ట్రంప్‌ 2.0..భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం | Trump Government First Priority To India | Sakshi
Sakshi News home page

భారత్‌కే తొలి ప్రాధాన్యం..జైశంకర్‌తో ట్రంప్‌ మంత్రి మొదటి భేటీ

Published Wed, Jan 22 2025 7:41 AM | Last Updated on Wed, Jan 22 2025 11:43 AM

Trump Government First Priority To India

వాషింగ్టన్‌:అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేయగానే భారత్‌,అమెరికా సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత తొలి ప్రాధాన్యం భారత్‌కే లభించింది. అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి మారో రుబియో తన తొలి భేటీ భారత విదేశాంగశాఖ మంత్రితోనే నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌ కూడా పాల్గొన్నారు.

సాధారంగా కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టగానే అమెరికా విదేశాంగశాఖ తొలి భేటీ పొరుగు దేశాలైన కెనడా,మెక్సికో లేదంటే నాటో కూటమిలోని ఏదో ఒక దేశంతో జరుగుతుంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో తొలి భేటీ జరపడం గమనార్హం.

అది కూడా అమెరికా విదేశాంగశాఖ మంత్రిగా మైక్‌ రుబియో పదవీ బాధ్యతలు చేపట్టిన గంటలోనే భేటీ జరగడం విశేషం. గంటపాటు జరిగిన ఈ భేటీలో అమెరికా,భారత్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.

భేటీ ముగిసిన తర్వాత జైశంకర్‌,రుబియోలు మీడియా ముందుకు వచ్చి కరచాలనం చేసుకున్నారు.రుబియోతో భేటీ అవడం సంతోషంగా ఉందని జైశంకర్‌ తన ఎక్స్‌(ట్విటర్‌)ఖాతాలో పోస్టు చేశారు. 

 

ఇదీ చదవండి: జన్మతఃపౌరసత్వం రద్దు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement