ఏప్రిల్‌ 1నుంచి ఈ బ్యాంకుల పేర్లు మారతాయి | Five associate banks to merge with State Bank of India from April 1 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 1 నుంచి ఈ బ్యాంకుల పేర్లు మారతాయి

Published Thu, Feb 23 2017 7:49 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

ఏప్రిల్‌ 1నుంచి ఈ  బ్యాంకుల పేర్లు మారతాయి

ఏప్రిల్‌ 1నుంచి ఈ బ్యాంకుల పేర్లు మారతాయి

న్యూఢిల్లీ:  స్టేట్ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం ఏప్రిల్‌ 1 అమల్లోకి రానుంది. ఏప్రిల్ 1 నుంచి  అయిదు అసోసియేట్‌ బ్యాంకులు  మాతృ సంస్థ ఎస్‌బీఐలో పూర్తిగా విలీనం  కానున్నాయని ఎస్‌బీఐ  రెగ్యులేటరీ ఫైలింగ్‌ లోతెలిపింది. 2017 ఏప్రిల​ 1 నుంచి ఇవి ఎస్‌బీఐ మారతాయని తెలిపింది.

గత ఏడాదినుంచి వార్తల్లో ఈ విలీన ప్రక్రియ ఎట్టకేలకు కార్యరూపంలోకి రానుంది. ఈ విలీనం తరువాత  డైరెక్టర్లు, అసోసియేట్ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ ధర్మకర్తలమండలి మినహా, బ్యాంకుల సిబ్బంది, అధికారులు ఎస్‌బీఐ పరిధిలోకి వస్తారు. వీరి జీతాలలో ఎలాంటి మార్పులు ఉండవు. అలాగే ఈ విలీన ప్రక్రియ  ముగిసిన తరువాత అసోసియేట్‌ బ్యాంకులు ఎస్‌బీబీజే, ఎస్‌బీఎం, ఎస్‌బీటీ షేర్లను స్టాక్‌మార్కెట్ల నుంచి తొలగించనున్నారు.

స్టేట్ బ్యాంకు ఆఫ్ బికానూర్ & జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్  అసోసియేట్‌ బ్యాంకుల విలీనానికి ఈ నెల 16న కేబినెట్  తుది ఆమోదం లభించింది. గత ఏడాది మేలో సెంట్రల్‌  బోర్డ్‌ ఆఫ్‌ బ్యాంకు  ఈ విలీన ప్రతిపాదనకు స్వాప్‌ రేషియో ఆధారంగా  ఆగస్టులో ఆమోదం లభించింది. అయితే  భారతీయ మహిళా బ్యాంకును కూడా ఎస్‌బీఐ విలీనం చేయాలనే ప్రతిపాదనపై నిర్ణయంఇంకా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement