SECRETARY
-
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవు: సంపత్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రేపుతోంది. పార్టీలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తేల్చి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వినోద్ లాంటి వారు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసిందన్న సంపత్.. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు.‘‘ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రధాన చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్కు మాదిగల గురించి మాట్లాడే హక్కు లేదు. 10 ఏళ్లు మాదిగల గురించి ఆలోచించని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఏదో చేస్తామని చెప్తున్నారు. వర్గీకరణ అమలు జరిగిందంటే.. అది కాంగ్రెస్ వల్లనే జరుగుతుంది. మాదిగలు గుండె మీద చెయ్యి వేసుకుని పడుకోండి. చంద్రబాబు హయాంలో వర్గీకరణకు ఎదురైనా సాంకేతిక లోపాలు తెలిసిన వాడిగా సీఎం క్యాబినెట్ కమిటీ వేశారు. ఏక సభ్య కమిటీ వేశారు కమిటీ నివేదిక వచ్చాక ఎస్సీ వర్గీకరణ జరగబోతుంది.వర్గీకరణ పకడ్బందీగా అమలు చేయాలనే దృఢమైన సంకల్పంతో సీఎం ముందుకెళ్తున్నారు. తరతరాలుగా అవమానాలు, అసమానతలు ఎదురొడ్డినా మాదిగలు ధైర్యంగా ఉండండి. అధికారిక సమావేశంలోనే కాంగ్రెస్‌ని డిమాండ్ చేశాను’’ అని సంపత్ పేర్కొన్నారు. -
ట్రంప్ 2.0..భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం
వాషింగ్టన్:అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయగానే భారత్,అమెరికా సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తొలి ప్రాధాన్యం భారత్‌కే లభించింది. అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి మారో రుబియో తన తొలి భేటీ భారత విదేశాంగశాఖ మంత్రితోనే నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా పాల్గొన్నారు.సాధారంగా కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టగానే అమెరికా విదేశాంగశాఖ తొలి భేటీ పొరుగు దేశాలైన కెనడా,మెక్సికో లేదంటే నాటో కూటమిలోని ఏదో ఒక దేశంతో జరుగుతుంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో తొలి భేటీ జరపడం గమనార్హం.అది కూడా అమెరికా విదేశాంగశాఖ మంత్రిగా మైక్ రుబియో పదవీ బాధ్యతలు చేపట్టిన గంటలోనే భేటీ జరగడం విశేషం. గంటపాటు జరిగిన ఈ భేటీలో అమెరికా,భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.భేటీ ముగిసిన తర్వాత జైశంకర్,రుబియోలు మీడియా ముందుకు వచ్చి కరచాలనం చేసుకున్నారు.రుబియోతో భేటీ అవడం సంతోషంగా ఉందని జైశంకర్ తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో పోస్టు చేశారు. Delighted to meet @secrubio for his first bilateral meeting after assumption of office as Secretary of State.Reviewed our extensive bilateral partnership, of which @secrubio has been a strong advocate. Also exchanged views on a wide range of regional and global issues.Look… pic.twitter.com/NVpBUEAyHK— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2025 ఇదీ చదవండి: జన్మతఃపౌరసత్వం రద్దు -
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..ఎన్కౌంటర్లో అగ్రనేత మృతి
సాక్షి,హైదరాబాద్:మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఎదురు కాల్పుల్లో మృతిచెందారు.ఛత్తీస్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ శనివారం(జనవరి18) ఓ లేఖను విడుదల చేసింది.దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. దాదాపు 30 ఏళ్లుగా ఆయన మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఆయన పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. ఆయనపై ఛత్తీస్‌గఢ్‌లో50 లక్షల రివార్డు కూడా ఉంది. తెలంగాణలోనూ 25లక్షల రివార్డు ఉంది.ఆరు నెలల క్రితమే ఆయన తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.మావోయిస్టు యాక్షన్ టీమ్‌లకు ఆయన ఇన్చార్జిగానూ ఉన్నారు.తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో ఘటన.. బిజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావో యిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు గురువారం ఉదయం కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పడుతుండగా మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల్లో దామోదర్ కూడా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ తాజాగా ప్రకటించింది. -
ఎంఎఫ్ఐలకు ఆర్థిక సహకారం అవసరం
సూక్ష్మ రుణ సంస్థలు (MFI) ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు వీలుగా ప్రత్యేకమైన నిధి ఏర్పాటుతోపాటు ప్రభుత్వం నుంచి సహకారం అవసరమని ఈ రంగం స్పష్టం చేసింది. పేదల రుణ అవసరాలను తీర్చడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న సూక్ష్మ రుణ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను అర్థం చేసుకునేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నాగరాజు ఒక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశం అనంతరం సా–ధన్ ఈడీ, సీఈవో జిజి మామెన్ మీడియాతో మాట్లాడారు. అనియంత్రిత సంస్థలను ఏరిపారేయాలని, అలాంటి సంస్థలు అనుసరిస్తున్న దారుణమైన రుణ వసూళ్ల విధానాలకు చెక్ పెట్టాలని సూచించినట్టు చెప్పారు. రుణాలకు ఆధార్‌ను తప్పనిసరి డాక్యుమెంట్‌గా చేయాలని కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం ఎంఎఫ్ఐలు రుణ గ్రహీతల నుంచి ఆధార్ తీసుకునేందుకు అనుమతి లేదు. పరిశ్రమకు ప్రత్యేకమైన నిధుల యంత్రాంగం ఉండాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. కరోనా సమయంలో రూ.25,000 కోట్లతో ఆర్బీఐ ప్రత్యేక విండో ప్రారంభించడాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. క్రెడిట్ గ్యారంటీని కూడా పరిశీలించాలని కోరినట్టు చెప్పారు. పెరిగిపోయిన మొండి బకాయిలు మొండి పద్దులు పెరిగిపోతుండడంతో ఎంఎఫ్ఐలు అప్రమత్త ధోరణితో వ్యవహరిస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ త్రైమాసికం చివరికి సూక్ష్మ రుణ రంగంలో రుణాల అవుట్ స్టాండింగ్ (తిరిగి రావాల్సిన మొత్తం/నికర రుణ పోర్ట్‌ఫోలియో) 4.3 శాతానికి (రూ.4.14 లక్షల కోట్లు) తగ్గినట్టు క్రెడిట్ సమాచార సంస్థ ‘క్రిఫ్ హై మార్క్’ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో మొండి బకాయిలు పెరిగిపోయినట్టు తెలిపింది.‘‘1–30 రోజుల వరకు చెల్లింపులు చేయని రుణాలు జూన్ త్రైమాసికం చివరికి 1.2 శాతంగా ఉంటే, సెప్టెంబర్ చివరికి 2.1 శాతానికి పెరిగాయి. 31–180 రోజుల వరకు చెల్లింపులు చేయని రుణాలు ఇదే కాలంలో 2.7 శాతం నుంచి 4.3 శాతానికి ఎగిశాయి’’అని వెల్లడించింది. బీహార్, తమిళనాడు, యూపీ, ఒడిశా రాష్ట్రాల్లో సూక్ష్మ రుణాల చెల్లింపుల నిలిపివేతలు ఎక్కువగా ఉన్నట్టు, పెరిగిన వసూలు కాని రుణాల్లో మూడింట రెండొంతులు ఈ రాష్ట్రాల నుంచే ఉన్నట్టు తెలిపింది. ఒకే రుణ గ్రహీత మూడు లేదా అంతకంటే ఎక్కువ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం తగ్గడాన్ని సానుకూలతగా పేర్కొంది. -
రక్షణ కార్యదర్శిగా రాజేష్ సింగ్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉన్నతస్థాయిలో పలువురు సీనియర్ బ్యూరోకాట్లను బదిలీ చేసి కొత్త స్థానాల్లో నియమించింది. రాజేష్ సింగ్ రక్షణశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న రాజేష్ తొలుత రక్షణ మంత్రిత్వ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా చేరతారు. ప్రస్తుత రక్షణశాఖ కార్యదర్శి అరమానే గిరిధర్ అక్టోబరు 31న పదవీ విరమణ చేయనున్నారు. అప్పుడు గిరిధర్ స్థానంలో రాజేష్‡ బాధ్యతలు స్వీకరిస్తారు. పున్యా సలీలా శ్రీవాస్తవ ఆరోగ్యశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. పస్తుతం మైనారిటీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న కటికిథల శ్రీనివాస్.. హౌసింగ్, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సీనియర్ బ్యూరోకాట్ దీప్తి ఉమాశంకర్‌ను రాష్ట్రపతి కార్యదర్శిగా నియమించారు. నాగరాజు మద్దిరాల ఆర్థిక సేవల కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నాగరాజు బోగ్గుశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. -
సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు
-
అంతర్జాతీయ దిగ్గజాలుగా దేశీ ఆడిటింగ్ సంస్థలు
న్యూఢిల్లీ: దేశం నుంచి అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థలను తీర్చిదిద్దేందుకు కేంద్ర సర్కారు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)తో కలసి పనిచేస్తున్నట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్ గోవిల్ వెల్లడించారు. అకౌంటింగ్, ఆడిటింగ్ సంస్థల అగ్రిగేషన్‌కు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. భారత్ నుంచి నాలుగు పెద్ద అకౌంటింగ్, ఆడిటింగ్ సంస్థలను తయారు చేయడమే లక్ష్యమని చెప్పారు. దేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ (కార్పొరేట్ పాలన)ను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బీమా రంగం, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్íÙప్ (ఎల్ఎల్పీలు)లకు అకౌంటింగ్ ప్రమాణాలు తీసుకు వచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే వీటిని తీసుకొస్తామన్నారు. బ్యాంక్‌లకు సంబంధించిన అకౌంటింగ్ ప్రమాణాల విషయంలో ఆర్బీఐతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు ఐసీఏఐ 75 వ్యవస్థాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రకటించారు. ఎల్ఎల్పీలు, కంపెనీల చట్టం నిబంధనలను సమీక్షిస్తున్నట్టు, కంపెనీల స్వచ్ఛంద మూసివేత సమయాన్ని తగ్గించడమే తమ ధ్యేయమన్నారు. -
ఆలయ కార్యదర్శిపై అమానుష దాడి
ఏలూరు టౌన్ : ఏలూరు కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవుని సొమ్మును కాజేశారని ప్రశ్నించిన ఆలయ కార్యదర్శిపై పాత ఆలయ కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రెడ్డి నాగరాజు అమానుష దాడికి తెగబడ్డాడు. నూతన ఆలయ కార్యదర్శి అచ్యుతకుమారిపై రాడ్డుతో దాడిచేసి, ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఏలూరు జీజీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని బాధితురాలిని బుధవారం ఆస్పత్రిలో పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకుని వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు 27వ డివిజన్ కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వరస్వామి గుడికి ఇటీవలే కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. రాజరాజేశ్వరినగర్‌కు చెందిన సావన్ అచ్యుతకుమారి ఆలయ నూతన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి సంబంధించి నిధులు భారీఎత్తున గోల్మాల్ అయ్యాయని ఆమె గుర్తించారు. సుమారు రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలుసుకుని పాత కార్యవర్గ సభ్యులను ఆమె ప్రశ్నించారు. దీంతో పాత, కొత్త కార్యవర్గాల మధ్య వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే.. శ్రీవారి కళ్యాణ మహోత్సవాలను ఆచ్యుతకుమారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తుండడంతో పాత కార్యవర్గ సభ్యుడు రెడ్డి నాగరాజు అతని భార్య ఇద్దరూ కలిసి ఆలయ ప్రాంగణంలో పుస్తక వ్యాపారం చేసుకునేందుకు అవకాశమివ్వాలని అచ్యుతకుమారిని కోరారు. ఆలయంలో వ్యాపారం చేయడానికి వీల్లేదని, అవసరమైతే ఉచితంగా పుస్తకాల పంపిణీకి అనుమతి ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. ఈ విషయంలో వివాదం చెలరేగడంతో రెడ్డి నాగరాజు అచ్యుతకుమారిపై దాడికి తెగబడ్డాడు. రాడ్డు తీసుకుని ఆమెను తలపైన తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమె చీరను లాగేసి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో.. అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో అచ్యుతకుమారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. నిధుల గోల్‌మాల్‌పై నిలదీయడంతో.. రెడ్డి నాగరాజుతో పాటు ఉమామహేశ్వరరావు, ప్రసాద్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ఆలయ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయని ఆస్పత్రిలో ఆమె చెప్పారు. లక్షలాది రూపాయల నిధులకు లెక్కలు లేకపోవడంతో వారిని నిలదీయగా.. రెడ్డి నాగరాజు సమయం కోసం వేచిచూసి దాడిచేశారన్నారు. -
Somesh Kumar: క్విడ్ ప్రోకోతో భూముల కొనుగోలు!
హైదరాబాద్: మాజీ సీఎస్, ధరణి రూపకర్తగా పేరున్న సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాతిక ఎకరాల భూమిని తక్కువ ధరలకు చెల్లించి ఆయన కొనుగోలు చేయడం.. అదీ ఫార్మా సిటీ ప్రాంతంలోనే కావడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో క్విడ్ ప్రోకో అంశంపై తెరపైకి వచ్చింది. ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని.. ప్లాన్ప్రకారమే యాచారంలో భూములు కొన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. 2018లో ఫార్మాసిటీ ప్రాంతం అయిన కొత్తపల్లిలో 25 ఎకరాల్ని నలుగురి దగ్గరి నుంచి ఆయన కొన్నారు. అందుకుగానూ ఎకరానికి రూ.2 లక్షలు చెల్లించారు. అయితే అది సోమేష్ భార్య పేరిట ఉన్నట్లు ధరణి రికార్డుల్లోనూ ఇది నమోదు అయ్యింది. లక్షల్లో రైతుబంధు సొమ్ము తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఈ భూముల ద్వారా సోమేశ్ కుమార్ లక్షల్లో రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తపల్లి విలేజ్‌లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటివరకు 14 లక్షల 5 వేల 550 రూపాయల రైతుబంధు తీసుకున్నట్లు సమాచారం. భూమి సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. 25 ఎకరాల 19 గుంటలు భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉన్నాయి. కానీ, సోమేశ్ కుటుంబం.. సాగు చెయ్యకుండానే రైతుబంధు పొందినట్లు తెలుస్తోంది. అదేకాకుండా ఆయన బంధువులు మొత్తం 150 ఎకరాలకు సంబంధించి భూమిపై రైతుబంధు డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇక.. ఏడాదికి రెండు దఫాల్లో 2 లక్షల 52,750 రూపాయల రైతుబంధు డబ్బును సోమేశ్ కుమార్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే రెరా సెక్రటరీగా పని చేసిన శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో సోమేష్‌కుమార్ కూడా రెరాలో పని చేయడంతో ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది. -
అమెరికా రక్షణ మంత్రికి అనారోగ్యం
వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్(70) అనారోగ్యంతో గత సోమవారం నుంచి విధులకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఆయన వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతున్నట్లు పెంటగాన్ తెలిపింది. స్వల్ప శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం సమస్యలు తలెత్తడంతో సోమవారం ఆయన్ను మెడికల్ సెంటర్లో చేరి్పంచినట్లు పెంటగాన్ ప్రతినిధి ఎయిర్ ఫోర్స్ మేజర్ జనరల్ ప్యాట్ రైడర్ శుక్రవారం(స్థానిక కాలమానం ప్రకారం) చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని, ఈ రోజే ఆయన విధుల్లో చేరే అవకాశాలున్నాయని తెలిపారు. వ్యక్తిగత గోప్యత, వైద్యపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి ఆస్టిన్ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని బయటకు వెల్లడించలేదని తెలిపారు. అవసరమైన పక్షంలో సహాయ మంత్రి కాథ్లీన్ హిక్స్ ఆయన స్థానంలో బాధ్యతలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. -
టీడీపీ తెలుగు మహిళా కార్యదర్శి అరెస్ట్
గుంటూరు లీగల్: సీఎం వైఎస్ జగన్ పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన టీడీపీ గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళ కార్యదర్శి పిడికిటి శివ పార్వతిని బుధవారం పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన శివ పార్వతి నగరంలోని జేకేసీ రోడ్డులోని విజయపురి కాలనీలో ఉంటుంది. ఆమె టీడీపీ గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా కార్యదర్శిగా పనిచేస్తూ ఫేస్బుక్లో ‘లక్ష్మీగణేష్ ఐడీతో పోస్టింగ్‌లు పెడుతుంది. ఈ నెల 25న సీఎం పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలతో వీడియో పోస్టు చేసింది. దీనిపై స్తంబాలగరువుకు చెందిన వైఎస్సార్ సీపీ 42వ డివిజన్ ఇన్చార్జ్ చల్లా శేషిరెడ్డి, ఏటి అగ్రహారానికి చెందిన వైఎస్సార్ సీపీ గుంటూరు వెస్ట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజవరపు జగదీష్ పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా ఉండటమే కాకుండా అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వీడియో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. నిందితురాలు ఇదే తేదీన పోస్టు చేసిన మరో వీడియోపై మారుతీనగర్‌కు చెందిన షేక్ ఉస్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కూడా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నిందితురాలు సోషల్ మీడియాలో తరచూ ఇలాంటి పోస్టింగ్స్ పెడుతుందనీ, గతంలో సీసీ నం.1247/2021 లో కూడా ముద్దాయి అని పేర్కొంటూ , ఆమెకు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరుతూ పట్టాభిపురం పోలీసులు రిమాండ్ రిపోర్టును కోర్టులో దాఖలు చేశారు. వాదనలు విన్న ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి జి.స్పందన రిమాండ్‌ను తిరస్కరిస్తూ రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. -
రూ.13,000 కోట్ల పీఎల్ఐ ప్రోత్సాహకాలు: 4 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం కింద అర్హత కలిగిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.13,000 కోట్లను మంజూరు చేయనుంది. ఇక మీదట పీఎల్ఐ కింద ఏటా ఇచ్చే ప్రోత్సాహకాల మొత్తం గణనీయంగా ఉంటుందని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది ఇలా విడుదల చేసే మొత్తం రూ.13వేల కోట్లుగా ఉండొచ్చన్నారు. పీఎల్ఐ కింద కేంద్ర సర్కారు 14 రంగాలకు ప్రోత్సహకాలను ఇప్పటి వరకు ప్రకటించగా, మరిన్ని రంగాలు సైతం ప్రోత్సాహకాల కోసం డిమాండ్ చేస్తున్నాయి.(గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) టెలీకమ్యూనికేషన్స్, వైట్ గూడ్స్, టెక్స్టైల్స్, వైద్య ఉపకరణాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఫుడ్ ఉత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు, ఫార్మా రంగాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే వీటిల్లో సోలార్ పీవీ మాడ్యూళ్లు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్టైల్ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్ రంగాలకు పీఎల్ఐ కింద ప్రోత్సాహకాల విడుదల మొదలు కావాల్సి ఉంది. దేశీయ తయారీని పెంచడం, దిగుమతులు తగ్గించడం, అంతర్జాతీయంగా ఎగుమతుల్లో పోటీ పడడం అనే లక్ష్యాలతో కేంద్ర సర్కారు 2021లో పీఎల్ఐ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. (Fraud Alert: కస్టమ్స్ డ్యూటీ, వారికి బలైపోకండి!) 4 లక్షల మందికి ఉపాధి.. పర్యావరణ అనుమతుల్లో జాప్యం, చైనా నుంచి నిపుణుల సాయం పొందేందుకు వీసా మంజూరులో సమస్యలను భాగస్వాములు ప్రస్తావించారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. పీఎల్ఐ కింద ఇప్పటికే రూ.78వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రూ.6 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చినట్టు తెలిపారు. ఆటబొమ్మలు, ఇతర రంగాలకు పీఎల్ఐ అభ్యర్థనలు అంతర్గత మంత్రిత్వ శాఖల పరిశీలనలో ఉన్నట్టు సింగ్ పేర్కొన్నారు. ఇటీవలే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయగా, తర్వాత అక్టోబర్ 31 వరకు వాయిదా వేయడం తెలిసిందే. దీనిపై సింగ్ మాట్లాడుతూ.. ఇది స్వేచ్ఛాయుత లైసెన్సింగ్ విధానమని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. దీని పట్ల పెద్దగా ఆందోళన అవసరం లేదన్నారు. -
రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలపై ఉద్యోగ సంఘాల భేటి
అమరావతి: జోనల్ వ్యవస్థలో మార్పులపై ఉద్యోగ సంఘాలతో జీఏడి సెక్రెటరీ పోలా భాస్కర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన, జిల్లాల విభజన తర్వాత ఇప్పటి వరకు పాత విధానంలోనే జరుగుతున్న ఉద్యోగాల భర్తీ పై చర్చ జరిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలకు తెలియజేసి వారి నుంచి పలు సూచనలు, సలహాలను స్వీకరించారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, బండి.శ్రీనివాసులు, బొప్పరాజు, ఆస్కార్ రావు తదితర నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్టు రిక్రూట్మెంట్)కు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు 1975కు సవరణ ప్రతిపాదనపై నివేదికలను అధికారులు సిద్దం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి పోస్టుల భర్తీపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను అధికారులు తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్ -
దేశాభివృద్ధిలో కంపెనీ సెక్రటరీల కీలకపాత్ర
సాక్షి, విశాఖపట్నం: దేశాభివృద్ధిలో కంపెనీ సెక్రటరీల పాత్ర కీలకమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు అన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విశాఖలో జరిగిన ప్రాక్టీసింగ్ సెక్రటరీస్ 24వ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో జస్టిస్ సోమయాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘న్యాయవ్యవస్థలు, వృత్తి నిపుణుల నుంచి అంచనాలు.. ప్రాక్టికల్ టిప్స్’ అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక సెషన్లో ఆయన మాట్లాడారు. కంపెనీ సెక్రటరీలు.. న్యాయ వ్యవస్థకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. నియమ నిబంధనల్ని పాటిస్తూ.. దేశ ఆర్థి క వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలబడాలన్నారు. ముగింపు సదస్సులో ఐసీఎస్ఐ ఇండియా చైర్మన్ మనీష్ గుప్తా, ప్రతినిధులు గిరిధరన్, ద్వారకానా«థ్, నరసింహన్ తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ సోమయాజుల్ని ఐసీఎస్ఐ ప్రతినిధులు సత్కరించారు. -
ED విచారణలో TSPSC చైర్మన్,సెక్రటరీలు
-
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణె
-
అంత ఆవేశం పనికిరాదు! ఇక్కడ ఎవరి మాట ఎవరు వింటున్నారని...!
అంత ఆవేశం పనికిరాదు! ఇక్కడ ఎవరి మాట ఎవరు వింటున్నారని...! -
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ " స్ట్రెయిట్ టాక్ "
-
విస్తరణపై ‘ప్రైవేట్’ దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్కు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ)లలో పెట్టుబడి అవకాశాలపై ప్రయివేట్ రంగం దృష్టి సారించాల్సి ఉందని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆర్థిక నిర్వహణగా కాకుండా సంస్కరణల కోణంలో చూడవలసిందిగా సూచించారు. కార్పొరేట్ సుపరిపాలన కారణంగా సీపీఎస్ఈలు మెరుగైన పనితీరు చూపుతున్నాయని తెలిపారు. దీంతో వాటాదారులకు సీపీఎస్ఈ షేర్లు స్టాక్ మార్కెట్ ఇండెక్సులతో పోలిస్తే అత్యుత్తమ రిటర్నులు(లాభాలు) అందిస్తున్నట్లు తెలియజేశారు. దేశీ కంపెనీలు వృద్ధి బాటలో సాగడంతోపాటు దేశ, విదేశాలలో క్లిష్టతరహా బిజినెస్‌లను సైతం సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉత్పత్తి పెంపు, ఉద్యోగ సృష్టి తదితర లబ్దిని చేకూర్చగల విస్తరణ అంశాలకు ప్రయివేట్ రంగం ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సొంత సామర్థ్యాలపై సందేహాలు పెట్టుకోకుండా సంకోచాలు వీడి పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవలసిందిగా దేశీ కార్పొరేట్లకు మంగళవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించిన సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో పాండే అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వ్యూహాత్మక విక్రయానికి దీపమ్ సుమారు ఏడు ప్రభుత్వ రంగ కంపెనీలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ), కంటెయినర్ కార్పొరేషన్(కంకార్), వైజాగ్ స్టీల్, ఐడీబీఐ బ్యాంక్, ఎన్ఎండీసీకి చెందిన నాగర్నార్ స్టీల్ ప్లాంట్, హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంక్ త్వరలో ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్‌కు వీలుగా త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ)కు తెరతీయనున్నట్లు దీపమ్ కార్యదర్శి పాండే వెల్లడించారు. బ్యాంక్ వ్యూహాత్మక విక్రయానికి 2021 మే నెలలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం బ్యాంకులో ప్రమోటర్‌గా ఉన్న బీమా రంగ పీఎస్‌యూ ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. ప్రాథమిక బిడ్స్‌కు ఆహ్వానం పలికేముందు ప్రభుత్వం, ఎల్ఐసీ ఎంతమేర వాటాలు ఆఫర్ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పాండే తెలియజేశారు. ఫిక్కీ సీఏపీఏఎమ్ 2022 నిర్వహించిన 19వ వార్షిక క్యాపిటల్ మార్కెట్ సదస్సులో పాండే ఈ విషయాలు పేర్కొన్నారు. -
యూకే హోం సెక్రటరీగా భారత సంతతి మహిళ
లండన్: భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ యూకే కొత్త హొం సెక్రటరీగా భాద్యతలు చేపట్టారు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి. అంతేకాదు ఆమె తల్లి హిందూ తమిళియన్ ఉమా, తండ్రి గోవాకు చెందిన క్రిస్టీ ఫెర్నాండెజ్. ఐతే ఆమె తల్లి మారిషస్ నుంచి యూకే వలస వెళ్లగా, తండ్రి 1960లలో కెన్యా నుంచి వలస వచ్చారు. ప్రస్తుతం బ్రేవర్మన్కి చట్టపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న రువాండాకు చెందిన కొంతమంది శరణార్థులను పంపించాలనే ప్రభుత్వ ప్రణాళికకు సంబంధించిన ప్రాజెక్టులను అప్పగించనున్నట్లు సమాచారం. ఆమె తనతోటి సహోద్యోగి భారత సంతతికి చెందిన ప్రీతీ పటేల్ వారుసురాలిగా ఈ అత్యున్నతి పదవిని చేపట్టారు. ఈ మేరకు బ్రేవర్మన్ మాట్లాడుతూ...బ్రెక్సిట్ అవకాశాలను పొదుపరిచి, సమస్యలను చక్కదిద్దాలనుకుంటున్నాని చెప్పారు. యూరోపియన్ కోర్టు ఆఫ్ హ్యుమన్ రైట్స్ నుంచి యూకేని బయటకు తీసుకువచ్చేలా ఐరోపా నుంచి స్పష్టమైన విరామాన్ని కోరకుంటున్నాని తెలిపారు. ఆమె తన నాయకత్వ ప్రచార వీడియోలో తన తల్లిదండ్రుల గురించి చెబుతూ..వారు బ్రిటన్‌ని ప్రేమిస్తారని, తమకు ఈ దేశం అత్యంత భద్రతనిచ్చిందని అన్నారు. తాను రాజకీయాల్లోకి రావడం వల్లే తన నేపథ్యం గురించి అదరికి తెలిసిందని చెప్పుకొచ్చారు. ఆమె 2018లో రేల్ బ్రేవర్‌మాన్‌ను వివాహం చేసుకుంది. ఆమె గతేడాది రెండోవ బిడ్డకు జన్మనిచ్చే నిమిత్తం ప్రసూతి సెలవుల్లో ఉన్న సయంలోనే క్యాబినేట్ మంత్రిగా అనుమతించేలా ఒక చట్టపరమైన మార్పును తీసుకువచ్చి పేరుగాంచారు. ఆమె బౌద్ధ మతస్తురాలు, పార్లమెంటులో కూడా బుద్ధుని సూక్తులకు సంబంధించిన ధ్మపద గ్రంథంపై ప్రమాణ స్వీకారం చేశారు. (చదవండి: 'తక్షణమే రంగంలోకి దిగుతా'... వర్షంలో తడుస్తూనే) -
సీఎం జగన్‌తో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బృందం భేటీ
సాక్షి, అమరావతి: కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బృందం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం అయ్యింది. బుధవారం సాయంత్రం.. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.సునీల్, నోడల్ ఆఫీసర్ అజయ్‌కరన్‌లతో కూడిన బృందం భేటీ అయ్యింది. ఈ భేటీకి వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ జి శేఖర్ బాబు హాజరు అయ్యారు. ఏపీకి సంబంధించి కీలకాంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. -
క్రిప్టోకు చట్టబద్ధత వచ్చినట్లు కాదు
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయ పన్ను రిటర్ను ఫారంలలో ప్రత్యేకంగా ఉంటుందని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. క్రిప్టో ఆదాయాలను కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. ‘ఈ కరెన్సీలకు సంబంధించిన ట్యాక్సేషన్‌పై స్పష్టత తెచ్చేందుకే ఫైనాన్స్ బిల్లులో వర్చువల్ డిజిటల్ అసెట్స్‌పై పన్నుల నిబంధన చేర్చారు. ఈ నిబంధనల్లో వీటి చట్టబద్ధత గురించి ఏమీ లేదు. క్రిప్టోకరెన్సీల నియంత్రణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాతే ఆ వివరాలు వెల్లడవుతాయి‘ అని బజాజ్ తెలిపారు. ‘క్రిప్టో అసెట్స్ ఆదాయంపై పన్ను విధించే విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. అందుకే గరిష్టంగా 30 శాతం రేటు పరిధిలోకి దాన్ని చేర్చాం. టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కూడా వర్తింపచేస్తున్నాం. ఇకపై ఈ లావాదేవీలన్నింటినీ ట్రాక్ చేస్తాం‘ అని ఆయన వివరించారు. క్రిప్టోల చట్టబద్ధత గురించి ప్రస్తావించకుండా.. గుర్రపు పందేలు, ఇతర స్పెక్యులేటివ్ లావాదేవీల తరహాలోనే ఈ కరెన్సీల ద్వారా వచ్చే లాభాలపైనా 30% పన్ను (సెస్సు, సర్‌చార్జీలు అదనం) విధించాలని బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి పన్ను, జులై 1 నుంచి టీడీఎస్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం కూడా క్రిప్టో లాభాలపై పన్ను వర్తిస్తుందని, 2022 ఏప్రిల్ 1కి ముందు చేసిన క్రిప్టో లావాదేవీలను ఐటీఆర్‌లోని ఏదో ఒక హెడ్ కింద చూపితే అసెస్మెంట్ అధికారి దానిపై తగు నిర్ణయం తీసుకుంటారని బజాజ్ తెలిపారు. వర్చువల్ డిజిటల్ అసెట్లకు టెక్నాలజీ తప్ప ఎటువంటి ఆర్థిక విలువ ఉండదు కాబట్టి డిడక్షన్లకు తావు ఉండదని ఆయన చెప్పారు. పన్నుతో మార్కెట్ పరిస్థితి తెలుస్తుంది: సీబీడీటీ చీఫ్ మహాపాత్ర క్రిప్టో కరెన్సీలపై పన్నుల వడ్డనతో దేశీయంగా ఈ మార్కెట్ ’లోతు’ ఎంత ఉందో తెలుస్తుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ జేబీ మహాపాత్ర చెప్పారు. అలాగే ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడుల స్వభావం మొదలైన వివరాల గురించి కూడా వెల్లడవుతుందని పేర్కొన్నారు. అయితే పన్ను విధించడమనేది.. ఈ లావాదేవీలకు చట్టబద్ధత కల్పించినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సరే డిజిటల్ వ్యాపారం ద్వారా లాభాలు ప్రకటించిన పక్షంలో.. దానికి అవసరమైన పెట్టుబడులు ఎక్కడ నుంచి తెచ్చారన్నది కూడా వెల్లడించాల్సి ఉంటుందని మహాపాత్ర తెలిపారు. ఒకవేళ పెట్టుబడి సరైనదే అయితే లాభాలపై పన్ను వర్తిస్తుందని చెప్పారు. అలా కాకుండా లెక్కల్లో చూపని డబ్బును లేదా బినామీగా ఇన్వెస్ట్ చేసినట్లు తేలితే దానికి అనుగుణంగా ఇతర చర్యలు ఉంటాయన్నారు. ట్యాక్సేషన్ వల్ల ఇవన్నీ బైటపడతాయని మహాపాత్ర చెప్పారు. అనధికారిక లెక్కల ప్రకారం 2017 నుంచి చూస్తే దేశీయంగా క్రిప్టో లావాదేవీల పరిమాణం ఏటా రూ. 30,000 కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకూ ఉంటోంది. -
వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నీరా టాండన్
వాషింగ్టన్: భారత సంతతి అమెరికన్ నీరా టాండన్ (51)కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే సీని యర్ అడ్వైజర్ హోదాలో ఉన్న ఆమెను వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నియమించినట్లు వైట్‌హౌస్ వర్గాలను ఉటంకిస్తూ మీడియా తెలిపింది. అధ్యక్ష భవనం స్టాఫ్ సెక్రటరీగా అధికార యంత్రాంగం, ఫెడరల్ ప్రభుత్వం నుంచి అధ్యక్షుడికి అందే అన్ని రకాల ఫైళ్ల బాధ్యతలను నీరా టాండన్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లెయిన్కు ఆమె తన విభాగం తరఫున నివేదికలను అందజేస్తారు. అందుకే, వైట్‌హౌస్‌కు సంబంధించి ఈ పోస్టును అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఈ నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం లేదు. జో బైడెన్ 8 నెలల క్రితం వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్, బడ్జెట్ డైరెక్టర్ పదవికి ఆమెను నామినేట్ చేయగా రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించారు. దీంతో, ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. -
నెల్లూరు బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ కిడ్నాప్ కలకలం
కృష్ణాజిల్లా: విజయవాడ పెనమలూరు పీఎస్ పరిధిలో బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ వినోద్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం కలకలం రేపింది. తన భర్తను నిన్నరాత్రి (ఆదివారం) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ప్రశాంతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న వినోద్ అనే వ్యక్తి నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా సిల్వర్ కలర్ కారులో వినోద్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో తన భర్తను కిడ్నాప్ చేశారని వినోద్ భార్య.. ప్రశాంతి పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఆటో ఎక్కిన పాపానికి సామూహికంగా ఆమెపై.. -
పంచాయతీ కార్యదర్శిపై చెప్పులతో దాడి!
సాక్షి, కెరమెరి(ఆదిలాబాద్): మండలంలోని కైరి పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌పై సర్పంచ్ లెండుగురే విజయలక్ష్మి, ఆమె భర్త బాలాజీ చెప్పులతో దాడి చేసినట్లు మంగళవారం పంచాయతీ కార్యదర్శులు సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో దత్తారాం, పీఎస్సై ప్రశాంత్‌కు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యాలయంలో విధుల్లో ఉండగా అకారణంగా దూషిస్తూ సర్పంచ్‌తోపాటు ఆమె భర్త చెప్పులతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంఘం నాయకులు మహేందర్‌రెడ్డి, రమేశ్, మల్లేశ్, హరీశ్, ధర్మయ్య తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈమేరకు సర్పంచ్ విజయలక్ష్మి, బాలాజీని వివరణ కోరగా.. ఇటీవల పంచాయతీలో చేపట్టిన పనులకు సంబంధించి తీర్మానం కావాలని కోరామన్నారు. అయితే మహిళా సర్పంచ్ అని చూడకుండా దుర్భాషలాడారని ఆరోపించారు. తాము చెప్పులతో దాడి చేయలేదని, పంచాయతీ కార్యదర్శి అకారణంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌తోపాటు డీపీవోకు నివేదిస్తానని ఎంపీడీవో తెలిపారు. కాగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
జెండా ఎగురవేశాడని దళిత సర్పంచ్‌పై సెక్రటరీ పిడిగుద్దులు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అమానుషమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక దళిత వ్యక్తి జాతీయజెండాను ఎగురవేశాడనే కోపంతో.. ఆ గ్రామ కార్యదర్శి అతనిపై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానికుల ప్రకారం.. ఈ సంఘటన బుందేల్ ఖండ్‌లో జరిగింది. కాగా, నిన్న (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఛత్తర్పూర్లోని ధాంచీ గ్రామస్తులు.. స్థానిక పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో సదరు గ్రామ కార్యదర్శి సునీల్ తివారి సమయానికి రాలేదు. దీంతో గ్రామస్తులు సర్పంచ్ హన్ను బాసర్ను జెండా ఎగురవేయాలని కోరారు. వారి కోరిక మేరకు.. హన్ను బాసర్ జెండాను ఎగురవేశాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న సునీల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తనను కాదని.. నువ్వు జెండా ఎలా ఎగురవేశావని ప్రశ్నించారు. కోపంతో విచక్షణ కోల్పోయిన సెక్రెటరీ.. దళిత సర్పంచ్‌పై పిడిగుద్దులు కురిపిస్తు దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా.. అడ్డు వచ్చిన సర్పంచ్ భార్య.. కోడలిపై కూడా దాడిచేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కార్యదర్శిపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సర్పంచ్, అతని భార్య.. సెక్రెటరీ సునీల్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా ఘటనపై కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ బాస్ సోదరుడు
కోల్‌కతా: బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ ఆసుపత్రిలో చేరారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) కార్యదర్శి అయిన స్నేహాశీష్.. స్వల్ప అస్వస్థకులోనై(జ్వరం, కడుపునొప్పి) శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆసుపత్రిలో చేరారు. ఈ ఏడాది జనవరిలో ఆయనకు అపోలో ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ జరిగింది. దీంతో యాంజియోప్లాస్టీ వల్లే ఏమైనా సమస్య వచ్చిందేమోనని కుటంబ సభ్యులు ఆందోళన చెందారు. జ్వరంగా కూడా ఉండటంతో కోవిడ్ పరీక్ష చేయించారు. అందులో నెగిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని ఉడ్‌ల్యాండ్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఏడాది జనవరిలో సౌరవ్ గంగూలీకి కూడా యాంజియోప్లాస్టీ జరిగింది. -
శ్రీకాంత్ ఫ్రమ్ సీఎం పేషీ.. బీసీ కమిషన్ చైర్మన్ పోస్టు కావాలా?
సాక్షి, హైదరాబాద్: ‘నేను ముఖ్యమంత్రి పేషీలో కార్యదర్శిగా పని చేస్తున్న శ్రీకాంత్ రావును, బీసీ కమిషన్ చైర్మన్ పోస్టు కావాలా?’ అంటూ ఎర వేసి, అందినకాడికి దండుకుని పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి బారినపడిన వారిలో పార్టీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారని ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు సోమవారం వెల్లడించారు. కరీంనగర్ జిల్లా, ఇందుర్తికి చెందిన బి.కమల్ కృష్ణ గౌడ్ బీకాం మధ్యలో ఆపేశాడు. ఆపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో రిపోర్టర్‌గా పని చేశాడు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ముఖ్యమంత్రి పేషీ కార్యదర్శి అవతారం ఎత్తాడు. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ కార్యకర్తల ఫోన్ నంబర్లు సంగ్రహించిన అతను బీసీ కమిషన్‌తో పాటు వివిధ కమిషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులు ఇప్పిస్తానంటూ ఫోన్లు చేశాడు. పలువురి నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు వసూలు చేసి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాడు. ఇతగాడిపై గోపాలపురంతో పాటు జవహర్‌నగర్ పీఎస్‌లలో మూడు కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు చేపట్టిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని బృందం సోమవారం అతడిని అరెస్టు చేసింది. పవర్ ప్లాంట్ పనుల నిలిపివేత దుండిగల్: దుండిగల్ తండా సమీపంలో చేపట్టిన రాంకీ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను మున్సిపల్ అధికారులు నిలిపి వేశారు. పవర్ ప్లాంట్‌కు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంటూ దుండిగల్ కమిషనర్ భోగీశ్వర్లు నేతృత్వంలో సోమవారం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న టౌన్ ప్లానింగ్ అధికారి, సిబ్బంది జేసీబీతో బేస్మెంట్, పిల్లర్లను కూల్చివేయించారు. -
AP: పోలవరం ప్రగతిపై నేడు సమీక్ష
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహిస్తామని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ లేఖ రాశారు. ఈ సమీక్షలో రాష్ట్ర జలవనరులశాఖ ఉన్నతాధికారులతోపాటు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, సీడబ్ల్యూసీ చైర్మన్ హెచ్‌కే హల్దార్, డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య తదితరులు పాల్గొననున్నారు. ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసిన విషయం విదితమే. ఈ సీజన్లో చేయాల్సిన పనుల ప్రగతిపై సమావేశంలో సమగ్రంగా సమీక్షిస్తారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు, వరదను దిగువకు మళ్లించే స్పిల్‌వే పనులు, 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పనపై చర్చిస్తారు. గోదావరి వరదను స్పిల్‌వే మీదుగా మళ్లించడంపై సమీక్షించి, వరద సమయంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పనులు చేపట్టి 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు. రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వడం, ఆ మేరకు నిధులు విడుదల చేయడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు ముందుగా ఖర్చుచేసిన నిధులను రీయింబర్స్ చేయడంలో జాప్యం లేకుండా చూడటం, ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి అవసరమైన సహకారం అందించడంపై కూడా సమావేశం అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తూ బుధవారం కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు లేఖ రాశారు. పనుల పరిశీలన పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను బుధవారం ప్రత్యేక అధికారుల బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ సీడీవో కె.శ్రీనివాస్, సీఈ హైడ్రాలజీ టీఎన్వీ కుమార్, ఆంధ్రా రీజియన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ రేవు సతీష్‌కుమార్, అడ్వయిజర్ గిరిధర్‌రెడ్డి, పోలవరం ప్రాజెక్టు సీఈ ఎం.సుధాకర్‌బాబు పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, పైలెట్ చానల్, కాఫర్ డ్యామ్ పనులు పరిశీలించి ఎస్ఈ కె.నరసింహమూర్తిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 15వ తేదీలోపు స్పిల్‌వే మీదుగా గోదావరి నీటిని దిగువకు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. స్పిల్‌వే మీదుగా నీరు దిగువకు విడుదల చేస్తే నీటి ప్రవాహం ఎలా ఉంటుంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై చర్చించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణంతో ఇప్పటికే నీరు ఎగపోటు పెరుగుతోందనే అంశాన్ని పరిశీలించారు. స్పిల్‌వే, రివర్స్ స్లూయిజ్ గేట్ల నుంచి దిగువకు స్పిల్ చానల్ మీదుగా తిరిగి గోదావరి ప్రవాహం యథావిధిగా నదిలో కలిసేలా పనులు చేపట్టారు. అనంతరం పోలవరం గ్రామంలో వరద రక్షణగా నిర్మించిన నెక్లెస్‌బండ్ పనులను అధికారుల బృందం పరిశీలించింది. చదవండి: Jagananna Vidya Kanuka: నాణ్యమైన ‘కానుక’.. ఈ ఏడాది అవి అదనం -
రియల్టీ @ లక్ష కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగం 2030 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. ఉపాధి కల్పనలో 11 శాతం వాటాతో ఎకానమీలో రియల్ ఎస్టేట్ కీలకమైన రంగంగా ఉంటోందని ఆయన వివరించారు. ‘2019–20లో జీడీపీలో రియల్టీ రంగం వాటా దాదాపు 7 శాతం. సుమారు 200 బిలియన్ డాలర్ల మేర వృద్ధికి దోహదపడింది. 2030 నాటికి ఎకానమీ 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో సుమారు 10 శాతం వాటా రియల్ ఎస్టేట్ నుంచి రానుంది. అంటే.. 2030 నాటికి ఈ రంగం 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని దాటేయవచ్చని అంచనాలు ఉన్నాయి‘ అని మిశ్రా వివరించారు. ఉపాధి కల్పన విషయంలోనూ రియల్టీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని.. 50 కోట్ల ఉద్యోగాల్లో దాదాపు 5.5 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. రియల్టీ పోర్టల్ హౌసింగ్ డాట్‌కామ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), పరిశ్రమ సమాఖ్య నారెడ్కో కలిసి రూపొందించిన ఇళ్ల ధరల సూచీని వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా మిశ్రా ఈ విషయాలు వివరించారు. గత ఏడేళ్లుగా రియల్టీ రంగం గణనీయ మార్పులకు లోనైందని రెరా చట్టం ఇందులో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, నాగాలాండ్ మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది అమలవుతోందన్నారు. హైదరాబాద్ సహా 8 నగరాల్లో.. హౌసింగ్‌డాట్‌కామ్, ఐఎస్బీలోని శ్రీని రాజు సెంటర్ ఫర్ ఐటీ అండ్ నెట్వర్క్డ్ ఎకానమీ (ఎస్ఆర్ఐటీఎన్ఈ) రూపొందించిన సూచీ (హెచ్పీఐ).. హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఉపయోగపడగలదని మిశ్రా తెలిపారు. దీన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏ తరుణంలో కొనుక్కోవచ్చన్న విషయంలో కొనుగోలుదారులు, ఎప్పుడు విక్రయించుకుంటే శ్రేయస్కరమో అటు విక్రేతలు తగు నిర్ణయాలు తీసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ తెలిపారు. ఆయా నగరాల్లో అమ్ముడైన యూనిట్లు, ధరలకు సంబంధించిన నెలవారీ నివేదికలు ఇందులో ఉంటాయి. రియల్టీ రంగంలో ధోరణులను విధానకర్తలు, ఆర్థికవేత్తలు తెలుసుకునేందుకు కూడా ఈ సూచీ ఉపయోగపడనుంది. హౌసింగ్‌డాట్‌కామ్ అనుబంధ సంస్థ ప్రాప్‌టైగర్ ఇప్పటికే డిమాండ్,సరఫరా, ధరలు, అమ్ముడు కాకుండా ఉన్న ఇళ్ల డేటాను మూణ్నెల్లకోసారి అందిస్తోంది. -
విషాదం: కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి మృతి
న్యూఢిల్లీ: మనుషుల జీవితాలను కరోనా వైరస్ రెండో దశ అతలాకుతలం చేస్తోంది. ఎలాంటి తారతమ్యం లేకుండా నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంటోంది. ఎంతో మంది ప్రముఖులు, సాధారణ ప్రజలు కోవిడ్ కోరల్లో చిక్కుకొని మృత్యువాతపడుతున్నారు. తాజాగా కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నారాయణరాజు(62) మృతిచెందారు. డీఆర్డీవో ఫెసిలిటీలో చికిత్స పొందుతూ నారాయణరాజు మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. నారాయణరాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా. ఇటీవలే రాజుకు న్యాయశాఖ కార్యదర్శిగా ఒక సంవత్సరం పొడిగింపు ఇచ్చారు. చదవండి: కోవిడ్ సెకండ్ వేవ్: ఏపీలో అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ -
సీఎం కార్యదర్శి ఆత్మహత్యాయత్నం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజాకీయ కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ కుమార్ శుక్రవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. తన నివాసంలో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలో కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సంతోష్ కుమార్‌ను స్థానిక ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. భర్త ఆత్మహత్య యత్నంపై ఆయన భార్య జాహ్నవి మీడియాతో మాట్లాడుతూ.. ‘ నా భర్త సంతోష్ కుమార్ శుక్రవారం సాయంత్రం చాలా ఆందోళనతో పాటు, బాధగా కనిపించారు. సాయంత్రం 7గంటల సమయంలో ఆయన ఇంటి మేడపైకి వెళ్లారు. నేను డిన్నర్‌కు ఏం వండాలో అడుగుదామని మేడపైకి వెళ్లాను. అప్పటికే ఆయన స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలో ఉన్నారు. పక్కనే నిద్ర మాత్రలు కనిపించాయి. దీంతో వెంటనే స్థానిక అస్పత్రిలో చేర్చాం’ అని ఆమె తెలిపారు. తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని, తమకు ఎలాంటి సమస్యలు లేవని జాహ్నవి వెల్లడించారు. చదవండి: అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఈ ఘటనపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందిస్తూ.. ‘అతను ఎందుకు అలా ఆత్మహత్యకు యత్నించాడో తెలియదు. సంతోష్‌కు సరైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించాన’ని తెలిపారు. అలాగే సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా సంతోష్ కుమార్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఆయన ఈ ఏడాది ప్రారంభంలో ముఖ్యమంత్రికి రాజకీయ కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే. అయితే సంతోష్ కుమార్ ఆత్మహత్య యత్నానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘ప్రియురాలి’ కోసం కొడుకుని చంపిన తల్లి -
ఐటీ శాఖ కార్యదర్శిగా భాను ప్రకాష్
సాక్షి, విజయవాడ: ఐటీ శాఖ కార్యదర్శిగా వై భాను ప్రకాష్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు కరోనా ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్‌గా రాజమౌళిని ప్రభుత్వం నియమించింది. కరోనా ఆస్పత్రుల సామర్థ్యం, సన్నద్ధత పర్యవేక్షణ తదితర బాధ్యతలను రాజమౌళి పర్యవేక్షించనున్నారు. దేశంలో కరోనా టెస్ట్‌లను అత్యధికంగా నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రపదేశ్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. శుక్రవారం రాష్ట్రంలో కొత్తగా 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 21,020 శాంపిల్స్‌ను పరిక్షించగా అందులో 1576 కేసులు ఏపీలో నమోదవ్వగా, మిగతా 32 కరోనా కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 25,422కి చేరింది. -
కరోనా: బంగ్లాదేశ్ రక్షణ శాఖ కార్యదర్శి మృతి
ఢాకా: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ రక్షణ శాఖ సీనియర్ కార్యదర్శి అబ్దుల్లా అల్ మోసీన్ చౌదరి (57) కరోనా వ్యాధితో మరణించారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. అబ్దుల్లా మృతిపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంతాపం తెలిపారు. గత నెల మే 29న అనారోగ్యంతో ఢాకాలోని మిలిటరీ ఆసుపత్రి (సీఎంహెచ్)లో చేరిన అబ్దుల్లాకు కరోనా పరీక్షలు చేయగా పాజిటీవ్‌గా తేలింది. దీంతో ఆయనను జూన్ 6న ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రత్యేక వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని అదనపు కార్యదర్శి ఎండీ మహమూద్ ఉల్ హక్ తెలిపారు. ఆయన మృతికి బంగ్లాదేశ్ రక్షణ శాఖ సిబ్బంది, ఇతరులు నివాళులర్పించారు. కాగా అబ్దుల్లాకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
రక్షణశాఖలో కరోనా కలకలం
ఢిల్లీ : భారత రక్షణ శాఖలో కరోనా కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌కు మంగళవారం నిర్వహించిన పరీక్షలో కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయనను క్వారంటైన్ చేసిన అధికారులు మొత్తం కార్యాలయాన్ని శానిటైజేషన్ చేయించారు. ఆయన పనిచేస్తున్న రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్‌లోని మిగతా 35 మంది ఉద్యోగులను కూడా హోం క్వారంటైన్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా రాజ్‌నాథ్ సింగ్ బుధవారం కార్యాలయానికి హాజరు కాలేదు. గత కొన్ని రోజులుగా అజయ్ కుమార్.. రక్షణ శాఖ అధికారులు ఎవరెవరిని కలిశారనన్న దానిపై ఆరా తీస్తున్నారు. కేంద్ర రక్షణమంత్రి, కార్యదర్శి, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ కార్యాలయాలు సౌత్ బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఉన్నాయి. దీంతో మొత్తం కార్యాలయాలను శుభ్రం చేయించి ఉద్యోగులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. (గుజరాత్ ఫ్యాక్టరీలో ప్రమాదం..) ఇక దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా 8వేలకు పైగానే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. లాక్డౌన్ 4.0లో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పక్షం రోజుల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. ప్రపంచంలోనే కరోనా ప్రభావానికి గురైన దేశాల్లో ప్రస్తుతం మన దేశం 7వ స్థానంలో ఉంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో అతి త్వరలోనే భారత్ అమెరికా సరసన చేరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు ) -
‘హిందుమత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా’
సాక్షి, విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. మతాల మధ్య అంతరం పెంచడానికి చూస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ గురువారం ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ధర్నాలో రామకృష్ణ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసనలు వ్యక్తం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ హిందుమత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా తన వైఖరి చూపుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్ఆర్సీ ద్వారా ప్రజల మధ్య విభజన తెచ్చేలా చేస్తున్నారని.. వెంటనే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మైనారిటీలకు అండగా దేశవ్యాప్తంగా బంద్‌కు సైతం పిలుపునిస్తామని రామకృష్ణ హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చటాన్ని ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఆరంభం మాత్రమే అని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. బీజేపీ రాజ్యాంగం మీద తలపెట్టిన దాడిని తిప్పి కొడతామని మధు అన్నారు. ఇది హిందు ముస్లింల సమస్య కాదని.. లౌకికవాద సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు. -
‘ప్రజలను అప్రమత్తం చేయడంలో ఏపీ ముందంజ’
సాక్షి, విజయవాడ: పిడుగుపాట్ల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్, రెవెన్యూ డిపార్టుమెంట్ సెక్రటరీ ఉషారాణి తెలిపారు. నగరంలో ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్, నేషనల్ ఇస్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, యూనిసెఫ్ ఆధ్వరంలో ‘పిడుగు పాటు ముందస్తు సూచనలు, అవగాహన విధానాలు’పై బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉషారాణి మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలు ప్రకృతి విపత్తులను ఏవిధంగా ఎదుర్కొంటున్నాయని.. ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లపై అనుసరిస్తున్న విధానాలపై చర్చించామని ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో పిడుగుపాటుకు 25 వేల మంది చనిపోయారని ఆమె వెల్లడించారు. సాంకేతికతను వినియోగించుకుని పిడుగుపాట్లపై మండలస్థాయిలో ప్రజలను చైతన్య పరుస్తున్నామని ఉషారాణి పేర్కొన్నారు. అదేవిధంగా మోబైల్‌ఫోన్లకు సందేశాలు సైతం పంపుతున్నామని ఆమె చెప్పారు. పిడుగుపాట్ల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. ప్రజలు సైతం అవగాహన కలిగి ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లకూడదని.. ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పుడు యర్త్ఇన్ చేసుకోవాలని ఉషారాణి సూచించారు. గ్లోబుల్ వార్మింగ్ సైతం తగ్గించేలా చెట్లను పెంచాలని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని సెక్రటరీ ఉషారాణి పేర్కొన్నారు. -
కెవిన్ అనూహ్య రాజీనామా
వాషింగ్టన్: అమెరికా యాక్టివ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ కెవిన్ మెక్‌లీనన్ అనూహ్యంగా పదవి నుంచి వైదొలిగారు. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కెవిన్ మెక్‌లీనన్ హోంల్యాండ్ సెక్యూరిటీ యాక్టింగ్ సెక్రటరీగా అత్యుత్తమ సేవలందించారంటూ ఆయనకు ట్రంప్ అభినందనలు తెలిపారు. చాలా ఏళ్లపాటు పాటు ప్రభుత్వానికి సేవలించిన కెవిన్ ఇపుడు తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని, ప్రైవేటు రంగానికి వెళ్లాలని కోరుకుంటున్నరాని ఆయన ట్వీట్ చేశారు. చాలా మంది అద్భుతమైన అభ్యర్థులున్నారనీ, వచ్చే వారం కొత్త యాక్టింగ్ సెక్రటరీని ప్రకటిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ మెక్‌లీనన్ సేవలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అటు తన రాజీనామా విషయాన్ని కెవిన్ కూడా ట్విటర్ ద్వారా ధృవీకరించారు. కాగా మాజీ డిహెచ్ఎస్ కార్యదర్శి కిర్స్ట్జెన్ నీల్సన్ రాజీనామా చేసిన తరువాత ఏప్రిల్‌లో మెక్‌లీనన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డిహెచ్ఎస్) యాక్టింగ్ చీఫ్‌గా ఎన్నికయ్యారు. అక్రమ వలసదారులను దక్షిణ సరిహద్దు నుండి యుఎస్‌లోకి ప్రవేశించకుండా నిరోధించే దూకుడు ప్రచారాన్ని పర్యవేక్షించిన మెక్‌లీనన్, ఇటీవల తన ఉద్యోగల బాధ్యతలపై మీడియా ద్వారా తన నిరాశను వ్యక్తం చేశారు. దీనికి తోడుగా వైట్ హౌస్ అతన్ని శాఖ కార్యదర్శిగా నామినేట్ చేయడానికి ఇష్టపడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. Kevin McAleenan has done an outstanding job as Acting Secretary of Homeland Security. We have worked well together with Border Crossings being way down. Kevin now, after many years in Government, wants to spend more time with his family and go to the private sector.... — Donald J. Trump (@realDonaldTrump) October 11, 2019 Thank you Kevin McAleenan for your dedication and service to our country! You have done great work securing our border and we are thankful for your continued support of President @realDonaldTrump and our entire Administration. — Vice President Mike Pence (@VP) October 12, 2019 I want to thank the President for the opportunity to serve alongside the men and women of the Department of Homeland Security. With his support, over the last 6 months, we have made tremendous progress mitigating the border security and humanitarian crisis we faced this year... pic.twitter.com/A4rTcZgJKF — Acting Sec. Kevin McAleenan (@DHSMcAleenan) October 12, 2019 -
మాయావతి మాజీ కార్యదర్శికి ఐటీ షాక్
సాక్షి, ముంబై: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మయావతికి మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేత్‌రామ్‌కు ఐటీ విభాగం షాకిచ్చింది. అక్రమ ఆస్తులకు సంబంధించి ఆదాయ పన్నుఅధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నోయిడా, కోల్‌కతా, ముంబైతోపాటు మొత్తం 19 స్థిరాస్తులను ఆదాయపు పన్ను శాఖ ఎటాచ్ చేసింది. నేత్రకు చెందిన మొత్తం 230 కోట్ల రూపాయల విలువైన 'బినామి' ఆస్తులను ఎటాచ్ చేసినట్టుగా అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి. 1988 బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం సెక్షన్ 24 (3) కింద, వివిధ వాణిజ్య, నివాస ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. జప్తుచేసిన వాటిలో వాణిజ్య, నివాస సముదాయాలుతోపాటు రూ.1.64 కోట్ల నగదు, రూ.50 లక్షల విలువైన ‘మాంట్ బ్లాంక్' కలాలు, నాలుగు విలాసవంతమైన ఎస్యూవీ కార్లు ఉన్నాయి. బీఎస్పీ అధినేత మాయావతి ముఖ్యమంత్రి పదవిలో ఉండగా వివిధ ఉన్నత పదవుల్లో పనిచేసిన నేత్రామ్ నివాసం, కార్యాలయాలపై ఈ ఏడాది మార్చిలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రూ.300 కోట్ల విలువైన బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. యూపీలో బీఎస్పీ పాలనలో షుగర్ మిల్లుల పెట్టుబడుల కుంభకోణం కేసులో అవినీతి ఆరోపణలకు సంబంధించి సీబీఐ కూడా ఆయనను విచారిస్తోంది. కాగా ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏడు సంవత్సరాల వరకు కఠినమైన జైలు శిక్ష, బినామీ ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. -
త్రిపుర రాష్ట్ర సీఎస్‌గా తెలుగోడే!
సాక్షి, తిరుపతి : త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఉసురుపాటి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు తిరుపతిలోని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర్లు స్వస్థలం కార్వేటినగరం మండలం సుద్ధగుంట గ్రామం. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం తిరుపతిలోని నెహ్రు మున్సిపల్ హైస్కూల్లో సాగింది. శ్రీవెంకటేశ్వర జూనియ ర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. అనంతరం ఎస్వీ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్, ఐఏఆర్ఐ (న్యూఢిల్లీ)లో ఎంఎస్సీ, పీహెచ్డీ పూర్తి చేశారు.1986లో ఐఏఎస్‌గా సెలెక్టయ్యారు. వెంకటేశ్వర్లు ఉమ్మడి రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ టూ సెక్రటరీ, వ్యవసాయశాఖలో జాయింట్ సెక్రటరీ, విద్యాశాఖ జాయింట్ సెక్రటరీగా పనిచేసి కేంద్ర సర్వీసులకు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి వద్ద పీఎస్‌గా బాధ్యతలు నిర్వహించారు. -
ప్లాట్ నెంబర్ 420
పెద్ద భవంతి... గదుల్లోంచి గదులు.. వసారాల మీద వసారాలు! ఆ మేడ వైశాల్యానికి తగ్గట్టే నిండా మనుషులు. ముత్తాత, జేజమ్మ, తాత, నానమ్మ, నాన్న, అమ్మ, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, అత్తలు, పిన్నులు, మామయ్యలు, బాబాయ్‌లు, అక్కలు, బావలు, అన్నలు, వదినలు, చెల్లెళ్లు, తమ్ముళ్లు, పిల్లలు.. పిల్లులు, కుక్కలు..! ‘‘గమనించావా?’’ అధికారం పెద్ద కోడలి మాటల్లో. ‘‘ఇంకా లేదు. కాని ఆమె స్పీడ్ .. అదీ చూస్తుంటే అనుమానమేమీ రావట్లే’’ చెప్పింది.‘‘అయినా కీన్గా అబ్జర్వ్ చెయ్’’ అని చెప్పి బయటకు వెళ్లిపోయింది పెద్దకోడలు. తలూపి పనిలో పడిపోతుండగా... ‘‘అభయంక్... ఆగు.. నేను పట్టి ఇస్తాను...’’ అంటూ మూడేళ్ల పిల్లాడి వెనకాల పరిగెడ్తూ సెక్రటరీ గదిలోకి వచ్చింది నైరా. అభయంకేమో ఓ పిల్లిపిల్ల వెనకాల ఉరుకుతున్నాడు. ఆ కూన గదిలో నాలుగు మూలలు తిరుగుతూ చివరకు సెక్రటరీ కుర్చీ కింద నక్కింది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో నైరా .. సెక్రటరీ కుర్చీ కిందకు దూరబోతుంటే.. ఉలిక్కిపడ్డ సెక్రటరీ ‘‘ఏయ్ ఏం చేస్తున్నావ్’’ అంటూ గబుక్కున తన కాళ్లను కుర్చీ మీద పెట్టుకొని స్కర్ట్‌ను కిందకు లాక్కుంది. అదేమీ పట్టించుకోకుండా...ఆ మాటలేవీ వినిపించుకోకుండా పిల్లిని పట్టుకోవడం మీదే కాన్సన్ట్రేట్ చేసింది నైరా సీరియస్‌గా. పిల్లికూనను చేతచిక్కించుకుని కుర్చీ కింద నుంచి లేచింది నింపాదిగా నైరా. దాని తల నిమురుతూ తననే తదేకంగా చూస్తున్న అభయంక్ దగ్గరకు వెళ్లింది. ‘‘తీసుకో...’’ అంటూ వాడి చేతుల్లో పెట్టింది. వాడు వెంటనే దాన్ని వదిలేశాడు. నైరా తిక్క నషాళానికంటింది. ఓ గంట నుంచి ఇదే తంతు. వాడి జబ్బ పుచ్చుకుని బరబరా లాక్కెళ్లి గదిలో పడేసి తాళం వేయాలన్నంత కోపంగా ఉంది. మొహంలో ఆ భావంతోనే వాడి వైపు గుడ్లురిమింది నైరా.ఆమె కోపాన్ని లెక్క చేయకుండా అభయంక్ మళ్లీ పిల్లిపిల్ల వెంట ఇంకో గదిలోకి పరిగెత్తాడు. అయితే నైరా వైల్డ్ ఎక్స్ప్రెషన్ను సెక్రటరీ లక్ష్యపెట్టింది. కనుబొమలు ముడివేసింది. ‘‘మేడం చెప్పినట్టు కీన్గా అబ్జర్వ్ చేయాల్సిందే’’ అనుకుంటూ లేచి నిలబడింది సెక్రటరీ. అప్పుడే నైరా ఫోన్ మోగింది. జీన్స్ ప్యాంట్ జేబులోంచి ఫోన్ తీస్తూ మరో గదిలోకి వెళ్లింది ఫోన్ మాట్లాడుకోవడానికి. ఆమె వెనకాలే సెక్రటరీ. నైరాకు కనిపించకుండా!‘‘ఆ... అమ్మా... చెప్పు’’ నైరా ఫోన్ లిఫ్ట్ చేస్తూ!‘‘లంచ్ చేశావా?’’ అమ్మ పలకరింపు అవతలి నుంచి.‘‘ఆ.. తిన్నాలే..’’ ఉదాసీనంగా నైరా. ‘‘ఎలా ఉంది కొత్త ఉద్యోగం?’’ కలవరంగా అమ్మ. ‘‘ వీళ్లు పిల్లలు కాదే..పిశాచాలు..’’ నైరా నొక్కి పలికింది.ఆ మాటను చెవులు రిక్కించి మరీ విన్నది సెక్రటరీ.పి..శా..చా..లు.. స్పష్టంగా వినపడగానే అక్కడి నుంచి కదిలింది. ‘‘ఏమైందో చెప్పు అంటుంటే..’’ ఫోన్లో అమ్మ కంటిన్యుయేషన్.‘‘లంకంత కొంప... ఇంటెడు మనుషులు.. వాళ్లకు పిల్ల దయ్యాలు.. చంపుతున్నాయే..’’ గోడు వెళ్లబోసుకుంది.‘‘ఎందుకొచ్చిన బేబీ సిట్టర్ ఉద్యోగం అంటే విన్నావా? లైఫ్ అంటే ఎక్స్పెరిమెంటల్గా ఉండాలి. రేప్పొద్దున ఎబ్రాడ్ వెళితే.. ఏ జాబ్ చేయడానికైనా రెడీగా ఉండాలి..అంటూ పెద్ద స్పీచ్ ఇచ్చావ్ కదే.. అనుభవించు’’ రెచ్చగొట్టింది అమ్మ.‘‘ఆపమ్మా... నువ్వొకదానివి! ఏదో బుద్ధి తక్కువై అన్నాను. నా తిప్పలేవో నే పడ్తాలే.. పెట్టేయ్ ఫోన్..’’ ఉక్రోషంతో ఫోన్ డిస్కనెక్ట్చేసింది నైరా.ఆపాటికే వివిధ వయసుల్లో ఉన్న ఒక డజన్ మంది పిల్లలంతా నైరా చుట్టూ చేరి గోల చేయసాగారు.ఓ చేతిలో ఫోన్.. ఇంకో చేత్తో నుదురు పట్టుకుని కూలబడి పోయింది నైరా నీరసంగా! ∙∙ నైరా ఆ జాబ్‌లో చేరి వారం అవుతోంది. అంతకుముందు ఎమ్ఎన్సీలో చేసేది. కాస్ట్‌కటింగ్‌లో ఆ ఉద్యోగం పోయింది. ‘‘బేబీ సిట్టర్’’ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చినప్పడు ఈ పిల్లలను చూసి చాలా ముచ్చటపడింది. ఓసోస్.. ఈ బుజ్జిగాళ్లను సంభాళించలేనా అని అనుకుంది. అంత బుద్ధిగా కనిపించారు. మొదటి రోజే దర్శనమిచ్చారు ఆ పిల్లల్లోని రాక్షసులు!తిండి పెడ్తూనే ఉండాలి.. అల్లరి చేస్తూనే ఉంటారు. అంత తిండి ఎలా అరిగించుకుంటున్నారో.. అంత అల్లరికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో.. పెద్ద పజిల్ నైరాకి. సాయంకాలానికల్లా ఇల్లు పీకి పందిరేస్తారు. తెల్లవారి డ్యూటీకి వచ్చేటప్పటికిఎక్కడిదక్కడ చక్కగా నీట్‌గా సర్దేసి ఉంటుంది. అంత ఓపిక ఉన్నావాళ్లు తనను.. తనలాంటి ఇంకొంతమంది నౌకర్లను ఎందుకు పెట్టుకున్నట్టు? ఆ పెద్దల ప్రవర్తనా వింతే ఆమెకు. మిగతా నౌకర్ల తీరు కూడా!ఎవరూ ఎవరితో ఏమీ మాట్లాడుకోరు. అందరి షెడ్యూల్ ఆ ఇంటి పెద్ద కోడలే నిర్ణయిస్తుంది. ఇంప్లిమెంట్ అయ్యేలా చూస్తుంది సెక్రటరీ. కురు వృద్ధులు.. ఎప్పుడూ వాళ్ల గది దాటి బయటకు రారు. వాళ్లు నడుస్తుంటే ప్రత్యేకించి నేలను శుభ్రం చేయక్కర్లేదు. జుట్టే శుభ్రం చేస్తుంది. పిల్లలకూ అంతే జుట్టు. ఎవరు ఏ పని చేస్తున్నారో తెలీదు కాని అందరూ బిజీగా ఉంటారు. ఇంటికొస్తూంటారు.. పోతూంటారు!ఎప్పుడూ సందడే.. కాని సంబరమే ఉండదు! అన్నిటికన్నా విస్మయం ..నైరా తప్ప మిగిలిన నౌకర్లంతా ఒకేరకంగా ఉండటం. ఈ ఇల్లు ఊరు అవుట్స్కట్స్లో ఉందని ప్రత్యేకించి వెహికిల్ కూడా పంపుతున్నారు నైరా కోసం. అదో చిత్రం. ఒకసారి వచ్చిన డ్రైవర్ మళ్లీ కనిపించడు. తనను పెద్ద కోడలెప్పుడూ అనుమానాస్పదంగా చూస్తుంది. ఎందుకో.. నైరా అనుకుంటూండగా..పెద్ద కోడలు వచ్చింది బయట నుంచి. ఆమె వెనకాలే సెక్రటరీ గబగబా లోపలకి వెళ్లింది. ‘‘మేడం.. మన దగ్గర జాయిన్ అయినప్పటి నుంచీ ఆమె లాంగ్ స్కర్ట్సే వేసుకొని వచ్చింది. సో.. అబ్జర్వ్ చేయలేకపోయా. బట్ ఈరోజు మీరుగుర్తు చేశాక.. పనిగట్టుకొని మరీ గమనించా.. ఆమె మాటలు కూడా విన్నా. పిశాచాల్లా అని చెప్తుంది ఫోన్లో ఎవరికో మరి. ప్లస్ ఆమె పాదాలు... స్ట్రయిట్’’ చెప్పింది. పెద్ద కోడలు ఎడమ కన్ను ఐబ్రో పైకి లేచింది. చెవులు నిటారయ్యాయి. ‘‘హూ.. తప్పదన్నమాట’’ అంది.‘‘యెస్ మామ్’’ ‘‘ఈ రోజు వెహికిల్ ఎందుకు పంపలేదు? ఫోన్ చేస్తుంటే కూడా అవుటాఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. ఏమై ఉంటుదబ్బా..? కొంపదీసి నా సర్వీసెస్ చాలని చెప్పడానికి ఇండికేషన్ కాదుకదా ఇది?’’ క్యాబ్‌లో కూర్చున్నాక నూట ముప్పయో సారి నైరా అలా అనుకోవడం. నైరా పెట్టిన డెస్టినేషన్ దగ్గర ఆపాడు క్యాబ్.. డ్రైవర్. ఆలోచనలకూ బ్రేక్ పడడంతో అడిగింది డ్రైవర్ని... ‘‘ఏమైందీ?’’ అని. ‘‘మీ డెస్టినేషన్ వచ్చింది మేడమ్’’ అంటూ ఫోన్లో ఫేర్ చూస్తున్నాడు డ్రైవర్. కార్ విండోలోంచి అవతలికి చూసింది. అపరిచిత ప్లేస్‌లా అనిపించి ‘‘ఎటు తీసుకొచ్చావ్?’’ అడిగింది. ‘‘మీరు పెట్టిన పాయింట్‌కే. థౌజెండ్ ట్వంటీఅయింది మేడం ఫేర్’’ అని డ్రైవర్ చెప్తూంటే చెవికెక్కడం లేదు ఆమెకు.. కార్ దిగింది. అక్కడేమీ లేదు. శ్మశానం తప్ప. ‘‘ఇదేంటి? శ్మశానం..?’’నైరా.‘‘మేడం.. మీరు పెట్టిన డెస్టినేషనే చూసుకోండి..’’చెప్పాడు. నిజమే! చూస్తే.. ప్లాట్ నెంబర్ 420.. రీచ్డ్ అని చూపిస్తోంది జీపీఎస్ మ్యాప్. నైరా మొహంలో నెత్తురు చుక్కలేదు. ∙సరస్వతి రమ -
ఏడేళ్లలో వేయి విమానాలు..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ రానున్న ఏడెనిమిదేళ్లలో వేయి విమానాలను ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానుంది. రానున్న పదిహేను సంవత్సరాల్లో దేశంలో అదనంగా మరో 100 విమానాశ్రయాలు సమకూరుతాయని, ఏడెనిమిదేళ్లలో వేయికి పైగా విమానాలు తోడవనున్నాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యర్శి ఆర్ఎన్ చూబే పేర్కొన్నారు. భారత్ ఏవియేషన్ లోకోమోటివ్ హబ్‌గా మారనుందని ఆర్ఎన్ చూబే చెప్పారు. గత నాలుగేళ్లుగా దేశీయ పౌరవిమాన యాన పరిశ్రమ 20 శాతం వార్షిక వృద్ధితో ఎదుగుతోందని వెల్లడించారు. భారత్‌లో విమానయాన వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికమని, ఇది నిలకడగా కొనసాగుతున్నదని ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్‌లో తెలిపారు. ఏవియేషన్ ఇంధన ధరలు భారం కాకుండా ఉంటే మరో ఇరవయ్యేళ్లు ఈ వృద్ధి కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విమానయాన వృద్ధికి అవసరమైన తోడ్పాటును ప్రభుత్వం అందిస్తుందని చూబే చెప్పారు. -
సీసీఐ కార్యదర్శిగా పి.కె. సింగ్
న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొత్త కార్యదర్శిగా పి.కె.సింగ్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా సీసీఐకి ఆయన న్యాయపరమైన అంశాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. కార్యదర్శి పోస్టులో నియామకం కోసం సీసీఐ సెప్టెంబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, సీసీఐకి అయిదేళ్ల పాటు సలహాదారుగా అనుభవమున్న వారిని కూడా ఎంపిక చేయొచ్చన్న నిబంధన మేరకు సింగ్‌ను నియమించినట్లు సంస్థ తెలిపింది. గుత్తాధిపత్య ధోరణులు, నిర్బంధ వాణిజ్య విధానాల నివారణ కమిషన్ స్థానంలో 2003లో సీసీఐ ఏర్పాటైంది. వ్యాపార రంగం లో పోటీ సంస్థలను దెబ్బతీసే ధోరణులకు చెక్ చెప్పేందుకు, విలీనాలు.. కొనుగోళ్ల డీల్స్‌ను నియంత్రించేందుకు సీసీఐ ఏర్పాటైంది. -
సచివాలయంలో సీఎస్ ఎస్ కె జోషి సమిక్ష సమావేశం
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా అప్పం కిషన్
భూపాలపల్లి అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా భూపాలపల్లికి చెందిన అప్పం కిషన్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కిషన్ విద్యార్థి దశ నుంచి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అభిమాని కాగా, 2003 సంవత్సరంలో వైఎస్ చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్‌పార్టీలో చేరి ఎన్ఎస్యూఐలో కీలకంగా పనిచేశారు. 2010లో జగన్ యువసేన వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2011లో వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నారు. 2012లో పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లాల విభజన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా సింగరేణి ఎన్నికల్లో మహాకూటమి గెలుపొందేందుకు కృషిచేశారు. తన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి పదవి ఇచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, షర్మిల, వరంగల్ రూరల్ జిల్లా క్రాంతికుమార్, రాష్ట్ర నాయకులందరికీ అప్పం కిషన్ కృతజ్ఞతలు తెలిపారు. -
సీల్డ్ కవర్లో....
యద్దనపూడి సులోచనారాణి గారి ‘సెక్రటరీ’ నవల యాభై సంవత్సరాల పండగని తెలుగు పాఠకలోకం జరుపుకుంటున్న సందర్భం అది. అనేక టీవీ చానళ్లు ఆవిడ ఇంటర్వూ్యలను ప్రసారం చేశాయి. ఆ సందర్భంలో ఓ ఇంటర్వ్యూ చివరలో యాంకర్ అడిగారు, ‘‘మేడమ్! మీరు ఎన్నో కథలు, నవలలు రాసారు. వాటి గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ ముగింపుగా మీరో చిన్న కథ చెప్తారా!’’ అని. దానికి సమాధానంగా శ్రీమతి సులోచనారాణి చెప్పిన కథ ఇది : ఒక రచయిత్రి ఉంటుంది. ఎన్నో కథలు, నవలలు రాసింది, రాస్తూ ఉంటుంది. ఆమె తర్వాతి కథ ఎప్పుడు వస్తుందా అని పాఠకులు ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటారు. ఆమెకు డెబ్భయి ఏళ్లు వచ్చేశాయి. రాస్తూనే ఉంటుంది. అప్పుడేదో చానల్‌వాళ్లు ఇంటర్వూ్య చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో మీరు రాయబోయే కథ ఏమిటి అని అడుగుతారు. చెప్తాను. నా పబ్లిషర్ ఎమెస్కో విజయకుమార్ ఉన్నారు కదా! నా చివరి నవల రాసి ఆయనకు ఇచ్చేస్తాను. ఆయన దాన్ని నేను చనిపోయిన తర్వాత ప్రచురిస్తారు. అప్పుడు మీరందరూ చదువుకుందురుగాని; అని చెప్తుందావిడ; నేనేననుకోండి. అయితే ఆవిడ ఆ తర్వాత రెండేళ్లు, మూడేళ్లయినా చనిపోదు, ఇంకా రాస్తూనే ఉంటుంది. ఆమె రాసే కథలు, నవలల్ని మంజుల (మంజులానాయుడు, దర్శక నిర్మాత) సీరియల్స్ తీస్తూనే ఉంటుంది. ఆమె చివరి కథ ఏమిటో అన్న ఆసక్తి జనాన్ని చంపేస్తూ ఉంటుంది. ఈమె చచ్చిపోతేగానీ అది బయటికి రాదాయె. ఆమె ఏమి రాసిందోననే కుతూహలం రోజురోజుకి తట్టుకోలేని స్థాయికి పెరిగిపోయింది. ఇది తట్టుకోలేని ఓ పిచ్చి అభిమాని ఆమెను పొడిచి చంపేస్తాడు. పత్రికల్లో, చానళ్లలో ఆమెకు నివాళులర్పిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు, అభిమానులు ఏడుస్తూ ఉంటారు. కన్నీళ్లతో ఎమెస్కో విజయకుమార్ చొక్కా తడిసిపోయి ఉంటుంది. ఇంతలో ఆ అభిమాని వస్తాడు. విజయకుమార్ గారు ఆ కథ బయట పెట్టండి అని అడుగుతాడు. అప్పుడు విజయకుమార్ తన బీరువా తెరిచి కాగితాల బొత్తుల్లోంచి ఒక కవరు బయటికి తీస్తాడు. కెమెరాలన్నీ దాని మీద ఫోకస్ చేసి ఉంటాయి. అంతా ఉత్సుకతతో చూస్తుంటారు. ఏముంది ఆ కవరులో..... ఏముందనుకుంటూ. విజయకుమార్ కవరు తెరుస్తాడు. అందులో ఒక తెల్లకాగితం ఉంటుంది. ‘నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని మరచిపోతున్నాను, మీరు నన్ను మరచిపోండి!’ అని మాత్రమే ఉంటుందందులో.... ఇలా నేను చేస్తానని కాదు. ఏదో సరదాగా చెప్పాను. నేను వెళ్లిపోయినప్పుడు మీరేమీ చేయవద్దు. సెక్రటరీ చదవండి అంతే. నన్ను మరచిపోతారు అంటూ ఆ ఇంటర్వ్యూని ముగించారావిడ. ఆవిడ మరణవార్త చిరంజీవి శైలు (శైలజ) భర్త రవి నాకు తెలియజేసినప్పుడు ఎందుకో నా మనస్సు మొత్తం ఓ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. నా గుండె ఉనికి గురించి నేనే వెతుక్కున్నాను. నా సంస్థకు వెన్నెముక ఆవిడ. వెన్నెముక లేని మానవశరీరం నిలబడుతుందా అని ఓ భయం, నిటారుగా నించున్న నానుంచి నా వెన్నెముకను తొలగించినట్లు ఓ అనుభూతి. మర్నాడు ఉదయం మీడియాకు ఆ విషయం తెలియజేయటం, ఆ తరువాత హడావిడి కొంచెం తేరుకున్నాక నాకు ఓ విషయం గుర్తొచ్చింది. సులోచనారాణిగారు అమెరికా వెళుతూ నాకో కవరు పంపించారు. దాన్ని మా ఆఫీసులో కుర్రాడు అనిరుధ్ తీసుకువచ్చాడు. అది వచ్చిన రోజు నుండి నేనో వారం రోజులు హైదరాబాద్‌లో లేను. నా భాగస్వామి కుమారుడి వివాహం హడావిడిలో ఫోన్లో అనిరుధ్‌ని అడిగితే మేడమ్ కొన్ని కథలు పంపారు ప్రచురణ కోసం అని చెప్పాడు. ఆవిడ వచ్చాక ప్రచురిద్దాం. చాలాకాలం తరువాత వస్తున్న పుస్తకం కదా మంచి రిలీజ్ ఫంక్షన్ పెట్టొచ్చు అని ఎడిటర్ గారికి చెప్పాను. ఆ కవరుని బీరువాలో దాచమని చెప్పాను. ఈ రోజు ఉదయం (22–5–18) ఆ కవరులో ఏముందా అని తెరిచి చూశాను. పైన ఆవిడ కథలో చెప్పినట్లుగానే నా కన్నీళ్లతో చొక్కా తడిసిపోతోంది. అవి అన్నీ కథలు కాదు. ఆవిడ ఆలోచనలు, అనుభూతులూను. పాఠకులతో పంచుకోవడం కోసం రాసినవి. ప్రియనేస్తమా! అనే పేరున తయారైన ఆ సంపుటిని ఆవిడ నన్ను ఆశీర్వదిస్తూ నాకు, నా అర్ధాంగికి అంకితం ఇచ్చారు. కృతజ్ఞతతో ఆవిడ పాదాలను ముద్దాడాలనిపించింది. ఆవిడ నా ప్రియమైన పాఠకులారా! అని ప్రారంభించి రాసిన ముందుమాటను మీ ముందుంచుతున్నాను.- ఎమెస్కో విజయకుమార్ నా ప్రియమైన పాఠకులారా! నేను నవలలు, కథలు వ్రాయకుండా ఎందుకిలా వ్రాస్తున్నానా.. అని మీరు అనుకోవచ్చు! నా 16వ సంవత్సరంలోనే నేను ‘చిత్రనళినీయం’ అనే కథ వ్రాసినప్పుడు, నా మనసులో ఏ కోర్కెలూ లేవు! కథ వ్రాయటంలోనే నాకు పరిపూర్ణమైన ఆనందం. ఆ ఆనందం కోసమే మళ్ళీ... మళ్ళీ... మళ్ళీ.. 60 సంవత్సరాల పాటు వ్రాసాను.. ఆనందం పొందుతూనే ఉన్నాను. అదొక చైతన్య జలపాతం! 16 సంవత్సరాల్లో కథలు వ్రాసినçప్పుడు నాకు ఎలాంటి ఆనందం, ఉత్సాహం ఉన్నాయో, ఇప్పుడూ అంతే ఉన్నాయి.. నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని నవలలు, ఇన్ని కథలు వ్రాసినా, నా మనసు కాస్తంత కూడా అలిసిపోలేదు! ఆ జలపాతం సన్నగిల్లలేదు! అదే ఉద్వేగం! అదే చైతన్యం.. 16 సంవత్సరాల వయసులో కంటే 76 సంవత్సరాల ఈ వయసులో నా మనసుకి చాలా పరిపూర్ణత వచ్చింది.. వేల మంది పాఠకులతో నేను కలిసిపోయి, వారి జీవితంలోని సంఘటనలకి స్పందించినçప్పుడు, అవి నా మస్తిష్కంలో ఉన్న భాండాగారంలో నిక్షిప్తం అయి ఉన్నాయి.. వంద సంవత్సరాలు వ్రాయగల కథల వస్తు సామగ్రి నా దగ్గర ఉంది..! కానీ నా శరీరం వయోభారంతో అలిసిపోయింది. నా శరీరంలో శక్తి ఉన్నంత వరకూ మీకు ఏదో ఒకటి వ్రాసి ఇస్తూనే ఉంటాను. నన్ను చాలామంది ‘‘మృత్యువు’’ గురించి ఎందుకు మాట్లాడతారు అని అడుగుతారు. 70 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వ్యక్తికీ ఈ ఆలోచన వస్తుంది. ఇది మన ముందున్న యథార్థం! ఒక నగ్నసత్యం! ఈ నగ్నసత్యం లోకి మనం నిర్వికారంగా, హుందాగా, ఆనందంగా నడిచి వెళ్ళాలి! నేను లెక్కచూసుకున్నాను.. అయిన వారంతా... అమ్మా–నాన్నా, అక్కయ్యలు–బావలు, అన్నయ్యలు–ఒదినలు, పిన్నులు–పినతండ్రులు, మేనత్తలు– మేనమామలు. ఎందెందరో బంధుజనం.. అందరూ పోయారు. నా వృత్తిలో ముఖ్యమైన శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీ రామానాయుడు గారు, శ్రీ మధుసూదనరావు గారు, శ్రీ ఎల్వీ ప్రసాద్ గారు, ఇంకా పత్రికాధిపతులు, పబ్లిషర్స్, కొంతమంది ప్రియమైన పాఠకులు, అందరూ వెళ్ళిపోయారు.. నేను వెళ్ళిపోవాల్సిన సమయం వస్తోందని నాకు బాగా తెలుసు! నాకు ఎప్పుడు ఏది అనిపిస్తుందో అది మీ ముందు పెడుతున్నాను. నా ఆలోచనలు పంచుకునే నా ప్రియనేస్తాలు మీరు! ఇప్పుడు నేనేదైనా వ్రాసిస్తే అది మీలో ఉన్న ఆ భగవంతుడికి అక్షరార్చనగా భావిస్తాను! ఈ వయసులో ఇంత ప్రశాంతంగా నేను మీకోసం ఈ భావపుష్పాలని మాలగా అల్లడం నాకెంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తున్నది. సెలవా మరి! యద్దనపూడి సులోచనారాణి రేపటి సంచికలో... ప్రియనేస్తమా! గులాబీ జీవితం -
నవలా రచయిత్రి సులోచనారాణి కన్నుమూత
-
యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత
కాలిఫోర్నియా : ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (79) అమెరికాలో కాలిఫోర్నియాలోని కుపర్టినోలో గుండెపోటుతో మృతి చెందారు. కుమార్తె నివాసంలో ఆమె నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నిసులోచనారాణి కుమార్తె శైలజ ధ్రువీకరించారు. సులోచనారాణి అంత్యక్రియలు కాలిఫోర్నియాలోనే నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెస్కో పబ్లిషర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... ‘ సులోచనారాణి మృతి విషయాన్ని ఆమె కుమార్తె శైలజ గతరాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు.ఆమె నవలలు ఎక్కువ శాతం మేమే పబ్లిష్ చేశాం. సులోచనారాణి మృతి తెలుగు పాఠకలోకానికి తీరనిలోటు. స్త్రీల ఆత్మాభిమానం గురించి ఆమె తన రచనల్లో చాలా బాగా ఎలివేట్ చేసేవారు. సులోచనారాణి రాసిన ‘సెక్రటరీ’ నవల ఇప్పటికీ ఆదరణ పొందటం అందుకు నిదర్శనం.’ అని తెలిపారు. యద్దనపూడి సులోచనారాణి తెలుగులో పాపులర్ నవలా ప్రపంచంలో ఓ కలికితురాయి. మధ్యతరగతి మహిళామణుల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చిత్రించారు. ఎక్కడా నేల విడిచి సాము చేయకుండానే తనదైన శైలితో అరుదైన రచనలు చేశారు. ముఖ్యంగా 1970వ దశకంలో ఆమె రచనలు సినీ ప్రపంచాన్ని కూడా ఓ ఊపు ఊపాయి. స్త్రీలు కాల్పనిక సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలో సులోచనా రాణి తనదైన సొంత మార్గంలో ఎన్నో నవలలు రాశారు. యద్ధనపూడి సులోచనారాణి 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. తను పరిశీంచిన జీవితాలను వస్తువులుగా తీసుకొని మొదట రచనలు చేయడం ప్రారంభించారు. తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవిన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి, వారి ఊహల్లోంచి, కలల్లోంచి వచ్చిన పాత్రలను సృష్టించారు. అయితే వాటిని సజీవపాత్రలకు దగ్గరగా ఉండే విధంగా మలిచారు. వీరి నవలల్లో, కథల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఎక్కువగా కోటీశ్వరుడైన నాయకుడు, కిందిస్థాయి నాయిక, విరిద్ధరి మధ్యా అంకురించే ప్రేమ. ఇదే వీరి నవలా సూత్రం. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం... ... ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు. వర్ణనల విషయానికి వస్తే వీరి నవలల్లో ఇళ్లు, పరిసరాలు, ప్రకృతి, మానసిక వర్ణనలు సహజత్వాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని బట్టి సాగుతాయి. ఇవి ఎక్కువ ప్రచారం పొందడానికి కారణం- మెజారిటీ ప్రజల జీవన విధానాలను, అనుభూతులను పొందుపరచడమే. వీరి నవలా పాత్రలు విచిత్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతాయి. కొద్ది సంతోషాన్ని పొందగానే వెంటనే దుఃఖానికి లోనవుతాయి. అందుకేనేమో బహుశా సాధారణ ప్రజల జీవితాలకు ఇవి దగ్గరయ్యాయి. ధైర్యం - అధైర్యం, ప్రేమ - కోపం, పేదరికం - సంపద, శాంతి - అశాంతి, ఆశ - నిరాశ... ఇలాంటి సహజాతాల మధ్య వీరు సృష్టించే పాత్రలు తలమునకలవు తుంటాయి. చదివే పాఠకులకు ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తుంటాయి. యద్దనపూడి సులోచనారాణి తొలిసారిగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్ గా మిగిలిపోయింది. ఆ రోజుల్లో ప్రతి యువకుడు ఓ రాజశేఖరంలా, ప్రతి యువతీ ఆత్మాభిమానం గల జయంతిలా ఉండాలనుకునే వారు. మీనా నవల పత్రికలో ధారావాహికగా వచ్చింది. పేరును పాఠకులే నిర్ణయించారు. చివరకు మీనా నవలను 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించి సినిమాగా తీసింది. సులోచనారాణి ఎక్కువ ప్రేమ కథలనే రాశారు. ఆత్మాభిమానం గల ఆడపిల్లలను తన నాయికలుగా ఎన్నుకున్నారు. ధనవంతుల యువకులను నాయకుడిగా చేశారు. వీరి రచనలు నేటికీ టీవీలలో ధారావాహికలుగా వస్తూనే ఉన్నాయి. ప్రముఖ ఛానల్లో వచ్చిన రాధ మధు సీరియల్ కథ వీరిదే. నేటికీ చాలామంది పాఠకుల హృదయాల్లో వీరి నవలలు నిక్షిప్తమయి ఉన్నాయి. చాలామంది పాఠకులు నేటికీ వీరి రచనలను విస్తృతంగా చదువుతున్నారు. -
అభాండం
ఉదయాన్నే సొసైటీలోకి అడుగుపెట్టేసరికి మా సెక్రటరీ గారు ఇంకా రాలేదు. ఆయన అప్పుడే రాడు కూడా. నా సీట్లోకి వెళ్లి నిశ్చింతగా వెనక్కి జారగిలపడి కూర్చున్నాను. ‘‘అరేయ్ రామూ!’’ పరుగు పరుగున వచ్చీ రావడంతోనే నన్ను లోగొంతుతో పిలిచాడు శంకర్రావు.‘‘ఏరా శంకూ! ఏమైందిరా..’’‘‘రా.....రా!’’ అంటూ నా చెయ్యి పట్టుకుని బయటకు లాక్కుపోయాడు. ‘‘ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు?’’ నెమ్మదిగా శంకు చెయ్యి విడిపించుకుంటూ అన్నాను. ‘‘నాకు చేతులూ, కాళ్లూ ఆడటం లేదురా? భయంగా వుంది.’’ అంటూ బావురుమని ఏడ్చేశాడు. ‘‘అరేయ్ ఎందుకురా ఏడుస్తావ్? ఏమైందో చెప్పరా?’’ ఆత్రుతగా అడిగాను.శంకర్రావు కూడా నాతో సొసైటీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇద్దరం ఒక్కసారే సొసైటీలో చేరాము. మాతోపాటు మరో ఇద్దరు సీనియర్లున్నారు. సెక్రటరీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగి. మా మీద అజమాయిషీ చెయ్యడానికి వచ్చిన అధికారి. నలభై గ్రామాలు ఊరూరా తిరిగి అప్పులు వసూలు చేసే కష్టం మాది, రుణాలు బట్వాడా చేసి వేలకు వేలు లంచాలు వసూలు చేసుకునే అధికారం ఆయనది.నన్ను ఆలోచనల్లోనుంచి బయటపడేస్తూ మా సొసైటీకి కొద్ది దూరంలో ఉన్న పాడుబడ్డ ఇంట్లోకి లాక్కుపోయాడు. అది శంకూ వాళ్ల ఇల్లే. అన్నదమ్ముల గొడవల్లో వాటాలు నప్పక ఇంట్లో దీపం వెలిగించే దిక్కులేక పాడుబడిపోయింది. వాళ్ల తండ్రి పోయాక అన్నదమ్ములు నలుగురికీ పెళ్లిళ్లు అయ్యాయని, ఎవరి మట్టుకు వాళ్లు వేరే కాపురాలు పెట్టుకున్నారని చెప్పాడు. అందరిలో ఆఖరివాడైన శంకుకే ఆ ఇల్లు ఇద్దామని వాళ్లమ్మ కోరికట. శంకే ఓ రోజు సొసైటీలో ఉండగా తన కథంతా చెప్పాడు.నేరుగా లోపల ఉన్న గదిలోకి తీసుకెళ్ళాడు శంకు. మౌనంగా అనుసరించాను. గది తలుపులు తెరవడానికి తటపటాయిస్తున్నాడు. దగ్గరగా మూసి వున్న తలుపుల్ని టక్కున కాలితో తన్నాను. తలుపులు రెండు బార్లా తెరుచుకున్నాయి. లోపల దృశ్యం చూసి ఒక్కసారిగా అదిరిపడ్డాను. శంకు మాత్రం బాధతో గబుక్కున కళ్లు మూసుకున్నాడు.ఎదురుగా శంకు పెద్దన్నయ్య. మా సొసైటీ ప్రెసిడెంట్. గదిలో ఉన్న కిటికీ రాడ్‌కు తాడు కట్టి ఉరిపోసుకుని చచ్చిపడి ఉన్నాడు. శంకే తేరుకుని గబాలున వెళ్ళి వాళ్లన్నయ్య మెడకు ఉన్న తాడు కత్తెరతో కత్తిరించబోయాడు. నేనే టక్కున అడ్డుకుని వద్దని వారించాను. ఇంట్లో వాళ్లకి కబురు చెప్పి ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దామని శంకుని బలవంతంగా బయటకు లాక్కొచ్చాను. శంకు దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు. ఇద్దరం రోడ్డు మీదకు వచ్చాము. ఇంతలో మా సొసైటీ వైస్ ప్రెసిడెంట్ శివరామ్మూర్తి గారు అటుగా వస్తూ మమ్మల్ని చూశారు. గుండెల్లో నుండి తన్నుకొస్తున్న దుఃఖం ఆపుకుంటూ కళ్లు తుడుచుకుంటున్న శంకుని చూసి ‘‘ఏమైంది?’’ అంటూ శంకు భుజం మీద చెయ్యేశాడాయన. ఏడుస్తూ జరిగింది చెప్పాడు శంకు. ‘‘కొంపలంటుకుంటాయ్. పోయినోడు చక్కగానే ఉరేసుకు చచ్చిపోయాడు. ఇది గాని పోలీసులకు తెలిస్తే అందర్నీ అనుమానంతో చంపుకు తింటారు. ఊరందరికీ ఈ విషయం తెలియక ముందే శవాన్ని మామూలుగా పడుకోబెట్టేద్దాం. ఏదో జ్వరంతో చనిపోయాడని జనాల్ని నమ్మించాలి. ఎవరికీ అనుమానం రాకుండా మీ వాళ్లకు కబురు చెయ్యి..’’ అంటూ ముందుకు సాగిపోయాడాయన.ఆయనన్నదీ కరెక్టే అనిపించింది. పావుగంటలో శంకు అన్నదమ్ములతో పాటు వాళ్ల అమ్మగారు వచ్చేశారు. ఉరితాడు కత్తిరించి ఇంటి బయట చాప పరిచి శవాన్ని తిన్నగా పడుకోబెట్టారు. ఊరందరికీ విషయం తెలిసేలోగా శవాన్ని శ్మశానానికి తీసుకుపోవడం మంచిదని శివరామ్మూర్తిగారే దగ్గరుండి కార్యక్రమాలు ఆదరాబాదరా పడుతూ పూర్తి చేయించాడు. నాకా క్షణం ఆయన మీద వీసమెత్తు అనుమానం కూడా కలగలేదు. శవాన్ని నిలువుగా పడుకోబెట్టినా కాళ్లు రెండూ ముడుచుకుని బిగుసుకుపోయాయి. నిటారుగా సాగదీద్దామని శంకు అన్నదమ్ములు, బంధువులు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. శవానికి స్నానం చేయిస్తున్నప్పుడు నేనే కాదు అక్కడున్న వాళ్లంతా అదిరిపడ్డారు. మా సొసైటీ వైస్ ప్రెసిడెంట్ శివరామ్మూర్తిగారైతే తల బాదుకుని ఏడ్చేశారు. ‘‘అయ్యో ఎంత పనైపోయిందిరా తమ్ముడూ. తప్పు చేశాం రా! వీడేదో తాగిన మైకంలో బాధలు తట్టుకోలేక ఉరి పోసుకున్నాడనుకున్నాను. ఇలా జరిగుంటుందని ఊహించలేదురా! వీడ్నెవరో చంపేశార్రా తమ్ముడూ. చంపేసి మీ ఇంట్లోనే ఉరి పోసుకుని చచ్చిపోయినట్టు తెచ్చి పడేశారు’’ అంటూ తల బాదుకుని ఏడ్చాడాయన. శవమ్మీది రక్తపు మరకలు అది హత్య అని చెప్తున్నాయి.‘‘ఇప్పుడేం చేద్దాం..’’ అంటూ శివరామ్మూర్తిగారి దగ్గరకొచ్చి అడిగారు ముగ్గురూ.‘‘పోలీసు రిపోర్టు ఇస్తే హంతకులెవరో తెలుస్తుంది. కానీ మనం తొందరపడి శవాన్ని ముట్టుకున్నాం. ఉరితాడు కట్ చేశాం. ఇప్పుడు శవానికి స్నానం కూడా చేయించేశాం. హంతకుడి ఆధారాలన్నీ మన చేతులతో మనమే తుడిచేశాం. ఇప్పుడేం చేయాలో తోచటంలేదు.’’ అన్నాడాయన.చనిపోయినవాడు ఎలాగూ పోయాడు. ఇక లేనిపోని పెంట నెత్తిమీదకి ఎందుకని నిర్ణయించుకున్నారు శంకు అన్నదమ్ములు. శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్తున్న సమయంలో పెడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చింది శంకు పెద్ద వదిన. పిల్లలు ముగ్గుర్నీ వెంటబెట్టుకు వచ్చిందావిడ. పాపం చిన్నపిల్లలు. ఆర్నెల్ల నుండి భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడట. భర్త చావు వార్త విని ఆమె వాళ్ల పుట్టింటి నుండి పిల్లల్ని తీసుకుని బావురుమంటూ పరిగెత్తుకొచ్చింది. శ్మశానం నుండి ఇంటికొచ్చాను గాని నా మనసు మనసులో లేదు. ఉరి పోసుకు చావ లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఎవరో హత్యే చేశారు. ఈ ఊర్లో ఆయనకి శత్రువులెవరబ్బా? ఆ రోజు శంకూ నేనూ సినిమాకి వెళ్లాము. నేనే బలవంతంగా శంకుని లాక్కెళ్ళాను. ‘‘మీ అన్నయ్యకి శత్రువులెవరున్నార్రా? వెధవలు మీ అన్నయ్యని బాగా చిత్రవధ చేసి చంపేశార్రా!’’ శంకును రెచ్చగొట్టాలనే అలా అన్నాను. కోపమొస్తే కొంతైనా వాళ్ల అన్నయ్య వెనుక దాగి వున్న నిజాలు చెప్తాడని. ‘‘నువ్వన్నది నిజమేరా, అదే చేసుంటుంది’’ కసిగా పళ్లు కొరుకుతూ అన్నాడు. ‘‘ఎవర్రా?’’ ఆశ్చర్యంగా అన్నాను.‘‘బ్రాందీషాపు దగ్గర చికెన్ చీకులు అమ్ముతుందే అది’’ కోపంగా అన్నాడు శంకు.‘‘ఆవిడా!’’ ఆశ్చర్యంగా అన్నాను. ‘‘మా అన్నయ్యకి ఎలా తగిలిందో తెలీదురా.... రాత్రీ పగలు దానింట్లోనే ఉండేవాడని అంటార్రా అందరూ’’ బాధగా అన్నాడు శంకు.ఆ మర్నాడు రుణాల వసూలుకు ఊరి మీదకు బయలుదేరాను. దారిలో బ్రాందీ షాపు కనిపించింది. దాని పక్కనే శంకు చెప్పిన ఆవిడ చీకుల కొట్టు కనిపించింది. అప్రయత్నంగా అటు వెళ్లాను. ‘‘ఏం బాబూ ఇలావచ్చావు? ఒక కవాపుల్ల తింటావా?’’ అంటూ అప్పుడే నిప్పుల మీద కాల్చిన చికెన్ ముక్కలు చూపిస్తూ అడిగిందామె. ఒక కర్రకు గుచ్చి వున్నాయవి. దాన్నే చీకులు అంటారేమో అని అనుకున్నాను.‘‘మా ప్రెసిడెంట్‌గారు చనిపోవడం చాలా బాధాకరం కదా! ఆయనకూ మీకు మంచి స్నేహం వుందని, ఆయనే మీకు లోను ఇప్పించారని విన్నా’’ అన్నాను ఆమె కళ్లలోకి చూస్తూ.‘‘అయ్యో! ఆయన అంత ఏగిరం పడే మనిషి కాదు బాబు. బ్రాందీ షాపుకొస్తే సొసైటీ ప్రెసిడెంట్గోరు కదా మీ ఇంట్లో కూర్చుని మందు తాగుతారు అని బ్రాందీ షాపు ఓనరుగారు చెప్పిన దగ్గర నుండి మా ఇంట్లో కూర్చుని మందు తాగి వెళ్లిపోయేవారు బాబు అంతే!’’ అంది ఆమె. ఇంత కంటే ఆమె నుండి ఎక్కువ రాబట్టలేమనిపించింది.ఆ మర్నాడు సొసైటీలో కూర్చున్నాను. శివరావు ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నాడు. ‘‘గురూ! నీకు తెలుసా! మన ప్రెసిడెంట్ గాని బ్రతికి ఉంటే ఈ సెక్రటరీగాడి పనైపోను.’’ కసిగా పళ్లు కొరుకుతూ అన్నాడు అటెండర్ శివరావు.‘‘నిజమా?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘ప్రెసిడెంట్ గారి పేరు చెప్పి రైతులందరి దగ్గరా అప్పులిస్తూ డబ్బులు నొక్కేస్తున్నాడని తెలిసిందట. అంతే! ఆయన ఆఫీసుకొచ్చి గది తలుపులు వేసి మరీ బండ బూతులు తిట్టాడు. ఈ నెల్లో ఈయన గార్ని మన సొసైటీ నుండి సాగనంపేస్తానని కూడా అన్నారు’’ అన్నాడు.నాకంతా అయోమయంగా ఉంది. ప్రెసిడెంట్‌కి తెలీకుండా ఇన్ని లక్షలు అప్పులిస్తూ లంచాలు తీసుకుంటున్న సెక్రటరీకి ఆయన్ని చంపేసేటంత ధైర్యం ఎక్కడిది?‘‘మన వైస్ ప్రెసిడెంట్ శివరామ్మూర్తిగారు మధ్య పడకపోతే ఎలా ఉండేదో’’ మళ్లా శివరావే అన్నాడు. ‘‘శివరామ్మూర్తిగారా?’’ ఆశ్చర్యంగా అన్నాను. ‘‘అవును. సెక్రటరీ గాడెళ్ళి ఆయన దగ్గర తన గోడు వెళ్లబోసుకుని ఉంటాడు. ప్రెసిడెంట్ గారు చనిపోయే ముందు రోజే రాజీ కోసం ముగ్గురూ ఆ రంభ ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు గురూ’’ అన్నాడు శివరావు.ఉలిక్కిపడ్డాను. నాకెందుకో ఎక్కడో, ఏదో జరిగిందనిపించింది. శంకు కోసం సెల్ తీసి ఫోన్ చేశాను. నా అనుమానాలన్నీ వాడికి పూస గుచ్చినట్టు చెప్పాను. ఇద్దరం బ్రాందీ షాప్ దగ్గరకు వెళ్ళాము. అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది చీకుల దుకాణం. దాని వెనుకే వున్న రంభ ఇంటికెళ్ళాము. వాళ్లాయన లేడు ఎక్కడికో వెళ్లాడని చెప్పింది.‘‘బ్యాంకోళ్లిద్దరూ మా ఇంటికొచ్చాసారేం బాబూ’’ అంది నవ్వుతూ.‘‘నీతో మాట్లాడాలి.’’ అన్నాను నేను. ‘‘... మన సొసైటీ ప్రెసిడెంట్ ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరో చంపేసి అక్కడ పడేశారు’’ అన్నాను నేనే ఆమె కళ్లల్లోకి తీక్షణంగా చూస్తూ. ‘‘నిజమా! ఎంత ఘోరం’’ ఆశ్చర్యం నటిస్తూ అంది రంభ. ‘‘చనిపోయిన రాత్రి మా అన్నయ్య మీ ఇంట్లోనే ఉన్నాడట కదా’’ శంకు కోపంగానే అన్నాడు. ఆ మాటకు ఒక్కసారే అదిరిపడింది.తేరుకొని, – ‘‘అవునవును బాబు.. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, శివరామ్మూర్తి గారు ముగ్గురూ ఉన్నారు. వాళ్లతో మా ఆయన కూడా ఉన్నాడు.’’ అంది తడబడుతూ.‘‘ఆ రోజు ఇక్కడే గొడవ పడి మీరే మా ప్రెసిడెంట్ గారిని చంపేశారని తెలిసింది’’ కావాలనే అబద్ధం ఆడాను. ‘‘అయ్యో! గొడవ పడ్డం మాట నిజమే. మీ అన్నయ్య గారే సెక్రటరీగారితో గొడవ పడ్డారు. ఆ గొడవలోనే చిన్న తోపులాటలో మీ అన్నగారి తల బలంగా గోడకు తగిలింది. అంతే మీ అన్నగారు సొమ్మసిల్లి పడిపోతే మా ఆయనే సాయం చేసి ఆటో ఎక్కించాడు. తర్వాత ఏమైందో మాకు తెలీదు.’’ అంది భోరున ఏడుస్తూ. ఆ వెంటనే ఇదంతా పోలీసు కమిషనర్ ఆఫీసుకు వెళ్లి చెప్పాము. ఆ మర్నాడు పోలీసు జీపు నేరుగా వచ్చి మా సొసైటీ ముందు ఆగింది. సెక్రటరీని, ప్రస్తుత ప్రెసిడెంట్ శివరామ్మూర్తి గారిని జీపులో ఎక్కించుకుని వెళ్లారు పోలీసులు. ఆ విషయం ఊరంతా గుప్పుమంది. ఆ మధ్యాహ్నం పోలీసులు రెండు మూడు జీపుల్లో వచ్చి నేరుగా శ్మశానానికి వెళ్లారు. వాళ్లతోపాటు శంకు కుటుంబ సభ్యులందర్నీ తీసుకువెళ్లారు. శవాన్ని పోస్టుమార్టవ్ు కోసం పెద్దాసుపత్రికి తీసుకుపోయారు పోలీసులు. రెండు రోజుల ఇంటరాగేషన్ కోసం పోలీసు కస్టడీలో ఉన్నారు సెక్రటరీ, కొత్త ప్రెసిడెంట్ శివరామ్మూర్తి. మూడోరోజు ఇద్దరూ సొసైటీకి వచ్చారు. వస్తూనే నన్నూ, శంకుని తన కేబిన్‌లోకి పిలిచాడు ప్రెసిడెంట్ శివరామ్మూర్తి. అతని పక్కనే సెక్రటరీ కూడా కూర్చున్నాడు. ‘‘మీ ఇద్దరూ మంచి పని చేశార్రా! చనిపోయే ముందు రోజు మేము ముగ్గురం కలిసి మందు కొట్టడం నిజమే. సెక్రటరీగారు, మీ అన్నయ్య గొడవ పడ్డం నిజమే. కానీ వాణ్ని మేము చంపలేదురా. చేతులారా స్నేహితుణ్ని చంపేసేటంత దుర్మార్గుడిగా కనిపిస్తున్నానా?’’ దాదాపు ఏడుస్తున్నట్టే అన్నాడు శివరామ్మూర్తి. ‘‘ఆ రోజు ఆటో ఎక్కించి తీసుకొస్తూ సోడాతో మొహం కడిగేసరికి మీ అన్నయ్య తెలివిమీదకి వచ్చాడు. మీ అన్నే తనింట్లో పడుకుంటాను దించెయ్యమంటే ఆ గదిలో చాప మీద పడుకోబెట్టి వచ్చేశాము. అంతే మాకు తెలిసిన నిజం.’’ అంటూ చెప్పాడు సెక్రటరీ. అదే సమయంలో పోలీసు స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. హంతకుడు దొరికాడు.నలుగురం పోలీసుస్టేషన్ దగ్గరికెళ్ళేసరికి బయట రంభ ఏడుస్తూ నిలబడి వుంది. ఎస్సై ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు రంభ మొగుడు. ‘‘వీడే మీ సొసైటీ ప్రెసిడెంట్‌ని చంపేశాడు. చెప్పరా.. చెప్పు.’’ అంటూ పక్కనే చేతులు కట్టుకు నిలబడ్డ రంభ మొగుణ్ని లాఠీతో కొడుతూ అన్నాడు ఎస్సై.‘‘అవును నేనే.. నేనే చంపేశాను. ఆటోలో మీరు అతణ్ని వాళ్ల పాడుబడ్డ ఇంట్లో దించి వెళ్లడం చూశాను. అర్ధరాత్రి ఎవరూ చూడకుండా వెళ్లి గొంతు నులిమి చంపేశాను.’’ కసిగా అన్నాడు రంభ మొగుడు. ‘‘అతణ్ని చంపాలన్న పగ నీకెందుకు?’’ అడిగాడు ఎస్సై.‘‘మా ఆవిడ.. మా ఆవిడతో తిరిగితే నేను ఊరుకుంటానా? ’’ కోపంగా అరిచాడు. మా నలుగురికీ నోట మాట కరువైంది. ఇందులో నిజమెంతో.. అబద్ధమెంతో ఆ భగవంతుడికే తెలియాలి. నిజం చెప్పగలిగిన రంభ ‘‘చనిపోయిన దేవుడులాంటి మనిషి మీద లేనిపోని అభాండాలు వెయ్యకండి బాబు.’’ అంటూ తల బాదుకుని ఏడుస్తోంది. -
