
బీజింగ్ : చైనాలోని ఓ యువకుడు మిగతా దొంగల్లా కాకుండా చోరీకి కొత్త దారి ఎంచుకున్నాడు. షాపు షెట్టరు పగలకొట్టడం.. గోడలు దూకడం మాములు అనుకున్నాడేమో కానీ.. సైలెంట్‌గా పని కానిచ్చాడు. ఈ ఘటన దక్షిణ చైనాలో ఈ నెల 13న చోటుచేసుకుంది. ఓ నగల దుకాణంలో దొంగతనం చేద్దామని నిర్ణయించుకున్న అతడు అర్ధరాత్రి అక్కడికి చేరుకున్నాడు. తనను ఎవరు చూడటం లేదని నిశ్చయించుకున్న తర్వాత.. షాపు ముందు నెలపై పడుకున్నాడు. షట్టర్‌ను మెల్లిగా తన చేతులతో పైకి నెడుతూ, తన శరీరాన్ని గట్టిగా ఒత్తుకుంటు.. చిన్నగా షాపులోకి ప్రవేశించాడు.
షాపులోకి వెళ్లగానే ఏ మాత్రం అలస్యం చేయకుండా అలారమ్ ఆఫ్ చేశాడు. తెలివిగా విలువైన అభరణాలను మాత్రమే దొంగిలించాడు. మరునాడు ఉదయం షాప్ తెరచిన వారు కంగుతిన్నారు. షట్టర్ అలాగే ఉండగా చోరీ ఎలా జరిగిందో వారికి అర్థం కాలేదు. తర్వాత సీసీ పుటేజ్‌ను చూసి అసలు విషయం తెలుసుకున్నారు. దాదాపు 36లక్షల విలువ కలిగిన 40 బ్రెస్‌లెట్స్, నక్లెస్‌లు, ఉంగరాలు చోరీకి గురయినట్టు ఆ షాప్ యాజమాని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు చోరీకి పాల్పడిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment