shutter
-
షటర్‌స్టాక్, గెట్టీ ఇమేజెస్ విలీనం
న్యూయార్క్: విజువల్ కంటెంట్ కంపెనీలైన షటర్‌స్టాక్, గెట్టీ ఇమేజెస్ విలీనం కానున్నాయి. దీంతో 3.7 బిలియన్ డాలర్ల భారీ సంస్థ ఆవిర్భవించనుంది. విలీన సంస్థ గెట్టీ ఇమేజెస్ పేరుతో కొనసాగుతుంది, న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో గెట్టీ టికర్‌తో ట్రేడవుతుంది. సంస్థకు గెటీ ఇమేజెస్ సీఈవో క్రెగ్ పీటర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తారు. డీల్ ప్రకారం షటర్‌స్టాక్ షేర్హోల్డర్లకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి.తమ దగ్గరున్న ఒక్కో షేరుకు 28.85 డాలర్ల చొప్పున నగదును తీసుకోవడం లేదా, ప్రతీ షేరుకు 13.67 గెట్టీ ఇమేజెస్ షేర్లను పొందడం వీటిలో ఉన్నాయి. ఈ రెండింటితో పాటు ఒక్కో షేరుకు 9.50 డాలర్ల నగదు, 9.17 షేర్లను కూడా తీసుకోవచ్చు. ఇమేజ్‌లు, వీడియోలు, మ్యూజిక్ మొదలైన కంటెంట్‌ను ఈ రెండు సంస్థలు అందిస్తున్నాయి. ఇరు సంస్థల విలీనానికి ఇదే మంచి తరుణమని పీటర్స్ తెలిపారు. -
కొట్టుకుపోయిన సాగర్ ఎడమకాలువ ఎస్కేప్ షట్టర్
చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పోలేనిగూడెం పరిధిలో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఏర్పాటు చేసిన ఎస్కేప్ షట్టర్ నీటి ప్రవాహానికి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో కొట్టుకుపోయింది. దీంతో సుమారు 1,500 క్యూసెక్కుల వరద కాలువ నుంచి బయటికెళ్లి సమీప గ్రామాల పంటపొలాలను ముంచెత్తింది. నాగార్జున్ సాగర్ ప్రధాన కాలువ 113.14వ కిలోమీటర్ వద్ద కాలువకు అనుబంధంగా 18 ఏళ్ల క్రితం ఎస్కేప్‌ను నిర్మించి రెండు షట్టర్లు ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ షట్టర్లను తొలగించి, కొత్తగా ఎస్కేప్ ఏర్పాటు చేయా లని నిర్ణయించిన ఎన్ఎస్పీ అధికారులు రూ.62 లక్షల నిధులు కూడా మంజూరు చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు కూడా పూర్తి కాగా మరో వారం రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే, సాగర్ ఆయకట్టు పరిధి రెండో జోన్‌లోని పంటలను కాపాడటంలో భాగంగా అధికారులు పాలేరు రిజర్వాయర్‌ను నింపేందుకు ఈనెల 16న నాగార్జునసాగర్‌లో 6,200 క్యూ సెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ జలా లు నేరుగా పాలేరుకు వెళ్తున్నాయి. 19.5 అడుగుల ఎత్తు నుంచి నీటి ప్రవాహం ఉధృతంగా వెళ్తుండటంతో శిథిలావస్థకు చేరిన ఎస్కేప్ షట్టర్ కొట్టుకుపోయిందని రైతులు చెబుతున్నారు. దీనికితోడు షట్టర్‌కు బిగించిన బేరింగ్లను ఇటీవల దుండగులు ఎత్తుకుపోయారు. దీంతోపాటు చిలుకూరు మండలం బేతవోలు చెరువును నింపేందుకు రై తులు జేసీబీతో షట్టర్‌ను కొద్దిగా పైకి లేపిన ట్లు తెలిసింది. ఈక్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గేటు తట్టుకోలేక కొట్టుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. కాలువ కింద, పక్కన ఏమైనా సంఘటన జరిగినప్పుడు నీళ్ల తాకిడిని తగ్గించి మళ్లించేందుకు వీలుగా ఏర్పాటుచేసిన దానిని ఎస్కేప్ షట్టర్‌ను అంటారు. ఆయకట్టు పరిధిలోని మునగాల, బరాఖత్‌గూడెం, ముకుందాపురం, చిలుకూరు మండలంలోని పోలేనిగూడెం, బేతవోలు తదితర గ్రామాల్లో సుమారు 600 ఎకరాల చేతికొచ్చిన వరి పంట నీట మునిగిందని రైతులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న ఎన్ఎస్పీ సీఈ రమేష్, ఈఈ సత్యనారాయ ణ, డీఈ రఘు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో సాగర్, అడవిదేవులపల్లి రిజర్వాయర్ వద్ద నీటిని నిలిపివేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే షట్టర్ కొట్టుకుపోయి నష్టం వాటిల్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా, కొట్టుకుపోయిన గేటు స్థానంలో సోమవారం రాత్రి కొత్త గేటును అమర్చినట్లు ఎన్ఎస్పీ అధికారులు చెప్పారు. -
అందరూ!....వెక్కిరించి అవమానించే ఏకైక వైకల్యం...నత్తి!!
