Alla Ramakrishna Reddy
-
ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టు తీర్పు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి రియాక్షన్
-
లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్
-
మంగళగిరి మాదే.. భారీ ర్యాలీతో నామినేషన్
-
బాబు, రేవంత్ మరోసారి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే. కేసును వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదాలు ఇచ్చేదిలేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ.. జూలై 24కు విచారణను వాయిదా వేసింది. విచారణ అనంతరం ఎమ్మెల్యే ఆర్కే సాక్షి మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఒక ఓటుకు ఐదు కోట్లు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడింది. 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రపంచమంతా చూస్తుండగానే డబ్బు ఇచ్చారు. అన్ని సాక్షాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే. ఏడేళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాగదీస్తున్నారు. సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు’’ అని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఇదీ చదవండి: సుప్రీంకోర్టు: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా -
మహిళ చేతిలో నారా లోకేష్ చిత్తు చిత్తు..
-
ఆళ్ల రామకృష్ణ రెడ్డి కౌంటర్
-
పింఛన్ ను 2500 నుండి 5000 కు పెంచిన సీఎం జగన్
-
పార్టీలో చేరిక తరువాత మంగళగిరి సీటుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి రియాక్షన్
-
ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ చేరికపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
కాంగ్రెస్ లోకి వెళ్లి తప్పు చేశా ..!
-
సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు
-
వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత ఆర్కే సంచలన వ్యాఖ్యలు
-
ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, తాడేపల్లి: ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్సీపీ గెలవాలన్నారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ గెలుపునకు తాను పనిచేస్తానన్నారు. పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. ‘‘2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోతారు. సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి -
YSRCPలోకి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
-
ఒక రైతు గా చెప్తున్నా.. ఎవరు బాధపడకండి..ఎమ్మెల్యే ఆర్కే భరోసా
-
బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ నాయకులు
-
చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ కార్యకర్తలకు ఒక్కటే చెప్తున్నా..ఎమ్మెల్యే ఆర్కే స్ట్రాంగ్ కౌంటర్
-
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఎందుకు మార్చారు?
మంగళగిరి: ‘ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. దాంతో తనకు సంబంధం ఏమిటి అంటున్న నారా లోకేశ్ ఆ రింగ్ రోడ్డు నిర్మాణానికి షబ్బానా వాళ్లను ఎందుకు కన్సల్టెంట్‌గా నియమించారు’ అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిలదీశారు. బుధవారం ఎయిమ్స్ ఆస్పత్రి పక్కన అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన టెంపుల్ హిల్ ఎకో పార్కు ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు ముందుగా ఇచ్చినట్టు కాకుండా లింగమనేని రమేష్, మాజీ మంత్రి నారాయణ, హెరిటేజ్ డైరెక్టర్ లోకేశ్ పేరిట కొన్న భూముల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నిజాయితీపరుడైన అప్పటి సీఆర్డీఏ కమిషనర్ నాగులాపల్లి శ్రీకాంత్ వారి మాట వినడం లేదని ఆయనను మార్చేసి సీఆర్డీఏ కమిషనర్‌గా అర్హత లేని అప్పటి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను నియమించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాను అన్ని ఆధారాలు, సాక్ష్యాలతో సహా రికార్డులను సేకరించి సీఐడీ అధికారులకు అప్పగించానని చెప్పారు. చంద్రబాబు రాజధాని పేరుతో ప్రతి అంశాన్ని ఆయన స్వార్థానికి, ఆయన మనుషుల స్వార్థానికి ఎంతలా వాడుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. లింగమనేని రమేష్, మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణ హౌసింగ్ వాళ్లతో పాటు హెరిటేజ్ పేరుతో కొన్న భూములు సుమారు 650 ఎకరాలకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్డును మార్చిన వాట వాస్తవం కాదా అని నిలదీశారు. అనైతిక పొత్తులను ప్రజలు గమనిస్తున్నారు టీడీపీ అధికారమే పరమావధిగా జనసేనతో అనైతిక పొత్తులు పెట్టుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆర్కే పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుల మతాలకు అతీతంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా డీబీటీ ద్వారా రూ.లక్షల కోట్లు పంపిణీ చేసి సంక్షేమాన్ని ఇంటికి చేర్చినట్టు చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్టు వైనాట్ 175 జరిగి తీరుతుందనే నమ్మకం ఉందన్నారు. -
ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంపై లోకేష్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఆర్కే కౌంటర్
-
ఏపీ విద్యార్థులు ఐక్యరాజ్య సమితి లో ప్రసంగించడం హర్షణీయం
-
ఒక్క మాటతో పవన్ కళ్యాణ్, లోకేష్ పరువు తీసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి
-
గుంటూరు
చెంతనే ఉన్న కృష్ణమ్మ మురిసేలా.. మంగళాద్రి లక్ష్మీనరసింహుడే ఆనంద గర్జన చేసేలా.. శాసన రాజధాని నడిబొడ్డున ప్రగతిపతాక సగర్వంగా రెపరెపలాడుతోంది. సంక్షేమ సర్కారుకు మంగళహారతి పడుతోంది. మంగళగిరి–తాడేపల్లి జంట నగరం అభివృద్ధి పథాన పరవళ్లు తొక్కుతూ జయజయధ్వానాలు చేస్తోంది. మళ్లీ అధికారం కోసం అర్రులు చాస్తున్న గత పాలకులకు ఖబడ్దార్ అంటూ సవాల్ విసురుతోంది. మంగళగిరి: వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టాక నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలులో గణనీయ మార్పు కనిపిస్తోంది. రూ.1,200 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2019కు ముందు టీడీపీ హయాంలో మూడు శాఖల మంత్రిగా పనిచేసిన లోకేష్, ఇదే నియోజకవర్గంలో నివాసం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదు. అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సేవా కార్యక్రమాలతో జన హృదయాలు గెలిచారు. ఫలితంగా గత ఎన్నికల్లో తనపై లోకేష్ పోటీ చేసినా అలవోకగా జయకేతనం ఎగురవేశారు. రాష్ట్రంలోనూ వైఎస్సార్ సీపీ జయభేరి మోగించడంతో నియోజకవర్గంపై వరాల జల్లు కురిసింది. ఫలితంగా రూ.వందల కోట్లతో సంక్షేమ, అభివృద్ధి పనులు శరవేగంగా అమలయ్యాయి. ఇప్పటికే చాలా పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 25,254 మంది పేదలకు ఇళ్లస్థల పట్టాలు అందజేశారు. ఇళ్ల నిర్మాణానికీ శ్రీకారం చుట్టారు. గౌతమ బుద్ధా రోడ్డు విస్తరణ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే ఆర్కే చొరవతో రూ.24 కోట్లతో మంగళగిరిలో గౌతమ బుద్ధా రోడ్డును విస్తరించారు. అభివృద్ధికి బాటలు వేశారు. క్రీడలకు ప్రాధాన్యం నగరంలోని క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా వసతు ల కల్పనకు ఎమ్మెల్యే ఆర్కే చర్యలు తీసుకున్నారు. తాగునీటి పథకం ఆవరణలో రూ.7 కోట్లతో స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ ట్రాక్, పవర్ లిఫ్టింగ్ కోచింగ్ సెంటర్ నిర్మాణం చేపట్టారు. ఇవి తుదిదశకు చేరాయి. కొత్తగా షటిల్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నియాత్రలు చేసినా లోకేష్ ఎమ్మెల్యే కాలేరు గతంలో మూడు శాఖల మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్, ఇదే నియోజకవర్గంలో నివాసంలో ఉన్న చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలి. ఎన్ని యాత్రలు చేసినా లోకేష్ ఎమ్మెల్యే కాలేరు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో సంతృప్తస్థాయిలో అభివృద్ధి జరిగింది. దీనిపై చర్చకు నేను సిద్ధం. చేనేతల కోసం మగ్గం షెడ్లు, చేనేత భవనం నిర్మించాం. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించాం. – ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్యే, మంగళగిరి ప్రాంతాల వారీగా సంక్షేమ పథకాల లబ్ధి ఇలా.. మండలం లబ్ధి చేకూరిన మొత్తం (రూ.కోట్లలో) మంగళగిరి అర్బన్ 673.27 మంగళగిరి రూరల్ 23.81 తాడేపల్లి అర్బన్ 125.73 తాడేపల్లి రూరల్ 112.23 దుగ్గిరాల 147.68 -
మహిళా వలంటీర్ పాదాలు కడిగిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో గ్రామస్తులకు ఉత్తమ సేవలు అందించిన దళిత గ్రామ వలంటీర్ జె.రజిత పాదాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మంగళవారం కడిగారు. పూలమాల వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. వలంటీర్ల సేవలు వెలకట్టలేనివని తెలియజేశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చేసిన విమర్శలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. చదవండి: పవన్‌కు వాలంటీర్ల బహిరంగ లేఖ.. పది ప్రశ్నలు -
పేదలకు నో ఎంట్రీ అంటున్న బాబుగారి రైతులు
-
రాజధానిలో పేదలు ఉండకూడదనే చంద్రబాబు కుట్ర: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంగళగిరిలో 23 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించబోతున్నామన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే, కోర్టుల ద్వారా టీడీపీ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కోర్టులో పేదలకు న్యాయం జరిగింది.’’ అని ఆర్కే అన్నారు. ‘‘పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం. సీఎం జగన్ పేదలకు అండగా నిలిచారు. రాజధానిలో పేదలు ఉండొద్దంటూ టీడీపీ దుర్మార్గంగా వ్యవహరించింది. రాజధానిలో పేదలు ఉండకూడదనే చంద్రబాబు కుట్ర. దీపావళి కల్లా మంగళగిరిలో కూడా జగనన్న కాలనీలు పూర్తవుతాయి. ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్నదే సీఎం జగన్ ఆకాంక్ష’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: సీఎం జగన్ గొప్ప మనసు.. గంటల వ్యవధిలోనే.. -
వైఎస్సార్సీపీకి నన్ను దూరం చేయలేరు: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, గుంటూరు: ‘‘రాజకీయాల్లో ఉన్నంత కాలం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే కొనసాగుతా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరూ నన్ను దూరం చేయలేరు’’.. కీలక సమావేశానికి గైర్హాజరు కావడంతో తనపై ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఒక్క స్టేట్మెంట్తో కొట్టిపాడేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. సోమవారం జరిగిన ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం ఉంది. పంటికి సర్జరీతో పాటు ఇంట్లో శుభకార్యం ఉండటం వల్ల మీటింగ్‌కి వెళ్లలేకపోయా. దానికి ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు పిచ్చిపిచ్చి రాతలు రాసింది. ఒక వర్గం మీడియా పనికట్టుకుని విష ప్రచారం చేసింది. వ్యక్తులు, కులాల మధ్య చిచ్చులు పెట్టి మనిషి మనిషిని విడదీసి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నాడు అంటూ ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. అసలు చంద్రబాబు మీటింగ్ పెడితే ఎవరెవరు వచ్చారో.. ఎవరెవరు రాలేదో యెల్లో మీడియా ఎందుకు రాయదు. గత ప్రభుత్వంలో మూడు శాఖల మంత్రిగా పనిచేసిన నారా లోకేష్.. ఏనాడైనా మంగళగిరి మున్సిపల్ సమావేశానికి వచ్చాడా?. జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చాడా?. మరి లోకేష్ గురించి ఎందుకు ఎల్లో మీడియా ప్రస్తావించిందా? అని నిలదీశారాయన. చంద్రబాబు నాయుడు-ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ నుంచి పేదల్ని విడదీయలేరని, మంగళగిరిలో మళ్లీ గెలిచేది వైఎస్సార్సీపీనే అని ఎమ్మెల్యే ఆర్కే ఘంటా పథంగా చెప్పారు. -
నిచ్చెనలాగి.. కూలీలతో కలిసి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి (గుంటూరు): ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) వ్యవసాయ సీజన్ వస్తే రైతుగా పొలంలో పనులు చేస్తుంటారు. ఎమ్మెల్యే ఆర్కేకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. రాజకీయాలలో, ప్రజాసేవలో నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూనే తనకెంతో మక్కువైన వ్యవసాయ పనులను రాజీపడకుండా చేస్తుంటారు. అందులో భాగంగా గురువారం ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలోని తన పొలంలో కూలీలతో కలిసి వ్యవసాయ పనులు చేశారు. కలుపు ఏరి పొలంలో నాట్లు వేయడానికి మెరకపల్లాలను చదును చేయడానికి నిచ్చెనలాగారు. అనంతరం నారుమడికి విత్తనాలు చల్లి, కంది నాటారు. వ్యవసాయ కూలీలతో కలిసి పొలంలోనే వారితోపాటు భోజనం చేసి వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు. -
వాడవాడలా వేడుక
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో మంగళవారం ఈ కార్యక్రమం సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే అక్కడికక్కడే వాటిని పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పారు. -
నారా లోకేశ్ దారుణాలు సృష్టిస్తున్నారు: ఆళ్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, గుంటూరు: దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఒక్కరే ఉండటంతో ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి దానబోయిన సంతోష రూపవాణి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో వైఎస్సార్సీపీ, ఒక స్థానంలో జనసేన విజయం సాధించింది. కాగా, బీసీ మహిళకు ఎంపీపీ స్థానం రిజర్వ్ చేసి ఉంది. అయితే, టీడీపీ నుంచి బీసీ మహిళ సభ్యురాలు లేకపోవడంతో వైఎస్సార్సీపీ మహిళా సభ్యులను ప్రలోపెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు మహిళలు ఎంపీటీసీలుగా గెలుపొందారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికల్లో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు. మేము ఎక్కడా తప్పు చేయలేదు. గెలిచిన 8 మందితోనే మేము ముందుకు వెళ్తాం. టీడీపీలో మహిళా అభ్యర్థి లేకపోవడంతో పచ్చనేతలు వైఎస్సార్సీపీ నేతలను మభ్యపెడుతున్నారని తమ వైపు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే దుగ్గిరాలలో నారా లోకేశ్ దారుణాలు సృష్టిస్తున్నారు’’ అని విమర్శించారు. ఇది కూడా చదవండి: ఈనెల 7,8 తేదీల్లో ఏఎన్‌యూలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా -
బాబూ.. ఇన్ని చీప్ ట్రిక్సా!
రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా, దానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లింకు పెట్టి.. రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు అలవాటైపోయింది. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని.. ఉన్నవి, లేనివి కల్పించి ప్రజల మనసుల్లో విషం నింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్ష నేతననే విషయాన్ని మరచి, చిల్లర గొడవల్లోనూ దూరిపోతున్నారు. పొగలా అనిపిస్తే చాలు.. నిప్పు అంటించి ఆనందం పొందుతున్నారు. తాజాగా తాడేపల్లిలో మూడు సెంట్ల స్థల వివాదం చోటుచేసుకుంటే.. దాంతోనూ సీఎం వైఎస్ జగన్‌కు ముడిపెడుతూ తండ్రీ కొడుకులు శనివారం ట్వీట్ చేస్తూ సమస్యను పెద్దది చేశారు. వాస్తవానికి ఆ వివాదంలో బాధితుడు సాక్షి విలేకరి కావడమే పాపమైపోయింది. అంతా తెలిసీ.. నిస్సిగ్గుగా.. దుర్మార్గంగా.. అన్యాయంగా.. రాజకీయ పరమపద సోపానంలో అడ్డదారుల్లో నిచ్చెన కోసం వెతుకుతున్నారు. బాబు దయనీయ పరిస్థితిని పాపం అనాలా.. లేక మరేమనాలో ఆ పార్టీ శ్రేణులే నిర్ణయించాలి. ఇంతకూ తాడేపల్లిలో వివాదం వివరాలు ఇలా ఉన్నాయి. – మంగళగిరి బాబూ ఇదీ సంగతి.. తాడేపల్లి పోలకంపాడులో స్థల వివాదంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. స్థానికంగా సుబ్బారావు అనే వ్యక్తి 1994లో ఏడు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశాడు. 2010లో పెద్దకుమారుడు కోటేశ్వరరావుకు నాలుగు సెంట్లు, చిన్న కుమారుడు శ్రీనివాసరావుకు మూడు సెంట్లు చొప్పున ఇచ్చాడు. ఈ క్రమంలో కోటేశ్వరరావు తన స్థలంలో ఇల్లు నిర్మించుకోగా, శ్రీనివాసరావు ఆర్థిక సమస్యలతో ఇంటిని నిర్మించుకోలేదు. ఈ స్థలాన్ని ఈనెల 16వ తేదీన శ్రీనివాసరావు వద్ద నుంచి సాక్షి విలేకరి నాగిరెడ్డి పెద్ద మనుషుల సమక్షంలో కొనుగోలు చేశాడు. ఇది గిట్టని కోటేశ్వరరావు గొడవకు దిగాడు. అతనికి ఆపద కలిగి ఉంటే పోలీసులనో, స్థానికులనో పిలవకుండా ‘అయ్యా.. చంద్రబాబూ.. నన్ను కాపాడండి... టీడీపీ నేతలూ.. నన్ను కాపాడండి’ అని కేకలు వేశాడు. దీన్ని బట్టి ఇక్కడ ఏం జరిగిందనేది అందరికీ అర్థమవుతోంది. ఈ విషయం తెలుసుకోకుండా చంద్రబాబు.. సీఎంను, ప్రభుత్వాన్ని, సాక్షి యాజమాన్యాన్ని తిట్టిపోయడం ఎంత వరకు సమంజసం? – ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మంగళగిరి ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకోవాలి పోలకంపాడులో మా నాన్న సుబ్బారావు మా ఇద్దరి అన్నదమ్ములకు స్థలాన్ని విభజించి ఇచ్చారు. నేను నా స్థలాన్ని అమ్ముకున్నాను. మా అన్న అట్లా కోటేశ్వరరావు మాట్లాడేవన్నీ అవాస్తవాలు. యాదవ సంఘం నాయకులు, ఇతర పెద్దలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఇది కుల సమస్య కాదు. 150 కుటుంబాల వరకు పోలకంపాడులో నివాసముంటున్నాయి. ఇక్కడి వారందరికీ నిజం ఏమిటో తెలుసు. నేను ఆర్థికంగా చితికిపోవడంతో మా తండ్రికి ఆరోగ్యం బాగుండకపోవడంతో, మా అన్నయ్య, వదినలు పెట్టే వేధింపులు తట్టుకోలేకే నా స్థలాన్ని నాగిరెడ్డికి అమ్ముకున్నాను. నాగిరెడ్డి మాకు సాక్షి విలేకరిగా పరిచయం కాదు. మా అందరిలో ఒకడిగా ఉంటాడు. పోలకంపాడు వచ్చి వాస్తవాలు తెలుసుకోవచ్చు. – అట్లా శ్రీనివాసరావు, స్థలం విక్రేత స్థలం అమ్మిన మాట వాస్తవం అట్లా శ్రీనివాసరావు స్థలం అమ్ముతున్నాడని మా అందరితో చెప్పాడు. మా అందరి సమక్షంలోనే నాగిరెడ్డికి స్థలాన్ని విక్రయించాడు. అట్లా శ్రీను స్థలం నాగిరెడ్డికి అమ్మగానే అందులో గోడను కూల్చివేశారు. అప్పుడు నాగిరెడ్డి మాకు తెలియజేశాడు. కేసు పెడతామంటే వద్దులే అని చెప్పాం. మళ్లీ గోడ కట్టుకున్నాడని పదేపదే అతడిని దూషించడం, నాగిరెడ్డి స్థలంలో ఉన్నపుడు గొడవ పెట్టుకోవడం.. నన్న చంపొద్దు అంటూ ప్రాధేయ పడడం చూస్తుంటే పకడ్బందీ ప్లాన్ ప్రకారం చేసినట్లుంది. – ప్రభాకర్, మధ్యవర్తి స్థలాన్ని కొనుక్కున్నాను అట్లా శ్రీనివాసరావు నుంచి నేను స్థలం కొనుగోలు చేసేటప్పుడు సాక్షులను, యాదవ సంఘం పెద్దలను విచారించి కొనుగోలు చేశాను. ఎన్నోసార్లు నాపై దాడిచేసినా నేను ఎప్పుడూ వారిని ఏమీ అనలేదు. అట్లా కోటేశ్వరరావు భార్య నా కుటుంబ సభ్యుల్ని, నన్ను అనేకమార్లు నోటికి వచ్చిన బూతులు తిడుతూ అవమాన పరిచింది. చివరకు వారు పెట్టిన వీడియోలో నా చొక్కా పట్టుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. నేను విడిపించుకోవడానికి విశ్వప్రయత్నం చేసినా నాపై దాడి చేశారు. ఇది పూర్తిగా మా వ్యక్తిగత వివాదం. అయినా దీనికి రాజకీయ రంగు పులమడం బాధాకరం. – నాగిరెడ్డి, స్థలం కొనుగోలు చేసిన వ్యక్తి -
మంత్రి పదవి కంటే జగన్ మనసులో స్థానమే ముఖ్యం
మంగళగిరి: మంత్రి పదవి కంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసులో స్థానమే తనకు ముఖ్యమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. 6 నెలల క్రితమే సీఎం జగన్‌ను కలిసి సామాజికవర్గ పరంగా మంత్రి పదవి ఇవ్వడంలో ఇబ్బందులుంటే తనకు పదవి అవసరం లేదని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరానన్నారు. తాను రాజకీయాల్లో ఉంటే సీఎం జగన్ వెంటే ఉంటానని.. లేదంటే తన పొలంలో వ్యవసాయం చేసుకుంటానని అసెంబ్లీ సాక్షిగా గతంలోనే స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. -
‘ఆ బిడ్డల’కు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అండ
నిర్మల్: సేవకు కావలసింది మాటలు కాదని.. చేతలని నిరూపించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈనెల 6న ‘గడ్డాల నాడూ మా బిడ్డలే..’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌పేజీలో ప్రచురించిన ఫొటో కథనానికి ఆయన స్పందించారు. ఈనెల 5న తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ నిర్మల్‌లో ప్రత్యేక శిబిరం నిర్వహించింది. లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు లక్ష్మి, గంగన్న దివ్యాంగులైన తమ కుమారులు శ్రీనివాస్ (22), గంగన్న (18)లను భుజాలపై ఒకరిని, చంకలో ఒకరిని ఎత్తుకుని శిబిరానికి వచ్చారు. యుక్తవ యసులో ఉన్న కొడుకులను మోసుకొస్తున్న తల్లిదం డ్రుల ఫొటోలను ‘సాక్షి’ ప్రచురించింది. దీనికి స్పందించిన ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎమ్మెల్యే రామకృ ష్ణారెడ్డి ఆ కుటుంబానికి రూ.50 వేలు అందించాలని ‘సాక్షి’ సిబ్బందికి పంపించారు. త్వరలోనే ఈ డబ్బులు గంగన్న కుటుంబానికి అందనున్నాయి. -
చంద్రబాబు డైరెక్షన్లోనే అంతా జరుగుతోంది
-
నిజాలు తెలుసుకుని మాట్లాడాలి..
మంగళగిరి: రాంకీ సంస్థలో జరిగిన ఐటీ దాడులపై టీడీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సూచించారు. పట్టణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాంకీ సంస్థలో తాను 2006 నుంచి ఉద్యోగిగా ఉన్నానని, ఉద్యోగులకు కంపెనీ ఇచ్చే షేర్లలో భాగంగా రెండు వేల షేర్లు తనకు ఇచ్చిందని, అలాగే 2007లో బోనస్ కింద పదివేల షేర్లు ఇచ్చిందని.. ఈ 12 వేల షేర్లను ఎవరికీ విక్రయించలేదన్నారు. 2010లో సంస్థ పబ్లిక్ ఇష్యూకి వెళ్లిందన్నారు. 2009లో రాంకీ సంస్థ నుంచి తాను బయటికొచ్చానని అప్పటి నుంచి 2021 వరకూ తనకు రాంకీ సంస్థతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఐటీ అధికారులు తన నివాసంలో జరిపిన దాడుల్లో రూ.4,23,400 నగదు మాత్రమే దొరికిందని, మరెలాంటి బంగారం, డాక్యుమెంట్లు లభించలేదన్నారు. దొరికిన నగదు సైతం తనకు వ్యవసాయం వలన వచ్చిన ఆదాయం అని తెలుసుకున్న అధికారులు తనకు రాతపూర్వకంగా పంచనామా రాసి ఇచ్చి వెళ్లారని నగదు కూడా సీజ్ చేయలేదని వెల్లడించారు. రాంకీ సంస్థ ఎన్నడూ పన్ను ఎగ్గొట్టలేదని ఐటీ దాడుల్లో పన్ను బకాయి ఉంటే చట్ట ప్రకారం సంస్థ చెల్లింపు చేస్తుందన్నారు. అవినీతికి పాల్పడాల్సిన అవసరం తన కుటుంబానికి లేదని ఆర్కే స్పష్టం చేశారు. టీడీపీ నేతలు తనపై బురద జల్లేందుకు ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలో 2014లో 12 ఓట్లతో గెలిచిన తాను.. 2019లో సీఎం కుమారుడు లోకేశ్ పోటీ చేసినా 6 వేల ఓట్లతో ప్రజలు తనను ఆదరించారని చెప్పారు. కంపెనీ, షేర్, మూలధనం, ఐటీ, పబ్లిక్ ఇష్యూ అంటే తెలియని స్థానిక టీడీపీ నేతలను నమ్ముకుంటే చంద్రబాబు, లోకేశ్‌లు కోటి జన్మలెత్తినా మంగళగిరిలో టీడీపీ గెలవలేదన్నారు. -
దమ్ముంటే నిరూపించండి.. టీడీపీ నేతలకు ఆర్కే సవాల్
సాక్షి, గుంటూరు: తన రాజకీయ చరిత్రలో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 2006లో రాంకీ సంస్థలో తాను ఉద్యోగం చేశానని.. 2006-21 వరకు రాంకీ గ్రూప్‌లో తనకు ఏ విధమైన షేర్లు లేవని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ షేర్లు, మూలధనం ఏమిటో టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. దుగ్గిరాలలో ఎక్కడ అవినీతి జరిగిందో దమ్ముంటే నిరూపించాలని టీడీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. మంగళగిరిలో లోకేష్ పై తాను ఆరువేల ఓట్ల మెజార్టీ తో గెలిచానన్నారు. పుష్కరాల పేరుతో తాడేపల్లిలో రెండువేల ఇళ్లను టీడీపీ ప్రభుత్వం తొలగించిందని మండిపడ్డారు. -
దళితులను బెదిరించి భూములు లాక్కున్నారు: ఆర్కే
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో దళితులను బెదిరించి అసైన్డ్ భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, ఈ వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొందరు ఐఏఎస్‌ల పాత్ర ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వీడియో ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. దళితుల నుంచి అసైన్డ్ భూములను లాక్కున్నాకే గత సర్కారు ప్యాకేజీని ప్రకటించిందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ... నిజాలు నిగ్గు తేల్చిన వీడియో.. దాదాపు 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో మంగళగిరికి చెందిన రియల్టర్ కొమ్మారెడ్డి (భూమిపుత్ర) బ్రహ్మానందరెడ్డి టీడీపీ పెద్దల ఆదేశాల మేరకు కొందరు రియల్టర్లను పిలిచి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో దళితులు భూములు అమ్మకపోతే నష్టపోతారని ప్రచారం చేయించాడు. ఈ హెచ్చరికలతో ఆందోళనకు గురైన దళితులు భూములను తెగనమ్ముకున్నారు. డబ్బులు ముట్టినట్లు బాండ్ పేపర్ల మీద వారి సంతకాలు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కట్టలు కట్టలు డబ్బులు తీసుకుని వెళ్లి ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది. రాజధాని ఎక్కడనేది ముందే తెలుసుకాబట్టి చంద్రబాబు ఈ పని చేయించారు. ఆయన బినామీలకు భూములు బదిలీ అయ్యాక ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సాంబశివరావు ఇందులో కీలక పాత్రధారి. రాజధాని గ్రామాల రెవెన్యూ రికార్డులన్నింటినీ దొంగతనంగా తరలించారు. అప్పటి గుంటూరు జిల్లా ఐఏఎస్ అధికారులు కోన శశిధర్, కాంతీలాల్ దండేల సహకారంతో ఈ భూములన్నింటినీ తమకు కావాల్సిన వారికి కట్టబెట్టారు. నాలుగైదు వేల ఎకరాల భూములను కొట్టేసి దళితుల నోట్లో మట్టికొట్టారు. ముందుగానే వారితో బాండు పేపర్ల మీద సంతకాలు తీసుకోవడం ఓ కుట్ర. ప్రభుత్వ భూములకు తప్పుడు రికార్డులు సృష్టించి అనుయాయులకు ప్యాకేజీ వచ్చేలా రూ.కోట్లు కొల్లగొట్టారు. రికార్డుల ట్యాంపరింగ్.. దళితులకు 1940 కన్నా ముందే ఇచ్చిన భూముల పట్టాలు వారి వద్దే ఉన్నాయి. ఆ రోజు నుంచీ వారు ఆ భూములను అనుభవిస్తున్నారు. బెదిరించి లాక్కున్న భూములన్నీ వారికి తిరిగి ఇప్పించాలి. మాజీ ఐఏఎస్ అధికారి సాంబశివరావు భూములకు హద్దులు లేకుండా చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో కూర్చుని రికార్డులు మొత్తం ట్యాంపరింగ్ చేయించారు. దీంతో దళిత సోదరులు మోసానికి గురయ్యారు. చంద్రబాబు చెప్పిన తప్పుడు పనులను చేయలేదని అప్పట్లో ఐఏఎస్ అధికారి నాగులపల్లి శ్రీకాంత్‌ను తప్పించారు. క్యాట్‌లో కేసులు ఉన్న చెరుకూరి శ్రీధర్‌ను తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలి. దోషులను శిక్షించాలి. దళితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరుతున్నా. -
ప్రతి ఒక్కరు జ్యోతిరావు పూలే అడుగు జాడలలో నడవాలి : ఆళ్ల రామకృష్ణరెడ్డి
-
గుంటూరు జిల్లాలో టీడీపీకి ఝలక్
మంగళగిరి: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీకి గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మరో షాక్ తగిలింది. త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికల ముందు అక్కడ ఎంపీటీసీ–1, ఎంపీటీసీ–03 స్థానాలకు టీడీపీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులు ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సమక్షంలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీటీసీ–01 స్థానానికి పోటీచేస్తున్న దరివేముల హనీరాయ్, ఎంపీటీసీ–03 అభ్యర్థిగా పోటీచేస్తున్న బాణావత్ ఉమాదేవి, దుగ్గిరాల సర్పంచ్ బాణావత్ కుషీబాయ్తో పాటు పలువురు నాయకులు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేసినప్పటికీ అక్కడ వైఎస్సార్సీపీ మద్దతుదారుడు 1,100 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో డీలాపడ్డ ఆ పార్టీ నేతలకు ఎంపీటీసీ అభ్యర్థులు మరో షాక్ ఇవ్వడంతో ఎంపీటీసీ ఎన్నికల్లోగా ఇంకెంతమంది జంప్ అవుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. సీఎం సంక్షేమ పథకాలు ఆకట్టుకున్నాయి కాగా, వైఎస్సార్సీపీలో చేరిన హనీరాయ్, ఉమాదేవి మాట్లాడుతూ.. తమకు తొలి నుంచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి అంటే ఇష్టమని.. కానీ, స్థానిక టీడీపీ నేతల మాటలు నమ్మి ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేశామన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమను ఆకట్టుకున్నాయన్నారు. తమపై ఎలాంటి ఒత్తిడిలేదని వారు స్పష్టంచేశారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయన్నారు. సంక్షేమ పథకాలే తమ పార్టీని విజయపథంలో నడిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. -
‘అసైన్డ్’పై గత సర్కారు తప్పు చేసినా ఎందుకు సహకరించారు?
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో గత సర్కారు తప్పు చేసినా ఎందుకు సహకరించారంటూ సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారుల బృందం ప్రశ్నించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ తదితరులపై కేసు నమోదు చేసిన సీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సర్కారు హయాంలో రాజధానికోసం భూ సమీకరణ(ల్యాండ్ ఫూలింగ్) జరిగినప్పుడు ఆ ప్రాంతమున్న గుంటూరు జిల్లాకు జాయింట్ కలెక్టర్గాను, రాజధానిలో రైతుల భూముల సేకరణ, ప్లాట్లు కేటాయింపు తదితర చర్యలు చేపట్టినప్పుడు సీఆర్డీఏ కమిషనర్‌గాను కీలక బాధ్యతలు నిర్వర్తించిన శ్రీధర్‌ను శుక్రవారం విజయవాడలోని సత్యనారాయణపురం సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారించారు. అసైన్డ్ భూములు చట్టవిరుద్ధంగా చేతులు మారుతున్నప్పుడు, అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పుడు కీలక బాధ్యతల్లో ఉన్న మీరు ఎందుకు పట్టించుకోలేదని శ్రీధర్‌పై సీఐడీ అధికారులు ప్రశ్నలవర్షం కురిపించినట్టు సమాచారం. మంత్రివర్గ ఆమోదం లేకుండానే జీవోలు జారీ చేస్తున్నా, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ అడ్డగోలుగా జరిగినా ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారిగా తన పరిధి మేరకు ఏది చట్టబద్ధమో? ఏది చట్టబద్ధం కాదో? ప్రభుత్వానికి చెప్పడం వరకే తన బాధ్యత అని, ఆచరించడం, ఆచరించకపోవడం అనేది వారిష్టమని శ్రీధర్ చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో ఇంకా అనేక కీలక ఆధారాలను శ్రీధర్ నుంచి సీఐడీ సేకరించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామానికి చెందిన దళిత రైతుల నుంచి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐడీ పోలీసులు శుక్రవారం పలు వివరాలు సేకరించారు. చంద్రబాబు హయాంలో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తు చేసింది. -
చంద్రబాబుకు శిక్ష తప్పదు..
సాక్షి, అమరావతి: అమరావతిలో దళితులను దగా చేసిన మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు అసైన్డ్ భూ కుంభకోణం కేసులో శిక్ష తప్పదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని ఎమ్మెల్యే ఆర్కే ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే నిమిత్తం సీఐడీ అధికారులు తమ ఎదుట హాజరు కావాలని ఆర్కేకు నోటీసులు పంపించగా.. గురువారం ఆయన విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి వచ్చారు. దాదాపు గంటన్నర పాటు సీఐడీ అధికారులు అడిగిన సమాచారం ఇచ్చి, ఆధారాలు సమర్పించిన అనంతరం మీడియాతో ఆర్కే మాట్లాడుతూ.. రాజధాని పేరుతో తమకు అన్యాయం జరిగిందని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు ఎస్సీ, ఎస్టీ రైతులు ఆవేదన చెందడంతో వారికి న్యాయం చేసే నిమిత్తం తాను సీఐడీకి ఫిర్యాదు చేశానన్నారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 500 ఎకరాలకు పైగా దళితుల భూములను టీడీపీ పెద్దల బినామీలు లాక్కున్నారని, తాడికొండ నియోజకవర్గంలో మరో 3,500 ఎకరాల అసైన్డ్ భూములు గుంజుకున్నారని తెలిపారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు, అసైన్డ్ భూ కుంభకోణానికి సంబంధం లేదని, ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారని, కోర్టుల పరిధిలో ఉన్న దాని గురించి తాను మాట్లాడబోనని చెప్పారు. అసైన్డ్ భూ కుంభకోణానికి పాల్పడేలా చంద్రబాబు తెచి్చన జీవో 41 వల్ల రెవెన్యూ చట్టాలు దెబ్బతింటాయని అప్పట్లో కొందరు ఐఏఎస్‌లు అభ్యంతరాలు తెలిపారని, వారు రాసిన నోట్ ఫైల్స్ (అభ్యంతరాలు)ను సీఐడీ అధికారులకు అందజేసినట్టు ఆర్కే చెప్పారు. ఈ కేసులో తన వద్ద ఉన్న పూర్తి సాక్ష్యాధారాలు సీఐడీకి సమరి్పంచానని, ఎప్పుడు రమ్మన్నా విచారణకు వస్తానని చెప్పానన్నారు. -
నేడు విచారణకు వచ్చి వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసులో గురువారం విచారణకు రావాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ బుధవారం నోటీసు అందజేసింది. అమరావతిలో ఎస్సీ, ఎస్టీల భూములను టీడీపీ నేతలు బలవంతంగా తక్కువ ధరకు గుంజుకున్నారని, అసైన్డ్ భూముల వ్యవహారంలో దళితులకు తీవ్ర అన్యాయం, నష్టం జరిగిందని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఆర్కే సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నమోదైన కేసులో ఏ1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి పి.నారాయణ ఉన్నారు. చంద్రబాబు ఈ నెల 23న, నారాయణ 22న విచారణకు రావాలని ఇప్పటికే సీఐడీ నోటీసులిచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారైన ఆర్కే వాగ్మూలం నమోదు చేసేందుకు విచారణాధికారిగా ఉన్న సీఐడీ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణరావు సీఆర్పీసీ 160 నోటీసు జారీచేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ రీజినల్ కార్యాలయానికొచ్చి కేసుకు సంబంధించి.. మీకు తెలిసిన వివరాలు చెప్పాలని సీఐడీ నోటీసులో పేర్కొన్నారు. -
బాబు, నారాయణలకు శిక్ష తప్పదు
మంగళగిరి: దళితులను భయపెట్టి, బెదిరించి వారి భూములను కాజేసిన చంద్రబాబు, నారాయణ అండ్‌కో, వారి బినామీలకు శిక్ష తప్పదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మాట్లాడారు. అన్ని ఆధారాలతోనే తాను ఫిర్యాదు చేసిన మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. దర్యాప్తు చేసిన అధికారులు అన్ని ఆధారాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేశారని చెప్పారు. చంద్రబాబు రాజధానిని ప్రకటించకుండా నూజివీడు, అక్కడ.. ఇక్కడ అంటూ లీకులు ఇస్తూ తమ బినామీలతో మాత్రం ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 500 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేయించారన్నారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలలోని రాజధాని ప్రాంతంలో సుమారు 3,500 ఎకరాలను కొట్టేశారని ఆరోపించారు. విచారణలో నిజాలన్నీ బయటకొస్తాయన్నారు. దళితుల భూములను విక్రయించరాదని, బదలాయించరాదని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. చట్టాలను అతిక్రమించి.. కేబినేట్లో ఆమోదం పొందకుండా అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని తెలిపారు. అనంతరం, తన అనుంగులకు కోట్లాది రూపాయలు లబ్ధి చేకూర్చేలా వాటిని కట్టబెట్టారని విమర్శించారు. దీంతో అమాయకులైన దళిత సోదరులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దళితులకు న్యాయం చేయాలంటూ దళితులే ఫిర్యాదు చేయాలని ఎక్కడా లేదని, వారి తరఫున ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని టీడీపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే సీఐడీ విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. -
చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ అభ్యర్థించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు డబ్బులు ఇవ్వజూపారని, దీనిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ త్వరితగతిన విచారణ చేయాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల దాఖలు చేసిన ఎర్లీ హియరింగ్ అప్లికేషన్‌ను గురువారం జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, న్యాయవాది అల్లంకి రమేశ్‌లు వాదనలు వినిపించారు. ‘2017 మార్చిలో పిటిషన్ దాఖలు చేయగా 2018 నవంబరులో పిటిషన్ ధర్మాసనం ముందుకొచ్చింది. నాడు జస్టిస్ మదన్ బి లోకూర్ ధర్మాసనం ముందుకు రాగా 2019 ఫిబ్రవరిలో విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. 2019లో విచారణ చేయాల్సిన కేసు నెలలు గడుస్తున్నా బెంచ్‌మీదకు రాకపోవడంతో నవంబర్ 23, 2019న మరొక ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ దాఖలు చేశాం. అయినప్పటికీ విచారణ జాబితాలోకి రాకపోవడంతో ఈ నెల మొదటి వారంలో మరో డైరెక్షన్ అప్లికేషన్ దాఖలు చేశాం’ అని ధర్మాసనానికి వివరించారు. పిటిషన్ వచ్చే ఏడాది వేసవి సెలవులు అనంతరం జులైలో విచారణ చేస్తామని జస్టిస్ ఎస్ఏ బోబ్డే పేర్కొన్నారు. వచ్చే ఏడాది జులైలో విచారణకు ఏమీ అభ్యంతరం లేదని కానీ విచారణ తేదీని ఖరారు చేయాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. రాజకీయనేతల ప్రమేయం ఉన్న కేసులు వీలైనంత త్వరగా విచారణచేయాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన అంశాన్ని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రస్తావించారు. ఈ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని, కానీ తెలంగాణ ఏసీబీ ఆ పేరు చేర్చడంలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రశాంత్ భూషణ్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రధాన కేసు జూలైలో విచాస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ‘ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ పై విచారణ ముగిస్తున్నాం. ప్రధాన కేసు జూలై 14, 2021న తగిన ధర్మాసనం విచారిస్తుంది’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. -
అక్రమ కార్యాలయంపై టీడీపీకి ‘సుప్రీం’ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణం కోసం గుంటూరు జిల్లా ఆత్మకూరులో గత సర్కారు చేసిన భూ కేటాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీచేసింది. సీఆర్డీఏ, రాష్ట్ర ప్రభుత్వంతోపాటు మొత్తం 12 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 23వతేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రోహింటన్ నారీమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన« ధర్మాసనం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే ఆళ్ల తరఫున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేష్ అల్లంకి వాదనలు వినిపించారు. గత సర్కారు టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణం కోసం అక్రమంగా భూ కేటాయింపులు చేసిందని, నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిపిన కేటాయింపులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యావరణం కోణంలో చూడాలి.. ‘మంగళగిరి మండలం ఆత్మకూరులో సర్వే నంబర్లు 392/1, 392/3, 392/4, 392/8, 392/10 పరిధిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి గత సర్కారు 99 సంవత్సరాల లీజు ప్రాతిపదికన భూమి కేటాయించింది. అవి పోరంబోకు భూములు. వాటిని ఎవరికీ కేటాయించడానికి వీల్లేదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతించారు. ఇది చట్ట, రాజ్యాంగ విరుద్ధం. నీటి వనరులు, వాటితో సంబంధం ఉన్న భూములను కేటాయించడంపై నిషేధం ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవడానికి స్వేచ్ఛ ఉందని హైకోర్టు చెప్పినప్పటికీ కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వలేదు. లీజు, నిర్మాణాలు నిషేధమని నాటి ప్రభుత్వం అంగీకరించినా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు’ అని తెలిపారు. ఈ తరహా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టే హైకోర్టు కేసును ముగించి ఉండవచ్చు కదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే పెండింగ్‌లో ఉన్న కేసు వ్యక్తిగతమైందని, ఈ కేసును మాత్రం పర్యావరణానికి సంబంధించిన పెద్ద అంశంగా చూడాలని ప్రశాంత్ భూషణ్ ధర్మాసనానికి నివేదించారు. కేవియెట్లు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించిన ధర్మాసనం మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
అది టీడీపీ ఎమ్మెల్సీ పీఆర్వో పనే
మంగళగిరి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటుకొందరు విలేకరులపై సోషల్ మీడియాలో దు్రష్పచారానికి పాల్పడింది టీడీపీ ఎమ్మెల్సీ పీఆర్వో చైతన్య, ఎమ్మెల్సీ అనుచరులేనని పోలీసుల విచారణలో తేలింది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన కేసుతో పాటు అదే ఉద్యోగాలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు మంగళగిరి సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 2017లో ఎమ్మెల్సీ, మంత్రికి అనుచరుడిగా ఉన్న మంగళగిరికి చెందిన గాలి వెంకట లారెన్స్ పట్టణంలోని కొత్తపేటకు చెందిన కారంచేటి మణికాంత్‌కు విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.23 లక్షలు తీసుకున్నాడు. మూడేళ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మణికాంత్ ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్న కోలపల్లి సునిల్‌కుమార్ కీలకపాత్ర వెలుగులోకి వచ్చింది. అతనితోపాటు ఎమ్మెల్సీకి మరో సన్నిహితుడు లారెన్స్ పేరు బయటకు రావడంతో పీఆర్వో చైతన్య దీన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడ వేశాడు. ఎమ్మెల్సీకి కేసు చుట్టుకుంటుందనే భావనతో ఉద్యోగాల పేరిట వసూళ్లకు సంబంధించి అజేయ కల్లం, ఆర్కే, సాక్షి విలేకరిపై దుష్ప్రచారానికి పూనుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో లారెన్స్, కొప్పూరి వేణును అరెస్ట్ చేసినట్టు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఎమ్మెల్యే ఆర్కేకు పితృ వియోగం
సాక్షి, పెదకాకాని/పేరేచర్ల: రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి దశరథరామిరెడ్డి(86)కి కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులు, అభిమానులు శుక్రవారం కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికారు. పెదకాకాని సర్పంచిగానే కాక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శివాలయం పాలకవర్గం చైర్మన్‌గా పనిచేసిన దశరథరామిరెడ్డి గ్రామ, ఆలయ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించి ప్రజల మన్ననలు పొందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న దశరథ రామిరెడ్డి గుంటూరు సాయిభాస్కర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించిన సంగతి విదితమే. పెదకాకానిలోని ఆయన నివాసానికి గురువారం రాత్రి స్థానిక నాయకులు, అభిమానులు, బంధుమిత్రులు చేరు కుని ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే, పారిశ్రామికవేత్త పేరిరెడ్డిని పరామర్శించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అంబులెన్స్‌లో దశరథరామిరెడ్డి భౌతికకాయం ఆయన నివాసానికి చేరుకుంది. దశరధరామిరెడ్డి సతీమణి వీరరాఘవమ్మ పెద్ద కుమారుడు అయోధ్యరామిరెడ్డి చేయి పట్టుకోగా భర్త భౌతికకాయంచుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ‘అయ్యా వెళ్లిపోతున్నావా’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. పెదకాకానిలో ప్రజల సందర్శనానంతరం భౌతికకాయాన్ని ఫిరంగిపురం మండలం, వేమవరంలోని ఆళ్ల వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అయోధ్యరామిరెడ్డి శాస్త్రోక్తంగా పూజా క్రతువు నిర్వహించి తండ్రి పార్థివదేహానికి అంత్యక్రియలు జరిపించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఎమ్మెల్యేలు కిలారి వెంకటరోశయ్య, మహమ్మద్ ముస్తాఫా, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్, లింగంశెట్టి ఈశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, పాదర్తి రమేష్‌గాంధీ, కళ్లం హరనాథరెడ్డి, మేరుగ విజయలక్ష్మి, డైమండ్ బాబు తదితరులు దశరథరామిరెడ్డి పార్ది్థవదేహానికి నివాళులర్పించారు. -
వైఎస్సార్ సున్నా వడ్డి పథకం చెక్కుల పంపిణీ
సాక్షి, ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజమైన మహిళల పక్షపాతి అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలులో వైఎస్సార్ సున్నా వడ్డి పథకం చెక్కులను డ్వాక్రా మహిళలకు మంత్రి శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చంద్రబాబులా మాయమాటలు చెప్పకుండా పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప నేత సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జేట్ ఉన్నప్పటికీ ప్రజలను ఆదుకోవాలనే మంచి మనసు ఉంది కాబట్టే ఇవ్వాళ పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అందిస్తున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారన్నారని మంత్రి పేర్కొన్నారు. (కర్నూలులో సున్నా వడ్డి పథకాన్ని ప్రారంభించిన మంత్రి) గుంటూరు: సీఎం జగన్ మాట తప్పడు.. మడమ తిప్పడని మరోసారి రుజువైందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి అన్నారు. మంగళగిరిలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా స్వయం సహాయక సంఘాలకు పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అనంతపురం: సంక్షోభ కాలంలోనూ సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే సిద్దారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా 11 కోట్ల రుణాలు డ్వాక్రా మహిళల ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. కష్టకాలంలో డ్వాక్రా మహిళలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. -
మంగళగిరిలో సున్నా వడ్డీ ప్రారంభం
-
‘పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు కూడా లేరు’
-
బోండా ఉమా, బుద్దా వెంకన్నకు మాచర్లలో ఏంటి పని?
