‘నా సోదరుడు.. లోకల్ హీరో ఆర్కే గత ఐదేళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు. ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్థులను కాపాడుతాడు.. మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు.. నా కేబినేట్‌లో మంత్రిగా ఉంటాడు’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరుజిల్లా మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.