south China
-
డీప్సీకర్ లియాంగ్
అత్యంత శక్తిమంతమైన చౌక ఏఐ అసిస్టెంట్‌తో కృత్రిమ మేథ (ఏఐ) ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న డీప్‌సీక్ సృష్టికర్త లియాంగ్ వెన్ఫెంగ్ (40) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు టెక్ ప్రపంచంలో ఎక్కడా కనీసం వినబడని, కనబడని లియాంగ్ పేరు ఇప్పుడు ఎలాన్ మస్క్ (టెస్లా), శామ్ ఆల్ట్‌మన్‌ను (ఓపెన్ ఏఐ) మించి మార్మోగిపోతోంది. ఆయన గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. లియాంగ్ దక్షిణ చైనాలోని అయిదో శ్రేణి పట్టణమైన గ్వాంగ్‌డాంగ్‌లో జన్మించారు. ఆయన తండ్రి ఒక స్కూల్ టీచరు. ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా సహా టెక్ దిగ్గజాలకు కేంద్రమైన ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో లియాంగ్ విద్యాభ్యాసం చేశారు. ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ, 2010లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. హెడ్జ్ఫండ్తో వ్యాపార రంగంలోకి.. లియాంగ్ 2015లో ఇద్దరు క్లాస్‌మేట్స్‌తో కలిసి హై–ఫ్లయర్ అసెట్ మేనేజ్మెంట్ పేరిట చైనాలో ఒక హెడ్జ్ ఫండ్‌ను ఏర్పాటు చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. సంక్లిష్టమైన అల్గోరిథంలతో ట్రేడింగ్ వ్యూహాలను అమలు చేసే ఈ ఫండ్ చాలా వేగంగా ఎదిగింది. కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే ఫండ్ పోర్ట్‌ఫోలియో ఏకంగా 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.19 లక్షల కోట్లకు) చేరింది. అదే సమయంలో స్వంత ఏఐ ప్రాజెక్టు కోసం అంటూ శక్తివంతమైన ఎన్విడియా చిప్‌లను వేల సంఖ్యలో ఆయన కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అటుపైన 2023లో కృత్రిమ మేథకు సంబంధించిన డీప్‌సీక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. సాధారణ ఏఐ అవసరాలకు ఉపయోగపడే కోడర్, ఎల్ఎల్ఎం, వీ2 లాంటి మోడల్స్‌ను చకచకా ప్రవేశపెట్టి, బైట్‌డ్యాన్స్, బైదులాంటి దిగ్గజాలకు కాస్త కుదుపునిచ్చారు. కట్ చేస్తే, 2025 జనవరి వచ్చేసరికి అత్యంత సంక్లిష్టమైన రీజనింగ్ సామర్థ్యాలతో, ఓపెన్ఏఐ జీపీటీ–4కి పోటీగా డీప్‌సీక్–ఆర్1 ఏఐ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టారు. ఒకవైపు బడా టెక్ దిగ్గజాలన్నీ తమ తమ మోడల్స్‌ను అభివృద్ధి చేసేందుకు మిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తూ, యూజర్ల నుంచి చార్జీలు కూడా వసూలు చేస్తుండగా.. డీప్‌సీక్ చాట్‌బాట్‌ను అత్యంత చౌకగా కేవలం 6 మిలియన్ డాలర్లకే (దాదాపు రూ. 52 కోట్లు) తయారు చేసి షాకిచ్చారు. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఓపెన్‌సోర్స్ మోడల్‌గానే ఉంచుతామంటున్నారు. కృత్రిమ మేథ విషయంలో చైనాను అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని లియాంగ్ చెబుతున్న నేపథ్యంలో అమెరికన్ టెక్ దిగ్గజాలు దీనికి ఎలా చెక్ పెట్టబోతున్నాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
చైనాలో వరద బీభత్సం: 53 మంది మృతి
బీజింగ్: ఆకస్మిక వర్షాలు, వరదలతో దక్షిణ చైనా వణికిపోతోంది. వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. బురద ప్రవాహం గ్రామాలను ముంచెత్తుతోంది. వరదల కారణంగా గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో 47 మంది, ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వర్షాలు, వరదల వల్ల భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. -
చైనా: కరువుపై మేఘమథన అస్త్రం!
