎలాంటి అదనపు (ఇన్స్పెక్షన్, యాన్యువల్ రివ్యూ లేదా రెన్యూవల్ పేర్లతో వసూలు) చార్జీలను పూర్తిగా మినహాయించేలా నిర్ణయం తీసుకుంది. సాధారణంగా.. బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ‘పొదుపు’ రుణాలపై రూ.మూడు లక్షల వరకు కేవలం ఏడు శాతం వడ్డీకే రుణాలు ఇస్తుంటాయి. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య రుణాలపై ఆయా బ్యాంకులు నిర్దేశించుకునే నిర్ణీత ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు – రుణాలు ఇచ్చేందుకు ఆయా బ్యాంకులు నిర్దేశించుకున్న కనీస వడ్డీ రేటు) ప్రకారం మాత్రమే రుణాలు అందజేయాల్సి ఉంటుంది. ఈ ఎంసీఎల్ఆర్ అన్నది ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా.. ఒకే బ్యాంకులో ఒక్కో సమయంలో ఒక్కొక్క వడ్డీరేటు కూడా ఉంటుంది. అయితే, రూ.5 లక్షల పైబడి పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలపై ఆయా బ్యాంకులు తమ విచక్షణ మేరకు వడ్డీ రేటుకు రుణాలు ఇచ్చుకోవచ్చు. ఇలా.. ఐదు లక్షలకు పైబడి పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలపై కొన్ని బ్యాంకులు గరిష్టంగా 13 శాతం వడ్డీ రేటుకు కూడా రుణాలిస్తున్నాయి. ఇప్పుడు.. ఎస్బీఐ పొదుపు రుణాలపై రూ.5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉండే మొత్తాలపై 12.15 శాతం వడ్డీ రేటును 2.25 శాతం తగ్గించుకుని 9.90 శాతానికే రుణాలిచ్చేందుకు అంగీకారం తెలిపింది. అదే రూ.10 లక్షలకు పైబడి రూ.20 లక్షలలోపు రుణాలపై కూడా 12.15 శాతం ఉన్న వడ్డీ రేటును 2.45 శాతం తగ్గించుకుని 9.70 శాతానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. పొదుపు రుణాలను సకాలంలో చెల్లించే విషయంలో ఏపీ దేశంలోనే ముందంజలో ఉండడంతో ఎస్బీఐ వడ్డీ రేటు తగ్గింపునకు సానుకూలంగా స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. 2024 మార్చి నెలాఖరు వరకు.. ఇక మహిళలు తీసుకునే ‘పొదుపు’ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఈ ఏడాది మార్చి 10న జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లను కోరారు. పొదుపు రుణాలపై ప్రొసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ తదితర పేర్లతో అదనపు ఫీజులు కూడా వసూలు చెయ్యొద్దని ఆ సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కూడా ఇదే అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఎండీ ఇంతియాజ్ పలు దఫాలుగా వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో.. ఎస్బీఐ అప్పట్లోనే తాత్కాలికంగా నాలుగు నెలల కాలానికి, అంటే.. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జులై 31 వరకు తీసుకునే రూ.5 లక్షల పైబడిన పొదుపు రుణాలపై దాదాపు రెండు శాతం తగ్గించడానికి అనుమతి తెలిపింది. ఆ గడువు ముగియడంతో సెర్ప్ అధికారులు మళ్లీ రెండేళ్లపాటు వడ్డీ తగ్గించాలంటూ ఎస్బీఐకి లేఖ రాశారు. దీంతో ఆ బ్యాంకు ప్రాంతీయ డిప్యూటీ జనరల్ మేనేజర్ స్పందిస్తూ.. 2024 మార్చి నెలాఖరు వరకు రూ.ఐదు లక్షలకు పైబడిన పొదుపు రుణాలపై 2.15 శాతం నుంచి 2.45 శాతం తక్కువ వడ్డీరేటుకే రుణాలిచ్చేందుకు అంగీకారం తెలిపారు. అలాగే, రూ.20 లక్షల వరకు ఎలాంటి ప్రొసెసింగ్ చార్జీలు, ఇన్స్పెక్షన్ చార్జీలు, యాన్యువల్ రివ్యూ లేదా రెన్యూవల్ ఛార్జీలు వంటివి అదనంగా వసూలు చేయబోమని కూడా ఆయన ఆ లేఖలో తెలిపారు. నాలుగో వంతు రుణాలు ఎస్బీఐ నుంచే.. రాష్ట్రంలోని పొదుపు రుణాల్లో దాదాపు నాలుగో వంతు ఎస్బీఐ నుంచే తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు ఒక్క ఎస్బీఐ నుంచే రూ.9,378.24 కోట్ల రుణాలు తీసుకోగా.. పట్టణ ప్రాంతాల్లో రూ.2,565 కోట్ల రుణాలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే, గ్రామీణ మహిళలు తీసుకున్న రూ.9,378.24 కోట్లలో ఐదు లక్షలకు పైబడి కేటగిరిలో రూ.2,765 కోట్ల దాకా ఉన్నాయని.. వీటిపై ఇప్పుడు ఆ బ్యాంకు తీసుకున్న వడ్డీరేటు తగ్గింపు నిర్ణయంతో ఏటా రూ.వంద కోట్ల వరకు వడ్డీ భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా.. పట్టణ ప్రాంతంలో తీసుకున్న రుణం రూ.2,565 కోట్లలో రూ.5 లక్షల పైబడిన రుణాల్లో దాదాపు రూ.600 కోట్ల మొత్తంపై వడ్డీ రేటు తగ్గింపు వర్తించే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. ఇతర బ్యాంకులు సైతం భవిష్యత్‌లో వడ్డీ రేటు తగ్గించే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. మిగిలిన బ్యాంకులతోనూ సంప్రదింపులు.. ఇక పొదుపు రుణాలకు సంబంధించి అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులతోనూ వడ్డీ రేటు తగ్గింపు గురించి ప్రభుత్వంతోపాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయం కూడా నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోంది. త్వరలోనే ఆయా బ్యాంకులు కూడా నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నాం. – ఎండీ ఇంతియాజ్, సెర్ప్ సీఈవో -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! ఏటీఎం కార్డు వాడట్లేదా? అయితే...
ప్రస్తుతం యూపీఐ వినియోగం ఎక్కువైంది. ఎక్కడ డబ్బు చెల్లించాలన్న ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారానే అన్ని చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏటీఎం వాడకం బాగా తగ్గిపోయింది. ఇక రెండు మూడు కార్డులున్న వారి సంగతి చెప్పనక్కర్లేదు. అయితే ఎప్పుడోకానీ ఏటీఎం కార్డులు వాడని వారికి ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణంగా డెబిట్ కార్డు గడువు ముగిసిన తర్వాత బ్యాంకులు ఆటోమేటిక్‌గా కొత్త ఏటీఎం కార్డును పోస్ట్ ద్వారా కస్టమర్ల చిరునామాకు పంపుతాయి. కానీ ఓ ఎస్బీఐ కస్టమర్‌కు విభిన్న అనుభవం ఎదురైంది. దీనిపై ఆ కస్టమర్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్! ఇకపై మరింత..) ఆ కస్టమర్‌కు ఎస్బీఐలో 10 సంవత్సరాలుగా అకౌంట్ ఉంది. అతని డెబిట్ కార్డ్ గడువు ఇటీవలే ముగిసింది. కొత్త ఏటీఎం కార్డు ఆటో మేటిక్‌గా పోస్టులో ఇంటికి రావాల్సిఉండగా అతనికి బ్యాంక్ కొత్త ఏటీఎం కార్డును పంపలేదు. దీంతో బ్యాంక్ బ్రాంచికి వెళ్లిన అతనికి కొత్త కార్డు కావాలంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకులు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. దీంతో ఎక్స్ (ట్విటర్)లో ఎస్బీఐ యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేయగా ఎస్బీఐ స్పందించింది. కొత్త ఏటీఎం కార్డు ఎందుకు రాలేదో కారణాలను వివరించింది. కార్డు గడువు ముగిసేందుకు మూడు నెలల ముందే అప్రమత్తం కావాలని సూచించింది. కొత్త కార్డు ఆటోమేటిక్‌గా రావాలంటే.. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అకౌంట్ అయి ఉండకూడదు. డెబిట్ కార్డును ఏడాదిలో కనీసం ఒక్కసారైనా వాడి ఉండాలి. అకౌంట్‌కు కస్టమర్ పాన్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. -
డెబిట్ కార్డు పోయిందా? సింపుల్‌గా ఇలా బ్లాక్ చేయండి!
State Bank of India: కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఏటీఎమ్ కార్డు లేదా డెబిట్ కార్డు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చాలా మంది కంగారు పడతారు. కానీ డెబిట్ కార్డు పోగొట్టుకుంటే ఏ మాత్రం గాబరా పడకుండా.. సింపుల్‌గా బ్లాక్ చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. (ఇదీ చదవండి: హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్.. మిస్ చేసుకుంటే మళ్ళీ రాదేమో!) మీరు పోగొట్టుకున్నది స్టేట్ బ్యాంక్ ఏటీఎమ్ కార్డు అయితే.. ముందుగా స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ బ్లాక్ ది కార్డ్‌పై క్లిక్ చేయాలి. డెబిట్ కార్డును ఆన్లైన్ నుంచి బ్లాక్ చేయాలనుకుంటే తప్పకుండా మీ అకౌంట్ నెంబర్‌కి.. మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, కంట్రీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. క్యాప్చా ఫిల్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి తరువాత మీ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అందులో ఏ కార్డునైతే బ్లాక్ చేయాలనుకుంటారో.. అక్కడ కనిపించే నుంబర్లలో సెలక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక సారి కార్డుని బ్లాక్ చేసిన తరువాత దానిని తిరిగి ఆన్లైన్లో అన్‌బ్లాక్ చేయడం సాధ్యం కాదు. -
‘పొదుపు’ మహిళలకు వ్యక్తిగత రుణాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పొదుపు స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులైన మహిళలకు వైఎస్ జగన్ అందించిన చేయూత అక్కచెల్లెమ్మలు మరింతగా పురోభివృద్ధి సాధించేందుకు బాటలు వేసింది. రాష్ట్రంలో పొదుపు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలకు సంఘంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగానూ వ్యాపారానికి బ్యాంకు రుణాలు లభించనున్నాయి. ఈ రుణాల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రత్యేక అవగాహన ఒప్పందం చేసుకొంది. సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్, ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి. హేమ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎస్బీఐ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ, సెర్ప్ బ్యాంకు లింకేజీ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ కేశవ్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలకు బ్యాంకులు సంఘాల ప్రాతిపదికన మాత్రమే రుణాలు ఇస్తున్నాయి. మహిళలు పొదుపు సంఘంగా ఏర్పడి, నెలనెలా కొంత మొత్తం పొదుపు చేసుకుంటుంటే.. సంఘాల పని తీరు ఆధారంగా బ్యాంకులు వాటిలోని మహిళలందరికీ ఉమ్మడిగా మాత్రమే, సంఘం పేరుతోనే రుణాలిస్తున్నాయి. ఈ రుణాలతో వారి అత్యవసర కుటుంబ అవసరాలను తీర్చుకోవడంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలను కూడా నిర్వహిస్తూ మహిళలు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. దీంతో అప్పట్లో పొదుపు సంఘాలపై వడ్డీలు, చక్రవడ్డీల భారం పడి పొదుపు సంఘాలన్నీ కుదేలైపోయాయి. సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించలేకపోయాయి. నాలుగో వంతుకు పైగా సంఘాలు నిరర్ధక ఆస్తులు(ఏన్పీఏ)గా ముద్రపడ్డాయి. ఆ సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలంతా ఆర్థికంగా దెబ్బ తిన్నారు. తిరిగి రుణాలివ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితి మారింది. అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్ పూర్తి తోడ్పాటునందించారు. దీంతో పొదుపు సంఘాలు మళ్లీ జీవం పోసుకున్నాయి. ఇప్పుడు మహిళలు పొదుపు సంఘాల పేరిట తీసుకున్న రుణాలను నూటికి 99.55 శాతం మేర తిరిగి చెల్లిస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల చెల్లింపుల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. సీఎం జగన్ అందించిన ‘ఆసరా’ చంద్రబాబు చేసిన మోసంతో దారుణంగా దెబ్బ తిన్న మహిళల పొదుపు సంఘాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2019 ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ. 25,571 కోట్ల మేర అప్పులు ఉండేవి. ఆ రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా మహిళల చేతికి అందిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. అధికారంలోకి రాగానే, ఇచ్చిన హామీని అక్షరాలా అమలుచేస్తున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటికే మూడు విడతల్లో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మొత్తం 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ మొత్తం రూ.19,178 కోట్లు అందజేశారు. దీనికి తోడు గత చంద్రబాబు ప్రభుత్వం మధ్యలోనే ఆపేసిన పొదుపు సంఘాలపై సున్నా వడ్డీ పథకాన్ని మళ్లీ అమలు చేశారు. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ భారాన్ని కూడా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటిదాకా రూ. 3,615. 29 కోట్లు వడ్డీని అక్కచెల్లెమ్మలకు అందజేసింది. పెరిగిన మహిళా సంఘాల పరపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలతో మహిళలు సంఘాల పేరిట బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. వ్యాపారాలనూ వృద్ధి చేసుకుంటున్నారు. దీంతో మహిళా సంఘాల పరపతి పెరిగింది. పెద్ద ఎత్తున రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు బ్యాంకులు పొదుపు సంఘాలకు మొత్తం రూ. 1,09,956.87 కోట్ల రుణాలు అందజేశాయి. ఒకప్పుడు ఒక్కొక్క సంఘం రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల మధ్య మాత్రమే రుణాలు పొందగలిగేవి. ఇప్పుడు 3,00,468 సంఘాలు (మూడో వంతుకు పైగా) రూ. 10 లక్షలకు పైబడి రుణాలు పొందుతున్నాయి. వీటిలో 41,139 సంఘాలు ఏకంగా రూ. 20 లక్షల మేర రుణాలు పొందడం గమనార్హం. ఈ రుణాలతో వ్యాపారాభివృద్ధి చేసుకున్న పొదుపు సంఘాల మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారు ఇప్పుడు సొంతంగా వ్యాపారాలు చేసుకోగల స్థాయికి వచ్చారు. అయితే, వారికి బ్యాంకులు వ్యక్తిగతంగా రుణం ఇవ్వకపోవడం అవరోధంగా మారింది. ఇప్పుడు వీరికి రుణాలివ్వడానికి ఎస్బీఐ ముందుకు వచ్చింది. వారు ఏర్పాటు చేసుకొనే వ్యాపార సంస్థనుబట్టి సంఘంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా రుణాలు లభిస్తాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
Reset SBI ATM PIN: ఇంటినుంచే ఏటీఎమ్ పిన్ మార్చుకోండి
ఆధునిక ప్రపంచంలో ఆన్లైన్ పోర్టల్ వినియోగంలోకి వచ్చిన తరువాత మనం చేయాల్సిన పనులు దాదాపు ఇంటి నుంచి చేసేయడానికి వీలుపడుతోంది. ఇందులో భాగంగానే 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఖాతాదారులు ఇప్పుడు బ్యాంకుకి వెళ్లకుండానే ఏటీఎమ్ పిన్ మార్చుకోవచ్చు. దీని కోసం ఈ కింది దశలను పాటిస్తే సరిపోతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్టల్ ఓపెన్ చేయండి పర్సనల్ బ్యాంకింగ్ డీటైల్స్‌లో లాగిన్ అవ్వండి ఇ-సర్వీసుకి వెళ్లి ఏటీఎమ్ కార్డ్ సర్వీసు కోసం క్రిందికి స్క్రోల్ చేయండి. డ్రాప్-డౌన్ లిస్ట్ నుంచి కొత్త ఏటీఎమ్ పిన్ జనరేట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. కొనసాగడానికి 'Get Authorization PIN' ఆప్షన్ క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ పొందుతారు. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. రీసెట్ చేయాలనుకుంటున్న ఏటీఎమ్ పిన్ అకౌంట్ సెలక్ట్ చేసుకోండి. పిన్ రీసెట్ చేయడానికి కార్డు వివరాలు ఎంచుకోండి. కార్డు వివరాలు ఎంటర్ చేసిన తరువాత మీకు నచ్చిన, బాగా గుర్తుంచుకోగలిన రెండు అంకెలను ఎంటర్ చేయండి. తరువాత మిగిలిన రెండు అంకెలు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తాయి. పిన్ నాలుగు అంకెలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్రియ మొత్తం ముగిసే సమాయానికి ఎస్బిఐ మీకు ఒక కన్ఫర్మ్ మెసేజ్ పంపిస్తుంది. ఎస్బిఐ ఏటీఎమ్ పిన్ నెంబర్ మాత్రమే కాకుండా మొబైల్ నెంబర్ కూడా ఇంటినుంచి అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
ఎస్బీఐ అకౌంట్ బ్రాంచ్ మారాలనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని..
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ ఖాతాదారులు బ్యాంక్ కార్యకలాపాల్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. 45 కోట్ల మంది ఖాతాదారులు, 22వేల బ్రాంచీలు, 71,617 ఆటోమెటిక్ డిపాజిట్ మెషిన్లు, విత్‌డ్రా మెషిన్లు, 62617 ఏటీఎం సెంటర్ల నుంచి సేవల్ని అందిస్తుంది. ఇప్పుడా ఖాతాదారుల సంఖ్యను పెంచేలా బ్యాంక్ సేవల్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే అకౌంట్ హోల్డర్లు పలు రకాల సేవల్ని ఆన్లైన్లో ఇంటి వద్ద నుంచి చేసుకునే వెసలుబాటు కల్పించింది. వాటిలో అతి ముఖ్యమైంది బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని వ్యయప్రయాసలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ సమస్యల్ని తగ్గించేలా ఆన్లైన్లో అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కల్పించ్చింది. అయితే ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని అకౌంట్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చో తెలుసుకుందాం. ఇందుకు కోసం బ్యాంక్ విధించిన నిబంధనలకు లోబడి కేవైసీ, ఇతర వ్యక్తిగత వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఆ వివరాలు అందుబాటులో లేక పోతే అకౌంట్‌ను మార్చుకోలేం. చదవండి👉 ఈ ఉద్యోగాలు చేస్తున్నారా? అయితే వేరే జాబ్ చూసుకోవడం మంచిదంట? ఎస్బీఐ అకౌంట్‌ను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండిలా ♦ ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ఆన్లైన్ ఎస్బీఐ. కామ్‌లో లాగిన్ అవ్వాలి ♦అందులో పర్సనల్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై మనం ట్యాప్ చేయాలి. ♦ట్యాప్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ♦అనంతరం ఈ- సర్వీస్ ట్యాబ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ♦క్లిక్ చేస్తే స్క్రిన్‌పైన ట్రాన్స్ఫర్ సేవింగ్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై ట్యాప్ చేసి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న అకౌంట్ నెంబర్‌పై క్లిక్ చేయాలి. ♦అక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఐఎఫ్ఎస్ కోడ్‌ను ఎంటర్ చేయాలి ♦ఇతర వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసిన తర్వాత కన్ఫామ్ బటన్‌పై ట్యాప్ చేయాలి. ♦అనంతరం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మరోసారి కన్ఫామ్ చేయాలి ♦ ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసిన కొన్ని రోజులకు మీరు ఎక్కడికైతే బ్యాంక్ అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేశారో అక్కడి నుంచి బ్యాంక్ అకౌంట్ సేవలు ప్రారంభమవుతాయి. ఎస్బీఐ యోనో యాప్ నుంచి సైతం ఒకవేళ మీరు ఇలా కాకుండా ఎస్బీఐ యోనో యాప్ నుంచి బ్యాంక్ ఖాతాను మార్చుకోవచ్చు. ఇలా మార్చుకోవాలంటే మీరు తప్పని సరిగా బ్యాంక్ అకౌంట్‌కు రిజిస్టర్ మొబైల్ నెంబర్ జత చేయాల్సి ఉంటుంది. If you need help in transferring your account from one branch to another, then SBI has got your back. Use YONO SBI, YONO Lite and OnlineSBI from the comfort of your homes and bank safe.#SBIAapkeSaath #StayStrongIndia #YONOSBI #YONOLite #OnlineSBI #BankSafe pic.twitter.com/WlW8bb8aBG — State Bank of India (@TheOfficialSBI) May 7, 2021 చదవండి👉 వేలకోట్ల బ్యాంక్‌ను ముంచేసి..భార్యతో పారిపోయిన సీఈవో! -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! ఖాతాల నుంచి రూ.295 కట్! ఎందుకో తెలుసుకోండి..
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది బ్రాంచ్‌లు ఉన్న ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఖాతాదారులు ఉన్నారు. రకరకాల సేవల నిమిత్తం బ్యాంక్ పలు చార్జీల కింద కస్టమర్ల ఖాతాల నుంచి డబ్బులు కట్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయో తెలియక చాలా మంది మథనపడుతుంటారు. స్టేట్ బ్యాంకు ఇటీవల తమ ఖాతాల నుంచి రూ.295 కట్ చేసిందని, అది తిరిగి జమ కాలేదని చాలా మంది కస్టమర్లు చెబుతున్నారు. ఆ మొత్తం ఎందుకు కట్ చేశారో తెలియక తికమకపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ డబ్బు కట్ అవడానికి గల కారణం ఇక్కడ తెలుసుకోండి... నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) సేవల కోసం కస్టమర్ల అకౌంట్ల నుంచి ఆ డబ్బు కట్ చేస్తున్నట్లు తెలిసింది. ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఈఎంఐల ఆటోమేటిక్ చెల్లింపు కోసం ఎన్ఏసీహెచ్ ను ఉపయోగిస్తున్నారు. మీరు ఈఎంఐపై ఏదైనా కొనుగోలు చేసినా లేదా రుణం తీసుకున్నా నిర్ణీత తేదీలో మీ సేవింగ్ ఖాతా నుంచి ఈఎంఐ మొత్తం ఆటోమేటిక్‌గా కట్అవుతుంది. కాబట్టి గడువు తేదీకి ఒక రోజు ముందుగానే మీరు మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఉదాహరణకు ప్రతి నెల 5వ తేదీన కట్ అవుతుందనుకుంటే 4వ తేదీ నుంచి ఆ మొత్తం మీ ఖాతాలో ఉండాలి. ఇదీ చదవండి: ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లి.. ఆహ్వానితుల్లో అత్యంత ప్రముఖులు! ఎవరెవరు వస్తున్నారో తెలుసా? ఒక వేళ ఈఎంఐ ఆటోమేటిక్‌గా కట్ కాకపోయినా, ఈఎంఐకి తగినంత మొత్తం మీ ఖాతాలో లేకపోయినా రూ.295 పెనాల్టీ కింద కట్ అవుతుంది. ఇది కొన్నిసార్లు ఒకే సారి కాకుండా కొన్ని నెలల పాటు పెనాల్టీని కూడబెట్టి ఆపై పూర్తిగా కట్ కావచ్చు. మీరు ఈఎంఐ మొత్తానికి తగినంత బ్యాలెన్స్ అకౌంట్లో ఉంచడంలో విఫలమైతే బ్యాంక్ రూ. 250 పెనాల్టీ విధిస్తుంది. దీనికి 18 శాతం జీఎస్టీ అంటే రూ.45 అదనం. మొత్తంగా రూ.295 మీ ఖాతా నుంచి కట్ అవుతుందన్నమాట. ఇలా కట్ కాకూడదంటే మీరు ఈఎంఐకి సరిపడా మొత్తాన్ని గడవు తేదీకి ఒక రోజు ముందుగానే మీ అకౌంట్లో ఉంచాలని గుర్తుంచుకోండి. ఇదీ చదవండి: Samsung Galaxy Z Fold 5: మడత అంటే ఇదీ.. పర్ఫెక్షన్ అంటే ఇదీ! -
పాన్ లింక్ చేయకపోతే ఎస్బీఐ యోనో అకౌంట్ బ్లాక్ అవుతుందా?
పాన్ నంబర్ అప్డేట్ చేయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) యోనో అకౌంట్లు బ్లాక్ అవుతాయని, వెంటనే అప్డేట్ చేసుకోవాలంటూ లింక్‌తో కూడిన మెసేజ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని ఎస్బీఐ ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఇవి పూర్తిగా ఫేక్ అని తేల్చింది. ఒక వేళ అకౌంట్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నా ఎస్బీఐ అలాంటి లింక్‌లను పంపదని పేర్కొంది. ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడానికి ఎస్బీఐ అనేక సౌకర్యాలను అందిస్తోంది. ఇందులో భాగంగా యోనో మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ వినియోగం ఇటీవల బాగా పెరిగింది. దీని ద్వారా కస్టమర్లు బ్యాంకుకు వెళ్లకుండానే మొబైల్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను చేసుకోవచ్చు. అయితే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ నంబర్లు, ఆధార్ నంబర్లు, పాన్ కార్డ్ నంబర్లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నంబర్లు, ఓటీపీలు వంటి వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ షేర్ చేయకూడదని కస్టమర్లను బ్యాంక్ హెచ్చరించింది. సైబర్ నేరాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, వ్యక్తిగత సమాచార భద్రత గురించి ఎస్బీఐ కస్టమర్లను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది. మెసేజ్‌లు లేదా ఈ-మెయిల్ల ద్వారా పంపిన లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దని, తెలియని కాల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించి ఎలాంటి వ్యక్తిగత వివరాలను షేర్ చేయకూడదని సూచించింది. తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్‌ను నమ్మొద్దని, ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఖాతా వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. (ఇదీ చదవండి: అంబానీ సోదరి రూ.68 వేల కోట్ల కంపెనీకి అధిపతి.. ఈమె గురించి తెలుసా?) -
ఎఫ్డీ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు పెంపు..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తమ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి ఊరటనిచ్చింది. రూ.2 కోట్లలోపు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 5 నుంచి 25 బీపీఎస్ వరకు పెంచింది. అలాగే 400 రోజుల నిర్దిష్ట కాలవ్యవధితో కొత్త ఎఫ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది 2023 మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి గల ఎఫ్డీలపై 3 నుంచి 7 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది. 2-3 సంవత్సరాల కాలానికి ఎఫ్డీ చేసిన సీనియర్ సిటిజన్లుకు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ అందించే అత్యధిక వడ్డీ రేటు ఇదే. పెంచిన ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎస్బీఐ 2 నుంచి 3 సంవత్సరాల వ్యవధికి చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేటును అత్యధికంగా 25 బీపీఎస్ పెంచింది. వీటిపై గతంలో 6.75 శాతం వడ్డీ వస్తుండగా ఇప్పుడు 7 శాతానికి పెరిగింది. అలాగే 3 నుంచి 10 ఏళ్ల వ్యవధి ఎఫ్‌డీలపైనా 25 బేసిస్ పాయింట్లు పెంచింది. వీటికి గతంలో 6.25 శాతం వడ్డీ ఇస్తుండగా తాజాగా 6.5 శాతం అందిస్తోంది. ఇక 1 నుంచి 2 సంవత్సరాల కాలానికి చేసే ఎఫ్డీలపై అత్యల్పంగా కేవలం 5 బేసిస్ పాయింట్లు మాత్రమే వడ్డీ రేటు పెంచింది. వీటిపై 6.75 శాతం ఉన్న వడ్డీ రేటు ప్రస్తుతం 6.8 శాతానికి పెరిగింది. అయితే సంవత్సరం కన్నా తక్కువ కాల వ్యవధి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎటువంటి పెంపూ లేదు. 211 రోజుల నుంచి సంవత్సరం లోపు చేసే ఎఫ్డీలపై 5.75 శాతం, 180 నుంచి 210 రోజుల లోపు వాటిపై 5.25 శాతం, 46 నుంచి 179 రోజుల వరకు చేసే ఎఫ్డీలపై 4.5 శాతం, 7 నుంచి 45 రోజులలోపు వాటిపై 3 శాతం వడ్డీ రేటును ఎస్బీఐ అలాగే కొనసాగిస్తోంది. (ఇదీ చదవండి: సీనియర్ సిటిజన్స్ కోసం కొత్త పాలసీ.. ప్రయోజనాలు ఇవే..) -
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. బీఅలర్ట్!
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్రెడిట్ కార్డ్ యూజర్లపై మరింత భారాన్ని మోపింది. క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన ఫీజును సవరిస్తున్నట్లు ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ తాజాగా ప్రకటించింది. కొత్త ఫీజులు మార్చి 17 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు వినియోగదారులకు మెసేజ్‌లు, మెయిల్స్ పంపించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా రెంట్ చెల్లింపులపై ప్రాసెసింగ్ ఫీజును రూ.199లకు పెంచింది. ఇది ఇంతకు ముందు రూ.99 ఉండేది. రెంట్ చెల్లింపులపై గతేడాది నవంబర్లోనే రూ.99లు చేసిన ఎస్బీఐ తాజా మళ్లీ పెంచింది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనం. సింప్లీ క్లిక్ కార్డ్‌లకు సంబంధించిన అనేక నిబంధనలను ఈ ఏడాది జనవరిలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ సవరించింది. పలు పరిమితులు విధించింది. వోచర్లు, రివార్డ్ రిడెమ్షన్‌లకు సంబంధించి మార్పులు చేసింది. జనవరి 6 తర్వాత వచ్చిన మార్పుల ప్రకారం సింప్లీ క్లిక్ కార్డ్ హోల్డర్లు గరిష్ట ఆన్లైన్ స్పెండింగ్‌కు చేరుకున్నాక ఇచ్చే క్లియర్ ట్రిప్ వోచర్లను ఒకే ట్రాన్సాక్షన్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది. వీటిని ఇతర ఆఫర్లతో కలిపి వినియోగించుకునేందుకు ఆస్కారం లేదు. ఇక అమెజాన్‌లో ఆన్లైన్ కొనుగోళ్లకు సంబంధించిన రివార్డ్ పాయింట్ల వినియోగంలో కూడా నిబంధనలు జనవరి 1 నుంచి మారాయి. (ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్: వడ్డీ బాదుడు షురూ!) -
రూ.100 తిరిగి ఇవ్వని బ్యాంకు.. షాకిచ్చిన కోర్టు.. ఏకంగా రూ. 65 వేలు
సాక్షి, చెన్నై: వినియోగదారుడికి రూ.100 తిరిగి ఇవ్వని బ్యాంకు నష్టపరిహారంగా రూ. 65 వేలు అందజేయాలని వినియోగదారుల ఫోరంను కోర్టు ఆదేశించింది. చెంగల్పట్టు జిల్లా మధురాంతకంకు చెందిన నిర్మల్ కుమార్ చెన్నై సౌకార్‌పేట గోవిందప్పనాయకన్ వీధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2018 జూలై 24న స్నేహితుడు అకౌంట్లో నగదు డిపాజిట్ చేశాడు. ఆ సమయంలో రూ. 900కు గాను రెండు 500 రూపాయల నోటును బ్యాంకు సిబ్బందికి ఇచ్చాడు. చలానాలో రెండు 500 నోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. బ్యాంక్ క్యాషియర్ రూ.900 లకు బదులుగా నిర్మల్ కుమార్ స్నేహితుడి ఎకౌంట్‌కు వెయ్యి రూపాయలు పంపించేశాడు. దీంతో నిర్మల్ కుమారు బ్యాంకు క్యాషియర్ వద్ద మిగిలిన రూ. 100 ఇవ్వమని కోరాడు. ఈ వ్యవహారాన్ని నిర్మల్ కుమార్ బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. అతను ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని తరువాత ముంబైలో ఉన్న ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారు కూడా చర్యలు తీసుకోలేదు. చివరిగా చెంగల్పట్టు వినియోగదారుల ఫోరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును పరిశీలించిన వినియోగదారుల ఫోరం కోర్టు న్యాయమూర్తి బాధితుడికి నష్టపరిహారంగా రూ. 50 వేలు, కేసు దాఖలు చేయడానికి అయిన ఖర్చు రూ. 15 వేలు కలిపి మొత్తం రూ. 65 వేలు అందజేయాలని సంబంధిత అధికారికి ఆదేశాలు జారీ చేశారు. -
ఇన్ స్టెంట్ లోన్స్ తీసుకుంటున్నారా ..?
-
SBI ఖాతాదారులకు మరో బిగ్ షాక్..
-
డిగ్రీ అర్హతతో 5,008 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
బ్యాంకు కొలువుల అభ్యర్థులకు..శుభవార్త! దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఐదువేలకుపైగా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు దశల రాత పరీక్ష ద్వారా నియామకాలు ఖరారు చేయనుంది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానంతో పాటు విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా క్రమం తప్పకుండా క్లరికల్, పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్), స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతోంది. కాబట్టి ఐబీపీఎస్, ఎస్ఎస్సీ వంటి పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు అదే ప్రిపరేషన్‌తో.. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు కూడా పోటీ పడొచ్చు. ఐదు వేలకుపైగా పోస్టులు ఎస్బీఐ మొత్తం 5,008 జూనియర్ అసోసియేట్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో హైదరాబాద్ సర్కిల్లో 225 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అర్హతలు ►నవంబర్ 30,2022 నాటికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ►వయసు: ఆగస్ట్ 1, 2022 నాటికి 18–28 ఏళ్లుగా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. తొలిసారి ప్రాంతీయ భాషల్లో ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ తాజా నోటిఫికేషన్లో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం.. తొలిసారిగా పరీక్షలను ్ర΄ాంతీయ భాషల్లో నిర్వహించనుండడం. తెలుగు సహా మొత్తం ఇరవై భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న భాషలో పరీక్షకు హాజరు కావచ్చు. హైదరాబాద్ సర్కిల్లో పరీక్ష రాయాలనుకునే వారు తెలుగు లేదా ఉర్దూ మీడియంలను ఎంచుకునే అవకాశముంది. రెండు దశల రాత పరీక్ష ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ పోస్టులకు రెండు దశల రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అందులో సాధించిన ఉత్తీర్ణత, కటాఫ్ లిస్ట్ ఆధారంగా..తదుపరి దశలో జరిపే మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతిమంగా మెయిన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగానే నియామకాలు ఖరారు చేస్తారు. స్థానిక భాష పరీక్ష అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే మాధ్యమాన్ని దరఖాస్తు సమయంలోనే తెలియజేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే పరీక్ష పేపర్ మాధ్యమం ఉంటుంది. మాతృ భాష కాకుండా.. వేరే భాషలో పరీక్ష రాసిన అభ్యర్థులకు.. మెయిన్ ఎగ్జామ్ తర్వాత స్థానిక భాష పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ 100 మార్కులు ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్ష.. ప్రిలిమినరీ. మూడు విభాగాలుగా ఆన్లైన్లో మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ మినహా మిగతా విభాగాలకు సంబంధించి.. అభ్యర్థులు తమ రాష్ట్రానికి చెందిన లేదా తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాషలో పరీక్ష రాయొచ్చు. 200 మార్కులకు మెయిన్ తొలిదశ రాత పరీక్ష ప్రిలిమినరీలో చూపిన ప్రతిభ ఆధారంగా 1:10 నిష్పత్తిలో (ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున) తదుపరి దశ మెయిన్ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే మెయిన్ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో 200 మార్కులకు జరుగుతుంది. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–60 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 2గంటల 40 నిమిషాలు. మెయిన్ ఎగ్జామ్‌లోనూ అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్ మినహా మిగతా విభాగాలను తమకు ఆసక్తి, అర్హత ఉన్న ప్రాంతీయ భాషలో హాజరయ్యే అవకాశం ఉంది. నవంబర్‌లో పరీక్ష.. సన్నద్ధత ఇలా ఎస్బీఐ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం–ప్రిలిమినరీ పరీక్ష నవంబర్‌లో జరుగనుంది. మెయిన్ మాత్రం ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. అంటే..ప్రిలిమ్స్‌కు గరిష్టంగా రెండు నెలలు, మెయిన్స్‌కు మూడు లేదా నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ముందుగా ప్రిలిమినరీ పరీక్ష తేదీ వరకు.. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో ఉన్న సబ్జెక్ట్‌లకు ప్రిపరేషన్ సాగించాలి. ఆ తర్వాత పూర్తిగా మెయిన్స్‌పై దృష్టి పెట్టాలి. మెయిన్ పరీక్షలో మాత్రమే ఉన్న జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అభ్యర్థుల ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరిశీలించే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌పై అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. న్యూమరికల్ ఎబిలిటీ పరీక్షలో మరో కీలక విభాగం ఇది. మెయిన్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగానికి సరితూగే విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అర్థమెటిక్ అంశాలు (పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలు)పై పట్టు సాధించేలా ్ర΄ాక్టీస్ చేయాలి. వీటితో΄ాటు డేటాఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్లనూ సాధన చేయాలి. రీజనింగ్ ఈ విభాగం ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ మెయిన్‌లోనే ఉండే ఈ విభాగంలో రాణించాలంటే.. బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించిన చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో.. కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఎకానమీ, ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్‌ను పరీక్షించే ఉద్దేశంతో మెయిన్‌లో మాత్రమే ఉండే విభాగం ఇది. ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి. గత ప్రశ్న పత్రాల సాధన అభ్యర్థులు గత ప్రశ్న పత్రాల సాధన, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా ఏ టాపిక్కు ఎంత వెయిటేజీ ఉందో తెలుస్తుంది. అంతేకాకుండా సమాధానాలను సరి చూసుకోవడం ద్వారా తాము ఇంకా అవగాహన ΄÷ందాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. మాక్ టెస్ట్‌లకు హాజరవడం వల్ల టైమ్ మేనేజ్మెంట్ కూడా అలవడుతుంది. ఇలా ఇప్పటి నుంచే మెయిన్ ఎగ్జామినేషన్ దృక్పథంతో చదివితే.. ప్రిలిమ్స్‌లో సులువుగా నెగ్గడానికి, ఆ తర్వాత మెయిన్‌లో రాణించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. ►ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 27, 2022 ►ప్రిలిమినరీ పరీక్ష తేదీ: నవంబర్, 2022లో ►మెయిన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2022 లేదా జనవరి 2023లో ►పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers -
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ బంపరాఫర్
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ బంపరాఫర్ ఇచ్చింది. ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం ఎస్బీఐ వీకేర్ గడువును మార్చి 31,2023 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ స్కీమ్ పథకంలో చేసిన డిపాజిట్లకు అదనపు వడ్డీ లభిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ ఎఫ్డి స్కీమ్ ఎస్బీఐ వీకేర్ ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టే గడువును మార్చి 31, 2023 వరకు పొడిగించింది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం..సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక “ఎస్బీఐ వీకేర్” డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టబడింది. ఈ స్కీమ్‌లో అర్హత పొందిన సీనియర్ సిటిజన్లు 30 బేసిస్ పాయింట్లు అదనంగా పొందవచ్చు. అంటే సాధారణ ప్రజలకంటే 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకు లభిస్తుంది. సిటిజన్లకు సాధారణ ప్రజలకు వర్తించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ ఈ పథకం ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం ఎస్బీఐ సాధారణ ప్రజలకు 5ఏళ్ల ఎఫ్డీకి 5.65శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుండగా...సీనియర్ సిటిజన్ ప్రత్యేక ఎఫ్డీ పథకంలో చేసిన డిపాజిట్లకు 6.45శాతం వడ్డీ లభిస్తుంది. డిపాజిట్ వ్యవధి : కనిష్టంగా - 5 సంవత్సరాలు. గరిష్టంగా - 10 సంవత్సరాలు వడ్డీ చెల్లింపు : టర్మ్ డిపాజిట్ - నెలవారీ/ త్రైమాసిక వ్యవధిలో ప్రత్యేక టర్మ్ డిపాజిట్ : మెచ్యూరిటీ వడ్డీపై టీడీఎస్ డిడక్ట్ చేసి కస్టమర్ ఖాతాకు జమ చేయబడుతుంది రుణ సౌకర్యం సీనియర్ సిటిజన్లకు పలు బ్యాంకులు ప్రత్యేక ఎఫ్డి పథకాల్ని ఇతర బ్యాంకులు సైతం అందిస్తున్నాయి. వీటిలో ఐసిఐసిఐ బ్యాంక్ , హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో పాటు ఇతర బ్యాంకులున్నాయి. -
ఆల్‌టైమ్ గరిష్టానికి.. జోరు మీదున్న ఎస్బీఐ షేరు!
ముంబై: స్టాక్ సూచీలు రెండోరోజూ డీలాపడ్డాయి. సెన్సెక్స్ 413 పాయింట్లు నష్టపోయి 60 వేల దిగువున 59,866 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 18 వేల స్థాయిని కోల్పోయింది. చివరికి 126 పాయింట్లు పతనమై 17,877 వద్ద నిలిచింది. డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్(3%), రిలయన్స్(ఒకశాతం) పతనమై సూచీలను ఏదశలోనూ కోలుకోనివ్వలేదు. అయితే ఆటో, మెటల్ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి రూ.79.71 వద్ద స్థిరపడింది. ఆయిల్ కంపెనీల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో రూపాయిపై ఒత్తిడి పడిందని నిపుణులు తెలిపారు. లాభాల్లోంచి నష్టాల్లోకి... సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంతో 60,454 వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 18,046 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్ 329 పాయింట్లు, నిఫ్టీ 92 పాయింట్లను ఆర్జించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. మెప్పించని తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిస్టింగ్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ షేరు లిస్టింగ్ తొలిరోజే నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.510తో పోలిస్తే ఫ్లాటుగా రూ.510 వద్దే లిస్టయ్యింది. రూ.484.5 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 0.5శాతం స్వల్ప నష్టంతో రూ.508 వద్ద ముగిసింది. పీవీఆర్ షేర్ల అమ్మకం మూడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ ఫండ్లు మల్టీప్లెక్స్ వ్యాపార సంస్థ పీవీఆర్‌కు చెందిన 40.45 లక్షల ఈక్విటీ షేర్లను ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించాయి. ఈ లావాదేవీ విలువ రూ.759.14 కోట్లుగా ఉంది. ఫలితంగా బీఎస్ఈలో పీవీఆర్ షేరు 4.40 శాతం నష్టపోయి రూ.1,844 వద్ద స్థిరపడింది. కొనసాగిన ఎస్బీఐ రికార్డు రెండోరోజూ ఎస్బీఐ షేరు జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. ట్రేడింగ్‌లోనూ ఒకశాతానికి పైగా లాభపడి రూ.579 వద్ద ఆల్‌టైం హై స్థాయిని తాకింది. చివరికి క్రితం ముగింపు(రూ.572)తో పోలిస్తే ఎలాంటి లాభ, నష్టానికి లోనవకుండా రూ.572 వద్ద స్థిరపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల తర్వాత మార్కెట్ విలువ రూ.5 లక్షల కోట్లకు చేరిన మూడో బ్యాంకు, తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా అవతరించింది. ► ఆటో షేర్లలో భాగంగా మారుతీ సుజుకీ షేరు ట్రేడింగ్‌లో నాలుగు శాతం లాభపడి రూ.9,351 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 3% పెరిగి రూ.9,245 వద్ద నిలిచింది. -
రష్యాతో ’రూపాయి’ట్రేడింగ్, ఇక పెత్తనం అంతా ఎస్బీఐదే!
న్యూఢిల్లీ: రష్యాతో రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐని అధీకృత బ్యాంకుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎ. శక్తివేల్ తెలిపారు. త్వరలో రష్యా కూడా తమ దేశం తరఫున అధీకృత బ్యాంకును ఎంపిక చేసి, 15 రోజుల్లోగా ప్రకటించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ విషయాలు చెప్పినట్లు శక్తివేల్ వివరించారు. ఎగుమతి, దిగుమతి లావాదేవీలను దేశీ కరెన్సీ మారకంలో నిర్వహించేందుకు అదనంగా ఏర్పాట్లు చేయాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్యా–భారత్ మధ్య సింహభాగం వాణిజ్యం డాలర్ మారకంలో కాకుండా రూపాయి మారకంలోనే జరుగుతోంది. ఉక్రెయిన్ మీద దాడులకు తెగబడినందుకు గాను రష్యాపై అమెరికా, యూరప్ ఆంక్షలు విధించడమే ఇందుకు కారణం. -
ఖాతాదారులకు భారీ షాక్, రుణాలపై స్పందించిన ఎస్బీఐ చైర్మన్ ఖారా!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల (అర శాతం) వరకూ పెంచింది. దీంతో రుణగ్రహీతలు నెలవారీగా చెల్లించే వాయిదాల (ఈఎంఐ) భారం మరింత పెరగనుంది. కొత్త రేట్లు ఆగస్టు 15 నుంచి వర్తిస్తాయని బ్యాంకు వెల్లడించింది. ఈ సందర్భంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ రిటైల్, కార్పొరేట్ లోన్లకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం మేర రుణ వృద్ధిని సాధించగలమని అంచనా వేస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రుణాల వృద్ధి గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే రూ.25,23,793 కోట్ల నుంచి 14.93 శాతం పెరిగి రూ.29,00,636 కోట్లకు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో రిటైల్ రుణాలు సుమారు 19 శాతం, కార్పొరేట్ రుణాలు 11 శాతం మేర పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ రుణాలు రూ.2.5–3 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని, చిన్న.. మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) నుంచి కూడా రుణాలకు డిమాండ్ నెలకొందని ఖరా వివరించారు. త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లతో యోనో 2.0 యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు విశ్లేషకులతో సమావేశంలో ఆయన తెలిపారు. యోనోలో ఇప్పటివరకూ నమోదు చేసుకున్న వారి సంఖ్య 5.25 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. కొత్త సేవింగ్స్ ఖాతాల్లో 65 శాతం అకౌంట్లను యోనో ద్వారానే తెరుస్తున్నట్లు ఖారా వివరించారు. ప్రభుత్వాలు భారీగా టీకాల కార్యక్రమం నిర్వహించడంతో కరోనా మహమ్మారి చాలా మటుకు అదుపులోకి వచ్చిందని..ఆంక్షల తొలగింపుతో ఎకానమీ మెరుగుపడుతోందని ఆయన చెప్పారు. చదవండి👉 ఎస్బీఐ:'హాయ్' చెప్పండి..వాట్సాప్‌లో బ్యాంక్ సేవల్ని పొందండి! -
ఎస్బీఐ డిపాజిట్, రుణ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పెంపుబాట నేపథ్యంలో... భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన డిపాజిట్, రుణ రేట్లను పెంచింది. మే తొలి వారం తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను రెండు దఫాలుగా (0.40 శాతం, 0.50 శాతం చొప్పున) 4.9 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదటి వారంలో ఆర్బీఐ 0.50 శాతం రెపో పెంపు నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ వెబ్సైట్ తెలిపిన సమాచారం ప్రకారం... ►ఎంపిక చేసిన కాలపరిమితులకు సంబంధించి రూ. 2 కోట్ల కంటే తక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 0.20 శాతం వరకూ పెరిగాయి. ఈ మార్పు తక్షణం అమల్లోకి వచ్చింది. ►211 రోజుల నుంచి ఏడాది మధ్య డిపాజిట్ రేటు ప్రస్తుతం 4.40% ఉంటే ఇది 4.60%కి పెరిగింది. సీనియర్ సిటిజన్లు ప్రస్తుతం 4.90% వడ్డీరేటు తీసుకుంటుండగా, ఇది 5.10%కి పెరగనుంది. ►ఇక ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్ రేటు 0.20 శాతం పెరిగి 5.30%కి చేరింది. ఈ విభాగంలో సీనియర్ సిటిజన్లు 5.80% వడ్డీ అందుకుంటారు. ►రెండు నుంచి మూడేళ్ల మధ్య వడ్డీరేటు 5.20 శాతం నుంచి 5.35 శాతానికి ఎగసింది. సీనియర్ సిటిజన్లు పొందే రేటు 5.70 శాతం నుంచి 5.85 శాతానికి పెరుగుతుంది. రూ. రెండు కోట్లపైన డిపాజిట్లు దాటితే... రూ.2 కోట్లు ఆపైబడిన డిపాజిట్లకు సంబంధించి వివిధ కాలపరిమితులపై వడ్డీరేటు 0.75%వరకూ పెరిగింది. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య రేటు 4% నుంచి 4.75%కి పెరిగింది. సీనియర్ సిటిజన్లకు ఈ రేటు 4.50% నుంచి 5.25 శాతానికి పెరుగుతుంది. రుణ రేట్ల పెరుగుదల ఇలా.. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణరేటు (ఎంసీఎల్ఆర్)ను కూడా ఎస్బీఐ 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. జూన్ 15 నుంచి తాజా పెంపు అమల్లోకి వస్తుంది. గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలకు దాదాపు ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.20% నుంచి 7.40% కి పెరగనుంది. వెబ్సైట్ ప్రకారం, రెపో ఆధారిత లెండింగ్ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్)ను కూడా జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చేట్లు పెంచింది. ఐడీబీఐ బ్యాంక్ కూడా... మరోవైపు ఐడీబీఐ బ్యాంక్ రూ.2 కోట్ల దిగువన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. దేశీయ టర్మ్ డిపాజిట్లు, నాన్–రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ), నాన్–రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) టర్మ్ డిపాజిట్లపై 15వ తేదీ నుంచి తాజా పెంపు నిర్ణయం అమలవుతుంది. తాజా నిర్ణయం ప్రకారం, 91 రోజుల నుంచి 6 నెలల మధ్య డిపాజిట్లపై రేటు 3.75% నుంచి 4%కి పెరుగుతుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.60%కి చేరింది. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మధ్య రేటు 5.60% నుంచి 5.75%కి ఎగసింది. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త!
SBI Hikes Interest Rates On Fixed Deposits: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త. ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానుండగా...రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్న డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీరేట్లు వర్తించనున్నాయని అధికారులు తెలిపారు. 7 నుంచి 45 రోజుల వ్యవధి మినహాయించి మిగిలిన టెన్యూర్ వడ్డీరేట్లను పెంచింది. దీంతో 46 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్‌లో 3శాతం ఉన్న వడ్డీ రేటు 3.50శాతం, 180 నుంచి 210 టెన్యూర్‌లో 3.10 నుంచి 3.50శాతం వరకు పెరిగాయి. సంవత్సరం కంటే తక్కువ అంటే 211 రోజుల టెన్యూర్‌లో 3.30 శాతం నుంచి 3.75శాతం వరకు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల టెన్యూర్‌లో 3.60 నుంచి 4శాతం, 2 సంవత్సరాల నుంచి 3సంవత్సరాల లోపు టెన్యూర్‌లో 3.6శాతం నుంచి 4.25శాతం, మూడు నుంచి 5 సంవత్సరాల లోపు టెన్యూర్‌లో 4.50 శాతం వరకు, 5ఏళ్ల నుంచి 10 టెన్యూర్ వరకు 4.50శాతం వరకు పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ల పిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. 7 నుంచి 45 రోజుల టెన్యూర్‌ను మినహాయించింది. 46 నుంచి 179 రోజుల టెన్యూర్‌లో 3.5శాతం నుంచి 4శాతానికి, 180 రోజుల నుంచి 210 రోజుల టెన్యూర్‌లో 3.6శాతం నుంచి 4శాతానికి పెంచింది. ఒక సంవత్సరం కంటే తక్కువ అంటే 211 రోజుల టెన్యూర్‌లో 3.80శాతం నుంచి 4.25 శాతానికి, ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు టెన్యూర్‌లో 4.1 శాతం నుంచి 4.5శాతం వరకు, 2 సంత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు టెన్యూర్‌లో 4.1 నుంచి 4.75శాతం వరకు, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు టెన్యూర్‌లో 4.1 నుంచి 5శాతం , 5 సంవత్సరాల నుంచి 10ఏళ్ల టెన్యూర్‌లో 4.1 శాతం నుంచి 5శాతానికి వడ్డీ రేట్లు పెంచుతూ తాజాగా ఎస్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చదవండి👉వందల కోట్లే..ఎస్బీఐ కార్డ్స్‌కు పెరిగిన లాభం! -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్!
ఎస్బీఐ తన ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. తమ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే బ్యాంక్ సిస్టమ్‌ను అప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునే వారికి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మార్చి 20న రాత్రి 11:30 గంటల నుంచి మార్చి 21 2:00 గంటల మధ్య కాలంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నట్లు ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో సిస్టమ్‌ను అప్డేట్ చేస్తోంది. ఈ కారణంగా రేపు రెండున్నర గంటలపాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్/యోనో/యోనో లైట్ సేవలు ఈ రెండున్నర గంటల పాటు అందుబాటులో ఉండవని ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలని ట్వీట్ చేశారు. మరి ఈ సమయాల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు ముందుగానే జాగ్రత్త పడండి. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/t1GGRRxWjx — State Bank of India (@TheOfficialSBI) March 20, 2022 (చదవండి: రూ.53 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా కంటే ఎక్కువ రేంజ్!) -
ఎస్బీఐకి మీనా జ్యువెలర్స్ కుచ్చుటోపీ
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.364 కోట్లు మోసగించిన వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన మీనా జ్యువెలర్స్ సంస్థతో పాటు డైరెక్టర్లపై బెంగళూరు సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. మీనా జ్యువెలర్స్ ప్రమోటర్లు ఉమేష్ జెత్వాని, అతడి భార్య హేమ, కుమారుడు కరణ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఎస్బీఐ డీజీఎం ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ చర్యలు చేపట్టినట్లు తెలియగా, 2015–19 మధ్య కాలంలో మీనా జ్యువెలర్స్ ప్రమోటర్లు నకిలీ పత్రాలతో బ్యాంకు నుంచి క్రెడిట్ పొంది, ఆ రుణాలను ఇతర సంస్థలు, ఉపయోగాలకు మళ్లించినష్టాలుగా చూపించినట్టు ఎస్బీఐ డీజీఎం ఫిర్యాదులో వెల్లడించారు. మీనా జ్యువెలర్స్ హైదరాబాద్ కేంద్రంగా మూడు ఔట్లెట్లు నిర్వహిస్తోంది. బంగారం, వజ్రాలు, వెండి, ప్రీమియం గడియారాలు, అత్యాధునిక మొబైల్ ఫోన్ల వ్యాపారం చేస్తోంది. 2001లో ఫర్మ్ సంస్థగా మొదలై, 2007లో లిమిటెడ్ కంపెనీగా మారింది. ఫోరెన్సిక్ ఆడిట్‌తో వెలుగులోకి... బ్యాంకులను మోసం చేసేందుకు ఖాతా బుక్కులను తారుమారు చేసినట్లు ఎస్బీఐ థర్డ్ పార్టీ ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో బయటపడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఔట్లెట్లలో క్లోజింగ్ స్టాక్ ఎక్కువగా చూపించి, బ్యాంకుకు అందించిన స్టాక్‌లో వ్యత్యాసాలు వచ్చాయని, వ్యాట్ లెక్కల్లో కూడా అవకతవకలకు పాల్పడ్డారని తేలిందని పేర్కొన్నారు. ఇద్దరు గ్యారెంటీర్లు మనోజ్ గన్వానీ, భావనా గన్వానీ సంతకాలను ప్రమోటర్లు ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదులో స్పష్టంచేశారు. ఈ విచారణలో మీనా జ్యువెలర్స్‌కు చెందిన మరో రెండు కంపెనీలు మీనా జ్యువెలర్స్ ఎక్స్‌క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్, మీనా జ్యువెలర్స్–డైమండ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమేయం కూడా ఉన్నట్లు బయటపడినట్లు వెల్లడించారు. ఈ రెండు కంపెనీలపైనా ఎస్బీఐ ఫిర్యాదు చేయడంతో వాటిపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. 2016 నుంచి 2020 మధ్య కాలంలో మీనా జ్యువెలర్స్ రూ.906 కోట్లు వ్యాపారం చేసిందని, అయితే క్యాష్ క్రెడిట్ ఖాతాలో రూ.110 కోట్ల రసీదులనే చూపించినట్లు వెల్లడైంది. మొత్తంగా మూడు కంపెనీల పేరిట రూ.364 కోట్లు రుణాలు తిరిగి చెల్లించాల్సి ఉందని, అనేకసార్లు నోటీసులిచ్చినా కంపెనీ ప్రమోటర్లు స్పందించలేదని ఎస్బీఐ పేర్కొంది. ఈ మేరకు ఫిర్యాదు రావడంతో సీబీఐ కేసులు నమోదుచేసింది. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. పెరిగిన వడ్డీ రేట్లు
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఎఫ్డీ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)పై చెల్లించే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ గల బల్క్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఎస్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు మార్చి 10, 2022 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రూ.2 కోట్లకు కంటే ఎక్కువ పెట్టుబడి, 211 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధి గల ఎఫ్డీ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లను పెంచింది. వడ్డీ రేట్లను పెంచడం వల్ల మార్చి 10 నుంచి ఎఫ్డీలపై 3.30 శాతం వడ్డీ లభించనుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఈ ఎఫ్డీలపై వడ్డీ రేటు 3.60 శాతం నుంచి 3.80 శాతానికి పెరిగింది. ఏడాది నుంచి పదేళ్ల టెన్యూర్ కలిగిన బల్క్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఎస్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేట్లు 3.10 శాతం నుంచి 3.60 శాతానికి చేరనుంది. అలాగే, ఈ ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లు 4.10 శాతం వరకు వడ్డీని పొందవచ్చని ఎస్బీఐ తెలిపింది. సమీక్షించిన ఈ వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లకు, రెన్యూవల్ అయ్యే డిపాజిట్లకు వర్తిస్తున్నాయి. (చదవండి: పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ) -
పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా ఎస్బీఐ యోనో యాప్..!
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ అనుభవాన్ని పెంపొందించడానికి బ్యాంకింగ్ అప్లికేషన్ "యోనో"ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ యాప్‌ను ‘ఓన్లీ యోనో’గా మారుస్తున్నట్లు తెలిపింది. వచ్చే 12 నుంచి 18 నెలలో ఈ మెరుగుపరిచి యాప్‌ను పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా అమల్లోకి తేవాలని ఎస్బీఐ యోచిస్తుంది. అంతేకాక ప్రస్తుత ఎస్బీఐ యోనో కస్టమర్లను ఓన్లీ యోనోలోకి మార్చనుంది. ఎస్బీఐ యోనో 2021లో యాక్టివ్ యూజర్ల పరంగా 35 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. ‘ఓన్లీ యోనో’ అనేది తదుపరి తరానికి చెందిన యాప్. ఇది పూర్తి డిజిటల్ బ్యాంకుగా రూపాంతరం చెందనుంది. ఇది పూర్తిగా పర్సనలైజ్డ్ కస్టమర్ సెంట్రిక్ డిజైన్‌లో వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా బ్యాంకులు కూడా డిజిటల్ లావాదేవీల కోసం ప్రత్యేకంగా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో నిర్దిష్ట కస్టమర్ సెగ్మెంట్‌కు తమ సేవలను అందిస్తున్నాయి. అంతకుముందు కంటే ఎక్కువ లక్ష్యంతో కస్టమర్లను చేరుకోనున్నాయి. ఫుల్ స్టాక్ డిజిటల్ బ్యాంకులకు సంబంధించి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి ప్రత్యేక లైసెన్సింగ్ విధానాలు లేవు. కానీ అవసరమైతే అలాంటి ప్రతిపాదనలకు చేసే అవకాశం ఉంది, అందుకని బ్యాంకులు దానికి సిద్ధమై ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 2017లో యోనోను ఎస్బీఐ లాంచ్ చేసింది. (చదవండి: ఆ రంగానికి కలిసొస్తున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం..!) -
హైటెక్స్‌లో 26, 27 తేదీల్లో ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో..!
ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ పరిధిలో కోవిడ్ కష్టకాలంలోనూ రూ.10 వేల కోట్ల మేర గృహరుణాలు మంజూరు చేసినట్లు సంస్థ తెలంగాణ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జిన్గ్రాన్ మంగళవారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. హైదరాబాద్ సర్కిల్ పరిధిలో రూ.44,580 కోట్ల మేర హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియో నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19 వేల గృహరుణాలు జారీ చేశామన్నారు. ఈ మొత్తం రూ.8,500 కోట్లుగా ఉందన్నారు. మరో 9,100 టాప్అప్ లోన్లను జారీచేశామని.. ఈ మొత్తం రూ.1700 కోట్లని తెలిపారు. గృహరుణాల జారీలో ఎస్బీఐ మార్కెట్ లీడర్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే అన్ని రకాల రుణాలపై తక్కవ వడ్డీ వర్తిస్తుందని చెప్పారు. యోనో,ఓసీఏఎస్ ద్వారానూ ఆన్లైన్లో రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకానికి తమ బ్యాంకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందన్నారు. మెగా ప్రాపర్టీ షో.. హైటెక్స్ ప్రాంగణంలో ఎస్బీఐ ఆధ్వర్యంలో ఈ నెల 28,27 తేదీల్లో మెగా ప్రాపర్డీ షో నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో ప్రముఖ బిల్డర్లు, నిర్మాణ రంగ సంస్థలు ఇందులో పాలుపంచుకోనున్నాయన్నారు. ఈ ప్రదర్శన వద్ద రుణ మంజూరీపై తక్కువ ప్రాసెసింగ్ ఫీజు వసూలు, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను వర్తింపజేయనున్నామని తెలిపారు. (చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!) -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!
How To Link Aadhaar Pan Card With SBI Account Online: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మార్చి 31 నాటికి తమ పాన్ నంబర్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలని తన ఖాతాదారులను కోరింది. ఒకవేళ మార్చి 31 నాటికి లింకు చేయడంలో విఫలమైతే వారు ఎస్బీఐ బ్యాంకింగ్ పూర్తి సేవలను వినియోగించుకోలేరు అని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం.. మార్చి 31, 2022లోగా ఆధార్ నంబర్‌కు పాన్ నంబర్‌ను లింక్ చేయాలని సూచించింది. ఆధార్‌తో పాన్ నెంబర్ లింక్ చేయండి ఇలా.. www.incometax.gov.inని ఓపెన్ చేయండి ‘క్విక్ లింక్స్’ హెడ్ కింద ‘లింక్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయండి. కొత్త పేజీలో పాన్‌కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మీ పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి. ఇప్పుడు లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఆరు-అంకెల ఓటీపీ నమోదు చేసి లింకింగ్ ప్రాసెస్‌ను ధృవీకరిస్తే సరిపోతుంది. (చదవండి: ఒక సీఈవో.. ఇద్దరు దేశాధినేతలు.. ఓ ఆసక్తికర సన్నివేశం) -
సీనియర్ సిటిజన్లకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త..!
ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త తెలిపింది. "గోల్డెన్ ఇయర్స్" అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో వృద్దులు పెట్టుబడి పెట్టేందుకు గడువును పొడిగించింది. ఈ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ గడువు తేదీని 8 ఏప్రిల్ 2022 వరకు పొడిగించింది. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ పథకం కింద బ్యాంకు వృద్ధులకు సంవత్సరానికి వడ్డీని 0.50 శాతం అదనంగా అందిస్తుంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ పథకాలలో నిర్ణీత కాలానికి ముందు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే, వారు మరింత వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు జనవరి 20, 2022 నాటి నుంచి అమల్లోకి వచ్చాయి.డిపాజిట్ మొత్తం రూ.2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. అన్ని ఇతర టర్మ్ డిపాజిట్ ప్రయోజనాలు, నియమ నిబంధనలు కూడా ఈ పథకానికి వర్తిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాలలో డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మరోవైపు, అదే కాలానికి గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ కింద సీనియర్ సిటిజన్లు 6.35 శాతం వడ్డీ రేటును లభిస్తుంది. సాధారణ ప్రజలకు వార్షికంగా లభిస్తున్న వడ్డీ రేటు కంటే 0.75 శాతం అదనం. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డి స్కీమ్‌లో ఉన్న డిపాజిట్‌ను ముందుగానే విత్‌డ్రా చేస్తే లేదా 5 సంవత్సరాల 1 రోజు లేదా తర్వాత మూసివేసినట్లయితే పెనాల్టీ రేటు 1.25 శాతం ఉంటుందని సీనియర్ సిటిజన్లు తెలుసుకోవాలి. ఈ పథకం కింద తెరిచిన ఖాతా 5 సంవత్సరాల 1 రోజులోపు విత్‌డ్రా చేయబడినా లేదా మూసివేయబడినా బ్యాంకు ఉపసంహరణ నియమాలు వర్తిస్తాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ కూడా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ ఎస్బీఐ వీకేర్ గడువును పొడిగించింది. బ్యాంక్ ఎస్బీఐ వీకేర్ స్కీమ్ గడువును 30 సెప్టెంబర్ 2022 వరకు పొడిగించింది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారుల కష్టాలకు చెక్.. జోరుగా ఈవీ స్టేషన్ల నిర్మాణం!) -
కుదిరిన ఒప్పందం.. సింగరేణి ఉద్యోగులకు 40 లక్షల బీమా
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉన్న ప్రతీ సింగరేణి ఉద్యోగికి రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేశారు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సింగరేణి కాలరీస్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఎస్బీఐలో ఖాతాలున్న 35వేల మంది ఉద్యోగులకు ప్రయో జనం చేకూరనుంది. ఈ ఒప్పందం వచ్చే నెల 4 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సింగ రేణి డైరెక్టర్లు బలరామ్, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ సమక్షంలో ఇరు సంస్థల ఉన్నతా ధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ సూచనల మేరకు బలరామ్ ఈ చారిత్రక ఒప్పందంలో కీలక పాత్ర పోషించారన్నారు. (చదవండి: ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ) -
ఎస్బీఐ సైనేజీ కేసు,7 సంస్థలకు సీసీఐ జరిమానా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలు, ఆఫీసులు, ఏటీఎంలకు సైనేజీలను సరఫరా చేసేందుకు సంబంధించిన బిడ్‌ను రిగ్గింగ్ చేసిన కేసులో 7 సంస్థలు, వాటి అధికారులకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) జరిమానా విధించింది. మొత్తం రూ. 1.29 కోట్లు కట్టాలని ఆదేశించింది. అలాగే ఇకపై పోటీని దెబ్బతీసే విధానాలకు పాల్పడవద్దని హెచ్చరించింది. ఆయా కంపెనీలకు చెందిన తొమ్మిది మంది అధికారులు రూ. 54,000 పైచిలుకు జరిమానా కట్టాల్సి రానుంది. వివరాల్లోకి వెడితే.. పలు ప్రదేశాల్లో ఎస్బీఐ బ్రాంచీలు, కార్యాలయాలు, ఏటీఎంలకు ఉన్న సైనేజీ స్థానంలో కొత్త సైనేజీ సరఫరా, ఇన్స్టాలేషన్ కోసం 2018 మార్చిలో ఎస్బీఐ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ సొల్యూషన్స్ సంస్థ బిడ్లు ఆహ్వానించింది. అయితే, ఈ టెండర్ విషయంలో బిడ్డర్లు కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు రావడంతో సుమోటో ప్రాతిపదికన సీసీఐ విచారణ చేసింది. బిడ్డింగ్ ప్రక్రియ సజావుగా జరగకుండా .. ధరల అంశంలో కంపెనీలన్నీ కూడబలుక్కుని మార్కెట్‌ను తమలో తాము పంచుకున్నట్లు ఇందులో తేలింది. దీంతో సీసీఐ తాజా ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రకారం డైమండ్ డిస్ప్లే సొల్యూషన్స్ ఏజీఎక్స్ రిటైల్ సొల్యూషన్స్, ఒపల్ సైన్స్, ఎవెరీ డెనిసన్ తదితర సంస్థలకు జరిమానా విధించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు చిన్న, మధ్యతరహా కోవకి చెందినవే కావడం, విచారణలో సహకరించడంతో పాటు తమ తప్పులను అంగీకరించిన నేపథ్యంలో శిక్ష విషయంలో సీసీఐ కొంత ఉదారత చూపింది. పెనాల్టీని ఆయా సంస్థల టర్నోవరులో 1 శాతానికి పరిమితం చేసింది. -
ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!
అమ్మో ఒకటో తారీఖు..! ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. వచ్చేనెల ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుండగా పలు రంగాల్లో రానున్న మార్పులను మనం స్వాగతించాల్సి ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్న బ్యాంకులకు సంబంధించిన కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ► దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచనుంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. ఐఎమ్పిఎస్ లావాదేవీలు చేసేటప్పుడు జీఎస్టీతో పాటు గరిష్టంగా రూ.20 వసూలు చార్జీల రూపంలో చేయనుంది. అక్టోబర్ 2021లో ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని ఆర్బిఐ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయం మనకు తెలిసిందే. ► ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన చెక్ క్లియరెన్స్‌కు సంబంధించిన నియమ & నిబంధనలు మారనున్నాయి. చెక్ చెల్లింపు కోసం వినియోగదారులు సానుకూల చెల్లింపు విధానాన్ని అనుసరించాలి. ప్రస్తుతం ఖాతాదారులు చెక్ జారీ చేసిన తర్వాత ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు బ్యాంక్‌కు పంపాల్సి ఉంటుంది. లేకపోతే ఆ చెక్ క్లియర్ అవ్వదు. ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు కేవలం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న చెక్కుల కోసం ఇలాంటి నిబంధనలు మార్చింది. తక్కువ మొత్తంలో చెక్కులు జారీ చేస్తే మాత్రం ఈ మార్పులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చే నెల నుంచి చార్జీల బాదుడు షురూ చేయబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల మీ ఇన్స్టాల్మెంట్లు లేదంటే ఈఎంఐ చెల్లింపులు ఫెయిల్ అయితే అప్పుడు బ్యాంక్ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.100 చార్జీ వసూలు చేస్తున్నారు. డిమాండ్ డ్రాఫ్ట్‌ను క్యాన్సిల్ చేయాలన్నా రూ.150 చెల్లించుకోవాలి. ► ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మాదిరిగానే వచ్చేనెల ఫిబ్రవరి 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఫిబ్రవరి & మార్చిలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఫిబ్రవరి 1న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గిస్తుందా? లేదా అనేది చూడాలి. (చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్..!) -
SBI: దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకు
ఉమెన్ కమిషన్ నోటీసుల దెబ్బకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ దిగొచ్చింది. గర్భిణీ ఉద్యోగుల విషయంలో కొత్తగా జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆఘమేఘాల మీద ప్రకటించింది. ప్రెగ్నెంట్ ఉమెన్ క్యాండిడేట్స్‌ల విషయంలో.. మూడు నెలలు దాటిన గర్భిణి అభ్యర్థులు విధుల్లో చేరడానికి తాతాల్కికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఇండియా సర్క్యులర్ జారీ చేయడం, ఆపై విమర్శలు చెలరేగడం తెలిసిందే. పైగా బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలలలోపు చేరొచ్చంటూ పోయినేడాది డిసెంబర్ 31న రిలీజ్ చేసిన ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. అయితే ఈ చర్య వివక్షతో కూడుకున్నదని, రాజ్యంగబద్ధమైన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేదిగా ఉందని, పైగా కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 ప్రకారం చెల్లదని అని పేర్కొంటూ ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ విషయమై లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ వెనక్కి తగ్గింది. SBI మునుపటి నిబంధనల ప్రకారం, గర్భిణీ స్త్రీల అభ్యర్థులు గర్భం దాల్చిన ఆరు నెలల వరకు బ్యాంకులో నియమించబడటానికి అర్హులు. దానిని మారుస్తూ బ్యాంక్ సర్క్యులర్ తేవడడమే తాజా విమర్శలకు కారణమైంది. ఇక సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంక్ ప్రకటించినప్పటికీ.. బ్యాంక్ చైర్మన్ ఉమెన్ కమిషన్ ముందు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. -
ఎస్బీఐ కొత్త రూల్స్.. నిర్మలకు ఎంపీ లేఖ.. ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చిన తాజా నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ తన నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ మహిళా కమిషన్ స్టేట్ బ్యాంక్‌కు నోటీసులు సైతం జారీచేసింది. చట్టవిరుద్ధమైన ఈ నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరేవారి కోసం ఎస్బీఐ 2021 డిసెంబరు 31న నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై ఆలిండియా ఎస్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. (చదండి: ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే చారిత్రక నిర్ణయం) -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్..!
భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులను అలర్ట్ చేసింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లో భాగంగా ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలను జనవరి 22న నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సేవలు రేపు ఉదయం 02:00 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఎటువంటి సేవలు పనిచేయవు అని తన ట్విటర్ ఖాతా వేదికగా పేర్కొంది. "మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాము అని, ఈ ఒక్క రోజు పాటు తమకు సహకరించగలరని" ఎస్బీఐ అభ్యర్థించింది. ఎస్బీఐ తాత్కాలికంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను బంద్ చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా చాలా సార్లు మెయింటనెన్స్ చేపట్టింది. యూజర్లకు మరింత సురక్షితమైన సేవలను అందించేందుకు ఎస్బీఐ గత కొంత కాలంగా మెయింటనెన్స్ వర్క్ చేపడుతూ వస్తుంది. దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగిన ఎస్బీఐకి 22 వేలకు పైగా బ్రాంచులున్నాయి. దేశవ్యాప్తంగా 57,889కి పైగా ఏటీఎంలున్నాయి. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/3Y1ph0EUUS — State Bank of India (@TheOfficialSBI) January 21, 2022 (చదవండి: కరోనా కాలంలో అమ్మకాల్లో డోలో 650 టాబ్లెట్ రికార్డు..!) -
ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త..!
ఎస్బీఐ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, కారు లోన్ వంటి 3 రకాల లోన్స్ అంధించనున్నట్లు తెలిపింది. గోల్డ్ లోన్‌పై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా వడ్డీ ఇస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ గోల్డ్ లోన్ మీద వడ్డీ రేటు 7.3 శాతం నుంచి ప్రారంభం కానుంది. అంతేకాకుండా రుణ మొత్తాన్ని చెల్లించడానికి పలు ఆప్షన్లు అందుబాటులో ఉంచింది. బుల్లెట్, ఓవర్‌డ్రాఫ్ట్, ఈఎంఐ వంటి ఆప్షన్లలో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని 36 నెలలలోగా తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. మీ దగ్గర ఉన్న బంగారం నాణ్యతను బట్టి రూ. 20 వేల నుంచి రూ. 50 లక్షల వరకు లోన్ ఇవ్వనుంది. అలాగే, ఎస్బీఐ కారు లోన్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. దీని మీద వడ్డీ రేటు 7.25 శాతం నుంచి ప్రారంభం కానుంది. కారు ధరలో 90 శాతం వరకు రుణం పొందొచ్చు. ఎలాంటి ప్రిపేమెంట్ చార్జీలు కూడా ఉండవు. అలాగే టూవీలర్ లోన్ పొందాలని భావించే వారికి కూడా ఈజీ రైడ్ ప్రిఅప్రూవ్డ్ రుణాలు లభిస్తున్నాయి. రూ.10 వేలకు ఈఎంఐ రూ.251 నుంచి ప్రారంభం అవుతోంది. Upgrade to a good life with fantastic deals for your brand new four-wheels on Car Loan by SBI. Apply now on YONO app or Know more: https://t.co/aYhi3C6dC8#SBI #StateBankOfIndia #SBICarLoan #Offers #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/zOmgzHH4rS — State Bank of India (@TheOfficialSBI) January 17, 2022 Give your gold the opportunity to enhance your life with Gold Loan by SBI! Apply now on YONO app or Know more: https://t.co/u3h7OdQHtZ#SBI #StateBankOfIndia #SBIGoldLoan #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/XgJ8Z9ooAC — State Bank of India (@TheOfficialSBI) January 16, 2022 ఇక మీరు వ్యక్తిగత రుణాలు తీసుకోవాలంటే వాటికి కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే కేవలం 4 క్లిక్స్‌తోనే లోన్ పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. ఈ తరహా రుణాలపై కూడా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇకపోతే ఈ రుణాలు అన్నీ కూడా యోనో యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. Grab the opportunity to fulfil all your dreams with great offers on Personal Loan by SBI. Avail SBI Personal Loan on YONO app or Know more: https://t.co/biL9usmNSz#SBI #StateBankOfIndia #SBIPersonalLoan #Offers #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/zLx823coPd — State Bank of India (@TheOfficialSBI) January 18, 2022 (చదవండి: ధోనీ గ్యారేజీలోకి మరో అరుదైన కారు.. కారు స్పెషల్ ఇదే!) -
ఎస్బీఐ ఖాతాదారులకు సంక్రాంతి శుభవార్త..!
కొత్త ఏడాదిలో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఫిక్సిడ్ డిపాజిట్(ఎఫ్డి)పై అందించే వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10% వరకు పెంచినట్లు ప్రకటించింది. ఎస్బీఐ తన వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. 1 సంవత్సరం కాలపరిమితి నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి గల ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 5.0% నుంచి 5.1%కి పెంచింది. అలాగే, అదే కాలానికి సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేటును 5.50% నుంచి 5.60%కి పెంచినట్లు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జనవరి 15 నుంచి అమలులోకి రానున్నాయి. డిసెంబర్ 2021లో ఎస్బీఐ తన బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బిపిఎస్ పెంచినట్లు వెబ్సైట్లో తెలిపింది. కొత్త బేస్ రేటు (సంవత్సరానికి 7.55%) డిసెంబర్ 15, 2021 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక తక్కువ వడ్డీ రేట్లకు సమయం ముగిసింది అని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తోంది. రుణగ్రహీతలకు లోన్స్ ఇచ్చేందుకు బేస్ రేటును కీలకంగా తీసుకుంటారు. బేస్ రేట్ పెరగడంతో అన్నీ రకాల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు పడిపోయాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరగడం అనేది బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన వారికి ఒక మంచి శుభవార్త. ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇటీవల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ అధికారిక వెబ్సైట్ ప్రకారం..రెండేళ్ల కంటే ఎక్కువ మెచ్యూరిటీ కాలానికి రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచింది. 2 సంవత్సరాల 1 రోజు, 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి గత ఎఫ్డీలపై 5.2 శాతం వడ్డీని పొందొచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఉంటే వడ్డీ 5.4 శాతం ఉంటుంది. చివరగా మెచ్యూరిటీకి 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సర కాలానికి వడ్డీ రేటు 5.6 శాతంగా ఉండనుంది. పెరిగిన వడ్డీరేట్లు జనవరి 12నుంచి అమలులోకి రాగా.. రెసిడెంట్ డిపాజిట్లకు మాత్రమే రేట్లు వర్తిస్తాయి బ్యాంక్ తెలిపింది. ఇవి ఎన్నారైలకు వర్తించవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. (చదవండి: ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారికి సీఈఓ భవిష్ అగర్వాల్ శుభవార్త..!) -
ఎస్బీఐ ప్రాపర్టీ షో వాయిదా
సాక్షి, సిటీబ్యూరో: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఎస్బీఐ) మెగా ప్రాపర్టీ షో వాయిదా పడింది. కరోనా మహ మ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రదర్శనను వాయి దా వేసినట్టు నిర్వాహకులు తెలి పారు. తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
ఎంఎస్ఎంఈ ఈసీఎల్జీఎస్ స్కీంతో ఎకానమీకి భారీ భరోసా!
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) ప్రయోజనాలకు సంబంధించి ఆవిష్కరించిన అత్యవసర రుణహామీ పథకం(ఈసీఎల్జీఎస్) వల్ల ఎకానమీకి భారీ ప్రయోజనాలు కలిగినట్లు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పరిశోధనా నివేదిక ఒకటి తెలిపింది. ఈ పథకం వల్ల దాదాపు 13.5 లక్షల సంస్థలు దివాలా చర్యల నుంచి రక్షణ పొందాయని, ఫలితంగా 1.5 కోట్ల మంది ఉద్యోగాలకు రక్షణ లభించిందని విశ్లేషించింది. కోవిడ్-19 ప్రేరిత లాక్డౌన్ కారణంగా వివిధ రంగాలకు, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈలకు రుణాన్ని అందించడం ద్వారా వాటిని కష్టాల్లో నుంచి గట్టెక్కించడానికి మే 2020లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని ప్రకటించారు. దీనిలో అత్యవసర రుణహామీ పథకం ప్రధాన భాగంగా ఉంది. ఆయా అంశాలపై ఎస్బీఐ రిసెర్చ్ తాజా సమీక్షాంశాలను పరిశీలిస్తే.. ఈసీఎల్జీఎస్ (పునర్వ్యవస్థీకరణ సహా) కారణంగా దాదాపు 13.5 లక్షల సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఖాతాలు ప్రయోజనం పొందాయి. ఇలాంటి ఖాతాల్లో దాదాపు 93.7 శాతం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమ కేటగిరీలో ఉన్నాయి. మహమ్మారి కాలంలో రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ రుణ ఖాతాలు మొండిబకాయిల్లోకి (ఎన్పీఏ) జారిపోకుండా రక్షణ పొందాయి. ఈ సంస్థలు మొండిబకాయిలుగా మారితే 1.5 కోట్ల కార్మికులు నిరుద్యోగులుగా మారేవారు. ఒక్కొక్కరి కుటుంబ సభ్యుల సంఖ్య నలుగురిగా భావిస్తే, ఆరు కోట్ల జీవిత అవసరాలకు రుణ హామీ పథకం రక్షణ కల్పించింది. ఈ పథకం వల్ల లబ్ది పొందిన రాష్ట్రాల్లో తొలుత గుజరాత్ ఉంది. తరువాతి స్థానంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. (చదవండి: Bitcoin: భారీగా పడిపోయిన బిట్‌కాయిన్ ధర..!) -
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ అలర్ట్..!
హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆన్లైన్లో పెరిగిపోతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన ఖాతాదారులను హెచ్చరించింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొందరు మోసగాళ్లు ఎస్బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయలని నకిలీ లింక్స్ పంపిస్తున్నారు. అయితే, ఇలాంటి నకిలీ లింక్స్ పట్ల జాగ్రత్త ఉండాలని సూచిస్తుంది. మోసగాళ్లు ఈ నకిలీ లింక్స్ సహాయంతో వ్యక్తిగత వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్బీఐ పేర్కొంది. గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన ఒక యువకుడు క్రింద పేర్కొన్న విధంగా వచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి రూ.10 వేల నగదు పొగట్టుకున్నాడు. కొన్ని రోజుల నుంచి ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అందుకే, ఇలాంటి నకిలీ లింక్స్, నకిలీ మెసేజ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మోసాల బారిన పడకుండా ఎస్బీఐ సూచనలు: * ఏదైనా లింక్‌ను క్లిక్ చేసేముందు ఆలోచించండి. * కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకు ఎలాంటి లింకులనూ పంపించదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. * మీ మొబైల్ నంబర్, ఇతర వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. * నకిలీ లింక్స్ ఎప్పుడు క్రింద పేర్కొన్న విధంగా ఉంటాయి. వాటి యుఆర్ఎల్ లో బ్యాంక్ పేరు లేకుండా వస్తాయి. రిపోర్ట్ చేయడం ఎలా? ఖాతాదారులు తమ బ్యాంక్ ఖాతాలో అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకుకు నివేదించాలి. ఇలాంటి లావాదేవీలను గుర్తించిన వెంటనే 1800 425 3800, 1800 112 211 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. వారు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తారు. (చదవండి: లాభం అంటే ఇది.. వారంలో రూ.లక్ష రూ.2 లక్షలయ్యాయ్..!) -
ఎస్బీఐ ఏటీఎం పిన్ మర్చిపోయారా? 2 నిమిషాల్లో PIN జనరేట్ చేయండిలా..!
