వాషింగ్టన్ : సముద్ర జలాలకు సంబంధించిన వివాదాల్లో పొరుగు దేశాలతో భారత్ అనుసరిస్తున్న విధానాన్ని చూసి చైనా నేర్చుకోవాలని అమెరికా సూచించింది. 2014లో భారత్-బంగ్లాదేశ్ మధ్య తలెత్తిన సముద్రసంబంధ వివాదంలో అంతర్జాతీయ కోర్టు బంగ్లాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని.. దీన్ని భారత్ గౌరవించిన విషయాన్ని గుర్తుచేసింది. దక్షిణ చైనా సముద్రంలోని దేశాలకు సంబంధం లేకుండా.. తీర ప్రాంతంలోని వనరులన్నీ తనవేనంటున్న చైనా.. పొరుగుదేశాల విషయంలో భారత్ అనుసరించే పద్ధతిని గమనించాలని సూచించింది.