సాక్షి, తాడేపల్లి: స్థానిక ఎన్నికలు జరగకుండా ఉండటమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాబు ఎన్నికలను ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని చిన్న సంఘటనలను కూడా భూతద్దంలో చూపుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా లేరని విమర్శించారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డబ్బు, మద్యం లేకుండా స్థానిక ఎన్నికలు జరగాలని నూతన సంస్కరణలు తెచ్చారన్నారు. ఇక 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా ఇలాంటి సంస్కరణలు తెచ్చారా విమర్శించారు. రాజకీయ నాయకులు, బంధువులు ఎన్నికల్లో పోటీ చేయకుడదనే నూతన విధానాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారన్నారు. సీఎం జగన్ పాలనను అన్ని రాష్ట్రాల వారు అభినందిస్తుంటే ఎల్లో మీడియాకు అవి కనబడటం లేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీలో భారీ ఎత్తున చేరికలు 8 నెలల కాలంలో సీఎం జగన్ చేసిన పాలనను ఇతర రాష్ట్రాలు సైతం అనుసరిస్తున్నాయని చెప్పారు. అవి...ఎల్లో మీడియాకు కునబడం లేదా అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తెస్తున్న నూతన సంస్కరణలు నచ్చక చంద్రబాబు ఎల్లో మీడియాల్లో రాష్ట్రంలో ఏదో జరిగిపోయినట్లుగా కల్పితాలు రాపిస్తున్నారన్నారు. ఆయన అమలులోకి తెచ్చిన ఇంగ్లీషు మీడియం, వికేంద్రీకరణ, దిశ చట్టాన్ని ఇతర రాష్టాలు కూడా మెచ్చుకుని వాటిని అనుసరిస్తున్నాయి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు. గతంలో తమ నాయకులైన అంబటి రాంబాబు, ముస్తఫాలు సత్తెనపల్లిలో ఎంపీటీసీగా గెలిచిన వారిని బస్సులో తీసుకువెళుతుంటే జరిగిన దాడిపై బాబు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. పల్నాడులో టీడీపీ పాలనలో జరిగిన అరాచకాలు అందరికీ తెలుసని, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం, గురజాలలో యరపతినేని, చిలకలూరిపేటలో పుల్లారావ్ చేసిన అరాచకాలు ప్రజలు గమనించారని తెలిపారు. బోండా ఉమా, బుద్దా వెంకన్నకు మాచర్లలో ఏంటి పని..? అని ప్రశ్నించారు. విజయవాడ నుండి గూండాలను మాచర్ల తెచ్చారా అని ఎద్దేవా చేశారు. పల్నాడు పౌరుషాల గడ్డ ప్రజలు మీ అరాచకాలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ‘సంతాప సభను.. బాబు రాజకీయ సభగా మార్చారు’ టీడీపీ నుంచి రోజుకు ఇద్దరూ చొప్పున పార్టీ మారుతుంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిందలువేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో సీబీఐ, ఈడీలను ఎందుకు రాష్ట్రంలోకి రానివ్వలేదని, చంద్రబాబు ఎల్లో మీడియాతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏడాది పాటు ఎన్నికలు జరపకుండా ప్రత్యేక అధికారులతో పాలన చేసిన నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. సీఎం జగన్ ఆర్డినెన్స్ తో నూతన సంస్కరణలు తీసుకువచ్చారని, డబ్బులు లేకుండా ఎన్నికల జరగాలన్నదే ఆయన ఉద్దేశం అన్నారు. పులివెందుల పంచాయతీ అని విమర్శలు చేస్తున్న టీడీపీ నాయకులు ఓసారి పులివెందుల వెళదాం రండి... అక్కడి ప్రజల మమకారం మీకు తెలియదు అని వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యoలో హింసకు తావు లేదని.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం జగన్ తీసుకువచ్చిన సంస్కరణలకు కట్టుబడి పని చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ: చంద్రబాబు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆరాచకాలు ఎలా చేయాలో బాబు తన మనుషులకు చెప్పి పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవలేమనే జనాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా బాబు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. -
మానవత్వం చాటుకున్న ఆర్కే
సాక్షి, గుంటూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను ఆస్పత్రికి తరలించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన మానవత్వాన్ని చాటుకున్నారు. తాడేపల్లి శివారులో సోమవారం రెండు బైకులు ఢీకొని ధనలక్ష్మీ అనే మహిళ తలకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ధనలక్ష్మీ అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. అటుగా వెళ్తున్న ఆర్కే.. ప్రమాద విషయాన్ని గమనించి తన కారులోఆమెను ఆస్పత్రికి తరలించారు. దగ్గర ఉండి మహిళకు చికిత్సను అందించారు. -
ఎమ్మెల్యే ఆర్కేకి గాయం
సాక్షి, గుంటూరు/మంగళగిరి: గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఓ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గాయపడ్డారు. వధూవరులను ఆశీర్వదించేందుకు స్టేజీపైకి వెళ్లిన ఆర్కేతో కరచాలనం కోసం స్థానికులు కూడా వేదికపైకి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. ఘటనలో ఎమ్మెల్యే కాలికి గాయమైంది. వెంటనే గుంటూరు అరండల్‌పేటలోని సాయిభాస్కర్ ఆస్పత్రికి తరలించారు. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆర్కేను కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితరులు పరామర్శించారు. (జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని అభినందిస్తున్నా: పవన్ కళ్యాణ్) -
పచ్చమీడియా చంద్రబాబుకు దాసోహమైంది
-
చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, గుంటూరు: అవినీతి, అక్రమాలు ఎక్కడ బయట పడతాయోనని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భయం పట్టుకుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సిట్ వేయడంతో చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారన్నారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసి రైతులు, ప్రభుత్వాన్ని చంద్రబాబు తప్పుదారి పట్టించారని ఆయన మండిపడ్డారు. రాజధానిలో పోలీస్, రెవెన్యూ అధికారులను అడ్డుకోవడం సరికాదన్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని రాజధాని రైతులకు ఎమ్మెల్యే ఆర్కే సూచించారు. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్ రాజధాని పర్యటన
-
ఐటీ దాడులపై వారు నోరు మెదపరేం..!
సాక్షి, విజయవాడ: పచ్చమీడియా రోజురోజుకు దిగజారిపోతుందని వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్‌కల్యాణ్ రాజధానిలో పర్యటించారని విమర్శించారు. రెండు వేల కోట్లు అక్రమ లావాదేవీలు జరిగాయని సీబీడీటీ అధికారులు స్పష్టంగా ప్రెస్ నోట్లో చెప్పారని తెలిపారు. శ్రీనివాస్ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అడ్డంగా దొరికిపోయారన్నారు. సీబీడీటీ ప్రాథమిక విచారణ లోనే రెండు వేల కోట్ల అక్రమ వ్యవహారం జరిగితే ఇక పూర్తిస్థాయిలో విచారణ జరిగితే చంద్రబాబుకు సంబంధించిన వేల కోట్ల అక్రమ సంపాదన బయట పడుతుందన్నారు. ('మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా') ‘తన మాజీ పీఎస్ ఇంటిపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు. లోకేష్ బినామీ రాకేష్ కంపెనీలపై ఐటీ దాడులు జరిగితే లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదు.తన కొడుకు కంపెనీలపై ఐటీ దాడులు జరిగితే మాజీ మంత్రి పుల్లారావు ఎందుకు నోరు విప్పడం లేదు. ఇప్పటికీ పవన్‌కల్యాణ్, సీపీఐ రామకృష్ణ, నారాయణలు ఎందుకు మాట్లాడటం లేదు. టీడీపీ నేతలు, పచ్చమీడియా ఎందుకు గొంతులు చించుకుంటుందని’ ఆర్కే ప్రశ్నించారు. -
'పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని'
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు, లోకేష్ ఇచ్చే ప్యాకేజీలకు పవన్ లొంగిపోయారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీని మాత్రమే ప్రశ్నిస్తున్నారని, పేద రైతుల భూములు కాజేసిన చంద్రబాబును మాత్రం ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటనను ఆళ్ల తప్పుపట్టారు. గుంటూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించే ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఉన్న పరిజ్ఞానం కూడా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: ‘ఆయన వేషం మార్చి నటుడయ్యారు..!’ గత ఐదేళ్లు పవన్ చంద్రబాబుతో లోపాయికారిగా స్నేహం చేసి, ఆయన ఇచ్చిన ప్యాకేజీలు తీసుకున్నారు. రైతులకు చంద్రబాబు మోసం చేసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటించలేదు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా పవన్ చంద్రబాబును ప్రశ్నించలేదు. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. గత ఐదేళ్లు చంద్రబాబు ప్యాకేజీలకు లొంగి.. ఈ రోజు రాజధాని ప్రాంతానికి వచ్చి రైతుల సమస్యలను తెలుసుకోకుండా వారిని రెచ్చగొట్టడం ఎంతవరకు వరకు సమంజసం. మేం రాజధాని ప్రాంత రైతులం. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి రిజర్వ్ జోన్లను తొలగించాలని కోరాం. సమస్య ఏంటో తెలుసుకోకుండా పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అసలు రాజధాని అమరావతి నుంచి తరలించడం లేదు. ఇక్కడే శాసన సభ ఉంటుంది. అధికార వికేంద్రీకరణ కావాలి. ఎగ్జిక్యూటీవ్ రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును చేయబోతున్నాం. చంద్రబాబు వదిలిపెట్టిన పనులు పూర్తి చేయాలంటే లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. రాజధాని రైతులకు సీఎం న్యాయం చేస్తుంటే రైతులను రెచ్చగొట్టడం సరికాదు. రాజధాని అంశం రాష్ట్రం పరిధిలో ఉంటుందని తెలిసి కూడా రైతులను రెచ్చగొట్టడం సరికాదు. చంద్రబాబు ఏం చెబితే.. అదే పవన్ మాట్లాడుతున్నారు. పవన్‌కు లోక పరిజ్ఞానం లేదు. ఇది తప్పు అయితే చంద్రబాబు, లోకేష్ ఇస్తున్న ప్యాకేజీలు తీసుకొని మాట్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించే ముందు ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి..రైతులు, రైతు కూలీలు, పేదలు ఎంత మంది ఉన్నారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సీఎం వైఎస్ జగన్ అడగకుండానే రైతులకు కౌలు 15 ఏళ్లు పెంచారు. కూలీలకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పరిహారం పెంచారు. సీఎం నిర్ణయానికి హర్షించాల్సింది పోయి చంద్రబాబు, లోకేష్‌లు చెప్పినట్లు పవన్ మాట్లాడటం సరికాదు. చదవండి: నా జీవితం ఏ మగాడి సాయం లేకుండా సాగుతోంది: రేణు సుమారు 4500 ఎకరాల భూములు బినామీల పేరుతో, తెల్ల రేషన్‌కార్డు దారులతో కొనుగోలు చేయించారు. ఇవాళ కేసులు కూడా నమోదు అయ్యాయి. వీటిపై పవన్ నోరు మెదపడం లేదు. దళితుల భూములను చంద్రబాబు కాజేస్తే..ఆ భూములు తిరిగి దళితులకు సీఎం వైఎస్ జగన్ ఇప్పించారు. ఈ విషయాలపై పవన్ మాట్లాడటం లేదు. చంద్రబాబు, లోకేష్ చెప్పిన మాటలు వళ్లెవేయడంలో పవన్ ఉన్నారు. చంద్రబాబు బినామీ కంపెనీలతో వేల కోట్లు డబ్బులు దోచేశాడు. దీనిపై పవన్ మాట్లాడటం లేదు. తాత్కాలిక భవనాలకు వేల కోట్లు ఖర్చు చేసి దోచుకున్నా మాట్లాడటం లేదు. రాజధాని పేరుతో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టకపోయినా పవన్ ప్రశ్నించడం లేదు. ఇన్ని బొక్కలు పెట్టుకొని ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీని ప్రశ్నిస్తానని పవన్ అంటున్నారు. ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు తెలిపారు. పవన్ ఎందుకు ఈ విషయాలపై మాట్లాడటం లేదు. పవన్ రైతులను, జనసేన కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నారు. రాజధాని పర్యటనకు తన పార్టీ ఎమ్మెల్యేను ఎందుకు పిలువలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చదవండి: రేణుదేశాయ్ ఇబ్బందులు అందరికీ తెలుసు -
'పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని'
-
పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి
-
చంద్రబాబు రైతు ద్రోహి
-
మీరు కూడా రండి.. సీఎం దగ్గరకు వెళ్దాం..
-
బాబు, లోకేశ్.. సీఎం దగ్గరకు వెళ్దాం రండి: ఆర్కే
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రోజురోజుకూ దిగజారి ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడం సరికాదని హితవు పలికారు. సమస్యలు చెప్పుకొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజధాని రైతులు కలిశారని.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తమది రైతు ప్రభుత్వం అని.. అడగకుండానే సీఎం జగన్ కౌలు పరిహారాన్ని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచారని పేర్కొన్నారు. రైతు కూలీల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచారన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా.. పూలింగ్ పేరిట చంద్రబాబు బలవంతపు భూసేకరణ చేశారని.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం 8648 ఎకరాలు అవసరమా అని ప్రశ్నించారు. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు భ్రష్టు పట్టించారని విమర్శించారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు.(రాజధానితో చంద్రబాబు వ్యాపారం) మీరు కూడా రండి.. సీఎం దగ్గరకు వెళ్దాం.. ‘‘నేషనల్ హైవే దగ్గర జయభేరి వాళ్లు అపార్టుమెంట్లు కట్టారు. అక్కడికి సమీపంలోనే ఈస్ట్ ఫేస్‌తో రైతులకు సంబంధించిన భవనాలు కడుతుంటే.. వాటి కారణంగా జయభేరి అపార్టుమెంట్లు అమ్ముడుపోవనే కారణంతో వాటిని రిజర్వు జోన్లో పెట్టారు. దానిని ఎత్తివేయాలని సీఎం జగన్‌ను కోరాం. రైతుల సమస్యల గురించి చెప్పడానికి వెళ్తే నన్ను రైతు ద్రోహి అంటారా. రైతులను, రైతు కూలీలను పెయిడ్ ఆర్టిస్టులు అంటారా’’ అని ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు.(భావి తరాల బాగుకే వికేంద్రీకరణ) అదే విధంగా... ‘‘అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు.. తన ఇంటి దగ్గర బల్బుల కోసమని... ఉండవల్లి పంచాయతీ నుంచి రూ. 50 లక్షలు డ్రా చేయించారు. పేదల ఇళ్లకు కనీస విద్యుత్ సౌకర్యాలు కల్పించలేదు. రెఫరెండం పెట్టాలని ఇప్పుడు అడుగుతున్నారు. అసలు ఏయే అంశాలపై రెఫరెండం పెట్టాలో బాబుకు తెలియడం లేదు. రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. మీరు రైతు మిత్రలు అయితే... చంద్రబాబు, లోకేశ్ ఉండవల్లి ఎమ్మెల్యే వద్దకు, మంగళగిరి ఎమ్మెల్యే అయిన నా వద్దకు రండి.. మనందరం కలిసి సంబంధిత మంత్రితో మాట్లాడదాం. ఈ పరిస్థితికి మీరే కారణం అయినా.. రైతుల కోసం నేను కూడా మీతో పాటు ముఖ్యమంత్రిని కలుస్తా. సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం రాజకీయాలు చేస్తూ గ్రామస్థాయి నేతలా చంద్రబాబు మాట్లాడుతున్నారు’’ అని చంద్రబాబు తీరును ఆర్కే ఎండగట్టారు. -
సీఎం జగన్ మాకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు
-
రిజర్వ్ జోన్లను కూడా ఎత్తివేస్తామని సీఎం హామీ ఇచ్చారు
-
పేదల జీవితాలు బాగుపడకూడదనే కుట్రతోనే..
సాక్షి, అమరావతి: పేద, బడుగు వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ విద్యను అందించేందుకు ఉద్దేశించిన ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లు చరిత్రాత్మకమైనదని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో తప్పనిసరిగా విద్యాబోధన జరగాలంటూ ఈ బిల్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించి.. శాసనమండలికి పంపించిందని, మండలిలోని పెద్దలు ఈ బిల్లును మరింత కూలకశంగా చర్చించి.. సూచనలు, సలహాలు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా బిల్లు మీద నాలుగు సవరణలు ప్రతిపాదిస్తూ మండలి తిరిగి శాసనసభకు పంపిందని తెలిపారు. ఇంగ్లిష్ మీడియాన్ని ఎత్తివేయాలని, లేదా తెలుగు మీడియం తీసుకోవాలా? ఇంగ్లిష్ మీడియమా? అన్న నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వదిలేయాలని సవరణలు పంపారని, శాసనమండలిలో తనకు మెజారిటీ ఉండటంతో చంద్రబాబు ఈ విధంగా దురుద్దేశంతో ఈ బిల్లును తిప్పి పంపారని ఆర్కే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. విద్య ప్రాథమిక హక్కు అని, పిల్లలందరికీ కచ్చితంగా విద్యను ఉచితంగా అందించాలని రాజ్యాంగం నిర్దేశించిందని గుర్తు చేశారు. శ్రీచైతన్య, నారాయణ వంటి ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియంలో అసలు బోధన జరగడం లేదని, నిర్బంధంగా ఇంగ్లిష్ మీడియంలోనే వాళ్లు బోధిస్తున్నారని తెలిపారు. తన బినామీలు, తన మనుషులు చేసే ఇలాంటి చర్యలు సమర్థించే చంద్రబాబు.. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన పేద పిల్లలు, అగ్రకులాల పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. పేదలెవరూ ఇంగ్లిష్ మీడియం చదువుకోకూడదన్న దుర్బుద్ధితో చంద్రబాబు ఈ బిల్లుకు అడ్డుపడుతున్నారని, మండలిలో బలముందని ఇలా బిల్లులను చంద్రబాబు దురుద్దేశంతో అడ్డుకోవడం సరికాదని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తీసుకొస్తున్న బిల్లులను తన కుట్రల ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, పేదల జీవితాలు బాగుపడకూడదనే కుట్రతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఆర్కే ధ్వజమెత్తారు. -
ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నా మైక్ ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వైఖరిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. సభ్యుల ప్రవర్తన గురించి రూల్స్‌బుక్‌లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల్లాగా తామెప్పుడూ ప్రవర్తించలేదన్నారు. పోడియం వద్దకు వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారో టీడీపీ సభ్యులకే అర్థం కావటం లేదని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు తీర్మానం చేస్తే తాము బలపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక సోనియా, చంద్రబాబు కుమ్మక్కై వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అయితే 23 కేసుల్లో స్టే తెచ్చుకున్న వ్యక్తిగా చంద్రబాబును పేర్కొన్నారు. ప్రజలు 151 స్థానాలు ఇచ్చి వైఎస్ జగన్‌కు పట్టం కట్టారని తెలిపారు. కాగా గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతకు ఎంత సమయం ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నా మైక్ ఇవ్వలేదని విమర్శించారు. కానీ నేడు ప్రతిపక్ష నేతలకు ఎంత అవకాశం కల్పిస్తున్నారో గమనించాలని ఆర్కే సూచించారు. చదవండి: నిరూపిస్తే రాజీనామా చేసి.. క్షమాపణ కోరుతా : ఆర్కే పోలీసులపై టీడీపీ నేతల రౌడీయిజం -
శాసనాలు చేసే రాజధానిగా అమరావతి
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును సమర్థిస్తున్నట్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గత ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందుకు రాకుండా చేసిందని ఆరోపించారు. అమరావతి రాజధాని అనగానే మొదటగా సంతోషపడిన వాళ్లలో తానూ ఒకడినని, కానీ తర్వాత మోసపోయామని తెలుసుకున్నానని చెప్పారు. అమరావతిలో రాజధాని నిర్మాణం అనుకూలం కాదని పర్యావరణవేత్తలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కౌలు రైతు వ్యవస్థను చంద్రబాబు ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. రాజధానిని కొంతమందికే పరిమితం చేసేలా చంద్రబాబు వ్యవహరించారని, దళిత సోదరులు అనుమతి తీసుకోకుండా భూములు లాక్కున్నారని ఆరోపించారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రైతుల నుంచి భూములు గుంజుకున్నారని తెలిపారు. కానీ సీఎం జగన్ ఇలా వ్యవహరించలేదని.. కమిటీ నివేదికలు, ప్రజల అభీష్టం మేరకే ముందుకు వెళ్తుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పదేళ్లు ఉండేందుకు అవకాశం ఉన్నా ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు అనాలోచిత నిర్ణయం వల్లే ఈ దౌర్భగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని గుర్తు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందనే భయంతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. టీడీపీ బినామిలతో ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలోనే శాసనసభ శాసనాలు చేసే రాజధానిగా అమరావతి మారినందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. రాజధాని తరలింపుపై అనుమానాలు పటాపంచలయ్యాయని తెలిపారు. శాసనసభ ఇక్కడే ఉంటుందని, కింగ్ మేకర్లను తామేనని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ భవిష్యత్తు ముఖ్యం కాదని, రాష్ట్ర భవిష్యత్తు ప్రధానమని స్పష్టం చేశారు. అమరావతిని అగ్రికల్చరర్ జోన్‌గా ప్రకటించాలని కోరారు. శాసనసభ, సచివాలయంతో సామాన్యులకు పనేం ఉండదన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముందుకు తెచ్చామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు బలవంతంగా ప్రయోగించిన భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. చదవండి: రాజధాని రైతులకు వరాలు 72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు... స్పీకర్ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా? భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా? -
ఆస్తులు కాపాడుకోవడానికే బాబు జోలె
సాక్షి, అమరావతి: చంద్రబాబు తన ఆస్తులు, తన బినామీల భూములు కాపాడుకోవడానికే జనం ముందుకు జోలె పట్టుకుని వస్తున్నారని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. హెరిటేజ్ ఆస్తులను కాపాడుకోవడానికి తన భార్యతో ఓ ప్లాటినం గాజును వేయించి.. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు, రైతుల వద్ద విరాళాలు అడుగుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ వారి జీతాలను గానీ, ఇంటి అద్దె అలవెన్సును గానీ రైతుల ఉద్యమానికి విరాళంగా ఇవ్వలేదన్నారు. -
అవినీతి రాజకీయ లబ్దికోసమే చంద్రబాబు ఈప్రాంతాన్ని ఎంచుకున్నారు
-
చంద్రబాబు రైతులను నిలువునా ముంచారు
-
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్
-
అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే
సాక్షి, గుంటూరు: రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకముందే ప్రతిపక్ష నేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఎమ్మెల్యే ఆర్కే సోమవారం పెనుమాక నుంచి ర్యాలీకి సిద్ధపడ్డారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా రాజధాని ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని, భూములు ఇచ్చిన వారికి కూడా ప్లాట్లు ఇవ్వలేదన్నారు. గతంలో తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రాజధాని ముసుగులో 25 రోజులు విషప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పులను, దళితులకు చేసిన అన్యాయాన్ని బయటకు రానీవకుండా చూసుకోవడానికి టీడీపీ కార్యకర్తలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కలిసి రాజధాని గ్రామాల్లో అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో గతంలో జరిగిన ఘటన వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేసి రాజధానిలో ఏదో జరిగిపోతోందన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికలపై హైపవర్ కమిటీ తమ నిర్ణయాన్ని ఇంకా వెలువరించలేదన్నారు. ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ అధికార ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉన్నా కూడా చంద్రబాబు పట్టించుకోకుండా గత 25 రోజులుగా దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని దూషిస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం చంద్రబాబుకు తగదన్నారు. లక్షల కోట్లు దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహించారు. రాజధాని రైతుల సాక్షిగా అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాల్సిందేనని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సంబంధిత వార్తలు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్ వికేంద్రీకరణతో శరవేగంగా రాష్ట్రాభివృద్ధి వరదొస్తే అమరావతికి ముప్పే ఇదీ భ్రమరావతి కథ -
బాబు బినామీ..ప్యాకేజి పవన్..ఏమయ్యావు తల్లీ!