ప్రస్తుతం ఏటీఎం కార్డులు వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ ఏదో ఒక సమయంలో వాటి అవసరం పడుతుంది. మనం ఒక నెల, రెండు నెల రోజులు ఏటీఎం కార్డు వాడకపోతే పిన్ మర్చిపోవడం సాదారణ విషయమే. రెగ్యులర్‌గా ఏటీఎం కార్డు వాడేవారికి ఈ సమస్య ఉండదు. పిన్ గుర్తుంటుంది. కానీ ఎప్పుడో ఓసారి ఏటీఎం కార్డు వాడేవారు పిన్ మర్చిపోవడం సాధారణమే. అలాగే, రెండు లేదా మూడు ఏటీఎం కార్డులు వాడేవారు కూడా పిన్ నెంబర్లు గుర్తు పెట్టుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఒకవేల ఏటీఎం పిన మర్చిపోతే కొత్త పిన్ జనరేట్ చేయడం గతంలో కొద్దిగా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి పిన్ జనరేట్ చేయడం చాలా సులువు. మీ ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐవీఆర్, ఎస్ఎంఎస్ ద్వారా సులువుగా ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు సులువుగా పిన్ జనరేట్ చేసుకునే వీలు కల్పిస్తోంది. ఈజీ స్టెప్స్‌తో ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు. మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎం పిన్ జనరేట్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎం పిన్ జనరేట్ చేయండిలా..? మీ ఖాతా క్రెడెన్షియల్స్ ఉపయోగించి ఎస్బీఐ ఆన్లైన్లోనికి లాగిన్ అవ్వండి. ఇప్పుడు మెనులో ఉన్న 'ఈ-సర్వీసెస్> ఎటిఎమ్ కార్డ్ సర్వీసెస్' ఆప్షన్ ఎంచుకోండి. ఎటిఎమ్ కార్డ్ సర్వీసెస్ పేజీ క్లిక్ చేయగానే మరొక పేజీ క్రియేట్ చేయండి. ఇప్పుడు "వన్ టైమ్ వర్డ్' లేదా 'ప్రొఫైల్ పాస్ వర్డ్' అనే రెండు ఆప్షన్స్ కన్పిస్తాయి. ఇప్పుడు 'ప్రొఫైల్ పాస్ వర్డ్' ఆప్షన్ ఎంచుకొని 'సబ్మిట్' మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ నమోదు చేయగానే, మీ మొబైల్ నెంబర్ బ్యాంక్ ఖాతాలు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు పిన జనరేట్ చేయాలి అనుకున్న ఖాతా రేడియో బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ బ్యాంకు ఖాతాకు లింకు అయిన ఏటీఎం కార్డు ఎంచుకోండి. ఆ తర్వాత మీకు కనిపించే Enter First Two Digits of Your Desired Pin బాక్స్‌లో మీకు గుర్తుండే ఒక రెండు నంబర్స్ నమోదు చేయండి. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీలో వచ్చిన రెండు నంబర్స్, మీరు ఎంటర్ చేసిన రెండు నంబర్స్ కలిపి ఇప్పుడు మీకు కనిపించే బాక్స్‌లో నమోదు చేయండి. ఈ నాలుగు నంబర్స్ మీ ఏటీఎం పిన్ గా మారుతుంది. (చదవండి: పాలసీల ప్రీమియం ధరలు పెరగనున్నాయా?) -
కొత్త ఏడాదిలో ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..!
కొత్త ఏడాదిలో ఎస్బీఐ తన ఖాతాదారులకు మంచి శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన బ్యాంకు శాఖల వద్ద చేసే డబ్బు బదిలీలకు సంబంధించిన తక్షణ చెల్లింపు సేవ(ఐఎమ్పీఎస్) పరిమితిని పెంచినట్లు ప్రకటించింది. ఎస్బీఐ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఐఎమ్పీఎస్ లావాదేవీల కొత్త స్లాబ్ అనేది ఫిబ్రవరి 1, 2022 నుంచి అమల్లోకి రానుంది. ఐఎమ్పీఎస్ ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య డబ్బును పంపినందుకు రూ.20లతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఐఎమ్పీఎస్ అంటే ఏమిటి? ఐఎమ్పీఎస్ అంటే తక్షణ నగదు బదిలీల చెల్లింపు వ్యవస్థ. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) నిర్వహిస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, బ్యాంక్ బ్రాంచీలు, ఎటిఏమ్స్, ఎస్ఎమ్ఎస్, ఐవిఆర్ఎస్ వంటి వివిధ ఛానల్స్ ద్వారా ఐఎమ్పీఎస్ వ్యవస్థను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ వల్ల ఖాతాదారులు ఏడాదిలో ఎప్పుడైనా వేగంగా నగదు బదిలీ చేసుకోవచ్చు. భారతదేశం అంతటా బ్యాంకులు, ఆర్బిఐ అధీకృత ప్రీపెయిడ్ పేమెంట్ ఇనుస్ట్రుమెంట్(పిపిఐ) వ్యక్తులు తక్షణమే డబ్బును బదిలీ చేయవచ్చు. ఐఎమ్పీఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్(ఐఎమ్పీఎస్) విధానంలో డబ్బులు వెంటనే ఇతరుల బ్యాంక్ అకౌంట్‌కు వెళ్లిపోతాయి. కనీసం రూ.1 నుంచి డబ్బులు పంపొచ్చు. గరిష్టంగా ఇప్పుడు రూ.5 లక్షల వరకు పంపించుకోవచ్చు. గతంలో ఈ పరిమితి రూ.2 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచింది. ఈ సేవలు రోజులో ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి. రూ.2 లక్షల వరకు ఐఎమ్పీఎస్ ద్వారా ఉచితంగా పంపించవచ్చు. ఆ తర్వాత పంపించే మొత్తాలకు ఛార్జీలు వర్తిస్తాయి. (చదవండి: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే బడ్జెట్లో) -
రైతులకు ఎస్బీఐ తీపికబురు.. తక్కువ వడ్డీకే రుణాలు!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు తీపికబురు అందించింది. రైతులకు తక్కువ వడ్డీకే అగ్రి గోల్డ్ రుణాలను అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఆసక్తి గల వ్యక్తులు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాన్ని పొందవచ్చు. ఈ వియాన్ని ఎస్బీఐ ట్విట్టర్లో వెల్లడించింది. ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాల పేరుతో రైతులకు రుణాలను అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ 7 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. యోనో యాప్ ద్వారా అప్లై చేసే రుణాలు వేగంగా మంజూరవుతాయి. రీపేమెంట్ ఆప్షన్ కూడా రైతులు తమకు కావాల్సినట్టుగా ఎంచుకోవచ్చు. ఈ ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణం మాత్రం కేవలం బంగారు నగలపై మాత్రమే లభిస్తుంది. 24 క్యారట్, 22 క్యారట్, 20 క్యారట్, 18 క్యారట్ స్వచ్ఛత గల నగలు, ఆభరణాలపై రుణాలు తీసుకోవచ్చు. 50 గ్రాముల వరకు బ్యాంక్ గోల్డ్ కాయిన్స్ పైనా రుణాలు లభిస్తాయి. గోల్డ్ బార్స్ పై ఈ రుణాలు వర్తించవు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాలు తీసుకోవచ్చు. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, పిగ్గరీ, గొర్రెల పెంపకం లాంటి వాటికీ ఈ రుణాలు వర్తిస్తాయి. యంత్రాల కొనుగోలు, వ్యవసాయం, హార్టీకల్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ లాంటి అవసరాలకు ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు. Avail SBI's Agri gold loan at lowest interest rate through YONO. #SBIAgriGoldLoan #SBI #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/jawDwSzWsH — State Bank of India (@TheOfficialSBI) December 21, 2021 (చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. రూ.1.44 లక్షల కోట్లు రీఫండ్..!) -
ఎస్బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ తన ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఎస్బీఐ ఖాతాదారులకు 3-ఇన్-1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభించింది. ఎస్బీఐ ఖాతాదారులకు సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానించే 3-ఇన్-1 ఖాతా సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారి ప్రయోజనం చేకూరుతుంది. వినియోగదారులు ఒకే ఖాతాతో మూడు రకాల సదుపాయాలను పొందుతారు. ఈ విషయన్ని ఎస్బీఐ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేసింది. మీరు ఎస్బీఐ 3-ఇన్-1 తెరవాలనుకుంటే ఈ క్రింది పేర్కొన్న పత్రాలు అవసరం. ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కోసం: పాన్ కార్డు లేదా ఫారం 60 ఫోటోగ్రాఫ్ పాస్‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, ఎమ్ఎన్ఆర్ఈజీఏ జారీ చేసే జాబ్ కార్డ్, మీ పేరు & చిరునామా వివరాలతో జాతీయ జనాభా రిజిస్టర్ జారీ చేసే ఏదైనా ఒక లేఖ. ఇందులో ఏదైనా ఒక పత్రం అవసరం. ఎస్బీఐ డీమ్యాట్ & ట్రేడింగ్ అకౌంట్ కోసం: పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ పాన్ కార్డ్ కాపీ ఆధార్ కార్డు కాపీ ఒక క్యాన్సిల్ చేయబడ్డ చెక్ లీఫ్/తాజా బ్యాంక్ స్టేట్ మెంట్ Experience the power of 3-in-1! An account that combines Savings Account, Demat Account, and Trading Account to provide you with a simple and paperless trading experience. To know more, visit -https://t.co/Mvt7i2K3Le#Go3in1WithSBI #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/3RDWUZEgIF — State Bank of India (@TheOfficialSBI) December 15, 2021 -
ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను భారీగా పెంచిన ఎస్బీఐ!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి శుభవార్త.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బేసిస్ పాయింట్లు(బిపిఎస్) పెంచినట్లు తన వెబ్సైట్లో తెలిపింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో జమ చేసే బల్క్ టర్మ్ డిపాజిట్లపై మాత్రమే ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తిస్తుందని ఎస్బీఐ ప్రకటించింది. 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తంలో ఉండే రీటేల్ టర్మ్ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తించదని బ్యాంక్ స్పష్టంచేసింది. కొత్తగా పెంచిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచి అమలులోకి వస్తాయని తాజా ప్రకటనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఫిక్స్డ్ డిపాజిట్ల కొత్త వడ్డీ రేట్లు: డిసెంబర్ 8న సెంట్రల్ బ్యాంక్ తన ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశాన్ని నిర్వహించిన వారం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రెపో రేటు, రివర్స్ రెపో రేటు ప్రస్తుతం వరుసగా 4 శాతం, 3.35 శాతంగా ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటును ప్రస్తుతానికి మార్చకుండా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు, ఇది గత 20 సంవత్సరాలలో కనిష్టం. -
సర్వీసు చార్జీల పేరుతో ఎస్బీఐ భారీగా వడ్డీంపు..!
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 2017-18 నుంచి అక్టోబర్ 2021 వరకు ఖాతాదారుల నుంచి సుమారు ₹346కోట్లను చార్జీల రూపంలో వసూలు చేసింది. ఉచిత సేవలకు మించి వినియోగదారులు అదనపు సేవలను వినియోగించినందుకు 2017-18 నుంచి అక్టోబర్ 2021 వరకు ₹345.84 కోట్లను ఎస్బీఐ వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి భగవత్ కరద్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆగస్టు 30, 2020 నాటి సీబీడీటీ మార్గదర్శకాల ప్రకారం.. రూపే డెబిట్ కార్డు, యుపీఐ, యుపీఐ క్యూఆర్ కోడ్ ఎలక్ట్రానిక్ మోడ్ లను ఉపయోగించి నిర్వహించే లావాదేవీలపై జనవరి 1, 2020న లేదా ఆ తర్వాత సేకరించిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని, భవిష్యత్తు లావాదేవీలపై ఛార్జీలు విధించరాదని బ్యాంకులకు సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం.. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పిఎమ్‌జెడివై) కింద తెరిచిన ఖాతాలతో సహా ప్రాథమిక సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా(బిఎస్‌బిడిఎ) తెరిచిన వినియోగదారులకు ఉచితంగా సేవలు అందిస్తుంది. అలాగే, వీరు బ్యాంకు ఖాతాలలో ఎలాంటి కనీస మొత్తం నిల్వ చేయాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం… ఖాతాదారులు ఖాతాల నుంచి నెలకు నాలుగు సార్లు ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి తోడు బ్యాంకు ఏవైనా వాల్యూ యాడెడ్ సేవలు అందిస్తుంటే, వాటిపై ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదు. 2014 సెప్టెంబర్‌లో ఆర్బీఐ దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇది ఆయా బ్యాంకుల విచక్షణకు లోబడి ఉంటుందని చిన్న మెలిక పెట్టింది. దీనిని అడ్డుపెట్టుకుని బ్యాంకులు సామాన్య ప్రజానీకం ఉపయోగించే బీఎస్‌బీడీఏ, ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలపై సర్వీసు చార్జీల పేరుతో ప్రత్యేక వడ్డింపులు మోపుతున్నాయి. (చదవండి: టయోటా వాహన కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్..!) -
తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు అందించే టాప్ 10 బ్యాంకులు ఇవే..!
వ్యక్తిగత రుణం అనేది బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థలు అందించే అసురక్షిత రుణం. అందుకే, వ్యక్తిగత రుణాల మీద వడ్డీ రేట్లు అనేవి సాదారణంగా అధికంగా ఉంటాయి. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణాలను అందిస్తాయి. ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎక్కువ శాతం అధిక క్రెడిట్ స్కోర్లు ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలు ఇస్తాయి. ఈ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారతాయి. ఉదాహరణకు, ఐడీబీఐ బ్యాంక్ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు 8.15% నుంచి ప్రారంభమై 14% వరకు ఉంటాయి. ఇవి 12-60 నెలల కాలపరిమితితో రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు లోన్ ఇస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వ్యక్తిగత రుణాల రేట్లు 9.6% నుంచి ప్రారంభమై 15.65% వరకు ఉంటాయి. ఇవి 6-72 నెలల కాలపరిమితితో రూ.25,000 నుంచి రూ.20 లక్షల మధ్య అప్పు ఇవ్వవచ్చు. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. ఏయే బ్యాంకులు ఎంత వడ్డీతో రుణాలను ఇస్తున్నాయో చూద్దాం. తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు అందించే టాప్ 10 బ్యాంకులు ఇవే..! వ్యక్తిగత రుణంపై గరిష్ట మరియు కనీస పరిమితి ఎంత? అప్పు తీసుకోగల కనీస, గరిష్ట పరిమితి మొత్తం అనేది ప్రతి బ్యాంకుకు మారుతుంది. ఉదాహరణకు, వేతన జీవులు గరిష్టంగా రూ.20 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చని ఎస్బీఐ తన వెబ్ సైట్లో పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.12 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు అందుబాటులో ఉన్నాయని తన వెబ్ సైట్లో తెలిపింది. టాటా క్యాపిటల్ వెబ్ సైట్ ప్రకారం.. మీ క్రెడిట్ విలువను బట్టి మీరు రూ.75,000 మరియు రూ.25 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. (చదవండి: జియో పెనుసంచలనం: కేవలం ఒక్క రూపాయికే..) వ్యక్తిగత రుణానికి ఎవరు అర్హులు? వ్యక్తిగత రుణ అర్హత ఆవశ్యకతలు ఒక బ్యాంకుతో పోలిస్తే మరో బ్యాంకుకు భిన్నంగా ఉంటాయి. ఎస్బీఐ వెబ్ సైట్ ప్రకారం.. వ్యక్తిగత రుణానికి అర్హత పొందడానికి కనీసం నెలవారీ ఆదాయం రూ.15,000 ఉండాలి. వ్యక్తిగత రుణం కొరకు మీ అర్హతను నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోరు కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. వ్యక్తులు కనీసం 2 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేస్తూ.. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి త్వరగా లోన్ వచ్చే అవకాశం ఉంది. నెలవారీ నికర ఆదాయం కనీసం రూ.25,000 ఉంటే హెచ్డీఎఫ్సీ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత రుణాల కాలపరిమితి ఎంత? వ్యక్తిగత రుణాల కాలపరిమితి అనేది ప్రతి బ్యాంకును మారుతుంటాయి. బ్యాంకులు వంటి రుణ సంస్థలు తరచుగా గరిష్టంగా ఐదు సంవత్సరాలకు వ్యక్తిగత రుణాలను ఇస్తాయి. వ్యక్తిగత రుణంలో ఇమిడి ఉన్న ఛార్జీలు ఏమిటి? ఒక బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సి సంస్థలు వ్యక్తిగత రుణంపై ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ, ఇతర రెగ్యులేటరీ ఫీజులను వసూలు చేస్తాయి. అదేవిధంగా, రుణదాతపై ఆధారపడి ప్రీ పేమెంట్ లేదా ప్రీ క్లోజర్ ఫీజు కూడా విధిస్తారు. (చదవండి: టెస్లాలో కీచక పర్వం! అసభ్యంగా తాకుతూ వేధింపులు) -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ సేవలకు అంతరాయం!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిసెంబర్ 11, 12 తేదీల్లో 5 గంటలు పాటు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. "మేము 11 డిసెంబర్ 2021న 23:30 గంటల నుంచి 12 డిసెంబర్ 04:30 గంటల(120 నిమిషాలు) మధ్య కాలంలో చేపట్టే మెయింటెనెన్స్ కారణంగా ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు పేర్కొంది. మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము" అని ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలను అంధించడం కోసం కృషి చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ సమయంలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని పేర్కొంది. గత నెల నవంబర్ 27న అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ పెనాల్టీ విధించింది. నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు ఎస్బీఐకు రూ.కోటి జరిమానా విధించినట్లు ప్రకటించింది. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/LZsuqO2B0D — State Bank of India (@TheOfficialSBI) December 10, 2021 (చదవండి: రూ.60 వేల కోట్లను దాటనున్న సాఫ్ట్వేర్ ఆదాయం!) -
ఆరోగ్య అత్యవసర సేవల కల్పనకు ఎస్బీఐ కృషి
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యతలో భాగంగా ఆరోగ్య అత్యవసర సేవల కల్పనకు కృషి చేస్తుందని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (ఆర్ అండ్ డీబీ) చల్లా శ్రీనివాసులు అన్నారు. గురువారం ఆయన కోఠి లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఏటీఎంతో పాటు క్యాష్ డిపాజిట్ మిషన్ (సీడీఎం), స్టేట్మెంట్ ప్రింటింగ్ మిషన్లతో కూడిన ఈ–కార్నర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్–19 నేపథ్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద ఎస్బీఐ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ సర్వీసులను అందించాలని భావిస్తోందని, ఇందులో భాగంగా ఎంపికచేసిన ఆస్పత్రులకు అంబులెన్సులను అందిస్తున్నామన్నారు. గురువారం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి ఒక అంబులెన్స్‌ను అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది రూ.2కోట్లు సీఎస్ఆర్ కింద ఖర్చు చేసినట్లు ఎస్బీఐ సీజీఎం అమిత్ జింగ్రాన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2 కోట్లు అదనంగా ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. -
రూల్స్ ఉల్లంఘన.. ఎస్బీఐకు భారీ పెనాల్టీ
RBI Impose Penalty To SBI: భారతీయ బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు భారీ పెనాల్టీ విధించింది. నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు ఎస్బీఐకు రూ.కోటి జరిమానా విధించినట్లు ప్రకటించింది. రుణగ్రహీత కంపెనీల్లో ఆ కంపెనీల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తంలో షేర్లను కలిగి ఉందన్న కారణంతో ఎస్బీఐకు ఈ జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 19 సబ్ సెక్షన్ 2 ప్రకారం.. నవంబర్ 26న ఈ పెనాల్టీ విధించింది. ఈ సెక్షన్ ప్రకారం.. ఏ బ్యాంక్ కూడా 30 శాతం కంటే ఎక్కువ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్‌ను కలిగి ఉండడానికి వీల్లేదు. చదవండి: ఆర్బీఐ మార్గదర్శకాలు.. కేరళ సర్కార్ అసంతృప్తి ఈ మేరకు 2018 మార్చి 31, 2019 మార్చి 31న ఆర్థిక అంశాలకు సంబంధించి ఎస్బీఐ సూపర్వైజరీ ఎవాల్యుయేషన్ (ఐఎస్ఈ) చట్టబద్ధ తనిఖీలు చేపట్టిందని, నష్ట మదింపు నివేదికల్లో ఈ విషయం బయటపడింది. దీంతో ఎస్బీఐకు షోకాజ్ నోటీసు జారీ చేసింది ఆర్బీఐ. అయితే బ్యాంక్ ఇచ్చిన సమాధానం, ఇతర వివరాలను పరిశీలనలోకి తీసుకున్న తర్వాతే ఆర్బీఐ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే షేర్ మార్కెట్లో ఎస్బీఐ నష్టాల బాటలో పయనిస్తోంది. -
State Bank of India: డిజిటల్ ఛార్జీల మోతపై క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ
State Bank of India Clarifies on Reports of Unpaid Refund: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) డిజిటల్ చెల్లింపుల అదనపు ఛార్జీల విషయంపై క్లారిటీ ఇచ్చింది. 2017 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2019 మధ్య కాలంలో డిజిటల్ చెల్లింపుల సమయంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పిఎంజెడివై) ఖాతాదారుల నుంచి వసూలు చేసిన రుసుములో భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత ఇంకా తిరిగి ఇవ్వాల్సి ఉందని మీడియాలో వస్తున్న వార్తలపై ఎస్బిఐ వివరణ ఇచ్చింది. డిజిటల్ లావాదేవీల కోసం తన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్‌బీడీ) ఖాతాదారుల నుంచి ఎటువంటి లావాదేవీ రుసుమును వసూలు చేయమని ఎస్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. "ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఎస్బిఐ బీఎస్‌బీడీ ఖాతాదారుల నుంచి రుసుముల రూపంలో వసూలు చేసిన రూ.254 కోట్లలో కేవలం 90 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చింది. ఇంకా రూ.164 కోట్లను ఎస్బీఐ చెల్లించాల్సి ఉంది" అని ఐఐటీ-ముంబై తయారు చేసిన నివేదిక గత వారం తెలిపింది. ఈ కాలంలో ఒక్కో ఖాతా నుంచి బ్యాంకు రూ.17.70 వసూలు చేసినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ నివేదికపై ఎస్బిఐ స్పందిస్తూ.. “యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపీఐ), రూపే డెబిట్ కార్డ్‌లను ఉపయోగించే లావాదేవీలతో సహా ఇతర డిజిటల్ లావాదేవీలకు బీఎస్‌బీడీ ఖాతాదారులు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బీఎస్‌బీడీ ఖాతాదారుల మొదటి నాలుగు విత్ డ్రాలకు ఎటువంటి ఛార్జీలు ఉండవని ఎస్బిఐ స్పష్టం చేసింది. (చదవండి: దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్..! నితిన్ గడ్కరీ క్లారిటీ!) -
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్!
SBI Credit Card Users to Pay Rs 99 Plus Tax on All EMI Transactions: క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్బీఐ షాక్ ఇచ్చింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే అన్ని ఈఎంఐ లావాదేవీలు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పన్నుకు లోబడి ఉంటాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రకటించింది. ఎస్బీఐ కార్డులు & పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్బీఐసీపీఎస్ఎల్) ఇటీవల రూ.99 ప్రాసెసింగ్ ఫీజువసూలు చేసి దానిపై పన్నులు వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. రిటైల్ లొకేషన్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ఈ-కామర్స్ సైట్స్ నిర్వహించే అన్ని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్ స్టాల్ మెంట్(ఈఎమ్ఐ) కొనుగోళ్లకు ఈ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. ఈ విషయం గురించి తన క్రెడిట్ కార్డు ఖాతాదారులకు తెలియజేస్తూ ఒక ఈ-మెయిల్ పంపింది. "01 డిసెంబర్ 2021 నుంచి మర్చంట్ అవుట్ లెట్/వెబ్ సైట్/యాప్ వద్ద చేసిన అన్ని మర్చంట్ ఈఎమ్ఐ లావాదేవీలపై రూ.99 (+ పన్నులు) ప్రాసెసింగ్ ఫీజు విధించనున్నట్లు మేము మీకు తెలియజేస్తున్నాము" అని ఎస్బీఐసీపీఎస్ఎల్ తెలిపింది. ఈ నోటీసును ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఖాతాదారులందరికీ పంపారు. అంటే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో వస్తువులను కొని ఈఎంఐగా మార్చుకుంటే ఈ ఫీజు వసూలు చేస్తారు. ఈ నిర్ణయంతో ఈఎంఐ ఆప్షన్ వినియోగించుకోవాలనుకునే కస్టమర్లకు మరింత భారం పడనుంది. అలాగే, ఈఎమ్ఐ లావాదేవీ విఫలమైనా లేదా క్యాన్సిల్ చేసిన ప్రాసెసింగ్ ఖర్చు తిరిగి చెల్లిస్తారు. (చదవండి: 'సింగిల్స్ డే' అమ్మకాల్లో రికార్డ్.. రూ.10 లక్షల కోట్ల వ్యాపారం) -
ద్విచక్ర వాహనాలు కొనేవారికి ఎస్బీఐ తీపికబురు
SBI Easy Ride: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ద్విచక్ర వాహనాలు కొనేవారికి తీపికబురు అందించింది. ఎస్బీఐ యోనో ఫ్లాట్ ఫారం ద్వారా సులభంగా ద్విచక్ర వాహనా రుణాలను పొందవచ్చు అని తెలిపింది. ద్విచక్ర వాహనా రుణాల కోసం ఎస్బీఐ "ఈజీ రైడ్" పేరుతో మరో ఆప్షన్ తీసుకొనివచ్చింది. అర్హత కలిగిన ఎస్బీఐ కస్టమర్లు బ్యాంకు బ్రాంచీని సందర్శించకుండానే యోనో యాప్ ద్వారా క్షణాలలో ద్విచక్ర వాహన రుణాలను పొందవచ్చు అని తెలిపింది. "కస్టమర్లు గరిష్టంగా 4 సంవత్సరాల వరకు సంవత్సరానికి 10.5% వడ్డీరేటుతో రూ.3 లక్షల వరకు ఈజీ రైడ్ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస రుణ మొత్తాన్ని రూ.20,000గా నిర్ణయించారు' అని బ్యాంకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కస్టమర్ పొందిన రుణం నేరుగా డీలర్ ఖాతాలోకి జమ కానుంది. ఈ పథకం కింద వాహనం ఆన్-రోడ్ ధరలో 85% వరకు రుణాలను పొందవచ్చని ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీ ఛైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ.. 'ఎస్బీఐ ఈజీ రైడ్' రుణ పథకం మా కస్టమర్లకు అంతరాయం లేని అనుభవాన్ని అందిస్తుందని మేం ఆశిస్తున్నాం అని అన్నారు. (చదవండి: ఎలక్ట్రిక్ కారు రేసులోకి టొయోటా.. రేంజ్ కూడా అదుర్స్!) -
రైతులకు శుభవార్త.. గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల రుణం!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు శుభవార్త తెలిపింది. రైతులకు గ్యారంటీ లేకుండా రూ. 3 లక్షలు వరకు రుణం అందించనున్నట్లు పేర్కొంది. ఈ రుణం కోసం ఎస్బీఐ బ్యాంక్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. రైతులకు సహాయం చేయడం కోసం ఎస్బీఐ కిసాన్ క్రెడిట్ కార్డును అందిస్తుంది. రైతు తన వ్యవసాయానికి సంబంధించిన ఖర్చుల కోసం ఈ కార్డు సహాయంతో రుణం సులభంగా తీసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. దీని ద్వారా వారి అవసరాన్ని బట్టి రుణం అందిస్తుంది. ఈ కార్డు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్బీఐ కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు కిసాన్ క్రెడిట్ కార్డు అనేది రివాల్వింగ్ క్యాష్ క్రెడిట్ అకౌంట్ తరహాలోనే ఇది ఉంటుంది. ఖాతాలో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటును అందిస్తుంది. ఈ కార్డు వ్యవది 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం వార్షిక సమీక్షకు లోబడి మీ కార్డు పరిమితి 10% పెరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణాలకు రూ.3 లక్షల వరకు 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. తిరిగి చెల్లించే వ్యవధి పంట కాలం(స్వల్ప/దీర్ఘం), పంట మార్కెటింగ్ పీరియడ్ పై ఆధారపడి ఉంటుంది. 45 రోజులకు ఒకసారి కార్డు యాక్టివేట్ చేసినట్లయితే, బ్యాంకు రూపే కార్డుల మాదిరిగా మీకు రూ. 1 లక్ష బీమా లభిస్తుంది. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? రైతులు/వ్యక్తులు/ఉమ్మడి రుణగ్రహీతలు, యజమాని సాగుదారులు, కౌలు రైతులు, నోటి లెస్సీలు, షేర్ క్రాపర్లు అందరూ కూడా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కౌలు రైతులు, షేర్ క్రాపర్లు మొదలైన వాటితో సహా రైతుల స్వయం సహాయక గ్రూప్, జాయింట్ లయబిలిటీ గ్రూపులు కూడా వర్తిస్తాయి. రూ.3 లక్షల వరకు తీసుకునే రుణాలపై వడ్డీ రేటు 7 శాతం వరకు ఉంటుంది. 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణగ్రహీతలు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం(పీఎఐఎస్) కింద కవర్ చేయబడతారు. అర్హత కలిగిన పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పిఎమ్ఎఫ్ బివై) కింద కవర్ అవుతాయి. (చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో కోటీశ్వరులైపోయారు!) కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఎస్బీఐ పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోండి రైతులు నేరుగా ఎస్బీఐ శాఖను సందర్శించి కేసీసీ దరఖాస్తు ఫారమ్ కోసం అడగవచ్చు. ఆ తర్వాత మీ పూర్తి వివరాలను నింపి, బ్యాంకులో సమర్పించాలి బ్యాంకు దరఖాస్తును పరిశీలించి, దరఖాస్తుదారుడి వివరాలను ధృవీకరించి, కార్డును కేటాయిస్తుంది. యోనో ద్వారా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా? యోనో ఎస్బీఐ లాగిన్ అవ్వండి యోనో కృషి ఆప్షన్ పై క్లిక్ చేసి ఖాతాపై క్లిక్ చేయండి. మళ్లీ కిసాన్ క్రెడిట్ కార్డుపై క్లిక్ చేయండి ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు, పంట వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించండి. మీరు గనుక అర్హులు అయితే, కిసాన్ క్రెడిట్ కార్డు మీ ఇంటికి వస్తుంది. కావాల్సిన పత్రాలు ఇంటి చిరునామా, గుర్తింపు రుజువు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి. వ్యవసాయ భూమి పత్రాలు దరఖాస్తుదారుడి ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ను అందించాలి. కార్డ్ జారీ చేసే బ్యాంక్ సెక్యూరిటీ పోస్ట్ డేటెడ్ చెక్‌ను సమర్పించమని కూడా అడగవచ్చు. (చదవండి: నెలకు రూ.300 చెల్లిస్తే చాలు జియో ఫోన్ మీ సొంతం..!) -
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. రూ.342కే రూ.4 లక్షల బెనిఫిట్!
2020లో వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి తర్వాత బీమా గురించి సాధారణ ప్రజలలో అవగాహన పెరిగింది. సమాజంలోని ప్రతి వర్గానికి చేరుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ మొత్తానికి బీమా సదుపాయాలను అందిస్తోంది. ఎస్బీఐ బ్యాంక్ ఖాతా కలిగిన వారు ఏడాదికి రూ.342తో డబ్బులు కడితే ఏకంగా రూ.4 లక్షల విలువ గల భీమా ప్రయోజనం మీరు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పిఎంఎస్బివై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పిఎంజెజెబివై) మీకు రూ.4 లక్షల వరకు ప్రమాద బీమా + జీవిత బీమా అందిస్తున్నాయి. అయితే, దీని కోసం మీరు కేవలం రూ.342 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ రెండు పథకాల గురించి సమాచారాన్ని షేర్ చేసింది. ఎస్బీఐ కస్టమర్లు ఆటో డెబిట్ సదుపాయం ద్వారా ఖాతాదారుడి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం కట్ అవుతుంది అని బ్యాంకు తెలియజేసింది. Get the insurance that suits your need and live life worry-free.#PMSBY #PMJJBY #SBI #Insurance pic.twitter.com/n7DC4eTlOV — State Bank of India (@TheOfficialSBI) October 2, 2021 (చదవండి: జియోఫోన్ నెక్ట్స్ లాంచ్...! సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు..!) ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద బీమా తీసుకున్న ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా పూర్తిగా వికలాంగులైనా రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది. ఈ పథకం కింద బీమా చేసిన వ్యక్తి పాక్షికంగా లేదా శాశ్వతంగా వైకల్యం పొందినట్లయితే అతడు/ఆమెకు లక్ష రూపాయల పరిహారం లభిస్తుంది. దీనిలో 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా చేరవచ్చు. ఈ ప్లాన్ వార్షిక ప్రీమియం కూడా రూ.12 మాత్రమే. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.2 లక్షలు వరకు పరిహారం లభిస్తుంది. 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఏ వ్యక్తి అయినా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కోసం కూడా మీరు కేవలం రూ.330 వార్షిక ప్రీమియం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ బీమా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఈ బీమా కవర్ జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుందని తెలుసుకోవాలి. భీమా పొందాలంటే మీరు బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. ప్రీమియం మినహాయింపు సమయంలో బ్యాంకు ఖాతా మూసివేయడం లేదా ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కూడా బీమాను రద్దు చేసుకోవచ్చు. (చదవండి: ఓలా స్కూటర్ గురించి సీఈఓ భవిష్ అగర్వాల్ ఆసక్తికర ట్వీట్) -
ఎస్బీఐ కార్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్!
దసరా పండుగ సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అన్నీ భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎస్బీఐ కార్డ్స్ తమ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సమయంలో మొబైల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ల్యాప్ టాప్స్, కిచెన్ అప్లయన్సెస్, హోమ్ డెకార్, ఫర్నిషింగ్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వంటి మొదలైన ఏ కేటగిరీల్లోనైనా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ఆన్లైన్ షాపింగ్ చేసే వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఆఫర్ కేవలం అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5, 2021 వరకు మాత్రమే ఉంటుంది.(చదవండి: జీన్స్, టీషర్ట్స్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్...!) ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో ఈఎమ్ఐ కింద కొనుగోళ్లు చేసిన ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే, కొనే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా, మీకు ఇష్టమైన ఈ-కామర్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసినా ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. అలాగే, ఆ మూడు రోజుల సమయంలో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు కూడా కల్పిస్తామని తెలిపింది. వాటి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది. మరింత సమాచారం కోసం ఎస్బీఐ కార్డ్. కామ్ సందర్శించండి అని తెలిపింది. (చదవండి: ఎస్బీఐ హోమ్ లోన్ దరఖాస్తుకు కావాల్సిన ధ్రువ పత్రాలు ఇవే..!) Start the celebrations with the most exciting sale of the festive season. Stay Tuned for more info on #DumdaarDus Cashback*! *T&Cs Apply#SBICard #Cashback #FestiveOffers #FestiveShopping #Sale #FestiveSale pic.twitter.com/Kc1bpzRIbt — SBI Card (@SBICard_Connect) September 28, 2021 -
హోమ్ లోన్ దరఖాస్తుకు కావాల్సిన ధ్రువ పత్రాలు ఇవే..!
మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడానికి ఎంతో ఆరాట పడుతుంటారు. ఇలాంటి కలల గృహం చాలా కష్ట పడుతారు. అయితే, వారి దగ్గర ఉన్న సొమ్ముతో మరికొంత సొమ్మును వడ్డీకి తీసుకొని వచ్చి కట్టుకుంటారు. అయితే, అలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశంలోని అతిపెద్ద రుణదాత 6.70 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తోంది. ఎస్బీఐ ఇటీవలి ప్రకటనలో, ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారులు గృహ రుణం పొందడానికి అవసరమైన పత్రాల జాబితాను విడుదల చేసింది. ఎస్బీఐ గృహ రుణాన్ని పొందడానికి అవసరమైన ముఖ్యమైన పత్రాలు క్రింది విధంగా ఉన్నాయి.(చదవండి: దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్!) ఉద్యోగి గుర్తింపు కార్డు లోన్-అప్లికేషన్: పూర్తిగా నింపిన రుణ దరఖాస్తు ఫారం మీద మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు అతికించాలి. గుర్తింపు రుజువు (ఏదైనా ఒకటి): పాన్ /డ్రైవర్ లైసెన్స్/ పాస్ పోర్ట్/ఓటర్ ఐడి కార్డు నివాస రుజువు లేదా చిరునామా(ఏదైనా ఒకటి): ఇటీవల విద్యుత్ బిల్లు/టెలిఫోన్ బిల్లు/ వాటర్ బిల్లు/ పైప్డ్ గ్యాస్ బిల్లు లేదా పాస్ పోర్ట్/ఆధార్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్ కాపీ ప్రాపర్టీ పేపర్లు: నిర్మాణానికి అనుమతి (వర్తించే చోట) అమ్మకానికి నమోదు చేసుకున్న ఒప్పందం (మహారాష్ట్రకు మాత్రమే)/అమ్మకానికి స్టాంప్డ్ ఒప్పందం/కేటాయింపు లేఖ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్(ఆస్తిని బదిలీ చేయడానికి సిద్ధంగా ఉంటే) మెయింటెనెన్స్ బిల్లు, విద్యుత్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు ఆమోదించబడ్డ ప్లాన్ కాపీ(జిరాక్స్ బ్లూప్రింట్), బిల్డర్ రిజిస్టర్డ్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్, కన్వేయన్స్ డీడ్(కొత్త ఆస్తి కోసం) చెల్లింపు రసీదులు లేదా బిల్డర్ లేదా విక్రేతకు చేసిన అన్ని చెల్లింపులను చూపించే బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ బ్యాంక్ ఖాతా వివరాలు దరఖాస్తుదారుడు కలిగి ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలకు సంబంధించి గత ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్లు ఒకవేళ ఇతర బ్యాంకులు నుంచి రుణం తీసుకుంటే, గత సంవత్సరం రుణ ఖాతా స్టేట్ మెంట్ వేతన దరఖాస్తుదారుడు శాలరీ స్లిప్ లేదా గత మూడు నెలల వేతన సర్టిఫికేట్ గత రెండు సంవత్సరాలుగా ఫారం 16 కాపీ లేదా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐటి రిటర్న్‌ల కాపీ వేతనేతర దరఖాస్తుదారుడు బిజినెస్ చిరునామా రుజువు గత మూడు సంవత్సరాల ఐటి రిటర్న్స్ గత మూడు సంవత్సరాలుగా బ్యాలెన్స్ షీట్, లాభం మరియు నష్టం ఖాతా బిజినెస్ లైసెన్స్ వివరాలు(లేదా సమానమైనవి) టీడీఎస్ సర్టిఫికేట్ (ఫారం 16ఏ - ఒకవేళ వర్తిస్తే) అర్హత సర్టిఫికేట్(సి.ఏ/డాక్టర్ లేదా ఇతర ప్రొఫెషనల్స్ కోసం) -
రుణ గ్రహీతలకు ఎస్బీఐ పండుగ బొనాంజా ఆఫర్లు
పండుగ సీజన్ సమీపిస్తున్న కొద్దీ ఇటు బ్యాంకులు, అటు ఈ కామర్స్ సంస్థలు వినియోగదారుల మీద ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థలు భారీగా డిస్కౌంట్స్ ఇస్తుంటే, బ్యాంకులు గృహ, వ్యక్తిగత, కారు, బంగారం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు పండుగ ఆఫర్ల వర్షం కురిపించింది. గృహ రుణం, కారు రుణం, బంగారు రుణం, వ్యక్తిగత రుణంపై అనేక ప్రయోజనాలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల ఎస్బీఐ చేసిన ఒక ట్వీట్లో కారు, బంగారం, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన ఆఫర్ల గురించి ప్రస్తావించింది. ఈ ట్వీట్లో "కారు రుణం, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ పై ఎస్బీఐ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లతో పండుగ వేడుకలను ప్రారంభించండి. ఈ రోజు ప్రారంభించండి!" అని పేర్కొంది. కారు రుణాన్ని లక్షకు రూ.1539, బంగారు రుణాన్ని 7.5 శాతం వడ్డీతో, వ్యక్తిగత రుణాన్ని లక్షకు రూ.1832 ఈఎంఐకే అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ కస్టమర్లు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. (చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త!) Start the festive celebrations with special offers on Car Loan, Gold Loan and Personal Loan from SBI. Get started today! Apply Now: https://t.co/BwaxSb3HYQ#SBI #StateBankOfIndia #HarTyohaarShubhShuruaat #CarLoan #PersonalLoan #GoldLoan pic.twitter.com/Ebx69ujTYf — State Bank of India (@TheOfficialSBI) September 22, 2021 అలాగే, త్వరలో రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని గృహ రుణాలపై ఆఫర్లను ప్రకటించింది. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. దీని ప్రకారం, చక్కటి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 45 బేసిస్ పాయింట్ల(100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర వడ్డీరేటు తగ్గింది. 30 సంవత్సరాలకు చెల్లించే విధంగా రూ.75 లక్షల రుణం తీసుకుంటే, ఈ కాలపరిమితిలో రూ.8 లక్షలకుపైగా వడ్డీ భారాన్ని తగ్గించుకోగలుగుతారు. -
రిటైల్ డిపాజిట్లపై నెగటివ్ రిటర్న్స్!
ముంబై: ధరల పెరుగుదల స్పీడ్ (ద్రవ్యోల్బణాన్ని) పరిగణనలోకి తీసుకుంటే రిటైల్ డిపాజిటర్లకు తమ డిపాజిట్లపై ప్రస్తుతం నెగటివ్ రిటర్న్స్ అందుతున్నాయని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థికవేత్తల నివేదిక ఒకటి పేర్కొంది. ఈ నేపథ్యంలో వడ్డీ ఆర్జనలపై పన్ను అంశాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని తన తాజా నివేదికలో సూచించింది. ఈ మేరకు సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలోని ఆర్థికవేత్తలు సమర్పించిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►డిపాజిటర్ల అందరి గురించీ ఆలోచించక పోయినా, కనీసం సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై పన్ను భారాన్ని తగ్గించే అంశాన్ని అయినా సమీక్షించాలి. వారి రోజూవారీ అవసరాలు, వ్యయాలు ఈ వడ్డీపైనే ఆధారపడే సంగతి తెలిసిందే. మొత్తం డిపాజిట్లు దాదాపు రూ. 156 లక్షల కోట్లు. ఇందులో రిటైల్ డిపాజిట్ల వాటా దాదాపు రూ.102 లక్షల కోట్లు. ►ప్రస్తుతం,డిపాజిటర్లందరికీ సంవత్సరానికి రూ.40,000 కంటే ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని జమ చేసే సమయంలో బ్యాంకులు మూలం వద్ద పన్నును మినహాయించుకుంటాయి, అయితే సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి ఆదాయం రూ .50,000 దాటితే పన్ను భారం పడుతుంది. ►వృద్ధే ప్రధాన లక్ష్యంగా దేశం ప్రస్తుతం సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అవలంభిస్తోంది. దీనితో డిపాజిట్ రేట్ల కనీస స్థాయికి పడిపోయి, కేవలం దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నవారికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. రెపో వరుసగా ఏడు త్రైమాసికాల నుంచి 4 శాతంగా కొనసాగుతోంది. ►వడ్డీరేట్లు ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనిపించడంలేదు. బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) భారీగా కొనసాగుతుండడం ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశం. ►ప్రస్తుతం ఫైనాన్షియల్ మార్కెట్లో బుల్‌రన్ నడుస్తోంది. ఇది డిపాజిటర్ల ఆలోచనా ధోరణిని మార్చే అవకాశం ఉంది. తమ పెట్టుబడికి తగిన రిటర్న్స్ సంపాదించడానికి వారు మార్కెట్‌వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. ►వ్యవస్థలో అధిక ద్రవ్య లభ్యత, వడ్డీరేట్ల విషయంలో పోటీతత్వం, నిధుల సమీకరణ వ్యయాల సమతౌల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, బ్యాంకులు ప్రస్తుతం మార్జిన్ల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయి. -
పండుగ సీజన్ రాకముందే ఎస్బీఐ ఆఫర్ల వర్షం
ముంబై: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ పండుగ రాకముందే ఖాతాదారులకు ఆఫర్ల వర్షం కురిపించింది. త్వరలో రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తుంది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోరు ఆధారంగా జీరో ప్రాసెసింగ్ ఫీజుతో కేవలం 6.70 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలను అందిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఇంతకు ముందు రూ.75 లక్షల కంటే ఎక్కువ రుణాన్ని పొందాలంటే రుణగ్రహీత 7.15% వడ్డీ రేటు చెల్లించాల్సి వచ్చేది. పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టడంతో రుణగ్రహీత ఇప్పుడు 6.70% కంటే తక్కువ రేటుతో గృహ రుణాన్ని పొందవచ్చు. రూ.8 లక్షలు ఆదా.. ఈ ఆఫర్ వల్ల 45 బీపీఎస్ పాయింట్లు ఆదా అవుతుంది. దీని వల్ల పరోక్షంగా రుణగ్రహీతకు రూ.8 లక్షలకు పైగా భారీ వడ్డీ ఆదా కానున్నట్లు సంస్థ పేర్కొంది. 30 సంవత్సరాల కాలానికి రూ.75 లక్షల రుణం అందించే అవకాశం ఉంటుంది. అలాగే, గతంలో వేతనేతర రుణగ్రహీతలకు వర్తించే వడ్డీ రేటు వేతన రుణగ్రహీతలకు వర్తించే వడ్డీ రేటు మధ్య 15 బీపీఎస్ వ్యత్యాసం ఉండేది. వేతన, వేతనేతర రుణగ్రహీతల మధ్య ఈ వ్యత్యాసాన్ని ఎస్బీఐ తాజాగా తొలగించింది. ఇక వేతనేతర రుణగ్రహీతలకు 15 బీపీఎస్ వడ్డీ ఆదా అవుతుంది. (చదవండి: Gpay: గూగుల్ పే భారీ అవకతవకలు!) ఈ కొత్త ఆఫర్ల వల్ల పండుగ సీజన్లో ఖాతాదారులు, రుణగ్రహితలు మరింత సంతోషంగా పండుగలు జరుపుకుంటారు అని ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్(రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ సెట్టీ మాట్లాడుతూ.. "ఈసారి, మేము ఆఫర్లను మరింత సమ్మిళితంగా చేసాము. రుణ మొత్తం అనేది రుణగ్రహీత వృత్తితో సంబంధం లేకుండా అందిరికి ఒకేవిధంగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 6.70% వడ్డీరేటు, జీరో ప్రాసెసింగ్ ఫీజులు, రాయితీ వడ్డీ రేట్లు గృహ రుణాలను మరింత చౌకగా చేస్తాయని మేము నమ్ముతున్నాము. ఈ మహమ్మారి సమయంలో మన దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తుంది. ప్రతి భారతీయుడికీ బ్యాంకర్ గా అందరికీ గృహవసతి కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో మా వంతు కృషి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని ఆయన అన్నారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ఎస్బీఐ తన ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బేస్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05 శాతం తగ్గించాలని ఎస్బీఐ 14 సెప్టెంబర్ 2021న నిర్ణయించింది. దీని తర్వాత కొత్త వడ్డీ రేట్లు 7.45 శాతంగా ఉంటాయి. అదే సమయంలో ప్రైమ్ రుణ రేటు(పీఎల్ఆర్)ను కూడా 12.20 శాతానికి(5 బేసిస్ పాయింట్లు తగ్గించి) తగ్గిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ కొత్త రేట్లు 15 సెప్టెంబర్ 2021 నుంచి అమలులోకి రానున్నాయి. గతంలో ఏప్రిల్ 2021లో ఎస్బీఐ గృహ రుణాల రేట్లను 6.70 శాతానికి, మహిళా రుణగ్రహీతలకు ప్రత్యేక రాయితీ కింద 5 బీపీఎస్ తగ్గించింది. బేస్ రేటు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత ప్రభావితం చెందుతాయి. సెంట్రల్ బ్యాంక్ నిర్దేశించిన బేస్ రేటు కంటే తక్కువ రేటుతో రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అనుమతి లేదు. సెంట్రల్ బ్యాంక్ నిర్దేశించిన ప్రస్తుత బేస్ రేటు 7.30-8.80 శాతంగా ఉంది. ఎస్బీఐ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుడి జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ కొత్త వడ్డీరేట్ల వల్ల ఎస్బీఐ కస్టమర్లు ప్రతి నెల చెల్లించే గృహ రుణం, ఆటో రుణం, వ్యక్తిగత రుణంతో సహా వివిధ రకాల రుణాల వాయిదాలు తక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.(చదవండి: ఎంఐ ప్రియులకి షియోమీ షాకింగ్ న్యూస్) -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపు ఈ సేవలకు అంతరాయం
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సెప్టెంబర్ 15న రెండు గంటలు పాటు తన ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. "మేము 15 సెప్టెంబర్ 2021న 00:00 గంటల నుంచి 02:00 గంటల (120 నిమిషాలు) మధ్య కాలంలో చేపట్టే మెయింటెనెన్స్ కారణంగా ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలు అంతరాయం కలగనున్నట్లు పేర్కొంది. మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము" అని ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలను అంధించడం కోసం కృషి చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది.(చదవండి: పెన్షనర్లకు ఎస్బీఐ శుభవార్త!) ఇంతకు ముందు కూడా సెప్టెంబర్ 4, 5 తేదీల మధ్య మూడు గంటలపాటు అన్ని డిజిటల్ సర్వీసులకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 4వ తేదీ(ఇవాళ రాత్రి) రాత్రి 10.35 నుంచి అర్ధరాత్రి దాటాక 1గం.30ని. వరకు డిజిటల్ సర్వీసులు పని చేయవని తెలిపింది. ఈ మూడు గంటలపాటు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని పేర్కొంది. ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులు సెప్టెంబర్ 30 లోపు తప్పనిసరిగా ఆధార్ తో లింక్ చేయాలని పేర్కొంది. ఒకవేళ లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని తెలిపింది. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #OnlineSBI #SBI pic.twitter.com/5SXHK20Dit — State Bank of India (@TheOfficialSBI) September 14, 2021 -
బ్యాంక్‌కు నిద్రలేని రాత్రి: అర్ధరాత్రి పాము హల్చల్
ఆత్మకూరు: బ్యాంక్‌లో పాము దూరి హల్చల్ చేసింది. అనంతపురము జిల్లా ఆత్మకూరులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో శుక్రవారం అర్ధరాత్రి ఓ పాము కలకలం రేపింది. శనివారం తెల్లవారుజాము 4.30 గంటల వరకూ బ్యాంక్ అధికారులు, పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేసింది. బ్యాంక్ మేనేజర్ పరుశురాం, ఏఎస్ఐ వరుణాచారి తెలిపిన మేరకు.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బ్యాంక్ అలారం ఒక్కసారిగా మోగింది. అప్పటికే అనంతపురంలోని తన గృహంలో నిద్రిస్తున్న బ్యాంక్ మేనేజర్ మొబైల్ ఫోన్లో సైతం అలారం (బ్యాంక్ సైరన్‌తో అనుసంధానం) మోగడంతో వెంటనే ఆయన అప్రమత్తమై పోలీసులకు, స్థానికంగా ఉన్న బ్యాంక్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆగమేఘాలపై బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అలారం మోతకు చుట్టుపక్కల వారు నిద్రలేచి బ్యాంక్ చుట్టూ గుమిగూడారు. దొంగలు పడ్డారేమోననే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతుండగా బ్యాంక్ ఉద్యోగులు తలుపులు తీశారు. లోపల అనుమానాస్పద వ్యక్తులు ఎవరూ కనిపించలేదు. క్షుణ్ణంగా గాలించారు. అలారం స్విచ్ వద్ద ఓ పాము కనిపించడంతో దానిని చంపేశారు. అప్పటికే తెల్లవారుజాము 4.30 గంటలైంది. పాము కదలికలతో అలారం స్విచ్ ఆన్ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
అదిరిపోయే ఎస్బీఐ ఆఫర్ వారం రోజులు మాత్రమే
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారుల కోసం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్’ కింద కస్టమర్లు 75 రోజులు, 75 వారాలు, 75 నెలల వరకు డిపాజిట్ చేసే మొత్తంపై 15 బేసిస్ పాయింట్లు వరకు అదనంగా వడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ ఆఫర్ 2021 సెప్టెంబరు 14 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య సాధారణ ఖాతాదారులు పొదుపు చేసే ఎఫ్డీలపై 3.9% నుంచి 5.4% వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్లు జమ చేసే డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) అదనంగా లభిస్తాయి. ఈ వడ్డీ రేట్లు 8 జనవరి 2021 నుండి అమల్లోకి రానున్నాయి. (చదవండి: Tesla: భారత్‌లో ఆన్లైన్ ద్వారా కార్ల అమ్మకం!) అర్హత: ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ టర్మ్ డిపాజిట్లతో సహా దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు(₹2 కోట్ల కంటే తక్కువ) కొత్త, రెన్యువల్ డిపాజిట్లు టర్మ్ డిపాజిట్, స్పెషల్ టర్మ్ డిపాజిట్ ప్రొడక్ట్‌లు మాత్రమే. ఎన్ఆర్ఈ డిపాజిట్లు(525 రోజులు, 2250 రోజులు మాత్రమే) సాధారణ ప్రజలకు ఎస్బీఐ ప్లాటినం వడ్డీ రేట్లు Tenor Existing Interest Rate Proposed Interest Rate 75 రోజులు 3.90% 3.95% 525 రోజులు 5.00% 5.10% 2250 రోజులు 5.40% 5.55% సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ ప్లాటినం వడ్డీ రేట్లు Tenor: Existing Interest Rate Proposed Interest Rate 75 రోజులు 4.40% 4.45% 525 రోజులు 5.50% 5.60% 2250 రోజులు 6.20% 6.20% -
ఎస్బీఐ భారీగా నిధుల సమీకరణ
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) బాండ్ల జారీ ద్వారా రూ.4,000 కోట్లు సమకూర్చుకుంది. బాసెల్ నిబంధనలకు అనుగుణంగా అదనపు టైర్-1 బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించినట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ ఏటీ-1 బాండ్లకు 7.72 శాతం కూపన్ రేటును ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. రూ.1,000 కోట్ల బేస్‌తో జారీ చేసిన బాండ్లకు భారీ స్థాయిలో డిమాండ్ కనిపించినట్లు ఎస్బీఐ తెలియజేసింది. రూ.10,000 కోట్లకుపైగా విలువైన బిడ్స్ లభించినట్లు వెల్లడించింది. దీంతో 7.72 శాతం కూపన్ రేటుతో రూ.4,000 కోట్ల విలువైన బిడ్స్‌ను అంగీకరించినట్లు వివరించింది. కాగా.. 2013లో బాసెల్-3 నిబంధనలు అమల్లోకి వచ్చాక ఏటీ-1 బాండ్లకు ఒక దేశీ బ్యాంక్ ఆఫర్ చేస్తున్న అత్యంత కనిష్ట ధర ఇదని ఎస్బీఐ తెలియజేసింది. వీటికి రేటింగ్ సంస్థలు అత్యుత్తమ రేటింగ్ ఏఏప్లస్‌ను ప్రకటించినట్లు వెల్లడించింది. నిధుల సమీకరణ వార్తల నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ.429 వద్ద ముగిసింది.(చదవండి: దాల్ సరస్సులో ఎస్బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్) -
పికప్ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.ఇందులో భాగంగా కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఇకపై కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు. వడ్డీ రేటు 11.5 శాతం నుంచి ప్రారంభం. రూ.10 లక్షల వరకు వాహనానికి (ఆన్ రోడ్) అయ్యే వ్యయంలో 85 శాతం దాకా రుణం ఇస్తారు. కాల పరిమితి ఆరేళ్లు. థర్డ్ పార్టీ గ్యారంటీ అవసరం లేదు. తొలిసారి వాహనాన్ని కొనుగోలు చేసేవారికి ఐటీఆర్ అక్కరలేదు. చదవండి : అదిరిపోయే లుక్, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో -
SBI: కారు రుణాలపై 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో రిటైల్ కస్టమర్లకు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొన్ని ముఖ్య ఆఫర్లను పరిశీలిస్తే... కారు రుణాలపై 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు; 90 శాతం వరకూ ఆన్–రోడ్ ఫైనాన్సింగ్ కారు రుణం డిజిటల్‌గా యోనో ద్వారా దరఖాస్తు చేస్తే 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు)మేర ప్రత్యేక వడ్డీ రాయితీ. వార్షిక వడ్డీ 7.5 శాతం వడ్డీ రేటు నుంచి లభ్యత బంగారంపై రుణాల విషయంలో 75 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వడ్డీరేట్ల తగ్గింపు. 7.5 శాతానికే రుణ లభ్యత. యోనో ద్వారా దరఖాస్తు చేస్తే ప్రాసెసింగ్ ఫీజు రద్దు చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వ్యక్తిగత, పెన్షన్ రుణ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు కోవిడ్ వారియర్స్ (ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్ వంటివారికి) వ్యక్తిగత రుణాలపై 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీ. కారు, బంగారం రుణాలకు సంబంధించి దరఖాస్తులకూ ఇది వర్తిస్తుంది. రిటైల్ డిపాజిటర్లకు ‘‘ప్లాటినం టర్మ్ డిపాజిట్ల’ పథకాన్ని కూడా బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఈ పథకం కింద 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితితో టర్మ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ లభ్యత. ఆగస్టు 31 వరకూ వర్తించేట్లు గృహ రుణంపై 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు. 6.7 శాతం నుంచి గృహ రుణం లభిస్తోంది. -
ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త!
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పండుగ రాక ముందే తన రిటైల్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. బ్యాంకు వివిధ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేసినట్లు ప్రకటించింది. గతంలో గృహ రుణాలపై ఆఫర్ కింద 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును ఆగస్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా కారు రుణాలపై, బంగారం రుణాలపై, వ్యకిగత రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను 100 శాతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ జనవరి 1, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే, వినియోగదారులు కారు ఆన్ రోడ్ ధరలపై 90 శాతం వరకు ఫైనాన్సింగ్ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది. 75 బీపీఎస్ పాయింట్ల తగ్గింపు యోనో యాప్ ద్వారా కారు రుణం కోసం దరఖాస్తు చేస్తున్న కస్టమర్లకు బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) ప్రత్యేక వడ్డీ రాయితీని అందిస్తుంది. యోనో(యు ఓన్లీ నీడ్ వన్ యాప్) అనేది ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్. యోనో వినియోగదారులు సంవత్సరానికి 7.5 శాతం నుంచి వడ్డీ రేటుతో కారు రుణాలను పొందవచ్చని తెలిపింది. యోనో ద్వారా బంగారు రుణాలను పొందే ఖాతాదారులకు వడ్డీ రేట్లలో 75 బీపీఎస్ పాయింట్ల తగ్గింపును బ్యాంకు అందిస్తోంది. వారు సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటుతో బ్యాంకు నుంచి బంగారు రుణాలను పొందవచ్చు అని పేర్కొంది. అంతేగాక, యోనో ద్వారా బంగారు రుణాల కోసం దరఖాస్తు చేసే వినియోగదారులందరికీ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. Get drenched in happiness, as it's raining offers with SBI. Avail a 100% Processing Fee waiver on Car Loan, Gold Loan and Personal Loan. Know more at https://t.co/8gV2D7FEFG#SBI #CarLoan #GoldLoan #PersonalLoan #ItsRainingOffersWithSBI pic.twitter.com/fTcMvYShyq — State Bank of India (@TheOfficialSBI) August 16, 2021 కోవిడ్ యోధులకు వడ్డీ రాయితీ వ్యక్తిగత, పెన్షన్ రుణ ఖాతాదారుల కొరకు ప్రాసెసింగ్ ఫీజుల్లో బ్యాంకు 100 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్ల కొరకు 50 బీపీఎస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీని ప్రకటించింది. కారు, బంగారు రుణాలకు కూడా ఈ ఆఫర్ త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిటైల్ డిపాజిటర్ల కోసం ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్లను’ ప్రవేశపెడుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. 75 రోజులు, 75 వారాలు, 75 నెలల టర్మ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇది 2021 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబరు 14 వరకు అమల్లో ఉండనుంది. గృహ రుణాలపై వడ్డీ రేటు 6.70 శాతం వద్ద నుంచి ప్రారంభమవుతుంది. -
ప్రజల కోసం ఎస్బీఐ సరికొత్త డిపాజిట్ పథకం
దేశంలోని అతిపెద్ద పబ్లిక్ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రజల కోసం కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త డిపాజిట్ పథకం కింద ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీని లభిస్తుంది. ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్లు అని పిలువబడే ఈ కొత్త డిపాజిట్ పథకం కాలవ్యవధి పరిమిత కాలం మాత్రమే. ఈ ఆఫర్ సెప్టెంబర్ 14 వరకు కొనసాగుతుందని ఎస్బీఐ తన పోర్టల్ లో తెలిపింది. "ప్లాటినం డిపాజిట్లతో భారతదేశం 75వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని జరుపుకునే సమయం ఇది. టర్మ్ డిపాజిట్లు, స్పెషల్ టర్మ్ డిపాజిట్ల కింద ఎస్బీఐ అనేక ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తుంది. ఈ ఆఫర్ 14 సెప్టెంబర్ 2021 వరకు చెల్లుబాటు అవుతుంది" అని ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో తెలిపింది. ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్లు ప్రత్యేక డిపాజిట్ పథకంలో భాగంగా డిపాజిట్ దారులకు 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలవ్యవధుల్లో ప్రస్తుతం లభిస్తున్న టర్మ్ డిపాజిట్లపై 0.15 శాతం వరకు అదనపు వడ్డీని పొందవచ్చు. ఈ ప్రత్యేక డిపాజిట్ పథకం కింద డిపాజిట్ దారులు 75 రోజులు, 525 రోజులు, 2,250 రోజుల కాలవ్యవధులను ఎంచుకోవచ్చు. దీని కింద పెట్టిన పెట్టుబడులపై అదనపు వడ్డీ లభిస్తుంది. రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లను ఈ పథకం కింద పెట్టుబడులు పెట్టవచ్చు. ఎన్ఆర్ఈ డిపాజిట్ల కాలపరిమితి 525 రోజులు, 2,250 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ పథకం టర్మ్ డిపాజిట్, స్పెషల్ టర్మ్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుంది. It's time to celebrate India's 75th year of Independence with Platinum Deposits. Exclusive benefits for Term Deposits and Special Term Deposits with SBI. Offer valid up to: 14th Sept 2021 Know More: https://t.co/1RhV1I8fam #SBIPlatinumDeposits #IndependenceDay #SpecialOffers pic.twitter.com/qnbZ4aRVEs — State Bank of India (@TheOfficialSBI) August 15, 2021 వడ్డీ రేటు ఎస్బీఐ ప్లాటినం కింద పెట్టుబడి పెట్టిన ఖాతాదారులకు 75 రోజుల కాలానికి ప్రత్యేక ఆఫర్ కింద వారికి 3.95 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 525 రోజుల కాలంలో వారికి ప్రస్తుతం ఉన్న 5 శాతానికి బదులుగా 5.10 శాతం వడ్డీరేటు లభిస్తుంది. 2,250 రోజుల కాలంలో వారికి 5.40 శాతానికి బదులుగా 5.55 శాతం వడ్డీరేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్ల కింద పెట్టుబడి పెడితే ప్రత్యేక 4.45 శాతం వడ్డీ రేటు 75 రోజుల కాలానికి, 5.60 శాతం వడ్డీ రేటు 525 రోజుల కాలానికి అందించనున్నారు. అయితే, 2,250 రోజుల పదవీకాలంలో అదనపు వడ్డీ ప్రయోజనం లభించదు. టర్మ్ డిపాజిట్ల విషయంలో వడ్డీ చెల్లింపు నెలవారీగా, త్రైమాసిక కాలానికి చెల్లించబడుతుంది. ఎస్బీఐ పరిమిత ఆఫర్ డిపాజిట్ స్కీం గురించి మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. -
సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారతదేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఎఫ్డీ పథకం కింద ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి పెట్టుబడి పెట్టె నగదుపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల కన్న అధిక వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ గా పిలువబడే ఈ కొత్త స్కీమ్ వల్ల వారి ఎఫ్డీ డిపాజిట్లపై అదనంగా 30 బేసిస్ వడ్డీ పాయింట్లు లభిస్తాయి. ప్రస్తుతం, ఎస్బీఐ అన్ని కాలవ్యవధుల టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల ను అందిస్తుంది. వీకేర్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో వారు ఇప్పుడు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టె టర్మ్ డిపాజిట్లపై 80 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ వీకేర్ ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ ఇప్పుడు సెప్టెంబర్ 30, 2021 వరకు అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ ఎఫ్డీ స్కీమ్ వివరాలు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు అర్హులు. ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి ఇందులో ఎఫ్డీ చేయాలి. బ్యాంకు గరిష్ట డిపాజిట్ రూ.2 కోట్లు ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. ఈ డిపాజిట్లపై బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 80 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ కింద డబ్బును ఎఫ్డీ చేస్తే వర్తించే వడ్డీ రేటు 6.2 శాతం గడువు కన్న ముందు నగదు విత్ డ్రా చేస్తే అదనపు 30 బిపీఎస్ ప్రీమియం వర్తించదు. బ్యాంకు 0.5 శాతం జరిమానా విధించవచ్చు. -
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!
ఎస్బీఐ తన బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ తో తప్పనిసరిగా సెప్టెంబర్ 30, 2021లోపు లింక్ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులను కోరింది. "ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఏఏ ప్రకారం ఆధార్ నంబర్ ను, శాశ్వత ఖాతా నంబర్(పాన్)తో 30 సెప్టెంబర్ 2021 నాటికి లింక్ చేయడం తప్పనిసరి" అని ఎస్బీఐ తెలిపింది. అయితే, ఖాతాదారులకు ఈ విషయాన్ని గుర్తు చేయడానికి బ్యాంకు కొన్ని రోజులుగా ట్వీట్ చేస్తూనే ఉంది. ఒకవేల ఖాతాదారులు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ తో లింకు చేయడంలో విఫలమైతే వారి బ్యాంక్ సేవల విషయంలో అంతరాయం ఇబ్బందులు ఎదుర్కొంటారని రుణదాత తెలిపారు. " ఎటువంటి అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలను ఆస్వాదించడానికి పాన్ నెంబర్ ను, ఆధార్ తో లింక్ చేయమని మా కస్టమర్లకు మేము సలహా ఇస్తునాము" అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. కరోనా వైరస్ మహమ్మారి దృష్ట్యా పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసే గడువును గత నెలలో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడగించిన విషయం తెలిసిందే. గతంలో ఈ గడువును మార్చి 30 నుంచి జూన్ 30 వరకు పొడగించారు. మీ పాన్ ను ఆధార్ తో లింక్ చేయడం కొరకు మీరు www.incometax.gov.in ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి లింకు చేయాల్సి ఉంటుంది. We advise our customers to link their PAN with Aadhaar to avoid any inconvenience and continue enjoying a seamless banking service.#ImportantNotice #AadhaarLinking #Pancard #AadhaarCard pic.twitter.com/p4FQJaqOf7 — State Bank of India (@TheOfficialSBI) July 16, 2021 ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ తో పాన్ ను లింక్ చేయవచ్చు. దీని కొరకు మీరు UIDPAN ఫార్మెట్ లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి 567678 లేదా 56161కు ఎస్ఎమ్ఎస్ పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి పాన్-ఆధార్ ని గడువు తేదీ నాటికి లింక్ చేయడంలో విఫలమైనట్లయితే, అప్పుడు అతడు/ఆమె గరిష్టంగా రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. ఆన్ లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపీఐ, యోనో, యోనో లైట్ సేవలు శుక్రవారం రాత్రి 150 నిమిషాల పాటు నిలిచిపోనున్నట్లు పేర్కొంది. "మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి మేము కృషి చేస్తున్నాము, గౌరవనీయ ఖాతాదారులు మాకు సహకరించగలరని అభ్యర్థిస్తున్నాము" అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఎస్బీఐ కస్టమర్లు జూలై 16 రాత్రి 10:45 నుంచి జూలై 17 ఉదయం 1.15 గంటల వరకు 150 నిమిషాలపాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపిఐ, యోనో మరియు యోనో లైట్ సర్వీసులను యాక్సెస్ చేసుకోలేరని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక "ముఖ్యమైన నోటీసు"లో తెలిపింది. ఈ సమయంలో ఎటువంటి లావాదేవీలు చేయకపోవడం మంచిది. -
State Bank Day: పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం
కోవిడ్-19 మహమ్మారి ఇంకా కొనసాగుతున్న తరుణంలో దానిని అరికట్టడం కోసం దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు చెందిన సుమారు 2.50 లక్షల మంది ఉద్యోగులు ఎస్బీఐ 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పీఎం కేర్స్ ఫండ్ కు 62.62 కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు పీఎం కేర్స్ ఫండ్ కు సహకారం అందించడం ఇది రెండవసారి. "మా ఉద్యోగులు కరోనా మహమ్మారి కాలంలో కూడా మా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను అందించడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గర్వకారణం. వారు సేవలు అందించడంలో ఎల్లప్పుడు ముందు ఉంటారు. అదనంగా, మహమ్మారిని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్న సమయంలో వారు స్వచ్ఛందంగా ప్రధాని కేర్స్ ఫండ్ కు విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారు" అని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. Today, on #StateBankDay, we celebrate the incredible journey undertaken so far. Proud to move together with our nation in its march towards progress. We are happy to serve you with the latest digital banking products and services. #TheBankerToEveryIndian pic.twitter.com/qgve8jKQJ6 — State Bank of India (@TheOfficialSBI) June 30, 2021 ఒక బాధ్యతాయుతమైన కార్పొరేట్ పౌరుడిగా, ఈ మహమ్మారి వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ఎస్బీఐ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. గత సంవత్సరంలో ఎస్బీఐ తన వార్షిక లాభంలో 0.25% కోవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా అవసరమైన వారికి మాస్క్ లు, శానిటీసర్ల సరఫరా రూపంలో గణనీయమైన విరాళాలు కూడా ఇచ్చింది. అలాగే అదనంగా, ఎస్బీఐ ఉద్యోగులు ప్రధాని-కేర్స్ ఫండ్ కు రూ.107 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. చదవండి: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ పొదుపు పథకాల కొత్త వడ్డీ రేట్లు ఇవే! -
ఎస్బీఐ vs పోస్టాఫీస్: ఎందులో డబ్బులు పొదుపు చేస్తే మంచిది?
మీరు ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు ఆదా చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు రికరింగ్ డిపాజిట్లు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి రిస్క్ ఉండదు. 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు మీరు రికరింగ్ డిపాజిట్ సేవలను పొందవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు వస్తుందో.. అదే వడ్డీ రేటు ఆర్డీ ఖాతాలపై కూడా వస్తుంది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా పోస్టాఫీస్‌లలో కూడా ఆర్డీ ఖాతాలను తెరవచ్చు. ఆర్డీ కాలపరిమితి ముగిసిన తర్వాత కస్టమర్ మెచ్యూరిటీ మొత్తాన్ని అందుకుంటాడు. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీతో సహ కలిపి వినియోగదారులకు తిరిగి చెల్లిస్తారు. పోస్టాఫీస్: జనవరి 1, 2021 నుంచి పోస్టాఫీస్ లో ప్రతి ఆర్ధిక సంవత్సరానికి 5.8 శాతం వడ్డీరేటును పొదుపు చేసిన సొమ్ముపై అందిస్తుంది. దీనికి 5 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అకౌంట్ తెరవడానికి కనీసం నెలకు రూ.10 కట్టినా సరిపోతుంది. మీ డబ్బుకు రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి వస్తుంది. ఎస్బీఐ: ఎస్బీఐ ఆర్డీ వడ్డీ రేటు సాధారణ ఖాతాదారులకు 5 నుంచి 5.4శాతం ఉంటే సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు కలుపుతారు. ఈ వడ్డీ రేట్లు జనవరి 8, 2021 నుంచి వర్తిస్తాయి. ఎస్బీఐ ఆర్డీ మెచ్యూరిటీ పీరియడ్ 1 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటుంది. నెలకు కనీసం రూ.100 నుంచి పొదుపు చేయవచ్చు. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితిలోని ఆర్డీలకు 5.4 శాతం వడ్డీ వర్తిస్తుంది. పెట్టుబడి మొత్తంపై గరిష్ట పరిమితి లేదు. మొదటి రెండు సంవత్సరాలకు - 4.9 శాతం వడ్డీ, 2- 3 సంవత్సరాల వరకు - 5.1%, 3 - 5 సంవత్సరాల వరకు - 5.3%, 5 - 10 సంవత్సరాల వరకు - 5.4 శాతం వడ్డీ రేటు ఉంటుంది. చదవండి: ల్యాప్‌టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి! -
బ్యాంక్ ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్!
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కెవైసీ(నో యువర్ కస్టమర్) పేరుతో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులను హెచ్చరించింది. మీకు కెవైసీ ఏమైనా కాల్స్ లేదా మెసేజ్ లు వస్తే వాటి గురుంచి సైబర్ క్రైమ్ కు తెలియయజేయలని కోరింది. ట్విట్టర్ లో ఒక పోస్టులో "ఎస్బీఐ కెవైసీ పేరుతో జరుగుతున్న మోసం దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తుందని. అటువంటి మోసగాళ్లు ఎస్బీఐ ప్రతినిధి పేరుతో పంపిన ఎటువంటి లింక్ పై క్లిక్ చేయవద్దు అని కోరింది". స్కామర్లు టెక్స్ట్ సందేశంలో లింక్ పంపడం, కెవైసీని అప్ డేట్ చేయమని టార్గెట్ వ్యక్తిని అడగడం ద్వారా మోసం చేస్తారని బ్యాంక్ వివరించింది. ఈ విపరీతమైన నేర కార్యకలాపాల గురించి http://cybercrime.gov.in కి నివేదించండి అని అంది. ఈ కరోనా మహమ్మరి కాలంలో ఇటువంటి మోసాలు భారీగా పేరుగుతున్నట్లు సైబర్ నిపుణులు కూడా సూచిస్తున్నారు. అందుకే ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితో షేర్ చేయవద్దు అని బ్యాంక్ తెలియయజేస్తుంది. అలాగే ఎస్బీఐ పేరుతో ఇతర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులను కోరింది. The reality of KYC fraud has proliferated across the country. The target is sent a text message asking to update their #KYC by clicking on a link by someone acting as a bank/company representative. Report such scams at https://t.co/3Dh42iwLvh#CyberCrime #StaySafeStayVigilant pic.twitter.com/Z2UGRFYrol — State Bank of India (@TheOfficialSBI) June 26, 2021 చదవండి: ఆధార్ కు కూడా మాస్క్.. ఇక మీ ఆధార్ నెంబర్ మరింత సురక్షితం! -
జూలై ఒకటి నుంచి ఎస్బీఐ కొత్త రూల్స్!
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై ఒకటి నుంచి కొత్త నిబందనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబందనలను ప్రతి ఖాతాదారుడు తెలుసుకోవాలి అని స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ ను కోరింది. ఎటిఎమ్ నుంచి నగదు విత్ డ్రా, బ్రాంచీ నుంచి నగదు విత్ డ్రా, చెక్ బుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడి) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. జూలై ఒకటి నుంచి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు ఎటిఎమ్ ద్వారా నెలలో నాలుగు సార్లకు మించి ఎక్కువ సార్లు నగదు విత్ డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవిపై రూ.15 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి నెలలో నాలగు సార్లకు మించి డబ్బులు తీసుకుంటే కూడా అదే చార్జీలు పడతాయి. ఇక బీఎస్ బీడి ఖాతాదారులకు ఎస్బీఐ ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. వీటి తర్వాత మరో 10 చెక్ లీవ్స్ కావాలంటే రూ.40 ఛార్జీ పడుతుంది. అలాగే జీఎస్టీ అదనం. ఇక 25 చెక్ లీవ్స్‌కు అయితే రూ.75 చార్జీ ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ చెక్ బుక్ (10 చెక్ లీవ్స్) కోసం అయితే రూ.50 కట్టాలి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కానీ ఈ రూల్స్ సీనియర్ సిటిజన్స్ కి వర్తించవు. చదవండి: కొత్త ఇళ్లు కొనేవారికి కేంద్రం గుడ్ న్యూస్! -
మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొంటాం!
ముంబై: కోవిడ్–19 తుదుపరి వేవ్ వచ్చినా తట్టుకొని నిలబడగలిగిన పటిష్ట స్థాయిలో బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉందని చైర్మన్ దినేష్ కుమార్ ఖారా స్పష్టం చేశారు. మూలధన పెరుగుదల విషయంలో బ్యాంక్ తగిన స్థాయిలో ఉందని అన్నారు. వైవిధ్య పోర్ట్‌ఫోలియోతో వృద్ధి అవకాశాలు ఉన్న రంగాలకు రుణ అవకాశాలను అన్వేషిస్తోందని తెలిపారు. ఎటువంటి సవాళ్లనైనా బ్యాంక్ ఎదుర్కొనగలదన్నారు. వర్చువల్‌గా నిర్వహించిన బ్యాంక్ 66వ వార్షిక సర్వసభ సమావేశాన్ని (ఏజీఎం) ఉద్దేశించి చైర్మన్ శుక్రవారం ప్రసంగిస్తూ, ‘‘2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్–19 విసిరిన సవాళ్లను బ్యాంక్ తట్టుకుని నిలబడింది. ఇదే ధోరణి 2021–22 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుంది. తదుపరి ఎటువంటి వేవ్నైనా బ్యాంక్ ఎదుర్కొనగలుగుతుంది’’ అన్నారు. ప్రసంగంలో ముఖ్యాంశాలను చూస్తే.. 2020–21లో మంచి ఫలితాలు 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ.20,410 కోట్ల అత్యధిక స్టాండెలోన్ నికర లాభం సాధించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమాణం రూ.14,488 కోట్లు. స్థూల మొండిబకాయిల (ఎన్పీఏ) రేషియో కూడా ఇదే కాలంలో 6.15 శాతం నుంచి 4.98 శాతానికి తగ్గింది. ప్రొవిజనల్ కవరేజ్ రేషియో (పీసీఆర్) 87.75 శాతానికి మెరుగుపడింది. బ్యాంక్ రూపొందించిన వ్యాపార ప్రణాళికలు విజయవంతంగా కొనసాగాయి. 2021 మార్చితో ముగిసిన కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లోని పలు అంశాల్లో ఇది సుస్పష్టమైంది. భవిష్యత్‌కు భరోసా.. 2021–22 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఊహించని రీతిలో సెకండ్ వేవ్ సంక్షోభం ప్రారంభమైంది. 2020నాటి కఠిన లాక్డౌన్ పరిస్థితులు లేకపోయినప్పటికీ మొదటి త్రైమాసికం ఎకానమీపై సెకండ్‌వేవ్ తీవ్ర ప్రభావాన్నే చూపింది. అయితే బ్యాంక్ భవిష్యత్ వ్యాపార ప్రణాళికల అమల్లో ఢోకా ఉండబోదని భావిస్తున్నాం. బ్యాంక్ తన డిజిటల్ ఎజెండాను మరింత వేగంగా కొనసాగిస్తుంది. యోనో పరిధి మరింత విస్తృతం అవుతుంది. మున్ముందు మొండిబకాయిల భారం కూడా గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నాం. ఈ దిశలో విజయానికి దివాలా చట్టాలు, కోర్టులు, నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) దోహదపడతాయని విశ్వసిస్తున్నాం. నష్టాల్లో 406 బ్రాంచీలు.. బ్యాంక్‌కు ప్రస్తుతం 406 నష్టాల్లో నడుస్తున్న బ్రాంచీలు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించడానికి బ్యాంక్ తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నిర్దిష్ట కాలపరిమితితో సమీప భవిష్యత్తులో తగిన చర్యలు ఉంటాయి. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే లింక్ చేయండి
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఖాతా ఉందా? మీరు ఇంకా పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయలేదా? అయితే, వెంటనే లింక్ చేయండి లేకపోతే మీ ఖాతా, పాన్ కార్డ్ చెల్లవు. ఎస్బీఐ తన ఖాతాదారులను జూన్ 30 లోపు పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయాలని కోరింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది. "ఖాతాదారులు ఎటువంటి ఆటంకం లేని ఎస్బీఐ సేవలను పొందాలంటే మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని" ట్వీట్ లో పేర్కొంది పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి అని ట్వీట్లో పేర్కొన్నారు. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయకుండా పోతుంది అని భవిష్యత్ లో లావాదేవీలను నిర్వహించడానికి కష్టం అవుతుంది అని పేర్కొంది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30, 2021. గతంలో మార్చి 31 వరకు ఉన్న గడువును కరోనా మహమ్మారి దృష్ట్యా జూన్ 30 వరకు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే https://www.incometax.gov.in/ పోర్టల్ ద్వారా జూన్ 7 నుంచి లింక్ చేయవచ్చు. We advise our customers to link their PAN with Aadhaar to avoid any inconvenience and continue enjoying a seamless banking service.#ImportantNotice #AadhaarLinking #Pancard #AadhaarCard pic.twitter.com/LKIBNEz7PO — State Bank of India (@TheOfficialSBI) May 31, 2021 చదవండి: 2 నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం -
ఎస్బీఐ వినియోగదారులకి హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు గమనిక. మీరు మీ ఎస్బీఐ ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ చేశారా? లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తన కస్టమర్లకు ట్విటర్ ద్వారా హెచ్చరికలు జారీచేసింది. ఒకవేల మీరు కనుక ఎస్బీఐ ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ చేసుకోకపోతే ప్రభుత్వ సబ్సిడీలు పొందలేరని పేర్కొంది. తమ ఖాతాలోకి ప్రభుత్వ సబ్సిడీలు తమ అకౌంట్లలోకి నేరుగా రావాలంటే ఆధార్ లింక్ చేయాలని పేర్కొంది. ఎస్బీఐ ఖాతాకు ఆధార్ అనుసంధానం నాలుగు విధాలుగా చేయవచ్చని ఎస్బీఐ కస్టమర్లు తెలుసుకోవాలి. వారి ఖాతాను ఆధార్ లింక్ చేయటానికి ఇష్టపడే వారు ఎస్బీఐ యాప్, ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎటిఎం, వారి సమీప ఎస్బీఐ బ్యాంక్ శాఖను సందర్శించడం ద్వారా అనుసంధానం చేయవచ్చు. (చదవండి: అమెజాన్ ఇండియాను బహిష్కరించాలి) -
ఎస్బీఐ మొండిబాకీలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) రూ. 5,196 కోట్ల నికర లాభం సాధించింది. గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో ఆర్జించిన రూ. 5,583 కోట్లతో పోలిస్తే ఇది 7 శాతం క్షీణత. స్టాండెలోన్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం స్వల్ప వెనకడుగుతో రూ. 75,981 కోట్లకు పరిమితమైంది. గత క్యూ3లో రూ. 76,798 కోట్ల ఆదాయం నమోదైంది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన తాజా క్వార్టర్లో నికర లాభం 4 శాతం నీరసించి రూ. 6,258 కోట్లను తాకింది. గతంలో రూ. 4,500 కోట్లమేర లభించిన అదనపు ఆదాయం కారణంగా లాభాలు అధికమైనట్లు బ్యాంక్ ప్రస్తావించింది. వీటిలో ఎస్సార్ స్టీల్ రుణ పరిష్కారం ద్వారా రూ. 4,000 కోట్ల వడ్డీ లభించగా.. మరో రూ. 500 కోట్ల ఇతర ఆదాయం నమోదైనట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా వివరించారు. ప్రొవిజన్లు అప్ తాజా సమీక్షా కాలంలో ఎస్బీఐ ఆస్తుల(రుణాల) నాణ్యత మెరుగుపడింది. క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.94 శాతం నుంచి 4.77 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు కూడా 2.65 శాతం నుంచి 1.23 శాతానికి క్షీణించాయి. అయితే మొండి రుణాలకు ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 7,253 కోట్ల నుంచి రూ. 10,342 కోట్లకు పెరిగాయి. ఇక నికర వడ్డీ ఆదాయం దాదాపు 4 శాతం పుంజుకుని రూ. 27,779 కోట్లకు చేరింది. ఇందుకు 7 శాతం రుణ వృద్ధి సహకరించింది. నికర వడ్డీ మార్జిన్లు 3.12 శాతంగా నమోదయ్యాయి. రిటైల్ రుణాలు 15 శాతం జంప్‌చేయగా.. మొత్తం లోన్ బుక్‌లో వీటి వాటా 61 శాతానికి చేరాయి. వీటిలో వ్యక్తిగత రుణ వాటా 39 శాతంకాగా.. ఏడాది కాలంలో 45 శాతానికి పెరిగే వీలున్నట్లు ఖారా అంచనా వేశారు. డిసెంబర్‌కల్లా బ్యాంక్ కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 14.5 శాతాన్ని తాకింది. ఇతర ఆదాయం రూ. 9106 కోట్ల నుంచి రూ. 9246 కోట్లకు స్వల్పంగా పెరిగింది. మారటోరియంపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జీఎన్పీఏలుగా పరిగణించే స్లిప్పేజెస్ రూ. 16,461 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 6.6 శాతం జంప్‌చేసి రూ. 358 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఇంట్రాడేలో రూ. 331 వద్ద కనిష్టానికీ చేరింది. షేరు ధర పుంజుకోవడంతో ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 17,000 కోట్లకుపైగా బలపడింది. వెరసి బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 3.19 లక్షల కోట్లను అధిగమించింది. -
ఎస్బీఐ బ్రాంచ్‌లో భారీ కుంభకోణం
సాక్షి, తూర్పుగోదావరి : సఖినేటిపల్లి ఎస్బీఐ బ్రాంచ్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. బంగారం రుణాలపై సుమారు అయిదు కోట్ల వరకూ స్వాహా చేసినట్లు సమాచారం అందింది. అదే బ్యాంకులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ భారీ స్కాంకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇతనికి మరో ఉద్యోగి సహకరించినట్లు కూడా సమాచారం. అయితే ఖాతాదారులు బంగారం విడిపించుకునే క్రమంలో సదరు ఉద్యోగి జాప్యం చేయడంతో బండారం బయట పడింది. దీనిపై స్పందించిన బ్రాంచ్ మేనేజర్.. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు, స్కాంపై విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. -
ఎస్బీఐ కొత్త నిబంధన రేపటి నుంచే..
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఏటీఎంలో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధన రేపటి నుంచి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బీఐ ఏటీఎంలలో శుక్రవారం నుంచి ఓటీపీ ఆధారిత విత్‌డ్రాయల్ సిస్టమ్ అమలులోకి రానుంది. ఎస్బీఐ ఏటీఎంల నుంచి నగదు తీసుకోవాలంటే తప్పనిసరిగా వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) ఎంటర్ చేయాల్సిందే. ఈ నెల 18 నుంచి రోజులో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) 10 వేలు రూపాయలు అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్ నంబర్‌తోపాటు ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డుకు లింక్ చేసిన ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేస్తేనే ఏటీఎంలో నుంచి నగదు వస్తుంది. ఓటీపీ లేకపోతే 10 వేల రూపాయలకు మించి నగదు తీసుకోలేరు. ప్రస్తుతానికి రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య ఎస్బీఐ ఏటీఎంల్లో రూ.10వేలకు మించి చేసే ఉపసంహరణలకు వినియోగదారుల మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా అమల్లో ఉంది. రాత్రి వేళల్లో మోసాలకు తావు లేకుండా ఉండే ఉద్దేశ్యంతో ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని ఎస్బీఐ తీసుకొచ్చింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) ఈ నిబంధనను అమలు చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. (చదవండి: పెట్రో ధరలు : మూడో రోజూ ఊరట) -
ఎస్బీఐలో రూ.కోటికి టోకరా!
అమలాపురం టౌన్: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచిలో బినామీ గోల్డ్ లోన్లతో ఆ బ్యాంక్ నగదు అధికారే రూ.కోటికి టోకరా వేశాడు. బ్యాంక్‌లో మూడు వారాలుగా జరుగుతున్న ఆడిట్లో ఈ బినామీ గోల్డ్ లోన్ల అవినీతి వెలుగు చూసింది. బ్యాంక్‌లో దాదాపు రెండు వేల గోల్డ్ లోన్లకు సంబంధించిన నగలను భద్రపరిచిన బ్యాగ్‌లు ఉన్నాయి. అధికారులు ఆడిట్ నిర్వహించినప్పుడు గోల్డ్ లోన్లకు సంబంధించి బ్యాగ్‌ల లెక్కల ప్రకారం 25 బ్యాగులు కనిపించకపోవడంతో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించి మరోసారి ఆడిట్ నిర్వహించారు. అసలు బంగారు నగలు లేకుండానే.. బ్యాగ్లనేవి ఉంచకుండానే బినామీ పేర్లతో అంటే ఆ నగదు అధికారి కుటుంబీకులు, బంధువుల పేరుతో బినామీ గోల్డ్లోన్లు తానే తీసుకుని రూ.కోటి వరకు బ్యాంక్ సొమ్ములను రుణాల రూపంలో నొక్కేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నగదు అధికారి ఆక్వా చెరువులు సాగు చేస్తున్నట్లు సమాచారం. చెరువుల్లో నష్టం రావడం వల్లే వాటి భర్తీకి బ్యాంక్‌లో బినామీ గోల్డ్ లోన్ల పేరుతో పనిచేసే బ్యాంక్‌కే కన్నం వేసినట్లు తెలుస్తోంది. సోమవారం విజయవాడ నుంచి మరో ఆడిట్ అధికారుల బృందం సమనస బ్యాంక్‌కు రానుంది. అవకతకలపై ఆరోజు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. -
ఎస్బీఐ ఉద్యోగులకు 'స్వచ్ఛంద షాక్'
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి ఉద్యోగులకు షాకివ్వనుంది. ఖర్చులను తగ్గించే లక్ష్యంతో రెండవ విడత స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) అమలు చేయనుంది. ఇందులో భాగంగా దాదాపు 30,190 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. వీఆర్ఎస్ కోసం ముసాయిదా పథకం సిద్ధం చేసి బోర్డు అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు పీటీఐ వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత పథకం 'సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వీఆర్ఎస్-2020' పేరుతో ఒక డ్రాఫ్ట్ సిద్ధం చేసిందనీ, బోర్డు ఆమోదం అనంతరం ఆచరణకు సిద్ధమవుతోందన్న ఆందోళన బ్యాంకు వర్గాల్లో నెలకొంది. డిసెంబర్ 1న ప్రారంభమై, ఫిబ్రవరి వరకు మాత్రమే అర్హులైన వారినుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. కటాఫ్ తేదీ నాటికి 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయస్సు నిండిన పర్మినెంట్ ఆఫీసర్లు, సిబ్బందికి ఇది వర్తిస్తుంది. మొత్తం 11,565 మంది అధికారులు,18,625 మంది సిబ్బంది వీఆర్ఎస్కు అర్హులు. వారిలో 30 శాతం మంది ముందుకొస్తారని అంచనా. తద్వారా సుమారు 2,170 కోట్ల రూపాయలను ఆదా చేయాలని బ్యాంక్ ఆశిస్తోంది. పరిహారం, ప్రయోజనాలు విఆర్ఎస్ కింద పదవీ విరమణ ఎంచుకున్నసిబ్బందికి మిగిలిన 18 నెలల చివరి వేతనానికి లోబడి, మిగిలిన కాలానికి (సూపరన్యుయేషన్ తేదీ వరకు) 50 శాతం జీతం చెల్లించాలి. వీఆర్ఎస్ను ఎంచుకునే ఉద్యోగులకు గ్రాట్యుటీ, పెన్షన్, ప్రావిడెంట్, మెడికల్ బెనిఫిట్స్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందించనుంది. ఈ పథకం కింద పదవీ విరమణ చేసిన సిబ్బంది పదవీ విరమణ చేసిన తేదీ నుండి రెండేళ్ల కూలింగ్ ఆఫ్ కాలం తర్వాత బ్యాంకులో తిరిగి ఉద్యోగం పొందటానికి, లేదా సర్వీసులు అందించేందుకు అర్హులు. కాగా ఎస్బీఐ 2020 మార్చి చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.49 లక్షలు. గత ఏడాది ఇదే కాలంలో వీరి సంఖ్య 257,000. -
కారులోనే చితిమంట..!
బొమ్మలసత్రం(నంద్యాల): తండ్రి అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన తల్లి కూడా అస్వస్థతకు గురైంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి కారులో తిరిగొస్తున్న కుమారుడికి మృత్యువు లారీ రూపంలో ఎదురుపడింది. కష్టాలతో ప్రయాణం చేస్తున్న ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అసలేం జరిగింది.. నంద్యాల రూరల్ సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని టెక్కె నాగులకట్ట వీధికి చెందిన దేశాయి రవికుమార్, ఉమాదేవి కుమారుడు శివకుమార్ (35)కు పుట్టుకతోనే పోలియో సోకడంతో రెండు కాళ్లూ పనిచేయవు. దివ్యాంగుడైనప్పటికీ బాగా చదువుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ ఉద్యోగం సాధించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివకుమార్ తండ్రి సోమవారం, తల్లి ఉమా దేవి మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. స్నేహితుల సహాయంతో తల్లిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి.. బుధవారం వేకువజామున శివకుమార్ నంద్యాలకు బయలు దేరారు. స్నేహితుడు కాశీ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. నంద్యాల శివారులోని శాంతిరామ్ ఆసుపత్రి వద్ద కారు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో కారు లారీని ఢీకొట్టి ఇరుక్కుపోయింది. దీన్ని గమనించని లారీ డ్రైవర్ కారును దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. కారులో మంటలు చెలరేగడంతో ముగ్గురు స్నేహితులు బయటకు దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు. శివకుమార్‌ను రక్షించేందుకు వారు విఫలయత్నం చేశారు. శివకుమార్ నిస్సహాయ స్థితిలో కారులోనే సజీవ దహనమయ్యాడు. మరో వాహనదారుడు లారీని ఓవర్టేక్ చేసి చెప్పేవరకు డ్రైవర్ గమనించక పోవడం గమనార్హం. -
చైర్మన్ కంటే మూడు రెట్లు అధిక వేతనం
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వరంగంలోని ఎస్బీఐ నూతన సీఎఫ్‌వో నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మూడేళ్ల కాలానికి కాంట్రాక్టు విధానంపై నియమించుకోనుంది. రూ.కోటి వేతన ప్యాకేజీ ఇవ్వనున్నది. అన్ని రకాల వ్యయాలు కలసి (సీటీసీ) రూ.75 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉండనున్నాయి. అయితే, ఎస్బీఐ చైర్మన్‌కు 2018–19లో ఇచ్చిన పారితోషికం కేవలం రూ.29.5 లక్షలు కాగా, దాంతో పోలిస్తే సీఎఫ్‌వోకు మూడు రెట్లు అధికంగా ఆఫర్ ఇవ్వడం ఆసక్తికరం. ప్రస్తుతం ఎస్బీఐ సీఎఫ్‌వోగా చలసాని వెంకట్ నాగేశ్వర్ పనిచేస్తున్నారు.(చెక్ బౌన్స్ నేరం... ఇక క్రిమినల్ కాదు!!) -
కరోనా: క్యూలైన్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
సాక్షి, వికారాబాద్: ప్రభుత్వం ప్రకటించిన కరోనా సాయాన్ని తీసుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఖాతాల్లో జమ అయిన రూ.1500 కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. కరోనా భయాల నేపథ్యంలో డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లిన ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ వరుసల్లో నిలుచోవడంతో కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. మీరు ఈ వీడియోలో చూస్తున్న దృశ్యాలు.. వికారాబాద్ జిల్లాలోని ధరూరు మండల కేంద్రం ఎస్బీఐ ధరూర్ శాఖ వద్ద రోడ్డుకు ఇరువైపులా మహిళలు వరుసలో నిలుచున్నవి. అయితే, వందలాది మంది సొమ్ము విత్ డ్రా కోసం ఎర్రటి ఎండలో బారులు తీరుతూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. ఈక్రమంలోనే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కేంద్రంలో నానోత్ కమల (45) అనే మహిళ శుక్రవారం గుండెపోటుకు గురై మృతి చెందారు. కరోనా ఆర్థిక సాయం కోసం తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద ఆమె క్యూలైన్లో నిలుచుండగా ఘటన జరిగింది. (చదవండి: గాంధీలో డ్యూటీ.. కానిస్టేబుల్‌కు కరోనా!) -
వడ్డీరేటు తగ్గించిన ఎస్బీఐ, కెనరా బ్యాంక్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుక్రవారం అన్ని కాలపరిమితులపై రుణరేట్లను స్వల్పంగా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. కెనరాబ్యాంక్ కూడా ఇదే బాటన పయనించింది. కాగా ద్రవ్య లభ్యత బాగున్న నేపథ్యంలో డిపాజిట్ రేట్లనూ ఎస్బీఐ తగ్గించడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ నిర్ణయాల ప్రకటన మరుసటి రోజు బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు వర్తించే ఏడాది కాల వ్యవధి రుణ రేటు ప్రస్తుత 7.90 శాతం నుంచి 7.85 శాతానికి తగ్గింది. ► రూ.2 కోట్లకన్నా తక్కువ ఉన్న రిటైల్ టర్మ్ డిపాజిట్‌పై వడ్డీరేటు అలాగే రూ.2 కోట్ల పైబడిన బల్క్ టర్మ్ డిపాజిట్ రేటును బ్యాంక్ సవరించింది. రిటైల్ విభాగంలో డిపాజిట్ రేటు 10–50 బేసిస్ పాయింట్లు తగ్గగా, బల్క్ సెగ్మెంట్లో 25–50 బేసిస్ పాయింట్లు తగ్గింది. ► తగ్గించిన రేట్లు ఫిబ్రవరి 10వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి. కెనరాబ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఓవర్‌నైట్, నెల, మూడు, ఆరు నెలల కాలానికి ఎంసీఎల్ఆర్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాది కాలానికి ఈ రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫిబ్రవరి 7 నుంచీ తాజా రేటు అమల్లోకి వచ్చింది. బ్యాంకింగ్‌కు ఈనెలలోనే 50,000 కోట్లు! బ్యాంకింగ్ వ్యవస్థలో మరిన్ని నిధులు లభ్యమయ్యే కీలక చర్యలకు ఆర్బీఐ శ్రీకారం చుడుతోంది. ఫిబ్రవరి 17, 24 తేదీల్లో రూ.50,000 కోట్ల రీపర్చేజింగ్ ఆపరేషన్స్ (రెపో) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సంబంధిత 2 రోజుల్లో రూ.25,000 చొప్పున రెపో ఆపరేషన్స్‌ను ఆర్బీఐ నిర్వహించనుంది. అయితే 17న మూడేళ్ల కాలవ్యవధి రెపో ఆపరేషన్‌కాగా, 24వ తేదీ రెపో ఆపరేషన్ ఏడాది కాల వ్యవధికి ఉద్ధేశించినది. దీనివల్ల బ్యాంకింగ్‌కు అదనపు నిధులు అందుబాటులోకి వస్తాయి. వడ్డీరే ట్లు మరింత తగ్గడానికి ఈ చర్యలు వీలుకల్పిస్తాయి. -
మీనా జ్యుయలర్స్‌పై ఎన్సీఎల్టీకి ఎస్బీఐ
హైదరాబాద్: రుణాల డిఫాల్ట్‌కు సంబంధించి మీనా జ్యుయలర్స్ సంస్థలపై దివాలా కోడ్ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆశ్రయించింది. మీనా జ్యుయలర్స్, మీనా జ్యుయలర్స్ ఎక్స్‌క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్, మీనా జ్యుయలర్స్ అండ్ డైమండ్స్ అనే 3 సంస్థలు కలిసి దాదాపు రూ. 254 కోట్లు ఎగవేసినట్లు తెలిపింది. వాటిపై దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్బీఐ పిటిషన్‌ను స్వీకరించిన ఎన్సీఎల్టీ.. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా కొండపల్లి వెంకట్ శ్రీనివాస్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న తొలి ఆభరణాల సంస్థ.. మీనా జ్యుయలర్సేనని ఎస్బీఐ తెలిపింది. -
తగ్గిన ఎస్బీఐ రుణ రేటు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)... ఏడాది కాల వ్యవధి ఉండే రుణాలపై వడ్డీ రేటును స్వల్పంగా తగ్గించింది. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటు 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించినట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గడం ఇది వరుసగా ఎనిమిదవసారి. తాజా తగ్గింపుతో ఏడాది కాల ఎంసీఎల్ఆర్ 8% నుంచి 7.90%కి దిగివచ్చింది. తన గతవారం పాలసీ సమీక్షలో ఆర్బీఐ ఎటువంటి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.15%) తగ్గింపు నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఎస్బీఐ తాజా రుణరేటు కోత ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 బేసిస్ పాయింట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంసీఎల్ఆర్ను 20 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. ఓవర్‌నైట్ రుణ రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనితో ఈ రేటు 7.75%కి దిగివచ్చింది. ఇతర కాలపరి మితి రేట్లు 10 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.30% నుంచి 8.20%కి చేరింది. -
ఆ డబ్బు మోదీజీ వేశారనుకున్నా..!
భోపాల్ : విదేశాల నుంచి బ్లాక్ మనీని రప్పించి దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ తన మాట నిలబెట్టుకున్నారని హుకుం సింగ్ అనుకున్నాడు. తన ఖాతాలో నెలనెలా వచ్చిపడుతున్న డబ్బులు మోదీజీయే ఇస్తున్నారని దర్జాగా ఖర్చు చేసుకున్నాడు. తీరా చూస్తే.. అవి తన పేరుతోనే ఉన్న మరొకరివని, బ్యాంకు అధికారుల పొరపాటుతో తన ఖాతాలోకి వచ్చిన సొమ్ము అని తేలడంతో అవాక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఆన్లైన్ లావాదేవిల్లో తరచూ అవకతవకలు జరగడం రోజూ చూస్తునే ఉన్నాం.. అకస్మాత్తుగా అకౌంట్ల నుంచి డబ్బులు మాయమవడం.. అనుకోకుండా డబ్బులు జమ అవ్వడం సర్వసాధారణమైన విషయంగా మారింది. తాజాగా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బింద్ జిల్లా రురై గ్రామానికి చెందిన హుకుం సింగ్ ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్లాడు. అక్కడ తను సంపాదించిన మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేయడం ప్రారంభించాడు. ఇలా ఆరు నెలల్లో మొత్తం రూ. 140,000 వేలు జమచేశాడు. అనంతరం ఊరికి తిరిగి వచ్చిన సదరు వ్యక్తికి డబ్బులు విత్ డ్రా చేద్ధామని ప్రయత్నించగా అకౌంట్లో కేవలం రూ. 35,400 ఉన్నట్లు కనిపించడంతో కంగుతిన్నాడు. వెంటనే బ్యాంకులో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై బ్యాంకు అధికారులు విచారించగా.. ఒకే అకౌంట్ నెంబర్‌పై రెండు అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో హుకుం సింగ్(రురై గ్రామం).. హుకుం సింగ్ (రోనీ గ్రామం). ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇద్దరు ఒకే బ్రాంచ్ ఆలంపూర్లో అకౌంట్ తీయడంతోపాటు ఇద్దరు పేర్లు కుడా ఒకటే అవ్వడంతో కంగారుపడ్డ బ్యాంకు మేనేజర్ ఇద్దరికి ఒకే అకౌంట్ నెంబర్ కేటాయించాడు. ఇక రురై గ్రామానికి చెందిన హుకుం సింగ్ ఖాతాలో వేసిన డబ్బులు..రోనీ గ్రామానికి చెందిన హుకుం సింగ్ విత్ డ్రా చేశాడని నిర్ధారణకు వచ్చిన బ్యాంకు అదికారులు ఈ తప్పిదమంతా బ్యాంకు మేనేజర్ రాజేష్ సోంకర్ వల్లే జరిగిందని అంగీకరించారు. అనంతరం అతడిని పిలిచి బ్యాంకు అధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఎన్నికల సమయంలో నల్లధనాన్నివెనక్కి తీసుకు వచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తానని అప్పట్లో మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ప్రస్తుతం తమ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారని అనుకున్నానని సదరు వ్యక్తి తెలిపాడు. అందుకే ప్రతి నెల అకౌంట్లో వచ్చిన డబ్బులను తీసుకున్నానని, అవి తనకు చాలా అవసరమయ్యాయని వెల్లడించాడు. ఆరు నెలల్లో దాదాపు రూ.89,000 వేలు విత్‌డ్రా చేశానని అధికారుల ముందు ఒప్పుకున్నాడు. చివరికి వాస్తవం తెలుసుకున్న హుకుం సింగ్ నిరాశపడ్డాడు. అయితే తమ తప్పిదాన్ని అంగీకరించిన బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ప్రయత్నించారని బాధితుడు ఆరోపించాడు. ఇక ఈ సమస్యను బ్యాంకు అదికారులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి!.. -
బ్యాంకులో నాగుపాము హల్చల్
సాక్షి, తిరుత్తణి : బ్యాంకులో చొరబడిన నాగుపాము హల్చల్ రేపింది. దీంతో ఖాతాదారులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన తిరుత్తణిలో మంగళవారం చోటుచేసుకుంది. తిరుత్తణి బస్టాండుకు సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఖాతాదారులు వేచివున్న సమయంలో బ్యాంకు ముందు భాగంలోని నీటి ట్యాంకు నుంచి దాదాపు మూడు అడుగుల పొడవున్న నాగుపాము బ్యాంకులోకి ప్రవేశించడాన్ని గుర్తించిన ఖాతాదారులు కేకలు వేస్తూ భయంతో పరుగులు తీసారు. బ్యాంకు సిబ్బంది సైతం ఆందోళన చెందారు. ఇంతలో అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారంతో బ్యాంకు వద్దకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది దాదాపు అర్ధగంట పాటు శ్రమించి పామును పట్టుకోవడంతో వినియోగదారులు, బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దాన్ని అడవిలో విడిచిపెట్టారు. -
ఎస్బీఐ బ్యాంకులో చోరీకి యత్నం
-
నల్గొండ ఎస్బీఐ బ్యాంకులో చోరీకి యత్నం
సాక్షి, నల్గొండ : జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి ప్రయత్నించారు. బ్యాంకు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించిన దుండగులు చివరికి విఫలమయ్యారు. సోమవారం ఉదయం బ్యాంకులో చోరీకి యత్నించినట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా బ్యాంకులో ఎటువంటి నగదు మాయం కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
పొదుపు ఖాతాలపై వడ్డీకి కత్తెర
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పొదుపు ఖాతా డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లకు మరింత కత్తెర వేసింది. రూ. లక్ష లోపు సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటిదాకా 3.50 శాతంగా ఉన్న రేటు ఇకపై 3.25%కి తగ్గనుంది. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. తగినంత ద్రవ్య లభ్యత ఉన్నందున సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్‌పై రేటును (రూ. లక్ష దాకా బ్యాలెన్స్) సవరిస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఏడాది నుంచి రెండేళ్ల లోపు కాల వ్యవధి గల టర్మ్ డిపాజిట్లు, బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు, 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇది అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది. రుణాలపై 0.10 శాతం తగ్గింపు.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఎంసీఎల్ఆర్)ను స్వల్పంగా 0.10 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రుణాలపై రేటు తగ్గించడం వరుసగా ఇది ఆరోసారి. ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ ఇకపై 8.15% కాకుండా 8.05%గా ఉండనుంది. ఈ తగ్గింపు అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది. ‘పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని వివిధ విభాగాల ఖాతాదారులందరికీ ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నాం‘ అని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటులో పావు శాతం కోత పెట్టిన ఎస్బీఐ.. రుణాలపై వడ్డీ రేటును మాత్రం 0.10 శాతమే తగ్గించడం గమనార్హం. వృద్ధికి ఊతమిచ్చే దిశగా తక్కువ వడ్డీ రేట్లకే ప్రజలకు రుణాలు అందాలన్న లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను (రెపో రేటు) తగ్గిస్తూ వస్తోంది. అయినప్పటికీ బ్యాంకుల స్థాయిలో ఈ ప్రయోజనాలు ఖాతాదారులకు అందడం లేదు. ఆర్బీఐ ఈ ఏడాది వరుసగా 5 సార్లు రెపో రేటును తగ్గించడంతో ఇది ప్రస్తుతం దశాబ్దపు కనిష్ట స్థాయి 5.15%కి చేరింది. కానీ బ్యాంకుల స్థాయిలో మాత్రం ఆ మేరకు రుణాలపై వడ్డీ రేటు తగ్గడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య
సాక్షి, గుంటూరు : తెనాలిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిప్యూటీ మేనేజర్ అంకిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు నెలల క్రితమేతెనాలి బ్రాంచ్‌లో చేరిన అంకిరెడ్డి.. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అంకిరెడ్డి మృతిపై కుటుంబీకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. బ్యాంకు అధికారుల వేధింపుల వల్లే తన భర్త మృతి చెందారని అంకి రెడ్డి భార్య చెబుతుండగా.. భార్య, అత్తమామల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తండ్రి ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
10,400 అడుగుల ఎత్తులో ఎస్బీఐ శాఖ
లధాఖ్: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శనివారం తన శాఖను లధాఖ్‌లోని 10వేల 400 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసింది. లధాఖ్‌ను ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే. సముద్ర మట్టానికి 10వేల400 అడుగుల ఎత్తులో ఉన్న లధాఖ్ నుబ్రా వ్యాలీలోని దిక్సిత్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్‌ను ఎస్బీఐ చైర్మన్ రజినీష్ కుమార్ ప్రారంభించారు. నుబ్రా వ్యాలీ లోయ ప్రాంతం. ఇక్కడ ఆరువేల మంది జనాభా మాత్రమే ఉంటారు. సుదూర ప్రాంతంగా ఉన్న ఇక్కడి ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించి.. ఆర్థికంగా పరిపుష్టి కలిగించే ఉద్దేశంతో ఎస్బీఐ తన శాఖను ఏర్పాటు చేసింది. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని లెహ్‌లోని తుర్తుక్ గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ బ్యాంక్ ఏర్పాటయింది. సియాచిన్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. మిగతా బ్యాంకులు ఊహించడానికి కూడా శక్యం కాని ప్రదేశాల్లో ఎస్బీఐ తన శాఖలను విస్తరించిందని, సుదూర కొండప్రాంతాల్లోని వారికి కూడా మొక్కవోని సంకల్పంతో ఎస్బీఐ తన సేవలను అందిస్తోందని ఈ సందర్బంగా బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. -
బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ము స్వాహా
సాక్షి, పుట్టపర్తి : నగర పంచాయతీలోని బ్రాహ్మణపల్లి స్టేట్ బాంక్‌లో ఖాతాదారుల సొమ్ము రూ.3 లక్షలను తాత్కాలిక ఉద్యోగి రమేష్ స్వాహా చేశారు. మేనేజర్ శివనాగ లింగాచారి వివరాల మేరకు.. బ్యాంక్‌లో సిబ్బంది తక్కువ ఖాతాదారులెక్కువగా ఉండడంతో తాత్కాలిక ఉద్యోగికి కొన్ని బాధ్యతలు అప్పజెప్పారు. బడేనాయక్ తండాకు చెందిన మంజులాబాయి రమేష్ సహకారంతో 2015లో రూ.1.2 లక్షలు, రూ.80 వేల చొప్పున రెండు ఫిక్స్డ్ డిపాజిట్లు(ఎఫ్డీ) చేసింది. అయితే గతేడాది అక్టోబర్‌లో డబ్బు అవసరం ఉండటంతో ఎఫ్డీలపై రూ.1.5 లక్షలు రుణం తీసుకుంది. డబ్బు సరిపోవడంతో 15 రోజుల తర్వాత రుణం చెల్లించాలంటూ రమేష్‌కు నగదు అందజేసింది. రమేష్ బ్యాంకు సిబ్బందికి తెలియకుండా ఆమెకు నకిలీ ఎఫ్డీ రసీదు ఇచ్చాడు. ఆమెకు ఉన్న పరిచయంతో కొద్ది రోజులకు ఆమె ఇంటికి వెళ్లి ఒర్జినల్ ఎఫ్డీ రసీదు తీసుకొచ్చి బ్యాంక్ సిబ్బందితో ఉన్న నమ్మకాన్ని ఆయుధంగా చేసుకొని ఫోర్జరీ సంతకాలతో రెండు లక్షలు స్వాహా చేశాడు. ఆమె తిరిగి ఈనెల 5న నకిలీ ఎఫ్డీ రసీదు తీసుకుని బ్యాంకుకు వచ్చి డబ్బు అడగడంతో రమేష్ బాగోతం బయటపడింది. ఇదే తరహాలో సుబ్బరాయునిపల్లికి చెందిన సత్యమ్మకు రూ.1 లక్ష టోకరా వేసినట్లు బాధితురాలు వాపోయింది. విషయం తెలుసుకున్న సదరు ఉద్యోగి పరారుకావడంతో బాధితులను పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. బ్యాంకు అధికారులు విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇది చదవండి : సాక్స్‌లో మొబైల్ ఫోన్ పెట్టుకొని సచివాలయం పరీక్షకు.. -
ఏటీఎంలకు తాళం..!
ముంబై: పట్టణ ప్రాంతాల్లో ఖాతాదారులు బ్యాంకింగ్ లావాదేవీల కోసం డిజిటల్ విధానాలవైపు మళ్లుతుండటంతో ఏటీఎంలు, బ్యాంకు శాఖల అవసరం క్రమంగా తగ్గుతోంది. దీంతో పభ్రుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కూడా వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా వీటిని తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఏటీఎంలు, శాఖల ఏర్పాటు, నిర్వహణ భారం తడిసి మోపెడవుతుండటం ఇందుకు కారణం. గడిచిన ఏడాది కాలంలో టాప్ 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 5,500 ఏటీఎంలు, 600 పైచిలుకు శాఖలను మూసివేసినట్లు ఆయా బ్యాంకుల త్రైమాసిక ఆర్థిక ఫలితాల నివేదికల ద్వారా తెలుస్తోంది. ఓవైపు పెరిగిపోతున్న మొండిబాకీలు, మరోవైపు రుణ వృద్ధి లేకపోవడం వంటి అంశాలతో లాభాలు సాధించడానికి పీఎస్‌బీలు నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఎస్బీఐ.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాŠంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య కాలంలో 420 శాఖలు, 768 ఏటీఎంలను మూసివేసింది. ఇక విలీనమైన బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా, దేనా బ్యాంక్‌లు ఇదే వ్యవధిలో మొత్తం 40 శాఖలు, 274 ఏటీఎంలను మూసివేశాయి. ఇలా బ్రాంచీలను, ఏటీఎంలను తగ్గించుకున్న పీఎస్బీల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ మొదలైనవి కూడా ఉన్నాయి. పది బ్యాంకుల్లో తొమ్మిది బ్యాంకులు ఏటీఎంలను తగ్గించుకోగా, ఆరు బ్యాంకులు శాఖలను కూడా తగ్గించుకున్నాయి. ఈ వ్యవధిలో ఒక్క ఇండియన్ బ్యాంక్ మాత్రమే ఏటీఎంలు, శాఖల నెట్‌వర్క్‌ను పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా..నగరాల్లోనే...: మూసివేతల ధోరణి ఎక్కువగా నగరాల్లోనే కనిపిస్తోంది. పెద్ద పట్టణాలు, నగరాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తృతంగా ఉండటం, ఖాతాదారులు కూడా డిజిటల్ లావాదేవీల నిర్వహణకు అలవాటు పడుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలు, శాఖల మూసివేత ఎక్కువగా మెట్రో నగరాల్లోనే ఉంటోందే తప్ప గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇలాంటి ధోరణులు లేవు‘ అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ పల్లవ్ మహాపాత్ర తెలిపారు. ‘ఇది డిమాండ్‌పరమైన అంశం. తీవ్రమైన పోటీ ఉన్న మెట్రోల్లోనే అసంఖ్యాకంగా శాఖలు, ఏటీఎంలు ఎందుకు ఏర్పాటు చేయాలి. మెట్రో నగరాల్లో ఏదైనా ఏటీఎం వినియోగం చాలా తక్కువగా ఉంటే దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏం ఉంది‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇది లాభదాయకతతో ముడిపడి ఉన్న విషయంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ ఎన్ దామోదరన్ పేర్కొన్నారు. ‘ఏటీఎంలు, శాఖల మూసివేత అన్నది ఎక్కువగా వ్యాపారపరమైన లాభదాయకత అంశానికి సంబంధించినది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా శాఖలు, ఏటీఎంల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతుంది‘ అని ఇటీవల బ్యాంకు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది 36 శాఖలు, 1,269 ఏటీఎంలను మూసివేసింది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. క్రమంగా కస్టమర్లు డిజిటల్ మాధ్యమాల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలకు అలవాటుపడే కొద్దీ ఏటీఎంలు, శాఖల అవసరం చాలా మటుకు తగ్గిపోతుందని ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొన్నాళ్లు పోతే గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులు కూడా డిజిటల్ బాట పడితే.. ఆయా ప్రాంతాల్లో కూడా శాఖలు, ఏటీఎంలపరమైన వ్యయాలను బ్యాంకులు తగ్గించుకుంటాయని పేర్కొన్నారు. డిజిటల్ మాధ్యమంతో పోలిస్తే వీటిపై పెట్టుబడుల భారం భారీగా ఉంటోంది కాబట్టి ఖాతాదారుల బ్యాంకింగ్ అలవాట్లు మారే కొద్దీ .. ఇలాంటి మూసివేతలు సాధారణ ట్రెండ్‌గా మారే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రైవేట్ విస్తరణ.. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఏటీఎంలు, శాఖలను మూసివేస్తుండగా .. మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు మాత్రం క్రమంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాయి. గత ఏడాది వ్యవధిలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజాలన్నీ తమ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించాయి. అయితే, రిజర్వ్ బ్యాంక్ గణాంకాల చూస్తే ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రధాన నగరాల్లోనే ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే విషయంలో ఈ బ్యాంకుల ఏటీఎంలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ అయిదు ఏటీఎంలలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఏటీఎం ఒకటి ఉంటుండగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయం తీసుకుంటే ప్రతి పదింటిలో ఒకటి మాత్రమే ఉంటోంది. -
డెబిట్ కార్డులకు ఇక చెల్లుచీటీ..!
ముంబై: డెబిట్ కార్డుల వినియోగాన్ని క్రమంగా తప్పించే దిశగా బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్రమంగా ప్లాస్టిక్ కార్డుల వినియోగాన్ని తగ్గించి డిజిటల్ పేమెంట్ విధానాలను మరింతగా ప్రోత్సహించాలని భావిస్తోంది. తద్వారా డెబిట్ కార్డుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తోంది. సోమవారం జరిగిన బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వార్షిక సదస్సు ఫిబాక్‌లో పాల్గొన్న సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఈ విషయాలు తెలిపారు. ‘డెబిట్ కార్డులను పూర్తిగా తొలగించాలని మేం భావిస్తున్నాం. కచ్చితంగా ఇది సాధ్యమేనని విశ్వసిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. డెబిట్ కార్డుల రహిత దేశంగా భారత్‌ను మార్చడానికి తమ ’యోనో’ వంటి డిజిటల్ ప్లాట్‌ఫాంలు ఉపయోగపడగలవన్నారు. అసలు కార్డు అవసరమే లేకుండా యోనో ప్లాట్‌ఫాం ద్వారా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని, చెల్లింపులు కూడా జరపవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా 90 కోట్లకు పైగా డెబిట్ కార్డులు, 3 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన ’59 నిమిషాల్లోనే రుణ మంజూరీ పథకం’పై చిన్న వ్యాపార సంస్థల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ వాహనాలకు.. ముఖ్యంగా కార్లకు కూడా ఈ రుణాలను వర్తింపచేసే అంశాన్ని బ్యాంకు పరిశీలిస్తోందన్నారు. రూ. 25 కోట్ల దాకా టర్నోవరు ఉండే వ్యాపారవేత్త ఈ పథకం కింద కేవలం 59 నిమిషాల్లోనే రూ. 5 కోట్ల దాకా రుణాలకు సూత్రప్రాయంగా ఆమోదం పొందవచ్చని రజనీష్ కుమార్ వివరించారు. -
ఎస్బీఐ లాభం 2,312 కోట్లు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,312 కోట్ల నికర లాభాన్ని (స్టాండ్ అలోన్)సాధించింది. గత క్యూ1లో రూ.4,876 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఎస్బీఐ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా రావడం, మొండిబకాయిలు తగ్గిన కారణంగా కేటాయింపులు తక్కువగా ఉండటంతో ఈ క్యూ1లో లాభాలు వచ్చాయని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వివరించారు. మొత్తం ఆదాయం రూ.65,493 కోట్ల నుంచి రూ.70,653 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాలకు సంబంధించి ఇతర వివరాలు... నికర వడ్డీ ఆదాయం 5 శాతం అప్... బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.21,798 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో రూ.22,939 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2.95 శాతం నుంచి 3.01 శాతానికి ఎగసింది. బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ1లో 9.95 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 7.53 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 4.84% నుంచి 3.07 శాతానికి తగ్గాయి. మొండిబకాయిలు తగ్గడం తో కేటాయింపులు కూడా తగ్గాయి. గత క్యూ1లో రూ.16,849 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో 35 శాతం తగ్గి రూ.10,934 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 79.34 శాతంగా ఉంది. అయితే తాజా మొండిబకాయిలు ఈ క్యూ1లో భారీగా, రూ.16,212 కోట్లకు పెరిగా యి. ఒక మహారత్న కంపెనీకి చెందిన రూ.2,000 కోట్ల రుణం ఎన్పీఏగా మారడం, వ్యవసాయ, ఎస్ఎంఈ రుణాలు ఎన్పీఏలుగా మారడంతో ఈ క్యూ1లో తాజా మొండి బకాయిలు పెరిగాయి. రూ. 5,769 కోట్ల రికవరీలు... మొండి బకీలకు సంబంధించి రికవరీలు, అప్గ్రేడ్లు రూ.5,769 కోట్లకు పెరిగాయి. దివాలా ప్రక్రియ నడుస్తున్న ఎస్సార్, భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్‌ల కేసులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ ఖాతాల నుంచి రూ.16,000 కోట్ల రుణాలు రికవరీ అవుతాయి. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 12.89% నుంచి 12.83 శాతానికి మెరుగుపడింది. రూ.7,000 కోట్ల సమీకరణ.... అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ.7,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని బ్యాంక్ తెలిపింది. మరో రూ.20,000 కోట్ల నిధులు సమీకరించాలని కూడా ఆలోచిస్తున్నామని, అయితే దీనికి సమయం పడుతుందని బ్యాంక్ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడేదాకా వేచి చూస్తామని పేర్కొన్నారు. ఈ నాలుగో క్వార్టర్లో ఎస్బీఐ కార్డ్ ఐపీఓ ఉంటుందని, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓ వచ్చే ఏడాది ఉంటుందని ఆయన తెలిపారు. రూ.2,312 కోట్ల నికర లాభం రావడం, రుణ నాణ్యత మెరుగుపడటం వంటి సానుకూలతలున్నా, బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ నష్టపోయింది. తాజా మొండి బకాయిలు పెరగడంతో ఎస్బీఐ షేర్ 3 శాతం నష్టంతో రూ.308 వద్ద ముగిసింది. రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.... వరుసగా నాలుగో క్వార్టర్లోనూ లాభాలు సాధించామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్రమక్రమంగా మెరుగుపడుతున్నామని పేర్కొన్నారు. సిబ్బంది, ఇతర వ్యయాలు నియంత్రణలోనే ఉన్నాయని, ఆదాయానికి, వ్యయానికి గల నిష్పత్తి అర శాతం తగ్గి 2.03 శాతానికి చేరిందని వివరించారు. నిర్వహణ లాభం పెంచుకోవడంపై దృష్టి పెట్టామని, ఈ క్యూ1లో నిర్వహణ లాభం 11 శాతం వృద్ధితో రూ.13,246కు పెరిగిందని పేర్కొన్నారు. రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నికర వడ్డీ మార్జిన్ పెంచుకోవడం కష్టమైన పనేనని అంగీకరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం రుణ వృద్ధి, 3.1 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించగలమని పేర్కొన్నారు. మొండిబకాయిలు వసూలు కావాలని ప్రతి రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వాహన రంగంలో మందగమనం చోటు చేసుకోవడం వల్ల తామెలాంటి ఆందోళన చెందడం లేదని పేర్కొన్నారు. మొత్తం రిటైల్ వాహన రుణాలు రూ.71,000 కోట్లుగా ఉన్నాయని, వీటిల్లో వాహన డీలర్ల రుణాలు రూ.11,500 కోట్లని రజనీష్ కుమార్ తెలిపారు. -
దోంగ క్యాషియర్ అరెస్టు!
సాక్షి, కంచికచర్ల(నందిగామ): కంచికచర్ల మండలం పరిటాల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాష్ ఇన్చార్జి జి.శ్రీనివాసరావును అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ, విజయవాడకు చెందిన గొడవర్తి శ్రీనివాసరావు గత కొంతకాలంగా కంచికచర్ల మండలం పరిటాల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాష్ ఇన్చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే సమయంలో బ్యాంకు మేనేజర్ కాకొల్లు యోగిత వద్ద ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించాడు. ఇద్దరి బాధ్యత కలిగిన క్యాష్ లావాదేవీలు, గోల్డ్‌లోన్స్ లావాదేవీల తాను ఒక్కడే నిర్వర్తించే విధంగా నమ్మించాడు. మేనేజర్ వద్ద ఉన్న తాళం కూడా తీసుకుని లాకర్లను ఓపెన్ చేసి పనులు చక్కబెడుతున్నాడు. మేనేజర్‌తో సంబంధం లేకుండా.. శ్రీనివాసరావు ఒకరోజు మేనేజర్‌కు తెలియకుండా లాకర్ నుంచి రూ.19లక్షలు, 3 గోల్డ్బ్యాగ్లు లాకర్లో నుంచి దొంగిలించాడు. తాకట్టు పెట్టిన ఒకరి బంగారు ఆభరణాలపై మరొకరి పేరుమీద లోన్ అకౌంట్ ఓపెన్ చేసి గోల్డ్‌లోన్ నగదు మొత్తం తీసుకున్నాడు. రెన్యువల్ కోసం ఖాతాదారుల వద్ద డెబిట్, క్రెడిట్ ఓచర్‌పై సంతకాలు తీసుకుని కొత్తఖాతాను తయారుచేసి పాత ఖాతాలో డబ్బులు చెల్లించకుండా ఆ సొమ్మును సొంతానికి, విలాసానికి వాడుకున్నాడు. బ్యాంకు మేనేజర్ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని లాకర్లోని బంగారాన్ని దొంగిలించి ఆ బంగారం నగలను ఆప్కాబ్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ, నగలు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చే ప్రైవేటు వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుని సొంతానికి ఉపయోగించుకున్నాడు. మేనేజర్ నిలదీయడంతో.. నగలు మయం కావడంతో విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావును నిలదీయగా నగదుతో పాటు బంగారం కూడా తీసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. తాను దొంగిలించిన సొత్తును, నగలను రెండురోజులలో తిరిగి బ్యాంకుకు అందజేస్తామని నమ్మబలికాడు. కాని నాటి నుంచి విధులకు రాకుండా శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. బ్యాంకులో జరిగిన విషయాల గురించి బ్యాంకు మేనేజర్ యోగిత బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బ్యాంకు మేనేజర్ యోగితను ఇతర బ్యాంకుకు బదిలీచేశారు. క్యాష్ ఇన్చార్జి శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. గల్లా ఓం ప్రకాష్‌ను బ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాసరావుపై కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి నుంచి రికవరీ..... నిందితుడు శ్రీనివాసరావు నుంచి నగదు రూ.20,75 లక్షలు, 2,200 గ్రాముల బంగారం నగలు, కారు రూ.6,25లక్షలు మొత్తం రూ.88లక్షలు రికవరీ చేసుకోవటం జరిగిందని తెలిపారు. శ్రీనివాసరావును అరెస్ట్‌చేసి నందిగామ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో నందిగామ డీఎస్పీ షేక్ అబ్దుల్ రజీజ్, సర్కిల్ సీఐ కే సతీష్, ఎస్ఐ శ్రీహరిబాబు, ఏఎస్ఐలు ఎంవీ కోటేశ్వరరావు, షేక్ జమీల్ పాల్గొన్నారు. పోలీసులకు రివార్డులు అందజేత నగదుతోపాటు బంగారు నగలు దొంగతనం కేసులో బ్యాంక్ క్యాష్ ఇన్చార్జి గొడవర్తి శ్రీనివాసరావును త్వరగా అరెస్టు చేయటం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు పేర్కొన్నారు. కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు ఆదివారం వచ్చిన జిల్లా ఎస్పీ, అనతికాలంలో బ్యాంకులో నగలు, నగదు దొంగతనానికి పాల్పడిన శ్రీనివాసరావును అరెస్ట్ చేసినందుకు 8 మందికి రివార్డులు అందజేశారు. రివార్డులు అందుకున్న వారిలో సర్కిల్ సీఐ కే సతీష్, ఎస్ఐ శ్రీహరిబాబు, హెడ్‌కానిస్టేబుళ్లు ఆలి, నాగరాజు, ప్రభాకర్, రఘు, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు కే రామారావు, హనుమంత్ ఉన్నారు. -
బ్యాంకులో అగ్నిప్రమాదం
సాక్షి, ఉలవపాడు(ప్రకాశం) : ఉలవపాడులోని భారతీయ స్టేట్ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. చిన్నమంటలతో ప్రారంభమై క్యాబిన్ మొత్తం కాలి బూడిదయింది. కంప్యూటర్లు, ఎయిర్ కండిషనర్లు, క్లర్క్‌ల క్యాబిన్లు మంటల ధాటికి బుగ్గయ్యాయి. బంగారం భద్రపరిచే గది వరకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రూ.40 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. లాకర్ రూమ్, మేనేజర్ రూమ్‌కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని బ్యాంకు మేనేజర్ తెలిపారు. ఉదయం 5 గంటల సమయంలో పొగతో పాటు చిన్న మంటలు రావడం బ్యాంకు పక్కన ఉన్న ఇంటి వారు గమనించారు. వెంటనే బ్యాంకు సిబ్బందికి తెలియజేయగా వారు వచ్చి తాళాలు తెరిచేలోపు మంటలు మరింత ఎక్కువయ్యాయి. టంగుటూరు నుంచి ఫైర్ ఆఫీసర్ అంకయ్య ఆ«ధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నికీలల ధాటికి శ్లాబు పెచ్చులూడి పడ్డాయి. క్యాబిన్లో ఉన్న మొత్తం ఫర్నిచర్, విలువైన రికార్డులు కాలి బూడిదయ్యాయని బ్యాంకు మేనేజర్ శంకర్ తెలిపారు. ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు. వెల్లువెత్తుతున్న అనుమానాలు బ్యాంకు దగ్ధమైన ఘటనలో ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో ఫైర్ బెల్, అలారమ్ కొంత కాలంగా పనిచేయడం లేదని బ్యాంకు సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులతో తెలిపారు. కానీ దానిని బాగుచేయలేదు. ప్రమాదం జరిగే సమయంలో కిటికీలు తెరచి ఉన్నాయి. బ్యాంకులో సీసీ కెమేరాల ఫుటేజీ కావాలని పోలీసులు కోరగా తమ టెక్నీషియన్ వచ్చి తీసిస్తాడని బ్యాంకు సిబ్బంది చెప్పడం గమనార్హం. సాధారణంగా పోలీసులు ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు ప్రాథమిక సమాచారంతోపాటు విచారణకు ముఖ్యమైన సీసీ ఫుటేజీని బ్యాంకు అధికారుల సమక్షంలో జరిగిన వెంటనే స్వాధీనం చేసుకోవాలి. కానీ సీసీ ఫుటేజీని బ్యాంకు అధికారులు ఇవ్వలేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీస్‌స్టేషన్‌లో రాత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేయలేదు. ఈ పరిణామాలు అగ్ని ప్రమాదంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మూడు బ్యాంకుల్లో సేవలు వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మూడు బ్యాంకుల్లో లావాదేవీలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఒంగోలు ఆర్బీఓ అధికారి జానకిరామ్ తెలిపారు. చాకిచర్ల, సింగరాయకొండ, కరేడు స్టేట్ బ్యాంకుల్లో ఉలవపాడు బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన అన్ని లావాదేవీలు యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉలవపాడు బ్యాంకు సిబ్బంది మూడు బ్యాంకుల పరిధిలో అందుబాటులో ఉంటారని తెలియజేశారు. -
ఎస్బీఐ రుణ రేట్లలో స్వల్ప కోత...
ముంబై: అన్ని కాలపరిమితులకు సంబంధించి రుణ రేటును కేవలం ఐదు బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఈ లెక్కన రేటు 0.05% తగ్గిందన్నమాట. ఏప్రిల్ 10 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ వారం 4వ తేదీన పావుశాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25%)ను తగ్గిస్తే, ఎస్బీఐ ఇందులో కేవలం 0.05 శాతాన్ని కస్టమర్లకు బదలాయిస్తుండటం గమనార్హం. తాజా రేట్ల స్థితిని పరిశీలిస్తే... ఏడాది ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు) 8.55 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. ఇక రూ.30 లక్షల వరకూ గృహ రుణంపై వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు (0.10 శాతం) తగ్గింది. దీనితో ఈ రేటు శ్రేణి 8.70–9 శాతం నుంచి 8.60–8.90 శాతం శ్రేణికి దిగివచ్చింది. మూడవ బ్యాంక్... ఆర్బీఐ రేటు కోత నిర్ణయం తరువాత ఈ దిశలో నిర్ణయాలు తీసుకున్న మూడవ బ్యాంక్ ఎస్బీఐ. ఇప్పటికే ఇండియన్ ఓవర్సీస్ (ఐఓబీ) బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం)లు ఏడాది ఆపైన కాలపరిమితి రుణ రేటును 0.05 శాతం తగ్గించాయి. ఐఓబీ రుణ రేటు 8.70 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గితే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రేటును 8.75 శాతంనుంచి 8.70 శాతానికి తగ్గించింది. ఈ రేట్లు బుధవారం నుంచీ అమల్లోకి వస్తాయి. ఆర్బీఐ నుంచి పొందిన వడ్డీరేటు ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయిం చడం లేదన్న విమర్శ పలు వర్గాల నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
బీఓబీ... ఇక దేశంలో టాప్–2 బ్యాంక్!
న్యూఢిల్లీ: దేశంలో ప్రభుత్వ రంగ రెండవ బ్యాంకింగ్ దిగ్గజంగా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) అవతరించింది. దేనా, విజయాబ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచీ లాంఛనంగా అమల్లోకి రావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తరువాత బీఓబీ రెండవ స్థానంలోకి చేరింది. దీనితో ఇప్పటి వరకూ రెండవ స్థానంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మూడవ స్థానంలోకి వెళ్లింది. ఇందుకు సంబంధించి ముఖ్యాంశాలు చూస్తే... ►ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండవ స్థానంలోకి బీఓబీ వస్తే, మొత్తం బ్యాంకింగ్ రంగంలో చూస్తే, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తరువాత మూడవ స్థానానికి బీఓబీ చేరింది. ► తాజా విలీనంతో బీఓబీ వ్యాపారం విలువ దాదాపు రూ.15 లక్షల కోట్లు దాటనుంది. ఇందులో రూ.8.75 లక్షల కోట్లు డిపాజిట్లు, రుణాలు రూ.6.25 లక్షల కోట్లు. ► దేశం మొత్తంమీద బ్యాంక్‌కు 9,500 బ్రాంచీలు ఉంటాయి. 13,400 ఏటీఎంలు, 85,000 మంది ఉద్యోగుల నుంచి దాదాపు 12 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందుతాయి. ►విలీన పథకం ప్రకారం, దేనాబ్యాంక్, విజయాబ్యాంక్ షేర్హోల్డర్లకు బీఓబీ షేర్ కేటాయింపులను పూర్తిచేసింది. విజయాబ్యాంక్ షేర్ హోల్డర్లు తమ వద్ద ఉన్న ప్రతి వెయ్యి షేర్లకు 402 బీఓబీ ఈక్విటీ షేర్లు పొందారు. ఇక దేనా బ్యాంక్ విషయంలో షేర్హోల్డర్లు ప్రతి వెయ్యి షేర్లకూ 110 బీఓబీ ఈక్విటీ షేర్లు పొందారు. ►సోమవారం షేర్ల జారీ, కేటాయింపులు జరిగినట్లు బీఓబీ ఎక్సే్ఛంజ్‌లకు పంపిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ► విలీనం పూర్తయిన నేపథ్యంలో.. గుజరాత్లో బీఓబీ మార్కెట్ షేర్ 22 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో ఈ షేర్ 8 నుంచి 10 శాతంగా ఉంది. ► మొండిబకాయిల భారంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిద్దుబాటు చర్యల చట్రం (పీసీఏ)లో ఉన్న దేనా బ్యాంక్ వినియోగదారులకు రుణ సౌలభ్యం ఇప్పటివరకూ అందుబాటులో లేదు. తాజా విలీనంతో తిరిగి తక్షణం ఈ సౌలభ్యత అందుబాటులోకి వస్తుంది. ► గత ఏడాది సెప్టెంబర్‌లో బీఓబీతో విజయా,దేనా బ్యాంకుల విలీన నిర్ణయాన్ని ప్రకటించింది. విలీనం 2019 జనవరిలో నోటిఫై అయ్యింది. ఏప్రిల్ 1న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ► భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులను అంతర్జాతీయ పోటీ స్థాయికి తీసుకువెళ్లడానికి వాటి బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచడానికి ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ నేతృత్వంలో తీసుకున్న పలు సంస్కరణల్లో భాగంగా బ్యాంకింగ్ విలీన ప్రక్రియ ఊపందుకుంది. ►ఈ సంస్కరణల్లో భాగంగా ఐడీబీఐ బ్యాంక్‌లోని 51 శాతం షేర్‌ను జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కొనుగోలు చేసింది. ► దీనితోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థికశాఖ దాదాపు రూ.1.06 లక్షల కోట్లను తాజా మూలధనంగా సమకూర్చింది. దీనితో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌సహా ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐ దిద్దుబాటు చర్యల చట్రం నుంచి బయటపడ్డాయి. 2018 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య బ్యాంకింగ్ మొండిబకాయిల మొత్తం దాదాపు రూ.23,860 కోట్ల మేర తగ్గాయి. ►తాజా విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 18కి తగ్గింది. కేంద్ర తాజా విలీన ప్రక్రియ ప్రారంభానికి ముందు దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య మొత్తం 27. అయితే భారతీయ మహిళాబ్యాంక్సహా ఐదు అనుబంధ బ్యాంకులు ఎస్బీఐలో కలిశాయి. దీనితో ఈ సంఖ్య 27 నుంచి 21కి తగ్గింది. ►ఈ విలీనం నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)కు కేంద్రం రూ.5,000 కోట్ల తాజా మూలధనం సమకూర్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ►విలీనానికి సరిగ్గా నెల రోజుల ముందు బీఓబీ చైర్మన్‌గా మాజీ ఆర్థిక కార్యదర్శి హస్ముఖ్ అదియా నియమితులయ్యారు. ►గుజరాత్‌లోని ఒకప్పటి బరోడాలో బ్యాంక్ ఆఫ్ బరోడా 1908 జూలై 20న ఏర్పాటయ్యింది. ప్రస్తుతం బరోడా వడోదరగా పిలుస్తున్నారు. ఇక కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో 1931లో ఏబీ శెట్టి విజయాబ్యాంక్ను స్థాపించగా, ముంబైలో 1938లో దేవ్‌కరణ్ నాన్జీ దేనా బ్యాంక్‌ను స్థాపించారు. ►తాజా విలీన నిర్ణయాల్లో తప్పులు జరిగాయని, ఈ ప్రక్రియను నిలుపుచేయాలని బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత వారం తిరస్కరించింది. ►తాజా విలీనం నేపథ్యంలో... దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీడ్ బ్యాంకర్ల (రాష్ట్రాల్లో ప్రధాన బ్యాంకులుగా పరిగణించే) బాధ్యతను ఆర్బీఐ పునర్వ్యవస్థీకరించింది. ►విలీనం అమల్లోకి రావడంతో బీఓబీ షేర్ ధర సోమవారం ఎన్ఎస్ఈలో 3.15 శాతం పెరిగి 132.70 వద్ద ముగిసింది. కస్టమర్లకు, ఉద్యోగులకు ప్రయోజనం తాజా విలీనం వల్ల 12 కోట్ల మందికిపైగా కస్టమర్లకు, బ్యాంక్ ఉద్యోగులకు అత్యుత్తమ ప్రయోజనాలు సమకూరనున్నాయి. నగదు నిర్వహణా వ్యవహారాలు, రుణ సత్వర అందుబాటు, ఆర్థిక, ద్రవ్య ప్రణాళికలు, సంపద నిర్వహణ వంటి విస్తృతస్థాయి అంశాల్లో ఈ ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగుల సేవలు మెరుగుపడతాయి. వారి ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించడం జరుగుతుంది. విలీన ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులన్నీ 12–18 నెలల్లో పరిష్కారం అవుతాయి. – బీరేంద్ర కుమార్, బీఓబీ జీఎం, బెంగళూరు జోనల్ ఆఫీస్ -
రుణాలు@ 5.15 లక్షల కోట్లు
హైదరాబాద్ బిజినెస్ బ్యూరో: గతేడాది డిసెంబర్ చివరినాటికి తెలంగాణలోని మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.4,33,036 కోట్లకు చేరినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ప్రకటించింది. 4.86% వృద్ధితో రూ.20,091 కోట్ల మేర డిపాజిట్లు పెరిగినట్లు తెలియజేసింది. ఈ కాలంలో మొత్తం అడ్వాన్సులు (రుణాలు) 7.28 శాతం పెరిగి రూ.5,15,537 కోట్లకు చేరుకున్నాయి. మంగళవారం ఇక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్యాలయంలో జరిగిన 22వ ఎస్ఎల్బీసీ త్రైమాసిక సమీక్ష సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జే.స్వామినాథన్ మాట్లాడుతూ.. ‘క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి (సీడీ రేషియో) 100% పైనే ఉంది. తాజాగా 119.05 శాతానికి చేరుకుంది. ఎంఎస్ఎంఈ విభాగం అనుకున్న విధంగా 134.31 శాతానికి చేరింది. ముద్రా రుణాలు సైతం నిర్థేశిత లక్ష్యం మేర పెరిగాయి’ అని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్ఎల్బీసీ కన్వీనరు, ఎస్బీఐ జీఎం ఉన్ మయ్యాతో పాటు ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, జనరల్ మేనేజర్ ఎస్.శంకర్, తెలంగాణ ప్రభుత్వ అధికారులు సందీప్ సుల్తానియా, రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. -
డిపాజిట్ల రేటును తగ్గించిన ఎస్బీఐ
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. పొదుపు ఖాతాలు, స్వల్పకాలిక రుణ రేట్లను రెపోరేటుకు అనుసంధానం చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. తొలిసారిగా ఎక్స్టర్నల్ ప్రమాణిక వడ్డీరేట్లకు కలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన రేట్లు మే 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి తీసుకొచ్చింది. రూ.లక్ష పైబడిన సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై ప్రస్తుతం ఏడాదికి 3.50 శాతం రేటు ఉండగా.. ఇది రెపోరేటు కంటే 2.75 శాతం తక్కువగా ఉందని తెలిపింది. క్యాష్ క్రెడిట్ అకౌంట్స్, రూ.లక్ష దాటిన ఓవర్‌డ్రాఫ్ట్‌ను రెపోరేటు, 2.25 శాతం జోడించి అనుసంధానం ఉంటుందని వివరించింది. -
బ్యాంకుకే కన్నం వేసిన మేనేజర్
సాక్షి, హైదరాబాద్: కంచె చేను మేయడం అంటే ఇదేనేమో! ఓ బ్యాంకు మేనేజర్ తాను పనిచేస్తున్న బ్రాంచ్‌ను నిలువుగా ముంచిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నాగర్‌గూడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఎన్.కృష్ణఆదిత్య అదే బ్యాంకులో తన పేరిట సేవింగ్ ఖాతా తెరిచాడు. తన స్నేహితుడు నీరటి కృష్ణయ్య పేరుపై రూ.9 లక్షలతో ఓవర్ డ్రాఫ్ట్(ఓడీ) అకౌంట్ తెరిచాడు. ఈ బ్యాంకు పరిధిలో ఉన్న 77 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి డబ్బులను ఆన్లైన్ ద్వారా సేవింగ్ ఖాతాలోకి బదిలీ చేసుకోవడంతోపాటు ఓడీ అకౌంట్‌పై రూ.92 లక్షలు బ్యాంకు నుంచి బదిలీ చేశాడు. 77 అకౌంట్లతో 24 మంది ఖాతాదారుల అనుమతి లేకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా డబ్బులను తన సేవింగ్ ఖాతాలోకి మళ్లించినట్టు బ్యాంకు రీజినల్ మేనేజర్ అంతర్గత విచారణలో బయటపడింది. ఇక్కడితో ఆగకుండా కృష్ణఆదిత్య 53 మంది పేర్లతో తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి బ్యాంకు ఖాతాలు తెరిచాడు. వీళ్ల ఖాతాలపై రూ.62 లక్షలను రుణాల పేరిట దండుకున్నాడు. దుర్గాభవానీ, జై భవానీ మద్యం దుకాణాలకు ఎలాంటి రుణ ష్యూరిటీ పత్రాలు లేకుండానే రూ.60 లక్షలు రుణాలు మంజూరు చేశాడు. గ్రూప్ ఆఫ్ కస్టమర్ల పేరుతో 11 మందికి అర్హత లేకున్నా క్రెడిట్ రుణాలు మంజూరు చేసి బ్యాంకుకు నష్టం వచ్చేలా చేసినట్టు గుర్తించారు. అయితే, ఈ వ్యవహారం ఓ ఖాతాదారుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చినట్టు ఎస్బీఐ రీజినల్ మేనేజర్ జె.దుర్గాప్రసాద్ తెలిపారు. తనకు సమాచారం లేకుండా తన అకౌంట్ నుంచి రూ.2 లక్షలను డ్రా చేసి కృష్ణఆదిత్య తన అకౌంట్లో వేసుకున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరపగా మొత్తం కుంభకోణం బయటపడిందని దుర్గప్రసాద్ సీబీఐకి రెండు రోజుల క్రితం చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణ ఆదిత్య మొత్తం రూ.3.46 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు తేలిందన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సీబీఐ హైదరాబాద్ రేంజ్ అధికారులు ప్రాథమిక విచారణ జరిపి బ్యాంక్ మేనేజర్ కృష్ణ ఆదిత్యతోపాటు క్యాషియర్ కమ్ క్లర్క్ లేళ్ల శశిధర్, తాత్కాలిక మేనేజర్ ఆరె సత్యం, అసిస్టెంట్ మేనేజర్ మహ్మద్, సుజాత్ అలీ సిద్దిఖీ, ఇతడి స్నేహితులు మహ్మద్ అబ్దుల్ ఖలీముల్లా షబ్బీర్, మహ్మద్ జబీరుల్లాపై సీబీఐ కేసులు నమోదు చేసింది. -
1 నుంచి ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలకు రంగం సిద్ధమైంది. 2019, జనవరి 1 నుంచి 10 వరకూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ బాండ్లను జారీచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, గాంధీనగర్, పట్నా, చండీగఢ్, బెంగళూరు, భోపాల్, ముంబై, జైపూర్, లక్నో, చెన్నై, కోల్‌కతా, గువాహటి నగరాల్లోని 29 ఎస్బీఐ శాఖల్లో ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గత నవంబర్‌నాటికి 6విడతల్లో రూ.1,056.73 కోట్ల విలువైన బాండ్లను ప్రజలు కొనుగోలు చేశారంది. -
ఎస్బీఐ మళ్లీ లాభాల బాట
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మొండిబకాయిల సమస్య నుంచి నెమ్మదిగా మళ్లీ గాడిలో పడుతోంది. గడిచిన మూడు త్రైమాసికాలుగా నష్టాలను ప్రకటిస్తున్న బ్యాంక్ ఇప్పుడు లాభాల బాటపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2018–19, క్యూ2) స్టాండెలోన్ ప్రాతిపదికన (బ్యాంకింగ్ కార్యకలాపాలు) రూ.945 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.1,582 కోట్లతో పోలిస్తే 40% తగ్గింది. అయితే, ఈ ఏడాది జూన్ క్వార్టర్లో (క్యూ1) వచ్చిన రూ.4,876 కోట్ల భారీ నష్టంతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా బ్యాంక్ మళ్లీ లాభాల్లోకి రావడం గమనార్హం. మార్చి క్వార్టర్లో కూడా రూ.7,718 కోట్ల నికర నష్టాన్ని ఎస్బీఐ మూటగట్టుకోవడం తెలిసిందే. మరోపక్క, సెప్టెంబర్ క్వార్టర్లో(క్యూ2) అనుబంధ సంస్థ ఎస్బీఐ లైఫ్‌లో వాటా విక్రయం ద్వారా వచ్చిన రూ.5,436 కోట్ల భారీ వన్‌టైమ్ ఆదాయం ఎస్బీఐకి కలిసొచ్చింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, కేటాయింపుల(ప్రొవిజనింగ్) భారం శాంతించడం కూడా బ్యాంక్ మెరుగైన పనితీరుకు తోడ్పడింది. క్యూ2లో ఎస్బీఐ రూ.225 కోట్ల మేర నికర నష్టాన్ని ప్రకటించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. బ్యాంక్ స్టాండెలోన్ ఆదాయం రూ.65,429 కోట్ల నుంచి స్వల్ప పెరుగుదలతో రూ.66,608 కోట్లకు చేరింది. 1.8% వృద్ధి నమోదైంది. కన్సాలిడేటెడ్‌గా ఇలా... ఎస్బీఐ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్, కార్డ్స్, మ్యూచువల్ ఫండ్... ఈ అనుబంధ సంస్థలన్నింటితో కలిపి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎస్బీఐ క్యూ2లో రూ.576 నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో వచ్చిన లాభం రూ.1,841 కోట్లతో పోలిస్తే 69 శాతం తగ్గింది. మొత్తం ఆదాయం మాత్రం 5.8 % వృద్ధితో రూ.74,949 కోట్ల నుంచి రూ.79,303 కోట్లకు పెరిగింది. మొండిబకాయిలు తగ్గాయ్... బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు క్యూ2లో రూ.2,05,864 కోట్లుగా (9.95 శాతం) నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో స్థూల ఎన్పీఏలు రూ.1,86,115 కోట్లుగా (9.83 శాతం) ఉన్నాయి. అయితే ఈ ఏడాది క్యూ1లో రూ. 2,12,840 కోట్లుతో (10.69%) పోలిస్తే సీక్వెన్షియల్‌గా దిగొచ్చాయి. ఇక నికర ఎన్పీఏలు వార్షిక ప్రాతిపదికన, సీక్వెన్షియల్‌గా కూడా తగ్గుముఖం పట్టడం గమనార్హం. గతేడాది క్యూ2లో రూ.97,896 కోట్లుగా(5.43%) ఉన్న నికర ఎన్పీఏలు ఈ ఏడాది క్యూ2లో రూ.94,810 కోట్లకు (4.84%) తగ్గాయి. ఈ ఏడాది క్యూ1లో ఇవి రూ. 99,236 కోట్లుగా (5.29%) ఉన్నాయి. మరోపక్క, మొండిబాకాయిలకు కేటాయింపులు (ప్రొవిజనింగ్) కూడా భారీగా తగ్గాయి. గతేడాది క్యూ2లో రూ.16,842 కోట్లను కేటాయించగా... ఈ ఏడాది క్యూ2లో 39% తగ్గుదలతో ప్రొవిజనింగ్ రూ.10,381 కోట్లకు దిగి వచ్చింది. కాగా, క్యూ2లో స్థూలంగా రూ.10,888 కోట్ల విలువైన రుణాలు మొండిబకాయిలుగా మారాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో మొండి బకాయిలుగా మారిన రూ.14,349 కోట్లతో పోలిస్తే భారీగా అడ్డుకట్టపడినట్లు లెక్క. రైటాఫ్ చేసిన రుణ ఖాతాల్లో సుమారు రూ. 1,327 కోట్లను రికవరీ చేసుకున్నామని.. 14.6% వృద్ధి నమోదయిందని బ్యాంక్ వెల్లడించింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) క్యూ2లో 12.5 శాతం వృద్ధి చెంది రూ.18,586 కోట్ల నుంచి రూ.20,906 కోట్లకు ఎగబాకింది. n నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 2.59 శాతం నుంచి 2.88 శాతానికి మెరుగుపడింది. ♦ బ్యాంక్ మొత్తం రుణాలు సెప్టెంబర్ క్వార్టర్లో 9 శాతం వృద్ధితో రూ.19.57 లక్షల కోట్లకు చేరాయి. దేశీ రుణ వృద్ధి 1%గా నమోదైంది. ఇందులో కార్పొరేట్, రిటైల్ రుణాలు 14% వృద్ధి చెందాయి. ♦ డిపాజిట్లు 7 శాతం పెరుగుదలతో రూ.28.07 లక్షల కోట్లకు చేరాయి. ♦ ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సోమవారం ఎస్బీఐ షేరు పరుగులు తీసింది. ట్రేడింగ్ మరో పావు గంటలో ముగుస్తుందనగా.. ఫలితాలు వెలువడ్డాయి. దీంతో బీఎస్ఈలో 5 శాతం దూసుకెళ్లి రూ.299.90ని తాకింది. చివరకు 3.45 శాతం లాభంతో రూ.295 వద్ద ముగిసింది. బ్యాంక్ మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.8,791 కోట్లు ఎగబాకి రూ. 2,63,543 కోట్లకు చేరింది. సెస్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. ఐఎల్ఎఫ్ఎస్కు రూ.4,250 కోట్ల రుణాలు... రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌ఎఫ్‌స్ గ్రూప్ మొత్తానికి తాము దాదాపు రూ.4,250 కోట్ల మేర రుణాలిచ్చినట్లు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వెల్లడించారు. ఇందులో రూ.4,000 కోట్లు ఐఎల్ఎఫ్ఎస్కు చెందిన 13– 14 ప్రత్యేక సంస్థలకు (ఎస్పీవీ) ఇవ్వగా... మరో రూ.250 కోట్లను మాతృ సంస్థ అయిన హోల్డింగ్ కంపెనీకి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఒక్క ఖాతా మాత్రమే మొండిబకాయిగా మారిందని.. దీనికి రూ.56 కోట్ల కేటాయింపులు జరిపామని రజనీష్ పేర్కొన్నారు. కాగా, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) తామిచ్చిన రుణాల పరిమాణం రూ.1.5 లక్షల కోట్లు ఉన్నట్లు వివరించారు. ‘ఈ రుణాలకు సంబంధించి వ్యవస్థాగత రిస్కులేవీ లేవు. సంక్షోభం మొదలైన ఆగస్టు, సెప్టెంబర్ నెలలతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. అక్టోబర్ నెలలో సుమారు రూ.5,250 కోట్ల విలువైన ఎన్బీఎఫ్సీ రుణాలను టేకోవర్ చేశాం. మరో రూ.15,940 కోట్ల రుణాలను చేజిక్కించుకునే పనిలో ఉన్నాం. మార్చి నాటికి రూ.45,000 కోట్ల రుణాలు, ఆస్తుల కొనుగోలు లక్ష్యాన్ని అందుకుంటామన్న నమ్మకం ఉంది’ అని ఎస్బీఐ చైర్మన్ పేర్కొన్నారు. క్యూ2లో నికర లాభం తక్కువగానే ఉన్నప్పటికీ... బ్యాంక్ పనితీరు బాగా మెరుగుపడింది. రానున్న కాలంలో లాభాలు మరింత పుంజుకుంటాయన్న విశ్వాసం ఉంది. మొండిబకాయిలు, కేటాయింపులు కూడా భారీగానే దిగొస్తాయని భావిస్తున్నాం. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ -
ముగిసిన లోన్లకూ ఈఎంఐ కోతలు!!
(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) : మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్ లోన్, పర్సనల్ లోన్, గృహ రుణం వంటివేమైనా ఉన్నాయా? వాటిని ఈ మధ్య... అంటే ఏడాది, రెండేళ్ల కిందట పూర్తిగా తీర్చేసి క్లోజ్ చేశారా? అయితే మీరు ఒకసారి మళ్లీ మీ ఖాతాలను చూసుకోండి. మీరు వాటికి ఏ ఖాతాల నుంచి చెల్లింపులు చేశారో ఆయా ఖాతాల్లో కొత్త కోతలేమైనా పడ్డాయేమో సరిచూసుకోవటం మంచిది. ఎందుకంటే ఎస్బీఐ విషయంలో పూర్తిగా తీర్చేసి, క్లోజయిపోయిన రుణాలకు సైతం ఆటోమేటిగ్గా మళ్లీ ఈఎంఐ కోతలు జరిగిపోతున్నాయి. ఒక్క సికింద్రాబాద్ ఆర్‌ఏసీపీసీ పరిధిలోనే వెయ్యి నుంచి రెండు వేల ఖాతాల వరకూ ఈ రకంగా ప్రభావితమైనట్లు ఎస్బీఐ వర్గాలు చెబుతున్నాయి. రెండు నెలలుగా ఈ సమస్య ఉందని, చాలా మందికి కోతలు పడ్డాయని, ఇప్పటికీ ఇది పరిష్కారం కాలేదని తెలియవచ్చింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆయా ఖాతాలను పాత ప్లాట్‌ఫామ్ నుంచి కొత్త ప్లాట్‌ఫామ్‌కు మార్చాల్సి వచ్చిందని, ఈ క్రమంలో కన్వర్షన్ ప్రక్రియ సమర్థమంతంగా జరగలేదని ఎస్బీఐ అధికారి ఒకరు చెప్పారు. ‘‘ఈ కన్వర్షన్ ప్రక్రియ సరిగా జరగలేదు. అన్ని ఆదేశాలనూ (మాండేట్స్) అది తీసుకోలేదు. దీంతో పాత, క్లోజ్ చేసిన ఖాతాలు కూడా యాక్టివేట్ అవుతున్నాయి. వాటిల్లో కోతలు పడుతున్నాయి’’ అని సికింద్రాబాద్ ఆర్ఏసీపీసీలోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇలాగే తన ఖాతా నుంచి రెండు నెలలుగా నగదు కట్ అవుతోందని ఓ వ్యక్తి ఫోన్ చేసి అడిగినపుడు సదరు అధికారి ఈ సమాధానమివ్వటం గమనార్హం. అసలేం జరిగిందంటే... సికింద్రాబాద్‌కు చెందిన కృష్ణకుమార్‌కు ఎస్బీఐలో కార్లోన్ ఉంది. 2009 ఏడాదిలో తీసుకున్న ఈ రుణాన్ని నెలకు రూ.5,790 చొప్పున ఈఎంఐ చెల్లించి ఆయన 2016లో పూర్తిగా తీర్చేశారు. క్లోజ్ చేశారు కూడా. అయితే ఉన్నట్టుండి గత నెల తన హెచ్డీఎఫ్సీ ఖాతా నుంచి రూ.5,790 ఈఎంఐ డెబిట్ కావటానికి ఈసీఎస్ వచ్చింది. కాకపోతే ఆ ఖాతాలో అంత సొమ్ము లేదు. దీంతో ఈసీఎస్ ఆదేశాలు అమలు కాలేదు. ఇలా ఈసీఎస్ ఫెయిలయినందుకు ఆయన హెచ్‌డీఎఫ్‌సీకి రూ.600 పెనాల్టీ చార్జీలను చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇదెలా జరిగిందని ఎస్బీఐని సంప్రతిస్తే... పొరపాటున జరిగి ఉండవచ్చని అప్పుడు సమాధానమిచ్చారు. ఇదిగో... ఈ నెల 10న మళ్లీ మరో ఈసీఎస్ ఆదేశం వచ్చింది. ఈ సారి ఖాతాలో డబ్బులుండటంతో ఆ డబ్బులు డెబిట్ అయి ఎస్బీఐకి వెళ్లిపోయాయి. ఖాతా చూసుకుని లబోదిబోమన్న కృష్ణకుమార్... ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయమైన ఆర్ఏసీపీ అధికారుల్ని సంప్రతించారు. నిజానికి చెక్కులయితే బ్రాంచి స్థాయిలో డిపాజిట్ చెయ్యటం, క్లియర్ చెయ్యటం జరుగుతాయి. కానీ ఈసీఎస్ మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) స్థాయిలోనే జరుగుతుంది. ఇదంతా సాఫ్ట్వేర్ సమస్య వల్ల జరిగిందని, దాదాపు 1,000 నుంచి 2,000 ఖాతాల వరకూ ప్రభావితమయ్యాయని సదరు అధికారులు కృష్ణకుమార్‌కు చెప్పారు.మరి ప్రాంతీయ కార్యాలయమైన సికింద్రాబాద్ ఆర్‌ఏసీపీసీ పరిధిలోనే ఇన్ని ఖాతాలు ప్రభావితమయ్యాయంటే... దేశ వ్యాప్తంగా ఎన్ని ఖాతాలు దెబ్బతిని ఉండొచ్చనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా చిత్రమేంటంటే తను ఖాతా చూసుకుని బ్యాంకును సంప్రతించే వరకూ... ఇలాంటి సమస్య ఒకటుందని గానీ, ఆ సమస్య వల్ల తన ఖాతాలో డబ్బులు డెబిట్ అయ్యాయని ఎవరికీ తెలియదు. పోనీ బ్యాంకు ఇలాంటి వారికి ముందస్తు సమాచారమేదైనా ఇస్తోం దా అంటే... అదీ లేదు. ‘‘మేం సదరు ప్రోగ్రామ్‌ను రన్ చేస్తే ఎన్ని ఖాతాలు ప్రభావితమయ్యాయో తెలిసిపోతుంది. వాటన్నిటి నుంచీ డెబిట్ అయిన డబ్బులు ముంబయికి వెళ్లి... రుణ ఖాతా క్లోజయిపోయింది కనక మాకు తిరిగి వచ్చేస్తాయి. మేం వాటిని సస్పెన్స్ ఖాతాలో పెట్టి తిరిగి మీకు క్రెడిట్ చేస్తాం’’ అని సదరు అధికారి సమాధానమిచ్చారు. రెండు నెలలుగా ఏం చేశారు? ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. తాము ప్రోగ్రామ్‌ను రన్ చేస్తే ఎన్ని ఖాతాలు ప్రభావితమయ్యాయో తెలిసిపోతుందని సదరు అధికారే చెప్పా రు. మరి 2 నెలలుగా ఎందుకు రన్ చెయ్యలేదు. బహుశా! చెయ్యబట్టే 2,000 ఖాతాల వరకూ ప్రభావితమయ్యాయని వారికి తెలిసి ఉంటుందని అనుకుందాం!! మరి గతనెలే జరిగినపుడు.. మళ్లీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటే ఈ నెల కూడా చెక్కు వచ్చి సొమ్ము డెబిట్ అయ్యేది కాదు కదా? ఈ ప్రశ్నకు మాత్రం సదరు అధికారి సమాధానమివ్వలేకపోవటం గమనార్హం. నిజానికి ఒకవేళ ఆయా డబ్బులు డెబిట్ అయిన ఖాతాల్లోకి తిరిగి వచ్చినా... ఈ లోగా రావాల్సిన క్రెడిట్ కార్డు చెక్కుల వంటివి రావటం, డబ్బుల్లేక బౌన్స్ కావటం వంటివి జరగవని చెప్పలేం. కృష్ణకుమార్‌కు జరిగినట్లే మిగతా వారికీ పెనాల్టీలు పడితే దానికెవరు బాధ్యులు? లీన్ పేరిట ‘హోల్డింగ్’ ఎస్బీఐలో ఈ మధ్య కొందరికి మరో సమస్య కూడా ఎదురవుతోంది. ఉన్నట్టుండి ఖాతాలోని డబ్బుల్లో కొన్ని ‘లీన్’ పేరిట కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మీ ఖాతాలో రూ.30 వేలుంటే... దాన్లో రూ.25వేలు ‘లీన్’ పేరిట కనిపించాయనుకోండి!!. మొత్తం బ్యాలెన్స్ రూ.30వేలు కనిపించినా మీరు విత్‌డ్రా చెయ్యగలిగేది, వాడుకోగలిగేది రూ.5 వేలు మాత్రమే. లీన్ పేరిట ఉన్న సొమ్మును మళ్లీ బ్యాంకు విడిచిపెట్టేదాకా వాడలేరు. ఈ మధ్య కొందరికి ఇలాగే జరిగినపుడు బ్యాంకును సంప్రతిస్తే... ‘‘అధిక విలువగల లావాదేవీలు జరిగినపుడు ఇలా చేస్తాం’’ అని ఒక అధికారి సమాధానమిస్తే... మీకు వేరే శాఖలో లోన్ ఉండి దాన్ని చెల్లించకపోతే ఇలా హోల్డ్ చేస్తామని మరో అధికారి చెప్పారు. కేవైసీ వివరాలు సమర్పించకపోతే ఇలా చేస్తామని కొందరు సిబ్బంది చెప్పటం గమనార్హం. నిజానికి ఏ బ్రాంచిలోనూ లోన్లు లేనివారికి, మామూలు లావాదేవీలు నిర్వహించేవారికి చాలా మందికి ఇలా జరగటం... ఓ వారం పాటు ఫిర్యాదులు చేసి, బ్యాంకు చుట్టూ తిరిగితే చివరికి లీన్ విడుదల చేయటం వంటివి ఈ మధ్యే చోటుచేసుకున్నాయి. కాగా ఈ విషయమై ఎస్బీఐ రుణాల విభాగం డీజీఎంను సంప్రతించటానికి మెయిల్, మెసేజ్‌ల ద్వారా ‘సాక్షి’ ప్రయత్నించినా... ఆయన స్పందించలేదు. -
ఎన్‌బీఐతో ఎస్బీఐ ఒప్పందం
ముంబై: ఖాట్మండు నేషనల్ బ్యాంకింగ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌బీఐ)తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. మౌలిక, పరిపాలనా సదుపాయాలను ఇరు సంస్థలు వినియోగించుకునేందుకు ఈ ఎంఓయూ వీలు కల్పిస్తుందని ఒక ప్రకటనలో వివరించింది. బ్యాంకింగ్ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మానవ వనరులను సమకూర్చడం కోసం వ్యూహాత్మక కూటమి ఏర్పాటు ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని పేర్కొంది. -
ఇక రోజుకు రూ.20వేలే!!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయల్ పరిమితిని సగానికి సగం తగ్గించేస్తోంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.40,000 ఉండగా... దీనిని ఈ నెలాఖరు నుంచి రూ.20,000కు తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. మోసపూరిత లావాదేవీలు పెరిగిపోతుండడంతో, కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ సోమవారం ప్రకటించింది. తాజా నిర్ణయం వల్ల ఏటీఎంల ద్వారా ఒకేరోజు పెద్ద మొత్తంలో నిధుల విత్‌డ్రా చేయడానికి అవకాశం ఉండదు. దీనివల్ల మోసగాళ్లు సైతం రోజుకు రూ.20వేల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేయలేరు కనక ఒకవేళ ఎవరైనా మోసపోయినా మరీ ఎక్కువ మొత్తాన్ని పోగొట్టుకోకుండా ఉంటారన్నది తమ ఉద్దేశమని బ్యాంకు తెలియజేసింది. ఏదైనా మోసపూరిత విత్‌డ్రాయల్ జరిగితే వెంటనే కార్డ్ బ్లాక్ చేయించుకోవడం, సంబంధిత బ్రాంచీని సంప్రదించడం చేయాలని, దాంతో నష్టాన్ని పరిమితం చేసుకోవచ్చని కూడా సూచించింది. ఈ నిర్ణయం అక్టోబర్ 31 నుంచీ అమల్లోకి వస్తుంది. ‘‘క్లాసిక్–డెబిట్ కార్డ్‌పై విత్‌డ్రాయల్ పరిమితిని రూ.20,000కు తగ్గిస్తున్నాం. ఇతర కార్డులకు సంబంధించి రోజూవారీ విత్‌డ్రాయల్ పరిమితిలో ఎలాంటి మార్పూ లేదు. క్లాసిక్–డెబిట్ కార్డ్ చిప్ ఆధారితం కాదు. కాబట్టి సెక్యూరిటీ పరమైన ఆందోళనలు ఉన్నాయి. పలు ఫిర్యాదులూ అందాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని సీనియర్ బ్యాంక్ మేనేజర్ ఒకరు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎస్బీఐకి దాదాపు 42 కోట్ల మంది కస్టమర్లున్నారు. 2018 మార్చి నాటికి బ్యాంక్ 39.50 కోట్ల డెబిట్ కార్డులను జారీ చేసింది. వీటిలో దాదాపు 26 కోట్ల కార్డుల వినియోగం పూర్తి క్రియాశీలంగా ఉంది. డెబిట్ కార్డుల జారీకి సంబంధించి ఎస్బీఐ మార్కెట్ వాటా దాదాపు 32.3 శాతం. -
ఎస్బీఐ ఏటీఎం విత్‌డ్రాయల్స్: బ్యాడ్ న్యూస్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వినియోగదారులకు మరో చేదువార్త చెప్పింది. రోజువారీ క్యాష్ విత్‌డ్రాయల్ పరిమితిని మరింత కుదించింది. ఏటీఎం ద్వారా రోజువారీ నగదు ఉపసంహరణపై కస్టమర్లకు షాకిచ్చింది. క్లాసిక్, మ్యాస్ట్రో డెబిట్ కార్డులు వినియోగిస్తున్న ఎస్బీఐ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా వినియోగదారులు పొందే నగదును సగానికి కోత పెట్టి కేవలం రూ.20వేలుగా నిర్ణయించింది. ఇంతకుముందు ఈ పరిమితి 40వేల రూపాయలుగా ఉంది. అయితే అక్రమ లావాదేవీలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే డిజిటల్, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎస్బీఐ తెలిపింది. అక్టోబర్ 31 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలలో పెరుగుదల ఉన్నప్పటికీ, నగదు డిమాండ్ ఎక్కువగా ఉందని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పికె గుప్తా చెప్పారు. తాజా అంచనాల ప్రకారం, నోట్ల రద్దు ముందు కంటే నగదు డిమాండ్ భారీగా ఉందని తెలిపారు. తాజానిర్ణయం వినియోగదారుల అసౌకర్యానికి దారితీస్తుందా అని ప్రశ్నించినపుడు అంతర్గత విశ్లేషణ అనంతరం 20వేల రూపాయల మొత్తం చాలామంది వినియోగదారులకు సరిపోతుందని భావిస్తున్నామన్నారు. అలాగే స్వల్ప ఉపసంహరణలు ద్వారా మోసాలను తగ్గించేందుకు వీలవుతుందా లేదా అనేది పరిశీలించనున్నట్టు చెప్పారు. మరోవైపు దీనిపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యంగా వైద్య అవసరాల నిమిత్తం ఇప్పటికే పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, తాజా నిర్ణయంతో మరిన్ని కష్టాలు తప్పవని వాపోతున్నారు. -
ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పద్మజ బాధ్యతలు
ప్రభుత్వ రంగ బ్యాంక్– ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పద్మజ చంద్రూ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్లోబల్ మార్కెట్స్ విభాగానికి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆమె... తాజాగా ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టారని గురువారం బ్యాంక్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఎండీ, సీఈఓలను నియమించగా... ఈ జాబితాలో ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పద్మజ ఉన్న విషయం తెలిసిందే. -
10 ప్రభుత్వ బ్యాంకులకు కొత్త చీఫ్‌లు!
న్యూఢిల్లీ: పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం బుధవారం ఎండీ, సీఈఓలను నియమించింది. కొత్త చీఫ్‌లలో ఐదుగురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్లు కావడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నియామకాలకు ఆమోదముద్ర వేసింది. నియామక వ్యవహారాల మంత్రిత్వశాఖ జారీచేసిన అధికారిక ఉత్తర్వులను క్లుప్తంగా చూస్తే... ఎస్బీఐ నుంచీ వీరు... మొండిబకాయిలతో సతమతమవుతున్న ఇతర బ్యాంకులు ఈ సమస్య నుంచి బయటపడ్డానికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు– ఎస్బీఐ నిపుణుల సహాయం కీలకం అని భావించిన కేంద్రం, ఎస్బీఐ నుంచి ఈ నియామకాలు చేపట్టినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నియామకాలు చూస్తే... ►ఆంధ్రాబ్యాంక్: జే. పకీర్‌సామి. 2021 ఫిబ్రవరి 28 పదవీ విరమణ వరకూ బాధ్యతలు నిర్వహిస్తారు. ► సిండికేట్ బ్యాంక్: మృత్యుంజయ్ మహాపాత్ర. పదవీకాలం పూర్తయ్యే వరకూ అంటే 2020 మే 31 మహాపాత్ర ఈ బాధ్యతలను నిర్వహిస్తారు. ► ఇండియన్ బ్యాంక్: పద్మజా చంద్రూ. 2021, ఆగస్టు 31న చంద్రూ పదవీ విరమణ చేస్తారు. ► సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: పల్లవ్ మహాపాత్ర. 2021 ఫిబ్రవరి వరకూ ఉంటారు. ► దేనా బ్యాంక్: కర్నమ్ శేఖర్. 2020, జూన్ 30 వరకూ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇతర ఐదు బ్యాంకులనూ చూస్తే... ►అలహాబాద్ బ్యాంక్: ఎస్ఎస్ మల్లికార్జునరావు. తొలి బాధ్యతల కాలపరిమితి మూడేళ్లు. అయితే ఆయన పదవీ విరమణ సమయం 2022 జనవరి 31 వరకూ బాధ్యత కాలపరిమితిని పొడిగించే వీలుంది. ప్రస్తుతం ఆయన సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ►బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఏఎస్ రాజీవ్. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీ కాలం మూడేళ్లు. మంచి పనితనం కనబరిస్తే, పదవీకాలం మరో రెండేళ్లు పొడిగించవచ్చు. ►యూకో బ్యాంక్: అతుల్ కుమార్ గోయెల్. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా పనిచేస్తున్నారు. ►పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్: ఎస్. హరి శంకర్. అలహాబాద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ► యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: అశోక్ కుమార్ ప్రధాన్, ప్రస్తుతం ఇదే బ్యాంకులో అశోక్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్బీఐ స్థానిక బోర్డ్లకూ నియామకాలు... రిజర్వ్ బ్యాంక్ స్థానిక బోర్డుల సభ్యుల నియామకాలనూ కేంద్రం ప్రకటించింది. వీటిలో దక్షిణ(రాకేష్ జైన్), ఉత్తర (రేవతీ అయ్యర్, రాఘవేద్ర నారాయణ్ దుబే), తూర్పు (ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది) ప్రాంత బోర్డులు ఉన్నాయి. -
ఇన్ఫ్రా, విద్యుత్ కంపెనీలకు రుణాలు వద్దు..
ముంబై: మౌలిక సదుపాయాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టులు, ముఖ్యంగా విద్యుత్ రంగానికి బ్యాంకులు రుణసాయం నిలిపివేయాలని ప్రభుత్వరంగ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అభిప్రాయపడింది. గత దశాబ్దకాలంలో ఈ రంగానికి మంజూరు చేసిన రుణాల్లో అధిక భాగం మొండి బకాయిలుగా (ఎన్పీఏలు) మారడం వంటి భయానక అనుభవాన్ని ఇందుకు కారణంగా పేర్కొంది. ఆర్బీఐ మార్గదర్శకాల నేపథ్యంలో విద్యుత్ రంగానికి సంబంధించి రూ.1.7 లక్షల కోట్ల ఎన్పీఏలను దివాలా చర్యల కోసం బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) నివేదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రుణాలను నిలిపివేయాల్సి రావచ్చని ఎస్బీఐ ఎండీ దినేష్‌కుమార్ ఖరా మీడియాతో అన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకమైన ఇన్ఫ్రా రంగానికి నిధుల సాయం అవసరాల నేపథ్యాన్ని గుర్తు చేస్తూ, బ్యాంకులకు ఇప్పుడు ఈ రంగం ‘అంటరానిదా’ అన్న ప్రశ్నకు... కేవలం విద్యుత్ రంగానికే అది వర్తిస్తుందని ఖరా బదులిచ్చారు. తన మాటల్ని సవరించి రోడ్డు ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు సుముఖంగానే ఉన్నామని చెప్పారు. రిస్క్ నివారణను సరైన చర్యలు తీసుకుంటే అన్ని రంగాలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధమేనని తేల్చి చెప్పారు. అయితే, విద్యుత్ రంగానికి సంబంధించి ఇంధన సరఫరా ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పరంగా సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. మరో ఎండీ పీకే గుప్తా మాట్లాడుతూ... ఫిబ్రవరి 12 నాటి ఆర్బీఐ ఎన్పీఏల సత్వర గుర్తింపు ఉత్తర్వుల కారణంగా బ్యాంకులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ ప్రాజెక్టుల ఎన్పీఏలను ఎన్సీఎల్టీకి నివేదించితే సహజంగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుకు దారితీస్తుందని, అది బ్యాంకులను బలహీనపరుస్తుందని చెప్పారు. బ్యాంకులకు మరింత సమయం ఇస్తే ఎన్సీఎల్టీకి వెళ్లకుండా పరిష్కార ప్రణాళిక కనుగొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. -
ఈ ఏడాది లాభాల్లోకి వస్తాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలను ఆర్జిస్తామని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. జూన్ త్రైమాసికంలో బ్యాంకు రూ.4,876 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2,006 కోట్ల లాభాలను ఆర్జించింది. 2018–19 సెప్టెంబరు త్రైమాసికం అనంతరం నుంచి లాభాలను చూస్తామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. హైదరాబాద్‌లో బ్యాంకు నిర్వహించిన సీఎస్ఆర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రానిబాకీల కోసం చేసిన కేటాయింపుల వల్లే లాభాలపై ప్రభావం చూపింది. 2017–18లో ఈ కేటాయింపులు రూ.70,000 కోట్లు. అంత క్రితం ఏడాది ఇవి రూ.55,000 కోట్లు. ఈ ప్రొవిజన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గుముఖం పట్టనున్నాయి. ఇచ్చిన రుణాలు బ్యాడ్ లోన్స్ కాకుండా గట్టి చర్యలు చేపడుతున్నాం. ఎన్సీఎల్టీ వద్ద ఉన్న మొండి బకాయిల కేసులు కొన్ని పరిష్కారం అవుతాయి. మొత్తంగా ఈ ఏడాది బ్యాంకు లాభాల్లోకి వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. రుణాల్లో 10 శాతం వృద్ధి.. ఈ ఏడాది రుణాల్లో 10 శాతం వృద్ధి ఉండొచ్చని రజనీశ్ కుమార్ వెల్లడించారు. కంజ్యూమర్ లోన్స్ అయిన కార్ లోన్స్, హోమ్, పర్సనల్ లోన్స్ ఎక్కువగా ఉండనున్నాయి. ఎస్ఎంఈ విభాగంలో కూడా మంచి వృద్ధి ఉంటుంది. ఈ ఏడాది కార్పొరేట్ రుణాలు పుంజుకుంటాయి. ఈ విభాగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. సిమెంట్, రోడ్స్, ఆటో, ఆటో కాంపోనెంట్, రెనివేబుల్ ఎనర్జీ, ఆయిల్ తదితర రంగాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయి’ అని తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరపడుతున్నాయని, రానున్న రోజుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అన్నారు. కొత్తగా 8,000 మందిని నియమిస్తున్నట్టు చెప్పారు. -
ఎస్బీఐ : కొత్త నోట్ల కోసం ఇంకా...
ఇండోర్: ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేసిన తర్వాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతూ వస్తోంది. 2000 రూపాయి నోటు నుంచి 500 రూపాయి నోట్లు, 200 రూపాయి నోట్లు, 50 రూపాయి నోట్లు, 20 రూపాయి నోట్లు, 10 రూపాయి నోట్లు ఇలా కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ కొత్త నోట్లను పాతనోట్లతో పోలిస్తే మరిన్ని భద్రతా పరమైన ఫీచర్లతో ప్రవేశపెడుతోంది. అయితే పాత నోట్లకు, కొత్త నోట్లకు సైజుల్లో మార్పులు ఉండటం వల్ల.. కొత్త నోట్లకు అనుకూలంగా బ్యాంక్‌లు ఏటీఎంలను మార్చాల్సి వస్తుంది. డిమానిటైజేషన్ పూర్తయి ఇప్పటికి 21 నెలల కావొస్తున్నా.. ఇంకా 18,315 ఏటీఎంలను రికాలిబ్రేట్ చేయాల్సి ఉందని దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ కోరిన మేరకు ఆర్టీఐ డేటాలో ఎస్బీఐ ఈ విషయం తెలిపింది. ఏటీఎం రికాలిబ్రేషన్( ఏటీఎం పునరుద్ధరణ) ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. కొత్త నోట్లు రూ.2000, రూ.500, రూ.200ను పంపిణీ చేయడానికి ఎన్ని ఏటీఎంలను రికాలిబ్రేట్ చేశారని చంద్రశేఖర్ ఎస్బీఐను ఆర్టీఐ ద్వారా కోరాడు. చంద్రశేఖరన్ ప్రశ్నకు ఆగస్టు 18న ఎస్బీఐ ఇచ్చిన సమాధానంలో... మొత్తం 59,521 ఏటీఎంలు ఉండగా, 41,386 ఏటీఎంలను రికాలిబ్రేట్ చేసినట్టు పేర్కొంది. ఈ ప్రక్రియకు మొత్తం రూ.22.50 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది. ఇంకా 18,135 ఏటీఎంలను రికాలిబ్రేట్ చేయాల్సి ఉందని, అవి ప్రస్తుతం కొత్త కరెన్సీ నోట్ల పంపిణీకి సిద్ధంగా లేవని చెప్పింది. కాగ, 2016 నవంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. -
దేశాభిమాన బ్రాండ్‌గా ఎస్బీఐ
ముంబై: దేశాభిమానాన్ని అత్యధికంగా ప్రతిబింబించే బ్రాండ్స్ జాబితాలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అగ్రస్థానంలో నిల్చింది. బ్రిటన్‌కి చెందిన ఆన్లైన్ మార్కెట్ రీసెర్చ్, డేటా అనలిటిక్స్ సంస్థ యూగవ్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 16 శాతం మంది.. ఈ విషయంలో ఎస్బీఐకి ఓటేశారు. ఇక ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, పతంజలి సంస్థ చెరి 8 శాతం ఓటింగ్‌తో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టెలికం సంస్థలు రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్ చెరి 6 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. రంగాల వారీగా చూస్తే అత్యధిక దేశాభిమాన బ్రాండ్స్‌తో ఆర్థిక రంగం అగ్రస్థానం దక్కించుకుంది. ఆటోమొబైల్, కన్జూమర్ గూడ్స్, ఫుడ్, టెలికం రంగాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 2 నుంచి 8 మధ్యలో.. మొత్తం 11 రంగాలు, 152 బ్రాండ్స్‌పై యూగవ్ ఈ సర్వే నిర్వహించింది. బ్యాంకుల పరిస్థితేమీ బాగులేదు: ఫిచ్ పేరుకుపోయిన మొండిబాకీల భారం, పేలవ పనితీరును అధిగమించి మూలధన పరిమాణాన్ని మెరుగుపర్చుకునే దాకా భారత బ్యాంకుల పరిస్థితి ప్రతికూలంగానే ఉండనుందని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. బ్యాంకింగ్ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ నెగిటివ్ రేటింగ్ తప్పదని విశ్లేషించింది. -
ఎస్బీఐ హెడ్ క్యాషియర్.. నిండా ముంచాడు
సాక్షి, కడప : ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో అతను ఉద్యోగి. హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న అతడు సొంత బ్యాంకుకే కన్నం వేశాడు. ఖాతాదారులు కుదవపెట్టిన నగలు, బ్యాంకులోని సొమ్ముతో ఉడాయించాడు. గత మార్చి నెలలో పరారైన ఆ కేటుగాడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాలాలి.. వైఎస్సార్ జిల్లా పొరుమామిళ్లలోని రంగసముద్రం ఎస్బీఐలో గురుమోహన్‌రెడ్డి అనే వ్యక్తిగా హెడ్ క్యాషియర్‌గా పనిచేశాడు. అతడు గత మార్చిలో బ్యాగు తీసుకొని బ్యాంకుకు వచ్చిన అతను.. బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన నగలు, డబ్బుతో ఉడాయించాడు. తాజాగా గురుమోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. అతని వద్ద నుంచి 56 లక్షల నగదు, 1.7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయానని, అందుకే బ్యాంకు సొమ్ముతో ఉడాయించానని నిందితుడు గురుమోహన్ విచారణలో వెల్లడించినట్టు వైఎస్సార్ జిల్లా ఓఎస్డీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. -
ముందుముందు మరిన్ని సవాళ్లే!
న్యూఢిల్లీ: బ్యాంకులకు రానున్న సంవత్సరాలు సవాళ్లమయమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2017–18 వార్షిక నివేదిక పేర్కొంది. మొండిబాకాయిల సమస్యల పరిష్కారమే కాకుండా ఇతర అంశాలపైనా దృష్టిపెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. మోసాలు, సైబర్ సెక్యూరిటీ, పాలనా వ్యవహారాల్లో పటిష్టత, వినియోగ సేవల పెంపు, మానవ వనరులు వంటివి ఇందులో ఉన్నాయి. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ♦ నిర్వహణాపరమైన అంశాలు క్లిష్టంగా మారాయి. ఆయా అంశాలపై రానున్న కాలంలో మరింత దృష్టి పెట్టాలి. ♦ మొండిబకాయిలు, ఒత్తిడిలో ఉన్న రుణ వసూళ్ల సమస్యలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయి. అయితే తగిన ఫలితాలను చూడ్డానికి మరింత సమయం పడుతుంది. ♦ ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం తాజా మూలధనం అందించడం సానకూల అంశమే. అయితే దీనివల్ల ఎంత ప్రయోజనం లభిస్తుందన్న అంశం పలు అంశాల ప్రాతిపదికగా ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకోవడం, సాంకేతికత వినియోగం, ఎన్పీఏల పరిష్కారం వంటివి ఇక్కడ పరిశీలనార్హం. ♦ 2017–18 బ్యాంకింగ్ నికర లాభాలకు సంబంధించి ఎంతో క్లిష్టమైనది. ప్రొవిజనింగ్, గవర్నమెంట్ బాండ్లపై మార్క్ టూ మార్కెట్ నష్టాలు పెరగడం, ఉద్యోగులకు వేతనాలు వంటి సవాళ్లను బ్యాంకింగ్ ఎదుర్కొంది. పలు బ్యాంకులు ఆర్బీఐ దిద్దుబాటు చర్యల్లో (పీసీఏ)కి వెళ్లడం ఇక్కడ చర్చించుకోవాల్సిన మరో అంశం. ♦ ఇక వృద్ధి బాగున్నప్పటికీ, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి ఉంది. ముఖ్యంగా ‘వాణిజ్య యుద్ధం’ గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఈ సమస్య కొనసాగే అవకాశం ఉంది. ఆయా అంశాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు తమ విదేశీ వాణిజ్య వ్యూహాన్ని ‘ఇబ్బందులకు’ లోబడి పునఃరూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. భారత్ బ్యాంకులూ ఇందుకు అతీతం కాదు. ♦ వచ్చే రెండేళ్లలో 10 నుంచి 12 శాతం రుణ వృద్ధి నమోదయ్యేలా ఎస్బీఐ ఒక వ్యూహాన్ని రూపొందిస్తోంది. ♦ బ్యాంకింగ్ పరిశ్రమలో గత ఏడాది ఎదురయిన అనుభవాల దృష్ట్యా, అంతర్గత ఆడిట్, నియంత్రణ వ్యవస్థలను మెరుగుపరచుకోవడంపై ఎస్బీఐ దృష్టి సారిస్తోంది. ♦ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు దాదాపు రూ.11.5 లక్షల కోట్ల వరకూ ఉన్నాయి. ఈ బ్యాంక్‌లు ఇచ్చిన మొత్తం రుణాల్లో ఇది దాదాపు 14 శాతానికి సమానం. బడా రుణ గ్రహీతల రుణాలకు ఆర్బీఐ ముసాయిదా! కాగా, బడా రుణ గ్రహీతలకు రుణ మంజూరీల విషయంలో ప్రమాణాల పటిష్టతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి సోమవారం ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. -
ఎస్బీఐ నష్టాలు రూ.7,718 కోట్లు
న్యూఢిల్లీ: మొండి బకాయిలకు భారీ కేటాయింపుల కారణంగా భారత దేశ అతి పెద్ద బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రికార్డ్ స్థాయి నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో రూ.7,718 కోట్ల నికర నష్టాలు (స్డాండెలోన్) వచ్చాయని ఎస్బీఐ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,815 కోట్ల నికర లాభం వచ్చిందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వివరించారు. సీక్వెన్షియల్‌గా చూసినా నికర నష్టాలు పెరిగాయని, గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,416 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వివరించారు. ఇటీవలే పీఎన్బీ రూ.13,417 కోట్ల నికర నష్టాలు ప్రకటించింది. ఆ బ్యాంక్ తర్వాత దేశంలో అత్యధికంగా నష్టాలు ఎస్బీఐకే వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నిర్వహణ లాభం, నికర వడ్డీ ఆదాయం తగ్గగా, వడ్డీయేతర ఆదాయం మాత్రం మెరుగుపడింది. ఆర్బీఐ గత ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన కొత్త మార్గదర్శకాల కారణంగా ఒత్తిడి రంగాలకు ఇచ్చిన రుణాలకు కేటాయింపులు అధిక రేట్ల ప్రకారం కేటాయించాల్సి వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు ఎస్బీఐ మరింత పటిష్టం మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా ఉండడం, పెట్టుబడి ఆదాయం తక్కువగా ఉండటం లాభాలపై ప్రభావం చూపాయని రజనీష్ కుమార్ చెప్పారు. వీటితో పాటు ట్రేడింగ్ నష్టాలు పెరగడం, వేతన సవరణ కోసం కూడా అధిక కేటాయింపులు జరపడం, బాండ్ల రాబడులు పెరగడం వల్ల మార్క్–టు–మార్కెట్ నష్టాలు పెరగడం వల్ల కూడా గత క్యూ4లో భారీగానష్టాలు వచ్చాయని వివరించారు. ఈ మార్క్–టు–మార్కెట్ నష్టాలను తర్వాతి నాలుగు క్వార్టర్లలో సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, మొత్తం నష్టాలను గత క్యూ4లోనే చూపించామని చెప్పారు. గత మూడేళ్లు ఎస్బీఐకి సమస్యాత్మకంగానే ఉందని, రెండేళ్ల కంటే ఇప్పుడు ఎస్బీఐ మరింత పటిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. పుష్కలంగా మూలధన నిధులు మూలధన నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. కామన్ ఈక్విటీ టైర్ వన్ మూలధనం ఈ ఏడాది మార్చి నాటికి 0.27% వృద్ధితో 9.68 శాతానికి పెరిగిందని వివరించింది. ఇది ఆశావహ సంవత్సరం అన్నారు. 2020 బ్యాంక్‌కు సంతోష సంవత్సరం అవుతుందని విశ్లేషించారు. భారీ నష్టాలున్నా...లాభపడిన షేర్ భారీ నష్టాలు ప్రకటించినప్పటికీ, ఎస్బీఐ షేర్ జోరుగా పెరిగింది. స్టాక్ సూచీలు ఒడిదుడుకులమయంగా సాగినప్పటికీ, ఫలితాల అనంతరం ఎస్బీఐ షేర్ దూసుకుపోయింది. బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ 3.7 శాతం లాభంతో రూ. 254 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 6 శాతం లాభంతో రూ.260ను తాకింది. షేర్ ధర జోరుగా పెరగడంతో బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.8,078 కోట్లు పెరిగి రూ. 2,26,818 కోట్లకు పెరిగింది. ఎస్బీఐకి అధ్వాన పరిస్థితులు ముగిసినట్లేనని ఇన్వెస్టర్లు భావించారని, దీంతో షేర్ ధర పెరిగిందని ఐడీబీఐ క్యాపిటల్ వ్యాఖ్యానించింది. ఇతర బ్యాంక్‌ల ఫలితాల సరళిని బట్టి చూస్తే, ఎస్బీఐ ఇంకా అధిక నష్టాలు ప్రకటించగలదన్న అంచనాలున్నాయని, కానీ ఆ అంచనాల కంటే రూ.2,000 కోట్ల తక్కువే నష్టాలను ప్రకటించిందని వివరించింది. భూషణ్ స్టీల్ డీల్ వల్ల లాభమే! తమ అనుబంధ సంస్థల్లో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ కార్డ్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ల్లో వాటాలను విక్రయించనున్నామని కుమార్ తెలిపారు. కాగా భూషణ్ స్టీల్‌ను టాటా స్టీల్ కొనుగోలు వల్ల ఎస్బీఐకి ప్రయోజనం కలుగనున్నదని విశ్లేషణ. ఎస్బీఐ నికర లాభం రూ.1,300 కోట్ల మేర పెరుగుతాయని. ఎన్పీఏలు రూ.11,000 కోట్ల మేర తగ్గుతాయని అంచనా. బ్యాంక్ ఫలితాలు ముఖ్యాంశాలు... ♦ 2016–17 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.10,993 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 119 శాతం పెరిగి రూ.24,080 కోట్లకు ఎగిశాయి. ♦ మొత్తం కేటాయింపులు రూ.11,740 కోట్ల నుంచి రూ.28,096 కోట్లకు పెరిగాయి. ♦ ఆదాయం రూ.57,720 కోట్ల నుంచి రూ.68,436 కోట్లకు పెరిగింది. ♦ నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.19,974 కోట్లకు పెరిగింది. దేశీయ నికర వడ్డీ మార్జిన్ మాత్రం 0.26 శాతం తగ్గి 2.67 శాతానికి చేరింది. ♦ ఫీజు ఆదాయం 13 శాతం పెరగడంతో ఇతర ఆదాయం 2.2 శాతం వృద్ధితో రూ.12,222 కోట్లకు పెరిగింది. ♦ ప్రొవిజన్ కవరేజ్ రేషియో 5 శాతం పెరిగి 66.17 శాతానికి పెరిగింది. బ్యాంకింగ్ రంగంలో ఉత్తమ ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఉన్న బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి. ♦ రద్దు చేసిన రుణాలకు సంబంధించిన రికవరీలు 21 శాతం వృద్ధి చెందాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో.. ♦ 2016–17లో రూ.10,484 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.6,547 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ♦ఇదే కాలంలో ఆదాయం మొత్తం రూ.2,10,979 కోట్ల నుంచి రూ.2,59,664 కోట్లకు పెరిగింది. ♦ గత ఏడాది మార్చినాటికి రూ.1,12,343 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,23,427 కోట్లకు పెరిగాయి. అలాగే నికర మొండి బకాయిలు రూ.59,277 కోట్ల నుంచి రూ.1,10,855 కోట్లకు పెరిగాయి. ♦ శాతం పరంగా చూస్తే, గత ఏడాది మార్చినాటికి 6.90 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 10.91 శాతానికి పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, అర శాతమే పెరిగాయి. అలాగే నికర మొండి బకాయిలు 3.71 శాతం నుంచి 5.73 శాతానికి పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, 0.12 శాతమే పెరుగుదల ఉంది. -
రోజుకు రూ.2,000 విత్‌డ్రా చేసుకోండి
న్యూఢిల్లీ: కరెన్సీ కొరత నేపథ్యంలో దేశీ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు ఒక వెసులుబాటు కల్పించింది. చిన్న చిన్న పట్టణాల్లోని కస్టమర్లు రిటైల్ ఔట్‌లెట్స్‌లోని పీవోఎస్ మెషీన్ల ద్వారా రోజుకు రూ.2,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని, దీనికి ఎలాంటి చార్జీలూ ఉండవని తెలియజేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. టైర్–1, టైర్–2 పట్టణాల్లోని రిటైల్ ఔట్లెట్ల వద్ద ఉన్న పీవోఎస్ మెషీన్ల నుంచి రోజుకు ఒక కార్డు ద్వారా రూ.1,000 మాత్రమే విత్‌డ్రా చేసుకోగలం. అదే టైర్–3 పట్టణాల్లో అయితే రూ.2,000 వరకు తీసుకోవచ్చు. ‘టైర్–3 నుంచి టైర్–6 పట్టణాల్లోని కస్టమర్లు ఎస్బీఐ, మరే ఇతర బ్యాంక్ డెబిట్ కార్డుతోనైనా రూ.2,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే టైర్–1, టైర్–2 పట్టణాల్లోని కస్టమర్లు రూ.1,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి చార్జీలు ఉండవు’ అని ఎస్బీఐ డీఎండీ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) నీరజ్ వ్యాస్ ట్వీట్ చేశారు. కాగా ఎస్బీఐకి మొత్తంగా 6.08 లక్షల పీవోఎస్ మెషీన్లు ఉన్నాయి. ఇందులో 4.78 లక్షల మెషీన్లు నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. -
‘ఐవీఆర్సీఎల్’ దివాలా ప్రక్రియకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: తమ నుంచి తీసుకున్న రూ.604 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ లిమిటెడ్ విఫలమైన నేపథ్యంలో ఆ సంస్థ దివాలా ప్రక్రియను ప్రారంభించాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన కంపెనీ పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) స్పందించింది. ఐవీఆర్సీఎల్ లిమిటెడ్ దివాలా ప్రక్రియ (సీఐఆర్‌పీ)ను ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా దివాలా పరిష్కారదారు (ఐఆర్పీ)గా కోల్‌కతాకు చెందిన సుతను సిన్హాను నియమించింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ జ్యుడీషియల్ సభ్యులు విత్తనాల రాజేశ్వరరావు, సాంకేతిక సభ్యులు రవి కుమార్ దురైస్వామిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తన ఉత్తర్వుల్లో ధర్మాసనం ఐవీఆర్‌సీఎల్‌కు పలు ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్‌పీకి సహకరించాలని ఆదేశం దివాలా ప్రక్రియ విషయంలో ఐఆర్‌పీకి పూర్తిస్థాయిలో సహకరించాలని ఐవీఆర్‌సీఎల్‌కు ధర్మాసనం తేల్చి చెప్పింది. అన్ని రికార్డులను ఐఆర్‌పీకి అందుబాటులో ఉంచాలంది. అంతేకాక కంపెనీ ఆస్తులను అమ్మడం గాని, అన్యాక్రాంతం చేయడం గాని చేయరాదంది. అంతేకాక తాకట్టు పెట్టిన ఆస్తులు ఏవైనా ఉంటే, ఆ ఆస్తులను అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే దివాలా ప్రక్రియ ప్రారంభం కాగానే ఆ విషయాన్ని బహిరంగంగా తెలియజేయాలని ఐఆర్‌పీని ధర్మాసనం ఆదేశించింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) వెబ్సైట్లో ఉంచడంతో పాటు, పత్రికల్లో సైతం ప్రకటనలు ఇవ్వాలంది. అలాగే ఐవీఆర్సీఎల్ వెబ్సైట్లో కూడా దివాలా ప్రక్రియ గురించి తెలియజేయాలని ఆ సంస్థను ఆదేశించింది. దివాలా ప్రక్రియకు సంబంధించి అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఐఆర్‌పీని ఆదేశించింది. మొత్తం ప్రక్రియను 180 రోజుల్లో పూర్తి చేయాలంది. అప్పటి లోపు ఇప్పటి వరకు ఏం చేశారో తెలియజేస్తూ పూర్తి వివరాలతో ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ఐఆర్‌పీకి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. 2014, 15 సంవత్సరాల్లో ఎస్బీఐ 6 ఖాతాల కింద ఐవీఆర్సీఎల్ లిమిటెడ్‌కు రూ.898.49 కోట్ల మేర రుణం మంజూరు చేసింది. అయితే ఇందులో కొంత మొత్తం చెల్లించిన ఐవీఆర్సీఎల్, గత ఏడాది అక్టోబర్ నాటికి రూ.604.15 కోట్ల మేర బకాయి పడింది. -
ఎస్బీఐ రుణ రేట్లు తగ్గాయ్!
ముంబై: ఖాతాదారులకు కొత్త సంవత్సర కానుకగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బేస్ రేటు, బీపీఎల్ఆర్ను 0.3 శాతం మేర తగ్గించింది. దీంతో పాత వడ్డీ రేట్ల విధానంలో రుణాలు తీసుకున్న 80 లక్షల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత కస్టమర్లకు బేస్ రేటును 8.95 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (బీపీఎల్ఆర్) 13.70% నుంచి 13.40%కి తగ్గించింది. అయితే, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత వడ్డీ రేటును (ఎంసీఎల్ఆర్) మాత్రం యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం ఏడాది వ్యవధి ఎంసీఎల్ఆర్ 7.95%గా ఉంది. దీన్ని గానీ మరింతగా తగ్గించి ఉంటే రుణగ్రహీతలందరికీ ప్రయోజనం చేకూరేది. కొత్త రేట్లు జనవరి 1 నుంచే వర్తింపచేస్తున్నట్లు ఎస్బీఐ వివరించింది. ‘డిసెంబర్ ఆఖరు వారంలో వడ్డీ రేట్లను సమీక్షించాం. మా డిపాజిట్ రేట్లను బట్టి .. బేస్ రేటును 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి 8.65 శాతానికి కుదించాం. బేస్‌రేటుతో వ్యత్యాసం భారీగా ఉన్న నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ను గతంలోనే తగ్గించాం. ఇది మా ఖాతాదారులకు కొత్త సంవత్సరం కానుక’ అని రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ పి.కె. గుప్తా తెలిపారు. ఇటీవల తగ్గిన పాలసీ రేట్ల ప్రయోజనాలను ఖాతాదారులకు బదలాయించేందుకు తాజా సమీక్ష తోడ్పడగలదని వివరించారు. గృహ, విద్యా రుణాలు తీసుకున్న పలువురు ఖాతాదారులకు ఇది ఉపయోగపడనుంది. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు మార్చి దాకా .. గృహ రుణం ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఆఫర్‌ను ఈ ఏడాది మార్చి దాకా పొడిగిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. కొత్తగా గృహ రుణం తీసుకునే వారు, వేరే బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను ఎస్బీఐకి బదలాయించుకోవాలని అనుకుంటున్న వారు ఈ ప్రయోజనాలు అందుకోవచ్చు. సుమారు 80 లక్షల మంది ఖాతాదారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఎంసీఎల్ఆర్ విధానానికి మళ్లకుండా ఇంకా పాత వడ్డీ రేట్ల విధానంలోనే కొనసాగుతున్నారు. వీరికి తాజా బేస్ రేటు తగ్గింపు ప్రయోజనం చేకూర్చనుంది. -
ఎస్బీఐ లాభం రూ.1,840 కోట్లు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,840 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఈ బ్యాంక్ కేవలం రూ.21 కోట్ల నికర లాభాన్నే సాధించి ంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయం కారణంగా ఇతర ఆదాయం భారీగా పెరగడం, నిర్వహణ లాభం కూడా పెరగడం, నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటంతో పాటు రూ.720 కోట్ల ట్యాక్స్ రైట్‌బ్యాక్ కారణంగా నికర లాభం ఈ స్థాయిలో ఉందని ఎస్బీఐ తెలిపింది. ఇక స్టాండ్ అలోన్ పరంగా చూస్తే నికర లాభం తగ్గిందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. గత క్యూ2లో రూ.2,538 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 38 శాతం క్షీణించి రూ.1,582 కోట్లకు తగ్గిందని వివరించారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన స్టాండోలోన్ నికర లాభం 21 శాతం క్షీణించిందని తెలిపారు. మొండి బకాయిలకు భారీ కేటాయింపులు కారణంగా నికర లాభం తగ్గిందని పేర్కొన్నారు. నిర్వహణ లాభం 30 శాతం అప్... గత క్యూ2లో రూ.50,743 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం(స్టాండోలోన్) ఈ క్యూ2లో రూ.65,430 కోట్లకు ఎగసిందని రజనీష్ తెలిపారు. మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్) రూ.72,918 కోట్ల నుంచి రూ.74,949 కోట్లకు పెరిగిందని వివరించారు. ఇతర ఆదాయం 28 శాతం వృద్ధితో రూ.10,580 కోట్లకు, నిర్వహణ లాభం 30 శాతం వృద్ధితో రూ.14,563 కోట్లకు ఎగసిందని, నికర వడ్డీ ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.18,586 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.789 కోట్ల పన్ను వ్యయాలు ఉండగా, ఈ క్యూ2లో రూ.720 కోట్ల ట్యాక్స్ రైట్‌బ్యాక్ ఉందని వివరించారు. ఎస్బీఐ లైఫ్ వాటా విక్రయం వల్ల రూ.5,436 కోట్లు వచ్చాయని వివరించారు. మెరుగుపడిన రుణ నాణ్యత.. గత క్యూ2లో రూ.1,05,783 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.1,86,115 కోట్లకు పెరిగాయని రజనీష్ కుమార్ పేర్కొన్నారు. అలాగే నికర మొండి బకాయిలు రూ.60,013 కోట్ల నుంచి రూ.97,896 కోట్లకు పెరిగాయని వివరించారు. శాతం పరంగా చూస్తే స్థూల మొండి బకాయిలు 7.14 శాతం నుంచి 9.83 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 4.19 శాతం నుంచి 5.43 శాతానికి పెరిగాయని వెల్లడించారు. అయితే సీక్వెన్షియల్ పరంగా చూస్తే మొండి బకాయిలు తగ్గాయని, రుణ నాణ్యత మెరుగుపడిందని రజనీష్ వివరించారు. ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 9.97 శాతంగా ఉండగా, ఈ క్యూ2లో 9.83 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 5.97 శాతం నుంచి 5.43 శాతానికి తగ్గాయి. ‘మొండి’ కేటాయింపులు రెట్టింపు... మొండి బకాయిలకు కేటాయింపులు రెట్టింపయ్యాయని రజనీష్ కుమార్ చెప్పారు. గత క్యూ2లో రూ.7,670 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ2లో 16,715 కోట్లకు ఎగిశాయని వివరించారు. మొండి బకాయిలకు కేటాయింపులు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 38 శాతం, ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 118 శాతం చొప్పున పెరిగాయని పేర్కొన్నారు. మొండి బకాయిలతో పాటు ఇతర అంశాలను కూడా కలుపుకొని మొత్తం కేటాయింపులు142 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూస్తే 114 శాతం) వృద్ధితో రూ.19,137 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఈ క్యూ2లో రుణ వృద్ధి అంతంత మాత్రంగానే ఉందని, రుణాలు 1 శాతం వృద్ధితో రూ.18.92 లక్షల కోట్లకు, డిపాజిట్లు 10 శాతం వృద్ధితో రూ.26.23 లక్షల కోట్లకు ఎగిశాయని వివరించారు. ఎస్బీఐ షేర్ 6 శాతం అప్ కన్సాలిడేటెడ్ నికర లాభం భారీగా పెరగడం, సీక్వెన్షియల్‌గా చూస్తే రుణ నాణ్యత మెరుగుపడటంతో బీఎస్ఈలో శుక్రవారం ఎస్బీఐ షేర్ జోరుగా పెరిగింది. 6.2 శాతం లాభంతో రూ.333 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి రూ.231గా, గరిష్ట స్థాయి రూ.352గా ఉన్నాయి. -
ఎస్బీఐ రుణ, డిపాజిట్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ రేటును, రిటైల్ టర్మ్ డిపాజిట్ రేట్లను తగ్గించింది. బుధవారం నుంచే కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ముఖ్యాంశాలు చూస్తే... ►వివిధ మెచ్యూరిటీలపై మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణరేట్లను స్వల్పంగా (ఎంసీఎల్ఆర్) 5 బేసి స్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) తగ్గించింది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ను తగ్గించడం 10 నెలల్లో ఇదే తొలిసారి. పెద్ద నోట్ల రద్దు, భారీ డిపాజిట్ల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ఎంసీఎల్ఆర్ రేట్లను ఎస్బీఐ తగ్గించింది. ►ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 8 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గింది. ► రిటైల్ టర్మ్ డిపాజిట్ రేట్లను సైతం పావు శాతం తగ్గించింది. ఆర్బీఐ ఒత్తిడి వల్లే...: 2015 జనవరి నుంచీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) రేటును దాదాపు 2 శాతం తగ్గిస్తే, బ్యాంకులు మాత్రం ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు యథాతథంగా అందించడం లేదన్న విమర్శల నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. తమపై పడే తాజా నిధుల సమీకరణ భారాన్ని బేరీజు వేసుకుంటూ, దాదాపు నెలవారీగా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ను సమీక్షిస్తున్నాయి. గత ఏడాది ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల కస్టమర్లకు పాలసీ రేట్ల ప్రయోజన బదలాయింపు కొంతలో కొంత వేగవంతమైంది. మూడేళ్ల నుంచీ మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం ఇచ్చే క్రమంలో రుణ వృద్ధి, ప్రైవేటు పెట్టుబడులు పెరగాలని ఆర్బీఐ సూచిస్తోంది. ఇందుకు బ్యాంకింగ్ రుణ రేట్ల తగ్గింపు అవసరమని పేర్కొంటోంది. -
టెక్నాలజీలోనూ సిబ్బంది ముందుండాలి: ఎస్బీఐ చీఫ్
ముంబై: లక్షలమంది కస్టమర్లు సిబ్బందితో దేశంలో దిగ్గజ బ్యాంకుగా నిలిచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను డిజిటలైజేషన్, టెక్నాలజీ వినియోగంలోకూడా ముందు వరుసలో నిలపాలని బ్యాంక్ చీఫ్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రజనీష్ కుమార్ ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన బ్యాంక్ సిబ్బందికి లేఖ రాశారు. టెక్నాలజీ వల్ల బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. కస్టమర్లకు కొత్త బ్యాంకింగ్ సేవలను అందించేందుకు టెక్నాలజీలకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలని అప్పుడే పోటీలో నిలువగలమని తెలిపారు. వినియోగదారులతో మర్యాదగా, స్నేహపూరితంగా మెలగాలని సూచించారు. -
పేమెంట్స్ బ్యాంకు ప్రక్రియ వేగవంతం
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి చిన్న స్థాయి పేమెంట్స్ బ్యాంకును ఏర్పాటు చేయటానికి ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ రంగంలో దిగ్గజ స్థాయి బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ... చిన్న పేమెంట్స్ బ్యాంకు కోసం రిలయన్స్‌తో కలిసి ఇప్పటికే దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలో రిలయన్స్‌కు 70 శాతం వాటా, ఎస్బీఐకి 30 శాతం వాటా ఉంటాయి. ‘‘చెల్లింపుల బ్యాంకు ఏర్పాటుకోసం నియంత్రణ సంస్థల పరమైన విధివిధానాలను పూర్తిచేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కార్యకలాపాల ప్రారంభానికి ఇంకా నిర్దిష్ట గడువేదీ విధించుకోలేదు’’ అని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అప్పట్లో చెల్లింపుల బ్యాంకు ఏర్పాటుకు 11 సంస్థలు లైసెన్సులు పొందగా.. మూడు సంస్థలు లైసెన్సుల్ని తిరిగి ఇచ్చేశాయి. ఎయిర్టెల్, పేటీఎం సంస్థలు ఇప్పటికే పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించాయి కూడా. డిపాజిట్లు తీసుకోవటంతో పాటు, పేమెంట్ సర్వీసులకు మాత్రమే ఈ బ్యాంకులు పరిమితమవుతాయి. రుణాలివ్వడానికి ఉండదు. -
వడ్డీలు తగ్గుతున్నాయ్... ఏం చేద్దాం!
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. కొద్ది నెలల కిందటే కోటి రూపాయల లోపు నగదు ఉండే పొదుపు ఖాతాలపై వడ్డీరేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించింది. ఆరేళ్లుగా 4 శాతంగా ఉన్న ఈ రేటును దిగ్గజ బ్యాంకే తగ్గించడంతో... మెజారిటీ బ్యాంకులూ ఇదే విధానాన్ని అనుసరించాయి. నిజానికి గడచిన మూడేళ్ల నుంచీ వడ్డీరేట్లు తగ్గుతూ వస్తున్నాయి. సేవింగ్స్ ఖాతాలపైనే కాదు. వివిధ కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే రాబడి కూడా తగ్గిపోతోంది. మరి ఇలా తగ్గిపోవటానికి కారణాలేంటో తెలుసా? ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా... 2014 అక్టోబర్ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై తీసుకునే వడ్డీ రేటు ‘రెపో’ను ఏకంగా ఏడు సార్లు తగ్గించింది. దీంతో రెపో రేటు ప్రస్తుతం 6.25 శాతానికి దిగివచ్చింది. ఆర్బీఐ ఈ రేటును తగ్గిస్తే, ఈ ప్రయోజనాన్ని తన వద్ద రుణాలు తీసుకునేవారికి కూడా బ్యాంకులు వర్తింపజేయాలి. దీనితో వాటికి వచ్చే రాబడి తగ్గిపోతుంది. వాటికి రాబడి తగ్గుతుంది కాబట్టి, తమ వద్ద డిపాజిట్ చేసిన వారికీ తక్కువ వడ్డీ రేటే ఆఫర్ చేస్తాయి. బ్యాంకులు ఇలా వడ్డీ రేట్లు తగ్గిస్తుండటంతో పొదుపు చేసేవారు పోస్టాఫీసులు, పీపీఎఫ్ల వంటి ఇతర సాధనాలకు మళ్లుతున్న నేపథ్యంలో, అక్కడ కూడా డిపాజిట్లపై వడ్డీ రేటు కోతకు ప్రభుత్వం పూనుకుంది. ఏతావాతా కేవలం వడ్డీలపై ఆధారపడి బ్రతుకుతున్న వారికి ఈ పరిణామమంతా ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయాలేవైనా ఉన్నాయా? అన్నదే ఇపుడు అందరినీ ఆలోచింపజేస్తున్న అంశం. వాటిపై అవగాహన కల్పించడానికే ఈ ప్రయత్నం. చిన్న బ్యాంకులను చూడండి... పెద్ద బ్యాంకులు రేటు తగ్గిస్తుంటే, పోటీని ఎదుర్కొనడానికి చిన్న చిన్న బ్యాంకులు మాత్రం కొన్ని షరతులకు లోబడి పొదుపు ఖాతాలపై ఇంకా అధిక రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు డీబీఎస్‌ను చూస్తే, సగటు రోజు వారీ బ్యాలెన్స్ రూ.లక్ష వరకూ కొనసాగించే సేవింగ్స్ ఖాతాపై 7 శాతం రిటర్న్స్‌ను ఆఫర్ చేస్తోంది.రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ ఉంటే గనక ఈ రేటు 6 శాతంగా ఉంది. రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ సగటు రోజూవారీ బ్యాలెన్స్‌పై రేటు 5 శాతంగా ఉంది. మీకు డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంచుకుంటూ, మంచి వడ్డీ కావాలనుకుంటే, ఈ బ్యాంక్ తరహా పొదుపు ఖాతాను ఎంపిక చేసుకోవచ్చు. లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే... చాలా స్వల్ప కాలం కోసం పెట్టుబడులు పెట్టేందుకు లిక్విడ్ ఫండ్స్ అనువైనవి. అంటే మూడు నెలలకన్నా మించని కాలానికన్న మాట. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇవి కూడా ఒక రకం. ఈ ఫండ్స్ స్వల్పకాలిక డెట్ పేపర్లపై ఇన్వెస్ట్ చేస్తాయి. దీంతో ఒడిదుడుకులు, రిస్క్ తక్కువగా ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వార్షిక రాబడులు దాదాపు 7 శాతంగా ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్ అన్నవి ప్రధానంగా సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, ట్రెజరీ బిల్లులు, కర్మ్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. 6 శాతం వడ్డీ రేటు వచ్చినా గానీ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు వాటిపై డివిడెండ్ పంపిణీ పన్ను కింద 28.3 శాతాన్ని చెల్లిస్తుంటాయి. పన్ను అనంతరం రాబడులను చూసుకుంటే 4.3 శాతం గిడుతుంది. ఒకవేళ ఫండ్ మేనేజర్ మరింత రాబడులను తీసుకురాగలిగితే, ఇన్వెస్టర్లకూ అదే స్థాయిలో రాబడులు వస్తాయి. ఎటువంటి ఎగ్జిట్ రుసుము భారం ఉండదు. విత్‌డ్రాయెల్స్ కోరుకుంటే ఒకటి, రెండు రోజుల్లో ఆ పనైపోతుంది. 2017 జూన్ నెలలో క్రిసిల్ ఏఎమ్ఎఫ్ఐ లిక్విడ్ ఫండ్ ఇండెక్స్‌ను పరిశీలిస్తే, ఏడాదిలో రిటర్న్స్ రేటు 6.83 శాతంగా ఉంది. అంతక్రితం మూడేళ్లు 8.37 శాతంకాగా, పదేళ్ల కాలంలో సగటు 7.76 శాతంగా ఉంది. అక్రూయల్ ఫండ్స్‌లో పెడితే... పదవీ విరమణ తీసుకున్న వారు పన్ను అనంతరం అధిక ఆదాయం సంపాదించాలనుకుంటే అక్రూయల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చుననేది ఫైనాన్షియల్ అడ్వైజర్ల సూచన. 20–30 శాతం పన్ను పరిధిలో ఉన్న విశ్రాంత ఉద్యోగులకు ఈ ఫండ్స్ అనువైనవి. అదే 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారు, ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేని వారికి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు అనుకూలమేనన్నది వారి సూచన. అందుకే 20–30 శాతం పన్ను పరిధిలోని వారు అదనపు ఆదాయం కోసం అక్రూయల్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ ఫండ్‌లో ఏక మొత్తంగా ఇన్వెస్ట్ చేసి అదే సమయంలో క్రమానుగత ఉపసంహరణ విధానం (ఎస్‌డబ్ల్యూపీ) సెలక్ట్ చేసుకుటే సరిపోతుంది. దీంతో మీ పెట్టుబడిపై రాబడులను ఎప్పటికప్పుడు ఎస్‌డబ్ల్యూపీ ద్వారా బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. అసలు మొత్తాన్ని కదిలించరు. దీంతో ఇన్వెస్టర్‌కు క్రమం తప్పకుండా అదనపు ఆదాయం లభిస్తుంటుంది. అదే సమయంలో బ్యాంకు ఎఫ్‌డీతో పోలిస్తే పన్ను కూడా తక్కువే. కేవలం లాభంపైనే పన్ను పడుతుంది. కార్పొరేట్ డిపాజిట్లు.. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఒకటి నుంచి ఐదేళ్ల కాలానికి ఈ డిపాజిట్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లకన్నా అధిక వడ్డీరేటు గిట్టుబాటు కావటమే కాకుండా... సీనియర్ సిటిజన్ల విషయంలో మరిన్ని ప్రోత్సాహకాలూ అందుతున్నాయి. అయితే మీరు కార్పొరేట్ డిపాజిట్లకు వెళ్లేముందు ఆ సంస్థకు రేటింగ్ ఎంతన్నది మాత్రం తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది. ‘ఏఏఏ’ లేదా ‘ఏఏ’ రేటింగ్ కంపెనీలనే డిపాజిట్లకు ఎంచుకోవాలి. తక్కువ రేటున్న కంపెనీలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంది. నెలవారీ ఆదాయ పథకాలు... ఇవి ఒకరకమైన బ్యాలెన్స్డ్ (సమతౌల్య) మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. డెట్, ఈక్విటీ సెక్యూరిటీల్లో కలగలిపి ఇన్వెస్ట్ చేస్తాయి. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదనుకునే యువ ఇన్వెస్టర్లకు ఇవి సానుకూలం. దాదాపు 10 శాతం రిటర్న్స్ వీటి ప్రత్యేకత. 2017 జూన్ క్రిసిల్ యాఫీ డెట్ ఫండ్ ఇండెక్స్ ప్రకారం, ఏడాదికి 13.79 శాతం, మూడేళ్లకు 10.65 శాతం, ఐదేళ్లకు 11.26 శాతం, పదేళ్లకు 9.80 శాతం ఈ కేటగిరీలో రిటర్న్స్ లభించాయి. సిప్ ద్వారా ఈ పథకాల్లో పెట్టుబడులు మంచిది. డెట్ ఫండ్స్ తరహాలోనే ఎంఐపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లోనూ పన్ను భారాలు ఉంటాయి. పోస్టాఫీసు పథకాలు... డిజిటల్ యుగంలో పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్మెంట్ పట్ల ఆకర్షణ కొంత తగ్గినప్పటికీ, విశ్వసనీయ ఆర్థిక సేవలను మనం ఇక్కడ నుంచి పొందవచ్చు. ఐదేళ్ల కాలపరిమితి డిపాజిట్‌పై 7.7 శాతం వార్షిక వడ్డీ ఇక్కడ లభిస్తోంది. సీనియర్ సిటిజన్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలకు 8.4 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలూ లభిస్తున్నాయి. చిన్న పొదుపు పథకాలు ఈ పొదుపు పథకాల నుంచి బ్యాంకుల కన్నా మంచి వడ్డీ రేటు ను పొందవచ్చు. పబ్లిక్ ప్రావిడెం ట్ ఫండ్ (పీపీఎఫ్) నుంచి 7.8% వడ్డీ లభిస్తోంది. పన్ను ప్రయోజ నాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లకు ఇది అత్యుత్తమ సాధ నమని నిపుణులు అంటున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8శాతం బాండ్ దాదాపు 2003 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8 శాతం బాండ్ అమల్లో ఉంది. వార్షికంగా 8 శాతం రిటర్న్స్ ఇచ్చే ఈ బాండ్ ఆరేళ్ల కాలానికి వర్తిస్తుంది. మార్కెట్లో ట్రేడ్ కాదు. బాండ్‌పై వచ్చే ఆదాయంపై శ్లాబ్ మేరకు పన్ను విధించడం జరుగుతుంది. అయితే సురక్షిత బాండ్ ఇన్వెస్ట్మెంట్గా దీనికి పేరుంది. దీర్ఘకాలానికి ఉద్దేశించిన ఫండ్ ఇది. రూ.1,000 కనీస మొత్తంతో ట్రేడింగ్ అకౌంట్లు లేదా జాతీయ బ్యాంకుల ద్వారా ఈ బాండ్లను పొందవచ్చు. పేమెంట్ బ్యాంకులు... ఇవి ఇటీవలే ప్రారంభమైన మొబైల్ పేమెంట్ బ్యాంకులు. డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. కస్టమర్లు తమ మొబైల్ నెంబర్‌ను వినియోగించుకుని కొత్త అకౌంట్లను సృష్టించుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. తమ అకౌంట్లకు సంబంధించి రూ. లక్ష వ్యక్తిగత ప్రమాద బీమానూ పొందవచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్స్... స్వల్పకాలం నుంచి దీర్ఘకాలం వరకూ డిపాజిట్లు పెట్టేందుకు వీలైన వివిధ డెట్ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ డిపాజిట్లు, నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మనీ మార్కెట్ ఇన్ర్çస్టుమెంట్లు వంటి స్థిర ఆదాయం సెక్యూరిటీల్లో ఈ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోడానికి క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్ఐపీ)లను ఎంచుకోవచ్చు. 2017 జూన్ క్రిసిల్ యాఫీ డెట్ ఫండ్ ఇండెక్స్ ప్రకారం, ఏడాదికి 10.14 శాతం, మూడేళ్లకు 9.59 శాతం, ఐదేళ్లకు 9.04 శాతం, పదేళ్లకు 8.59 శాతం ఈ కేటగిరీలో రిటర్న్స్ లభించాయి. డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎగ్జిట్ పన్నులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని ఒక్కసారి గమనించుకోవల్సి ఉంది. -
ఎస్బీఐ చార్జీల నుంచి ఇలా తప్పించుకోండి..
సాక్షి, న్యూఢిల్లీ : మినిమం బ్యాలెన్స్‌ను ప్రతి నెలా మెయింటెన్ చేయలేక అవస్థలు పడుతున్న ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, స్మాల్, బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులను మెయింటెన్స్ రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఎస్బీఐ తాజా నిర్ణయంతో 13 కోట్ల మంది ఖాతాదారులు లాభపడనున్నారు. ఎస్బీఐకు మొత్తం 43 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. నెలవారీ రుసుము బాధ నుంచి ఉపశమనం పొందాలనుకునే వారికి మరో ఆప్షన్ కూడా ఇచ్చింది ఎస్బీఐ. సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయలేని వారు తమ ఖాతాలను బేసిక్స్ సేవింగ్స్ అకౌంట్‌కు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పింది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అంటే.. పేదవారిని ఉద్దేశించి ప్రారంభించనదే ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ అకౌంట్. మామూలు సేవింగ్స్ ఖాతాలా బేసిక్ సేవింగ్స్ అకౌంట్ నుంచి నెలకు నాలుగు సార్ల కంటే ఎక్కువగా డబ్బును డ్రా(బ్యాంకులో డ్రా, ఏటీఎం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్) చేయకూడదు. ఒక వేళ చేస్తే ఒక్కసారికి రూ.50+ ట్యాక్స్‌లు(ఎస్బీఐలో డ్రా చేస్తే), రూ. 10+ట్యాక్స్(ఎస్బీఐ ఏటీఎంలో డ్రా చేస్తే), రూ.20+ట్యాక్స్(వేరే బ్యాంకుల ఏటీఎంలో డ్రా చేస్తే) రుసుము చెల్లించాల్సివుంటుంది. -
ఈ మూడింటి భవితవ్యం తేలేది నేడే!
ముంబై : భారీగా రుణాలు ఎగవేసి, తమకు గుదిబండలా మారిన సంస్థలపై బ్యాంకులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యాయి. ఆర్బీఐ ఆదేశాలతో పలుమార్లు సమావేశమైన బ్యాంకర్లు వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు బ్యాంకులకు భారీగా ఎగనామం పెట్టిన మూడు సంస్థలు ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ భవితవ్యాన్ని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేడు నిర్ణయించనుంది. మొండిబకాయిల విషయంలో విజయ్ మాల్యా కంటే ఘనులు మరో 12 మంది ఉన్నట్టు రిజర్వ్ బ్యాంకు ఇటీవలే గుర్తించిన సంగతి తెలిసిందే. వారందరిపై దివాలా కోడ్ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా బ్యాంకుల్ని ఆదేశించింది. కానీ వారి పేర్లను ఆర్బీఐ వెల్లడించలేదు. ఈ మేరకు పలుమార్లు సమావేశమైన బ్యాంకులు, చర్యలకు రంగంలోకి దిగాయి. 12 సంస్థల మొండిబకాయిల్లో సగానికి పైగా రుణాలు ఈ మూడు సంస్థల వద్దనే ఉన్నట్టు కూడా బ్యాంకులు గుర్తించాయి. దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్షల కోట్ల మొండిబకాయిల్లో 12 సంస్థల వద్దనే 25 శాతం అంటే రెండు లక్షల కోట్లు మొండిబకాయిలుంటే, ఇక ఏకంగా ఈ మూడు సంస్థలే లక్ష రూపాయలకు పైగా రుణాలు మొండిబకాయిలుగా కలిగి ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ మూడు సంస్థల భరతం పట్టాలని బ్యాంకులు నిర్ణయించినట్టు తెలిసింది. నేడు బ్యాంకర్లు, రుణగ్రస్తులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో బ్యాంకులకు వచ్చిన నష్టాలు, తీసుకోబోయే చర్యలను చర్చించనున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ మూడు స్టీల్ కంపెనీలను సీల్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. ఈ దిగ్గజ సంస్థలకు ఇచ్చిన రుణాల్లో అత్యధికంగా ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియానే ఇచ్చింది. జాయింట్ లెండర్స్ ఫోరమ్ కు ఇది పిలుపునిచ్చింది. కార్పొరేట్ దివాలాను ఫైల్ చేయడం కోసం లెండర్లు కచ్చితంగా కన్సోర్టియంను కోరవచ్చని ఓ ఎస్ బీఐ సీనియర్ అధికారి చెప్పారు. బ్యాంకులు ఎస్సార్ స్టీల్ కు ఇచ్చిన రుణాలు రూ.45వేల కోట్లు, భూషణ్ స్టీల్ కు ఇచ్చిన రుణాలు రూ.47వేల కోట్లు, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కు ఇచ్చిన రుణాలు రూ.11వేలు కోట్లుగా ఉన్నాయి. బుధవారమే దీనిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కార్పొరేట్ దివాలా కింద ఓ అప్లికేషన్ కూడా దాఖలు చేశారు. -
గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ
ముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహరుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. రూ.75లక్షలకు పైన తీసుకునే హోంలోన్లపై 10 బీపీఎస్ పాయింట్ల మేర కోత పెట్టింది. ఈ ఆదేశాలు జూన్15నుంచి అమల్లోకి వస్తాయని శుక్రవారం ప్రకటించింది.అంచనాలకు అనుగుణంగానే ఎస్బీఐ గృహరుణాలపై వడ్డీరేటులో కోత పెట్టింది. అయితే పరిమితిరూ.75లక్షలకు పైన ఈ తగ్గింపును వర్తింపచేయడంతో నిరాశ వ్యక్తమవుతోంది తాజా తగ్గింపు ప్రకారం ఇకపై రూ.75లక్షల పైన గృహరుణాలపై 8.55 శాతం వడ్డీరేట్లు వర్తించనుంది. మహిళలకు 8.60శాతం వడ్డీరేట్లును అమలు చేయనుంది. ఇంటిని కొనుగోలు చేయడం పెద్ద విషచయనీ, ఈ వడ్డీ రేట్ తగ్గింపు ద్వారా గృహ కొనుగోలుదారులు తమ ఇంటిని సొంతం చేసుకోవడానికి ఉపయోడపడుతుందని ఎస్బీఐ నేషనల్ బ్యాంకింగ్, మేనేజింగ్ డైరెక్టర్ రాజనీష్ కుమార్ తెలిపారు. తమ కస్టమర్లకుసేవలో తమ బ్యాంకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. కాగా 2017 ఏప్రిల్ 9న హోంలోన్లపై (ఎంసీఎల్ఆర్)25 బేసిస్‌పాయింట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. -
ఎస్బీఐ లాభం డబుల్
క్యూ4లో రూ.2,815 కోట్లు... ► నికర వడ్డీ ఆదాయం వృద్ధిలో జోరు ► తగ్గుముఖం పట్టిన మొండిబకాయిలు.... ► స్థూల ఎన్పీఏలు 6.4%; నికర ఎన్పీఏలు 3.73% న్యూఢిల్లీ: వరుసగా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు వెల్లడిస్తున్న నిరుత్సాహఫలితాలు చూసి బెంబేలెత్తిన ఇన్వెస్టర్లకు శుక్రవారం ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఊరటనిచ్చింది. ఎన్పీఏలు తగ్గడం, నికర వడ్డీ ఆదాయం జోరుగా పెరగడంతో ఎస్బీఐ నికరలాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రెట్టింపై రూ. 2,815 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో బ్యాంకు స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 1,264 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు స్టాండెలోన్ నికరలాభం 5.36 శాతం వృద్ధిచెంది రూ. 9,951 కోట్ల నుంచి రూ. 10,484 కోట్లకు చేరింది. అయితే పూర్తి సంవత్సరానికి కన్సాలిడేటెడ్ నికరలాభం మాత్రం 98 శాతం క్షీణించి రూ. 12,225 కోట్ల నుంచి రూ. 241 కోట్లకు పడిపోయింది. పూర్తి సంవత్సరంలో కేటాయింపులు గణనీయంగా పెరిగిన కారణంగా కన్సాలిడేటెడ్ నికరలాభం బాగా తగ్గింది. మొండి బకాయిలు తగ్గాయ్.. ఈ ఏడాది మార్చి చివరినాటికి ఎస్బీఐ గ్రూప్ స్థూల నిరర్థక ఆస్తులు 9.04 శాతం నుంచి 6.4 శాతానికి, నికర నిరర్ధక ఆస్తులు 5.15 శాతం నుంచి 3.73 శాతానికి తగ్గాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన మాత్రం స్థూల ఎన్పీఏలు 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెరగ్గా, నికర ఎన్పీఏలు 3.81 శాతం నుంచి 3.71 శాతానికి తగ్గాయి. నాల్గవ త్రైమాసికంలో మొండి బకాయిల కేటాయింపులు గతేడాది ఇదేకాలంతో పోలిస్తే రూ. 12,139 కోట్ల నుంచి రూ. 10,993 కోట్లకు క్షీణించాయి. నాల్గవ త్రైమాసికంలో బ్యాంకు ఆపరేటింగ్ లాభం 12.93 శాతం మెరుగుపడి రూ. 14,192 కోట్ల నుంచి రూ. 16,026 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 17.33 శాతం వృద్ధితో రూ. 15,401 కోట్ల నుంచి రూ. 18,071 కోట్లకు చేరింది. అయితే నికర వడ్డీ మార్జిన్లు 0.16 శాతం తగ్గుదలతో 3.27 శాతం నుంచి రూ. 3.11 శాతానికి దిగాయి. విలీన బ్యాంకుల ఖాతాల్ని కలపలేదు... మార్చితో ముగిసిన త్రైమాíసికపు ఫలితాల్లో ఇటీవల ఎస్బీఐలో విలీనమైన అనుబంధ బ్యాంకుల ఖాతాల లెక్కలు కలవలేదు. ఐదు అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లతో పాటు భారతీయ మహిళా బ్యాంక్‌లు ఎస్బీఐలో విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చినందున, ఈ మెగాబ్యాంకు జూన్‌లో వెల్లడించే ఫలితాల్లో విలీన బ్యాంకుల ఖాతాలూ కలుస్తాయి. మార్కెట్లో ట్రేడింగ్ జరుగుతుండగానే ఎస్బీఐ ఫలితాలు వెల్లడికాగా, ఫలితాలకు స్పందనగా రూ. 302–315 కనిష్ట, గరిష్టస్థాయిల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎస్బీఐ షేరు చివరకు 1.72% పెరుగుదలతో రూ.308.15 వద్ద ముగిసింది. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలిస్తాం తాజాగా ముగిసిన త్రైమాసికం క్లిష్టమైనదే..కానీ సంతృప్తినిచ్చింది. మా అనుబంధ బ్యాంకులకు సంబంధించి విలీన ఖర్చులేవీ ఇక వుండబోవు. అందుకు సంబంధించిన కష్టనష్టాల్ని ఇప్పటికే భరించాం. భవిష్యత్తులో మరింత మెరుగైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడిస్తాం. ప్రస్తుత క్వార్టర్లో అవసరమైన వీఆర్ఎస్ వ్యయాల్లో 75 శాతం 2016–17 ఖాతాల్లోనే కేటాయించేశాం. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ -
సెప్టెంబర్‌కల్లా ఎస్బీఐ లైఫ్ ఐపీఓ
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు చెందిన జీవిత బీమా వెంచర్, ఎస్బీఐ లైఫ్ ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా ఐపీఓకు వచ్చే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ కంటే ముందుగానే ఎస్బీఐ లైఫ్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనుకుంటున్నామని ఎస్బీఐ లైఫ్ ఎండీ దినేశ్ ఖరా చెప్పారు. ఈ ఐపీఓలో భాగంగా ఎస్బీఐ 8 శాతం, కార్డిఫ్ 4 శాతం చొప్పున మొత్తం 12% వాటాను విక్రయించనున్నాయని తెలియజేశారు. కాగా ఈ ఐపీఓకు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి ఆసక్తి గల సంస్థల నుంచి గత నెలలో ఎస్బీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
బుచ్చి ఎస్బీఐలో గోల్డ్ లోన్ల గోల్మాల్
- పెద్దనోట్ల రద్దు సమయంలో రూ.12.40 లక్షల అవినీతి - ఇద్దరు అధికారుల మీద సీబీఐ కేసు నమోదు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నోట్ల రద్దు సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుచ్చిరెడ్డిపాళెం శాఖలో బంగారు రుణాల మంజూరు మాటున రూ.12.40 లక్షలు అవినీతి జరిగింది. ఈ విషయంపై అందిన ఫిర్యాదుతో బ్యాంకు సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ ఎం.సుల్తాన్ మొహిద్దీన్, డిప్యూటీ మేనేజర్ (ఆపరేషన్) ఐ.జె.రాజశేఖర్మీద కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎస్పీ ఆర్.గోపాలకృష్ణారావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఖాతాదారులకు, రుణగ్రహీతలకు కూడా నగదు చెల్లింపు విషయంలో రిజర్వ్ బ్యాంకు అనేక షరతులు విధించింది. దేశ వ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో ఖాతాదారులు రూ.10 వేల నగదు కూడా ఉపసంహరించుకోలేక అవస్థలు పడ్డారు. బుచ్చిరెడ్డిపాళెం ఎస్బీఐలో పనిచేస్తున్న సుల్తాన్ మొహిద్దీన్, రాజశేఖర్ ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుని అవినీతికి పాల్పడ్డారు. గత ఏడాది నవంబరు 15, 25 తేదీల్లో సుల్తాన్‌కు బినామీ పేర్ల మీద డిప్యూటీ మేనేజర్ రాజశేఖర్ నాలుగు బంగారు రుణాల కింద రూ.9.70 లక్షలు మంజూరు చేశారు. మరో మూడు బంగారు రుణాలు మంజూరు చేసి ఇందుకు సంబంధించి రూ.2.70 లక్షలు కొత్త రూ.500, రూ.2000 నోట్లు అందజేశారు. ఇదే సమయంలో గత ఏడాది నవంబరు 21, నవంబరు 25వ తేదీల్లో రూ.500 పాత నోట్లు జమ చేసి సుల్తాన్‌కు మంజూరు చేసిన రెండు బినామీ రుణాలు క్లోజ్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో విశాఖపట్నం సీబీఐ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేశారు. బ్యాంకు ఉన్నతాధికారులు సుల్తాన్ మొహిద్దీన్ను సస్పెండ్ చేశారు. సీబీఐ అధికారులు శని, ఆదివారాల్లో ఇందుకు సంబం«ధించి బ్యాంకు రికార్డులు తనిఖీ చేశారు. ఈ సంఘటన బుచ్చిరెడ్డిపాళెంలో సంచలనం కలిగించింది. లోతుగా జరిపిన విచారణలో రూ.12.40 లక్షలు గోల్ మాల్ జరిగిందని తేల్చారు. దీంతో సుల్తాన్, రాజశేఖర్ మీద ఐపీసీ సెక్షన్ 120 ృబి రెడ్‌విత్ 420, 409, 1988 పీసీ చట్టం లోని సెక్షన్ 13(2), రెడ్ విత్ 13(1)(డి) సెక్షన్ల కింద సోమవారం కేసు నమోదు చేశారు. కేసు విచారణ దశలో ఉందని ఎస్పీ గోపాలకృష్ణారావు తెలిపారు. అధికారులు ఇద్దరూ తమ చేతిలో అధికారాన్ని ఉపయోగించి అవినీతి పాల్పడ్డారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగం సంస్థలు, బీమా సంస్థల్లో అవినీతిపై ప్రజలు ఎస్పీ కార్యాలయం, సీబీఐ, విశాఖపట్నం చిరునామాకు నేరుగా గానీ, పోస్టు ద్వారా లేదా 1800 425 00100 టోల్‌ఫ్రీ నంబరుకు గానీ ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. -
స్టేట్ బ్యాంక్ బాదుడు షురూ!
దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రైవేటు బ్యాంకుల బాటలోనే నడుస్తోంది. ఖాతాలలో కనీస మొత్తం ఉంచకపోతే పెనాల్టీలు విధిస్తామని చెప్పింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇవి అమలవుతాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో కనీసం రూ. 5వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 3వేలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 2వేలు, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి రూపాయల చొప్పున కనీస నిల్వ ఖాతాల్లో ఉండాలని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఖాతాలలో ఉన్న మొత్తానికి, కనీస నిల్వకు మధ్య ఎంత తేడా ఉందో దాన్ని బట్టి పెనాల్టీలు ఉంటాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో రూ. 3750 (75%) కంటే తక్కువ ఉంటే వంద రూపాయలు, దానిపై సేవాపన్నును పెనాల్టీగా వేస్తారు. అదే 50-75 శాతం మధ్య అయితే 75 రూపాయలు, దానిపై సేవాపన్ను పనడుతుంది. సగం కంటే తక్కువ తేడా ఉంటే 50 రూపాయలు, సేవాపన్ను పెనాల్టీగా వేస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఖాతాల్లో కనీస నిల్వ మొత్తం ఉంచుకోకపోతే రూ. 25-50, సేవాపన్ను పెనాల్టీగా పడుతుంది. బ్యాంకుకు వస్తే మోతే బ్రాంచిలో నెలకు మూడుసార్ల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు నిర్వహిస్తే 50 రూపాయల చొప్పున చార్జీ విధిస్తారు. అయితే ఎంత మొత్తం నగదు లావాదేవీ అనే పరిమితి మాత్రం లేదు. గతంలో కూడా ఇలా బ్యాంకులో నగదు లావాదేవీల మీద చార్జీలు ఉండేవని, వాటిని ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరిస్తున్నామని బ్యాంకు అధికారులు తెలిపారు. ఏటీఎంల నుంచి నెలకు 10 సార్లు ఉచితంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్నందున కస్టమర్లు బ్రాంచికి రావాల్సిన అవసరమే ఉండదన్నారు. -
ఆదివారం కూడా ఎస్బీఐ సేవలు
అనంతపురం అగ్రికల్చర్ : సెలవు రోజు ఆదివారం కూడా జిల్లాలో ఎక్కడో ఒకట్రెండు ప్రాంతాలో స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ద్వారా ఉద్యోగులు, ఖాతాదారులకు సేవలందిస్తున్నట్లు ఆ బ్యాంకు రీజనల్ మేనేజర్ ఎంవీఆర్ మురళీక్రిష్ణ తెలిపారు. ఆదివారం స్థానిక ఇంజనీరింగ్ కళాశాల శాఖ ఆధ్వర్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో ‘మేళా ఆన్ వీల్స్’ పేరుతో మొబైల్ వ్యాన్ ద్వారా సేవలందించారు. సొసైటీ కనెక్ట్ పేరుతో ప్రతి ఆదివారం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నందున ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, ఖాతాదారులు వినియోగించుకోవాలని సూచించారు. ప్రధానంగా వాహన, గృహ కొనుగోలుకు సంబంధించి రుణాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ హరిబాబు, డిప్యూటీ మేనేజర్ ఎస్వీ ప్రసాద్, బ్రాంచి మేనేజర్ నాగేంద్ర, ఇతర అధికారులు శ్యామ్, చౌదరి పాల్గొన్నారు. -
రూ. 2000 నోటు రంగు పోతోంది!
షాజహాన్ పూర్: ఏటీఎంలో వచ్చిన రూ.2,000 నోటు రంగు పోతోందని ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి శనివారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. రితిక్ గుప్తా అనే వ్యక్తి భారతీయ స్టేట్ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంకు వెళ్లి రూ.10 వేలు తీయగా ఐదు రూ.2,000 నోట్లు వచ్చాయి. వాటిలో ఒక దాని రంగు పోతోందని రితిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అది దొంగనోటు కాదనీ, రంగు పోతున్నట్లుగా ఫిర్యాదు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. ఏటీఎంలో దొంగనోట్లు వచ్చే అవకాశం లేదని బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ చెప్పారు. ఇటీవలే రిజర్వు బ్యాంకు బదులు చిల్ర్డన్ బ్యాంకు అని రాసి ఉన్న నాలుగు నోట్లు ఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో రావడం తెలిసిందే. -
ఏప్రిల్ 1నుంచి ఈ బ్యాంకుల పేర్లు మారతాయి
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 అమల్లోకి రానుంది. ఏప్రిల్ 1 నుంచి అయిదు అసోసియేట్ బ్యాంకులు మాతృ సంస్థ ఎస్బీఐలో పూర్తిగా విలీనం కానున్నాయని ఎస్బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్ లోతెలిపింది. 2017 ఏప్రిల 1 నుంచి ఇవి ఎస్బీఐ మారతాయని తెలిపింది. గత ఏడాదినుంచి వార్తల్లో ఈ విలీన ప్రక్రియ ఎట్టకేలకు కార్యరూపంలోకి రానుంది. ఈ విలీనం తరువాత డైరెక్టర్లు, అసోసియేట్ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ ధర్మకర్తలమండలి మినహా, బ్యాంకుల సిబ్బంది, అధికారులు ఎస్బీఐ పరిధిలోకి వస్తారు. వీరి జీతాలలో ఎలాంటి మార్పులు ఉండవు. అలాగే ఈ విలీన ప్రక్రియ ముగిసిన తరువాత అసోసియేట్ బ్యాంకులు ఎస్‌బీబీజే, ఎస్బీఎం, ఎస్బీటీ షేర్లను స్టాక్‌మార్కెట్ల నుంచి తొలగించనున్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ బికానూర్ & జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అసోసియేట్ బ్యాంకుల విలీనానికి ఈ నెల 16న కేబినెట్ తుది ఆమోదం లభించింది. గత ఏడాది మేలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ బ్యాంకు ఈ విలీన ప్రతిపాదనకు స్వాప్ రేషియో ఆధారంగా ఆగస్టులో ఆమోదం లభించింది. అయితే భారతీయ మహిళా బ్యాంకును కూడా ఎస్బీఐ విలీనం చేయాలనే ప్రతిపాదనపై నిర్ణయంఇంకా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. -
డజను సార్లు పాస్వర్డ్ చెప్పాడు!
⇒ ముషీరాబాద్ వాసికి సైబర్ నేరగాళ్ళ ఎర ⇒ అతడి ఖాతా నుంచి రూ.లక్ష నగదు స్వాహా సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు ఖాతాలోని నగదు ఆన్లైన్లో కాజేసే సైబర్ నేరగాళ్ళు రోజురోజుకూ తెలివి మీరుతున్నారు. ముషీరాబాద్‌కు చెందిన ఓ చిరు వ్యాపారికి టోకరా వేసిన ఈ కేటుగాళ్ళు రెండు రోజుల్లో రూ.లక్ష కాజేశారు. సదరు సైబర్ నేరగాళ్ళు ఏ స్థాయిలో బుట్టలో వేసుకున్నారంటే... ఈ వ్యవధిలో పన్నెండుసార్లు తన ఫోన్‌కు వచ్చిన వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) చెప్పిన సదరు చిరు వ్యాపారి అదే సమయంలో తన సెల్‌ఫోన్‌కు వచ్చిన బ్యాంకు ఎస్సెమ్మెస్‌లను పట్టించుకోలేదు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్‌కు చెందిన ఓ చిరు వ్యాపారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌లో ఖాతా ఉంది. ఈ నెల 19న ఇతడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్ళు బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, అనివార్య కారణాల నేపథ్యంలో మీ డెబిట్‌కార్డ్ బ్లాక్ అయిందంటూ చెప్పారు. అసలే నోట్లు రద్దు ఎఫెక్ట్‌తో అత్యధికంగా లావాదేవీలు కార్డు ద్వారానే చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కార్డ్ బ్లాక్ అని తెలియడంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు పరిష్కారమేమిటని ఆలోచిస్తుండగా... పునరుద్ధరిస్తామంటూ ఫోన్ చేసిన వారే చెప్పి బుట్టలో వేసుకున్నారు. పునరుద్ధనణ కోసమంటూ కార్డు నెంబర్, సీవీవీ కోడ్ సహా ఇతర వివరాలు తెలుసుకున్నారు. వీటిని వినియోగించి ఆన్లైన్ ద్వారా వ్యాపారి ఖాతాలో ఉన్న సొమ్ము స్వాహా చేయడానికి ఓటీపీ అవసరం. అది లావాదేవీ చేసినప్పుడు వ్యాపారి సెల్‌ఫోన్‌కే వస్తుంది. దీంతో లావాదేవీలకు రంగం సిద్ధం చేసిన సైబర్ నేరగాళ్ళు ఆన్లైన్లో డబ్బు కాజేస్తూ బాధితుడికే ఫోన్ చేసిన ఓటీపీ అడిగారు. తాము మీ కార్డును పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ఈ నెంబర్ చెప్పడం అనివార్యమంటూ నమ్మించారు. 19న ఆరుసార్లు, 20న మరో ఆరుసార్లు ఫోన్లు చేసిన సైబర్ నేరగాళ్ళు బాధితుడి ఖాతా నుంచి రూ.లక్ష కాజేశారు. ఈ సమయంలో సైబర్ నేరగాళ్ళు మాట్లాడుతున్న అంశాలను బాధితుడు రికార్డు చేశాడు. అదే సమయంలో అతడి ఖాతా నుంచి డబ్బు కట్ అయిన ప్రతిసారీ బ్యాంకు నుంచి ఎస్సెమ్మెస్ వచ్చింది. సైబర్ నేరగాళ్ళు హడావుడి పెట్టడం, ఓటీపీని సరిగ్గా చెప్పనందుకే కార్డు పునరుద్ధరణ కావట్లేదంటూ గందరగోళానికి గురి చేయడంతో ఈ ఎస్సెమ్మెస్‌లను బాధితుడు పట్టించుకోలేకపోయాడు. రూ.లక్ష బదిలీ అయినట్లు గుర్తించిన తర్వాత ఈ సంక్షిప్త సందేశాలను పరిశీలించడం ద్వారా రెండు రోజుల్లో 12 లావాదేవీలు జరిగినట్లు తెలుసుకున్నాడు. దీనిపై శుక్రవారం నగర సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రాథమికంగా సదరు సైబర్ నేరగాళ్ళు జార్ఖండ్‌లోని జమ్‌తార ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. బాధితుడి నగదు సైతం ఉత్తరాదికి చెందిన ఖాతాల్లోకి మళ్ళించినట్లు భావిస్తున్న పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. -
ఏటీఎం నుంచి నకిలీ కొత్త కరెన్సీ నోటు!
పాట్నా: నకిలీ నోట్లను, బ్లాక్‌మనీని నిర్మూలిస్తామంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన పాత నోట్ల రద్దు ప్రక్రియ ఏ మేరకు అనుకున్న లక్ష్యాన్ని చేధించగలదనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాలకు ఆజ్యం పోస్తూ భారీ మొత్తంలో కొత్త కరెన్సీ నోట్లు ఐటీ రైడ్స్‌లో దొరకడం, అక్కడక్కడా నకిలీ కొత్త నోట్లు వెలుగులోకి రావడం జరుగుతోంది. తాజాగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి నకిలీ కొత్త రూ.2000 కరెన్సీ నోటు బయటికి వచ్చినట్టు తెలిసింది. ఎస్బీఐ ఏటీఎంలో నగదు డ్రా చేసుకున్న సీతామహ్రి జిల్లా లంగ్మా ప్రాంతానికి చెందిన పంకజ్ కుమార్ అనే వ్యవసాయదారుడికి అచ్చం ఒరిజినల్ నోటు మాదిరి నకిలీ కొత్త రూ.2000 నోట్లు డ్రా అయినట్టు తెలిసింది. వేరే వ్యక్తికి ఈ నోటును అందించినప్పుడు ఇది నకిలీ నోటని అతను తిరస్కరించడంతో ఆశ్చర్యానికి గురైనట్టు పంకజ్ తెలిపాడు. వెంటనే మంగళవారం బ్యాంకుకి వెళ్లి ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నాడు. అదేవిధంగా డుమ్రా పోలీసు స్టేషన్లోనూ దీనిపై ఫిర్యాదుచేసినట్టు చెప్పాడు. పంకజ్ ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ కొనసాగిస్తున్నామని డుమ్రా పీఎస్ విజయ్ బహదూర్ సింగ్ తెలిపారు. ఎక్కడైతే పంకజ్ నకిలీ నోటు విత్‌డ్రా చేసుకున్నాడో ఆ ఏటీఎం ఖజానా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుందని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సుధాంశు కుమార్ రావు తెలిపారు. ఏటిఎం ఖజానా లోపల కరెన్సీని ప్రైవేట్ సంస్థ అధికారులు సమక్షంలో బ్యాంకు అధికారులు తనిఖీ చేస్తారని ఆయన చెప్పారు. ఆ సమయంలోనే వాటికి సీల్ కూడా వేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎం నుంచి నకిలీ నోటు విత్‌డ్రా అయ్యేందుకు ఆస్కారం ఉండదని పేర్కొంటూ ఈ విషయాన్ని రావు తోసిపుచ్చారు. -
ఎస్బీఐలో తొక్కిసలాట
- ఐదుగురికి అస్వస్థత బద్వేల్: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద సోమవారం తొక్కిసలాట జరిగింది. నిన్న సెలవు కావడంతో.. సోమవారం తెల్లవారుజాము నుంచే కస్టమర్లు బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. పింఛన్లు కూడా బ్యాంకుల్లోనే ఇస్తుండటంతో వృద్ధులు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. గేట్లు తెరవగానే.. జనాలంతా ఒక్కసారిగా లోపలికి వెళ్లడానికి యత్నించడంతో తొక్కిసలాట జరిగింది. పింఛన్ల కోసం వచ్చిన వృద్ధులు ఈ తొక్కిసలాటలో కిందపడిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో ఐదుగురు వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు. భారీగా జనం బ్యాంకు వద్దకు చేరుకున్నా పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో.. అరకోర సిబ్బంది జనాన్ని నిలవరించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదరైందని స్థానికులు అంటున్నారు. -
బ్యాంకులో తోపులాట: ఇద్దరికి గాయాలు
పాలకొల్లు: నోట్ల రద్దు చేసి 25 రోజులైనా పూర్తి స్థాయిలో నగదు అందక ప్రజలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు గంటల తరబడి ఉన్నా రెండు వేలు కూడా దొరకని పరిస్థితి. దీంతో తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం ఓ బ్యాంకులో తోపులాట జరిగింది. స్థానిక ఎస్బీఐకు నగదు చేరుకుందని తెలుసుకున్న ఖాతాదారులు భారీగా తరలివచ్చారు. శనివారం బ్యాంకు ఒక్కపూటే పని చేయడం, ఆదివారం సెలవు కావడంతో నగదు అందదేమోనని ఆందోళన చెందారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగి బ్యాంకు అద్దాలు పగిలాయి. ఇద్దరు ఖాతాదారులకు గాయాలయ్యాయి.