బడ్జెట్లో గీత కార్మికులకు అన్యాయం
భీమవరం : కల్లుగీత కార్మికులకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశారని రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి తీవ్రంగా విమర్శించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం కోసం విచ్చలవిడిగా మద్యం, బెల్టు దుకాణాలను ప్రోత్సహించడంతో గీత కార్మికులకు ఉపాధి కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టుషాపులపై ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒకప్పుడు గీత కార్మికులు వచ్చిన ఆదాయంతో ఇళ్లు నిర్మించుకుంటే చంద్రబాబు పాలనలో ఉన్న ఇళ్లు అమ్ముకుని జీవించాల్సి వస్తోం దన్నారు. నిధులు కేటాయించకపోవడంతో కల్లుగీత కార్పొరేషన్ ఉత్సవ విగ్రహంగా మిగిలిందన్నారు. కల్లుగీత కార్పొరేషన్‌కు తక్షణం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిడదవోలులో ఉన్న ఏౖMðక తాటిబెల్లం పరిశ్రమకు నిధులు కేటాయించకపోవడంతో నిరుపయోగంగా మారిందన్నారు. తాటి పరిశ్రమకు తక్షణం రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో గీత వృత్తిపై నాలుగు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని వీరి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.14 కోట్లు కిస్తీల రూపం ఆదాయం సమకూరుతుందని చెప్పారు. గీత కార్మి కుల సంక్షేమాన్ని పట్టించుకోకపోతే సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్త ఆం దోళనలకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి నివాసాలు, కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. సంఘం భీమవరం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కడలి పాండు, చింతపల్లి చినవీరాస్వామి, ఉపాధ్యక్షుడు చెల్లబోయిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
కోర్టు తీర్పు ఇచ్చేలోగా ఆయన్ను మార్చండి
-
రేపు జాతీయ మెగా లోక్‌అదాలత్
నిజామాబాద్ లీగల్ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ముడియం వెంకట హరినాథ్ తెలిపారు. గురువారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా న్యాయపరమైన సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా జాతీయ మెగా లోక్ అదాలత్‌ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే జిల్లాలోని అన్ని సబ్‌కోర్టుల్లో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి సుజన ముఖ్యఅతిథిగా పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈసారి లోక్‌అదాలత్‌లో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు, పెట్టి కేసులు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించిన కేసులు పరిష్కరిస్తామన్నారు. జిల్లా కోర్టుతో పాటు కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి సబ్ కోర్టులలో న్యాయ సేవాసదన్‌లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. -
స్కూల్ గేమ్స్‌కు రాజకీయ గ్రహణం
– కార్యదర్శి ఎంపికలో డీఈవోపై అధికార పార్టీ ఒత్తిడి – కలెక్టర్ నుంచి డీఎస్‌డీవోకు చేరిన ఎంపిక ఫైల్ – ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై వెళ్లిన డీఎస్డీవో – స్కూల్ గేమ్స్ దగ్గర పడుతున్నా పూర్తిగాని క్రీడాకారుల ఎంపిక తిరుపతి సెంట్రల్: పీవీ.సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే ‘ఆ గొప్ప నాది అంటే నాది’ అంటూ మన నాయకులు చేసిన ఆర్భాటం నిన్నమొన్నటి వరకు చూశాం. క్షేత్ర స్థాయిలో ప్రోత్సహిస్తే ఇలాంటి సింధులు ఎంతోమంది పుట్టుకొస్తారనే విషయం తెలిసినా ఏ నాయకుడూ ఆ దిశగా చర్యలు తీసుకోరు. స్కూల్ గేమ్స్ విషయంలో జిల్లా నాయకులు వ్యవహరిస్తున్న తీరే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. తిరుపతి ఎంఆర్‌పల్లికి చెందిన మంజు గత ఏడాది రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించింది. మహారాష్ట్రలో నిర్వహించిన 62వ స్కూల్ గేమ్స్‌లో రజత పతకం సాధించింది. అంతటి ప్రతిభావంతురాలు ఈ నెల 12 నుంచి గన్నవరంలో నిర్వహించనున్న స్కూల్‌గేమ్స్ రెజ్లింగ్ స్టేట్‌మీట్‌లో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఇంతవరకు జిల్లా క్రీడాజట్టును ఎంపిక చేయకపోవడమే. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి జిల్లాలో స్కూల్ గేమ్స్‌లో పాల్గొనాలని అనుకున్న క్రీడాకారులకు ఆశాభంగం తప్పలేదు. కార్యదర్శినే ఎంపిక చేయలేదు.. గ్రామీణ స్థాయిలో ప్రతిభ ఉన్న నిరుపేద క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీనికోసం జిల్లాకో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిని డీఈవో ఎంపిక చేయాలి. కార్యదర్శి నేతత్వంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభగల పేద క్రీడాకారులను గుర్తించి, స్కూల్ గేమ్స్‌కు జిల్లా జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. 2016–17 విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఇంతవరకు కార్యదర్శిని ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కార్యదర్శి పోస్టుకు జిల్లా నుంచి దాదాపు 10 మంది పీఈటీలు పోటీపడుతున్నారు. ఈ పోస్టుకు అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తేవడంతో ఎంపిక ఆలస్యమయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నష్టపోతున్న క్రీడాకారులు.. స్కూల్‌గేమ్స్ కార్యదర్శి లేకపోవడంతో ఈ ఏడాది ప్రతిభగల క్రీడాకారులు నష్టపోతున్నారు. సాధారణంగా స్కూల్ గేమ్స్‌కు 15 నుంచి 20 రోజుల ముందు అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి పేద క్రీడాకారులను ఎంపిక చేస్తారు. వారి సర్టిఫికెట్లు పరిశీలించి కార్యదర్శి సంతకం చేస్తేనే రైల్వే కన్సెషన్ ఫాం వర్తిస్తుంది. అంతా ఓకే అయ్యాక క్రీడాకారులకు కనీసం రెండు వారాలైనా శిక్షణ ఇవ్వాలి. గన్నవరంలో ఈ నెల 12 నుంచి జరిగే స్కూల్ గేమ్స్ పంపించాలంటే 11వ తేదీన అక్కడికి చేరుకోవాల్సిన జిల్లా రెజ్లింగ్ జట్టును ఇంతవరకు ఎంపిక చేయలేదు. పేద క్రీడాకారులపై వివక్ష.. జిల్లాకు వన్నె తెస్తున్న క్రీడాకారులను ప్రభుత్వం విస్మరిస్తోంది. గత ఏడాది రెజ్లింగ్‌లో జాతీయ స్థాయిలో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చిన క్రీడాకారులను గుర్తించడంలేదు. పేద క్రీడాకారులు వారి సొంత ఖర్చులతో పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నా ఎంపిక చేయలేదు. తక్షణమే కలెక్టర్ చొరవ తీసుకోవాలి. – చీనేపల్లి కిరణ్‌కుమార్, కార్యదర్శి, జెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ, తిరుపతి. -
నేడు ప్రిన్సిపల్ సెక్రటరీ రాక
భువనగిరి అర్బన్ : భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించే హరితహారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరి ప్రదీప్‌చంద్ర రానున్నరాని ఎం.వి భూపాల్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మండలంలోని బండసోమారం గ్రామంలో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హజరౌతునట్లు సర్పంచ్ ఎస్.మాధవీ ఐలయ్య తెలిపారు. -
చాలిక..మారండి
-
'సెక్రటరీ 'నవల స్వర్ణోత్సవం
-
సులోచనారాణితో ఇంటర్వ్యూ
-
సెక్రటరీ.. ఆ పేరు వల్లే అంత హిట్ అయ్యింది
సెక్రటరీ నవలకు యాభై ఏళ్లు నిండిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఆ నవలకు నీరాజనం కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా తరాల పాఠకుల రచయిత్రి యద్దనపూడి... తెలుగు సాహిత్యంలో ఒక గురజాడ గేయాన్నో, శ్రీశ్రీ కవితనో, జాషువా పద్యాన్నో కంఠతా చెప్పమంటే చెప్పేవాళ్లు చాలామందే చెబుతారు. కాని ఒక నవలను అభిమానులు కంఠతా జెప్పటం మీరెప్పుడయినా విన్నారా? ఉన్నారు. ఆ నవల సెక్రటరీ. ఆ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి. సెక్రటరీ నవల ప్రచురితమై 50 ఏళ్లయింది. 90 పైగా ప్రచురణలు పూర్తి చేసుకుంది. ఇది అద్వితీయ రికార్డు. సెక్రటరీ గురించి, యద్ధన పూడి సులోచనారాణి ఆలోచనలు, ఆకాంక్షలు, జీవితతత్వం గురించి మనం తెలుసుకుందాం. మృణాళిని: నమస్కారం సులోచనారాణి గారూ యద్దనపూడి: నమస్కారమండీ మృణాళిని: సెక్రటరీ ఇప్పటి కీ సజీవంగా, తాజాగా ఉంటుంది. పాఠకుల నుంచి ఈ నవల ఇంత అభిమానం పొందడం పట్ల మీ అనుభూతి ఎలా ఉంది? యద్దనపూడి: నవలా రచయిత్రిగా నా నవలలకు అభిమానుల నుంచి నేనెన్నో ప్రశంసలు పొందాను. కాని సెక్రటరీ విషయం మాత్రం ప్రత్యేకం. 50 ఏళ్ల తర్వాత కూడా ఈ నవలను ఇంతగా గుర్తుపెట్టుకోవడం, నవలకు నీరాజనం పేరుతో పండుగ చేయడం వింటుంటూనే ఉద్విగ్నంగా అనిపిస్తోంది. ఆనందబాష్పాలతో సరస్వతీదేవి పాదాలు కడగాలనిపిస్తోంది. మృణాళిని: అప్పట్లో అంటే 1964-65 సంవత్సరంలో జ్యోతి పత్రికలో సీరియల్‌గా వచ్చినప్పుడు, 66లో పుస్తకంగా వచ్చినప్పుడు అప్పటి పాఠకులు వేరు. ఇప్పటి పాఠకులు వేరు. కొత్త పాఠకులు వచ్చి ఉంటారు. అంటే వారి స్పందనలో మీకేమైనా తేడా కనిపించిందా? యద్దనపూడి: నిజం చెప్పాలంటే స్పందనలో తేడా లేదమ్మా. స్త్రీ మనస్సు అది. 60 ఏళ్ల క్రిందటి స్త్రీ మనస్సు ఏ తీరున ప్రేమను కోరుకుందో నేటి యువతి మనసు కూడా అదే కోరుకుంటోంది. అంటే స్త్రీ మనస్సును తాకేదీ, స్త్రీ మనస్సు ఆశించేదీ ఏదో అంశం అందులో ఉంది. కాబట్టి ఇన్నేళ్లుగా అది మనుషుల్ని అట్లా పట్టి ఉంచిందేమోనని అనుకుంటున్నాను. తరాలు వేరైనా కూడా పాఠకుల రెస్పాన్స్ ఒకటే ఉంది . నవల్లోని రాజశేఖరం పాత్రను ఐడియలైజ్ చేయడం అలా ఉంచితే నిజానికి ఇప్పుడు అమ్మాయిలంతా అప్పటి జయంతిగానే ఉన్నారు. ఆత్మగౌరవంతో పాటు సంపాదన కొరుకుంటున్నారు. అన్నీ ఉన్నా కూడా స్త్రీత్వం పోకుండా ఒక పురుషుడు తనకు తోడు కావాలనుకునే ఆకాంక్ష మాత్రం పోలేదు. అందుకే సెక్రటరీ నవల ఇప్పటికీ పాఠకులతో కొనసాగుతూందేమో అనిపిస్తుంటుంది. మృణాళిని: ఒక జయంతిని, ఒక రాజశేఖరాన్ని సృష్టించడానికి మీకేమైనా నమూనాలున్నాయాండీ? ఎవరి ప్రభావం అయినా ఉందా? యద్దనపూడి: ఒకసారి రమణ, బాపు, రాఘవులు గార్లు వచ్చి జ్యోతి పత్రిక ప్రారంభిస్తున్నాం నవల రాయమన్నారు. నేను నవల రాయనంటే రాయనన్నాను. ఎందుకంటే అప్పటి వరకు కథలే రాస్తున్నాను. ఐలవ్యూ, భానుమతి వంటి కథలు బాగా ఆదరణ పొందాయి. అందుకే బలవంతంగా రాయలేనన్నాను. బాపు, రమణగారు నా ఇబ్బందిని గమనించి పోనీలేండి మీరు పెద్ద కథ రాయండి అని అన్నారు. కథ అయితే రాస్తా అన్నా. కథ రాస్తావా అయితే పేరు చెప్పు అన్నారు. పేరు చెబితే మేము ఇప్పట్నుంచీ పబ్లిసిటీ ఇస్తాం అని చెప్పగా నేను లోపలికి వెళ్లి ఓ కాగితం తీసుకొని సరస్వతీ దేవికి దండం పెట్టుకొని సెక్రటరీ అని రాశా. కథ లేదు, ఏం లేదు. కానీ నాకు తెలిసిన ఒక ఆడపిల్ల టైపిస్టుగా పని చేస్తుండేది. తనతోపాటు జాబ్ చేసేవాడు ఎంత ఏడిపించేవాడో చెప్పి తిట్టిపోస్తుండేది. ఆడపిల్ల, మధ్య తరగతి అమ్మాయి పడే అలాంటి బాధలేవో చెప్పొచ్చు అనుకున్నాను. కాని సెక్రటరీ కాకుండా జయంతి అని పేరు పెడితే ఆ నవల అసలు ఇంత ప్రచారమయ్యేది కాదు అనుకుంటున్నా. ఆ నవల మొదలెట్టినప్పుడు నాకు హీరో పాత్ర గురించి ఏమీ తెలియదు. జయంతి, బామ్మ పాత్రలే ఉండేవి. ఆ తరువాత హీరో వచ్చాడు రాజశేఖర్. ఆ పేరు తట్టిన క్షణమేమిటో గానీ ఇప్పటికీ ఇప్పటికీ ఆడవాళ్ల హృదయాల్లో ఒక ఇమేజ్గానే మిగిలిపోయాడు. మృణాళిని (నవ్వుతూ): మాతరం వారమందరమూ ఆ పేరు గలవాళ్లనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అంత పిచ్చి ఉండేదన్నమాట. అదృష్టవశాత్తు మా అల్లుడి పేరు రాజశేఖరం. యద్దనపూడి: ఔనా! మృణాళిని: అది కూడా కాకతాళీయం యద్దనపూడి: మీకో విషయం చెబుతాను. రాజశేఖరం అనే పేరుకు ఎంత పాపులారిటీ అంటే ఓ సారి నేను అమెరికా వెళ్లినప్పుడు సన్మానం చేశారు. నేను అని తెలియగానే కొంత మంది - అందరూ తెలుగువాళ్లే- నా దగ్గరకు వచ్చారు. ఒకతను మేడం మీరు రావాలి అని బయటకు తీసుకెళ్లి ఇండియాలో ఉన్న వాళ్ల అమ్మకు ఫోన్ చేశాడు. అతని పేరు కూడా రాజశేఖరం అట. అమ్మా నాకు పేరు పెట్టావే రాజశేఖరం అని ఆ పాత్ర సృష్టించిన మీ అభిమాన రచయిత్రి ఇక్కడే ఉన్నారు మాట్లాడు అన్నాడు. సంతోషం కలిగింది. ఇంకో ఘటన... ఐదారేళ్ల క్రితం ఒక అమ్మాయిని శ్రావణమాసం నోముల సందర్భంగా కలిశాను. ఏం చేస్తుంటావమ్మా అని అడిగితే ఇంజినీర్ని, సెలవు పెట్టాను అని చెప్పింది. మరి నోములు అవి నీకు విసుగు పుట్టవా అని అంటే ఎందుకు పుడుతుంది. ఇవి చేస్తే భర్తకు బాగుంటుందటగా అంది. అయ్యబాబోయ్ ఇంత నమ్మకాలా ... మీ పేరేంటమ్మా అన్నాను. వెంటనే ముఖం కాస్త చికాకుగా పెట్టేసి సువర్ణలత (కీర్తికిరీటాలు హీరోయిన్) అని చెప్పింది. ఆ చికాకును కొనసాగిస్తూ మా అమ్మ నాకేమో సువర్ణలత, మా అన్నకేమో రాజశేఖర్ అని పేరు పెట్టింది అంది. ఎక్కడికెళ్లినా ఈ రాజశేఖరం అనే మాట అలా వస్తూనే ఉంటుంది. మృణాళిని: సెక్రటరీనే తరువాత సినిమాగా తీశారు. సినిమా తీసినప్పుడు మీతో సంప్రదించారా? అసలు మీరు ఇష్టపడ్డారా? నవలను సినిమాగా తీస్తే బాగా వస్తుందని మీరు ఊహించారా? యద్దనపూడి: సినిమా అనుభవం చాలా డిఫరెంట్. అప్పటికే జీవన తరంగాలు వచ్చింది. రామానాయుడుగారు తీశారు. అది బాగా ఆడింది. బాగా వచ్చింది కూడా. ఆ ఉత్సాహంతోనే సెక్రటరీని సినిమాగా తీస్తా అన్నారు. నేను కూడా ఉత్సాహంగానే ఇచ్చాను. ఆయన అనౌన్స్ చేశారు. సెక్రటరీ సినిమా తీస్తున్నాను నాగేశ్వరరావు హీరో అని. ఇంక లేడీస్ వచ్చారమ్మా మా ఇంటికి గుంపులుగుంపులన్నమాట. మీరు ఆ రైట్స్ ఎలా ఇచ్చారు. మీకు ఆ రైట్ లేదు. వెంటనే వాపస్ తీసుకోండి అని నన్ను డిమాండ్ చేశారు. మృణాళిని: ఎందుకు? యద్దనపూడి: సినిమా తీయడానికి వీలులేదు. ఎవరూ సూట్ కారు దానికి, మా ఇమేజ్నేషన్ అంతా చెడిపోతుంది అంటారు వాళ్లు. రామానాయుడుగారికి విషయం చెప్పా. సినిమా చూసిన తర్వాత అభిప్రాయం మార్చుకుంటారులేండి అన్నారు. మృణాళిని: సెక్రటరీ తరువాత మీ నవలల మిగతా సినిమా రూపాలను కూడా మాట్లాడుకోవాలి. మీనా నవలకు సినిమా ఎక్కువ న్యాయం చేసిందని అంటున్నారు నాతో ఎక్కువగా. మీనా సినిమా చూస్తుంటే మేం మళ్లీ నవలను చూసినట్లే అనిపించింది. మీ ఇతర నవలలతో పోల్చి చూస్తే మీకు అది పూర్తి తృప్తినిచ్చిందా? యద్దనపూడి: చెప్పాలంటే మీకు లాగే నాకూ మీనా సినిమాయే నచ్చింది. మృణాళిని: మరో విషయం మీ అన్ని నవలల్లోనూ సెక్రటరీ, మీనా, జీవనతరంగాలు, విజేత అనే నాలుగు నవలలనే చెప్పుకుంటారు. కొంత మంది అయితే ఆరాధన నవల కూడా చెప్పుకుంటారు. మీరు 70కిపైగా నవలలు రాసినా, ఈ నాలుగైదు నవలలనే ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. సున్నితమైన ప్రేమభావాన్ని అత్యద్భుతమైన స్త్రీ పాత్రలను చిత్రించిన రచయిత్రిగా మీరు మా హృదయాల్లో మిగిలే ఉంటారు. కానీ మీరు ఈ ఒక్క ఇమేజ్‌కే పరిమితమయ్యారా? యద్దనపూడి: అలా లేదమ్మా. నా అన్ని రకాల నవలలను పాఠకులు ఇష్టంగా చదువుతున్నారు. పార్థును చదువుతున్నారు. ఇతర నవలలనూ చదువుతున్నారు. నవల రాయలేను అన్నదానిని తొలిసారి సెక్రటరీ నవలు రాశాను. అప్పటి నుంచి నవలలే రాస్తున్నాను. అప్పుడే ఎమెస్కో వారు వచ్చారు. పుస్తకాలు చదవడం మనం అలవాటు చేస్తే పుస్తకం కొని చదవడం వారు నేర్పారు. ఎం.ఎన్.రావుగారు వచ్చి చిన్న నవల రాయండమ్మా అని ప్రాధేయపడితే చివరకు ఒక నవల రాశాను. ఆరాధన అలా వచ్చిన చిన్న నవల. ఆయన ఎంత సంతోషంగా ఫీలయ్యారంటే మళ్లీ ఇంకో నవల రాయమన్నారు. బతిమిలాడి బతిమిలాడి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఒక నవల రాయమన్నారు. అదే నా పుట్టినరోజు కూడా. దాంతో చాలా నవలలు వచ్చేశాయి. మృణాళిని: 50 ఏళ్ల క్రితం వచ్చిన సెక్రటరీని ఇప్పుడు చదివితే, మళ్లీ అందరూ ఫ్రెష్ అవుతున్నారు. అంటే ఒక రచన విలువ ఏమిటన్నప్పుడు, జీవితం గురించి పెద్ద పెద్ద సందేశాలు ఇవ్వటమనే కాదు. మన మనస్సులో ఎప్పడూ తాజాగా ఉండటం అన్నదే ఒక రచనకు ఉన్న ప్రమాణం అయితే మీ రచనలు అన్నీ దాన్ని సాధించాయి అనిపిస్తుంది. ఈరోజు మీరు మీ మనసులోని భావాలను ఆత్మీయంగా మాతో పంచుకున్నారు. మీ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అరమరికలు లేకుండా మాతో పంచుకున్నందుకు చాలా సంతోషమండీ. ధన్యవాదాలు. యద్దనపూడి: మీకూ ధన్యవాదాలు. మృణాళిని: అంటే సీరియల్స్ కాకుండా ఇలా నవలలు రాసేవారన్నమాట. యద్దనపూడి: ఔను. తరువాత తరువాత సీరియల్స్ రాయను, నవలలే రాస్తానని షిప్ట్ అయిపోయాను. ప్రతి పదేళ్లకు నాలో ఏదో మార్పు. మొదట సీరియల్స్ రాయడం మానేశాను. స్వాతిలో 12 ఏళ్లు సీరియల్స్ రాశాను. కీర్తికిరీటాలు, సుకుమార్ వంటివి ఇలాగే వచ్చాయి. అందుకే సెక్రటరీ వంటి నవలలకే కాకుండా, పార్థు వంటి నవలలకు కూడా పాఠకులు ఏర్పడ్డారు. నేడు(శనివారం) మధ్యాహ్నం గం.12.30లకు సాక్షి టీవీలో ఈ ఇంటర్వ్యూ ప్రసారం. -
యూజీసీ కార్యదర్శికి మరోసారి రూ.1500 ఫైన్
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శిపై హైకోర్టు గురువారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాము ఆదేశించిన మేర నిర్ణీత వ్యవధిలోపు కౌంటర్ దాఖలు చేయనందుకు రూ.1500 జరిమానా విధించినా పద్ధతి మార్చుకోకపోవడాన్ని తప్పుపట్టింది. గురువారం నాటి విచారణకు సైతం కౌంటర్ దాఖలు చేయకుండా సమయం కోరడంతో మండిపడ్డ హైకోర్టు మరోసారి రూ.1500 జరిమానా విధించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఉభయ రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాలు యూజీసీ అనుమతి లేకుండానే పలు కోర్సులను నిర్వహిస్తున్నాయని, ఈ విషయంలో విశ్వవిద్యాలయాలను నిలువరించేలా యూజీసీని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రొఫెసర్ జి.శివారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారించింది. తాము ఆదేశించిన విధంగా నిర్ణీత కాల వ్యవధి లోపు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో యూజీసీ కార్యదర్శికి రూ.1500 విధిస్తూ విచారణను వాయిదా వేసింది. తాజాగా ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా యూజీసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ, కౌంటర్ సిద్ధమైందని, అయితే అది ఇంకా కోర్టులో దాఖలు చేసేందుకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఇప్పటికే ఓసారి జరిమానా విధించినా పద్దతి మార్చుకోలేదా..? అంటూ ప్రశ్నించింది. మరోసారి రూ.1500 జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
షికారుకెళ్లాం..బిల్లులు చెల్లించండి
రంగారెడ్డి జిల్లా: షికారు చేశాం.. బిల్లులు చెల్లించండి.. శీర్షికన బుధవారం ప్రచురితమైన వార్త జిల్లా అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పది నెలల వాహనం అద్దె బిల్లులు చెల్లించాలని రెవెన్యూమంత్రి పేషీ నుంచి లేఖ రావడం.. నిధులు విడుదల చేసేందుకు ఫైలు సిద్ధమైనట్లు పత్రికల్లో కథనం రావడంతో అధికార యంత్రాంగం ఫైలును పక్కనపెట్టింది. నిబంధనలకు అనుగుణంగా లేనందున బిల్లులు చెల్లించకూడదని నిర్ణయించామని పేర్కొంటున్న అధికారులు అసలు ఫైలును ఎందుకు సిద్ధం చేశారనే అంశంపై మాత్రం నోరు మెదపడంలేదు. -
మైనర్‌పై అత్యాచార యత్నం
నిందితుడు పంచాయతీ కార్యదర్శి పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు నిర్భయ చట్టం కింద కేసు నమోదు మాకవరపాలెం: మాయమాటలతో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నించిన ఓ కార్యదర్శి చివరికి కటకటాలపాలయ్యాడు. ఇంటికి పిలిచి మోసగించేందుకు నిందితుడు చేసిన ప్రయత్నాన్ని పసిగట్టిన బాలిక తప్పించుకుని విషయం తల్లిదండ్రులకు చేరవేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాకవరపాలెం మండలం పెద్దిపాలెం పంచాయతీ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ రామారావు తెలిపిన వివరాలు ఇవీ. పెద్దిపాలెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగరావు స్థానికంగా నివాసముంటున్నాడు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలికను తన ఇంటికి పిలిచాడు. ఆమెకు ఎగ్‌పఫ్ ఇచ్చి తినమన్నాడు. అనంతరం నిన్ను పట్నం తీసుకు వెళ్తానని ఆశచూపి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ బాలిక తప్పించుకుని ఇంటికి పరుగుతీసింది. అన్నం కూడా తినకుండా రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది. ఉదయం ఆమెను గమనించిన తండ్రి ఎందుకు ఏడుస్తున్నావంటూ ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. దీంతో కుమార్తెను తీసుకుని అతను స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన కార్యదర్శిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెద్దిపాలెంలో ఎస్ఐ విచారణ అత్యాచార యత్నంపై అందిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.రామారావు పెద్దిపాలెంలో విచారణ నిర్వహించారు. కార్యదర్శి ఉంటున్న ఇంటితోపాటు బాలిక ఇంటి చుట్టు పక్కల వారిని పిలిచి విచారణ చేశారు. వారు చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారు. కార్యదర్శిని అరెస్టు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
సీఎస్ ఔత్సాహికులకు సరైన సమయమిదే..
గెస్ట్ కాలమ్ కంపెనీ సెక్రటరీ.. వ్యాపార, వాణిజ్య రంగాల్లో దేశం శరవేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో చక్కటి కెరీర్‌కు అవకాశం కల్పించే కోర్సు. ప్రభుత్వ తాజా నిబంధనలు కూడా కెరీర్ పరంగా కంపెనీ సెక్రటరీలకు ఎన్నో అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాయి. ఔత్సాహిక విద్యార్థులు దీన్ని అందిపుచ్చుకోవాలి. కంపెనీ సెక్రటరీ కోర్సు అంటే కామర్స్, మేనేజ్మెంట్ సంబంధితమని, ఆ నేపథ్యం ఉన్న వారికే అనుకూలమనే భావన సరికాదు. నిరంతర అధ్యయన దృక్పథం, పరిశీలనాత్మక దృష్టితో వ్యవహరిస్తే.. అన్ని అకడమిక్ నేపథ్యాల విద్యార్థులు సీఎస్ కోర్సులో రాణించగలరు అంటున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ఆల్ ఇండియా కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆర్. శ్రీధరన్‌తో ఇంటర్వ్యూ.. ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం ఐసీఎస్ఐ ప్రెసిడెంట్‌గా తొలి ప్రాధాన్యం ఇచ్చే అంశం.. ఉద్యోగం లేదా ప్రాక్టీస్‌లో ఉన్నవారిని మరింత నిబద్ధతగా వ్యవహరించేలా చేయడమే. ఇక సీఎస్ విద్యార్థుల విషయానికొస్తే అకడమిక్ సామర్థ్యాలను మరింత పెంచడం మా లక్ష్యం. ఈ క్రమంలో కంపెనీస్ లా- 2013లో కంపెనీ సెక్రటరీ విధుల పరంగా పేర్కొన్న అన్ని నిబంధనలను కచ్చితంగా అమలయ్యేలా చేస్తాం. కంపెనీ సెక్రటరీ.. పెరుగుతున్న ప్రాధాన్యం కంపెనీ సెక్రటరీ ప్రొఫెషన్‌కు ప్రాధాన్యం దినదిన ప్రవర్థమానం అవుతోంది. రూ. 5 కోట్ల పెయిడ్-అప్ క్యాపిటల్ ఉన్న ప్రతి సంస్థ కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలనే నిబంధన కారణంగా క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు డిమాండ్ పెరుగుతోంది. ఆయా సంస్థల్లో పూర్తిస్థాయిలో కంపెనీ సెక్రటరీ ఉద్యోగంతోపాటు, ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీగా స్వయం ఉపాధికి కూడా ఎంతో అవకాశం ఉంది. కానీ ఏటా సర్టిఫికెట్లు అందుకుంటున్నవారి సంఖ్యతో పోల్చితే సీఎస్‌కు డిమాండ్ - సప్లయ్ మధ్య ఎంతో వ్యత్యాసం నెలకొంది. ఔత్సాహిక విద్యార్థులు ప్రొఫెషన్లో ప్రవేశించి చక్కటి కెరీర్ అందుకోవడానికి ఇదే సరైన సమయం. సంస్థల్లోనూ కీలక పాత్ర పోషించే సీఎస్‌లు మూడు దశల సీఎస్ కోర్సు పూర్తి చేసుకున్న క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు ఆయా సంస్థల కార్యకలాపాల్లోనూ ముఖ్య హోదాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతో కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. సదరు సంస్థ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెక్రటేరియల్ ప్రమాణాలు పాటించేలా చూడటం, ఆ మేరకు అవసరమైతే ఉన్నతాధికారులకు తగిన సిఫార్సులు చేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కంపెనీ లా - 2013 ప్రకారం మొత్తం తొమ్మిది కీలక విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత కంపెనీ సెక్రటరీలదే. ఇలా.. ఒక సంస్థలో సీఈఓ, ఎండీ తర్వాత ఆ స్థాయీ ప్రాధాన్యం సీఎస్‌లకు లభిస్తుంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాకు చేరుకోవచ్చు. అదేవిధంగా సెక్రటేరియల్ ఆడిట్, లేబర్ ఆడిట్, లీగల్ ఆడిట్ తదితర విభాగల్లోనూ సీఎస్‌లకు అవకాశాలు లభిస్తాయి. ఇదే సమయంలో రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఎక్కువగా ఉండే ఉద్యోగం కంపెనీ సెక్రటరీ. ఒకవైపు సంస్థలోని ఉన్నతాధికారులకు, మరోవైపు స్టేక్ హోల్టర్లు, నియంత్రణ సంస్థలకు మధ్య వారధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సెమినార్లు, వర్క్‌షాప్‌లతో అవగాహన వృత్తి పరంగా ఎంతో కీలకమైన కంపెనీ సెక్రటరీ కోర్సుపై విద్యార్థులకు ఆశించిన రీతిలో అవగాహన లేదనే మాట వాస్తవం. కోర్సుకు నమోదు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతున్న ప్పటికీ ఆ సంఖ్య వాస్తవ అవసరాలకు సరితూగట్లేదు. ఈ క్రమంలో విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు సెమినార్లు నిర్వహించాలని నిర్ణయించాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 400 సెమినార్లు నిర్వహించాలని నిర్దేశించుకున్నాం. అదేవిధంగా ఇప్పటికే కోర్సు పూర్తి చేసి అసోసియేట్, ఫెలో మెంబర్స్‌గా దాదాపు 35 వేల మందికిపైగా క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలు ఉన్నారు. వీరికి కూడా తాజా పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించ నున్నాం. సీఏ, సీఎస్, సీఎంఏ మూడు.. వేర్వేరు ప్రాధాన్యత కలిగిన కోర్సులు చాలా మంది సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల మధ్య పోలికలు, తేడాలు బేరీజు వేయాలని చూస్తున్నారు. కానీ ఇది సరికాదు. రెండు కోర్సులు వేర్వేరు ప్రాధాన్యతలు కలిగున్నాయి. కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తిగా సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, కంపెనీ లా ఆధారంగా ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు ఆర్థికపరమైన అంశాలు (అకౌంటింగ్, ఆడిటింగ్) ఎక్కువగా ఉండే కోర్సు. ఉద్యోగ విధుల విషయంలోనూ రెండింటికీ వేర్వేరు ప్రాధాన్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి సంస్థకు కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్ ఇద్దరూ అవసరం. అదే విధంగా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగ సంస్థల్లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశాలున్నాయి. మొత్తంమీద ఒక సంస్థను సమర్థంగా, ప్రగతి పథంలో పయనించేలా చేయడంలో సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులు ముగ్గురూ ముఖ్యమే. ఆ అభిప్రాయం అపోహ మాత్రమే కంపెనీ సెక్రటరీ కోర్సు.. కేవలం కామర్స్, లా, మేనేజ్మెంట్ అకడమిక్ నేపథ్యాలు ఉన్న విద్యార్థులకే అనుకూలం అనే అభిప్రాయం అపోహ మాత్రమే. తులనాత్మక పరిశీలన, విశ్లేషణ నైపుణ్యం ఉంటే అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా ఎలాంటి విద్యార్థులైనా సులువుగా రాణించగల కోర్సు కంపెనీ సెక్రటరీ. కోర్సులో చేరాక నిర్దేశిత సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయడంతోపాటు దానికి సంబంధించిన తాజా మార్పులపై అవగాహన పొందుతూ ముందుకు సాగాలి. సరైన సమయం.. మూడు దశలు (ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్)గా ఉండే కంపెనీ సెక్రటరీ కోర్సులో చేరడానికి సరైన సమయం అనేది విద్యార్థుల వ్యక్తిగత లక్ష్యాలు, అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సుతో ఫౌండేషన్ కోర్సులో; బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. ఏ దశలో చేరినా పూర్తి స్థాయిలో సమయం కేటాయించేట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. సీఎస్ కోర్సు ఔత్సాహికులకు సలహా.. సీఎస్ కోర్సు ఔత్సాహికులు, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కెరీర్లో గుర్తుంచుకోవాల్సిన రెండు ప్రధాన అంశాలు కఠోర శ్రమ, ఓర్పు. ఈ రెండూ ఉంటే విజయాలు వాటంతటే వరిస్తాయి. అదే విధంగా నిత్య నూతన ఆలోచన దృక్పథం కూడా ఈ రంగంలో విజయానికి ఎంతో కీలక సాధనం. దీంతోపాటు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకునే లక్షణాన్ని సొంతం చేసుకోవాలి. -
తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పదవీ కాలం పొడగింపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం పదవీ కాలాన్ని మరో ఏడాది పొడగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సోమవారం హైదరాబాద్ లో పర్యటించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఆహ్వానం మేరకు కేసీఆర్ పలు ప్రాంతాలను సందర్శించారు. -
ఎస్కేయూ నేతలను కలిసిన మాజీ ముఖ్యమంత్రి
ఎస్కేయూ, న్యూస్‌లైన్:ఎన్నికల ప్రచార నిమిత్తం జిల్లాకు వచ్చిన జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద ఐకాస నేతలను కలిశారు. 2009, 2013లో రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఎస్కేయూనివర్సీటీలో ఉద్యమం జరిగిన తీరు, ఐకాస నేతల వ్యవహార శైలి వల్లే జై సమైక్యాంధ్ర పార్టీ అవిర్భవానికి స్ఫూర్తినిచ్చిందని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎస్కేయూ ఐకాస కన్వీనర్ ఆచార్య సదాశివారెడ్డి కరువు జిల్లా అయిన అనంతపురమును దృష్టిలో వుంచుకొని అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని పోరాడాలని కోరారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన వారిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ఆచార్య ఎం.సీ.ఎస్.శ్రీనివాసన్, జై సమైక్యాంధ్ర పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిరాజు, క్రాంతికిరణ్, వెంకటేసులు, భోదనేతర సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి, ఓబుళరెడ్డి, హిమగిరి, శివఉన్నారు. -
నేడు ఖరారు కానున్న గవర్నర్ సలహాదారులు
-
ఏపీజీఏ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్వర్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ జిమ్నాస్టిక్స్ సంఘం (ఏపీజీఏ) కొత్త అధ్యక్షుడిగా వి.దశరథ్, ప్రధాన కార్యదర్శిగా ఎ.సోమేశ్వర్‌లు ఎన్నికయ్యారు. జాతీయ మాజీ జిమ్నాస్ట్ సోమేశ్వర్ రాష్ట్రం తరఫున పలు మార్లు జాతీయ జిమ్నాస్టిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. ఇక్కడి ఒలింపిక్ భవన్లో ఆదివారం హైదరాబాద్ జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు రవి ఈశ్వర్ చంద్ పర్యవేక్షణలో ఏపీజీఏ కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు భారత జిమ్నాస్టిక్ సమాఖ్య సంయుక్త కార్యదర్శి అశోక్ కుమార్ సాహు, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ధన్‌కిషన్ బండారి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) తరపున అలీమ్ ఖాన్లు పర్యవేక్షులుగా వ్యవహరించారు. కోశాధికారిగా ఆర్.రవీందర్, ఉపాధ్యక్షులుగా రవి ఈశ్వర్ చంద్, రణప్రతాప్ గౌడ్, ఎం.రాజేష్ కుమార్, డాక్టర్ గౌర్ఖీ, వి.వినేష్, సంయుక్త కార్యదర్శులుగా ఎల్.శాంతి, పి.రేణుక, ఎస్.శ్రీనివాస్‌రావులు ఎన్నికయ్యారు. -
రజాకార్లను ఎదురించిన యోధుడు
జక్రాన్‌పల్లి, న్యూస్‌లైన్: వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎల్.వెంకట్రామిరెడ్డి (85) అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో మరణించారు. ఆయన స్వగ్రామమైన జక్రాన్‌పల్లి మండలంలోని తొర్లికొండలో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వెంకట్రాంరెడ్డి స్వాతంత్య్ర సమర యో ధుడు. ఆర్మూర్ ప్రాంతం నుంచి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారిలో వెంకట్రాంరెడ్డి మొట్టమొదటి వ్యక్తని చెబుతారు. ఆయన రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. వారిని తరిమికొట్టి, తొర్లికొండ గుట్టపై జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అదే సమయంలో ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయా రు. ఆయన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌లో స్పోర్ట్స్ డెరైక్టర్‌గా పనిచేశారు. స్పోర్ట్స్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శిగా ముప్పై ఏళ్లు కొనసాగారు. ప్రస్తుతం రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వాలీబాల్ అసోసియేషన్‌కు నలభై ఏళ్లుగా సేవలందిస్తూనే ఉన్నారు. వెంకట్రామిరెడ్డి శిక్షణ సలహాలతోనే.. తొర్లికొండలో మొట్టమొదటగా నలుగురు పీఈటీలుగా ఎంపికయ్యారు. సీనియర్ పీడీలు జానకీరాం, మల్లేశ్‌గౌడ్, ప్రభాకర్‌రెడ్డి, నాగేశ్‌లు వెంకట్రామిరెడ్డి శిష్యులే. అలాగే వెంకట్రామిరెడ్డి సలహాలు సూచనలతోనే గ్రామానికి చెందిన 32 మంది పీఈటీలయ్యారు. పీఈటీల గ్రామంగా తొర్లికొండకు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాక ఈ గ్రామం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి వాలీబాల్‌పోటీల్లో ఎందరో పాల్గొన్నారు. వెంకట్రాంరెడ్డి భార్య లక్ష్మీదేవి గతంలోనే మరణించారు. ఆయనకు ముగ్గురు కుమారు లు, ఒక కూతురు ఉన్నారు. సంతాపం నిజామాబాద్ స్పోర్ట్స్ : వెంకట్రామిరెడ్డి మరణంపై జిల్లాకు చెందిన ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాల్‌శర్మ, ఉమామహేశ్వర్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాగిర్తి బాగారెడ్డి, లక్ష్మణ్, బొబ్బిలి నర్సయ్య, వివిధ క్రీడా సంఘా ల సభ్యులు సంతాపం తెలిపారు. వాలీబాల్ అంటేనే వెంకట్రామిరెడ్డి జిల్లాలో, రాష్ట్రంలో వాలీబాల్ అంటేనే వెంకట్రామిరెడ్డి అని పేరు తెచ్చుకున్నారు. ఆయన అందించిన ప్రోత్సాహంతో జిల్లానుంచి ఎందరో ఆటగాళ్లు జాతీయ స్థాయికి ఎదిగారు. ఆయన స్వగ్రామంనుంచి 32 మంది పీఈటీలు తయారు కావడానికి ఆయన ప్రోత్సాహమే కారణం. -ఉమామహేశ్వర్‌రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సేవలు మరువలేనివి ఒలింపిక్ అసోసియేషన్, వాలీబాల్ అసోసియేషన్లకు వెంకట్రామిరెడ్డిఎంతో సేవ చేశారు. ఆయన కృషి వల్లే జిల్లా ఒలింపిక్ సంఘానికి ఒక నీడదొరికింది. ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో పక్క వాలీబాల్ క్రీడాభివృద్ధికి ఆయన కృషి చేశారు. క్రీడారంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి. -బాగారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
తెలుగు నవలల్లో అనాబ్‌షాహీ సెక్రటరీ...
కొన్ని కథల్ని మనుషులు మొదలు పెడతారు. కొన్ని కథల్ని మెషీన్లు మొదలుపెడతాయి. కొన్ని కథల్ని మెషీన్లను ఉపయోగించే మనుషులు మొదలుపెడతారు. చాలాకాలం క్రితం సెక్రటరీ అనేది మగవాళ్ల పని. 1880లో టైప్మెషీన్ కనిపెట్టాక అది ఆడవాళ్ల పని అయ్యింది. టైప్ తెలిసిన ఆడవాళ్లు, ఆఫీసు వ్యవహారాలను ‘సీక్రెట్’గా ఉంచుతూ నమ్మకంగా పని చేసే ఆడవాళ్లు - ‘సెక్రటరీలు’. ఇరవయ్యవ శతాబ్దపు మొదలులో మొదలయ్యి 1950లకు ఉద్ధృతమైన ఈ పని చేసిన మేలూ మగవారి జీవితంలో తెచ్చిన మార్పూ అంతా ఇంతా కాదు. పుట్టించిన కథలూ అన్నీ ఇన్నీ కావు. సెక్రటరీలు చాలా మంది జీవితాలను వెలిగించారు. చాలామంది జీవితాలను ఆర్పేశారు. సుభాస్ చంద్రబోస్ తన సెక్రటరీనే పెళ్లి చేసుకున్నాడు. దోస్తవ్ స్కీ అదే పని చేశాడు. మన శ్రీశ్రీ కూడా డబ్బింగ్ సినిమాల పనికి తనకు సహాయకురాలిగా చేరిన సరోజను వివాహం చేసుకున్నారు. కొంతమంది దీనికి రివర్స్‌గా వెళ్లి ఇరకాటంలో పడ్డారు. భార్యలతో దెబ్బలు తిన్నారు. క్లింటన్లాంటివాడు లెవన్స్కీతో చాలాదూరం వెళ్లి చాలా లోతులో పడ్డాడు. ‘సెక్రటరీ’ నవలలోని రాజశేఖరం కూడా జయంతిని సెక్రటరీగా పెట్టుకున్నాక అంత సుఖంగా ఏమీ లేడు. రాజశేఖరంకు ఒక సమస్య ఉంది. అతడి తల్లిదండ్రులు పారిపోయి హైదరాబాద్ వచ్చినవారు. అందువల్ల బంధువులంటూ ఎవరూ లేరు. ఒక్క కొడుకు- రాజశేఖరం పుడితే అతణ్ణే సర్వస్వం అనుకొని ఎవర్నీ కలవనిచ్చేది కాదు తల్లి. కలివిడిగా ఉండటం, మనసులో ఉన్నది చెప్పడం రాజశేఖరంకు చేతగాదు. ‘నన్ను నన్నుగా ప్రేమించుటకు’ అన్నట్టుగా తన అందం, ఆస్తి, వైభవం చూసి కాకుండా తన హృదయాన్ని చూసి ప్రేమించే అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే జయంతికి కూడా ఒక సమస్య ఉంది. ఆమెను ఆమె బామ్మ పెంచింది. బామ్మల పెంపకంలో ఆడపిల్లలు ఎలా పెరుగుతారో అలానే పెరిగింది. తెలిసీ తెలియనితనం, చాదస్తం, అనుమానం.... మగవాళ్లంటే లోపల ‘జడత్వం’ ఉండి పైకి నిక్కచ్చిగా ఉన్నట్టుగా కనపడుతూ వారిని దూరం పెడుతూ విలువల వంకతో అసహ్యించుకుంటూ ఉండే స్వభావమా జయంతిది అన్నట్టుగా ఉంటుంది. ‘నాకు ఉద్యోగం వచ్చింది వనితా విహార్‌లో. అక్కడంతా ఆడవాళ్లే ఉంటారు తెలుసా?’ అని ఎంతో సంతోషంగా చెప్తుంది బామ్మతో. అదే జయంతి ‘మీరంటే నాకు అసహ్యం’ అని అనేక సార్లు చెప్తుంది రాజశేఖరంతో. ఎందుకు అసహ్యం? ఏమో. తెలియదు. వీరిద్దరూ కలవాలి. అందుకొక సుదీర్ఘ ప్రయాణం అవసరం. ఆ ప్రయాణమే పాఠకులను ఉత్కంఠకు గురిచేసి లక్షలాది మందిని గోళ్లు కొరుక్కునేలా చేసి ఈ నవలను ఇప్పటికి 86 సార్లు రీ ప్రింట్కు తెచ్చింది. ఊహించండి. ఒక అమ్మాయి. నెలకు నూట యాభై రూపాయల జీతం వస్తే చాలు అనే మధ్యతరగతి పిల్ల. అతడు? ఈ మధ్యనే ఆరు లక్షల ఆదాయాన్ని చూసిన వ్యాపారవేత్త. పైగా ఎప్పుడూ చుట్టూ ఆడవాళ్లు. రేఖారాణి అనీ, మిసెస్ వర్మ అనీ, మిసెస్ కరుణాకరం... ప్రమీల.... ఏదో ఒక గాసిప్. ఇలాంటి వ్యక్తి దగ్గర పని అంటే సింహం బోనులో ఉన్నట్టే. ఆ సింహం తన రాజసంతో, దర్పంతో, ఠీవితో ఆకర్షిస్తూనే ఉంటుంది. కాని ఏ క్షణం నోట కరుచుకుంటుందోనని భయం. జయంతి ఈ రెండు భావాల మధ్యా నలిగిపోతూ తప్పుల మీద తప్పులు చేస్తుంటుంది. రాజశేఖరంను ఒక్కసారి కూడా అర్థం చేసుకోదు. అభిమానంతో చీర కొనిస్తే దానిని తిరిగి ఇవ్వడానికి సిద్ధపడిపోతుంది. ఒక మంచి పార్టీలో అందరి సమక్షాన ఆమెను తన కాబోయే భార్యగా ప్రకటిద్దామనుకుని- కాసింత మంచి చీర కట్టుకోరాదూ అని రాజశేఖరం సూచిస్తే అది తన పేదరికం మీద, ఆత్మాభిమానం మీద కొట్టిన దెబ్బగా భావించి గింజుకుంటుంది. ఏదో కారణాన ఎవరో ఒక స్త్రీ అతని భుజం మీద తల వాల్చి ఓదార్పు చెందుతుంటే అది చూసి ఇతడు దుర్మార్గుడే అనే శాశ్వత నిర్ణయానికి వచ్చేస్తుంది. నిజానికి జయంతి నెలకు నూటయాభై రూపాయల స్థితి ఉన్న మనుషులతోనే కొంచెం సౌకర్యంగా ఉండగలదు. శివరామ్లాంటి మామూలు ఉద్యోగి సమక్షంలో ఆమెకు కొంచెం ఊపిరి ఆడుతుంటుంది. కాని ఆ సంగతి అతడికి చెప్పదు. పైగా రాజశేఖరం ఈర్ష్య పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా గ్రహించకుండా తన స్థాయి మగవాళ్లతో చనువుగా మాట్లాడుతుంటుంది. వద్దని వారిస్తే, అది ప్రేమ అని గ్రహించక- ఏమిటి ఇతని అధికారం అని మరింత అసహ్యించుకుంటూ ఉంటుంది. ఈ అసహ్యం, ఇబ్బంది పెరిగి పెరిగి బెంగళూరు పారిపోతుంది. అక్కడ ఎవరెవరి దగ్గరో ఉంటూ దారీ తెన్నూ సొంత అభిప్రాయాలూ లేకుండా బతుకుతూ చివరకు తాను ఇన్నాళ్లూ కోల్పోయిన పెన్నిధి ఏమిటో గ్రహించి రాజశేఖరం దగ్గరకు తిరిగి వస్తుంది. నవల ముగింపువాక్యం - ఆమె అతణ్ణి గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టుకుంది- కాదు. అతడి శిరస్సును తన హృదయానికి హత్తుకుంది - కాదు. భుజం మీద తలవాల్చి తృప్తిగా కళ్లు మూసుకుంది. అంతే. ఇలా భుజం మీద తలవాల్చి తృప్తిగా కళ్లు మూసుకునే జయంతితో భవిష్యత్తులో రాజశేఖరం ఎలా జీవించినా ఆమె అంత వరకూ వచ్చినందుకు పాఠకులకు ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. ఎక్కడలేని ఉత్కంఠ తీరి సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషం ఇవ్వడంలోనే ఈ నవల విజయం అంతా ఉంది. 1960లలో- అంటే ఈ నవలా కాలానికి దేశంలో రెండు ఉన్నాయి. ఒకటి- స్వాతంత్య్రం వచ్చి ఆడపిల్లలు కొద్దోగొప్పో బయటకు వచ్చి, చదువుకొని, ఉద్యోగాలకు ప్రయత్నించడం. రెండు- ఆర్థికంగా ఇంకా కుదురుకోనందు వల్ల సమస్యలు పెరిగి పెళ్లిళ్లు, కార్యాలు వంటివి అసంభవంగా మారడం. ఇలాంటి పరిస్థితుల్లో తమను ఎంచుకునేవాడు, లేదా తాము ఎంచుకునేవాడు ఒక రాజశేఖరంలా ఉండాలని ఏ ఆడపిల్లయినా కోరుకోవడంలో వింత లేదు. వాస్తవలోకంలో ఆ పని జరిగినా జరగకపోయినా కనీసం ఊహాలోకంలో అయినా ఆ పని జరిగేలా చేసి- లక్షలాదిమందికి తెలియని ఆనందం ఇచ్చిన నవల- సెక్రటరీ. అంతే కాదు, ఒక తరాన్ని తీవ్ర ప్రభావంలో ముంచెత్తి తమకు కాబోయే భర్తలను రాజశేఖరంతో పోల్చి చూసి నిరాశ చెందేంత వరకూ వెర్రెత్తించిన నవల ఇది. సెక్రటరీలో సాహిత్యం లేకపోవచ్చు. ఇది సాహిత్య నవలల సరసన చేరకపోవచ్చు. కాని తన సులభమైన శైలి వల్ల, సరళమైన కథనం వల్ల, రాజు - పేద అనే రెండు బలమైన వర్గాల ప్రాతినిధ్య పాత్రల వల్ల ఆకర్షించి, వానాకాలం చదువులు చదివిన ఆడవాళ్లను కూడా పఠితులను చేసి, వారి చేత చదివించేలా చేసి, తెలుగునాట కొత్త పాఠకులను తయారు చేసిన నవల ఇది. ఆ పాఠకుల్లో కొందరైనా మంచి సాహిత్యం వైపు ప్రయాణించకుండా ఉంటారా? అదీ- సెక్రటరీ కాంట్రిబ్యూషన్. యద్దనపూడి సులోచనారాణి ఏ ముహూర్తాన సెక్రటరీ ఫార్ములాను కనిపెట్టారోగాని ఇది సీరియల్‌గా వస్తుండగా పే చేసింది. నవలగా పే చేసింది. సినిమాగా పే చేసింది. నిన్న మొన్న దీని ఆధారంగా ‘రాధ- మధు’ సీరియల్ తీస్తే ఘన విజయం సాధించి మరీ పే చేసింది. అంటే ఇందులో మనుషులకు ఇష్టమైనదేదో ఉంది. ఉంటుంది. ఇవాళ సెక్రటరీలు లేరు. పోయారు. ఆ స్థానంలో పీఏలు వచ్చారు. సెక్రటరీ అనేది పైస్థాయి మాటై కూచుంది. అలాగే ఈ నవలలో కనిపించే అనాబ్‌షాహీ ద్రాక్ష తోటలు కూడా హైదరాబాద్‌లో లేవు. పోయాయి. వాటి స్థానంలో గేటెడ్ కమ్యూనిటీలు వచ్చాయి. ఆ మాటకొస్తే తెలుగులో నవలలైనా ఏం మిగిలాయని? అవీ పోతున్నట్టే. పోనివ్వండి. ఏవి ఎటు గతించినా సెక్రటరీకి మాత్రం గతింపు లేదు. ఎందుకంటే అందులోని అనాయాస రుచి అలాంటిది. అది జో కొట్టే కలల ప్రపంచమూ అలాంటిదే. నవల: సెక్రటరీ రచయిత: యద్దనపూడి సులోచనారాణి తొలి ముద్రణ: 1965 (1964లో జ్యోతి మాసపత్రికలో ధారావాహికం) ఒక కాలపు మధ్యతరగతి ఆడపిల్లల ఆలోచనలని, ఆశలని, ఆత్మాభిమానాలని, అయోమయాలని అందిపుచ్చుకొని ఊహాలోకాల్లో విహరింపజేసి విస్తృత పాఠకాదరణ పొందిన నవల. తెలుగు పాప్యులర్ ఫిక్షన్లో మైలురాయి. తెల్లగా, పొడుగ్గా, హుందాగా ఉండే ‘రాజశేఖరం’ అనే పాత్రను నవలా నాయకులకు మోడల్‌గా చేసిన నవల ఇది. లెక్కలేనన్ని పునర్ము ద్రణలు పొందింది.మార్కెట్లో లభ్యం. వెల: రూ.100 -
బీసీసీఐ మాజీ కార్యదర్శి జయవంత్ లెలె మృతి
-
పవర్‌కు ‘చెక్’
ఏలూరు, న్యూస్‌లైన్ :రాష్ట్రంలోని సర్పంచ్‌లు 17 ఏళ్ల క్రితం పోరాటం చేసి చెక్ పవర్ సాధించుకున్నారు. ఆ అధికారాన్ని పంచాయతీ కార్యదర్శులతో కలిసి పంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించటంతో సర్పంచ్‌లు మరోసారి ఆందోళన దిశగా పయనిస్తున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు జిల్లా సర్పంచ్ల చాంబర్ తరఫున ప్రతినిధులు త్వరలో ముఖ్యమంత్రిని కలవనున్నారు. సర్పంచ్ల చెక్‌పవర్‌ను రద్దు చేసే యత్నంలో మొదటి మెట్టుగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు కలిపి చెక్ పవర్ ఇచ్చారనే అనుమానాలు సర్పంచ్‌లకు ఉన్నాయి. సర్పంచ్‌లు అవతవకలకు, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినపుడు, అవి రుజువైన సందర్భాల్లో మాత్రమే చెక్‌పవర్‌పై ఆంక్షలు విధించేవారు. పంచాయతీలకు రెండేళ్ల తరువాత ఇటీవలే పాలకవర్గాలు ఏర్పడినందున ప్రభుత్వం నిధులివ్వాల్సిందిపోయి, కొత్త సర్పంచ్‌లను అవమానించేలా ఈ ఆంక్షలేమిటంటూ వారు ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నారు. గ్రామ పాలనపై ప్రతికూల ప్రభావం! రెండేళ్లుగా గ్రామాల్లో పాలకవర్గాలు లేక పాలన కుంటుపడింది. దానిని గాడిలో పెట్టాలంటే ప్రస్తుత వర్షాకాలంలో రోడ్లు, పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను సరిదిద్దేందుకు సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది. మరోవైపు జిల్లాలోని 884 పంచాయతీల్లో సగానికిపైగా కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక్కో కార్యదర్శి మూడేసి గ్రామాల బాధ్యతలు కూడా చూడాల్సి వస్తోంది. వారు ఎప్పుడు ఏ గ్రామంలో ఉండాలనే విషయమై నిర్దిష్టమైన జాబ్‌చార్ట్ అమలు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో పంచాయతీలు చేపట్టాల్సిన అత్యవసర సేవలపై సర్పంచ్ సొంత నిర్ణయం తీసుకోవటం సాధ్యమయ్యే వీలు లేదు. చెక్‌పవర్ విషయంలో ఇద్దరి మధ్య సమన్వయం కుదిరే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో గ్రామాల్లో ప్రచ్ఛన్న యుద్ధాలు సాగే ప్రమాదం లేకపోలేదని పలువురి విశ్లేషణ. జాయింట్ చెక్ పవర్‌తో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తే గ్రామాల్లో పాలన కుంటుపడుతుందనేది విశ్లేషకుల భావన. ఎందుకీ కళ్లెం 1996 నుంచి గత పంచాయతీ పాలకవర్గాల వరకు సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఉంది. నాన్చుడు ధోరణి అవలంబిస్తూ ప్రభుత్వం రెండేళ్ల తర్వాత పంచాయతీ పాలకవార్గలకు ఎన్నికలు నిర్వహించింది. సర్పంచ్‌లు పదవి చేపట్టిన నెలలోనే వారి హక్కులను కాలరాసేలా జాయింట్ చెక్‌పవర్ జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఈ చర్య సర్పంచ్‌లను అవినీతిపరులుగా చిత్రీకరిస్తూ ఉద్యోగుల కనుసన్నల్లోనే వారు ఉండేలా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనన్న వాఖ్యలు వినవస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై పోరాటం సాగించే దిశగా సర్పంచ్‌లు యోచిస్తున్నారు. సర్పంచ్‌లను కించపర్చటమే 1996లో 15వేల మంది సర్పంచ్‌లు అసెంబ్లీని ముట్టడించి చెక్‌పవర్‌ను సాధించాం. అప్పటి నుంచి కొనసాగుతున్న హక్కును కాలరాస్తూ జాయింట్ చెక్‌పవర్ ఇవ్వటం చూస్తుంటే అధికారులను నమ్మి, ప్రజాప్రతినిధులను దొంగలుగా అవమానించడమే అవుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ లాంటింది. దీని ద్వారా ప్రభుత్వం ఏం సాధిస్తుంది. ఈ జీవోను వెనక్కి తీసుకునేలా సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో సీఎం కిరణ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలను కలసి వివరిస్తాం. - పిల్లి వెంకటసత్తిరాజు, జిల్లా సర్పంచ్ల చాంబర్ గౌరవాధ్యక్షుడు