చాంగ్కింగ్(చైనా): దక్షిణ చైనాలో కరువు ఉరుముతోంది. ఎండలు మండిపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. నదుల్లో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, ఏసీలు వాడొద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కరెంటు లేక ఫ్యాక్టరీలకు తాళాలు వేయాల్సి వస్తోంది. రిజర్వాయర్లలో నీరు అడుగంటుతోంది. తాగునీరు కూడా సరఫరా కావడం లేదు. కరువు నేపథ్యంలో కొన్నిచోట్ల అత్యవసర పరిస్థితిని సైతం ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కరువు సమస్యను అధిగమించడానికి మేఘ మథనంపై చైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మేఘాలపై రసాయనాలు వెదజల్లి, వర్షాలు కురిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. సిచువాన్, హూబే ప్రావిన్స్‌ల్లోనూ ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు చేతికి రాకుండా పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో పంటలను కరువు బారినుంచి కాపాడుకోవాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొంది. చైనాలో వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేసే ప్రక్రియ 61 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యింది. ఇప్పటినుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సిచువాన్ ప్రావిన్స్‌లో 45 డిగ్రీల సెల్సియస్(113 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదయ్యింది. దక్షిణ చైనాలో వరిసాగు అధికం. పంట దెబ్బతినకుండా కాపాడుకోవడానికి రాబోయే 10 రోజులు చాలా కీలకమని వ్యవసాయ శాఖ మంత్రి టాంగ్ రెంజియాన్ చెప్పారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసే అవకాశం లేదు. దాంతో చైనా సర్కారుకు ఇప్పుడు మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) ఒక ప్రత్యామ్నాయంగా మారింది. డ్రోన్ల సాయంతో మేఘాలపై రసాయనాలు చల్లి, కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఉత్తర చైనాలో మాత్రం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కింగాయ్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా 26 మంది మృతిచెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. -
నెలకు ఈ ఇంటి అద్దెంతో తెలుసా!
హాంగ్‌కాంగ్: సాధారణంగా ఓ ఇంటి అద్దె వేలల్లో లేదా లక్షల్లో ఉంటుంది. కానీ దక్షిణ చైనాలో హాంగ్‌కాంగ్‌లోని ఈ ఇంటి అద్దె ఎంతో తెలిస్తే అందరూ కళ్లు తేలేయాల్సిందే. నెలకు ఈ ఇంటి అద్దె 1.26 కోట్ల రూపాయలు. ఇది వింటే ఇది అద్దెనా లేక ఇంటి ఖరీదా అని అందరికి డౌట్ రావోచ్చు. కానీ ఇది అక్షరాల అద్దె. ఎందుకంటే అదే రేంజ్లో ఈ ఇంటిలో స్టార్ హోటళ్లను మించిన గదులు, ఇతర సౌకర్యాలు ఉన్నాయట. చూడటానికి ప్యాలేస్‌ను తలపిస్తున్న ఈ ఇళ్లు మొత్తం 10, 804 అడుగుల విస్తిర్ణంలో... విలాసవంతమైన గదులు, రకారకాల పూలతో కూడిన తోటతో నిర్మించారట. ఇక లోపల ఓ ప్రైవేటు గ్యారేజ్, అధునాతమైన సాంకేతికతతో తయారు చేయించిన లిఫ్టులు ఉన్నాయట. ఇక ఈ భవనం నుంచి బయటకు చూస్తే విక్టోరియా హార్బర్ స్పష్టంగా కనిపిస్తుందట. అందుకే ఈ ఇంటికి హాంగ్‌కాంగ్‌లో అన్నిటికంటే అధిక రెంటు ఉన్నట్లు నైట్ ప్రాంక్ ఎల్ఎల్పీ ఎగ్జీక్యూటివ్ డైరెక్టర్ థామస్ లామ్ పేర్కొన్నారు. హాంగ్‌కాంగ్‌లో గృహల కొరత, లగ్జరీ ఇళ్ల అమ్మకాలు తక్కువ ఉండటం వల్ల అక్కడి శ్రీమంతులు ఈ ఇంట్లో రెంటుకు ఉండేందుకు ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: ఇంటర్వ్యూలలో ఫెయిల్.. బాధతో 9 ప్లాస్టిక్ సర్జరీలు చైతు కోసం నదిలో దూకిన అభిమాని.. ఆ తర్వాత -
తైవాన్‌పై దాడికి చైనా కుట్ర!
బీజింగ్: తైవాన్ను ఆక్రమించేందుకు మిలటరీ చర్యకు చైనా సిద్ధమవుతోందని మిలటరీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగ్నేయ తీరంలో చైనా భారీగా అత్యాధునిక ఆయుధాలను, సైనిక బలగాలను మోహరిస్తుండటంతో తైవాన్‌పై దాడికే ఈ మోహరింపు అని వివరిస్తున్నారు. ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పత్రిక కథనం ప్రకారం.. ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఉన్న పాత డీఎఫ్ 11, డీఎఫ్ 15 క్షిపణుల స్థానంలో ఆధునిక ఢీఎఫ్ 17 క్షిపణులను చైనా మోహరిస్తోంది. ఈ ఆధునిక హైపర్సోనిక్ క్షిపణి అత్యంత కచ్చితంగా శత్రు లక్ష్యాలను చేధిస్తుంది. స్వీయ పాలనలో ఉన్న ద్వీప దేశం తైవాన్ను తన నియంత్రణలోకి తీసుకునేందుకు చైనా చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. తైవాన్ చైనాలో అంతర్భాగమని వాదిస్తోంది. తైవాన్ను ఆక్రమించేందుకు అవసరమైతే మిలటరీ చర్యకు వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. గ్వాంగ్డాంగ్, ఫ్యుజియన్ ప్రాంతాల్లో చైనా బలగాల, ఆయుధ వ్యవస్థల్లో భారీ పెరుగుదల కనిపిస్తోందని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కెనడాకు చెందిన ‘కన్వా డిఫెన్స్ రివ్యూ’ పేర్కొంది. తైవాన్ లక్ష్యంగా యుద్ధం చేసేందుకు తూర్పు, దక్షిణ కమాండ్స్ల క్షిపణి వ్యవస్థలను చైనా ఇటీవల రెట్టింపు స్థాయిలో బలోపేతం చేసిందని వెల్లడించింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైనిక దళాలకు మంగళవారం చైనా అధ్యక్షుడు పిలుపిచ్చిన విషయం తెలిసిందే. -
వెరైటీ దొంగతనం..వైరల్!
-
వేసిన షెట్టర్ వేసినట్టే ఉంది.. కానీ నగలు మాయం!
బీజింగ్ : చైనాలోని ఓ యువకుడు మిగతా దొంగల్లా కాకుండా చోరీకి కొత్త దారి ఎంచుకున్నాడు. షాపు షెట్టరు పగలకొట్టడం.. గోడలు దూకడం మాములు అనుకున్నాడేమో కానీ.. సైలెంట్‌గా పని కానిచ్చాడు. ఈ ఘటన దక్షిణ చైనాలో ఈ నెల 13న చోటుచేసుకుంది. ఓ నగల దుకాణంలో దొంగతనం చేద్దామని నిర్ణయించుకున్న అతడు అర్ధరాత్రి అక్కడికి చేరుకున్నాడు. తనను ఎవరు చూడటం లేదని నిశ్చయించుకున్న తర్వాత.. షాపు ముందు నెలపై పడుకున్నాడు. షట్టర్‌ను మెల్లిగా తన చేతులతో పైకి నెడుతూ, తన శరీరాన్ని గట్టిగా ఒత్తుకుంటు.. చిన్నగా షాపులోకి ప్రవేశించాడు. షాపులోకి వెళ్లగానే ఏ మాత్రం అలస్యం చేయకుండా అలారమ్ ఆఫ్ చేశాడు. తెలివిగా విలువైన అభరణాలను మాత్రమే దొంగిలించాడు. మరునాడు ఉదయం షాప్ తెరచిన వారు కంగుతిన్నారు. షట్టర్ అలాగే ఉండగా చోరీ ఎలా జరిగిందో వారికి అర్థం కాలేదు. తర్వాత సీసీ పుటేజ్‌ను చూసి అసలు విషయం తెలుసుకున్నారు. దాదాపు 36లక్షల విలువ కలిగిన 40 బ్రెస్‌లెట్స్, నక్లెస్‌లు, ఉంగరాలు చోరీకి గురయినట్టు ఆ షాప్ యాజమాని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు చోరీకి పాల్పడిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
రాక్షస కోడి...