మనకు ఉండే చిన్నలోపాల్ని మనమే పెద్దపెద్ద సమస్యగా చూసి నిరాశనిస్ప్రహలకి లోనైపోతాం. అంతేకాదు సరైన విధంగా ఆలోచించం. పైగా ఎవర్ని సలహలు, సూచనలు కూడా అడగకుండా అట్లా ఉసూరుమంటూ ఉండిపోతాం. కానీ ఇక్కడొక అమ్మాయి తన లోపాన్ని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడితో ముచ్చటించి సరి చేసుకుంటుంది చూడండి.! (చదవండి: హే!..రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్!!) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ థాంక్స్ గివింగ్ సెలవుదినం సందర్భంగా నాన్‌టుకెట్‌కు వెళ్లిన సమయంలో డెన్మార్క్ మాజీ రాయబారి రూఫస్ గిఫోర్డ్ మేనకోడలు అవేరితో మాట్లాడిన సంభాషణ చూడముచ్చటగా ఉంటుంది. ఈ మేరకు అవేరికి కాస్త నత్తి ఉంటుంది. దీంతో ఆమె బైడెన్‌తో కాస్త తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది. దీంతో బైడెన్ అవేరిని ప్రోత్సహిస్తూ ...నత్తిగా వస్తున్న పర్వాలేదు అలాగే మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉండు అని అంటాడు. ఆ తర్వాత ఆమె తన ప్రసంగాన్ని ముగించి బైడెన్‌ని ఆనందంగా కౌగలించుకుంటుంది. ఈ మేరకు ఈ సంభాషణకు సంబధించిన వీడియోని రూఫస్ గిఫోర్డ్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ...ఈ రోజు నా మేనకోడలు ఇప్పటి వరకు నత్తితో పోరాడితోంది. ఈ రోజు తనకు తెలిసిన వ్యక్తితో సంభాషించి నత్తిని ఎలా జయించాలో తెలుసుకుంది అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు గతంలో సీఎన్ఎన్ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.." నేను కూడా చిన్నతనంలో నత్తిగా మాట్లాడేవాడిని . అంతేకాదు ప్రజలందరూ వెక్కిరించి అవమానించే ఏకేక వైకల్యం. ఆ లోపాన్ని పోగొట్టుకునేందకు చాలా కష్టపడ్డాను. పైగా అద్దం ముందు నిలబడి గంటల తరబడి ప్రసంగిస్తూ ఆ లోపాన్ని జయించాను" అని చెప్పారు. (చదవండి: ఎంత అమానుషం!.... గాయపడిన మూగజీవిపై పైశాచికం!!) My amazing niece and goddaughter Avery has struggled with a stutter much of her life. She was just told by a guy who knows a little something about it that she can be anything she wants to in this world. A day she will never ever forget. Thank you sir. ❤️🇺🇸❤️ pic.twitter.com/RDP5Y0FfTa — Rufus Gifford (@rufusgifford) November 28, 2021 -
వెరైటీ దొంగతనం..వైరల్!
-
వేసిన షెట్టర్ వేసినట్టే ఉంది.. కానీ నగలు మాయం!
బీజింగ్ : చైనాలోని ఓ యువకుడు మిగతా దొంగల్లా కాకుండా చోరీకి కొత్త దారి ఎంచుకున్నాడు. షాపు షెట్టరు పగలకొట్టడం.. గోడలు దూకడం మాములు అనుకున్నాడేమో కానీ.. సైలెంట్‌గా పని కానిచ్చాడు. ఈ ఘటన దక్షిణ చైనాలో ఈ నెల 13న చోటుచేసుకుంది. ఓ నగల దుకాణంలో దొంగతనం చేద్దామని నిర్ణయించుకున్న అతడు అర్ధరాత్రి అక్కడికి చేరుకున్నాడు. తనను ఎవరు చూడటం లేదని నిశ్చయించుకున్న తర్వాత.. షాపు ముందు నెలపై పడుకున్నాడు. షట్టర్‌ను మెల్లిగా తన చేతులతో పైకి నెడుతూ, తన శరీరాన్ని గట్టిగా ఒత్తుకుంటు.. చిన్నగా షాపులోకి ప్రవేశించాడు. షాపులోకి వెళ్లగానే ఏ మాత్రం అలస్యం చేయకుండా అలారమ్ ఆఫ్ చేశాడు. తెలివిగా విలువైన అభరణాలను మాత్రమే దొంగిలించాడు. మరునాడు ఉదయం షాప్ తెరచిన వారు కంగుతిన్నారు. షట్టర్ అలాగే ఉండగా చోరీ ఎలా జరిగిందో వారికి అర్థం కాలేదు. తర్వాత సీసీ పుటేజ్‌ను చూసి అసలు విషయం తెలుసుకున్నారు. దాదాపు 36లక్షల విలువ కలిగిన 40 బ్రెస్‌లెట్స్, నక్లెస్‌లు, ఉంగరాలు చోరీకి గురయినట్టు ఆ షాప్ యాజమాని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు చోరీకి పాల్పడిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
రెండు నిమిషాల్లో చోరీ
షట్టర్ పగుల గొట్టి రూ.3.31లక్షలు అపహరణ రాంగోపాల్‌పేట్: రెండు షాపుల షట్టర్లను పగుల గొట్టి రూ.3.31లక్షల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగంపూరకు చెందిన ఖాలిద్ ఏఆర్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో హోల్‌సేల్ రెడీమేడ్ దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. మల్లేపల్లికి చెందిన ఇక్బాల్ అదే ప్రాంతంలో ఆర్కే ట్రేడర్స్ పేరుతో హోల్‌సేల్ దుకాణం ఏర్పాటు చేశాడు. మంగళవారం తెల్లవారు జామున నలుగురు వ్యక్తులు దుకాణాల తాళాలు పగులగొట్టి చోరాలకు పాల్పడ్డారు. ఏఆర్ ఎంటర్ ప్రైజెస్‌లో రూ.2.96 లక్షలు, ఆర్కే ఎంటర్ ప్రైజెస్‌లో రూ.35వేల నగదు అపహరణకు గురయ్యాయి. ఉదయం స్థానికులు షట్టర్లు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ మురళి కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. క్షణాల్లో పని పూర్తి ఈ ఘటనలో నలుగురు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు కేవలం రెండు నిమిషాల్లోనే తమ పనిపూర్తి చేసుకోవడం గమనార్హం. ఉదయం సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించిన పోలీసులు నిందితులు 4.48 నిమిషాలకు వచ్చి 4.50 నిమిషాలకు బయటికి వెళ్లినట్లు గుర్తించారు. -
పాకాలకు లీకేజీ గండం
తూముల నుంచి వృథాగాపోతున్న నీరు మరమ్మతులు చేయించడంపై దృష్టిసారించని అధికారులు ఏళ్లు గడుస్తున్నా షటర్లు మార్చని వైనం ఆందోళనలో ఆయకట్టు రైతులు ఖానాపురం : ‘ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుదాం’ అంటూ జల పరిరక్షణ కోసం నినాదాలు ఇస్తుంటారు అధికారులు. కానీ వర్షం రూపంలో ప్రకృతి ప్రసాదించిన జల వనరులు కళ్లెదుటే నేల పాలవుతున్నా పట్టించుకోని దుస్థితి పలుచోట్ల కనిపిస్తోంది. మండలం పరిధిలోని పాకాల సరస్సు తూములకు లీకేజీ గండం చుట్టుముట్టింది. రెండు తూముల షటర్లు శిథిలావస్థలో ఉన్నాయి. అయినా ఐబీ అధికారులు గత కొన్నేళ్లుగా మరమ్మతు చేయించలేదు. ఫలితంగా ఏటా వర్షాకాలంలో తూముల నుంచి నీరు వృథాగాపోతోంది. ఈ లీకేజీల కారణంగా రబీ సీజన్లో క్యారీ ఓవర్ సిస్టమ్ ప్రకారం 10 ఫీట్ల వరకు ఉండాల్సిన నీటిమట్టం 5 ఫీట్లకు పరిమితం అవుతోంది. దీంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 1902 సంవత్సరంలో కాకతీయుల పాలనా కాలంలో పాకాల సరస్సు తూములు నిర్మించారని చెబుతారు. వాటికి మరమ్మతులు చేయించడంపై అధికారులు ఇప్పటికైనా దృష్టిసారించాలి. కాగా, సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.03 అడుగులు. ఇది పూర్తిస్తాయిలో నిండితే ఖరీఫ్, రబీలో ఆయకట్టు రైతులు ఆనందోత్సాహాలతో పంటల సాగుకు నడుం బిగిస్తుంటారు. అన్నదాతల ఆనందం పదికాలాల పాటు పరిఢవిల్లాలంటే జలసిరులను అందిస్తున్న పాకాల సరస్సును కంటికిరెప్పలా కాపాడాల్సిన అవసరం ఉంది. నీటి వృథాను అరికట్టాలి తూముల నుంచి నీరు వృథాగా పోకుండా చూడాలి. అప్పుడే సరస్సు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంటుంది. షటర్లకు మరమ్మతులు చేయించాలి. తద్వారా ఆయకట్టు రైతులకు ఎటువంటి బెంగ ఉండదు. – జినుకల సురేష్, రైతు, అశోక్‌నగర్ రూ.40 కోట్లతో ప్రతిపాదనలు పాకాలలో ప్రధాన తూముల ద్వారా నీరు వృథాగా పోతున్న విషయం వాస్తవమే. తూములు, కాల్వల మరమ్మతుల కోసం రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించాం. దీన్ని ప్రభుత్వానికి పంపుతాం. తూములు, షటర్లకు మరమ్మతులు చేసి లీకేజీలను అరికడతాం. – సుదర్శన్‌రావు, ఐబీ డీఈ -
అనూహ్యంగా పోలీసులకి దొరికిన దొంగ