3.7 బిలియన్ డాలర్ల విజువల్ కంటెంట్ సంస్థగా ఆవిర్భావం
న్యూయార్క్: విజువల్ కంటెంట్ కంపెనీలైన షటర్‌స్టాక్, గెట్టీ ఇమేజెస్ విలీనం కానున్నాయి. దీంతో 3.7 బిలియన్ డాలర్ల భారీ సంస్థ ఆవిర్భవించనుంది. విలీన సంస్థ గెట్టీ ఇమేజెస్ పేరుతో కొనసాగుతుంది, న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో గెట్టీ టికర్‌తో ట్రేడవుతుంది. సంస్థకు గెటీ ఇమేజెస్ సీఈవో క్రెగ్ పీటర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తారు. డీల్ ప్రకారం షటర్‌స్టాక్ షేర్‌హోల్డర్లకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి.
తమ దగ్గరున్న ఒక్కో షేరుకు 28.85 డాలర్ల చొప్పున నగదును తీసుకోవడం లేదా, ప్రతీ షేరుకు 13.67 గెట్టీ ఇమేజెస్ షేర్లను పొందడం వీటిలో ఉన్నాయి. ఈ రెండింటితో పాటు ఒక్కో షేరుకు 9.50 డాలర్ల నగదు, 9.17 షేర్లను కూడా తీసుకోవచ్చు. ఇమేజ్‌లు, వీడియోలు, మ్యూజిక్ మొదలైన కంటెంట్‌ను ఈ రెండు సంస్థలు అందిస్తున్నాయి. ఇరు సంస్థల విలీనానికి ఇదే మంచి తరుణమని పీటర్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment