ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇంఛార్జ్ సెక్రటరీ సత్యనారాయణ ఆ పదవికి అనర్హుడంటూ మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సత్యనారాయణకు లా డిగ్రీ లేదని ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సత్యనారాయణకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Published Mon, Oct 24 2016 3:36 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
Advertisement