-
రాజధానికి చంద్రబాబే పెద్దశాపం
-
నిరూపిస్తే క్షమాపణ.. రాజీనామా : ఆర్కే
సాక్షి, తాడేపల్లి : అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌ను ఆధారాలతో చూపించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజధాని పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. అమరాతిలో తన పేరిట భూములు ఉన్నాయనే తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. నీరుకొండలో తనకు ఐదు ఎకరాల భూమి ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటానని ఆర్కే సవాలు విసిరారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో తనపేరు మీద గానీ, తన భార్య పేరు మీద గానీ భూములు లేవని స్పష్టం చేశారు. తన భార్య పేరు మీద ఐదెకరాల భూమి ఉందని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపిస్తున్నారని తెలిపారు. తమకు భూమి ఉందని చూపిస్తే ఆ ఐదెకరాలు వారికే రాసిస్తానని.. అంతేకాకుండా బహిరంగంగా క్షమాపణ చెప్తానని అన్నారు. రామోజీ, రాధాకృష్ణ తెగ తాపత్రాయపడుతున్నారు.. తనను వివరణ అడగకుండానే పేపర్లలో తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు. అవాస్తవాలు రాయవద్దని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను కోరారు. చంద్రబాబును కాపాడుకోవడానికి రామోజీరావు, రాధాకృష్ణ తెగ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల రూపాయల అవినీతి బయటపడుతుందనే కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిలో అవినీతి జరగలేదని చంద్రబాబు గుండెల మీద చేయ్యి వేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు. రాజధానికి చంద్రబాబు శాపం అని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరం అని అన్నారు. చంద్రబాబు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క శాశ్వత బిల్డింగ్ కూడా కట్టలేకపోయారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలోని నేతలు రాజధాని ప్రాంతంలో కి.మీ రోడ్డు కోసం రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాజధానికి భూములు ఇవ్వని రైతులను అప్పటి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ బెదిరించారని తెలిపారు. అక్రమంగా రైతులపై కేసులు పెట్టించారని విమర్శించారు. దళితుల భూములను కాజేసిన చంద్రబాబు వాటిని తన బినామీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు కొత్త బినామీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అని అన్నారు. అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి ప్యాకేజీ తెచ్చుకోలేదా అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. మంగళగిరిలో జనసేన కూటమి అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం ఎందుకు చేయలేదని నిలదీశారు. భువనేశ్వరి అప్పుడేందుకు రోడ్లపైకి రాలేదు.. చంద్రబాబు అవినీతికి పాల్పడినందుకే మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీని ప్రజలు ఓడించారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌కు మంగళగిరి హద్దులు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. రైతుల నుంచి అన్యాయంగా భూములు తీసుకున్నప్పుడు, వారిని పోలీసు స్టేషన్లలో పెట్టి కొట్టినప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎందుకు రోడ్లపైకి రాలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు భువనేశ్వరి ఎందుకు బయటకు రాలేదో చెప్పాలన్నారు. రైతుల నుంచి భూములు తీసుకుని ఒక్క శాశ్వత భవనం ఎందుకు కట్టలేదో భువనేశ్వరి చంద్రబాబును అడగాలని సూచించారు. రాజధాని కట్టాలంటే రూ. లక్ష 25వేల కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. చంద్రబాబు రాష్ట్రాలన్ని మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో నెట్టారని విమర్శించారు. -
చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదు
-
చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదు: ఆర్కే
సాక్షి, గుంటూరు : రాజధానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ పరిస్థితికి కారణం చంద్రబాబు నాయుడు దోపిడీనే అని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే ఆర్కే ఆదివారమిక్కడ మాట్లాడుతూ...‘చంద్రబాబు చేసిన పాపం ఇప్పుడు రాజధాని రైతులు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధానిలో చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. భూములు ఇచ్చిన రైతులకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. దోపిడీయే లక్ష్యంగా చంద్రబాబు పనిచేశారు. అన్నివిధాలుగా రాజధాని రైతులను చంద్రబాబు మోసం చేశారు. ఇవాళ రైతుల గురించి ఆయన మాట్లాడటం దారుణం. రాజధాని లో జరిగిన కుంభకోణాలు ప్రభుత్వం బయట పెడుతుంటే చంద్రబాబు కంగారు పడుతున్నారు. చంద్రబాబు అనుకూల మీడియాతో పాటు ఆయనకు అనుకూలంగా ఉన్న కొంతమంది రియల్టర్లు ఆయన బినామీల రాజధానిలో హంగామా చేస్తున్నారు. దీక్షలు చేయడానికి రైతులు రాకపోతే చంద్రబాబు కార్యకర్తలు పంపించి చేయిస్తున్నారు. రాజధాని పేరుతో తమను ఎందుకు మోసం చేశారని దీక్షలు చేసే రైతులు చంద్రబాబును నిలదీయాలి. రాజధానిపై సీఎం ప్రకటన, జీఎన్ రావు కమిటీ నివేదికపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. కుటిల రాజకీయాలు చేసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రాజధాని రైతులకు చంద్రబాబు చేయలేని పనులను సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాజధాని రైతులకు ప్రభుత్వం కౌలు ఇస్తోంది. రైతు కూలీలకు ప్రతి నెలా పెన్షన్ ఇస్తున్నాం. ప్రభుత్వం రైతులందరికి న్యాయం చేస్తుంది.’ అని అన్నారు. -
వివరాలన్నీ సాయంత్రం వెల్లడిస్తాం
-
టీడీపీ నూతన కార్యాలయం కూడా అక్రమ నిర్మాణమే
సాక్షి, గుంటూరు: మంగళగిరి మండలం ఆత్మకూరులో నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ కార్యాలయాన్ని నిర్మించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన టీడీపీ పార్టీ కార్యాలయ స్థలాన్ని వాగు, పోరంబోకు భూములకు కేటాయించినట్లు తెలిపారు. ‘వాగు, చెరువు, పోరంబోకు భూములను ఆఫీసులకు, పార్టీ కార్యాలయాలకు కేటాయించ కూడదని చట్టం చెబుతుంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించింది’ అని అన్నారు. ఈ విషయంపై తాను కోర్టును ఆశ్రయించానని, దీనిపై కోర్టు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు ఉండే ఇల్లు అక్రమమేనని, ఇప్పుడు ఆయన కట్టుకున్న పార్టీ కార్యాలయం కూడా అక్రమంగానే నిర్మించారని విమర్శించారు. అయితే ఈ పార్టీ కార్యాలయాన్ని లింగమనేని రమేష్ కట్టించారని, దీని కోసం మొదట 3.65 సెంట్ల భూమిని టీడీపీ ప్రభుత్వమే కేటాయించుకుందని తెలిపారు. అది కాకుండా పార్టీ కార్యాలయం కోసం ఉమా మహేశ్వర్‌రెడ్డి అనే రైతు భూమిని కబ్జా చేశారని అన్నారు. దీనిపై ఆ రైతు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్టే ఇచ్చిందని, కోర్టు ఉత్తర్వులను కూడా చంద్రబాబు పాటించకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని ఆయన పేర్కొన్నారు. -
వచ్చే నెలలో మెగా డీఎస్సీ: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి : వచ్చే నెలలో మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 7,900 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రతీ ఏటా జనవరిలో ప్రభుత్వంలోని అన్ని శాఖల ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నలకు మంత్రి సురేష్ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో సురేష్ మాట్లాడుతూ... ప్రతీ ఏడాది జనవరిలో అన్ని శాఖల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అదే విధంగా పేదలందరికీ ఇంగ్లీషు మీడియంలో విద్య అందించేలా తమ ప్రభుత్వం విద్యాసంస్కరణలు చేపట్టిందని సభకు తెలిపారు. గొప్ప నిర్ణయం.. ‘పేద విద్యార్థులకు ఇంగ్లీషు విద్యను అందించడమే లక్ష్యం. టీడీపీ హయాంలో భాషా పండితులను విస్మరించారు. అయితే మా ప్రభుత్వం విద్యాశాఖలో భాషా పండితులకు పదోన్నతులు కల్పించింది. మొత్తం 12 వేల మంది భాషా పండితులకు పదోన్నతి లభించింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే పరిష్కరించారు. సీఎం నిర్ణయంతో భాషా పండితులంతా సంతోషంగా ఉన్నారు అని సురేష్ వ్యాఖ్యానించారు. ఇందుకు బదులుగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ... ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యాబోధన సంతోషకరం అని హర్షం వ్యక్తం చేశారు. ఇదొక గొప్ప నిర్ణయం అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచే ఇంగ్లీషు మీడియం బోధన ప్రారంభించడం శుభ సూచకమని ఆర్కే అన్నారు. -
టీడీపీ కార్యాలయం కూల్చేయాలంటూ పిటిషన్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మితమైన టీడీపీ కార్యాలయ భవనం అక్రమ నిర్మాణమని.. దానిని కూల్చివేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆత్మకూరు పరిధిలో ఉన్న వాగు పోరంబోకుకు చెందిన సర్వే నెంబరు 392లో 3.65 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. ఇది అక్రమమని ఎమ్మెల్యే ఆళ్ల తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ కార్యదర్శి, ఏపీ సీఆర్డీఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ కార్యాలయ భవనం వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూముల్ని ఇతరాలకు కేటాయించడం పర్యావరణ చట్టాలకు విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని పిటిషన్లో ఆళ్ల తరపు న్యాయవాది గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో అనేక చట్ట ఉల్లంఘనలు ఉన్నందున గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయడంతో పాటు అక్రమంగా కట్టిన టీడీపీ భవనాన్ని కూల్చివేసి, తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకునేలా సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశించాలని ఆళ్ల తరపు న్యాయవాది అభ్యర్థించారు. టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభం గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. కార్యాలయం ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు చేపట్టి పార్టీ జెండాను చంద్రబాబు ఎగురవేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అవన్ని చెప్పాకే చంద్రబాబు పర్యటించాలి..
సాక్షి, అమరావతి: ప్యాకేజీలతో దళిత సోదరులకు చేసిన మోసాన్ని ప్రపంచానికి చెప్పి, ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామాల్లో పర్యటించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆర్కే గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ‘చేసిన వాగ్దానం ప్రకారం అమరావతిలో చంద్రబాబు చేత శంకుస్థాపన చేయబడి..నిర్మాణం పూర్తి చేసుకున్న 100 అడుగులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి..చంద్రబాబు తన అమరావతి పర్యటన ప్రారంభించాలి. పేద రైతుల భూములు ఏవిధంగా తన మనుషులకు దోచిపెట్టారు. రాజధాని కోసం చంద్రబాబును నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏమి చేశారో చెప్పాలి. రైతులకు అన్ని చెప్పాకే చంద్రబాబు తన పర్యటన కొనసాగించాలి. చదవండి: అప్పుడు ఆర్భాటం ఇప్పుడు రాద్ధాంతం కౌలు రైతులు, చేతి వృత్తిదారులకు రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన అన్యాయాన్ని చెప్పి ...తన పర్యటన కొనసాగించాలి. తన బినామీ కాంట్రాక్టర్లకు ఏవిధంగా రైతుల భూములు దోచిపెట్టారో చెప్పి గ్రామాల్లో తిరగాలి. తన హయాంలో ఒక్కటి కూడా శాశ్వత భవనం ఎందుకు కట్టలేకపోయారో చెప్పి పర్యటించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాజధానిలో ఎక్కడ, ఏవిధంగా ఖర్చు పెట్టారో...ఎందుకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదో.. చెప్పి చంద్రబాబు తన పర్యటన కొనసాగించాలి. చంద్రబాబుకు నిరసన ఫ్లెక్సీలు స్వాగతం భూములు ఇవ్వని రైతులపై ఎందుకు కేసులు పెట్టించి, పోలీసులతో హింసించారో చెప్పాలి. గ్రామ కంఠాలను తేల్చకుండా సామాన్యులను సైతం ఎందుకు ఇబ్బంది పెట్టారు. నిర్మాణ వ్యయం చదరపు అడుగు సుమారు రూ.1500 అవుతుంటే.. ఇసుక, భూమి ఉచితంగా ఇచ్చి తన బినామీ కాంట్రాక్టర్లకు చదరపు అడుగు రూ.15,000లకు ఎందుకు ఇచ్చారో చెప్పి చంద్రబాబు పర్యటన చేయాలి. పేద, దళిత రైతుల భూములు ఎందుకు సింగపూర్ ప్రయివేట్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా కట్టబెట్టారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. చదవండి: దళిత ద్రోహి చంద్రబాబు -
‘ఓటుకు కోట్లు’ కేసుపై సుప్రీంలో మరోసారి పిటిషన్
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఎర్లీ హియరింగ్ కోసం ఆర్కే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2017లో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. సుప్రీం కోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో ఆర్కే సోమవారం మరోసారి సుప్రీంను ఆశ్రయించారు. కాగా, 2015లో తెలంగాణలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఆ పార్టీ నేతలు అప్పటి ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టారు. ఈ క్రమంలో అప్పుడు టీడీపీలో కీలక నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొన్ని రోజులపాటు జైలులో గడిపారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు కూడా వచ్చాయి. స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడినట్టు కూడా చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు 2016లో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. -
ఐదేళ్ల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఆర్కే
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 'కనెక్ట్ టు ఆంధ్రా' ఇచ్చిన పిలుపు మేరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ మేరకు తన ఐదేళ్ల ఎమ్మెల్యే జీతాన్ని 'కనెక్ట్ టు ఆంధ్రా'కు విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణ చార్యులును కలిసి లేఖ అందజేసినట్లు తెలిపారు. వైఎస్ జగన్ అమ్మ ఒడి, నాడు-నేడు, నవరత్నాల అమలుకు ' కనెక్ట్ టు ఆంధ్రా పేరుతో ప్రజా భాగస్వామ్యాన్ని కోరడం మంచి విషయమని ఆర్కే పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కొరకు ఏర్పాటు చేసిన ‘కనెక్ట్ టూ ఆంధ్రా’ వెబ్ పోర్టల్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.. సచివాలయంలోని తన కార్యాలయంలో ఈ వెబ్‌పోర్టల్‌ను సీఎం ప్రారంభించారు. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కోసం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. -
ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో ఆర్కే పరిశీలన
-
రాజధాని తరలిస్తున్నట్లు చెప్పారా?
సాక్షి, మంగళగిరి: రాజధానిలో దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో సహా ఏ ఒక్క టీడీపీ నాయకుడికి లేదని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రకటించిన సమయంలో దళితులకు చెందిన అసైన్ట్, లంక, ప్రభుత్వ భూములకు రైతుల భూములతో పాటు పరిహారం ప్రకటించకుండా చంద్రబాబు బినామీలు దళితులను బెదిరించి, పరిహారం రాదని భయపెట్టి దళితుల భూములన్నింటిని తక్కువ ధరలకు కొట్టేసినప్పుడు మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ నిద్రపోతున్నారా అని నిలదీశారు. రాజధాని తరలిస్తున్నట్లు ఎవరు చెప్పారని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాని మరెవరైనా కాని రాజధాని తరలిస్తున్నట్లు చెప్పారా అని ప్రశ్నించారు. తాడికొండ, తుళ్ళూరులతో పాటు రాజధానిలో మంగళగిరి భాగం కాదా చెప్పాలన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు ఇప్పుడు దళితులు గుర్తుకువచ్చారా అని నిలదీశారు. అసలు రాజధానిలో దళితుల భూములన్నింటిని రాజధాని ప్రకటించేనాటికే టీడీపీ నాయకులు హస్తగతం చేసుకున్నారని, ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రాజధానిలో ప్లాట్లు కేటాయించే సమయంలోనూ దళితులకు ప్రత్యేకంగా ప్లాట్లు కేటాయిస్తుంటే మాజీ ఎమ్మెల్యేకు కనిపించలేదా అన్నారు. ప్లాట్ల కేటాయింపులోను టీడీపీ నాయకులు వారికి నచ్చిన చోట వారికి నచ్చిన విధంగా వాస్తులు చూసుకుని మరీ ఇచ్చుకుని లాటరీ అంటూ రైతులను మభ్యపెట్టారన్నారు. రాజధాని భూములపై విచారణ కొనసాగుతుందని, పూర్తిస్థాయిలో విచారణ చేసి రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌ను నిరూపిస్తామని స్పష్టం చేశారు. అన్ని వాస్తవాలను ప్రజల ముందుంచి రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి రాజధానిని అందించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షించారు. -
బలవంతపు భూ సేకరణ జీవో రద్దు చేయాలి
-
మంగళగిరి నియోజకవర్గానికి మహర్దశ !
సాక్షి, మంగళగిరి : రాజధాని అమరావతిలో కీలకంగా ఉన్న మంగళగిరి, తాడేపల్లి మునిసిపాలిటీలను రాష్ట్రంలోనే మోడల్ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) కృషి చేస్తున్నారు. రెండు మున్సిపాలిటీలను రూ.1500 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా అందుకు నిధులు మంజూరు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. ఈ మేరకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపినట్లు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. రెండు పట్టణాల్లో ఇళ్లు లేని పేదలతో పాటు ప్రభుత్వ భూముల్లో ఉంటున్న పేదలందరికీ 27 వేలకు పైగా గృహాలు నిర్మించి అందించనున్నారు. తాడేపల్లిలో కాల్వగట్లు, ప్రభుత్వ భూముల్లో ఉన్న నిర్వాసితులకు అవసరమైన 15 వేల ఇళ్ల నిర్మాణంతో మంగళగిరి మున్సిపాలిటీలో మరో 12 వేల ఇళ్లు నిర్మించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆయా పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మురుగునీటి శుద్ధి, విద్యుత్, వీధిలైట్లు, కాలువల అభివృద్ధి, పార్కులు, బరియల్ గ్రౌండ్, రోడ్ల విస్తరణలకు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. చేనేత బజారు ఏర్పాటు దిశగా చర్యలు.. చేనేత పరిశ్రమకు నెలవైన మంగళగిరి పట్టణంలో చేనేత బజార్ ఏర్పాటు, కమ్యూనిటీ హాలు నిర్మాణాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ.670 కోట్లతో తాడేపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసిన అధికారులు మంగళగిరి మున్సిపాలిటీకి రూ.800 కోట్ల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లగా ఆమోదముద్ర వేశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో నియోజకవర్గం నిరాదరణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున తాను గెలిచాననే అక్కసుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌లు నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారు. అందుకే ఈ ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ పోటీ చేసినా నియోజకవర్గ ప్రజలు నమ్మకం లేక నన్నే గెలిపించారు. ఐదేళ్లుగా ఉండవల్లిలో నివాసముంటున్న చంద్రబాబు, ఆయన కుమారుడు ఏ ఒక్క రోజు మున్సిపాలిటీల అభివృద్ధిపై కనీసం సమీక్ష చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే రెండు సార్లు మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్ష చేశారు. రూ.1500 కోట్ల అభివృద్ధి పనులకు సైతం ఆమోదం తెలిపారు. పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పడంతో పాటు నిధులు మంజూరుకు సీఎం అంగీకరించడం అభినందనీయం. రూ.670 కోట్లతో తాడేపల్లి, రూ.800 కోట్లతో మంగళగిరిని అభివృద్ధిపర్చేందుకు తయారు చేసిన పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారంటే నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. -
‘అందుకే లోకేష్‌ను ప్రజలు ఓడించారు’
సాక్షి, అమరావతి: తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రూ.1500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ తెలిపారన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ నిర్మాణంలో ఉన్నారని..ఇక్కడి అభివృద్ధిపై రివ్యూ చేయలేదని ఆర్కే అన్నారు. ఇదే రోడ్లపై చంద్రబాబు తిరిగారని..కానీ పైసా కేటాయించలేదని విమర్శించారు. అందుకే మంగళగిరి ప్రజలు లోకేష్‌ను ఓడించారని పేర్కొన్నారు. రెండునెలల్లోనే సీఎం జగన్ ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. -
వెనుక ఆయన ఉన్నారనే లింగమనేని ధీమా
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు.. లింగమనేని రమేష్‌ను ఆడిస్తున్నారని, బాబు ఆడించినట్టు లింగమనేని ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లింగమనేని కలిసే కుట్ర పన్నుతున్నారని అన్నారు. లింగమనేని గెస్ట్‌హౌస్‌కు సంబంధించిన విషయమై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లింగమనేని రమేష్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రికి లింగమనేని లేఖ రాయటంపై ఎమ్మెల్యే ఆర్కే మంగళవారం స్పందించారు. ఈ విషయంపై బుధవారం మరోసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ లింగమనేని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే బాబుకు ఇల్లు ఇచ్చారా? లింగమనేనికి అధికారులు నోటీసులు ఇవ్వలేదా? నోటీసులకు లింగమనేని రమేష్ ఎందుకు స్పందించలేదు. మీ దగ్గర అనుమతులుంటే పేపర్లు చూపండి. ఇంటి ప్లాన్ ఏది, బిల్డింగ్ ఫీజు ఎంత కట్టారు? బిల్డింగ్ నిర్మాణానికి పైసా ఫీజు కట్టలేదు, అనుమతులు రాలేదు. సర్వేనెంబర్ 271,272 ప్రభుత్వ డొంక భూమి అని రికార్డులో ఉంది. ఆ ప్రాంతంలో అనుమతిచ్చే అధికారం ఉండవల్లి పంచాయితీకి లేదు. ఉడా నుంచి కేవలం స్విమ్మింగ్ పూల్ కోసమే అనుమతి తీసుకున్నారు. ప్రహారీ గోడకూడా కట్టరాదని నిబంధన ఉంటే లింగమనేని ఏకంగా ఇళ్లే కట్టేశారు. కరకట్ట మీద అక్రమ నిర్మాణాలు కట్టడం అవాస్తవమా? తనవెనుక చంద్రబాబు ఉన్నారని లింగమనేని ధీమా. ఇంటి అద్దె పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రభుత్వ సొమ్ము రూ. 1.20 కోట్లు తిన్నారు. మంగళగిరి ఖాజాగ్రామంలో 4,5ఎకరాలు కాజేశార’’ని ఆరోపించారు. -
‘వాళ్ల వైఖరి మారకుంటే భవిష్యత్‌లో టీడీపీ ఉండదు’
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. దళితులపై టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వివరించారు. టీడీపీ నేతలు కూన రవికుమార్, అచ్చెన్నాయుడు,నన్నపనేని రాజకుమారిలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డీజీపీని కలిసిన అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. ‘అధికారం కోల్పోయినా టీడీపీ నేతలకు కనువిప్పు కలగడం లేదు. ఎవరినీ లెక్క చేయం అనే ధోరణిలోనే ఉన్నారు. పోలీసులు, దళితులంటే లెక్క లేదు. అసలు చట్టాల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దళిత మహిళా ఎస్ఐ పట్ల టీడీపీ నేతలు చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. తమ వ్యాఖ్యలపై ఇప్పటికైనా టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు...టీడీపీ నేతలను పిలిచి బుద్ధి చెప్పాలి. వారి వైఖరి మారకుంటే భవిష్యత్‌లో టీడీపీ ఉండదు.’ అని వ్యాఖ్యానించారు. కాగా అంతకు ముందు ఎస్ఐ అనురాధను కులం పేరుతో దూషించిన నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాలంటూ ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో మంగళగిరిలో వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. దళిత మహిళా ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించిన నన్నపనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
మాట తప్పిన పవన్ కల్యాణ్ : ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరి రైతులకు ఇచి్చన మాట తప్పారని, అసలు మంగళగిరి నియోజకవర్గంలో ఎందుకు ఆయన పర్యటించారో అర్థం కావటంలేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలు, దుర్మార్గాల గురించి ఒక్కమాట కూడా పవన్ మాట్లాడటం లేదన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. మంగళగిరి, తాడికొండ పర్యటనలో పవన్ వెంట టీడీపీ క్యాడర్ నడిచిందన్నారు. మంగళగిరి రూరల్ మండలం బేతపూడి గ్రామంలో గతంలో పర్యటించిన సమయంలో ఓ మహిళ పెట్టిన అన్నం తింటూ పవన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలన్నారు. ‘అమ్మా.. చంద్రబాబు మీ భూములను బలవంతంగా లాగేసుకుంటున్నారు. భూములను తీసుకోవడానికి చంద్రబాబు నోటిఫికేషన్ ఇస్తే రైతులకు అండగా నేను ఆమరణ దీక్ష చేస్తాను’ అని పవన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఐదారు నోటిఫికేషన్లు చంద్రబాబు ఇచ్చినా.. పవన్ అడ్రసేలేదన్నారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత రాజధాని ప్రాంతంలో పర్యటించారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్ గెలుపు కోసం పవన్ తాపత్రాయపడ్డారన్నారు. చంద్రబాబు లేఖ ఆశ్చర్యకరం.. వరద నీటి గురించి సమాచారం ఎప్పటికప్పుడు మంత్రి అనిల్ కుమార్ ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేశారని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. అందుకే ఆస్తి నష్టాలు సంభవించలేదని తెలిపారు. వరద నియంత్రణలో ప్రభుత్వం విఫలం అయిందని చంద్రబాబు.. సీఎం జగన్‌కు లేఖ రాయటంపై ఆర్కే మండిపడ్డారు. చంద్రబాబు నివాసం ఆయనది కాదన్నారు. అది ప్రభుత్వ ఆస్తి, చట్టాలకు వ్యతిరేకంగా నిరి్మంచిన గృహమన్నారు. వరద వచ్చే ముందు అధికారులు అప్రమత్తం చేస్తే, కుటుంబసభ్యులతో కలసి చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయారన్నారు. లోకేశ్ చేసే ట్వీట్లు ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. -
పవన్ రాజధాని పర్యటనపై ఆర్కే ఫైర్
సాక్షి, గుంటూరు: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజధాని పర్యటనపై మంగళగిరి ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నుంచి ప్యాకేజి ముట్టినపుడు ఒకరకంగా, అందనపుడు ఇంకో రకంగా మాట్లాడటం పవన్‌కు అలవాటు అయిందన్నారు. బేతపూడి గ్రామంలో పర్యటించినపుడు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన పవన్.. దమ్ముంటే చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను బయట పెట్టాలని సవాలు విసిరారు. భూ సేకరణ చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న పవన్, నాలుగుసార్లు భూసేకరణ జరిపినపుడు ఏమయ్యారని ఆర్కే సూటిగా ప్రశ్నించారు. పవన్‌కు నిజంగా రాజధాని మీద ప్రేమ ఉంటే ఇక్కడ నుంచి ఎందుకు పోటీ చేయలేదని, కనీసం జనసేన అభ్యర్థినైనా పోటీలో దింపలేదని విమర్శించారు. కమ్యూనిస్టులతో పొత్తు కారణంగా సీటు ఇచ్చారనుకున్నా.. వారి కోసం ఎందుకు ప్రచారం చేయలేదని ఆర్కే ప్రశ్నలు సంధించారు. లోకేష్‌ను గెలిపించడానికి పవన్ తెర వెనుక చేసిన ప్రయత్నాలన్నీ రాజధాని రైతులకు తెలుసని వ్యాఖ్యానించారు. ఇన్నిరోజుల పత్తాలేని పవన్ ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్టు పర్యటిస్తే జనం నమ్మరని అన్నారు. -
అందనప్పుడు మరోలా మాట్లడటం పవన్‌కు అలవాటు
-
రాజధాని ముసుగులో అక్రమాలు
మంగళగిరి: రాజధాని పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అక్రమాలను ప్రపంచానికి తెలియనీయకుండా కొన్ని మీడియా సంస్థలు లేనిపోని వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాజధాని ముసుగులో చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలను బయటకు తెలిసేలా మీడియా వ్యవహరించాలని హితవు పలికారు. రాజధాని పేరుతో చంద్రబాబు అతని బినామీలు, అప్పటి మంత్రులు, టీడీపీ నాయకులు కోట్లాది రూపాయల విలువైన భూములను కొట్టేయడంతో పాటు కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే బుధవారం విలేకరులతో మాట్లాడారు. తుళ్లూరు ప్రాంతం కట్టడాలకు పనికిరాదని, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని శివరామకృష్ణ కమిటీ తేల్చిచెప్పినా చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఎంపిక చేశారన్నారు. అప్పట్లోనే తాను అసెంబ్లీ సాక్షిగా మంగళగిరి ప్రాంతమైతే కట్టడాల ఖర్చు తగ్గుతుందని, అంతేగాక వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్పానని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణానికి మంగళగిరి ప్రాంతం అనువుగా ఉంటుందని, అక్కడ నిర్మాణాలు కొనసాగిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. అయినా రాజధానిని తరలిస్తున్నారని ఎవరు చెప్పారని ప్రశి్నంచారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ‘రాజధాని అమరావతి అంటూ గోబెల్స్ ప్రచారం నిర్వహించిన చంద్రబాబు రాజధాని ప్రాంతంలో సొంతిల్లు కట్టుకున్నారా? అసలు రాజధానిలో చంద్రబాబుకు అడ్రసు ఎక్కడ ఉంది?’ అంటూ దుయ్యబట్టారు. తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత ఇల్లు నిరి్మంచుకోవడంతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని గుర్తు చేశారు. -
‘అందుకే చంద్రబాబు భయపడ్డారు’
సాక్షి, గుంటూరు : గత టీడీపీ ప్రభుత్వ అవినీతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చాలా కరెక్ట్‌గా మాట్లాడారని, ఆయన మాట్లాడినదానిలో తప్పులేదని వైఎస్సార్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజధాని పేరుతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బినామీలు, తెలుగుదేశం నాయకులు రైతుల భూములను కొట్టేయ లేదా? అని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రాజధాని ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, నిర్మాణ బాధ్యతలు ఎవరు తీసుకోవాలి అనే అంశం విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. కానీ, చంద్రబాబునాయుడు రాజధాని ఎంపికపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాలతో సహా అసెంబ్లీలో చూపించారు. చంద్రబాబు బినామీలు, టీడీపీ నాయకులు భూములు కొనుగోలు చేసిన తర్వాతే తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని ప్రకటించింది. తాత్కాలిక సచివాలయానికి, అసెంబ్లీ నిర్మాణానికి 100 అడుగుల లోతు పిల్లర్లు వేశారంటే ఆ ప్రాంతం నిర్మాణానికి అనువుగా ఉందో లేదో అర్థం అయిపోతుంది. రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతం వరద ముంపుకు గురయ్యే ప్రాంతం అని అందరికీ తెలుసు. ప్రభుత్వ రికార్డులు కూడా అదే చెబుతున్నాయి. రాజధాని ప్రకటించే ముందు చంద్రబాబునాయుడు ఎవరితోనైనా చర్చించారా?. మేధావులతో పాటు అఖిల పక్షాలతో రాజధాని ఎంపికపై చర్చిస్తే తన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ బయటపడుతుందోనని చంద్రబాబు భయపడ్డారు. రాజధాని నిర్మాణ స్థలాన్ని కేంద్రం నిర్ణయించాల్సి ఉంది. నిర్మాణ ఖర్చులు కూడా కేంద్రమే భరించాలి. రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన దోపిడీని, అవినీతిని మీడియా చూపించాలి. రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్లు అవినీతి జరగలేదా?. చంద్రబాబు అవినీతి అరాచకాలు భరించలేకే తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించార’’ని అన్నారు. -
సోషల్ మీడియాలో ఆర్కేకు బెదిరింపులు
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): సోషల్ మీడియాలో తనను టీడీపీ కార్యకర్తలు బెదిరించడంతోపాటు, అసభ్యంగా పోస్టులు పెట్టారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆదివారం గుంటూరు జిల్లా, తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమన్నారు. అయితే తనపై పోటీ చేసి లోకేశ్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, చంపుతామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. నానీచౌదరి, ‘టీడీపీ టీం లోకేశ్ అన్న’ పేరుతో, చెన్నై టీడీపీ ఫోరం టీమ్ అనే ఐడీ నుంచి అసభ్యంగా పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ప్రతిపక్షనేత చంద్రబాబు నివాసం వద్ద రోడ్డుపై నిలబడి కృష్ణానదిలో వరద ఉధృతిని పరిశీలిస్తే, ఆయన ఇంట్లోకి వెళ్లామంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో బూతులు తిడుతూ పోస్టులు పెట్టారని, చంద్రబాబు ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశానని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు నిజంగా దమ్మూ, ధైర్యం ఉంటే ఆయన ఇంట్లోకి వెళ్లినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. ప్రతిపక్ష నేత వరదల్లో చిక్కుకొని ఉంటే ప్రభుత్వం ఆయన క్షేమం గురించి కూడా ఆలోచిస్తుందని, ఆ ఉద్దేశంతో ఆయన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించామే తప్ప ఇంట్లోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. ఆర్కే వెంట నేతలు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, మల్లేశ్వరరావు ఉన్నారు. -
పోలీసులను ఆశ్రయించిన మంగళగిరి ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నాని చౌదరి, లోకేష్ టీమ్ పేరుతో సోషల్ మీడియాలో నాపై బెదిరింపు ధోరణితో పోస్టులు పెట్టారు. చెన్నై టీడీపీ ఫోరమ్ పేరుతో సైతం అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు చేశారు. మా నాయకుడిని జైలుకు పంపుతామని.. నన్ను చంపుతామని.. మంగళగిరి నుంచి తరిమి కొడతామని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉంది. భద్రత కల్పించాలని ఫిర్యాదులో పొందుపరిచాను’అన్నారు. బాబు నివాసంలోకి వెళ్లలేదు.. తన నియోజకవర్గంలో భాగం అయినందునే కరకట్ట ముంపు ప్రాంతాల్లో పర్యటించానని ఆర్కే చెప్పారు. చంద్రబాబు అక్రమ నివాసంలో ఉంటున్నారని, తాను బాబు నివాసంలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినా కూడా టీడీపీ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఇల్లు ముంపునకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ప్రజాతీర్పు చూసి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఓర్వలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెరచాటు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. -
లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు: ఆర్కే
సాక్షి, మంగళగిరి : గత ప్రభుత్వంలో ముచ్చటగా మూడు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నారా లోకేష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూటిగా ప్రశ్నించారు. మంగళగిరి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆయన ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు వారికి పరామర్శించాలన్న బాధ్యత లేదా అంటూ ప్రశ్నలు సంధించారు. వరద వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు హైదరాబాద్ పారిపోతారా అంటూ ఆర్కే మండిపడ్డారు. అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు వరదలను రాజకీయం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీమంత్రి దేవినేని ఉమా... మైలవరం నియోజకవర్గాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఎప్పుడైనా పర్యటించారా అని ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలు చేశారు. -
చేనేత సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ఆర్కే
సాక్షి, అమరావతి: చేనేతల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. గతంలో చేనేతల కోసం వైఎస్ జగన్ దీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చేనేతల అంశంపై ఆయన సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. వ్యవసాయ రంగం తర్వాత అధిక ప్రాధాన్యం తమ ప్రభుత్వం చేనేత రంగానికి ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మెగా క్లస్టర్లను ఏర్పాటుచేస్తామని ప్రకటించగా.. టీడీపీ హయాంలో వాటిని బ్లాక్‌స్థాయి క్లస్టర్లుగా మార్చారని, దీనివల్ల ప్రయోజనం లేదని, బ్లాక్‌స్థాయి క్లస్టర్ల వల్ల చాలా తక్కువమందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మెగా క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చేనేతరంగానికి రూ. వెయ్యికోట్ల స్థీరికరణ నిధిని ఏర్పాటు చేస్తానని.. ప్రతి ఏడాది వెయ్యి కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తన హయాంలో కేవలం సుమారుగా రూ. 875.3 కోట్లను మాత్రమే కేటాయించి.. రూ. 473 కోట్లు మాత్రమే నేతన్నల కోసం ఖర్చు చేశారని, మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మొదటి బడ్జెట్లోనే చేనేత రంగానికి రూ. రెండువందల కోట్లు కేటాయింపులు చేశారని, చేనేత రంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఇక, చంద్రాబు హయాంలో ఆప్కో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, దీనిని ఆదుకోవాల్సిన అవసరముందని కోరారు. దీనికి మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సమాధానమిస్తూ.. మెగా క్లస్టర్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, వీటిని కేంద్రం రద్దు చేసి.. బ్లాక్‌స్థాయి క్లస్టర్లను తీసుకొచ్చిందని తెలిపారు. ఇక, ఆప్కో రంగంలో గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టినవిధంగా చర్యలు తీసుకొని.. దీనికి పునర్వైభవాన్ని తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ నిశ్చయించారని తెలిపారు. -
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: బొత్స
సాక్షి, అమరావతి: అక్రమ కట్టడాలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శాసనసభలో గురువారం ఆయన మాట్లాడుతూ.. అక్రమ నివాసంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నోటీసులిచ్చినట్టు వెల్లడించారు. టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..కరకట్టపై అక్రమ కట్టడాలన్నింటికి నోటీసులు ఇచ్చామని మంత్రి వివరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. నదీ పరివాహక చట్టప్రకారం కరకట్టకు, నదికి మధ్య చిన్న మొక్క కూడా నాటడానికి వీల్లేదన్నారు. ఇప్పటికైనా అక్రమ నివాసం నుంచి చంద్రబాబు బయటకు రావాలని డిమాండ్ చేశారు. హైకోర్టు నోటీసులు ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదని, ప్రజావేదిక నిర్మాణం పేరుతో కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. -
మంగళగిరికి మహర్దశ
సాక్షి, మంగళగిరి: ఐదేళ్ల టీడీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మంగళగిరి పట్టణానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాకతోనే మహర్దశ పట్టనుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరిలో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) గెలిచారనే అక్కసుతో గత టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో ప్రధాన పట్టణంగా ఉన్న మంగళగిరి అభివృద్ధిని పట్టించుకోలేదు. 2019 ఎన్నికలలో రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్‌పై పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మంగళగిరి అభివృద్ధిపై దృష్టి సారించడంతో మంగళగిరి పట్టణంతో పాటు మంగళగిరిలో ప్రధాన పరిశ్రమగా ఉన్న చేనేత పరిశ్రమకు మంచిరోజులు వచ్చాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అసెంబ్లీలో తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మంగళగిరి పట్టణాన్ని మోడల్ పట్టణంగా అభివృద్ధి పరిచేందుకు రూ.50 కోట్లు, చేనేత పరిశ్రమ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించడంలో ఎమ్మెల్యే ఆర్కే చేసిన కృషి అభినందనీయమని పట్టణ వాసులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళగిరి ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంపై రాజకీయ పార్టీలతో పాటు పట్టణ వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించడం శుభపరిణామమని అభిప్రాయపడుతున్నారు. చిత్తశుద్ధిని చూపారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళగిరిలో చేనేత సదస్సు నిర్వహించి కార్మికుల బాధలు వై.ఎస్.జగన్ తెలుసుకున్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత పరిశ్రమ అభివృద్ధికి తొలి బడ్జెట్లోనే రూ.200 కోట్లు కేటాయించి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకం ఉంది. అదే విధంగా మంగళగిరి పట్టణాన్ని మోడల్ పట్టణంగా మార్చేందుకు నిధులు కేటాయించడం అభినందనీయం. –చిల్లపల్లి మోహనరావు, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రైతు సంక్షేమ ప్రభుత్వం మంగళగిరి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి అంటేనే గుర్తుకు వచ్చేది రైతు అని, ఆ మహానేత ఆశయ సాధనకు ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అద్భుతమైన బడ్జెట్ రూపకల్పన చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి రైతు పక్షపాత ప్రభుత్వం అని చాటి చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో ఏ పట్టణానికి దక్కని విధంగా మంగళగిరి పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించడం గొప్ప విషయమన్నారు. మంగళగిరి పట్టణంలో ప్రధానమైన చేనేత పరిశ్రమకు రూ.200 కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. -
చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా
-
చంద్రబాబుకు ఎమ్మెల్యే ఆర్కే సవాల్
సాక్షి, అమరావతి : రైతు పక్షపాతి ఎవరో...రైతు ద్రోహి ఎవరో ప్రజలందరికీ తెలుసునని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. రైతాంగం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ పాయింట్ వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు ఉచిత విద్యుత్ అందజేసి వైఎస్సార్ వ్యవసాయానికి ప్రాణం పోశారని... రైతు సంక్షేమం కోసం ఆయన అనుసరించిన విధానాలను ఆదర్శంగా తీసుకుని సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతారన్నారు. ఇందులో భాగంగా రూ.5 వేల కోట్లతో సీఎం జగన్ ధరల స్థిరీకరణ నిధిని ప్రకటించారని.. అదే విధంగా కౌలురైతుల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. రైతుల పట్ల ఆయనకు ఉన్న నిబద్దతకు ఇది నిదర్శనమన్నారు. చర్చకు సిద్ధమా? సంపూర్ణ రుణమాఫీ చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు.. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆర్కే మండిపడ్డారు. ‘ చంద్రబాబు 2017 ఎస్ఎల్బిసి మీటింగ్‌లో రైతు రుణమాఫీ ఎందుకు ప్రస్తావించలేదు. నేడు రైతు రుణా బకాయిలు వుండటం చంద్రబాబు నిర్వాకం వల్ల కాదా? ప్రివిలైజేషన్ మోషన్ పెడతా అంటున్నారు. ఇందుకు గల నిబంధనలపై చంద్రబాబుకు అవగాహన లేదా? చంద్రబాబు రైతు ద్వేషి. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు వున్న సాగు విస్తీర్ణం ఎంత? నేడు సాగు విస్తీర్ణం ఎంత? చర్చకు చంద్రబాబు సిద్దమా? ప్రివిలైజేషన్ మోషన్‌పై చర్చకు ప్రభుత్వం సిద్దంగా వుంది’ అని సవాల్ విసిరారు. చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా : గడికోట రైతుల పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రైతులకు భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి జగన్ సభలో ప్రసంగించారని పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష టీడీపీ నాడు అధికారంలోకి వచ్చేందుకు రూ. 17200 రుణమాఫీ అని చెప్పింది. కానీ చెల్లించింది రూ. 1500 కోట్లు మాత్రమే. గడిచిన ఐదేళ్ళలో రైతుల రుణాలపై అయిన వడ్డీ రూ.1600 కోట్లు. ఇదీ చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకం. రైతు రుణాలు మాఫీ చేశాను అనే ధైర్యం చంద్రబాబుకు లేదు. డ్వాక్రా, చేనేత రుణమాఫీ చేయలేని ప్రభుత్వం చంద్రబాబుది’ అని గత ప్రభుత్వ తీరును విమర్శించారు. రైతు సంక్షేమం పట్ల నిబద్ధతతో ఉన్న తమ ప్రభుత్వం వారికి ఏం చేయబోతుందో బడ్జెట్లో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది చంద్రబాబు?
సాక్షి, విజయవాడ : సీఆర్డీఏ నోటీసులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా స్పందించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిపై లింగమనేని రమేశ్ గతంలో చేసిన వ్యాఖ్యలను సరిచూసుకోవాలన్నారు. ఆదివారం విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఉంటున్న ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేసినట్టు గతంలో లింగమనేని చెప్పారని అన్నారు. కానీ లింగమనేని ఇప్పుడు మాటమార్చి.. ఆ ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్నారని విమర్శించారు. కొత్తగా ఆ ఇళ్లు తనదేనని లింగమనేని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. తాను నివాసం ఉంటున్న ఇళ్లు ప్రభుత్వానిదేనని చంద్రబాబు 2016 మార్చి 6వ తేదీన శాసనసభలో వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం పదవి పోయాక ప్రభుత్వ ఇళ్లు ఖాళీ చేయాలనే కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకుండా పోయిందని మండిపడ్డారు. చంద్రబాబు లింగమనేనిని భయపెట్టి రకరకాలుగా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. నైతిక బాధ్యతగా చంద్రబాబు తాను ఉంటున్న ఇంటిని తక్షణమే ఖాళీ చేయాలన్నారు. చంద్రబాబు ఖాళీ చేయని పక్షంలో ఆ అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టాలని సీఆర్డీఏ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. కరకట్ట మీద అక్రమ నిర్మాణాలను వదిలేది లేదని స్పష్టం చేశారు. కరకట్టపై నిర్మాణాలకు అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చి ఉంటే వారు కూడా శిక్షర్హులేనని చెప్పారు. చంద్రబాబు తన అనుకూల మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. డబ్బుతో ప్రలోభ పెట్టిన చంద్రబాబు తనయుడు లోకేశ్ ఎన్నికల్లో గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. -
లింగమనేని రమేష్‌ను ఎవరు బెదిరించారు?
-
లింగమనేని దందాలపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలి
విజయవాడ సిటీ: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో జరిగిన భూ బాగోతాలతో పాటు లింగమనేని భూ దందాలపై విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరనున్నట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.కరకట్ట లోపల నిర్మించిన ఇల్లును ఇచ్చినందుకే లింగమనేని రమేష్‌ను చంద్రబాబు కాపాడుకుంటూ వస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం తన నియోజకవర్గంలోనే లింగమనేని రూ.50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం విజయవాడలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పనంగా కొట్టేశారు ‘‘కాజ, నంబూరు, కంతేరు గ్రామాల్లో ఐజేఎం–లింగమనేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 2005–06లో 40 ఎకరాల్లో వెంచర్లు వేసి విలాసవంతమైన విల్లాలు నిర్మించింది. పొన్నూరు నియోజకవర్గం నంబూరు గ్రామంలో 200 ఎకరాల్లో లేఔట్లు వేశారు. 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆ గ్రామ పంచాయతీకి 10 శాతం భూమిని రిజిస్టర్ చేయాల్సి ఉండగా చేయకుండా తప్పించుకున్నారు. కాజకు సంబం«ధించి జాతీయ రహదారిని ఆనుకుని విలాసవంతమైన విల్లాలు నిర్మించారు. మంగళగిరిలో 40 ఎకరాల్లో లేఔట్లు వేశారు. అక్కడి కట్టడాలకు సంబంధించిన బిల్డింగ్ పర్మిట్, గ్రామ పంచాయతీకి కట్టాల్సిన ఫీజులు రూ.కోట్లు ఎగవేశారు. చంద్రబాబు అండ చూసుకునే ప్రభుత్వానికి రావల్సిన రూ.వందల కోట్లకు ఎగనామం పెట్టారు. ఒక్కో విల్లాను రూ.5 కోట్లకు అమ్ముకుని, లేఔట్ ఫీజులు చెల్లించలేదు. 2005–06 నుంచి పన్నులు ఎగ్గొట్టారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి లేఖ రాసినా పట్టించుకోలేదు. అక్కడి రిజిస్టర్ విలువ ప్రకారం ఎకరం రూ.2.5 కోట్లు, మార్కెట్ విలువ రూ.15 కోట్ల వరకు ఉంది. ఈ మేరకు కాజ గ్రామ పంచాయతీకి రూ.50 నుంచి రూ.60 కోట్ల మేర ఎగవేశారు. పంచాయతీకి చెందని భూములు, దళితుల భూములను చట్టవ్యతిరేకమైన పద్ధతిలో ఇతరుల పేరిట మార్పిడి చేసుకున్నారు. రూ.250 కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా కొట్టేసిన లింగమనేనిని చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చారు. చంద్రబాబును అడ్డం పెట్టుకొని లింగమనేని రూ.100 కోట్ల దాకా రాయితీలు పొందారు. రియల్ ఎస్టేట్ ముసుగులో లింగమనేని వంటి వాళ్లు సాగించిన భూ బాగోతాలు బయటకు రావాలి. గత టీడీపీ ప్రభుత్వం అండతో దళితుల భూములను బలవంతంగా లాక్కొని వెంచర్లు వేశారు. వాటిపై కూడా దర్యాప్తు జరగాలి. కంతేరు గ్రామ డొంక భూములను సైతం కబ్జా చేశారు’’ అని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. అప్పుడు ఎందుకు స్పందించలేదు? ‘‘లింగమనేని భూ బాగోతాలపై కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, 12 ఏళ్లకు కూడా ఆ కేసులు బెంచ్‌పైకి రాకపోవడం ఏమిటి? చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నానని లింగమనేని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది. ఆ ఇంటిపై 2015 ఫిబ్రవరి 6న తాడేపల్లి తహసీల్దార్ నోటీసు ఇస్తే ఎందుకు స్పందించలేదు? దీనిపై నేను హైకోర్టుకు వెళ్లినప్పుడు అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదు?’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. -
టీడీపీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆర్కే
-
టీడీపీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, అమరావతి: మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. రాష్ట్రంలో టీడీపీ తన కిరాయి మనుషులతో వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోందని, వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ...టీడీపీ వ్యూహాత్మకంగా దాడులు చేసి, వాటిని వైఎస్సార్ సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు తమ పార్టీ శ్రేణులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలోనూ ముఖ్యమంత్రి, హోంమంత్రిలపై దారుణంగా అసత్యాలు దుష్ప్రచారం చేస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీడీపీ ఇటువంటి అరాచకాలకు పాల్పడుతోందన్నారు. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా తమపై అక్కసుతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే ధ్వజమెత్తారు. -
రాజధాని పేరుతో బాబు అక్రమాలెన్నో
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన అనుచరులు అరాచకాలు సృష్టించి రైతులను భయభ్రాంతులకు గురిచేసి, భూములను బలవంతంగా లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి–అమరావతి కరకట్టపై ప్రజావేదిక తొలగింపు పనులను ఎమ్మెల్యే ఆర్కే బుధవారం పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడినపుడు 2014 డిసెంబర్ 31వ తేదీన భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ కృష్ణానదిలో పర్యటించి ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ చెప్పి అధికారులకు క్లాసు పీకారని, దానికి అనుగుణంగానే తాడేపల్లి తహసీల్దార్ మాజేటి తిరుపతి వెంకటేశ్వర్లు కృష్ణాతీరంలో అక్రమ కట్టడాలను గుర్తించి నోటీసులు అందజేశారని గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి అక్రమ కట్టడంలో నివాసం ఉండడంతో ఆ విషయం మరుగున పడిందని విమర్శించారు. అనంతరం ఎటువంటి అనుమతులు లేకుండా రూ.4 కోట్ల వ్యయంతో మొదలు పెట్టిన అక్రమ కట్టడం ప్రజావేదికను రూ.9 కోట్లకు పెంచి..అందులోసైతం రూ.5 కోట్లు మిగుల్చుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆర్కే ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టాలను గౌరవించారు కాబట్టే.. ప్రజావేదికను తొలగించి, తదితర సామగ్రిని భద్రపరచాలని సూచించారని చెప్పారు. చంద్రబాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని హైదరాబాద్‌లోని తన నివాసానికి సైతం ప్రజాధనాన్ని ఖర్చు చేశారని విమర్శించారు. త్వరలోనే గౌరవ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి మిగతా అక్రమ కట్టడాలను సైతం ప్రభుత్వం తొలగిస్తుందని ఆర్కే స్పష్టం చేశారు. దౌర్జన్యంతో పంట పొలాలు లాక్కున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబ సీఎంగా ఉండగా.. కొంతమంది తమపై దౌర్జన్యం చేసి పంట పొలాలను ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు కట్టారని గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన పలువురు రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. చంద్రబాబు ఉండవల్లిలో లింగమనేని ఎస్టేట్‌లో నివాసం ఉండగా దారి కావాలంటూ, తర్వాత ఇస్తామంటూ 10 సెంట్ల స్థలాన్ని తీసుకున్నారని తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న ఎకరంన్నర పొలాన్ని తీసుకున్నారని ఉండవల్లి గ్రామానికి చెందిన దాసరి సాంబశివరావు వివరించారు. ఆర్కే మాట్లాడుతూ రాజన్న రాజ్యం వచ్చిందని, రాజధాని ప్రాంతంలో రైతులకు ఎటువంటి కష్టాలు ఉండవని, త్వరలోనే రైతుల భూములను రైతులకు అందజేస్తామని అన్నారు. -
రాజధాని నిర్మాణాన్ని 5 వేల ఎకరాల్లోనే పూర్తి చేస్తాం
-
ఇంకా చంద్రబాబు పెత్తనమేనా?
సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట కృష్ణాతీరంలో రిజర్వ్ కన్జర్వేటరీలో నిబంధనలకు విరుద్ధంగా నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన నివాసం వైపు రాత్రి వేళల్లో వాహనాలు వెళ్లనీయకుండా నిలుపుదల చేశారు. అయితే ఎన్నికలు ముగిసి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయి, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి, ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమితమైనప్పటికీ ఇప్పటికీ కూడా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత చంద్రబాబు నివాసం వైపు ప్రయాణికులను, రైతులను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు ఆయన ఇంటికి మూడు వైపులా దారులు మూసివేశారు. మరోవైపు కృష్ణానదిలో మత్స్యకారులను వెళ్లనీయకుండా నిరంతరం పోలీసులు కాపలా కాస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సీతానగరం కొండవీటివాగు హెడ్‌స్లూయిస్ నుంచి చంద్రబాబు నివాసానికి 3 కి.మీ.ల దూరం ఉంటుంది. కొండవీటి వాగుకి, కరకట్టకు మధ్య సుమారు 500 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. ఈ పంట పొలాల్లో ఎక్కువ శాతం పూల తోటలు, కూరగాయలు ఉండటంతో రైతులు తెల్లవారుజామున ఒంటిగంట నుంచి మూడు గంటల సమయంలో పొలాలకు వెళుతుంటారు. రైతులను పొలాలకు వెళ్లనీయకుండా పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారం కోల్పోయినా చంద్రబాబునాయుడు పెత్తనం చెలాయిస్తున్నాడని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. ఈ విషయమై ఆ ప్రాంత రైతులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడంలో దౌర్జన్యంగా నివాసం ఉంటున్నాడని, కష్టపడే రైతు పంట పొలానికి వెళ్లనీయకపోతే సహించేది లేదని, రెండు మూడు రోజుల్లో పోలీసులు బారికేడ్లు తొలగించకపోతే, ఆయన ఇంటిముందే కూర్చుంటానని ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. -
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాబీలో మంగళవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మాజీ మంత్రి నారా లోకేశ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) కరచాలనం చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అసెంబ్లీలో లాబీలో వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడటంతో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆర్కేతో కరచాలనం చేసిన లోకేశ్.. ఆయనకు అభినందనలు తెలిపారు. తనను అభినందించిన లోకేశ్‌కు ఆర్కే ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరూ ముఖాముఖి మొదటిసారి పలకరించుకోవడం అందరిలోనూ ఆసక్తి రేపింది. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆర్కే 5 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
‘జగన్ నిర్ణయం రాజకీయాల్లో సంచలనం’
సాక్షి, తాడేపల్లి : కేబినెట్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో సంచలనమని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభివర్ణించారు. వైఎస్సార్ఎల్పీ సమావేశంలో అందరికీ సమ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు అద్భుతమైన పాలన చూస్తారని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. అలాగే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పదవులను బాధ్యతగా తీసుకోవాలని వైఎస్ జగన్ చెప్పారని, ధర్మానికి, న్యాయానికి అండగా ఉండాలని చెప్పారన్నారు. చదవండి : ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో చేసిన ప్రకటన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించనున్నారు. ఇది దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. అత్యంత ఉన్నత స్థానాల్లో సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. -
మహాత్మగాంధీ విగ్రహానికి మరమ్మతులు చేసిన ఆర్కే
-
ప్రత్యేకత చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, అమరావతి: మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తన ప్రత్యేకత చాటుకున్నారు. దుండగులు ధ్వంసం చేసిన జాతిపిత మహాత్మగాంధీ విగ్రహానికి స్వయంగా మరమ్మతులు చేశారు. తాడేపల్లి వద్ద ఉన్న పోలకంపాడులో గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. విగ్రహం కాళ్లు దెబ్బతినడంతో స్వయంగా తాపీ పట్టి సిమెంట్ చేశారు. తర్వాత మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కారం చేశారు. గాంధీ విగ్రహానికి స్వయంగా మరమ్మతులు చేపట్టిన ఎమ్మెల్యేను స్థానికులు అభినందించారు. స్వతహాగా రైతు అయిన ఆర్కే నిరాడంబర జీవితం గడుపుతుంటారు. గతంలో లైనులో నిలబడి 5 రూపాయల భోజనాన్ని రుచి చూశారు. అంతేకాదు తన నియోజకవర్గంలోనూ ఈ సదుపాయం కల్పించి ప్రజల మన్ననలు పొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేత నారా లోకేశ్‌పై ఆర్కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
కృష్ణా తీరాన్ని కాంక్రీట్ జంగిల్ చేస్తారా?
తాడేపల్లిరూరల్: రిజర్వ్ కన్జర్వేటివ్‌లో ఒక చిన్న మొక్క నాటాలన్నా ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోవాలని, అలాంటిది టీడీపీ నేతలు ఇష్టానుసారం అక్రమ నిర్మాణాలు చేస్తూ కృష్ణానదీ తీరాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉండవల్లి కరకట్ట వెంట కొత్తగా ఏర్పాటుచేసిన అక్రమ కట్టడాలను ఆర్కే సోమవారం పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ ఈఈతో ఫోన్లో అక్రమ కట్టడాలను ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించగా, మొదట అక్రమ కట్టడాలను ఎక్కడా కట్టడం లేదంటూ ఆయన బదులిచ్చారు. ఎక్కడ కడుతున్నారో సర్వే నంబర్‌తో సహా ఆర్కే ఈఈకి తెలియజేయడంతో వాటిని తొలగించామని సమాధానమిచ్చారు. వెంటనే ఎమ్మెల్యే ఆర్కే ‘‘నేను సంఘటనా స్థలంలోనే ఉన్నాను’’ అని చెప్పగా ఈఈ మాట దాటవేసేందుకు ప్రయత్నం చేశారు. అనంతరం ఆర్కే విలేకరులతో మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నదీ తీర ప్రాంతాల్లో ఎటువంటి కట్టడాలు కట్టకూడదని చెప్పినప్పటికీ, టీడీపీకి తొత్తులుగా మారిన ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కరకట్ట వెంట నివాసం ఉంటున్నారని రైతులను పంట పొలాల్లోంచి ఉత్పత్తులను బయటకు కూడా తీసుకువెళ్లనీయకుండా ఆంక్షలు విధించారని, అయితే కరకట్ట నుంచి నదీ తీర ప్రాంతానికి వందల లారీల మట్టి తోలుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విచిత్రమన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్, టీడీపీ నేత పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో తీరంలో ఈ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నట్లు స్థల యజమాని కోటేశ్వరరావు తెలిపారని ఆర్కే చెప్పారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను తొలగించకపోతే, కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని ఆర్కే స్పష్టం చేశారు. -
వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే పోటీ: లోకేష్
సాక్షి, అమరావతి: 2024 ఎన్నికల్లోనూ తాను తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన సోమవారం మంగళగిరి కార్యకర్తలతో ఉండవల్లిలో మాట్లాడారు. త్వరలోనే తాను మంగళగిరిలో పర్యటించనున్నట్లు చెప్పారు. అయితే ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దొని, ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుని మనకి పార్టీ అండగా ఉందని అన్నారు. రాష్ట్ర మంత్రి హోదాలో మంగళగిరి బరిలో నిలిచిన లోకేష్... వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో ఘోర పరాజయం పాలైన తెలిసిందే. నారా లోకేష్ ఓవైపు ఓటమిపై తాను బాధపడటం లేదంటూనే మరోవైపు...మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పుడే అందరూ రాంగ్ సెలక్షన్ అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా అందరూ అదే అంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. కాగా ఓటమి అనంతరం నియోజకవర్గ సీనియర్ నేతలెవరూ చంద్రబాబు, లోకేష్‌లను కలవలేదు. అయితే రెండు రోజుల నుంచి చోటా నాయకులు, చంద్రబాబు, చినబాబును కలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
చినబాబు....చివరికిలా
సాక్షి, మంగళగిరి : రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. ఆయన గెలిస్తే చాలు.. పిలిస్తే నిధులొస్తాయి.. నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి బాట పట్టిస్తారు. ఇదీ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చేసిన ప్రచారం.. సర్వేలన్నీ లోకేష్ బాబు విజయంవైపే.. అన్ని రిపోర్టులూ చినబాబుకు తిరుగులేదనే.. ఇవీ పోలింగ్ ముగిశాక చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన నివేదికలు. ఎన్నికల్లో నారా లోకేశ్ ఓటమి పాలవడంతో ఇక చినబాబు రాజకీయ జీవితం ముగిసినట్టేనా.. రాజధాని ప్రాంతంలో మితిమీరిన అవినీతే కొంపముంచిందా? అధినాయకుడి అసమర్థతే ఓటమి మూటగట్టిందా? ఇదీ ఎన్నికల ఫలితాలు వెడివడ్డాక తెలుగుదేశం పార్టీ నేతల్లో అంతర్మథనం. ఎందుకిలా అయ్యింది.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఓటమిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. రాష్ట్ర మంత్రి హోదాలో మంగళగిరి బరిలో నిలిచిన లోకేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో ఘోర పరాజయం పాలవడం టీడీపీ నేతలను ఆందోళనలోకి నెట్టేసింది. రాంగ్ రిపోర్ట్ వాస్తవానికి ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక నాయకులు మండలాల వారీగా లెక్కలు కట్టారు. ప్రతి మండలంలో లోకేష్‌కు ఆధిక్యం వచ్చినట్లు చూపించారు. మొత్తం గా 25 వేలకుపైగా మెజార్టీతో చినబాబు గెలుస్తాడంటూ చంద్రబాబుకు నివేదికలు అందజేశారు. మళ్లీ అంతర్గత సర్వే చేయించుకున్న చంద్రబాబు లోకేష్ ఓటమి ఖాయమని తెలుసుకుని స్థానిక నాయకులకు చివాట్లు పెట్టారు. దీంతో టీడీపీ నాయకులే లోకేష్ ఓడిపోతాడంటూ బెట్టింగ్ పెట్టారని సమాచారం. అంతటా వ్యతిరేకతే.. తాడేపల్లి పట్టణంతోపాటు మండలంలో వైఎస్సార్ సీపీ 10 వేలకుపైగా మెజార్టీ రావడంతోనే ఓటమి తప్పదని గ్రహించిన నాయకులు మంగళగిరి మండలం, పట్టణంపై ఆశలు పెట్టుకున్నారు. అనంతరం దుగ్గిరాల మండలంలో వైఎస్సార్ సీపీకి వచ్చిన మెజార్టీతో వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) 5339 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. లోకేష్ రాజకీయ జీవితానికి తెరపడినట్టే(నా) లోకేష్ పోటీ అనంతరం మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు లోకేష్ రాజకీయ భవిష్యత్‌కు కూడా ముగిసినట్టేనని పేర్కొంటున్నారు. రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుని అడ్డగోలుగా అవినీతికి పాల్పడింది. పార్టీ నాయకులు ఇసుక, మట్టి దోపిడీకి సాగించారు. ఇలాంటి ప్రాంతంలో లోకేష్‌లాంటి నాయకుడ్ని తీసుకొచ్చి చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. మరో వైపు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయ చతురత, ప్రజల్లో చొచ్చుకుపోయే తత్వం వంటి లక్షణాల ముందు లోకేష్ నిలవలేడని తెలిసి ఇక్కడ పోటీ చేయించడం అధిష్టానం తప్పేనని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ బాబు రాజకీయ భవితవ్యంపై ఆందోళనేనని చర్చించుకుంటున్నారు. లెక్కింపునకు ముందే ఓటమి ఈ నెల 23వ తేదీన నాగార్జున యూనివర్సిటీలో లెక్కింపు కేంద్రానికి సైతం లోకేష్తోసహా మంగళగిరి నాయకులు ఎవరు వెళ్లకపోవడంతో ఓటమికి వారు ముందుగానే సిద్ధపడ్డారని స్థానిక కార్యకర్తలు అంటున్నారు. డబ్బు, అధికారం గెలిపిస్తుందనే ఆశతో ప్రత్యక్ష ఎన్నికలలో తొలిసారి బరిలోకి దిగిన లోకేష్‌ను మంగళగిరి ఓటర్లు శంకరగిరి మాన్యాలకు పంపించారని టీడీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. ఓటమి అనంతరం నియోజకవర్గ సీనియర్ నేతలెవరూ చంద్రబాబు, లోకేష్‌లను కలవలేదు. రెండు రోజుల నుంచి చోటా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబును కలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఫలించని చిలుక జోస్యం ఇప్పటికే జగన్ సునామీలో తెలుగుదేశం పార్టీ ఆనవాళ్లు గల్లంతయ్యాయి. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేయడం.. రాష్ట్రం చూపు ఇటే ఉండడం.. చివరకు చినబాబు మట్టి కరవడం జరిగాయి. ఈ బాధలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆర్థికంగానూ చితికిపోయారు. సర్వేలన్నీ వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నా.. టీడీపీపై ఉన్న అభిమానంతో అప్పులపాలయ్యారు. రాజధానిలో వివిధ రకాల బెట్టింగ్‌లతో కోట్ల రూపాయలు, భూములు నష్టపోయారు. వీరి ఆత్మవిశ్వాసం లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన చిలకజోస్యంతో అతి విశ్వాసం మారి ఇల్లు గుల్ల చేసుకున్నారు. రాష్ట్రంలో తమకు ఒక్క సీటయినా వైఎస్సార్ సీపీ కంటే ఎక్కువగా వస్తుందని తాడికొండ మండలంలో సుమారు రూ.10 కోట్లకుపైగా పందేలు కాశారు. కానీ పందెం తల్లకిందులైంది. ఒక్క సీటు కాదు ఏకంగా 128 సీట్లు వైఎస్సార్ సీపీకి ఎక్కువగా రావడంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. తుళ్లూరు మండలంలో టీడీపీకి 8 వేలకుపైగా మెజార్టీ వస్తుందని పందేలు కాశారు. ఇక్కడ 6 వేలకే పరిమితమైంది. భూములిచ్చిన రైతులు, ఓ సామాజిక వర్గం టీడీపీకి సానుకూలంగా ఉన్నా..లంక, అసైన్డ్ భూముల రైతులు వైఎస్సార్ సీపీకి మొగ్గు చూపారు. లంక అసైన్డ్ భూముల రైతులను ప్యాకేజీ విషయంలో టీడీపీ నాయకులు దారుణంగా మోసం చేశారు. టీడీపీని తరిమికొట్టారు అతి తక్కువ ధరలకు మంత్రుల బినామీలు కొనుగోలు చేసి చట్టబద్ధం చేసుకొనేందుకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లంక, అసైన్డ్ భూముల రైతులకు సాధారణ రైతులకు ఇచ్చే ప్యాకేజీ కంటే 20 శాతం ఎక్కువ ఇస్తామని ప్రకటించడడంతో వారు టీడీపీని తరిమికొట్టారు. తాడికొండ మండలంలో ఒక్క ఓటు అయినా తమకు మెజార్టీ వస్తుందని వేసిన పందేలు దాదాపు రూ.40 లక్షల వరకు బెడిసికొట్టాయి. ఇక్కడ వైఎస్సార్ సీపీకి 850కిపైగా మెజార్టీ వచ్చింది. రాజధాని ప్రాంతంలో టీడీపీ పాగా వేస్తుందనే గట్టి నమ్మకంతో కొందరు బెట్టింగ్ రాయుళ్లు శ్రావణ్ కుమార్ విజయంపై భారీగా పందేలు వేసి భంగపడ్డారు. ముంచిన ఎల్లో మీడియా ఎల్లో మీడియా, ఆంధ్రా ఆక్టోపస్ చిలక జోస్యంను నమ్మి అప్పన్నంగా తమకే సొమ్ము వస్తుందనే అత్యాశతో లక్షల్లో పందేలు కాసి కుదేలయ్యారు. దీంతో ‘సొమ్ము పోయే... శని పట్టే’ అన్న చందంగా తెలుగు తమ్ముళ్ల పరిస్థితి తయారైంది. రాజధాని వ్యాప్తంగా ఇదే పరిస్థితి రాజధానిలోని మంగళగిరిలో ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ పోటీ చేయడంతో ఎట్టి పరిస్థితులలో విజయం సాధిస్తాడనే నమ్మకంతో పందేలు కాశారు. నామినేషన్ సమయంలోనూ భారీగా బెట్టింగ్‌లు నడిచాయి. తుళ్లూరు మండలంలోని మందడం గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని ఐదెకరాలతోపాటు లగడపాటి మాటలు నమ్మి రూ.2 కోట్ల పందెం కాసి నష్టపోయినట్లు చర్చ జరుగుతోంది. రాజధాని వ్యాప్తంగా సుమారు యాభై ఎకరాలకుపైగా భూములను టీడీపీ నాయకులు పందెం కాసి భంగపడ్డారు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, బేతపూడి, నీరుకొండ, నిడమర్రు గ్రామాల్లోనూ బెట్టింగ్ నడిచాయి. ఇలా రాజధాని వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల వరకు టీడీపీ నేతలు బెట్టింగ్‌లు పెట్టి జేబులు గుల్ల చేసుకున్నారు. -
మంగళగిరి అని స్పష్టంగా పలకలేని...: ఆర్కే
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడు అవినీతి పాలనే టీడీపీ ఓటమికి కారణం అయిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలు విశ్వసించి అఖండ మెజార్టీతో తీర్పు ఇచ్చారన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్‌పై విజయం సాధించిన ఆర్కే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అయిదేళ్లు అండగా ఉండి, సమస్యలను పరిష్కరిస్తామన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలిచారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందన్న నమ్మకంతో తమకు అండగా నిలబడి, విజయాన్ని అందించారని అన్నారు. మంగళగిరి అని స్పష్టంగా పలకలేని అభ్యర్థిని గెలిపిస్తే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని నియోజకవర్గ ఓటర్లు ఆలోచించారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కావలంటే కనీస అవగాహన ఉండాలని ....అలాంటిది లోకేశ్‌కు నియోజవర్గ సరిహద్దులు కూడా తెలియకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా లోకేశ్ ఏనాడూ మంగళగిరి నియోజకవర్గంలోని ఏ గ్రామాన్ని సందర్శించిన పాపాన పోలేదని, కనీసం రైతుల సమస్యలను కూడా వినలేదని అన్నారు. పోలింగ్ తేదీనే మరిచిపోయిన మాలోకానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని ఆర్కే వ్యాఖ్యానించారు. దోచుకున్న వేలకోట్ల అవినీతి సొమ్ముతో ఓట్లును కొనాలని చూసిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలిందని అన్నారు. -
ఆర్కేకు నారా లోకేష్ అభినందనలు
సాక్షి, అమరావతి : మంగళగిరి నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌బాబు అభినందనలు తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై అత్యంత విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రజలందరికి ఆయన నమస్కారాలు తెలిపారు. నామినేషన్ వేసిన నాటినుంచి కౌంటింగ్ వరకు అహర్నిశలు తన కోసం శ్రమించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తొలిసారి ఎన్నికలలో పోటీచేసిన తనకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మీడియా మిత్రుల సహకారం మరువలేనిదన్నారు. ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు సహకరించి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అందరూ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. నియోజకవర్గ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. మంగళగిరి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడతానని అన్నారు. -
ఘనంగా వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం 9వ ఆవిర్భావ వేడుకలు
-
ఘనంగా వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం 9వ ఆవిర్భావ వేడుకలు
వాషింగ్టన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం 9వ ఆవిర్భావ వేడుకలు (ఏప్రిల్ 30, 2011లో ఆవిష్కరణ) వర్జీనియాలోని పెర్సిస్ (బంజారా) ఇండియన్ గ్రిల్, అష్బర్న్ సిటీలో ఘనంగా జరిగాయి. ఏనిమిది వసంతాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా వాషింగ్టన్ డిసి మెట్రో ప్రాంతములో వైఎస్సార్సీపీ సలహాదారు, గవర్నింగ్ కౌన్సిల్ (యూఎస్ఏ) వల్లూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇండియా నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ నుంచి గురజాల మాజీ ఎమ్మెల్యే మందపాటి నాగి రెడ్డి మనువడు శరత్ మందపాటి, నాటా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొదటగా వైఎస్సార్సీపీ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సభకు విచ్చేసిన ముఖ్య అతిధిని శాలువా, పుష్పగుచ్చాలతో వాషింగ్టన్ డీసీ మెట్రో పార్టీ ఎన్నారైలు సత్కరించారు. అనంతరం ఆంజనేయ రెడ్డి అతిధులను సభకు పరియం చేసి సభ యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీడీపీతో చేతులు కలిపి వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైలుకు పంపినా అధైర్యపడకుండా ప్రజా సంక్షేమం కొరకు పోరాడుతున్నారని ప్రశంసించారు. 2014 ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను, లోక్ సభ సభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా అదరకుండా, బెదరకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారన్నారు. మే 23 తర్వాత భారీ మెజారిటితో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, మళ్లీ రాజన్న రాజ్యం చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నీతి మాలిన ప్రభుత్వానికీ చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన నుంచి ప్రజలను కాపాడాలంటే వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్ జగన్ పాలనకై ఆంధ్ర ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని, వైఎస్ జగన్‌ను సీఎం చేసే బాధ్యత ప్రవాసాంధ్రుల అందరిపై ఉందన్నారు. అమెరికా లో ఉన్న ప్రతి వైఎస్సార్ అభిమాని, పార్టీ కార్యకర్తలు తమ నియోజకవర్గాలకు వెళ్లి పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. వీలు కాని వాళ్లు ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యలకు, సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రమేష్ రెడ్డి మాట్లాడుతూ..‘ విశ్వసనీయతే మన బలం, ఎన్నికల్లో చేతకాని హామీలిచ్చి తీరా అధికారమొచ్చాక మాట తప్పి నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేయడం బాబు నైజం, ఒక మాటంటూ ఇస్తే ఆ మాట కోసం ఎందాకైనా వెళ్ళడం మన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇజం. మాట తప్పం, మడమ తిప్పం..ఇదే వైఎస్సార్ మనకు నేర్పిన సిద్ధాంతం’ అన్నారు. 2019 ఎన్నికల ఫలితాలలో వైఎస్సార్సీపీ జెండా ఎగురు తుందని ఘంటాపథంగా అన్నారు. కలిసికట్టుగా ప్రయాణం చేసి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెర్సిస్ ఇండియన్ గ్రిల్ ఓనర్ శ్రీనివాస్ గొలుగూరి అందరికి కమ్మనైన విందు భోజనాన్ని పంచారు. ముఖ్యంగా వర్జీనియా, మేరీలాండ్, న్యూ జెర్సీ, నార్త్ కరోలినా, డెలావేర్, వాషింగ్టన్ డి.సి. ప్రాంతాల నుంచి దాదాపు 200 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నారా లోకేష్ ఓటమి ఖాయం.. రూ.10 కోట్లు బెట్
మంగళగిరి: ‘గుంటూరు జిల్లా మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయం.. రూ.పది కోట్ల బెట్‌కు నేను రెడీ.. గెలుస్తాడనుకుంటే బెట్‌కు ముందుకు రండి’ అంటూ సాక్షాత్తు ఓ టీడీపీ నాయకుడు సవాల్ విసరడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం లోకేష్‌కోసం మాత్రమే ఈ ఎన్నికల్లో పని చేసిన ఆ నాయకుడి సవాల్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. అన్నీ తానై వ్యవహరించడమే కాక ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన ఆ నాయకుడే లోకేష్ ఓటమి తప్పదని బెట్టింగ్ కట్టడం చూస్తుంటే.. ఇప్పటికే లోకేష్‌ను నమ్మి బెట్టింగ్‌లు కట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బూత్‌ల వారీగా నివేదికలు తెప్పించుకున్న సదరు నాయకుడు లోకేష్ ఓటమి ఖాయమని, బెట్టింగ్‌లు కట్టి నష్టపోవద్దని అనుచరులతో వ్యాఖ్యానించారు. ఇప్పటికే లోకేష్ గెలుస్తాడని ఎవరైనా బెట్టింగ్‌లు కట్టివుంటే ఆ డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు లోకేష్ ఓటమిపై బెట్టింగ్ కట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. వాస్తవానికి లోకేష్‌ను గెలిపించేందుకు సదరు నేత పక్కా ప్రణాళిక రచించాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మళ్లీ బరిలో నిలవడంతో ఆ నేతతో పాటు ఇతర టీడీపీ నాయకులు ఎలాగైనా లోకేష్‌ను గెలిపించేందుకు కోట్ల రూపాయల డబ్బును మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో సదరు నేతతో పాటు ఆయన శిష్యుడిగా ఉన్న మరో యువనేత వారి సొంత డబ్బును కూడా వెచ్చించినట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు నేతలు ఖర్చు పెట్టిన డబ్బులను ఎన్నికలు జరక్కముందే తిరిగి వెనకేసుకునేందుకు పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు కట్టినట్లు సమాచారం. అయితే పోలింగ్ అనంతరం బూత్‌ల వారీగా సమీక్షించి పరిస్థితి తారుమారైందనే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా పోలింగ్ జరిగిన విధానాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ వాస్తవ పరిస్థితిని పార్టీ పెద్దలకు ఏ విధంగా వివరించాలో అర్థం కాక తర్జనభర్జనలు పడుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలే లోకేష్ ఓటమిపై బెట్టింగ్‌లకు దిగడం చర్చనీయాంశంగా మారింది. లోకేష్ గెలవడనడానికి ఇవీ ప్రధాన కారణాలు - రాజధాని భూములపై పోరాటం వల్ల వైఎస్సార్సీపీకి రైతుల మద్దతు - తాడేపల్లి పరిధిలోని భూములను గ్రీన్ బెల్ట్ నుంచి తొలగిస్తామని (అమ్ముకోవచ్చు) ఎమ్మెల్యే ఆర్కే హామీ - మళ్లీ టీడీపీ వస్తే ఇక్కడి ప్రభుత్వ భూములను ఐటీ కంపెనీలకు ఇస్తుందనే భయంతో వాటిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న 30 వేల మంది వైఎస్సార్సీపీకి ఓటు వేయడం. - ఎమ్మెల్యే ఆర్కే ప్రారంభించిన రాజన్న రైతు బజార్ వల్ల పెద్ద సంఖ్యలో మహిళలు లబ్ధి పొందడం. - రాజన్న క్యాంటిన్ ద్వారా ఎంతో మంది పేదల ఆకలి తీరడం. -
ఎమ్మెల్యే ఆర్కే ధర్నా
-
ఎమ్మెల్యే ఆర్కే ధర్నా
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధర్నాకు దిగారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఎమ్మెల్యే ఆర్కే ధర్నాకు దిగడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే.. తిరిగి తమ కార్యకర్తలపైనే కేసులుపెట్టడంపై మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన టీడీపీ నాయకులు మీద పోలీసులు ఎలాంటి కేసులు పెట్టలేదని అన్నారు. దెబ్బలు తిన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తల మీద దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై మీద కేసు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. చంద్రబాబు, లోకేష్ మాటలు విని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. -
మళ్లీ పనిలో నిమగ్నమైన ఆర్కే
సాక్షి, మంగళగిరి : నిన్న మొన్నటి వరకూ ఎన్నికల ప్రచారం, పోలింగ్‌లో బిజీ బిజీగా గడిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మళ్లీ తన దైనందిక జీవితంలో పడిపోయారు. స్వతహాగా వ్యవసాయంపై ఎంతో మక్కువ చూపే ఆయన... సామాన్య రైతు మాదిరిగా పొలం పనులు చేసుకుంటారు. పోలింగ్ ముగియడంతో ఆర్కే తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని... మళ్లీ యథావిధిగా తన పనుల్లో నిమగ్నం అయ్యారు. (రైతన్న ఎమ్మెల్యే ఆర్కే) మీరు చూడండి... ఆ దృశ్యాలు... -
ఓటర్లతో కలిసి ఆర్కే ధర్నా
సాక్షి, గుంటూరు : ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మంగళగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రారంభమై రెండున్నర గంటలు అయినా ఇంకా పలు బూత్ ల్లో పోలింగ్ ప్రారంభం కాకపోవటం పై అసహనం వ్యక్తం చేసారు. అనేక మంది ఓటర్లు చాలా సేపు నిరీక్షించి తిరిగి వెనక్కు మళ్ళుతున్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడంపై ఆర్కే ఎన్నికల అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా ఆర్కే ధర్నాకు దిగారు. నియోజకవర్గంలోని దాదాపు 60 ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కొని చోట్ల ఇప్పటి వరకు పోలింగ్ మొదలు కాలేదన్నారు. ఎండకు తట్టుకోలేక ముందుగానే ఓటు వేద్దామని వచ్చిన ఓటర్లు ఈవీఎంలు పనిచేయకోవడంతో వెనుతిరిగి పోతున్నారన్నారు. మాక్ పోలింగ్ సమయంలో పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు పనిచేయకకోవడం పట్ల అనుమానాలు ఉన్నాయన్నారు. వైఎస్సా సీపీకి ఓట్లు పడే చోట ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆరోపించారు. లోకేష్ ఓడిపోతారనే ఉద్దేశ్యంతోనే ఈవీఎంలు పనిచేయకుండా చేస్తున్నారనే అనుమానం ఉందన్నారు. అధికారుల తీరు పై ఆర్కే తో పాటుగా ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండకు తట్టుకోలేక ఉదయాన్నే ఓటు వేద్దామని వస్తే ఇప్పటి వరకు బయటటే నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేయడానికి వస్తే ఈవీఎంలు పనిచేయడం లేదంటే ఎలా అని ప్రశ్నించారు. -
ఓటేయకపోతే ఊరుకునేదిలేదు !
సాక్షి, గుంటూరు : ‘ఓటు వేస్తే మాకే వేయాలి.. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదు.. మాకు ఓటు వేయకపోతే ఊర్లో నుంచి వెళ్లగొడతాం.. మమ్మల్ని ఎదురించేంత ధైర్యం ఎవరిచ్చార్రా.. బతకాలని లేదా?’ అంటూ టీడీపీ నేతలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని మంగళగిరి, గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ వంటి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కులం పేరుతో దూషిస్తూ... ‘మీరు కూడా మాకు ఎదురు తిరిగేంత మనగాళ్లు అయ్యారా.. ఎన్నికలయ్యాక ఓట్లు తక్కువ వస్తే మీ అంతు తేలుస్తాం’ అంటూ టీడీపీకి మద్దతుగా ఉండే బలమైన సామాజికవర్గం నేతలు ఇతర సామాజికవర్గాల ప్రజల్ని నయానోభయానో తమ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఓటమి భయం వెంటాడుతుండటంతో రాత్రి వేళల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలు నివాసాలు ఉండే కాలనీలకు వెళ్లి నానా యాగి చేస్తున్నారు. వీరి బెదిరింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న వారు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. దీంతో ‘మాపైనే కేసులు పెడతారా ?’ అంటూ టీడీపీ నేతలు బాధితుల ఇంటిని ముట్టడించి నానా దుర్భాషలాడుతూ వీరంగం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. పల్నాడులో శాంతిభద్రతలకు విఘాతం గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు ఓటమి భయంతో వైఎస్సార్ సీపీకి వెన్నుదన్నుగా నిలిచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై దౌర్జన్యానికి తెగబడుతున్నారు. ఓటు తమకు వేసే ఉద్దేశం ఉంటేనే పోలింగ్ కేంద్రానికి రావాలని, అలాకాని పక్షంలో వేయకుండా ఇంట్లోనే కూర్చొవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండతోపాటు మంగళగిరి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే గొడవలకు దిగుతూ శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం కేసులు కూడా నమోదు చేయని పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో అధికారులంతా అధికార పార్టీ నేతలు తెచ్చుకున్నవారే కావడంతో వారు చెప్పినట్లు ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కులం పేరుతో దూషణలు గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ కాలనికి వెళ్లిన టీడీపీ నేతలు సోమవారం రాత్రి వారికి డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేశారు. అయితే, తాము డబ్బు తీసుకోబోమని, ఎన్నికల్లో తమకు ఇష్టం వచ్చిన వారికి ఓట్లు వేసుకుంటామంటూ చెప్పడంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కొల్లి కృష్ణతోపాటు, మరికొందరు ఎస్సీలపై దౌర్జన్యానికి దిగడంతో వీరంతా వెళ్లి పోలీసులకు íఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి రెండు రోజులు గడుస్తున్నా కేసు కూడా నమోదు చేయకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లికు తలొగ్గి పనిచేస్తున్న దయనీయ పరిస్థితి. ఓట్లు ఎలా వేస్తారో చూస్తాం గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో టీడీపీ నేతల ముస్లిం మైనార్టీ వర్గం నివాసం ఉండే ప్రాంతంలో చంద్రబాబు సామాజిక వర్గం నేతలు రెచ్చిపోయారు. ‘మీరు రేపు ఓట్లు ఎలా వేస్తారో చూస్తాం.. మాకు ఎదురు తిరిగే మొగాళ్లు అయ్యారా.. ఇళ్లు పీక్కొని ఊరి నుంచి వెళ్లిపోవాల్రా ’ అంటూ మహిళలను సైతం తీవ్ర స్థాయిలో దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దాచేపల్లి పోలీసులు పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన టీడీపీ నేతలు ‘మాపైనే కేసులు పెట్టేంత మొనగాళ్ళు అయ్యారా’ అంటూ తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ బాధితుల ఇంటి ముందు హల్చల్ చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవంటే అధికార పార్టీ నేతలకు ఏ స్థాయిలో ఊడిగం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మంగళగిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం పల్నాడులో పరిస్థితి ఇలా ఉంటే ..రాజధాని నియోజకవర్గమైన మంగళగిరిలో సైతం టీడీపీ నేతలు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రజల నుంచి పెద్ద ఆదరణ లభిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లలను ఓటమి భయం వెంటాడుతోంది. పార్టీ అధినేత తనయుడు ఓటమిపాలైతే పరువు పోతుందనే భయంతో బీసీ సామాజిక వర్గాలను టార్గెట్‌గా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో బీసీ వర్గానికి చెందిన మహిళలపై దౌర్జన్యానికి దిగుతూ టీడీపీకి ఓటు వేయకపోతే చంపుతామంటూ బెదిరింపులకు దిగారు. టీడీపీ నేత గరికపాటి నాని తనను చంపుతామంటూ బెదిరించారంటూ బీసీ మహిళ దేవరాజు పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు టీడీపీ నేతల దౌర్జన్యకాండకు అడ్డుకట్ట వేయకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే వీల్లేకుండా పోతుంది. -
మీరు ఓటేసి గెలిపిస్తే ఆర్కేను మంత్రిని చేస్తా
-
‘బాబూ.. మంగళగిరిలో మీ అబ్బాయి గెలవడు’
సాక్షి, మంగళగిరి : ‘చంద్రబాబూ.. నువ్వు ఎన్నిచేసినా మీ అబ్బాయి మంగళగిరిలో గెలవలేడు.. 9న జరిగే ఎన్నికల్లోనూ గెలవలేడు..’ అంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్లరామకృష్ణ రెడ్డి (ఆర్కే) ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడుతోందని ధీమా వ్యక్తం చేశారు. ‘నీకొడుక్కి పార్టీ తెలియదు.. పార్టీ గుర్తు తెలియదు. మంగళగిరి నియోజకవర్గ నైసర్గిక స్వరూపం తెలియదు. మంగళగిరి అనే పేరు పలకలేడు. నామినేషన్ వేయటం రాదు.. ఎన్నికల కౌంటింగ్ డేట్ తెలియదు. అలాంటి వ్యక్తిని మంగళగిరి ప్రజలు ఎలా ఎన్నుకుంటారు?’ అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మంగళవారం మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే చంద్రబాబు, ఆయన సుపుత్రుడు నారాలోకేష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించి సభికులను కడుపుబ్బా నవ్వించారు. -
చంద్రబాబు కొడుకుని ఓడించండి: వైఎస్ జగన్
-
నీకొడుక్కి పార్టీ తెలియదు.. పార్టీ గుర్తు తెలియదు.
-
బాబు నమ్మించి మోసం చేశారు: బుట్టా రేణుక
మంగళగిరి: రాష్ట్రంలోని చేనేతలను నమ్మించి మోసగించిన ఘనత చంద్రబాబుదేనని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ధ్వజమెత్తారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం చేనేత మహిళలను మభ్యపెట్టి మోసం చేసి అవమానించిన చంద్రబాబుకు రాష్ట్రంలోని నేతన్నలంతా తమ సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత, చేతివృత్తుల సంఘాల నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బుట్టా రేణుక మాట్లాడుతూ జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించేలా ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎంత చెప్పినా బాబు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారంటే ఎంత నష్టం జరిగినా నిలబెట్టుకుంటారన్నారు. బీసీలకు 41 సీట్లు ఇవ్వడంతో పాటు తనకు ఇచ్చిన కర్నూలు ఎంపీ సీటు తాను పార్టీ మారినా మరో బీసీ పద్మశాలీయులకే ఇచ్చారు కానీ బాబులా మోసం చేయలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళలను మోసం చేసిన చంద్రబాబు, లోకేష్‌లకు బీసీలంతా ఐక్యంగా వైఎస్సార్సీపీకి అండగా నిలిచి మంగళగిరిలో చరిత్ర సృష్టించాలన్నారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత పరిశ్రమ అభివృద్ధితో పాటు స్వర్ణకారుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. పలువురు నేత సంఘాల నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీలైన మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమలను పిలిచి టిక్కెట్ ఇచ్చారని గుర్తు చేశారు. నేడు సంఘాల నేతలను గంటల తరబడి పడిగాపులు కాయించి అవమానించి చివరకు తన కుమారుడికి టిక్కెట్ ఇచ్చి బీసీలను అగౌరవపరచిన చంద్రబాబుకు బీసీల సత్తా ఏమిటో తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ నేత దామర్ల కుబేరస్వామి, కాండ్రు శ్రీనివాసరావు, మాచర్ల సుధాకర్, దామర్ల ఉమామహేశ్వరరావు, ప్రగడ ఆదిసుదర్శనరావు, చింతక్రింది సాంబశివరావు, చింతకింది కనకయ్య, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. -
మంగళగిరిలో లోకేశ్‌కు ఎదురుగాలి
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై కేంద్రీకృతమైంది. అయితే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం.. బలమైన ప్రత్యర్థి బరిలో ఉండడంతో ఈ ఎన్నికల్లో లోకేశ్ గెలుపుపై సందేహాలు నెలకొన్నాయి. దీనికితోడు ప్రచారంలో తానుగా చేస్తున్న కామెడీతో లోకేశ్ అభాసుపాలవుతున్నారు. ఇప్పటికే ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై నోరు జారడంతో సామాజిక మాధ్యమాలలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. అదే సమయంలో ఆయన ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. వైఎస్సార్సీపీ వైపే బీసీల మొగ్గు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికితోడు మంగళగిరిలో స్థానికంగా బలంగా ఉన్న బీసీలు తమకు టికెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నాయకత్వం చివరకు మొండిచేయి చూపి అధినేత తనయుడికి సీటివ్వడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం శుక్రవారం మంగళగిరిలో సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇదే సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మాట్లాడుతూ 2024లో మంగళగిరి స్థానాన్ని బీసీలకే కేటాయిస్తామని, ఈ మేరకు తమ పార్టీ అధినేతను తాను ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో అక్కడున్న బీసీ సంఘాల నేతలంతా వైఎస్సార్సీపీకి మద్దతు తెలపడంతోపాటు ఆర్కేకు ఓటు వేసి గెలిపించాలని బీసీలకు పిలుపునిచ్చారు. లోకేశ్‌కు ఝలక్ తప్పదంటున్న బీసీలు ఇదిలా ఉంటే.. నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తరచూ కుప్పం గురించి ప్రస్తావిస్తూ, తన తండ్రిని నాలుగు దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఆదరించి, విజయాన్ని అందిస్తున్నారని, తాను గెలిస్తే మంగళగిరిని కుప్పంలా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ఈ మాట బీసీలంతా పునరాలోచనలో పడేలా చేసింది. ఈ ఎన్నికల్లో లోకేశ్ గెలుపునకు సహకరిస్తే ఆయన ఇక్కడే పాతుకుపోతారని, భవిష్యత్తులో తమకు అవకాశమే లేకుండా పోతుందన్న భావనకు వారు వచ్చారు. ఇప్పటికే మంగళగిరి టికెట్‌ను బీసీలకే కేటాయిస్తామని చివరిదాకా చెప్పిన అధిష్టానం.. ఆఖరు నిమిషంలో లోకేశ్‌ను బరిలోకి దింపడం ద్వారా తమను నమ్మించి మోసం చేసిందని, ఈ పరిస్థితుల్లో లోకేశ్ గెలవకుండా చేసి తమ తడాఖా చూపాలని వారు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. నియోజకవర్గంలో దాదాపు రెండున్నర లక్షలకుపైగా ఓటర్లు ఉండగా.. ఇందులో బీసీలు 70 వేల వరకు ఉన్నారు. వీరంతా ఏకతాటిపై నిలచి లోకేశ్‌కు మొండిచెయ్యి చూపేందుకు సిద్ధమవుతున్నారు. డబ్బుల కట్టలతో గెలవాలని ప్రయత్నం.. నారా లోకేశ్ ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో డబ్బులిచ్చి జనాన్ని తరలిస్తున్నారు. ఏదేమైనా లోకేశ్‌ను గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వ పెద్దలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు వెనుకాడట్లేదు. ఇందులో భాగంగా భారీ ఎత్తున డబ్బులు దింపేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం తనయుడు కావడంతో డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. శుక్రవారం జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లకోసం ఒక్కో ఓటుకు రూ.4 వేల చొప్పున డబ్బులు పంచడం ఇందుకు నిదర్శనం. అన్ని వర్గాల మద్దతుతో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆర్కే ప్రచారంలో దూసుకుపోతుండడంతో ఆయన్ను నిలువరించేందుకు నానా తంటాలు పడుతున్న టీడీపీ నేతలు భారీ మొత్తంలో డబ్బు దించయినా గెలవాలని గట్టి పన్నాగంలో ఉన్నట్టు కనిపిస్తోంది. -
లీడర్‌తో ఆళ్ల రామకృష్ణారెడ్డి
-
ఆళ్ల రామకృష్ణ రెడ్డి - లీడర్‌తో
-
మంగళగిరి పోస్టల్ బ్యాలెట్ బూత్‌లో టీడీపీ నేతలు
-
లోకేష్‌కు ప్రజాక్షేత్రంలో తిరస్కరణ తప్పదు
సాక్షి, మంగళగిరి : అధికార బలంతో అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి తాజా మాజీ మంత్రి నారా లోకేష్ నామినేషన్‌ను ఆమోదింపజేసుకున్నా ప్రజాక్షేత్రంలో మాత్రం తిరస్కరణ తప్పదని మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) స్పష్టం చేశారు. మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నామినేషన్ల పరిశీలన జరగ్గా టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్ పత్రాల్లో చేసిన నోటరీపై ఎమ్మెల్యే ఆర్కే న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీంతో నామినేషన్ ఐదు గంటల పాటు పెండింగ్‌లో పెట్టిన అధికారులకు ఉన్నతస్థాయిలో ఒత్తిడి రావడంతో ఆమోదించక తప్పలేదు. అనంతరం ఆర్కే విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తీవ్రస్థాయిలో స్థానిక ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి లోకేష్ నామినేషన్ ఆమోదింపజేశారని విమర్శించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ఏం మాట్లాడతాడో తెలియని లోకేష్ చివరకు నామినేషన్ పత్రాలను సమర్పించడంలోనూ తప్పటడుగులు వేసి మరోసారి తన అసమర్థతను చాటుకున్నారని ఎద్దేవాచేశారు. తమ అభ్యంతరాలపై సమాధానం చెప్పలేని లోకేష్ న్యాయవాదులు 24 గంటలు సమయం కోరారని, 24 గంటల సమయం గడవకముందే అధికారులు ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. ఆక్రమించుకుని నివాసం ఉంటున్న లోకేష్, చంద్రబాబు అదే ఇంట్లో కూర్చుని కృష్ణాజిల్లా న్యాయవాదులతో నోటరీ చేయించుకున్నారని విమర్శించారు. వాస్తవానికి ఉండవల్లిలో నివాసం ఉంటున్నప్పుడు గుంటూరు జిల్లా న్యాయవాదులతో నోటరీ చేయించుకోవాలని స్పష్టంచేశారు. అప్పుడు కూడా ఇక్కడ ఎవరు నోటరీ చేసేవారు లేకపోతే ప్రత్యేకంగా అనుమతులు తీసుకుని కృష్ణాజిల్లా వారితో నోటరీ చేయించుకోవాలనే నిబంధనలను తుంగలో తొక్కి కృష్ణాజిల్లా న్యాయవాదులతో నోటరీ చేయించారన్నారు. వాస్తవానికి ఎన్నికల అధికారులు నిబంధనలను అమలు చేస్తే నామినేషన్ తిరస్కరించాలని, కానీ ఒత్తిడితోనే ఆమోదించారని పేర్కొన్నారు. ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా ప్రజాక్షేత్రంలో మంగళగిరి ప్రజల నుంచి తిరస్కరణ తప్పదని స్పష్టం చేశారు. -
ఎట్టకేలకు లోకేష్ నామినేషన్ ఆమోదం
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్‌ను అధికారులు ఎట్టకేలకు ఆమోదించారు. మంగళవారం ఉదయం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నామినేషన్ పరిశీలనకు రాగా లోకేష్ తరఫున హాజరైన న్యాయవాది అభ్యంతరం తెలిపారు. నోటరీ చేసిన న్యాయవాది నోటరీ కాలపరిమితి ముగిసిందని, నామినేషన్ చెల్లదని అభ్యంతరం వ్యక్తం చేయడంతో నోటరీ చేసిన న్యాయవాది రుద్రు శ్రీనివాసరావు ప్రభుత్వం రెన్యువల్ చేసిన పత్రాలను చూపించడంతో వెంటనే ఆర్కే నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి మెమ్మాబేగం ఆమోదించారు. అనంతరం టీడీపీ అభ్యర్థి లోకేష్ నామినేషన్ పత్రాల పరిశీలనలో నోటరీ చేసిన విధానంపై ఎమ్మెల్యే ఆర్కే తరఫున హాజరైన న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఆర్కే తరఫున పున్నం జనార్ధనరెడ్డి, ఆల్లం రమేష్ లేవనెత్తిన అభ్యంతరాలతో అధికారులు ఏమీ తేల్చుకోలేక లోకేష్ తరఫున న్యాయవాదులకు 24 గంటల సమయం ఇచ్చి ఆర్కే తరఫు న్యాయవాదులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రికి సమాచారం.. ఈ ఘటనతో బిత్తరపోయిన న్యాయవాదులు బయటకు వచ్చి టీడీపీ నాయకులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చారు. దీంతో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు రిటర్నింగ్ అధికారిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి తట్టుకోలేక ఆరుగంటల సమయంలో లోకేష్ నామినేషన్ ఆమోదించినట్టు ప్రకటించక తప్పలేదు. వాస్తవానికి నోటరీ ఎవరు చేసినా వారి పరిధిలోనే అభ్యర్థి సంతకం చేశారని నోటరీ చేయాలి. కానీ లోకేష్ నోటరీలో న్యాయవాది తన పరిధి దాటి లోకేష్ నివాసంలో తన ముందు సంతకం చేసినట్టు నోటరీ చేశారు. అయితే 1956 నోటరీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 8, 8ఏ, 9 ప్రకారం అలా సంతకం చేయరాదని చట్టంలో ఉండడంతో న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీంతో రిటర్నింగ్ అధికారి సైతం వైఎస్సార్సీపీ న్యాయవాదుల వాదనలో నిజం ఉండడంతో ఆమోదిస్తే ఇబ్బంది పడతానని ఐదుగంటల పాటు ఏ నిర్ణయం ప్రకటించలేదు. అనంతరం అనేక ఒత్తిళ్లతో ఆమోదించారు. పోలీసు ఏఎస్పీ, నార్త్‌జోన్ డీఎస్పీ రామకృష్ణ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారితో ప్రత్యేకంగా మాట్లాడడం విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే నామినేషన్ ఆమోదించిన అనంతరం సతీష్ మాదల అనే యువకుడు వచ్చి ఆర్కే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ హడావుడి చేశారు. టీడీపీ నాయకుడు గంజి చిరంజీవి పసలేని ఆరోపణలతో ఆర్కేపై అక్కసు వెళ్లగక్కారు. నామినేషన్ పత్రాలే చూసుకోలేనోడు ప్రజలనెలా పాలిస్తాడు నామినేషన్ పత్రాలనే సరిగా చూసుకోలేని లోకేష్ ప్రజలను ఎలా పాలిస్తాడని ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ప్రశ్నించారు. సామాన్యుల నామినేషన్ దరఖాస్తుల్లో చిన్న తప్పు దొర్లినా తిరస్కరించిన అధికారులు లోకేష్ నామినేషన్లో ఎందుకు తాత్సారం చేశారని నిలదీశారు. తమన్నా నామినేషన్ ఆమోదం పొందిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తప్పులున్న నామినేషన్‌ను వెంటనే తిరస్కరించకుండా ఎందుకు సమయం ఇచ్చారని నిలదీశారు. లోకేష్‌కు ఓటమి తప్పదని తెలిసే ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం లేదన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా లోకేష్ ఓటమి ఖాయమన్నారు. -
ఉత్కంఠ రేపుతున్న లోకేష్ నామినేషన్..!
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబు తనయుడు, నారా లోకేష్ నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ పేపర్లలో తప్పిదం కారణంగా లోకేష్ నామినేషన్ ఆమోదం పొందుతుందో లేదోనని టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. టీడీపీ మంగళగిరి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన లోకేష్ ఇంటి అడ్రస్‌ను తాడేపల్లి మండలం ఉండవల్లిగా పేర్కొన్నారు. దీనిని కృష్ణా జిల్లాకు చెందిన లాయర్ సీతారామ్ నోటరీ చేశారు.అయితే, తన పరిధిలోకి రాని గ్రామాన్ని నోటరీ ఎలా చేస్తారని వైఎస్సార్సీపీ అభ్యర్థి, మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. వివరణ ఇచ్చేందుకు లోకేష్ తరపు న్యాయవాది సీతారామ్ కొంత సమయం కావాలని రిటర్నింగ్ అధికారి వసుమా బేగంను కోరారు. నోటరీ రూల్స్ ప్రకారం ఈ నామినేషన్ చెల్లదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తప్పుడు నామినేషన్ పత్రాలు ఇచ్చినందుకు చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎన్నికల అధికారులు పక్షపాత రహితంగా నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఒకవేళ లోకేష్, అతని తరపు న్యాయవాదులు ఇచ్చిన వివరణతో ఎన్నికల అధికారి సంతృప్తి చెందకపోతే... నామినేషన్‌ను తిరస్కరించే ఆస్కారం కూడా ఉంటుంది. అయితే, ఇది పొరపాటే తప్ప.. తప్పిదం కాదంటున్న టీడీపీ నేతలు...అంత మాత్రాన నామినేషన్ తిరస్కరించే పరిస్థితి ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క లోకేష్ నామినేషన్ ఆమోదానికి ఉన్నతస్థాయిలో ఒత్తిడులు పనిచేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి -
‘దోచిన డబ్బు పంచేస్తున్నారు’
సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో గెలవడానికి గుంటూరులో గల్లా జయదేవ్, మంగళగిరిలో నారా లోకేష్ వేలకోట్లు ఖర్చు చేస్తున్నారని గుంటూరు వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాజకీయాల్లో కనీస అవగహన, పరిపక్వతలేని వారితో తాను పోటీపడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. మైనార్టీలు, దళితుల నుంచి తమ పార్టీకి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. గుంటూరు లోక్‌సభ సీటు, మంగళగిరి అసెంబ్లీ స్థానం వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమాన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి 25వేల భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మోదుగులు అభిప్రాయపడ్డారు. గుంటూరులో గల్లా జయదేవ్‌కు భారీ ఓటమి తప్పదని అన్నారు. ఎంపీతో పాటు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుపొంది తీరుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల కాలంలో చేయలేని అభివృద్ధి ఒక్కరోజులోనే చేస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలకు సాధారణ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని మోదుగుల వెల్లడించారు. ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు చేసిన అక్రమాలకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు సిద్ధమైన్నట్లు ఆళ్ల రామకిృష్ణరెడ్డి తెలిపారు. అధికారంలో ఉండి ఒక్క పని కూడా చేయలేదని, వేల ఎకరాలు భూమిని కాజేశారని ఆరోపించారు. రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి భూములను బలవంతంగా లాగుక్కున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో గ్రామీణ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని అన్నారు. అక్రమంగా సంపాధించిన వేలకోట్ల రూపాయలను నారా లోకేష్ ఈ ఎన్నికల్లో తన గెలుపుకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ నేతృత్వంలో రాజన్న రాజ్యంకోసం ప్రజలు ఎదురు చేస్తున్నారని అభిప్రాయడ్డారు. -
మీరే మీ నాన్నపై ఒత్తిడి తీసుకొచ్చారా?
సాక్షి, అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో తనపై పోటీకి దిగిన ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌బాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఐదో ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. మంగళగిరిలో తన చేతిలో ఓడిపోతారనే భయంతోనే లోకేశ్‌తో చంద్రబాబు రాజీనామా చేయించలేదా? లేక లోకేశే రాజీనామాకు నిరాకరించారా? అని ఆయన ప్రశ్నించారు. ‘నువ్వే మీ నాన్న మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉంటావు. నాన్న నేను రాజీనామా చేయను. నాకు ఎమ్మెల్సీ పదవి ఉండాల్సిందే. పొరపాటునో.. గ్రహపాటునో నేను ఆర్కే చేతిలో ఓడిపోతే.. నాకీ ఎమ్మెల్సీ పదవైనా ఉంటుందని చెప్పేసి.. నువ్వు రాజీనామా చేసి ఉండవు’ అని ఆర్కే లోకేశ్‌ను ఉద్దేశించి ఫేస్బుక్లో పెట్టిన పోస్టులో పేర్కొన్నారు.ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రామసుబ్బారెడ్డిలతో ఎమ్మెల్సీ పదవులకు చంద్రబాబు రాజీనామా చేయించారని, కానీ, మీతో ఎందుకు రాజీనామా చేయించలేదని లోకేశ్‌ను నిలదీశారు. ‘నాపై ఎలాగూ ఓడిపోతావనే భయంతోనే నువ్వు రాజీనామా చేయలేదా? ఎమ్మెల్యేగా ఓడిపోతే కనీసం ఎమ్మెల్సీగానన్న మూడున్నరేళ్లు కొనసాగవచ్చని మీరు అనుకుంటున్నారా? అది అవాస్తవమైతే తక్షణమే మీరు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నేను కోరుకుంటున్నాను’ అని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. -
మంగళగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆర్కే నామినేషన్
-
లోకేష్ కాదు.. మాలోకం..
మంగళగిరి/ తాడేపల్లి రూరల్: మంత్రి లోకేశ్‌కు ఆ పేరు ఎవరు పెట్టారోగానీ ‘మాలోకం’ అని పెట్టి ఉంటే బాగుండేదని మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఎద్దేవా చేశారు. అసలు మంత్రి లోకేశ్‌కు కాడి తెలుసా.. మేడి తెలుసా? రాజకీయాలంటే భూములను లాక్కుని దోచుకోవడం.. పిజ్జాలు బగ్గర్లు తినడమనుకున్నారా అని నిలదీశారు. మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన ఆర్కే విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలవడం అని గుర్తుంచుకోవాలని లోకేశ్‌కు హితవు పలికారు. నిద్రలేచినప్పటి నుంచి ‘మేము ఇక్కడే ఉంటున్నాం.. మా ఓట్లు ఇక్కడే ఉన్నాయి’ అని చెబుతున్న లోకేశ్.. అసలు ఆయన తండ్రి చంద్రబాబు ఉంటున్న ఇల్లు అక్రమమా.. సక్రమమా అంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆక్రమించుకుని ఐదేళ్లుగా నియోజకవర్గంలో ఉంటున్న తండ్రీకొడుకులు ఏనాడైనా మంగళగిరి ప్రజల సమస్యలను పట్టించుకున్నారా? అని నిలదీశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైతుల తరఫున ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని చెప్పి ప్రభుత్వం భూసేకరణ నోటీసులిస్తే పత్తా లేకుండా పోయారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పోటీ చేస్తారని తాను భావించానని, కానీ ఆ పార్టీ బరిలోకే దిగకపోవడం ఆశ్చర్యమేసిందన్నారు. అలాగే తాడేపళ్లిలోని తన కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. అసలు మంగళగిరి నియోజకవర్గం గురించి లోకేశ్‌కు ఏం తెలుసో చెప్పాలి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడానికి వచ్చి పొన్నూరు వరకు వెళ్లి వెనక్కు తిరిగి వచ్చిన ఘనత లోకేశ్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో ఒక్క ఇల్లు తొలగించడానికి కూడా తాము నోటీసులు ఇవ్వలేదని, గత ప్రభుత్వం ఇచ్చిందంటూ నారా లోకేశ్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. లోకేశ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే నోటీసు ఇవ్వలేదని బహిరంగ చర్చకు రావాలని, తాము కూడా సీతానగరం వచ్చి నోటీసులు ఇచ్చారో, లేదో చూపిస్తాం అని ఎమ్మెల్యే ఆర్కే సవాల్ విసిరారు. -
మగళగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా ఆర్కే నామినేషన్
-
మంగళగిరి అభ్యర్ధిగా అర్కే నామినేషన్
-
‘నీ పీడ వదిలించుకోవడానికే నాపై పోటీకి పంపారు’
సాక్షి, మంగళగిరి: ఐదేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో ప్రజలకిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఓట్లను అడుగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్కే శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, తనకు స్వచ్చందంగా ప్రజల మద్దతు లభిస్తోందని తెలిపారు. మంగళగిరిలో తనకు సరైన పోటీ నారాలోకేష్ కానేకాదని, వాళ్ల తండ్రి చంద్రబాబు నాయుడని ఆర్కే పేర్కొన్నారు. లోకేష్ పీడ వదిలించుకోవడానికే వాళ్ల నాన్న తనపై పోటీకి పంపారని ఎద్దేవా చేశారు. లోకేష్‌కు పీజ్జా బర్గర్లు తినడం తప్ప.. కాడి తెలుసా, మేడి తెలుసా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం మంగళగిరి ప్రజలకు ఏం చేసిందో వివరించి ఆ తరువాత ఓట్లు అడగాలని ఆర్కే స్పష్టం చేశారు. ఆయన నామినేషన్ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైయారు. -
పవన్ కల్యాణ్ ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు
-
విజిటింగ్ ప్రొఫెసర్ గల్లా.. గుల్లే..!
సాక్షి, మంగళగిరి : విజిటింగ్ ప్రొఫెసర్లా ఏడాదికి ఒకసారి గుంటూరుకు వచ్చే గల్లా జయదేవ్ ఈసారి పరాజయదేవ్‌గా పేరు మార్చుకోక తప్పదని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)తో కలిసి ఆయన నిన్న నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్న తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం శ్రీకోదండ రామసమేత శ్రీమద్వీరాంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ దుర్యోధన, దుశ్శాసనుల్లాంటి నారా లోకేష్, గల్లా జయదేవ్‌లకు కృష్ణార్జునుల్లాంటి మోదుగుల, ఆర్కే చేతిలో పరాభవం తప్పదని స్పష్టం చేశారు. లోకేష్‌లాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాలేదని, అలాంటి సచ్ఛీలుడిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనలో భాగస్వాములమై పోటీ చేస్తున్న ఆర్కేతో తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే మాట్లాడుతూ లోకేష్‌కి మంగళగిరి నియోజకవర్గ సరిహద్దులు తెలుసా? మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నానని చెప్పుకుంటున్న లోకేష్ ఏ రోజైనా మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో తాగునీరు వస్తుందా అని ప్రజలను అడగడం కానీ, అధికారులతో సమీక్ష కానీ చేశారా అని ప్రశ్నించారు. చేనేత కార్మికుల సమస్యలపై కానీ, లేక మరే సమస్య పైన అయినా ఈ మూడేళ్లలో ఒక్కసారైనా మంగళగిరి నియోజకవర్గ ప్రజలను పలకరించారా అని ఎద్దేవా చేశారు. మంగళగిరి అభివృద్ధికి ఎమ్మెల్యే ఆర్కే నిధులు అడగడం లేదని లోకేష్ వ్యాఖ్యానిస్తున్నారని, దానిపై మీ సమాధానమేంటని విలేకరులు ప్రశ్నించగా, ఆర్కే లోకేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళగిరి అభివృద్ధికి ఏఏ ప్రాజెక్టుకి ఎంత కావాలో విపులంగా జాబితా తయారుచేసి, రూ.7కోట్లు నిధులు కావాలని లోకేష్ బాబుని అడిగానో లేదో ఇంటికి వెళ్లి రాత్రికి కనుక్కోవాలన్నారు. రూ.7కోట్లు నిధులు కావాలని విజయవాడ సీఎం క్యాంపు ఆఫీసులో చంద్రబాబును కలిస్తే మీరు వైఎస్సార్ సీపీ తరఫున గెలిచారు, మేం నిధులు ఇవ్వం అని చెప్పడం తెలియదా? తెలియకపోతే లోకేష్ తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు కొబ్బరికాయలతో, టెంకాయలతో అభ్యర్థులకు దిష్టితీయగా, మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి హారతులతో స్వాగతం పలికారు.