రాక్షస బల్లుల సిరీస్‌లో ఇది కొత్తది. చూడ్డానికి 10 అడుగుల పొడవున్న టర్కీ కోడిలా కనిపిస్తున్న దీని పేరు కారీథొరాప్టర్ జాకొబ్సీ.. ఆ మధ్య దీని తాలూకు అస్థిపంజరం దక్షిణ చైనాలో దొరికింది. అస్థిపంజరాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇది 10 కోట్ల ఏళ్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఉండేదని తేల్చారు. మాంసాహారే.. బరువు 230 కిలోలు. నెత్తి మీద చిన్నసైజు పింఛం దీనికి అదనపు ఆకర్షణట. కోపం వస్తే.. తన కాళ్లతో కరాటే కిక్లాంటిది ఒకటిచ్చుకుంటుందట. -
సౌత్ చైనాలో అంతర్జాతీయ సర్కస్ ఫెస్టివల్
-
స్కైవాక్..
దక్షిణ చైనాలోని తియాన్మెన్ పర్వతం అంచున నిర్మించిన ‘కాయిలింగ్ డ్రాగన్ క్లిఫ్’ ఇది. సముద్ర మట్టానికి 4600 అడుగుల ఎత్తులో ఉన్న దీని వెడల్పు 5 అడుగులు. కింది భాగమంతా అద్దాలతో నిర్మితమైంది. ప్రజల సందర్శనార్థం సోమవారం అధికారికంగా ప్రారంభించారు. -
చైనా చారిత్రక హక్కులు చెల్లవు
-
చైనా చారిత్రక హక్కులు చెల్లవు
దక్షిణ చైనా సముద్ర వివాదంపై డ్రాగన్‌కు ట్రిబ్యునల్ షాక్ - చైనా చెప్తున్న చారిత్రక హక్కులకు ఆధారాలు లేవు - ఏవైనా ఉన్నా ఐరాస ఒడంబడికతో చెల్లిపోయాయి: ట్రిబ్యునల్ - ఆ తీర్పు చెల్లదు.. ఆమోదించం.. గుర్తించం: చైనా బీజింగ్/ద హేగ్ : అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరంగా చైనాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన దక్షిణ చైనా సముద్రంలో తనకు చారిత్రక హక్కులు ఉన్నాయన్న చైనా వాదనను ఐక్యరాజ్యసమితి నియమిత అంతర్జాతీయ ట్రిబ్యునల్ మంగళవారం కొట్టివేసింది. ట్రిబ్యునల్ తీర్పుపై చైనా ఆగ్రహంగా స్పందించింది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదంటూ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తిరస్కరించారు. దక్షిణ చైనా సముద్రంలో 90 శాతానికి పైగా ప్రాంతంపై తనకు చారిత్రక హక్కులు ఉన్నాయంటూ పట్టుపడుతున్న చైనా వాదనకు ఎటువంటి న్యాయపరమైన ప్రాతిపదికా లేదని ద హేగ్ లోని ట్రిబ్యునల్ కొట్టివేసింది. 1940ల నాటి చైనా మ్యాప్ ఆధారంగా ‘నైన్-డాష్ లైన్’ పరిధిలో గల సముద్ర ప్రాంతంపై, అందులోని వనరులపై తనకు హక్కులు ఉన్నాయని చైనా ఉద్ఘాటిస్తుండగా.. సముద్ర చట్టాలపై ఐక్యరాజ్యసమితి ఒడంబడిక (యూఎన్సీఎల్ఓఎస్)లో పేర్కొన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లకు.. చైనా చెప్తున్న హక్కులు విరుద్ధంగా ఉన్నాయని, చైనా చారిత్రక హక్కులేవైనా ఉంటే ఒడంబడిక ద్వారా అవి చెల్లిపోయాయని తీర్పులో స్పష్టంచేసింది. దక్షిణ చైనా సముద్రంలోని దీవులను చైనా, ఇతర దేశాలకు చెందిన నావికులు, మత్స్యకారులు చారిత్రకంగా వినియోగించుకున్నప్పటికీ.. ఆ జలాలపై కానీ, వనరులపై కానీ చైనా చారిత్రకంగా ప్రత్యేక హక్కులను కలిగి ఉన్నట్లు ఎటువంటి ఆధారం లేదని ట్రిబ్యునల్ పేర్కొంది. ఒడంబడికలోని 296వ అధికరణ, అనుబంధం 7లోని 11వ నిబంధన ప్రకారం ఇది తుది తీర్పు అని, చైనా కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. తీర్పు సారాంశాన్ని మీడియాకు విడుదల చేసింది. స్పార్ట్లీ దీవుల వద్ద సముద్రంలో కృత్రిమ దీవుల నిర్మాణం, ఇతరత్రా చర్యల వల్ల సముద్ర పర్యావరణాన్ని చైనా దెబ్బతీస్తోందని కూడా ట్రిబ్యునల్ తప్పుపట్టింది. తీర్పు ప్రభావం ఏమీ ఉండదు: చైనా ట్రిబ్యునల్ తీర్పుపై చైనా కఠిన వైఖరి అవలంబించింది. చైనా ప్రాదేశిక సార్వభౌమాధికారం పైనా, దక్షిణ చైనా సముద్రంలో తమ ప్రయోజనాల పైనా ఈ తీర్పు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభావం చూపబోదని.. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు జీన్-క్లాడ్ జుంకర్తో సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాలపై చారిత్రక వాస్తవాల ఆధారంగా, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా నేరుగా ప్రమేయమున్న దేశాలతో శాంతియుత సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవటానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆ సముద్రగర్భంలో అపార సంపద..! దక్షిణ చైనా సముద్ర గర్భంలో ఇప్పటివరకూ గుర్తించని చమురు, గ్యాస్, ఖనిజాల నిల్వలు ఉండవచ్చని శాస్త్రవేత్తల విశ్వాసం. అలాగే.. ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన నౌకా మార్గాలు ఈ సముద్రం లోంచే వెళతాయి. ఈ సముద్రంలోని దీవులను తమ చక్రవర్తులు శతాబ్దాల కిందట కనుగొన్నారని, చరిత్ర అంతటా ఆ ప్రాంతంపై హక్కులు కలిగివున్నారని చైనా వాదిస్తోంది. అందులో కృత్రిమంగా దీవులు నిర్మించి, వాటిపై సైనిక స్థావరాలనూ ఏర్పాటు చేస్తోంది. చైనా వాదనను ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేసియా, బ్రూనై, తైవాన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ 2013లో సమితి శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టుకు ఫిర్యాదు చేయగా.. ఆ కోర్టు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ తీర్పు చెల్లదని, దానిని తాము అంగీకరించేది కానీ, గుర్తించేది కానీ లేదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ బీజింగ్‌లో ప్రకటించింది. -
చైనాకు ఈ దీవులతో సంబంధం లేదు
-
భారత్‌ను చూసి నేర్చుకోండి : అమెరికా
వాషింగ్టన్ : సముద్ర జలాలకు సంబంధించిన వివాదాల్లో పొరుగు దేశాలతో భారత్ అనుసరిస్తున్న విధానాన్ని చూసి చైనా నేర్చుకోవాలని అమెరికా సూచించింది. 2014లో భారత్-బంగ్లాదేశ్ మధ్య తలెత్తిన సముద్రసంబంధ వివాదంలో అంతర్జాతీయ కోర్టు బంగ్లాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని.. దీన్ని భారత్ గౌరవించిన విషయాన్ని గుర్తుచేసింది. దక్షిణ చైనా సముద్రంలోని దేశాలకు సంబంధం లేకుండా.. తీర ప్రాంతంలోని వనరులన్నీ తనవేనంటున్న చైనా.. పొరుగుదేశాల విషయంలో భారత్ అనుసరించే పద్ధతిని గమనించాలని సూచించింది. -
గ్యాస్ సిలిండర్ పేలుడు: ఆరుగురు మృతి
బీజింగ్: దక్షిణ చైనాలోని గాంగ్జిజువాంగ్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని నింగ్మింగ్ కౌంటీ ఫూడ్ స్టాల్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 19 మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.